You are on page 1of 19

నమ్మకం అత్యంత ప్రభావశీలమైన మానసిక శక్తి.

నమ్మకమనేదే
లేకుండా మనిషి జీవితం నుంచి ఏదైనా నేర్చుకోగలడా అంటే లేడనే
చెప్పవచ్చు. మనిషికి ఉండే నమ్మకాల మూలాలన్నీ అతడి
మెదడులోనే ఉంటాయి. ఒక వ్యవస్థ లో అక్కడ నిర్మితమై ఉండే అవన్నీ,
అతడి అన్ని ప్రా పంచిక, వ్యక్తిగత వ్యవహారాల్లో , ఆధ్మాత్మిక సాధనలో
నిర్ణ యాత్మకమైన పాత్ర పో షిస్తా యి. అతడి కాళ్ల కు బలమిచ్చి, ఆశించిన
లక్ష్యాల దిశగా నడిపించగల శక్తి ఆ నమ్మకాల నాణ్యత నుంచే అతడికి
లభిస్తు ంది.

భూమి చదునుగా ఉంటుందని, సూర్యుడు భూమి చుట్టూ


తిరుగుతాడన్న ఒకప్పటి తన నమ్మకం నిజం కాదని మనిషి
తెలుసుకున్నాక, నమ్మకాలకు శాస్త్రీయ దృక్పథం ఇచ్చే కొత్త శకం
ప్రా రంభమైంది. పాచిపట్టి, నిల్వ ఉన్న నీరు తాగేందుకు పనికి రాదు.
కాలం చెల్లి న నమ్మకాలన్నీ అటువంటివే. కొత్త నమ్మకాలు
బహిర్గతమైనప్పుడల్లా ప్రపంచం అనూహ్యమైన మార్పులు చూసింది.

మనుషుల ప్రవర్త నకు దర్పణం పట్టేవి వారి నమ్మకాలే. ప్రతికూల


పరిస్థితుల్లో మనుషులు చూపగల మొక్కవోని మనోధైర్యం, ప్రలోభాల
వలల్లో చిక్కకుండా కనబరచగల స్వయం నియంత్రణ, అవమాన
గాయాల్ని ఆనందంగా భరించటం, విభేదిస్తు న్నవారితోనూ విజ్ఞ తతో
వ్యవహరించటం... సమున్నతంగా నిలబెడతాయి. మనిషికి తన మీద
తనకో నమ్మకం బలపడితేనే ఇవన్నీ సాధ్యం. అటువంటి బలమే
ఆత్మవిశ్వాసం. అది మనిషిలో పట్టు దల పెంచుతుంది. అమెరికాకు
అధ్యక్షుడు కాకముందు, అబ్రహాం లింకన్‌తన రాజకీయ జీవితంలో
పో టీచేసిన ముఖ్యమైన ఎన్నికలన్నింటిలోనూ పరాజయాలే
చవిచూశాడు. అయినా అతడు అవేవీ పట్టించుకోలేదు. తలదించుకుని
కుంగిపో లేదు. ఎప్పటికైనా గెలిచి తీరుతానన్న నమ్మకాన్ని
విడిచిపెట్టలేదు. చివరికి అదే అతడికి అమెరికా అధ్యక్ష పదవిని
కట్ట బెట్టింది. గాంధీ మహాత్ముడికి అహింస పట్ల నమ్మకం జగద్విదితం.
రవి అస్త మించని మహాసామ్రా జ్యపు పునాదుల్నే అది కుదిపి, ఈ
దేశానికి స్వరాజ్యం తెచ్చిపెట్టింది. నెపో లియన్‌చక్రవర్తి ‘అసాధ్యం’ అనే
మాటను అన్ని శబ్దా ర్థ కోశాల నుంచి తొలగించమన్నాడు. అది అతడికి
తన మీద తనకున్న అచంచల విశ్వాసంతో వచ్చిన మాట.

దీనులు, బాధార్తు లపై ఎప్పుడూ సేవాభావం ఉండాలన్న నమ్మకంతోనే


మదర్‌థెరెసా జీవితాంతం మానవాళికి అవిరళ సేవలందించింది.
దక్షిణాఫ్రికా దేశానికి శ్వేతజాతీయులు వేసిన జాతి విచక్షణా బంధాలు
ఎప్పటికైనా తెగిపో తాయన్న దృఢనమ్మకం, ముప్ఫై ఏళ్లు గా జైళ్లలో
మగ్గు తున్నాననే విషయాన్ని నెల్సన్‌మండేలాకు ఎప్పుడూ
స్ఫురణకు రానీయలేదు.
మనుషులే కాదు... సృష్టిలోని అన్ని జీవులూ ఏదో ఒక నమ్మకంతోనే
జీవిస్తూ ఉంటాయి. వేకువ కావటానికి సమయం ఇంకా ఉన్నా, చుట్టూ
చిమ్మచీకట్లు అలాగే ఉంటున్నా, పక్షులు కిలకిలా రావాలు
మొదలుపెడతాయి. వెలుగు వస్తు ందన్న నమ్మకమే అందుకు కారణం.

ఆత్మవిశ్వాసం ఉన్నవారు తమ వ్యక్తిత్వానికి వారే పునాదులు


వేసుకోగలరు. జయాపజయాలు రెండింటినీ ఒకటిగానే స్వీకరించగల
మానసిక స్థితికి చేరుకోగలరు. ఆత్మవిశ్వాసం ఆయుధం అయితే,
శత్రు వు ఎంత బలవంతుడైనా అతణ్ని ఎదిరించవచ్చు. అరిషడ్వర్గా లపై
పో రుకు మనిషి పట్ట వలసిన మొదటి ఆయుధం అదేనని వేదాంతులు
చెబుతారు.

ఆత్మవిశ్వాసం అంతరాత్మకు మేలుకొలుపు లాంటిది. అది ఇవ్వగల


బలంతో వచ్చే ఆత్మనిష్ఠ తో అతడు నామ, గుణ, రూపాలు లేని అనంత
దివ్యత్వాన్ని అవలీలగా చేరుకోగలడు!

చాలామంది వైఫల్యాన్ని దురదృష్టా నికి, సాఫల్యాన్ని అదృష్టా నికి


ముడిపెడతారు. ఇది పూర్తిగా తప్పు. స్వయంకృషిని నమ్మేవారు
అదృష్ట ం గురించి అసలు ఆలోచించరు. ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అనే
వ్యక్తీకరణకు అర్థం- కృషితో సాధించలేనిది లేదని. ఇక అదృష్ట ం అనే
మాటకు స్థా నం ఎక్కడుంది? నిరాశ, నిస్పృహలతో బాధపడేవారు
మాత్రమే ‘అదృష్ట ం లేదు’ అనో, ‘దురదృష్ట ం నన్ను వెంటాడుతోంది’
అనో తలపో స్తా రు.

అబ్దు ల్‌కలాం అతి సామాన్య, అట్ట డుగు, బీద కుటుంబానికి చెందిన


వ్యక్తి. సంకల్పబలం, స్వయంకృషి, ఆత్మవిశ్వాసమే ఆయనను
శిఖరాగ్రా నికి తీసుకువెళ్లా యి. ఆయన వ్యక్తిగత సంస్కారం కోట్లా ది
అభిమానులను సంపాదించిపెట్టింది. విద్యార్థు లు, జిజ్ఞా సువులకు ఆ
మహావ్యక్తి నిలువెత్తు ఆదర్శం. ఆయన స్ఫూర్తితో తమకు
అనుకూలమైన రీతిలో అవిశ్రా ంత కృషిని, ఫలితం సాధించేవరకూ
కొనసాగించాలి. ఫలితం సాధించిన తరవాతా కృషి ఆగకూడదు.
జ్ఞా నమనే మహాసముద్రా న్ని జిజ్ఞా స అనే దాహంతో ఆస్వాదిస్తూ నే
ఉండాలి. అప్పుడు జ్ఞా నానందం అనే అద్భుత అనుభూతి
కలుగుతుంది.

తపస్సు అంటే ఒక్క పూటతో ముగించే పూజ కాదు. అలాగే, చదువు


అంటే పట్ట భద్రత సాధించడమే కాదు. మనిషి నిత్యవిద్యార్థిగా జీవించాలి.
అప్పుడే జ్ఞా నప్రసారం చంద్ర-సూర్య కిరణాల్లా , ప్రా ణవాయువునందించే
పవన వీచికల్లా గా లభిస్తు ంది. మనసు, బుద్ధి, ఆత్మ బలోపేతం
అవుతాయి. విశిష్ట వ్యక్తిత్వం, జ్ఞా నతేజం మనల్ని ఆవహించి ఉంటాయి.

ప్రతి వైఫల్యాన్నీ విశ్లేషించి చూడండి. అందులో మన కృషిలోని


లోపాలెన్నో కనిపిస్తా యి. వాటిని గుర్తించి, సరిదిద్దు కోవాలి. అలా
చెయ్యటానికి సహనం, పట్టు దల, ఆత్మవిశ్వాసం తోడుకావాలి.
విద్యార్థు లకైనా, సాధకులకైనా ఇదే పద్ధ తి అనుసరణీయం. సాధన అంటే
సాధించటం కోసం చేసే కృషి. వైఫల్యాలకు విసిగి విరమించేది కాదు.
చదువు అంటే పట్టా ల సంఖ్యను పెంచుకోవటం కాదు. అది మేధ, ప్రజ్ఞ,
వ్యక్తిత్వం ఏకీకృతమై ప్రయోజకత్వాన్ని సాధించడం. చదువు ప్రా థమిక
జ్ఞా నం మాత్రమే ఇవ్వగలదు. దాన్ని అభివృద్ధి చేసుకోవడం మన
కర్త వ్యం. ప్రతి మనిషీ ఒక విత్త నం లాంటివాడు. అవకాశాలు గాలి, నీరు
వంటివి. మేల్కొని చురుగ్గా , బలంగా ఎదగాలి. అప్పుడే జీవితం
అర్థవంతమవుతుంది.

ప్రతి సాఫల్యం వెనక తపన, పట్టు దల, అవిశ్రా ంత కృషి ఉంటాయి.


విశ్వామిత్ర మహర్షి ప్రతి వైఫల్యాన్నీ సాఫల్యంగా మార్చుకోగలిగిన
విధానం ఇదే. ఏ రంగంలోనివారికైనా వైఫల్యాలను సాఫల్యాలుగా
మార్చుకోగల అద్భుత అవకాశాలు వేచి ఉంటాయి. స్నానం
చెయ్యాలంటే మనం నది వద్ద కు వెళ్ళాలి. నది మన వద్ద కు
రాదు.అవకాశాలు మన కోసం నిరీక్షించవు. కాలంతో పాటు వచ్చి,
వెళ్లి పో తుంటాయి. ఉదయాన్నే వికసించి పరిమళించే పుష్పాలను రాత్రి
కోసుకుందాం అనుకుంటే- అవి వాడి, నేల రాలి ఉంటాయి. ఈ సత్యాన్ని
ప్రతి వ్యక్తీ అనుక్షణం గుర్తు ంచుకోవాలి. ఏ క్షణాన్నీ వ్యర్థం
చేసుకోకూడదు.
డబ్బు పో తే తిరిగి పొ ందగలమనే భరోసా ఉంది.కాలానికి లేదు.
వైఫల్యాలకు కుంగిపో కుండా, నిద్రా ణంగా ఉన్న అద్భుత శక్తు ల్ని
జాగృతం చెయ్యడమే విజయరహస్యం. మేల్కొన్న ఆ శక్తు లే గత
వైఫల్యాలను కృషి అనే మంత్రంతో సాఫల్యంగా మార్చేయడాన్ని మీరే
చూస్తా రు!

కర్షకుడు నిరంతరం శ్రమిస్తా డు. అదృష్టా న్ని నమ్మి చేతులు


ముడుచుకొని కూర్చోడు. ఒక్కో సంవత్సరం సరైన వర్షా లు కురవక,
పంట చేతికి రాని పరిస్థితి ఏర్పడుతుంది. అంతమాత్రా నికే అతడి
ఆత్మవిశ్వాసం చెక్కుచెదరదు. మరుసటి ఏడాదీ పొ లం దున్ని
విత్త నాలు చల్లు తాడు. అది సైతం ఫలించకున్నా, రైతు నిరాశపడడు.
మొక్కవోని దీక్షతో ఆ తరవాతి సంవత్సరమూ కృషి కొనసాగిస్తా డు.
ఒకనాటికి మేఘుడు కరుణిస్తా డు. భూమి పులకిస్తు ంది. బంగరు
పంటలు పండుతాయి. శ్రమ ఫలించి ఇబ్బడిముబ్బడిగా పంట చేతికి
అంది, కర్షకుడి పెదవులపై చిరు దరహాసం చిందులాడుతుంది. అతడి
విజయరహస్యం ఒక్కటే- కృషి! అలాగే అద్భుత విజయాలు
సాధించినవారి జీవిత రహస్యం ‘కృషి’ అని రెండు అక్షరాల్లో సూక్ష్మంగా
చెప్పవచ్చు.

నిత్యం సాగించే కృషి ఒక్కటే దీర్ఘకాలిక ఫలితాలు ఇస్తు ంది. కృషితో


దుర్భిక్షం ఉండదని శ్రా మికులు నిరూపిస్తా రు. వారికే కాదు- ఇది అన్ని
తరగతులవారికి, వృత్తు లవారికి అన్వయిస్తు ంది. విద్యార్థి నిరంతర
కృషితో చదువులో ప్రథముడిగా నిలుస్తా డు. అదేవిధంగా
ఉపాధ్యాయుడూ సదా కృషి సాగించి దేశానికి ఉపకరించే విద్యార్థి
రత్నాలను సాన పట్టి జాతికి అందిస్తా డు.

జీవనం కోసం ఏదో ఒక వృత్తి చేపట్టినా, ఆసక్తి ఉన్న రంగంలో సాధన


ద్వారా ఉన్నత స్థితికి చేరినవారు పలువురు ఉన్నారు. పో తన ఒక
చిన్న రైతు. పరమ పవిత్రమైన ఆంధ్ర మహాభాగవతాన్ని రచించి
అజరామరమైన కీర్తి పొ ందినవాడు.

ఒకసారి ఆది శంకరాచార్యులవారు శిష్యులకు బో ధ చేస్తు న్నప్పుడు,


ఒక సన్యాసి అక్కడికి వెళ్లా డు. ‘మీ శిష్యుల్లో గొప్ప జ్ఞా ని ఎవరు’ అని
ఆయనను ప్రశ్నించాడు. ‘నా శిష్యుల్లో హస్తా మలకుడు గొప్ప జ్ఞా ని’
అని శంకరాచార్యులు బదులిచ్చారు. ‘ఆయన ఎక్కడ ఉన్నాడు’ అని
మరో ప్రశ్న వేశాడు సన్యాసి. ‘అక్కడ ఆ పొ దల అవతల ఉంటాడు
చూడండి’ అని సమాధానం వచ్చింది. సన్యాసి వెళ్లి చూశాడు. అక్కడ
హస్తా మలకుడు- పొ లంలో నాగలి పట్టి దున్నుతూ, పాఠాలు వల్లె వేస్తూ
కనిపించాడు!

ఉద్దా లకుడు గురువు. ఆయన శిష్యుడు ఆరుణి. తత్వదీక్ష


ప్రసాదించాలని గురువును ప్రా ర్థించాడు. అప్పుడు ఆయన బలహీనంగా
ఉండే వంద గోవుల్ని అతడికి ఇచ్చాడు. వాటిని మేపి, బలంగా
తయారుచేసి తేవాలని ఆదేశించాడు. శిష్యుడు శ్రద్ధగా వాటిని మేపాడు.
పది సంవత్సరాల తరవాత వెయ్యి బలిష్ఠ మైన ఆవులతో తిరిగి
గురువుగారి దరి చేరాడు. అతడి ముఖం బ్రహ్మతేజస్సుతో మెరుస్తో ంది.
గురువు పరమానందం పొ ందాడు. అనంతరం కొద్ది కాలంలోనే
ఉద్దా లకుడి సమక్షంలో ఆరుణి బ్రహ్మజ్ఞా నిగా రూపొ ందాడు. మిగతా
శిష్యులు ఆశ్చర్యపడి ‘ఇంత కాలవ్యవధిలోనే ఆరుణి అంత జ్ఞా ని ఎలా
అయ్యాడు’ అని ప్రశ్నించారు. ‘లక్ష్యశుద్ధి ఉన్నవారు ఏ రంగంలోనైనా
రాణిస్తా రు’ అని గురువు బదులిచ్చాడు.

ప్రపంచమంతటా ఇలాంటి ఉదాహరణలు కొల్ల లుగా కనిపిస్తా యి.


ప్రఖ్యాత మేధావి, శాస్త వ
్ర ేత్త ఐన్‌స్టీన్‌బాల్యంలో గణితశాస్త ం్ర లో వెనకబడి
ఉండేవాడు. సహ విద్యార్థు లు అతడిని ఎగతాళి చేసేవాళ్లు . ‘గణితం
నాకు ఇష్ట మైన పాఠ్యాంశం. ఎలాగైనా కృషి చేస్తా ను’ అనేవాడు ఐన్‌స్టీన్‌.
చెప్పిన విధంగానే అహర్నిశలు కృషి కొనసాగించి చివరకు
సఫలుడయ్యాడు. ఇతరులెవ్వరూ అందుకోలేనంత ఎత్తు కు ఎదిగాడు.

ప్రతి ఒక్కరు నిత్యం ఆలోచనలకు పనిపెడుతుండాలి. అప్పుడే అవి


రాటు తేలతాయి. లేకుంటే మొద్దు బారతాయి. మెదడుకు మేత
వేయకుంటే, బుద్ధి మందగిస్తు ంది. సో మరులకు శారీరక దౌర్బల్యం
ఏర్పడుతుంది. కరచరణాలు బాగా ఉన్నంతకాలం ఒకరిని యాచించి
బతకాల్సిన అవసరం ఉండదు. చేతులకు కాళ్ల కు తగిన పని చెబితే,
అవే కడుపు నింపుతాయి. మనిషిని దీనుడిగానో హీనుడిగానో
భగవంతుడు సృష్టించలేదన్నది మహాత్ముల నమ్మకం. కృషితో ఎంతైనా
సాధించవచ్చని అన్ని కష్టా లనూ అధిగమించవచ్చని వారు
నిరూపించారు. మనకు ఆదర్శ పురుషులుగా నిలిచారు!

ఏదైనా పో టీలో పాల్గొ ంటే గెలుపు మనదే అనుకుంటాం. ఓడిపో తే


కుంగిపో తాం, మానసికంగా కుమిలిపో తాం. పో టీ అంటే,
పాల్గొ నబో తున్న రంగంలో మన నైపుణ్యం, మెలకువలు ప్రదర్శించే
వేదిక. మనలాగే అందరూ తీవ్రమైన కృషిచేసి పో టీలో తమ సత్తా
చూపడానికి వస్తా రు. ఇచ్చిన సమయంలో, నియమ నిబంధనలకు
లోబడి, ఎవరు సరైన విధంగా తమలోని ప్రతిభను ప్రదర్శిస్తా రో, వాళ్ల నే
విజయం వరిస్తు ంది. అప్పుడు ఓడినవాళ్లు గెలిచినవాళ్ల ను చూసి ఈర్ష్య
అసూయలకు లోనుకాకుండా, గెలుపొ ందినవారి ప్రదర్శనలోని
కుశలతను పాఠంగా నేర్చుకునే హుందాతనం అలవరచుకోవాలి. అది
భవిష్యత్‌పో టీకి చక్కటి పునాది అవుతుంది. ఓటమిని మన
అసమర్థతగా భావించి కుంగిపో కూడదు. అది లోటుపాట్లు తెలియజేసే
ఒక సాధనం. ఓడిపో యినప్పుడు చింతించకుండా, ద్విగుణీకృత
ఉత్సాహంతో మరింత కృషిచేయాలి. గెలిచితీరాలన్న పట్టు దల
పెంచుకోవాలి. ప్రయత్నలోపం లేకుండా, సమ ఉజ్జీలతో తలపడి
గెలుపొ ందితే మధురానుభూతి మన సొ ంతం అవుతుంది. కమ్మటి
స్మృతిగా మనసులో నిలిచిపో తుంది.

ఏ రంగంలో అయినా నిలదొ క్కుకోవాలంటే మొదట మనకు దానిపట్ల


అంతులేని ఆసక్తి ఉండాలి. దివారాత్రా లు దాని గురించే ఆలోచించాలి.
అందులోని చిన్న చిన్న అంశాలు కూడా శ్రద్ధగా, క్షుణ్నంగా
పరిశీలించాలి. అవసరమైన వనరులను సమీకరించుకోవాలి. ‘అభ్యాసం
కూసు విద్య’ అని పెద్దలు వూరకే అనలేదు. ఎంత సాధన చేస్తే ఆ
రంగంలో మనకు అంత పరిణతి, పట్టు లభిస్తా యి.

ఏ కళనైనా గురుముఖతః నేర్చుకుంటే జ్ఞా న పరిపక్వత కలుగుతుంది.


అందుచేత ఆయన చూపించిన మార్గ ంలో, సరైన శిక్షణతో తగిన కృషి
చెయ్యవలసి ఉంటుంది. శ్రీరాముణ్ని సంస్కారవంతంగా, సద్గు ణ
సంపన్నుడిగా తీర్చిదిద్దింది గురువు వసిష్ఠు డు. యాగ సంరక్షణ కోసం
శ్రీరామచంద్రు ణ్ని తనతో తీసుకెళ్లి , ఆయన సత్ప్రవర్త న, ప్రశాంత
నడవడిక చూసి ముగ్ధు డై, తన అస్త శ
్ర స్త్రా లు ధారపో శాడు
విశ్వామిత్రు డు. రావణ సంహారంలో, రామయ్యకు అవి ఎంతగానో
ఉపయోగపడ్డా యి.

ద్రో ణాచార్యుడి వద్ద విలువిద్య నేర్చుకోకుంటే అర్జు నుడు బహుశా


సవ్యసాచి కాకపో యి ఉండేవాడేమో. సాందీపని మహాముని శ్రీకృష్ణు ణ్ని
జగన్నాటక సూత్రధారిగా చక్కగా తీర్చిదిద్దా డు. వివేకానందుణ్ని
ఎందరికో స్ఫూర్తిపద
్ర ాతగా మలచింది రామకృష్ణ పరమహంస.

గురువైన శుక్రా చార్యుడు రాక్షసులకు సర్వశాస్త్రా లు బో ధించాడు.


రాక్షసులు వాళ్ల మనోవైకల్యంతో తప్పుదారి పట్టా రు. దేవతలతో
సమానమైన ప్రతిభ, సామర్థ్యం కలవాళ్లే వాళ్లూ ను. మరోవంక,
సమర్థు లైన శిష్యుల వల్ల పేరు తెచ్చుకున్న గురువులెందరో చరితల
్ర ో
ఉన్నారు.

‘స్పర్ధయా వర్ధతే విద్యా’ అన్నది మహనీయుల మహితోక్తి. మనందరం


ఆరోగ్యకరమైన పో టీతత్వం అలవరచుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడు ‘కర్మ
నువ్వు చెయ్యి, ఫలితం నాకు వదిలెయ్యి’ అని గీతలో చెప్పాడు.
గెలుపు ఓటములు దైవాధీనంగానే భావించాలి తప్ప, మనమే కర్త కర్మ
క్రియ అనుకోకూడదు. ఎక్కడా ఏ దశలోనూ కృషిలోపం లేకుండా
చూసుకోవడమే మనవంతు!

==================================================================================

‘నేను జాతకాల్నీ, జ్యోతిష్యాన్నీ నమ్మను’ అన్నాడో పెద్దమనిషి.


‘అవును. ఈ విషయం మీ జాతకంలోనే ఉంది’ అని

సమాధానమిచ్చాడు మరో పెద్ద వ్యక్తి.


ఇది కొంచెం హాస్యంలా అనిపించినా వాస్త వం లేకపో లేదు. మన జన్మపై
ప్రభావం చూపే జ్యోతిశ్శక్తు ల్నీ, కాలశక్తు ల్నీ ‘గ్రహాలు’ అని పేర్కొన్నాయి
శాస్త్రా లు.

ఎవరి నమ్మకాలు వారివే అయినా, ప్రపంచంలో ప్రతి దేశంలోనూ వారి


విజ్ఞా నంతో తమ భవిష్యత్తు గురించీ, శుభాశుభాల గురించీ
తెలుసుకోవాలనే కుతూహలాన్ని ప్రదర్శించడం కనిపిస్తూ నే ఉంది.

ఒక నాస్తిక మేధావి తన ఇంటి ముందు- ఏదో దేవుడి బొ మ్మ,


పూజాయంత్రం తగిలించాడు. దాన్ని చూసి ఓ మిత్రు డు ‘నువ్వు
ఇలాంటివి నమ్మవు కదా! మరి ఎందుకు వీటిని పెట్టించావు?’ అని
ప్రశ్నించాడు. దానికి సమాధానంగా- ‘మనం నమ్మకపో యినా ఇవి
పనిచేస్తా యని ఓ శ్రేయోభిలాషి చెప్పాడు. అందుకే పెట్టించాను’ అన్నాడీ
మేధావి.

కాలగతిలో నూతన సంవత్సరం రాబో తుండగా, గడచిన సంవత్సరానికి


వీడ్కోలు పలుకుతూ, కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ‘ఈ
సంవత్సరం ఎలా ఉంటుందో !’- అనే ఉత్సుకత, శుభంగా ఉండాలనే
ఆకాంక్ష ప్రతి వ్యక్తీ ప్రదర్శిస్తా డు.

ఈ ఆకాంక్షలే రకరకాల వేడుకలుగా ఈ నడిరాత్రి సందడిస్తా యి.

మన భవిష్యత్తు ను ఎవరు నిర్దేశిస్తా రు?


మనమా, కాలమా, భగవంతుడా?

మన ధార్మిక గ్రంథాలేం చెబుతున్నాయి?

ఎవరి అనుభవానికి వారే కర్త లు! మరి మనం ఒకటి ఆశిస్తే మరొకటి
జరుగుతోందెందుకు? అటువంటప్పుడు- మనకు పైన మరేదో ఉన్నట్టే
కదా? అది కాలమా, దైవమా?

వీటిన్నింటికీ చక్కటి అన్వయాలు మన శాస్త్రా లందించాయి. ఏం


జరుగుతుందో మనకు తెలియదు. తెలియనివ్వకుండా చేసింది ఈ
విశ్వంలోని ఈశ్వర వ్యవస్థ . ప్రత్యేక శాస్త్రా లతో కొందరు జరగనున్నది
చెప్పే ప్రయత్నాలు చేశారు. అవన్నీ భ్రా ంతులేనని తీసిపారేయలేని
శాస్త్రా ధారాలు కనిపిస్తు న్నాయి కూడా. కానీ, అవి సూచనలు మాత్రమే.

మన ప్రయత్నాల్లో బలమూ, దృఢమైన సంకల్పమూ ఉంటే


అనివార్యాలను సవరించుకోవచ్చు- అని కూడా ధార్మిక గ్రంథాలు
చెబుతున్నాయి.

గత జ్ఞా పకాల్లో తీపీ చేదూ రెండూ ఉంటాయి. చేదు సంఘటనలను


మనోనిబ్బరంతో ఎదుర్కొని, తీపిని మధురస్మృతిగా దాచుకొని-
రెండింటిలోంచి గ్రహించిన అనుభవాన్ని భవితకు అవకాశంగా
మలచుకోవడం ఉత్త మ వ్యక్తిత్వం.
‘నా చేయి భగవచ్ఛక్తితో కూడినది.

భగవచ్ఛక్తి కంటే గొప్పది.

సమస్త దుఃఖాలనీ పరిష్కరించే శక్తి నా చేతి స్పర్శలో ఉంది’ అని ఒక


రుగ్వేద మంత్ర భావం.

హస్త స్పర్శకు భగవచ్ఛక్తిని ఆవహింపజేసే మంత్రంగా దాన్ని


భావించినా, దీనిలో ఒక అద్భుత సందేశాన్ని రుషి నిక్షిప్త ం చేశాడు.

‘చేయి’- అనే శబ్ద మే ‘కృషి’ని చెబుతోంది.

మనదైన కృషిలోనే భగవంతుడి శక్తి ఉంది.

నిజానికి ఇది ఆ శక్తి కంటే గొప్పది- అనడంలో ఆంతర్యం? చిత్త శుద్ధితో


సత్కర్మను ఆచరిస్తే భగవంతుడే కృషికి ఫలాన్ని ప్రసాదిస్తా డు- అని
భావం.

మన కృషితో మనం దేనినైనా సాధించగలం- అనే ప్రో త్సాహ వాక్యం ఈ


మంత్రంలో ధ్వనిస్తో ంది.

ఇప్పటి మన జాతకాలకు వెనకటి కర్మలు కారణమైతే,


జరగబో యేవాటికి నేటి కర్మలు (కృషి) కారణమవుతాయి.
‘నా కుడిచేతిలో కార్యశక్తి ఉంది- ఎడమ చేతిలో విజయం ఉంది’ అని
ఒక అధర్వవేద మంత్రభావం.

కృషి నీవంతు- ఫలితం నీకు తప్పక లభిస్తు ంది- అనే కర్త వ్య నిర్దేశాన్ని
వేదధర్మం ప్రబో ధిస్తో ంది.

మన సత్సంకల్పానికీ సత్కర్మకీ ఫలమిచ్చేదే దైవం. తగిన విధంగా,


తగిన తరుణంలో ఫలమిచ్చే భగవత్స్వరూపమే కాలం.

‘సంయమనం, సదాచారం- ఈ రెండింటి ద్వారా ఇంద్రియాలు


మధురమవుతాయి’- అని రుగ్వేద, యజుర్వేదాల్లో వచ్చే ఒక మంత్రం
చెబుతున్నది.

అధర్మాచరణకు వెనుదిరగడం సంయమనం, ధర్మానికి సిద్ధపడి


ఆచరించడం సదాచారం, ఈ రెండే ఇంద్రియాలకు పుష్టినిస్తా యి.
అలాంటి ఇంద్రియాలే తనకు, పదిమందికి ప్రయోజనకరంగా
పనిచేస్తా యి. ఆ ప్రయోజనాన్నే ‘మాధుర్యం’గా వర్ణించింది వేదం.

సమాజానికి పనికివచ్చే సత్కర్మను చిత్త శుద్ధిగా ఆచరించేవాడికి,


కాలరూపుడైన ఈశ్వరుడు ఎప్పుడూ అనుకూలిస్తా డనే వేదాశీర్వచనం,
నూతన కాల ద్వారాలను తెరుస్తు ంది!
భర్త ృహరి నీతి శతకమైనా, ఆధునిక మనోవైజ్ఞా నిక శాస్త మ
్ర ైనా ఒక్కటే

చెబుతుంది. పనిని ప్రా రంభించడమే కాదు, దాన్ని పూర్తిచేయాలన్న


పట్టు దల ఉన్నప్పుడు మాత్రమే ఆ కార్యసాధన పూర్త వుతుందని.
పట్టు దలే మనిషికి మహాబలం. అది ఉన్న మనిషి ఈ లోకంలో
సాధించలేనిది ఏదీ లేదు. నిరాశకు అవకాశమివ్వకుండా పట్టు దలతో
ముందుకు సాగే మనిషి తప్పకుండా విజేత కాగలడు.
ప్రా చీన పురాణ గాథలు గమనిస్తే పట్టు దలతోనే పురాణ పురుషులు
మహాకార్యాలు సాధించారని తెలుస్తో ంది.

అమృతం కోసం పాలసముద్రా న్ని మధించారు దేవతలు. అందులో


లభించిన విలువైన రత్నరాశులు చూసి వారు సంతోషించలేదు. పుట్టిన
కాలకూటవిషానికి భయపడి ప్రయత్నాన్ని విరమించలేదు. పట్టు దలతో
అమృతం లభించేవరకు పాలసముద్రా న్ని మధిస్తూ నే ఉన్నారు. ఇదే
కార్యసాధకుల లక్షణం.

గంగను దివి నుంచి భువికి తీసుకువచ్చిన భగీరథుడి పట్టు దల ఎంత


గొప్పదో అందరికీ తెలిసిందే. సగరులను తరింపజేయడానికి గంగను
భూమికి తీసుకురావాలని వారి పుత్రు డు అంశుమంతుడు తపస్సు
చేశాడు. కాని, సాధించలేకపో యాడు. తరవాత అతడి కుమారుడు
దిలీపుడు తపస్సు చేశాడు. అతడూ ఆ కార్యాన్ని సాధించలేదు. ఆపై
దిలీపుడి తనయుడు భగీరథుడు తపస్సు చేసి గంగను భూమిమీదకు
తెచ్చాడు. అందుకే ఏ సాధననీ ఎవరూ ఆపకూడదు. పట్టు దలతో
కొనసాగించాలి. చివరికి ఆ కార్యాన్ని పూర్తిచేయాలి.

జాంబవంతుడి ప్రేరణతో సీతాన్వేషణకు పూనుకొన్న హనుమంతుడి


పట్టు దల సామాన్యమైనదా! లంకాపురం చేరేందుకు పట్టు దలతో అతడు
అతికష్ట మైన పనులు నాలుగు సాధించాడు. అవి వరసగా- సముద్ర
లంఘనం, మైనాకుడి ఆతిథ్యాన్ని తిరస్కరించడం, సురసను
జయించడం, సింహికా దమనం. ఈ కష్ట తరమైన పనులను
హనుమంతుడు పట్టు దలతోనే పూర్తిచేశాడు.

నాటి నుంచి నేటి వరకు ఎందరెందరో మహనీయులు ఈ నేల తల్లిని


పునీతం చేస్తూ , పట్టు దలతో మహాకార్యాలు సాధిస్తూ లోకకల్యాణం
కోసం పాటుపడ్డా రు.
లక్ష్యం మంచిదైతే ఆ భగవంతుడి కృప తప్పక లభిస్తు ంది.
కష్ట పడేవాళ్ల కు, కార్యదీక్షతో ముందుకు సాగేవారికి విజయం తప్పక
లభిస్తు ంది.
భారతీయ సంస్కృతిని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన
వివేకానందుడు మొదట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. చివరికి
అందరూ మెచ్చే వేదాంతిగా నిలిచాడు. అలాగే సిద్ధా ర్థు డు బుద్ధు డిగా
మారడం వెనక ఎంత పట్టు దల ఉందో !
పట్టు దలనే ప్రధానంగా భావించి ముందడుగు వేసే సాధకుడు ఎలాంటి
కష్టా లనైనా భరిస్తా డు. స్థితప్రజ్ఞతతో వ్యవహరిస్తా డు.
ఈ ప్రకృతిలో సంచరించే మూగజీవుల్ని పరిశీలించండి. ప్రతి జీవి
పట్టు దలకు ప్రతీకగా నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తు ంది. గడ్డిపరకలు
సంపాదించి పరమాద్భుతంగా పిచ్చుక గూడు కట్టు కుంటుంది. ఆహారం
కోసం చీమలు ఎంతదూరమైనా ప్రయాణిస్తా యి. ఇలా ప్రతి జీవి
నిరంతరం శ్రమిస్తూ నే ఉంటుంది.

పట్టు దల, పరిశమ


్ర ఉంటే సామాన్య కుటుంబంలో పుట్టినవారైనా
ఎనలేని కీర్తిపతి
్ర ష్ఠ లు ఆర్జిస్తా రు. అంధురాలైన హెలెన్‌కెల్లర్‌
అంతర్జా తీయ ఖ్యాతి పొ ందడం వెనక ఎంత పట్టు దల ఉందో ప్రతి ఒక్కరూ
గ్రహించగలరు. తాళాలు తయారు చేసే గోద్రెజ్‌ప్రముఖ వాణిజ్యవేత్త
అయ్యాడు. ప్రమాదంలో కాలు పో గొట్టు కున్న సుధాచంద్రన్‌ప్రముఖ
నర్త కిగా పేరు సంపాదించుకుంది. వారందరూ సామాన్య వ్యక్తు లే. కఠోర
పరిశమ
్ర తో, పట్టు దలతో అంతర్జా తీయ ఖ్యాతిని ఆర్జించారు.

విజేతలంటే కేవలం విజయం సాధించినవారే కాదు. ఎన్ని అడ్డ ంకులు


ఎదురైనా కార్యదీక్షతో ముందుకు సాగేవారందరూ విజేతలే.
గెలుపు ఓటములు ఎలాంటివారికైనా తప్పవు. ఈ రెండూ ఎవరి
జీవితంలోనూ శాశ్వతం కావు. ఓటమి సంభవించినప్పుడు సైతం
రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ ప్రయత్నించి విజయం సాధించేవారే
అసలైన విజేతలు.
విజయం సాధించాలనుకున్నవారు చెడు ఆలోచనల్ని మనసులోకి
రానివ్వరు. భవిష్యత్తు మీద విశ్వాసం పెంచుకుంటారు. నిరంతర
సాధనతో, పట్టు దలతో గట్టి ప్రయత్నంతో విజయ తీరాలను
చేరుకుంటారు. పట్టు దలే మనిషికి శ్రీరామరక్ష!

You might also like