You are on page 1of 8

Medical Tips in Telugu

All Medical Related Queries, Some Common Medical Problems & Solutions, Medical Knowledge, Medical Tips

Tag Archives: surya namaskar steps in telugu

Sun God Namaskar Health hints-


సూర్యనమస్కారాలు ఆరోగ్య సూత్రా లు
January 21, 2016 Uncategorized Sun God Namaskar Health hints, surya
namaskar mantra in telugu, surya namaskar steps in telugu

సూర్యుడు…చైతన్యానికి ప్రతీక, ఆరోగ్యానికి అధిపతి, క్రమశిక్షణకు మారుపేరు. సూర్యనమస్కారాలతో ఆ మూడూ


సిద్ధిస్తా యంటారు సాధకులు.

ఆదిత్యస్య నమస్కారాన్‌ఏ కుర్వన్తి దినేదినే


జన్మాంతర సహశ్రేషు దారిద్య్ర నోపజాయతే
నమః ధర్మవిధానాయ నమస్తే కృతసాక్షినే
నమః ప్రత్యక్షదేవాయ భాస్కరాయ నవోనమః

అనేకానేక నమస్కారాలతో నీకు కృతజ్ఞతలు తెలియజేస్తు న్నాం. పవిత్ర మంత్రా లతో నీ ఘనతను కీర్తిస్తు న్నాం. మాకు
ఆరోగ్యాన్నివ్వు. ఆయుర్దా యాన్నివ్వు. అలుపెరుగని చైతన్యాన్నివ్వు. ఆధ్యాత్మిక జ్ఞా నాన్నివ్వు.
***

మనిషి కొలిచిన తొలిదేవుడు భానుడు. ఆ లేలేత కిరణం, ఆ ప్రచండ భానుతేజం, ఆ సంధ్యాసౌందర్యం…ప్రతీదీ ఓ


అద్భుతమే! అందుకే ఏడుగుర్రా ల తేరులో వూరేగించారు. ‘ఆదిత్య హృదయం’తో కీర్తించారు. కోణార్కు, అరసవిల్లి
ఆలయాలు కట్టించారు. రుగ్వేదంలో సూర్యుడిని కీర్తిస్తూ చాలా రుక్కులే ఉన్నాయి. భానుకిరణాలు బలహీనతల్ని
నివారిస్తా యనీ రోగాల్ని నయంచేస్తా యనీ దుష్టశక్తు ల్ని తరిమికొడతాయనీ ఉపాసకులను కవచంలా రక్షిస్తా యనీ
వేనోళ్ల కొనియాడారు. పురాణాలు కూడా చాలా ప్రా ధాన్యం ఇచ్చాయి. రామాయణంలో మహాబలవంతుడైన
రావణుడిని జయించడానికి అగస్త్యమహాముని రాముడికి ‘ఆదిత్య హృదయం’ బోధించాడు. ‘మహాభారతం’లో
అరణ్యవాసంలో ఉన్న పాండవులకు అక్షయపాత్ర ఇచ్చింది సూర్యుడే. ‘గీత’లో కృష్ణు డు ‘నక్షత్ర రాశిలో నేను
సూర్యుడిని’ అని ప్రకటించాడు.

పన్నెండు భంగిమలు…:
సూర్యారాధనలో నమస్కారాలే ప్రధానం. ప్రతి నమస్కారంలో ఓ ఆసనం ఉంటుంది. అలా వెుత్తం పన్నెండున్నాయి.
ఇందులో ఏడు వైవిధ్యమైనవి. మిగిలిన అయిదూ వాటిలోంచే పునరావృతం అవుతాయి. నిటారుగా నిలబడటం,
ముందుకు వంగడం, వెనక్కి వంగడం…ఇలా ప్రతి కదలికా శరీరంలోని ఏదో ఓ భాగం మీద ప్రభావం చూపుతుంది.
పన్నెండు నమస్కారాలూ అయ్యేసరికి ఆ చైతన్యం శరీరమంతా విస్తరిస్తుంది. ప్రతి భంగిమా సూర్యమంత్రంతో
వెుదలవుతుంది. దీనికీ ఓ కారణం ఉంది. మన పెద్దలు మంత్రా నికి అపారమైన శక్తి ఉందని నమ్మారు. అందులోనూ,
ప్రతి సూర్యమంత్రా నికీ జోడించే ‘ఓం’కారం మహా మహిమాన్వితమని భావించారు. సూర్యనమస్కారాలు
చేస్తు న్నప్పుడు శరీరం మీద ఎంత శ్రద్ధపెడతావో, మనసు మీదా అంతే ధ్యాస ఉండాలి. బాహ్య చైతన్యంతో
ప్రా రంభించి, అంతః చైతన్యాన్ని సాధించడమే సూర్యనమస్కారాల లక్ష్యం.

పన్నెండు ఆసనాలకు ఆ పన్నెండు మంత్రా లే ఎందుకన్న ప్రశ్నకూ యోగులు సమాధానం చెప్పారు. జ్యోతిషం
ప్రకారం…సూర్యుడు రాశిచక్రంలోని పన్నెండు స్థా నాల్లో సంచరిస్తా డు. ఆయా స్థా నాల్లో ప్రవేశించగానే సూర్యుడి ముఖ
కవళికల్లో వచ్చే మార్పులను బట్టి… పన్నెండు పేర్లూ వచ్చాయి. ‘మిత్రా య నమః’ అంటూ సూర్యుడిని జగత్తు కంతా
స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా కీర్తిస్తాం. ‘రవయే నమః’ అంటే ప్రకాశించేవాడని అర్థం. ‘సూర్యాయ నమః’ అన్న
మంత్రం… చైతన్య స్వరూపుడిగా కొనియాడుతుంది. ‘భానవే నమః’…అంధకారాన్ని తొలగించేవాడికి ఇవే మా
నమస్కారాలు. అజ్ఞా నాన్నీ అనారోగ్యాల్నీ దూరంచేసేవాడని కూడా అంతర్లీన భావం. ఇలా పన్నెండు మంత్రా లకూ
పన్నెండు అర్థా లున్నాయి.

సూర్యనమస్కారాలు శరీరానికి చైతన్యాన్ని ఇస్తా యి. క్రమబద్ధమైన శ్వాస మనసును ప్రభావితం చేస్తుంది.
ఓంకారంతో పలికే సూర్యమంత్రా లు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తా యి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం
ఆరోగ్యం అంటే… శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం! సూర్యనమస్కారాల్లో ఈ మూడూ ఉన్నాయి.

శుభోదయం…:
తెలతెలవారుతూ ఉంటుంది. కిలకిలమంటూ పక్షులు గూట్లోంచి బయటికొస్తా యి. లేతవెుగ్గలు సుకుమారంగా
విచ్చుకుంటాయి. వెుక్కలు పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి. ప్రకృతికే ఓ కొత్తకళ వచ్చేస్తుంది. అర్ధరాత్రి పార్టీలతో
అపరాత్రి విందులతో అలసిసొలసిన ఆధునిక మానవుడు మాత్రం, అలారమ్‌వోగినా పట్టించుకోడు. కోడి ‘కొక్కొరకో’
అంటూ అరిచిగీపెట్టినా స్పందించడు. ఆ అపసవ్య జీవనశైలితో ఆరోగ్యం నాశనమైపోతుంది. సూర్యనమస్కారాల్ని
జీవితంలో భాగం చేసుకుంటే…అన్నిటికంటే ముందు బద్ధకం వదిలిపోతుంది. తెల్లవారుజామునే నిద్రలేస్తాం.
బాలభానుడి దర్శనమే ఓ దివ్యానుభూతి. బంగారు వన్నెలో మెరిసిపోతుంటాడు. ఆ అద్భుత దృశ్యాన్ని
చూస్తు న్నప్పుడు…ఎక్కడలేని ప్రశాంతత. ఆ ప్రభావం రోజంతా ఉంటుంది. సూర్యనమస్కారాల్లో – ఓ రూపమంటూ
లేని ఆదిత్యుడిని మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటాం. ఓ రూపం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఆ సాధన మనలోని
సృజనాత్మకతను ఇనుమడింపజేస్తుంది. సూర్యనమస్కారాల్లో ఏకాగ్రత ముఖ్యం. ఆలోచనల్లేని స్థితిని సాధించే
క్రమంలో… తూనీగల్లా వచ్చిపోయే ఆలోచనల్ని ఎలాంటి స్పందనా లేకుండా, ఏ మాత్రం భావోద్వేగాలకు
లోనుకాకుండా అచ్చంగా ఓ ప్రేక్షకుడిలా గమనిస్తాం. జీవితంలో ఎదురయ్యే సవాళ్లనూ సమస్యలనూ ఎదుర్కోడానికి
అవసరమైన శక్తి అలా మనకు ఒంటబడుతుంది. మంత్రం మన ఉచ్చరణ దోషాల్ని పరిహరిస్తుంది. తడబడకుండా
సూటిగా భావాల్ని వ్యక్తం చేయగల నైపుణ్యాన్నిస్తుంది. కార్పొరేట్‌ప్రపంచంలో పట్టా ల కంటే గొప్ప అర్హత ఇది.
వూబకాయం, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు… ఆధునిక జీవితంలోని ప్రతి ఆరోగ్య సమస్యకీ సూర్యనమస్కారాల్లో
పరిష్కారం ఉంది. పొద్దు న్నే తూర్పు దిశగా నిలబడినపుడు శరీరంలోకి ప్రవేశించే విటమిన్‌-డి ఎముకల్ని శక్తిమంతం
చేస్తుంది. ఆ కిరణాల ప్రభావంతో కొన్నిరకాల చర్మరోగాలు కూడా దూరమవుతాయని నిపుణులు నిర్ధరించారు. నేత్ర
సంబంధ వ్యాధులు ఉన్నవారికి సూర్యదర్శనం చాలా మంచిది. సూర్యనమస్కారాల్లో భంగిమ ఎంత ముఖ్యవో,
శ్వాసా అంతే ముఖ్యం. క్రమబద్ధమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మలిన రక్తం తొలగిపోతుంది. అన్ని భాగాలకూ
చక్కని రక్తప్రసరణ జరుగుతుంది. అలసట గాలికెగిరిపోతుంది.

సూర్యనమస్కారాల్లో ని పన్నెండు ఆసనాలూ అపారమైన ప్రయోజనాల్ని కలిగించేవే. మొదటి ఆసనం…


ఏకాగ్రతనిస్తుంది. రెండో ఆసనం… పొట్టలోని కొవ్వును తగ్గిస్తుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. వెన్నులోని నరాలను
శక్తిమంతం చేస్తుంది. చేతులకూ భుజాలకూ సత్తు వనిస్తుంది. వూపిరితిత్తు ల్లో ని గదులను విశాలం చేస్తుంది. మూడో
ఆసనం…ఉదర సమస్యలను తొలగిస్తుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. నాలుగో ఆసనం…కాళ్లలోని కండరాలకు
బలాన్నిస్తుంది. ఐదో ఆసనం…రక్తప్రసరణను క్రమబద్ధం చేస్తుంది. ఆరో ఆసనంలో ఛాతీ విశాలమవుతుంది. ఏడో
ఆసనంలో బుద్ధివికాసం కలుగుతుంది. పునరావృతమయ్యే ఐదు ఆసనాలూ అదనపు ప్రయోజనాలను జోడిస్తా యి.

సూర్యనమస్కారాలు ముగిస్తే ప్రణామాసనం, హస్త ఉత్తా నాసనం, పాదహస్తా సనం, అశ్వసంచలనాసనం,


పర్వతాసనం, అష్టాంగాసనం, భుజంగాసనం…చేసినట్టే. అంటే, యోగా ద్వారా కలిగే ప్రయోజనాలు మన ఖాతాలో
పడ్డట్టే. వాత, పిత్త, కఫ…ఈ మూడూ సమతౌల్యంగా ఉంటే, ఎలాంటి సమస్యలూ రావని ఆయుర్వేదం చెబుతుంది.
సూర్యనమస్కారాలతో ఆ సమస్థితిని సాధించవచ్చు.

సూర్యనమస్కారాలు ఆధ్యాత్మిక సాధకులకూ దిశానిర్దేశం చేస్తా యంటారు యోగాచార్యులు. మన శరీరంలోని


నాడులతో, గ్రంధులతో ముడిపడి వెుత్తంగా ఏడు శక్తికేంద్రా లున్నాయి…మూలాధార, స్వాధిష్టా న, మణిపుర, అనాహత,
విశుద్ధి, ఆజ్ఞ, సహస్రా రం వాటి పేర్లు . సూర్యనమస్కారాలతో ఏకాగ్రత కుదురుతుంది. దాంతోపాటే చక్ర కేంద్రా ల్లో
చైతన్యం కలుగుతుంది. అదే, కుండలిని జాగృతికి దారిచూపుతుంది. అంతకుమించిన ఆధ్యాత్మిక ఉన్నతి
ఇంకెక్కడుంటుంది?అదే ఆనందం, బ్రహ్మానందం, మహదానందం!

మహాప్రసాదం!
రోజువారీ కార్యక్రమాల ద్వారా మన శరీరంలోని 35 నుంచి 40 శాతం కండరాల్లో మాత్రమే కదలికలు ఉంటాయి.
మిగతావన్నీ పనీపాటా లేకుండా బద్ధకంగా ముడుచుకుని పడుంటాయి. పన్నెండు సూర్యనమస్కారాలతో 95 నుంచి
97 శాతం కండరాల్లో కదలిక వస్తుంది. మరుసటి రోజు ‘రీఛార్జ్‌’ చేసేదాకా అవి చురుగ్గా ఉంటాయి.
సూర్యనమస్కారాల ప్రభావాన్ని తెలుసుకోడానికి ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు జరిగాయి. కర్ణా టకలోని గుల్బర్గా
విశ్వవిద్యాలయంలో లోతైన పరిశోధనలు చేశారు. సూర్యనమస్కారాల్ని ఆరు రౌండ్లతో ప్రా రంభించి…క్రమక్రమంగా
ఇరవై నాలుగుదాకా తీసుకెళ్లడం ద్వారా… సాధకుల ఆరోగ్య పరిస్థితిలో వచ్చిన మార్పులను నవోదు చేశారు. ఇవి
శ్వాసవ్యవస్థ మీద చాలా ప్రభావం చూపాయని నిపుణులు గుర్తించారు. ఊపిరితిత్తు ల పనితీరు గణనీయంగా
మెరుగుపడింది. మునుపటి కంటే ఎక్కువ సేపు పనిచేయగల సత్తు వ వచ్చింది. శరీర వ్యవస్థ మరింత
శక్తిమంతమైంది. బెనారస్‌హిందూ యూనివర్సిటీ పరిశోధనలు కూడా ఇదే మాట చెబుతున్నాయి.
సూర్యనమస్కారాల వల్ల గుండెకు రక్తా న్ని చేరవేసే నాళాల్లో ని అడ్డంకులు తొలగిపోవడం గమనించారు
పాండిచ్చేరిలోని అరవిందాశ్రమం ప్రతినిధులు. ఇండియన్‌మెడికల్‌అసోసియేషన్‌పుణెశాఖ ప్రతినిధి డాక్టర్‌దిలీప్‌
శార్దా ఐదువందల మందిపై తాను జరిపిన అధ్యయన ఫలితాల్ని పత్రికాముఖంగా వెల్లడించారు. ముఖ్యంగా ముప్ఫై
నుంచి ఎనభై సంవత్సరాలవారిలో… రక్తపోటు క్రమబద్ధం అయినట్టు నిర్ధరించారు. కొలెస్ట్రాల్‌, బ్లడ్‌షుగర్‌, కొవ్వు…
తదితరాల్లో ఆరోగ్యకరమైన తేడాను గుర్తించినట్టు చెప్పారు. అమెరికాలోని శాన్‌జోస్‌స్టేట్‌యూనివర్సిటీలోనూ కొన్ని
అధ్యయనాలు జరిగాయి. వృద్ధా ప్యాన్ని మందగింపజేయగల సామర్థ్యం సూర్యనమస్కారాలకు ఉందని
విశ్వవిద్యాలయ వర్గా లు ప్రకటించాయి. జీవక్రియతో పాటు గుండె పనితీరు మీద కూడా వీటి ప్రభావం ఉంటుందని
కె.బి.గ్రంట్‌అనే హృద్రో గవైద్యుడు గుర్తించాడు. పొట్టచుట్టూ పేరుకుపోయే కొవ్వును సూర్యనమస్కారాలు సులభంగా
కరిగిస్తా యని సాధకులు అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ‘జీవన తత్వయోగ’ సంస్థ ప్రా చీనమైన పద్ధతికి
చిన్నచిన్న మార్పులు చేసి డైనమిక్‌సూర్యనమస్కారాల్ని రూపొందించింది. దీనివల్ల రెండుమూడుసార్లు సాధన
చేసినా, అంతకు రెట్టింపు ఫలితాలు కనిపిస్తా యని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని పరిమితులూ:
సూర్యనమస్కారాలు ఎప్పుడు పుట్టా యి? ఆవిష్కర్త ఎవరనే విషయంలో స్పష్టత లేదు. పతంజలి యోగసూత్రా ల్లో
ఎక్కడా ఆ ప్రస్తా వన లేదు. గత శతాబ్దంలో ఔంధ్‌రాజైన భవన్‌రావు ప్రా చుర్యంలోకి తెచ్చినట్టు ఓ కథనం. ఆయన
లండన్‌లో న్యాయశాస్త్రం చదువుతున్న రోజుల్లో వాటివల్ల తానెంత ప్రయోజనం పొందిందీ ఓ రచయితకి
యథాలాపంగా చెప్పారట. వాటి ఆధారంగా ‘టెన్‌పాయింట్‌వే టు హెల్త్‌’ అనే పుస్తకం వచ్చిందనే వాదన ఉంది. ఆ
అభిప్రా యాన్ని కాదనలేం. కానీ, భవన్‌రావు సూర్యనమస్కారాల సృష్టికర్త కాకపోవచ్చు. మహాఅయితే, వాటి
ప్రచారానికి కృషిచేసి ఉండవచ్చు. వేదకాలం నాటికే అవి ఉనికిలో ఉన్నాయి. ఇప్పుడు, సూర్యనమస్కారాలు
ప్రపంచవ్యాప్తంగా పరిచయమయ్యాయి. జపాన్‌లో పన్నెండు ముద్రల్లోంచి ఏడింటిని తీసుకుని సాధన చేస్తు న్నారు.
వివిధ దేశాల్లో ని యోగా కేంద్రా ల్లో సూర్యనమస్కారాల్ని కూడా నేర్పుతున్నారు.

వీటిని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంలో మాత్రం ఎన్నో
అనుమానాలు. కొన్ని అపోహలూ ఉన్నాయి. సూర్యోదయ సమయంలో…తూర్పువైపుగా నిలబడి చేయడమే
ఉత్తమం. సాధ్యం కాకపోతే, సూర్యాస్తమయంలో అయినా ఫర్వాలేదు. మిట్టమధ్యాహ్నవో, అర్ధరాత్రో చేయడం
మంచిది కాదు. చాపకానీ దుప్పటి కానీ పరుచుకుంటే సౌకర్యంగా ఉంటుంది. వదులైన దుస్తు లు వేసుకుంటే మంచిది.
కాలకృత్యాలు ముగించుకున్నాకే ప్రా రంభించాలి. ఖాళీ కడుపుతో చేయాలి. వెంటనే, భోజనం కూడదు. కాస్త
సేదదీరాక మంచినీళ్లో పళ్లరసవో తీసుకోవచ్చు. ఎన్నిసార్లు చేయాలనే విషయంలో కచ్చితమైన నిబంధన లేదు.
వెుక్కుబడిగా ఒకటిరెండుసార్లు చేయడం వల్ల లాభం ఉండదు. అలా అని, శరీరాన్ని హింసిస్తూ అదేపనిగా
చేయడమూ నిష్ఫలమే. వయసు, ఆరోగ్య పరిస్థితి, అందుబాటులో ఉన్న సమయం…వంటి అంశాల్ని కూడా దృష్టిలో
పెట్టు కోవాలి. తీవ్రస్థా యిలో రక్తపోటు ఉన్నవారు, హృద్రో గులు, ఆర్థరైటిస్‌, హెర్నియా తదితర సమస్యలతో
బాధపడుతున్నవారు దూరంగా ఉండటమే మేలు. వెన్నెముక సమస్యలున్నవారు నిపుణుల పర్యవేక్షణలోనే
చేయాలి. గర్భిణులు దాదాపు నాలుగు నెలల దాకా చేయవచ్చు. దీనివల్ల సుఖప్రసవం జరుగుతుంది. అయితే,
వైద్యుల సలహా తప్పనిసరి. ప్రసవమైన నలభైరోజుల తర్వాత మళ్లీ ప్రా రంభించవచ్చు. ఇక, ఎనిమిదేళ్లలోపు పిల్లలు
ప్రత్యేకంగా సూర్యనమస్కారాలు చేయాల్సిన అవసరం లేదు. ఆ వయసులో ఆటపాటల్ని మించిన వ్యాయామం
ఏముంటుంది? ఆరోగ్యవంతులైన వృద్ధు లకూ ఎలాంటి పరిమితుల్లేవు. మహిళలకు నెలసరి రోజుల్లో తీవ్ర రక్తస్రా వం
వంటి సమస్యలుంటే, ఆ మూడునాలుగు రోజులూ ఆపేయడమే మంచిది.

సూర్యనమస్కారాలు చేస్తు న్నప్పుడు…ఒత్తిడి వద్దు , తొందరవద్దు . ప్రశాంతంగా చేయాలి. శరీరానికి పూర్తి


విశ్రాంతినివ్వాలి. ఆలోచనలకు పగ్గా లు వేయాలి. సూర్య మంత్రం మీదే దృష్టి కేంద్రీకరించాలి. ఆ తేజస్సును మనలో
ఆవాహనం చేసుకోవాలి. క్రమంగా, సూర్యనమస్కారాలకు ప్రా ణాయామాన్ని కూడా జోడిస్తే మరీ మంచిది.

సూర్యనమస్కారాలు ఖరీదైన వ్యవహారమేం కాదు. ఏ జిమ్ముకో వెళ్లా ల్సిన పన్లేదు. ఓ వారవో, పదిరోజులో
సుశిక్షితుడైన గురువు దగ్గర నేర్చుకుంటే చాలు. జీవితాంతం సాధన చేసుకోవచ్చు. యోగాలో ఉన్నట్టు వందలకొద్ది
ఆసనాలూ ఉండవు. తికమకపడాల్సిన అవసరం లేదు. కొన్నింటినే పునరావృతం చేస్తూ వెళ్లడమే కాబట్టి,
గుర్తుంచుకోవడం పెద్ద సమస్యేం కాదు. ‘మాకు తీరిక లేదు’…అని వాదించేవారికి ఒకటే ప్రశ్న? ‘రేపు ఏ గుండె జబ్బో
వస్తే (రాకూడదనే కోరుకుందాం), సర్జరీ చేయించుకోడానికి కూడా టైం ఉండదా? ఏ రక్తపోటో చక్కెర వ్యాధో వేధిస్తే
(వేధించకూడదనే ఆశ), డాక్టర్ల చుట్టూ తిరగడానికి కూడా టైం ఉండదా?’. కొంపలేం మునిగిపోవు. రోజూ ఓ అరగంట
కేటాయించినా చాలు. ప్రా రంభంలో కాస్త నిదానంగా సాగినా, సాధన పెరిగాక వేగం పుంజుకుంటుంది.
సూర్యనమస్కారాలు జీవితంలో భాగమైపోతాయి. సూర్యుడికి ‘శుభోదయం’ చెప్పడంతోనే మీ దినచర్య
వెుదలవుతుంది.
***
యోగా గురువుగారిని అత్యాధునికమైన జిమ్‌కు తీసుకెళ్లా డు ఓ యువకుడు. అక్కడున్న పరికరాలన్నీ
చూపిస్తు న్నాడు.
‘ఇది ఛాతీ వ్యాయామానికి సంబంధించింది…’
‘ఇది చేతులకు సంబంధించింది’
‘ఇది పొత్తికడుపు కోసం…’
అలా సాగుతోంది పరిచయం.
చివర్లో అడిగారు గురూజీ… ‘ఇంతపెద్ద జిమ్ములో వెుత్తం శరీరానికంతా పనికొచ్చే పరికరం ఒక్కటీ లేదా?’.
బిక్కవెుహం వేశాడు సిక్స్‌ప్యాక్‌కుర్రా డు.
మొత్తం శరీరానికే కాదు, మనసుకూ బుద్ధికీ కూడా ఒకటే వ్యాయామం…అవే సూర్యనమస్కారాలు!

వెలుగుల దేవుడికి వందనం:


సూర్యనమస్కారాలు వెుత్తం పన్నెండు. ఎనిమిదో ఆసనం తర్వాత మళ్లీ నాలుగు, మూడు, రెండు, ఒకటి ఆసనాలే
పునరావృతం అవుతాయి. ప్రణామస్థితి నుంచి ప్రణామస్థితి దాకా ఒక రౌండు. నిపుణుల పర్యవేక్షణలో సాధన
ప్రా రంభించడం మంచిది.
Advertisements

REPORT THIS AD

You might also like