You are on page 1of 5

మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కు, వృద్ధు ల శారీరక మానసిక ఆరోగ్యానికీ, మనం చేసే వృత్తు లలో

అభివృద్దికీ, సంతృప్తికీ మనం తప్పక ఆచరించవలసినవి – గాయత్రీ ఉపాసన, కులదేవతారాధన,


గురువు ఆరాధన.
గాయత్రీ ఆరాధన
“గాయతాన్ త్రాయతే ఇతి గాయత్రి” - బుద్ధిని వికసింప చేసి,మేధస్సును పెంపొందించి, తేజస్సును
ప్రసాదించును.
గాయత్రి మంత్ర ప్రయోజనాలు
-సర్వరోగ నివారిణి గాయత్రి, -సర్వదుఃఖ పరిహాణి గాయత్రి , -సర్వవాంఛాఫల శ్రీ గాయత్రి
గాయత్రీదేవి ఐదు ముఖాలు ముత్యం వంటి తెలుపు, పగడం వంటి ఎరుపు, బంగారం రంగు, నీలం,
శ్వేత వర్ణాల్లో ఉంటాయి. వరద హస్తం, అభయ హస్తా లతో పాటు అంకుశం, కొరడా, కపాలపాత్ర, గద,
శంఖం, చక్రం, రెండు చేతుల్లో పద్మాలతో శోభిస్తూ ఉంటుంది. పంచముఖాలు పంచ భూతాత్మకమైన
శక్తికి ప్రతీక.
చాలా మందికి గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా ఉపాసిస్తే
ఫలితం వస్తుందో తెలియదు,కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా
జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని
ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు.
మంత్రం ' అనే పదం ' మన్ ' అనే సంస్కృత పదం నుంచి జనించింది. మన్ అనగా 'మనసు లేదా
ఆలోచించడం' అని అర్ధం. అదేక్రమంలో భాగంగా' త్రై ' అంటే ' రక్షణ ', లేదా ' విముక్తి ' అని అర్థం
ఉంటుంది. కావున, మంత్రాలు మనసిక స్థా యిలను పెంచడానికి, మరియు స్వస్థతను చేకూర్చడానికి
ఉపయోగపడే సాధనాలు లేదా పరికరంగా భావించబడడం జరుగుతుంది.
గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలతో పాటు 24 దేవతమూర్తు ల శక్తి అంతర్హితమై ఉంటుందని
చెబుతారు. ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించటం వలన ఆ ఇరవైనాలుగు దేవతల ఆశీస్సులు, శక్తి
చేకూరుతాయని మన పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. మన జీవితంలోని అన్ని రకాల కష్టా ల నుంచి
గట్టెక్కిస్తుంది. ఇది గాయత్రి మంత్రానికి ఉన్న గొప్ప శక్తి. వివిధ రకాలైన సమస్యకు విధి విధానంలో
జపం క్రమాన్ని అనుసరిస్తే ఆయా ఫలితాలను తప్పక పొందవచ్చు.
గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తు లు.

01. వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ


ప్రసాదిస్తా డు.
02. నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది
ఈయనే.
03. విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్ఠా త అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.
04. ఈశ్వరుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తు లనూ ప్రసాదించే
దయామయుడు.
05. శ్రీకృష్ణుడు: యోగ శక్తికి అధిష్ఠా త అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ
ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తా డు.
06. రాధాదేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠా త్రి, భక్తు లకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష
భావాలకు దూరం చేస్తుంది.
07. లక్ష్మీదేవి: ధన వైభవ శక్తు లకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం,
యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.
08. అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను
ప్రాసాదిస్తా డు.
09. మహేంద్రు డు: రక్షాశక్తికి అధిష్ఠా త, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి
రక్షిస్తా డు.
10. సరస్వతి: విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.
11. దుర్గాదేవి: దమన శక్తికి అధిష్ఠా త్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రు వుల బారి నుండి కాపాడుతూ
సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
12. ఆంజనేయుడు: నిష్ఠా శక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తు లకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ
తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తా డు.
13. భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని,
నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.
14. సూర్య భగవానుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని,
తేజస్సును ప్రసాదిస్తా డు.
15. శ్రీరాముడు: ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి
అధిష్ఠా త ఈయన.
16. సీతాదేవి: తపశ్శక్తి అధిష్ఠా త్రి. అనన్య భావాలతో భక్తు లను తపోనిష్ఠు లుగా తయారుచేసి,
అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.
17. చంద్రు డు: శాంతి శక్తికి అధిష్ఠా త. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక
వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తా డు.
18. యముడు: కాలశక్త్యాదిస్థా త. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం
చేసేవాడు.
19. బ్రహ్మ: సకల సృష్టికి అధిష్ఠా త.
20. వరుణుడు: భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తా డు.
21. నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠా త. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తా డు.
22. హయగ్రీవుడు: సాహన శక్తికి అధిష్ఠా త. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తా డు.
23. హంస: వివేక శక్తికి అధిష్ఠా త్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.
24. తులసీ మాత: సేవాశక్తికి అధిష్ఠా త్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.

శ్రీ గాయత్రీ మాత మహాత్యం


వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన
రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.

మూడు సంధ్య ల్లోనూ గాయత్రీ మంత్రాన్ని జపించడం, సంధ్యావందనం చేయడం విధి. ఆ విధంగా
చేస్తే దరిద్రాలు తొలగడం, పితృదేవతలకు తృప్తి, వంశవృద్ధి, గ్రహ దోషాలు సమసిపోవడం, సుఖ
జీవనం, చేసిన పాపాలు నశించడం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

కులదేవతారాధన
భారతీయ కుటుంబ వ్యవస్థలో, కులదైవం ఆరాధన ఎంతో విశిష్టమైనది. ఈ రోజు చాలా భారతీయ
కుటుంబాలు, కులదైవాన్ని మరచి పోతున్నాయి. తదనుగుణ నష్టా లు చవి చూస్తు న్నాయి. సంతానం
లేకపోవడం , భార్యా-భర్తల మధ్య మధ్య మనస్పర్దలు రావడం, తద్వారా కుటుంబ సభ్యుల మధ్య
మనస్పర్దలు రావడం, కుటుంబ ఆర్దిక పరిస్థితులు తలక్రిందులు కావడం....ఇలాంటి వన్నీ కుల
దేవతారాధన నిర్లక్ష్యం వలనే వస్తా యి.
విశ్వబ్రాహ్మణుల కులదైవం మహామ్మాయి – ఆమే కాళికాంబ, దశమహా విద్యల్లో మొదటిది కాళి.
కాలమనే మాటలోంచి పుట్టినది కాళి. ఈమె అవతరణని గురించి వేదములలో, దేవి భాగవతంలో,
పురాణములలో ఎన్నో కధలున్నాయి. రామకృష్ణ పరమహంస ను అనుగ్రహించినది, వివేకానందుడిని
భరత భూమికి ప్రసాదించిన శక్తి ఈమే, కాలాన్ని నడిపించేది, సాధకుల మృత్యు భయాన్ని పోగొట్టేదీ
కాళికాదేవి. "మానవులలో విజయం సాధించాడినికున్న మొదటి విఘ్నం వాళ్ళ భయం. చేసే ప్రతి
పనిని, విషయాన్ని బూతద్దంలో చూసుకుని ఏమవుతుందో అని భయపడుతూ జీవితాంతం భయానికి
బానిసలై అనుక్షణం ఛస్తూ ఉంటారు. అలాంటి భయాన్ని దూరంచేసే నిర్భయ శక్తి ఆ కాళి”
అలాంటి కాళికా మూర్తు ల వర్ణన ఏమిటంటే- 1. దక్షిణ కాళిక 2. సిద్ధ కాళిక 3. గుహ్య కాళిక
4. శ్రీ కాళిక 5. భద్ర కాళిక 6. చాముండా కాళిక 7. శ్మశాన కాళిక 8 .మహాకాళిక.

గురు ఆరాధన
హైందవం గురువును ఒక వ్యక్తికాదు ఒక శక్తి, ఒక వ్యవస్థ గా భావిస్తుంది. తిమిరాంధకారాన్ని
పారద్రోలేవానిగా గురువు మహోన్నతస్థా నంలో కీర్తించ బడుతాడు. గురు అనుగ్రహాన్ని పొందిన వారికి
త్రిమూర్తు లు సైతం కింకరులుగానే ఉంటారు.
గురు స్థా నం పరమ పవిత్రమైనది. అజ్ఞానపు చీకటి నుండి జ్ఞానమనే వెలుగును నలువైపులకు ప్రసరింప
చేసే శక్తి ఒక్క గురువుకు మాత్రమే ఉంది. 'గు' అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని 'రు' అంటే
నిరోధించేవాడు అని అర్ధం. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు కనుకనే గురు స్థా నానికి
ప్రాముఖ్యత ఉంది. ‘గురుర్బ్ర హ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరంబ్రహ్మ తస్మైశ్రీ
గురవేనమః అంటూ నిరంతరం మన గురువు లను స్మరించుకోవాలని మన సనాతన హైందవ ధర్మం
చెపుతోంది. విశ్వబ్రాహ్మణుల కుల గురువైన శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారిని అనుగ్రహానికి
పాత్రత సంపాదించిన విశ్వబ్రాహ్మణులు తమ పూర్వవైభవంతో ఈ జగాన వెలుగొందుదురునుటలో
సందేహం లేదు.

మహాభారతంలో ధర్మపరిరక్షణకు గురుతర బాధ్యతతో కీలక భూమిక


పోశించిన ఆలనాటి ద్రోణాచార్యుల వారిలా, నేటి విశ్వబ్రాహ్మణ జాతి ఉద్ధరణకు సామాజిక బాధ్యతగా
స్వీకరించిన కలియుగ ద్రోణాచార్యుల అండగా ఉండి, అనుసరిద్ధాం అభివృద్ధి పథాన్ని అధిరోహిద్ధాం
దేవుల్లపురి శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ కేంద్రంగా వేములవాడ ద్రోణాచారి గారి
అధ్యక్షతన తలపెట్టిన గురు,కుల,గాయత్రీ ఆరాధనలతో పాటుగా ప్రతీ మాసశివరాత్రి ప్రదోశకాల
రుద్రాభిషేక (పాశుపత రుద్రకామ్యార్చన) , నందిహారతి కార్యక్రమాల గూర్చి వివరంగా తెలుసుకుని,
ఈ కార్యక్రమాలలో పాలు పంచుకొని సంపూర్ణ సుఖసంతోషాలను పొందగలరు.

You might also like