You are on page 1of 4

3.

శతక సుధ

I. క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు వ్రా యండి.

1) 'సత్పురుషుల స్నేహం అవసరం'. ఎందుకు?


జ) సత్పురుషులు అనగా సజ్జ నులు, మంచివారు అని అర్థం. సత్పురుషుల తో స్నేహం చేయడం వలన మంచి
లక్షణాలు అలవడతాయి. తోటివారు ఆపదలో ఉంటే రక్షించాలనే ఆలోచనలు కలుగుతాయి. గురువులను,
తల్లిదండ్రు లను, పెద్దలను, స్త్రీలను గౌరవించడం మన బాధ్యత అని తెలుసుకుంటాం. సత్పురుషులతో స్నేహం కీర్తిని,
సంతృప్తిని కలిగిస్తు ంది. చెడు గుణాలను తొలగిస్తు ంది. కావున సత్పురుషుల స్నేహం మనకు చాలా అవసరం.

2) 'ఉన్న ఊరు ,కన్నతల్లి స్వర్గ ం వంటివి'. ఎందుకు?


జ) ఉన్న ఊరు కన్నతల్లి స్వర్గ ం లాంటివి. ఎందుకంటే తల్లి జన్మనిచ్చి ఆలనాపాలనా చూస్తూ జీవితాంతం కాపాడుతుంది.
ఉన్న ఊరు బ్రతుకుతెరువును చూపిస్తు ంది.బంధుమిత్రు లను ఇస్తు ంది. ఆపద వస్తే కడుపులో పెట్టు కుని కాపాడుతుంది.
కన్నతల్లి తన బిడ్డ ను ఎటువంటి లాభం ఆశించకుండా ఎలా పెంచుతుందో అలాగే ఉన్న ఊరు కూడా తన బిడ్డ ను
ఆదరిస్తు ంది. కాబట్టి ఎవరికైనా ఉన్న ఊరు కన్నతల్లి స్వర్గ ంతో సమానం అని చెప్పవచ్చు.

3) ధనం బాగా ఉంటే ఏమేం మంచి పనులు చేయవచ్చు?


జ) ధనం బాగా ఉంటే మనము చాలా మంచి పనులు చేయవచ్చు. దానధర్మాలు చేయవచ్చు. సత్రా లు కట్టించవచ్చు.
దేవాలయాలను నిర్మింప చేయవచ్చు. చెరువులను తవ్వించి గ్రా మాభివృద్ధికి పాటుపడవచ్చు. పాఠశాలలు, వైద్యశాలలు
ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేయవచ్చు. కవులు, కళాకారులు, కష్టా ల్లో ఉన్న వారిని ఆదుకోవచ్చు. ధనం
సంపాదించుకున్న దానికన్నా ఆ ధనం ద్వారా ఇతరులకు మేలు జరిగినప్పుడే సంపాదించుకున్న ధనానికి సార్థకత
చేకూరుతుంది.

4) 'లోభి ఎప్పుడూ సంతోషంగా ఉండడు'. ఎందుకు?


జ) లోభి అంటే పిసినారి అని అర్థం. లోభి ఎల్ల ప్పుడు మనసులో అత్యాశతో,మోసపు ఆలోచనలతో ఉంటాడు. లోభి తాను
సంపాదించుకున్న ధనాన్ని ఎవరైనా దో చుకుంటారేమోననే భయంతోనే జీవితాన్ని గడుపుతుంటాడు. అలాగే తను
సంపాదించుకున్న దానిని తాను తినడు, ఇతరులకు పెట్టడు. కాని ఇతరులు చేస్తు న్న దానాన్ని చూసి తాను ఓర్వలేడు.
ఇతరులకు మేలు కలిగితే బాధపడతాడు. అందువలనే లోభి ఎప్పుడూ సంతోషంగా ఉండడు.

II. క్రింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు వ్రా యండి.

1) పాఠంలోని శతక పద్యాలు ఆధారంగా మన ప్రవర్త న, నడవడిక ఎట్లా ఉండాలో వివరించండి.


జ) పాఠంలోని శతక పద్యాల ఆధారంగా మన ప్రవర్త న, నడవడికలో చాలా మార్పులు వస్తా యి.
దానగుణాన్ని కల్గి ఉండటం, కష్టా లను ఓర్చుకోవడం మనుషులకు ఉండవల్సిన లక్షణాలు అని తెలుసుకున్నాను.
మనము ఇంద్రియనిగ్రహం ద్వారా స్థిరమైన బుద్ధిని పొ ందగలుగుతామని తెలుసుకున్నాను.లోభి తాను
సంపాదించుకున్న ధనాన్ని ఇతరుల అవసరానికి ఉపయోగించనప్పుడు, అటువంటి సంపాదన అనవసరం,దానికి
విలువ లేదు అని తెలుసుకున్నాను. సజ్జ నులు ఎదుటివారు ఎంత హేళన చేసినా వాదులాడ బో రని అలాగే మనం
కూడా అనవసర విషయాలలో జోక్యం చేసుకోకూడదని తెలుసుకున్నాను. మన మనసులో మోసపూరిత భావాలు
తొలగించుకుంటే లోకంలో మనకు మోసగాడే కనిపించడు. ధనబలంతో రాక్షసులుగా మారి పేదవారిని బాధ పెట్టకూడదు.
వారికి చేతనైన సహాయం చేయాలి అని తెలుసుకున్నాను.లోకానికి ప్రపంచ శాంతిని కలిగించే విజ్ఞా నాన్ని పొ ందాలి.కన్న
తల్లిని ,ఉన్న ఊరును విడువకూడదు.

పదజాల వినియోగం :
I. క్రింది పదాలకు అర్థా లు వ్రా యండి.
1.నరుడు ​=​మానవుడు
​2.గేలి ​=​అపహాస్యం
3.జిహ్వ​​= ​నాలుక
​4.కపటము​= ​మోసం
5.తేకువ​​= ​ధైర్యము
​6.లోభి​=ప ​ ిసినారి
7.కౄరుడు​= ​దుర్మార్గు డు ​
8.సజ్జ నుడు​= ​మంచివాడు
9.దానవుడు​=​రాక్షసుడు ​
10.మైత్రి​= ​స్నేహము
11.విశ్వము​= ​పప ్ర ంచము​​
12.దీప్తి​= ​కాంతి
II. క్రింది పదాలకు పర్యాయ పదాలు వ్రా యండి.
1. ధరిత్రి​= ​భూమి, నేల, అవని,ధర
2. తావి ​=​పరిమళం, సువాసన
3. మది​= ​మనసు,హృదయం
4. మీను​​=​చేప,మత్స్యము
5. ఏనుగు​​=​గజము,కరి
6. జనని​​=​మాత, తల్లి
IV. క్రింది ప్రకృతి పదాలకు వికృతి రూపం వ్రా యండి..
1. బిక్ష ​-​బిచ్చం
2. భక్తి ​-​బత్తి
3. వంశం ​-​వంగడం
4. కష్ట ం ​-​కసటు
5. పద్యం ​-​పద్దెము
6. త్రిలింగ ​-​తెలుగు
7. కవి ​-​కయి
8. కావ్యం​​-​కబ్బం
9. రత్నం ​-​రతనం
10. భూమి ​-​బూమి
11. శాస్త ం్ర ​-​చట్ట ం

4.అమ్మ జ్ఞా పకాలు

I. క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో జవాబులు వ్రా యండి.

1). ఈ పాఠం రాసిన కవి గురించి సొ ంతమాటల్లో వ్రా యండి.


జ.అమ్మ జ్ఞా పకాలు పాఠం ద్వారా టి.కృష్ణ స్వామి యాదవ్ రచనాశైలి సరళమైన వచనములో ఉంటుందని తెలిసింది.
గ్రా మీణ జీవనాన్ని, మధ్యతరగతి ప్రజల జీవన విధానాన్ని వారి యొక్క కోరికలను, కష్ట సుఖాల గురించి చక్కగా తన
రచనలో తెలిపాడు.గ్రా మీణులకు, పట్ట ణ వాసులకు అర్థమయ్యే విధంగా వచనంలో రాయడం మరియు తెలంగాణ భాషలో
వచన రచన చేయడం కృష్ణ స్వామి యాదవ్ గారి ప్రత్యేకతగా చెప్పవచ్చును.

2). 'కాలుష్య నిర్మూలన కార్యకర్త గా అమ్మ పని చేసింది' అని అనడంలో కవి ఉద్దేశం ఏమిటి?
జ. మన పరిసరాలలో ఉండే చెత్త, చెదారం, వ్యర్థా లను శుభ్రపరిచే మున్సిపాలిటీ, పంచాయతీ 'కార్మికులను కాలుష్య
నిర్మూలన కార్యకర్త లు' అంటారు. కాలుష్య నిర్మూలన కార్యకర్త లు చేసినట్లు గానే ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచడం
మొదలగు పనులను అమ్మ ఎంతో శ్రద్ధగా నిర్వహిస్తు ంది. వాకిట్లో ముగ్గు లు వేస్తు ంది. ఇంటి పరిసరాలను అందంగా
తీర్చిదిద్దు తుంది. కాబట్టి అమ్మను 'కాలుష్య నిర్మూలన కార్యకర్త ' అని అనడంలో సందేహం లేదు.

3). మీ అమ్మ ఇష్టా లను గురించి మీ సొ ంతమాటల్లో వ్రా యండి.


జ. ఎల్ల ప్పుడూ మా అమ్మకు మా ఇంటిని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి ఇష్ట పడేది. అమ్మకు మేము
చక్కగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని, క్రమశిక్షణతో ఉండాలని కోరుకునేది. ఇంటిని చక్కగా
అలంకరించుకోవడం, మా కుటుంబమంతా కలిసి మెలిసి సంతోషంగా ఉండడం, పండుగలప్పుడు బంధువులను పిలిచి
వారికి ఇష్ట మైన పిండి వంటలు చేయడం అమ్మకు చాలా ఇష్ట ంగా ఉండేద.ి ఎప్పుడూ కుటుంబ క్షేమం కోసం ఆకాంక్షించే
అమ్మ అంటే నాకు ఎంతో ఇష్ట ం.

4). అమ్మ చేసే పనుల్లో మనం కూడా ఎందుకు సహాయం చేయాలి?


జ. అమ్మ చేసే పనులకు సహాయం చేయడం వల్ల మనకు కూడా అమ్మ ఎంత కష్ట పడుతున్నారనే విషయం
అర్థమవుతుంది. అమ్మ ఎల్ల ప్పుడూ మన కుటుంబాన్ని ఉన్నత స్థా నంలో ఉంచడం కోసం రాత్రింబవళ్ళు ఎంతో కష్ట పడి
పని చేస్తు ంది. అమ్మ చేసే పనులకు మనం కూడా సాయం చేస్తే పనులు తొందరగా పూర్తి అవుతాయి. అమ్మకు విశ్రా ంతి
దొ రుకుతుంది. అమ్మకు సహాయం చేయడం వల్ల పని పట్ల బాధ్యత, పెద్దల పట్ల ప్రేమ, గౌరవం కలుగుతాయి కాబట్టి
అమ్మకు ఎల్ల ప్పుడు మనం సహాయపడుతుండాలి.

II. క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు వ్రా యండి.

1). అమ్మ గొప్పతనాన్ని మీ సొ ంత మాటల్లో వ్రా యండి.


జ. అమ్మంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగాలకు ప్రతి రూపం. అనునిత్యం కుటుంబం కోసం, పిల్లల బాగు కోసం ఎంతటి
కష్టా న్నైనా భరించి, సంతోషంగా అన్నింటినీ భరిస్తు ంది. మనం ఒకసారి ప్రపంచ చరితన ్ర ు పరిశీలిస్తే ఒక విషయం
అర్థమవుతుంది. మన జాతి గర్వించదగిన వీరులను, మహనీయులను, ప్రవక్త లను, సంఘసంస్కర్త లను, మేధావులను
రూపుదిద్దినది మాతృమూర్తు లే అని తెలుస్తు ంది. తల్లిగా, చెల్లి గా, అక్కగా, ఉపాధ్యాయురాలిగా, స్నేహితురాలిగా మన
నుంచి ఏమీ ఆశించకుండా నిస్వార్ధంగా సేవ చేస్తు ంది. పిల్లల కోసం సర్వం త్యాగం చేయడానికైనా సిద్ధపడే
మాతృమూర్తు లకు మనం ఏమి ఇచ్చినా వారి రుణం తీర్చుకోలేము. మన ఇంటిని స్వర్గ ంగా మార్చే శక్తి తల్లికి మాత్రమే
ఉంది.

పదజాల వినియోగం:
అర్థా లు
1.ప్రా ంగణము​​= ​ముంగిలి, వాకిలి
​2.అద్ద కము​= ​రంగు వేయడం
3.గట్టు ​= ​తీరము
​4.పడిషం​= ​జలుబు
5.వరాహము​​= ​పంది
​6.కుంచె= ​రోలు
7.కొట్ట ము​​= ​పశువుల పాక
పర్యాయపదాలు :
1. కనకంబు​​=​బంగారము, పుత్త డి
2. కుందేలు​​= ​శశకము, చెవులపిల్లి , శరభం
3. దూడ​​= ​పెయ్య, లేగ, క్రేపు
4. ఆకాశము​​= ​అంబరము, గగనం
5. ఇల్లు ​= ​గృహము, నివాసము

ప్రకృతి --వికృతులు
1.కుల్య​​- ​కాలువ
2. ఆకాశము​​- ​ఆకసం
3. మొగము​​- ​ముఖము

You might also like