You are on page 1of 11

ఏది గొప్పదానం

1 కథ

కింది బొమ్మను చూడండి. ప్రశ్నలకు జవాబులను చెప్పండి.

1. పై బొమ్మలో మీకు ఎవరెవరు కనిపిస్తున్నారు?


జ. పై బొమ్మలో దానం చేసేవారు, తీసుకునేవారు కనిపిస్తున్నారు.
2. వారు ఏమి చేస్తున్నారు?
జ. ఒకరు వస్త్రదానం చేస్తుంటే, ఒకరు అన్నదానం చేస్తున్నారు.
3. మీరు ఎప్పుడైనా, ఎవరికైనా దానం చేసారా?
జ. చేసాను

పాఠం నేపథ్యం

కురువంశ రాజసింహాసనం కోసం కౌరవులకు మరియు పాండవులకు మధ్యన కురక్షేత్రంలో యుద్ధం


జరిగింది. ఎంతో మంది ఈ యుద్ధంలో మరణించారు. చివరకు పాండవులు విజయం సాధించారు. పాండవులు
ఐదుగురు. అందులో పెద్దవాడు ధర్మరాజు, యుద్ధంలో జరిగిన హింసకు పరిహారంగా ధర్మరాజు ఒక యాగం
చేసాడు. ఆ యాగంలో భాగంగా అనేక దానధర్మాలు చేసాడు.
దానం చేయాలనే గుణం ఉండాలే కానీ వారు గొప్పవారు, బీదవారు అనే తేడా ఉండదు. దానం ఎవరైనా
చేయవచ్చు. తన దగ్గర ఏమీ లేకున్నా మంచి మనసుతో చేసే చిన్నదానం కూడా గొప్ప ఫలితాలను ఇస్తుంది అని
తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.
Varsity Education Management Pvt.Ltd.,
5
IX_Class TS_Telugu II Language_Common Notes

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం ‘కథ’ అనే ప్రక్రియకు చెందినది. ఈ కథను మహాభారతం


నుండి తీసుకున్నారు. రామాయణ, మహాభారతాలను ఇతిహాసాలు అంటారు.
ద్వితీయ భాష విద్యార్థుల కోసం ఈ కథను వచన రూపంలో రాయడం జరిగింది.

I. అవగాహన ప్రతిస్పందన

విని ఆలోచించి మాట్లాడడం

అ) కింది ప్రశ్నలకు జవాబులను చెప్పండి.


1) కథలోని దానగుణం గురించి మీ సొంతమాటల్లో చెప్పండి.
జ. ధర్మరాజు చేసిన దానధర్మాలు ఆడంబరంగా ఉన్నాయి. సక్తుప్రస్తుడు అనే పేద బ్రాహ్మణుని దానధర్మాలు
నిరాడంబరంగా ఉన్నాయి. దానం చేసినపుడు వదిలిన నీరు తగిలినా పవిత్రులు అవుతారని తెలుస్తుంది. బాగా
సంపద ఉండి చేసిన దానం కన్నా, తన దగ్గర ఏమీ లేకున్నా లభించిన దానిని, ఉన్న కొంత దానిని దానం
చేయడం ఎంతో గొప్ప విషయం.
2) మీరు చేసిన దానం గురించి చెప్పండి.
జ. నేను మా అమ్మ నాన్నలతో గుడికి వెళ్ళినపుడు అక్కడున్న భిక్షగాళ్ళకు అన్నదానం చేసాను. వరద బాధితులకు
పాత బట్టలు దానం చేసాను. అనాథ పిల్లలకు మా తరగతి పిల్లలు అందరము ధన సహాయము చేసాము.

ధారాళంగా చదవడం - అర్థం చేసుకోవడం

అ) కింది గద్యాన్ని చదువండి. ఖాళీలను పూరించండి.


ఒక ఊరిలో సక్తుప్రస్తుడు అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. దొరికిన భిక్షతో కాలం గడిపేవాడు.
భార్య, కొడుకు, కోడలు అతనికి ఎంతో సహకరించేవారు. ఒకసారి వీరికి కొన్ని రోజులపాటు భిక్ష దొరకలేదు.
ఒక రోజు జొన్నపిండి భిక్షగా దొరికింది. దొరికిన కొంచెం పిండిని కుటుంబ సభ్యులు పంచుకున్నారు. ఇక
తిందాం అని కూర్చోగానే ఒక వ్యక్తి ఆకలి అంటూ ఇంటి ముందు నిలబడ్డాడు.
1) ఒక ఊరిలో సక్తుప్రస్తుడు అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు.
2) సక్తుప్రస్తునికి భార్య, కొడుకు, కోడలు సహకరించేవారు.

Varsity Education Management Pvt.Ltd., 6


TS_Telugu II Language_Common Notes IX_Class
3) వారికి కొన్ని రోజుల తరువాత జొన్నపిండి భిక్షగా దొరికింది.
4) కుటుంబ సభ్యులు పిండిని పంచుకున్నారు.
5) ఇంటి ముందు ఆకలి అంటూ ఒక వ్యక్తి నిలబడ్డాడు.
ఆ) కింది గద్యాన్ని చదువండి. ఐదు ప్రశ్నలను తయారు చేయండి. (ఎవరు, ఏమిటి, ఎందుకు అన్న పదాలను
ఉపయోగించండి.)
సుదాముడు, శ్రీకృష్ణుడు చిన్ననాటి స్నేహితులు. వారిద్దరూ కలిసి చదువుకున్నారు. వారి గురువుగారు
సాందీపుడు. సుదాముడి మనస్సు అద్దంలాగా నిర్మలమైనది. బుద్ధిమంతుడు. క్రమశిక్షణతో ఉండేవాడు. శాంత
స్వభావం కలిగినవాడు. దరిద్రాన్ని అనుభవించేవాడు. కానీ తన దరిద్రాన్ని గురించి ఎన్నడూ దుఃఖపడలేదు.
చిరునవ్వు అతని ముఖాన్ని ఎన్నడూ విడువలేదు. అన్ని విలువలు తెలిసిన యోగ్యుడికే డబ్బు విలువ మరియు
సంతోషం విలువ తెలుస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చిన సత్కర్మలు ఆచరించడం మానలేదు. అందువల్ల చివరికి
అతనికి మోక్షం లభించింది.

1) పై పద్యంలో చిన్ననాటి స్నేహితులు ఎవరు?


2) ఎవరి మనస్సు అద్దంలాగా నిర్మలమైనది?
3) చివరికి సుదామునికి ఏమి లభించింది?
4) పై గద్యంలోని స్నేహితుల గురువు ఎవరు?
5) సుదాముడి ముఖాన్ని ఎన్నడూ వీడనిది ఏమిటి?

II. వ్యక్తీకరణ - సృజనాత్మకత

స్వీయరచన

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులను రాయండి.


1) ముంగిస ఎక్కడికి వచ్చింది?
జ. పాండవులకు కౌరవులకు యుద్ధం జరిగి చాలా మంది మరణించారు. దానికి పరిహారంగా ధర్మరాజు ఒక
యాగం చేసాడు. చాలా గొప్పగా దానాలు, ధర్మాలు చేసాడు. అందరూ ఆయన దానగుణాలను పొగుడుతున్నారు.
ఆ సమయంలో ముంగిస అక్కడకు వచ్చింది.

7 Varsity Education Management Pvt.Ltd.,


IX_Class TS_Telugu II Language_Common Notes
2) ముంగిస పెద్దగా నవ్వడానికి గల కారణాన్ని వివరించండి.
జ. ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాప పరిహారము కోసం యాగం చేస్తున్నాడు. ఆ యాగంలో అనేక
దానధర్మాలను ధర్మరాజు బ్రాహ్మణులకు చేస్తున్నాడు. అప్పుడు ఆయనను అందరు పొగుడుతున్నారు. అప్పుడే
సగం శరీరం బంగారు కాంతితో మెరిసిపోతున్న ముంగిస అక్కడకు వచ్చింది. ఆ మాటలను విని నవ్వింది.
3) సక్తుప్రస్తుడు చేసిన అతిథి మర్యాద గురించి మీ మాటల్లో రాయండి.
జ. సక్తుప్రస్తుని వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ఆకలి అంటూ ఇంటి ముందు నిలబడ్డాడు. అతనిని కూర్చోబెట్టి తన
భాగానికి వచ్చిన జొన్నపిండిని ఆయనకు ఆహారంగా ఇచ్చాడు. కాని అతని ఆకలి తీరలేదు. మిగిలిన కుటుంబ
సభ్యులు ఒకరి తర్వాత ఒకరు తమ వంతు ఆహారం అతనికి ఇచ్చారు. ఆ ఆహారం తిని కడుపు నిండిందని
అన్నాడు. సక్తుప్రస్తుడు ఎంతో సంతోషించాడు.
4) దానధర్మాలు ఎన్ని రకాలుగా చేయవచ్చో రాయండి.
జ. దానధర్మాలు చాలా రకాలుగా చేయవచ్చు. గోవును దానము చేయుటను గోదానమంటారు. అన్నము
దానము చేయుటకు అన్నదానమంటారు. భూమిని దానము చేయుటను భూదానమంటారు. వస్తువులను
దానము చేయుటను వస్తు దానమంటారు. బంగారమును దానము చేయుటను హిరణ్యదానమంటారు.
విద్యాదానం, రక్తదానం ఇలా అనేక రకాలుగా దానములు చేయవచ్చును.
ఆ) కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబును రాయండి.
1) ‘‘నిజమే ఆ పేద బ్రాహ్మణుడి దానగుణం ముందు నా దానగుణం సరిపోదు’’ అని ధర్మరాజు ఎందుకు అన్నాడో
వివరించండి.
జ. ధర్మరాజు తాను చేస్తున్న యాగంలో బ్రాహ్మణులకు, ఋత్విక్కులకు దానధర్మాలు చేసాడు. ఎంతో
ఆడంబరంగా జరిగిన దానిని చూసి అందరూ పొగిడారు. అక్కడకు వచ్చి, ఇదంతా చూసి నవ్విన ముంగిసను
చూసి కారణం అడిగారు. అప్పుడు ముంగిస ఇలా చెప్పింది. సక్తుప్రస్తుడు అనే పేద బ్రాహ్మణుడు తన వద్దకు
ఆకలితో వచ్చిన వ్యక్తికి తమకు ఆహారంగా లభించిన జొన్నపిండిలో తన భాగాన్ని ఇచ్చాడు. అతనికి ఆకలి
తీరలేదు. అప్పుడు బ్రాహ్మణుని భార్య, కొడుకు, కోడలు తమ భాగాన్ని ఇవ్వగా అతని ఆకలి తీరింది. ఆ
దానం చేసే సమయంలో అతిథిగా వచ్చిన బ్రాహ్మణుడి కాళ్ళు కడిగి ఆహారం దానం చేసాడు. ఆ కారణంగా
ఆ నీళ్ళు నాకు తగిలి సగం శరీరం బంగారమయ్యింది అని ముంగిస అన్నది. మిగతా శరీరం బంగారం
చేసుకొందామని తిరిగి తిరిగి ఇక్కడకు రాగా నిరాశ ఎదురయ్యింది ముంగిస అన్నది. అప్పుడు ధర్మరాజు
‘‘నిజమే ఆ పేద బ్రాహ్మణుడి దానగుణం ముందు నా దానగుణం సరిపోదు. ప్రేమతో, ఆర్తితో దానం చేయాలి
కానీ అహంకారంతో కాదు’’ అని ఆ ముంగిసకు నమస్కరించాడు.

Varsity Education Management Pvt.Ltd., 8


TS_Telugu II Language_Common Notes IX_Class

సృజనాత్మకత

1) మీకు తెలిసిన ఒక దాతను గురించి మీ మిత్రునికి లేఖ రాయండి.


కోదాడ,
14-07-2021.
ప్రియ మిత్రుడు రవికి,
నీ మిత్రుడు రాయునది. నేను క్షేమము. నీవు క్షేమమని అనుకుంటున్నాను. మా తెలుగు మాష్టారు
దానగుణం గురించి గొప్పగా చెప్పారు. దాని గురించి నీకు కూడా చెబుతాను. దానము చేసేవారిని దాత
అంటారు. మన అందరికీ బాగా తెలిసిన దాత కర్ణుడు. నాకు తెలిసిన విషయాలు కర్ణుడి గురించి నీకు
తెలియజేస్తాను. కర్ణుడు మహావీరుడు. సూర్యుడు కర్ణుని తండ్రి, తల్లి కుంతి. సహజ కవచ కుండలాలతో
జన్మించాడు. దుర్యోధనుడు కర్ణుడిని అంగరాజ్యానికి అధిపతిగా చేసాడు. తండ్రి వద్దని చెప్పినా మారు వేషంలో
వచ్చిన ఇంద్రునికి కవచకుండలాలు కోసి ఇచ్చాడు. ఆయన జీవితంలో ఎన్నో గొప్ప దానాలు చేసి దాన కర్ణుడిగా
పేరు పొందాడు. నీకు తెలుసున్న విషయాలు నాకు లేఖ ద్వారా తెలియజేయుము.
మీ అమ్మానాన్నలకు నా నమస్కారములు.
ఇట్లు
నీ మిత్రుడు,
xxx.
చిరునామా:
కె. రవి,
ఇ.నెం: 6-3-21,
వివేకానందనగర్,
కూకట్ పల్లి,
హైదరాబాదు.

9 Varsity Education Management Pvt.Ltd.,


IX_Class TS_Telugu II Language_Common Notes

III. భాషాంశాలు

పదజాలం

అ) కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు అర్థాలను A/B/Cలుగా గుర్తించండి.


1) ఋషులు లోకకళ్యాణం కొరకు యాగం చేసేవారు. (C)
A) వ్యవసాయం B) వ్యాపారం C) యజ్ఞము
2) హర్ష వాళ్ళ ఇంటికి వచ్చిన అతిథులను చాలా మర్యాదగా చూస్తాడు. అందుకే అతడంటే అందరికీ
ఇష్టం. (C)
A) కోపం B) అవమానం C) గౌరవం
3) రాణి తన అహంకారంతో అందరికీ దూరమైంది. (A)
A) గర్వం B) పిసినారితనం C) కోపం
ఆ) కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలను రాయండి.
1) పరిహారం : నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించింది.
2) ఆర్తి : ఆర్తిలో ఉన్నవారికి సాయం అందించాలి.
ఇ) వచనాలు
ఒకటే ఉంది అని అర్థం వచ్చేవి ‘ఏకవచనం’ లో ఉంటాయని,
ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయని తెలుపడానికి ‘బహువచనం’ లో ఉంటాయని మీకు తెలుసు! కింది
పట్టిక చూడండి.
ఏకవచనం బహువచనం
కొడుకు కొడుకులు
పుస్తకం పుస్తకాలు
రంగు రంగులు
* ఇదే విధంగా, పాఠంలో ఉన్న ఏకవచన పదాలకు బహువచనాలు, బహువచన పదాలకు ఏకవచన
పదాలను పట్టికలో రాయండి.
ఏకవచనం బహువచనం
1) యుద్ధం యుద్ధాలు
2) శరీరం శరీరాలు
3) స్థలం స్థలాలు
4) కాలు కాళ్ళు
5) వ్యక్తి వ్యక్తులు
Varsity Education Management Pvt.Ltd., 10
TS_Telugu II Language_Common Notes IX_Class

ఈ) కింది ఇచ్చిన పట్టికలోని అక్షరాలతో వీలైనన్ని పదాలను రాయండి.

పు దా న గు ణం
ముం వ్వు గ ని మ్మ
గి తం ర్యా రు అ
స మ స్య నీ తి
బ్రా హ్మ ణు డు థి
ఉదా: దానగుణం
1) ముంగిస 6) నీతి
2) బ్రాహ్మణుడు 7) అమ్మ
3) అతిథి 8) గని
4) నీరు 9) నగ
5) నిమ్మ 10) సమస్య

వ్యాకరణాంశాలు

• పిల్లలూ! ఇవి మీకు తెలుసుకదా!


• వ్యక్తుల, వస్తువుల, ప్రాంతాల పేర్లను తెలిపే పదాలను ‘నామవాచకాలు’ అంటారు.
• ఉదా: నిరాలి, సహస్ర, హర్షవర్థన్, కుర్చీ, బల్ల, జామ, అరటి, కరీంనగర్, నల్గొండ మొదలగునవి.
• నామవాచకాలకు బదులుగా వాడే పదాలను ‘సర్వనామాలు’ అంటారు.
• ఉదా: ఆమె, అతడు, మీరు, నేను, అది, ఇది, అక్కడ, ఇక్కడ, మేము, మనము మొదలగునవి.
• పనిని తెలిపే పదాలను ‘క్రియ’ అంటారు.
• ఉదా: పాట పాడింది, నాట్యం చేసింది, పంట చేసింది, సామాన్లు తెచ్చాడు మొదలగునవి.
• గుణాలను తెలిపే పదాలను ‘విశేషణం’ అంటారు.
ఉదా: రాజు మంచి అబ్బాయి.
చింతకాయ పుల్లగా ఉంటుంది.
లింగ, వచన, విభక్తులు లేని పదాలు ‘అవ్యయాలు’.
ఆహా, ఓహో, అరెరె మొ॥ పదాలు అవ్యయాలు.
ఉదా: ఆహా! నాగార్జునసాగర్ ఎంత అందంగా ఉన్నదో కదా!
11 Varsity Education Management Pvt.Ltd.,
IX_Class TS_Telugu II Language_Common Notes

అ) కింది వాక్యాలను చదువండి. గీత గీసిన పదం ఏ భాషా భాగమో బ్రాకెట్లలో రాయండి.
ఉదా: వైష్ణవి చక్కగా నాట్యం చేస్తుంది. (నామవాచకం)
1) అతడు వ్యవసాయం చేస్తాడు. (సర్వనామం)
2) ఆహా! వేయి స్తంభాల గుడి ఎంత అద్భుత కట్టడం. (అవ్యయం)
3) అమ్మ చేతి ముద్ద అమృతంతో సమానం. (నామవాచకం)
4) రాకేశ్ తోటలోని మామిడి పండ్లు తెచ్చాడు. (క్రియ)

ప్రాజెక్ట్ పని

ఏవైనా ఇతిహాస కథలను సేకరించి రాయండి. మీ తరగతి గదిలో ప్రదర్శించండి.

అభ్యాసపత్రం

I. అవగాహన ప్రతిస్పందన

అ) కింది గద్యాన్ని చదువండి. ఖాళీలను పూరించండి.


ఒక ఊరిలో సక్తుప్రస్తుడు అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. దొరికిన భిక్షతో కాలం గడిపేవాడు.
భార్య, కొడుకు, కోడలు అతనికి ఎంతో సహకరించేవారు. ఒకసారి వీరికి కొన్ని రోజులపాటు భిక్ష దొరకలేదు.
ఒక రోజు జొన్నపిండి భిక్షగా దొరికింది. దొరికిన కొంచెం పిండిని కుటుంబ సభ్యులు పంచుకున్నారు. ఇక
తిందాం అని కూర్చోగానే ఒక వ్యక్తి ఆకలి అంటూ ఇంటి ముందు నిలబడ్డాడు.
1) ఒక ఊరిలో ................................ అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు.
2) సక్తుప్రస్తునికి భార్య, ................................ సహకరించేవారు.
3) వారికి కొన్ని రోజుల తరువాత ................................ భిక్షగా దొరికింది.
4) కుటుంబ సభ్యులు ................................ పంచుకున్నారు.
5) ఇంటి ముందు ................................ అంటూ ఒక వ్యక్తి నిలబడ్డాడు.
ఆ) కింది గద్యాన్ని చదువండి. ఐదు ప్రశ్నలను తయారు చేయండి. (ఎవరు, ఏమిటి, ఎందుకు అన్న పదాలను
ఉపయోగించండి.)
సుదాముడు, శ్రీకృష్ణుడు చిన్ననాటి స్నేహితులు. వారిద్దరూ కలిసి చదువుకున్నారు. వారి గురువుగారు
సాందీపుడు సుదాముడి మనస్సు అద్దంలాగా నిర్మలమైనది. బుద్ధిమంతుడు. క్రమశిక్షణతో ఉండేవాడు. శాంత
Varsity Education Management Pvt.Ltd., 12
TS_Telugu II Language_Common Notes IX_Class
స్వభావం కలిగినవాడు. దరిద్రాన్ని అనుభవించేవాడు. కానీ తన దరిద్రాన్ని గురించి ఎన్నడూ దుఃఖపడలేదు.

చిరునవ్వు అతని ముఖాన్ని ఎన్నడూ విడువలేదు. అన్ని విలువలు తెలిసిన యోగ్యుడికే డబ్బు విలువ మరియు

సంతోషం విలువ తెలుస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చిన సత్కర్మలు ఆచరించడం మానలేదు. అందువల్ల చివరికి

అతనికి మోక్షం లభించింది.

1) ...........................................................................................

2) ...........................................................................................

3) ...........................................................................................

4) ...........................................................................................
5) ...........................................................................................

II. భాషాంశాలు

పదజాలం

అ) కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు అర్థాలను A/B/Cలుగా గుర్తించండి.

1) ఋషులు లోకకళ్యాణం కొరకు యాగం చేసేవారు. ( )

A) వ్యవసాయం B) వ్యాపారం C) యజ్ఞము

2) హర్ష వాళ్ళ ఇంటికి వచ్చిన అతిథులను చాలా మర్యాదగా చూస్తాడు. అందుకే అతడంటే అందరికీ

ఇష్టం. ( )

A) కోపం B) అవమానం C) గౌరవం

3) రాణి తన అహంకారంతో అందరికీ దూరమైంది. ( )

A) గర్వం B) పిసినారితనం C) కోపం

ఆ) కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలను రాయండి.

1) పరిహారం : .............................................................................................

2) ఆర్తి : .............................................................................................
13 Varsity Education Management Pvt.Ltd.,
IX_Class TS_Telugu II Language_Common Notes

ఇ) వచనాలు

ఏకవచనం బహువచనం

1) యుద్ధం
2) శరీరం

3) స్థలం

4) కాలు

5) వ్యక్తి

ఈ) కింది ఇచ్చిన పట్టికలోని అక్షరాలతో వీలైనన్ని పదాలను రాయండి.

పు దా న గు ణం

ముం వ్వు గ ని మ్మ

గి తం ర్యా రు అ

స మ స్య నీ తి

బ్రా హ్మ ణు డు థి

ఉదా: దానగుణం

1) .............................. 6) ..............................

2) .............................. 7) ..............................

3) .............................. 8) ..............................

4) .............................. 9) ..............................

5) .............................. 10) ..............................

Varsity Education Management Pvt.Ltd., 14


TS_Telugu II Language_Common Notes IX_Class

వ్యాకరణాంశాలు

ఉదా: రాజు మంచి అబ్బాయి.

అ) కింది వాక్యాలను చదువండి. గీత గీసిన పదం ఏ భాషా భాగమో బ్రాకెట్లలో రాయండి.

ఉదా: వైష్ణవి చక్కగా నాట్యం చేస్తుంది. ( )

1) అతడు వ్యవసాయం చేస్తాడు. ( )

2) ఆహా! వేయి స్తంభాల గుడి ఎంత అద్భుత కట్టడం. ( )

3) అమ్మ చేతి ముద్ద అమృతంతో సమానం. ( )

4) రాకేశ్ తోటలోని మామిడి పండ్లు తెచ్చాడు. ( )



15 Varsity Education Management Pvt.Ltd.,

You might also like