You are on page 1of 119

కథలు కనే కళ్ళు

కథలు కనే కళ్ళు


-పెండ్యాల గాయత్రి 

అంకితం 

పెండ్యాల గాయత్రి (1)


కథలు కనే కళ్ళు

సాహితీ సృష్టికి కావలసిన ఊహా శక్తిని, వివేచనా యుక్తిని చిన్నతనం నుండే నాలో పెంపొందించి, నన్ను
ప్రోత్సహించిన పుణ్య దంపతులు, నాకు పూజనీయులు అయిన నా తల్లిదండ్రు లు పెండ్యాల శేషమ్మ,
సుబ్బారావు గార్లకు,, 
తన రచనలతో నన్ను పులకాంకితురాలిని జేసి, అనవరతం నాలో సాహితీస్ఫూర్తిని నింపుతూ, నా
రచనల మొదటి ముద్రణ అనే అపూర్వ అవకాశాన్ని కలుగజేసిన పూజ్య గురువులు సినారే గారికి ఈ
నా కథల సంపుటిని అంకితం చేస్తు న్నాను.

ముందుమాట
పెండ్యాల గాయత్రి గారు రచించిన ‘కథల సమాహారం’లో ప్రతీ కథ సమాజ పోకడలను, ప్రస్తా విస్తూ, అభ్యుదయ
భావాలను ప్రతిబింబిస్తూ సాగుతాయి. కొన్ని కథలకు ఆరంభంలో ఉదహరించిన వాక్యంతోనే ఆ కథలో ఉన్న గాఢత అర్థం
చేసుకోవచ్చును. తన కథల కోసం రచయిత్రి చుట్టూ జరిగే సంఘటనలనే కథాంశాలుగా తీసుకుని మలిచిన తీరు ఎంతగానో
ఆకట్టు కుంటుంది.

పెండ్యాల గాయత్రి (2)


కథలు కనే కళ్ళు

ఉపాధ్యాయురాలిగా పనిచేసే గాయత్రి గారు, ఓ మనిషి తప్పటడుగులు వేయకుండా ఉండాలంటే తన బాల్యంలో మంచి
టీచర్ పరిరక్షణలో విద్యాబుద్ధు లు నేర్వాలంటారు. సమాజంలో మార్పు తేవాలన్నా, రావాలన్నా బడి నుంచే మొదలవ్వాలని
భావిస్తా రన్న దానికి తగ్గట్టు గా తన కథలు క్రమశిక్షణ గల ఉపాధ్యాయులు, వారి దగ్గర శిష్యరికం చేసిన పిల్లలను చూపిస్తా యి.  
అలాంటి అంశంతోనే రాసిన కథ పినాకిని. ‘సామాజిక బాధ్యత కల టీచర్, తనను పెంచి చదివించటం వెనుక ఉన్న
అసలు కారణమేమిటో అతను తెలుసుకున్న తీరును, ఆ తర్వాత తన గురువు ఆశయాన్ని ఎలా ఆచరణలో పెట్టా డు’ అన్నది
చాలా చక్కగా రాసారు. 
మట్టిపొరలు అనే కథలో, ఓ టీచర్ తన విద్యార్థు లకు బోధించిన మంచి విషయం, వారి మనసుల్లో నాటుకుని అది
ఆచరణ దిశగా అడుగులు వేయటం చూసిన తర్వాత, ఆ టీచర్ పడే ఆనందం గురించి పాఠకులు చదివినప్పుడు, మంచికి బీజం
పడాలంటే అది బడినుంచే, అనిపించక మానదు. 
ముందు వెనుకలు ఆలోచించకుండా వెంటనే స్పందించే గుంపు మనస్తత్వం ఎలా ఉంటుందన్న అంశాన్ని, ఓటమిలో
గెలుపు సాధించటం ఎలాగన్న ఆశావహ దృక్పధాన్ని ‘వందిమాగదులు’ అనే కథలో చూపించిన తీరు ఎంతో అద్భుతంగా ఉంది.
‘తను ఓ నిరుద్యోగి, చిత్రకారుడు. రైలు ప్రయాణంలో ఒకానొక అపూర్వ దృశ్యాన్ని చూసి వేసిన చిత్రం అతనిని అందలానికి ఎలా
ఎక్కించింది.. ఆ చిత్రం వేసినప్పుడు అతనికి జరిగిన అవమానానికి అతనెలా స్పందించాడు., ఓ చిన్న ప్రయాణంలో జరిగిన
సంఘటన అతని జీవితాన్నెలా మార్చింది., విషయం తెలియకుండా, చూడకుండా, నేరస్తు డికి వత్తా సు పలుకుతూ నిందించే
వారిని వందిమాగదులంటూ రాసిన కథ’ సమాజ పోకడలను వివరిస్తుంది.
చెప్పాలనుకున్నది సుస్పష్టంగా ఉంటే, అంశాలకు కరువా..!? అన్నట్టు ప్రకృతి పరిరక్షణ గురించి వికారి.కామ్ అనే కథలో
తన భావాలను వెల్లడించారు. కథను గమనిస్తే, ఓ వెబ్సైట్ వారు ఇచ్చిన సందేశం చూసి ఆ అన్నాచెల్లెళ్ళు ఎలా స్పందించారో,
వారిలో వచ్చిన మార్పు, రచయిత్రి కోరుకునే మార్పు అని అర్థం చేసుకోవచ్చు. ప్రకృతి పట్ల తన మమకారాన్ని, బాధ్యతను అలా
తెలియజేశారు అనిపిస్తుంది.
మరో కథలో చదువు ఆవశ్యకత చెపుతూ, కథకురాలి అంతరంగం నుంచి వచ్చిన సంఘర్షణ ఈ ‘ఆత్మవిమర్శ’ అనే
కథగా రాసారు. ఆడపిల్ల చదువు లేకుండా అర్హతకు మించి అర్రు లు చాస్తే ఎలాంటి పరిస్థితుల్లో తనను తాను ఉంచుకుని బాధ
పడుతుందో, అని ఓ పరిపక్వత లేని మానసిక దౌర్బల్యం కల అమ్మాయి కథను చాలా చక్కగా విశ్లేషిస్తూ రాసారు రచయిత్రి.
మనిషి ఆకలిదప్పులను ఆధారంగా చేసుకుని తమ పబ్బం గడుపుకునే వారు అడుగడుగునా తగులుతారు. సమాజ
పోకడలను ఎండగడుతూ రాసిన కథ తుఫాను నగర్. తమ కొచ్చే ఫండ్స్ కోసం వారిని స్వార్థా నికి ఊరి చివరున్న నిరక్షరాస్యులకు
మత బోధనలు చేస్తూ, వారి దైన్యాన్ని వాడుకునే సంస్థకు ఆ తల్లీ కూతుళ్ళు ఎలా బుద్ధి చెప్పాలని చూసారో అని చెప్తూ ఇలాంటి
వారి పట్ల జాగ్రత్త వహించాలని సూచిస్తుందీ కథ.

ముందు చెప్పినట్లు గా, ‘సంఘంలో మార్పు రావాలంటే బాల్యం నుంచే రావాలి, అది కూడా విద్యార్థి దశలోనే బీజం
పడాలి. అప్పుడే ఆ పిల్లల్లో నిబద్ధత వలన అభివృద్ధి ఫలాలు సులభంగా సాధించవచ్చు’ అని తన ఆలోచనలను కథగా మార్చి
‘సుజలాం సుఫలాం’ పేరిట అందించారు.
తెలుగు భాషకు పట్టం కట్టినట్టు చక్కటి తెలుగులో రాసిన ‘అటునుంచి నరుక్కురండి..!’ కథను చదివినప్పుడు
రచయిత్రికి తెలుగుభాషపై ఉన్న మక్కువ అర్థమవుతుంది.

పెండ్యాల గాయత్రి (3)


కథలు కనే కళ్ళు

సంసారం సాఫీగా సాగాలంటే, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అవగాహన ఉండాలి. అర్థం చేసుకునే క్రమంలో
ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ ఎంతో ఓర్పుతో సహనంతో ఉంటే ఆ భార్యాభర్తల మధ్య బంధం ఎంతో అందంగా
ఉంటుంది,, అనే సందేశం ఇచ్చే దిశగా సాగుతుంది ఈ కథ. ‘భర్త, సమాజాన్ని చదివినవాడు. భార్యంటే అమితమైన ప్రేమ.
ఆమెకు భర్త మీద వల్లమాలిన ప్రేమ ఉన్నా, అతని చేష్టలు అర్థం కావు. అతని ప్రతిచర్య వెనుక ఓ సామాజిక బాధ్యత ఉంటుంది.
ఎంత ప్రేమ ఉన్నా, అతను తను చెప్పినట్టు కాకుండా, తనకు అర్థం కాకుండా ఎందుకు అలా ప్రవర్తిస్తా డో అర్థం కాదు. ఆమె
అనుమానం వెనుక అసలు కారణం ఏమిటి, అతను భార్యకు ఏమి చెప్పి ఆమె సందేహాలు తీర్చాడో ‘ఆమెకెందుకిచ్చినట్టు ?’
కథలో ఎంతో చక్కగా వివరించారు. భర్త పాత్రను తీర్చిదిద్దిన తీరు మనసుకు నచ్చేలా ఎంతో బాగుంటుంది. భార్య మనసులో
సందేహపు తెరలు కూడా అంతే వాస్తవంగా ఉంటాయి. ఓ చక్కటి బంధానికి అర్థం ఈ కథ. 
గాయత్రి గారికి సమాజం పట్లే కాదు, ప్రకృతి పట్ల కూడా బాధ్యత, మమకారం ఉందని, దానిని పరిరక్షించటమెలాగో
కూడా తనదైన శైలిలో రాసారు. ‘ఓ చిన్న పల్లెలో వినాయక చవితి సంబరాలు జరుగుతుంటాయి. రెండు పాత్రలతోనే కథ నడిపిన
వైనం ఎంతో బాగుంటుంది. చివరికి కథలో ప్రకృతి పరిరక్షణ గురించి చెప్తూ ,, చెరువులో పూడిక తీయడం, మట్టి గణపతి
చేయటం.. వంటి ఆలోచనలు పంచుతూ పచ్చదనాన్ని పెంపొందించడం కోసం చేసే చర్యలు వివరించిన తీరు రచయిత్రికి ఉన్న
అవగాహన తెలియజేస్తుంది.
మరొక కథలో, కంప్యూటర్ యుగంలో కూడా కొడుకు కావాలనుకునే తల్లిదండ్రు లు అబార్షన్‌లు చేయించుకోవడం వల్ల
ఆడపిల్లల సంఖ్య తగ్గిందని వారి తప్పును సూక్ష్మంగా సూచిస్తూ, మనిషిలో బాహ్య సౌందర్యం కన్నా అంతఃసౌందర్యం మిన్న
అంటూ చెప్పిన కథ ‘లోపలి అందాలు’.
తనకు సమాజం పట్ల బాధ్యతతో కూడిన అవగాహన ఉందన్నందుకు గుర్తు గా ‘ఆశయం’ కథ రూపొందించారు.
సమాజ సేవ అంటే మనకున్న పరిధిలో ఎంతో కొంత చేయొచ్చు, అన్నట్లు సాగిన ఈ కథ రచయిత్రి అంతరంగాన్ని చూపిస్తుంది. 
గాయత్రిగారి ఈ కథా సంపుటి, సమాజానికి ఉపయోగపడే చక్కటి అంశాలపై అవగాహన కల్పిస్తూ, వాటికి తగిన
పరిష్కారాలను చూపిస్తూ రాసిన తీరు ముదావహము. 
మనసులో ఉన్న భావాలను అక్షరీకరించినప్పుడే ఆ వ్యక్తిత్వం అర్థమవుతుంది. తానెంతో నిబద్ధతతో ఉంటారన్న దానికి
అనుగుణంగా ఉన్నాయి తన రచనలు. సమాజహితంగా సాగిన మంచి రచనలు అందించి, ప్రతిష్టా త్మక సినారే గారి సంస్థ ఆదరణ
చూరగొన్న పెండ్యాల గాయత్రి గారికి హృదయపూర్వక అభినందనలు. 

- రాధికాప్రసాద్

నా మనోగతం..!
సమాజానికి నిలువుటద్దం వంటి సాహిత్యంతో సాంగత్యం చేయడమంటే.. సాహసోపేతమైన సార్ధకత సాధించడం.
సత్యమనే అగ్నితో సంగమించడం. నిత్యం కాలుతూ, కాలాన్ని కావలించుకుంటూ.. కాగితానికి కల్యాణం చేస్తుండడం అని
అనిపిస్తుంది నాకు.

పెండ్యాల గాయత్రి (4)


కథలు కనే కళ్ళు

నా కుటుంబం, స్నేహసైన్యం, రేడియో, సమాజం.. నా సాహితీ ప్రపంచానికి నాలుగు దిక్కులవలే నిలిచి, నన్ను సైతం
వ్రాతల రాజ్యంలో సభ్యురాలిని చేసాయి. భాషామతల్లికి చరణాభిషేకం చేసుకునే భాగ్యాన్ని కలిగించాయి. ఒకవ్యక్తిగా,
జీవనయానాన్ని సాగించే క్రమంలో నాకు లభించిన అభిమానాలు, అవమానాలు.., నేను మనోనేత్రంతో దర్శించిన సోపానాలు,
సంతాపాలు.., నా హృదయాన్ని కదిలించిన కల్లోలాలు, కర్తవ్యాలు కార్యోన్ముఖులై, ఈ కథల సుధామాలుగా
రూపుదిద్దు కున్నాయి. 
ఒంగోలుకు సమీపంలోని చెరువుకొమ్ముపాలెం గ్రామంలో దిగువ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను,
తెలుగు ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తు న్నాను. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కవితలు వ్రాయడం ద్వారా ఆరంభమైన నా
సాహితీ పయనం, కుటుంబ సభ్యుల, ఆత్మీయ మిత్రు ల సహకార ప్రోత్సాహాలతో నేడు నవలలు రచించేవరకు చేరుకుంది. 
కవిత, కథ, నాటిక, నవల, గజల్ వంటి అనేక ప్రక్రియలలో రచనలు చేసినప్పటికీ ఏ ప్రక్రియలోనూ పుస్తకం
వేయించలేకపోయానని విచారించేదానను. అయితే పూజ్య గురువులైన సినారే ట్రస్ట్ అముద్రిత రచనలను తమ పబ్లికేషన్స్ ద్వారా
ముద్రించి, ఉత్తమ రచనలను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో పత్రికా ప్రకటన ఇచ్చి, నా కథలను సైతం ఎంపిక చేయడం జరిగింది.
అలా.. అనేక రచనలతో పోటీపడి, సినారే పబ్లికేషన్స్ ద్వారా నా తొలి పుస్తక ప్రచురణావకాశం రావడం నా సాహితీ జీవితంలో ఓ
అపురూప ఘట్టంగా భావిస్తూ.. ఇంతటి అపూర్వ అవకాశాన్ని కలిగించిన ట్రస్ట్ బృందానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా
జిల్లా స్థా యి ఉగాది పురస్కారాలనుండి, రాష్ట్ర స్థా యివరకు వివిధ సందర్భాలలో అనేక పురస్కారాలు అందుకున్నాను. సినారే గారి
చేతుల మీదుగా అందుకున్న తేజా ఆర్ట్స్ వారి పురస్కారం నాకెంతో అపురూపమైనది. 
ఈ సంపుటి లోని ప్రతి కథా, పాఠకుల హృదయాలను పలుకరిస్తుంది. పరిస్థితుల వెంట పరిగెత్తిస్తుంది. పలు ప్రశ్నలను
రేకెత్తిస్తుంది అని ప్రగాఢంగా విశ్వసిస్తా ను. 
    -పెండ్యాల గాయత్రి.

కథాక్రమం
1. బడి నుంచి ఉరిదాకా. 
2. లోపలి అందాలు.
3. జీవితమిచ్చిన కథ. 
4. కౌగిలి. 
5. ఆమె స్వప్నం. 

పెండ్యాల గాయత్రి (5)


కథలు కనే కళ్ళు

6. పినాకిని. 
7. వందిమాగధులు. 
8. వికారి.కామ్ 
9. మట్టిపొరలు.
10. సిరికి వెన్నెల వస్తే. 
11. ఆత్మవిమర్శ.
12. తుఫాన్ నగర్. 
13. సుజలాం సుఫలాం.
14. అటునుండి నరుక్కురండి. 
15. కల చెదిరింది కథ మారింది. 
16. నిత్యనూతనం. 
17. కంటేనే అమ్మా?.
18. కలలు కనే కళ్ళు. 
19. జ్యోతి ప్రజ్వల. 
20. ఆమెకెందుకిచ్చినట్లు ?. 
21. నాలుకలోపలి నరం.
22. ఆశయం. 
23. మంత్రదండం.

బడినుండి.. ఉరిదాకా!! (ఒక ఖైదీ ఆత్మకథ)


“కానిస్టేబుల్‌...! బి కేర్‌ఫుల్‌.. వీడు పరారయ్యాడంటే.., మన ప్రాణాల మీదకొస్తుంది..”
“ఆ చాన్సే లేదు సార్‌! అంతా పకడ్బందీగా, పర్ఫెక్ట్‌గానే ఉంది చూడండీ!”
“ఆ వెనుక డోర్‌లాక్‌అయింది కదా!”
“ఎస్సార్‌!”
“వీణ్ణీ, జైలర్‌కి అప్పగించేదాకా రెస్పాన్సిబిలిటి మనదే.. చాలా కేర్‌ఫుల్‌గా తీసుకెళ్లా లి” అంటూ అరిగిపోయిన రికార్డు లా
చెప్పిన మాటే పదేపదే చెప్తూ న్నాడు ఇన్‌స్పెక్టర్‌.

పెండ్యాల గాయత్రి (6)


కథలు కనే కళ్ళు

‘లాఠీకర్రకు అంకితమై ఆకారాన్ని కోల్పోయిన ఎముకలతో, పిడిగుద్దు లకు పరిమితమై పోగులైన కండరాలతో,
బూటుకాళ్ళకు తివాచీలై తూట్లు పడ్డ కాళ్ళూచేతులతో, తీర్పు తూటా తగిలి తెగి ముక్కలైన నరాలతో,, మీకందకుండా ఎక్కడికి
పారిపోతాలే సార్‌!’ అని మనసులో అనుకుంటూ అయన వైపు చూశా.
“ఏంట్రా ఆ చూపూ?” అంటూ మాటతో పాటు లాఠీ మోకాలిని మోదింది.
ఇంకా ఎముకలూ, కండరాల్లో జీవముందేమో, గట్టిగా మూల్గాయి. అరిస్తే లాఠీకి మళ్లీ చేతులు మొలుస్తా యని కళ్లు
మూసుకొని కిందిపెదవిని పళ్ల మధ్య నొక్కిపెట్టా , నొప్పి తగ్గేదాకా.
“ఊం! కమాన్‌స్టా ర్ట్‌!” అంటూ నాయకులు పచ్చజెండా ఊపి కొత్తరైలును ప్రారంభించినట్లు ,‌ ఇన్స్పెక్టర్‌లాఠీకర్ర
ఊపుతూ జీపును స్టా ర్ట్‌చేయించాడు యమపురికి,, అదే, కృష్ణ జన్మస్థా నానికి.
‘ఇంకా మూడురోజులు గడువెందుకు? ఇవ్వాళే, ఇప్పుడే.. ఆ పని కానిచ్చేయ్యొచ్చుగా.. ఉద్యోగమిస్తు న్నారా నాకేమైనా,
ఫలానా టై ముకని చెప్పి ఊరించడానికి. ఉరిశిక్ష కదా! ఊపిరి తీయడానికి కూడా ముహూర్తం చూడాలా?’ ఆలోచనల్లో ఉన్నాను.
“ఒరేయ్‌... నీ చివరి కోరికేంటి అని అడిగితే.., ఏం చెప్తా వురా!” పాన్‌నమిలి తుపుక్కున ఊస్తూ అడిగాడు కానిస్టేబుల్‌.
‘ఉరిశిక్ష నుండి తప్పించుకోవడం...’ అని చెప్పాలనుకొని ఈసారి లాఠీ, బూటు కలిసి కాలుదువ్వుతాయేమో,, అనిపించి
ఏమీ లేదన్నట్లు తలాడించా. దాదాపు 80 మీద వెళుతున్న జీపెందుకో ఒకచోట ఆగింది.
‘నా యమపురి వచ్చేసినట్లుంది’ అనుకొని బయటకు చూశాను. కాస్త సైడుకి తిరిగి ఉన్న పెద్ద ప్లెక్సీలో తాటికాయంత
అక్షరాల మధ్య ఒక పెద్ద ఫోటో, దాని క్రిందభాగంలో చిన్నగా ఉన్న మరికొన్ని ఫోటోలు కనపడ్డా యి. రాజకీయ నాయకుల రంగు
చిత్రాలులే అనుకొని క్షణంలో చూపు తిప్పుకున్నా.
“ఆవిడకీ నేషనల్‌అవార్డ్‌వచ్చినందుకు శిష్యులంతా కలిసి ఇవాళ ఘన సన్మానం చేస్తు న్నారటోయ్‌!” కానిస్టేబుళ్లిద్దరూ
చెప్పుకుంటున్నారు.
అప్రయత్నంగా నా చూపు ప్లెక్సీ వైపు మళ్లింది. జీపు కాస్త ముందుకు కదలటంతో ఆ ఫోటోను మరోసారి స్పష్టంగా
చూడగానే నా కళ్ళు విప్పారాయి. నా కళ్ళను మరింత పెద్దవి చేసుకొని చూసి, నిర్ధా రించుకున్నా. పదేళ్ళు గడిచినా పెద్దగా
మార్పులేని ఆ రూపం మనసు పొరలను పలుగులా పొడిచేస్తుంది. చూపు అక్షరాల మీదకు మళ్లించాను, ‘సన్మానమెక్కడా!’
అన్న ఆతృతను ఆపుకోలేక.
భుజంపై ఓ పిడిగుద్దు పడింది. గట్టిగా కళ్ళు మూసుకొని పళ్ళు బిగించాను.
“ఏరా..! పరిసరాలు పరిశీలిస్తు న్నావా పథకం వెయ్యటానికి. మూడేళ్ల బట్టి చావగొడుతున్నా, బుద్ధి రాలేదూ, ఇక
మూడురోజులే మిగిలుందిలే పాపం..” అరుస్తు న్నాడు కానిస్టేబుల్.
కొంతదూరం ప్రయాణం తర్వాత నన్నంతం చేసే గేట్లు తెరుచుకోవడంతో జీపు రయ్‌మంటూ.., లోపలికి దూసుకెళ్లింది.
కసాయివాడికి పశువునప్పగించినట్లు , జైలర్‌కి నన్నప్పగించి పోలీసులు వెళ్లిపోయారు. జైలర్‌గారు తీర్పు కాగితాలు తిరగేస్తుంటే,
చిరిగిన నా బతుకు పేజీలను ఒకసారి చదవాలని మనసు మూల్గుతూంది.
“ఎందుకురా.. బంగారమంటి బతుకులను ఇలా బుగ్గిపాలు చేసుకుంటారూ!?” జైలర్‌గొంతులో విసుగు, ఒక్కింత
జాలి.
“సార్‌! మరీ.. ఉరితీయబోయే ముందు చివరి కోరిక ఏదైనా ఉంటే.., తీరుస్తా రంట కదా!” గొంతు పెగల్చుకొని
లోగొంతుకతో అడిగాను.

పెండ్యాల గాయత్రి (7)


కథలు కనే కళ్ళు

“ఏంట్రా..! మీ వాళ్లను పిలిపించమంటావా?” అడిగారు మరింత సానుభూతి చూపిస్తూ.


ఆయనిచ్చిన ప్రోత్సాహంతో ధైర్యాన్ని కూడగట్టు కొని నా వింత కోరిక చెప్పాను.
ఆయన విస్తు పోతూ, “అది జరిగే పనేనట్రా...!?” అన్నారు.
“నేరమో, ఘోరమో కాదు కదా సార్‌! మీరు తలచుకుంటే తీరుతుంది” అన్నాను ఆశగా.
అయిదు నిమిషాల చర్చ తర్వాత జైలర్‌గారు అంగీకరించడమే కాకుండా, మరుసటి రోజుకు నన్ను బంధించిన గదిలోకి
నేనడిగినవన్నీ పంపించారు.
నా బతుకు పుటలను పదేళ్ళు వెనక్కి తిప్పాను.‌
***
నేను 9 వ తరగతి చదివే రోజులవి. 10 - 12 పల్లెలకు వ్యాపార కేంద్రమైన చిన్నపాటి పట్టణం మా ఊరు. ప్రభుత్వ
పాఠశాలతో పాటు ఉన్నత పాఠశాల, కళాశాల కొలువు తీరిన ఊరు. మా సొంతూరు అదే అయినా.., పక్క ఊరనే పత్రాన్ని
పుట్టించి పత్రికా విలేఖరైన మా బాబాయ్‌పలుకుబడిని ఉపయోగించుకొని, బేల్దా రి మేస్త్రీ అయిన నాన్న,, నన్ను సాంఘిక సంక్షేమ
హాస్టల్లో చేర్పించాడు.
స్కూలు, హాస్టలు, ఇల్లూ, ఊరు.. ఈ నాలుగు దిక్కుల ప్రపంచానికి నేనే నాయకుణ్ణని ఫీలైపోయి, ఐదారుగురు పిల్లల్ని
వెంటేసుకొని వీర చక్రవర్తిలా వీధులన్ని విహరిస్తుండేవాణ్ణి. ఎక్కడైనా నామాట చెల్లలేదంటే,, వీరంగం సృష్టిస్తా నని మా ఫ్రెండ్స్‌కి,
క్లా స్‌మేట్స్‌కే కాదు,, స్కూలంతా తెలుసు. అందుకే టెంత్‌క్లా సోళ్ళు కూడా నన్ను ‘అన్నా!’ అని పిలిచేవాళ్ళు. ఏడేళ్లొచ్చాక బళ్లో
చేరడంతో మా క్లా సోళ్ల కన్నా రెండేళ్ళూ, టెంత్‌వాళ్ల కన్నా ఒకేడు పెద్దోణ్ణి నేను.
‘మనందరిలోకెల్లా మన చందన్నే అందగాడ్రా!’ అని మా ఫ్రెండ్సంతా పొగుడుతుంటే, మురిసిపోయి వాళ్లకి
మూంగుదాలు, మసాలా మిక్స్చర్‌పాకెట్లు కొనిస్తుండేవాణ్ణి.
రెండురోజులు వరుసగా బడికెళ్లినా, రెండు పీరియడ్స్‌కదలకుండా క్లా సులో కూర్చున్నా, ‘ఏంటి ఇవాళ విశేషం..,
చందూదొరగారు క్లా సుకొచ్చారూ!’ అని ఇద్దరు ముగ్గురు టీచర్లు అంటుంటే, కళ్ళూ, కాలరూ ఎగరేసే వాణ్ణి, ఫ్రెండ్సంతా
చూసేటట్లు .
పరీక్షలప్పుడు తోటిపిల్లల్ని అదిరించి, బెదిరించి, ఆశ చూపించి కాపీ కొట్టేవాణ్ణి. చేతిరాత చక్కగా ఉండడం చేత
నాకెప్పుడూ 80% పైనే మార్కులొచ్చేవి. ఆ మార్కులతో ఇంట్లో బ్లా క్మెయిల్‌చేసి అవసరానికి మించి డబ్బులూ,, బళ్లో బ్లా క్మెయిల్‌
చేసి వెళ్లకపోయినా హాజరు,, హాస్టల్లో బ్లా క్మెయిల్‌చేసి అదనపు తిండీ రాబట్టు కునే వాణ్ణి.
అందరూ నా గురించి ఏమనుకొనేవాళ్ళో ఏమో నాకు తెలియదు గానీ, ఎవ్వరూ ‘అదొద్దు ఇదిచెయ్యి’ అని
ఆజ్ఞాపించేవాళ్ళు కాదు. మా వార్డెన్‌కానీ, కొందరు టీచర్లు గానీ, వాళ్ల సొంతపనులు చెప్పినప్పుడు కొంత డబ్బు నొక్కేసి పని పూర్తి
చేసేవాణ్ణి. మా బాచ్‌ని వెంటేసుకొని వెళ్లి సిగరెట్లు కాలుస్తూ, పాన్‌పరాగ్‌ వగైరా నములుతూ, గవర్నమెంటోళ్ళు అమ్మాయిలకిచ్చిన
సైకిళ్ళను దొబ్బేసి వాటిపై సినిమాలకీ, షికార్లకీ వెళుతుండేవాళ్లం.
ఇలాంటి ఫుల్‌ఎంజాయ్‌మూమెంట్లో ఒకరోజు కొండకాడ కూర్చొని బీరు తాగుతుండగా, “చందన్నా! అన్నీ.. ఎంజాయ్‌
జేస్తు న్నం గానీ.. ఆ ఒక్కటీ మిస్సవుతున్నామన్నా!” మిగిలిన చివరిగుక్క నోట్లో పోసుకుంటూ అన్నాడు కొండలు.
“మిస్సవ్వడమన్నది మన హిస్ట్రీలోనే లేదు.. అదేందో చెప్పు!”
“అది తెలియకపోతే ఎట్టన్నా.. లవ్వు..!”

పెండ్యాల గాయత్రి (8)


కథలు కనే కళ్ళు

“వొయ్‌.. వొయ్‌.. వొయ్‌వొయ్‌..” అంటూ నవ్వుతూ చప్పట్లు కొట్టా . ఇద్దరు నాతో చేతులు కలిపితే,. ఇంకో ఇద్దరు లేచి
పాటలు పాడుతూ డాన్సులేశారు.
కొద్దిసేపటి తర్వాత నేను చప్పట్లా పి సీరియస్‌గా ఫేస్‌మార్చేసరికి అందరూ సైలెంటయి పోయి ఎక్కడి వాళ్లక్కడే నిలబడి
నన్నే చూస్తు న్నారు.
“అరే..! ఈ హీరోకి తగిన హీరోహిన్‌ఎవరంటారూ.!” గడ్డం కింద చెయ్యుంచుకొని చిన్నగా అడిగాను.
“నీకు మేమున్నాంగా.. సెలక్ట్‌చేస్తా మన్నా!” అంటూనే, అందరూ కలిసి నన్నెత్తు కొని గిరగిరా తిప్పుతూ, “చందన్నే మా
హీరో..” అంటూ గోల చేశారు.
“అన్నా..! మనమొక నాలుగు రోజులు వరుసగా స్కూల్‌కెళితే గానీ.. అమ్మాయిలకు లైనెయ్యడానికి కుదరదన్నా!”
“రవిగాడి సలహా బాగుందిరా! పదండి స్కూల్‌కి పోదాం..” అన్నాను.
ఆరుగురం కలిసి స్కూల్లోకి వెళ్లేసరికి ఇంటర్‌బెల్‌కొట్టా రు. కొందరు పిల్లలు మాకెదురొచ్చారు.
వారిలో ఒకడు, “చెందన్నా..! మన స్కూల్‌కి కొత్త టీచరొచ్చారు..” అని చెప్పాడు.
“చూద్దాం పదండ్రా...!” నా బ్యాచ్‌తో స్టా ఫ్‌రూంలో కెళ్లా ను.
మిగతా టీచర్లతో మాట్లా డుతున్న ఆవిడ వెనక్కల్లా తిరిగి మావైపు చూస్తూ నవ్వారు.
“శారదా టీచర్‌! మీరా.. బాగున్నారా...!” అశ్చర్యం, ఆనందం కలగలిపిన గొంతుతో అడిగాను.
టీచర్ లేచి నా దగ్గరకొచ్చి, “చందూ! నువ్వట్రా.. ఈ స్కూల్లోనే చదువుతున్నావా? చాలా పెద్దవాడివైపోయావు నాన్నా!”
నా తలపై చెయ్యివేసి నిమురుతూ అన్నారు.
“వీడు ఎలిమెంటరీ స్కూల్‌లో చదివేటప్పుడు నా స్టూడెంటండీ! ఎంతో వినయంగా ఉంటాడు. చక్కగా రాస్తా డు,
చదువుతాడు. ఇంకా చక్కగా బొమ్మలు గీస్తా డు, ప్రతిరోజూ బడికొస్తా డు” అంటూ చిన్నప్పటి నాగురించి టీచర్‌చెప్తుంటే, మిగతా
టీచర్లంతా వింతగా, మా ఫెండ్సంతా విచిత్రంగా నావైపు, ఆమెవైపు మార్చిమార్చి చూస్తు న్నారు.
“టీచర్‌నేనిప్పుడు అప్పట్లా అన్నిటికి భయపడే పిరికోణ్ణిగాదు..” అని కటువుగా అనేసి ఆమె ఏదో చెబుతున్నా
వినిపించుకోకుండా అక్కడినుండి విసవిసా వచ్చేశా.
అప్పటినుండి శారదా టీచర్‌నన్ను వెంటాడడం మొదలు పెట్టా రు. నేను బడికి రాకపోయినా, క్లా సులో ఉండకపోయినా,
పాఠాలు వినకపోయినా, ఆమె అడిగింది చెప్పకపోయినా ఊరుకొనేవారు కాదు. నాకేవేవో నీతులు చెప్పేవారు. అవి
వినిపించుకోకపోతే చురకలు అంటిస్తుండేవారు.
“నా లవ్వుకి లాకేసేటట్టుందిరా ఈ రాకాసి, పిశాచి..” అంటూ ప్రెండ్స్‌దగ్గర నోటికొచ్చిన బూతులల్లా తిట్టేవాణ్ణి.
ఓరోజు బడికెళ్లకుండా అటెండెన్స్‌రిజిస్టర్లో ఉన్న ఆబ్సెంట్‌ని తీసేసి ప్రజెంట్‌వేసుకున్నాను.
శారదా టీచర్‌హాజరు తీసుకోడానికి పిల్లల పేర్లు పిలుస్తూ నా నిర్వాకం చూసి, “ఏంటీపని! నువ్వు బడికి రాకపోవడం ఒక
తప్పు. అటెండెన్స్‌రిజిస్టర్‌ని తాకడం రెండవ తప్పు.. ఆబ్సెంట్‌ని దిద్దు కోవడం మూడవ తప్పు. ఇట్రా..! ఇటొచ్చి గోడకుర్చీ
వెయ్యి..’ అంటూ గర్జించారు.
“నేనెప్పుడైనా ఇంతే.. ఇప్పుడు కొత్తేంగాదు” అని పెడసరంగా సమాధానం చెప్పి బయటకెళ్లబోయాను.
టీచర్‌వెనకనుండి నా చొక్కా పట్టు కొని మా ఫ్రెండ్స్‌వై పు చూస్తూ, “వీడివెంట మీరెవరైనా తిరిగారంటే కాళ్లు విరగ్గొడతా..
వెయ్యి..! గోడకుర్చీ...” అమె అరుపుతో గది మారుమ్రోగింది.

పెండ్యాల గాయత్రి (9)


కథలు కనే కళ్ళు

టీచర్ కోపం చూసి చేసేదిలేక ఆ పని చేశాను. తలెత్తి చూడకుండా, ‘ఆడపిల్లల ముందు, ఈ ఎదవల ముందు నా
పరువు తీసేసింది. దీన్ని చంపేయాలి..’ ఆలోచిస్తుండగానే ఏదో గొంతు వినిపించింది.
మరో టీచర్‌క్లా స్‌లోకి వచ్చి, “మేడమ్‌! చందూని ఒక్కసారి పంపిస్తా రా! పనుంది..” అన్నారు.
తలెత్తి చూడగానే, “వేరే ఎవరినైనా తీసుకెళ్లండి మేడం.. వీడితో తలనొప్పైపోయింది..!” చెప్తూ న్నారు శారదా మేడమ్‌.
“నేనొకమాట చెప్తా ను ఏమనుకోకండి! వీడికి చదువు, సంస్కారమంటే పనికి రాదు.. బయట పనులేమైనా చెప్పడి!
అత్యంత సమర్ధవంతంగా చేసుకొస్తా డు. మనం ఎలాంటివాళ్లను అలా ఉపయోగించుకోవాలి గానీ, తిట్టి, కొట్టి, పనిష్మెంట్లిచ్చి మనం
చెడ్డవాళ్లం కావడం తప్ప, ప్రయోజనం లేదు” అని చెప్తుండగానే,.
ఆమెను అడ్డు కుంటూ, “వాడు చెడడమే కాదు మేడమ్‌! అందరినీ చెడగొడుతున్నాడు..” అంటూ క్లా సంతా
కలయజూశారు శారదా మేడమ్‌.
“వాళ్ల కర్మ మేడమ్‌! మనమేం చేయగలం. క్లా సులో కూర్చుంటే, నాలుగక్షరాలు చెప్పగలం. లైట్‌తీసుకోండి., రారా
చందూ!” అంటూ నన్ను బయటకు టీసుకెళ్లా రు ఆ మేడమ్‌.
కాలరెగరేస్తూ క్లా సులోనుంచి వెళ్లిపోయాను.
తరువాత రోజు రవిగాడికి చెప్పి మా నాన్నని పిలిపించారు శారదా టీచర్‌.
క్లా స్‌జరుగుతుండగా నాన్నొచ్చి, “మేడమ్‌గారూ.. శారదా టీచర్‌అంటే మీరేనా?! నేను చందూ వాళ్ల నాన్ననండి!
నన్నెందుకో రమ్మన్నారటా!” క్లా స్‌రూమ్‌వాకిలి కాడ నిలబడి అడిగాడు.
“మీ అబ్బాయి గురించి మాట్లా డదామని పిలిపించానండి..!”
“మా అబ్బాయి గురించి మాట్లా డేదేముందండీ! మంచిగా చదువుకుంటున్నాడు, అందరికన్నా ఎక్కువ మార్కులు
తెచ్చుకుంటున్నాడు..” కొంచెం గర్వంగా ఆన్నాడు నాన్న.
“ఆ మార్కులు ఎలా తెచ్చుకుంటున్నాడో మీకు తెలుసా!” సూటిగా అడిగారు టీచర్.
“అట్లాంటియన్నీ మాకెట్లా తెలుస్తా యమ్మా! ఈడ మీరుండేదెందుకు? అయినా మా పిల్లోడిని ఏ టీచరూ ఇట్టా గ తప్పు
పట్టలా.. వజ్రమంటి పిల్లోణ్ణి బట్టు కొని నిందలేస్తన్నావు తల్లీ.. నీకేమమ్మా! యేలేలు జీతాలు తీసుకుంటున్నావు. కూలిపని
చేసుకొనేటోళ్లం, పని మానుకొని రావాల్నంటే ఊరకలేదు” అంటూ భుజం మీద కండువా తీసి ఒక్కసారి విదిలించి మళ్ళీ
పైనేసుకొని, టీచర్‌ఇంకేదో చెప్పబోతుంటే పట్టించుకోకుండా నాన్న వెళ్ళిపోయాడు.
బల్లమీద దరువేస్తూ.. నా ఆనందాన్ని వ్యక్తంచేశా.
“మీరు మిడిసిపడే శలభాలురా! కాలి బూడిదైనా అవుతారు గానీ, నిప్పునొదిలిపెట్టరు” అన్నారు టీచరు.
ఆమె మాటలకన్నా పెద్దశబ్ధం చేస్తూ బల్లపై కొట్టడంతో, “రేపటి నుంచి నువ్వు నా క్లా సులో ఉండొద్దు ..” అని నాతో చెప్పి,
బెల్‌కొట్టడంతో శారదా టీచర్‌వెళ్లిపోయారు.
నాక్కావలసిందదే కదా అని అనుకుంటూ గంతులేశాను. తర్వాత డెస్కు మీదెక్కి కూర్చొని ప్రగల్భాలు పల్కుతుంటే
మా ప్రెండ్సంతా వత్తా సుగా వంత పాడుతుండగానే, తరువాత సబ్జెక్ట్‌టీచర్‌క్లా సులో కొచ్చారు.
పిల్లలంతా నిల్చున్నాక, నేను నిలబడకపోయినా అయన చూసీచూడనట్లు వదిలేసి, “కూర్చోండిరా పిల్లలూ!” అన్నారు.
“మీరు చాలా మంచోళ్లు సార్‌! నేనేం చేసినా తిట్టరు, కొట్టరసలూ..” నా మాటలు పూర్తికాగానే,

పెండ్యాల గాయత్రి (10)


కథలు కనే కళ్ళు

“మిమ్మల్ని కొట్టి తిట్టి మా ఉద్యోగాలు ఊడగొట్టు కోలేం కదా నాయనా!” అంటూ టెక్స్ట్‌బుక్‌తెరుస్తుండగా, నా
బుర్రలో ఓ విషయం మెరిసింది.
సార్‌దగ్గరకెళ్ళి, “మమ్మల్ని కొడితే మీకిబ్బందా సార్‌!” సీక్రెట్‌గా అడిగాను.
“ఇటీవల కోర్టు తీర్పిచ్చిందిగా బాబూ! పిల్లల్ని కొట్టగూడదట.. తిట్టగూడదట.. బాధ కలిగించేటట్లు మాట్లా డకూడదట..
కనీసం ఉరిమి చూడకూడదట.. అలా చేస్తే పిల్లల మనోభావాలు నొచ్చుకుంటాయట. మీకే ఇబ్బంది కలిగినా మాపై కేసేసి మా
ఉద్యోగం ఊడబీకి మమ్మల్ని బొక్కలో తోస్తా రు నాయనా! మీకేమీ.. మిమ్మల్ని అన్నీ ప్రభుత్వమే భరించి బతికిస్తోంది. ఇదిగో
ఇలాంటి పరిస్థితుల్లో మా పిల్లల్ని ఇక్కడ చేర్చలేక లక్షల రూపాయల ఫీజులుగట్టి,, క్రమశిక్షణలో పెట్టి, చదివించుకుంటున్నాం. మీ
పుణ్యమా అనీ మా ఉద్యోగాలూడిపోతే మా పెళ్లాంపిల్లలు అడుక్కుతినాలి..” అని సార్‌మొత్తు కుంటున్నట్టు చెప్తుంటే,
ముసిముసిగా నవ్వుకుంటూ వచ్చి కూర్చున్నాను.
తర్వాత రోజు ఉదయం తొమ్మిది గంటలకల్లా స్కూల్‌కి వచ్చి క్లా స్‌రూమ్‌డోర్‌వెనక నిలబడి, సరిగ్గా శారదా టీచర్‌వచ్చే
సమయానికి, “రేయ్‌రవీ! ఇవాళ ఎట్లా గైనా శిరీషకు లవ్‌లెటర్‌ఇచ్చి తీరాల్రా!” అన్నాను.
నా మాటలను విన్న టీచర్‌, క్షణం ఆలోచించకుండా లోపలికొచ్చి నా చెంప చెళ్ళుమనిపించి, “నీకు తోడు ఈ కళలు
కూడానా!” అంటూ ఆగ్రహంగా చూసారు.
చెంప తడుముకుంటూ, “నా ఇష్టం..!!” అన్నా పొగరుగా.
“రేయ్‌! పిల్లలూ! మంచి బెత్తమొకటి తెచ్చి పెట్టండి, నేను మళ్ళీ క్లా స్‌కొచ్చేసరికి ఉండాల.. ఇవ్వాళ వీడి సంగతేంటో
తెలుస్తా ..” అంటూ వెళ్లిపోయారు.
నా ప్లా న్‌సక్సెస్‌అయినందుకు రవిగాడికి షేక్‌హ్యాండిచ్చి, నేనే వెళ్లి నున్నటి ఎండుకర్రొకటి వెతికి తెచ్చి, ఒకవైపు కొద్దిగా
చీల్చి పేళ్లు పైకిలేపి టేబుల్‌మీదపెట్టి, బోర్డు పై శిరీష బొమ్మవేసి, ‘ఐ లవ్‌యూ శిరీషా ఇట్లు నీ చందు..’ అని రాసి, ఈలపాట
పాడుతూ, బల్లపై దరువేస్తూ కూర్చున్నా.
అది చూసిన శిరీష ఏడుస్తుంటే మిగతా అమ్మాయిలు తనను ఓదారుస్తు న్నారు. శారదా టీచర్‌క్లా సులోకి వచ్చి ఆ
సీనంతా చూసి చండిలా మారి, బెత్తం తీసారు. అదే అదను కోసం చూస్తు న్న నేను, అమె కొడుతుంటే అటూ ఇటూ మెలికలు
తిరిగాను బాగా దెబ్బలు తగలాలని. రెండు దెబ్బలు చేతులమీద, ఒక దెబ్బ వీపుమీద, మరో దెబ్బ పొట్టమీద, ఇంకో దెబ్బ కంటి
క్రింద తీవ్రంగా తగిలాయి. పేళ్లు చీల్చి ఉండడంతో నా చర్మానికి గుచ్చుకుపోయి రక్తపు చెమ్మ కనిపిస్తోంది. పెద్దగా శోకండాలు
పెడుతూ ఏడుస్తు న్నాను. పిల్లలంతా గడబిడగా గోలందుకున్నారు. వేసుకున్న పథకం ప్రకారం ఒకడు బోర్డు తుడిపేశాడు,
ఇంకొకడు మా నాన్నకు చెప్పడానికెళ్లా డు, ఇద్దరేమో అన్నీ క్లా సులకీ, టీచర్లకీ విషయం చేరవేశారు.
కంటిక్రింద తగిలిన దెబ్బను నా గోటితో గట్టిగా గీకి మరింత పెద్ద గాయంగా చేశాను. ముఖానికి చేతులడ్డం పెట్టు కొని
ఏడుస్తు న్నాను. అరిచేతులకు రక్తమంటి అవి ఎర్రగా కనిపిస్తు న్నాయి.
అప్పటికి అక్కడికి వచ్చిన మిగతా టీచర్లూ, పిల్లలూ నా పరిస్దితి గమనించారు. పిల్లలు కొందరు నన్ను చూసి ఓదారుస్తూ
చుట్టూ చేరారు. అందరూ ఎవరికి తోచింది వాళ్లు మాట్లా డుకుంటున్నారు.
ఇంతలో మానాన్న, బాబాయితో సహా వచ్చి నన్ను చూసి టీచర్‌ని నానా తిట్లూ తిట్టా డు. మా బాబాయి నా
దెబ్బలన్నింటినీ ఫోటో తీసి ఎవరెవరికో ఫోన్లు చేశాడు. హెడ్మాస్టరు, కొందరు టీచర్లు బ్రతిమాలుతున్నా మావాళ్లు
వినిపించుకోవడం లేదు. కాసేపటికి కొందరు విలేఖర్లు కెమెరాలతోనూ, పోలీసులు లాఠీలతోనూ దిగిపోయారు.

పెండ్యాల గాయత్రి (11)


కథలు కనే కళ్ళు

ఎవరేమి అడిగినా శారదా టీచర్‌మాత్రం నోరు విప్పట్లేదు. మిగతా టీచర్లు , హెడ్మాస్టరు ఎటు మాట్లా డితే ఏ
తిప్పలొస్తా యోనని తటపటాయిస్తు న్నారు.
కొద్దిసేపటికల్లా ఊరువాడా, జిల్లా , రాష్ట్రమంతట ఈ వార్త వ్యాపించి పోయింది. టీవీ చానళ్లవాళ్లు వెక్కివెక్కి ఏడుస్తు న్న
నన్ను హీరోగా,, నోరువిప్పని శారదా టీచర్ని రాకాసిగా సృష్టించి ఆ తర్వాత రకరకాల శీర్షికలు పెట్టి అదే వార్తను పదేపదే
మార్చిమార్చి చూపించారు.
‘ఎన్ని చట్టా లు చేసినా పసిపిల్లలపై దాడులు అగట్లేదు’ అని మధ్యమధ్యలో నిపుణుల చేత వ్యాఖ్యానాలిప్పిస్తు న్నారు.
కాసేపటికల్లా డిఈవోగారొచ్చారు. ఆయన నన్ను పలుకరిస్తుంటే, నేనేడ్చి ఏడ్చి సొమ్మసిల్లినట్టు నాటకమాడుతూ
పడిపోయాను. అందరి మాటలూ నాకు వినబడుతున్నాయి.
“ఏంటమ్మా ఇదంతా!? మంచి టీచరువని పేరుంది నీకు.. ఇటీవలే ప్రమోషన్‌కూడా తీసుకున్నావు. నువ్వు నోరువిప్పి
పొరపాటున తగిలిందని ఒక్కమాట చెప్తే కేసు లేకుండా చూద్దాం..” అన్నారు డియీవో గారు.
శారదా టీచర్‌ఓ నిట్టూర్పు విడిచి, “వజ్రానికి సాన పెట్టా లీ అనుకున్నా,. అలవికాక చేతులు కాల్చుకున్నా..” అన్నారు.
ఇక ఆయన చేసేదేమిలేక, “నిన్ను సస్పెండ్‌చేస్తు న్నామమ్మా..” అంటూ ఏవో కాగితాలు టీచర్‌కిచ్చారు.
మౌనంగానే సంతకాలు చేసి ఇచ్చింది శారదా టీచర్‌.
అప్పటివరకు సొమ్మసిల్లిన వాణ్ణల్లా సంతోషంతో పైకిలేచాను. నా టాలెంటుకు నాలో నేనే అబ్బురపడిపోతూ, ‘ఫ్యూచర్లో
హీరోవయ్యే చాన్సుందిరా చందూగా నీకు!’ అనుకుంటూ నా భుజాన్ని నేనే తట్టు కొని మురిసిపోయాను.
ఆ తర్వాత నన్ను బడికి రమ్మని గానీ, పాఠాలు వినమని గానీ, అడిగిన వాళ్ళు లేకపోగా పరీక్షలప్పుడు పుస్తకాలు పెట్టి
రాసినా సినిమా చూసినట్లు చూస్తూ ఉండిపోయేవాళ్లందరూ.
శిరీషకు ప్రపోజ్‌చేశాను. టెంత్‌క్లా స్లో స్కూల్‌ఫస్ట్‌వస్తే ఓకే చెప్తా నంది.
ఏమాత్రం కష్టపడకుండా, కాపీలు పెట్టి స్కూల్‌పస్ట్‌వచ్చా. మా బాబాయి మళ్లీ పేపర్లలో ఊదరగొట్టేశాడు నాగురించి.
నాది నిజమైన టాలెంటనుకొని ప్రైవేటు కాలేజీల వాళ్లంతా ఎగబడ్డా రు నన్ను ప్రీగా చదివిస్తా మని. శిరీష నా లవ్‌కి గ్రీన్‌సిగ్నలిచ్చింది.
నీకన్నా అదృష్టవంతుడెవడన్నా అంటూ నా ప్రెండ్స్‌నన్ను ఆకాశానికెత్తేశారు.
నా శిరి గవర్నమెంట్‌కాలేజీలోనే చేరుతున్నానని చెప్పడంతో మా బాచ్‌అంతా అక్కడే చేరాము. స్కూలు, కాలేజి ఒకే
క్యాంపస్‌కావడంతో నా హవా అక్కడ కూడా నిరాటంకంగా సాగింది. ఇంట్లో బ్లా క్మెయిల్‌చేసి తెచ్చిన డబ్బులతో శిరీష అడిగినవి,
అడగనివి అన్ని కొనిచ్చేవాణ్ణి. ఆ రెండేళ్ళు కూడా నాది రాజభోగమే.
పరీక్షల్లో కాపీలు పెట్టినా పట్టు బడకుండా రాసి కాలేజీ ఫస్ట్‌వచ్చి పేపర్‌క్లిప్పింగ్‌లు నాకే సొంతమని నా అదృష్టా న్ని
చెప్పుకొని పొంగిపోయాను.
ఇంటర్ అయిపోయాక ఇంజినీరింగ్‌లో చేరమన్నారు ఇంట్లో వాళ్ళు. నా శిరి, వాళ్ల మేనత్తగారి ఊరిలో డిగ్రీ
చేరుతుందట! ఇక తిరుగేముంది. నా మకాంని కూడా అక్కడికి మార్చేశా. వెళ్లేటప్పుడు తెలియలేదు అక్కడ నా అదృష్టం వెనక్కి
నడుస్తుందని. వెనకటి నా తడాఖా చూపించబోతే, అక్కడెవడూ పట్టించుకోలేదు.
శిరి మేనత్త కొడుకు, నాలా ప్రేమికుడి హోదాలో బిల్డప్ ఇవ్వడం భరించలేకపోయాను. పైగా నా శిరి వాడి బైక్‌మీద
రావడమేంటని తనను నిలదీస్తే బైకు కొనమంది.

పెండ్యాల గాయత్రి (12)


కథలు కనే కళ్ళు

నాన్నను నానా తిప్పలు పెట్టి బైక్‌కొనిపించి దానిపై శిరి ముందుకెళ్లగానే, తన బావ కారు తీసుకుంటున్నాడంది. ఒళ్ళు
మండిపోయింది. తమాయించుకొని షాపింగ్‌మాల్‌కి వెళ్లి శిరికి ఇష్టమైన కలర్‌డ్రస్‌సెలక్ట్‌చేసి రెండువేలు బిల్‌కట్టి తనకందించాను.
‘ఇదే కలర్‌లో ఐదువేలు పెట్టి కొన్నాడు బావ’ అంటూ వెనక్కిచ్చేసింది.
విసుగొచ్చి విసిరికొట్టి అంతే విసురుగా రూమ్‌కెళ్లా ను. రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చి తెల్లవారుజామున ఒక
కునుకు తీసి, 9 గంటలకల్లా రెడీ అయ్యి, యాసిడ్‌బాటిల్‌కొనుక్కొని కాలేజీకి వెళ్లా ను. వాళ్లిద్దరూ వచ్చారని నిర్ధా రించుకొని
కాలేజి వదిలే టయానికల్లా శిరి మేనత్త వాళ్లింటి దగ్గర కాపు కాసాను. ఇద్దరూ బైక్‌పై వచ్చారు. శిరి దిగి లోపలికెళుతుండగా వాళ్ల
బావమీద యాసిడ్ పొయ్యబోయాను. అతడు మెరుపు దాడి చెయ్యడంతో నా చేతిలోని యాసిడ్‌బాటిల్‌ఎగిరి నా వెనకున్న
శిరీష పైన పడింది.
క్షణాల్లో ఆమె ఒళ్ళంతా కాలిపోయింది. నావల్లే, నా శిరికి అలా కావడంతో నా గుండెల్లోని ప్రేమ కళ్ళల్లోకి ఉబికింది. అలా
కావడానికి కారణమైన వాళ్ల బావపై పట్టరాని కోపం వచ్చింది. అంతలో శిరి కేకలు విని జనం పోగవుతున్నారు. పట్టు బడితే
ప్రమాదమని తలచి పరుగులంకించుకున్నా. అలా ఎంతదూరం పరిగెత్తా నో తెలియదు. వాణ్ణి చంపి నా శిరీషను
దక్కించుకుందామని అనుకుంటే ఇలా జరిగింది.
రెండేళ్ల అజ్ఞాతవాసంలో కుక్కబతుకు బతికాను. ఇక అలా బతకలేనని ఊరికి వెళ్లా ను. నాన్న నన్ను ఇంట్లోకి
రానివ్వలేదు. ఆ అలికిడికి జనం పోగై నన్ను పోలీసులకు పట్టించారు. శిరి రెండురోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు
కోల్పోయిందని అప్పుడు తెలిసింది నాకు.
నాన్న ప్రేమ, బాబాయి పరపతి శారదా టీచర్ని శిక్షించడానికి ఉపయోగపడినంతగా నన్ను రక్షించడానికి
ఉపయోగపడలేదు. అంతే కాకుండా మా నాన్న అతిప్రేమ మరో నాన్నకు కడుపుకోత మిగిల్చింది.
విచక్షణెరుగని స్నేహాలే నా నాశనానికి నాంది పలికాయి. నాడు టీచర్‌మాటలు వినిపించుకొని ఉంటే, నేడిలా జైలు
ఊచలు లెక్కించేవాణ్ణా..! నాడు టీచర్‌కొట్టే చిన్న దెబ్బలకు ఓర్చుకొని ఉంటే, నేడు కఠినమైన లాఠీకర్రకు ఒళ్లప్పగించేవాణ్ణా..!
ఆనాడు టీచర్‌చెప్పే పాఠం అర్థం చేసుకొనివుంటే, ఈనాడిలా అర్ధాంతరంగా ముగిసిపోతుండేవాణ్ణా..! టీచర్‌ని సర్వీసు నుండి
సస్పెండ్‌చేయించి నేను సాధించినదేంటి? నేను నా జీవితం నుండే సస్పెండ్‌కావడమా.!?
మంచేదో - చెడేదో, ప్రేమేదో - పగేదో, ఆనందమేదో - అనుబంధమేదో, అవసరమేదో - విలాసమేదో, మేలేదో - కీడేదో..
తెలుసుకోలేక మిడిసిపడే నావంటి శలభాలు కాలి బూడిదవ్వాల్సిందే..!
ఓ ప్రియమైన తమ్ముళ్ళూ..! చెళ్లెళ్ళూ..! ‘బడినుంచి ఉరిదాకా’ వచ్చిన నా జీవితగాధ చదివైనా శిక్షలసలు లేని శిక్షణ,
విచక్షణను చంపేస్తుందనీ,, ఉలిదెబ్బలు తగలందే శిల శిల్పం కాజాలదనీ,, పూటకూళ్ల పొగడ్తలూ బతుకంతా కడుపు నింపవనీ,,
మెట్లెక్కడం కష్టమని అమాంతం మేడమీదకెగిరితే,, చివరకూ కాళ్ళే మిగలవనీ,, దయచేసి తెలుసుకోండి..! అంతా అయిపోయాక,
పశ్చాత్తా పపడి పరితపించే నాలాంటి కథలూ పునరావృతం కాకూడదనీ, ఆలోచించి,, నా ఆత్మ ఘోషను అక్షరచిత్రాలుగా మలచి
మీకందిస్తు న్నా..!
ఇట్లు ,
- ‘బడి నుంచి ఉరిదాకా’ చేరుకొని చెరిగిపోతున్న చందు.
అనే చివరివాక్యంతో సహా, పదేళ్ల నా జీవిత ప్రయాణాన్ని పొదిగిన చిత్రాల ప్రతిని జైలర్‌గారికి అందించాను.
అది చూచిన ఆయన సంభ్రమాశ్చర్యాలకు లోనయి, “నీ చిత్రకళకు నా జోహార్లయ్యా!” అంటూ నన్ను ఆత్మీయ
ఆలింగనం చేసుకున్నారు.

పెండ్యాల గాయత్రి (13)


కథలు కనే కళ్ళు

కొన్నిగంటల తర్వాత జైలర్‌గారు తన మొబైల్‌లో టీవీ చానళ్లను చూపించారు. మార్చిమార్చి ‘నేటి యువతకు కనువిప్పు
కలిగించే ఒక ఖైదీ ఆత్మకథ “బడి నుంచి ఉరిదాకా..” అద్భుతమైన సన్నివేశ చిత్రాలతో అందరినీ ఆకట్టు కుంటుంది. ఉరిశిక్ష
పడబోయే ఖైదీయే స్వయంగా రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రం’ అంటూ ఓ యాంకర్‌మాట్లా డుతూ నా బొమ్మలను
ఒక్కొక్కటిగా చూపిస్తోంది.
‘మంచైనా, చెడైనా, విషయం దొరకడమాలస్యం దాన్ని విస్తృతం చేసి ప్రజలందరికీ చేరవేసే దాకా నిద్రపోదు ఈ
మీడియా. అయితే, మీడియాను మంచికి ఉపయోగించుకోగలిగిన అస్త్రం మాత్రం ప్రజల చేతుల్లోనే ఉంది..’ అనుకుంటూ, నా
చివరికోర్కె తీర్చడం కోసం ఇంతటి సహాయ సహకారాలందించిన జైలర్‌గారికి కృతజ్ఞతగా రెండు చేతులూ జోడించి
నమస్కరించాను.
ఇక కొద్దిగంటల్లో జీవితమనే రంగస్థలంపై నా పాత్ర ముగిసిపోతుందనగా జైలర్‌గారు పిలిచి, “నీకోసం ఎవరొచ్చారో
చూడు చందూ..!” అన్నారు.
అంతమై పోతున్నానన్న భావన అంతరంగాన్నీ పిండేస్తు న్నట్టుంది. పైకి లేవడానికి ఏమూలనో దాగున్న రవ్వంత శక్తిని
కూడదీసుకొని లేచి, ఆ దృశ్యాన్ని చూసీ.., ఏ భావాన్ని వ్యక్తం చెయ్యాలో అర్థంకాని సందిగ్ధతలో ఉండిపోయాను.
“అన్నయ్యా..!” అని అరవై గొంతులు ఐక్యమై ఆత్మీయంగా పిలుస్తుంటే, ఎడమచేత్తో ఊచలు ఊతంగా పట్టు కొని
కుడిచెయ్యిని నావైపుకు చూపించుకుంటూ, ‘నన్నేనా!’ అన్నట్లు సైగచేశాను.
“మిమ్మల్నే పిలిచామన్నయ్యా! మీకోసమే వచ్చాము..” అన్నాడు వారిలో ఒక తమ్ముడు.
ఇంతమంది పిల్లలు ఈ దోషికోసం వచ్చారా.., అనే ఆనందం వల్లనేమో నోరు పెగలడం లేదు.
“నువ్వూ.. కొవ్వొత్తి లాంటి వాడివన్నయ్యా..! కాలిపోతూ కూడా మాకు వెలుగు పంచాలనుకున్నావు!” ప్రేమ నిండిన
కళ్ళతో ఒక చెల్లెలు చెప్పింది.
“మన మేలుకోరే గురువులను, పెద్దలను అర్థం చేసుకొని నడుచుకోవాలని మాకు తెలియ చెప్పావన్నయ్యా!” చెమ్మగిల్లిన
కళ్ళతో ఒక తమ్ముడు అన్నాడు.
“మీ ఆత్మకథ చూశామన్నయ్యా! ‘బడి నుంచి ఉరిదాకా’ ప్రయాణించిన నువ్వూ,, ‘బడి నుంచి భవిత దాకా’
ప్రయాణించమని మమ్ములను ఆశీర్వదించావు!” అని ఇంకో తమ్ముడు ఆప్యాయంగా అన్నాడు.
“నా కథ చదివి ఏ ఒక్కరైనా ఆలోచించగలిగితే చాలు.. ఈ జన్మ ధన్యమైనట్లే.. అన్నావుగా చందూ! ఇప్పుడు చూడు
ఇంతమంది పిల్లలు ఆలోచించడమే కాదు, ఆచరించడానికి సిద్ధంగా ఉన్నారు..” అన్నారు జైలర్‌గారు.
“మీ హెల్ప్‌వల్లే కదా సార్‌! అన్నయ్య కథను మేము తెలుసుకోగలిగాము!” అన్నదింకో చెల్లెలు.
“ఖైదీల సమంజసమైన చివరి కోరిక తీర్చడం న్యాయమమ్మా! నా జీవితంలో ఇది ఒక అపూర్వ ఘట్టం.. జాతీయస్థా యి
రచయిత్రిని కలుసుకొనే భాగ్యం కలిగింది నాకు..” అంటున్న జైలర్‌గారి చివరి మాట అర్ధంకాక అయన వైపు విస్మయంగా
చూశాను.
“పిల్లలందరి వెనుకవైపు చూడు చందూ! నువ్వు ఆరాధించే టీచర్‌, నేను అభిమానించే రైటర్‌అయిన శారదాదేవిగారు
నీకోసం వచ్చారు..” అన్నారు జైలర్‌గారు చిరునవ్వుతో.

పెండ్యాల గాయత్రి (14)


కథలు కనే కళ్ళు

‘నా చెవులేమైనా పొరపాటుగా విన్నాయా..!’ అనుకుంటూ, తల మరికాస్త పైకెత్తి చూశాను. ఆ స్ఫురద్రూపి కంటబడి
వెంటనే మాయమయ్యింది. గుండెనెవరో పిండేసినట్టు , మనస్సునెవరో మెలిబెట్టినట్టు అనిపించి భోరున ఏడ్చేశాను. గుండెలోని
పశ్చాత్తా ప భారమంతా కళ్ళలోని నీటిధారతో తొలగిపోయాక, ఆ ప్రేమమూర్తి మళ్లీ నా ముందు సాక్షాత్కరించింది.
కటకటాలను కసిగా విరిచేసి, పరుగు పరుగున వెళ్లి ఆ దేవతామూర్తి పాదపద్మాలను నా కన్నీటితో కడగాలనుంది. అమె
పవిత్రమైన చేతులతో నా రెండు చెంపలూ వాచి ఊడిపోయేదాకా కొడితే, ఎంత బాగుండునో కదా,,‌అనిపిస్తుంది. నన్ను
క్షమించమని అడిగే అర్హత కూడా కోల్పోయిన అధముడిని. ఆ మహాశక్తితో ఏం మాట్లా డగలనూ.. అలా తదేకంగా చూస్తూ
స్తబ్ధతతో నిలబడిపోయాను.
ఆమె అమ్మలా నా వద్దకు వచ్చి, నా తలపై తన కుడిచేతిని ఉంచి, “చందూ! నువ్వు విలువ కట్టలేని వజ్రానివయ్యా..
నిన్ను వెలుగులోకి తీసుకురాలేకపోయా!” అంటున్న టీచర్‌కళ్లల్లో కన్నీటిపొర కదలాడింది.
‘అదంతా, నా ప్రారబ్ధం..! మీరలా అనకూడదు!’ అని అనాలనిపిస్తుంది కానీ, బాధ గొంతును కప్పేస్తుంటే.., మూగగా
నిలబడిపోయాను.
మళ్లీ టీచరే మాట్లా డుతూ, “నువ్వెప్పటికీ, చిరంజీవివి చందూ..! ఎందుకంటే, ‘బడి నుండి భవితనందుకోండి!’ అని
పిలుపునిచ్చిన నీ కథని, అచ్చు వేయించి ప్రతి విద్యార్ధికి అందించబోతున్నాను. లక్షలాది విద్యార్ధు ల చేతుల్లో నువ్వు చిరంజీవివై,
చిరస్థా యిగా ఉండబోతున్నావయ్యా!” అన్న శారదా టీచర్‌మాటలకు సంతోషంతో ఉక్కిరిబిక్కిరైన నాకు, నిలబడే శక్తి
నశిస్తుండగా గేటు ఊచల ఊతంతో జారగిలబడి ఆమె పాదాలను పట్టు కొని పవిత్రు డనయ్యాననే ఆనందంతో అచేతనుణ్ణయి
పోయాను.

(నేటి విద్యార్థు ల లోని విపరీత పోకడలకు స్పందిస్తూ వ్రాసిన ఈ కథ, 2019 వ సంవత్సరం ప్రతిలిపి ఆన్లైన్ పత్రికలో
ప్రచురించబడింది)

లోపలి అందాలు
“పెళ్లెప్పుడవుతుంది బాబు.. నాకు పిల్ల ఏడ దొరుకుతుంది బాబు”
16 వ పెళ్ళిచూపులకని బయలుదేరి బస్సు ఎక్కుతున్న కామేష్‌కి ఆలీ పాడిన జాలి పాట వినిపించడంతో, “ కత్తిపీటకు
కందగడ్డ లోకువ అయినట్టు , ఈ కంప్యూటర్ కాలానికి ఈ కామేష్ లోకువయిపోయాడు. ఆఖరికి నోరులేని బస్సుకు కూడా
తనపై జాలి పుట్టు కొచ్చి పాట పాడుతోంది..” అని గొణుక్కుంటూ తనలో తానే ఉడుక్కుంటూ ఎదురుగా కనిపించిన ఖాళీ సీట్లో
కూర్చున్నాడు.
“గుంటూరు జిల్లా ఎల్లి బాబు ముద్దు గుమ్మనే చూసినాను బాబు” డబ్బాలో రాళ్ళు పోసి గిలకొట్టినట్లు ఇంకా అదే రొద.

పెండ్యాల గాయత్రి (15)


కథలు కనే కళ్ళు

‘గుంటూరు, గూడూరు, గిద్దలూరు ఎన్ని ఊర్లు తిరగలేదు తాను. సగం సంపాదన టిక్కెట్లు గా మారింది కానీ, కన్య
పురుగు కానరాక పోయే. ఈ పాట రాసిన వాళ్ళకి, పాడిన వాళ్లకి, బస్సులో పెట్టిన వాళ్లకి ఏ ఒక్కరికైనా తెలుసా, పిల్లకోసం తాను
పడే పాట్లు ...’ అనుకోగానే కలిగిన బాధ చికాకు కోపంగా మారి, పాట ఆపేయమని కండక్టర్‌కు చెబుదామనుకుని చివాలున
ముఖం తిప్పాడు. ఎదురుగా ఒక మహిళ ప్రశ్నార్థకంగా తననే చూస్తోంది.
‘ఈవిడెవరు నావైపు అలా చూస్తోందేమిటి? నేను తనకి తెలుసా? పలకరించేందుకు ఇబ్బంది పడుతుందా? పోనీ నేను
పలకరిస్తే.. అమ్మో! ఏం జరుగుతుందో ఏమో..’ సందేహంతో ఆగాడు.
ఆ క్షణంలో అతని మనసులో మెదిలిన అన్ని ప్రశ్నలకు జవాబుగా నవ్వినట్టు మూతి సాగదీశాడు ఆమె కళ్ళలోకి
చూస్తూ. ఆ మహిళ చటుక్కున ముఖాన్ని కండక్టర్ వైపు తిప్పింది.
“ఏమయ్యా..! నీకేమైనా చెవుడా? చెప్పేది అర్థం కాదా?” కటువుగానే అన్నాడు కండక్టర్.
అతను ఏం చెప్పాడో, అసలు ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా అటు ఇటు చూసాడు కామేష్.
“ఆడోళ్ళ సీట్లో కూర్చొని ఆడమనిషిని నిలబెట్టి, ముఖాన్ని యికిలిస్తు న్నావు ఏందో ఇకిచ్చినా...” ప్లే అవుతున్న పాట కన్నా
పెద్దగా వినిపిస్తోంది అతని మాట.
విషయం తెలిసి తలొంచుకుని లేచి వెనక్కి వస్తుంటే క్లా స్ టీచర్ చేతిలో తిట్లు తిన్న స్టూడెంట్‌ని చూసినట్లు బస్సులోని
జనమంతా అతన్నే చూస్తు న్నారు. ఏదో నేరం చేసిన వాడిలా అతని రెప్పలు కిందికి వాలిపోయాయి.
“బస్సు ఎక్కేటప్పుడే ఆ పాట ఎందుకు రావాలి? పాట విన్న తాను పరాకు ఎందుకు తెచ్చుకోవాలి.. పరాకులో పడి
పరిసరాలు పట్టించుకోకుండా పరువెందుకు పోగొట్టు కోవాలి. చ వెధవ జన్మ” పైకే అనుకుంటూ సీటుకు ఒక్కడే కూర్చున్న ఒక
యువకుడి దగ్గరకు వెళ్లి, జరగమన్నట్టు సైగ చేసాడు.
అతడు లేచి కామేష్‌ని కిటికీ పక్కకు పంపించి ముందున్న చోటే కూర్చున్నాడు.
‘చదువుల్లో, స్కాలర్షిప్పుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ఇళ్లల్లో, వీధుల్లో, బస్సుల్లో, రైళ్లల్లో, రాజకీయాల్లో యాడ పట్టిన ఈ
ఆడోల్లే.. వీళ్లు యాడుంటే ఆడే రిజర్వేషన్లే. ఎదురుగా సముద్రం ఉన్నా దాహం తీరనట్లు ఇందరాడోళ్ళు ఉన్నా, నాకు పెళ్లి
కాకపోయే..! ఈగల్లా ముసురుతున్నాయి ఏంటి ఆలోచనలు, తరిమి కొట్టకపోతే మళ్లీ జనం మధ్య తలవంపులు తప్పవు..’
అనుకుంటూ బస్సులోని జనాలను గమనించసాగాడు.
తన పక్కన కూర్చున్న యువకుడు, నిమిషానికొకసారి కోడి మెడ తిప్పినట్లు వెనక్కి తిరిగి చూస్తు న్నాడు. ఎందుకబ్బా
అని కామేష్ కూడా వెనక్కి తిరిగి చూశాడు కానీ, అర్థం కాక మిన్నకుండిపోయాడు. ఏదో ఊరు రావడంతో ఎక్కే దిగే జనంతో
సందడి మొదలైంది. తదేకంగా అందర్నీ గమనిస్తు న్నాడు కామేష్. దిగేవాళ్ళ మధ్య నున్న ఓ బురఖా అమ్మాయి, కామేష్ పక్కన
కూర్చున్న యువకుడికి ఒక పుస్తకం ఇచ్చి గబగబా దిగి వెళ్ళిపోయింది. ఆ సంఘటన చూసిన కామేష్ ఏమీ ఎరుగనట్లు
బయటకు చూస్తూ అతడిని ఓరకంట గమనిస్తూ ఉన్నాడు. బస్సు కదిలింది. తననెవరు పరిశీలించలేదని నిర్ధా రించుకున్న
యువకుడు, పుస్తకం తెరచి, తెల్లకవరు ఒకటి బయటకు తీసి, ముసిముసిగా నవ్వుకుంటూ, కవరులో నుంచి రెండు కాగితాలు
తీసి చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి చదువుకుంటున్నాడు.. అతడి చేతిలోని కాగితం, ప్రేమలేఖ అని, బురఖా అమ్మాయి అతడి
ప్రేయసని, అర్ధం చేసుకున్నాడు కామేష్. తన గుండెలో ఏదో గుబులు రేగింది. టీవీలో వచ్చే వంటల కార్యక్రమాలు చూస్తూ నాలుక
చప్పరించినట్టు ఆగి ఆగి వస్తు న్న యువకుడి నవ్వులను చూస్తూ గుటకలు వేస్తు న్నాడు అతడు.
తనకి ఏ రోజైనా ఏ అమ్మాయి అయినా ప్రేమలేఖ రాసిందా! లేఖ దాకా పోయాడు, కనీసం తనవైపు ఏ పిల్లయిన కన్నెత్తి
చూసిందా?!

పెండ్యాల గాయత్రి (16)


కథలు కనే కళ్ళు

డిగ్రీ చదివే రోజుల్లో తన క్లా స్మేట్ కవిత, ‘కామేష్ చాలా మంచివాడు, అనవసరమైన విషయాలు పట్టించుకోడు, పుస్తకాలే
లోకంగా ఉంటాడు’ అని క్లా సులో అందరితో చెప్తుంటే లోలోపల మురిసిపోయి, ఆమెకు రికార్డు లన్ని రాసిచ్చాడు. యానివర్సరీ
రోజుకు కానీ అర్థం కాలేదు తనకు, తన దగ్గర కాపీ కొట్టడం కోసం ఫ్రెండ్షిప్ నటించే కార్తీక్‌కి కవిత లైన్ వేస్తుందని, వాళ్ల ప్రేమ
చదరంగానికి తానొక పావుగా మారాడని. కాలక్షేప కబుర్లు చెప్తూ కాఫీలు కొట్టి పాస్ అయిన కార్తీక్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి,
కవితకు భర్త, ఇద్దరు పిల్లల తండ్రి. కర్తవ్యాన్ని వదలక కష్టపడి చదివిన తానిప్పుడు కేవలం కిరాణా కొట్టు నడుపుకునే ఘోటక
బ్రహ్మచారి. పెళ్లిచూపుల పిల్ల కాలువల్లో ఈదడానికే మూడు పదులు ముగిసిపోయాయి. ఇవాళ్ళయినా ముడి పడుతుందో లేక
17 వ పిల్ల కోసం పాట్లు పడాలో..’ అనుకుంటూ ఆ యువకుడి వైపు చూశాడు కామేష్.
అతడు అదే నవ్వుతో మొదటి పేపర్ చదవడం పూర్తి చేసి, రెండవ పేపర్ తీశాడు.
నిన్ను నేను ప్రేమిస్తు న్నాను, నువ్వే నా ప్రాణం, నువ్వు లేకపోతే బ్రతకలేను, ఇంతేకదా ప్రేమలేఖ అంటే. బురఖా
అమ్మాయి ఇంకేం రాసుంటుంది, ఇతడు ఇంతసేపు చదువుతున్నాడు. కామేష్‌కి ఉత్కంఠ రెట్టింపవుతోంది.
మళ్లీ యువకుడి వంక చూశాడు. అతడి ముఖాన మునుపటి నవ్వు లేదు. ఇంకా లేఖ పూర్తి కాలేదు కానీ, మొఖం
ముడుచుకుపోయింది. ఓ క్షణం తర్వాత పేపర్లను మడిచి కవర్లో పెట్టి, పుస్తకం మధ్యలో ఉంచి కళ్ళు మూసుకొని, తల వెనక్కి
ఆనించాడు.
‘ఆ అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందా ఏంటి? అంత ఉత్సాహంగా ఉన్నవాడు కాస్త నీరుగారిపోయాడు’
అనుకొని జాలిపడి పలకరిద్దాం అనుకుంటుండగా, అతడు ఏదో గుర్తొచ్చిన వాడిలా కళ్ళు తెరచి తలవంచి, పుస్తకంలోని
లెటరున్న కవర్ తీసి నలిపి బస్సులో నుంచి బయటపడేలా విసిరేసి, మళ్ళీ కళ్ళు మూసుకున్నాడా యువకుడు.
రాకెట్లా దూసుకెళ్లిన ఆ కవర్ బస్సు గ్లా సుకు తగిలి, వెనక్కి వచ్చి, కామేష్ కాళ్ళ మధ్యన పడింది. తీసి అతడికి
ఇద్దా మనుకున్నాడు కానీ, మరింత బాధ పెట్టినట్లు అవుతుందని ఊరుకుండిపోయాడు. మరో ఊరు రావడంతో అదే బాధలో
ఉన్న యువకుడు దిగిపోయాడు. పెళ్లి పందిరినీ పడద్రోసే వడగండ్ల వానలా అతడిని వరించి వేధించిన ఆ లెటర్లో ఏముందో
చూద్దా మని వంగి చేతికి తీసుకొని, నలిగిన దానిని అరచేతితో చదును చేసి చూసి ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు.
“ఈ ఆరునెలలు నా అనుమతి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన మీరు, ఈ ఉత్తరంతో, మొలకెత్తిన ప్రేమ
విత్తనం అవుతారని, అనుకుంటూ”
అని వ్రాసి ఆరు కన్నుబొమ్మలు, ప్రతి కంటిపాపలో దొండ, బెండ, బీర, సొర, కాకర, పొట్ల కాయలు ప్రతి కాయపై వివిధ
భావాల యువకుడి ముఖాలను కార్టూన్లు గా చిత్రించి ఉన్నాయి. ఎదురు చూపుల విరహవేదనలో వేగి పోయిన అతడి భావాలను
ఆరు చిత్రాలలో ఆరు అర్ధరూపాయిల సైజులో ఆవిష్కరించిన బురఖా అమ్మాయి ఎంత గొప్ప చిత్రకారిణో కదా! మహాద్భుతం..”
అనుకోకుండా ఉండలేకపోయాడు కామేష్.
‘కవర్ పైనే ఇంత గొప్పగా ఉంటే లోపల ఇంకెంత ఘనంగా ఉంటుందో ఉత్తరం..’ అనుకొని కవర్ లోపల నుంచి పేపర్లు
బయటకు తీయబోయాడు.
‘ఒరేయ్ కామేష్ నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? ఇతరుల ప్రేమలేఖలు చదివే అంత దిగజారి పోయావా!?’ అని తన
అంతరాత్మ మొట్టికాయ వేసినట్లు అనిపించి కవరును భద్రంగా మడిచి జేబులో పెట్టు కున్నాడు.
తాను దిగవలసిన ఊరు రావడంతో కర్చీఫ్‌తో ముఖం తుడుచుకుని ప్యాంట్ జేబులో ఉన్న దువ్వెన తీసి చెరిగిన క్రా ఫ్‌ను
సరిచేసుకుని అందరి మధ్యలో నుంచి నింపాదిగా దిగాడు. దిగిన తర్వాత కండక్టర్ చిల్లర ఇవ్వాలని గుర్తు కు రావడంతో కిటికీ

పెండ్యాల గాయత్రి (17)


కథలు కనే కళ్ళు

దగ్గర నిలబడి టికెట్ చూపించాడు. ఇంతలో కండక్టర్ వెనక సీటులోంచి ఒక మహిళ హఠాత్తు గా తల బైటికి పెట్ఠి, భళ్ళున వాంతి
చేసుకుంది.
‘పెళ్లి చూపులకు వెళ్లక ముందే నాకు కళ్యాణం జరిగి పోయింది..’ అనుకున్నాడు వికారంగా.
రోకటి కింద చితికిన చింతకాయలా చితికిపోయిన అతడిని చూసి, “చూడలేదులే అబ్బాయ్..! కళ్యాణమొచ్చినా
కక్కొచ్చినా ఆగదనేది నీకు తెలుసు కదా!” కామేష్ నోటిని సామెతతో తొక్కేసింది ఆ మహిళ.
ఆ తొక్కుడుకు తట్టు కోలేకనో దుర్వాసనను భరించలేకనో గాని, నోరు తెరవలేక లోలోపలే తిట్టు కుంటూ, ఆమెవైపు
కూడా చూడకుండా ఆ పక్కనే ఉన్న కిరాణా కొట్టు దగ్గరికి వెళ్లి, 30 రూపాయలు ఇచ్చి మూడు బాటిల్స్ నీళ్లు కొనుక్కొని
శుభ్రంగా కడుక్కొని, ‘అవతారం ఆరిన తర్వాత పోదాంలే..’ అనుకొని ఒక అరుగుపై కూర్చున్నాడు‌.
‘11 గంటలు దాటితే దుర్ముహూర్తం ఉందిరా! ఆలోపు నువ్వు వాళ్ళింటికి చేరుకోవాలి..’ అన్న అమ్మ మాటలు గుర్తొచ్చి
టైం చూశాడు.
11 కు ఐదు నిమిషాలుంది. కూర్చుంటే కుదరదులే అనుకొని ఆటో ఎక్కి వాళ్ల ఇంటి ముందు దిగాడు. గేటు తీసిన
చప్పుడు విని నడివయసు మహిళ బయటకు వచ్చింది. పిల్లి కంట పడ్డ ఎలుక పిల్లలా పారిపోబోయాడు.
“ఆగబ్బాయ్..! ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతున్నావ్ ఏంది?” బిగ్గరగా ఆవిడ అరిచేసరికి ఇంట్లో నుంచి మరో ఇద్దరు
బయటకు వచ్చారు.
“బస్సులో నేను కక్కుంటే ఒక అబ్బాయి పైన పడింది అంటినే, పాపం ఈ అబ్బాయే, మనింటికి వచ్చాడు ఎందుకో?”
అంటూ ఆ వీధంతా వినపడేలా అరిచి చెప్తోంది.
ఆ ఇద్దరూ ఉబికి వస్తు న్న నవ్వును నోట్లోనే అదిమి పట్టు కున్నారు.
వారిలో ఒకరు, “ఈ అబ్బాయే మన అమ్మాయిని చూడ్డా నికి వచ్చింది” అంటూ కామేష్‌ని లోపలికి పిలిచింది.
లోపలికి వెళ్ళిన అతడికి నోటితో పాటు నరాలన్నీ బిగుసుకుపోయాయి. ఎండు కట్టెలా కదలకుండా కుర్చీలో
కూర్చున్నాడు.
“అబ్బాయ్! మీరు ఏ ఇంటివారు?” వాంతింగ్ ఆంటీ అడిగింది.
‘కొట్టొచ్చిన’ అని చెప్పాలనుకున్నాడు., కానీ గతంలో ఒక పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు, “అదేం ఇంటి పేరయ్యా? మా
అమ్మాయిని కొడతావా ఏం కొంపదీసి!” నిలదీస్తూ అంది ఒక బామ్మ.
ఆ అనుభవం గుర్తు కొచ్చి కొంచెం మార్చి, “కట్టేసిన కామేష్” అని చెప్పాడు.
“అదేంది అబ్బాయ్! అట్లా మాట్లా డతావు? ఇప్పుడే ఇట్లా గంటున్నావంటే రేపు మా పిల్ల ఏం మాట్లా డినా చిలువలు
పలువలు చేస్తా వేమో!” అంది ఆ ఆంటీ.
కళ్ళు తేలేసిన కామేష్‌ని చూస్తూ పెళ్లికూతురు తల్లి కాబోలు, “అమ్మాయిని తీసుకు వస్తా నయ్యా” అంటూ లోపలికి వెళ్లి
వడ్లబస్తా కి చీర చుట్టినట్లు కదల్లేక కదులుతున్న ఓ ఆడ ఆకారాన్ని తీసుకొని వచ్చింది.
చెవులను కప్పేసే చెంపలు, తొండాన్ని తలపించే ముక్కు, గండు చీమల కన్నా చిన్నవైన కళ్ళు, గేదె దూడను గుర్తు కుతెచ్చే
పెదవులు, చాట సైతం చిన్నబోయే మొఖం, బానను కూడా బంధించగల బొజ్జ, సొరకాయలతో పోటీపడే కాళ్లు చేతులు కల ఆ
సౌందర్యవతి వచ్చి కూర్చోబోతుంటే, ‘పాపం కుర్చీ!’
అనుకున్నాడు కామేష్.

పెండ్యాల గాయత్రి (18)


కథలు కనే కళ్ళు

ఆ తరువాతి తతంగాన్నంతా చేసుకుని తన తల మెమోరీలో ఫీడ్ చేసుకుని బతుకు జీవుడా అనుకుంటూ బైటపడి,
బస్సెక్కి కూర్చున్నాడు.
ఉదయాన ఇంటినుండి బయలుదేరే ముందు అమ్మవారికి నమస్కరించుకొని, “ఇవాళయినా నా పెళ్లి కుదిరితే
అరడజను మంది ఆడపిల్లలను కని, నీకు కానుక ఇస్తా నమ్మా..” అని మొక్కుకున్నాడు.
అందుకే, “ఆకారం వికారం ఐనా అడ్జస్ట్ అవుదాం అనుకుంటే వాళ్లు లకారాల కారం చల్లా రే నా ముఖాన..” అంటూ
తల పట్టు కున్న కామేష్‌కి తన వెనక సీటులోని ఇద్దరు పెద్దవాళ్ళ సంభాషణ చెవిలో పడింది.
“ఇప్పుడు వరకట్నం పోయి కన్యాశుల్కం వచ్చేసిందండి!” అన్నారొకరు.
వధువులు ఎక్కువగా ఉన్నప్పుడు వరుడిని కొనుక్కునేవాళ్లు , ఇప్పుడు ఆ వధువులు కరువవుతున్నారుగా, కొనుక్కోగల
వరుడికి మాత్రమే పెళ్లిళ్లు అవుతున్నాయి..” అన్నారు మరొకరు.
‘అమ్మాయికి బంగారం చేయించడం కోసం ఒక రెండు లకారాలు, పెళ్లి బట్టలకు ఒక లకారం, ఇవ్వాలంట..’ కామేష్
మనసులో అనుకున్నాడు.
“ఆమధ్య పేపర్లో చదివానండి, దక్షిణాంధ్ర జిల్లా ల్లో ఒక సర్వే జరిపితే, పాతికేళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యనున్న మగాళ్లలో, 40
శాతం మంది బ్రహ్మచారులే ఉన్నారట!” వాపోయారు ఒకరు.
“ఇంతకుముందు ఆడపడుచు లాంచనం ఉండేది, ఇప్పుడేమో మగబిడ్డ లాంచనాలు అడుగుతున్నారంట..” కిసుక్కున
నవ్వి అన్నాడు రెండోవ్యక్తి.
కామేష్, “మా మగ పిల్లోడికీ కూడా ఓ యాభై వేలు ఇవ్వాల్సి ఉంటుంది!” సన్నగా గొణిగాడు.
ముందువ్యక్తి అందుకుని, “మరీ ఆ 80 90 దశకాలలో కొత్తగా స్కానింగులు రావడం, విపరీతమైన కట్నాలు ఉండడం
వల్ల ఆడపిల్లల్ని అసలు పుట్టనివ్వలేదండి..” వాస్తవాన్ని వెల్లడించాడు.
“అవునవును,, అప్పుడు ఆడపిల్లలు పుడితే ఏడ్చారు, ఇప్పుడు మగబిడ్డకి పెళ్లి కావట్లేదని ఏడుస్తు న్నారు” తనవంతు
నిరసన తెలిపాడు రెండోవ్యక్తి.
కామేష్‌కు తల్లి మాటలు గుర్తొచ్చాయి. ‘ఆడపిల్లను కన్నావంటే నీకు విడాకులు ఇస్తా నే, అనేవాడురా మీ నాన్న. మగబిడ్డ
పుట్టా లని వెయ్యి దేవుళ్ళకు మొక్కుకుంటే నువ్వు పుట్టా వు..’ అనే అమాయకపు తల్లి ముఖం కనిపించింది.
“ఏది ఏమైనా ఇప్పుడున్న ఆడ మగ అసమానతకి సమాజం చేసుకున్న స్వయంకృతాపరాధమే కారణం అండి..”
వెనకనుండి కాస్త ధాటిగా వినిపించింది.
“కావచ్చు కానీ, ఇంకా వంశము వారసుడు, అనే వేదాంతాలు పట్టు కు వేలాడేతే వివాహానికి వధువులు ఎక్కడినుంచి
వస్తా రు?” అన్నాడు రెండో అతను.
కామేష్ నిట్టూరుస్తూ, ‘నేరం ఒకరిది శిక్ష మరొకరికి అంటే ఇదేనేమో’ అనుకున్నాడు.
“ఇటీవలి కాలంలో అత్యాచారాలు విపరీతంగా జరగడానికి కారణం కూడా ఆడపిల్లల కొరతేనండి.”
“స్వలింగ వివాహాలకు కూడా ఆ సమస్యే కారణమని అనుకుంటున్నాను అండి..” సమాజ పోకడను వివరించాడు
రెండో వ్యక్తి.
ఇక కామేష్‌కి వాళ్ళ సంభాషణ వినాలనిపించలేదు. ‘ఇప్పుడు అంత డబ్బు ఎక్కడ తేవాలి..!? అని ఆలోచిస్తూ ఒక
కునుకు తీశాడు.

పెండ్యాల గాయత్రి (19)


కథలు కనే కళ్ళు

ఎంతసేపు అలా పడుకున్నాడో ముఖాన నీళ్లు చల్లినట్లు అనిపిస్తే గాభరాగా కళ్ళు తెరిచి చూశాడు.
ముందు సీటులో ఉన్న వ్యక్తి, “సారీ అండి” అని చెప్పాక కాని, తన ముఖాన పడింది నీళ్లు కాదని అర్థం కాలేదు.
‘సారీలు, స్వారీలు చెప్పాక ఏం మాట్లా డుతాము,.’ అసహ్యంగా ముఖం చిట్లించుకొని, కర్చీఫ్‌తో తుడుచుకుని
బయటకు చూస్తే తాను దిగవలసిన ఊరు వచ్చిందని అర్థమైంది.
“ఛ.. దరిద్రపు నిద్ర, ఊరుదాటి పోయేవాడిని, ఉమ్మి వేయించుకుంటే గానీ మెలుకువ రాలేదు..” పైకే తిట్టు కుంటూ
బస్సు దిగి ఇంటికి చేరుకున్నాడు.
కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి తల్లికి జరిగిన విషయాలన్నీ చెప్పి దుస్తు లు మార్చుకుంటుండగా చేతికి తగిలిన కవర్
చూడగానే బురఖా అమ్మాయి లేఖ సంగతి గుర్తు కు వచ్చింది.
వెంటనే జేబులో నుంచి కవర్ తీస్తూ, “ఆ అమ్మాయి అంత ప్రేమగా రాస్తే ఆ యువకుడు ఎందుకు పడేశాడో
తెలియాలంటే చదవాలి కదా” అంటూ, వద్దంటున్న మనసును బుజ్జగించి చదవమంటున్న మెదడును ప్రోత్సహించాడు.
మొదటి కాగితం మడతలు తీయగానే,
“మొలకెత్తిన మనోవృక్షానికి ప్రేమ ఫలాలతో చిత్రాభిషేకం”
అని వ్రాసి, గుండెలో చెట్టు , ఒకే చెట్టు కు వివిధ రకాల ఫలాలు, ప్రతి ఫలంపై అతడి రూపం ఉంది. రూపాయి బిళ్ళ సైజులో
ఉన్న ఆ చిత్రరాజం వ్యక్తం చేసే భావాలకు మాటలు చాలవు అనిపించింది కామేష్‌కు.
రెండవ చిత్రానికి ముందు,
“మండు వేసవిలో మనోరంజకమైన మామిడి”
పండులో ఎండ, ఎండలో మామిడిచెట్టు , చెట్టు కింద అతడివే రెండు రూపాలు. మొదటిరూపం ఒక పండు తింటూ
ఉంది. మరోరూపం పది పండ్లు తిని, పొట్ట పట్టు కున్నట్లు ఉంది.
చిత్రం కింద:
“ఇదే రేయింబవళ్ళ ప్రేమ”
3 వ చిత్రం పైన,
“పుచ్చగింజలన్ని ప్రేమ పాట్లు “
అతడి ముందు రెండు పుచ్చముక్కలు. ఒక ముక్క ముదురు ఎరుపు రంగులో ఉంది. అధిక విత్తనాలు ఉన్నాయి.
ఇంకో ముక్క లేత ఎరుపురంగులో ఉండి విత్తనాలు అసలు లేవు.
చిత్రం కింద:
“ఏరగలిగితే తియ్యదనం, లేకపోతే చప్పదనం”
4 వ చిత్రం పైన,
“పక్వానికొస్తేనే సీత ప్రేమఫలమై తీపి సిరులనిస్తుంది”
ఒక స్త్రీ చెయ్యి,చేతిలో సీతాఫలం చెట్టు , చెట్టు నిండా కాయలు, చెట్టు కి ఇరువైపులా ఇరు రూపాలలో అతడు. ఒక
రూపం ఎదురు చూస్తు న్నట్లు చెట్టు ని చూస్తుంది. ఇంకో రూపం చేతిలోని కాయ వైపు విసుగ్గా చూస్తుంది.
చిత్రం కింద:
“పండేదాక చూస్తా వా, పచ్చి దాన్ని కోసి కొరికి పారేస్తా వా”

పెండ్యాల గాయత్రి (20)


కథలు కనే కళ్ళు

5 వ చిత్రం ముందు,
“జామపండు ప్రేమ ఎవరి సొత్తు ”
నిండుగా కాయలున్న జామచెట్టు , చెట్టు కిరువైపుల ఇరు రూపాల్లో అతడు. ఒక రూపం రాయితో పండ్లను కొడుతూ
ఉంది. ఇంకో రూపం కిందపడ్డ వాటిని ఏరుతున్నది.
చిత్రం కింద:
“పండు కొట్టే రాయిదా, వేరే చేతిదా”
6 వ చిత్రం ముందు,
“శిశిర వసంతాలు ప్రేమకి ఆవాసాలు”
ఆకులు రాల్చిన చెట్టు , చివుళ్ళు తొడిగిన చెట్టు ,. చెట్ల మధ్యన ప్రశ్నార్థక ముఖంతో అతడు, అతడి ముందు ఎరువు
గంప, నీళ్ల బిందె.
చిత్రం కింద:
“తనకు కావలసినది వచ్చే వసంతమా,, వచ్చేసిన వసంతమా”
పై చిత్రాభిషేకంలో ప్రేమ స్నానమాడి విచిత్రాలు చవిచూశారు కదా. రెండవ పేజీలోని చిత్రాలను చూసి సజీవ చిత్రాలను
స్వీకరించగలరో లేరో చూడండి..
చదువుతున్న కామేష్ కళ్ళింత చేసి, “ఇంత విభిన్నంగా ప్రేమలేఖ రాయవచ్చా. ఈ చిత్రాలన్నింటిని వర్ణిస్తే ఒక ప్రేమ
కావ్యమైపోదూ”
అంటూ రెండవపేజీ తెరచి చదివి, నిర్ఘాంతపోయి, నిలువెల్లా నిశ్చేష్టు డయ్యాడు. మంచంపై కూర్చుని చదువుతున్న
వాడల్లా వెనక్కి వెల్లికిలా పడుకున్నాడు.
ఉబికి వస్తు న్న కన్నీళ్లు కంటిపాపను కప్పేస్తు న్నాయి. “ఈ భయంకర నిజం, నిజం కాకుండా పోతే ఎంత బావుండును!
సుగంధాల గని అయిన మొగలిపువ్వు ముళ్లపొదల్లో పెరిగినట్లు , ప్రేమవని అయిన ఈ ప్రతిభాశాలి బ్రతుకులో ఇంతటి బడబాగ్ని
చెలరేగడమా? ఆ యువకుడిది గుండెనా, బండనా..? ప్రేమ సంపదను విసిరికొడతాడా..?” జీర్ణించుకోలేకపోతున్నాడు కామేష్.
‘ఎలాగైనా ఈ ప్రేమ పెన్నిధిని కలుసుకోవాలి’ మనసులోనే దృఢ నిశ్చయానికి వచ్చాడు.
తరువాత రోజు ఉదయం అదే బస్సు ఎక్కేసాడు. బురఖా అమ్మాయి ఎక్కకపోతుందా అని చూస్తు న్నాడు. నలుగురు
బురఖా మహిళలు బస్సెక్కారు.
“అరే ఇప్పుడు ఎవరినని అడగాలి,.. వీళ్ళ ముసుగుల్లో ముఖాలు కనపడి చావవే,. ‘కమ్మ కనపడక వెతుకుంటుంటే
కొలిమి పెట్టడమంటమంటే’ ఇదే కాబోలు” గొణుక్కుంటూండగా ఒక బురఖా మహిళ వచ్చి కామేష్ పక్కన కూర్చుంది.
“మీరేమైన ప్రేమలేఖ రాసారా?” అని అడుదామనుకున్నాడు కానీ, పళ్ళు రాలగొడుతుందేమోనని, “మీరేం
చదువుతున్నారు మేడం” అన్నాడు మాటలు కలుపుతూ.
ఆమె బిగ్గరగా, “క్యా..? చదువా! ఎట్లా కనిపిస్తు న్న నీ కంటికి, ఐదుగురు పిల్లలున్నారు నాకు, ఆడది దొరికితే చాలు
ఆవురావురుమంటారు దరిద్రగొట్టు మొకాలు..” అని తిట్టు కుంటూ వెనక్కెళ్లి కూర్చుంది ఆవిడ.
దోచుకొని దొంగయ్యాడు కామేష్. బస్సు లోని సగం జనం కొరకొరా చూసారతనివైపు.
‘కష్టా లెన్నొచ్చిన కర్తవ్యాన్ని వీడకూడదు..’ మనసులోనే అనుకున్నాడు బుద్దిమంతుడిలా.

పెండ్యాల గాయత్రి (21)


కథలు కనే కళ్ళు

‘నిన్న ఆ అమ్మాయి దిగిన ఊరు వస్తే దిగుతుందిగా.. కలుసుకోవచ్చు’ అనుకుంటుండగానే ఆ ఊరు వచ్చింది. జనం
మధ్యలో నుంచి రెండు బురఖాలు కదులుతున్నాయి.
ఏదైతే అది అయిందని అనుకుంటూ హడావుడిగా వాళ్ల వెంట దిగబోయి, కాలు స్లిప్పై బస్సు వాకిలి దగ్గర పడిపోతుంటే,
అతడి ముందు దిగుతున్న ఒక బురఖా అమ్మాయి వెనక్కి తిరిగి కామేష్‌కి చెయ్యి అందించబోయి, తన తలను తలుపుకి
కొట్టు కుంది. ఆ గందరగోళంలో ఆమె ముఖానికి ఉన్న మాస్కు ఊడిపోయింది.
“ఆహా! అద్భుత సౌందర్యం” అని మనసులోనే అనుకొని, “సారీ అండీ! నావల్ల మీకు ఈ దెబ్బ” అంటున్న కామేష్‌తో,
ముఖానికి మాస్కు తగిలించుకుంటున్న ఆమె మాట కలుపుతూ, “మీకు బాగా తగిలినట్లుంది” అంది.
‘బంగారాన్ని భద్రంగా బీరువాలో దాచి పెట్టినట్లు ఆ ముసుగు లోపల అందాన్నంతా దాచి పెట్టేస్తా రు. కనీసం కళ్ళారా
చూసి ఆనందించకుండా..’ అనుకుంటూ, “పరవాలేదు లేండి!” అన్నాడు పైకి.
ఆమె, “ఉంటానండి” అంటుంటే లేఖ సంగతి అడగాలనుకున్నాడు కానీ, ‘ఈమె ఇంత అందంగా ఉంది కదా ఆమె
కాదులే’ అని నిర్ధా రించుకొని నిరాశగా వెనక్కి వచ్చి బస్సెక్కాడు.
ఆ లేఖ తలంపులతోనే పదిరోజులు గడిచిపోయాయి. తల్లి పదేపదే ఒత్తిడి చేయడంతో ఆడపెళ్ళి వారితో సంప్రదింపులు
జరిపి ముహూర్తం పెట్టు కుందామనుకుంటే, ‘ముందు డబ్బు సర్దండి’ అన్నారు వాళ్ళు. చేసేది లేక, దాచుకున్నది కొంత,
తెలిసినవాళ్లని అడిగి కొంత డబ్బు తీసుకొని బస్సెక్కాడు. ఆ ప్రేమమూర్తిని కలుసుకోలేక పోయాననే కొరత అతని మనస్సును
పిండేస్తుంది.
‘ఈ లోకం తీరే అంత.. మంచి అన్నంలోకి మంచి కూర దొరకదు. అంతటి రసహృదయకు రసికత తెలియనివాడు
తారసపడ్డా డు. ఆ రసజ్ఞతను ఆరాధించగలిగిన నాకు ఆమె గగన కుసుమమే అయ్యింది. ఛా.. నా ప్రయత్నమంతా ఎడారిలో బావి
త్రవ్వినట్లు నీరుగారిపోయింది...’ అని పరిపరి విధాలుగా తనలో తాను మదన పడుతున్నాడు కామేష్.
“హలో ఎలా ఉన్నారండీ!” అంటూ బురఖా అమ్మాయి పలకరించడంతో ఈ లోకం లోనికి వచ్చాడు.
“ఎవరు?” అన్నట్లు ఆ ముసుగు వైపు ప్రశ్నార్థకంగా చూశాడు.
“ఓరోజు మీరు బస్సు దిగుతూ పడిపోతుంటే..”
ఆమె మాటకు అడ్డు వస్తూ, “ఓ మీరా.. మీ ముఖాన్ని మాస్కుల్లో దాచేస్తా రు కదండీ ఎలా గుర్తించడం?” అని నవ్వుతూ
ఎందుకో ముందుకు చూసి అదిరి పడ్డా డు.
గతంలో ప్రేమలేకబుర్లు ఖ బయటపడేసిన యువకుడు,, ఎవరో అమ్మాయితో చెబుతు‌న్నాడు. కామేష్‌కి కోపం కట్టలు
తెంచుకుంది.
ముందుకు వంగి, “అబ్బాయ్..” అరిచినట్లు పిలిచాడు.
అతడు వెనక్కి తిరిగి విస్మయంగా చూస్తుంటే, “బురఖా అమ్మాయి ప్రేమకు బై చెప్పి, చుడీదార్ అమ్మాయి వెంట
పడుతున్నావా?” అన్నాడు కాస్త కోపంగా.
ఆ మాట పూర్తవటం ఆలస్యం, “నా లైఫ్ నా ఇష్టం అండి! అడగటానికి మీరెవరు?” రెచ్చిపోయాడతడు.
యువకుడితో మాట్లా డుతున్న చుడీదార్ అమ్మాయి అసహ్యంగా అతడి వైపు ఓ చూపు చూసి లేచి వెళ్ళిపోయింది.
ఆ దృశ్యాన్ని చూసి శాంతించిన కామేష్‌తో, “అతని విషయం మీకెట్లా తెలుసండి!” మెల్లగా అడిగింది బురఖా
అమ్మాయి.

పెండ్యాల గాయత్రి (22)


కథలు కనే కళ్ళు

“ప్రేమ పెన్నిధి లాంటి ఒక అమ్మాయి వీడిని నమ్మి అద్భుతమైన చిత్రాలతో లేఖ వ్రాస్తే చదివాక వీడు విసురుగా బయట
విసిరేస్తే అది నాకు దొరికిందండి! ఆ ప్రేమ దేవత కనిపిస్తుందేమో ఇద్దా మని దేవుడి దగ్గర భద్రంగా దాచిపెట్టా ” అంటూ ఆమెవైపు
చూసాడు.
తన కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి.
వెంటనే ఏదో అర్ధమైనట్లు , “అంటే, అంటే.... మీరే” అంటుండగా బస్సు ఆగింది.
ఆమె లేచి వెళ్ళి పోతుంటే, వెనకనే వెళ్ళాడు. అలా అర కిలోమీటరు నడిచాక, ఒక స్కూల్ లోపలికి వెళుతూ, వెనక్కి
తిరిగి చూసింది. ఇద్దరి మధ్య మౌనమే కాసేపు మనసు విప్పి మాట్లా డుకుంది. అతడొక మంచుకొండలా ఆమెకు, ఆమె ఒక
మహానదిలా అతనికి అనిపించింది ఆ క్షణంలో. పెదవులు విచ్చుకున్నాయి.చీకటి తొలగిన వేకువలా చిరునవ్వు సొగసులారబోసింది
ఇద్దరిలోనూ.
***
ఆడపెళ్ళి వారికి ఇవ్వవలసిన డబ్బు అమ్మ చేతికి ఇచ్చాడు కామేష్. ఏం జరిగిందో అని గాభరా పడుతున్న అమ్మకు
ప్రేమలేఖ విషయం చెప్పి లేఖ ఆమె చేతికి అందించాడు.
***
రెండవ పేజీ
సందర్బోచితమైన సముచిత చిత్రాల మధ్య...
“ఆరుగాలం అల్లా డి పంట పొలం కోసం పరితపించే కర్షకుడిలా మీరు నా కోసం వేచి ఉన్నారని, పరపతిని లెక్కచేయక
ప్రేమ సంయుక్తను పరిణయమాడిన పృధ్వీరాజులా నాకోసం ప్రయత్నిస్తు న్నారని, మిరిమిట్లు గొలిపే పైపై మెరుగులను కాక
మనస్సుని మీటే లోపలి అందాలను ఆరాధిస్తా రనే, ఆశతో నా ఎదను చిదిమేసిన యదార్ధగాధను మీ ముందు పరుస్తు న్నాను.
నేను పన్నెండేళ్ళ వయసులో ఉన్న రోజులవి, పిండివంట చేస్తు న్న అమ్మ, నాన్న పిలుపుకు పక్కగదిలోకి వెళ్లడంతో ఆ పని
కల్పించుకున్న నాపై, మసులుతున్న నూనె బాండి జారిపడడం, నేను కింద పడిపోవడం, పక్కనే ఉన్న నీళ్ల గ్లా సు దొర్లిపోవడం,
కాగిన నూనె నీళ్లు తోడై నా ఒంటి పై మంటలు చెలరేగడం, అంతా మాయలా ఒక్కక్షణంలో జరిగి పోయింది. గొంతు కిందనుంచి
మోకాళ్ల దాకా ఉన్న నా అవయవాలన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. బతకడం కష్టం అన్నారు డాక్టర్లు . కొంత కోలుకున్నాక
మెచ్యూరిటీ ఉండకపోవచ్చు అన్నారు.
ఆ రెండింటినీ జయించాను. కాలిపోయిన నా అందాల ఆశలను కాగితంపై పెట్టి, అందరిలా అందలాన్ని అందుకోవాలి
అనుకున్నాను.
హిందువుల అమ్మాయిని అయిన నేను నా చిద్రరూపాన్ని దాచేందుకు ముస్లిం అవతారము ఎత్తా ను. ప్రకృతి సహజమైన
స్త్రీ కోరికలను చిదిమేసిన నేను మీ పిలుపుతో విచిత్ర ప్రేమచిత్రాన్ని అయ్యాను”
కన్నీళ్ల మధ్య అక్షరాలు అలుముకు పోతుంటే, మాటరాక గొంతు మూగబోతుంటే, అతికష్టంపై చెప్పింది కామేష్ తల్లి,
“ఆ ప్రేమనదిని నువ్వే అందుకోవాలి నాయనా..” అని.
ఆ సమయంలో అతడి కళ్ళలో కోటి కాంతులు వెలుగుతున్నాయి.

(తగ్గిపోయిన ఆడపిల్లల నిష్పత్తి వలన ఉత్పన్నమైన వివాహ సమస్యలను స్పృసిస్తూ వ్రాసిన ఈ కథ, 2020 వ
సంవత్సరంలో సంచిక వెబ్ మేగజైన్లో ప్రచురింపబడింది)

పెండ్యాల గాయత్రి (23)


కథలు కనే కళ్ళు

జీవితమిచ్చిన కథ
“మహరాణులాంటి మగువలకు విధేయుడనవుతా...” -అజయ్.
“మహిళల బారినుండి తప్పించుకునేందుకు, మగ మాన సంరక్షణ కొరకు పోరాడతా...”-రాజేష్
“మహిళాధిక్య సమాజంలో మీరుంటే ఎలా ఉంటారు?” అని ప్రశ్నిస్తూ పంపించిన నా వాట్సాప్ మెసేజ్‌కు బదులుగా పై
రెండు భిన్నమైన సమాధానాలు వచ్చాయి.
అజయ్ నాకు కాబోయే శ్రీవారు. మహారాణులం కావాలనే దురాశ అయితే లేదు గానీ, మమ్మల్ని మనుషులుగా
చూడగల మంచి మనసు తోడు కావాలని ఆశ మాత్రం ఉంది.
రాజేష్ మా అక్కకు శ్రీవారు... తమ పురుషజాతి ఉద్ధరణకు నడుం బిగించేలా ఉన్నారు మహిళాధిక్యతను నిరసిస్తూ.
ఇదే ప్రశ్న మా కొలీగ్ సరోజనడిగా.
ఆమె కళ్ళు పెద్దవి చేసి, “ఒకవేళ నువ్వన్నట్లు మహిళలకు ఆధిక్యత వస్తే మొట్టమొదట మహిళల మూత్ర విసర్జన
సమస్యను పరిష్కరిస్తా ” అంది,, అనునిత్యం నీళ్లు లభించని మా ఆఫీస్ లోని బాత్రూమ్‌లను గుర్తు కు తెస్తూ. ఏమనాలో తోచక
గట్టిగా నవ్వా.
ఇదే విషయం మా తమ్ముడిని అడిగితే, “మహిళాధిక్యత వస్తే ఎంచక్కా మాకు రిజర్వేషన్లొస్తా యిగా,, నేను మంచి
ఉద్యోగం సంపాదించుకుని హాయిగా ఉంటా..” అని ఉత్సాహంగా అన్నాడు.
దగ్గర పడుతున్న అంతర్జా తీయ మహిళా దినోత్సవానికి ఏ అంశంపై కథ రాయాలబ్బా అని ఆలోచిస్తూ ఎస్ఎంఎస్ ల
అన్వేషణ మొదలుపెట్టా ను.
‘అయినా నా పిచ్చిగానీ, ఈ మగాళ్లు సమసమాజమంటేనే భరించలేరు. ఇక మాకు ఆధిక్యత కావాలంటే
ఒప్పుకుంటారా! అయినా విచక్షణ ఎరుగక అనునిత్యం అమ్మాయిలపై జరిగే అకృత్యాలను మించిన కథాంశం ఏముంది..?’
అనుకుంటుండగా,,

పెండ్యాల గాయత్రి (24)


కథలు కనే కళ్ళు

“మేడం! 525 రుపీస్ రీఛార్జి కార్డ్ ఇస్తా రా!” అన్న మాటతో తేరుకుని పైకి చూద్దు ను కదా.. ఎదురుగా నిలబడుంది నా
ఇంటర్మీడియట్ క్లా స్మేట్.
“రమణీ..!!” అన్నా బిగ్గరగా,, ఆఫీస్‌లో ఉన్నానన్న సంగతి కూడా మర్చిపోయి.
రమణితో కలిసి వచ్చిన మరో ఇద్దరు మహిళలు నావైపు దానివైపు మార్చిమార్చి చూశారు.
రమణి నవ్వుతూ, “లతా! నువ్వేంటే ఈ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్‌లో ఉన్నావు?” అంది నా చేతుల్ని తన చేతుల్లోకి
తీసుకుంటూ.
“ఓ ఏడాది నుంచి ఇక్కడే ఉంటున్నానులే కానీ, మీ బావ బాగున్నాడా? పిల్లలేమి చదువుతున్నారు?” అన్నాను వాళ్ళ
ముగ్గురికి కుర్చీలు సిద్ధం చేస్తూ.
“ఎవరూ? హరి..నా.., బాగానే ఉన్నాడు” నిర్లిప్తంగా అని, వెంటనే ముఖంపై నవ్వు పులుముకుని, “లతా..! నీ
పెళ్ళెప్పుడే?” అంది.
“త్వరలో శుభలేఖిస్తా లే రమణీ” అన్నాను నవ్వుతూ.
రమణితో వచ్చిన ఆ ఇద్దరి ముఖాల్లో ఇంకా సందిగ్ధత తొలగినట్లు లేదు.
“ఇక బయలుదేరుతానే!” అంటూ తను పైకి లేచింది.
“ఏ.., కూర్చో.. ఇన్నాళ్ల తర్వాత కనిపించి అప్పుడే వెళ్తాం అంటావ్!” చనువుగా గదమాయించాను.
“వీళ్లు వెళ్లా లటా., ఇంటి దగ్గర దింపి రమ్మని కార్ డ్రైవర్‌కు చెప్పేసి వస్తా ..!” అంటూ వారితో బయటికి నడిచింది.
ఈ రమణిది పేరుకు తగిన అందం. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కాలేజ్ బ్యూటీగా చలామణి అయింది. ఎంతటి
విషయమైనా ఒక్కసారి చదివి గుర్తు పెట్టు కునేది. అయితే కష్టపడి సబ్జెక్ట్ అంతా నేర్చుకోవడానికి ఇష్టపడేది కాదు. ఏ
విషయంలోనైనా తను అందరికన్నా పైచేయిగా ఉంటే ఆనందంగా ఉండేది. పొగిడేవాళ్ల కోసం ప్రాణాలైనా ఇస్తుంది. తనను
పెళ్లా డబోయే హరి బావ గురించి పదే పదే చెప్పి తెగ మురిసిపోయేది.
“మా ఊరి మొత్తంలో మా మేనమామ ఆస్తిపరుడు. నా కోడలి అందం, తెలివి ముందు నా ఆస్తి ఎంతజేస్తుందంటారు
మామయ్య” అంటూ వాళ్ళ మామయ్య మంచిని తన ఘనతను కలగలిపి చెప్పేది.
ఇంతలా మా అందర్నీ ఊరించి, ఎవరికీ చెప్పాపెట్టకుండా సమ్మర్ హాలిడేస్‌లో వాళ్ళ హరి బావను పెళ్లి చేసుకుంది.
ఓ మూడు సంవత్సరాల తర్వాత కనిపించి, “ఇద్దరు అబ్బాయిలు పుట్టా రే. చాలా హ్యాపీగా ఉన్నా” అంది.
మరో రెండేళ్ల తర్వాత ఓ బట్టలషాపులో దర్శనమిచ్చింది. కస్టమర్గా కాదు షాపు ఓనర్‌గా.
“ఇది ఏంటి రమణి?” అంటే.,
“ఇంట్లో బోర్ కొడుతోంది లతా.., హరి ఎప్పుడు బిజీ, లంకంత ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోతున్నా..” అంది.
మరో ఆరునెలల తర్వాత ఫోన్ చేసి, “ఓపెన్ డిగ్రీ కట్టా లనుకుంటున్నా.., ఎక్కువ మార్కులు వేసే యూనివర్సిటీ ఏదో
చెప్పవే!” అంది.
“ఇదేంటి మళ్లీ పైరగాలి వీస్తోంది” అన్నా నవ్వుతూ.
“మన కాలేజీలో సిఈసి గ్రూప్ అమ్మాయి ధనలక్ష్మి కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ అయింది. తెలుసా నీకు? డిగ్రీ ఉంటే
డబ్బు పెట్టయినా గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ కొట్టొచ్చట, తెలిసిన వారు చెప్పారులే” అంది.

పెండ్యాల గాయత్రి (25)


కథలు కనే కళ్ళు

మూడేళ్లనాటి ఆ ఫోన్‌కాల్ తర్వాత ఈరోజు ఇదిగో ఇలా కనపడింది. తన గురించి ఆలోచిస్తూ తలెత్తగానే రమణి
లోపలికి వస్తూ ఉంది.
రావడమాలస్యం, “ఇప్పుడు చెప్పవే లతా..! నీ ఉడ్బీ ఏం చేస్తుంటాడు..?” అంది.
“ఆ సంగతి తర్వాత చెప్తా గాని, నీతో వచ్చిన వాళ్ళిద్దరూ మనిద్దర్నీ అయోమయంగా చూస్తు న్నారు, ఎందుకు?”
అడిగాను.
“వాళ్లకి తెలిసి నా పేరు రమ్య! నువ్వేమో రమణి అని పిలుస్తుంటివి మరి..” అంది నవ్వుతూ.
“అంటే, పేరు కూడా మార్చేశావన్నమాట..” నామాట పూర్తికాక ముందే,
“ఏం చేస్తా ను.! మా వాళ్ళంతా రవిని అని పిలుస్తుంటే ఫ్రెండ్స్ అందరిలో ఇన్‌సల్ట్‌గా అనిపించి మార్చేశా..” అంది.
“మ్ఁ.. బావుంది. ఇంతకీ ఇప్పుడేం చేస్తు న్నావు?” వెటకారం వినిపించకుండా అన్నాను.
చూపును నేలవైపు మళ్ళించి, “లతా..! మరి!” అని ఆపేసింది.
“చెప్పవే ఆపేసావే!” అన్నాను అనునయంగా.
“పెళ్లికి ముందు రావలసిన సమస్య ఇప్పుడొచ్చిందే..” అంది మెల్లగా.
నేను కాస్త కంగారు పడినా, తేరుకుని, “అది సమస్య అని తెలిసినప్పుడు దగ్గరికి ఎందుకు రానిచ్చావు?”
పరిశీలనగా చూస్తూ అన్నాను.
“ప్రేమను దూరం చేసుకోమంటావా! ప్రేమించడం నేరమా!” అంది సినిమాలో డైలాగ్ చెప్పినట్టు .
“అర్థం లేని ప్రేమ అనర్థం అంటాను..” అన్నాను.
“ప్రపంచంలో నేనొక్కదాన్నే వ్యర్థమైన పని చేసినట్టు అందరూ నన్నే నిందిస్తా రు..” ముఖం ముడుచుకుని అంది.
“అందరికీ ఆ అవకాశం నువ్వే ఇచ్చావు!” అన్నాను
“అంటే?” అంది.
“పొగడ్తల కోసం పనులు చేస్తూ పోతే, ఫలితాలిలాగే ఉంటాయి రమణీ..!” అన్నాను.
“నువ్వు ఎన్నైనా చెప్పవే, నేను అతనిని మర్చిపోలేక పోతున్నాను. హరితో కలిసి ఉండలేక పోతున్నాను!” వేదాంతిలా
చెప్పింది.
“మనసు కుదిరితే మట్టి కూడా మాణిక్యమై కనిపిస్తుంది రమణి!” అన్నాను.
“అతను మాణిక్యం కన్నా విలువైనవాడు” అంది.
“ఇప్పుడు మట్టిలా కనిపిస్తు న్న మీ బావ కోసం ఒకప్పుడు తపించావు. రేపు మరో మేలిమి వజ్రం నీ వద్దకు వస్తే!”
అనేసరికి,,
“లతా..! ఎలా కనిపిస్తు న్నానే నేను.., ఏదో క్లోజ్‌ఫ్రెండ్ అని నీకు నా బాధ చెప్పుకుంటే అంత చులకనగా
మాట్లా డతావా..?” అంటూ లేచి నిలబడింది.
“రమణి..! నేను నిజంగా నీకు ఫ్రెండ్ అయితే ఈ ఒక్కరోజు నీ కారు వదిలేసి, నాతో ఆటోలో రాగలవా?” అన్నాను
కంప్యూటర్‌ని క్లోజ్ చేస్తూ.
“ఓ! ష్యూర్” అంటూ మొబైల్ బయటికి తీసి, “కార్ తీసుకురావద్దు ..” అని చెప్పింది.
బహుశా కార్ డ్రైవర్‌తో అనుకుంటాను.

పెండ్యాల గాయత్రి (26)


కథలు కనే కళ్ళు

ఇద్దరం ఆఫీస్‌లో నుంచి మౌనంగా బయటకి నడిచాము.


‘వామ్మో! ఏంటి ఈ వింత పోకడలు. ఒకవేళ నేనాశించినట్లు మహిళాధిక్య సమాజమే ఏర్పడితే, మా రాజేష్ బావ మెసేజ్
ఇచ్చినట్టు మగవాళ్ళ పోరాటం మొదలు అవుతుందేమో! ఈ పిల్లను నాతో రమ్మన్నాను గానీ, ఏం చెప్పి దీన్ని ఆలోచనను
మళ్ళించగలను..’ అనుకుంటుండగా మా ఎదురుగా ఆటో వచ్చి ఆగింది.
“గాంధీ రోడ్..” అనగానే ఎక్కమన్నట్టు తలాడించాడు ఆటోడ్రైవర్.
రమణిని ముందు ఎక్కమన్నాను.
“ఏయ్ ఈశ్వరి..! బాగున్నావా?” అంటున్న రమణి మాటలకు ఆ పక్కనున్న వ్యక్తిపై దృష్టి సారించాను.
“రమణీ!” అని నన్ను చూసి, “లతా..!!” ఆమె అనేసరికి పరీక్షగా చూసాను. ఈశ్వరమ్మ., మా క్లా స్మేట్. ఆశ్చర్యానందాల
మధ్య మాట మూగబోయిందేమో దాని చేతుల్ని గట్టిగా పట్టు కున్నాను. దాదాపు పదేళ్లవుతోంది దాన్ని చూసి.
“ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జా మ్స్ అయిపోయి వెళ్లేరోజు మనమందరం మరో ఐదేళ్ల తర్వాత మన కాలేజీ లోనే మళ్లీ
కలుసుకుందాం అనుకున్నాం..” రమణి అంది.
ఇద్దరం తలూపాము. పలకరింపులు, ఆలింగనాలూ అయ్యాయి.
చూడగానే ఆకర్షించే అందం కాదు గాని, ఈశ్వరి కూడా అందంగానే ఉంటుంది. దాని పొడవు జడ కాలేజ్ మొత్తంలో
టాప్. అయితే పాపం ఎంత కష్టపడి చదివినా దానికి అసలు గుర్తుండేది కాదు.
రమణి ఈశ్వరిని కుశలప్రశ్నలు అడుగుతోంది.
ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా వర్క్ చేస్తోందట వాళ్ళ ఊరిలో.
“ఏంటే..! అప్పటికన్నా ఇంకా బక్కగా తయారయ్యావు!” అన్నా మాటలు కలుపుతూ.
అది నవ్వి, “నువ్వు కూడా ఏమీ మారలేదు లతా!” అంది.
“ఇవాళ మన ముగ్గురం భలే చిత్రంగా కలిసాం కదా!” అన్న రమణి మాటలకు స్పందనగా నవ్వి,
“ఈశ్వరీ..! నువ్వు ఎక్కడికి వెళుతున్నావు?” అన్నాను.
“హాస్పిటల్ కి!”
“ఎందుకు?” రమణి నేను ఒకేసారి అన్నాం.
“మా ఆయనకి యాక్సిడెంట్ అయిందట..” తాపీగా చెప్పింది ఏ మాత్రం కంగారులేకుండా.
“అయ్యో..! మేం కూడా వస్తాం పదా చూడ్డా నికి..” అన్నాను.
“రండి వెళదాం!” అని ఈశ్వరి అనగానే, ఆటోలో సర్దు కుని కూర్చుని, అడ్రస్ చెప్పమన్నాను.
ఈశ్వరి చెప్పిన హాస్పిటల్‌కు ఆఘమేఘాల మీద తెచ్చి దింపాడు డ్రైవర్. ముగ్గురము లోపలికి వెళ్ళాం.
దూరం నుంచి ఓ నడివయసు మహిళ ఈశ్వరిని చూసి, సుమారు ఐదేళ్ల వయస్సున్న బాబును వెంటబెట్టు కుని మాకు
దగ్గరగా వచ్చి, “మీ అమ్మ రా..!” అంది బాబుకు ఈశ్వరిని చూపిస్తూ.
ఈశ్వరి చటుక్కున కింద మోకాళ్ళపై కూర్చుని, ఆ అబ్బాయిని చేతుల్లోకి తీసుకుని ఒళ్లంతా తడుముతూ ఉంది,
అప్పుడే పుట్టిన బిడ్డను చూసిన దానిలాగా. దాని కన్నీళ్లతో ఆ పసివాడి ముఖమంతా తడిసిపోయింది.
“నీకు చేసిన అన్యాయానికి ఆ దేవుడు మాకు తగిన శాస్తి చేశాడు. అబ్బాయి కాడికి పోదాం రా అమ్మా!” అందావిడ
కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ.

పెండ్యాల గాయత్రి (27)


కథలు కనే కళ్ళు

అయోమయ స్థితిలో నేను, రమణి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాం.


బాబునెత్తు కుని, “మీరు ఇక్కడ కూర్చోండే.. ఇప్పుడే వస్తా ..” అంటూ ఆవిడ వెంట వెళ్లింది ఈశ్వరి.
ఓ పదినిమిషాలు తర్వాత బాబుతో పాటు మా దగ్గరికి వచ్చి కూర్చుంది.
“ఎలా ఉందే మీ ఆయనకు?” అన్నాను నెమ్మదిగా.
“ఒక కాలు తీసేశారు” అంది.
“అసలేం జరిగింది ఈశ్వరీ?” నేను అడగాలనుకున్నది రమణి అడిగింది.
“చాలా జరిగింది.. నేను ఏడోనెల గర్భవతిగా ఉన్నప్పుడు విపరీతమైన గుండె దడ., ఊపిరి ఆగిపోయినట్లు అనిపించింది.
పరీక్షలన్నీ అయ్యాక గుండెలో రంధ్రం ఉందని., అది ప్రమాదపు అంచున ఉందని చెప్పారు డాక్టర్లు . ‘రోగిష్టిదాన్ని అంటగట్టా రు
ఈమె మాకు అవసరం లేదం’టూ మా అత్తమామలు, మొగుడు అందరూ నన్ను హాస్పిటల్లోనే వదిలేసి వెళ్ళిపోయారు. కాన్పులో
కవలలు పుట్టా రు, పాప బాబు. అది తెలుసుకుని మా అత్త వచ్చి బాబును తీసుకు వెళ్ళింది. బయట ప్రపంచం ఎరుగని మా
అమ్మనాన్న నన్ను వెంటబెట్టు కుని హాస్పిటల్ చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఈ పరిస్థితులకు నిరాదరణకు గురై, నా పాప
బలైపోయింది. డాక్టర్లు నమ్మకం చెప్పకపోయినా నా బతుకుపై నమ్మకం ఉంచి నా తల్లిదండ్రు లు ఆపరేషన్ చేయించారు. అమ్మ
అస్తు ల్ని అరగదీసి రెండేళ్ల తర్వాత మనిషినయ్యా. అప్పుడు వచ్చి కాపురానికి రమ్మన్నాడు మొగుడు. అతని చెంప
వాయకొట్టా లనిపించింది. నేను రానని కరాఖండిగా చెప్పేశాను. కంప్యూటర్ కోర్సు నేర్చుకుని కాంట్రాక్టు ఉద్యోగంలో చేరాను.
మాకెవరికీ తెలియకుండా మరో పెళ్లికి ఏర్పాటు చేసుకుంటూ ఉండగా మా ఆయనకి ఈ యాక్సిడెంట్..” తడి ఆరిన కళ్ళతో
చెప్తోంది ఈశ్వరి.
“ఇట్లాంటి నీచుడి దగ్గరికి మళ్లీ ఎందుకు వచ్చావే? నువ్వు హాయిగా మరో పెళ్లి చేసుకోకుండా” అంది రమణి.
ఈశ్వరి ఓ నిట్టూర్పు విడిచి, “మరో పెళ్లయిన మగాణ్ణి కదంటే చేసుకోవాల్సింది. ఇన్నేళ్ల బంధంలో వీడిలో పుట్టని
మానవత్వం మరొకరి దగ్గర దొరుకుతుందని ఎలా అనుకోవడం...” అని బాబు తలపై చెయ్యి ఉంచి, “కనీసం వీడినయిన మనిషి
లాగా పెంచుతా, నా స్థితి మరో ఆడపిల్లకు రాకుండా!” అంది.
అలా ఆ అమ్మాయి చెప్తుంటే మరో సృష్టి నిర్మాతలా కనిపించింది.
“ఈ అవిటివాడికి నీ జీవితమంతా చాకిరి చేయాలి ఈశ్వరి!” మళ్లీ అంది రమణి.
“చేస్తా నే.. అదేగా ఆడదానికి మగవాడికి ఉన్న తేడా. ఆడది సహనంలో క్షమాగుణంలో ఆదిశక్తి. ఎన్ని జన్మలెత్తినా
మగాడు ఆ శక్తిని అందుకోలేడు..”
ఈశ్వరి మాటలకు, “ఎంత నేర్చుకున్నావే!” బాబుకు తన బ్యాగ్‌లో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ ఇస్తూ అంది రమణి.
“చూడు రమణీ..! ఈ మగవాళ్లు మూసలో పోసిన ద్రవం వంటివారు. అమ్మగా, భార్యగా వాళ్లను సరైన రీతిలో
మలచగల అవసరం అవకాశం మనకే ఉంది..” ఎంత ఉన్నతంగా చెప్తోంది మా ఈశ్వరమ్మ.
‘ఈతరం ఆడవాళ్ళంతా ఇలా ఆలోచించి ఆచరించగలిగితే అమ్మాయిలపై జరిగే అకృత్యాలు అమానుషాలు తర్వాతి
తరంలోనైనా సమసిపోతాయి కదా. అణచివేత లేనప్పుడు ఆధిక్యతతో అవసరమేముంది. మహిళలంతా కోరుకునే నవ
సమాజమదే కదా..’ ఆలోచనలు ఆగాయి.
“ఆల్ ది బెస్ట్ ఈశ్వరీ..! ఇక మేము బయలుదేరుతాము” అంటూ రమణి లేచింది.
నేను కూడా ఈశ్వరికి కరచాలనం ఇచ్చి, బాబుకు టాటా చెప్పి రమణితో బయటకు నడిచాను.

పెండ్యాల గాయత్రి (28)


కథలు కనే కళ్ళు

తను బ్యాగ్ నుండి మొబైల్ తీసి, “హలో బావా..! నువ్వు ఎక్కడున్నావ్? ఇంటికి ఎప్పుడు వస్తు న్నావు.. నేను స్కూల్‌కి
వెళ్లి పిల్లల్ని తీసుకుని వస్తా !” అంటూ మాట్లా డుతోంది.
ఫోన్ పెట్టేసేసరికి దాని కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. అది నాకు కనిపించకుండా ఉండేందుకు బ్యాగ్‌లో ఏదో
వెతుకుతూ ముఖం వంచుకుని, “లతా నేనిక ఇంటికి వెళతానే!” అంది.
దాన్ని ఆటో ఎక్కించేముందు గాఢాలింగనం చేసుకుని, మనసు నిండుగా నవ్వుతూ చెయ్యి ఊపాను.
నేనూ ఇంటికి చేరాను. పత్రికకు పంపించేందుకు పసందైన కథ దొరికిందని లోలోపల మురిసిపోతూ స్నానాదికాలు
ముగించుకుని కథ కాగితంపై పెట్టబోతుండగా ఫోన్ రింగ్ అవుతోంది. మొబైల్ స్క్రీన్‌పై అజయ్ పేరు కనిపించింది. ఇప్పుడు
మాటలు పెట్టు కుంటే కథ రాయడం ఆగిపోతుందని అనుకుంటూనే లిఫ్ట్ చేశాను.
“ఏంటి లతా..! ఇవాళ ఉదయాన్నే ఆధిక్య సమాజం అంటూ ఎస్ఎంఎస్ పెట్టా వు” అంటూ అతను తీగ లాగేసరికి
డొంకంతా కదిలించి, జరిగిందంతా చెప్పక తప్పింది కాదు.
విషయం అంతా విన్నాక, “నువ్వు కాగితంపై పెట్టేందుకే కాదు. ఏకమవుతున్న మన జీవితాలను మలచుకునేందుకు
కూడా మంచికథ..” అన్నాడు అజయ్.
నాకు నోటమాట రాలేదు. అతనే మళ్లీ, “అవును లతా..! నీ స్నేహితురాళ్ళ జీవితాలలో జరిగిన సంఘటనలు మన
జీవితాలలో జరగకుండా చూసుకుందాం! ఒకరి కోసం మరొకరుగా ఉందాం. ఆధిక్యతను పక్కనపెట్టి, సారూప్యత సాధిద్దాం...”
అలా అజయ్ చెప్తుంటే ప్రతి జీవితం ఒక కమ్మని కథే కదా అనిపించింది.

(నవ్యత పేరుతో ఆడపిల్లల లో పెరుగుతున్న వింతపోకడలను ప్రస్తా విస్తూ వ్రాసిన ఈ కథ, 2014 వ సంవత్సరం
ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో ప్రసారమై, 2016 వ సంవత్సరంలో ఆంధ్రభూమి ఎడిషన్లో ప్రచురించబడింది)

పెండ్యాల గాయత్రి (29)


కథలు కనే కళ్ళు

కౌగిలి 
‘పగటిపూట ప్రయాణమంటే, పొద్దు తో యుద్ధం చేసినట్లే,. ఎన్నెన్ని కునికిపాట్లు , తీరికపాట్లు పడాలో.. సెల్‌ఫోన్ సొల్లు తో
సమయం సాగతీద్దా మంటే సిగ్నల్ లేదు, చార్జింగ్ చాలినంత లేదు. ఎవరితోనన్నా మాట కలుపుదామంటే ఫస్ట్‌క్లా స్ ఏ సి రిజర్వేషన్
కావడంతో బెర్త్‌కి ఒక్కరే ఉన్నారు. ఎదురుగా ఉన్న ఇద్దరూ, కునికిపాట్లలో ఉంటే పైబెర్తు మీదనున్న పెద్దా యన పుస్తకాలను
నమిలేస్తు న్నాడు. ఎంతకీ పొద్దు కదలట్లేదు...’ తనలోని అసహనాన్నంతా నిమిషానికోసారి చేతి వాచ్‌పై ప్రదర్శిస్తు న్నాడు సూర్య. 
తలపై ఏదో పడడంతో తటాలున నిలబడబోయి, తలకు ‘టప్’మని పై బెర్త్‌కి బిగించిన ఇనుపబద్దె పొడుచుకున్నాడు. ఆ
దెబ్బకి దిమ్మతిరిగి పోయి అరచేతితో తలని రుద్దు కుంటూ సీటులో చతికిలపడ్డా డు. అప్పుడు కంటబడింది తనని ఓ క్షణం పాటు
వణికించిన వీక్లీ మ్యాగజైన్. ‘ఛ! ఈ చెత్త పుస్తకానికేనా అంత బెదిరిపోయి పుచ్చె పగలగొట్టు కుంది?’ అనుకుంటూ పుస్తకాన్ని బర్త్
కిందకు విసిరి వేయబోయాడు. ‘ఏ చెట్టూ లేనిచోట కుంకుడు చెట్టు కల్పవృక్షం కదా! పలకరింపే కరువైన తనకి ఇప్పుడు ఈ
పుస్తకమే పుష్పక విమానం’ అనుకుంటూ బాసిపట్టు వేసుకొని చదవడానికి ఉపక్రమించాడు.
‘చంటాణ్ణి పట్టించుకోకుండా చెత్త పుస్తకాలు చదివావంటే చూడు’ అని బెదిరించాడు. పాపం చైత్ర  అప్పటినుండి
పుస్తకాలు పట్టినట్లు లేదు. పెళ్ళికి ముందు చెప్పింది కూడా, ‘పుస్తకాలు చదవడమంటే పిచ్చి నాకు’ అని.
తాను మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకం. ఆలోచిస్తూనే ఒక్కోపేజీ తిరగేస్తు న్నాడు. ‘చిత్రం భళారే విచిత్రం,, ప్రముఖ
చిత్రకారుడు సుమన్ స్వీయ అనుభవాలు ఈ వారం నుండి ధారావాహికగా’ అన్న హెడ్డింగ్ చూసి, ‘ఈ సుమన్ ఎవరో గాని తన
అభిమాన ఎన్టీఆర్ పాటతో మొదలెట్టా డు. ఏంటో చదువుదాం..’ అనుకుని కళ్ళను అక్షరాల వెంట నడిపించాడు సూర్య.
***
‘నమస్కారమండీ! నేను మీ సుమన్‌ని. నేను గీచిన వేలాది చిత్రాలను ఆదరించి, అభిమానించిన మీ అందరికీ నా
కృతజ్ఞతలు. చిత్రం ఒక్కటే అయినా దాని వెనక విచిత్రమైన వేలకొద్దీ భావాలు ఉంటాయి. అలాంటి చిత్రరాజాన్ని మీకు పరిచయం
చేస్తూ ఆ చిత్రానికి నాకు గల అనుబంధాన్ని మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను.
కౌగిలి..
కమ్ముకొచ్చే కలల మబ్బులను బంధించే లోగిలి..
కొంటె కోర్కెలను స్వాగతించే వాకిలి..
ఎంత చవిచూచినా తీరని ఆకలి..
కరిగిపోని హాయినందించే జాబిలి..
కౌగిలి అనగానే ప్రతి హృదయంలో పెల్లు బికే భావాల వెల్లు వ ఇది. కానీ ఒకానొక కాలేజీ కౌగిలి..
కులికే కుర్రతనానికి కర్తవ్యాన్ని,
ఉబికే వెర్రితనానికి విద్వత్తు ను,
నిద్రపోతున్న నిజానికి కదలికను,

పెండ్యాల గాయత్రి (30)


కథలు కనే కళ్ళు

నీరుగారిన నైపుణ్యానికి నిబద్ధతను అందించింది అంటే నమ్మగలరా!


నేను ఎంబిఏ చదువుతున్న రోజులవి. నా  బాల్యమిత్రు డయిన చందు కూడా మా కాలేజీ లోనే సీట్ కొట్టా డు. నేను
గీచిన బొమ్మలకు అనుగుణంగా వాడు కథలనల్లేవాడు. ‘అపర బాపు-రమణలురా మీరిద్దరూ’ అంటుండేది మా అమ్మ.
‘చదువు పూర్తయి జాబ్ కొట్టేదాకా నీ కళలకు కాస్త ఖాళీ ఇవ్వండి’ అన్న మా పెద్దల సూచన తు.చ. తప్పక పాటించాలని
అనుకున్నాము.
కొందరు విద్యార్థు ల కొంటెచేష్టల వల్ల కాలేజీలో  క్లా సులు సరిగ్గా జరిగేవి కాదు. వారి వింత చేష్టలతో విసిగి వేసారిన
ప్రొఫెసర్‌ను మేమెంత బ్రతిమాలినా క్లా సులకు వచ్చేవారు కాదు.
ఆ సమయంలో చైత్ర అనే అమ్మాయి కాస్త ఆలస్యంగా కాలేజీలో చేరింది..
***
‘మా ఆవిడ పేరు రాశాడు ఏంటి..?’ అనుకుంటూ ఒక్కక్షణం ఆగిన సూర్య, ‘ఆ పేరు లోకంలో ఇంకెవరికీ ఉండదా
ఏంటి’ అనుకుని మళ్ళీ చదవడం మొదలు పెట్టా డు.
***
క్లా సులు సజావుగా జరగడం లేదని కలత చెందిన చైత్ర ఎంతో పట్టు దలగా ప్రయత్నించడంతో, యాజమాన్యం దిగివచ్చి
ఆచార్యుల తరగతి ఆగమనం జరిగిపోయింది. చైత్ర  అందాన్ని 
చూసో, ఆమె సిన్సియారిటీని చూసో తెలియదు కానీ, అల్లరిమూక క్లా సులకు వచ్చి నిశ్శబ్దంగా కూర్చోవటం
మొదలుపెట్టా రు.
ఒకరోజు ఎందుకో చైత్ర కాలేజీకి రాలేదు. సరిగ్గా క్లా సులు మొదలయ్యే సమయంలో ఇద్దరూ వికలాంగ యువతులు
కాలేజ్‌కి వచ్చి అనాధాశ్రమాన్ని నడుపుతున్నామని, ఎవరైనా సహృదయంతో సహాయం అందించాలని అడుగుతుండగా.. రాజేష్
అనే విద్యార్థి వారిలోని ఒక మహిళ ఊతంగా పెట్టు కున్న చేతికర్రకు కాలు అడ్డం పెట్టడంతో ఆమె కింద పడిపోయింది. కొందరు ఆ
దృశ్యాన్ని చూసి హేళనగా నవ్వి, ‘ముందు నువ్వు  నిలబడటం నేర్చుకోమ్మా! ఆ తరువాత అనాధలను ఉద్ధరిద్దు వుగాని’ అంటూ
వెక్కిరించడంతో వాళ్ళిద్దరూ ఏడుపు అణుచుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు.
అది చూచిన చందు సహనాన్ని కోల్పోయి రాజేష్ చెంప చెళ్ళుమనిపించాడు. కొంతసేపటి ఉద్రిక్తత తరువాత తనవాళ్లను
కంట్రోల్ చేసిన రాజేష్ చందుకి ఒక సవాల్ విసిరాడు. ‘చైత్రను చందు అందరిముందు కౌగిలించుకొని ముద్దు పెట్టు కుంటే,
క్లా సులు సజావుగా జరగనిస్తా మనీ. అంతేకాదు తమ పాకెట్ మనీ అంతా అనాధ పిల్లలకి ఇచ్చేస్తాం.. ఒకవేళ చందు ఓడిపోతే
కాలేజ్ వదిలి వెళ్లిపోవాలి., ఈ పందెం గురించి ప్రొఫెసర్స్ గాని, చైత్రకు గాని తెలియకూడదు..’ అని వివరించాడు. 
రాజేష్ కండిషన్లన్నింటికీ ‘ఓకే’ అన్న చందు ఒక పదిరోజులు టైం అడిగాడు. నేనెంత వారిస్తు న్నా వినలేదు సరికదా,
‘విజయం మనదేరా’ అన్నాడు.
అన్నట్లు గానే విజయం మా చందూదే.
చైత్ర చంద్రికల కౌగిలిని చూసి ముగ్దు డినై ఎంతో మనోహరమైన ఆ దృశ్యాన్ని మనసు నిండా నింపుకొని ఇంటికెళ్లి
అదేరోజు కాగితంపై పెట్టా ను.
చందు ఎలా గెలిచాడు?
చైత్ర ఒప్పుకుందా?
వచ్చేవారం సంచికలో...

పెండ్యాల గాయత్రి (31)


కథలు కనే కళ్ళు

ఈలోపు పక్క పేజీలోని చైత్ర చంద్రికల కౌగిలి చిత్రాన్ని ఆస్వాదించండి మరి!


***
చదవడం పూర్తి చేసిన సూర్యా పేజీ తిప్పి నిర్ఘాంతపోయాడు. కళ్ళు పెద్దవి చేసి పుస్తకం దగ్గరగా పెట్టు కుని మరీ
చూసాడు. పుస్తకాన్ని అటు ఇటు తిప్పి చూశాడు. సందేహం లేదు.. అవును, తన చైత్ర వాడెవడో బాహువుల మధ్య పరవశంగా
నవ్వుతోంది. తానే ప్రాణంగా బతికే తన చైత్ర ఇలా చేస్తుందా? జీర్ణించుకోలేక పోతున్నాడు. వాడి మొఖం కనబడడం లేదు కానీ,
కనిపిస్తే వాడెక్కడున్నాడో కనుక్కొని వాడి పీక పిసికేయాలన్నంత కసి కలిగింది సూర్యకి. ఆ అక్కసునంతా పేపరుపై చూపించాడు.
చిత్రం అర్ధం కానంతగా నలిగిపోయింది. చించేయాలి అనుకున్నాడు కానీ., సాక్ష్యం కావాలిగా అనిపించి ఆగిపోయాడు. ఏదో
ఆలోచన వచ్చిన వాడల్లే పేపరు వెనక్కి తిప్పాడు. ‘ఈ సుమన్ గాడు ఫోన్ నెంబర్ ఇచ్చి చావలేదు’ అని పళ్ళు కొరుక్కుంటూ,
లోలోపల గొణుక్కున్నాడు.
‘కంపెనీ మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని అయినా ఇంటికెళ్లి దాన్ని నిలదీయాలి’ ఆలోచన వచ్చిందే తడవుగా వాటర్ బాటిల్,
మ్యాగజైన్ బ్యాగులో సర్దేశాడు.
“ఏమయ్యో..! చూడ్డా నికి బుద్ధిమంతుడిలా కనిపిస్తు న్నావు, బుక్కు అప్పనంగా దొరికిందని బ్యాగులో దోపేసుకున్నావు” 
పై బెర్త్ పైనున్న వ్యక్తి కిందకి చూస్తూ అన్నాడు.
“కాస్త మర్యాదగా మాట్లా డండి” గొంతు పెంచి అన్నాడు సూర్య.
“ఆయన బుక్కు లోపల పెట్టు కొని బుకాస్తు న్నావ్ ఏమయ్యా..?” ఎదుటి వ్యక్తి కల్పించుకున్నాడు.
“నాకు ఆ బుక్కు కావాలండి” తను చేసిన పని తప్పని తెలిసినా మొండిగా చెప్పాడు.
“నీకు కావాలంటే ఇంకొకటి కొనుక్కోవయ్యా!”
“ఎంతో చెప్పండి డబ్బులు పారేస్తా ..” మాట ముగియనే లేదు,,
పైనున్న వ్యక్తి కిందకి దిగి విసురుగా బ్యాగు లాక్కుని తన పుస్తకం తీసుకున్నాడు. కూపేలో ఎదురు బెర్తు లోని వాళ్లు
నవ్వుకుంటుంటే సిగ్గుతో తలవంచుకొని తన తొందరపాటుకి తనలో తానే తిట్టు కొని, ‘మంచిగా మాట్లా డి ఉంటే అతను బుక్కు
ఇచ్చేసేవాడు కదా.. తన పరువు కూడా దక్కేది. అయినా నేను ఇప్పటికిప్పుడు మీటింగ్ మానేసి  ఇంటికెళ్ళినా ఆ రాక్షసి నిజం
చెప్తుందని గ్యారెంటీ ఏంటి? ఛా! అది చేసిన వెధవ పనికి తానిప్పుడు ఫూల్ అయ్యాడు. ఇకనుంచి ఆ కళంకిత నీడ కూడా
తనమీద, తన పిల్లల మీద పడడానికి వీలు లేదు.. ఎలా..ఎలా! ఆ దరిద్రాన్ని ఇంట్లోంచి ఎలా  తప్పించాలి?’  రైలాగిన కుదుపుకు
తలపుల సంద్రం నుంచి తేరుకొని చుట్టూ చూశాడు. 
తను దిగవలసిన స్టేషన్‌కి రైలు చేరుకుందని అర్థమై హడావిడిగా బ్యాగు తగిలించుకుని కిందకు వంగి షూ కోసం
వెతికాడు. అక్కడ ఒక్కటే ఉంది. చుట్టూ చూశాడు.. ఉహు,, కనపడలేదు. రైలు కదిలే కూత మొదలైంది. 
తాను హడావిడిలో  ఉన్నప్పుడు, ‘మీరు కూర్చోండీ.. ప్రశాంతంగా అన్ని నేను సర్దు తాను కదా!’ అని తన చెయ్యి
తగలకుండా అన్నీ చేసి పెట్టే చైత్ర మాటలు గుర్తొచ్చాయి. ఒక్క బూటు ఏం చేసుకుంటానని  అక్కడే వదిలేసి దిగిపోతుంటే మరో
బూటు దారిలో కనిపించింది. అది చేతిలో పట్టు కుని ఒక్క పరుగున వెనక్కెళ్ళి రెండో బూటు కూడా తీసుకుని 
దిగబోయేటప్పటికి రైలు నెమ్మదిగా కదిలింది. గుండె దడ దడ లాడుతున్నా, దూకినట్లు దిగేసాడు.
ప్లా ట్ ఫాం పై ఎదురుగా ఉన్న రాతి బెంచ్‌పై కూర్చొని, నేలకి రాసుకొని మంట పెడుతున్న అరికాళ్లను కాసేపు
అరిచేతులతో రుద్దు కొని బూట్లు వేసుకున్నాడు. మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. 

పెండ్యాల గాయత్రి (32)


కథలు కనే కళ్ళు

‘బ్యాగ్ అంతా సర్దేసి షూ పాలిష్ చేసా, ట్రైన్ టైం అవుతోంది త్వరగా తెమలండి!’ ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు
చైత్ర అందించిన సహకార చర్యలవి. 
తన అవసరాలు, అలవాట్లు అన్ని చెప్పకుండానే తెలుసుకొని, అన్నీ తానై చేసుకుపోయే చైత్ర అలా చేస్తుందా? ఛ! తన
బాడ్ టైం కాకపోతే ఆ మ్యాగజైన్ తనకే ఎందుకు కనిపించాలి? పుస్తకాలు అసలు చదవని తాను ఎందుకు చదవాలి? చదవక
చదవక చదివితే తన చైత్ర  చిత్రంగా వాడెవడితోనో ఎందుకు కనిపించాలి? అంత పవిత్రమైన నా చైత్ర అలా ఎందుకు చేయాలి? ఆ
చిత్రం చైత్రది కాకుండా పోతే ఎంత బావుంటుంది!  కవ్వించే ఆ కళ్ళు, కట్టిపడేసే ఆ నవ్వు, అమాంతం జుర్రు కోవాలనిపించే ఆ
పెదవులు, చూపు తిప్పుకోనివ్వని ఆ చెక్కిళ్ళు.. అవును అవన్నీ తన చైత్రవే. ‘ఆరబోసిన ఈ అందాలన్నీ అందుకునే
అదృష్టవంతుడివి నేనే’ అంటూ గిలిగింతలు పెడుతుంటే మెలికలు తిరుగుతూ జలపాతంలా నవ్వేసేది. ఆ నవ్వు వెనక ఇంతటి
నజరానా ఉందని తెలియకపోయే! 
ఒకరోజు సినిమా చూస్తూ తనని ఉడికిద్దా మని ‘ఆ హీరోయిన్ అందాలు అదిరాయి కదా’ అన్నాడు.
‘ఆవిడ కన్నా అందంగా యాక్ట్ చెయ్యగలను నేను’ అంది.
అవును మరి.. ఎంత బాగా నటించింది.. నా నమ్మకమనే అవార్డు కొట్టేసి ఇంత కథ నడిపించింది. నెక్స్ట్ వీక్ మ్యాగజైన్
కొంటే ఆ సుమన్ గాడు ఏం రాస్తా డో తెలిసిపోతుందిగా..!’ ఓ ఆలోచన రావడంతో కాస్త రిలీఫ్ వచ్చినట్లు అనిపించింది.
అక్కడినుండి బయటకు వచ్చాడు.
***
లగేజ్ లాడ్జ్‌లో పడేసి, టిఫిన్ చేసి మ్యాగజైన్ ఎక్కడ దొరుకుతుందని అక్కడే హోటల్ లోనే వాకబు చేశాడు. వాళ్లు ఒక
చూపు చూసి అడ్డంగా తలాడించారు. 
వాచ్ చూసుకొని, ‘ఎనిమిదేగా అయ్యింది.. అలా నడుస్తూ వెళితే దొరక్కపోతుందా..’ అనుకొని  వీధుల్లో నడవడం
మొదలులెట్టా డు. తొమ్మిదిన్నర అయ్యింది.. కానీ, ఒక్క పుస్తకాల షాపు కూడా కనిపించలేదు. అలా వెతుకుతూ సిటీలో ఎంత
దూరం వచ్చేసాడో తెలీలేదు. ఇక నడిచే ఓపిక లేక ఆటో ఎక్కి లాడ్జ్ ముందు దిగగానే పుస్తకాల షాపు కంటబడింది. అదేదో
సామెత చెప్పినట్లుంది.. అని నిట్టూరుస్తూ షాపు దగ్గరికి వెళ్లి మ్యాగజైన్ పేరు చెప్పాడు. 
“అవి ఇంతసేపు ఉండవండి.. తెప్పించగానే బిస్కెట్లు మాదిరి అయిపోతాయి..” అన్నాడు షాప్‌వాడు.
“ప్రజలు పుస్తకాలు చదవడం మానేశారు, టెక్నాలజీ వచ్చాక అంటూ గగ్గోలు పెడుతున్నారు కదండీ. అంత ఎగబడి
కొనేవాళ్ళు ఎవరున్నారు?”
“దేనికి అదేనండి!!”
“నాకా పుస్తకం కావాలి తెప్పించగలవా!”
“రెండు రోజులు పడుతుందండి”
“కాస్త ఖర్చయినా సరే, రేపు ఉదయానికల్లా తెప్పించగలవా!”
“ఒక వంద ఇవ్వండి.. మా ఆవిడ కోసం ఉంచిన కాపీ ఇస్తా . అదీ, మీరు అర్జెంట్ అంటున్నారు కాబట్టి!”
‘ఓరి దుర్మార్గుడా! బ్లా క్లో అమ్ముతున్నావా..’ అనుకొని, “కానీ,, నా అవసరం నీ అవకాశం కదా!” అన్నాడు విధిలేక
నవ్వుతూ.
“నా అవకాశమే అయినా మీ అవసరాన్ని తీరుస్తుంది కదండీ!” పుస్తకాన్ని చేతికందిస్తూ అన్నాడు.
‘వీడి వేదాంతం తగలడా..’ అనుకుంటూ పుస్తకం తెరచి, “ఈ కాపీ కాదయ్యా..” 

పెండ్యాల గాయత్రి (33)


కథలు కనే కళ్ళు

సూర్య మాట ముగియకముందే, “ఈ వారం మ్యాగజైన్ అదేనండి!” అన్నాడు.


“అది.. చిత్రం భళారే విచిత్రంలో ‘కౌగిలి’ రెండవ పార్టు ఉండాలయ్య బాబు!”
‘కౌగిళ్లు , కామ క్రీడలు చదువుతా కూర్చుంటే మా కడుపులు నిండవండి! నిలువు కాళ్ళమీద నిలబడి అమ్ముకుంటేనే
అంతంత  మాత్రంగా ఉంది..”
“నిజమే ఎవడి బాధ వాడిది.. ఇదిగో తీసుకో” అంటూ పుస్తకం వెనక్కి ఇస్తు న్న సూర్యను ఎగాదిగా చూసి,
“రిటన్ తీసుకోరు, ఎల్లండి..” అంటూ ముఖం మీదే తలుపేసాడు షాపువాడు.
“వార్ని! వీడికి ఎంతుంది.. ఛ! ఈ చెత్తబుక్కుకి 100 బొక్క..” పైకే అనుకుంటూ రూమ్ కొచ్చి పడుకున్నాడు గానీ, నిద్ర
పట్టడం లేదు.
‘నీకేం సూర్యా! మీ ఆవిడ అందమైనది, తెలివైనది,, ఇంటి విషయాలన్నీ తనే చక్కబెట్టు కుంటుంది కాబట్టి, ప్రశాంతంగా
ఆఫీస్ వర్క్ చేయగలుగుతున్నావు..’ అంటూ తన అదృష్టా నికి అసూయ పడుతున్న కొలీగ్స్ మాటలకు ముసిముసిగా
నవ్వుకున్నాడు కానీ, వాళ్ళెవరైనా ఈ మ్యాగజైన్ చూస్తే,, ఛీ..ఛీ.. ఆ ఊహే ఎంతో భయంకరంగా ఉంది. ఆ ఆందోళనతోనే
రాత్రంతా గడిపేశాడు. 
తరువాతి రోజు మీటింగ్ అయిందనిపించుకొని ఇంటికి బయలుదేరాడు.
***
“డాడీ!!  మరే,, నీకోసమని మమ్మీ గులాబ్ జామ్ చేసింది..” సూర్యకి ఎదురెళ్లి చెప్పాడు చంటాడు.
“ఈ బిస్కెట్లకు ఏం తక్కువ లేదు..” తన అక్కసునంతా గొంతులో చూపించాడు.
చంటాడు “మమ్మీ!” అని గట్టిగా అరుస్తూ లోపలికి పరిగెత్తా డు.
వాణ్ణి ఎత్తు కొని బుజ్జగిస్తూ, “డాడీ!!  నిన్నేమీ అనరు నాన్నా! జర్నీ చేసి వచ్చారు,  నిద్రలేదు కదా పాపం! అందుకే
చిరాకుగా ఉన్నారు..”
చైత్ర మాటలు విని, ‘ఇది తేనె పూసిన కత్తి. నేనెందుకు అంత తొందరగా బయటపడి చెడ్డవాణ్ణి కావాలి.. సాక్షాలు
సేకరించి దీని భాగోతం బయట పెడతా..’ లోలోపలే పళ్ళు నూరసాగాడు. 
“ఏంటండీ..! అలా వాకిట్లోనే నిలబడిపోయారు..”
“చైత్రాదేవి గారు ఆహ్వానించలేదని..,” అంటూ ముఖంపై నవ్వు పులుముకుని లోపలికి వెళ్ళాడు.
“స్నానం చేసిరండి..  టిఫిన్ చేసి  కాసేపు పడుకుందురు గాని..” 
‘టిఫిన్‌లో ఏమైనా కలిపి పెడుతుందో ఏమో!’ అనుకుంటూ స్నానం చేసి పనుందని బయటకు వచ్చేశాడు.
ఊరంతా తిరిగాడు. ఎక్కడ అడిగినా పాత మ్యాగజైన్ దొరకవని చెబుతుండడంతో చేసేది లేక ఇంటిముఖం పట్టిన
సూర్యకి తన కొలీగ్ ఎదురయి మాటలు కలిపాడు.
“నువ్వు ఒక్కరోజు ఆఫీస్‌లో లేకపోతే వారానికి సరిపడా సంఘటనలు జరిగాయి తెలుసా సూర్యా..!” 
“అవునా!”
“రామారావు భార్య ఇల్లొదిలి వెళ్లిపోయిందట..”
“పుట్టింటికా?”
 ”కాదు మరో అత్తింటికి,, ఇక నువ్వు ఊహించగలవు.. ఏం జరిగిందో” అంటూ నవ్వాడతడు. 

పెండ్యాల గాయత్రి (34)


కథలు కనే కళ్ళు

ఆ నవ్వులో నలభై అర్థా లు కనిపించాయి సూర్యకి. ‘రేపోమాపో ఆ జాబితాలో తను ఉండబోతున్నాడా.. ఏమో!’ బాధ,
కోపం, కసి కలగలిసి కల్లోలం సృష్టిస్తుంటే కొలీగ్‌తో మాట్లా డలేక ముందుకు కదిలాడు. కళ్ళు తిరుగుతున్నాయి. కాళ్ళు
తడబడుతున్నాయి పరువు పోయే కన్నా ప్రాణం పోవడం మేలనిపించింది. ఓ మెడికల్ షాప్‌కి వెళ్లి కొన్ని నిద్రమాత్రలు తీసుకొని
ఇంటికి వెళ్ళాడు.
చైత్ర చంటాడికి అన్నం తినిపిస్తోంది. 
“కాసేపు పడుకుంటా..” అంటూ బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన సూర్యాని చూచి, 
“నేను కూడా డాడీ దగ్గరే పడుకుంటా” అంటూ చంటాడు సూర్య వెంట వెళ్ళాడు.
చావబోయే ముందు బిడ్డని ఒక్కసారి తనివితీరా ముద్దు చేయాలనిపించింది. వాడు నిద్రపోయాక మాత్రలు వేసుకుని
పడుకుంటే సరి అనుకున్నాడు. కొడుకును గాఢంగా హత్తు కుని పడుకున్నాడు. వాడితో పాటు సూర్య కూడా నిద్రపోయాడు.
తనకు మెలుకువ వచ్చి టైం చూస్తే నాలుగు దాటింది. పక్కన పడుకున్న పిల్లా డేడబ్బా అనుకుంటూ చుట్టూ చూశాడు. డ్రెస్సింగ్
టేబుల్ దగ్గర కింద కూర్చుని ఏవో పుస్తకాలు తిరగేస్తు న్నాడు వాడు. కొడుకు దగ్గరకెళ్లి బుగ్గమీద ముద్దు పెట్టు కోబోయాడు.
“డాడీ! మమ్మీ ఇదిగో” అంటూ తను రైల్లో చూసిన మేగజైన్‌ని చూపించాడు చంటాడు.
అదిరిపడిన సూర్య చటుక్కున వాడి చేతిలోని పుస్తకాన్ని లాక్కుని చూశాడు.
‘చిత్రం భళారే విచిత్రం కౌగిలి రెండవ భాగం’ అని ఉంది. 
“డాడీ!! ఇక్కడుంది నువ్వు, మమ్మీ కదా!”
అంటున్న వాడి మాటలు అతడి చెవికెక్కలేదు.
అంటే, చైత్ర దొంగచాటుగా ఈ బుక్స్ తెచ్చుకుని చదువుతుందన్నమాట. ఎర్రబడ్డ అతడి కళ్ళు అక్షరాల వెంట పరుగులు
పెడుతున్నాయి.
***
చందు తన విజయాన్ని  కాలేజీకి అంకితమిచ్చాడు. చైత్ర కౌగిలి ఎన్నో విచిత్రాలకు నాంది పలికింది.
ఇక విషయానికి వస్తా ..
పందానికి సై అన్న చందుపై నాకు కోపం నషాళానికి అంటింది వాడి గూబ పగలగొట్టి..,
‘నీకసలు బుద్ధుందారా? తగుదునమ్మా అని నువ్వు వెళ్లి వాటేసుకుంటే తరువాత ఆ పిల్ల గతేం కాను?నీకేంటి
మగరాయుడువి’ ఆవేశంగా అన్నాను.
వాడు చిన్నగా శాంతంగా, ‘ఒరేయ్ సుమన్! నీకు కూడా నేను అర్థం కాలేదా..!’ అన్నాడు.
అప్పుడు నా ఆవేశాన్ని కాస్త అణుచుకొని, ‘ఏం చేద్దా మని’ నసిగాను.
‘పదిరోజుల టైం ఉంది కదా.. చూస్తూ ఉండు, ఏం చేస్తా నో’ ఎంతో  హుందాగా చెప్పాడు.
వాడి మాట మీద నమ్మకం ఉన్నా.. నాలోని ఉత్కంఠ మాత్రం ఉడికిస్తూనే ఉంది. రెండురోజుల తర్వాత ఓ స్క్రిప్ట్
పట్టు కొని వచ్చి నా చేతిలో పెట్టి  చైత్రను పిలుచుకు వచ్చాడు. అది చదివిన నేను వాడిని ఎంతో ప్రేమగా కౌగిలించుకున్నాను.
స్క్రిప్టు చదివిన చైత్ర కూడా చందుని హృదయపూర్వకంగా అభినందించి, ‘ఇంత గొప్ప పాత్ర చేసే అవకాశం నాకు
కల్పించినందుకు చాలా కృతజ్ఞతలు.. చందూ..! ఈరోజు నుంచి రిహార్సల్ మొదలెడదాం’ అంది.

పెండ్యాల గాయత్రి (35)


కథలు కనే కళ్ళు

కాలేజ్ అంతా వెల్కమ్ పార్టీ ఏర్పాట్లలో కళకళలాడుతోంది. సాయంకాలం ఆరుగంటలకల్లా స్టేజ్‌పై అనౌన్స్మెంట్
ఇచ్చారు..,
‘ఇప్పుడు ‘కౌగిలి’ నాటిక ప్రదర్శన చూడబోతున్నారు.
రచన, దర్శకత్వం ‘శ్రీ చందు’ ముఖ్య నటీనటులు ‘శ్రీ చందు’, ‘కుమారి చైత్ర’.
నాటికలో హీరో, హీరోయిన్ల పేర్లు కృష్ణ, సుభద్రలు ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకుంటారు. చాటుమాటుగా
కలుసుకుంటూ ఉంటారు. ఎవరైనా చూస్తే బద్ద శత్రు వుల్లా ప్రవర్తిస్తుంటారు. ఓరోజు సుభద్ర కళ్లు తిరిగి పడిపోతుంది. అంతా ఆమె
చుట్టూ చేరి గర్భవతి అని భ్రమించి హేళన చేస్తుంటారు. అప్పుడు కృష్ణ ఇద్దరు నడి వయసు మహిళలను తీసుకువచ్చి, వారిని
విషయం మాట్లా డమంటాడు.
తమ ఇద్దరి భర్త ఒక్కరే అని,, కృష్ణ, సుభద్రలు తమ పిల్లలని పగ, ప్రతీకారాలతో పిల్లలిద్దరినీ వేరు చేశామని
మాట్లా డుకుంటే చస్తా మని బెదిరించడంతో ఈ అన్నాచెల్లెళ్ళు చాటుమాటుగా మాట్లా డుకుంటున్నారని ఆ మహిళలు చెప్పడంతో
అందరూ ఆశ్చర్యపడతారు.
అడ్డంకి తొలగిన ఆ అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ, అందరి ముందు ఆనందంగా కౌగిలించుకుంటారు. ఆ అనురాగ దృశ్యమే
మీరు చూస్తు న్న ఈ చిత్రం. 
ఓక్షణం తరువాత సుభద్ర అన్న కౌగిలిలో నుంచి జారి పడిపోతుంది. అందరూ కలిసి  హాస్పిటల్‌కి ఆమెను తీసుకు
వెళతారు. ఆమె అత్యంత ప్రమాదకరమైన ‘బ్రెయిన్ కేన్సర్’తో బాధపడుతుందని బహు కొద్దికాలం మాత్రమే బ్రతుకుతుంది డాక్టర్
చెప్తా రు.
అప్పుడు సుభద్ర ప్రేక్షకుల వైపు చూస్తూ..
‘ఈ కృష్ణ మాత్రమే కాదు.. మీరందరూ కూడ నా అన్నయ్యలు నేను మీరంతా అనుకున్నట్లు , బాధపడుతున్నట్లు నేను
చనిపోవటం లేదు. మీ అందరి మనసులో చిరకాలం జీవించే ఉంటాను. మీరంతా బాగా చదువుకుని మంచి జీవితాలు
అందుకుంటే చూసి ఆనందిస్తా ను. దయచేసి ఇంకెప్పుడూ ఏ అమ్మాయిని అపార్థం చేసుకోకండి, అనుమానించకండి,
అవమానించకండి. ప్రేమంటే కేవలం శారీరక వాంఛ కాదు, కాలక్షేప కబుర్లు చెప్పుకోవడం కాదు ..
ప్రేమంటే... సాటి మనిషిని మనిషిగా ఆదరించడం.’ అంటూ సుభద్ర పడిపోతుంటే కృష్ణ పట్టు కుంటాడు. ‘అన్నయ్యా..!
నా అవయవాలు అవసరమైన వారికి దానం చెయ్యి’ అంటూ కృష్ణ కౌగిలిలోనే ఆమె ప్రాణాలు విడుస్తుంది.
సుమారు పన్నెండేళ్ల నాటి ఈ డ్రామా చూసి కంటతడి పెట్టని వాళ్లు లేరు.
‘చైత్ర, చంద్రల కౌగిలి, కాలేజీ రూపురేఖలను మార్చి వేసింది. చెల్లిగా చైత్ర అద్భుత నటన నాటికకు జీవం పోసింది.
చిత్రకారుడిగా నేను, రచయితగా చందు సంఘంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి నేపథ్యం, మీరు చూస్తు న్నది ఆ అపురూప
చిత్ర రాజమే!.
అయితే ఎంబీఏ అయిపోయిన తరువాత మా మానసిక సోదరి చైత్ర ఎక్కడుందో, ఏం చేస్తుందో,, ఇన్నాళ్లు సమాచారం
లేదు కానీ, ఆమె ఎప్పుడూ మా ఇద్దరి మనస్సులో ముద్దు లచెల్లి గానే మిగిలి ఉంటుందనే ఆలోచనతో ఉన్నపుడు ఈమధ్యే తన
ఆచూకీ తెలియడం ముదావహం.
ఇంత గొప్ప జ్ఞాపకాన్ని మీతో పంచుకునే అవకాశాన్ని కల్పించిన పత్రిక యాజమాన్యానికి, చదివి ఆనందిస్తూ, ఆదరిస్తు న్న
పాఠకులందరికీ ధన్యవాదాలతో మీ సుమన్..’ 
***
పెండ్యాల గాయత్రి (36)
కథలు కనే కళ్ళు

ఆ దృశ్యాన్ని చదివిన సూర్య కళ్ళు మేఘాలు అయ్యాయి. పశ్చాత్తా పంతో అతడి నరనరాలు నలిగిపోతున్నాయి. తన
తొందరపాటుతో ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడు తలుచుకుంటేనే సిగ్గుతో కుంచించుకుపోతున్నాడు.
పుస్తకాలు భద్రంగా అల్మారాలో పెట్టి, జేబులో నుంచి నిద్రమాత్రలు తీసి బయటపడేలా విసిరికొట్టా డు.
‘నా చైత్రని క్షమాపణ అడగాలి, కాదు కాదు.. నన్ను శిక్షించమని అడగాలి..’ తనలో తాను అనుకుంటూ మదన
పడుతుండగా చైత్ర రాక వెయ్యి వోల్టు ల శక్తిని ఇచ్చినట్లు అనిపించింది సూర్యకి. వెంటనే ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు.
“మీరు ఎంత మంచివారండి..!”
 కంగారు పడ్డా డతను.
“నేను మిమ్మల్ని సర్ప్రై జ్ చేద్దా మనుకుంటే, మీరే నాకు సర్ప్రై జ్ ఇచ్చారు..”
‘తన అనుమానం  సుగుణాన్ని చంపేసిందని ఆమెకి అర్థమయిందా?!’
“ఏంటండీ మాట్లా డరు!” బుంగమూతి పెట్టింది.
బాధను అణుచుకుంటూ ఆమెకు ప్రేమగా ముద్దిచ్చి, “నువ్వు చెప్తేనే అందంగా ఉంటుంది చైత్రా..!  నీ రాకతో నా
జీవితమంతా నిత్య చైత్రం అయింది కదా!” అన్నాడు నిజాయితీగా.
ఆమె నవ్వుతూ, “సుమన్ అని మా క్లా స్‌మేట్ పేరున్న మంచి చిత్రకారుడు. 3 నెలల క్రితం మా కాలేజీ విషయాలను ఓ
మ్యాగజైన్‌లో స్క్రిప్ట్ రూపంలో రాస్తే అవి చదివి నాటి విషయాలను, నేటి విషయాలను మేళవించి ఒక కథగా రాసి పత్రికకు
పంపించా. ఇవాళ మీ బ్యాగ్ లోని బట్టలన్నీ తీస్తుంటే ఆ పత్రిక కనిపించింది. చూద్దు ను కదా.. నేను రాసి పంపిన కౌగిలి కథకు 
ప్రథమ బహుమతి లభించింది..” అంది ఉత్సాహంగా.
అతడు రెట్టించిన ఉత్సాహంతో ఆమెను మరింత గట్టిగా కౌగిలించుకున్నాడు. ఇద్దరూ ఆ ఆనంద తన్మయత్వంలో
ఉండగా క్లిక్ మని శబ్దం వినిపించడంతో ఉలిక్కిపడి అటు చూసారు చైత్ర, సూర్యలు.
ఆ కమనీయ కౌగిలిని వాళ్ల తొమ్మిదేళ్ల  కూతురు సెల్ ఫోన్‌లో బంధించి చూపించింది...!!

(అనుమానాలు, అపార్థా లు పండంటి జీవితాలను ఛిద్రం చేస్తా యని తెలుపుతూ వ్రాసిన ఈ కథ, 2018 వ సంవత్సరం
ప్రతిలిపి వారు నిర్వహించిన చిత్ర కథల పోటీలో ప్రథమ బహుమతికి ఎంపికయింది)

ఆమె స్వప్నం
“అది సుందర యమునాతీరము.. అది రమణీయ బృందావనము!” అన్నట్లు గా ఓ అందమైన పూల తోట... చూస్తు న్న
తన కన్నులకు బృందావనాన్ని దర్శింపచేస్తోంది.

పెండ్యాల గాయత్రి (37)


కథలు కనే కళ్ళు

కవి వర్ణనలో ఆస్వాదించడం తప్ప ఆ బృందావనాన్ని చూడలేదు తానెప్పుడూ. వందలాది మొక్కలకు విరబూసిన
వేలాది పువ్వులు.. తనను ఆప్యాయంగా ఆహ్వానిస్తు న్నట్లు అనిపించింది. ‘అందమంటే నాదే’ అంటున్న ఈ పూలతోటను పెంచి
పోషిస్తు న్న ప్రేమమూర్తి ఎవరో? సుందరమైన చిట్టడవి లాగా కనిపించే ఈ తోటను నియంత్రించాలంటే ఎంత కృషి చేయవలసి
ఉంటుందో కదా!” అనుకుంటూ లోపలికి నడిచింది తను.
లోపల వనమాలి కాబోలు పసిపాపను తల్లి లాలించి సంరక్షించినట్లు ప్రతిమొక్క తన ప్రాణమన్నట్లు ఎంతో జాగ్రత్తగా
చూసుకుంటూ సంచరిస్తు న్నాడు. కలుపు మొక్కలను శ్రధ్ధగా తొలగిస్తు న్నాడు.. మంచి మొక్కకు ఏ హానీ జరగకుండా గాలికి
ఒరిగిన మొక్కలు నిలవడానికి పుల్లలు కడుతున్నాడు. అదుపు తప్పి పెరిగిన కొమ్మలను సున్నితంగా తొలగిస్తు న్నాడతను. అతడు
ఎంతో శ్రమపడి ప్రతి మొక్కకు నీరు అందిస్తు న్నాడు. తల్లి తన బిడ్డల కొరకు శ్రమ పడినట్లు గా పోసిన నీరు వృధా కాకుండా
జాగ్రత్త పడుతున్నాడు. ఎదుగుదల లేని మొక్కలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తు న్నాడు. ఈ తోటే తన ప్రపంచం అన్నట్లు అతడు
బ్రతుకుతున్నాడు. అతడి నిరంతర కృషి ఫలితంగా తోట స్వర్గధామం అవుతుంది. ఆమె రెండు కళ్ళు చాలడం లేదు ఆ అద్భుత
సౌందర్యాన్ని వీక్షించడానికి.
“స్వప్నా!” అమ్మ పిలుపుతో మెలకువ వచ్చింది ఆమెకు.
ఎదురుగా నిల్చుని ఉన్న అమ్మను, ఇంటిని చూసిన తర్వాత అర్థమైంది స్వప్నకు ఇంతసేపు తాను కల కన్నదని. వచ్చిన
కలను తలచుకుంటూ మంచుకు తడిచిన మల్లెమొగ్గలా వికసించింది బొండుమల్లె లాంటి ఆమె ముఖం.
“పగటి కలలు కంటున్నావా? పగలు నిద్ర పోవద్దని ఎన్నిసార్లు చెప్పాను!” అంది అమ్మ తన స్వరాన్ని పెంచుతూ.
అమ్మ గర్జనతో వర్తమానం లోకి వచ్చింది స్వప్న, తన కల తలపును పక్కనపెట్టి.
“నీకు డిఎస్సీ నుంచి లెటర్ వచ్చింది” చెప్పింది అమ్మ, అదేదో నేరమో ఘోరమో అయినట్లు గా ముఖం పెట్టి.
ఆమెలోని ఉత్సాహం ఉరకలు వేసింది. ఎంతో ఆత్రంగా తెరచి చూసింది. తాను ఉపాధ్యాయురాలిగా ఎంపికయినట్లు ,
తనను కౌన్సిలింగ్‌కు ఆహ్వానిస్తు న్నట్లు ఆ లెటర్ చూసి తెలుసుకుంది. ఆనందంతో ఉప్పొంగిపోయింది తీరాన్ని చేరిన నావలా. తన
కోరిక తీరుతున్నందుకు మనసులోనే భగవంతుడ్ని స్తు తించింది.
తనవాళ్ళు ఎవరూ తన ఆనందంలో పాలు పంచుకోరు. వాళ్లందరికీ తాను టీచర్‌గా స్థిరపడటం ఇష్టం లేదు. ఇప్పుడేమీ
కొత్త కాదు తన బాల్యం నుండి అలవాటై న విషయమే. తాను కోరుకున్నది ఏదైనా తనవాళ్లు హర్షించరు. బహుశా.., అందుకేనేమో
స్వప్నకు అంతగా బాధనిపించలేదు. ఆమె ఎంతగానో ఎదురుచూస్తు న్న రోజు రానే వచ్చింది వర్షించే మేఘంలా.
గడియాపుడి అనే పల్లెటూరిలోని ఉన్నత పాఠశాలలో తెలుగు పండితురాలుగా చేరడానికి వెళ్ళింది స్వప్న. తండ్రి కూడా
ఆమె వెంట వెళ్ళాడు. ఆ ఊరిలో ఓ చిన్న ఇల్లు మాట్లా డి ఇరుగుపొరుగు వారికి స్వప్నను పరిచయం చేసి జాగ్రత్తలు చెప్పి తను
ఇంటికి వెళ్లిపోయాడు.
స్వప్నకు ఆ ఊరివారి పరిచయ పలకరింపులతో ఆ సాయంత్రమంతా చాలా సంతోషంగా గడిచింది. తాను రేపే స్కూల్లో
చేరబోతోంది. అనిర్వచనీయమైన ఆనందం అంతు తెలియని విచారం తనను వెంటాడుతున్నాయి. తన వారెవరు లేకుండా తను
ఇక్కడ ఉండగలదా? తాను ఉపాధ్యాయురాలిగా రాణించగలదా? తన జీవితాశయం నెరవేర్చగలదా.. అనేక ప్రశ్నలు మనస్సులో
మెదులుతున్నాయి.
కోట్ల ఖరీదు చేసే తన బంగళా కన్నా అతి సామాన్యమైన ఈ చిన్న అద్దె ఇల్లు తనకు ఇకపై ఎంతో తృప్తిని కలిగిస్తుంది.
తన వారికన్నా ఇక్కడి వారు ఎంతో అభిమానంగా పలకరిస్తు న్నట్లు గా అనిపిస్తోంది. పక్షి పంజరాన్ని విడిచి తాను కట్టు కున్న గూటికి
చేరినట్లు గా ఉంది. కానీ, తన మనస్సులో తనకే తెలియని ఏదో సందిగ్ధత...

పెండ్యాల గాయత్రి (38)


కథలు కనే కళ్ళు

తరతరాలు కూర్చొని తిన్నా తరగని సంపన్న కుటుంబంలో ముగ్గురు అక్కలకు ముద్దు ల చెల్లిగా జన్మించింది స్వప్న.
వరుసగా ముగ్గురు ఆడపిల్లలతో విసిగిపోయిన అమ్మ నాన్నలకు నిరాశను మిగిల్చింది స్వప్న పుట్టు క. కరువులో వచ్చే
అధికమాసంలా
వంశాంకురం లేకుండా పోయిందనే వారి బాధ స్వప్నపై ప్రేమకు అడ్డు వచ్చింది. తరగని సంపద ఉన్నా సంపాదనే
ధ్యేయంగా బ్రతుకుతాడు స్వప్న తండ్రి.
సాధించగలిగింది ఏమీ లేకపోయినా సంతృప్తికి సాధ్యమైనంత దూరంలో ఉంటుంది స్వప్న తల్లి. అమ్మానాన్నల
మనస్తత్వాలకు అనుగుణంగా పుట్టా రు స్వప్న అక్కయ్యలు. వాళ్ళందరి లోనూ స్వప్న ప్రత్యేకం. ఈమె ఆలోచనలు వారికి గిట్టవు,
వాళ్ళ పద్ధతులు ఈమెకు నచ్చవు. తన పిల్లలు భూమి మీద కాదు అందరికన్నా ఎత్తు గా ఆకాశంలో పెరగాలి అన్నట్లుంటుంది
స్వప్న తల్లి ధోరణి. తినే తిండి, కట్టే బట్ట, చదివే చదువు అన్ని తన ఇష్టప్రకారం జరగాలంటుంది. స్వప్నది అతి సున్నితమైన మనసు.
ఆమెకు స్వతంత్ర భావాలు ఎక్కువ. పసి వయసులోనే తను ఇంట్లో పొందలేని ప్రేమను తరగతిలో పొందాలని ఆశించేది.
స్నేహితులతో ప్రాణంగా మెలిగేది. స్వప్న చదువుతో పాటు ఆటపాటల్లోను చురుకుగా పాల్గొనేది. చాలా బహుమతులు వచ్చాయి
తనకు.
‘పైసాయే పరమాత్మ’ అన్నట్లు గా,, ‘ఇవేం బహుమతులే? చదువు మీద శ్రద్ధపెట్టి లక్షలు సంపాదించి ఉద్యోగం చేయాలి
అనేవాడు నాన్న.
‘విదేశాలు వెళ్లే చదువు చదవాలి’ అంటుండేది అమ్మ.
ఓ స్వాతంత్ర దినోత్సవం నాడు స్వప్న పాట విని ఓ మాస్టా రు, ‘అమ్మాయికి సంగీతం నేర్పిస్తా నండీ.. మంచి గాయని
అవుతుంది’ అంటే ససేమిరా అన్నారు తల్లిదండ్రు లు.
స్వప్న ఉన్నత విద్య విషయంలో పెద్ద వివాదమే జరిగింది. ‘అక్కయ్యలు ముగ్గురు సైన్స్ కోర్సెస్ చదువుతున్నారు.
ప్రపంచమంతా ఇంగ్లీష్ భాష చుట్టూ పరిభ్రమిస్తుంది. నువ్వు తెలుగు చదివి ఎవరిని ఉద్ధరించాలి?’ అంటూ అమ్మ నాన్న స్వప్నపై
మాటల యుద్ధా న్ని ప్రకటించారు.
మౌనమే సమాధానంగా తనకిష్టమైన కోర్సులోనే చేరింది స్వప్న. వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటూ
ధైర్యంగా ముందుకు నడిచింది. తల్లిదండ్రు ల కోరిక ప్రకారం ముగ్గురు అక్కయ్యలకు ప్రవాస భారతీయులతో వివాహాలు జరిగి
విదేశాలు వెళ్లిపోయారు. వారు దూరంగా ఉన్నారన్న బాధ కన్నా కూతుళ్లు ఫారిన్‌లో ఉన్నారన్న సంతోషమే ఎక్కువగా ఉంది స్వప్న
తల్లికి. తాను తన కుటుంబంలో తేలేని మార్పులను చుట్టూ ఉన్న సమాజంలోనైనా తీసుకురాగలగాలి. దీనికి సరైన మార్గం తను
ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడటమేనని స్థిరమైన నిర్ణయం తీసుకుంది. సంకల్పం కార్యరూపం దాల్చి ఇలా గడియపూడి ప్రభుత్వ
పాఠశాలకు వచ్చింది స్వప్న రూపాంతరం చెందిన సీతాకోకచిలుక లాగా స్వేచ్ఛగా..! ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయింది.
తెల్లవారి ఓ శుభముహూర్తా న తన ఉద్యోగ ఉత్తర్వులతో సహా పాఠశాలకు వెళ్ళింది,, పెళ్లిపందిరిలో ప్రవేశిస్తు న్న కన్నెవధువు
లాగా. పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించగానే ఆమె తనువు పులకరించింది. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులను కలిసి అత్యంత
ఉత్సాహంగా ఉద్యోగంలో జాయిన్ అయింది. పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ తెలుగు పండితురాలినీ తీయగా
పలకరించారు. ఎంతో వినయంగా సరస్వతీదేవిని ప్రార్థించి మొదట తొమ్మిదవ తరగతిలో ప్రవేశించింది స్వప్న, చీకటిని తొలగించి
వెలుగును ఆనందించే సూర్యబింబంలా. విద్యార్థు లు అందరూ లేచి నిలబడి ఆమెకు నమస్కరించారు.
చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేసి తనను తాను పరిచయం చేసుకుంది. తొలిసారిగా విద్యార్థు లతో సంభాషిస్తు న్నప్పుడు
జ్ఞాపకం వచ్చింది తన పగటి కల.. ఆశ్చర్యపోయింది., ఆ అందాల బృందావనం లోని పసిమొక్కలే కదా నా విద్యార్థు లు. ఈ

పెండ్యాల గాయత్రి (39)


కథలు కనే కళ్ళు

మొక్కలు అన్నీ చక్కగా పుష్పించాలంటే కృషీవలుడు అయిన ఆ తోటమాలిని ఆదర్శంగా మలచుకోవాలనుకుంటూ ప్రేరణగా
నిలిచిన తన కలకు కృతజ్ఞతలు చెప్పుకుంది.
శిశిర వసంతంలా కాలం కౌగిలిలో ఐదు సంవత్సరాలు కరిగిపోయాయి.
స్వప్నకు మరో ఊరు బదిలీ అయింది. గడియపుడి పాఠశాలలోని ఉపాధ్యాయులంతా కలసి వీడ్కోలు సభ ఏర్పాటు
చేశారు. గ్రామమంతా పాఠశాలకు తరలి వచ్చింది. ఆనందమో విచారమో తెలియని వింత స్థితి. స్వప్నం లోని వనమునందు
వికసించిన పుష్పాలు ఆ వీడ్కోలు సభకు అతిథులు. వేలాది నక్షత్రాల మధ్య చంద్రబింబం వలే ప్రకాశిస్తోంది స్వప్న. ఆ వెలుగు వెనక
ఎన్నో చీకటికోణాలు విస్తరిస్తు న్న కాంతిలో కనిపించకుండా దాక్కుంటున్నాయి.
వందశాతం ఉత్తీర్ణత సాధించిన ఏకైక ప్రభుత్వ పాఠశాల., పదవ తరగతిలో రాష్ట్రంలో ప్రథమ స్థా నం., ఆంధ్ర క్రికెట్ జట్టు కు
ఎంపికైన ఇద్దరు పాఠశాల విద్యార్థు లు., రాష్ట్రస్థా యి నాట్య ప్రదర్శనలో ప్రథమ బహుమతి., ఏఐఆర్ నిర్వహించిన సంగీత పోటీలో
ప్రథమ స్థా నం., జిల్లా నిర్వహించే ప్రతి పోటీలోను ఆ పాఠశాలదే పైచేయి. ఆ గ్రామంలోనే కాదు చుట్టు ప్రక్కల గ్రామాల్లో కూడా
బడి మానేసిన పిల్లలు కనిపించటం లేదు. ఇది గడియపూడి ప్రభుత్వోన్నత పాఠశాల ప్రస్తు త ప్రత్యేకత. ఐదు సంవత్సరాల కాలంలో
అక్కడ రూపుదిద్దు కున్న పరిణామం.
స్వప్న విద్యార్థు లలో ఒక్కొక్కరూ ఒక్కొక్క విజ్ఞానవేత్తవలే తమ గురువును ప్రశంసిస్తు న్నారు. తోటి ఉపాధ్యాయులు,
గ్రామస్తు లు స్వప్న బదిలీపై వ్యతిరేకత వ్యక్తం చేస్తు న్నారు. స్వప్న కళ్ళనిండా కన్నీటి బిందువులు కదులుతున్నాయి. తన పగటికల
పదే పదే జ్ఞాపకం వస్తోంది, వాస్తవచిత్రం లాగా.
‘అందుకేనేమో భారతరత్న ప్రియతమ రాష్ట్రపతి కలాం గారు, “కలలు కనండి సాకారం చేసుకోండి” అంటూ
పిలుపునిచ్చారు,.’ అనుకుంది.
సన్మానం ముగిసిన తర్వాత స్వప్న ప్రసంగిస్తోంది శ్రీకారం చుట్టు కున్న పుస్తకం లాగా., “అందరికీ నమస్కారములు.
అరుదైన అద్భుతమైన ఈ అనుభూతిని హృదయంలో పదిలంగా దాచుకుంటాను. మన పాఠశాల సమిష్టి విజయం సాధించింది.
కలవంటి ఈ విజయం మన అందరిదీ. చీకటి గదిలో వెలిగించిన చిరుదీపం ఆ గదంతా కాంతిని ప్రసరింపజేసేస్తుంది. ఆ దీపం
సాయంతో మరో చీకటి గదిని కాంతిమయం చేయవచ్చును. మనమంతా కలిసి వెలిగించిన ఈ దీపాన్ని ఇలాగే చిరకాలం
వెలిగించుదాము. కావలసిన చమురును అందిద్దా ము.
ఈ వెలుగు దీపాన్ని మరో పాఠశాలలో వెలిగించడానికి వెళుతున్నాను. ప్రతి దీపానికి కిరణాన్నై మిగిలివుండాలని
ఆశిస్తు న్నాను..” అంటూ ముగించింది స్వప్న. కరతాళధ్వనులు ఆకాశాన్నంటుతున్నాయి.
“కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తు లు, వారికొరకే వస్తా రు సూర్యచంద్రు లు” అన్న ఓ కవి మాటలు సార్ధకమైనట్లు
అనిపిస్తోంది అక్కడి వారందరికీ, స్వప్నాన్ని సాకారం చేసిన స్వప్నను చూస్తుంటే.
ఆఖరిగా విద్యార్థు లు కొందరు, ‘దీపంతో దీపం వెలిగించు, తిమిరంతో సమరం సాగించు’ అంటూ సందేశాత్మక
గేయాన్ని ఆలపిస్తు న్నారు...
ఎన్నిసార్లు విన్నా తనివితీరని ఆ శ్రవ్యగీతాన్ని ఆలకిస్తూ వేదిక దిగుతున్న స్వప్నకు మరో స్వప్నం లాంటి సత్యం
కనులముందు మెరిసింది.. విస్తు పోయీ, విచిత్రంగా చూస్తూ నిలబడిపోయిందామె.
“అవునన్నా! వెలుగు లేని హృదయానికి ఉదయం కనపడదు”
“భయపడితే బ్రతుకులోని నాదం వినపడదు”

పెండ్యాల గాయత్రి (40)


కథలు కనే కళ్ళు

పిల్లలు పాడుతున్న పాటలోని మాటలు ఉచ్చరిస్తూ తనదరికి వస్తు న్న తన తల్లిదండ్రు లను, తోబుట్టు వులను చూస్తూ
పరమానంద భరితురాలయింది స్వప్న.....!!!

(నిబద్ధత కలిగిన వ్యక్తు లు వృత్తికెలా అంకితమవుతారో తెలపాలని వ్రాసిన ఈ కథ, 2008 వ సంవత్సరం విజయవాడ
ఆకాశవాణి యువవాణి లో ప్రసారమయింది)

పినాకిని
“ఎంత అందంగా నిర్మించినా భూమిక సక్రమంగా ఉంటేనే సౌధం పదికాలాలపాటు నిలిచి ఉంటుంది. మంచి విత్తనాన్ని
ఎంపిక చేసి నాటినా కూడా తగినన్ని పోషకపదార్థా లు అందితేనే వృక్షం చక్కగా ఫలిస్తుంది. పిండి కొద్ది రొట్టె అన్నారు కదా! మనిషి
జీవితం కూడా అంతే! బాల్యంలో హక్కులన్నీ బాధ్యతగా అనుభవిస్తే భవిష్యత్తు బంగారంలా ఉంటుంది”
గడియారం తన బాధ్యతను మర్చిపోకుండా ట్రింగ్ అంటూ ఒంటిగంట సమయాన్ని సూచించింది. ఆసక్తిగా రేడియోలో
ప్రసంగం వింటున్న నాకు ప్రస్తు త కర్తవ్యం జ్ఞప్తికి వచ్చింది. వెంటనే రేడియో ఆఫ్ చేసి బట్టల బ్యాగ్ తగిలించుకుని గదికి తాళం వేసి
దగ్గరే ఉన్న రైల్వేస్టేషన్‌కు బయలుదేరాను. అక్కడికి వెళ్లేసరికి ట్రైన్ కదలడానికి సిద్ధంగా ఉంది. పదిరోజుల కింద బుక్ చేసుకున్న
టికెట్ బయటకు తీసి నెంబర్ చూసి సీట్ వెతుక్కుని కూర్చున్నాను. ప్రయాణమంటే చాలు ఎక్కిన దగ్గరనుండి దిగేదాకా
కుంభకర్ణుడి మాదిరి నిద్రపోతాను. ఈరోజు ఆ అవకాశం లేదు. పైగా ఇది సీటు ప్రయాణం. ‘ఇవాళ కిటికీ దగ్గర కూర్చుని
పరిసరాలను గమనించాల్సిందే..’ అనుకుంటుండగా, కడలిని చేరడానికి పరుగులు తీసే నదిలా ట్రైన్ కదిలింది.
చిరుగాలి సుడిగాలిలా మారి ముఖాన్ని తాకుతోంది రైలు వేగాన్ని తెలియజేస్తు న్నట్లు గా. ఆలోచనలు వేగం
పుంజుకోవడంతో మనస్సు రైలు వేగాన్ని మించి పరిగెడుతోంది. మాష్టా రుని చూసి ఆరు నెలలయింది. ఆయనతో ఫోన్లో మాట్లా డి
కూడా పదిరోజులు అయిపోయింది. నాకు ఉద్యోగం వచ్చిందని, నెలకు 50, 000 సంపాదిస్తు న్నారని తెలిసి ఆయన ఎంత
ఆనందంగా ఉన్నారో మాటల్లో చెప్పలేను. సంతృప్తితో నిండిన ఆయన దివ్య వదనాన్ని కనులారా చూసి తరించాలని ఉంది. నేను

పెండ్యాల గాయత్రి (41)


కథలు కనే కళ్ళు

వస్తు న్నానని ముందే చెప్పకుండా వారి ముందు ప్రత్యక్షమైతే మాష్టా రు దంపతుల ఆనందాశ్చర్యాలకు అవధులు ఉండవు. ఆ
అద్భుత ఘడియల కోసం మనస్సు ఉవ్విళ్లూరుతోంది. ఈ రైలు ఒంగోలు ఎప్పుడు చేరుకుంటుందో ఏమో! పొంగే నదిలా
పరిగెడుతున్న రైలు వేగానికి, నా ఆలోచనల వేగానికి ఆనకట్ట కట్టినట్లు ఓ స్టేషన్ వచ్చింది.
కొంతమంది దిగడం, మరింతమంది ఎక్కడం జరిగింది. మరలా రైలు కదిలేటప్పుడు చూశాను, ఆ ఆగింది తడ స్టేషన్
అని. ‘అంటే, చెన్నై సిటీ మొత్తం దాటి వచ్చేసామన్నమాట. అబ్బా! ఇంక ఎన్ని గంటలు కూర్చోవాలో,,’ అనుకుంటుండగా కాలికి
ఏదో తగిలింది.
అప్రయత్నంగానే క్రిందికి చూశాను. ఓ పసిపాప రైలుపెట్టె శుభ్రం చేస్తు న్నట్లుంది, చేతిలో మురికిపట్టి నల్లగా మారిన
పాతబట్ట ఉంది. అదేమి చిత్రమో గానీ, జనాలకు ఇంట్లో ఉన్నప్పటికన్నా ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు ఏదో ఒకటి తినాలని
అనిపిస్తుంది. తినగా మిగిలిన చెత్త అక్కడే పడేస్తా రు. అలా వచ్చిన చెత్తనే తీసివేస్తుంది ఆ పాప. సుమారు ఏడు సంవత్సరాల
వయస్సు ఉంటుంది. మాసి చినిగి ఉన్న దుస్తు లు బక్కచిక్కిన దేహం, ఆమె అనాధ అని చెప్పకనే చెబుతున్నాయి. కాళ్లు పక్కకు
తీస్తే ఇక్కడ కూడా శుభ్రం చేస్తా నన్నట్టు సైగ చేస్తోంది.
సుమారు మాష్టా రు వయస్సులో ఉన్న వ్యక్తి ఆ పాప వైపు చూస్తూ, “నువ్వు ఇంత చిన్న వయసులోనే ఈ పని ఎందుకు
చేస్తు న్నావ్? మీవాళ్ళు ఏం చేస్తూంటారు? మీదే ఊరు?” అంటూ ప్రశ్నించాడు.
“నాకెవరూ లేరయ్యా..! మీలాటోరు ఏమన్నా పెడుతుంటారని ఈ రైలు సుబ్రం చేస్తుంటాను” అని పాప చెప్పిన
సమాధానంతో సంతృప్తి చెందని ఆయన,
“మీ అమ్మానాన్న ఏమయ్యారు?” కొంచెం విసుగ్గా ప్రశ్నించాడు.
ఆ పాప కనురెప్పలు ఆర్పుతూ ముఖం చిన్నది చేసుకుని, “సచ్చి పోయినారు” అంది.
ఆమాట విని నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
“మరి నువ్వు ఒక్కదానివే బ్రతుకుతున్నావా?” మరలా ఆ వ్యక్తి ప్రశ్నించాడు.
“కాదయ్యా..! మా సెల్లి ఉండాది, అది కూడా ఈ పనే సేత్తుంటాది. మా ఇద్దరికీ ఈ పినాకినే ఇల్లు . ఈ బండి లోనే
ఆడుకుంటాం, ఈడనే తింటాం, ఉంటాం, ఈ రైల్ ఎటుపోతే అదే మా ఊరు..”
రెండు మాటల్లో తమ జీవిత పుస్తకాన్ని పరిచింది ఆ పాప.
“అయితే నీకు భయం, బాధ ఉండదా?” అడిగాడు ఆ వ్యక్తి.
“బాదెందుకు అయ్యగారు?! మీవంటి మంచోళ్ళు ఎవరో ఒకళ్ళు డబ్బులు ఇస్తుంటారుగా. వాటితో కొనుక్కుని కడుపు
నింపుకుంటాం..” నవ్వు ముఖంతో చెప్పింది ఆ పాప.
ఆ వ్యక్తి ఏమనుకున్నాడో మరి తన జేబులో నుంచి పదిరూపాయలు తీసి ఆ పాపకిచ్చాడు. అప్పటివరకు నాకు ఆ
ఆలోచన కూడా రాలేదు. వెంటనే అతడిని అనుసరించాను.
నా మనస్తత్వం నాకే విచిత్రంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కొత్తవారితో కలుపుగోలుగా మాట్లా డలేను, జరిగే
సంఘటనలకు త్వరగా స్పందించను. అభిమానించే గుణం తక్కువ, అలాగని ఇష్టపడే వారికి మాత్రం దూరంగా ఉండలేను.
మంచిని ఆస్వాదిస్తా ను కానీ, చొరవగా మంచి పనులు చేయలేను. అంటే నాకు లభించిన స్వేచ్ఛను పూర్తిగా వినియోగించుకోలేక
పోతున్నాన్నమాట.

పెండ్యాల గాయత్రి (42)


కథలు కనే కళ్ళు

‘తప్పు చేస్తు న్నానని అనిపించినప్పుడు దానిని సరిదిద్దు కోవడానికి ప్రయత్నించాలి’ అని చెబుతుంటారు మాష్టా రు.
ముత్యాల్లాంటి మాటలు చెప్పే మాష్టా ర్ని మరి కొద్దిసేపటిలో కలవబోతున్నాను. వెలుగునీడల లాంటి నా బాల్యాన్ని జ్ఞప్తికి తెస్తూ
ప్రియమైన నా ఊరు రానే వచ్చింది.
***
ఆత్రంతో కూడిన ఆనందంతో ఇంటికి వెళ్లి తలుపు కొట్టా ను.
దేవతామూర్తి దేవాలయం తలుపు తెరచినట్లు , టీచరుగారు తలుపు తెరచి వికసించిన వదనంతో, “వేణు ఎలా
ఉన్నావురా? ఇప్పుడేనా రావటం? వచ్చే ముందుగా ఫోన్ చేసుంటే మీ మాష్టా రు స్టేషన్ దగ్గరకు వచ్చేవారు కదా!” అంటూ ప్రశ్నల
వర్షంతో నన్ను తడిపేసారు.
“మిమ్మల్ని ఆశ్చర్యపరచాలని ఇలా వచ్చేసాను టీచర్” అంటూ లోపలికి నడిచాను.
కుశల ప్రశ్నలయ్యాక భోజనం పెడతానంటున్న టీచర్‌తో, “మాస్టా రు ఎక్కడ టీచర్?” అని ప్రశ్నించాను.
“కొద్దిసేపటి క్రితమే ఊరెళ్ళారు. నువ్వు వస్తా వన్న విషయం ఆయనకు తెలియదు కదా!” టీచర్ చెప్పడంతో మనస్సు
చివుక్కుమంది. “రేపు సాయంత్రానికి వచ్చేస్తా రు వేణూ..” మళ్ళీ అంది టీచర్.
“నా మొదటి జీతం వచ్చింది. మాష్టా రు కోసం తీసుకువచ్చాను. నాకు ఈ లోకంలో మీరు తప్ప ఎవరున్నారు టీచర్..”
చెమ్మగిల్లిన కళ్లతో అన్నాను.
టీచర్ నా తలపై చేయి ఉంచి, “పిచ్చివాడా..! మీ మాష్టా రు మనసు నీకు పూర్తిగా అర్థం కాలేదు. నిన్ను చదివించి
ఇంతవాడిని చేసింది నీ జీతం కోసం కాదు. నీకు విలువైన జీవితాన్ని అందించాలని. నీవు మరికొందరికి జీవితం ఇవ్వాలని. ప్రతినెలా
మా జీతం నుంచి అయిదు శాతం పొదుపు చేసి నీ చదువు కోసం వినియోగించాం. మా ప్రయత్నం వృధా కాకుండా నీవు మంచి
ప్రయోజకుడయ్యావు. ఇక నీకోసం ఖర్చు చేయవలసిన అవసరం లేదు. అందుకే మీ మాష్టా రు మరో బాబును స్కూల్లో
చేర్పించడానికి వెళ్లా రు. నిన్ను ఎప్పుడూ పరాయివాడిగా భావించలేదు వేణూ. నువ్వు మా పెద్దబిడ్డవు. నువ్వు ఎక్కడున్నా
మాతోనే ఉన్నట్లు , మా దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయి..” కన్నతల్లి కన్నా మిన్నగా మాట్లా డుతున్న టీచర్ పాదాలను నా
కన్నీటితో కడిగాను.
నేను చేసిన తప్పేమిటో బోధపడింది. ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటే గాని మనశ్శాంతి లభించదు. తిని పడుకున్నా
కూడా నిద్ర రావడం లేదు. కథ లాంటి నా జీవితం సినిమారీల్‌లాగ కనుల ముందు కదులుతోంది.
రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబంలో మొదటి బిడ్డగా జన్మించాను. నాకు ఆరు సంవత్సరాలు రాగానే
అమ్మానాన్న దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. నేను రెండవ తరగతి చదివేటప్పుడు చెల్లి పుట్టింది. మూడవ తరగతిలో
వెంకటరావు మాష్టా రు పరిచయమయ్యారు. చెప్పిన విషయాన్ని కష్టపడి నేర్చుకుంటానని అల్లరి చేయనని ఆయన నాపై ప్రత్యేక
అభిమానాన్ని చూపించేవారు. ఒక్కోరోజు ఇంటిలో తినడానికి ఏమీ ఉండేది కాదు. ఆవేళ బడికి వెళ్ళలేక పోయేవాడిని. బడి
ఎగ్గొడితే మాష్టా రుకు కోపం వచ్చేది. ఒకనాడు నిర్మాణంలో ఉన్న భవనం కూలి 10 మంది కూలీలు చనిపోయారు. వారిలో
అమ్మానాన్న, వారితోనే ఉన్న చెల్లి ఉన్నారు. సర్వం కోల్పోయి అనాధ అయిన నన్ను ఓదార్చే వారే లేక పోయారు. నన్ను తీసుకు
వెళ్లేందుకు అమ్మ తరపు వాళ్ళు, నాన్న తరపు వాళ్ళు వాదులాడుకోసాగారు. పరిస్థితిని గమనించిన ఎవరినీ సంప్రదించకుండా
వెంకటరావు మాష్టా రు నన్ను వాళ్ళింటికి తీసుకువెళ్లా రు. ఇక ఏ బంధువులూ నా గురించి ఆలోచించలేదు.
అప్పుడు మాష్టా రు గారికి మా చెల్లి వయస్సున్న ఓ పాప ఉంది. టీచర్ గారు గర్భవతి. ఆమె కూడా మా స్కూల్‌లోనే
పని చేస్తా రు. వాళ్ళిద్దరూ నన్ను తమ పుత్రు నిగా దత్తత తీసుకునేటట్లు పాఠశాలలో ప్రకటించారు. తరువాత ఓ సంక్షేమ హాస్టల్‌లో

పెండ్యాల గాయత్రి (43)


కథలు కనే కళ్ళు

చేర్పించి చదివించసాగారు. మాష్టా రు ప్రతివారం నన్ను చూసేందుకు వచ్చేవారు. ఉత్తరాలు రాస్తుండమని చెప్పేవారు. ఆయన
ఆకాంక్షకు అనుగుణంగా అన్ని తరగతుల్లో మంచి మార్కులు తెచ్చుకున్నాను. ఇంజనీరింగ్ పూర్తిచేసి ఒక నెల క్రితమే చెన్నైలో
ఉద్యోగంలో చేరాను. అయితే మాష్టా రు ఆశయం ఏమిటో ఈరోజే తెలుసుకున్నాను.
తెల్లవారితే 8 గంటలకు పినాకిని ఉంది. ఆ రైలే ఇల్లు గా నివసిస్తు న్న పాపను వెతికి పట్టు కోవాలి. మాస్టా రు నాపై ఉంచిన
బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. అప్పుడే ఆయనకు నా ముఖం చూపిస్తా ను.
***
పినాకిని ఎక్కాను.
పాప కోసం ప్రతి బోగీ గాలించాను. రైలు చెన్నై చేరుకుంది కానీ, పాప జాడ కనిపించలేదు. తిరిగి అదే ట్రైన్లో వెనక్కి
బయలుదేరాను. వెదకడంలో బాగా విసిగిపోవడం వల్ల అలసిపోయి, ఎప్పుడు నిద్రపోయానో ఏమో మెలుకువ వచ్చేసరికి
విజయవాడలో ఉన్నాను. రాత్రి 10 గంటల 30 నిమిషాలు అయింది. రాత్రంతా రైలు ఇక్కడే విశ్రమించి తెల్లవారి ఆరుగంటలకు
తిరిగి చెన్నై బయలుదేరుతుంది.
తినేందుకు ఏమైనా కొందామని రైలు దిగి స్టేషన్ బయటకి నడిచాను. బాగా పొద్దు పోవడంతో ఎవరి దారిన వారు
హడావిడిగా వెళ్ళిపోతున్నారు. రైలు ఎక్కింది మొదలు, ఎక్కడ ఉన్నా చుట్టూ పరిసరాలు తీవ్రంగా గాలిస్తు న్న నాకు, స్టేషన్
ముందు వైపు ఆవరణలో ఓ మూలన ఇద్దరు ఆడపిల్లలు పడుకొని కనిపించారు. నా కాళ్లు ఆత్రు తగా ఆ వైపుకు నడిచాయి. నా
ఆనందం కట్టలు తెంచుకుంది. నిన్నటి రోజున పినాకినిలో కనిపించింది ఈ పాపే.
దగ్గర కూర్చొని నెమ్మదిగా, “పాపా” అని పిలిచాను.
“ఊఁ” చిన్నగా పలికింది.
మరలా పిలిచాను. నెమ్మదిగా లేచి కూర్చుని ప్రశ్నార్థకంగా నావైపు చూసింది.
“పినాకిని నీ ఇల్లు అని చెప్పావు కదా! మరి ఇక్కడున్నావేమ్మా?” అన్నాను అనునయంగా.
“నిన్న రేతిరి బండి దిగినప్పటి నుంచి మా చెల్లికి జ్వరం వచ్చినాది, లేవలేకుండా పడుంది” కళ్ళు నలుపుకుంటూ
దిగులుగా చెప్పింది.
ఆ పక్కనే పడుకునున్న పాప ఈమె చెల్లెలు కాబోలు. బాగా వణుకుతుంది, జ్వరం ఎక్కువగా ఉన్నట్లుంది. ఒళ్ళు
కాలిపోతోంది. అక్కడున్న వారి సాయం తీసుకుని ఓ మాత్ర తెచ్చి వేశాను. ఆకలికి వారికి ఏదో తినిపించి, నేను కూడా తిన్నాను.
కొద్దిసేపటి తరువాత పాప తల నిమురుతూ పేరేమిటని అడిగాను.
“నా పేరు మల్లి, మా చెల్లి పేరు కమల” అంది.
“మీ పేర్లు చాలా బాగున్నాయి” అన్నాను.
“మాయమ్మ, అయ్య పెట్టిన పేర్లు గుర్తు లేవు సార్.. నాకు మల్లెపూలు అంటే ఇష్టం. మా చెల్లికి కమలాకాయలు అంటే
ఇష్టం. అందుకే మా పేర్లు మేమే పెట్టు కున్నాం..” నవ్వుతూ చెప్పింది.
“సార్ అనొద్దు , అన్నయ్య అను. మరి మీ ఇద్దరినీ బడిలో చేర్పిస్తా ను, చదువుకుంటారా?” మల్లి కళ్ళలోకి చూస్తూ
అడిగాను.
“ఎందుకు?” కొంచెం ఆందోళనగా ముఖం పెట్టింది.
“మీ పినాకిని‌లో టికెట్ కలెక్టరుని చూసావు కదా., చదువుకుంటే అలాంటి ఉద్యోగం చేయవచ్చు..” ప్రేమగా చెప్పాను.

పెండ్యాల గాయత్రి (44)


కథలు కనే కళ్ళు

“అవునా..! అయితే మేమిద్దరం చదువుకుంటాం అయ్యగారు. మీతో వత్తాం..” కూర్చున్నచోటు నుంచి లేచి నిలబడి
అంది, ఆకాశానికి ఎగిరినంత సంతోషంగా.
చీకటి కోణాలు తొలగి వెలుగురేఖలు ప్రసరిస్తు న్న శుభోదయాన, మల్లీ, కమలలను వెంటబెట్టు కుని మరలా పినాకిని
ఎక్కాను.
రైలు తడబడుతున్న అడుగులతో నడక ప్రారంభించి, పరుగు లంకించుకుంది. కపటం తెలియని పసివాళ్ళ నుంచి,
కాటికి పోయే వృద్ధు ల వరకు భేదం చూపక తనలో అందరిని ఇముడ్చుకుంటుంది. మధ్యలో మజిలీలు చేస్తూ ఆకలిదప్పులు
తీరుస్తుంది. తనను తాను మరచిపోయి తన వారిని సురక్షితంగా గమ్యం చేరుస్తుంది. మరచిపోలేని మధుర జ్ఞాపకాలను మనస్సు
లోతుల్లో నిలుపుతుంది. పండంటి జీవితం అందించే జీవనది అయిన ఈ పినాకిని పడిలేస్తూ శాశ్వతంగా ఇలా ప్రయాణిస్తూనే
ఉంటుంది, ఆటంకాలను అధిగమిస్తూ సాగిపోతున్న సృష్టిలాగా.

(ఆపన్న హస్తా న్నందుకుని, జీవితంలో ఎదిగిన అనాథలు ఎలా ఆలోచిస్తే బాగుంటుంది... అనే ఆలోచనలోంచి వచ్చిన ఈ
కథ, 2009 వ సంవత్సరం ఆకాశవాణి విజయవాడలో ప్రసారమై.. 2012 లో ఆంధ్రభూమి పత్రికలో ప్రచురించబడింది)

వంది మాగధులు
“ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నా లేకున్నా... ప్రతి స్త్రీ విషాదం వెనుక ఒక పురుషుడు ఖచ్చితంగా
ఉంటాడు...”
నిజాముద్దీన్ ఎక్స్ప్రె స్ ఏసీ బోగీలో జనరద్దీ రహిత సుఖప్రయాణం చేస్తూ, మొబైల్‌లో వాట్సాప్ చూస్తూ కూర్చున్నాడు
హేమేంద్ర. పై సందేశం చూడగానే ఉద్వేగభరితుడై ఫోన్ పక్కన పెట్టి, తన బ్యాగులో ఉన్న ఆహ్వానపత్రిక బయటకు తీసి, తడినిండిన
కళ్ళతో మరొకసారి చదవసాగాడు. అలా ఆ పత్రిక తనకు అందినప్పటి నుండి ఎన్నిసార్లు చదువుకున్నాడో, ఆ పత్రిక తాలూకు
స్మృతులను ఇంకెన్నిసార్లు నెమరు వేసుకున్నాడో అతడే చెప్పలేడు.
“కేంద్ర ప్రభుత్వ సాంస్కృతికశాఖ ప్రతి ఏడాదీ ప్రతిష్ఠా త్మకంగా నిర్వహించే జాతీయస్థా యి చిత్రలేఖనం పోటీలలో ఈ
ఏడాదికి గాను ప్రథమస్థా నంలో నిలిచి, అక్షరాలా లక్షరూపాయల నగదు పురస్కారం అందుకోబోతున్న యువ చిత్రకారుడు శ్రీ
హేమేంద్ర గారిని ప్రయాణాది సౌకర్యాలతో సహా సాదరంగా, సగౌరవంగా దేశ రాజధాని నగరానికి ఆహ్వానిస్తు న్నాము..”
***
నిరుపేద కుటుంబంలో పుట్టి, పని చేసుకుంటూనే డిగ్రీదాకా చదువుకున్నాడు హేమేంద్ర. చిన్న అవసరం కూడా తీర్చలేని
చిత్రకళను ప్రాణప్రదంగా ప్రేమిస్తూ పెరిగిన అతడు ఉద్యోగాల వేటలో బయల్దేరాడు. విజయవాడ వెళ్ళేందుకని ఒంగోలు స్టేషన్‌కు
వెళ్ళి పినాకిని ఎక్స్ప్రె స్ ఎక్కాడు.
సీట్లలో కూర్చున్న వారికన్నా నిలుచున్నవారు రెండింతలు ఉండటం జనరల్ భోగి సహజ లక్షణాన్ని తేటతెల్లం చేస్తోంది.
తిరుణాళ్ళను తలపిస్తు న్న జనం మధ్య నుండి వెళ్ళి ఒక సీటు వద్ద నిలుచున్నాడు హేమేంద్ర.

పెండ్యాల గాయత్రి (45)


కథలు కనే కళ్ళు

ఒక బక్కపలచటి పెద్దా విడ ముందుకు జరిగి కాస్త జాగా చూపించి, “కూర్చోబ్బాయ్!” అనడంతో
మొహమాటపడుతూనే ఒక పక్కగా ఒదిగి కూర్చున్నాడు.
సహజంగా ఏకాంత ప్రియుడు, ప్రకృతి ప్రేమికుడు అయిన అతడు గడబిడగా మాట్లా డుకుంటున్న జనాన్ని
పట్టించుకోకుండా వెనక్కి పరుగెడుతున్న పరిసరాలను పరికిస్తు న్నాడు. అతడు కూర్చొని ఐదునిమిషాలైనా కాకముందే చోటిచ్చిన
అవ్వ కునుకుపాట్లు పడుతూ హేమేంద్ర భుజాన్ని ఆక్రమించేసింది. లేచి నిలుచుందామని అనుకున్నాడు కానీ, ఆవిడ
పడిపోతుందేమో అనిపించి, అలాగే కదలకుండా కూర్చున్నాడు.
‘బోగీలో ఏ సీటును చూసినా ముగ్గురు కూర్చోవలసిన చోట ఐదుగురు కూర్చున్నారు. ‘పేద, మధ్యతరగతి
ప్రయాణికులకు ఈ ఇరుకుపాట్లు , కాలిపోట్లు తప్పేదెప్పుడో? రిజర్వేషన్లు తొలిగించిన రైళ్ళు, ప్రతిభను బ్రతికించే ఉద్యోగాలు
దేశంలో అందుబాటులోకి వచ్చేదెన్నడో?’ అని ఆలోచిస్తు న్నాడు హేమేంద్ర. ఎదురు సీటు నుండి నెలల పసికందు ఏడుపు
వినిపించడంతో ఆవైపు దృష్టిని మరల్చాడు.
సుమారు ఇరవై ఏళ్ళ వయసున్న ఒక సన్నని అమ్మాయి ఒడిలోని బిడ్డ గుక్కపెట్టి ఏడుస్తు న్నాడు. బిడ్డను
సముదాయించడానికి తన చేతులు సైతం కదపలేనంత ఇరుకులో కూర్చుని ఉన్న ఆమె., అతి కష్టంమీద ముందుకు జరిగి,
బిడ్డను పైకీ కిందకీ ఊపుతోంది. జోలపాడుతున్నట్లు ఏవేవో శబ్దా లు చేస్తోంది. ముద్దు లాడుతోంది. రాని నవ్వును తెచ్చుకుని మరీ
నవ్వుతోంది. పెదవులను సున్నాలాగా చుట్టి, నాలుకను నాలుగు దిక్కులకూ తిప్పి, బుగ్గలను బూరెల్లా ఉబ్బించి, కళ్ళను కాళికలా
కదుపుతూ, తలను తోలు బొమ్మల్లే ఊపుతూ తనకు చేతనైన చతుషష్ఠి కళలన్నీ ప్రదర్శించినా బిడ్డ ఏడుపాపలేదు. పైగా రెట్టించి
కేరు కేరు మంటూ గగ్గోలు పెడుతున్నాడు.
ఆమె తరపు వారెవరూ వెంటరాలేదు కాబోలు! జనాలంతా ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారు. ఇక తప్పదనుకుందేమో.,
బిడ్డను ఒడిలో వేసుకుని, పైట కప్పేసుకోగానే రికార్డ్ ఆపి వేసినట్లు చిత్రంగా ఏడుపు ఆగిపోయింది.
అప్పటిదాకా ఊపిరి బిగబట్టి శిశుకాండనే తదేకంగా చూస్తు న్న హేమేంద్రతో పాటు మిగతా జనాలంతా ఊరటగా
ఊపిరితీసుకుని, చూపులు తిప్పేసుకున్నారు. కొద్దిక్షణాలు గడచేటప్పటికల్లా ఆ పసివాడు పైటలోనుంచి చేతులు బయటకు పెట్టి
ఆడటం మొదలుపెట్టా డు. ఆ ఆహ్లా దకరమైన దృశ్యం చూసిన హేమేంద్ర లోని చిత్రకారుడు మేల్కొన్నాడు. ఒంగి బ్యాగ్ లోంచి
పేపర్, పెన్సిల్ తీసుకుంటుండగా అవ్వ మేలుకుని, సర్దు కుంటూ, “సిన్నోడివి నాయనా! చమార్పనలు అడకూడదు. సిరకాలం
సల్లంగుండు” అంటూ అతడి నెత్తిని మెత్తగా తడిమింది.
అవ్వకు కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్పి హేమేంద్ర ఆ తల్లీ బిడ్డలను పరిశీలనగా చూస్తూ కాగితంపై ప్రతిష్ఠించే ప్రయత్నం
చేస్తు న్నాడు. పార్థు నికి పక్షికన్ను మాత్రమే కనిపించినట్లు ., హేమేంద్రకు అంతమందిలోనూ తల్లీబిడ్డల రూపమే కనబడసాగింది.
మనస్సు స్పందిస్తే... మనుషులకు అసాధ్యమైనది, ఆచరణకు అందనిదీ ఈ ప్రపంచంలో ఏదీ ఉండదేమో..! ఆ పసివాడిలో తనను,
ఆ అమ్మాయిలో తన తల్లినీ తలచుకుంటూ తన్మయుడై.. తల్లీ బిడ్డలను, తన చేతిలోని కాగితాన్ని మార్చిమార్చి చూస్తూ, కొద్ది
నిమిషాలలోనే చిత్రాన్ని పూర్తి చేశాడు.
‘వంచిన తల ఎత్తకుండా బిడ్డనే చూసుకుంటున్న ఆమె పైటతో చేసే యుధ్ధం కవుల కంటపడితే ఓ మహా కావ్యమే
రాసేద్దు రేమో!’ అనుకుంటూ ఆమెవంక చూశాడు హేమేంద్ర.
సరిగ్గా అదే సమయంలో ఆమె కళ్ళనుండి రెండు కన్నీటిబొట్లు జారి, బిడ్డ కుడిచేతిమీద పడ్డా యి.

పెండ్యాల గాయత్రి (46)


కథలు కనే కళ్ళు

ఆ ఘటన చూసిన అతడిలో కలవరం... ‘చిత్రం కోసమని పదేపదే చూడడం ఆమె మదిని గాయపరచిందా? లేక ఇలాంటి
స్థితిలో తన చిత్రం గీశానని బాధపడుతోందా? ఎంతకీ తల పైకెత్తడం లేదే..!! ఎలా తెలుసుకోవడం? ఇంకెలా క్షమాపణ చెప్పడం?’
నొచ్చుకుంటూ మరలా ఓసారి ఆమెవైపు, బిడ్డవైపు ఆందోళనగా చూశాడు.
పైట చాటునుండి కంటబడిన ఓ దారుణ దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. ఇంతలో చీరాల రావడంతో ఆగిన
రైలుతోపాటు తనుకూడా ముందుకు తూలాడు. అతడు కూర్చున్న బెర్త్ నుండి ఇద్దరు మనుషులు దిగడానికి లేవడంతో తనూ
లేచి నిలబడి ఆమెను అవ్వ పక్కన కూర్చోమన్నట్లు చేయి చూపించాడు. క్షణమాలస్యం చేయకుండా ఎడమచేతితో బిడ్డను,
కుడిచేతితో కిందున్న సంచీని తీసుకుని హేమేంద్ర కూర్చున్న చోటికి ఒక్కంగలో వచ్చి కూర్చుందామె.
అప్పటిదాకా ఆ అమ్మాయికి ఎడమ పక్కన తాకుతూ కూర్చున్న నడివయసు వ్యక్తి, “కుర్ర వెధవలు, కునిష్టి బుధ్ధు లు”
అన్నాడు బిగ్గరగా.
“ఏమయిందబ్బాయ్?” అంటూ అవ్వ కల్పించుకుంది.
“చూడు పెద్దమ్మా! నీ పక్కనున్న ఆడగూతురు ఎట్టా ఏడుస్తుందో?” చేయి చూపుతూ చెప్పాడా వ్యక్తి. అవ్వ ఒంగి..
తలొంచుకుని ఉన్న ఆమె చెమ్మగిల్లిన కళ్ళను చూసి బుగ్గ నొక్కుకుంటూ, “ఎందుకేడుస్తాందీ బిడ్డ?” అంది.
“నువ్వు రైలెక్కిన కాణ్ణుండి గంట గాకుండానే తెగ తూలిపోతా ఉంటివీ నీకేమర్థమయిద్ది పెద్దమ్మా?” రైలు శబ్దా న్ని
మించి అరిచి చెప్తు న్న నడివయసు వ్యక్తిపై మిగతా జనాలంతా దృష్టి సారించారు.
“ఏదో పెద్ద ముండనిలేయ్యా! ఈ పసితల్లిని ఎవురేమన్నారో చెప్పు నాయనా?” ఆ అమ్మాయి భుజం పట్టు కుని
అడుగుతోంది అవ్వ.
“ఇప్పుటిదాకా నీ పక్కన కూర్చునిళ్ళా బులుగు చొక్కా పిల్లోడు... రైలెక్కిన కాణ్ణించి అదేపనిగా సెకల శాస్టలు, ఎకిలి
సూపులు.. అమాయకపు ఆడగూతురు యాడవక ఏంజాస్తది పెద్దమ్మా?” అతడి మాటలు విన్న హేమేంద్ర అదిరిపడ్డా డు.
జనమంతా ఆశ్చర్యం, అసహ్యం కలగలిపి తననే చూస్తు న్నారు.
“ఓర్నీకు దూం దగల.. నువ్వు నాశనమైపోను.. అదేం పాడు బిద్దిరా? నువ్వు మంచోడివనీ, ఇప్పుటిదాకా నా పక్కన
కూర్చోబెట్టు కున్నా గదరా? నన్ను గూడా ఆపాడు బుద్దితోటే ఆనుకున్నావా ఏందిరా?” శక్తంతా కూడగట్టు కుని అరుస్తూ
పైటకొంగును భుజం చుట్టూ కప్పేసుకుంది అవ్వ.
ఇక ఒక్కరొక్కరుగా హేమేంద్రను తోచిన రీతిలో తూలనాడడం మొదలుపెట్టా రు. అతడి వెన్నులో వణుకు
మొదలయింది. నోటమాట పెగలడం లేదు. నిలుచొని ఉన్నాడే గానీ., నరనరాలు నేలలోకి కృంగిపోతున్నట్లనిపించాయి. తల
భూమిలా గుండ్రంగా తిరిగిపోతోంది. నోట మాట రావడం లేదు.
‘తనేం చేశాడసలు? నీచమైన పని చేసినవాడు పెద్దమనిషి అవతారమెత్తి., తనపై నేరం రుద్దు తున్నాడు. తను చూసిన
విషయం అందరిలో ఎలా చెప్పగలడు? అదిచెప్పి., ఆ అమ్మాయిని అవమానానికెలా గురిచేయగలడు? ఒకవేళ తాను జరిగిన
ఘటన చెప్పినా గానీ.. ఈ జనాలు నమ్ముతారా? ఇపుడు తనేం చేయాలి? ఇంత జరుగుతున్నా తనకేం పట్టనట్లు దించిన తల
ఎత్తకుండా కేరింతలు కొడుతున్న పిల్లవాడిని చూసుకుంటుందేమిటి? అయినా తన పిచ్చిగానీ, ఏ ఆడపిల్లైనా అలాంటి విషయాలు
బయటపెట్టు కుంటుందా?’ పరిపరివిధాలుగా ఆలోచిస్తూ ఆమెవైపు చూశాడు.
హేమేంద్ర వెనక నిలుచున్న ఒక పెద్దా యన అతడి నెత్తిన గట్టిగా మొట్టి, “ఇంత జరుగుతున్నా ఆ పిల్లనే చూస్తు న్నావే నీకు
సిగ్గులేదూ?” అన్నాడు కటువుగా.
“ఇలాంటి వాళ్ళను నిలువునా కాల్చిపారేయాలండీ!” ఒక మహిళ ఆవేశపడింది.

పెండ్యాల గాయత్రి (47)


కథలు కనే కళ్ళు

ఇంతలో రైలు ఆగడంతో, జనాల మాటలతో బిక్కచచ్చిపోయిన అతను ఏదీ పట్టు కోకుండా నిలుచున్నాడు కాబోలు.,
తూలి ముందుకు పడబోయీ మరో మహిళకు తగిలాడు. ఆమెకు క్షమాపణ చెప్పేలోపే వీపుపై నాలుగు చేతులు సర్రు మన్నాయి.
ఏ ఊరైతేనేం? రైలు దిగేయాలనుకుని బయటకు చూశాడు.. క్రా సింగ్ కాబోలు! నిర్మానుష్య ప్రదేశంలో ఆగింది పినాకిని.
ఉబికివస్తు న్న కన్నీళ్ళు చెంపలను తడిపేస్తుంటే, అంతటి అవహేళనా ప్రహసనానికి దారితీసిన తల్లీబిడ్డల చిత్ర కాగితంతో ముఖాన్ని
కప్పేసుకున్నాడు.
***
నిజాముద్దీన్ రైలు దేశ రాజధాని రైల్వేస్టేషన్ లోకి చేరుకున్నది. మూడునెలల క్రితం జరిగిన సంఘటన నుంచి బైటికి
వచ్చాడు. ‘గత స్మృతుల కన్నీళ్ళతో తడిచిన ఆ ఆహ్వాన పత్రిక అనేక ఉద్యోగ అవకాశాలను, అపరిమిత పరిచయాలను ఈ
నిరుపేదకందించిన భాగ్యరేఖ’ అనుకుంటూ.. దాన్ని ప్రేమగా మరొక్కసారి గుండెలకు హత్తు కుని, భద్రంగా బ్యాగులో పెట్టు కుని
రైలు దిగాడు హేమేంద్ర.
***
అనేకమంది అస్మదీయులు, అసంఖ్యాకులైన ఆహూతులు ఆసీనులవగా.. అత్యంత అట్టహాసంగా, ఆహ్లా దకరంగా,
వైభవోపేతంగా అలరారుతున్న సాంస్కృతిక సభలో ఉద్విగ్నభరితుడై కూర్చొని ఉన్నాడు. వక్తల ఉపోద్గాతాలు, ఉపన్యాసాల
అనంతరం.. బహుమతి ప్రదానపర్వం ప్రారంభమయింది.
‘జన్మనిచ్చీ జీవితాన్నందించిన కన్నతల్లి ఒక వైపు, పేపరిచ్చి ప్రతిభను పదిమందిలోకి పంపిన కళామతల్లి ఇంకోవైపు
కూర్చొని తననాశీర్వదిస్తు న్నారు’ అనుకుంటూ చెమ్మగిల్లిన కళ్ళతో వేదిక ఎక్కాడు. సాంస్కృతిక శాఖా మంత్రివర్యుల
అభినందనలతో బహుమతి అందుకున్నాడు. ఆయన కోరిక మేరకు మైక్ అందుకుని, సభా సరస్వతికి వందనాలర్పించాడు.
అందరివైపు ఒకసారి చూసి గొంతుక సవరించుకున్నాడు. “ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది, ప్రతి స్త్రీ
విషాదం వెనుక ఒక పురుషుడు ఉంటాడు.. అనే మాట నిజమో, అబద్ధమో నాకు తెలియదు కానీ, ఒక స్త్రీ ఎదుర్కున్న
విషాదఘటన ఈనాటి నా విజయానికి సోపానమయింది. అందుకే ఎక్కడుందో తెలియని ఈ నా బహుమతిని ఆఅజ్ఞాత
అనామిక స్త్రీ మూర్తికి అంకితమిస్తు న్నాను. ఏనాటికైనా ఆమెను చేరుకుని ఈ చిరుకానుక అందించగలనని విశ్వసిస్తు న్నాను”
అంటూ తన స్పందనను ముగించాడు హేమేంద్ర.
***
మళ్ళీ నిజాముద్దీన్ రైలులోనే తన ఒంగోలుకు తిరుగు ప్రయాణమైన అతడికి ఎదురు బెర్త్‌లో ఓ పసిబిడ్డ తల్లీ
దర్శనమివ్వడంతో.. మనసు మరొకసారి నాటి పినాకిని స్మృతుల వైపుకు పరుగులు పెట్టింది.
***
‘ఎంతగానో ఇష్టపడీ, పెద్దగా కష్టపడకుండా వేసుకున్న అపురూపమైన చిత్రం.. కన్నీళ్ళలో తడిచి, తన బతుకుమాదిరి
ఛిద్రమవుతోంది. కొద్దిసేపటి క్రితం చిరకాలం జీవించమని దీవించిన అవ్వ.. ఇప్పుడు నాశనమవమని శపిస్తోంది. నిజాలను నమ్మలేని
ఈ మనుషులు, నిందలకు మాత్రం వందిమాగదులై వంత పాడుతుంటారు. ఏదైతే అది అయ్యింది. బాపట్ల దగ్గరకొస్తు న్నట్లుంది..
అక్కడే ఈ రైలులో నుంచి దిగిపోవాలి’ అనే నిశ్చయానికి వచ్చి గట్టిగా నిట్టూర్చాడు.
సరిగ్గా అదే సమయానికి ఆ అమ్మాయి కిందకి ఒంగి, సీటు కింద ఉన్న సంచీని బయటకులాగింది. జిప్ లేని ఆ సంచీపై
కప్పిన పాత న్యూస్ పేపర్ చేతికి తీసుకుని, ఎదురుగా ఉన్న మహిళను పెన్ అడిగి తీసుకుని ఏదో రాసి హేమేంద్రకు
ఇచ్చింది.అప్పటికే బాపట్ల స్టేషన్ వచ్చేసింది. ఆమె గబగబా పైకి లేచి నిలబడి,, బిడ్డనూ, సంచీని కలిపి ఎడమచేతితో పట్టు కుంది.
కిందకి ఒంగి కుడికాలి చెప్పు తీసుకుని, రెప్పపాటు కాలంలో ఇందాక తన పక్కన కూర్చున్న నడివయసు వ్యక్తి చెంప

పెండ్యాల గాయత్రి (48)


కథలు కనే కళ్ళు

ఛెళ్ళుమనిపించింది. ఆ వ్యక్తి నిశ్చేష్టు డయ్యి చెంప పట్టు కున్నాడు. ఆమె జనాల వైపు తిరిగి తనకు చెవులు వినిపించవని, మాటలు
రావని అర్థం వచ్చేలా సైగలు చేసి రైలు దిగి వెళ్ళిపోయింది.
అసలేం జరిగిందో బోధపడని జనాలు శిలాప్రతిమలై చూస్తుండిపోయారు. ఊహించని ఆ ఘటన నుండి తేరుకున్న
హేమేంద్ర.. పేపర్‌పై రాసిన అక్షరాలపై దృష్టి సారించాడు.
“అమ్మలో రొమ్మును చూసే ధృతరాష్ట్ర పుత్రు ల బలుపు వదిలించే యశోద కృష్ణునిలా ఉండన్నా... ఇంకెప్పుడూ, ఎక్కడా
భయపడమాకు...!”
తన శక్తి యుక్తు లను తట్టిలేపిన ఆ మాటలను చుట్టూ ఉన్న జనాలకు గర్వంగా చూపించాడు. వాళ్ళందరికీ అసలు
విషయం తేటతెల్లమైంది. పెల్లు బుకుతున్న భావోద్వేగాన్నింటినీ నియంత్రించుకునేందుకు మరొక్కసారి ఆ మాటలు
చదవాలనుకుని, పేపర్ పైకి చూపు మరల్చాడు. తనను ఉత్తేజపరచిన ఆ మాటలకింద మెరిసిన పచ్చటి అక్షరాలు... తన కళ్ళను
కవ్వించాయి.
“జాతీయ స్థా యి చిత్రలేఖనం పోటీలు” అనే శీర్షిక కింద ఉన్న విషయమంతా చదివాడు. చిత్రాలు పంపడానికి
నాలుగురోజులు మాత్రమే గడువు ఉందని తెలుసుకున్నాడు. కన్నీటిలో నానిన కాగితాన్ని ఆరబెట్టి నగిషీలు అద్దా డు.. మొదటిసారి
మహత్తర పోటీకి పంపేశాడు.
***
పినాకిని నుండి.. మళ్ళీ నిజాముద్దీన్ లోకి వచ్చి, తన ఎదుట కేరింతలు కొడుతున్న పసిపాపాయిని చూస్తూ నిండుగా
నవ్వుకున్నాడు హేమేంద్ర.

(బహిరంగ ప్రదేశాలలో స్త్రీలు ఎదుర్కునే వేధింపులను చూపిస్తూ వ్రాసిన ఈ కథ, 2020 వ సంవత్సరం సహరి సమగ్ర వార
పత్రిక నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో ప్రథమ బహుమతి 5000 రూ గెలుచుకుంది)

వికారి.కామ్
“చైత్రా! ఇలా రా..! నీకో విచిత్రం చూపిస్తా ను” తనేదో ఎనిమిదవ ప్రపంచ వింతను కనుగొన్నంత ఆత్రంగా అరిచాడు
ఫల్గుణ్.
“ఏంట్రా! నీకన్నీ విచిత్రాలే! చీమను చూచి చైనా గోడను చూచినట్లు అరుస్తా వ్, అతిశయోక్తి అలంకారం లాగా.. నా
మొబైల్‌కు చిత్రవిచిత్రమైన సందేశం వచ్చింది, నన్ను చదువుకోనివ్వు” అంది చైత్ర తన ఫోన్ చూస్తూ.
“ఎలుకకి ఏనుగుకి తేడా తెలియని పిల్లి ముఖానికి అలంకారాలు కావలసి వచ్చాయి” అన్నాడు వెటకారంగా ఫల్గుణ్.
“నీదే దొరలకి దొంగలకి బేధం తెలియని కుక్క మొఖం” అంది ఉక్రోషంగా.
“చైత్రా..! ఏంటి అల్లరి?”
వంటగదిలో ఉన్న అమ్మ మాట పూర్తి కాకముందే, “నువ్వు కూడా నన్నంటావ్ ఏంటమ్మా? వాడు అన్నన్ని మాటలు
అంటుంటే!” అంది చైత్ర అన్నవైపు కసురుచూపులు చూస్తూ.
“వాడు నీకన్న పెద్దవాడు కదా! ఏదో అన్నాడనుకో నువ్వలా మాటకు మాట ఎదురు వాడవచ్చా? వాడు పిలిచినప్పుడు
వెళితే అసలు గొడవే రాదు కదా!” గదిలోకి వచ్చి బుజ్జగిస్తూ చైత్ర కళ్లలోకి చూస్తూ అంది అమ్మ.
“సారీ రా అన్నయ్యా!” అంటూ వెళ్లి కంప్యూటర్‌లో కళ్ళు పెట్టిన ఫల్గుణ్ పక్కన కూర్చుంది.
“మా మంచి చైత్ర..” అంటూ తల్లి తన బుగ్గమీద ముద్దిచ్చి వెళ్ళింది.

పెండ్యాల గాయత్రి (49)


కథలు కనే కళ్ళు

“చెల్లీ..! ఇటు చూడు, నాకు చిత్రమైన ఈమెయిల్ వచ్చింది” అన్నాడు స్క్రీన్ వైపు చూపిస్తూ.
“అరే! అంతా తెలుగులో పంపించారే...” ఆశ్చర్యపడుతూ అంది చైత్ర.
“అదే కదా నేను చెబుతుంది, చదువు అసలు సంగతి ఏమిటో తెలుస్తుంది” ఉత్సాహంగా చెల్లెలు వైపు చూస్తూ
అన్నాడు.
“ఫల్గుణ్ చైత్ర లకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ క్షేమాన్ని కాంక్షిస్తూ శుభవార్త అందిస్తు న్నాము.
వికారి నామ సంవత్సర చైత్ర మాస ఆరంభం రోజు రాత్రి 12 గంటలకు ఈ క్రింద ఇచ్చిన వెబ్‌సై ట్‌ను ఓపెన్ చేయండి! ఓ
అద్భుతమైన నాటక ప్రదర్శన ఉంటుంది. మీరు మనుషులైతే! మీకే మనసు ఉంటే మీ కోసమే ప్రదర్శించబడుతున్న ఆ సజీవ
చిత్రాన్ని వీక్షించి మెదడుకు ఎక్కించుకోండి. వెబ్ సైట్ అడ్రస్ www.vikari.com తప్పక చూస్తా రు కదూ!” అంటూ చదివిన చైత్ర
కళ్ళు పెద్దవి చేసి నోరెళ్ళబెట్టింది.
“ఇది చీమ కన్నా చిన్న, చైనా గోడ కన్నా పెద్దదైన వింత కదూ!” అని అన్నయ్య అనడంతో ఇద్దరు నవ్వుకున్నారు.
“అన్నయ్యా..! ఉగాది పండుగ ఎల్లుండే కదా! రేపు నేను మా కాలేజీలో అందరికీ చెప్తా ను. నువ్వు కూడా చెప్పు..” అంది
వంట చేస్తు న్న అమ్మ వద్దకు పరిగెడుతూ.
***
తరువాతి రోజు సాయంకాలం..
“అన్నయ్యా..! మా కాలేజీలో కూడా అందరికీ ఇదే ఈ మెయిల్ వచ్చిందట”
అంటున్న చెల్లిని చూసి నవ్వుతూ, “మా కాలేజీలో కూడా ఇదే పరిస్థితి” అన్నాడు.
రాత్రి 12 గంటలు ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ చైత్ర తల్లిదండ్రు లతో సహా ఎవరూ నిద్రపోలేదు. 12 గంటలు
అవ్వడంతోనే ఫల్గుణ్ vikari వెబ్సైట్‌ను ఓపెన్ చేసాడు. నాటకానికి ముందు వ్యాఖ్యానం కాబోలు అందరూ ఆసక్తిగా
వింటున్నారు.
“ఎందరో ప్రేక్షక మహాశయులు..! అందరికీ వందనాలు. తెలుగు వారందరికీ ఈరోజు పవిత్రమైన ఉగాది పండుగ. ఇలాగే
ప్రతిరోజు పండుగ అయితే అది మన ఇంటికి వస్తే, ఆత్మీయంగా పలుకరిస్తే, అలా ఆలోచిస్తే ఓ అద్భుతం! అలా రావాలంటే మన
హృదయ తలుపులు తెరిచి ఉండాలి.
జీవచ్ఛవాలుగా మారుతున్న జీవనదాతలను ప్రేమించాలి. చావలేక, చంపలేక, చస్తూ బ్రతుకుతున్నా కొన్ని జీవాలు
వేషాలు కట్టి వాస్తవ పరిస్థితిని మనతో ముచ్చటించడానికి,, కాదు కాదు మొరపెట్టు కోడానికి వస్తు న్నాయి. అందరం మనసున్న
కళ్ళతో వీక్షిద్దాం.
అన్నట్టు ఓ మాట మరిచాను. పేరు పెట్టని ఈ ప్రదర్శనకు ప్రేక్షకులే పేరు సూచించవలసిందిగా ఉంటుంది. ఉత్తమ
శీర్షికకు బహుమతి అందజేయబడుతుంది...”
ఫల్గుణ్ చైత్రలు కంప్యూటర్‌ను కన్నార్పక చూస్తు న్నారు.
తెర తొలిగింది.
ఆమె అందాల అవని, నిరంతర గర్భిణి, సకల జీవరాశులకు జనని, జగతికి జీవాన్నందించిన సంజీవని. నేడు
నిస్సహాయురాలై కన్నీరు కారుస్తోంది. తన పొత్తిళ్లలో ఒదిగి, పైపైకి ఎదిగిన రెండు కాళ్ల జంతువు, తనకు చేతులు ఉన్నాయని, తన

పెండ్యాల గాయత్రి (50)


కథలు కనే కళ్ళు

చేతులకు హద్దు లేదని తలంచినట్లు ఉంది. జీవులన్నింటినీ తన చెప్పుచేతల్లో పెట్టు కొని చదరంగమాడుతున్నాడు. అతని చేతలకి
అవని తల్లి ఏదో చెప్పబోతోంది.
అంతలో “ఆపు నీ ఏడుపు! నీ మాటలు ఎవరికి వినిపిస్తా యని అంతలా అల్లా డుతున్నావ్? హ!హ!హ! ఇది నా
యుగం.. నేనే, నేనే,, ప్రస్తు తానికి మహారాణి. కొన్ని లక్షల సంవత్సరాల వరకు ఈ సామ్రాజ్యం నాదే. నన్ను సృష్టించింది
ఎవరనుకుంటున్నావు? మహా మేధావి అయిన మనిషి. లక్షల సంవత్సరాలు చావులేని వరమిచ్చాడు నాకు. బ్రహ్మసృష్టి కైనా అంతం
ఉంటుందేమో కానీ మనిషి సృష్టికి అంతమే లేదు. నేను లేని చోటు చూపించు?! తళతళ మెరిసే అందాలరాశిని! మనిషి తినాలన్నా
తాగాలన్నా ఆడుకోవాలన్నా అలంకరించుకోవాలన్నా నేను ఉండాల్సిందే.
“ఓయ్ అవనీ,, వింటున్నావా! మనిషి నువ్వు లేకపోయినా బ్రతకగలడేమో కానీ, నన్ను వాడుకోకుండా బ్రతకలేక
పోతున్నాడు. అతడిని అంతం చేయగల ఏకైక శక్తిని నేనే! నీ ఒంటిపొరల అన్నింటిలో ప్రవేశించి నిన్ను విషతుల్యం చేస్తా ను. నేనే
విజేతను అవుతాను..” అంటూ ప్లా స్టిక్ తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తుండగా,,
“అమ్మా! రబ్బరు రాణీ! ఆగాగు.. నిన్ను మించిన శక్తి మరొకటి ఉందని మరచిపోకు. నీలాగే నన్ను కూడా మనిషి
సృష్టించాడు. నువ్వు అతడు తినేందుకు గిన్నెలాగో, తాగేందుకు ఓ గ్లా సులాగో మాత్రమే మారగలవు. కానీ నేను, తినే తిండిలోకి,
తాగే నీటిలోకి, కట్టే బట్టలోకి, ఆఖరికి పీల్చేగాలిలోకి కూడా ప్రవేశించి అతని ప్రాణాలు క్షణాల్లో గగనానికి ఎగిరేయగలను.
అంతెందుకు, ఈ అవని పైనున్న నీరు, గాలిలోనే కాదు. ఇవేవీ లేని నింగిలో కూడా పాగా వేసాను. నన్ను మించినదానవా నువ్వు?”
అంటూ కాలుష్యం కళ్ళెర్రేస్తుండగా,,
“అయ్యా! కలుషిత రాజుగారు! మీకన్నా, ఆ రంగుల రాణి కన్నా ముందే, మెదడున్న ఈ మనిషి నన్ను
తయారుచేశాడు. ఇందాక అన్నారే, మీరిద్దరూ అతని ఆహారాన్ని విషతుల్యం చేస్తు న్నామని.. అంతవరకే మీపని., హ! హ !హ! నేను
అసలు ఆహారమే లేకుండా చేస్తా ను. నా ఏకైక శత్రు వైన చెట్టు ను చంపేసి నేను హాయిగా బ్రతకడానికి, తను నా చేతుల్లో చావడానికి
తానే బాటలు పరుచుకున్నాడు.
ఈ మనిషి మేధావినని చెప్పుకుని తృప్తి పడుతున్న మందమతి. తాను కార్యశీలి అని కోతలు కోస్తూనే కల్లోలాలు
సృష్టిస్తు న్నాడు. అంతేనా! ఆశ్రయమిచ్చిన వారినే అంతం చేస్తా డు. అతడి బాటలో పయనిస్తు న్న అతివృష్టిలో, అనావృష్టిలో అన్ని
వేళలా నాదే రాజ్యం. ఈ అవనిని రక్షిస్తు న్న ప్రకృతినే నా గుప్పెట్లో బంధించి వికృతంగా మార్చివేశాను. ఈ మనుషులు ఒక లెక్కా
నాకు!” అంటూ ఊగిపోతున్న కరువును ప్లా స్టిక్ వెటకారంగా చూసింది.
వెంటనే గళం విప్పి, “అయ్యా కరువు మహాశయా! చాలించండి మీ కరువు కూతలు. ఎప్పుడూ మండిపడే మీకన్నా,
మురికి కారే ఆ కాలుష్యం కన్నా, సోయగాలు ఒలకబోసే నాకే త్వరగా బానిసవుతాడు మనిషి” అంది.
“కాదు.. కానే కాదు.. మనిషి నన్ను తప్పించుకొని పోలేడు” అంటూ కాలుష్యం గర్జించింది.
కరువు అందుకని, “అయితే కదలండి.. మన శక్తియుక్తు లు ఏమిటో ప్రయోగిద్దాం. ఎవరు ఎక్కువ విధ్వంసం సృష్టిస్తే
వారు విజేతలు అయినట్లు ” అంది సవాల్ విసురుతూ.
“సరే..! పందానికి మేము సిద్ధం” ప్లా స్టిక్ కాలుష్యం కలిసి చెప్పాయి.
“ఒక్కక్షణం ఆగండి” అవని బిగ్గరగా అరిచింది.
“కడసారి నా బిడ్డలతో మాట్లా డుకోనివ్వండి” చేతులు జోడించి ప్రాధేయపడింది. వారిలో ఏమూలనో దాగి ఉన్న కరుణ,
మౌనరూపాన్ని దాల్చి అవకాశం ఇచ్చింది.

పెండ్యాల గాయత్రి (51)


కథలు కనే కళ్ళు

అశ్రు నయనాలతో అవని చుట్టూ చూస్తూ, “నా బిడ్డలారా! మీరు మనుషులు అన్న సంగతి మర్చిపోకండి. మృగ ప్రవృత్తి
ఆశ్రయించకండి. అతి సుఖం కోరి సంతోషానికి దూరం కాకండి. ప్రగతి పేరుతో ప్రకృతిని చంపేకండి. కరువు, కాలుష్యం లాంటి
వికార శక్తు లను నియంత్రించి నిర్మూలించండి. ఆ శాంతి యజ్ఞానికి మొక్కలను ఆయుధంగా మలచుకోండి. మనిషికొక మొక్క
అనే నినాదంతో ప్రారంభించండి. తప్పనిసరై ఒక చెట్టు నరికితే 10 మొక్కలు పెంచండి. వికారంగా మారి మరణానికి
చేరువవుతున్న మీ అమ్మను బ్రతికించండి. మీ అమ్మ చల్లని ఒడిలో ఒదిగి ఉండి విశ్వవిజేతగా వెలుగొందండి. బిడ్డలారా! ఈ
భూమితల్లి బాధ అర్థం చేసుకుంటారు కదూ! ‘నేను ఉగాది పర్వదినం, వికారి నామ సంవత్సర ఆరంభ క్షణాన వికృత శక్తు లను
జయించి ప్రకృతిని పరిరక్షిస్తా నని, సకల ప్రాణకోటికి హాని తలపెట్టనని, అమ్మ వంటి అవని ఋణం తీర్చుకొని మహిలో
మహనీయులుగా వెలుగొందుతామ’ని ప్రతిజ్ఞ చేయండి. చిరకాలం చిరంజీవులై వర్ధిల్లండి” అంటూ అవని మృదుమధుర స్వరంతో
ఆశీర్వదించడంతో తెరపడింది.
“ఫల్గుణ్! చైత్రా! ఏమిట్రా.. అలా కొయ్యబారి పోయారు?” అంది వారి అమ్మ.
“భయమేస్తోంది అమ్మా” చిన్నగా చెప్పాడు ఫల్గుణ్.
అమ్మ ఇద్దరి భుజాలపై చేతులుంచి, “భయపడకూడదు నాన్నా! మన బాధ్యత ఏమిటో తెలుసుకోవాలి. ప్రతి
పొరపాటుకు ఒక పరిష్కారం ఉంటుంది. దాన్ని సరిదిద్దు కోవడానికి ఇంకా ఓ క్షణం మిగిలే ఉంది.
“ఆ! మీరిద్దరూ నాకో సంగతి చెప్పండి నాటకాన్ని చూశారుగా! మీరైతే ఏం పేరు నిర్ణయిస్తా రు?” అనడిగింది.
ఇద్దరూ ఒకేసారి చెప్పారు, “అవని ఆవేదన” అని.
అమ్మ చిరునవ్వుతో, “అంటే,, మీకు సమస్య అర్థమై పరిష్కారం వైపు ఆలోచన మళ్ళింది. అవునా! ప్రకృతి ఫాల్గుణ
మాసంలో తన అందాన్ని అలంకరించుకోవటం మొదలుపెడుతుంది. పచ్చదనపు చీరకట్టి, పసిడివన్నె పూలు పెట్టి, చైత్రమాసం
వచ్చేసరికి సొగసైన కన్నెలా రూపొంది, హృదయమున్న కళ్లకు విందు చేస్తుంది. ఆ అందం ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని,
ఐశ్వర్యాన్ని, ఆయుష్షును అందిస్తుంది. ఇప్పుడు అర్థమైందా మీకా పేర్లు ఎందుకు పెట్టా మో!” అంది అమ్మ.
“చాలా బాగా అర్థమైంది అమ్మా! అంతే కాదు ఇప్పుడు మా కర్తవ్యమేమిటో కూడా బోధపడింది” ఉత్సాహంగా అంది
చైత్ర.
“ఎల్లప్పుడూ కొత్తదనాన్ని ఆహ్వానించే ఫాల్గుణంలా, గతాన్ని ప్రేరణగా మార్చుకొని ముందుకు సాగే చైత్రములా
మేమిద్దరం కలిసి నడుస్తా మమ్మా!” మరింత ఉత్సాహంగా చెప్పాడు ఫల్గుణ్.
“అనుభవాల విళంబికి వీడ్కోలు ఇస్తూ, ఆశయాల వికారిని స్వాగతిస్తూ మొక్కలు నాటుదాం... అవని ఆవేదనను
తగ్గించుకోవడానికి ఇప్పుడే శ్రీకారం చుడదాం” అంటూ అన్నయ్య చెయ్యి పట్టు కుని పైకి లేచింది చైత్ర.
“అయితే vikari.com వాళ్ళ కంటే ముందే మీకు నేను ఒక బహుమతి ఇస్తు న్నా” అంటూ ఉగాది పచ్చడి
తీసుకొచ్చింది అమ్మ.
“షడ్రు చుల ఉగాది పచ్చడిని ఎందుకు తినాలో తెలుసా! తీపి, చేదు, ఉప్పు, పులుపు, కారం, వగరు అనే ఆరు రుచులను
మనిషి జీవితానికి ప్రకృతి పయనానికి ప్రతీకగా చెప్పవచ్చు..” అన్నాడు నాన్న. పచ్చడిని రుచి చూసి.,
“ప్రకృతిలో మోతాదు ఎక్కువైన చేదును తగ్గించుకోవడానికి ఈ క్షణమే “ట్రీ” కారం చుడదాం..!” అనుకుంటూ పెరటి
వైపు కదిలారందరూ.


పెండ్యాల గాయత్రి (52)


కథలు కనే కళ్ళు

(వికారి నామ ఉగాది పండుగను స్వాగతిస్తూ వ్రాసిన ఈ కథ, ఆకాశవాణి విజయవాడ, కడప కేంద్రాలలో
ప్రసారమయింది)

మట్టిపొరలు
‘పెద్ద పెద్ద ఉపదేశాలివ్వడం, పిల్లలకు ఉచిత సలహాలివ్వడం మాలాంటి పెద్దలకు అలవాటు. పెద్దవాళ్ళు తామెంతో
తెలివిగలవాళ్ళలా ప్రవర్తిస్తుంటారు కాని వాళ్ళలో కొద్దిమంది మాత్రమే విజ్ఞానవంతులు. ఈ పెద్దలంతా ఎంతో చిత్రంగా,
తమకుతాముగా పరిమిత పరిధులను, సమూహాలను నిర్మించుకుంటారు.’
ఏడవతరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ‘జవహర్‌లాల్‌నెహ్రు ’ వ్రాసిన ‘పిల్లలకో ఉత్తరం’ అనే పాఠ్యాంశాన్ని తరగతి గదిలో
ఆదర్శపఠనం చేస్తు న్నాను.. మధ్యమధ్యలో విద్యార్థు లంతా పుస్తకంలో చూస్తు న్నారా.. లేదా  అని గమనిస్తుండగా, దించిన తల
ఎత్తకుండా కూర్చున్న రసూల్‌కంటబడ్డా డు.
 ”రెండు రోజులనుంచి బడికిరాలేదు ఎందుకనిరా!?” అనడంతోనే ఒడిలోని పుస్తకం క్రిందపెట్టి చటుక్కున లేచి చేతులు
కట్టు కున్నాడు. 
వాడి ముఖంలో దుఃఖపు ఛాయలు కనిపించాయి. తనేదో చెప్పబోతుండగా చుట్టూ ఉన్న నలుగురు పిల్లలందుకొని,
“టీచెర్‌మరే! వీడే!” అంటుండగానే క్లా స్‌అంతా గడబిడగా గోలందుకుంది. 
పాఠం అయిపోయిందాకా పరామర్శలు పనికిరావులే.. అనుకొని గొంతు కాస్త పెంచి, “ఏయ్‌! పిల్లలూ! మాటలాపి
మౌనంగా అందరూ ఆ పేరా ఒక్కసారి చదవండి” అన్నాను.
నా కళ్ళు క్లా సంతా కలయజూస్తు న్నా గాని మనసు మాత్రం గత సంవత్సరానికెళ్లింది.
***
ఈ రసూల్‌ఆరవతరగతిలో ఎంత రాష్‌గా ఉండేవాడు. అందరూ తన అజమాయిషీలో ఉండాలి, తను చెప్పింది
చేయాలి, తను చేసింది చూడాలి పిల్లలంతా. తనకనుకూలంగా లేని పిల్లల్ని కొట్టడం.. అది కుదరకపోతే మిగతా పిల్లల్ని వాళ్లనుంచి
వేరుచేయడం లాంటి పనులు చేసేవాడు. ఇదంతా గమనించి వాణ్ని రెండు మూడుసార్లు మందలించినా ప్రయోజనం
లేకపోయింది.
ఓరోజు క్లా స్‌లోకి వెళ్లేసరికి రూమంతా రంగస్థలంలా ఉంది. ‘ఏంటిరా,, ఇదీ అంటే..,’ పిల్లలంతా కుడికంటి క్రింద రక్తం
కారుతున్న వినయ్‌ని నా దగ్గరకు తీసుకొచ్చారు. కనుగుడ్డు కేమైనా ప్రమాదమేమోనని భయపడుతూనే నీళ్ళు తెప్పించి కడిగి
చూసిన తరువాత ఊపిరి పీల్చుకున్నాను. 
అప్పుడడిగాను, “ఏం జరిగిందిరా..?” అని., 

పెండ్యాల గాయత్రి (53)


కథలు కనే కళ్ళు

“రసూల్‌ఇనుప స్కేల్‌తో కొట్టా డు టీచర్‌..!” పిల్లలంతా ముక్తకంఠంతో అదేమాట.


నాకు కోపం తారాస్థా యికి చేరింది. అదే స్కేల్‌తో రసూల్‌అరచేతులపై నాలుగు తగిలించి, “ఎందుక్కొట్టా వురా వాణ్ణి? ఆ
దెబ్బ కంటికి తగిలితే ఏమైయ్యేదిరా?” అరిచినట్లు అడిగాను. 
వాడు సమాధానం చెప్పలేదు సరికదా.. వీలైతే నా చేతిలో ఉన్న స్కేల్‌లాక్కొని తిరిగి కొట్టేటట్లు చూస్తు న్నాడు. 
“చెప్తా వా? బయటకెళ్తా వా!” అనడంతోనే బయటకెళ్లి నిలుచున్నాడు. 
ఒక్కక్షణం ఏంచెయ్యాలో తోచింది కాదు.
ఆరోజు క్లా సు అయ్యిందనిపించుకొని మరుసటిరోజు రెండు పాత న్యూస్‌పేపర్‌లు పట్టు కొని క్లా స్‌లోకి వెళ్ళాను.
రూమంతా రెండు వర్గాలుగా కనిపించింది.
“రసూల్‌! ఇట్రా!” అన్నాను. 
అనుమానంగా, ఆశ్చర్యంగా నావైపు చూశాడు. “ఈ పేపర్‌లో ముఖ్యమైన వార్తలున్నాయి.. నువ్వు చదువుదువు గానీ,
రా!” అన్నాను. 
నా చేతిలోని పేపర్‌ను చూస్తూ లేచి వచ్చాడు.
“పిల్లలూ! ఇప్పుడు రసూల్‌రెండు విషయాలు చదువుతాడు. అందరూ శ్రద్ధగా వినండి. తరువాత ప్రశ్నలడుగుతాను..”
అంటూ ఏమేమి చదవాలో చూపించాను. 
వాడు నిదానంగా చదివినా స్పష్టంగా చదివాడు. 
తరువాత ఆ సంఘటనలను విపులంగా వివరించి, “ఇప్పుడు చెప్పండి! వందమందిని చంపి తానూ పోయిన ఆత్మాహుతి
బాంబర్‌మీ ఫ్రెండా! లేక తాను చనిపోయినా మరో ఏడెనిమిదిమందిని బ్రతికించిన అవయవదాత.. మీ ఫ్రెండా!” అడిగాను.
“అవయవదాతే మా ఫ్రెండ్‌..!” ముక్తకంఠంతో అన్నారంతా.
 ”రసూల్‌మరి నీకూ!” అనగానే,
“ఈయన్న చచ్చిపోయిండుగా టీచర్‌” పేపర్‌లోని అవయవదాత ఫోటో చూస్తూ అన్నాడు.
“అవును నాన్నా.. ఆ అబ్బాయి చనిపోయాడు.. కాని తన అవయవాలతో పునర్జీవమందుకున్న వారి రూపంలో
బ్రతికేవున్నాడు.. అంతటి అదృష్టం ఎందరికి ఉంటుందో చెప్పు..” పాఠ్యపుస్తకం చేతికి తీసుకుంటూ అన్నాను.
“అలా మనంకూడా ఇవ్వాలనుకుంటే చచ్చిపోవాలా టీచర్‌!” వినయ్‌అడిగాడు. 
“ఛఛ! అలాకాదు నాన్నా! ప్రతిరోజు ఎన్నోవిధాలుగా ఎంతోమంది చనిపోతుంటారు కదా! వారి దేహాన్ని కాల్చివేయడమో,
పూడ్చిపెట్టడమో చేస్తుంటాము అవునా! అప్పుడు రోగులకు ఉపయోగపడవలసిన అవయవాలు వృధాగా మట్టిలో కలసిపోతాయి
కదా..” రసూల్‌భుజంపై చేయివేసి వాడి మొఖంలోకి చూస్తూ అన్నాను. 
“నిన్న నా కన్ను పోయుంటే అలా.. ఎవరైనా ఇచ్చేవాళ్ళా టీచర్‌!” రసూల్‌ని చూస్తూ అడిగాడు వినయ్‌.
అప్పటిదాకా సన్నగా పడుతున్న చినుకులు ఊపందుకున్న గాలితో కలిసి కిటికీల్లోంచి తరగతి గదిలోకి చొరబడ్డా యి. 
“టీచర్‌బుక్స్‌తడిచిపోతున్నాయ్‌” అంటూ కేకలు పెడుతూ నలుగురు పిల్లలు లేచి కిటికి తలుపులు మూసేశారు.
“పిల్లలూ! ఈ తలుపుల తయారీకి కావలసిన చెక్క మనకు ఎక్కడనుంచి వస్తుంది..?” అని అడిగి మాటల్లో పడిన పిల్లల
దృష్టిని నావైపుకు మళ్లించాను.
“చెట్లనుంచి వస్తుంది టీచర్‌...” వర్షం హోరుకన్నా గట్టిగా అరిచి చెప్పారందరూ.

పెండ్యాల గాయత్రి (54)


కథలు కనే కళ్ళు

“బ్రతికివున్నప్పుడు గాలి, నీడతోపాటు పండ్లను ఇచ్చి చనిపోయాక ఎండావానల నుంచి అందరిని రక్షించే చెట్టు లాగా
మనం పరులకు మేలు చేయాలే కానీ.. హాని తలపెట్టకూడదు శత్రు వైనా ఆపదలో ఉంటే సహాయం చేసే సంస్కృతి మనది”
అంటూ ‘నేను సైతం’ అనే పాఠంలోకి తీసుకెళ్లా ను.
ఆ తరువాత రోజు క్లా స్‌కెళ్లేసరికి రసూల్‌, వినయ్‌జంటగా కూర్చుని కనిపించారు. పిల్లలదెంతటి పసిడి మనసు! ఉగ్రవాద
సంస్థలు ఇలాంటి అమాయకులను చేరదీసి, శిక్షణనిచ్చి ఛాందసులుగా, దేశద్రోహులుగా మార్చేస్తా యి కాబోలు అనిపించింది. ఆ
తరువాత రసూల్‌లో మంచి నాయకత్వ లక్షణాలు కనిపించాయి. పిల్లలందరిని తన చేతలతో ఆకట్టు కొనేవాడు. చదువులోనే కాక
సహ పాఠ్యకార్యక్రమాల్లోనూ బాగా ముందుంటున్నాడు. 
***
అప్పటినుండి వాడు బడి మానేసింది ఇప్పుడే! మళ్లీ ఒక్కసారి క్లా సంతా కలయజూసి, “వినయ్‌కూడా బడికి
రాలేదేమిటర్రా!” అన్నాను. 
“వాళ్ల నాన్నని లారీ గుద్ది చచ్చిపోయిండు టీచర్‌” పిల్లలు చెప్పిన విషయం నా చెవులు జీర్ణించుకొనేలోపు,
 ”మేడమ్‌! మిమ్మల్ని హెచ్‌.ఎమ్‌గారు పిలుస్తు న్నారు” అటెండర్‌చెప్పాడు.
“పిల్లలూ.. మీకూ నెహ్రు గారు ఉత్తరం రాశారు కదా.. అలా మీకు నచ్చిన పెద్దలకు మీరొక ఉత్తరం రాయండి నేనిప్పుడే
వస్తా ను..” అని చెప్పి ఆఫీస్‌రూమ్‌దగ్గరకు వెళ్లా ను.
“సార్‌పిలిచారట..” హెచ్‌.ఎమ్‌తో పాటు అక్కడున్న ఇద్దరు వ్యక్తు లు నావైపు దృష్టి సారించారు. 
సార్‌ఏదో చెప్పబోయేలోపు, “ఏంది అయివారమ్మా.. నువ్వు పిల్లోళ్లకి చదువు చెప్తండావా.. తగులాటలు
నేర్పుతుండావా..” ఆ ఇద్దరిలో ఒకావిడందుకొని అంది.
“మీరుండండి,. నేను మాట్లా డుతున్నా కదా..” హెచ్‌.ఎమ్‌వాళ్ళను అనునయిస్తూ, “మేడమ్‌.. వీళ్ళు రసూల్‌
తల్లిదండ్రు లు. ఆ అబ్బాయి టీసి ఇవ్వమని అడుగుతున్నారు” కొంచెం నసిగినట్టు అన్నాడు.
“ఎందుకు సార్‌! పిల్లా డు బుద్దిగా చదువుకుంటుంటేను” నా మాట పూర్తికాక మునుపే, 
“నువ్వు మా ఇంటావంటా లేని బుద్దు లన్ని నేర్పుతుండావు..” మళ్లీ గట్టిగా అందావిడ.
“నువ్వుండమ్మా, నేను మాట్లా డుతున్నా కదా” అంటూ ఆమెను గదమాయించి, “మేడమ్‌.. మన స్కూల్‌లో చదివే
వినయ్‌వాళ్ళ నాన్న చనిపోయాడట. వాళ్ళ ఇళ్ళు వీళ్ళింటి దగ్గరేనట. శవ సంస్కారాలు జరుగుతుండగా రసూల్‌వాళ్ళింటికి వెళ్లి
శవాన్ని పూడ్చిపెట్టొద్దూ.. హాస్పిటల్‌కు పంపిస్తే పనికొచ్చే అవయవాలు తీసి శరీరాన్ని మళ్ళీ మనకు అప్పగిస్తా రూ.. అంటూ
ఆంబులెన్స్‌కు ఫోన్‌చేశాడట. వాళ్ళొచ్చి విషయం అడిగి, వాళ్ళు కాదనడంతో వాళ్ళు వీళ్ళు అందరూ కలసివచ్చి వీళ్ళిద్దరిని
తిట్టిపోశారట..” అని జరిగింది చెప్పారు హెచ్‌.ఎమ్‌.
రసూల్‌తండ్రి అందుకొని, “ఏదో చిన్నబిడ్డ తెలిసిదెలవక ఏదేదో అన్నడూ.. వాళ్ళందరికి సర్దిచెప్పుకుంటుంటే.. మా
బేటాగాడు ఆడికొచ్చి రోగులకు ఉపయోగపడే వాటిని మట్టిలో కలపడం తప్పు.. అని మాట్లా డి మల్ల గలాట పెద్దద్జేసిండు..”
అన్నాడు.
“పరువుగా బతికేటొళ్లం.. వానికీ తగులాటలు తగిలించిన్రు .. ఎన్నడూలేంది నా బేటాని చావు దెబ్బలు గొట్టిన..”
ఏడుపందుకుంది రసూల్‌తల్లి.
“నువ్వు ఏడవకమ్మ! ఏదో పొరపాటు జరిగిందిలే” అన్నాడు సోషల్‌టీచర్‌. 

పెండ్యాల గాయత్రి (55)


కథలు కనే కళ్ళు

“మా పిల్లోనికి ఈ సదువులేమొద్దు లే అయవారు.. వాళ్ళనాయిన్తో పాటు కిరానాకొట్లో కూర్చుంటే బతికిపోతడు’


కొంగుతో కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది ఆవిడ. 
ఇంతలో పి.ఎస్‌టీచర్‌కల్పించుకొని, “ఇంత చిన్న విషయానికి పిల్లా ణ్ణి బడిమాన్పిస్తా రా!” అంటూ రసూల్‌ని పిలిచి,
“ఒరేయ్‌! ఇకనించి మీ అమ్మానాన్న చెప్పింది విను.. దేనికి ఎదురు చెప్పకు సరేనా!” అన్నాడు రసూల్‌తలపై చెయ్యి ఉంచి. 
వాడు సరేనన్నట్టు తలాడించి వాళ్ళమ్మా నాన్నలకు ఏదో చెప్పాడు. వాళ్ళిద్దరు పి.ఎస్‌టీచర్‌కి నమస్కరించి, నా చైపు
ఒకచూపు విసిరి వెళ్లిపోయారు.
“ఇలాంటి తెలిసీ తెలియని వాళ్ళని తగిలించుకోకూడదు మేడమ్‌. ఆ తలనొప్పి మనం తట్టు కోలేము..” అన్నాడు మరో
టీచర్‌. 
‘అస్సలు ఖర్చులేనిది, అత్యంత తేలికైనది ఏదైనా ఉంది అంటే అది ఉచిత సలహా మాత్రమే. ఇచ్చేవాళ్లే తప్ప ఆచరించే
వాళ్ళుండరు’ అని అనుకుంటూ, “కానీ, ఒక మంచి సలహా పిల్లల్ని ఇంత ప్రభావితం చేస్తుందని ఊహించలేకపోయాను సార్‌!” అని
ఇక వెళతాను అన్నట్లు హెచ్‌.ఎమ్‌గారికి సైగచేసి అక్కడనిండి క్లా స్‌రూమ్‌కి వచ్చేశాను.
రసూల్‌నాదగ్గరకు వచ్చి, “టీచర్‌! ఈ పెద్దోళ్ళందరూ పిల్లలు చెప్పేది ఏది వినరుగాని.. కలక్టర్‌లు.. డాక్టర్‌లు చెప్పింది
చేస్తా రుకదా!” అన్నాడు. 
అవును అన్నట్లు చిన్నగా నవ్వి, ఎందుకు అన్నట్టు కళ్ళెగరేశాను. వాడు నా కళ్ళలోకి సూటిగా చూస్తూ,  “నేను బాగా
చదువుకుని కలెక్టర్‌నయ్యి అందరూ అవయవదానం చేసేలాగా ఆర్డర్‌వేస్త ” తన నిర్ణయానికి తిరుగులేదన్నట్టు దృఢంగా చెప్పాడు.
వాడి మాట తరగతి గదంతా ప్రతిధ్వనించింది.
‘ఇక ఢోకాలేదు.. నేను నాటిన విత్తనంలో జీవం ఉంది.  అది బిగుసుకున్న మట్టిపొరలను చీల్చుకొని వచ్చి
మొలకెత్తడానికి కొంతకాలం పడుతుంది. అందాకా ఓపికగా నీళ్ళుపోయాలి..’ అనుకుంటూ రసూల్‌‌భుజంతట్టి తన చొరవ,
ధైర్యం పిల్లలందరిలోనూ రగిలించాలనే సంకల్పంతో గాలి పీల్చుకున్నాను గుండెలనిండా.

(ఉపాధ్యాయినిగా తరగతి గదిలోని ఒక అనుభవం లోంచి వచ్చిన ఈ కథ, 2014 వ సంవత్సరం ఆకాశవాణి
విజయవాడ నుండి ప్రసారమై, 2016 వ సంవత్సరం ఆంధ్రభూమిలో ప్రచురించబడింది)

పెండ్యాల గాయత్రి (56)


కథలు కనే కళ్ళు

సిరికి వెన్నెల వస్తే..!?


‘నువ్వు వరస కలుపుకుంటే నీ కొడుకునవకపోను
నాకు చేతనైన సేవ నీకు చేయలేక పోను
మన సొంతం అంటూ వేరే ఏ బంధం లేదంటారు 
మనమంతా మానవులమే ఆ బంధం చాలంటారు’
కారు దిగి ఆశ్రమం లోపలికి నడుస్తు న్న జయచంద్రకు పాట వినబడడంతో, పరిశీలనగా చుట్టూ చూశాడు. ఆశ్రమ
ప్రాంగణంలో ఒకవైపు ఏదో కార్యక్రమం జరుగుతున్నట్లుంది. వందలాది ఆహూతులు ఆస్వాదిస్తుండగా ఒక యువకుడు
తన్మయుడై పాడుతున్నాడు. 
‘బిల్లు లన్నీ సిద్ధం చేశాను., సాయంత్రం ఆరు గంటలకల్లా ఇచ్చేస్తా ను.. మీరు వచ్చేయండి సర్ అని చెప్పి ఇప్పుడిక్కడకు
రప్పించిన మేనేజర్ కూడా మొదటి వరుసలో కూర్చొని పాట వింటున్నాడు., ఇక నా పనేం పూర్తి చేస్తా డు?’ అని లోలోపల
గొణుక్కుంటూ.. తప్పదన్నట్లు ఆవైపుకు నడిచాడతడు. 
“రండి రండి జయచంద్ర సర్..! మీ కోసమే ఎదురు చూస్తు న్నాము” అంటూ సాదరంగా లేచి వచ్చి, అతడిని సభలోకి
ఆహ్వానించాడు మేనేజర్.
“ఏమిటిదంతా..?” కూర్చుంటూ అడిగిన జయచంద్రకు పళ్ళ రసమందిస్తూ..
“ఈ ఆశ్రమ వాసులకు కాస్త ఆటవిడుపుగా ఉంటుందని, చిన్న పాటకచేరీ పెట్టించి.. మీవంటి ప్రముఖులను
గౌరవించుకోవాలనుకున్నాము సర్!” అన్నాడు మేనేజర్. 
“ఎన్నాళ్ళో గడిచాకా ఇన్నాళకు కలిశాకా ఉప్పొంగిన గుండెల కేకా ఎగసేను నింగి దాకా..”‘ 
మరో యువకుడు ఉద్విగ్నుడై పాడుతుండగా.. 
“ఈ కార్యక్రమం ఎప్పటికైపోతుందోనయ్యా, నాకవతల చాలా పనుంది..” 
“అయ్యో.. ఓ అరగంటలో ముగించేస్తా ము సర్, మిమ్ములను ఎక్కువగా ఇబ్బంది పెట్టము లెండీ!” జయచంద్ర చేయి
నొక్కుతూ అన్నాడు మేనేజర్.
‘ఇతను కనీసం ఒక లక్షరూపాయలకైనా బిల్ వేస్తా డా? ఆ కేసు నుండి నన్ను గట్టు న పడేస్తా డా? ఈ అనాథ అనామక
పిల్లలకు, పెద్దలకు వారం పైబడి మేపుతున్నాను.. బట్టలు, దుప్పట్లు , మాత్రలు అంటూ పాతిక వేలపైనే గుంజాడీ మేనేజర్.
ఆఫీసుకెళ్ళి, ఆ శీను సస్పెండ్ మ్యాటర్ ఫైల్ పూర్తి చేస్తే అర లక్షైనా ముట్టకపోవు.. పెట్టిన ఖర్చంతా తిరిగి దక్కకపోదు. ఇక్కణ్ణుంచి
త్వరగా బయటపడితే.. ఈ రాత్రికే...’ అనుకుంటూ గుంభనంగా నవ్వుకుని, “మేనేజర్ గారూ.. బిల్లింగ్...” నసిగాడు.  
“పచ్చనోటుతో లైఫు లక్ష లింకులు పెట్టు కుంటుందనీ అంది మనీమనీ 
పుట్టడానికీ పాడె కట్టడానికీ మధ్య అంతా తనే అంది మనీమనీ”
పాటకు లయగా వేళ్ళాడిస్తూనే, “హా.. వేసేసి సిద్ధంగా ఉంచేను సర్!” అన్నాడు మేనేజర్.
“ఇంకెన్ని పాటలు పాడిస్తా రయ్యా..? ఆ మైకు గోలకు తలపోటు వస్తోంది..” లేని చిరాకును ముఖాన పులుముకుంటూ
అడిగాడు జయచంద్ర.

పెండ్యాల గాయత్రి (57)


కథలు కనే కళ్ళు

మరొక అతిధి రావాలి సర్, ఆయన వస్తే సన్మానాల కార్యక్రమం మొదలవుతుంది.” మేనేజర్ అంటుండగా..
“సారూ, ఐదారేళ్ళ నాడూ.. నాకు పించను రాపిచ్చిన సారేగదండీ తమరు?! అప్పుడు రొండొందలే గానీ, ఇప్పుడు
రొండేలకి పైనే వత్తంది పించను డబ్బు..” జయచంద్ర వెనక కూర్చున్న వృద్ధ మహిళ పలకరించిందతనిని. 
“ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో ఆ వసంత మాసపు కులగోత్రాలను ఎల కోయిల అడిగేనా”
పాట వింటున్నట్లు ఒక్క క్షణమాగి వెనకకు తిరిగి చూశాడు. ఒక చెంప కాలి ఉన్న ఆమెను చూడగానే, చప్పున జ్ఞాపకం
వచ్చిందతనికి. ఆ రెండు వందల పించను రాయడం కోసం నాలుగు నెలలు ఆఫీసు చుట్టూ తిప్పించుకుని, ఐదువందలు
తీసుకున్నాడు. అదేమీ గుర్తు లేదేమో మరి ఆమె మనసారా నవ్వుతూ నమస్కరిస్తోంది. ఇక ఆవైపు చూడలేక ముందుకు తిరిగి
వేదికపైకి దృష్టి సారించాడు. 
“నా కన్నులు చూడని రూపం...” 
అనేక రూపాల తన ప్రతిరూపం కళ్ళముందు కదలాడుతూంటే.. జ్ఞాపకాల అలజడి అలలై ఉక్కిరిబిక్కిరి చేస్తూంటే.,
పాట వినడం కూడా కొనసాగించలేకపోయాడు. తన ముప్పై ఏళ్ళ సర్వీసులోని మాలిన్యాలన్నీ ఒక్కసారిగా ఉప్పెనలా
ముప్పిరిగొనగా, తట్టు కోలేక గట్టిగా ఊపిరి తీసుకున్నాడు కానీ.. ఇందాక నటనలో తెచ్చుకున్న తలపోటు తలపుల పోటై
పొడిచేస్తోంది. ఆ పాటలు, అందులోని మాటలు, తూటాలై.. తన బాటలోని మనుమాట్లను తవ్వి చూపుతూంటే అక్కడనుంచి
పారిపోతే బాగుండును అనుకున్నాడు.
“ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏక్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం 
రామ బాణమార్పిందా రావణ కాష్టం 
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం” 
ఆ పాట దాటిని మోపలేక దృష్టి మరల్చుకోవాలనుకుని వెనక్కు తిరిగాడు. 
‘వందల మంది వృద్ధు లు... అందరూ తన చేష్టల బాధితులే..!! తనలాంటి ఎందరెందరో దుష్టు లు, ఈ దుఃఖకాండకు
కారకులు. ఆ పెద్దలందరూ పెద్దపెట్టు న తనపై దాడిచేసి, చెంపలు వాయిస్తు న్నారు.. చేతులు మెలిబెడుతున్నారు.. చర్మాన్ని
రక్కేస్తు న్నారు... భరించలేక బావురుమంటున్నాడు తను. బ్రతకనివ్వమంటూ బాదేస్తు న్నారు తనను..’ 
తల విదిలించుకున్నాడు. ఆ చల్లని సాయంత్రాన జల్లు లవుతున్న చెమటను తుడుచుకున్నాడు. ఇక సభలో కూర్చోవడం
సరికాదని లేవబోతుండగా.,
‘“అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని 
మారదు లోకం మారదు కాలం”‘ 
అంటూ ఓ యువకుడి కంఠం కర్ణాల లోకి దూరిపోయింది. ఇక ఆగలేక రివ్వున పైకి లేచాడు.
“ఇంకొక్క ఐదు నిమిషాలే జయచంద్రగారూ.. సర్ వచ్చేస్తు న్నారట, ఫోన్ చేశారు” నొచ్చుకుంటున్న మేనేజర్‌కు
టాయిలెట్‌కు వెళ్ళొస్తా నన్నట్లు వేలు చూపించి, ఆశ్రమ గదుల లోపలికి వెళ్ళి పాటలు వినిపించకుండా తలుపులు
మూసేసుకున్నాడు. 
ఓ బాటిల్ నీళ్ళు తాగేసి, ముఖం కడుక్కుని, కాస్త స్థిమిత పడ్డా క మెల్లిగా నడుస్తూ వేదిక వద్దకు వచ్చాడు. 
“గుళ్ళో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే  

పెండ్యాల గాయత్రి (58)


కథలు కనే కళ్ళు

బళ్ళో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే 


గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే”‘
తన బాల్య స్మృతులను తట్టి లేపుతున్న ఆ తీయని పాటను మాత్రం ఒళ్ళంతా చెవులు చేసుకుని విన్నాడు. 
“క్షమించాలి జయచంద్ర గారూ.. మీ వంటి అధికారులకు అనేక బాధ్యతలుంటాయి., ఎంతో విలువైన మీ సమయాన్ని
వృధా చేశాము. సర్ దగ్గరకొచ్చేశారట, ఇహ మరునిమిషం లోనే సన్మాన సభ మొదలవుతుంది. ఇదే ఆఖరి పాటండీ!” మేనేజర్
మాటలలో వ్యంగ్యం ధ్వనించింది జయచంద్రకు. 
‘ఏం చేస్తాం? టై మ్ అతనిది..!’ అనుకుంటూ పాట వినసాగాడు. 
“పాము లాంటి రేతిరి పడగ దించి పోయింది 
భయం లేదు భయం లేదు నిదర ముసుగు తీయండి
సావు లాటి సీకటీ సూరు విడిసి పోయింది 
భయం లేదు భయం లేదు సాపలు సుట్టేయండి”
తనలో దూరిన భయపు భూతం వదిలినట్లనిపించిందేమో.. మునుపటికన్నా నిబ్బరంగా కూర్చున్నాడు.  
మేనేజర్ వేదిక ఎక్కడంతోనే గాయక బృందమంతా క్రిందకు దిగేసింది. అప్పటిదాకా గాయకుల ప్రత్యేకతను
గమనించలేదేమో అతడు.. అబ్బురంగా వారినే చూస్తూ ఉండిపోయాడు.
ఆరంభ వచనాలు పూర్తి చేసి, అప్పుడే అక్కడికి విచ్చేసిన ఆత్మీయ అతిధిని వేదికపైకి ఆహ్వానించిన మేనేజర్ తనను
రెండవసారి పిలిచేదాకా.. వేదిక వైపుకు దృష్టి సారించలేదతడు. మునుపెప్పుడూ లేని పరధ్యానానికి లోలోపల నొచ్చుకుంటూ..
లేచి వెళ్ళబోయి, వేదికపైనున్న వ్యక్తిని చూసి, విస్తు పోయి చేష్టలుడిగి శిలలా నిలుచుండిపోయాడు. 
“మిమ్మల్నే పిలిచాను జయచంద్ర గారూ, రండీ.. వేదిక మీదకు విచ్చేయండీ..!” మేనేజర్ మళ్ళీ పిలవడంతో కలలో
నడిచినట్లు వెళ్ళి వేదికపై ఇబ్బందిగా కూర్చున్నాడు.
‘ఏమిటీ ఈ పరిస్థితి? ఇదంతా పరీక్షా.. ప్రశంసా? ఇప్పుడందుకోబోయేది గౌరవమా.. పరాభవమా? తన టై మ్ వెనకకు
నడవడం కాకపోతే, ఈ అనంతమూర్తి గారు, ఇక్కడికెందుకు రావాలి? లేదు, ఈయన వస్తు న్నప్పుడు తనెందుకిక్కడ ఉండాలి?
ఈ మహానుభావుడు మాట్లా డుతూ ఆ విషయం చెప్పేస్తే, ఇంతమందిలో తన పరువేం కానుంది? ఇన్నేళ్ళుగా ఎన్ని కానిపనులు
చేసినా హోదాకు తగ్గట్లు కాలర్ ఎగరేశాడే గానీ, ఎవరికీ బోణీ కాలేదు.’
“ఏమండీ.. జయచంద్ర గారూ.., ఎక్కడాలోచిస్తు న్నారండీ! ఒక్క నిమిషం ఇలా రండీ!” 
మేనేజర్ కేకతో ఉలికిబాటుగా లేచి వెళ్ళాడు. సిరివెన్నెల చిత్రపటానికి అనంతమూర్తి పూలమాల అలంకరిస్తుంటే, తనను
అగరువత్తు లు వెలిగించమన్నాడు మేనేజర్. అప్పుడు బోధపడింది జయచంద్రకు., ఇప్పటిదాకా,, ఇటీవల అశువులు బాసిన
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నివాళిగా ఆయన పాటలతో పాట కచేరీ సమర్పించారని,, ఆ అంధ గాయకులు తమ అమోఘ
గళాలతో శాస్త్రి గారిని స్తు తించారని..! సభికులంతా సిరివెన్నెలకు వందనాలర్పించాక, మేనేజర్ మైకు వద్దకు వచ్చి.. 
“ఈ ఆశ్రమంలో గత పది సంవత్సరాలుగా ఓ సత్సాంప్రదాయం నడుస్తోంది. ఆశ్రమ స్నాతకోత్సవం నాడు ఏదో ఒక కళా
ప్రదర్శన ఏర్పాటు చేసి, ఆ కళాకారులను సముచితంగా గౌరవించడం జరుగుతుంది., అంతే కాదు, ఆశ్రమ నిర్వహణకు సాయపడే
దాతలను కూడా ఆ సభలోనే సాదరంగా సన్మానించుకునే సంప్రదాయం కొనసాగుతోంది. అందులో భాగంగా ఇవాళ.. గగనపు విరి
తోటకేగిన మన తెలుగు పాటల సీతారాముని స్మరించుకోవడంతో పాటు.., మన ఆశ్రమానికి ఆప్తమిత్రు డు, మనందరి ఆత్మ

పెండ్యాల గాయత్రి (59)


కథలు కనే కళ్ళు

బంధువు, మన జిల్లా కోర్టు లో న్యాయ రక్షకుడు అయిన అనంతమూర్తి గారిని,, గతవారం రోజులనుండీ మనందరికీ అన్నదానం
చేస్తు న్న సహృదయులు, మన జిల్లా స్థా యి అధికారి అయిన జయచంద్ర గారిని గౌరవించుకోవాలనుకున్నాము. ఈ సందర్భంగా..
ముందుగా మనవాడు, మన చెలికాడు అయిన అనంతమూర్తి గారు తన స్పందన అందిస్తా రు.” అంటూ మూర్తికి మైకు
అందించాడు మేనేజర్.
పరీక్ష - ఫలితాల నడుమ నడిచే మూల్యాంకన ఉద్విగ్నతతో ఒదిగి కూర్చుని వింటున్నాడు జయచంద్ర .
“నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది. 
గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది.
ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతావా?’”
ఇలా అక్షరాలలో ప్రత్యక్షమై, నిన్నూ నన్నూ ప్రశ్నిస్తు న్నాడు సిరివెన్నెల. ఏం జవాబు చెప్తా వు? ‘ఆశ్రమాన్ని నడిపించడంలో
సాయపడే దాతలను గౌరవించుకుంటాము, మీరు రావాలి’ అన్నారు మేనేజర్. సంఘంలో సకల సదుపాయాలు పొందే నావంటి
వాడు కాస్త సాయం చేస్తే సన్మానమన్నారు..! ఏ ఆసరా, ఆదరణా లేని ఇక్కడి వృద్ధు లు ప్రతి సంవత్సరం జరిగే కళా ప్రదర్శనకు ఒక
నెల పించను డబ్బును విరాళమిస్తా రు.. ఇందాక పాటలు పాడిన గాయకులందరికీ ఇవ్వబోయే కానుకలు వయసుడిగిన ఆ
పెద్దమనసులవే అంటే నమ్మగలరా..! వెళ్ళిపోయిన సిరివెన్నెలను ఆ గాయకులలో చూసుకున్నారు వాళ్ళు. చీకటి నిండిన ఆ
గాయకుల కళ్ళకు ఈ వృద్ధు లు తమ సిరిని వెన్నెలగా అందించారు. ఇంతకన్నా గొప్ప సాయం, ఔదార్యం ఉంటాయని
నేననుకోను. నన్ను వారిలో ఒకడిగా కలుపుకోగలిగితే నాకంతకుమించిన సన్మానం లేదనుకుంటాను. విశ్రాంతి లభించని విధులతో
సతమతమయ్యే మన జయచంద్రగారు ఇలా మన ఆశ్రమానికి సేవ చేయాలనుకోవడం అంటే.. అది వారి ఔన్నత్యమే కాదు, ఈ
ఆశ్రమ వాసుల అదృష్టంగా కూడా నేను భావిస్తు న్నాను..” అంటూ ముగించాడు మూర్తి. 
అందరి హర్షాతిరేకాల నడుమ, “ఈ అనంతమూర్తి.. న్యాయమూర్తే కాదు, అపరిమిత ప్రేమమూర్తి కూడా...! ఇప్పుడు
జయచంద్ర గారు మాట్లా డతారు.” అంటూ అతనికి మైక్ ఇచ్చాడు మేనేజర్. 
“రాముడు మంచి బాలుడు అని అంతా అంటారు గానీ మన సీతారాముడూ.. మంచిని చెప్పుకున్నంత చక్కగా
చెడును కప్పేసుకుంటారు.. రాముని వన్నె పూసుకున్న రావణులు. అయితే.. రావణత్వాన్ని కప్పేసైనా,, రామ తత్వాన్ని
బ్రతికించాలని తపిస్తా రు కొందరు మహాత్ములు. దీనివలన సమాజానికి జరిగే మేలెంతో నేను చెప్పలేను గానీ, ఇలా అన్నదాతగా
నన్ను మార్చి, మీ వద్దకు తీసుకు వచ్చింది మాత్రం ఈ జడ్జి గారే..!” అంటూ కొద్దిసేపు ఆగాడు జయచంద్ర. 
అందరి ముఖాలలోని ఉత్సుకతను చూసి వెంటనే కొనసాగించాడు. 
“సామాజిక సేవ చేయండి., వారంరోజుల పాటు భోజన ఖర్చు భరించండి.. ఏదైనా అనాథాశ్రమం లేదా వృద్ధా శ్రమానికి
సేవను అందించండి. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు గాను ఈ జడ్జిగారు నాకు విధించిన శిక్ష ఇది. ఆఖరుకు ఇందులో
సైతం నా హస్త లాఘవం చూపించబోయి, వీరి ఔన్నత్యం ఎదుట చతికలపడ్డా ను. ఇప్పటిదాకా నేను గడించిన చీకటి సిరిలో కొంత
ఈ ఆశ్రమానికీ, ఇక్కడి కళాకారులకు అందించి వెన్నెల ఝరిగా మారుస్తా ను. మీరంతా వరస కలుపుకుంటే పెద్దలకు కొడుకుగా,
పిల్లలకు తండ్రిగా వారం వారం చేతనైన సేవ చేసుకుంటాను. ఆ సిరివెన్నెల ఇచ్చి వెళ్ళిన పాటలు పాడించుకుంటాను.” మిన్నంటిన
కరతాళ ధ్వనుల మధ్య తన మాటలు ముగించాడు జయచంద్ర.

(అమృత కవి సిరివెన్నెల గారికి స్మృతిగా.. ఆయన పాటలనుపయోగించి వ్రాసిన ఈ కథ, 2022 వ సంవత్సరంలో సహరి
వారి కొసమెరుపు కథల పోటీలో వెయ్యి రూపాయల బహుమతి గెలుచుకుంన్నది)

పెండ్యాల గాయత్రి (60)


కథలు కనే కళ్ళు

ఆత్మవిమర్శ
అందమైన ఈ సృష్టిలో మహదానందకరమైనది మానవుని జన్మ. తిరిగి పొందలేని విలువైన జీవితాన్ని చేజార్చుకున్నాను.
శూన్యంలోకి పరుగులు తీశాను. ఇప్పుడు చీకటి వెలుగుల తేడా లేదు. ఇక్కడ కష్టసుఖాలు, కావడి కుండలు లేవు. సమస్యలసలే
లేవు పరిష్కరించడానికి. బాధపంచే వరకు ఎందుకు,, సంతోషం పంచేందుకు కూడా ఎవరూ ఉండరు. అసలు మనసుంటే కదా
ప్రేమకైనా, దేనికైనా తావుండేది. కళకళ నవ్వే కళ్యాణినై కలకాలం జీవించి ఉంటే ఎంత బాగుండేది..!
పేదరికంతో స్నేహం చేస్తు న్న అమ్మానాన్నలకు అక్క, అన్నల తర్వాత మూడోబిడ్డనై పుట్టినా ముద్దు గా పెంచుకున్నారు.
కళకళలాడుతున్న నన్ను కళ్యాణినని ప్రేమగా పిలుచుకుంటున్నారు. కష్టా లకోర్చి కూలినాలి చేసిన ముగ్గురు పిల్లల్ని ముచ్చటగా
చదివించుకోవాలి అనుకున్నారు. అమ్మానాన్నల గారాబమో లేక స్నేహితుల ప్రభావమో తెలియదు కానీ, నాకు చదువంటే బొత్తిగా
ఆసక్తి లేకుండా పోయింది. నా మనసు నామాట వినడం మానేసింది. అందాల హంసలా అలా తినిపోవాలని, కోరికలు గుర్రాలపై
స్వారీ చేయాలని, హటాత్తు గా రెక్కలు వచ్చి ఆకాశంలోకి ఎగిరిపోవాలని, గంధర్వ పురుషుడెవరో వచ్చి నన్ను వివాహమాడతాడని
తీయని కోరికల నేపథ్యంలో, పుస్తకాలను చూస్తే పురుగుల్ని చూస్తు న్నట్లు ఉండేది. సాదాసీదాగా ఉండే పల్లెటూరు అబ్బాయిలను
చూసి ఎగతాళి చేస్తుండేదాన్ని. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో అతి కష్టమ్మీద పదోతరగతి పాసయ్యాను. అక్క, అన్న ఇద్దరి
చదువులు కూడా కొనసాగుతున్నాయి. నేను మాత్రం చదువుకి పుల్‌స్టా ప్ పెట్టేసాను.
మా ఊరు పట్టణానికి కాస్త దూరంగా ఉండటం వల్ల నాలా పై చదువులకు నామం పెట్టిన అమ్మాయిలకేమీ కొదవలేదు.
వాళ్లతో రోజంతా హాయిగా పచార్లు కొట్టేదాన్ని. అమ్మ దగ్గర గోలచేసి, లేక ఇంట్లో దొంగలించో ఎలాగోలా డబ్బులు సంపాదించి,
స్నేహితులతో విడుదలైన ప్రతి సినిమా చూసేదాన్ని. కాస్త హై లెవల్‌గా ఉన్న అబ్బాయిలు కనిపిస్తే చాలు, అతని గురించి కబుర్లు
చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళం. నిద్రలేచి పొలం వెళ్లే అమ్మానాన్నలకు నా పనులు తెలియకుండా జాగ్రత్త పడేదాన్ని. అలా
ఆనందంగా ఒక సంవత్సరం గడిచింది.
ఒకరోజు దూరపు బంధువు ఒకాయన మా ఇంటికి వచ్చాడు. క్షేమ సమాచారం తెలుసుకొని తను వచ్చిన విషయం
చెప్పాడు. ‘మా ఊరిలో ఓ మంచి సంబంధం ఉంది. అబ్బాయి పెద్దగా చదువుకోకపోయినా కష్టపడి పని చేస్తా డు.,
బుద్ధిమంతుడు. వాళ్లకు సొంత ఇల్లు తో పాటు ఐదెకరాల పొలం కూడా ఉంది. కాస్త పని అందుకునే పిల్లయితే
బాగుండునన్నారు..’ అంటూ... ఏదో ఒక పిట్టకథ చెప్పినట్లు ఆ పల్లెటూరిమొద్దు గురించి అమ్మానాన్నలతో చెప్పాడు. 
‘పెద్దమ్మాయి చదువుకుంటుంది కాబట్టి, చిన్నమ్మాయి కళ్యాణిని ఇస్తా మని చెప్పండి. వాళ్లు అంగీకరిస్తే మంచిచెడ్డలు
మాట్లా డుకుందాం..’ అని నాన్న చెప్పటంతో అతడు శుభం అంటూ వెళ్ళిపోయాడు.
నా నెత్తిన పిడుగు పడ్డట్లు అనిపించింది. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోనని అమ్మతో చెప్పి బాగా ఏడ్చాను. 
‘చదువు సంధ్యలు లేకుండా, పెళ్లి చేసుకోకుండా ఆ ఇల్లు , ఈ ఇల్లు తిరుగుతూంటావా! ఎలాగయినా ఈ సంబంధం
కుదిరితే మాకు సగం భారం తగ్గుతుంది. చెప్పిన మాట విను..’ అంటూ నియంతల మాదిరి ఆజ్ఞాపించారు అమ్మానాన్న. 
శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువుతీరి ఉన్న తిరుమల కొండపై నా వివాహం జరిగింది.
అయిష్టంగానే వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టా ను. అతడు నాకన్నా పది సంవత్సరాల పెద్దవాడు. హీరో కింద అసిస్టెంట్
వేషానికి కూడా పనికొచ్చేలా లేదారూపం. దానికి తోడు గొర్రెల కాపరి వృత్తొకటి. పొద్దు న లేచిన దగ్గరనుండి ఇంట్లో వాళ్ళందరూ
పనులకు వెళ్లేవాళ్లే. పని చేయమని నన్నెవరు ఆజ్ఞాపించ లేదు. ‘ఇంకా చిన్నపిల్లలే కళ్యాణి’ అనుకుంటూ ఉండేవారు. నాకోసమో
కాదో తెలియదు కానీ, కొత్తగా కలర్ టీవీ తీసుకువచ్చారు. అయితే ఈ ఇంటితో కానీ, ఇక్కడ మనుషులతో గాని నాకు
సంబంధం లేనట్లు ఉండేదాన్ని. మావూరు వెళ్దా మన్నా, సినిమాకు, షికారుకు వెళ్దా మన్నా భర్తతో కలిసి వెళ్లా లి అంటారు. అసలే

పెండ్యాల గాయత్రి (61)


కథలు కనే కళ్ళు

పెళ్లిలో మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎంతో ఎగతాళి చేశారు. అతనితో వెళ్లే కన్నా ఇంట్లో కూర్చొని తపస్సు చేసుకోవటం
మేలనిపించేది. 
నాన్న నన్ను చూడటానికి వచ్చినప్పుడు ఇంటికొస్తా నంటే ఇద్దరూ కలిసి రమ్మనేవాడు. నా బాధ చెప్పుకోవడానికి కనీసం
స్నేహితులైనా లేరు. ఈ ఇల్లు ఒక జైలు, ఇక్కడ మనుషులంతా మూర్ఖులు. ఆ ఆరునెలలు అనుభవించిన నరకం చాలు.
సంతోషం కరువైన ఈ జీవితం ఎందుకు..? మధ్యాహ్నం వేళలో ఇంట్లో ఎవరూ ఉండరు. అప్పుడు ఉరివేసుకొని చనిపోతే హాయిగా
ఉంటుందనుకొని ఈరోజు మధ్యాహ్నం ఒక కాగితంపై ‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని రాసిపెట్టి నా చీర ఒకటి తీసుకుని
ఉరి వేసుకున్నాను. ప్రాణం ఎలా పోతుందో తెలియదు కానీ, ఇటువంటి పరిణామము, చలనములేని ఈ జీవితం ఎంత
దుర్భరంగా ఉంది. భరించలేక పోతున్నాను. ప్రాయశ్చిత్తం చేసుకోలేని పాపం చేశాను. నా సుఖం కోరుకునే అమ్మానాన్నల
మాటలు వినలేదు. స్నేహంలో మంచిచెడులు తెలుసుకోలేదు. గాలి మేడలు కట్టు కొని అందులోనే సమాధి అయ్యాను. నెమ్మదిగా
నేను నా మనస్సును, బుజ్జగిస్తూ నిలదీయటం ఆరంభించాను.‌
‘కలలు కనే ఓ కన్నెమనస్సా..! దయచేసి నేను చెప్పేది విను. కోరికలనే గుర్రాలకు కష్టపడి కళ్లెం వేయాలి కానీ. కంచె
దాటనివ్వకూడదు. అసలు నీ సామర్థ్యంతో తెలుసుకోవాలి. నేనేమీ ఐశ్వర్యవంతురాలని కాదు. అందాలరాశినేమీ కాదు.
విద్యావంతురాలిని కాకపోయినా, కళాకారిణిగా ప్రసిద్ధి కాలేనా? అదీకాదు.. నీ మటుకు నువ్వు అన్ని విలువలు కలిగున్నావా? అది
లేదు, నీలో ఏ ప్రత్యేకత లేకుండా అందగాడినో, అందని వాడినో ఆశించి అందలేదని నిరాశపడితే ఎలా? ఒక్కసారి నీలో నువ్వు
ఆత్మపరిశీలన చేసుకో. ఆ దైవం నీకిచ్చిన జీవితం చాలా విలువైనది. సుఖం లేదన్న భ్రమలో దుర్భరమైన మరణాన్ని ఆశ్రయించకు.
సమస్యకు చావు పరిష్కారం కాదు. అనుభవపూర్వకంగా చెబుతున్నాను. దయచేసి నా మాట వింటావు కదూ... ఓ కన్నె
మనసా..! కలలు కలలు కనటం మానివేస్తా వు కదా..’ అంటుండగా హటాత్తు గా మెలకువ వచ్చింది.
              మధ్యాహ్నం నాలుగు గంటలు అవుతున్నట్లుంది. వెనుక వాకిలి నుంచి వెచ్చని సూర్యకిరణాలు నా ముఖాన్ని
తాకుతున్నాయి. ఉలిక్కిపడి పైకి లేచి కూర్చున్నాను. నా చావుకి ఎవరూ కారణం కాదని రాసిన కాగితం మంచం మీద పడుంది.
పక్కింటి బామ్మ కుర్చీలో కూర్చుని టీవీ చూస్తుంది. అప్పుడు అర్థమైంది నాకు,, ఇంతసేపు నేను కలగన్నానని. మధ్యాహ్నం
చనిపోదామన్న ప్రయత్నంలో ఉండగా ఈ బామ్మ వచ్చి నా పనికడ్డు తగిలింది. ఈవిడను తిట్టు కుంటూ సొమ్మసిల్లినట్టు
పడుకున్నాను. తర్వాత నిద్ర పోయినట్లు న్నాను. అరే..! ఎంత భయంకరమైన కలొచ్చింది. చనిపోయిన తర్వాత పరిస్థితి అంత
దారుణంగా ఉంటుందనుకోలేదు. నా జీవితమంతా ఓ కథలాగా ఎవరితోనో చెబుతున్నాను కానీ, వినేవారు ఎవరు లేరు.       
నేనెంత పొరపాటుగా ఆలోచించాను ఇన్నాళ్లు . ఈ బామ్మ రాకుండా ఉంటే నిజంగా చనిపోయే దాన్నేమో. నా
వాళ్ళందరూ ఎంత బాధపడేవాళ్ళు కదా!.. నేను చదువుకోకపోవడం వల్లే కదా అమ్మానాన్నలు నా పెళ్లి విషయంలో
తొందరపడ్డా రు. కష్టమైనా అక్కను చదివిస్తు న్నారు. అందుకే అంటారు కాబోలు ప్రతి ఆడపిల్ల తప్పక చదువుకోవాలని. అయినా,,
అత్తవారింట్లో నాకేం సమస్యలున్నాయి? ఏదో ఒక చేతిపని నేర్చుకుంటే ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి. ఇంక
ముందెప్పుడు చావు గురించి ఆలోచించను. నేను కన్న కల ఇప్పుడు నన్ను రక్షించింది. భయంకరమైనది కాదు బంగారమంటిది
నా కల. ఇకనుంచి అందరితోనూ ప్రేమగా ఉంటాను. నాతోటి అమ్మాయిలందరికీ చదువుకోమని చెబుతాను. ఆత్మవిశ్వాసంతో
సమస్యలను పరిష్కరించుకోవాలి., మనకందని దానిని ఆశించకూడదు అని చెప్తా ను. మంచి భార్యగానే కాదు, మంచి కోడలిగా
కూడా పేరు తెచ్చుకుని అమ్మానాన్నలకు మంచి పేరు తెస్తా ను..’ అనుకుంటూ మంచం దిగి,, టీవీ చూస్తూ హాయిగా
నవ్వుకుంటున్న బామ్మకు రెండు చేతులెత్తి నమస్కరించాను., సరికొత్త జీవితాన్ని ప్రారంభించబోతూ.......,


పెండ్యాల గాయత్రి (62)


కథలు కనే కళ్ళు

(అవాంచిత ఆకర్షణకు లోనై, ఆపదలో చిక్కుకుని.. ఆత్మహత్య చేసుకున్న మా పక్కింటమ్మాయి గాధ నేపథ్యంగా వ్రాసిన
ఈ కథ, 2010 వ సంవత్సరం ఆకాశవాణి కడప, విజయవాడ కేంద్రాలలో ప్రసారమయింది)

తుఫాన్ నగర్
“అమ్మా ఆకలేత్తాందే” పొట్టపై తన కుడిచేతిని నాట్యం చేయిస్తూ అంది నాలుగో కూతురు.
“మీ నాన బియ్యం దెత్తా నని ఊళ్ళోకి బోయి గెంటయింది అంతులేడు..” వాకిట్లో నిలబడి బజార్లోకి చూస్తూ అందామె.
“అమ్మా..! అక్కోళ్ళేరి? వాక్యం జెప్పే సారోళ్ళొత్తు న్నారంట. తుపాన్ నగరు పిల్లోళ్ళంతా పళ్ళాలు బట్టు కొని అరుగుచెట్టు
కాడికి బోతున్నరు..” పరిగెత్తు కుంటూ వచ్చిన ఐదవ కూతురు సమాచారం అందించింది.
సిగరెట్ పొగ గుప్పున ఆ ముగ్గురి ముక్కుపుటాలను తాకడంతో బయటకు చూశారు.
చేతులూపుకుంటూ వస్తు న్న అతడికి ఆమె ఎదురెళ్లి, “బియ్యమేయయ్యా?” అంది పైనుంచి కిందకి చూస్తూ.
“ఇయాల్టికి మనకి బియ్యం అక్కర్లేదే, వాక్యం జెప్పి అన్నం బెడతారంట. అందరం ఆడికి బోదాం..” మరో సిగరెట్
వెలిగిస్తూ అన్నాడతడు.
“ఆడ, పెద్దోళ్లకు పెట్టరు నానా.. పిళ్ళోళ్ళకే” అంది ఐదవ కూతురు.
“మీ అమ్మొచ్చి వడ్డిత్తదిలేమ్మా. నాగ్గూడా కాత దెత్తది”
అతడి మాటలకు అడ్డొచ్చిన ఆమె, “ఓర్నీ దురాశకు ధూం దగల. వాళ్లెప్పుడో ఒంటి గెంటకి అంత ముద్ద పెడితే, అప్పుడి
దాకా పిళ్ళోళ్ళేం దినకుండా ఎట్టుంటరు. ఏయీ! ఆ డబ్బులిటియ్యి. నేను బోయి టిపినన్నా దెత్తా ..” దూకుడుగా చేయి
జాపింది.
“యాడున్నయే ఇయ్యాల్సినోళ్ళకి ఇచ్చేసిండ్ల..” అన్నాడతడు.
“ఓరి నీ పిండం బెట్ట, వారంరోజుల కూలీ డబ్బులు నీకిత్తినే” అంది ఆవేశంగా.
“ఆ ఇచ్చావులే యెయ్యి రూపాయలు. ఏమూలకొత్తయి అయ్యి” అంటూ అక్కడినుంచి జారుకోబోయాడు.
అతడికి అడ్డం పడ్డ ఆమె, “ఇదిగో జూడు, వద్దంటే ఇనకుండా మగపిల్లడు ఉండాలా అంటా,, ఆరుగుర్నీ గనిపించినవ్.
పనీబాట లేకుండా నువ్వు గాలికి తిరుగుతుంటే, నేను కూలికిబోయి, నీకింత ముద్ద బెడుతున్న. నా కట్టా న్ని తాగి
తందనాలాడినవంటే ఊరుకోను జెప్తు న్న..” బాధ, కోపం కలిసి ఆమె గొంతు రెట్టింపు అయ్యింది.
“ఏందే దెగ రెచ్చిపోతున్నవ్, కట్టబడాల్సిన కర్మ నాకేందే, ఆరుగుర్నీ గాదు అరవైమందిని గన్నా, నా బిడ్డల్ని గవర్నమెంటే
చాకుద్ది, చదివిచ్చిద్ది, బతికిచ్చిద్ది. నేను గూడ బెట్టా ల్సిన పనిలేదు. ఆదివారం పూట అంటావా ఇట్టాంటోళ్ళెవళ్ళో వకళ్ళు వొచ్చి,
తిండిబెట్టి బోతరు. అంత దానికేందో తెగ సాగదీత్తు న్నవ్..” అన్నాడు మూతిని తిప్పుతూ.
“నీ చావు నువ్వు జావు. ఆ డబ్బులిటీ” అంటూ అతని జేబులో చెయ్యి పెట్టింది.
“ఏందే,, ఈ నడమ ఎక్కవవుతుంది నీకు” అంటూ ఆమెను పక్కకు తోసేసి, పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు.
ఆ ఊపున గోడకి గుద్దు కొని కిందపడిందామె. కూతుళ్ళు పరుగున వచ్చి, పైకి లేపి పక్కనే ఉన్న కుక్కి మంచంలో
కూర్చోపెట్టా రు.
“ఆ ఆస్టల్లో ఉంటేనే నయమమ్మీ. మూడుబూటలా అంత ముద్ద దింటారు. ఇంటికొత్తే పస్తు ల పండగయిపోయింది..”
మోచేతి గాయాన్ని కొంగుతో తుడుచుకుంటూ బాధగా అంది.

పెండ్యాల గాయత్రి (63)


కథలు కనే కళ్ళు

“మా! అందరూ పళ్ళాలు బట్టు కొని ఎళ్తన్నరు..” అంటూ ఆమె ఐదేళ్ల కొడుకు చెప్పాడు.
“మీ అందరికీ పళ్ళాలన్నా ఉంచాడా మీయయ్యా. ఇంట్లో ఏ వొత్తు వుని బతకనిత్తు న్నడు. వీడి బతుకు బండలైబోతే”
అంది ఆమె.
“మా బళ్ళో ఇచ్చిన పళ్ళాలు తెచ్చుకున్నమమ్మా, అయి తీసుకెళ్తాం” రెండోకూతురు అంటుండగా.,
“ఆడ, పొటోలు దీత్తరేమో! కొత్త బట్టలేసుకుంటామే” గారంగా అంది మూడవ కూతురు.
“గవర్నమెంటోళ్ళిచ్చిన గుడ్డలున్నయిగా,, ఏసుకోండమ్మా..” అందామె.
ఐదేళ్లనాడు సముద్రతీర గ్రామాలు, తుఫానులో చిక్కుకొని ముంపుకు గురయ్యితే, పొట్టచేత పట్టు కొని, ఒక వంద
కుటుంబాల వాళ్లు ఈ ఊరు వలస వచ్చి, ఊరికి ఎడంగా, పాకలేసుకుని బ్రతుకు సాగిస్తు న్నారు. కాలక్రమేణా ఈ వలస ఊరుకు
తుఫాను నగర్ అని పేరు పడింది.
అరుగు చెట్టు దగ్గరకి సుమారు రెండు వందలమంది పిల్లలు పళ్ళాలతో సహా చేరుకున్నారు. కాసేపటికి ఆమె కూడా
చెట్టు దగ్గరకి చేరుకుంది. వచ్చినవాళ్లు ప్రవచనాలు చెబుతున్నారు. 10: 30...11.....12.... 12:30.... ఇంకా వాళ్ళు ఏదో
చెబుతూనే ఉన్నారు. ఆమెకు ఆత్మారాముడు ఘోష తప్ప వాళ్ల భాష చెవికెక్కట్లేదు. గతంలో కూడా రెండు మూడుసార్లు ఇలానే
బోధ చేసి భోజనాలు పెట్టా రు. వాళ్లు చెప్పేది తమ ఇంటి దేవుడి గురించి కాకపోయినా, పిల్లల ఆకలి తీరుస్తు న్నప్పుడు మడి
కట్టు కోకూడదని పంపిస్తుంది తను. ఆకలి మంట దహించివేస్తుంటే కూర్చునే శక్తి కూడా నశిస్తోంది. మిట్టమధ్యాహ్నం కావడంతో
చెట్టు నీడ తగ్గిపోయి ఎండ కూడా ఆకలి లాగే మండుతోంది.
‘తన స్థితే ఇలా ఉంటే ఇక పిల్లల పరిస్థితేంటి!’ అనుకుంటూ పైకి లేవబోయింది.
“ఇకముందు మీకందరికీ ఈ ఎండ బాధ ఉండదు, ఈ ప్లేస్ లోనే దైవబోధ కొరకు, మంచి బిల్డింగ్ కట్టించబోతున్నాం.
ఇంకాసేపట్లో లండన్ నుంచి వచ్చిన దొరలు మీ చెంతకు వచ్చి, మీకు ప్రేమగా అన్నం పెడతారు. మీలో ప్రతి ఒక్కరికి ప్లేటు, గ్లా సు,
రెండు జతల బట్టలు కొని ఉంచాము. ఇవాళ తేవలసింది., కానీ‌జీపులో, వండిన ఆహార పదార్థా లు సరిపోవడంతో తీసుకురాలేదు.
దొరలు వచ్చి అడిగినప్పుడు ప్లేట్లు బట్టలు మేమిచ్చామని చెప్పాలి మీరు. అంతేకాదు వారం వారం భోజనాలు పెడుతున్నామని
కూడా చెప్తా రు కదూ..” అంటూ బోధకుడు చెప్తుండగా పిల్లలంతా చప్పట్లతో తమ సమ్మతి తెలియజేశారు.
“దేవుడు మీకు మేలు చేస్తా డు...” అంటూ ఇంకా ఏదో చెప్తుంటే ఎండనుంచి తప్పించుకునేందుకు ఇంకొక చెట్టు
కిందకు వెళ్లి కూర్చుంది ఆమె.
ఒకటి ఒకటిన్నర రెండు గంటలు దాటుతుంది. వాళ్ల బోధ ఆగలేదు. వండుకొచ్చిన ఆ ఆహారపదార్థా లన్నీ జీపులో
ఉన్నట్లు న్నాయి, వాటి ఘుమఘుమలతో పేగులు మరింత గంతులేస్తు న్నాయి ఆమెకు. పళ్ళాలను అటు ఇటు కదుపుతున్న ఆ
పసి ముఖాలు వాడిపోయి వేలాడుతున్నాయి.
ఒక బోధకుడు ఫోన్లో మాట్లా డుతూ ఇవతలి చెట్టు వద్దకు వచ్చాడు.
“ఆహా,, ఈతమొక్కల మన్నూరు వెళ్తు న్నారంటనా.. ఓకే ఓకే., వాళ్లు వచ్చేసరికి మేము అక్కడ ఉంటాం. ఆఁ ఈ
భోజనాలే తీసుకొస్తాం” అంటూ ఫోన్ పెట్టేసి మరో బోధకుడి దగ్గరకు వెళ్లి ఏదో చెప్పాడు,
“అరే పిల్లలూ... మీకు కాసేపట్లో బిస్కెట్లు వస్తా యి, ఇక్కడే ఉండండి..” అని, ఇద్దరు వ్యక్తు లు హడావిడిగా జీపెక్కి
వెళ్ళిపోయారు.

పెండ్యాల గాయత్రి (64)


కథలు కనే కళ్ళు

అక్కడున్న ఒక బోధకుడు పిల్లలకు ఏదో చెప్తు న్నాడు. ఏం జరిగిందో అర్థం కాని పిల్లలంతా చెల్లా చెదురై గోల
చేస్తు న్నారు.
“అమ్మా ..! తమ్ముడు పడిపోయాడే..” అంటూ వచ్చింది ఆమె మూడవకూతురు.
లేని శక్తిని కూడగట్టు కొని, బిడ్డ దగ్గరికి వెళ్లి ఎత్తు కొని, భర్తని పిలిచి మౌనంగానే తన వేదన చెప్పింది. అతడు నలుగురు
మగాళ్ళను కలుపుకొని గోల చేస్తూ బోధకుడి దగ్గరకు చేరుకున్నారు. కాసేపటికి బైకుపై వచ్చిన ఒక వ్యక్తి, వాళ్లకు చాటుగా సీసాలు
అందించి, పిల్లలందరికీ తలా ఒక బిస్కెట్ పంచుతున్నాడు. అతడు ఆ నలుగురితో సహా అక్కడినుంచి ఉడాయించాడు. ఆ
దృశ్యాన్ని చూసిన ఆమె కళ్ళు అగ్నికణాలయ్యాయి. ఆకలి, ఆవేదన ఐక్యమై అరుపులుగా మారి, ఆ ప్రాంతమంతా
ప్రతిధ్వనిస్తు న్నాయి. ఆ ఇద్దరు వ్యక్తు లు పిల్లల మధ్యలో నుంచి మెల్లగా మాయమయ్యారు. బిక్కచచ్చి పోయిన పిల్లలంతా ఎటు
వాళ్ళు, అటు వెళ్ళిపోతున్నారు.
పదమూడేళ్ల ఆమె పెద్ద కూతురు, తల్లిని శాంతింపజేసి, రెండు పచ్చ కాగితాలు ఆమె చేతిలో పెట్టి, “మా ఆస్టల్లో సబ్బుల
డబ్బులిస్తే దాపెట్టి ఇంటికి తెచ్చా!” అంది.
ఆ తల్లి ఆవేశం ఆర్ద్రమై కింద కూలబడి తన పిల్లల కన్నా చిన్నపిల్లయి, చేతులతో తల బాదుకుంటూ ఏడుస్తోంది. స్పృహ
లేని ఆమె కొడుకు తప్ప ఐదుగురు ఆడపిల్లలు, ఏడ్చేందుకు కూడా శక్తిలేక, ఆమె చుట్టూ కూర్చుని, కారుతున్న కన్నీళ్లతో నోళ్లు
తడుపుకుంటున్నారు.
కొద్దిసేపటికి తేరుకున్న ఆమె పిల్లలందరినీ తన ఎదకి పొదుముకొని, “ఇంటికెళ్దాం పాండి” లోగొంతుకతో అంది.
పెద్ద కూతురు తలపైకెత్తి, “ఇంటికిగాదమ్మా, ఈడకొచ్చిన దేవుళ్ళ కథేంటో చూద్దాం పదండి” అంటూ నిలబడింది.
***
సిటీకేబుల్ ఆఫీస్ ముందు ఆగిన ఆటోలో నుంచి, ఆ తల్లి పిల్లలు దిగారు.
కొద్దిసేపటికి,
తుఫాను నగర్‌లో పుట్టిన తుఫాను, ‘లండన్’ నగరంలో తీరం దాటబోతోంది” అనే హెడ్‌లై న్స్‌తో మొదలై , క్రమేణా అన్ని
టీవీ ఛానళ్ళు అదే వార్తను చెబుతూ హోరెత్తిస్తు న్నాయి.

(మతం పేరుతో మనుషులను వాడుకుని, ధనార్జన గావించే బడాకోరుల బండారాన్ని చూపుతూ వ్రాసిన ఈ కథ,
"ప్రియమైన కథకులు" అనే వాట్సప్ గ్రూపు నిర్వహించిన పోటీలో తృతీయ బహుమతి గెలుచుకున్నది)

పెండ్యాల గాయత్రి (65)


కథలు కనే కళ్ళు

సుజలాం..సుఫలాం...
“అభినందనలు అందుకోండి మేజర్ ధనుంజయ్!! కరవును చెరువుగా, చెరువును తరువుగా, తరువును ఊరందరి
ఆదరువుగా మార్చడంలో ఐదేళ్ళుగా మీరు చేస్తు న్న అవిరళ కృషిని గుర్తించిన ‘వికాస్’ స్వచ్ఛంద సంస్థ.. అత్యంత ప్రతిష్ఠా త్మకమైన
‘భగీరథ’ పురస్కారానికి ఈ ఏడాదికి మిమ్మల్ని ఎంపిక చేసిందని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తు న్నాము.. త్వరలో సభా
నిర్వహణ తేదీ నిర్ణయించి మీకు తెలియపరుస్తా ము..”
అపరిచిత నంబరు నుంచి వచ్చిన ఫోన్ కాల్ సంభాషణ విన్న వెంటనే పట్టరాని సంతోషం.. వెనువెంటనే తట్టు కోలేని
సంతాపం ఉరుము,మెరుపుల్లా .. మూకుమ్మడిగా అతడిని చుట్టు ముట్టా యి.
అందరూ తనకు దేశభక్తి అనే కిరీటం పెట్టి పొగడ్తల పూలు చల్లు తారు కానీ... పగుళ్ళారని పొలాన్ని నమ్ముకున్న కిసాన్
కుటుంబాన్ని వదలని ఆకలి తెగుళ్ళను తట్టు కోలేకనే జవానావతారమెత్తి, తుపాకి పట్టా డు.
ఆకలి తీరాకనే, ఆటలకు బాట పడుతుందా!! అన్నట్లు .. అప్పులు, ఆర్ధిక ఇబ్బందులు తీరిపోయాక, కీర్తి వైపు కాంక్ష
మళ్ళడంతో, ఏం చెయ్యడమా.. అని యోచించగా, తనను ఈ స్థితిలో నిలిపిన బడి గుర్తు కొచ్చిందతడికి. ఐదేళ్ళనాటి ఘటన
అయినా, ఐదు క్షణాల క్రితం జరిగినట్లు కళ్ళముందు కదలాడుతోంది....
మేజర్ హోదాలో తాను చదువుకున్న బడిని సందర్శించిన ధనుంజయ్‌ని ఉపాధ్యాయులంతా ప్రశంసించి, అతని
గౌరవార్థం ఓ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసారు. దేశ రక్షణయాగంలో తానెలా పాల్పంచుకుంటున్నాడో, కళ్ళముందే తన
సహచరులెందరు సమిధలవుతున్నారో, ఉద్వేగంతో విద్యార్థు లకు వివరిస్తు న్నాడు.
అప్పుడు, “అన్నా! నేను గూడా నీయాలే రోజూ యుధ్ధం చెస్తన్న..” ఆరవ తరగతి చదివే భారతి.. ధనుంజయ్
మాటలకడ్డొచ్చి, అతడి దృష్టినాకర్షించింది.
ఆమెను వేదికపైకి రమ్మని ధనుంజయ్ ఆహ్వానించడంతో, భారతి తన పుస్తకాలలోంచి ఒక నోట్సు తీసుకుని,
ఉపాధ్యాయుల అనుమతితో వేదికపైకి వచ్చింది.
చిన్నగా నవ్వుతూ, “నువ్వెందుకు యుధ్ధం చేస్తు న్నావమ్మా?” అడిగాడు.
“ఈ బళ్ళో వోళ్ళందరికీ, దేశంలో వోళ్ళందరికీ అపాయమొచ్చిందన్నా. అందుకనే నేను రోజూ పోరాటం
చేయాల్సొస్తంది..”
భారతి మాటలకు అందరి ముఖాలలో నవ్వు తొంగి చూసింది.
“అపాయమా.. ఏంటమ్మా అదీ?”
ఆమె బాధగా ముఖం పెట్టీ, చేతులతో అభినయిస్తూ,
“నా తల్లిదండ్రు లను కొందరు దుర్మార్గులు నరికేసిన్రు .. నన్నెవురైనా దత్తత తీసుకుని కాపాడండీ” అంది.
అందరి నవ్వు ముఖాల్లో విస్మయం చోటు చేసుకుంది.
“అయ్యో..మరి నిన్నెవరు చూస్తు న్నారమ్మా?” బాధగా అన్నాడు ధనుంజయ్.
భారతి తన చేతిలోని నోట్స్ తెరచి, అతడికి చూపించింది..
అది చూసిన ధనుంజయ్ ఒకసారి ఊపిరి తీసుకునీ, “గడుసుదానివే..” అంటూ అందరికీ చూపించాడు.

పెండ్యాల గాయత్రి (66)


కథలు కనే కళ్ళు

గోదారోళ్ళకు నీళ్ళ కష్టా లు, ఉళ్ళకమ్మోళ్ళకు వరద కష్టా లు ఏకరవు పెడితే ఎంత విచిత్రంగా చూస్తా రో.. అలా ఉందక్కడి
పరిస్థితి.
“నెల రోజలనాడు మా టీచరు.. బోడ్డు పైన చిన్న చెట్టు బొమ్మేసీ, దాని పక్కన ఇందాక నేను చెప్పిన మాట రాసీ, ఆ
పిరుడంతా చెట్టు కథ చెప్పిన్రు ..”
అంది భారతి.
ఆమె భుజం తట్టీ, “అది నీ నోట్స్‌లో కూడా రాసుకున్నావన్నమాట.. చాలా చక్కగా ఉందమ్మా!” మెచ్చుకున్నాడు
ధనుంజయ్.
ఆమె అతడిని సూటిగా చూస్తూ, “ఆ తరువాత రోజు ఎవురో మా బడికొచ్చి, మా అందరికీ తలా ఒక చెట్టు
ఇచ్చిపోయిండ్రు . హెచ్చెం సారేమో, ‘అందరూ ఈడ నాటాలంటే స్థలం చాలదు, కొందరీడ, ఇంకొందరు మీ ఇళ్ళ కాడ
నాటుకోండి’ అన్నారన్నా! నేను ఆష్టల్ గదా.. అందుకే బడి యనకాల నాటుకున్నా. ‘మొక్కను దత్తత తీసుకోవాలి’ అని చెప్పిన్రు గా
టీచరు. ఆరోజు నించే నేను నా చెట్టు కు అమ్మానాన్నగా మారిపోయినా, అదుగో ఆడనించే మొదలయినియ్యన్నా నా కష్టా లు..!”
నాలుకతో పెదవులను తడుపుకుంటూ ఆగీఆగీ ఆరిందాన్లా చెప్తు న్న భారతినే గమనిస్తు న్నారందరు.
ముద్దు ముద్దు గా ఉన్న ఆ పాప మాటలు ముచ్చటగా అనిపించాయి ధనుంజయ్‌కి.
“ఎంచక్కా మొక్కను పెంచుకుంటున్నావ్.. మరి కష్టా లెందుకొచ్చాయమ్మా?” అనునయంగా అడిగాడు.
“మనకి ఒక్కపూట అన్నం లేకపోతే ఎంత నీరసం వస్తదో కదా? మరి ఒక్కపూట నీళ్లు లేకపోతే చెట్టు కి గూడా అంతే
నీరసం వచ్చిద్దంట. అన్నం లేనప్పుడు బాధ ఎట్లా ఉంటదో చానాసార్లు చూసినా కదన్నా! ఎట్టన్నా గాని నా చెట్టు కి రోజు నీళ్లు
బొయ్యాలనుకున్నా..” తినటానికి అన్నంలేక, తాగటానికి నీళ్ళు దొరక్క ఖాళీపొట్టతో కాలం వెళ్ళదీసిన తన బాల్యం
గుర్తొచ్చిందతనికి.
“బళ్ళోనే కాదు హాస్టల్ బోర్‌లో కూడా నీళ్లస్సలు రావట్లా . మూడు నాలుగు రోజులకొకసారి ట్యాంకీలొచ్చి నీళ్లు బోసిబోతే
మళ్లీ వాళ్లు వచ్చిందాకా సరిపోవాలని డ్రమ్ముల్లో బట్టి, రూముల్లో బెట్టి తాళమేస్తరు..” అంటూ ఆగీ మళ్ళీ పెదాలను
తడుపుకుంది.
“ఏం చేస్తా మండి..!? పిల్లలు తాగడానికి నీళ్లు సరిపోయేలాగా చూడాలి కదా!” పక్కనే కూర్చున్న ప్రధానోపాధ్యాయులు
చిన్నగా ధనుంజయ్‌తో చెప్పారు.
“నాకాడ.. ఒక్క బాటిలే ఉంది, ట్యాంకి వొచ్చినరోజు, నేను కడుపు నిండా నీళ్లు తాగి, నా చెట్టు కి పాదు నిండా పోస్తా .
ట్యాంకీ రాకపోతే మేం తాగడానికి తప్ప నా చెట్టు కి నీళ్లుండవ్. ఒకరోజు మధ్యాహ్నం అన్నం తిన్నాక, చెట్టు కాడికి పొయ్యేలోకి
ఆకులన్ని వాడిపోయి, యాల బడివున్నయన్న! ‘చెట్టు సచ్చిపోతే నీ ఊపిరాగిపోయినట్టే’ అన్న టీచర్ మాట గుర్తొచ్చింది.
పరిగెత్తు కుంటా ఎళ్లి, నీళ్ల కోసం ఎతికిన. చివరకి టీచర్ల రూములో ఒక చిన్న బకెట్లో సగానికి నీళ్ళుంటే అయ్యి తీసకపోయి నా
చెట్టు కి బోసిన. ‘నీళ్ళేంజేసినవే’ అని ఒక టీచరు అడిగితే, ‘చెట్టు కి
పోసిన’ అన్న. ‘బాత్రూమ్ కెళ్ళటానికి నీళ్ళు లేక అల్లా డుతుంటే చెట్టు కు పోసొచ్చా!?’ అని ఒక్కటేసిన్రు .. నెప్పి బుట్టినా
నా చెట్టు ని తలచుకుని ఓర్చుకున్న..” ఆవేదనకు అద్దంలా ఉన్న భారతి మాటలు అతడి కంటిని తడి చేస్తు న్నాయి.
“మా ఆస్టల్లో గోడా నీళ్ళు జాలట్లేదనీ మమ్మల్ని అన్నిటికీ బయటికి యళ్ళమన్నరు వార్డెన్ మేడం. స్థా నాలు గూడ రెండు
మూడు రోజులకు చేస్తన్నం.

పెండ్యాల గాయత్రి (67)


కథలు కనే కళ్ళు

మేము బయటికెళ్ళటం చూసిన అన్నోళ్లు కొందరు గోడలెక్కి గోల చేస్తు న్నారు, వాళ్లకి భయపడి ఒకరోజు నేను ఎనిమిదో
తరగతి అక్క కలుసుకొని అర్ధరాత్రికాడ ఎళ్లినం.. ఆడ ఒక పెద్దపాము జరజరా పాకీ పోతంటే భయం బుట్టి, ఆస్టల్ లోకి
పరిగెత్తినం, అర్జంటయ్యి మోషనంతా గుడ్డల్లోనే పడిపోయింది”
తన్నుకొస్తు న్న ఏడుపును దిగమింగుకుంటూ కన్నీళ్లు తుడుచుకుని, పెదవులను తడుపుకొని, జీరబోయిన గొంతుతో
మాట్లా డుతోంది భారతి.
“ఆరోజు నుంచి కడుపునిండా అన్నం తిన్నా, నీళ్లు తాగినా, బయటికెక్కువసార్లు ఎల్లా లని తినడం బాగా తగ్గించేసిన.
ఆకలైతే ఓర్చుకుంటున్నా, దప్పికయితే పెదాలు తడుపుకుంటున్న..”
స్తబ్దు గా కూర్చొని భారతి మాటలాలకిస్తు న్నాడు ధనుంజయ్.
“ఒకరోజు వార్డెన్ మేడం, సబ్బుల డబ్బులిచ్చిండ్రు . ఆరోజు నుంచి రోజుకైదు రూపాయలు పెట్టి ఒక బాటిల్ నీళ్లు
కొనుక్కొచ్చి నా చెట్టు కి పోస్తు న్న, ‘నాకు జానెడు చోటునిస్తే- నీకు బోలెడు గాలినిస్తా , నాకు చారెడు నీళ్లు పోస్తే- జీవితమంతా
నీడనిస్తా ’ అంటదంట చెట్టు . అట్ట పదిరోజులు నీళ్లు పొయ్యంగా, నా చెట్టు కి యిగురొచ్చింది, నేనెగిరి గంతేసి, ‘నువ్వు తొందరగా
పెద్దదానివైపోమ్మా, అందరికీ బాగా గాలినివ్వు’ అని బతిమిలాడినా. అడగంగా అడగంగా సరే అని తలాడిచ్చింది నా చెట్టు .
మొన్నొకరోజు నీళ్లు కొనుక్కుద్దా మని డబ్బులు ఎత్కుతుంటే బ్యాగ్‌లో డబ్బులెవురో కొట్టేసిండ్రు . మళ్లీ నా చెట్టు కి నీళ్లు లేకుండా
పోయినయ్యే.. అని ఏడ్చుకున్న... ఆరోజు మధ్యానం ఇంటర్బెల్ అప్పుడు ఒక టీచర్ డబ్బులిచ్చి, సమోసాలు తెమ్మన్నరు.
తెచ్చినందుకు నాకు రొండు సమోసాలియ్యబోయిడ్రు . ‘నాకయ్యెద్దు ఒక్కైదు రూపాయలు డబ్బులియ్యండి టీచర్!’ అన్న. చెట్టు
కోసమంటే తిడతారని పెన్ను కొనుక్కోవటానికని అపద్దం చెప్పిన. టీచరు పెన్నిచ్చిండ్రు .. ఇంకేం చేయాలి? కొట్టు కాడికెళ్ళి, పెన్నమ్మి
నీళ్లు కొన్న. అది చూసిన ఒకమ్మాయి నా చేతులో బాటిల్ లాక్కొని ఎళ్లి టీచర్‌కి చెప్పింది. టీచరు నన్ను పిలిపిచ్చి బాగా తిట్టి
పంపిచ్చిండ్రు ” ఇక బాధ నణుచుకోలేని భారతి గట్టిగా ఏడుస్తూ,, “ఆరోజు నుంచి నా చెట్టు కి, నీళ్లు లేక, వాడిపోయి,
సచ్చిపోయిందన్న‌...” అంటూ కింద కూలబడింది.
ఒక టీచర్, “అయ్యో! ఎంత పిచ్చిపిల్లవే ఇదంతా నాకు తెలియకపోయే.. అసలే తల్లీతండ్రి లేని బిడ్డవు. మీ అవ్వ చూస్తే
అల్లా డిపోద్దే తల్లీ!” అంటూ ఆమె దగ్గరికి వెళ్లి, పైకి లేపి నీళ్లు తాగించబోయింది.
“నాకొద్దు టీచర్, నా చెట్టు కి పొయ్యకుండా నేను తాగను.” లోగొంతుకతో చెప్పింది భారతి.
“నోరు దాహంతో పిడచగట్టు కు పోతోంది, నువ్వు చచ్చిపోతావే తల్లి, ఒక గుక్క తాగు..” అని ప్రేమగా మందలించారు
టీచర్.
“నేను సచ్చిపోయినా ఏం కాదు టీచర్, చెట్లు సచ్చిపోతే గాలి లేక మనుషులు, జంతువులు అన్ని సచ్చిపోతాయంట,
అందుకే ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు ని పెంచాలంట.. టీచరు చెప్పిండ్రు ..” అంటూ ఆ టీచర్ వైపు చూసి, “నిజ్జం కదా టీచర్!”
అంది.
‘పిల్లలు పాఠంలో ఇంతలా లీనమై పోతారు కాబోలు’ అనే తలంపులో ఉన్న ఆ టీచర్, భారతి అమాయకమైన ప్రశ్నతో
చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ, “హా! అవునమ్మా!”అన్నారు.
“అన్నా! మా బడికి ఏదో ఇయ్యాలని వచ్చినవంట కదా, మాకేరే ఏమీ వద్దన్నా!” ఆక్రోశిస్తు న్న భారతి కళ్ళు ధారలై, ఆమె
పెదవులను దాటి, నాలుకను చుట్టేస్తుంటే, “నీళ్లు ...నీళ్లు ...నీళ్లు .. కావాలన్న...!” అంటున్న ఆమె మాటలు ఆ కన్నీళ్ళ వరదలో
కలిసిపోయాయి.

పెండ్యాల గాయత్రి (68)


కథలు కనే కళ్ళు

అప్పటిదాకా విని విననట్లు న్న పిల్లలు, వినోదమనుకుంటున్న పిల్లలు, వింత అనుకుంటున్న ఉపాధ్యాయులు
ఒక్కసారిగా నిశ్చేష్టు లయ్యారు.....
ప్రతిభావంతులైన ఒకరిద్దరు విద్యార్థు లకు ఓ పదివేల రూపాయలు పురస్కారంగా ప్రకటించి, ఓ పది ఫోటోలు
తీయించుకుని, పదిమందికి చూపించుకుని తన ప్రతిష్ఠను పెంచుకుందామని బడికెళ్ళిన ధనుంజయ్.. తను పెంచుకునే మొక్క
కోసం ప్రాణాలివ్వటానికి సిధ్ధపడిన పసి భారతిని చూసాక, వసివాడని ఆమె సంకల్పాన్ని విన్నాక సిగ్గుతో కుచించుకుపోయాడు.
తాను పుట్టక ముందు నుంచీ కరవుకు కాణాచి అయిన తన ఊరు ఇప్పటికీ అలాగే ఉంటే, పిడికెడు ముద్ద కోసం,గుక్కెడు
నీళ్ళకోసం ఊరిజనం నిత్య సమరం చేస్తుంటే, తానేమో ఎక్కడో దేశానికి ఆవల అలుపెరుగని పోరాటం చేస్తు న్నాడు. అతివృష్టి,
అనావృష్టి అనే అంతర్గత శక్తు ల కోరల్లో భారతి చిక్కుకుపోయినప్పుడు.. తాను బహిర్గత శక్తు లనెదిరించి పోరాడినా
ప్రయోజనమేముంటుంది...?
అనుకున్నదే తడవుగా.. ఓ బృహత్తర ప్రణాళిక రూపొందించాడు. మొదట తన సహాద్యాయుల సమావేశం ఏర్పాటు చేసి,
వారందరి సహకారం సాధించాడు. అవమానాలను, అవరోధాలను అధిగమిస్తూ,, అధికారులతో మాట్లా డి ఊరికి శాశ్వత
మంచినీరు రప్పించాడు. దాతల సాయంతో ఖాళీ నేలలను మొక్కలతో నింపేసాడు. ఇంకుడు గుంతలు తవ్వించుకున్న ఇళ్ళకు,
మొక్కలను పెంచుకునే వాళ్ళకు బహుమతులిచ్చి ప్రోత్సహించాడు.
తొలిరోజుల్లో చాలామంది వెక్కిరించి, వ్యతిరేకించినా.. ధనుంజయ్ పట్టు దల, దరిచేరుతున్న ఫలితాలు చూసాక..
చాలామంది సహాయ సహకారాలందించడం మొదలెట్టా రు.
ఇప్పుడు తన ఇల్లు , బడి, ఊరు.. హాయిగా హరితామృతాన్ని సేవిస్తు న్నాయి. అయినా.. తాను, తన సహచరులు నిత్య
భగీరథులుగా శ్రమైక తపస్సు చేస్తూనే ఉన్నారు.. ఇక ఎప్పటికీ కృషి చేస్తూనే ఉంటారు.
“ఏంటి నాన్నా! అంత దీర్ఘంగా ఆలోచిస్తు న్నావ్? పదవతరగతి ఫలితాలు విడుదలయ్యాయి.. నాకు పది పాయింట్లు
వచ్చాయి”
అంటున్న కూతురిని మురిపెంగా చూస్తూ, “నువ్వు సాధిస్తా వని నాకు తెలుసు తల్లీ! త్వరలో నీవు నాటిన బీజం తేజాన్ని
అందుకోబోతోందమ్మా..!” అంటూ భారతిని గుండెలకు హత్తు కున్నాడు ధనుంజయ్.

(విద్యార్థు లలో దేశభక్తి, ఆలోచనా శక్తి నింపాలన్న సదుద్దేశంతో వ్రాసిన ఈ కథ, ఉపాధ్యాయ మాసపత్రికలో 2018 వ
సంవత్సరం ప్రచురించబడింది)

అటునుండి నరుక్కురండీ
“ఎవరక్కడ? ఆ రాజద్రోహిని తక్షణమే మా సముఖమునందు ప్రవేశపెట్టండి” ప్రభువుల కంఠం ఖంగుమంది.

పెండ్యాల గాయత్రి (69)


కథలు కనే కళ్ళు

క్షణాల్లో ఆజ్ఞ అమలయ్యింది. అర్ద నిమీలిత నేత్రాలతో తన ఎదుట నిలుచున్న దోషిని గాంచి, పట్టపగలు
చంద్రు డుదయించినట్లు , కనుల ముంగిట కమలం వికసించినట్లు భావన జనించి క్షణకాలం నిశ్చేష్టు డయ్యాడు రాజు.
‘సుధర్మ’ సభంతా స్తంభించి చూస్తోంది.
“ద్విదశకమైనా దాటని సునిశిత చిన్నారివి, కనినంతనే కరుణోద్భవించే సుందర సుకుమారివి.. నీవు ఇంతటి
దుస్సాహసానికి పాల్పడినావంటే మా హృదయం విశ్వసించలేకున్నది..” ప్రభువుల వ్యాఖ్య వినినంతనే తన కనురెప్పలను
ఒకమారు పైకెత్తి, రాజు వైపునకు దృష్టి సారించి మరలా క్రిందకు వాల్చేసుకున్నది ఆమె.
“నిశ్శబ్ద కాంతను వరించినటుల ఏమా మౌనమూ? మా స్పందనకు నీ సమాధానమునందించుట
సంస్కారమనిపించుకొనునేమో!” ప్రభువుల స్వరంలో రవంత ఆగ్రహం ధ్వనించింది.
అప్పటికీ ఆమె పెదవి విప్పలేదు.
“నీవమలు చేయబూనిన నేరమునకు విచారణ జరుగుతున్నదన్న విషయము గ్రహించితివా? రాజద్రోహమునకు లభించు
బహుమానమేమిటో ఎరుగుదువా? ఏ ప్రలోభమునకు లోబడి నీవీ కార్యమునకు తెగబడితివి? సంజాయిషీ వెంటనే
విన్నవించుకొనుము.” రాజు రాజసాన్ని ప్రదర్శించాడు.
“హయగ్రీవముల పాలనలో ఫలితములెటులుండునో పసివాళ్ళైనా ఊహించగలరు మహారాజా !” ఆమె సమాధానానికి
సభలో కలకలం రేగింది.
మహా మంత్రి కల్పించుకుని, “ఏ ఆధారము చేత నీవీ అభియోగ వ్యాఖ్యలు చేయుచున్నావు పర్యవసానమెటులుండునో
పరిశీలించుకుంటివా?” అనడంతో..
“ప్రజాచోరులు పేరోలగమున పలు శాఖాధికారులుగా చెలామణి కావడాన్ని మించిన ఆధారమేమున్నది మహా
మంత్రిగారు?” బదులు ప్రశ్న సంధించింది ఆమె.
“ఈ అమ్మాయిపై ఆరోపించబడిన రాజద్రోహముతో పాటు ధిక్కార నేరమునాపాదించి, విచారణ విస్మరించి నేరుగా
మరణదండనము విధించండి ప్రభూ !” సూచన చేసాడు మంత్రి.
“కొద్దిక్షణాల క్రిందటి నా ఆరోపణలు అసత్యములు కావని నిరూపించేందుకు మంత్రిగారి వ్యాఖ్య సహాయపడినది
మహారాజా! పరిశీలింప ప్రార్థన..!” అన్నదామె చేతులు జోడించి.
రాజు విస్మయుడై ఆమెను ఏదో అడిగేందుకు సంసిధ్ధు డవుతుండగా.. ప్రవేశ ద్వారము వైపు నుండి బిగ్గరగా, “శుభవార్త
చేరినది ప్రభూ !” ద్వారపాలకుల మాటలు వినిపించాయి.
సభంతా సంతోష రేఖలు ప్రసరించాయి. సభికుల హర్షధ్వానాల మధ్య లోపలికి ప్రవేశిస్తు న్న వారందరూ..
“రాజాధిరాజా, సకల ప్రజా తేజా,
వైకుంఠ పుర వేంకటేశ్వర పూజా,
శివ గంగ పుష్కరిణీ సిరోజా,
అమర లింగేశ్వర కటాక్షాగ్రజా,
అమరావతి నగర నిర్మాణ భోజా,
సుధర్మ నవ పండిత కొలువుల వారజా,
మహా క్షామ నిర్మూలనా శ్రీజా,

పెండ్యాల గాయత్రి (70)


కథలు కనే కళ్ళు

శ్రీశ్రీశ్రీ వాసిరెడ్డి వేంకటాద్రి మహారాజా..


జయహో, విజయహో, దిగ్విజయహో...!”
అంటూ పెద్దపెట్టు న జయధ్వానాలు చేస్తూ రాజుకు ఆనందాంజలి ఘటిస్తు న్నారు.
“భళా వీరులారా.. భళా ! మా కరవాలాన్ని ప్రయోగించకుండానే ఈ వాసిరెడ్డి సంస్థా నంలో మరోమారు విజయలక్ష్మిని
కొలువు తీర్చారు. మీ అందరినీ సముచిత కానుకలతో సత్కరించి ఈ ఆనంద సమయాన్ని సద్వినియోగం చేయదలచాము.
సేవకులారా ! ధనాగారంనుండి బంగారు, వజ్ర, వైఢూర్య నాణేలను తీసుకురండీ..” అంటూ తన ఒరలోని బాకును సింహాసనంపై
ఉంచి రాజా వేంకటాద్రినాయుడు విజయోత్సవాల నిర్వహణలో నిమగ్నమయ్యాడు.
మొదట సైన్యాధ్యక్షుడైన భుజంగరావును సన్మానపీఠం పైకి ఆహ్వానించాడు.
“ప్రభూ ! ఈ మారు అగ్ర తాంబూలము అందుకోవలసినది నేను కాదు,. ప్రస్తు త యుద్ధమునందు కీలకపాత్ర
నిర్వహించి, సునాయాస విజయానికి బాటలు పరచిన వీరాధి వీరుడు, తేజో సంపన్నుడు, నవ యువకుడు అయిన మన జల్లా ల
కృష్ణుడు” అంటూ జల్లా లుడిని పీఠంపై కూర్చుండబెట్టా డు భుజంగరావు.
రాజు చిరునవ్వులు చిందిస్తూ అతడిని పట్టు వస్త్రా లతో అలంకరిస్తు న్నాడు. దోషిగా.. సభా మంటపమున నిలుచోని ఉన్న
ఆమె ఆ దృశ్యాన్ని వీక్షించి నిలువెల్లా ద్వేషంతో రగిలిపోతోంది. తన నవ నాడులు ఆవేదనతో అట్టు డికిపోతున్నాయి. ఏ మాత్రము
వీలు దొరికినా, సభనంతటినీ సంహరించాలన్న కాంక్ష ఆమెను కుదురుగా ఉండనివ్వట్లేదు. కాపలాదారులు కన్నార్పకుండా తననే
గమనిస్తు న్నారు. ఆవేశాన్ని పంటి బిగువున అణచి ఉంచడంతో అది వేదనా జలపాతమై కళ్ళలోంచి పెల్లు బికింది.
‘నీ కన్నీళ్ళు నేను చూడలేనమ్మా కుముదా!’ అంటూ హృదయానికి హత్తు కునే తల్లి రూపం కన్నీళ్ళ మధ్య
ఛిద్రమవుతుంటే.. నేర బంధనాలలోంచి అనుబంధాల వైపుకు ఆమె అంతరంగం అడుగులు వేసింది.
***
“కుముదా... నా బంగరు తల్లీ... కుముదునీ..! ఇలా రామ్మా..! మీ నాన్నా నీ కోసం ఏమి తెచ్చాడో చూడమ్మా..!”
సాయం సంధ్య సమయాన దీపం వెలిగిస్తు న్న కుముద, భోజన ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్న కుముద తల్లి వీణాదేవి, వేదవ్రతుని
పిలుపు విని అతడిని సమీపించారు.
పగడాలు పొదిగిన సువర్ణ హారం, కెంపులద్దిన కర్ణాభరణాలు కుముదకు అందిస్తూ, “ఇవి అలంకరించుకో తల్లీ!”
నవ్వుతూ అన్నాడు.
తల్లీ బిడ్డలు విస్మయులై చూస్తుండగా, “ఇన్నాళ్ళకు నీ తండ్రి నీ వివాహము జరిపించబోతున్నాడమ్మా!” అతడి కళ్ళలో
ఆనందాశ్రు వులు తళుక్కుమన్నాయి.
“ఏమంటున్నారు?.. నా బిడ్డకు వివాహము నిశ్చయమైనదా? ఇది సత్యమా.. స్వప్నమా!” తన్మయురాలైన వీణ,
కుముద నుదుటిని ముద్దా డుతుండగా.,
“ఒక్కగానొక్క బిడ్డకు పదునారు వత్సరములు వచ్చేవరకూ వివాహము చేయలేని ఈ అసమర్థు డు క్షమార్హుడు కాడు
వీణా..!” తల్లితో బేలగా అంటున్న తండ్రిని వారిస్తూ..
“ఇదెక్కడి అన్యాయము నాన్నగారూ? నేను మీకు అంత భారమైపోతినా? ఆభరణములు, అలంకారములు ఏనాడైనా
ఆశించితినా ? వివాహము కొరకు వేధించితినా?” ఆమె గొంతు గద్గదమై మాటలు పూడుకుపోగా, కన్నీళ్ళు చెక్కిళ్ళపై ధారలు
కట్టా యి.

పెండ్యాల గాయత్రి (71)


కథలు కనే కళ్ళు

“అమ్మా.. కుముదా! నీ కన్నీళ్ళు నేను చూడలేనమ్మా...! ఏ ఆటంకము వెంటాడినా, ఎన్ని ఆపదలు చుట్టు ముట్టినా
చిరునవ్వును, మనోనిబ్బరాన్ని చెదరనివ్వకమ్మా!”
తల్లి ఓదార్పుతో ఊరడిల్లిన కుముద, “తమరి అభీష్టం నాన్నగారూ! ఇక భోజనానికు లేవండీ!” అన్నది.
“సువర్ణాన్ని మించిన సౌందర్యరాశివి.. చక్కదనాన్ని మించిన సుగుణాల గనివి... నీ తండ్రి తొలిసారి సమకూర్చిన ఈ
ఆభరణాలను కొద్ది సమయము ధరించమ్మా ! కనులలో నిన్ను నింపుకుంటాను..” తండ్రి కోరిక మేరకు ఆభరణాలను
అలంకరించుకున్నది కుముద.
వేదవ్రతుడు సంచిలోంచి కొంత ధనాన్ని తీసి, “ఈ ధనాన్ని దాచు వీణా! కుమార్తె కళ్యాణ ఖర్చుల కొరకు మాత్రమే
సుమా!” అన్నాడు.
“ఎదురాడుతున్నానని భావించకపోతే ఈ ధనాభరణాలు ఎటుల సమకూరినవో..” ఆపై అడగలేక ఆగింది వీణ.
“కరణం గారి భూమిని పుష్కరకాలం పాటు సాగు చేస్తా ననే ఒప్పందంపై బయానా అడిగాను” అతడి రెప్పలు నేలకు
వాలిపోయాయి.
“కడకు కరణరికానికి చేరుకున్నామన్నమాట..!” అరిటాకు కడుగుతూ కన్నీళ్ళను కూడా కడిగేసింది ఆ ఇల్లా లు.
వేదవ్రతుడు నాట్యశాస్త్రంలోను, వీణాదేవి సంగీతశాస్త్రంలోనూ ప్రావీణ్యం కలవారు. వారి వివాహమైనప్పటి నుండీ
రాజాశ్రయం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. జగ్గభూపాలుడి పాలన ముగిసి వేంకటాద్రినాయుడు రాజయ్యాడు గానీ, ఈ
దంపతుల ఆశలు ప్రయాసలు గానే మిగిలిపోయాయి. మొరటు మనిషికి మొగలి పరిమళం సోకనట్లే, వీరి కళా కౌశలం సామాన్య
జనులకు చులకనయ్యింది.
ఆకలి ఆత్మాభిమానాన్ని రెచ్చగొట్టింది. ఇంటివెనకున్న మట్టితో కుండలు తయారుచేసి, విక్రయించాలనుకున్నారు. ఆ
గ్రామంలోని కుమ్మరి వారు తమ కులవృత్తిని కొల్లగొడుతున్నారని గ్రామాధికారికి ఫిర్యాదు చేశారు. ఇక చేసేదిలేక.. వేదవ్రతుడు
వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్నట్లు తెలియడంతో వైశ్యులు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. అలా అతడు ఏ వృత్తి
చేపట్టబోయినా, ఆయా కులాలవారు అడ్డు పడి, వీరి కడుపు కొట్టేవారు. మూడు భోజనాలు, ఆరు ఉపవాసాలుగా కాలం
వెళ్ళదీస్తూనే కుముదను సంగీత, నాట్యశాస్త్రా లలో ప్రవీణగా తీర్చిదిద్దా రు.
ఆలోచిస్తూనే భోజనం పూర్తిచేసుకుని, నిద్రకుపక్రమించ బోతుండగా ఆగంతకులెవరో తలుపు కొట్టడంతో కుముద వెళ్ళి
తలుపు తెరచింది.
కత్తు లు చేతబట్టిన ఇద్దరు యువకులు శరవేగంతో ఇంటిలోకి ప్రవేశించి, కుముద కంఠాభరణాన్ని తస్కరించబోగా,
వేదవ్రతుడు అడ్డు కున్నాడు. వాళ్ళు చంపుతామని బెదిరించడంతో వేడుకున్నాడు, పాదాలపైబడి బ్రతిమాలాడు..రోదించాడు.
అయినా వారి మనసులు కరగలేదు.. ఒకడు కుముద రెక్కలు వెనక్కి విరిచి పట్టు కుంటే, మరొకడు ఆమె ఆభరణాలను
ఒలుచుకోబోయి.. ఆమెనే చూస్తూ క్షణమాగడంతో, రెండవవాడు కానివ్వమని గర్జించేటప్పటికి ఆభరణాలను ఒలుచుకున్నాడు.
ఇల్లంతా గాలించి, దొరికిన ధనంతోసహా వెళ్ళిపోతుండగా తలుపు మూసెయ్యబోయిన వేదవ్రతుడిని బలంగా పక్కకు తోసేసి
ఉడాయించారు. పడిపోయిన వ్రతుడి తల ఇనుప పెట్టెకు కొట్టు కోవడంతో ఆ క్షణమే ప్రాణాలు విడిచాడు. ప్రాణాధికుడైన భర్త
లేడనుకుందో, కన్నబిడ్డకిక భవిత లేదనుకుందో గానీ, ఆ దారుణాన్ని చూడలేని వీణాదేవి గుండె ఆగిపోయింది.
విధి ఆడిన దొంగాటలో ఓడీ, వాడిన కుముద, గ్రామస్తు ల సహకారంతో తల్లిదండ్రు ల అంతిమయాత్ర పూర్తిచేసింది.
అప్పుడు తెలిసిందామెకు.. చెంచులు అనే 150 మంది బందిపోట్లు తన ఇంటితో పాటు గ్రామం మొత్తా న్ని నిలువునా
దోచుకున్నారనీ, ఎదిరించినచోట మారణహోమం జరిపించారని. తీవ్రంగా ఆక్రోశించిన ఆమె అంతరంగం ఒక ఆలోచనతో

పెండ్యాల గాయత్రి (72)


కథలు కనే కళ్ళు

నిట్టూర్చింది. జరిగిన దారుణాన్ని వివరిస్తూ, గ్రామస్తు లందరి తరపునా ఒక లేఖ వ్రాసి, గ్రామ కరణం సాయంతో రాజుకు
పంపించింది. స్పందించిన రాజా వేంకటాద్రి నాయుడు విచారించి, రాజ్యమంతా చెంచుల దోపిడీకి గురవుతున్నదని గ్రహించి,
కుముద ఉన్న గ్రామంలో మకాం పెట్టి, విందు పేరుతో చెంచులనాహ్వానించి, వారందరినీ నరికించి, ఆ విషయాన్ని రాజ్యమంతటా
దండోరా వేయించాడు. ఆనాటినుండి ఆ గ్రామం నరుకుళ్ళ పల్లిగా అవతరించింది....
ఒంటరి తనాన్ని ఓడించేందుకు స్వగ్రామం వదలి శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నది కుముదిని. తన
మధుర గాత్రంతో స్వామిని అర్చిస్తూ, భక్తి పారవశ్యంతో నర్తిస్తూ ఒక వసంతకాలం ప్రశాంతంగా వెళ్ళదీసింది. ఒకనాడు.. ఆలయ
పునరుధ్ధరణకై ప్రణాళిక వేసేందుకు రాజాధికారులు వస్తు న్నారని, నాట్యప్రదర్శన ఇవ్వవలసిందనీ, అర్చకులు కోరడంతో
అంగీకరించింది. తన ప్రదర్శన వీక్షించిన ఆరుగురిలో నాటి దురాగత చోరుడొకడు ఉన్నట్లు గమనించింది. రాజు చెంచులను
నరికించడమన్నది నిజం కాదన్న నిర్ధా రణకు వచ్చింది. ఆనాటినుండీ రాజుపై, చోరుడిపై తీవ్రమైన ప్రతీకారంతో రగిలిపోతూ, ప్రజా
కంటక పాలనాంతం చూసేందుకు తగు సమయం కొరకు వేచి చూస్తు న్నది.
గత పున్నమినాడు పొరుగు రాజ్యం ఈ రాజ్యంపై కన్నేసిందని అర్చకుల ద్వారా విని, వివరాల సేకరణ ప్రారంభించింది.
ఆలయ సమీపంలోనే యుద్ధ స్థా వరమున్నదని తెలుసుకుని, రహస్యంగా వెళ్ళివస్తూ.. యుద్ధవ్యూహాన్ని పసిగట్టింది. చాటుగా
శత్రు సేనలనాశ్రయించి తన పథకం వివరించింది. విరివిగా నాట్య ప్రదర్శనలిస్తూ, గీతాలాపన చేస్తూ అధికారుల, అర్చకుల
ఆదరణను సంపాదించింది. యుద్ధా రంభానికి రెండురోజుల ముందు ఆలయదాపులోనే శత్రు పక్షానికి రహస్య ఆవాసాన్ని
ఏర్పాటుచేసి, తాజా వ్యూహాల తరలింపును సులభతరం చేసింది. తన రాజ్యంలో దుష్ట పాలనంతమై, ప్రజలకు సుఖశాంతులు
లభించాక.. తానేమైపోయినా ఫరవాలేదనుకున్నది. యుద్ధ శంఖారావం పూరించే ముందురోజు అర్ధరాత్రి మంతనాలు
జరుపుతుండగా శత్రు గూఢాచారితో సహా బంధింపబడి, అంతఃపురానికి తీసుకురాబడింది.
***
అవమాన భారంతో, ఆవేదనతో అట్టు డికిపోతున్న అంతరంగాన్ని సద్దు మనిపి, సుధర్మ సభనంతా పరిశీలించింది.
కాపలాదారులు సైతం సత్కారోత్సవంలో నిమగ్నమై ఉండడం గమనించింది. అతి నెమ్మదిగా నక్కి నడుస్తూ వెళ్ళి,
సింహాసనంపైనున్న కత్తిని తీసుకున్నది. వీరదాసుడనే చెంచు సైనికుడిని సత్కరిస్తు న్న రాజుకు వెనుక వైపుకు నిలబడి, వెన్నును
గురిచూసుకుని బాకును పైకెత్తింది.. సరిగ్గా అదే సమయాన ఓ రెండు చేతులు కుముద నడుమును చుట్టు కుని, బలంగా
అవతలకు లాగాయి.
అదిరిపడిన ఆమె వెనకకు చూసి, “నీవే నీవే నా తలిదండ్రు ల మరణానికి, నా జీవిత పతనానికీ కారకుడవు” అని
సింహనాదం చేస్తూ, అతడి కంఠంలో కసిగా బాకును దించబోయింది.
అతడు శరవేగంతో పక్కకు తిరగడంతో కుడి భుజానికి గుచ్చుకున్నది ఆ కత్తి. రెప్పపాటులో జరిగిన ఆ ఘటనతో
రాజుతో సహా పరివారమంతా తేరుకుని కుముద చేతిలోని ఖడ్గాన్ని లాగేసుకుని, ఆమెను బంధించారు.
“రాజ వైద్యులారా! జల్లా ల కృష్ణునికి వెంటనే వైద్యమందించండీ ! ఈ రాజహంతకిని తక్షణమే మా కరవాలంతో
వధించదలచాము” కంఠంలోనే కర్కశాన్నంతా వెళ్ళగక్కుతూ రాజు కత్తి పైకెత్తడంతో...
“ప్రభూ..! అటునుండి నరుక్కురండీ...!” జల్లా లుడు పెద్దపెట్టు న కేక పెట్టా డు.
అది విన్న రాజు, ఎత్తిన చేయి క్రిందకు దించి, “నీవేమంటున్నావో అర్థమవుతోందా జల్లా లా?” గంభీరంగా అడిగాడు.

పెండ్యాల గాయత్రి (73)


కథలు కనే కళ్ళు

గాయం తాలూకు బాధను పంటిబిగువున అణచి, “నేను స్పృహలోనే ఉన్నాను ప్రభూ ! మన విజయోత్సవాలలో ప్రధమ
తాంబూలమందుకోవలసిన నిజమైన దేశభక్తు రాలు ఈ కుముదా దేవియే.. అన్న నిజాన్ని మీరు గ్రహించమని
విన్నవించుకుంటున్నాను..!” అన్నాడు.
విస్మయుడైన రాజు, “శత్రు సేనతో చేతులు కలిపి, రాజద్రోహానికి పాల్పడింది కాక, మమ్ములనే సంహరింప బూనిన ఈ
వంచకి దేశభక్తు రాలా? ఈ విడ్డూ రమేమిటో వివరింపుము. కృష్ణా!” ఆజ్ఞాపించాడు.
“ఈమె గృహానికి దోపిడీకి వెళ్ళిన నేను, ఆభరణాలు ఒలుచుకుంటూ.. నాకు తెలియకుండానే తన ఎదలో
చిక్కుకుపోయాను ప్రభూ! నాడు జనించిన నా ప్రణయం.. ఈమె బ్రతుకులో ప్రళయాన్ని సృష్టించింది గానీ, నా పాషాణ
హృదయంలో పశ్చాత్తా పాన్ని రగిలించింది, క్రూ రులైన చెంచులందరినీ మీ చెంతకు రప్పించేలా చేసింది, నాకు వేంకటాద్రి ప్రభువుల
సాన్నిధ్యాన్నందించింది, ప్రజలకు చోరుల పీడను వదిలించింది, నేడు నా రాజ్యాన్ని శత్రు వుల చెర నుండి రక్షించింది, నిత్యం ఆమెనే
నేను రహస్యంగా అనుసరించినందున నేడు మన విజయం సులభ సాధ్యమయింది, ఆమె ప్రేమకై తపించినందున ప్రజలందరి
ప్రశంస లభించింది, కానీ, కానీ.. అంతటి నా ప్రేమ సైతం రాజభక్తి ముందు ఓడిపోయి నా కుముదను దోషిగా నిలబెట్టింది.”
జల్లా లుని స్వరం గద్గదమవగా,
“అంతే కాదు ప్రభూ.. తల్లిదండ్రు లను కోల్పోయిన వేదన నధిగమించి, చెంచుల దారుణాలను లేఖ రూపేణ
తమకందించింది ఈ కుముదయేననీ, కళలకంకితమైన ఈమె కుటుంబం జీవనోపాధికై అనేక ఇక్కట్లనెదుర్కున్నదని, ఆ అద్భుత
కళా సంపదకు ఈ సుకుమారియే వారసురాలని, కరణం ద్వారా వినియున్నాను..” భుజంగరావు కొనసాగించాడు.
“సహజముగా యవ్వన ప్రణయము.. ప్రళయానికి హేతువవుతుంది. కానీ, మన జల్లా లుని ప్రణయము, శాంతి ప్రణవానికి
పాదులు తీసినది. భళా.. ప్రేమ వీరుడా! నీ హృదయరాణిని అటునుండి నరికి నీకప్పగిస్తు న్నాము. మోదముతో యేలుకొనుము..”
అన్నాడు రాజు.
“దొంగలు దొంగలు దివాణాన్ని పంచుకున్నట్లూ.. నన్నిచ్చేందుకు మీరెవరూ, పుచ్చుకునేందుకు వారెవరు మహారాజా
??” వ్యంగ్యంగా అన్నది కుముద.
“పసితనపు చిలిపిచేష్టలు నిన్నింకా వదలినట్లు లేవు సుకుమారి!” అనునయించబోయాడు రాజు.
“అవునవును ప్రభువుల వారు గొప్ప సత్యము నుచ్చరించినారు.. పసి మనసులున్న ప్రజలను మోసగించి, చోరుల చేత
దోపిడీలు జరిపించి, ధనాగారాన్ని నింపించి, సైన్యాన్ని మాత్రమే పోషించి, యుద్ధా లలో విజయం సాధించి, ఆ ఒక్క ఘనతను పిచ్చి
ప్రజల ముందు ప్రచారము గావించిన సత్యాన్ని బహు బాగుగా పలికితిరి..”
కుముద మాటలనడ్డు కున్న మహా మంత్రి, “పూర్వమెన్నడూ లేనంతటి మహా క్షామం ఈ 18 వ శతాబ్దమున
సంభవించగా.. ధనాగారాన్నంతటినీ వెచ్చించి, ప్రజలను ఆదుకున్న పరమాత్ముడు మా ప్రభువు. రాజ్యమంతటా నలుబది ఆరుకు
పైగా ఆలయాలను నిర్మించిన పరమ పూజ్యుడు ఈ ప్రభువు. అలనాటి ఇంద్ర వైభవాన్ని తలపిస్తూ.. అమరావతిని తీర్చిదిద్ది, సుధర్మ
సభను రూపొందించి, నవ పండితులతో తెలుగు భాషామతల్లికి అంజలి ఘటిస్తు న్న అపరేంద్రు డు నా ప్రభువు. దారి దోపిడీ
దొంగలను హతమార్చి, ప్రజాశాంతికి పాటుపడిన దయామయుడు ఈ నాయుడు” అంటుండగా,,
“ఆహాహాహా..! ప్రగల్భాలు మీ ప్రభువులకు పర్యాయ పదాలు కాబోలు మహామంత్రిగారూ! అందుకు సాక్షం.. మీ
ప్రభువుల చేత స్వయంగా సంహరించబడిన ఈ జల్లా ల కృష్ణుడే కదా?” నవ్వినది కుముద‌.
“ఓహో.. ఇప్పుడు బోధ పడినది కుముదాదేవీ నీ ఆంతర్యము..! నాడు 150 మంది ప్రజా కంటక చోరులను మంచి
మాటలతో రాజ విందుకాహ్వానించి కొనితెచ్చినాడు మా భుజంగుడు. అదే అదనుగా తలంచిన మేము, వారందరిని ఒక

పెండ్యాల గాయత్రి (74)


కథలు కనే కళ్ళు

మంటపమునందు బంధించి, మా కరవాలముతో మేమే స్వయంగా నరకడం ప్రారంభించడంతోనే ప్రధమస్థా నంలో ఉన్న ఈ
జల్లా లుడు ప్రాణభీతితో ‘అటునుండి నరుక్కురండి ప్రభూ’ అని అడగగానే.
ఎంత దుర్మార్గుడైనా చచ్చేవాడి చివరి కోరిక తీర్చడం ధర్మమని తలంచి, మరోవైపు నుండి నరకడం మొదలు
పెట్టినాము.. సగానికి పైచిలుకు చోరులను నరికిన తరువాత, మా హృదయం ద్రవించి, అరే.. ఇందరిని చంపే బదులు వీరిని మరో
కార్యమునకు వినియోగించుట మేలుగాదా? అని భావించి, వారికి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసి, సైనికులుగా
శిక్షణనిప్పించాము. నాడు మా మనసును ఆకర్షించిన జల్లా లుని సమయస్ఫూర్తి సామాన్యమైనది కాదు, అతడడిగిన ఆ
ఒక్కమాట ఇంకొందరి ప్రాణాలను కాపాడడంతోపాటు, నేడు సమర్థు లైన సైనికులను మాకందించింది, రాజ్యరక్షణకు
దోహదపడుతోంది. మేము ఏ పని చేయబూనినా మరొక్కసారి ఆలోచించమని హెచ్చరిస్తోంది. తెలుగునాట తిరుగులేని సామెతగా
నిలచిపోనున్నది. అయితే.. ఈ విషయము ప్రజలకు సుస్పష్టము చేయకపోవుట చేత నీలో మాపట్ల ద్వేషము ప్రజ్వరిల్లినది.
ఇకనైనా ఈ రాజు వంచకుడు కాడని విశ్వసించెదవా? మరొక సంగతీ.. ఉపాధి లభించినవాడు ఉపద్రవాలను సృష్టించడని ఈ
జల్లా లుని ద్వారా గ్రహించగలిగాము” రాజు చెపుతుండగా..
విస్తు పోయిన కుముద, “ప్రభువులు చెప్పినదంతా సత్యమే అయినట్లైతే నేను శిక్షార్హురాలినని అంగీకరించుచున్నాను. ఈ
రాజ్య క్షేమము కొరకు కొన్ని సూచనలు చేయదలిచాను” అన్నది.
చిరునవ్వుతోనే అనుమతించాడు రాజు.
“ఆయా వృత్తు లు చేపట్టేందుకు కులానికి కాక, నైపుణ్యానికి ప్రాధాన్యత కలిగించండీ! దాన ధర్మాల పేరుతో ప్రజలను
సోమరులుగా మార్చకండీ! ప్రజలకు మెరుగైన ఉపాధి అవకాశాలను అన్వేషించండీ! సైనిక పోషణ ఒక్కటే రాజ్యధ్యేయం
కాకూడదని గమనించండీ! ప్రజలు నేరుగా ప్రభువుకే తమ సమస్యలను విన్నవించుకునేలా శాసనాలు చేయండీ! రాజా వాసిరెడ్డి
వేంకటాద్రినాయుడి చరిత శాశ్వతమయ్యేలా పాలన సాగించండీ! ఇక నాకు విధించిన శిక్షను అమలు పరచండి మహారాజా!” తల
వంచినది కుముద.
“భళా..కుముదాదేవీ ! స్త్రీ సౌందర్యము సామ్రాజ్యాలను సైతం కూలదోసేయగలదని వినియున్నాము. అయితే నీ
సౌందర్యము ప్రజా కంటకుడైన ఒక చోరుడిని నరికి, రాజ్య రక్షకుడిగా రూపొందించింది.. నీ ఘనతను కొనియాడడమన్నది
మానలేకున్నాము. జల్లా లుని ప్రేమనంగీకరించడమన్నది నీ అభీష్టా నికే వదలివేస్తూ, ఎంతో విజ్ఞత నిండిన నీ సూచనల అమలు
జరుపుతామని తెలియజేస్తూ నిన్ను నిర్దోషిగా విడుదల చేస్తు న్నాము..” రాజుమాట పూర్తవడంతోనే,
“తమరికి సదా కృతజ్ఞుడనగుదును ప్రభూ! ఒక వినతి.. కుముద తల్లిదండ్రు లు కళా ప్రవీణులైనప్పటికీ రాజాశ్రయం
లభించక ఎన్నో వెతలననుభవించారు.. ఈమెకు కూడా అదే అన్యాయం...” అంటున్న జల్లా లునికడ్డొస్తూ,,
“మాకు బోధ పడినది మహావీరా! మా అంతఃపురమునందు నేటి వరకూ లేని సాంస్కృతిక మంత్రి పదవిని సృజియించి,
ఈ కుముదకు అప్పగించబోతున్నాము. ఈమె కౌశలంతో మన కళామతల్లిని విరాజిల్లజేయ బూనుకొనునని
ఆకాంక్షించుచున్నాము.” రాజు పలుకులకు సుధర్మ సభలో హర్షాతిరేకాలు ఆరంభమయ్యాయి. కుముద కళ్ళు జల్లా లుని
ఆనందాన్ని ఆస్వాదించాయి.

(దేశభక్తి, సమసమాజ నిర్మాణమనే ఇతివృత్తంతో చారిత్రక నేపథ్యంలో వ్రాసిన ఈ కథ, 2021 వ సంవత్సరంలో "కలం
స్నేహం" వాట్సప్ గ్రూపు నిర్వహించిన కథల పోటీలో ప్రథమ బహుమతి పొంది, సహరి పత్రికలో ప్రచురితమయింది)

పెండ్యాల గాయత్రి (75)


కథలు కనే కళ్ళు

కల చెదిరింది.. కథ మారింది..‌
“బ్రతికినన్నినాళ్ళు ఫలములిచ్చుటెగాదు”
“చచ్చికూడ చీల్చి ఇచ్చు తనువు”
“త్యాగభావమునకు తరువులే గురువులు”
కాలక్షేపానికి పుస్తకాలు తిరగేస్తు న్న తనకు, “తెలుగు బాల” శతక పద్యం కనిపించింది. దీర్ఘంగా ఓ నిట్టూర్పు విడిచి,
‘చెప్పేవన్నీ నీతులు-తీసేవన్నీ గోతులు’, బడిలో ఉన్న రోజుల్లో ఈ పద్యం తన్మయత్వంతో చదువుతూ తరువులకు భక్తితో
నమస్కరించేది తను. బతుకు భారమై బలుసాకును కూడా జీర్ణించుకోలేని సమయాన త్యాగం, పరోపకారం ఇవన్నీ
అతిశయోక్తు లు, పగ ప్రతీకారం ఇవే నిజమైన ఉక్తు లు.
మోసాన్ని మోసంతోనే చంపాలి. ‘నేనిప్పుడు ఆకలిగొన్న దేవతను, మృగాలనాకర్షించి బలి తీసుకునే ప్రేమదేవతను,.
ఆనందాన్నందించి అంతంచేసే అందాల దేవతను’ అనుకుంటూ మరో పుస్తకం తిరగేస్తుండగా, ‘అంతరాయానికి చింతిస్తు న్నాం’
అన్నట్టు ఠంగుమనీ కాలింగ్ బెల్ మోగిన శబ్దం. చటుక్కున వాచ్ చూసుకుని ‘8:45 కే మృగానికాకలేసినట్టుంది. ఈ మేనికాంతిని
తాకి తరించబోతున్న మొదటి శలభాన్ని తానేనని దానికి తెలియదు పాపం’ అనుకుంటూ అద్దం ముందు నిల్చుని చెదిరిన చీరను,
రేగిన జుట్టు ను సవరించుకుంది. గుండెలో రగిలే సెగపై పన్నీరు చల్లు కుని ఎర్రబారిన ముఖానికి పౌడర్ అద్ది, నవ్వును చేర్చింది.
సృష్టికి నాంది పలికిన శోభనపు వధువులా తలుపు తెరిచింది.
అతడు కూడా ముఖం నిండా నవ్వు నింపుకొని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ రెండు చేతులు జోడించాడు.
ఊహించని ఆ పరిస్థితికి కొద్దిగా ఉలిక్కిపడినా వెంటనే తేరుకుని కళ్ళతోనే పలకరించి, కూర్చోమని చెప్పింది.

పెండ్యాల గాయత్రి (76)


కథలు కనే కళ్ళు

కొద్దిక్షణాలు మౌనం తర్వాత, “గది చాలా అందంగా ఉంది అలంకరణ మీదేనా?” చుట్టూ చూస్తూ అన్నాడతడు.
“గది అందం బాగా ఆకర్షించినట్టుందే” జ్యూస్ గ్లా సు అతడి చేతికందిస్తూ అంది.
“మీ పేరేంటి?” అని మృదువుగా అడిగాడతడు.
“నా పేరు జపిస్తూ రాత్రంతా గడిపేస్తా రేమో..” ట్యూబ్‌లై ట్ తీసి బెడ్‌లై ట్ వేస్తూ అంది.
“పరిచయానికి నాంది పేరు తెలుసుకోవడమే అని నేననుకుంటా.. కాదంటారా!” అంటూ మంచంపై బాసిపట్టు వేసుకుని
కూర్చున్నాడు.
చిన్నగా నవ్వింది.
“మీ పేరు చిరునవ్వుని అనుకోవచ్చా?”
“ఎలా అనుకున్నా ఫరవాలేదు” అంది.
“నవ్వు వికసించిన పువ్వు వంటిది ఆస్వాదించ గలిగితే ఆ పరిమళం నరనరాల్లో ప్రవేశించి పరవశింపజేస్తుంది. పోయే
ప్రాణాన్ని నిలబెడుతుంది..” ఆకట్టు కునే స్వరంతో అతడు చెప్తు న్నాడు.
తనకెంతో ఇష్టమైన ఆకాశవాణిలో ఓ అనౌన్సర్ కాంతిరేఖల కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఏదో ఒక అంశంపై
కమ్మగా కబుర్లు చెప్పేవాడు. ఎంత ఒత్తిడిలో ఉన్నా ఆయన మాటలు కొత్త ఉత్సాహాన్ని నింపేవి. హడావిడి ఎంతున్నా
ప్రేరణనందించే ఆ మాట, ఆ తరువాత వచ్చే పాట, విన్నాక గాని తను కాలేజీకి వెళ్లేది కాదు. తనకు ఇప్పుడేయిష్టా లు లేవు. కష్టం,
కసి తప్ప.
“ఏదో ఆలోచిస్తు న్నట్టు న్నారు?”
అతడి మాటతో తేరుకొని, “మీరు కవులైతే ఇక్కడికి రావాల్సింది కాదు, ఏ రేడియో స్టేషన్‌కో, రవీంద్ర భారతికో వెళితే
బాగుంటుంది” ఓరగా చూస్తూ అంది.
“నిజమే.. ఓ దరఖాస్తు పెట్టు కుంటా..!” అన్నాడు.
“అయితే ఇంకేం ఓ తెల్ల కాగితమివ్వనా!”
అతడు నవ్వి, “తెల్లకాగితం లాంటి స్వచ్ఛమైన మీరు ఈ నల్లబజారుకెందుకొచ్చారు?” అన్నాడు.
అతని స్వరంలో ఆప్యాయత ధ్వనించింది.
అవును తాను స్వచ్ఛమైన, సుందరమైన తెల్లకాగితం, ఏ మచ్చలు ముడతలు లేని శ్వేత పత్రం, సువర్ణాక్షరాలు
లిఖించవలసిన తామ్రపత్రం, తను పేదింట్లో పుట్టిన ప్రేమగని, గురువుల మెప్పు పొందిన జ్ఞానవాణి, ప్రకృతినే మైమరపించే అందాల
రాణి,. అటువంటి తాను మనిషితోలు కప్పుకున్న మృగాలకు సంజాయిషీ ఇచ్చుకుని సర్వస్వం అర్పించుకోవాలి.
“నేనడిగినదానికి, మీ మౌనం లోనే సమాధానం వెతుక్కోవాలంటారా?”
అతడి ప్రశ్నకు స్పందనగా, “తెల్లకాగితమే కాదు పండువెన్నెల కూడా తెల్లబోయి చూసే అందం, ఆకర్షణ నాలో
ఉందనుకుంటున్నాను కానీ,,,” అంటూ అతని కళ్ళలోకి చూసింది.
“మీరు విషయాన్ని దారి మళ్లిస్తు న్నారు..”
“లేదు విషయం దగ్గరకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తు న్నాను..” అంది.
“అయితే నేనొక విషయం చెప్పనా!?” జారిపడిన కీచైన్‌ను చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు.
“చెప్పండి..” అంది అతని చేతులను చూస్తూ.

పెండ్యాల గాయత్రి (77)


కథలు కనే కళ్ళు

“మీరు మూర్తీభవించిన స్త్రీ రత్నం, అందానికి నిర్వచనం, ఈ నరకకూపం నుంచి బయటపడి ఓ ఇంటి ఇల్లా లిగా నిండు
జీవితాన్నందుకోండి!” అతడింకా ఏదో చెబుతున్నాడు.
డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగాన్వేషణలో ఉన్న తను ఓ కోటీశ్వరుడి కొడుకు కంటికి నచ్చడం, పేదింటికి పెద్ద సంబంధం
వచ్చిందని నాన్న మురిసిపోయినంత ముచ్చటగా పెళ్ళి జరగడం, అత్తవారింటి స్టేటస్ సింబల్‌గా తన అందం ప్రస్తు తించబడడం,
మద్యం మత్తు లో డ్రైవ్ చేస్తు న్న భర్త పెళ్ళైన మూడోనెలలోనే పోవడం, కేసులతో పనిలేకుండానే అత్తా రింట్లో ఆశ్రయం దొరకడం, ఓ
సంవత్సరం అట్టట్టా ఉన్న తర్వాత అక్రమ సంబంధం అంటగట్టిన మామగారు హెచ్ఐవి పరీక్ష చేయించి తను పాజిటివ్ అని
ప్రచారం చేయడం, ఇదంతా మొగుడు నిర్వాకమే అని మొత్తు కున్నా వినిపించుకోని నాన్న, అన్నలు నోటినిందలతో తనకు
నిలువనీడ లేకుండా చేయడం, తాను చావబోయి, మగాళ్ళందరిని చంపాలని భీష్మించుకుని నిన్నటి రోజున ఇక్కడికి రావడం అన్నీ
ఓ ఏడాదిన్నరలో జరిగిపోయాయి.
ఇతగాడు పాతకథను, మళ్లీ ప్రారంభిస్తు న్నాడు. ఈ రాత్రే కసి తీర్చుకునే కొత్తకథకు బీజం నాటాలి.. ఆలోచనల్లోనే
అనుకుంటుండగానే అతని స్వరం వినిపించింది.
“ఏంటి ముఖంలో రంగులు మారుతున్నాయి? నేను చెప్పిన విషయం మీకు నచ్చలేదా?”
అతడి ప్రశ్నతో ముఖంపై మళ్లీ నవ్వు పులుముకుని, “ఇల్లా లి ప్రేమకు, ఇక్కడి ప్రేమకు తేడా తెలుసా మీకు..?” దిండు
చేతుల్లోకి తీసుకుంటూ అంది.
“నేనింకా ఓ ఇంటివాడిని కాలేదు..”
అతడి మాటకు కళ్ళు పెద్దవి చేస్తూ, “ఓ ఇది మీరందుకోబోయే మొదటి విందన్నమాట..” అంది.
“మీక్కూడా మొదటి వడ్డనే కదూ ఇది..” ఉలిక్కిపడింది.
అతడు జేబులో నుంచి ఏదో కార్డు బయటకు తీసి, “నేను ఇటీవలే ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాను. అందులో
క్యాన్సర్, ఎయిడ్స్, క్షయ లాంటి దీర్ఘకాలిక రోగాలకు పరీక్షలు చేసి చికిత్స అందించడం, మందులు ఇవ్వడం, రోగులకు కౌన్సిలింగ్
ఇవ్వడం ఇలాంటి సేవా కార్యక్రమాలను చేస్తు న్నాం. దాతల సాయంతో ఇప్పటివరకు సంస్థను నిర్విఘ్నంగా నడిపిస్తు న్నాము.
వాలంటీర్లకు సగటు స్థా యి జీతాలు అందిస్తు న్నాము. మీరిక్కడి నుంచి బయటకు రాదలుచుకుంటే ఇదిగోండి ఇది నా ఐడి..”
అంటూ అతడు లేచి నిలబడ్డా డు.
“ఈ కార్డు ఇవ్వడానికే అయితే ఇక్కడికి, ఈ సమయంలో రానవసరం లేదనుకుంటా..!”
అతడు మాట్లా డలేదు.
“సమాధానం ఇవ్వడం సభ్యత అనిపించుకుంటుందేమో!” అంటూ తనూ లేచి నిలబడింది.
“నిరుద్యోగం, నిరాశ్రయత వల్లే చాలామంది స్త్రీలు ఈ వృత్తి లోకి వస్తా రు..” అన్నాడు.
“సభ్య సమాజంలో చాలామంది నిరుద్యోగులున్నారే..” వ్యంగ్యంగా అంది.
“అవును.. అక్కడి నిరుద్యోగులు ఉద్యోగాలను వెతుక్కుంటూ వెళ్తా రు,. ఇక్కడి నిరుద్యోగులు, ఉద్యోగులను తమ
చుట్టూ తిప్పుకుంటారు..”
అతడి మాట పూర్తి కాకముందే, “ఎవరి అవసరం వారిది..” అంది.
“అవసరాలు అవకాశాలను కల్పించాలే కానీ అక్రమాల వైపు నడిపించకూడదు...”
“అక్రమ సక్రమాలను ఈ ఇంటి చుట్టూ తిరిగేవారా నిర్దేశించేది?” అంటూ ట్యూబ్ లైట్ వేసింది.

పెండ్యాల గాయత్రి (78)


కథలు కనే కళ్ళు

“వెలుగును చూడగలిగితే చీకటి అడ్డు కోదు” లైట్ వైపు చూస్తూ అన్నాడు.


“చెప్పడానికి చెయ్యడానికి మధ్య ఓ తరం అంత అంతరం ఉంది” అంది.
“అలాగని చెప్పడమే మానేస్తే,, చేసేందుకు, చూసేందుకు తరువాత తరం మిగిలి ఉండదు” అన్నాడు.
“అసలు మీరు చెప్పదలుచుకున్నదేమిటి?” రింగవుతున్న ఫోన్ కట్ చేస్తూ అంది.
“స్త్రీ, పురుష సంగమం అనివార్యమైనది. అవసరమైనది కూడా. సృష్టికి మూలమైన ఆ ప్రక్రియనాపడం సృష్టికర్తకే
సాధ్యపడలేదు. అయితే అంతటి పవిత్రకార్యం ఇలాంటి అనారోగ్య వాతావరణంలో జరగకూడదు”
‘ప్రేమమూర్తి అయిన తనను అనారోగ్యం పాలు చేసిన కామాంధుడెవడు? నిప్పులాంటి తనను నిందల పాలు చేసిన
వంచకుడెవడు? మదమెక్కిన మగాడేగా., ఆ మత్తు వదిలించేందుకే తానిక్కడికొచ్చింది..’ తాకితే కందిపోయే తన చర్మం ఈ
తలంపుతో ఎరుపెక్కింది. పెల్లు బుకిన ఆవేశాన్నణుచుకుంటూ, “అంటే మీ ఉద్దేశం?” అంది తీక్షణంగా.
“బి.పి, షుగరు, క్షయ లాంటిదే కదా హెచ్ఐవి కూడా. వాటిలాగే మందులు వాడుకుంటూ మామూలు జీవితాన్ని
గడపవొచ్చు కదా. నివారణ మార్గం మన చేతుల్లోనే ఉందని తెలుసు, అయినా దురదృష్టమేమిటో గాని ఏ రోగమొచ్చిన చికిత్స
కోసం పరిగెడతాం. కానీ, హెచ్ఐవి పరీక్షకు మాత్రం వెనుకంజ వేస్తాం అందుకేనేమో చాపకింద నీరులా విశృంఖలంగా వైరస్
విస్తరిస్తోంది..”
“ఇదంతా నాకెందుకు చెబుతున్నారు?” కొంగుతో చెమట తుడుచుకుంటూ అంది.
“ఈ విస్తరణకు మీరే వాహకాలు కాబట్టి..”
అతడి మాట పూర్తవకముందే, “నాన్సెన్స్..” అంటూ గట్టిగా అరచి, లేచి చెంప చెళ్ళుమనిపించింది.
ఉబికి వస్తు న్న కన్నీటిని అణుచుకుంటూ, “మా బ్రతుకులను బందీ చేసి, భోగాలను అనుభవించేది మీరు, మా
అవయవాలతో ఆడుకుని మమ్మల్నిక్కడికి చేర్చేది మీరు, మా అభిప్రాయాలు పట్టించుకోకుండా ఆకలి తీర్చుకునేది మీరు, మా
శరీరం లేకుండా ఒక్కరోజు బతకలేని బలహీనులు, మీరు మమ్మల్ని అనారోగ్యపు వాహకాలాంటారా..?” అంటూ వెనక్కి జరిగి
గోడకు గుద్దు కుంది.
అతడు ఆమెను కూర్చోబెట్టి మంచినీళ్ళందించి, “క్షమించండి.. మీ ఆవేదన నాకు తెలుసు, వికటించిన పరిస్థితులు
మిమ్మల్నిక్కడికి చేరుస్తా యని తెలుసు. సమాజానికి పట్టు కొమ్మ కుటుంబం, ఆ కొమ్మని పట్టి ఉంచే కాండం స్త్రీమూర్తి. ఆమెను
వంచిస్తే మొత్తం వృక్షం కూలిపోతుందని, తవ్వుకొన్న గోతిలో పడక తప్పదని గ్రహిస్తేనే ఈ చీకటి దీపాలు కాంతిరేఖలై
ప్రసరిస్తా యి..” అంటూ ఆమె చేతిలోని గ్లా సు తీసుకుని పక్కన పెట్టా డు.
“ఆరిపోయే దీపంతో చీకటిని పాలద్రోలాలని ఆశపడితే అది అడియాసే అవుతుంది..” అభావంతో అంది.
“చమురు నింపితే ఆ దీపం మరింతకాలం వెలుగుతుంది. లేదా మరో దీపాన్ని వెలిగిస్తుంది..” తానేమీ తగ్గకుండా
ఉత్సాహంగా చెప్పాడు.
“చమురు నింపినా ఈదురుగాలి దాన్ని వదిలిపెట్టదు లేండి, ఊరు, వాడ రగిలించేదాకా..” అంది.
“ఆ దీపానికి లాంతరునందించాలన్నదే నా ప్రయత్నం. ఇదిగోండి మా సంస్థ చిరునామా, నా ఫోన్ నెంబర్ ఇందులో
ఉన్నాయి. పాతబడిన గుర్రం కథ చెప్పను కానీ, స్వర్గస్తు లైన మా తల్లిదండ్రు ల పేరిట ప్రారంభించిన మా సేవాసంస్థను ఇప్పటిదాకా
నేను, మా అక్క కలిసి నిర్వహిస్తు న్నాం. ఇంకొన్నిరోజుల్లో కంటిచూపు లేని ఆమె ఒంటరిదై పోతుంది..” అతడి వైపు విస్మయంగా
చూసింది.

పెండ్యాల గాయత్రి (79)


కథలు కనే కళ్ళు

“అవును.. నా జీవితకాలం, ఇక రోజులు మాత్రమే. మధ్యతరగతి ఒడిదుడుకులను తట్టు కుంటూ చదువుకుని


అధ్యాపక ఉద్యోగాన్ని సంపాదించుకున్నా. ఇంతలో అమ్మానాన్న యాక్సిడెంట్లో పోవడంతో ఆ లోటు మరిచిపోయేందుకు
సేవాసంస్థకు శ్రీకారం చుట్టా ము. నేను బ్రతుకుతూ పదిమందికి బ్రతుకుని ఇస్తు న్నానని తృప్తి పడుతుండగా నా రక్తంలో క్యాన్సర్
కణాలు ఉన్నాయని చెప్పారు డాక్టర్. ఆ క్షణం నుంచి మరింత మందికి బ్రతుకుని ఇవ్వాలన్న ఆశ పెరిగింది. ఆపదలెక్కడెక్కడ
ఉన్నాయా అని అన్వేషిస్తూ ఇవాళ మీ వద్దకు వచ్చాను. నేను పోతానని తెలియని మా అక్కకు, మా సంస్థ సభ్యులకు ఓ ఆత్మీయ
స్పర్శనందించే దాకా జీవించి ఉంటానని నమ్ముతున్నాను..” అంటూ అతడు ఆమెకు నమస్కరించి బయటకు నడిచాడు.
“చచ్చికూడ చీల్చి యిచ్చు తనువు” కరుణశ్రీ మాట కళ్లముందు మెదులుతోంది.
ఇప్పుడు పగ, ప్రతీకారాల కథ మారింది. ప్రేమ వాత్సల్యాల చిరునామా వెతికేందుకు ఐడి కార్డ్ చేతిలోకి తీసుకుందామె.

(ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారు 2012 వ సంవత్సరం ముద్రించిన కథా సంకలనంలో ఈ కథ చోటును
సంపాదించుకుంది)

నిత్య నూతనం
“ఇప్పుడు నా ముందున్న ఏకైక జీవిత లక్ష్యం.. నాకు అత్యంత ప్రియమైన మా డాడీతో కనీసం ఒక్కసారైనా డేటింగ్‌లో
పాల్గొనడం!”
డాక్టర్ నిత్య మాటలకు నివ్వెరపోయి నోర్లు వెళ్ళబెట్టా రు మీడియా వాళ్ళు.
“అవును.. మీరు సరిగానే విన్నారు..! కొడితే కుంభస్థలాన్ని కొట్టా లి, పడితే పంచవన్నెల చిలకను పట్టా లి. నేటి సమాజాన్ని
శాసిస్తు న్న అంతర్జా ల ప్రపంచంలో ఆదర్శ నాయకుడిగా వెలుగొందుతున్న మా నాన్న కన్నా.. గొప్పవ్యక్తి మరొకరుంటారని
నేననుకోవడంలేదు..” నిత్య మాటలకడ్డొస్తూ..
“శశి భూషణరావుగారంటే సాక్షాత్తూ పరమశివుడంతటి వారు, ఆయన.. గతి తప్పుతున్న సమాజానికి సంజీవని
వంటివారు, దారి తప్పుతున్న యువతకు దిక్సూచి వంటివారు.. లక్షలాదిమంది ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితులై, అనుక్షణం
అనుసరిస్తు న్నారు. అలాంటి మానవతామూర్తి కడుపున పుట్టి..” తరువాతి మాట నోటరాక ఆగిపోయాడొక విలేఖరి.
“చెడువినవద్దు , చెడు కనవద్దు అన్న మహాత్మునికి మానస పుత్రు డాయన”
“ప్రేమ విఫలమైన ఓ యువకుడు కసిగా ప్రేయసిని చంపాలని బయలుదేరి, భూషణంగారి మాటలువిని, తన నిర్ణయాన్ని
మార్చుకున్నాడంట..! అతడే స్వయంగా చెప్పాడు నాతో”
“అంతేనా.. తన వాచ్మెన్, అతని భార్య ప్రమాదంలో మరణిస్తే వాళ్ళబ్బాయిని కన్నబిడ్డలా పెంచి పెద్ద చేసిన ప్రేమామూర్తి!”
“ఈ అమ్మాయికి ఐదేళ్ళున్నప్పుడే వీళ్ళమ్మ వెళ్ళిపోతే.. మళ్ళీ పెళ్ళి తలపెట్టకుండా ఈమె కోసమే బతికిన త్యాగమూర్తి”
“ఆయన ఫేస్ బుక్ చూసినా, యూట్యూబ్ లోకెళ్ళినా, టిక్ టాక్ ఫాలో అయినా, వాట్సప్ గ్రూపులో ఉన్నా తన చెప్పే
మాటలు అనితర సాధ్యమండీ!”

పెండ్యాల గాయత్రి (80)


కథలు కనే కళ్ళు

“అంతటి మహామనిషి ఏకైక కుమార్తె డాక్టరై, హాస్పిటల్ ప్రారంభిస్తోందంటే.. ఎంతటి ఉన్నతాశయాలున్నాయో,


ఇంకెంతటి నైతిక విలువలున్నాయో అని అందరం రెక్కలు కట్టు కుని వచ్చాం. ఇంతా చేస్తే ఈ మహాతల్లీ... ఇలా
మాట్లా డుతోంది!”
వరసపెట్టి తమ వాగ్ధా టిని వినిపిస్తు న్నారు విలేఖరులంతా.
“అమ్మ పుట్టింటి ఘనతను మేనమామకు చెప్పినట్లు .. మా నాన్న గురించి మీరు నాకు చెప్పాలా! ఇవాళ నా హాస్పిటల్
ఓపెనింగ్ పెట్టు కునీ.. ఎవరిదో ఆస్తి తగాదా తీర్చేందుకు వెళ్ళారు. అంతటి ఔన్నత్యం ఆయనది. అందుకే నేనంతలా ఫిదా
అయిపోయాను. పరిమితి లేని ప్రేమకు పరాకాష్ట శృంగారమే అని నేననుకుంటాను అయినా.. ప్రముఖులతో డేటింగ్ లాంటి
నిర్ణయాలు మన మీడియాకేం కొత్త కాదుగా!”
నిత్య మాటలు విని.. ప్రారంభోత్సవానికి వచ్చిన మహిళ కల్పించుకుని, “ఏమ్మాయ్.. ఇంత చదువుకున్నావ్,
డాక్టరునంటున్నావ్! ఆ మాత్రం వావి వరసలు, భవబంధాలు తెలియవా నీకు? ఇంతమందిలో ఇలా మాట్లా డడానికి కనీసం
సిగ్గుగా కూడా అనిపించడం లేదా?” గదమాయించింది.
ఈ కోలాహలాన్ని గమనించిన బాటసారులంతా ఒక్కొక్కరుగా అక్కడ నిలబడడంతో ఆ ప్రదేశమంతా
జనసంద్రమయ్యింది. సంగతేంటో తెలుసుకునే పనిలో సందడి మొదలయింది. ఎవరి పంథాలో వాళ్ళు గట్టిగట్టిగా
మాట్లా డేస్తు న్నారు.
“అరెరెరే! అందరూ ఎందుకంతలా ఆవేశపడిపోతున్నారు?”
నింపాదిగా అడిగిన నిత్యను కొరకొరా చూస్తూ, “ఈకాలం పిల్లలు కొరకరాని కొయ్యలే అనుకున్నా, కొంపలు కాల్చే
కొరివిలు గూడానండీ!” ఓ పెద్దా యన ముక్తా యించాడు.
నిత్య నవ్వి, “హ.. అవును కొత్తతరం వాళ్ళం కదా.. కోర్కెలు కూడా కొత్తకొత్తగానే ఉంటాయి మరి!” అంది.
“ఇదుగో అమ్మాయ్! నోరుందని నీ ఇష్టమొచ్చినట్లు మాట్లా డితే సినిమా జూసినట్టు చూస్తా
కూర్చుంటామనుకుంటున్నావేమో.. తగిన శాస్తి జేస్తాం” ఓ మహిళ మండిపడింది.
“అవును.. మీరిప్పుడే కాదు, ఎప్పుడూ సినిమాలే చూస్తా రు. పిల్లలు కోరే గొంతెమ్మ కోరికలన్నింటినీ కొండను తవ్వైనా,
కొంపను కూల్చైనా కాదనకుండా తీరుస్తా రు కదా.. పెద్దలు! మరి సెక్స్ విషయంలో మాతో స్నేహపూర్వకంగా ఉండి
చర్చించరెందుకు? ఆ విషయాలు మాట్లా డితే పిల్లల్నెత్తికుదేస్తా రెందుకు? వద్దన్న దానివైపే పసిమనసులు ఆకర్షించబడతాయని
గమనించరెందుకు? ఏ విషయంలోనైనా ‘నీకేం కావాలో చెప్పమ్మా’ అంటూ అలవిమాలిన స్వేచ్ఛ ఇచ్చే మీరు.. ఈ విషయంలో
మమ్మల్ని విషపురుగులుగా చిత్రీకరిస్తా రెందుకు?”
గంభీరంగా మాట్లా డుతున్న నిత్య మాటలకడ్డొస్తూ,,
“ఓహో! ఇది ప్రేమ పురాణమా.. పెద్దా యనకు నేను సిఫారస్ చేస్తా గానీ, ఆ హీరో ఎవరో కాస్త చెప్పమ్మా!” ఓ సీనియర్
విలేఖరి గొంతులో వ్యంగ్యం.
“నాకూహ తెలియకముందే అమ్మ దూరమవడంతో నాయనమ్మే అన్నీ అయ్యింది. నాన్నెలా ఉంటాడంటే.. నేనాడుకునే
బొమ్మలాగనో, తొడుక్కునే గౌను లాగనో, తినే తిండి లాగనో, చదువుకునే పుస్తకంలాగనో లేక నేను నేర్చుకోవలసిన నీతి లాగనో
ఉంటాడని, ఆ వయసులో నేను తెలుసుకున్న పాఠం. ఆయనను చూడడానికి జాగారం చేయాలనుకునేదాన్ని, అందుకోసమని
ఆయన గదిలోకెళ్ళి పడుకునేదాన్ని. నిద్ర లేచేసరికి నాయనమ్మ తప్ప నాన్నుండేవాడు కాదు. కొన్నాళ్ళకి, వాచ్ మెన్ అంకుల్

పెండ్యాల గాయత్రి (81)


కథలు కనే కళ్ళు

కొడుకు నాకు అన్నకాని అన్నలా మా ఇంటికొచ్చాడు. నాన్న వెంట ఆ అన్న ఉంటున్నాడన్న అసూయ తప్ప నాకు అనురాగం
దొరకలేదు. నాకేలోటూ చెయ్యని నాన్న ప్రేమించేది కూతురినా, కీర్తినా? అనే ప్రశ్నకు జవాబు దొరకకముందే నాయనమ్మకూడా
అమ్మ దగ్గరకు వెళ్ళిపోయింది. పదిమంది పనిమనుషుల మధ్య ప్రతిభావంతమైన యంత్రంలా పెరిగాను. నాన్న చేసే నీతిబోధను,
దేశసేవను టీవీలోనో, ఫోనులోనో చూస్తూ ప్రేరేపితురాలినై డాక్టరు వృత్తిని ఎంచుకున్నాను. నా పదవతరగతి పూర్తయ్యేటప్పటికి
ఇంటరు పూర్తి చేసుకున్న అన్న చదువు మానేస్తే బాధపడినా, నన్ను అమ్మలా చూసుకుంటున్నాడని ఆనందించాను. నా వైద్య
చదువు పూర్తయ్యే నాటికి అమ్మవంటి అన్నకు అంతుపట్టని వింతవ్యాధి వచ్చిందని తెలిసి విస్తు పోయినా, అందుకే
డాక్టరునయ్యానని తృప్తి పడ్డా ను.” కదిలించే కథలా చెపుతున్న నిత్యమాటలను నిశ్శబ్దంగా వింటున్నారు.
ఆ వందల మందిలోంచి ఒకరు, “వింత వ్యాధా..ఏంటదీ?” అరిచారు.
“ఓయ్..ఆపవయ్యా..! చెత్త ప్రశ్నలతో మధ్యలో అడ్డొస్తా రు!” శ్రధ్ధగా వీడియో తీసుకుంటున్న మీడియా వాళ్ళు
మండిపడ్డా రు.
“అదేంటండీ! అలా కోప్పడతారు? మీకైనా, జనానికైనా కావలసింది సంచలనాలే గానీ, సంక్షేమాలు కాదుకదా!”
వ్యంగ్యంగా నవ్వింది నిత్య.
“యేవమ్మా! నీ యిష్టమొచ్చినట్లు మాట్లా డిందిగాక జనాల్ని తప్పుడోళ్ళని చేస్తు న్నావా ?” అంటూ ఒక వ్యక్తి ఆవేశంగా
ఆమెవైపు రాయి విసిరాడు.
రాయిని చాకచక్యంగా ఒడిసి పట్టు కున్న నిత్య,
“ఓ..సూపర్! అసలు ఆట ఇప్పుడే మొదలయింది... నాలాంటి డేటింగ్ నోళ్ళను మీదాకా చేర్చి పైకం, పరపతి
పెంచుకుంటున్న మీడియాపై కూడా వెయ్యగలరా.. రాళ్ళు! మా నాన్నలాంటి చాటింగ్ గాళ్ళను ప్రచారం చేసుకుంటూ, వాటాలను,
కోట్లను గడిస్తు న్న డేటా కంపెనీలపై విసరగలరా.. జోళ్ళు! మా అన్నలాంటి ఏకాకులను చేరదీసి, కీర్తిని, కాసులను కొల్లగొడుతున్న
కరుణామయులకు వలిచేయగలరా తోళ్ళు. నా కారుకూతలు విని, పనిమానుకుని ఇంతసేపిక్కడ నిలబడిన మీరంతా కదపగలరా
కాళ్ళు ..!” అంటుండగా ఆహ్వానితులు ఒక్కొక్కరుగా పైకి లేచారు.
ఓ సీనియర్ విలేఖరి కలుగజేసుకుని, “దయచేసి ఎవ్వరూ వెళ్ళవద్దు ! ఈ అమ్మాయేదో నర్మగర్భంగా మాట్లా డుతూ,
శశిభూషణరావు గారిపై బురద చల్లి, తన పంతం నెగ్గించుకునే ప్రయత్నంలో ఉంది. ఇలాంటి వాళ్ళ నోరు మూయించి, మన
మంచికోరే రావుగారిని రక్షించాలి.. ప్లీజ్! అందరూ ఎక్కడివాళ్ళక్కడే నిలబడండి!” బిగ్గరగా చెప్పాడు.
అందరూ నిశ్శబ్దమయ్యాక..
“డాడీని నా ప్రాణప్రదంగా ప్రేమించాను కాబట్టే ఆయన ఆశయమైన ఈ హాస్పిటల్ని ప్రారంభిస్తు న్నాను. ఆయన
పధ్ధతులను తూ.చా తప్పక పాటిస్తా ను కనుకనే తనతో సంయోగం కోరుతున్నాను. అమ్మలేని నాకు అమ్మను మించిన అన్ననిచ్చిన
దేవుడు మా డాడీ!” నిత్య మాటలు అందరి ముఖాల్లోని విస్మయాన్ని ప్రస్పుటం చేస్తు న్నాయి.
“మా అన్న ఇంటర్తో చదువాపేస్తే నాన్న డిజిటల్ పనులు చేయడం కోసమేమో.. అనుకున్నా. కొన్నాళ్ళ తరువాత ఇళ్ళు
వదిలి బయటకు రావడమే మానేస్తే నాకూ, నాన్నకూ వండి పెట్టటానికిష్టపడుతున్నాడనుకున్నా. నన్నప్పుడప్పుడు
డబ్బులడుగుతుంటే.. నాన్ననడగలేక నన్నడుగుతున్నాడనుకున్నా. నాతో మాటలు తగ్గించేస్తే.. నా చదువుకు
సహకరిస్తు న్నాడనుకున్నా.
పనిమనుషులంతా చెవులు కొరుక్కుంటుంటే.. మా అన్నను నిలదీశా. అడగొద్దన్నాడు, చెప్పలేనన్నాడు, ఒట్టు పెట్టా డు,
బతిమాలాడు, కాళ్ళు పట్టు కోబోయాడు... కానీ నేనొదలలేదు చెప్పేదాకా...! విషయం విన్నాక, జీర్ణించుకోలేక, బాధనణచుకోలేక..

పెండ్యాల గాయత్రి (82)


కథలు కనే కళ్ళు

భోరుమని ఏడ్చేశా. పగవాళ్ళకు, పాపిష్టివాళ్ళకు కూడా రాకూడని దారుణమైన సమస్య.. చెపుతున్న నాకే నరాలన్నీ నలిగి,
నేలకొరిగిపోయేలా ఉన్నాయి.. అన్న మలాంగం వదులైపోవడం వల్ల విసర్జిత మలం తన ప్రమేయం లేకుండానే,
బాత్రూమ్లోకెళ్ళేటప్పటికే బట్టల్లో పడిపోతోందట.. ఏక్షణంలో పడుతుందో తెలియక బయటకు రావటానికి కూడా
భయపడిపోతున్నాడు, ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోతున్నాడు, కన్నీటితోనే సహవాసం చేస్తు న్నాడు. ఎందుకలా
అయ్యిందనే విషయం తెలియక.. అన్నను బలవంతంగా డాక్టర్లకు చూపించా..”
ఒక క్షణమాగింది నిత్య.
“ఏం చెప్పారమ్మా!” చాలామంది ముక్తకంఠంతో అడిగారు.
“ఆ విషమ విషయం వినగానే నా చెవులు పగిలిపోయినా, విన్నాక నేను బతికుండకపోయినా ఎంత బావుండేదో!” నిత్య
కళ్ళలో కన్నీళ్ళు ఉబికివస్తు న్నాయి.
“ఏం జరిగిందమ్మా” ఓ విలేఖరి మెల్లిగా అడిగాడు.
“జన్యుపరమైన సమస్యలతో హిజ్రాలుగా మారిన వాళ్ళను, హార్మోన్ల లోపంతో స్వలింగ సంపర్కం కోరుకునే వాళ్ళను
మనమంతా అసహ్యించుకుని సభ్య సమాజం నుంచి వెలివేస్తు న్నాం, వాళ్ళని కనీసం సాటి మనుషులుగా, తోటి మనుషులుగా
కూడా గుర్తించలేక పోతున్నాం, వాళ్ళకు ఎల్.జి.బి.టి అని పేరు పెట్టేసి.. విరుధ్ధమైన, విపరీతమైన వర్గంగా విభజించేశాం,
విధివంచితులైన ఆ అమాయకులను దారుణంగా దూరం పెట్టేసిన జాగ్రత్తపరులం కదా మనం! ఏ ప్రేమకూ నోచుకోని ఆ
అభాగ్యులు అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆక్రోశిస్తాం కదా!!!
అంతేనా... మన పిల్లలకు అతి స్వేచ్ఛనివ్వడం, అవసరానికి మించి అన్నీ అందించడం స్టేటస్ సింబల్‌గా భావించి,
మంచిచెడులు, బాగోగులు చెప్పకుండా గారాలు చేసి, వాళ్ళు యధేచ్ఛగా ఘోరాలు చేశాక... దుష్ట చరితులుగా, దుర్మార్గులుగా
తీర్మానించేసి, నిర్దా క్షిణ్యంగా కాల్చిపారేయమంటున్నాము కదా!!!
మరి... అన్ని అవయవాలు, అవకాశాలు సక్రమంగా ఉండి, మంచిచెడుల విచక్షణ ఎరిగి, అందరి సహకారం పొందుతూ,
మనందరి మధ్య హుందాగా బ్రతుకుతూ.. లౌక్యం ముసుగులో ఇతరుల అవసరాలను, ఆపదలను ఆసరాగా తీసుకుని, పబ్బం
గడుపుకుంటూ.. పైశాచికానందం పొందేవాళ్ళకి ఏ పేరు పెట్టా లి? ఏ వర్గంలో చేర్చాలి? ఏ శిక్ష విధించాలి???” గద్గద గొంతుతో
ప్రశ్నిస్తు న్న నిత్యనే నిశ్చలంగా చూస్తు న్నారందరు.
స్తబ్దత నుంచి సర్దు కుని.. మళ్ళీ చెపుతోందామె, “మళ్ళీ పెళ్ళిని నాకోసం త్యాగం చేసిన నా కన్నతండ్రి... తనవద్ద పనిచేసే
వాచ్ మెన్ దంపతులు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే, అనాధ అయిన వాళ్ళ ఎనిమిదేళ్ళ కొడుకును అందరిముందు దత్తత
తీసుకుంటున్నట్లు గా ప్రకటించి, తన కొడుకుగా ఆదరిస్తా నని, నా అన్నలా మా ఇంటికి తీసుకొచ్చి.. నమ్మలేనంత నీచంగా,
చెప్పలేనంత క్రూ రంగా, ఆనాటినుంచి.. అన్న మలాంగంతో పద్దెనిమిదేళ్ళుగా.... పద్దెనిమిదేళ్ళుగా....” అంటూ బిగ్గరగా ఏడ్చేసింది
నిత్య.
“అయ్యో..అలా ఏడవకమ్మా!” ఓదారుస్తూనే, ఆమె చెప్పేది నిజమా అనే సందేహం వ్యక్తం చేశారందరు.
ఆ మాటలు విన్న నిత్య, తనను తాను సంభాళించుకుంటూనే, కళ్ళు తుడుచుకుని,
“పదిమంది నక్కను కుక్క అంటే పదకొండవ వాడు కళ్ళు మూసుకుని అది కుక్కే అని నిర్ధా రిస్తా డు. భ్రమలో
బ్రతకటానికలవాటు పడిన మనం నిజాలను విని భరించలేము,, పొగడ్తలకు అలవాటు పడిన మనం లోపాలు చెపితే
జీర్ణించుకోలేము.

పెండ్యాల గాయత్రి (83)


కథలు కనే కళ్ళు

అసలు ఎవరు ఎవరినుండి అకృత్యాలు నేర్చుకుంటున్నారు? ఇది ఆధునిక సమాజమా, ఆటవిక సమాజమా? పిల్లలను
తీర్చిదిద్దా ల్సిన పెద్దలే కోర్కెలనే గుర్రాలెక్కి స్వారీ చేస్తుంటే ఇక నేటితరానికి రెక్కలు మొలవడంలో ఆశ్చర్యమేముంది?
మీరంతా నిజానిజాలను నిగ్గు తేల్చే నిబధ్ధత కలిగి, నైతికతకు విలువనిచ్చేటట్లైతే .. ఈ విధమైన విపరీత టాకింగులు,
వినలేని విశృంఖల డేటింగులు, ఇదిగో ఇప్పుడు జరుగుతున్న విచ్చలవిడి మీటింగులు కొనసాగుతాయా? పరిష్కారాలు లేని
సమస్యలు ఉత్పన్నమవుతాయా? ఒక్కక్షణం ఆలోచించండి! కంటికి కనపడినది మాత్రమే అద్భుతమో, అమానుషమో అనుకుని..
యథేచ్ఛగా ఎగిరే రెక్కల గుర్రాల్లా కాక, రేపటి చరిత్రలో మిగలవలసిన మనుషుల్లా అలోచించి, అడుగులు వేయండి! మా నాన్న
లాంటి మేకవన్నె మృగాలను మీ విచక్షణ అనే రెక్కలతో ముక్కలు ముక్కలుగా విరిచి వేయండి..!
కామపిశాచాల బారినుండి కాపాడుకోవలసింది.. కేవలం అమ్మాయిలను మాత్రమే కాదు, రాలిపోవడానికి సిధ్ధంగా ఉన్న
రేపటి తరం మొత్తా న్ని...! రసహీనమవుతున్న రంగుల ప్రపంచాన్ని...!!!” అంటూ అందరినీ కలయజూస్తూ ముగించింది నిత్య.

(లైంగిక వేధింపులకు లింగ బేధం లేదని ఓ పత్రికలో విన్న లైన్ ఆధారంగా రాయబడిన ఈ కథ, “కలం స్నేహం” వాట్సప్
గ్రూపులో నిర్వహించిన కథల పోటీలో ప్రథమ బహుమతి అందుకుని, 2019 వ సంవత్సరంలో ప్రతిలిపిలో ప్రచురించబడింది)

కంటేనే అమ్మా?
“వినీల్... మన విక్కీ,, విక్కీ...”
“విక్కీకి ఏమయింది నవ్యా?”
“విక్కి... విక్కీ.. కనిపించడం లేదు వినీల్!”
“అదేంటి... నువ్వింట్లోనే ఉన్నావు కదా?”
“నేను ల్యాప్‌ట్యాప్‌లో వర్క్ చేసుకుంటూ విక్కీకి మొబైల్ ఇచ్చాను. వాడు ఆడుకుంటున్నాడనుకున్నా.. వర్క్
పూర్తయ్యాక చూస్తే,”
“అలా ఏడవకు, ఎక్కడకీ పోడు.. ఇంట్లో ఏదో ఒక గదిలో ఉంటాడులే చూడు.. నేను బయలుదేరా... ఐదు నిమిషాలలో
వచ్చేస్తా ..”
“అరగంట నుండి వెదికాను వినీల్... ఎక్కడా కనిపించలేదు.”
“నేనొచ్చేస్తు న్నా.. నువ్వలా కంగారుపడక ప్రశాంతంగా చూడు, ఇల్లు వదలి ఎక్కడికీ పోడు. “
కట్టయిన సెల్ ఫోన్ను కుర్చీలో విసిరేసి, కన్నీళ్ళను తుడుచుకుని.. మరొకసారి కాళ్ళకు, కళ్ళకు పని పెట్టింది నవ్య.
మూడు విశాలమైన పడక గదులు, ఆ మూడు గదులు ఏకమైనంత హాలు, హాలులో సగం పరిమాణంలో ఉన్న
వంటగది, హాలు ముందున్న వరండా, వరండాను అనుకుని ఉన్న పార్కింగ్ ప్రదేశం, దానిముందున్న ఖాళీస్థలం అన్నిచోట్లా ,
“విక్కీ!” అని కేకలు పెడుతూ వెదికింది. బయటకు వచ్చి పక్కింటివాళ్ళను, ఎదురింటి వాళ్ళను, తెలిసిన వాళ్ళను, కనిపించిన
ప్రతివాళ్ళను వదలకుండా అడిగింది.. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఆమె ఆందోళన కట్టలు తెంచుకుంది. వెన్ను
విరిగినట్లు నరాలన్నీ మెలిబెడుతుంటే అతికష్టం మీద ఇంట్లోకి వచ్చి, వరండాలో ఉన్న అక్వేరియాన్ని ఊతంగా పట్టు కుని
నిలబడింది. కొద్ది నీళ్ళమధ్య పరుగులు పెడుతున్న చేపపిల్లల్లా , కన్నీళ్ళ మధ్య జ్ఞాపకాలు సుడులు తిరుగుతున్నాయి.
***

పెండ్యాల గాయత్రి (84)


కథలు కనే కళ్ళు

కోట్లా ది రూపాయల ఆదాయాన్ని కళ్ళచూసే వ్యాపారవేత్త ఇంట్లో ఏకైక సంతానంగా పుట్టింది నవ్య. సకలసుఖాలు
అనుభవిస్తూనే ఇంజనీరింగ్ పూర్తిచేసి, అవసరం లేకున్నా ఉద్యోగంలో చేరింది. నాన్న స్నేహితుడు, వ్యాపార భాగస్వామి కొడుకు
అయిన వినీల్‌తో వైభవంగా వివాహం జరిగింది. ఎంత సంపద ఉన్నా, తమ ఉద్యోగాలను వదులుకోమని పెద్దలకు చెప్పి,
హై దరాబాద్‌లో కాపురం పెట్టా రు నవ్య, వినిల్ దంపతులు.
నగర రణగొణ ధ్వనులకు దూరంగా తమ అభిరుచుల మేరకు విశాలమైన ఇల్లు కట్టు కుని ఏలోటు లేకుండా
పాలూమీగడల మేళవింపుగా జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తు న్నారు.
అయితే... ఒకటి కాదు, రెండు కాదు ఆరు సంవత్సరాలు గడచిపోయాయి.. కానీ, తను తల్లి కాలేకపోయింది. దేవుళ్ళ
చుట్టూ, డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టింది. లక్షలాది రూపాయలు మంచినీళ్ళ మాదిరి ఖర్చు చేశాక, అతికష్టం మీద ఒక
బాబుకు జన్మనిచ్చింది. తల్లిదండ్రు లు, అత్తమామలు బాబును దగ్గరుంచుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నా వాడిని వదలి ఉండలేక
తమ దగ్గరే ఉంచుకుని, మూడవ యేడు రావడం తోనే బడిలో చేర్పించి, తనూ ఉద్యోగంలో చేరింది. వాడి ఎల్‌కేజి
పూర్తవకముందే కరోనా కారణంగా మూసివేసిన బడులు నెలలు గడచినా తెరవకపోవడంతో తాను ఇంటినుండే ఉద్యోగ
బాధ్యతలు నిర్వర్తిస్తోంది.
బిడ్డను కంటికి రెప్పలా, ఒంటికి బట్టలా అనుక్షణం కాచుకుంటోంది. విక్కీయే తన లోకంగా బ్రతుకుతోంది.
***
‘బాబును ఎవరైనా.,, డబ్బుకోసం కిడ్నాప్.!!’ ఆ ఆలోచన రావడంతోనే నిలుచున్నదల్లా నేలపైకి ఒరిగి పోబోతుండగా,
వినీల్ వచ్చి ఆమెను ఒడిసి పట్టు కున్నాడు.
అతన్ని చూడగానే ఆమె దుఃఖం కట్టలు తెంచుకుంది. వినీల్ నవ్యను ఓదార్చి, తన స్నేహితుడి సోదరుడు ఎస్.ఐ గా
ఇదే ఏరియాకు పనిచేస్తు న్నాడనీ, అతనితో మాట్లా డదామని ధైర్యం చెప్పి... అతడికి ఫోన్ చేసాడు వినీల్.
“ఎస్ఐ గారూ, మా విక్కీ కనిపించట్లేదండీ!”
“కుక్కలను, పిల్లు లను వెదికిపెట్టడానికేనటయ్యా..పోలీసులున్నది?”
“అయ్యో..సార్! విక్కీ అంటే నాలుగు సంవత్సరాల మా బాబండీ!”
“విక్కి, లిక్కి, రిక్కి కన్నా మంచిపేరే దొరకలేదటయ్యా.. మీకు?”
మావాడి పేరు వేదాన్ష్ అండీ! ముద్దు గా ‘విక్కి’ అని పిలుచుకుంటాం.”
“ప్రేమానురాగాలతో పాటు పేర్లను కూడా ఖూనీ చేసేస్తు న్నారు.. ప్చ్ ఏంచేస్తాం?”
“సార్... మా బాబు ఒక గంటనుండి కనిపించట్లేదండీ!”
“ఇప్పుడే వాట్సాప్లో వైరల్ అయిన ఒక వీడియో చూస్తు న్నానయ్యా! నీకు ఒక అడ్రస్ మెసేజ్ పెడతాను, మీరక్కడికి
వచ్చేయండీ.. మేము కూడా వస్తు న్నాము.”
“సార్.. మా .. బా...బు కేదైనా... ప్రమాదం?”
ఈ కంగారు పిల్లలను నిర్లక్ష్యంగా వదిలివేసినప్పుడు ఉండదెందుకయా? త్వరగా వచ్చేయండి!”
కాల్ కట్టైపోవడంతో వణుకుతున్న చేతులతో అడ్రస్ తెలిపే మెసేజ్ కోసం వెదుకుతున్న వినీల్‌ను గట్టిగా కుదుపుతూ,
“నా బిడ్డకు ఏమయింది వినీల్? చెప్పు ఏమయిందీ..!”
తల్లడిల్లిపోతున్న నవ్యను గుండెలకు పొదుముకుని,

పెండ్యాల గాయత్రి (85)


కథలు కనే కళ్ళు

“మన విక్కీకేమీ కాదురా! నీ ధైర్యమే వాడికి శ్రీరామరక్ష.. పదా వెళదాం... ఇదిగో, ఎస్ఐ గారు అడ్రస్ మెసేజ్ చేశారు,
మన పక్కవీధిలోనేలా ఉంది త్వరగా వెళ్ళవచ్చు.” అంటూ బైక్ తీసాడు వినీల్.
ప్రయాణిస్తు న్నారేగానీ, ఇద్దరి ఆలోచనలు ఆ బైక్ కన్నా వేగంగా పరిగెడుతున్నాయి. నవ్య అంత వేదనను భరిస్తూ
నిశ్శబ్దంగా ఉండలేక, వినీల్‌తో ఆపకుండా ఏడుస్తూ మాట్లా డుతూ ఉంది..
“ఈ పెద్దవాళ్ళా వాళ్ళ వ్యాపకాలు వదులుకుని ఇక్కడికి రాలేరు. చేస్తు న్న ఉద్యోగాలు కాదనుకుని మనమా ఊరు
వెళ్ళలేం. బాబుతో గడపడానికి తగినంత సమయం దొరకదు. వాడి ఆనందం కోసమని., ఆలోచించకుండా ఖర్చుపెట్టి రకరకాల
ఆట వస్తు వులు, సాంకేతిక పరికరాలు, బుల్లి వాహనాలు లాంటివి అనేకం కొన్నాం. అవన్నీ వదిలేసి అమ్మానాన్నతో ఆడాలి
అంటాడు వాడు. లాక్డౌన్ మొదలైనప్పటినుంచి బడి లేకపోవడంతో పిల్లలెవరు కనిపించక నా వెంటే తిరుగుతుంటాడు. కరోనా
భయం చేత ఎవ్వరూ పిల్లలను ఇంట్లోనుండి బయటకు రానివ్వడం లేదు, ఇతర పిల్లలతో కలవనివ్వట్లేదు.
ఆటల పిచ్చితో తెగ అల్లరి చేస్తుంటే ఏదో విధంగా వాడిని ఏమార్చి ఆఫీస్ పని పూర్తి చేసుకుంటున్నాను. ఇవాళ కూడా
ఎలాగో బుజ్జగించి, ఫోన్ విక్కీ చేతికిచ్చి నాపనిలో లీనమయ్యాను. పని అయిపోయాక చూస్తే ఫోన్ అక్కడే ఉంది, వాడు
కనపడలేదు! ఏమయినట్లు ? ఊరుకాని ఈ ఊరులో మన కుటుంబానికి ఆత్మీయులు గానీ, ఆగర్భ శత్రు వులు గానీ ఎవరు లేరు
కదా? బాబే స్వయంగా ఎక్కడికైనా వెళ్ళగలిగే అంత వయసు, ఊహ రెండూలేవాయె. ఇంతటి మహానగరంలో ‘మీ ఇల్లెక్కడ
బాబు?’ అని ఎవరైనా అడిగినా చెప్పలేని పసివాడైపోయె. ఆ పోలీసేమో విషయం చెప్పకుండా వీడియో అంటాడు, పక్కవీధిలోకి
రమ్మంటాడు. విక్కీ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో? అమ్మా నాన్న అంటూ మనం కనిపించక ఎంతలా తల్లడిల్లిపోతున్నాడో..!”
మాటలలో అంతటి రద్దీని దాటుకుని, ఎస్.ఐ చెప్పిన ప్రదేశానికి చేరుకున్నారు.
అప్పటికే అక్కడికి చేరుకున్న ఎస్.ఐ వినీల్ దంపతులను సమీపించి, “కన్నబిడ్డ ఏంచేస్తు న్నాడు? ఎటు వెళుతున్నాడు?
అన్న చిన్న విషయాలు కూడా గమనించలేనంత ఏమరపాటులో తల్లి ఉండకూడదమ్మా! ఇదిగో.. ఒకసారి ఈ వీడియో
చూడండీ!” అంటూ సెల్ఫోన్ అందించబోయాడు.
వేదనా సంద్రాన్ని అణచిపెట్టి ఉన్న నవ్య ఎస్.ఐ మాటలు వినడంతోనే కన్నీటి సునామీ అయ్యింది.
“అవును సార్..!! కన్నతల్లికి ఏమరపాటు అసలుండకూడదు... కానీ, పరిస్థితులు వికటించి తల్లడిల్లిపోతున్న ఆ తల్లిని..
మరో గొప్పతల్లి కన్నకొడుకు విపరీత చేష్టలతో, వెటకార వ్యాఖ్యలతో ఇంకాస్త వేధించవచ్చు.” ధారలు కడుతున్న కళ్ళను
తుడుచుకోవడానికన్నట్లు పక్కకు తిరిగిన నవ్య రోడ్డు కు కాస్త దూరంలో మట్టినేలపై చలనరహితంగా పడుకుని ఉన్న బాబును
చూచి, పరుగున వెళ్ళి, ఎత్తు కుని, వాడు నిద్రపోతున్నాడని అర్థంచేసుకుని, వంటికంటుకున్న మట్టి దులిపి, ఆబగా
ముద్దు లాడుతూ భర్తవద్దకు తీసుకొచ్చింది.
“మీబాబు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో చూపించాలనే, అక్కడే వదిలేశాను” అన్నాడు ఎస్ఐ.
ఆ మాటలేవీ పట్టించుకోకుండా, అమితానందంతో బాబును అందుకున్న వినీల్ కూడా వాడిని ముద్దా డుతూ చుట్టూ
ప్రపంచాన్ని మరచిపోయాడు.
ఆ స్పర్శకు మేలుకున్న విక్కి కళ్ళు నులుముకుని, నవ్వుతూ, “డాడీ... మమ్మీ! మమ్మీ!! ఎక్కడ?” అన్నాడు.
“ఇదుగో” అంటూ నవ్యను చూపించాడు వినీల్.

పెండ్యాల గాయత్రి (86)


కథలు కనే కళ్ళు

“కాదు!! మన మమ్మీ కాదు,, నువ్వు చెప్పిన సెకండ్ మమ్మీ!! నేనిప్పటిదాకా., ఆ మమ్మీతో ఎంచక్కా ఆడుకున్నాగా...!”
అంటున్న బాబు మాటలకు నవ్య విస్తు పోగా, బాబును బయటకు తీసుకొచ్చినప్పుడల్లా తను ఎవరి దగ్గర కాసేపు ఆడిస్తా డో,
ఎవరినైతే ‘సెకెండ్ మమ్మీ’ అని పిలవమని విక్కీకి చెప్పాడో గుర్తు కొచ్చి, వాడి జ్ఞాపకానికి ఆశ్చర్యపడిపోతూ నవ్వుకున్నాడు వినీల్.
“నేను రోజు ఆ మమ్మీ దగ్గరకు వచ్చీ చక్కగా ఆడుకుంటా డాడీ! పీజ్ డాడీ! డాడీ!” వినీల్ గడ్డం పట్టు కుని మరీ
గోముగా అడిగాడు విక్కి.
అసలు విషయం తెలియని నవ్య, అయోమయంగా, కోపంగా చూస్తుంటే, ఆమెను ఉడికించాలనుకుంటూ..
“అలాగే ఆడుకుందువుగాని నాన్నా!” అన్నాడు.
వినీల్ చేతుల్లోంచి బాబును విసురుగా లాక్కుని,
“ముందిక్కడనుంచి ఇంటికెళదాం పదండి!” అంటూ ముందుకు కదిలింది నవ్య.
“ఆగండి మేడం! మీబాబు కనిపించగానే అలా వెళ్ళిపోతున్నారు.. చాలా ముఖ్యమైన ఈ వీడియో చూడకపోతే ఎలా?”
ఎస్.ఐ మాటలు వ్యంగ్యంగా అనిపించడంతో అతడివైపు ఒక చూపు విసిరి వినీల్ కోసం కూడా చూడకుండా, ఏడుస్తు న్న బాబును
బుజ్జగిస్తూ.. అక్కడనుండి విసవిసా వెళ్ళిపోయింది.
ఇంటికి చేరుకున్నా కానీ, వాడు మూలుగు ఆపకపోయేటప్పటికి బ్రతిమాలుతూ బిస్కెట్ తినిపించబోగా, “నాకు బిక్కీ
వద్దు , ఆ మమ్మీనే కావాలి,, అక్కడెల్తా ను.,” అంటూ మారాం చేయసాగాడు.
ఇందాకటివరకు బాబేమయ్యాడో అని ఆందోళన పడడం, వాడు కనిపించి., ‘సెకండ్ మమ్మీ’ అంటూ షాకివ్వడం,
ఇంతసేపైనా వినీల్ ఇంటికి రాకపోవడం లాంటి విసుగులన్నీ ఏకమై., ముసురుపట్టిన తుఫానులా, ఆమె సహనాన్ని
సంహరించడంతో బాబు వీపుపై గట్టిగా చరిచింది... ఎప్పుడూ దెబ్బలెరుగని వాడు బిత్తరపోయి, గుక్కపట్టి ఏడుస్తుండగా ఇంట్లోకి
వచ్చిన వినీల్., తన మొబైల్ లోని వీడియో ప్రారంభించి, నవ్యకు ఇచ్చి, విక్కీని ఎత్తు కుని మిద్దెపైకి వెళ్ళి, వాడిని ఆడించసాగాడు.
బొంగరంలా బాబుతో గిన్నిగిరి తిరుగుతూనే, దాన్ని తిప్పగలిగిన తాడు గురించి ఆలోచిస్తు న్నాడు. ‘ఈ జీవ ప్రపంచంలో
కన్నతల్లి కన్నా మిన్నగా బిడ్డను కాచగలిగినవారు ఉండరు అంటారే.,, అంతటి కన్నతల్లికి కోపమొచ్చేటప్పటికి కన్నబిడ్డను సైతం
కొట్టగలిగింది కదా!! మరి, మమత తెలియని, మాటరాని ఆ తల్లిని ఈ పసివాడు కొద్దిసేపట్లోనే అంతలా అల్లు కుపోవడమేంటి?
తను ఒక వాలుగా పడుకుని, వీడు మెడపైకి ఎక్కి కూర్చుని ఊగుతుంటే, చెవులు పట్టు కులాగుతుంటే, ముక్కులో వేళ్ళు పెట్టి
కెలుకుతుంటే, మూతిపై ముద్దు గా గుద్దు తుంటే, మెడను పట్టి మెలిపెడుతుంటే, తులిపిగా వళ్ళంతా గిల్లు తుంటే, కాళ్ళతో
చనువుగా తన్నుతుంటే, తనను పరుపుగా చేసుకుని పడుకుంటుంటే, పడుకుని తాపీగా అటూ ఇటూ పొర్లు తుంటే,,,
శిలాప్రతిమలా స్థిరంగా, సేవాసదనంలా శాంతంగా, ప్రేమభాండంలా హుందాగా లాలించిన ఆ తల్లితో ఆడీ ఆడి అలసి, అక్కడే
నిద్రించిన బాబుకు బాసటగా పహారా కాస్తూ, కాలమెరుగక నిలుచున్న ఆ తల్లి విక్కీకి అమ్మ కాదంటే ఎలా? వీధిధూళితో, గడ్డితో
నిండిన ఆ ప్రదేశాన బాబును కరిచేందుకు వచ్చిన తేలును తన కాలితో తొక్కి, తేలుకాటుకు గురైన ఆ జనని, ఈ వేదకు అమ్మ
కాదంటే ఎలా?’
“డాడీ...డాడీ...! ఎన్నిసార్లు పిలిచినా పలకవేంటీ? సెకెండ్ మమ్మీలా నువ్వుకూడా గప్చిప్‌గా ఆడేస్తా వా...?” విక్కి
మాటలతో తేరుకున్న వినీల్ నవ్వీ..
“నీకు ఎలా నచ్చితే అలా ఆడతా నాన్నా!” అన్నాడు.
“మరీ.., మమ్మీ కొడుతుందెందుకు?” బుంగమూతి పెట్టా డు.

పెండ్యాల గాయత్రి (87)


కథలు కనే కళ్ళు

“ఇకనుంచి కోప్పడదూ, కొట్టదు నాన్నా! ఆ మమ్మీని నీకు పరిచయం చేసిందెవరు? మన మమ్మీనే కదా! పూజ
చేసినప్పుడల్లా తనను పిలిచి.. బొట్టు పెట్టీ, నీతో పండ్లు , తినిపిస్తుంది కదా మన మమ్మీ..? ఇవాళ ఉదయం కూడా ఆ మమ్మీకి
పండు నువ్వే ఇచ్చావు కదా...!”
“అవును డాడీ!”
“మరి నువ్వూ మన మమ్మీకి చెప్పకుండా అలా ఆ మమ్మీ వెంట వెళ్ళిపోవచ్చా చెప్పు? నువ్వు కనిపించకపోయేసరికి
పాపం మన మమ్మీకి ఎంత భయమేసిందో తెలుసా?”
“మమ్మీ లాపీ చూసేప్పుడు పిలిస్తే అరుస్తుంది.. అందుకనీ., రోడ్డు పై వెళుతున్న ఆ మమ్మీతో ఆడుకుందామని వెళ్ళాను
డాడీ..! ఈసారి వెళ్ళేప్పుడు చెప్పే వెళ్తా గా!”
“అలా వెళ్ళకూడదు నాన్నా! బైట డాగీలు ఉంటాయి, కరిచేస్తా యి అని చెప్పాను కదా.. అయినా ఇకనుండి
మేమిద్దరమూ నీతో ఆడుకుంటాంగా!”
“అంతా వట్టిదే “
“నిజం విక్కీ! కావాలంటే కిందకెళ్ళి మన మమ్మీని అడుగుదాం పదా..!”
అంటూ కిందకొచ్చి చూసిన ఆ ఇద్దరికీ ఇంట్లో ఎక్కడా నవ్య కనిపించలేదు. లాన్‌లో ఉందేమోనని బయటకు
వస్తుండగా... గోమాతతో కలసి ఇంట్లోకి వస్తు న్న నవ్య కనిపించింది.
ఆ దృశ్యాన్ని చూసిన బాబు ఉదయభానుడల్లే వెలిగిపోతూ, వినీల్ చేతుల్ని దులపరించుకుని దిగిపోయి, “మమ్మీ...!”
అని బిగ్గరగా అరుస్తూ ఆవును అల్లు కుపోయాడు.
ఆవుకూడా బాబుకు అందుబాటులో ఒంగి, మూతితో ముద్దు లాడసాగింది.
ఆ సన్నివేశానికి చలించి, చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ, “సారీ వినీల్!” అంది నవ్య.
“అయ్యో.. అదేంటి నవ్యా? ఆవును గోమాత అంటారుగా! అందుకే మన బాబుకు ‘మమ్మీ’ అని పిలవమని చాలాసార్లు
నేనే చెప్పాను. ఈ కరోనా మొదలయిన దగ్గరనుండి వాడిని పార్క్‌కు తీసుకెళ్ళినప్పుడల్లా ఆవుతో ఆడుతున్నాడు కూడా..”
అంటూ ఆమెను హత్తు కున్నాడు వినీల్.
“అవునా.. నేనైతే వైరస్ భయంతో వాణ్ణి ఆవు వచ్చినప్పుడు కూడా దగ్గరకు పోనివ్వట్లేదు. ఆ అపురూపమైన వీడియో
ఎవరు తీసారు వినీల్?”
“ఎస్.ఐ గారబ్బాయీ, వాళ్ళింటి పక్కనే ఆవుతో ఆడుతున్న మన విక్కీని చూసి గుర్తు పట్టి, పిలిచాడటా... వీడు ఆవుతో
ఆడుతూ పట్టించుకోలేదట.. ఆ దృశ్యం ఎంతో ముచ్చటగా అనిపించడంతో ఫోన్‌తో వీడియో తీశాడటా., మనవాడు ఆడీఆడి
అలసి ఆవు పక్కనే పడుకుని నిద్రపోతుంటే, ఆ దృశ్యం వాళ్ళమ్మ‌కు చూపించాలని పిలిచి, అక్కడే ఉండి గమనిస్తూ ఉన్నాడట,.
ఇంతలో అక్కడే పాకుతున్న తేలును ఆవు తొక్కిందట, అదిచూసిన ఆ అబ్బాయి వెంటనే వాళ్ళ నాన్నకు, వాళ్ళ బాబాయికి., అదే
మా ఫ్రెండ్ అని చెప్పాకదా వాడికి ఫోన్ చేశాడటా! అందరూ కలిసి ఆవుకు ఇంజక్షన్ వేయించి, మనకు చెపుదామనుకునేటప్పటికి
మనమే ఫోన్ చేశామట.. తల్లిదండ్రు లుగా మనకు కాస్త హిట్ ఇవ్వాలనిపించి, ఇదంతా దాచారట...! ఇవేవీ తెలియక మనం
కంగారుపడ్డా ము నవ్యా!”
“అవునా.. అయ్యో! ఇవేవీ తెలుసుకోకుండా నేను ఆవేశపడిపోయి, ఆయనను ఏదేదో అనేశాను.”
“పర్లేదులే.. తల్లి మనసేంటో ఆయనకు తెలియదా?”

పెండ్యాల గాయత్రి (88)


కథలు కనే కళ్ళు

“లేదు వినీల్! అందరూ... ‘ఇంటింటి కల్పవల్లి’ అని, ‘తెలుగింటి కామధేనువు’ అని, ‘భారతావని భాండాగారం’ అనీ
గోమాతను భక్తిగా స్మరిస్తుంటే ఏమో అనుకునేదాన్ని. ఇవాళ పసివాడైన నా బిడ్డ ద్వారా ఆ సత్యాన్ని తెలుసుకోగలిగాను.”
“అయితే ఈ మిట్టమధ్యాహ్నం పూజించాలనిపించిందా... హుటాహుటిన వెళ్ళి గోమాతను తీసుకొచ్చావు...!”
“పుణ్యం పేరుతో పసుపు పూసి, బొట్లు పెట్టి, ఒక పండు ఇచ్చి వీధిలోకి తరిమి వేస్తే ఆ గోమాత ఆకలితీరక,
చెత్తకుండీలలో, సైడ్ కాలవలలో పడవేసిన పదార్థా లకోసం క్యారీ బ్యాగులను కూడా తినేయడం వలన పవిత్రమైన ఆ తల్లిదేహం
విషపూరితమవుతోంది వినీల్!”
“అవును నవ్యా! ఈ మహానగరాలలో వీధికొక ఆవు డొక్కలు పీక్కుపోయి, ఎముకలు పొడుచుకొచ్చీ నిస్తేజంగా
తిరుగుతూ ఉంటే, చూసి మనసు మెలిపెడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి.”
“అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను వినీల్!”
“చెప్పు నవ్యా..ఏంటది?”
“సంరక్షించే వాళ్ళు లేక కొన్ని ఆవులు వీధులపాలవుతుంటే,, వయసుడిగి, వట్టిపోయిన కొన్ని ఆవులు వెట్టివాళ్ళకు
బలౌతుంటాయి... కూర్చొని తిన్నా తరగనంత సంపద మనకు ఉంది కదా వినీల్!?”
“నీ ఆలోచన నాకర్థమయింది నవ్యా! నిరాదరణకు గురవుతున్న గోమాతలను సమీకరించి, మనమే ఆశ్రయమిస్తే
బావుంటుందనే కదా!?”
“అవును వినీల్! తమ పాలతో బాలలందరి బొజ్జలు నింపి, ప్రేమను పంచే ఆ అమ్మలు కూడా మన అమ్మలతో సమానమే
కదా?”
“నిజం నవ్యా! మన ఇంటి దగ్గరలోనే ఒక ఖాళీ స్థలం అమ్మకానికి వచ్చింది., ఆ స్థలాన్ని మనమే కొనుగోలు చేసి, అక్కడ
గోశాలకు ఏర్పాట్లు చేద్దాం,., అందాకా ఈ గోవు మన ఇంటి వసారాలోనే ఉంటుంది.”
“థాంక్యు వినీల్! మనకు పాలు తెచ్చే రాజుకు చెప్పి, ఈ తల్లికి మేత ఏర్పాటు చేస్తా ను.”
“ఐ... భలే! భలే!! ఆవు మమ్మీ, వాళ్ళ ఫ్రెండ్సూ ఎంచక్కా మనింట్లోనే ఉంటే రోజు హాయిగా ఆడుకోవచ్చు..!”
గంతులేస్తు న్న బాబును ఎత్తు కుని ముద్దా డుతూ.,
“నువ్వూ.. ఎందరో తల్లు ల ముద్దు ల బాబువు నాన్నా...!” మురిపెంగా అంది నవ్య.

(మూగ జీవాల రక్షణ అనే విషయం పై వ్రాసిన ఈ కథ, 2018 వ సంవత్సరంలో జాగృతి పత్రికలో ప్రచురించబడింది)

పెండ్యాల గాయత్రి (89)


కథలు కనే కళ్ళు

కలలు కనే కళ్ళు


“అమ్మా! నేను స్కూల్‌కి బయలుదేరుతున్నాను” బైక్‌ను బయటకు తీస్తూ ఇంట్లో ఉన్న అమ్మకు వినిపించేలా చెప్పాను.
“జాగ్రత్తగా వెళ్లి రా రవీ..” అన్న అమ్మ మాటలను చెవిలో వేసుకుని ఇల్లు దాటి బయటికి వచ్చాను.
అద్భుతం! భానుడు భూమి పైకి వచ్చి చంద్రు డితో జత కట్టినట్టు ఉన్నాడు. పగలే వెన్నెల కురుస్తు న్నట్లు వాతావరణం
ఎంతో ఆహ్లా దంగా ఉంది. మా ఇంటి ఎదురుగా ఓ అందాల కొలను. అందులో సయ్యాటలాడుతున్న రాజహంసలు నా కనులకు
విందు చేస్తు న్నాయి. ఆ ప్రక్కనే అందం తన కొంగున పరిచినట్లు విరబూసిన పూలతోట. రవి అందాన్ని మాత్రమే ఆస్వాదించే
పొద్దు తిరుగుడు పువ్వులు ఈవేళ నావైపు చూస్తు న్నయా ఏమిటి చిత్రంగా! బహుశా నేనే రవినని భ్రమించాయా ఏమిటి? నాకు
ఉన్నవి రెండేకళ్ళు కదా. ఇన్నివేల పూలలో దేన్నని చూడను?
నేను రహదారిపై కాక రాజమార్గంలో పూలరథంపై ప్రయాణిస్తు న్నాను. రాజ పరివారం వెంటరాగా నీటికొలను
పూలవనము దాటి వెళ్ళగా, ప్రామాణికమైన ఓ రాజప్రాసాదం ప్రత్యక్షమైంది. ప్రాసాద ద్వారం వద్ద కలువ రేకుల వంటి కన్నులున్న ఓ
కన్నె కుసుమం కమలాలను చేత ధరించి నాకు స్వాగతం పలుకుతుంది. నా కనులు కనుగొన్నాయి... ఆమె అలనాడు
ఆదిత్యునికి అందాలవిందు చేసిన కుంతికుమారి అని తన హృదయ ద్వారాలను తెరచి నన్ను ఆహ్వానిస్తు న్నది అని.
ఇది కలయో నిజమో తెలియక నా కనురెప్పలు రెండు గట్టిగా అతుక్కుపోయాయి.
“ఒరేయ్ రవీ..! ఆ రవి కిరణాలు ముఖాన్ని తాకుతున్నా నీకు మెలుకువ రాదేమిట్రా! కలగంటున్నవా ఏం? స్కూల్‌కు
టైం అవుతుందన్న విషయం తెలుస్తుందా నీకు?” అంటున్న అమ్మ మాటలు అతుక్కున్న రెప్పలను విడదీసాయి.
“ఆహా! ఎంతటి అద్భుత దృశ్యం! కలా ఇదంతా?” అనుకుంటూ వాస్తవంలోకి వచ్చి పనులు ముగించుకొని అమ్మ
చేతిలోని క్యారియర్ అందుకొని బైక్‌పై ఇంట్లో నుంచి బయటికి వచ్చాను.
“భౌ భౌ” మంటూ ఓ డజను కుక్కలు బైక్ చుట్టు మూగాయి.
‘నేను దొంగను కాదే,, పిల్లలకు పాఠాలు చెప్పే పంతులిని’ అనుకుంటూ పదినిమిషాల పాటు పాట్లు పడి, నా క్యారియర్ని
సైతం వాటికి వదిలేసి, ఆ కుక్కల భారీ నుంచి తప్పించుకుని బండి వేగం పెంచగా, ఎదురుగా ఎండుగడ్డి లారీ, నా ముందు మా
స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న రవిగాడి సైకిల్, ఆ రెండింటి మధ్యగా దూసుకువెళ్లి ముందుకు పోతుండగా, రోడ్డు పై
సిమెంట్ లేచిపోయిన గుంటలో నిలిచిన నీళ్లలో బండిచక్రం పడి, తెల్లని నా ప్యాంట్‌పై నల్ల డిజైన్ అలుముకుంది. ఇదంతా
చూడలేక చూస్తు న్న నా కళ్ళకు రోడ్డు పై విరిగిపడున్న ముళ్లకంచె కనిపించలేదు. ముళ్ళను దాటిన బైకుకు ఏమి కాలేదు కానీ,
దానిపై కూర్చున్న నా కాళ్లకు మాత్రం ఎర్రని గీతలు పడ్డా యి. నల్లని డిజైన్ అంటుకున్న నా ప్యాంట్‌కు సన్నని బొక్కలు పడ్డా యి.
వాటి వైపు చూసిన నా కళ్ళు ఒకింత నిట్టూర్చి, వేగాన్ని పెంచమని చేతులను ఆదేశించాయి. ఇంతలో రోడ్ క్రా స్ చేయవలసి

పెండ్యాల గాయత్రి (90)


కథలు కనే కళ్ళు

రావడంతో మళ్లీ ఆలస్యం. అక్కడ కంటిచూపు కొరవడిన ఓ అమ్మాయి రోడ్డు దాటడం కోసం అనుకుంటా నిలబడి ఉంది. అది
గమనించిన నా కళ్ళు వాచి వైపు చూశాయి. సమయం వెక్కిరిస్తూ ఉండడంతో నన్ను త్వరగా కదలమన్నాయి.
స్కూల్లో అసెంబ్లీ ప్రారంభమై పిల్లలు ప్రతిజ్ఞ చేస్తు న్నారు. నా ప్యాంటు అవతారాన్ని చూసి నా కళ్ళే వెక్కిరిస్తు న్నాయి. ఇక
పిల్లల కళ్ళు ఎలా స్పందిస్తా యో చూడాలి. నేను వెళ్లి నా తరగతి విద్యార్థు ల వెనక నిలుచుని, హెచ్.ఎం. గారి వైపు చూశాను.
ఆయన కళ్ళు చురకత్తు ల్లాంటి ఓ చూపును నాపై విసిరాయి. ఛ ఛ.! కలలకు నిజానికి తేడా తెలియని బ్రతుకు అయిపోయిందని
నన్ను నేను తిట్టు కుంటూ స్టా ఫ్‌రూమ్ లోకి వెళ్లి టైంటేబుల్ చూశాను. గురువారం మొదటి పీరియడ్ ఏడవ తరగతి సైన్స్. తరగతి
గదిలో ప్రవేశించి విద్యార్థు ల వందనాలు అందుకుని హాజరు పిలిచాను. ఐదుగురు గైర్హాజరయ్యారు.
నా కళ్ళు కాస్త పెద్దవి చేసుకుని క్లా స్ అంతా కలయజూస్తూ, “ఈరోజు మనమేం పాఠం చెప్పుకోబోతున్నాము?” గట్టిగా
అడిగాను.
“నేత్రాల సంరక్షణ ఆరోగ్యం” పిల్లలంతా ముక్తకంఠంతో చెప్పారు.
అద్దెకు తెచ్చుకున్న చిరునవ్వును ముఖంపై ప్రదర్శిస్తూ చాక్‌పీస్ అందుకుని బోర్డు వైపు తిరిగి నా రెండుకళ్ళతో చూస్తూ
ఓ కన్నుబొమ్మ గీశాను.
“మాస్టా రుగారూ..! ఆ కన్నులో కంటిపాప లేదండి” నెమ్మదిగా అంది ఉష, చెప్పాలా వద్దా అని సందేహిస్తూ.
“అది నిజం కన్నుకాదు” వెంటనే అన్నాడు ఆదిత్య తడుముకోకుండా.
మధ్యలో ఒక సున్నా పెట్టి, “ఓకేనా” అన్నాను.
అందరూ తలాడించారు.
“సర్వేంద్రియానం నయనం ప్రధానం” అను ఆర్యోక్తితో పాఠం మొదలు పెట్టా ను. ఈ ప్రపంచపు వెలుగు నీడలను
చూడగల విలువైన ఆయుధాలు కళ్ళు. కళ్ళు లేని జీవితం చుక్కానిలేని నావ వంటిది. అందుకే క్షణక్షణం మన కళ్ళను
సంరక్షించుకుంటూ ఉండాలి. కళ్ళు లేని వారికి సహకారం అందించాలి. పాఠానికి నా సొంత మాటలను కూడా జోడించి
చెప్పుకుపోతున్నాను.
ఇంతలో దీప్తి లేచి నిలబడి, “మాస్టా రుగారూ! కళ్ళు కలలు కంటాయంట. కథలు చెబుతాయంట కదా! మా నాన్న
చెప్పారు” అంది తన కళ్ళను చక్రా ల్లా తిప్పుతూ.
నా కళ్ళలో కలల ప్రశ్నార్ధకాలు కదలాడాయి.
పాఠం ముగించే సమయంలో లోపలికి అనుమతి కోరుతూ వాకిలి వద్ద ఎవరో నిలుచున్నారు. ఆ వైపు తిరిగి చూశాను
వాడి కళ్ళు వణుకుతున్నాయి భయంతో.
వాణ్ణి చూడగానే ప్రత్యక్షమైన కోపాన్ని ప్రదర్శిస్తూ, “ఏరా! రవి ఇప్పుడా బడికి రావడం? అంటూనే, “వెధవా... పైగా నా పేరే
పెట్టు కున్నాడు” అని పైకి అనేసా అనాలోచితంగా.
పిల్లలంతా గొల్లు మన్నారు.
రవి ఏదో చెప్పబోతుండగా, “దగ్గరకు రా” గట్టిగా అరిచాను.
ఎర్రబడ్డ నా కళ్ళవైపు చూస్తూ భయంభయంగా లోపలికి వచ్చాడు.
“ఇందాక నేను వచ్చేటప్పుడే సైకిల్ మీద వస్తు న్నావు కదా..! ఎందుకింత ఆలస్యం అయింది?” కోపాన్ని అణుచుకుంటూ
నెమ్మదిగా అడిగాను.

పెండ్యాల గాయత్రి (91)


కథలు కనే కళ్ళు

చిన్నగా మొదలుపెట్టా డు., “వచ్చేదారిలో రోడ్డు పై ముళ్ళు విరిగిపడి ఉన్నాయి సార్.. చూడక ఎవరైనా తొక్కుతారని
వాటిని ఏరి తీసి పక్కన పడేసి వస్తుండగా, కళ్ళు లేని ఒకామె రోడ్డు దాటలేక నిలబడి ఉంది. ఆమెను రోడ్డు దాటించి, ఆటో
ఎక్కించి వచ్చేసరికి ఆలస్యమైంది మాస్టా రు” అన్నాడు కళ్ళు ఆర్పుతూ.
ఎర్రబడ్డ నా కళ్ళల్లో ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది. క్షమించమన్నట్లు జాలిగా చూస్తు న్నాయి వాడి కళ్ళు. కూర్చోమని
సైగ చేశాను.
“అందరూ పుస్తకాలు తీసి చెప్పిన పాఠం చదవండి” అని చెప్పి మొదటి గంట కొట్టకముందే క్లా సులో నుంచి వచ్చేశాను.
నా రెండు కళ్ళల్లో రెండు వలయాలు అల్లు కున్నాయి. అందులో కలలు నిజాలు కలిసిపోయి గిన్నిగిరిగిరి
తిరుగుతున్నాయి. ఇంటర్ బెల్ కొట్టా రు. రవి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు, రమ్మని పిలిచాను. పరిగెత్తు కుంటూ నా వద్దకు
వచ్చాడు. చీకటిని చీల్చి వేకువ తెచ్చే కాంతిరేఖలా వెలిగిపోతున్నాడు.
వాడి తలను నా చేతితో తడుముతూ, “మంచిపని చేసావురా.. మీ అమ్మ నీకు నిజమైన పేరు పెట్టింది. రేపటినుండి
ఇంటి దగ్గర ఇంకో పావుగంట ముందే బయలుదేరు..” అనునయంగా చెప్పాను.
వాడి కళ్ళు కిరణాల్లా మెరిసాయి. ఈ మాటలు చెప్పే అర్హత నాకు ఉందో లేదో తెలియదు కానీ, బడికి సమయానికి
రమ్మని చెప్పే బాధ్యత మాత్రం నాపై ఉంది. ఉన్నదానిని చూడలేకపోవడం లేనిదేదో కోరుకోవడం కలను ఇలగా, ఇలను కలగా
తలుచుకుని తృప్తి పడడం ఇదే కాబోలు కలలు కనే కనుల ప్రపంచం.
వేకువజామున వచ్చే కలలు నిజమవుతాయి అంటారు. నిజమే నిజాలను ఊహించినపుడు ఆ ఊహలు కలలుగా
రూపాంతరం చెందినప్పుడు అలా జరుగుతుంది.
ఆకలి బాధ తీర్చుకోలేని వీధికుక్కలు రాజహంసల వలే కనువిందు చేస్తా యా? అవినీతిపరుల కరాలతో పరిచిన
రహదారులు పట్టు పాన్పులవలె హాయినిస్తా యా? కాలుష్య కోరల్లో నలిగిన ప్రకృతి ప్రేమ పరిమళాన్ని వెదజల్లు తుందా? అవసరాలు
తీర్చుకోలేని అనామకులు ఆనందాన్ని పంచి ఇవ్వగలరా? సమస్యలు, కారణాలు, ప్రయత్నాలు, ఆలోచనలు, ఊహలు, కలలు,
కర్తవ్యాలు కాలచక్రమై కంటిపాపలో కదలాడాయి. కారు మబ్బులను, ధూళి కణాలను దాటి వచ్చి రవి కిరణాలు పృధ్విపై
ప్రకాశిస్తు న్నట్లు కలతలను కన్నీటిని దాటి కలలు కనే కళ్ళు అవసరం దరికి ఆపదల ఒడికి అన్యాయం పైకి దృష్టిని ప్రసరింపజేస్తే
ప్రపంచంలో ప్రతిదీ అందంగానే కనిపిస్తుంది. ఆనంద గీతమై వినిపిస్తుంది. కొత్త కాంతులు నింపుకున్న కలల ఉషోదయమై
ప్రకాశిస్తుంది. ఆశల వాహినిలా పరిగెడుతున్న నా ఆలోచనా నేత్రాలు కలలై, కథలై, కవితలై నా కనురెప్పలతో కబుర్లు చెప్పాయి.

(మార్గదర్శకులైనవారిలో ఆచరణ లోపం ఉండరాదనే ఆలోచన నుండి ఉద్భవించిన ఈ కథ, ఆకాశవాణి కడప కేంద్రం
నుండి, 2013 వ సంవత్సరం ప్రసారమయింది)

పెండ్యాల గాయత్రి (92)


కథలు కనే కళ్ళు

జ్యోతి ప్రజ్వల
“హహ్హహ్హహ్హ‌.. హహ్హహ్హహ్హహ్హా.. హహ్హహ్హహ్హహ్హహ్హా..!
హిదే..ఇదే నేను కోరుకుంది. హీ..రోజు కోసమే పదహారేళ్ళ నుండీ కళ్ళు కాయలు కాచేలా..అహ్,, కాదుకాదు నా కలల
ఇళ్ళు కట్టేలా,, హెదురు చూస్తు న్నది ఈ శుభ ఘడియ కోసమే..! హిన్నాళ్ళకి, ఇన్నేళ్ళకి నా జీవితాశయం నెరవేరింది. హహ్హహ్హ..
హహ్హహ్హహ్హా..!”
ఆనందమో, ఉన్మాదమో అర్ధం కాకుండా, వికటాట్టహాసం చేస్తూ, ఆయాసంతో మాట తడబడుతున్నా, ఆపకుండా
విచిత్రంగా మాట్లా డుతున్న ప్రజ్వలను, ఉన్నట్టుండి నిలువునా నేల కూలి విలవిలలాడుతున్న తన తండ్రినీ మార్చిమార్చి చూస్తూ
ఒక్కక్షణం పాటు నిశ్చేష్టు డయ్యాడు ప్రదీప్.
అదే క్షణంలో అక్కడికి వచ్చిన ప్రదీప్ తల్లి శారద భర్తను చూసి ఆందోళనగా, “హా..!! ఏమయ్యిందండీ! అలా
ఐపోతున్నారు!” అంటూ కేశవరావును ఆర్తిగా పట్టు కుని అటూ ఇటూ కదుపుతూ అడుగుతోంది.
అప్పుడు తేరుకున్న ప్రదీప్ ఇంకా నవ్వుతున్న ప్రజ్వలను వెర్రిగా చూస్తూ, “ఏయ్! నీకేమైనా పిచ్చెక్కిందా? ఎందుకలా
ప్రవర్తిస్తు న్నావ్?” అరిచాడు.
“పిచ్చి కాదు ప్రదీప్! పగ.. పదహారేళ్ళుగా నా గుండెలో రగిలే సెగ...! నీ కన్నతండ్రినీ, ఈ కమనీయ పరిస్థితిలో
చూడాలనే, నిన్ను ప్రేమ పేరుతో నా వెంట తిప్పుకున్నాను. నేననుకున్నది సాధించాను.. హహ్హహ్హా!” అంటున్న ప్రజ్వలను
సమీపించాడతను.
“ఓసి రాక్షసి! నీ పథకం తెలియక నా తండ్రినెంత బాధపెట్టా నే? నిన్నూ..” పళ్ళు నూరుతూ ప్రజ్వల గొంతు
పట్టు కున్నాడు.
“నన్నేం చేస్తా వులే గానీ, ముందు అతగాడి పరిస్థితి చూసుకో.. ఐపోయేలా ఉన్నాడు..” నిర్లక్ష్యంగా అంటూ అతడి
చేతులను విసురుగా విడిపించుకొని అక్కడినుంచి వెళ్ళిపోయింది.
“ఒరేయ్ ప్రదీప్! ఈ మనిషిని హాస్పిటల్‌కి తీసుకువెళదాం పదరా..! ఏమవుతుందోనని నా గుండెలో దడదడగా
ఉంది!!” వణుకుతున్న గొంతుతో అంటున్న తల్లి మాటలు వినీ, తండ్రిని సమీపించి, ఉబికి వస్తు న్న కన్నీళ్ళను అణుచుకుంటూ
అతన్ని రెండు చేతులతో ఎత్తు కొన్నాడు.
***
“డాక్టర్ గారూ! నాన్నకేమయింది? ఎందుకలా అయిపోతున్నారు?” కంగారు, కోపం కలగలసిన గొంతుతో అడిగాడు
ప్రదీప్.
కలత చెందుతున్న అతని భుజంపై చెయ్యి ఉంచి ఓదార్పుగా, “మీరంతలా భయపడవలసిన పనిలేదు. ఆయనకు
పక్షవాతం వచ్చింది..”
అంటున్న డాక్టర్ మాట పూర్తి కాకముందే, “ఏమంటున్నారూ,, నాన్నకి పక్షవాతమా? ఆయనకి షుగరు, బీపీ లాంటివేమీ
లేవండీ!” అన్నాడు ప్రదీప్.
“కేశవరావు గారు ఏ విషయంలోనైనా ఇటీవల కాలంలో విపరీతంగా ఆందోళన చెందుతున్నారా!”

పెండ్యాల గాయత్రి (93)


కథలు కనే కళ్ళు

డాక్టర్ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సంకోచించిన ప్రదీప్, “అలాంటిదేమీ లేదండీ! ఆందోళన వల్ల కూడా ఇలా..”
అంటూ ఆగాడు.
“అవును ప్రదీప్! ఆయన ఏదో తలచుకుని మధనపడుతున్నట్లు నాకనిపిస్తోంది. నాలుగైదు రోజుల వరకూ తనకు మాట
కూడా సరీగా రాకపోవచ్చు. విషయం తెలుసుకుని మీరందించే ప్రేమానురాగాలే ఆయనను త్వరగా కోలుకునేలా చేస్తా యి.
ఇప్పుడు నాకన్నా కూడా మీ అవసరమే కేశవరావు గారికి ఎక్కువగా ఉంది.” అంటున్న డాక్టర్‌కి కరచాలనం చేసి కృతజ్ఞతలు చెప్పి
తండ్రి దగ్గరకు చేరుకున్నాడు.
తన ప్రాణసఖి, ప్రేమదేవత అనుకునీ ఆరాధించిన ప్రజ్వల ఎందుకలా ప్రవర్తించింది? నాన్నపై ఆమెకు ప్రతీకారమెందుకు?
పెళ్ళికి అన్నీ ఏర్పాట్లు చేయించిన నాన్న హటాత్తు గా పెళ్ళి ఎందుకు వద్దన్నారూ? తాను కారణమడిగితే చెప్పటానికి ఎందుకూ
నిరాకరించారు? నాన్నకీ, ప్రజ్వలకీ మధ్య జరిగిన ఘర్షణ ఏంటి? అయినా, తాను పరిచయం చేశాకే కదా వాళ్ళిద్దరూ
మాటాడుకున్నది?....
తనకు సమాధానాలు తెలియని, సంబంధం లేని పలురకాల ప్రశ్నలతో మెదడు పగిలిపోయేలా ఉంది ప్రదీప్‌కు.
తన తండ్రి ఇప్పుడు చెప్పలేడు., తన మనిషనుకుని తన వాళ్ళను సైతం వదులుకోవడానికి సిధ్ధపడ్డా డు ఆ ప్రజ్వల కోసం.
కానీ.. కానీ తను కూడా ఇప్పుడేమీ చెప్పదు. ఇక ఏం చేయాలి?
తల తిరుగుతున్నట్లనిపించీ, తమాయించు కోవటానికన్నట్లు పక్కబెడ్‌పై కూర్చుని తండ్రి వైపు చూసాడు.
మూతి వంకరపోయి, ముఖం వాడిపోయి.. అచేతనంగా, అతి దీనంగా పడివున్న తండ్రిని చూస్తుంటే కాళ్ళూ, చేతులు
ఆడడం లేదు.
లేచి ఆయనకు దగ్గరగా వెళ్ళి, “నాన్నా..!” అన్నాడు నెమ్మదిగా.
కేశవరావు కళ్ళు తెరిచాడు కానీ, ఆ కళ్ళలో భయాందోళనలు స్పష్టంగా కనపడుతున్నాయి ప్రదీప్‌కి.
‘మహరాజులా, మగధీరుడిలా బ్రతికిన తన తండ్రికి ఈ పరిస్థితి.. నో..!! ఇదంతా దానివల్లే జరిగింది..’
ఆ ఆలోచనతో ఆవేశం పెల్లు బికింది. ‘ముందు ఆ ప్రజ్వల అంతు చూస్తే తప్ప తనకు మనశ్శాంతి దొరకదు. ఇప్పుడే
వెళ్ళాలి..’ చుట్టూ చూశాడు.
శారద కనిపించలేదు. “అమ్మా!” అంటూ గది బయటకు వెళ్ళాడు. హాస్పిటలంతా వెదికాడు కానీ, ఎక్కడా తల్లి జాడ
లేదు. మరలా తండ్రి వద్దకు వెళ్ళి, అక్కడే పడేసిన తన ఫోన్ నుంచి తల్లి మొబైల్‌కి కాల్ చేశాడు.
‘నేనే.. నేనే స్త్రీమూర్తినీ, నేనే స్త్రీమూర్తినీ’ తల్లి ఫోన్ ఆ గదిలోనే రింగ్ అవుతోంది.
అసహనంగా కాల్ కట్ చేసి, ఫోన్ పక్కన పడేశాడు.
‘నాన్ననీ పరిస్థితుల్లో వదిలేసీ, అమ్మ ఎక్కడికెళ్ళినట్లు ? ఆయనకైనా, నాకైనా చిన్న జలుబు చేస్తేనే చాంతాడంత
చిట్కాలను ప్రయోగించి, పడీపడీ పరిచర్యలు చేస్తుంది కదా! ఈ స్థితిలో నాన్నొదిలి, నాక్కూడా చెప్పకుండా వెళ్ళిందంటే ఏం
జరిగుంటుంది? ఈయనకిలా అయిందనీ, పీటలదాకా వచ్చిన బిడ్డ పెళ్ళాగిపోతూందనీ.. మనస్తా పం చెంది ఏ అఘాయిత్యానికీ
పాల్పడలేదు కదా...???’
ఆ ఆలోచన రావడంతోనే బుర్ర ఒక్కసారిగా వేడెక్కినట్లయ్యీ, వళ్ళంతా చెమటలు పట్టేశాయి. మోతాదు దాటిన తన
గుండె చప్పుడు ఆ గదిలోని నిశ్శబ్దా న్ని ఛేదిస్తు న్నట్లు అనిపిస్తోందతనికి.

పెండ్యాల గాయత్రి (94)


కథలు కనే కళ్ళు

గది బయటనుండే, “మా సార్‌కి ఏమయింది ప్రదీప్ బాబూ? నాకిప్పుడే తెలిసి ఆఫీసునుండీ సరాసరి
హాస్పిటల్కొచ్చేశా..” అనడుగుతూ మాటల వరదల్లే తండ్రి దగ్గర పనిచేసే గుమాస్తా లోపలికొచ్చాడు.
అతనిని చూసిన వెంటనే శక్తినంతా కూడగట్టు కునీ, “మీరు కాసేపు నాన్న దగ్గరుంటారా అంకుల్! ఓ అర్జెంటు పనుందీ..
ప్లీజ్! కాసేపట్లో వచ్చేస్తా ..” అభ్యర్ధించాడు.
“అయ్యో! నువ్వంతలా అడగాలా.. వెళ్ళిరా బాబూ!మా స్టా ఫంతా కూడా వస్తు న్నారు సార్‌ని చూడడానికి.. ఏంటో ఈ
అన్యాయం..! ఎల్లుండి నీ పెళ్ళికి రావాల్సిన వాళ్ళం.. ఇలా రావలసి వస్తుందనుకోలేదు.”
అతని జాలి మాటలకి జోలపాడే పని పెట్టు కోకుండా, అతనికి వెళ్ళొస్తా నని తలూపి బయటపడి హాస్పిటల్ బైటికొచ్చి
కారెక్కాడు ప్రదీప్.
కారు కదిలింది కానీ, స్టీరింగ్ తన అదుపులో లేదు. గేర్లు వేస్తు న్నాడే గానీ, గమ్యాన్ని ఎంచుకోలేక పోతున్నాడు. తల్లి
ఎక్కడికెళ్ళిందో.. తండ్రికెలా ఉంటుందో.., తనకిలా ఎందుకు జరిగిందో...!
అన్నీ బదులెరుగని ప్రశ్నలై వదలని నీడలా వెంటాడుతున్నాయి.
***
“అమ్మా! ఉన్నట్లుండీ ఏర్పాట్లన్నీ జరిగిపోయాక పెళ్ళి ఆపేద్దా మంటారూ.. నాన్నకేమైందీ?” వాదనలన్నీ పూర్తయ్యాక
చివరి ప్రయత్నంగా అమ్మనడిగాడు.
“అదే నాకూ బోధపడట్లేదురా ప్రదీప్! నగలు తీసుకునీ, ప్రజ్వలకు చూపించాలనీ తన ఇంటికి వెళ్ళామా, టేబుల్ పై
నగలుంచీ, ఒక్కొక్కటీ తనకు చూపిస్తుండగా ఎదురుగా ఉన్న ఓ ఫోటోను చూసి, ఎవరని అడిగాను. ‘మాఅమ్మా, నేను..’ అంది
ప్రజ్వల. అప్పటిదాకా ఫోన్లో మాటాడుతున్న మీ నాన్న, ఒక్క ఉదుటున లేచి నిలబడీ, తనవైపు వేలు చూపిస్తూ, ‘నువ్వు.. నువ్వూ
సరస్వతి కూతురువా?’ అన్నాడు. ఆమె నాన్ననే సూటిగా చూస్తూ, ‘అవును’ అని ధృఢంగా అంది. ఆసమయంలో మీ నాన్నలో
కదిలిన హావభావాలు నాకర్థం కాలేదు. ఆ తరువాత ఒక్కక్షణం నన్నక్కడ ఉండనివ్వలేదు.. మరోమాటకు నాకవకాశమివ్వలేదు..”
తల్లి చెప్పిన మాట విని అయోమయంలో పడ్డా డు.
***
వాళ్ళు ఇంటికొచ్చాక జరిగింది తనకు తెలుసు. తల్లి చెప్పిన ఆ ఫోటో విషయం తనసలు పరిగణలోకి తీసుకోలేదు. నాన్న
దగ్గరకానీ, ప్రజ్వల దగ్గరకానీ ఆ సంఘటన ప్రస్తా వించనే లేదు. తను ఆవిషయాన్ని వాళ్ళిద్దరి ముందుంచి వివరాలడిగితే పరిస్థితి
మరోలా ఉండేదేమో..!
నగరంలో ప్రముఖ న్యాయవాది అయిన నాన్నకి తగిన వారసుడనిపించుకోడానికి.. రేయింబవళ్ళు పుస్తకాలతో నేస్తంకట్టి,
గ్రూప్స్‌లో టాప్ టెన్‌లో నిలిచాడు. అప్పుడే, అదే గ్రూప్స్‌లో స్టేట్ టాపర్‌గా నిలిచిన ప్రజ్వల ఫోటోను పేపర్లో చూసి,
ఆశ్చర్యపోయాడు.
ఇంటర్వ్యూ కెళ్ళినపుడు ముఖ పరిచయమయింది ఆమెతో. అనాధాశ్రమంలో ఉంటూ, చదువుకుని, ఇక్కడిదాకా
వచ్చిందని తన మాటల్లో తెలుసుకునీ, ఎంతో అబ్బురపడ్డా డు, అభినందించాడు. ఆ ప్రజ్వలే మరలా ట్రైనింగ్‌లో తారసపడి, తన
ప్రేమజ్వాలగా మారి, అణువణువూ నిండిపోయింది.
ఇద్దరూ గెజిటెడ్ హోదా అందుకున్నాక తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పాడు. ఆమె హోదా ముందు తనెవరనే ప్రశ్నకు
అంత ప్రాధాన్యత లేకుండానే నాన్న ఆమోదం లభించి పెళ్ళి ఏర్పాట్లు జరిగిపోయాయి. అందరికీ ఆహ్వానాలు వెళ్ళిపోయాయి. ఆ
తరువాతే నాన్నకిలా.. అమ్మ అలా... ఆలోచనల్లో మునిగిన ప్రదీప్ కళ్ళు ధారాళంగా వర్షిస్తు న్నాయి.

పెండ్యాల గాయత్రి (95)


కథలు కనే కళ్ళు

ఆ ప్రజ్వల ప్రతిభ, అందం చూసి ప్రభావితుడై, ప్రేమదాసుడై ఘోరంగా పరాభవించబడ్డా డు తను. తప్పక ప్రతీకారం
తీర్చుకునే తీరతాడు.
ఆలోచనలలో రోడ్డు దాటబోయి, మరోకారును గుద్దేశాడు.
అదృష్టం తనకు ప్రమాదమేమీ జరగలేదు కానీ, తను గుద్దిన కారులోని ప్రమాదకర దృశ్యం చూసి అదిరిపడ్డా డు.
అమితావేశంతో కారు దిగి వెళ్ళి, “అమ్మా...!!” గావుకేక పెట్టా డు.
ప్రజ్వల కారు డోరు తెరచింది.
“ఎండుకురా గొంతు చించుకుంటున్నావ్?” తల్లి నింపాదిగా అడిగింది.
“నాన్ననలా అనాధగా వదిలేసి ఎక్కడికెళుతున్నావు?”
“పోలీస్ స్టేషనుకి”
అదిరిపడ్డా డతను.
“అవును మీ నాన్నపై కేసు పెట్టడానికి వెళుతున్నాను. ధైర్యముంటే నువ్వు కూడా రా!” శారద అంటుండగానే కారు
ముందుకెళ్ళిపోయింది.
ఆగమంటున్న ప్రదీప్ కేకలు గాలిలో చేరిపోయాయి. ఇక చేసేది లేక ఆ కారుననుసరించాడు.
***
ప్రజ్వల కారు ఓ బహుళ అంతస్తు ల భవనం ముందు ఆగింది. శారదతో సహా ఇద్దరూ లోపలికెళ్ళారు. ప్రదీప్
వాళ్ళననుసరించాడు.
“జ్యోతి మేడం వచ్చేశారు.. అందరూ మీటింగ్ హాల్లోకి త్వరగా వచ్చేయాలి” ఓ మహిళ స్వరం మైకులో వినిపిస్తోంది.
ఆ భవనం దాటి బయటకు రానంత మృదువుగా వినిపిస్తు న్న మైకు శబ్దా న్ని ఆలకిస్తూ.. “ఈ జ్యోతి ఎవరో..?”
అనుకుంటూ లోపలికి నడిచాడు.
“ఆదరణకు నోచుకోని అనేకమంది అమ్మాయిలకు ఆశ్రయమివ్వడమే కాకుండా.. వారి ఆత్మరక్షణకు, ఆశయసిధ్ధికీ
అనునిత్యం కృషి చేస్తు న్న మన జ్యోతీ మేడం ఇప్పుడు మాటాడతారు..” మైకులో వినిపిస్తోంది.
నడకవేగం పెంచి మీటింగ్ హాలు దగ్గరకు వెళ్ళిన ప్రదీప్‌కు మైకు అందుకుంటూ ప్రజ్వల కనిపించింది.
“అంటే పేరు కూడా మార్చి చెప్పిందన్నమాట తనకు..” అతడి నొసలు ముడిపడ్డా యి.
“గుడీవినింగ్ ఫ్రెండ్స్! ఇవాళ మనమంతా ఎందుకు సమావేశమయ్యామో మీ అందరికీ తెలుసు.. నేటి మహిళకు
చదువొక్కటే కాదూ.. సమస్యలు అధిగమించ గల శౌర్యం, సమయస్ఫూర్తి కూడా అత్యవసరం. అందుకే ఈరోజు నుంచి మన
హోమ్ అమ్మాయిల ఆత్మరక్షణ కొరకు కరాటే, కర్రసాము, షుటింగ్,, మనోధైర్యం కొరకు యోగా, ధ్యానం, క్రీడలూ,, ఆర్ధిక
చేయూత కొరకు కంప్యూటరు, క్రా ఫ్ట్ కోర్సులు ప్రారంభించబోతున్నాం. ఆయా కోర్సుల టీచర్లను తన సొంత ఖర్చుతో
నియమించడానికి శ్రీమతి శారదాదేవిగారు ముందుకొచ్చారు. వారి పెద్ద మనసుకు మనమంతా కృతజ్ఞతలు అందిద్దా మా!” ప్రదీప్
ఆశ్చర్యంలోంచి తేరుకోక ముందే,,
అందరి కరతాళధ్వనుల మధ్య “మేడం...మేడం” అంటూ ఓ అమ్మాయి బిగ్గరగా అరుస్తూ లోపలికొచ్చింది.
“ఏమయిందమ్మా!” ప్రజ్వల మెరుపువేగంతో ఆమెను సమీపించింది.
“లత,, రూము లోపలికెళ్ళి తలుపేసుకుంది మేడం!” బాధతో ఆమ్మాయి గొంతు పూడుకుపోతోంది.

పెండ్యాల గాయత్రి (96)


కథలు కనే కళ్ళు

అందరూ అక్కడికి పరిగెత్తి తలుపులు, కిటికీలు బాదుతున్నారు.


ఎడంగా నిలబడివున్న ప్రదీప్‌కు వాళ్ళ మధ్యలోంచి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టా లనిపించింది కానీ, సంకోచిస్తూ
నిలబడ్డా డు.
ఎంతకూ లత తలుపు తెరవకపోయేసరికి తన రెండు చేతులూ ముందుకు వేగంగా చాచి కొట్టి తలుపును పడతోసేసింది
ప్రజ్వల. ప్రదీప్‌తో సహా అందరూ బిత్తరపోయారు. అప్పటికే ఫ్యానుకు ముడివేసిన చున్నీ మెడకు తగిలించుకోబోతోంది లత. ఆమె
చెంప ఛెళ్ళుమనిపించింది ప్రజ్వల. ముఖాన్ని చేతులమధ్య దాచుకుని వెక్కివెక్కి ఏడుస్తోందామె.
ఓ నిమిషం తరువాత లతను దగ్గరకు తీసుకుని, “ఏం జరిగింది?” చిన్నగా అడిగింది ప్రజ్వల.
“నిన్న కాలేజ్ నుంచి వస్తూంటే ఒకతను లిఫ్టిస్తా ననీ, దారి మళ్ళించీ, నన్నూ..నన్నూ” ఆమె మాటను కన్నీళ్ళు
మింగేస్తు న్నాయి.
“అయితే చచ్చిపోతావా!” ప్రజ్వల కంఠం ఖంగుమంది.
లత మాటాడలేదు.
“వాడ్ని చంపటం చేతకాకపోతే, నువ్వు బతికి చూపించు..!
వాడికి శీలం లేకపోతే, నీకు శరీరముందని గుర్తించు..!
వాడి కళ్ళు మూసుకుపోతే, నువ్వు ఉదయాన్ని ఆహ్వానించు..!
వాడి నాలుక మెలికలు తిరిగితే, నీ మెళుకువను ప్రదర్శించు..!”
నిశ్శబ్దా నికి శంఖమూదినట్లు న్న ప్రజ్వల మాటలు,. ఆ భవనమంతా ప్రతిధ్వనిస్తు న్నాయి.
“మీరు సంఘంలో ఒకహోదా ఉన్నవాళ్ళు కాబట్టి, మీకు అందరి అండా ఉంటుంది కాబట్టి, ఇలాంటి సమస్యలు మీ
దరికి రావు కాబట్టి, ఇన్ని మాటలు చెప్పగలుగుతున్నారు మేడం! మాలాంటి వాళ్ళకి ఇవన్నీ సాధ్యమేనా?” లత గొంతు విప్పింది.
“పడిలేస్తేనే కదమ్మా.. పసిబిడ్డైనా నడక నేర్చుకోగలుగుతుంది. ఎవరికీ ఏ హోదా ఊరికే వచ్చిపడదు లతా..!
సాధించుకోవాలి..” అంటూ తన బ్యాగులోంచి ఒక ఫోటో తీసి చూపిస్తూ,
“ఇందులో ఉన్న మహిళ పేరు సరస్వతి. ఈమెకు పుట్టు కతో వచ్చిన చెవుడు వల్ల మాటలు రావు. కుటుంబ ఆదరణకు
దూరమైన సరస్వతిని, పిన్ని వరసయ్యే దూరపు బంధువు ఒకావిడ తన ఉద్యోగరీత్యా నడుపుతున్న ప్రభుత్వ హోములో ఉంచి, ఓ
మంచి యువకుడిని చూసి పెళ్ళిచేసింది. అతడు లాయరు దగ్గర కారు డ్రైవరుగా పనిచేసేవాడు.
ఆ జంటకు కలిగిన ఏకైక గారాల పట్టి, ఆమె పక్కనే ఉన్న పాప, పేరు ప్రజ్వల. అప్పుడప్పుడూ తండ్రితో కలసి లాయర్
కారులో షికారు వెళ్ళేది చిన్నారి ప్రజ్వల. లాయరంకుల్ పాపను బాగా ముద్దు చేస్తుండేవాడు.
అలా ప్రజ్వల నాలుగవ తరగతికి వచ్చింది. ఓరోజు లాయర్ని వదిలి వస్తుండగా యాక్సిడెంటై పాప తండ్రి
చనిపోయాడు..”
ప్రజ్వల చెపుతుండగా, “అయ్యో..!” అంది లత.
అందరూ ఆసక్తిగా వింటున్నారు.
“సరస్వతి వాళ్ళ పిన్ని లాయరును కలిసి నష్టపరిహారమిప్పించమని అడిగింది. లాయరు సానుకూలంగా స్పందించడంతో
ఆమె ఆనందించి ఆ తల్లీబిడ్డకు తన ఇంటికి దగ్గరలోనే ఇల్లు చూసింది.

పెండ్యాల గాయత్రి (97)


కథలు కనే కళ్ళు

సంతకాల పేరుతో లాయర్ తరచుగా ఇంటికి వస్తుండేవాడు. ‘చెల్లెమ్మా!’ అంటూ ఆదరించే లాయర్ ఆ కుటుంబాన్ని
కూల్చేస్తా డని ఆ తల్లీబిడ్డ ఊహించలేదు..”
వింటున్న ప్రదీప్‌లో మరింత ఉత్కంఠ.
“ఓరోజు సాయంత్రం లాయరొచ్చాడు. పాప ఇంట్లో ఆడుకుంటోంది. ‘ఏంటంకుల్! మళ్ళీ అమ్మ సంతకం కావాలా?’
అనడిగింది. ‘లేదమ్మా! ఇవాళ నేనే సంతకం చేస్తా ..’ అన్నాడు. ‘అమ్మ వెనకుంది పిలవనా?’ అడిగింది పాప. ‘అక్కర్లేదు కానీ..
నాకో ముద్దు పెడతావా!’ అంటూ పాప మూతిపై సిగరెట్ ఆనించాడు. పాప కేక పెట్టింది. ‘నువ్వెంత అరచినా మీ అమ్మకు
వినపడదు కానీ, అరిచావంటే మళ్ళీ సిగరెట్ పెడతా..’ వణుకుతున్న పాప గౌను తీసేశాడు. ఆమె పసి చర్మాన్ని కసిగా ఒత్తు తూ
సిగరెట్ తగిలిస్తు న్నాడు. ఆమె ఏడ్చే కొద్దీ అతడి పైశాచికం పేట్రేగిపోతోంది. లోపలికొచ్చిన సరస్వతి ఈ దారుణాన్ని చూసి లాయర్ని
నెట్టేసే ప్రయత్నంలో పక్కనే ఉన్న పట్టెమంచానికి కొట్టు కొని పడిపోయింది. తననే చూస్తూ పడున్న తల్లి లేచి వచ్చి రక్షిస్తుందనీ పాప
అరుస్తోంది. అతడు ఆమె రెండు తొడలనూ చీల్చి, వేళ్ళను లోపలికీ దూర్చి, గోళ్ళతో రక్కి, సిగరెట్‌తో కాలుస్తు న్నాడు. పాప
ఆర్తనాదాలు అలసి పోయాయి. ఆమె నరాలు చిట్లి రక్తా న్ని చిమ్ముతున్నాయి.
మృగక్రీడ పూర్తిచేసుకున్న లాయరు స్పృహ కోల్పోయిన పాప ప్రాణాలు విడిచిందని నిర్ధా రించుకునీ, ఆమె గౌనుతో
తనకంటిన రక్తా న్ని తుడుచుకునీ కింద పడున్న సరస్వతి శ్వాసను గౌనుతో నిలిపేసి వెళ్ళిపోయాడు..” ప్రజ్వల గొంతు
గద్గదమవుతూంటే మూగబోయిన అందరూ మౌనంగా కన్నీళ్ళు తుడుచుకుంటున్నారు.
తనకు నైతిక విలువలంటూ పాఠాలు చెప్పే తన కన్నతండ్రి ఇంతటి కాలాంతకుడా.. జీర్ణించుకోలేక పోతున్నాడు ప్రదీప్.
ఓ నిమిషం భారమైన నిశ్శబ్దం తరువాత, “ఆ అమ్మాయి కూడా చనిపోయిందా మేడమ్!” కన్నీళ్ళను దిగమింగుతూ
అడిగింది ఒకయువతి.
“లేదమ్మా! వాళ్ళమ్మను ఆదరించిన సరస్వతి పిన్నమ్మే ప్రజ్వలను కూడా అక్కున చేర్చుకుని, రహస్యంగా వైద్యం
చేయించి కాపాడింది.
వాడ్ని చంపేస్తా నని పాప ఆవేశపడినప్పుడల్లా .. ‘వాడ్ని చంపడం కన్నా, నువ్వు బతకడం ముఖ్యం తల్లీ! బాగా చదువుకుని
మంచి భవిష్యత్తు నందుకో. అప్పుడు నువ్వు చేయాలనుకున్నది చేయవచ్చు..’ అనే అమ్మమ్మ మాటలు మందులా పనిచేసి
ఆమెను గెజిటెడ్ అధికారిగా మార్చాయి..”
“ఆమె ఇప్పుడెక్కడున్నారు మేడం! ఆ లాయరేమయ్యాడు?”
లత ప్రశ్న పూర్తికాకుండానే ప్రదీప్ వాళ్ళ మధ్యలోకి వచ్చి, “ఆ లాయరు ఇప్పుడు పక్షవాతంతో మంచాన పడ్డా డు.
ఎందుకో తెలుసా?”
అందరి ముఖాల్లో విస్మయం.. ఇతనెవరు అన్నట్లు .
“ఆ నీచ నికృష్ట లాయరుకి మన ప్రముఖ ప్రజ్వల కాబోయే కోడలు, ఎల్లుండే పెళ్ళి. మీరంతా వచ్చి ఆ జంటని
ఆశీర్వదించీ, ఆ దుర్మార్గుణ్ణి దూషించి వెళ్ళండి!”
అమ్మాయిలంతా గట్టిగా చప్పట్లు కొట్టా రు.
“అంతకన్నా పెద్ద శిక్ష ఏ కోర్టూ వేయలేదేమో! ప్రజ్వల మేడంతో పోలిస్తే నాదసలు సమస్యే కాదు. ఆ స్ఫూర్తితో నన్ను
నేను నిరూపించుకుంటాను..”
అంటున్న లత భుజం తట్టి, శారదను కళ్ళతోనే పలుకరించి, ప్రదీప్‌కి కరచాలనమందించింది జ్యోతిప్రజ్వల.

పెండ్యాల గాయత్రి (98)
కథలు కనే కళ్ళు

(పసిపిల్లలపై జరిగే లైంగిక వేధింపులను నిరసిస్తూ వ్రాసిన ఈ కథ, 2020 వ సంవత్సరం ప్రతిలిపిలో ప్రచురించబడింది)

ఆమెకెందుకిచ్చినట్లు ?
నా మనసు ఇప్పుడూ మౌనాన్ని కోరుతోంది. మంచికి, చెడుకు మధ్య మూగగా మూలుగుతోంది. ఆవేదనో, ఆందోళనో
తెలియక అల్లా డుతోంది. బాధో, బాధ్యతో తేల్చుకోలేక సతమతమవుతోంది.
ప్రస్తు తమున్నది దేవుని ఆలయంలోనే అయినా, నా మనసును ఆయన వైపు మళ్లించలేక పోతున్నాను.
ఎంత ఆలోచించినా బోధపడడం లేదు. ఈయన.. ఆమెకీ ఎందుకిచ్చినట్లు ? చూడ్డా నికి చక్కగా ఆరోగ్యంగానే ఉంది.
నీట్‌గా తలదువ్వుకుని బొట్టు పెట్టు కుంది. పరిశుభ్రమైన చీర కట్టు కుంది. పని కట్టు కుని వెతుకుదామన్నా ఏ లోటు
కనిపించట్లేదు.
“అలా నిలబడిపోయి ఏం ఆలోచిస్తు న్నావ్? ఆ అరుగు చెట్టు వద్ద దీపం పెట్టి వద్దాం దా!”
ఆయన పిలుపు చెవిన పడగానే అప్పటికి మనసును జోకొట్టి కాళ్లకు పని చెప్పాను.
తరువాతి తరాలకోసం ధనాన్ని పోగేసినట్టు , పుణ్యాన్ని కూడా వెనకెయ్యాలనుకుంటున్నారేమో!... గుడి లోపల వెలుపల,
ప్రాంగణమంతా ఎక్కడ చూసినా జట్లు జట్లు గా జనం. ఇసుక కాదు నీళ్లు రాళ్లు చల్లినా తరిగేటట్లు లేరు. కాస్త ఖాళీ దొరికితే చాలు
ఆ ప్రదేశాన్ని కడిగి, ముగ్గువేసి గంధం పసుపు కుంకుమ చల్లి, ముగ్గు మధ్యలో ప్రమిద పెట్టి, నూనె నెయ్యి పోసి వత్తి వెలిగించి,

పెండ్యాల గాయత్రి (99)


కథలు కనే కళ్ళు

పసుపును ముద్దగా కలిపి, గౌరమ్మను తీర్చి, తమలపాకు పైనుంచి, బొట్టు పెట్టి, పండ్లు పువ్వులు తాంబూలం కానుక అమ్మకు
సమర్పించి, అగరువత్తు లు వెలిగించి, అరటిపండ్ల నడుముకు గుచ్చి, కొబ్బరికాయ కొట్టి చిన్న వారుపోసి, కొన్ని వచ్చీరాని శ్లోకాల
మధ్య కోర్కెల చిట్టా ను గౌరమ్మకు నివేదించి, కర్పూరం వెలిగించి హారతి సమర్పిస్తూ, గంట గట్టిగా మోగించి, లేచి నిలబడి ఆత్మ
ప్రదర్శన చేసి, ఈ పూజ జరగడం కోసం తెచ్చిన సామాగ్రి తాలూకు వ్యర్థ వస్తు వులన్నీ, అక్కడే వదిలేసి, అవన్నీ గాలికి చెల్లా చెదురు
అవుతుంటే, వాటిని అతి కష్టమ్మీద దాటుకుంటూ, శివయ్య దర్శనానికి వెళ్తు న్నారు. ఆ జనసంద్రాన్ని దీపాల వరుసలను,
వ్యర్ధా లన్నిటినీ దాటుకొని, అరుగుచెట్టు వద్దకు చేరేటప్పటికి పదినిమిషాలు పట్టింది.
“ఇందాక మనం వచ్చినప్పుడు ఇంత జనం, ఇంత చెత్త లేదు కదా!” అన్నాను.
“మరి కార్తీకపౌర్ణమి అంటే ఏమనుకున్నావ్! ఇదిగో ఇటు చూడు, ఇక్కడ మూడు చెట్లు పెనవేసుకుని పెరిగి ఎంతగా
విస్తరించాయో, ఈ చెట్ల చుట్టూ కట్టిన గుండ్రటి అరుగు, దాని వెనుక పెద్దచెరువు, ఎంత ఆహ్లా దకరంగా ఉందో కదా ఇక్కడి
వాతావరణం” అన్నారాయన.
అవును.. ఆ పిల్లగాలి తనువును తాకగానే మనసు ఏదో పాటందుకుంది.
“ఓహో! పిల్ల మంచి ఊపు మీద ఉందే” అంటూ ఆకుపై కర్పూరదీపం వెలిగించి, చెరువులోని నీళ్ళమీద
వదులుతున్నారు.
ఆ దీపాన్ని తదేకంగా చూస్తూ, “కాసేపు కూర్చుందామా!” అన్నాను.
మనసు మళ్ళీ మూలుగుతోంది., ‘ఆమెకి ఎందుకు ఇచ్చినట్లు ’ అని ఆయన్ని అడగమంటోంది.
తను కొబ్బరిచిప్ప పగలగొట్టు తూ, “ఓయ్ కొబ్బరి చిప్ప మొకం.. ఏంటి అలా ఉన్నావ్? కాస్త నవ్వితే సెల్ఫీ తీసుకుందాం”
అన్నారు.
“అలాగేలే కొబ్బరి ముఖం ముఖం” అని నవ్వేసా.
“అబ్బా నవ్విందిరా నాగమల్లి పువ్వు” అంటూ మొబైల్ కెమెరా క్లిక్ చేశాడు.
“ఫోటో ఎలా వచ్చింది? కెమెరా ముఖం” అనగానే,,
“ఇద్దో చూస్తుండు సెల్ఫీ ముఖం, నేనెళ్ళి ప్రసాదం తీసుకువస్తా ” అంటూ మొబైల్ నా చేతికి ఇచ్చి లేచారు.
“నేను కూడా వస్తా ” అని హడావిడిగా పైకి లేస్తుంటే, నన్ను వెనక్కినెట్టి కిందకు వంగారు., ఏంటా అని చూస్తే,
అరటిపండు.. ఇప్పటికే ఎవరి పాదం కిందో పడి సగం పగిలి గుజ్జు బయటికి వచ్చింది.
“కింద చూసి కదా నడిచేది” అంటూ దాన్ని తీసి ఒక పక్కన పడేశారు.
‘ఏంటో! ఈ మనిషి పనులు.. ఒక పట్టా న అర్థం కావు. నాకు చిన్ననొప్పి తగలనివ్వరు. నన్ను అణువణువు
గమనిస్తుంటారు. చాలా మంచోడని అనుకుందామంటే, అసందర్భంగా ప్రవర్తిస్తుంటారు.
నిన్న సాయంత్రం పూజా సామాగ్రి కొనడానికని బజార్‌కి వెళ్ళాము. కొన్ని కొన్నాక, పూలు పండ్లు తీసుకోవాలంటే, బైకు
పండ్ల బండి దగ్గర ఆపారు. నేను పండ్లు తీసుకుని, ఆ పక్కనే తమలపాకులు కనిపిస్తే, అవి కూడా ఒక కట్ట తీసుకొని, బైక్ దగ్గరకు
వచ్చేటప్పటికి, ఒక పెద్దసంచి బైకు హ్యాండిల్‌కి తగిలిస్తు న్నారు. ఏంటా అని చూద్దు ను కదా పువ్వులు... ఒక ఫంక్షన్‌కి డెకరేట్
చేయడానికి సరిపోతాయి.
“ఇన్ని ఎందుకు?” అన్నా గొంతు పెంచి.
“గుడికోయ్”అన్నారు.

పెండ్యాల గాయత్రి (100)


కథలు కనే కళ్ళు

‘అభిషేకం చేయించుకుందాంమండీ’ అంటే!


“అంత ఖర్చు ఇప్పుడెందుకు చెప్పు, రేపు మనకి పాపో, బాబో పుట్టా క చేయించుకోవచ్చు” అన్నారు.
‘ఇప్పుడు ఈ పువ్వులకు పెట్టిన ఖర్చుతో అభిషేకం జరిగిపోయేది..’
“ఏంటలా రోడ్డు మీదే నిలబడి, ఎక్కడో ఆలోచిస్తు న్నావు? ఎక్కి కూర్చో వెళ్దాం” అంటూ బైక్ స్టా ర్ట్ చేశారు. ‘బజారులో
భజాన బాగోదులే’ అనుకొని, మాట్లా డకుండా బైక్ ఎక్కి కూర్చున్నాను.
ఇంటికెళ్లా క ఎప్పటిలాగే కొన్నవన్ని ఎక్కడివక్కడ సర్దేసి, కొన్ని పువ్వులు ఫ్రిడ్జ్‌లో పెట్టి, ఒక తెల్ల గులాబీని, నా జడలో
దూర్చి, “పూల పిచ్చి మొఖం” అంటూ నా పెదవులను ముద్దా డి,, “గుడి దాకా వెళ్ళొస్తా ” అని చెప్పి వెళ్లిపోతుంటే ఇంకేం
చేస్తా ను..! ఆయన ముద్దు కు నా కోపాన్ని అరువిచ్చేసి, మౌనంగా ఉండిపోయా.
ఇవాళ గుడికి వచ్చి దర్శనం చేసుకునేటప్పుడు, “చూడు మన పూలతో మంటపమంతా ఎంత చక్కగా
అలంకరించారో!” అన్నారు.
‘ఆ! డబ్బు ఖర్చుపెట్టి తెచ్చిస్తే, ఎందుకు అలంకరించరు..’ అనుకొని, “మ్ఁ.. బాగుంది” అన్నాను నవ్వినట్టు పెదాలను
సాగదీస్తూ.
“ఓ పిల్లా ! కాసేపు ఈ లోకంలోకి వచ్చి, ఇదిగో ఈ పులిహోర ప్రసాదం తిను...” అంటూ పులిహోరను నా చేతికి
అందించారు.
ఎన్నేళ్ళ నాటిదో వేపచెట్టు , గుడి తూర్పు ప్రాంగణమంతా నీడనిస్తుంది. ఆ చెట్టు కింద కట్టిన అరుగు మీద కూర్చుని,
ప్రసాదం తింటున్నాము.
సుమారు ఏడెనిమిదేళ్ల వయస్సు ఉన్న ఓ పాప మా వద్దకు వచ్చి, చేయి చాపుతూ ముడుస్తూ, “అమ్మా .. అమ్మా..”
అంటోంది.
“బడికి వెళ్తు న్నావా?” అన్నారీయన.
‘ఆ పిల్ల లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది.
“సరే మేము బడిలో చేర్పిస్తా ము మాతో వస్తా వా!” రింగవుతున్న సెల్ఫోన్‌ను జేబులో నుంచి తీస్తు న్నారు.
ఆ పిల్ల గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్లిపోతుంటే, నేను పిలిచి, అరటిపండు ఇవ్వబోయాను. నావైపు ఓ చూపు విసిరి
చివాలున వెళ్లిపోయింది.
“మీరు రండి సార్!! నేను గుడిలోనే ఉన్నా” అంటూ ఎవరితోనో ఫోన్లో మాట్లా డుతున్నారు.
“ఏంటో! ఈ మనిషి..! ఆ పిల్లకి ఒక ఐదు రూపాయలు ఇస్తే ఏం పోతుందీయన సొమ్ము..? పసిపిల్లలు దేవుని
స్వరూపాలు అంటారే, అలాంటిది ఆ దేవుని కోసం అంతంత ఖర్చు చేస్తు న్నారుగా.. పాపం భయపడి పండు కూడా తీసుకోకుండా
వెళ్ళిపోయింది.
అయినా ఇప్పటికి ఎన్నిసార్లు చూడలేదు, ఇంకా చిన్న పిల్లలు.. నాలుగయిదు ఏళ్ళు కూడా ఉండవు. ఆకలి బాధ
తాళలేక, డిపోల్లో, రైల్వేస్టేషన్లలో చేయి చాచి అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళని కూడా ఇలాగే ఏవేవో ప్రశ్నలు అడిగి భయపెట్టి,
వెళ్లగొడతారే కానీ రూపాయివ్వరు.

పెండ్యాల గాయత్రి (101)


కథలు కనే కళ్ళు

పాపం ఓ ముసలాయన, బాగా బక్కచిక్కి ఉన్నాడు. కదల్లేక కదులుతున్నాడు. ఇప్పటికీ రెండు దేవాలయాల్లో
కనిపించాడు. ఎంత ప్రాధేయపడినా అతనికి ఏమి ఇవ్వలేదు. అందుకేనేమో ఉదయం మా ఇద్దరినీ చూసి, చేయి చాచకుండా
అలా చూస్తూ నిల్చున్నాడు.
గుడి ద్వారం వద్ద ఎందరు బిక్షగాళ్లు న్నారు. మాసిన బట్టలు, మురికి కారుతున్న శరీరం, ముడులు గట్టిన జుట్టు ,
వాళ్లకేదైనా కొంచెం సాయం చేయొచ్చు కదా! ఇలాంటివన్నీ అడిగి వాదన పెట్టు కుందామంటే, ‘నీకెందుకు, నీకేమైనా లోటు
చేస్తు న్నానా?’ అని అంటారేమో. అది నిజమే. ఆయన ప్రేమ పాతికేళ్లు పెంచిన మా అమ్మానాన్నలను సైతం మరిపించింది. నాకేచిన్న
బాధ కలిగినా మా అమ్మలా విలవిలలాడిపోతారు. ఏది కావాలని అడిగినా నాన్నలా నిమిషాల మీద తీసుకువస్తా రు. అంతటి
ప్రేమమూర్తిని ఎలా నొప్పించను..!? ఆయన గురించి నేను చెడుగా అనుకోవడం ఏంటి. ఎవరో దారిన పోయే వాళ్ల గురించి
నాకెందుకు ఇంత బాధ ఆందోళన?
అయినా ఒకింత ఆలోచిస్తే నా అనేవాళ్ళు లేకనే కదా వాళ్లంతా ఇలా.. అడుక్కుంటూ బతుకుతున్నారు. నా భర్త అని
వెనక్కేసుకుని రావడం కాకపోతే, ఇలాంటి అనాధలకు రూపాయి ఇవ్వని వాడు ఎంతో షోకుగా హుషారుగా ఉన్న ఆమెకెందుకు
డబ్బులు ఇచ్చినట్లు ? నేను కూడా సంపాదిస్తు న్నాగా ఆయన అనుమతి కోసం ఎందుకు ఎదురుచూడాలి. వెళ్లేటప్పుడు గుడి
బయట ఉన్న కొందరికైనా చిల్లర ఇచ్చి వెళతా. కాస్త పుణ్యం అయినా వస్తుంది పండగపూట.
“ఓయ్ పిచ్చిపిల్లా ! ఇదిగో కార్తీక పురాణం పుస్తకం తీసుకు వచ్చా..” అంటూ పుస్తకాన్ని నాకు ఇచ్చేసరికి
ఆలోచనల్లోంచి తేరుకొని,,
“ఇప్పుడిది ఎందుకు మన ఇంట్లో ఉంది కదా!” ఉక్రోషంగా అన్నాను.
“అబ్బో అమ్మాయిగారు ఏంటో కస్సుబుస్సులాడుతున్నారే” అన్నారు నా భుజంపై నిమురుతూ.
“మనకున్న వస్తు వు కోసం డబ్బు పెట్టడం ఎందుకు?”
నా భుజం మీద ఉన్న ఆయన చేయిని నెట్టేస్తూ అన్నాను.
జాలిగా ముఖం పెట్టి, “అంత కోపం అయితే ఎలా తల్లీ! మనకు ఉంది కదా ఎవరికైనా ఇచ్చేద్దాం” అన్నారు.
“అంతేలెండి..! మనకు ఉంది కదా మన ఇష్టా నుసారం ఖర్చు పెట్టు కుందాం.” అన్నాను.
“మన కష్టా ర్జితం, మనం ఖర్చు చేసుకుంటున్నాం తల్లీ, ఒకరి దగ్గర చెయ్యి చాచట్లేదు కదా” అనగానే,,
“కనీస అవసరాలు తీరకనే, వాళ్లు చేతులు చాచి అడుకుంటున్నారని మీకు తెలియదా?” ఆయన కళ్ళలోకి చూస్తూ
అన్నాను.
“పరీక్షలు రాయని వాడికి మార్కులు వేస్తే ఏమవుతుంది? బీటలు బారిన నేలలో విత్తనాలు చల్లితే ఏమవుతుంది?”
అంటూ అసందర్భ ప్రశ్నలడుగుతూ ఉండగా,
ఎవరో ఒక వ్యక్తి వచ్చి, “ఇందాక కాల్ చేసింది మీరే కదా!” మా ఆయన్ని పలకరిస్తూ అన్నాడు.
“అవును సార్” అంటూ అతనికి షేక్‌హ్యాండ్ ఇచ్చి,
“నేనిప్పుడే వస్తా ను, కూర్చుని ఉండు” అని చెప్పి అతనితో వెళ్లా రు.
ఈయన పనులే అసందర్భం అనుకున్న మాటలు కూడా అలానే ఉన్నాయి. అడుక్కునే వాళ్లకి నాలుగు రూపాయలు
ఇద్దా మంటే, పొంతన లేని ప్రశ్నల పురాణం మొదలెట్టా రు. అనుకుంటుండగా వచ్చి ,
“ఇక బయలుదేరుదామా తల్లీ” అన్నారు.

పెండ్యాల గాయత్రి (102)


కథలు కనే కళ్ళు

“ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఎవరు?” అడిగాను.


“తర్వాత చెప్తా ,, దా వెళ్దాం” అంటుంటే,
“మ్హు చెప్పందే రాను” మూతి ముడుచుకుంటూ అన్నాను.
“ఏంటిది చిన్నపిల్లలా” చిరుకోపం ప్రదర్శించారు.
“చిన్నపిల్లలకు చిల్లర ఇద్దా మంటే చిక్కుప్రశ్న లేసింది ఎవరు?”‌అన్నాను.
“ఓ..! నువ్వు ఇంకా అదే ఆలోచిస్తు న్నావా!? సరే, చెప్తా విను” అంటూ అరుగుపై బాసపట్టు వేసుకుని కూర్చున్నారు.
“మనదేశంలో భిక్షగాళ్ల సంఖ్య రోజురోజుకి ఎందుకు పెరిగిపోతుందో తెలుసా నీకు? ఇంత ప్రగతి సాధిస్తు న్నప్పటికీ కూడా
పనిచేయని వాడిపట్ల, జాలి చూపించి, పైసలు ఇవ్వడం, ఉచిత దానాలు చేయడం వలన. కటిక పేదవాడైనా కష్టపడే తత్వం
ఉన్నవాడు పని వెతుక్కుంటాడే తప్ప భిక్షమెత్తు కోడు. పుణ్యాన్ని సంపాదించాలనే స్వార్థంతో కొందరు ప్రజలు, పదవులు
సంపాదించాలనే పేరాశతో కొందరు నాయకులు, దేశంలో భిక్షగాళ్ళు, సోమరిపోతుల సంఖ్యను వృద్ధి చేస్తు న్నారు. పని చేసేవాడికే
పైకం ఇవ్వాలి. ఏ పని చేయలేని వాడికి చేయూతనివ్వాలి. బాధ్యత ఎరిగిన వ్యక్తు లు పని చెయ్యకుండా ఫలితం ఆశించరు. ఇందాక
వచ్చిన వ్యక్తి ఎవరు, అని అడిగావు కదా! ఆయన వృద్ధా శ్రమం మేనేజర్. ఉదయం మనం గుడికి వచ్చేటప్పుడు, బయటున్న
బక్కచిక్కిన ముసలాయను గమనించావు కదా” అనగానే,,
నేనందుకొని, “మ్.. ఆయన్ని ఇంతకుముందు రెండు మూడు గుళ్ళల్లో చూశాము కదా..” అన్నాను.
“అవును వయసుడిగిన ఆయన తిప్పలు తప్పించడం కోసమే మేనేజర్‌తో మాట్లా డి, వృద్ధా శ్రమంలో చేర్పించా”
అంటుంటే..,
“నిజమా!” నా కళ్ళు పెద్దవి చేశాను.
“పని చేయగలిగిన శక్తి యుక్తు లు ఉండి కూడా, పిల్లల్ని పీక్కుతినే పెద్దవాళ్ళు, ఏదైనా సాధించగల సత్తా ఉండి కూడా,
పెద్దల శ్రమతో సరదాలు తీర్చుకునే కుర్రవాళ్ళు, విధిని మరిచి లంచాలను భోంచేసే అవినీతిపరులు సంఘంలో దర్పం
ప్రదర్శిస్తు న్నప్పటికీ.. బిక్షగాళ్లు , ముష్టివాళ్లతో సమానమే కదా తల్లీ!” అని ఆయన అంటున్నప్పుడు
కార్తీక పురాణం పుస్తకం నా ఒడిలో నుంచి జారి పడబోతుంటే పట్టు కుని, “ఇది మన ఇంట్లో ఉన్న సంగతి నాకు
గుర్తుంది, కానీ ఈ పుస్తకాలు అమ్ముకునే వ్యక్తికి రెండు కాళ్లు లేవు, అతనికి కాస్త సాయం చేసినట్టు ఉంటుందని కొన్నాను. నిన్న
అన్ని పువ్వులు ఎందుకు కొన్నారని అడిగావుగా, ఆ పువ్వులమ్మే ఆమె మరుగుజ్జు మనిషి. అవయవాలన్నీ ఉన్న కూడా చాలా
బలహీనంగా ఉన్నాయి. కనీసం ఒక్క రోజైనా ఆమెకు చేయూతను అందించిన వాళ్ళం అవుతాము కదా అని పువ్వులన్నీ కొన్నాను.
అభిషేకం చేయించినా ఫలితం ఇలా లభించిందని అనుకోవచ్చు కదా” అన్నారు.
నాకేం మాట్లా డాలో అర్థం కాలేదు.
“ఇప్పుడైనా ఇంటికి బయలు దేరదామా” అంటూ లేచారు.
“వెళదాం కానీ, మరి “అంటూ నసిగాను.
“ఇంకా ఏం అనుమానం మిగిలిపోయింది?” అంటూ ముఖం దిగాలుగా పెట్టా రు.
“ఇందాక పూజ అయిపోయి వచ్చేటప్పుడు, ఆమెకి ఎందుకు డబ్బులు ఇచ్చారు?”
నేనడిగిన మాట పూర్తి కాకముందే,,” అటు చూడు, ఆమెకే కదా” అన్నారు.
“అవును” బుంగమూతి పెట్టి అన్నాను.

పెండ్యాల గాయత్రి (103)


కథలు కనే కళ్ళు

“ఆమె ఏం చేస్తోంది?” అనగానే విసురుగా ఆయన వైపు చూసి,


“నేనేం చిన్నపిల్లనా అలా అడుగుతున్నారు, చిమ్ముతోంది” అన్నాను.
“పూజ పూర్తి చేసుకొని మనం ఇవతలకు వచ్చేస్తే, అక్కడ ఎంత చెత్త పోగవుతుందో, ఎంత మురికి చేరుతుందో, నువ్వు
చూసావు కదా! అదంతా తీసివేసి, శుభ్రం చేసి, తరువాతి పూజకు ఆ ప్రదేశాన్ని సిద్ధం చేస్తోంది ఆమె..”
ఆయన మాట ఆగగానే కాస్త గోముగా, “అందుకా ఆమెకి డబ్బులు ఇచ్చింది. నేను ఇంకా ఎందుకో అనుకున్నా
లేండి..” అన్నాను.
“నువ్వు కాక మరెవరు అనుకుంటారు, ఎవరు ఆలోచిస్తా రు తల్లీ నా గురించి..” అంటూ నా చేయి అందుకున్నారు.
ఇద్దరము అలా గుడి ద్వారం దాటి బయటకు నడుస్తూ ఉంటే, “అమ్మా ,, బాబూ,, ధర్మం చేయండి” అంటూ ఓ పది
గొంతులు అరుస్తు న్నాయి.
“వీరందరూ పని చేయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళే, ఏ ఒక్కరిలోనూ అవయవ లోపం గానీ, బలహీనతలు గాని లేవు,
కానీ ఇలా అలవాటు పడిపోయారు అంతే..” అంటున్నారాయన.
ఇంతలో, “ఇందాక డబ్బులు ఇవ్వకుండా, అరటికాయ ఇవ్వబోయిందంటినే, అదిగో ఆ మహాతల్లే, ఆ బోడి కాయలైతే
గుడినిండా లేవు” అనుకుంటున్నారు ఇద్దరు పిల్లలు.
“విన్నావా!” అన్నారాయన బైక్ స్టా ర్ట్ చేస్తూ.
వాళ్ల పరిస్థితికి జాలిపడాలో, ఆ పద్ధతి చూసి కోప్పడాలో అర్థం కాలేదు.
“ఉచితంగా లభించే వాటికి విలువ ఉండదు. అదే కష్టఫలం ఐతే కావలసినంత మేరకే ఉపయోగిస్తా రు..” అంటూ నన్ను
బైక్ ఎక్కమన్నట్లు సైగ చేశారు.
‘ఏది ఏమైనా మా ఆయన సమాజాన్ని చదివినంతగా, నేను చదవలేదేమో! ఇంతసేపు నా పిచ్చి మనస్సునింత
సంఘర్షణకు గురి చేసాను..’ బైక్ ఎక్కుతూ అనుకున్నాను.

(శ్రమజీవులు క్షుధ్ బాధకు లోనవకూడదు.. సోమరిపోతులు ఉచితాలకు అలవాటు పడకూడదు.. అన్న యోచనలోంచి
వచ్చిన ఈ కథ, 2018 వ సంవత్సరంలో మాంమ్స్ ప్రస్ లోను, ప్రతిలిపి లోనూ ప్రచురించబడింది)

నాలుక లోపలి నరం...!?


“అమ్మాయ్..! శేషమ్మా..!”
“ఆఁ.. ఆఁ! వస్తు న్నా పిన్నామ్! అట్లా బయటే నిలబడ్డా వేఁ రా.. లోపలికీ...!”
“నా మనవడికీ ఉద్యోగమొచ్చిందంటగా...!! ఊళ్ళో అందరూ అనుకుంటున్నార్లేమ్మా!”
“ఆఁ! అవునూ పిన్నామ్! ఇన్నాళ్ళకి మా కష్టా లు గట్టెక్కినయ్..”
“నిజమే తల్లీ! పాపం ఇన్నాళ్ళూ అల్లు డికి బాగలేక, మనవడికేపనీ లేక, మీరు నానా అవస్థలు పడ్డా రులేమ్మా! మీ
ఇబ్బందులూ పగోళ్ళకీ కూడా రాకూడదు తల్లీ!”
“ఏదోలే పిన్నామ్! నీ బోటి పెద్దల దయవల్ల అన్ని దెబ్బలు తిన్నా తట్టు కొని నిలబడ్డా ము. యట్టనో వేడినీళ్ళకు
చన్నీళ్ళన్నట్టూ ఏదో చిన్నదో, పొన్నదో బిడ్డకొక బతుకుదెరువు దొరికింది..”

పెండ్యాల గాయత్రి (104)


కథలు కనే కళ్ళు

“చిన్నదంటావేందమ్మాయ్ గవర్నమెంటుజ్జోగమంటగా... జీతమేమాత్రమిస్తా రంటనేఁ!!!”


“మేము అందరిలాగా వాణ్ణి సాఫ్టు వేర్లు చదివిచ్చలేదుగా పిన్నామ్! ఏదో.. మామూలు డిగ్రీనేగా! వాడూ.. కష్టపడీ ఆ
టై పూ కంప్యూటరూ నేర్చుకోబట్టీ, ఆ టై పిస్ట్ పోస్టొచ్చింది. మొదట్లో ఇరవై వేలిస్తా రంట పిన్నామ్!”
“ఆ..! ఇరవై వేలంటే ఊరకుందంటమ్మా! ప్రవేటు పనులకు పోతే పదివేలకన్నా పెచ్చిస్తా రా వాళ్ళూ.. పైగా
పొద్దు గూకులూ గొడ్డు చాకిరీ చేపిస్తా రూ..! గవర్నమెంటోళ్ళకాడ అంత కష్టమేమీ ఉండదంటా, పోయ్యేకొద్దీ జీతం పెరిగేదే కానీ
తరిగేదికాదుగా!
“పని చేసేవోళ్ళకీ ఎక్కడైనా పనుంటది పిన్నామ్! ఇంక జీతమంటావా! అది పెరిగే కొద్దీ ఖర్చులు గూడా పెరిగేవే కదా!
కాకపొతే ఒకటి, కొన్నాళ్ళు జాగర్తగా ఉండి అప్పులు తీర్చుకున్నామంటే.. కాస్త మనశ్శాంతిగా ఉండగలుగుతాము..”
“అంతేలే తల్లీ! ఎలాగో తంటాలు పడి పిల్ల పెళ్ళిజేసావు.. దాని బతుకది బతుకుతుంది. ఈ ఏడు పిల్లోడికి గూడా
జేసేసావంటే నీకా బాధ్యత గూడా తీరిపోద్ది.”
“ఆఁ! అవును పిన్నామ్! ఏదో ఆ దేవుడు చల్లగా చూస్తే ఈ సంవత్సరంలోనే అబ్బాయికి కూడా
చేద్దా మనుకుంటున్నా..!”
“వినాయకచవితి వస్తంది కదమ్మా! ఏటేటా మనపక్క ఎవురో ఒకళ్ళు వినాయకుడి బొమ్మ పెట్టిస్తా రుగా! పొయినేడూ
నరసిమ్మగారి పిల్లోడికీ ఉజ్జోగమొచ్చిందనీ వాళ్ళే బొమ్మకీ డబ్బులిచ్చారు నీకు గూడా తెలుసుగా!?”
“అవును,, వాళ్ళబ్బాయికి అమెరికాలో ఉద్యోగమొచ్చిందనీ, నెలకు రెండు లక్షల జీతమనీ నరసిమ్మగారి పద్మ చెప్పిందిలే
పిన్నామ్!”
“అందుకే తల్లీ! ఈసారి ఆ కార్యం మీరు జేపిచ్చారంటే ముందునాటికి మీ ఇంటికి మాలక్ష్మొచ్చుద్ది..”
“అంతేనంటావా పిన్నామ్!”
“రొండేళ్ళనాడూ మన బాలయ్యగారు బొమ్మని పెట్టా రు గుర్తుందా! అంతకుముందు వాళ్ళకన్నీ అప్పులేగదమ్మా!
ఏమంటా బొమ్మబెట్టా రో, వాళ్ళ పొలానికీ మంచి రేటొచ్చింది. అంతటితో వాళ్ళ దరిద్రమొదిలిపోయింది..”
“ఉన్న పొలమంతా అమ్ముకున్నారుగా పిన్నామ్!”
“అయితేనేమి తల్లీ! అప్పులన్నీ బోయినయ్యీ.. ఇప్పుడు తలా ఒక పని చేసుకుని బతుకుతున్నారు. అప్పులేనోడే
అసలైన ఆస్తిపరుడమ్మా!”
“నిజమేలే పిన్నామ్! ఒకరికాడ చెయ్యి జాచకుండా బతకగలిగితే చాలు ఈ రోజుల్లో..”
“తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తదనీ,, ఆ దేవుడు కూడా చల్లగా చూస్తేనే మనం ఇంత ముద్ద తినగలుగుతాము
తల్లీ! ఏమంటావ్?!”
“ఏమనేదేముంది పిన్నామ్! నువ్వు చెప్పిన మాట గూడా మంచిదేగా!”
“అందుకేనమ్మా! బొమ్మ పెట్టిచ్చుకోండి.. దోషాలేమైనా ఉంటే తొలిగిపోతాయి..”
“అంతేలే పిన్నామ్! దేవుడికిస్తే మంచే జరుగుద్ది కదా!”
“దేవుడియ్యకపోతే మనకేడ నుంచి వస్తది తల్లీ! వినాయకుడి కమిటీ పెద్ద, మావోడే కదమ్మా! మళ్ళీ ఎవురికన్నా
మాటిస్తా డేమో గానీ, ఒకమాట చెప్పమ్మా!”
“అట్లే చేద్దా ములే పిన్నామ్! సాయంత్రం అబ్బాయొచ్చిన తరువాత వాడికొక మాట చెప్పీ, మీ ఇంటికి పంపిస్తా లే..!”

పెండ్యాల గాయత్రి (105)


కథలు కనే కళ్ళు

“అట్లా గే తల్లీ! మనవడు ఖర్చు గురించి ఆలోచించి వెనకడుగేస్తా డేమో,, దేవుడితో గూడిన విషయం గదా! నువ్వు
చెప్పుకొని ఒప్పిచ్చుకోమ్మా!”
“అదేమి లేదులే పిన్నామ్? మా పిల్లలు పుట్టినప్పుటి నుంచీ నీ కళ్ళముందే పెరిగారు కదా? నీకు తెలియందేముంది?”
“నా మనవడి గురించి నాకు తెలీదా తల్లీ! వాడు బుధ్ధికి దేవుడంటోడమ్మా! ఆ దేవుడికి కొరవ చేస్తా డా?పండగ
దగ్గరకొస్తంది గదమ్మా! ఇల్లు బాగుజేయాలా, మీ వొదిన పన్లో యేలుబెట్టదు గదా! నీకు తెలియందేముంది.. వస్తా ను తల్లీ!”
“అబ్బాయిని సాయంత్రం పంపుతానని తమ్ముడితో చెప్పు పిన్నామ్..!”
“అంతకన్నానా తల్లీ! ఉంటానమ్మా! డబ్బుల కాడ ఇబ్బంది పడబాకండి తల్లీ! నీ తల్లెనక తల్లంటి దాన్ని. వడ్డీబొడ్డీ గూడా
చూసీ చూడనట్టు పోనిస్తా గా.. నీకు దెలిసిందే!”
“ముందియ్యాల్సినది అట్లా గే ఉన్నా, మళ్ళీ ఇస్తా ననటం నీ మంచితనం పిన్నామ్!”
“నా మనవడు బాధ్యత గల్లోడు తల్లీ..! ఉంటానమ్మా..!”
“అమ్మాయ్... శేషమ్మా! పనిలో ఉన్నావా?”
***
“ఆఁ..ఆఁ! వస్తన్నా,, నువ్వు కూర్చో పిన్నామ్..! గొడ్డు మేత తెచ్చీ కొట్టం కాడేసొచ్చీ కాళ్ళు కడుక్కుంటున్నా.. వస్తన్నా..”
“కష్టజీవివమ్మా నువ్వూ!”
“హాఁ! ఏంచేస్తాం పిన్నామ్? పని చేస్కోకపోతే కథ గడవదు గదా!”
“ఏదో నీపై ఆపేక్ష పోగొట్టు కోలేకా ఆ వినాయకుడి వల్లనన్నా నువు పడే బాధలు తప్పిద్దా మని చూస్తే అదీ ముడిబడేటట్టు
లేదు తల్లీ!”
“నువ్వనేదేం అర్థం కావట్లేదు పిన్నామ్! ముడిబడక పోవటమేంది? రాత్రి పిల్లోడొచ్చినే...!”
“ఆఁ..ఆఁ! వచ్చాడు తల్లీ! మీ తమ్ముడితో ఏమ్మాట్లా డేడో చెప్పాడా?”
“వాడు మీ ఇంటికాణ్ణించొచ్చేటప్పుటికి బాగా పొద్దు పోయిందిగా పిన్నామ్! నేను పడుకున్నా.. పొద్దు న్నే అడిగితే
సాయంత్రం మాట్లా డదాము లేమ్మా నాకాఫీసుకు టై మవుతుంది కదా! అన్నాడు..”
“నిజమేలేమ్మా! మన పనుల తరవాతే కదమ్మా ఏపనైనా?”
“ఆహాఁ! అట్లేంకాదు పిన్నామ్! నువ్వు చూస్తా నే ఉన్నావు గదా! క్షణం తీరికలేని పని.. ఏంచేసేది చెప్పు?”
“అయ్యో..! నాకు తెలియందేముంది తల్లీ! మనవడి మాట చాతుర్యం నీకు చెబ్దా మని వచ్చా తల్లీ!”
“తమ్ముడితో గానీ, అన్నతో గానీ తప్పుగా ఏమన్నా మాట్లా డాడా ఏంది, పిన్నామ్?”
“మనపక్క బజారోళ్ళ బొమ్మ ఇరవై వేలంటమ్మా! పెద్దింటోళ్ళం కదా.. వాళ్ళకన్నా పెద్దబొమ్మను తెస్తే కదమ్మా, మన
పరువు నిలిచేది? మనోళ్ళ తలగొట్టేసే పనులు మనమే చేసుకుంటే అవతలోళ్ళకీ మనమంటే లెక్కుంటదా చెప్పు తల్లీ?!”
“అంటే,, అచ్చం బొమ్మకే ఇరవైవేలు దాటుద్దా పిన్నామ్!?”
“శేషమ్మ తల్లీ! ఇది దేవుడి కార్యం.. అట్లా లెక్కలేస్తే మనకొచ్చేది కూడా అట్లనే ఉంటది తల్లీ! ఈసారి మీ అదృష్టమేందో
తెలుసా!? ఇంతకు ముందు బొమ్మిచ్చినా గానీ.. అందరితో పాటు కలిసి పూజ చేయించుకోవలసొచ్చేది..”
“మరిప్పుడెట్లా చేస్తు న్నారు పిన్నామ్!”

పెండ్యాల గాయత్రి (106)


కథలు కనే కళ్ళు

“బొమ్మిచ్చిన వాళ్ళు మాత్రమే మొదటిపూజ, చివరిపూజ చేయించుకుంటారు. ‘అంత భక్తితో బొమ్మిచ్చినోళ్ళని


వొదిలేసి.. వట్టోళ్ళకి ఆ పుణ్యం ఎందుకు పోగొట్టా లి?’ అని కమిటీ కొత్త నిర్ణయం తీసుకుంది తల్లీ!”
“మరీ పూజ కమిటీ సేకరించిన చందాలతో జరిపిస్తా రా పిన్నామ్?!”
“హయ్యో..! పిచ్చితల్లీ! అప్పుడూ పుణ్యమంతా పావలా, అర్దరూపాయి ఇచ్చిన వాళ్ళకెళ్ళిపోద్దిగా తల్లీ! కాసీకెళ్ళీ,
ఇస్వనాధుడిని చూసిన వాడికి, పక్కనే ఉన్న ఇశాలాక్షిని చూడటం కష్టమవుతుందా చెప్పు?!”
“అంతేగా.. పిన్నామ్! నిండా మునిగినోడికి చలేంటి? ఉన్నదంతా ఊడ్చేసుకున్నోడికి ఖర్చేంది..???”
“అయ్యయ్యో..! తప్పు తల్లీ! తెలియక అన్నావు గానీ.. చెంపలేస్కోమ్మ! తధాస్తు దేవతలుంటారంటమ్మా! నా మనవడికి
ఉజ్జోగం వచ్చిందంటే ఆ గణపయ్య కృప ఉండబట్టే కదా తల్లీ!”
“ఇంతకీ, గణేషుని కృపతో ఉజ్జోగస్తు డైన నా కొడుకేమన్నాడు పిన్నామ్?”
“మనవడిదేముంది తల్లీ! చిన్నబిడ్డ.. దేవుడి పని ఏదైనా అనుకోకూడదు.. ఒకసారి అనుకున్నామా, అంతే.. ప్రాణాలొడ్డైనా
పూర్తి చేయాలి తల్లీ! కాదంటే కీడు జరుగుద్ది.. ఆ నిర్ణయమేదో మీ కుటుంబ క్షేమాన్ని తలచుకుని నువ్వే తీసుకో తల్లీ!”
“సరే పిన్నామ్! మా కుటుంబ క్షేమం కన్నా మిన్న ఏముంది చెప్పు..! నువ్వు కోరినట్లు గానే గణేెశ పూజకు ఏర్పాట్లు
చేయిస్తా .. సాయంత్రం అబ్బాయి మీ ఇంటికి వచ్చి, శుభవార్త చెపుతాడు., సరేనా?”
“నా తల్లే! నాకు తెలుసమ్మా! అటుచూడు..! స్వామి నిన్ని ఆసీర్వదిస్తూన్నాడు.. నువ్వా మాటనడం తోనే ఎంత వాన
కురుస్తోందో..! ఈ ఏడు పంటలన్నీ నీ పుణ్యానే పండుతాయీ తల్లీ! ఇహ నేను బయలుదేరతానమ్మా! పుల్లలు బయట ఎండేసి
వచ్చా,, తడిసిపోతాయి..”
“ఆఁఆఁ..! పోయిరా పిన్నామ్! పుల్లలు తడిచిపోతే ఎట్లా ? గ్యాస్ అయిపోద్ది...! గ్యాస్ అయిపోతే నీకు ఖర్చవుద్ది...!”
***
“పిన్నామ్... పిన్నామ్.... ఓ సూరమ్మ పిన్నామ్....! పిలుస్తూంటే ఆం..తున బడిపోతా ఉన్నావు.. యాడకి?”
“సిరోమణి గారింటికి పోతన్నాలే! మళ్ళొస్తా ..”
“ఏంది పిన్నామ్! అంత తొందర పనా ఏందీ? నిలబడకుండానే బోతన్నావ్..!”
“ఆ.. ఏం..లేదు, వాళ్ళకీ.. చేజారిపోయిందనుకున్న పొలం పోలీసు కేసులో తిరిగొచ్చిందంట లేమ్మా!”
“ఓహో! ఆ సంగతి అప్పుడే నీదాకా వొచ్చేసిందా? పోదువు గానిలే గానీ, ఓ ముచ్చట చెప్తా ఇటు కూర్చో!”
“ఊళ్ళో.. వినాయకుడి కమిటీ కొత్తదొచ్చిందంటనే.. ఆఁ నీకెప్పుడో తెలిసిపోయే ఉంటదిలే పిన్నామ్! ఊరందరి
బాగోగులు చూసే దానివి గదా...!!”
“పాపగాలం తల్లీ! పదేళ్ళ నుంచి నాబిడ్డ చేత గొడ్డు చాకిరీ చేపిచ్చుకొనీ.. కొత్త కొమ్ములొచ్చేలోకీ.. తప్పిచ్చేసారు. ఆ
దేవుడు చూడకపోతాడా...??”
“పాపం.. దేవుడు మాత్రం ఎంతమందిని చూస్తా డులే పిన్నామ్! ఆయనకున్నది గూడా రొండుకళ్ళేగా??”
“ఆ.. శేషమ్మా! అన్నట్టు మర్చిపోయా.. మాయటపూటా ఆ యేభై వేల కాగితం తీస్కొస్తా గానీ డబ్బులు
చూసిపెట్టు కోమ్మా! మూడేళ్ళవుతంది.. ముందు మనమనుకున్నట్టూ మూడురూపాయలు ఒడ్డీ తల్లీ..! మర్చిపోతావేమోననీ
ముందే చెప్తన్నా..!”
“అదేందీ! మా తమ్ముడు రాత్రి నీకు చెప్పలా?”

పెండ్యాల గాయత్రి (107)


కథలు కనే కళ్ళు

“ఎందుకు చెప్పడుగానీ.. నేనెవుర్ని పరామర్సించను బోయానో?”


“అదీ నిజమేలే పిన్నామ్! నీకసలే నాలుగు వేల కళ్ళుకదా!!!”
“ఏందమ్మాయ్! నీ ఇంటికొచ్చాననా ఏంది..! అట్ట మాట్టా డుతున్నావ్?”
“ఊళ్ళో వోళ్ళందరూ నీవోళ్ళనుకుంటావు గదా, నువ్వందరి మనిషివి గదా అని నేనంటే అట్లా ఉడుక్కుంటావేంది
పిన్నామ్.. చిన్నపిల్లలాగా..?!!”
“అదేమీ లేదులేమ్మాయ్! ఏదో పెద్దదాన్నిగదా కాస్త చాదస్తం లేమ్మా! అదేందో ముచ్చటన్నావూ.. ఏందమ్మా అదీ!”
“ఇయాల పొద్దు న్నే చాటింపు విన్నావా!?”
“ఆ ఈరిగోడూ మా ఇంటి కల్లి రాలేదట్టుంది తల్లీ! దేని గురించేసాడో మరీ!?”
కొత్త కమిటీ వాళ్ళూ కొత్తకొత్త నిర్ణయాలు తీసుకున్నారంట పిన్నామ్! పదేళ్ళనుంచీ ఉన్న పాత కమిటీ జాగర్త చేసిన
వినాయకుడి డబ్బంతా ఉపయోగించీ.. ఊరజెరువు పూడిక తీపిస్తా రంటా,. కమిటీ సభ్యులంతా ఒంగోలు పోయీ మునుస్పాలిటీ
వాళ్ళతోటి మాట్లా డీ చెరువుకి నీళ్ళు పెట్టిస్తా రంట, అంతేనా,, ఊళ్ళో కట్టొదిలేసిన టాంకీకీ మంచినీళ్ళు బెట్టిచ్చీ పంపులకి
నీళ్ళొదులుతారంట, ఈ ఏడు వచ్చిన చందాల తోటీ పిల్లల భరతనాత్యం ప్రోగ్రాము పెట్టిస్తా రంటా, పండగ నాడూ,, పూజైపోగానే
కుర్రోళ్ళంతా కలిసీ, చెరువు చుట్టూ ఉన్న గట్టు పైన మొక్కలు నాటుతారంటా, వచ్చే వినాయకచవితి లోపు యవరి మొక్కైనా
చచ్చిపోతే.. వాళ్ళు కమిటీకి పదివేల జెరిమానా కట్టా లంటా...!”
“పదిరకాల కూరలు చేసీ.. అలసిపోయీ... అన్నమొండటం మర్చిపోయిందంట వెనకటికి నాయంటిదొకటి. అట్టనే ఎన్ని
పనులు జేపిచ్చేంలాభం? ఒక్కడూ బొమ్మ తెచ్చేవాడు లేడూ, భక్తితో పూజచేసేవాడు లేడు.. అందుకేనేమో! మొన్నటినుంచీ
యడతెరుపు లేని వాన కురుస్తుంది. చేటు గాలానికి నీటి బెడదంటే ఇదేనేమో!?”
“వానకోసం అందరూ ఓనమాలు జపిస్తుంటే.. నువ్వేంది పిన్నామ్! చేటుగాలం, పోటుగాలం అంటావు? నేను చెప్పేది
పూర్తిగా చెప్పనియ్యవు?”
“నువ్వెన్నన్నా చెప్పమ్మాయ్! ఇవ్వన్నీ., తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేవే! మనిషన్నాకా కాస్త పుణ్యం, పురుషార్థం
ఉండాలీ..!!!”
“మనిషి నాలుకకు నరం లేదంటలే పిన్నామ్! ఏం చేస్తా మ్? పండగ ఎల్లుండేగా! రేపు సాయంత్రానికొచ్చీ వినాయకుడి
బొమ్మ తీసుకెళ్ళు..!”
“ఏందమ్మాయ్! బొమ్మలు చేసి అమ్ముతున్నారా?
“పచ్చకామెర్ల సామెత చెప్పనులే గానీ.. చెరువులో పూడిక తీపిస్తు న్నారని చెప్పాగా! ఆ మట్టితో గనేశ ప్రతిమలు
చేయించీ, ఊరు మొత్తా నికీ ఉచితంగా పంపిణీ చేయాలని, ఆ పనితనం ఉన్న పేద కళాకారులకు తన మొదటి జీతం ఇవ్వాలనీ,
మన బజారులో ఈసారి రంగులేని వినాయకుడిని ప్రతిష్టించాలనీ, స్వఛ్ఛమైన ఈ మట్టి ప్రతిమలన్నింటినీ మన ఊరు చెరువులోనే
నిమజ్జనం చేయాలని మా అబ్బాయీ, కొత్తకమిటీకి సూచించాడు.. కమిటీ వాళ్ళంతా ఈ మంచి పనులకు ఆనందంగా ఆమోదం
తెలిపారు. పని కూడా మొదలయ్యింది పిన్నామ్!”
“ఆహా! నా మనవడా,, మజాకా?! బొమ్మ తేవటానికి ఒంగోలెవురు బోతారా అనుకున్నా తల్లీ! ఇంకా దిగులు లేదు..
అబ్బాయికీ పుణ్యమొచ్చిద్దమ్మా!”

పెండ్యాల గాయత్రి (108)


కథలు కనే కళ్ళు

“నీ నాలుక లోపల గాలం పెట్టి గాలించినా నరం దొరకదులే గానీ.. బొమ్మ కొనే ఖర్చు తగ్గిందిగా! కాస్త ప్రశాంతంగా
పూజ చేసుకునీ, పుణ్యమో, పురుషార్థమో సంపాయిచ్చుకోపో...!!!”

(దైవం పేరుతో ధనాన్ని దోచుకోవాలని చూసే జనాలకు చురుకు తగిలించాలనుకుని వ్రాసిన ఈ కథ, 2019 వ
సంవత్సరంలో లిపి వారి వినాయక చవితి పోటీకొరకు ప్రచురితమయింది)

ఆశయం
మాతృత్వం ప్రతి స్త్రీకి లభించే పవిత్రమైన వరం. ఇది కాదనలేని నిజం. తుఫాను తరువాత వచ్చే ప్రశాంతతలా ప్రసవ
వేదననంతరం కలిగే ఆనందం అనిర్వచనీయమైనది. వర్ణనాతీతమైన ఆ సంతోషాన్ని నేను కూడా పొందుతున్నాను. మాతృత్వం
అనే మాధుర్యాన్ని అనుభవించబోతున్నాను. ఈ ఊహే ఎంతో అద్భుతంగా ఉంది.
అమ్మను కావడానికి చేసే పోరాటంలో స్పృహ కోల్పోయానేమో కళ్ళు తెరిచేసరికి జవహర్ నన్నే చూస్తు న్నాడు. ఆరాటంతో
కూడిన చిరునవ్వుతో మన పాప ఎక్కడ? అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశారాయన కళ్ళలోకి. అదిగో అంటూ తన కుడిచేతి ప్రక్కనున్న
మంచం మీదకు వంగాడు జవహర్.
ఈ ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా నేను ఆశ్చర్యంలో నుంచి తేరుకోకముందే, “మనకు ఇద్దరు పాపలు
పుట్టా రు సంహితా”అన్నారు రెట్టించిన ఉత్సాహంతో.
ప్రాణమున్న రెండు బొమ్మలు హాయిగా ఆడుకుంటున్నట్లు అనిపించింది నాకు.
“మన పాపాయిలు ఎంత ముద్దొస్తు న్నారో చూడండి”అన్నాను లేని శక్తిని కూడగట్టు కుంటూ.
నా మాట పూర్తి కాకముందే, “మరి ఏం అనుకున్నావు” అన్నట్లు తల ఆడించాడు.
కొద్దిసేపటి తరువాత నా దగ్గర కూర్చొని “మనకు మరో శ్లోక, సంహిత పుట్టా రు కదా!” అన్నాడు నా కళ్ళల్లోకి చూస్తూ.

పెండ్యాల గాయత్రి (109)


కథలు కనే కళ్ళు

ఆమాట వినగానే నా గుండె దడదడ లాడింది. భయంతో ఒళ్లంతా గగుర్పొడిచింది.


సనాతన హైందవాచారాలను తూ.చా తప్పక పాటించే వైదిక కుటుంబంలో కవలలుగా జన్మించాము నేను, శ్లోక.
నాన్నగారు శివాలయంలో అర్చకులుగా పనిచేసేవారు.
“ఒకే రూపురేఖలు ఉన్న రెండు బొమ్మలకు ప్రాణం పోసి మన ఇంట్లో విడిచి పెట్టా డు ఆ బ్రహ్మ” అనేవారు నాన్నగారు
మా ఇద్దరిని చూస్తూ. నన్ను శ్లోకను ఒక్కటిగా పెంచాలన్న ఉద్దేశంతో ఒకే రకమైన దుస్తు లు కుట్టించడం, ఒకే స్కూల్లో
చదివించడం, ఏ వస్తు వైనా ఇద్దరికీ తీసుకురావడం లాంటి పనులు చేసేవారు అమ్మ నాన్న. చదువుతోపాటు ఆట పాటల్లో కూడా
ముందుండే వాళ్ళము. నాన్నగారికి హిందూమతం అన్న మతాచారాలన్నా అమితమైన గౌరవం.
“పూర్వజన్మ సుకృతం వలన మనమంతా గొప్ప వంశంలో పుట్టా మని, అన్నింటికన్నా మన మతము కులము గొప్పవని,
అంటరాని వాళ్లకు దూరంగా ఉండాలని, బీదరికం అంగవైకల్యం కర్మ ఫలితం అని మత సాంప్రదాయాలను ఆచరించి తీరాలని”
చెప్పేవారు నాన్నగారు.
ఆయన చెప్పేదంతా కరెక్టే కదా అనిపించేది నాకు. ఉన్నత వంశంలో పుట్టినందుకు గర్వంగా భావించేదాన్ని.
శ్లోక మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తించేది. మనుషులందరిలోనూ ఒకే రక్తం ప్రవహిస్తు న్నప్పుడు పవిత్రము అపవిత్రము
అనే బేధం ఎందుకు? ఏ మతమైనా మానవత్వాన్ని బోధిస్తు న్నప్పుడు మనలో ఈ ఘర్షణలు ఎందుకు? ఆకలి తీర్చలేని ఆచారాలు
ఎందుకు? బాధితులకు సహాయపడని సంపద ఎందుకు? అంటూ నాన్నగారితో ఎదురాడేది.
నాన్నగారికి కోపం తెప్పించడం ఎందుకు అన్న నా మాటలకు మన ఆలోచనా విధానం సబబైనదేనా సంహిత? అని
ప్రశ్నించేది. ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండి పోయేదాన్ని.
శ్లోక తరగతిలో అందరితోనూ స్నేహంగా మెలిగేది. మతంతో ప్రమేయం లేకుండా అన్ని గ్రంథాలను పఠించేది.
బాధపడేవారికి తనకు చేతనైన సహాయం చేసేది. వీధిబాలలకు తన దుస్తు లు చిల్లర డబ్బులు ఇచ్చి చదువుకోమని చెప్పేది.
ఆడంబరాలకు దూరంగా ఉండి ధనాన్ని ఆదా చేసేది. బాధపడేవారిని ఆత్మీయంగా పలకరించేది. సంఘసేవను ప్రోత్సహించే రచన
చేసేది. అంతరాలు లేని సమాజ స్థా పనకు యువత నడుం బిగించాలి అంటూ ప్రసంగాలు ఇచ్చేది.
నాన్న ఆమెను మందలించని రోజు ఇంట్లో ఉండేది కాదు. అయితే నన్ను ఎంతో ప్రేమగా చూసేవారు, ‘నీకా ఈశ్వరుని
కృప లభిస్తుందమ్మా’ అనేవారు. ‘సంఘసేవ అంటూ సమస్యలు తెచ్చుకోవడం ఎందుకు శ్లోకా..’ అని బ్రతిమాలిన వినేది కాదు.
‘మనం చేసేపని, చెప్పేమాట కనీసం ఒక్కరికైనా ఉపయోగపడగలిగితే నిజమైన సంతోషాన్ని పొందుతాము. మన సంపద
ఏ ఒక్కరి దారిద్ర్యాన్ని రూపుమాపిన మనం సుఖంగా ఉన్నట్లు . మన పరామర్శ ఒక్కరి వ్యాధిని తగ్గించ గలిగిన మనం ఆరోగ్యాన్ని
పొందినట్లు . ప్రేమకు నోచుకోని ఒక్క అనాధను చేరదీసిన చాలు నిజమైన మాతృత్వాన్ని చవిచూసినట్లు . సుఖం సంతోషం
ఆరోగ్యం కన్నా మనిషికి కావలసిందేమిటి?’ అని ప్రశ్నించేది. ఒక తల్లికి తన నలుగురు బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరిక
ఉంటుంది. అందుకోసం ఎంతో కృషి చేస్తుంది. ఒక దేశ పౌరులు కూడా ఒక తల్లీబిడ్డలు వంటివారే కదా! అంటూ విశ్లేషించేది.
మేము ఎదుగుతున్న కొద్దీ నాన్నగారికి, శ్లోకకు భేదభావం పెరగసాగింది. ఇద్దరూ ఎవరి భావాలను వారు వదులుకోరు.
నాకేమీ పట్టనట్లు మిన్నకుండేదాన్ని . ఒకరోజు ఒక లేఖ వ్రాసి పెట్టి శ్లోక కట్టు బట్టలతో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆ లేఖలో ఇలా
ఉంది.
“సమాజమే నా ఇల్లు ,, దీన జనులే నా కుటుంబ సభ్యులు” అమ్మానాన్నా, చెల్లీ.. 20 సంవత్సరాలు మీ వద్ద పొందిన
ప్రేమను, అసలు ప్రేమ నోచుకోని అభాగ్యులకు పంచడానికి వెళ్తు న్నాను. నాన్నగారు మీ వద్ద ఉన్న ధనం మేం ముగ్గురం

పెండ్యాల గాయత్రి (110)


కథలు కనే కళ్ళు

జీవించడానికి సరిపోతుంది. ఇకనైనా దేవుని పేరిట చేసే దోపిడీని మానివేసి ఆయన ఉనికిని రక్షించండి. అనాథలను అక్కున
చేర్చుకొని ఆదరించే ఓ స్వచ్ఛంద సంస్థలో సభ్యురాలిగా చేరడానికి వెళుతున్నాను దయచేసి నన్ను మన్నించండి”
ఇలా రాసి ఉన్న లేఖను చదివిన నాన్నగారు బాధ పడకపోగా శ్లోకకు కర్మకాండలు జరిపించినంత పని చేశారు. ఆయన
లాగే దేవాలయంలో అర్చకునిగా పనిచేసే జవహర్‌తో నా పెళ్లి జరిపించాడు. శ్లోక విషయం అతనికి చెప్పవద్దని, చెబితే కాపురానికి
ముప్పని నన్ను హెచ్చరించాడు. గత ఐదు సంవత్సరాలుగా శ్లోకను ఉచ్చరించిన వాళ్లు లేరు.
‘ఈయనకు అక్క పేరెలా తెలిసింది, మైలపడిన దాని చెల్లినని నన్ను వెలివేయరు కదా’ అనుకుంటున్న నా ఆందోళనను
జవహర్ గమనించాడేమో!
“భయపడకు సంహితా.., శ్లోక మీ అక్క అని నాకు తెలుసు. సంఘసేవకై తన జీవితాన్ని అంకితం ఇచ్చిన త్యాగమూర్తి
శ్లోక. కష్టమైనా సరే తన ఆశయాన్ని సాధించడం కోసం అహర్నిశలు కృషి చేస్తోంది. సేవా సంస్థలకు విరాళాలివ్వడం కోసం నేను
హై దరాబాద్ వెళ్లినప్పుడు, నీ రూపురేఖలతో ఉన్న ఆమెను పలుకరించి విషయం తెలుసుకున్నాను. ఆ మానవతామూర్తి నేను
వెళ్ళినప్పుడల్లా మీ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటుంది. ఆమె ఆశయాన్ని మీరెవరు హర్షించకపోయినా నేను మనస్ఫూర్తిగా
అభినందిస్తు న్నాను” అంటున్న జవహర్ మాటలను విని నిర్ఘాంతపోయాను.
నేను చేసిన తప్పు ఏమిటో బోధపడింది. బానిసత్వం అంటే నాదేనేమో అనిపించింది. ‘ఇన్నాళ్లు నీవు చేసినదేమిటి? నీవు
పొందినదేమిటి? ఏమి సాధించావు నీ జీవితంలో!’ అని నా అంతరాత్మ ప్రశ్నించసాగింది. ‘ధర్మాధర్మాల విచక్షణ తెలిసి కూడా
అధర్మానికి అండగా నిలిచాను. నిజమైన ప్రేమకు నిర్వచనం ఎరిగి కూడా ప్రేమమూర్తికి దూరమయ్యాను. శ్లోక లాగా దేశానికి సేవ
చేయకపోయినా కనీసం దాని పవిత్రమైన ఆశయాన్ని ఇంట్లో ఏ ఒక్కరమైనా అభినందించి ఉంటే మాతో ఉంటూనే ఎన్నో
మంచిపనులు చేసేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను చేసిన తప్పుని దిద్దు కుంటాను. మరో మదర్‌గా అవతరించిన
శ్లోకను ఆదర్శంగా మలచుకొని కడుపు పంట అయిన నా బిడ్డలు ఇద్దరిని మానవతా మూర్తు లుగా తీర్చిదిద్ది నవసమాజ
నిర్మాణంలో భాగస్వాములుగా చేస్తా ను. ఈ క్షణం నుంచి నిజమైన అమ్మగా మారిపోతాను. నేను కన్న నా బిడ్డలు ఇద్దరు నా
దేశంలోని అనాధ బిడ్డలకు తల్లు లుగా మారాలి. ఇది నా ఆశయం! పవిత్రమైన నా ఆశయానికి జవహర్ ఆధారంగా నిలుస్తా డు!!!’
ఆలోచిస్తూ ఉండగా జవహర్ కల్పించుకొని అన్నాడు, “వారంరోజుల క్రితం కులాంతర వివాహం చేసుకున్న నా స్నేహితుని
భార్య ఒక బాబును ప్రసవించి మరణించింది. ఆవేదనలో రోడ్డు ప్రమాదానికి గురై నా స్నేహితుడు కూడా మరణించాడు. వెలివేసిన
ఆ జంటను చేరతీయని వారి తల్లిదండ్రు లు ఆ పసికందును కూడా పట్టించుకోలేదు. మన ఇంటికి ఆ బాబును తీసుకువద్దా మని
అనిపించినా నీవు అంగీకరిస్తా వో లేదోనని శ్లోక దగ్గర ఉంచాను. నీకు ఇష్టమైతే ఆ బాబును మన మూడవబిడ్డగా
పెంచుకుందామని ఉంది” అనడంతో నా కళ్ళు ఆనందంతో చెమర్చాయి నోట మాటరాక కళ్ళతోనే నా అంగీకారాన్ని తెలిపాను.

(ఆచార సంప్రదాయాలు అనుబంధాలను, ఆత్మీయులను దూరం చేసేటంత మూఢంగా ఉండకూడదనే ఆలోచనలో
ఉద్భవించిన ఈ కథ, 2008 వ సంవత్సరం ఆకాశవాణి విజయవాడ నుండి ప్రసారమయింది)

పెండ్యాల గాయత్రి (111)


కథలు కనే కళ్ళు

మంత్రదండం
“హెలో..లెక్కలమాస్టా రూ! మీ అదురుబాబు గుర్తు న్నాడా?... అదేనండీ... మీ ప్రియ శిష్యుడు సుధీర్ బాబు..!
మనందరం అదిరిపడే సాహసకార్యం చేశాడండీ... వాడు!”
‘నేను ఆ ఊరినుంచి బదిలీ అయ్యాక ఆరునెలలకి ఫోన్ చేసీ కనీసం క్షేమ సమాచారం కూడా అడగకుండా
సాహసకార్యాలు, చాకిరేవులు అంటాడేంటి రాజశేఖర్?’ అనుకుంటూ, “ఏంటి మాస్టా రూ.. ఎలా ఉన్నారు? ఇన్నాళ్ళకి నేను
గుర్తొచ్చానన్నమాట!” నవ్వుతూ అన్నాను.
“అవును మాస్టా రూ! మిమ్మల్నెక్కడ మరచిపోతామో అనీ మీ శిష్యవీరుడు గుర్తు చేశాడు”
అతడి మాటలోని వ్యంగ్యం నా చెవిని దాటిపోలేదు కానీ, వరడు వ్యక్తిత్వంతో వాదన అనవసరమనిపించి, “పోన్లెండి..
పిల్లవాడికన్నా గుర్తు న్నాను..” అన్నాను.
“అదే.. అదే మీ కొంప ముంచింది..”
“అర్థమయ్యేట్లు చెప్పండి!”
పిల్లలూ.. పిల్లలు అని, వెంటేసుకుని పిచ్చిపిచ్చి పిట్టకథలన్నీ చెప్పారుగా! అందుకనే కాబోలు! మిమ్మల్ని పోలీసులకి
పట్టిస్తు న్నారు”
ఆ మాటకి ఓ క్షణం కంగారు కలిగినా,. అతడి అతిశయ స్వభావం ఎరిగినవాడ్ని కాబట్టి, “పిల్లల కోసం పోలీసుల
దగ్గరకేంటి? ప్రధానమంత్రి దగ్గరకెళ్ళడానికైనా వెనకాడను” నిశ్చలంగా చెప్పాను.
“అవునా..అయితే బస్సెక్కండి! పావుగంటలో ఇక్కడుండాలని ఎస్.ఐ గారు చెప్పారు..”
“అసలేం జరిగింది?”
“కోప్పడకండి సార్! చెప్పాగా మీ శిష్య సుధీరుడి సాహసకాండని.. బయలుదేరి మా బడికాడకొచ్చేయండి!” కాల్
కట్‌చేశాడు.
మిగతా టీచర్లకి ఫోన్ చేసి విషయం కనుక్కుందామనిపించినా.. అసలక్కడికి వెళితేగానీ స్పష్టంగా తెలియదులే
అనుకునీ, ప్రధానోపాధ్యాయులుగారి అనుమతి తీసుకుని బస్సెక్కాను.

పెండ్యాల గాయత్రి (112)


కథలు కనే కళ్ళు

మేడిపండు మాదిరి మిసమిసలాడుతున్నట్లు సీట్లో కూర్చున్నానే గానీ.. మనసు మజ్జిగ కవ్వంలా ముందుకూ వెనక్కీ
గిరికీలు కొడుతోంది. ఈ రాజశేఖర్ నాతో కలిసి నాలుగేళ్ళు పనిచేశాడు. ఇద్దరమూ ఒకే సబ్జక్ట్ టీచర్లమేగానీ, వ్యక్తిత్వాలు మాత్రం
ఉత్తరదక్షిణాలు. ఉత్తమ విద్యార్థు లను తయారు చేయడం నా ధ్యేయమయితే, ఉత్తముల వరల్లో మెత్తగా కత్తు లు దూర్చడం
అతడి నైజం. బదిలీ చేయించుకుని సొంతూరు దగ్గరకొచ్చి అతని పీడవదలించుకున్నాననుకున్నా.. కానీ, పిల్లలచేత యసరు
పెట్టిస్తా డనుకోలేదు. ఇప్పుడేమవుతుందో ఏంటో? గుండె సడి పెరిగింది.. దడదడగా ఉంది.
“టికెట్స్..!” అరిచిన కండక్టర్ మాటతో మేలుకుని, పర్స్ తీస్తుంటే, “బావున్నారా.. సార్!” పలకరింపుకు తలెత్తి
చూసాను.
“నేను మీ స్టూడెంట్‌ని సార్! ఇటీవలే ఈ ఉద్యోగమొచ్చింది. లెక్కలంటే లాడెన్‌ని చూసినట్లు వణికిపోయే నేను, మీరు
చెప్పే కథల కోసమే కష్టపడి లెక్కలు చేసేవాణ్ణి. అవే ఇప్పుడు నాకన్నం పెడుతున్నాయి సార్!” అంటున్న కండక్టర్‌ని చూస్తూ
చిరునవ్వు నవ్వాను.
“చాలా సంతోషమయ్యా!” అంటూ టికెట్ తీసుకున్నా.
ఆ అబ్బాయి మాటలు మండువేసవిలోని మెండు జల్లు ల్లా గుండెను చల్లబరిచాయి. అవును, ఎక్కువమందికి
కష్టమనిపించే గణితాన్ని ఇష్టం చేయడం కోసం నేను ఎంచుకున్న కిటుకు అదే... లెక్కలు చెప్పేముందు ఓ కథ మొదలుపెట్టి
ఉత్కంఠ రేగేటప్పుడు ఆపేస్తా .. లెక్కలు చేసినవాడికే మిగతా కథ,, అని ఊరిస్తా . ఆ పాచిక చాలామందిపై పనిచేస్తోంది. పన్నెండేళ్ళ
నా వృత్తి జీవితంలో లెక్కలనైనా లెక్కచేయని పిల్లలున్నారు కానీ, నా కథలను కాదన్నవాడు, కథలంటే పారిపోయేవాడు సుధీర్
బాబు ఒక్కడే. బస్సు ముందుకు సాగుతుంటే, నేను నెమ్మదిగా వెనక్కి గతంలోకి జారిపోయాను.
***
సుధీర్‌బాబు 6 వ తరగతిలో చేరిన రోజు భేతాళుడి కథొకటి మొదలుపెట్టా ను.
“రాకుమారిని మాంత్రికుడెత్తు కుపోయాడు” అనేటప్పుడే వణుకుతున్నాడు.
విషపాములు, సింహాలు దగ్గరకొచ్చేసరికి బ్యారుమని ఏడుపందుకున్నాడు.
దగ్గరకు పిలిచి, “నీపేరేంటి బాబూ!” అన్నా.
ఏడుస్తూనే, “సు.దీ..రూ బా..బూ..” చెప్పాడు.
అతి కష్టమ్మీద వాడి పేరునర్థంచేసుకునీ, “ఇలా ఏడ్చావంటే అదురుబాబు అని పిలుస్తా ” అని చెప్పి కూర్చోపెడుతుంటే,
ఒకమ్మాయి లేచి, “వాడు చిన్నప్పట్నుంచీ అంతే సార్! వొట్టి పిరికోడు..” అంది చేతులతో అభినయిస్తూ.
“నీపేరేంటీ! ఏ కథ చెప్పినా నువ్వు ధైర్యంగా వింటావా?” అడిగా.
“నా పేరూ మృదుల సార్! నాకూ దెయ్యాల కథలన్నా గూడా బయ్యంలేదు..”
మృదుల మాటవిన్న సుధీర్, “అమ్మో దెయ్యాలు..” అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టా డు.
వాణ్ణి ఓదార్చటానికి ఆ క్లా సంతా సరిపోయింది. ఇహ ఆ క్లా స్లో ఎప్పుడు కథ మొదలెట్టినా అదే తంతు
అవుతుండడంతో, “ఒరేయ్.. నువ్వు ఏడ్చావంటే భేతాళుడొచ్చీ నీ తలను వెయ్యి ముక్కలు చేస్తా డురా! ఇక నీ ఇష్టం” అని
చెప్పడంతో ఏడుపాపేశాడు. హమ్మయ్య.. ఈ మంత్రం పారిందిలే అనుకున్నా.
తరువాతి రోజు కథ చెప్తుంటే, కదలకుండా కట్టేసినట్లు కూర్చున్నాడు. కథ ఐపోయాకా, “చూశావా మృదులా! మన
సుధీర్ ధీరుడైపోయాడు” అన్నాను.

పెండ్యాల గాయత్రి (113)


కథలు కనే కళ్ళు

“సార్..మరీ..వాడూ..!” దీర్ఘాలు తీస్తోంది.


“ఊ..చెప్పూ! నువ్వు ధైర్యవంతురాలివి కదా..!” అంటుండగానే,,
మనోజ్ లేచి, “వాడు పాసుపోశాడు సార్!” అన్నాడు.
“మరిందాకట్నుంచీ చెప్పలేదేంట్రా?” గర్జించాను.
“మీరూ.. కథ ఆపేస్తా రనీ..” నలుగురు పిల్లలు గొణిగారు.
“ఇలాగైతే ... ఎలారా?! సాహసాలు చేయాలి, సమస్యలనధిగమించాలి గానీ, ఎన్నాళ్ళనిలా పాసులు పోసుకుంటూ
కూర్చుంటావ్?”‌అనడిగాను.
ఇహ ఆరోజు క్లా సంతా ఆ గడబిడతోనే ఐపోయింది. అప్పటినుండీ వీలైనంతవరకూ వాణ్ణి నాతోనే ఉంచుకుంటూ
ధైర్యం నింపే ప్రయత్నం మొదలెట్టా ను. పిల్లలంతా వాడి అసలు పేరు మరచిపోయి అదురుబాబూ అని పిలవటానికి అలవాటు
పడ్డా రు. లెక్కలు చాలా బాగా చేసేవాడు కానీ, వాడి ఏడవతరగతి అయిపోయినా ఆ బిడియం మాత్రం పోలేదు.
నేను బదిలీపై వచ్చేరోజున, “మీరు వెళ్ళొద్దు సార్!” అంటూ కాళ్ళకడ్డంపడి ఏడ్చాడు.
నాలుగు ధైర్య వచనాలు చెప్పి వచ్చేశాను.
***
బస్సు కుదుపుతో ఆగగానే కంగారుగా అటూ ఇటూ చూసాను ఆలోచనలతోనే.
అలాంటి సుధీర్ బాబు సాహసం చేశాడా? ఏం చేసుంటాడు? ఈ రాజశేఖర్ ఏదైనా వాడిమీద కల్పించాడా?
“సార్! స్కూల్ వచ్చేసింది..” కండక్టర్ పిలవడంతో, ప్రశ్నల పరంపరకు, తనకు వీడుకోలు చెప్పి బడిలోకి అడుగుపెట్టా ను.
నన్ను చూడడంతోనే నలుగురు పిల్లలు పరుగున వచ్చి, “సార్! మరే అదురుబాబు, మృదుల లేచిపోయారు.. మీకు
తెలుసా?” అదేదో పదవ ప్రపంచవింత అన్నట్లు ఆత్రంగా చెపుతున్న వాళ్ళ మాట వినటానికి కంపరమొచ్చి కసురుకున్నాను.
ఆపీస్ రూమ్ ముందు ఇద్దరు పోలీసులు, టీచర్లు , కొందరు పెద్దవాళ్ళు ఏదో సమావేశం జరుపుతున్నట్లు
నిలబడున్నారు.
నేను అక్కడికి చేరుకోగానే, “రండి సార్..! బావున్నారా! మీకోసమే చూస్తు న్నాం..” క్షేమ సమాచారమడుగుతూనే
క్షవరం చేసినట్లు న్న ప్రధానోపాధ్యాయుల మాటకు స్పందనగా పెదాలు సాగదీశాను.
బోనులో నిలబడ్డ దోషినన్నట్లు అందరి కళ్ళూ రెప్పార్పకుండా నన్నే చూస్తు న్నాయి. హెచ్.ఎమ్ గారు ఏవో కాగితాల
కవర్లు నా చేతికిస్తూ, “సార్! ఇవి చూడండీ!” అంటుండగా,,
“ఎనిమిదో తరగతి పిల్లలు ఈ పని చేశారంటే ఏమనుకోవాలి?” ఓ టీచర్ నిశ్శబ్దా నికి తెరతీశారు.
“కొందరు కాని ఉంటారు,, కబుర్లు చెప్పి పిల్లలను చెడగొడతారండీ!” రాజశేఖర్ గొంతు కలిపాడు.
ఇక ఒకరి తరువాత ఒకరు తోచింది మాట్లా డడం మొదలెట్టా రు. అదంతా గమనిస్తూనే కవర్లను పరిశీలించాను.
“అదురుబాబుననీ, బెదిరిపోతానని అందరూ నన్నెగతాళి చేశారు కదూ! నాకూ దమ్ముందని నిరూపించడం కోసం ఓ
సాహసకార్యం చేస్తు న్నాను. ఇప్పుడు మీరందరూ అదిరిపడతారు అదేంటో చెప్పనా.. నేనూ, మృదుల కలిసి ఈ బడీ, మా ఇళ్ళు,
ఊరు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతూన్నాం. మమ్మల్ని వెతికించే ప్రయత్నం ఎవరూ చెయ్యొద్దండి! ఈ కవరు లోపల ఇంకొన్ని
వివరాలున్నాయి.. వాటిని భరత్ సార్ మాత్రమే చదవాలి. మీరెవరైనా చదివితే మీ తలలు వెయ్యి ముక్కలవుతాయి జాగర్త! ఇది
భేతాళుడి మాట.. దీనికి తిరుగులేదు” అని కవరుపై రాసి ఉంది.

పెండ్యాల గాయత్రి (114)


కథలు కనే కళ్ళు

మరో రెండు కవర్లపై చూశా, అంతే రాసుంది. ఒళ్ళు మండిపోయింది. వీడు వెళ్ళేది కాక, నన్నిరికించి వెళతాడా?
అనుకుని ప్రశ్నార్థకంగా హెచ్.ఎమ్ వైపు చూశాను.
“ఉదయాన స్కూల్‌కి వచ్చి సైన్ చేస్తోంటే నా టేబుల్‌పై ఈ కవరు కనిపించింది మాస్టా రూ! మిగతా టీచర్లకు చూపించి
పిల్లల గురించి వాకబ్ చేస్తుండగా మా ఇంట్లో కవరు దొరికిందంటూ సుధీర్, మృదులల తల్లిదండ్రు లొచ్చారు. ఎందుకైనా
మంచిదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చానండీ! వాళ్ళ సలహాతో డి.ఇ.ఓ గారికి సమాచారమందించాము, ఆ తరువాతే మిమ్మల్ని
పీలిపించాను..” చెప్తు న్న హెచ్.ఎమ్‌తో,
“మరీ కవరు తెరచి చూడలేదా సార్!” అంటుంటే..,
పోలీస్ అందుకునీ, “కేస్ బుక్ అయింది కదయ్యా! అందులో ఏముందో నువ్వే చూడు” అన్నాడు.
“ఇదెక్కడి గోలండీ! నేనేమైనా ఈ బడిలో పనిచేస్తు న్నానా?” తలపట్టు కున్నాను.
“మీకే ఇబ్బందుండదు సార్! మేమంతాలేము? ముందు తెరవండి!” ఇంగ్లీష్ మాస్టా రు నా భుజాలను చుట్టేశాడు.
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలోని క్లైమాక్స్ చూస్తు న్నట్లు ఉత్కంఠను ఉగ్గబట్టి, నిశ్చేష్టు లై నన్నే చూస్తు న్నారందరు. ఇక తప్పక,
తప్పించుకోలేక వణుకుతున్న చేతులతో ఒక కవర్ చించాను.
“గెట్టిగా చదవండి.. అందరికీ వినపడాలి..” గుంపులోంచి ఒక గొంతు అరిచింది.
ఏడవకుండా కథ వినమన్నానని క్లా స్ రూమ్‌లో మూత్రం పోసిన అప్పటి సుధీర్ గాడి పరిస్థితికి, ఇప్పటి నా స్థితికి పెద్ద
తేడా ఉన్నట్లనిపించట్లేదు. లోపల ఏం రాసుందో ఏమో! చదువైపోయేదాకా నా బట్టలు భద్రంగా ఉంటే అదే పదివేలు.
“కానియ్యండి సార్! ఇంతమందిని నిలబెట్టి ఏందో అలోచిస్తా ఉన్నారు..!?” పోలీస్ గదమాయించాడు. కాగితం మడత
విప్పాను. గొంతు సవరించుకుని.. మొదలుపెట్టా ను.
“నాకు గుండె ఉందని తెలియజేసే కథలు జెప్పిన భరత్ సార్! మీకొక కథ చెప్పాలనుకుంటున్నా.. కానీ, పేరేం పెట్టా లో
తెలీయలా..”
“ప్రేమకథ...” దీర్ఘం తీశారెవరో.
“మధ్యలో మూలిగేవోళ్ళెవురైనా ఈడనుంచెళ్ళిపోండి!” పోలీస్ హెచ్చరించాడు.
“నాకు తెలిసిన ఈ కథ మీకు జెప్పకపోతే నా తల వెయ్యి ముక్కలైపోద్ది సార్! మీరు జేప్పే కథల్లో మాంత్రికుడు
దొంగోడు కదా! ఈ కథలో దొంగోడి కోసం నేను పదివేలు దొంగతనం చేశాను. ఇదే నా మొదటి సాహసం..” ఎవరో మాట్లా డబోతే
పోలీస్ వారించాడు.
“మీకథలో వాడు రాజకుమారిని ఎత్తు కుపోతాడు, ఈ కథలో రాజే దొంగోడై పేదకుమారిని ఏడిపిస్తంటాడు.
మాంత్రికుడు దొంగోడంటే ఎవురన్నా నమ్ముతారు గానీ, రక్షించాల్సిన రాజే మాంత్రికుడయ్యాడంటే ఎవురూ నమ్మరుగా.. అందుకే
పాపం ఆ పేదకుమారి ఎవురికీ చెప్పకుండా ఏడుస్తుంటే ఏంచెయ్యాలి? రాజునెదిరిస్తే తల తెగిపోద్ది. అందుకనీ మంచి
మాంత్రికుడొచ్చీ దొంగచాటుగా అంతఃపురంలోని పేదకుమారినెత్తు కుపోవాలి. అప్పుడు మాంత్రికుడిదే విజయం కదా సార్!
అందుకే నేను మాంత్రికపక్షంలో చేరిపోయి రెండవ సాహసం చేశాను. రాజుకు దొరక్కుండా, రాజుకు తెలియకుండా ఆయన్ని నా
మంత్రదండంలో బంధించేశా. ఇక పేదకుమారిని ఎత్తు కుపోయే మార్గం తెరుచుకుంది. ఇప్పుడు ముచ్చటగా మూడవ సాహసం
చేశా భయపడకుండా. నేనిప్పుడు అదురుబాబును కాదు సార్! వీరాధివీరుడైన సుధీరుడని. ఈ కథ మీరు చెప్పే కథలాగా గొప్పగా
తయారు చేయటానికి నేనూ, మృదుల కలిసి మూడురోజులు కష్టపడ్డా ము. తప్పులేమైనా ఉంటే సరిదిద్దండి సార్! ఇప్పటిదాకా

పెండ్యాల గాయత్రి (115)


కథలు కనే కళ్ళు

ఓపికగా నా కథ విన్నందుకు.. కాదు..కాదు, చదివినందుకు మీకొక పరీక్ష పెడుతున్నా.. నా మంత్రదండంలో బంధించబడిన ఆ


రాజును విడిపిస్తే మంత్రదండాన్ని మీకు బహుమతిగా ఇచ్చేస్తా ను. ఒకవేళ మీకు తెలిసికూడా అతడిని విడిపించకపోయారో..
తెలుసుగా... భేతాళుడి మాట..! ఈ కథ పక్కనే మీ బహుమతి కూడా ఉంది చూడండి. ఇక ఉంటాను సార్...టాటా!”“
చదవడం పూర్తయ్యేసరికి నా గొంతు గద్గదమయింది.
“మీకెవురికన్నా ఏమన్న అర్థమయిందా?” పోలీస్ అడగడంతో అందరూ పెదవులు ముందుకు విరిచి ఆలోచనలో
పడ్డా రు.
“బహుమతంటున్నాడు అదేంటో చూద్దాం” అంటూ ఇంగ్లీష్ టీచర్ నా చేతిలోని కవర్ తీసుకోబోయేసరికి ఓ మెమోరి
కార్డ్ కిందపడింది.
వంగి అది తీసుకుంటుండగా కార్ హారన్ మోగింది. “హా! డి.ఇ.ఓ గారొస్తు న్నారు...!” అంటూ స్టా ఫ్ అంతా
ఆయనకెదురెళ్ళి లోపలకి తీసుకొచ్చాక.. హెచ్.ఎమ్ గారు జరిగిందంతా వివరించి నా చేతులోని కాగితాన్ని ఇచ్చి చదవమన్నారు.
“వామ్మో భరత్ గారూ! నా తల వేయి వక్కలయిపోద్దేమోనండీ” అంటూ నవ్వి అంతా చదివాకా,,
“అమ్మో..వీళ్ళు పిల్లలేనా! ఆ మిగతా రెండు కవర్లలో ఏముందో చూశారా!?” అనడంతో ధైర్యంగా రెండు కవర్లను
చించాను.
అచ్చు కూడా తేడా లేకుండా అవే అక్షరాలు.. ఇందాక ఏడిపించినవే కదా... ఇప్పుడేమో ముచ్చట గొలుపుతున్నాయి
చిత్రంగా.
“మరి ఆ మెమోరీ మంత్రదండంలో ఏ మోడ్రన్ మాంత్రికుడున్నాడో చూడండీ!”
మాంత్రికుడు కాదు సార్! మోడ్రన్ మహరాజున్నాడు” అంటూ అధికారి అనుమతి కోసమే అన్నట్లు చూస్తు న్న ఇంగ్లీష్
టీచర్ మొబైల్‌లో సెట్ చేస్తోంటే,,
“స్కూల్లో టీవీలు, కంప్యూటర్లు ఉన్నాయి కదయ్యా.. వాటిలో పెట్టండీ! అందరూ చూస్తా రుగా!” అనడంతో క్షణాల్లో
సిధ్ధంచేసి అందరినీ పిలిచారు ఇంగ్లీష్ టీచర్.
అందరిలోనూ ఊపిరాడని ఉత్కంఠ. శ్వాస అయినా తీసుకుంటున్నారో, లేదో అన్నంత నిశ్శబ్దం...
‘ముఖ్యమంత్రిగారి వీడియో కాన్ఫరెన్స్‌కి కూడా ఇంత సిన్సియర్‌గా హాజరవరేమో మావాళ్ళు..!’ ఆలోచిస్తూ
నడుస్తు న్నా.
“కథ చెపుతాను, ఊకొడతారా..ఉలిక్కి పడతారా” ఉత్సాహంగా ఉయ్యాలూగబోతే ఉప్పెనొచ్చినట్లూ, నా మొబైల్ కూడా
ఇప్పుడే మోగుతోంది. దాని పీక పిసికేయాలన్నంత ఆవేశంగా బయటకు తీద్దు ను కదా.. నా శ్రీమతి నుండి ఆ ఫోన్ కాల్. అప్పుడు
గుర్తొచ్చింది.. ఇవాళ నా కూతురికి జ్వరం రావడంతో శలవు పెట్టమని శ్రీమతి అడగడం, నా పరీక్ష ఉందని, శలవు వీలు కాదని
చెప్పి నేను వచ్చేయడం, పాపతో ఆమె హాస్పిటల్‌కి వెళ్ళడం జరిగిపోయాయి. ఇక తప్పదులే అనుకుని బయటే నిలబడి
వివరాలడిగి, జాగర్తలు చెప్పీ, మారాం చేసే కూతురిని బుజ్జగించి లోపలికెళ్ళబోతుంటే,,
“నువ్వసలు మనిషివేనా! ఆ బిడ్డలు నీ కూతుళ్ళకన్నా చిన్నవాళ్ళే! గురువంటే తండ్రి సమానుడంటారే! ఛి..ఛీ.. నీ ముకం
చూడలేకపోతూన్నా” కంప్యూటర్ రూమ్ లోంచి వినపడుతున్న డి.ఈ.ఓ మాటలు పాఠశాల ప్రాంగణమంతా ప్రతిధ్వనిస్తు న్నాయి.
“సస్పెన్షన్ ఆర్డర్ రెడీ చేయండి.. ఇంకా ఆలోచిస్తు న్నారేంటండీ.. ఈ నీచ కీచకుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి.” ఆజ్ఞ జారీ
చేసి డి.ఈ.ఓ గారు బయటకు వచ్చారు.

పెండ్యాల గాయత్రి (116)


కథలు కనే కళ్ళు

గ్రీష్మకాల సూర్యుడిలా రగిలిపోతున్న ఆయనను పలకరించటానికి ధైర్యం చాలలేదు.


నన్ను చూసి కొంచెం శాంతించి, “భరత్ గారూ! మిమ్ములనపార్థం చేసుకున్నానండీ!” అంటూ నాకు చేయందించారు.
“అయ్యో.. ఎంతమాట సార్! మీరు పెద్దలు అలా అనకూడదు.” అన్నాను.
“అయినా పిల్లలెంత సమయస్ఫూర్తిని ప్రదర్శించారండీ! వాళ్ళ సాహసం అమోఘం.. కర్ర విరక్కుండా పామును
పట్టించారు. హృదయపూర్వకంగా అభినందించాలండీ మన పసి సాహసవంతులను” డి.ఈ.ఓ గారు అంటుంటే,
హెచ్.ఎమ్ కల్పించుకుని,
“ఈ ఘనతంతా మన భరత్ మాష్టా రికి చెందుతుందండీ! ఎన్నెన్నో నీతి, సాహసకథలు చెప్పీ పిల్లల్లో ఇంతటి విచక్షణను
కలిగించారు” అంటుండగా..
“అవును సార్! భరత్ సార్ చెప్పే కథల వల్లనే నాకింతటి ధైర్యం వచ్చింది..”
చెప్తు న్న సుధీర్‌ను చూస్తూనే హత్తు కునీ, “అరేయ్!మీరొచ్చేశారట్రా! ఎక్కడికెళ్ళారో అని కంగారు పడుతున్నాం..” ఇంగ్లీష్
టీచర్ సంతోషం వ్యక్తం చేశారు.
“మేమెక్కడికీ వెళ్ళలేదు సార్! బడెనకాల దాక్కున్నాం..” అంటూ ఓ సెల్ఫోన్ హెచ్.ఎమ్ గారికిచ్చాడు సుధీర్.
“వామ్మో! అదురుబాబూ.. మమ్మల్నందరినీ హడలెత్తించేశావు కదరా! ఈ ఫోనెవరిదీ?” అంటున్న హెచ్.ఎమ్ ను
వారిస్తూ,,
“వాడింకా అదురు బాబేంటండీ! భరత్ గారి కథలు వినీవినీ సు..ధీరుడైపోతేను” అంటూ భుజం తట్టిన సోషల్ టీచర్తో,
“ఒక ఆదివారం రాజశేఖర్ సార్ మాచేత సారా తెప్పించుకునీ తాగుతుంటే ఆయన పర్స్‌లో ఉన్న పదివేలు కొట్టేసి ఈ
ఫోన్ కొన్నాను సార్! మృదులనే కాక అమ్మాయిలను ఏడిపించడం చూసి, ఆయనతో మంచిగా ఉంటూ ఇలా చేశాను. ఎలాగైనా
ఆ సార్ చేసే తప్పు పనులు మీకందరికీ తెలియచేయాలని మృదుల సహాయంతో ఈ సాహసం చేశాను . తప్పైతే సారీ సార్!”
అంటున్న సుధీర్‌ను కౌగిలించుకున్న డి.ఈ.ఓ గారు, “చాలా మంచిపని చేశావు నాన్నా! నీలాంటి ధైర్యవంతులు, భరత్
గారివంటి బాధ్యతాయుత వ్యక్తు ల అవసరం నేటి సమాజానికి ఎంతో ఉంది. ప్రగతి పేరుతో ప్రాచీన సాహితీ సంపదను నిర్లక్ష్యం
చేస్తు న్నందునే మనుషుల్లో మృగ ప్రవృత్తి పెట్రేగిపోతోంది. ఆ కల్పిత కథలలోనే సమాజాన్ని సజావుగా నడిపించే మంత్రదండం
దాగుందని.. నీ సాహస చర్య ద్వారా నిరూపించావు. నిన్ను ప్రతిభా అవార్డ్‌కి సిఫారస్ చేస్తా ను సుధీర్!” అంటున్న డి.ఈ.ఓ గారి
మాటలకు అందరూ చప్పట్లతో అభినందించారు.

(ఉపాధ్యాయులు, విద్యార్థు ల మధ్య ఉండవలసిన సుహృద్భావ స్తితిని వాంఛిస్తూ వ్రాసిన ఈ కథ, 2018 వ సంవత్సరం
ఈనాడు వారి తెలుగు వెలుగు మాసపత్రికలో ప్రచురితమయింది)

పెండ్యాల గాయత్రి (117)


కథలు కనే కళ్ళు

ప్రకాశం జిల్లా రచయితల సంఘం ద్వారా కవితా పురస్కారం పూజ్య గురువులు సినారే గారి చేతుల మీదగా తేజా ఆర్ట్స్
అందుకుంటున్న దృశ్యం. క్రియేషన్స్ వారి రాష్ట్రస్థా యి పురస్కారం-2015
అందుకుంటున్న దృశ్యం.

ప్రభుత్వం జిల్లా స్థా యి ఉగాది పురస్కారం - 2016 ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి ద్వారా గిడుగు రామ్మూర్తి
అందుకుంటున్న దృశ్యం. పురస్కారం -2022 అందుకుంటున్న దృశ్యం.

రచయిత్రి పరిచయం

పెండ్యాల గాయత్రి (118)


కథలు కనే కళ్ళు

రచయిత్రి: పెండ్యాల గాయత్రి 

తల్లిదండ్రు లు: శేషమ్మ, సుబ్బారావు గార్లు . 

భర్త: హేమేంద్ర అడుసుమల్లి. 

సోదరుడు: అరవింద్. 

కుమారుడు:

వృత్తి: తెలుగు ఉపాధ్యాయిని,

        జి.హెచ్.ఎస్ సింగరాయకొండ. 

రచనలు: శతాధిక కవితలు, అర్ధ శతాధిక కథలు, ఆరు నాటికలు, “దివ్యపథం” నవల. 

పురస్కారాలు: జిల్లా కలెక్టరుగారందించిన ఉగాది పురస్కారం - 2012 

                    నెల్లూరు వారి సత్యశ్రీ పురస్కారం - 2014 

                    తేజా ఆర్ట్స్ క్రియేషన్స్ వారి రాష్ట్ర స్థా యి పురస్కారం - 2015 

                    జిల్లా స్థా యి ఉగాది పురస్కారం - 2017 

                    పెరసం నెల్లూరు వారి పెంచల నాయుడు పురస్కారం - 2020 

                    జిల్లా స్థా యి గిడుగు రామ్మూర్తి పురస్కారం - 2022 

                    మరియు వివిధ పోటీలలో బహుమతులు. 

ఫోన్: 8985314974

పెండ్యాల గాయత్రి (119)

You might also like