You are on page 1of 2

“సత్యవతి కధలు” – గతం లో “ మెలకువ” అనే ఒక్క సంపుటి తప్ప మరేమీ చదవలేదు.

అప్పుడు ఆ సంపుటిలోంచి

“నేనొస్తు న్నాను” అనే ఒక్క కధ గురించి నాలుగు మాటలు సారంగ లో రాశాను కూడా. ఆ మధ్య నెల్లూ రు బుక్ ఫెస్టివల్

లో “ సత్యవతి కధలు” సమగ్ర సంపుటాన్ని మెరిసే కళ్ళతో చూశాను..ఇష్ట ం గా కొనుక్కున్నాను.

చదవడం పూర్తి చేసి నాల్రో జులయింది. కానీ మనసంతా ఆ కధల్లో నే ఇంకా. జీవనపర్యంతమూ వదలని సుగంధం లో

మునకలేయించే కధలు. ముకుతాడేసి మరింత మంచి మానవులుండే కాలం లోకి మనల్ని నడిపించుకుపో యే

కధలు.వస్తు శిల్పాల నడుమ సమన్వయం అప్రయత్నంగా సహజసిద్ధంగా అలా అలవోకగా కుదిరిన కధలు. మళ్ళీ

మళ్ళీ చదువుకోవాలనిపించే, మనం మనలోకి చూసుకోవాలనిపించే , కాస్త లోపలా బయటా శుభ్రంచేసుకోవాలనిపించే

కధలు. ఇన్నాళ్ళ చదువూ సంస్కారం సాహిత్యమూ చొప్పకట్టే లతో మనకు సంక్రమించిన మధ్యతరగతి పురుషస్వామిక

సమాజపు దరిద్రా ల్లో ంచిమనం(స్త్ర్రీ పురుషులిద్ద రమూ కూడా) వదిలించుకున్నామని అనుకుంటూన్నవాటి శాతం ఎంత

అత్యల్పమో తెలియజెప్పే కధలు.

నా వరకు నాకైతే ఒక్కో కధా ఒక్కొక దెబ్బ కొట్టింది. ఓ కధ చెవుల్మెలేస్తు ంది. ఓ కధ మొట్టికాయ వేస్తు ంది. ఓ కధ చాచి

చెంప మీద ఒక్కటిస్తు ంది..ఓ కధ గుంజీలు తీయిస్తు ంది..ఓ కధ తొడపాశం పెడుతుంది. ఓ కధ ఎండలో

నిలబెడుతుంది..ఓ కధ గుంజీలు తీయిస్తు ంది. నాకనేముంది, మగ మహానుభావులందరికీ ఇంతే కావొచ్చు. దెబ్బలు

పడొ చ్చు.(ఇదే మాట అమృత తో అంటే “మగ మహానుభావులకే కాదు, పిల్ల మహానుభావులకి కూడా అంతేనయ్యా”

అంది పుస్త కం లోంచి తలెత్తకుండా. ఏం కధ చదువుతోందా అని తొంగి చూస్తే అది’ఒక రాణీ-ఒక రాజా’ కధ.  ) .ఐనా

దెబ్బలు పడుతున్నాఆపకుండా చదవాల్సిందే. అసలు ఆపడమనేది సాధ్యం కాదనుకోండీ. ఒక అత్యంత ఆసక్తికరమైన

నవలనెలా ఆపకుండా చదివేస్తా మో అలా కధ వెంట కధ చదవకుండా ఆగలేని తనంలోకి తోసేస్తో ందీ పుస్త కం.

అబ్బా..ఎంత సూక్ష్మమైన పరిశీలన! జీవితపు అనేకానేక అంశాల్ని వాటి వాటి సమస్త వర్ణా లనూ పట్టు కుని స్త్రీ కోణం

లోంచి చూసి పదునైన విశ్లేషణ చేస్తూ ..ఎక్కడా తేలిపో కుండా “ రాజకీయాలు మాట్లా డే కధలు వొట్టి

నినాదప్రా యాలూ,వాటిలో కళ ఉండదూ..” అని విమర్శించే వాళ్ళకు సవాల్ విసిరేటట్లు -అరే..మొగుళ్ళ

అయ్యప్పమాలలు పెళ్ళాలమీద పెడుతున్న బరువుని సైతం ఎంత మంచి కధ చేశారు!(పతిభక్తి..పేజ్ నెం. 21).

ప్రత్యేకించి ఒక్క కధ అని చెప్పలేం..దాదాపు 99 శాతం కధలు “ ఆహా” అనిపిస్తా యి,ఆలోచింపజేస్తా యి.

రక్త మాంసాలున్నపాత్రలు. వాటినడుమ సంఘర్షణ. జీవన వాస్త వికత. మానవోద్వేగాలు. వేదన. యాతన.
మన మగ వేషాలన్నిట్నీదుర్భిణీలోంచి చూసి పట్టేశారు. మనం వేసే రంగు రంగు ల వలలూ ,మనమూ మన

సమాజమూ ఆడాళ్ళ కోసం చేసిపట


ె ్టే రక రకాల చట్రా లూ, వాటిలోకి వాళ్ళే స్వచ్చందంగా వచ్చి ఇరుక్కునేలా చేసే మన

డొ ల్ల సంస్కృతులూ..అన్నిటినీ అందరినీ పట్టు కుని గొప్ప కళాత్మకంగా ’సీపురు’ తిరగేశారు సత్యవతి గారు. మనం

మరింత మంచి మనుషులమయ్యేలా మన వెంటపడే పుస్త కమిది. సత్యవతి గారూ…పుస్త కమంతా చదివాక వెనుక అట్ట

మీద మీ ఫో టో ను ప్రేమగా చేత్తో తాకి చెప్పాను “ అమ్మా!లవ్యూ సో మచ్”

You might also like