You are on page 1of 5

బేతాళుడే యొగి

రచయిత - అమృత
జానర్ - ఫిక్షన్
పదాల సంఖ్య – 2238

నమస్తే, నా పేరు ( ). రచయిత అమృత పంపిన "బేతళుడే యోగి" కథను నేను ఇప్పుడు మీకు
చెప్పబో తున్నాను. బేతాళుడు అంటే మరెవరో కాదండి, మనం తరచుగా వినే "విక్రమార్కుడు - బేతాళుడు" కథలో
బేతాళుడే. అసలు ఈ బేతాళుడి పాత్ర మీకు గుర్తు ందా? గుర్తు ఉన్నా లేకపో యినా పర్లేదండి, ఇంకోసారి గుర్తు
చేసుకుందాం. "అదేంటి ?బేతాళుడు అంటే చనిపో యి దెయ్యం అయ్యిన వాడు కదా, ఆ దయ్యం గురించి, పిశాచి
గురించి పడుకునే సమయంలో అవసరమా?" అని మీరు అనుకుంటున్నారా? మీరే ఆలోచించండి, బేతాళుడు
దెయ్యమే కానీ ఓ పరాక్రమవంతుడైన రాజుకి స్నేహితుడు కదా! బేతాళుడు కథని ఎన్నో మలుపులు తిప్పినవాడు
కూడా! ఈ కథ అయిపో యే సరికి మీరే ఈ పాత్రని అభినందిస్తా రు చుడండి...

అయితే, మనం కథ వినటం ప్రా రంభించే ముందు, సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దా ం. మీకు ఇష్ట మైన రీతిలో
పడుకుని, అన్ని లైట్లను ఆఫ్ చేస,ి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస
తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాళ్టి జ్ఞా పకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే
సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తి డిని బయటకు
వదిలివేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రా ంతి తీసుకోవడం, సేదతీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు
ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రా ంతి తీసుకుంటున్నట్లు గా మీకు
అనిపిస్తు ంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి, మీ అవయవాల్లో ని ఒత్తి డిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీ
కోసం అవన్నీ రోజంతా చాలా కష్ట పడ్డా యి. కాబట్టి, వాటికి విశ్రా ంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా, మీ పాదాల్లో
మొదలైన విశ్రా ంత అనుభూతి.... క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్ల లోకి
ప్రవేశిస్తు ంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రా ంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రా ంత అనుభూతి.... క్రమంగా మీ
పొ త్తి కడుపు నుంచి వెన్నెముక గుండా ఎగువవీపు వరకూ వచ్చి, తరువాత ఛాతీలోకి ప్రవహిస్తు న్నట్లు గా
గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లో కి, తరువాత చేతుల్లో కి... చివరగా వేలికొనల వరకూ వెళ్తు న్నట్లు గా
అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకూ ఆ అనుభూతి ప్రవహిస్తు ంది. ఇప్పుడు మీ శరీరం మొత్త ం
ప్రశాంతంగా, రిలాక్స్ డ్ గా, నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్‌ల్యాండ్‌లో
ప్రశాంతంగా ప్రయాణిస్తా రు. ఈ ప్రయాణం ఉదయం వరకూ కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను
వింటున్నప్పుడు, మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రా నుభవం కోసం మీ శరీరం మొత్తా నికీ
విశ్రా ంతినిస్తూ స్థిరంగా ఉండండి.

ఇక కథలోకి వెళ్తే , విక్రమార్కుడు అనే రాజు మహా ధీరుడు, వీరధీ వీరుడు. పరాక్రమవంతుడు ఇతని గురించి మనం
ఎన్నో కథలలో సినిమాల్లో కూడా వినే ఉంటాము. "విక్రమార్కుడు" పేరుతో మన తెలుగులోనే ఎన్నో సినిమాలు
కూడా వచ్చాయి. చిరంజీవి గారి రాజా విక్రమార్క సినిమా గుర్తు ఉందా? రవితేజ "విక్రమార్కుడు" సినిమా లో కూడా
అది ఒక పవర్ఫుల్ పో లీస్ ఆఫీసర్ పేరు.ఇలా ఎన్నో. అంటే హీరో పాత్రకి "విక్రమార్కుడు" అని పేరు పెడితే అతను
వీరుడు, ధీరుడు అని అనడానికి సూచన అన్నమాట, చెప్పకుండానే అతను గెలిచే మొనగాడు అని మనకి ఓ రాజా
ముద్ర పడిపో తుంది. అయితే, అసలు కథ లో రాజు ఉజ్జ యిని నగరానికి చెందిన రాజు. జనాదరణ పొ ందిన
సంప్రదాయం ప్రకారం, విక్రమాదిత్య శకాలను ఓడించిన తరువాత క్రీ.పూ 57 వ సంవత్సరంలో విక్రమ సంవత
శకాన్ని ప్రా రంభించాడు అంటారు. అతని మీద ఆధారపడిన ఒక చేరిత్రే ఉందని నమ్మే వారు అతనిని మొదటి
శతాబ్ద ం కి చెందిన వాడిగా గుర్తిస్తా రు. క్రమంగా "విక్రమాదిత్య" అనేది అనేకమంది భారతీయ రాజులచే
స్వీకరించబడిన ఒక సాధారణ బిరుదు అయ్యింది, విక్రమాదిత్య ఇతిహాసాలు వివిధ రాజులకు అలంకరించబడిన
ఖాతాలు అయ్యాయి, ముఖ్యంగా రెండవ చంద్రగుప్తు డు లాంటి రాజులకు. సరే అసలు ఆ మొదటి శతాబ్ద పు
విక్రమార్కుడు , యుద్ధ ం చెయ్యడంలోనే కాదు న్యాయనిర్ణేతగా కూడా ఆయనకు ఆయనే సాటి. ధర్మం పట్ల నిబద్ధ త
ఉన్నవాడు, నిర్దో షిని ఎన్నడూ శిక్షించలేదు. సాహసాలను కాదనుకోలేదు, ఎవరన్నా ఏమన్నా కోరినా కాదనలేదు.
నీతికి, న్యాయానికి, ధర్మానికి, మారుపేరు ఇతను. ఇతన్ని చూసే ఎన్నో సినిమా డైలాగులు కూడా వచ్చాయిలెండి!
విక్రమాదిత్య ప్రభావం అతని న్యాయపరమైన చతురతకు మించింది. అతను శాకాలపై విజయం సాధించి అతని
విజయాలను స్మరించుకోవడానికి విక్రమ సంవత్ శకాన్ని స్థా పించాడని కొన్ని ప్రా ంతాల వారు నమ్ముతారు. ఆయన
చరితల ్ర ో అందుకే నిలిచిపో యాడు. అదేమీ వింత కాదనుకోండి! అయితే, ఈనతో పాటు ఈయనతో సమానంగా ఒక
బేతాళుడు కూడా పేరు తెచ్చుకున్నాడు. అది కూడా ఒక పది శతాబ్దా లు తరువాత. "విక్రమ్ ఔర్ బేతాల్" అన్న
పేరుతో వచ్చిన కథలు 11వ శతాబ్ద ంలో కాశ్మీరీ కవి సో మ్‌దేవ్ భట్ రాసిన 'బేతాల్ పచిసి' ఆధారంగా
రూపొ ందించబడ్డా యి. కాలం మారినా, మనుషులు-బుద్ధు లు, కుట్రలు- మోసాలు అప్పుడూ ఇప్పుడూ ఉన్నాయి
కాబట్టే 11వ శతాబ్ద ం లో కథలు ఇప్పటికీ ప్రా చుర్యం పొ ందాయి, వర్తిస్తా యి. ఈ కథల్లో ఓ చమత్కారమైన దెయ్యం
పేరు బేతాళుడు, ఆ దయ్యం తెలివైన రాజు విక్రమాదిత్యకు చెప్పిన అద్భుత కథలు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ
నేను చెప్పను కానీ, అసలు ఈ కథల్లో ముఖ్య పాత్రలు మూడు, రాజు విక్రమాదిత్యుడు, ఓ బేతాళుడు, ఓ యోగి. ఈ
మూడు పాత్రలు ఈ కథని ఎలా మలుపు తిప్పాయి? చివరికి ఏమయ్యింది, ఈ పాత్రల నుంచి మనం నేర్చుకునేది
ఏమిటి? ఈ విశేషాలు చూద్దా ం:

ఆ రచయిత రాసిన కథ ప్రకారం విక్రమార్కుడు ఉజ్జ యిని నగరాన్ని పాలిస్తు న్న సమయంలో ఆయన దగ్గ రికి ఒక
యోగి వచ్చాడు. ఆయన రాజుకి ఒక ఫలము ఇచ్చాడు. రాజు ఆ ఫలాన్ని ప్రసాదంగా స్వీకరించాడు. "ఓ రాజా! దీన్ని
నీ ఖజానా దగ్గ ర పెట్టు ", అని సూచించాడు ఆ యోగి. అలాగే చేశాడు ఆ రాజు. ప్రతి రోజు సాయంత్రం ఇలాగే ఆ యోగి
వచ్చి ఒక ఫలాన్ని ఇస్తూ ఉండేవాడు. పది రోజులు గడిచాయి. ఆ తర్వాత ఆ ఖజానాకి సంబంధించిన అధికారి
పరుగున వచ్చి, హడావిడి పడుతూ, అంది అందని గొంతులో మాట సరిగ్గా వచ్చి రాని కంఠంతో "రాజా! మీరు ఇది
చూడాలి!! ఖజానాలో పెట్టిన ఫలాలు అన్ని అమూల్యమైన రత్నాలుగా మారిపో యాయి" అని చెప్పాడు. రాజు
పరుగున వెళ్లి చూస్తే నిజంగానే ఆ యోగి ఇచ్చిన ఫలాలు అమూల్యమైన రత్నాలుగా రకరకాల రంగులలో మెరుస్తూ
కనిపించాయి. "అరెరే! భలే భలే! ఎవరు ఆ యోగి? ఎందుకు మా ఖజానా సంపదను ఇలా పెంచారు? ఇంతటి
కాంతితో మెరిసే రత్నాలను నాకు బహుకరించేందుకు నేను ఆయనకీ ఏమి ఉపకారం చేసి ఉంటాను? ఒకవేళ నేను
ఏమీ చెయ్యకపో యినా ఆయన ఈ బహుమానం నాకు ఇచ్చి ఉంటే, కచ్చితంగా ఆయనకు నేను ప్రతి-ఉపకారం చేసి
పెట్టా లి!" అనుకున్నాడు రాజు. ఆరోజు సాయంత్రం మళ్లీ యోగి వచ్చినప్పుడు, "అయ్యా మీరు నాకు ఫలాలు
ఇచ్చారు అవి అమూల్యమైన రత్నాలుగా మారిపో యాయి. నాకు ఇంత సాయం చేసిన మీకు నేను ఏమన్నా
సహాయం చేయగలనా? మీలాంటి వారి ఆశీర్వాదము నాకు అవసరము" అన్నాడు రాజు. "నా ఆశీర్వాదము నీకు
ఎప్పుడూ ఉంటుంది రాజా! అయితే, నువ్వు చేయగలిగిన పని మాత్రం ఒకటి ఉందిలే! చేస్తా ను అంటే చెప్తా ను"
అన్నాడు ఆ యోగి. "నా ధైర్య సాహసాల మీద మీకు నమ్మకం లేదా? నేను మీ కోరిక నిరాకరిస్తా నన్న
అనుమానమా? సంకోచించకుండా సెలవివ్వండి, మీరు ఏమి చెప్పినా అది చెయ్యగలను" అన్నాడు రాజు. "సరే,
అయితే, వచ్చే అమావాస్య రోజు రాత్రి, నీ రాజ్యం నుంచి ఉత్త ర దిశగా దట్ట మైన అడవుల వైపు వెళ్ళినప్పుడు, నర
మానవులు కనిపించని దూరంలో, జంతువులు నిన్నుస్వాగతించే అలజడీలో నక నక నక్కల కూతలు వినిపించే
వైపు, అడవి మధ్యలో ఉన్న మర్రి చెట్టు కొమ్మమీద ఒక తెల్లటి నిర్జీవమైన శవం వేలాడుతోంది. అది నాకు కావాలి.
అమావాస్య ఘడియలు పూర్తి అవ్వకముందు నువ్వు దాన్ని తీసుకు వచ్చి నాకు అప్పగించాలి. అప్పుడు నేను
దాన్ని ఆ జగత్ జననికి బలి ఇస్తే నా శక్తు లు పెరుగుతాయి దానివల్ల నాకు సదుద్దేశం జరగబో తోంది. మరి ఆ పని
వెళ్లి చేయగలవా? సాధించగలవా?" అని అడిగాడు యోగి. రాజు మాటల మనిషి కాదు. చేతల మనిషి. "తప్పకుండా
వెళ్తా ను, మీకు తెచ్చి ఇస్తా ను", అని చెప్పి అమావాస్య రోజున అడవి వైపు బయలుదేరాడు రాజు. యోగి
చెప్పినట్టు గా అడవి లోపలికి వెళ్లి నడవసాగాడు. దట్ట మైన అడవి మధ్యలో హో రు మంటూ వీస్తు న్న గాలి.
అమావాస్య రాత్రి కావడం వల్ల మొత్త ం చీకటి కమ్మి వేసి ఉంది. ఒకవైపు నక్కల అరుపులు మరోవైపు కీటకాల
శబ్దా లు, బెదరకుండా అడవి మధ్య ఉన్న మర్రి చెట్టు దగ్గ రికి వెళ్లి నిలబడ్డా డు రాజు. ఆ చెట్టు చుట్టూ తా ఎముకలు,
ఎండిపో యిన ఆకులు, మట్టి, ధూళి, ఉన్నాయి. రాజు ఆ చెట్టు నీ జాగ్రత్తగా పరిశీలించి చెట్టు కొమ్మ పైన ఉన్నతెల్లటి
రంగులో ఉన్న శవాన్ని చూశాడు.

అది కొంచెం ఎత్తు లో ఉన్న కొమ్మమీద వేలాడుతోంది. దాని కింద భాగం పట్టి గట్టిగా లాగ సాగాడు రాజు. అది కాస్త
జారీ జారగాని భుజం మీద వేసుకొని నడవడం ప్రా రంభించాడు. ఇంతలో, యేవో భయంకరమైన నవ్వులు వినిపించి
రాజు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డా డు కానీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తు ండగా, "ఎవడివి రా నువ్వు?" అని
ప్రశ్నవినిపించింది. మాట్లా డేది భుజం మీద ఉన్న సవమేనని అర్థమైంది విక్రమార్కుడిక.ి "నేను విక్రమాదిత్యను,
మీరు ఎవరు?" అనిగౌరవపూర్వకంగానే అడిగాడు రాజు. "నా పేరు బేతాళుడు! నువ్వు ఏ పని మీద వచ్చావు?
నన్ను ఎక్కడికి తీసుకెళ్తు న్నావు?" అని అడిగినప్పుడు, రాజు జరిగిన విషయం అంతా వివరించాడు. అప్పుడు ఆ
బేతాళుడు, "చచ్చిపో యిన శవంతో పనియేమిటొ? అసలు అతడు ఎవరో కనుక్కున్నావా రాజా? ఆ యోగి చెప్పింది
నిజమనుకుంటున్నావా? అతను నిన్ను మాయ చెయ్యటానికి ఇచ్చిన రత్నాలు చూసి మురిసిపో యావా? ఆ యోగి
నిజానికి యోగి కాకపో వచ్చు నిన్ను మోసం చేసేవాడే కావచ్చు. వాడు అడిగాడు కదా అని నన్ను తీసుకెళ్లి
పో తున్నావు! నీకు విచక్షణ లేదా? నా అనుమతి అక్కర్లేదా?" అని రాజుని ఆలోచింపచేసాడు బేతాళుడు. "ఎవరు
ఏమి అడిగినా చేసి పెట్టగలవా? ఆలోచించు రాజా! నువ్వు చెప్పింది వింటుంటే నీ దగ్గ రికి వచ్చింది యోగి వేషంలో
ఉన్ మాంత్రికుడు అనిపిస్తో ంది. అతడు నేను ఒకే రోజున పుట్టా ము. అతనికి నా శవం అవసరమయ్యింది అంటే
నన్ను అతని బానిసని చేసుకోవాలి అన్నది అతని కొసరు ఉద్దేశం కావచ్చు, నీ ప్రా ణాలు తీయడమే అతని ముఖ్య
ఉద్దేశం అని నాకు అనిపిస్తో ంది" అన్నప్పుడు రాజు ఆలోచనలో పడ్డా డు ఏమి చేయాలో తెలియలేదు కానీ, "నేను
మాట ఇచ్చాను కదా నేను ఇచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని తీసుకెళ్లా ల్సిందే లేకపో తే నేను రాజునయ్యె అర్హత
ఉండదు" అన్నాడు రాజు. రాజు మీద కనికరం కలిగింది బేతాళుడిక,ి "సరే, అయితే నా అనుమతి అక్కర్లేదా?"
అన్నాడు. "మీరు నాతో రావాలి, నేను ఏమి చెయ్యాలో చెప్పండి", అని అడిగాడు రాజు. ఈ రాజు ఎంతటి ఆలోచన
శక్తి ఉన్నవాడు ఎంతటి ధీరుడు, ఎంతటి చురుకైన వాడో తెలుసుకుందామనుకున్నాడు బేతాళుడు. సరే, రాజా నీకు
పరీక్ష పెడతాను. ఒక కథ చెప్తా ను కానీ ఆ కథ చివరిలో నిన్ను నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకి సరైన
జవాబు నువ్వు చెప్తే నేను నీతో రాను. తప్పు జవాబు చెప్తే నీతో వస్తా ను. అసలు నువ్వు సమాధానం తెలియక
మౌనంగా ఉంటే మాత్రం నీ తల వెయ్యి ముక్కలు అవుతుంది. షరతుకు ఒప్పుకున్నాడు రాజు. అదేంటి? తికమకగా
చెప్పాను అనుకుంటున్నారా? కాదండి! బేతాళుడికి తెలుసు, రాజు మంచితనం, ధర్మం తెలిసిన వాడు అని కానీ
అతని విచక్షణ ఎంత గొప్పగా ఉంటుందని పరీక్ష పెట్టా లి అనుకున్నాడు, తికమక మెలికని ఎలా విప్పుతాడో చూద్దా ం
అనుకున్నాడు. అందుకే మెలిక పెట్టా డు. రాజన్నవాడు నిజాలే మాట్లా డాలి. ధర్మాన్ని పాటించాలి. ధర్మాన్ని
సూచించేలా సమాధానాలు చెప్పాలి. మరి ఈ రాజుకి నీతి, విలువలు, అచ్చమైన లక్షణాలు ఉన్నాయా? అబద్ద ం,
మోసం లాంటి గుణాలు కూడా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ మెలిక పెట్టా డు. అందుకే రాజు తప్పు చెప్తే
వస్తా ను అన్నాడు. సరైన జవాబు చెప్తే అతను రానని చెప్పాడు. అయితే రాజుగా అతను అబద్ధ ం చెప్పకూడదు,
నిజమే చెప్పాలి. సరైన జవాబే చెప్పాలి, ఏమీ తెలియదు అని నిశ్శబ్ద ం తో ఉండకూడదు. ఉంటే, రాజ్యాన్ని ఎలా
పాలిస్తా డు? "సరే, అలాగే కానివ్వండి! మీరు చెప్పే కథకి మీకు నచ్చే సరైన సమాధానమ్ ఇవ్వగలనని నేను
అనుకుంటున్నాను" అని రాజు అనేసరికి కథ చెప్పడం మొదలుపెట్టా డు బేతాళుడు.

బేతాళుడు మొదటి కథ చెప్పాడు. చివరిలో వేసిన ప్రశ్నకు రాజు సరైన సమాధానమే చెప్పాడు. ఆ సమాధానము
ధర్మ పూర్వకంగా, తెలివిగా చక్కని బుద్ధి ఆలోచనతోనే, మంచి విచక్షణతోనే చెప్పాడు. "భళా రాజా భళా!!" అని
చెప్పి మర్రి చెట్టు పైకి వెళ్లి కూర్చున్నాడు బేతాళుడు. "మర్చిపో యావా? సరైన సమాధానం చెప్తే వెళ్లి పో తాను
అన్నాను కదా!" అని నవ్వుకున్నాడు బేతాళుడు. రాజు వదులుతాడా? రాజు పట్టు బడితే సాధించాల్సిందే! అందుకే
కదా అతను పరాక్రమ విక్రమాదిత్యుడు అయ్యాడు. మళ్లీ మర్రి చెట్టు దగ్గ రికి వెళ్ళాడు, ముదురుతున్న చీకటిలో,
వణికించే చలిలో, బెదరకుండా, వణకకుండా మళ్ళీ బేతాళుడిని భుజం మీద వేసుకున్నాడు. మల్లి బేతాళుడు మరో
కథ చెప్పాడు. మల్లి దానికి విచక్షణతో సమాధానం ఇచ్చాడు. బేతాళుడు మల్లి చెట్టు పైకి వెళిపో యాడు. ఇలా 24
సార్లు జరిగింది. ఇక 25వ కథ చెప్పిన తర్వాత బేతాళుడు ఎప్పటి లానే ప్రశ్నఅడిగాడు దానికి రాజు ఎప్పటిలానే
తనకి తోచిన ధర్మ పూర్వకమైన సమాధానమే చెప్పాడు. అయితే, ఆ కథకి రెండు-మూడు సరైన సమాధానాలు
ఉండడం వలన రాజు ఒక్కటే చెప్పడం వలన రాజు గెలిచి కూడా ఓడిపో యాడు. రాజు ప్రయత్నాన్ని మెచ్చుకున్నా
బేతాళుడు అతని బుద్ధి సరైనదని తేల్చుకుని అతను ధర్మపూర్వకమైన మనిషిని గ్రహించి రాజుతో వెంట వెళ్లడానికి
అంగీకరించాడు. ఇదంతా జరిగింది ఒక్క రాత్రిలోనే. మరి యోగి పెట్టిన షరతు అలాంటిది. అమావాస్య ఘడియలు
ముగిసే లోపు శవాన్ని తీసుకురావాలని. యోగి దగ్గ రికి బేతాళుడిని తీసుకుని వెళ్లి నా రాజుకి అక్కడ యోగికి
బదులు క్షుద్ర పూజలు చేసే మాంత్రికుడు కనిపించాడు. అంటే బేతాళుడు అతని గురించి చెప్పింది నిజమే
అన్నమాట. ఆ విచిత్రమైన మంత్రా లు చదువుతూ కనిపించిన వాడు రాజుని శవాన్ని పక్కనపెట్టి రాజుని బలి
ఇవ్వడానికి సిద్ధపడ్డా డు. ఆ మాంత్రికుడు క్షుద్ర పూజలతో రాజుని చంపేసి రాజునే బలిదానం చేసి ఆ శవాన్ని అంటే
భేతాళుడిని తన బానిసని చేసుకుందాం అనుకున్నాడు. ఈ వివరాలన్నీ ఒకా ఘడియలోనే రాజుకి అర్ధం
అయ్యిపో యాయి. ముప్పు సంభవిస్తు ందని అర్థం చేసుకున్నాడు. "నువ్వు చెప్పింది నిజమే అనుకుంటాను బేతాళ"
అని అనేసరికి బేతాళుడు ఒక్క మాట అన్నాడు, "మరి ఇప్పుడు నువ్వు ఏం చేయాలో చూసుకో" అని. వెంటనే రాజు
ఆ మాంత్రికుడిని సంహరించాడు ఆ తర్వాత బేతాళుడు రాజుకి అవసరమైనప్పుడు వచ్చి సాయం అందించేందుకు
సాయం అందించేలా వాగ్దా నం చేశాడు. ఆ సంఘటన తర్వాత బేతాళుడు యథా స్థా నానికి అంటే మర్రి చెట్టు పైకి
వెళ్ళిపో యినా ఎంతో కాలం వరకు విక్రమార్కుడికి అవసరానికి తలుచున్నప్పుడు వచ్చి సాయం చేసాడు, వారి
అపూర్వ స్నేహం కొనసాగింది, ఈ కథలలో చిరస్మరణీయం అయ్యింది. అప్పటి నుంచి ఈమధ్య వచ్చిన “విక్రమ్-వేద”
సినిమా వరకు ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా మనం విక్రమాదిత్యను - బేతాళుడిని గుర్తు చేసుకుంటూనే ఉన్నాము.
నిజానికి బేతాళుడు బ్రతికి ఉన్నప్పుడు, ధర్మం పాటించే వ్యక్తి మాంత్రికుడు వలనే చనిపో తాడు. అతను చెప్పిన
25కథల వలన రాజుకి ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలాంటి ధర్మసంకటనలు ఎదురైనా ధర్మయుక్త ంగా ఎలా
నిర్ణ యం తీసుకోవాలో అనే పాఠాలని నేర్పించాడు ఆ బేతాళుడు. అదే వారి స్నేహానికి పునాది అయ్యింది. రాజు
బేతాళుడిని నమ్మేలా చేసింది. ఇదంతా జరిగింది ఇందాక అనుకున్నట్టు ఒక రాత్రిలోనే. మీకు గుర్తు ఉంటే, ఆ
మాంత్రికుడు రాజుకి పది రోజులు ఫలాలు ఇచ్చి రత్నాలు చేసి నమ్మకం కలిగించే ప్రయత్నం చేసాడు, అదే, ఎర
వేసాడు. మన చుట్టూ కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు, బహుమతులు ఇచ్చి, పార్టీలు ఇచ్చి మనకోసం వారు
ఉన్నారనే నమ్మకాన్ని కలిగిస్తా రు కానీ నిజానికి ఎవ్వరూ ఎవ్వరికి ఉండరు, ఉన్నారు అనుకోవటం మన తప్పు.
రాజు యోగి అనుకున్న వాడిని నమ్మి శవం మాటలు నాకెందుకు అని బేతాళుడి మాటలు వినకపో తే ఏమి అయ్యి
ఉండేద? ి రాజు ఉండేవాడు కాదు, ఈ కథా ఉండేది కాదు! మొదట్లో రాజు కూడా "నేను ఏమి ఉపకారం చేశానని నా
ఖజానా సంపదను ఈ యోగి పెంచాడు? నేను ఏదైనా తిరిగి చెయ్యాలి" అనే అనుకున్నాడు. నిజానికి ఆకర్షించే
బహుమతులను చూసి యోగి మీద మంచి అభిప్రా యాన్ని పెంచుకున్నాడు రాజు. అప్పటికి ఆ యోగి ఒక మారు
వేషం లో ఉన్న మాంత్రికుడు అని గ్రహించలేక పో యాడు. ఆ విచక్షణ బేతాళుడి 25 కథలు విన్న తరువాత,
బేతాళుడి వలెనే వచ్చింది.

బేతాళుడి పాత్రలో స్థితిస్థా పకత, దృఢ సంకల్పం మరియు న్యాయాన్ని అనుసరించడం వంటి లక్షణాలు ఉంటాయి.
అన్యాయానికి గురై ప్రా ణాలు కోల్పోయినప్పటికీ అన్యాయమైన స్థితిలో చిక్కుకున్నప్పటిక,ీ బేతాళుడు ప్రతీకారం
తీర్చుకునే అవకాశం కోసం ఓపికగా ఎదురుచూసాడు. ఈ అంశం ఆధునిక సమాజంలోని నిరాశకు లోనయ్యే బదులు
కష్టా లను అధిగమించడానికి మరియు పరిష్కారాన్ని వెతకడానికి ప్రేరేపించాలీ, ప్రతికూల పరిస్థితులను
ఎదుర్కోవడంలో దృఢ నిశ్చయాన్ని పెంపొ ందించుకోవాలి. ఓపికగా న్యాయాన్ని కోరుకుంటూ అవకాశం కోసం
చూడాలి. అందరికీ రోజులు ఒకేలా ఉండవు కాబట్టి ఎదురుచూస్తే అవకాశం తప్పకుండా వస్తు ంది. రాజు
తెలివితేటలకు, మోసాన్ని ఎదురుకునే దిట్ట. బేతాళుడినీ గుడ్డిగా నమ్మలేదు, యోగినీ గుడ్డిగా నమ్మలేదు. తన శక్తి
సామర్ధ్యాలని నమ్ముకున్నాడు. నేటి సమాజంలో, అవసరానికి వాడుకునే మనుషుల నుంచి ఇలాంటి లక్షణాలే
మనల్ని కాపాడుతాయి. ప్రశ్నించడానికి, న్యాయం ధర్మ విచక్షణ కోసం అవసరం అవ్వాలి. తప్పుడు సమాచారం
మరియు తారుమారుతో నిండిన సంక్లిష్ట ప్రపంచాన్ని అంచనా వెయ్యడంలో నైపుణ్యం అవసరం. అఘోరా యోగి
నియంత్రణ లేని దురాశ ఉన్నవాడు, బహుమతులు ఇచ్చి మనుషులని ఆకర్షించే బుద్ధి ఉన్నవాడు, అధికార
దుర్వినియోగం యొక్క ప్రమాదాలను సూచిస్తా డు. నమ్మితే గోతుకోసే రకం అన్నమాట. ఆధిపత్యం కోసం అతని
దాహం మరియు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇతరులను మభ్యపెట్టడం అతనికి తెలిసిన విద్యలు. ఆధునిక
సమాజంలో అవినీతి ప్రమాదాలకు అద్ద ం పడుతుంది ఈ పాత్ర. అతని పతనం అలాంటి ఆలోచనలు ఉన్నవారికి
గుణపాఠం కావాలి. బేతాళుడు - యోగి వాళ్ళ పేర్లకు విభిన్నమైన లక్షణాలు ఉన్నవాళ్ళు కదూ. సాధారణంగా యోగి
అంటే ఉత్త మం ఐన వాడు, బేతాళుడు అంటే దయ్యం అని ముందుగానే ఒక ఆలోచన ఏర్పరుచుని అసలు నిజాలను
అంగీకరించడం లో ఆలస్యం చేస్తు న్నాము. ఒక్కోసారి మనకి కీడు చెయ్యాలి అనుకున్న వారి పనులకు మనకి
మంచి జరిగింది అనుకోండి, ఇంకా కీడు చేసేవాడిని శత్రు వు గానే చూస్తా మా? అలాగే, మంచి వాడు అని నమ్మిన
వ్యతి వలన చేదు జరిగితే వాడు మంచే వాడు అనే అనుకుంటామా? ఒక నాణానికి రెండు వైపుల ఉన్నట్టు ఒక
మనిషికి, ఒక పరిస్థితికి, ఒక ప్రశ్నకి, ఒక ఆలోచనకి కూడా రెండు వైపుల ఉంటాయి. ఈ రెండు పాత్రలను సరిగ్గా
అర్ధం చేసుకోకపో తే పాత్రల స్వభావం యొక్క సంక్లిష్టతను, ప్రా ముఖ్యతను అర్ధం చేసుకోలేము.

యోగి అని చెప్పుకుని మాయాజాలాన్ని చూపించినంత మాత్రా న అతను మంచివాడు అనుకుంటుంది మన


ఆలోచన. అలాగే చచ్చిపో యిన శవం అనగానే కీడు అనుకుంటాము, ఇది కూడా ముందుగానే మన మనసులో
ఏర్పర్చుకున్నభావన. కానీ, ఇప్పుడు అర్థమైంది కదా బేతాళుడు ధర్మం వైపు రాజుని నడిపించాడు అని. వచ్చే
కష్టా న్ని కూడా పసికట్టేలా చేశాడు అని. ముందు మాంత్రికుడు యోగిలా కనిపించినప్పుడు అతను ఇచ్చే రత్నాలకు
తిరిగి సాయం చేద్దా ం అనుకున్నాడు రాజు, ఆ సాయం అతని ప్రా ణాలు తీస్తు ంది అని గ్రహించగలిగాడా? మనం కూడా
ఇలాంటి పొ రపాట్లు చేస్తూ ఉంటాము. ఏదీ పూర్తిగా ఆలోచించకుండా తొందర పడి నిర్ణ యాలు తీసుకుంటాం.
బేతాళుడు రాజు కథలు చెప్పి విచక్షణ కలిగించింది కేవలం విక్రమార్కుడికి మాత్రమే కాదు మనలాంటి వాళ్ల కు
కూడా. మనం కూడా విక్రమార్కుడి లాగా మన బుద్ధితో సత్యాన్ని అన్వేషిస్తూ సమాధానాలు వెతుక్కోవాలి. నిజానికి
మాయకి తేడాలు తెలుసుకోవాలి. చచ్చి దెయ్యంలా తిరుగుతున్న బేతాళుడు విక్రమార్కుడిని సరైన దారిలో
తీసుకుని వెళ్ళాడు. మనుషుల వేషాలని బట్టి వాళ్ళ మాటలను బట్టి వాళ్ళని అంచనా వేయకూడదు వాళ్ళ బుద్ధిని
అంచనా చేయగలగడమే మనం చేయగలిగిన పని. అంతేకాకుండా, కథ స్థితిస్థా పకత, విమర్శనాత్మక ఆలోచన
మరియు బాధ్యత లాంటి ఇతివృత్తా లను ప్రదర్శిస్తు ంది. న్యాయం కోరడంలో బేతాళుడి పట్టు దల, పరిస్థితులను
అంచనా వేయడంలో రాజు విమర్శనాత్మక ఆలోచన ఉన్న మాంత్రికుడు, అధికార దాహం వల్ల పతనం ఆధునిక
ప్రపంచంలో వ్యక్తు లకు శక్తివంతమైన పాఠాలుగా ఉపయోగపడతాయి. బేతాళుడు, రాజు యోగి కథ పగ, మోసం
మరియు అధికారం కోసం తపన వంటి ఇతివృత్తా లను కలిపి అల్లింది. పాత్రలు మరియు వారి చర్యలను విశ్లేషించడం
ద్వారా, మనకు పాఠాలను నేర్పిస్తు ంది. ఇప్పుడు ఏమంటారు? ఈ దయ్యం కథలో నిజానికి యోగి ఎవరు?
మాంత్రికుడు ఎవరు? మీకు ఓ చిరునవ్వు వచ్చి కథ కూడా నచ్చింది అని భావిస్తు న్నాము. శుభరాత్రి.

You might also like