You are on page 1of 11

మన జెండా

అర్ధా లు

త్రివర్ణ =మూడు రంగులు

ఖగము =పక్షి

అంబరం =ఆకాశం

పర్జన్యం =మేఘం

ముష్కరులు=దుండగులు

తలము = పై భాగము

పర్యాయపదాలు

జెండా = కేతన o ,పతాకం

అంబరం =ఆకాశం , నింగి

ధర = భూమి,అవని

పర్జన్యం =మేఘం,మబ్బు
వ్యతిరేక పదాలు

శాంతి × అశాంతి

సత్యం ×అసత్యం

సహనం × అసహనం

అంతం × ఆరంభం

స్వేచ్చ × బందీ

ప్రశ్నలు జవాబులు

1. మనం మన జెండాకు ఎందుకు వందనం చేయాలి?

జ) మన భారత జెండా కాషాయం, తెలుపు,ఆకుపచ్చ అనే


మూడు రంగులతో సహనం,శాంతి,సత్యములకు

ప్రతిరూపం. పరాక్రమమనే కాంతి తో వెలిగే దీపం .అందుకే మనం

మన జెండాకి వందనం చేయాలి.

2. బ్రిటిష్ వారిని ముష్కరులు, మత్త గజాలు అని ఎందుకు

అంటారు ?

జ ) దుష్టు లైన బ్రిటీషు వారు భారతీయులను మదించిన

ఏనుగుల వలె అనేక బాధలు పెట్టా రు. ఏనుగులని అంకుశం


భయపెట్టినట్లు మన భారత వీరుల చేతిలో జెండా ఆయుధమై

బ్రిటీషు వారిని భయపెట్టిందిట. అందుకే బ్రిటీషు వారిని

ముష్కరులు,మత్త గజాలు అన్నారు.

3.మన జెండా గొప్పతనం ఏమిటి?

జ) సహనం, శాంతి,సత్యానికి ప్రతి రూపమై ,స్వాతంత్ర పో రాటంలో

ముందు నడచి,పవిత్ర భారత దేశంలో పరాయి పాలనను అంత o

చేసి స్వేచ్చగా ఆకాశం లో ఎగిరుతూ భారతీయులకి అండగా

నిలిచింది మన జెండా.

2.యాదగిరిగుట్ట

అర్ధా లు
1. ఆవాసాలు =ఇళ్లు
2. నిత్యం= ప్రతిరోజు
3 దేదీప్యమానం =గొప్ప వెలుగు
4. విశ్వాసం=నమ్మకం
5. తొవ్వ =దారి
6. వసతి= నివాస స్థలం
వ్యతిరేక పదాలు
1. ఆచారం×అనాచారం
2. అనుగ్రహం×ఆగ్రహం
3. దుఃఖం×సుఖం
4. నమ్మకం×అపనమ్మకం
5. క్రింద×పైన
పర్యాయపదాలు
1.ప్రధానం=ముఖ్యం, అవసరం
2. ఉత్సవం= వేడుక, పండుగ
3. కీర్తి=గొప్ప పేరు, ఖ్యాతి

సొంత వాక్యాలు
1. ప్రసిద్ధి చెందిన: మన దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన గుడులు ఉన్నాయి.
2. దర్శించుట: నిత్యం దేవుని దర్శించుట చాలా మంచిది.
3. దేదీప్యమానం: శబరిమలలో మకర జ్యోతి దేదీప్యమానంగా వెలుగుతూ
ఉంది.
4. వసతి: పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు వసతి గృహాలలో బస చేస్తాం.
5. కీర్తించడం: రామదాసు శ్రీరాముని పాటలలో కీర్తించారు.
6. ఉత్సవాలు: ఉత్సవాలలో పాల్గొంటే మనకు ఎంతో ఆనందం కలుగుతుంది.
ప్రశ్నలు- జవాబులు
1. యాదగిరి గుట్ట గురించి రాయండి.
A. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన నరసింహ క్షేత్రం యాదగిరి గుట్ట.
ఇది హై దరాబాద్ కి 60 కిలోమీటర్ల దూరంలో వరంగల్ మార్గంలో ఉంది.
యాద ఋషి ఈ గుట్టపై తపస్సు చేయడం వల్ల నరసింహ స్వామి ఇక్కడ
వెలిశాడు ఇది భక్తు ల పాలిట కల్పతరువు ఈ క్షేత్రంలోని స్వామిని కీర్తిస్తూ
ఎంతో మంది కవులు శతకాలు రాశారు.
2. పుణ్యక్షేత్రంలో ఏదైనా ఉత్సవం జరిగినప్పుడు అక్కడ ఎట్లా ఉంటుందో
రాయండి.
A. ప్రతి సంవత్సరం ఆలయంలో మార్చి ఏప్రిల్ నెలల్లో యాదగిరిగుట్టలో
శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 11 రోజులు అంగరంగ వైభవంగా ఇవి
జరుగుతాయి. శ్రీవారికి ఎదుర్కోళ్ళు, కళ్యాణం ,రథోత్సవం కన్నుల
పండుగగా జరుగుతాయి. కవిసమ్మేళనాలు, ధార్మిక కార్యక్రమాలు కూడా
జరుగుతాయి. ఇక్కడ భక్తు ల రద్దీకి తగినట్లు గా వసతి గృహాలు కల్పించారు.
3. పుణ్యక్షేత్రాలు లేదా ఉత్సవాలకు వెళ్ళేటప్పుడు ఏమి జాగ్రత్తలు
తీసుకోవాలి?
A. పుణ్యక్షేత్రాలు లేదా ఉత్సవాలకు సంబంధించిన సమాచారం ముందుగానే
పూర్తిగా సేకరించాలి. అక్కడ పవిత్రతను కాపాడేలా ప్రవర్తించాలి. వసతి భోజన
సౌకర్యాలు గురించి ముందే ఏర్పాట్లు చేసుకోవాలి. అవసరమైన మందులు
తీసుకోవాలి. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి. అపరిచితులతో
చనువుగా ఉండకూడదు.
3.సాలార్ జంగ్ మ్యూజియం
అర్ధా లు
1. అర్ర=గది
2. సేకరించు=సమకూర్చు
3. భద్రపరచు=జాగ్రత్త చేయు
4. అశ్వం=గుర్రం
5. బీరి పోయి చూడు= ఆశ్చర్యంగా చూడు
6. పరదా=తెర
7. నక్ష=పటం
8. తొవ్వ=దారి
9. బోళ్ళు=గిన్నెలు
10. నడిమిట్ల=మధ్యలో

పర్యాయపదాలు
1. మనిషి=నరుడు, మానవుడు
2. బొమ్మ=ప్రతిమ, చిత్రము
3. బంగారం=స్వర్ణం, కనకం
4. ముఖం=వదనం, ఆననం
5. ఏనుగు=హస్తి, కరి
6. గుర్రం=అశ్వ o, హయం

జాతీయాలు
1. లొల్లి చేయు=అల్లరి చేయు
తరగతిలో పిల్లలు లొల్లి చేస్తు న్నారు.
2. బీరి పోయి చూడు=ఆశ్చర్యంతో చూడు
సినిమా పోస్టర్ ని నేను బీరి పోయి చూశాను.
3. పొద్దు గుంకు=సాయంకాలం
పక్షులు పొద్దు గుంక గానే తమగూళ్లకు చేరుకుంటాయి.
వ్యతిరేక పదాలు
పెద్ద×చిన్న
గొప్ప×బీద
ఏక×అనేక
ఆడ×మగ
బయట×లోపల
అందరు×కొందరు
ప్రశ్న- జవాబులు
1. సాలార్ జంగ్ మ్యూజియం ని ఎప్పుడు, ఎవరు ప్రారంభించారు ?దీనిని
ఎవరు గుర్తించారు?
A. సాలార్జంగ్ మ్యూజియంను 19 51 డిసెంబర్ 16 వ తేదీన ప్రజలు
చూసేటందుకు తెరిచారు .దీనిని మీర్ యూసఫ్ అలీఖాన్ సాలార్జంగ్-3
ప్రారంభించారు. భారత పార్లమెంటు దీనిని జాతీయ ప్రాముఖ్యత కల
సంగ్రహాలయంగా గుర్తించినది.
2. మ్యూజియం ను ఎందుకు చూడాలి?
A. మ్యూజియంలు చూడటం వలన మన పూర్వీకుల గొప్పతనం, గొప్ప
కళాఖండాలు సేకరణ, వాటి ప్రాశస్త్యం, మన చరిత్ర , వస్తు వుల, దుస్తు ల,
శిల్పాల ,కట్టడాల ,నిర్మాణాల గొప్పతనం తెలుస్తుంది. మనం ప్రాచీనమైన
వస్తు వులను జాగ్రత్తగా పరిరక్షించాలని తెలుస్తుంది.. మన జాతీయత,
సంస్కృతి గురించి తెలుస్తుంది.
3. గంటల గడియారం గొప్పతనం ఏమిటి?
A. గడియారం పెద్ద చెక్క డబ్బాలో ఉంది. దానిలో ఎడమవైపు చిన్న ఇల్లు ,
దానికి ఒక తలుపు మధ్యలో ఒక గంట ఉంటాయి. కుడి పక్కన ఒక చెట్టు ,
చెట్టు కింద ఒక మనిషి కొడుతూ ఉంటాడు .అంటే ప్రతి సెకనుకు ఒక దెబ్బ
కొడతాడు .మూసివున్న తలుపులు తెరుచుకొని ఒక మనిషి బయటకు వచ్చి,
గంట మీద ఎంత టైం అయితే అన్ని గంటలు కొట్టి ,మళ్ళీ లోపలికి పోయి
తలుపు మూసుకున్నాడు. 12 గంటలకు తలుపు తెరుచుకొని మనిషి
బయటకు వచ్చి, 12 గంటలు కొట్టా డు. సందర్శకులు అందరూ ఆశ్చర్య
పోయి చూశారు.
4. రెబెక్కా శిల్పం ప్రత్యేకత రాయండి.
A. ప్రపంచ ప్రసిద్ధి చెందిన శిల్పం రెబెక్కా శిల్పం . ఈశిల్పం ప్రత్యేకత ఏంటంటే
ఒక ఆడ మనిషి నెత్తి మీద నుండి కింద దాకా సన్నటి తెర కప్పుకున్నట్లు
అందులోనుండి ముఖం కనబడుతున్నట్లు ఉన్నది .అది బొమ్మలాగా
లేదు.నిజంగా ఒక మనిషి ముసుగు కప్పుకొని నిలబడి చూస్తు న్నట్లు ఉన్నది
.ఈ శిల్పాన్ని చెక్కినది 19 వ శతాబ్దా నికి చెందిన అనే ఇటలీ దేశస్థు డు.
5. చెక్క శిల్పాల ప్రత్యేకత ఏమిటి?
A. ఒక గది మధ్యలో చెక్క శిల్పం ఉన్నది. దాని వెనక అద్దం ఉన్నది. ముందు
నుండి చూస్తే ఒక మగ మనిషి, వెనకభాగం అద్దం లో చూస్తే ఆడ మనిషి
బొమ్మలు కనపడుతున్నాయి. అంటే ఒకే శిల్పానికి ముందు, వెనక
ఆడమనిషి, మగ మనిషి బొమ్మలు ఉన్నాయి .పనితనం అద్భుతంగా ఉన్నది
.ఆయన చేతులకి మొక్కాలి. ఈ శిల్పంలో ఉన్న మనుషుల పేర్లు ఫిలిప్స్
,మార్గరిట్టా . ఆ ఇద్దరూ జర్మనీ దేశంలో ప్రదర్శించే ఒక ప్రముఖ నాటకం లోని
ముఖ్య పాత్రలు అని తెలిసింది.
6. దినచర్య అంటే ఏంటి? ఎలా రాయాలి?
A. మనం రోజు చేసే పనిని తేదీల వారీగా, ఆరోజు మనం చేసిన పనులు
,చూసిన విషయాలు, వివరంగా ఒక పుస్తకంలో వ్రాస్తే దానిని దినచర్య లేదా
డైరీ అంటారు. డైరీ రాయడం వల్ల క్రమశిక్షణ అలవాటు అవుతుంది. మనల్ని
మనము సరి చేసుకోవడానికి మనపై మనకు ఒక అవగాహన వస్తుంది. సరైన
మార్గంలో ప్రయాణించడానికి ఒక ఆలోచన ఏర్పడుతుంది. దినచర్య
రాసేటప్పుడు ముందుగా తేదీని, వారాన్ని రాయాలి. తర్వాత విషయాన్ని బట్టి
క్లు ప్తంగా లేదా విశేషంగా రాయవచ్చు.

4. నీడ ఖరీదు
అర్ధా లు
1. నమ్రత=వినయం
2. రుసరుసలాడు=కోపగించు
3. యధావిధి=ఉన్నది ఉన్నట్లు
4. కునుకు=నిద్ర
5. జాగీరు=స్థలం
6. సేదతీరడం=విశ్రాంతి తీసుకోవడం
7. విస్తు పోవు=ఆశ్చర్య పడు
8. మనసు చివుక్కు మను=బాధ పడు
9. లబోదిబోమంటూ=పెద్దగా ఏడ్చు
10. పశ్చాత్తా పం=చేసిన తప్పు తెలుసుకొని మార్పు చెందుట.

వ్యతిరేక పదాలు
1. పిల్లలు× పెద్దలు
2 ఇంట్లోకి× బయటకి
3. నీడ ×ఎండ
4. ఏడుపు×నవ్వు
5. రావడం×పోవడం
6. దబుక్కున×మెల్లిగా
7. పిసినారి×పొదుపరి

జాతీయాలు
1. పిల్లికి బిచ్చం పెట్టు =పిసినారితనం
మా ఇంటి వద్ద షావుకారు పిల్లికి కూడా బిచ్చం పెట్టడు.
2. ముఖం చిట్లించుకుని =చిరాకు పడు
కొంతమంది ఊరికే ముఖం చిట్లించి కొని మాట్లా డతారు
3.రుసరుసలాడు = కోపగించు
కొత్త అద్దా న్ని పగలకొట్టిన o దుకు మా అమ్మ రుసరుస లా.
4. కాలికి బుద్ధి చెప్పు=పరిగెత్తు
పోలీసులు వెంటపడితే దొంగలు కాలికి బుద్ధి చెప్పారు.
5. నిప్పులు చెరుగు=కోపంతో మండిపడు
తక్కువ మార్కులు వస్తే మా నాన్న నిప్పులు చెరుగుతరు.
6. చెవికెక్కడం=వినిపించుకోవడం
పెద్దల మాటలు పిల్లలకు చెవికెక్కడం లేదు.
7. ఉత్తి పుణ్యానికి=ఊరికే
కొంతమంది ఉత్తి పుణ్యానికి గొడవ పడతారు.
8. చిందులు తొక్కడం=కోపంతో ఎగరడం
మా అన్నయ్య తన నోట్స్ కనిపించలేదని చిందులు తొక్కా డు.
9. నషాలానికి అంటటం=తీవ్రత
పిల్లలు గొడవ చేస్తే ఉపాధ్యాయునికి కోపం నషాలానికి అంటుతుంది.

క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.


1. పిల్లలు ఆడుతున్న ఆట పేరు ఏంటి?
A. కోతి కొమ్మచ్చి
2. పాపయ్య ఇంటి దగ్గర ఉన్న చెట్టు పేరు ఏమిటి?
A. మామిడి చెట్టు
3. పిసినారి పాపయ్య స్వభావం ఏమిటి?
A. పిసినారి పాపయ్య ఎవరి నీ దగ్గరకు రానివ్వడు.
పిల్లికి కూడా బిచ్చం పెట్టడు.
ఎప్పుడు రుసరుసలాడుతూ , ముఖం చిట్లింఛు కుంటూ ఉంటాడు.
4. పక్క ఊరి నుండి వచ్చినటువంటి యువకుడి పేరు ఏమిటి?
A. శివయ్య.
5. శివయ్య పాపయ్య కు ఎంత డబ్బు ఇస్తా ను అన్నాడు?
A. వెయ్యి రూపాయలు.
6. మామిడి చెట్టు నీడ నీడ ఖరీదు కట్టి అమ్మడం సరైనదేనా?
A. కాదు.
దారిన పోయే బాటసారులను నీడ ఇస్తుందనే చెట్లను పెద్దలు నాటేది.
7. నీడ తోపాటుగా శివయ్య ఎక్కడెక్కడికి మారాడు?
A. పాపయ్య చెట్టు నీడ తో పాటు వరండాలోకి, ఇంట్లోకి,తోటలోకి వెళుతూ
తోటలోని కూరగాయలు తెంపు కుంటూ ఉన్నాడు.
8. ఊరి వారు పాపయ్య కు సహాయం చేయడానికి ఎందుకు రాలేదు?
A. పాపయ్య ఎప్పుడు ఎవరికి సహాయం చేసే వాడు కాదు. అందువల్ల
ఊరివాళ్ళందరూ పాపయ్య కు తగిన శాస్తి జరిగింది అన్నారే కానీ ఎవరు
సహాయం చేసేందుకు ముందుకు రాలేదు.
9. ఊరి పెద్ద ఎలాంటి తీర్పు చెప్పాడు?
A. చెట్టు నీడను అమ్ముకున్నందుకు శివయ్య చేసిన పని సరైనదేనని ఊరి పెద్ద
తీర్పు చెప్పాడు.
10. శివయ్య దేని కోసం అలా చేశాడు?
A. పిసినారి పాపయ్య లో మార్పు తీసుకురావటానికి శివయ్య ఎలా చెట్టు నీడ
తో పాటు వెళ్లి కష్టా న్ని కలిగించాడు. చివరికి పాపయ్య లో మార్పు వచ్చిందని
గ్రహించాడు.

భాషను గురించి తెలుసుకుందాం.


క్రియా పదాలు
1. వాక్య భావం పూర్తిగా తెలిపే క్రియా పదాలను సమాపక క్రియలు అంటారు
అంటే వాక్య భావం పూర్తిగా అయిపోయినట్టు తెలిపే పదాలు. (.) కు కు
ముందు ఉన్న క్రియా పదాలు సమాపక క్రియలు.
ఉదా: చూశాడు. కాలిపోయింది. పడిపోయాను. వెళ్లా ను. వచ్చాను. బుద్ధి
చెప్పారు .గమనించలేదు. మొదలైనవి.
2. పూర్తికాని పనిని తెలిపే పదాలను అనగా వాక్య భావాన్ని అసంపూర్తిగా తెలిపే
క్రియ పదాలను అసమాపక క్రియలు అంటారు.
ఉదా: చూసి , వచ్చి ,వెళ్లి ,తెలుసుకొని, మాట్లా డుతుంటే ,ఆడుకుంటూ,
విస్తు పోతు, తోటలోకి పోయి... మొదలైనవి.

You might also like