You are on page 1of 2

4/30/23, 12:37 PM తెలుగువారి జానపద కళారూపాలు/వినోదాల విప్రవినోదులు - వికీసోర్స్

తెలుగువారి జానపద కళారూపాలు/


వినోదాల విప్రవినోదులు
< తెలుగువారి జానపద కళారూపాలు

వినోదాల విప్ర వినోదులు


ఈనాటి ఆంధ్రదేశంలో ఎక్క డో చెదురు మదురుగా
విప్రవినోదం ప్రచారంలో వుందని చెప్ప లేం కానీ 1600
__1700 సంవత్స రాలలో ఈ వినోదాలు వ్వా ప్తిలో వున్నా యి
అంటే అది విజయనగర సామ్రాజ్య కాలం.

విప్రులనగా బ్రాహ్మ ణులు. వారు వినోదం చేయడం వలన


విప్రవినోదమని పేరు వచ్చింది. బ్రాహ్మ ణులలో ఒక తెగ
బ్రాహ్మ ణులు దేవతో పాసన వలననో, మంత్ర తంత్రాల
వలనో, ఒక విచిత్రమైన గారడీలు చేస్తూ వుంటారు.
ష్టా
అ వధానాన్ని కూడ చే స్తూ ట్ఘా
వుం రు. ఆంధ్రదేశంలో ఈ
వినోదం చేసేవారు అక్క డక్క డా వున్నా రు. గుంటుపల్లి
ముత్తరాజనే విప్రవినోది గోలకొండ సుల్తా నుల తుది కాలంలో
వున్న ట్లు సురవరం ప్రతాప రెడ్డిగారు తెలియజేస్తున్నా రు.

చాటువు

సంతత మారగించు నెడ సజ్జన కోటుల


పూజసేయు శ్రీ మంతుడు గుంటుపల్లి
కుల మంత్రి శిఖామణి ముత్త మంత్రి దౌ
బంతియె బంతి గాక కడుపంద గులా
ముల బంతులెల్ల దూల్ బంతులు దుక్కి
టెల్ల యెడ బంతులు విప్రవినోది
గారడీ బంతులు సుమ్ము ధరాతలంబునన్.

అని వర్ణించాడు. ఈ విధంగా ఆ కాలంలో విప్ర వినోదాలు జరుగుతూ వుండేవి.


విప్రవినోదం చేసేవారు ఆంధ్ర దేశమంతటా వున్న ట్లు మనకు ఆధారా లున్నా యి. ​

మాణిక్యా ల పురం విప్ర వినోదులు:

తెలంగాణాలో ఈ విప్ర వినోదులు కరీంనగర్ జిల్లా మాణిక్యా ల పురంలో వున్న ట్లు


తెలుస్తూంది. వీరి వృత్తి విప్రులను యాచించడమే. వీరి ప్రదర్శ నం కూడ ఇంద్రజాలమే.
వీరి దళ సభ్యు లు నలుగురుంటారు. వీరి ప్రదర్శ నం విప్రుల ఇండ్లలోనూ, విశాల
బహిరంగ స్థలాల్లో నూ కూడ ప్రదర్సి స్తా రు. వీరి ప్రదర్శ న సామాగ్రి అయిదు శాలువలు,
ఒక కొయ్య అలమారా, ఒక తాళపత్ర గ్రంథం, రెండు జతల తాళాలు. ప్రదర్శ నం విశాల
ప్రదేశంలో ఒక చిన్న పందిరిలో జరుగు తుంది. పందిరి చుట్టూ శాలువలు కడాతారు. ఆ
తెరల మధ్య ఖాళీ అలమారా వుంచుతారు. ఇరువురు వ్వ క్తు లు చెరో ప్రక్క చేరి తాళాలతో
భజన చేస్తా రు. ఇంతలో ప్రేక్షకులు గుమి కూడతారు. తెరలన్నీ ఎత్తి ఖాళీ అలమారా
చూపిస్తా రు. తరువాత దళ సభ్యు డు ప్రాచీన తాటాకుల గ్రంథంతో తెరల మధ్య కు
వెళతాడు. ఒక పావు గంట వరకూ ఆయన బయటకు రాడు. ఈ లోగా భజన జరుగుతూనే
వుంటుంది. లోపల ఏం జరుగుతూందో అనే ఆసక్తిప్రేక్షకులలో రేకెత్తిస్తుంది.
లో ళీ
https://te.wikisource.org/wiki/తెలుగువారి_జానపద_కళారూపాలు/వినోదాల_విప్రవినోదులు లో దే 1/2
4/30/23, 12:37 PM తెలుగువారి జానపద కళారూపాలు/వినోదాల విప్రవినోదులు - వికీసోర్స్

ఇంతలో తెరను తొలగిస్తా రు. అదివరకు ఖాళీగా వున్న అలమారాలో దేవతా విగ్రహాలు,
దీపారాధన కుందులూ, పుష్పా లూ, ఫలాలూ, పిండివంటలూ, గంట, శంఖం వివిధ పూజా
పాత్రలు అనేక రకాల పిండి వంటలు ప్రత్య క్షమౌతాయి. అలాగే ఒక మామిడి టెంకను
పాతి పెట్టి పది నిమిషాల్లో అడుగు ఎత్తున పెరిగిన మామిడి మొక్క ను చూపిస్తా రు. ఈ
ప్రదర్శ నం ప్రేక్షకులను ఆశ్చ ర్య చకితుల్ని చేస్తుంది. ప్రదర్శ నానికి ముందే
అలమారాలను పరీక్షించ వచ్చు . అంతే కాక వీరు ఇంటింటికి తిరుగునప్పు డు
విగ్రహాలను, కప్ప లను చిలకలను, విభూతిని అరచేతిలో సృష్టించి ఇంద్రజాల
మహేంద్రజాల విద్య ను ప్రదర్శి స్తా రు.

రాయలసీమ విప్రవినోదులు:

విప్రవినోదులు జాతర్ల లోనూ, తిరునాళ్ళ లోనూ, గుడారాలను నిర్మి స్తా రు. ఈ గుడారాల్లో
రామాయణం మొదలైన కథలను అత్య ద్భు తంగా చిత్రిస్తా రు.

వీరు గొప్ప మాటకారులు, హాస్య ప్రియులు. చెప్పింది చెప్ప కుండా చెపుతారు.


ప్రేక్షకులను తమ హాస్య ప్రసంగాలతో ఆనందంలో ముంచెత్తుతారు. ​

వీరు భలే తమాషాలు చేసి, ప్రేక్షకులను ఆనంద పరుస్తా రు. వీరు ముందు మన పేరు
అడిగి తెలుసుకుంటారు. దూరంగా వుండే తమ జట్టు వారికి అర్థమయ్యే రీతిలో,
పద్యా లద్వా రా, సైగలు ద్వా రా, మన పేరును తెలియ చేస్తా రు. వారు అక్క డ నుంచే మన
పేరులను వారితోనే చెప్పించి చుట్టూ మూగిన ప్రేక్షకులను ఆశ్చ ర్య చికితుల్ని చేస్తా రు.

వీరు రాయల సీమ ప్రాంతాల్లో ఒకప్పు డు విరివిగా ప్రదర్శ నలిచ్చే వారు. ఈ నాడు వీరి
జాడవున్న ట్లు అధారాలు లేవు.

విప్రవినోదుల రోప్ ట్రిక్:

విప్రవినోదులు ఆ రోజుల్లో రోప్ ట్రిక్ ను చేసేవారు. అంటే ఒక త్రాడును ఆకాశంలో


ఎగరేస్తే అది అలాగే నిలబడితే, దానిమీద మనిషి ఎక్కి అంతర్ధా న మయ్యే వాడట. ఎలా
మాయమయ్యే వాడో వివరంగా ఇంద్ర జాలం శీర్షికలో వివరించ బడింది.

ఇలా ఆరోజుల్లో రోప్ ట్రిక్ చేసే విప్రవినోదులు, కృష్ణా నదీ ప్రాంతంలో


నివసించేరారట. బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో ప్రదర్శించిన ఒక
అద్భు త కార్యం. ఆ కాలంలో మన దేశానికి వచ్చి న విదేశీయు లెందరో ఈ
అద్భు తమైన ఇండియన్ రోప్ ట్రిక్ ను ఎంతగానో ప్రశంచించారు. ఇది
విప్ర వినోదుల విద్య .

"https://te.wikisource.org/w/index.php?title=తెలుగువారి_జానపద_కళారూపాలు/
వినోదాల_విప్రవినోదులు&oldid=209094" నుండి వెలికితీశారు

ఈ పేజీలో చివరి మార్పు 4 ఏప్రిల్ 2018న 02:24కు జరిగింది.

పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూ షన్/షేర్-ఎలైక్ లైసెన్సు ; క్రింద లభ్యం అదనపు షరతులు వర్తించవచ్చు . మరిన్ని
వివరాలకు వాడుక నియమాలను చూడండి.

https://te.wikisource.org/wiki/తెలుగువారి_జానపద_కళారూపాలు/వినోదాల_విప్రవినోదులు 2/2

You might also like