You are on page 1of 4

4/30/23, 1:36 PM తెలుగువారి జానపద కళారూపాలు/ఉరుమును మించిన ఉరుముల నృత్యం - వికీసోర్స్

తెలుగువారి జానపద కళారూపాలు/


ఉరుమును మించిన ఉరుముల నృత్యం
< తెలుగువారి జానపద కళారూపాలు

ఉరుమును మించిన ఉరుముల నృత్యం


చితికి జీర్ణమైపోయిన అనేక జానపద కళా రూపాల ఈనాడు మనకు కనబడకుండా
కనుమరుగై పోయాయి. అలా కనుమరుగైన కళారూపాలలో ఉరుముల నృత్యం
ముఖ్య మైనది. తలకు అందంగా రుమాళ్ళు చుట్టుకుని మెడల్లో కాసుల దండలు ధరించి
ఎఱ్ఱని, పచ్చ నివీ

శాలువలు కప్పు కుని, నిలువు అంగీలు ధరించి, పల్ల వేరు చెట్టు కర్రతో తయారు చేసిన
ఉరుములకు చర్మ పు మూతలు మూసి, కదర పుల్లలతో వాయించుకుంటూ దేవాలయ
ప్రాంగణాల్లో , ఉరుముల నృత్యం చేస్తూ వుంటారు. ఉరుము అనే పేరును బట్టి వాయిద్య
ధ్వ ని ఉరుమును పోలి వుండవచ్చు ను. అందువల్ల వాటికి ఉరుములు అనే నామకరణం
చేసి వుండవచ్చు .

రాయల కాలంలో:

విజయనగర సామ్రాజ్య కాలంలో వీరికి మాన్యా లు ఇచ్చి నా కాలక్రమేణా అంతరించి


పోయి, ప్రస్తుతం కుల వృత్తిని నమ్ము కుంటూ పొట్ట గడవని స్థితిలో డెబ్భై కుటుంబాల
దాకా ఉరుములవారు అనంతపురం జిల్లా లో వున్నా రు. వీరిని ఉరుములోళ్ళు అని కూడ
పిలుస్తా రు. వీరు మాల తెగలో ఎక్కు వగా వున్నా రు. ​ఉరుము అనబడే చర్మ వాయిద్యం
ప్రాచీనమైంది. ఆదిమ జాతుల నర్తన రూపంలో వలయాకార విన్యా సాలు చేస్తూ
ఉరుములతో భయంకర మైన శబ్దా లు సృష్టిస్తూ , వీరు చేసే నాట్య అతి గంభీరంగా
వుంటుంది.

ఉరుముల వాయిద్యం ఒకేసారి ఏకధాటిగా వాయిస్తే కారుమొయిళ్ళు ఉరుములతో


పయనిస్తున్న ట్లు భ్రమ వ్వ క్తమౌతుంది. అందుకే ఆ వాయిద్యా నికి ఉరుము అని పేరు
పెట్టా రేమో ననిపిస్తుంది.

ఒక చేత వీరణం యొక్క చర్మా న్ని ప్రేము పుల్లలతో రాస్తూ ఈ శబ్దా లు సృష్టిస్తా రు. మరో
చేతితో పుల్లతో లయ విన్యా సాలు తాళయుక్తంగా సాగుతాయి.

వీ శ్రీ
https://te.wikisource.org/wiki/తెలుగువారి_జానపద_కళారూపాలు/ఉరుమును_మించిన_ఉరుముల_నృత్యం 1/4
4/30/23, 1:36 PM తెలుగువారి జానపద కళారూపాలు/ఉరుమును మించిన ఉరుముల నృత్యం - వికీసోర్స్

వీరి ఆరాధ్య దైవం శ్రీశైల మల్లన్న . ఆయన మహాత్మ్య గాథలు ఉరుముపై దరువులు
వేస్తూ గాన చేస్తా రు. చరణానికి చరణానికీ మధ్య ముక్తా యింపుల్తో గంభీరమైన శబ్దా లు
సృష్టించి వలయాకార విన్యా సాలు చేస్తా రు:

వాయిద్య పు తీరు:

వాయిద్యా న్ని ఈ విధంగా ప్రారంభిస్తా రు:

బూర్ బూర్ బూర్ బూర్


డబు డబు డబు డబు
యరడడ్డ బూర్ బరడ్డ్
డబు డబు డబు డబు

అని వాయిస్తూ పుల్లలతోనే చేతులెత్తి ప్రేక్షకులకు నమస్కా రం చేసి పరాకు పరాకు అనే
వచనాన్ని వల్లిస్తా రు. తరువాత డప్ డప్ డప్; డప్ డప్ డప్; డప్ డప్ డప్ అంటూ
వాయిస్తూ అందరూ వలయాకారంగా వుంటూ రెండు కాళ్ళ ను పెనవేసుకుంటూ
శరీరాన్నంతా వూపుతూ ఎగురుతూ నృత్యం చేస్తా రు. ఒక్కొ క్క ధ్వ నికి ఒక్కొ క్క ఎగురు
ఎగురుతూ మధ్య మధ్య , ఆహా, ఓహో అంటూ ఉరుములను ఉధృతంగా వాయిస్తా రు.

కుంకాలాట:

ఉరుములు వాయిస్తూ నే కుంచెల నృత్యం చేస్తా రు. దీనిని కుంకాలాట అంటారు. నెమలి
ఈకలతో కుంచెల్ని తయారు చేసుకుంటారు. ఈ కుంచెల్ని రెండు చేతులతో తల మీద
వుంచుకుని వరుసగా నిలబడతారు. వీరు బావిలో మునిగి స్నా నం చేసి వస్తా రు. ఉరుము
వాయిద్య సాగుతుండగా కళ్ళు మూసుకుని ​వుంటారు. ఉరుములోళ్ళు వారికి పూనకం
తెప్పించటానికి ఉరుముల వాయిద్యా న్ని దద్దరిలచేస్తూ ఇలా మేలు కొలుపు పాడుతారు.

మేలుకొనవే వో మేలుకొనవే
అమ్మ నీవు పుట్టక ముందేనాడు
యిగము లేడూ జగము లేడూ......................॥మే॥

అమ్మ మచ్చు మాయల వో గంగి నీవూ


పీనిగెలు తినే పిశాచివో
సామి గంగ లేని వో తానమే లేదు....................॥మే॥

గంగ లేని వో జలకమ్మే లేదు


సామీ నీవు పుట్టక ముందేనాడూ
నరుడు లేడు నారాయనుడే లేడు.....................॥మే॥

పాట అవగానే కుంచెలు పట్టుకున్న వారంతా వూగటం ఒక్కొ క్క అడుగు వెనక్కి ,
ముందుకు వేయటం చేస్తుండగా చుట్టూ చేరిన జనం బండారు కుంకాన్ని చల్లుతారు.
పూనకంలో వున్న వారు వాయిద్యా నికి తగినట్లు అడుగులు వేస్తా రు. అలా అడుగులు
వేసివేసి అలసి పోయిన వారి నోటిలో ఒక నిమ్మ పండు నోట్లో పెడతారు. కుంచెలు
పట్టుకున్న వారి మీద బండారు కుంకాన్ని చల్లుతారు. గుడ్డలన్నీ రక్తసిక్తమై, వారంతా
యుద్ధ వీరుల్లా గా కనిపిస్తా రు. ఈ భంగిమల్లో నొక్కి అద్భు తంగా రౌద్రంగా అనిపిస్తా యి.
కంటి గ్రుడ్లను పెద్దవి చేస్తూ , భ్రమ అభినయిస్తా రు. ఉరుములోళ్ళు గాట్టిగా, ఏయ్, జోహో
ఓహో అంటూ లయాత్మ కంగా అరుస్తా రు. అదొక వీరనృత్య మనీ ఆ నృత్యా నికీ, పేరణికీ
చాల పోలికలున్నా యనీ డా॥ చిగిచర్ల కృష్ణా రెడ్డి గారు వారి జానపద నృత్య కళలో
ఉదహరించారు.

ఇలా వారు గంగ కథను ఎక్కు వ చెపుతారు:

పరాకు పారాకు యచ్చ రిక పరాకు


మనవాలకించు మందన పుడితివమ్మ
మాయారి గంగ

https://te.wikisource.org/wiki/తెలుగువారి_జానపద_కళారూపాలు/ఉరుమును_మించిన_ఉరుముల_నృత్యం 2/4
4/30/23, 1:36 PM తెలుగువారి జానపద కళారూపాలు/ఉరుమును మించిన ఉరుముల నృత్యం - వికీసోర్స్

దొడ్డన పుడితవమ్మ - దొన కొండ గంగ


గంగలేని తానంబు లేదు
గంగ లేని జలకమ్ము లేదు

గంగ లేని వుతకమ్ము లేదు


గంగ లేని నంది లేదు
నీవు లేని తలము లేదమ్మ
పన్నెండు అత్తా లు గలవు
బాగిరతి నలవీర గంగవో హ హో

ఇలా పాడుతూ చివరికి:

పెద్దల కిచ్చి న వరము చిన్న లకి తప్పు నంటివి


చిన్న ల కిచ్చి న మాత శిశుబాలలకు తప్ప నంటివి
శిశుబాల కిచ్చి న మాట కసి కందులకు తప్ప నంటివి
మనవాలకించు మాయదండ మెప్పో

పై పాట పాడుతున్న సమయంలో అప్పు డప్పు డు అడుగులు ముందుకు వేయటం,


వెనక్కి వేయటం చేస్తూ వారి అంగిక చలనానికి అనుగుణంగా ఉరుమును మలుచుకుని
వాయిస్తూ వుంటారు. మరో పాటలో,

నేనే వస్తా రా బీరన్నా , నేనే వస్తా రా, కన్న తండ్రి


నల్లగొర్ల నేను మందాయిలోన నమ్మ కాలు నేనే చెబుతాను
నేనే వస్తా రా బీరన్నా నీకు నేనే వస్తా రా ॥నేనే॥

ఇలా కథను నడుపుతూ దరువులు వేస్తూ నృత్యం చేస్తూ కథను సాగిస్తా రు. ​

పతాక సన్ని వేశం:

ఉరుములు వాయిద్యం భీకరంగా సాగే సమయంలో చుట్టూ మూగిన ప్రేక్షకులు


తెల్లపోయి చూస్తూ వుంటారు. ఉరుముల వాయిద్యా ల హోరును తట్టుకోలేని వారు
దూరంగా నుంచుంటారు.

పూనకం వచ్చి వూగిపోయే వారిని చూసి ప్రేక్షకులు అరుపులతో, కేకలతో అట్టహాసం


చేస్తా రు. నిజంగా దేవతే పూనిందన్నంత భ్రమలో మునిగిపోతారు ప్రేక్షకులు. ఈ
సమయంలో వురుములోళ్ళు చేసే హావభావాలు చూడవలసిందే కాని వ్రాయ నలవికాదు.

చివరగా వురుములోళ్ళు కథను పూర్తి చేసి మంగళం పాటలో ఒక్కొ క్క దేవత పేరు
చెపుతూ, రెండు చేతులెత్తి మొక్కు తారు. మంగళం పాట పాడి గంగమ్మ తల్లికి భక్తితో
నమస్కా రం చేసి నృత్యా న్ని పూర్తి చేస్తా రు.

ప్రతిసారీ మంగళం పాడుతూనే తమ నృత్యం ఆపుతారు. గేయంలో అనేక మంది


దేవతల్ని వేడుకొంటారు. చరణాలన్నీ పాడే సమయంలో, పల్లవి ఎత్తుకునే సమయంలో
ఒక రకమైన లయలో పాడటం వుంటుంది. ఈ పల్లవిని ఎత్తుకునే సమయానికి ముందుగా

దే పే చే త్తి
https://te.wikisource.org/wiki/తెలుగువారి_జానపద_కళారూపాలు/ఉరుమును_మించిన_ఉరుముల_నృత్యం చే 3/4
4/30/23, 1:36 PM తెలుగువారి జానపద కళారూపాలు/ఉరుమును మించిన ఉరుముల నృత్యం - వికీసోర్స్

ఒక్కొ క్క దేవత పేరు చెప్ప టం, రెండు చేతులెత్తి మొక్క టం చేస్తూ వుంటారు. కథా
కార్య క్రమం అంతా పూర్తి కాగానే బండారు బొట్టును నుదుట పెట్టుకుని దండం పెట్టుకుని
వెళ్ళి పోతారు.

కళాకారులు:

ఈనాడు అనంతపురం జిల్లా లో వురుముల కథల్లో పాల్గొ నే కళాకారులు ఉరుముల


నారాయణ__ ఉరుముల నారాయణ స్వా మి__ వురుముల నాగన్న __ ఉరుముల
చంద్రప్ప __ ఉరుముల ఆంజనేయులు మొదలైన వారు కళను ప్రచారం చేస్తూ ,
దేవతల కొలువులు చేయిస్తూ

జీవితాలను సాగిస్తున్నా రు. ఇలా ఉరుములోళ్ళు ధర్మ వరం, సుబ్బా రావు


పేట, ముస్టూ రు, గూగూరు, మేడాపురం, రేగాటిపల్లె మొదలైన చోట్ల వున్నా రు.
ఈ మాదిరి ఉరుముల బృందాలు ఆంధ్రదేశంలో మరెక్క డా లేవు.

"https://te.wikisource.org/w/index.php?title=తెలుగువారి_జానపద_కళారూపాలు/
ఉరుమును_మించిన_ఉరుముల_నృత్యం&oldid=209158" నుండి వెలికితీశారు

ఈ పేజీలో చివరి మార్పు 4 ఏప్రిల్ 2018న 03:35కు జరిగింది.

పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూ షన్/షేర్-ఎలైక్ లైసెన్సు ; క్రింద లభ్యం అదనపు షరతులు వర్తించవచ్చు . మరిన్ని
వివరాలకు వాడుక నియమాలను చూడండి.

https://te.wikisource.org/wiki/తెలుగువారి_జానపద_కళారూపాలు/ఉరుమును_మించిన_ఉరుముల_నృత్యం 4/4

You might also like