You are on page 1of 2

B.

V Reddy Senior secondary school chittoor


Concept :తోలుబొ మ్మలాట
Class:V. Class work
___________________________________
I.అర్థా లు
1.శతాబ్ద ం = వంద సంవత్సరాలు
2. కర్త వ్యం = చేయవలసిన పని
3. తర్ఫీదు = శిక్షణ అభ్యాసం
4. పారాయణం = శ్రద్ధగా చదవడం
5.చమత్కారం = నేర్పు
6. వంత పాడడం = ఒకరు చెప్పినది మళ్లీ చెప్పడం
/ఒకరు పాడినది మళ్లీ పాడడం
7.ఆమడ = ఎనిమిది మైళ్ళ దూరం
8. ప్రా చీన = పాత, పురాతన

II. వ్యతిరేక పదాలు


1. శ్రద్ధ × అశ్రద్ధ
2. ప్రా చీనం × నవీనం
3. నవ్వడం × ఏడవడం
4. ఆచరించడం × ఆచరించకపో వడం
III. వచనాలు
1. కళాకారుడు - కళాకారులు
2. సామెత - సామెతలు
3.శ్లో కం - శ్లో కాలు
4.చమత్కారం - చమత్కారాలు
5.గ్రంథం - గ్రంథాలు
IV.క్రియలు రెండు రకాలు.అవి
1. సమాపక క్రియ.
2. అసమాపక క్రియ.
1. సమాపక క్రియ: ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేస్తే అది సమాపక క్రియ.
ఉదా:1. రవి పాఠం చదివాడు.
2. గణపతికి ప్రా ర్థన చేస్తా రు.
3. పిల్లలు పరీక్షలు బాగా రాసారు.
2. అసమాపక క్రియ: ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేయలేక పో తే అది అసమాపక క్రియ.
ఉదా:1. ఉడుత చెట్టు పైకి ఎక్కి……
2. పాపా ఉయ్యాలలో పడుకొని నిద్ర లేచి…..
3. అడవికి వెళ్ళిన గోవులు తిరిగి వచ్చి….
V. కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. తోలుబొ మ్మల తయారీలో రంగుల కోసం ఏమేమి
ఉపయోగిస్తా రు?
జ. తోలుబొ మ్మల తయారీలో రంగుల కోసం ప్రకృతిపరంగా దొ రికే మోదుగ పువ్వు, బంక, దీపపు మసి వంటి
సహజసిద్ధమైన వాటిని ఉపయోగిస్తా రు.
వీటి వల్ల ఎటువంటి హాని జరగదు.
2. కళాకారుల పిల్లలకు తోలుబొ మ్మలాట కళ లో ఏయే అంశాలలో శిక్షణ ఇస్తా రు?
జ. కళాకారులు కుటుంబాలలో చిన్నప్పటినుంచీ పిల్లలకు తోలుబొ మ్మలాట కళ గురించి , తయారు చేయడం, వాటిని
ఆడించడం,పద్యాలు చెప్పించటం, పాటల పాడించడం, సంభాషణలను పలికే తీరు తదితర అంశాలపై పిల్లలకు శిక్షణ
(తర్ఫీదు )ఇస్తా రు.
3. తోలుబొ మ్మలాటకు కథావస్తు వులుగా వేటిని తీసుకుంటారు?
జ. తోలుబొ మ్మలాటలో ఎక్కువగా రామాయణ,భారత, భాగవత, కథా వస్తు వులతో పాటు సమాజానికి అవసరమైన
వేమన, సుమతి, శతక పద్యాలు, సూక్తు లు, సామెతలు,సందర్భానుసారంగా ఉపయోగిస్తా రు.

You might also like