You are on page 1of 4

జాతీయాలు.

1. అందెవేసిన చేయి - (నేర్పరి)

ఏకలవ్యుడు శబ్ద భేదిలో అందివేసిన చేయి.

2. అడకత్తెరలో పోకచెక్క - (బయటపడలేని స్థి తి)

మత్తుమందులకు అలవాటుపడినవారు అడకత్తెరలో పోకచెక్కలా కష్టా లు పడతారు.

3. అద్దు పద్దు - (ఇష్టం వచ్చినట్లు ప్ర వర్తించడం)

నేటి యువత అద్దు పద్దు లేకుండా వాహనాలను నడిపి ప్ర మాదాల పాలవుతున్నారు.

4. అన్నెము పున్నెము – (ఏమీతెలియనిఅమాయకత్వం)

అన్నెము పున్నెము తెలియని అనేకమంది పసిపిల్ల లను నేడు వీధులపాలు చేస్తున్నారు.

5. ఇల్లు గుల్ల చేయు – (పూర్తిగానాశనంకావడం)

మద్యపానం అలవాటు వల్ల అనేకమంది ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు.


6. అరటిపండ్లొ లిచినట్లు – (చాలాసులభంగా)

వాల్మీకి రామాయణ రచన అరటిపండొలిచి చేతిలో పెట్టి నట్లుంది.

7. అరచేతనిమ్మపండు – (అదృష్టందగ్గ రగాఉండడం)

కష్ట పడి చదివేవారికి ప్ర భుత్వ ఉద్యోగం అరచేతి నిమ్మపండు వంటిది.

8. ఉగ్గు పాలతోపెట్టు – (చిన్నతనంనుండేనేర్పించుట)

జిజియాబాయి శివాజీకి ధైర్యసాహసాలను ఉగ్గు పాలతో పెట్టింది.

9. కంకణముకట్టు కొను – (పూనుకోవడం)

స్వచ్ఛభారత్ కోసం దేశంలోని ప్ర తి పౌరుడూ కంకణం కట్టు కోవాలి.

10. కంట్లో వత్తులేసుకొని – (విశ్రాంతిలేకుండాఎదురుచూడడం)

అభిమన్యుడు తిరిగివస్తాడని సుభద్ర కంటిలో వత్తులేసుకుని ఎదురుచూసింది.


సామెతలు

1. పొమ్మనలేకపొగపెట్టి నట్లు .

ఇబ్బందులను సూటిగా చెప్పలేక ఇతర పనులతో గ్ర హించేలా చేయడం.

2. ఉరుమురిమి మంగళంమీద పడ్డ ట్టు .

సంబంధం లేనివారు దోషులగుట.

3. ఊరందరిదో దారి ఉలిపికట్టె దో దారి.

ప్ర త్యేకమైన వ్యక్తిత్వం –నలుగురిలోకలవకపోవడం.

4. సందిట్లో సడేమియా అన్నట్టు .

సమస్యలతో ఉన్నప్పుడు సంబంధంలేని వ్యక్తి జోక్యం.

5. గుమ్మడికాయలదొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు .

తమ తప్పులను తామే బయటపెట్టు కోవడం.


6. అంగట్లో అన్నీ ఉన్నా అల్లు డు నోట్లో శని అన్నట్లు .

చేరువలో అన్నీ ఉన్నా అనుభవించే యోగ్యత లేకపోవడం.

7. పుణ్యంకొద్ది పురుషుడు దానంకొద్ది బిడ్డ లు.

మనం చేసిన మంచిపనులు మాత్ర మే మనకు మంచి ఫలితాన్ని అందిస్తాయి.

8. తవ్వెడిస్తే తంగెళ్ళు పీకాలె.

కాస్త ఎక్కువ కూలి అడిగితే చాలు అంతకు రెట్టింపు పని చేయించుట.

9. ఇంటింటికో మంటిపొయ్యి.

ప్ర తి ఇంటికీ ఏదో ఒక సమస్య ఉండటం.

10. అడిగినట్లి స్తే కడిగినట్ల వుతది.

ఎవ్వరు ఏది అడిగితే అది ఇస్తే మిగిలేది ఏదీ ఉండదు.

You might also like