You are on page 1of 55

భాషాభాగములు

ఆంధ్రభాషలోని పదాలను అయిదు రకాలుగా విభజించిరి. అవి :


1. నామవాచకము :
దీనికి విశేష్యము అని కూడా పేరు కలదు. పేర్లను తెలుపు పదాలు నామవాచకాలు. రాముడు,
కృష్ణానది, బల్ల, మేడ. ఇది సంజ్ఞ, జాతి, గుణ క్రియా భేదములచే నాలుగు రకములైనది.

2. సర్వనామము :
నామవాచకములకు బదులుగా వాడబడేది. అతడు, ఆమె, అది, ఇది, ఇవి, వాడు, వారు మొ||
నవి. ఇది కూడా ప్రశ్న వాచక, సంబంధ వాచకాది భేదములతోనున్నది.

3. విశేషణము :
నామవాచకముల, సర్వనామముల విశేషములను రంగు, రుచి మొ||నవి. వాటిని తెలుపు పదము.
నల్లని, కమ్మని, చెడ్డ మొదలగునవి.

4. క్రియ :
పనిని తెలుపు పదాలు క్రియలు. ఉదా : చదివెను, వ్రాయును.

5. అవ్యయము :
లింగ, వచన, విభక్తు లు లేనిది. ఆహా, అయ్యో, ఔరా, భళా, చేసి, చూసి, చేయక.

విభక్తు లు

వాక్యములోని వేర్వేరు పదాలకు ఒకదానితో ఒకటికి గల సంబంధమును తెలిపేవే విభక్తి


ప్రత్యయములు. ఇవి ఏడు విధములు.

విభక్తి – ప్రత్యయములు
ప్రథమా విభక్తి – డు, ము, వు, లు
ద్వితీయా విభక్తి – నిన్, నున్, లన్, కూర్చి, గురించి
తృతీయా విభక్తి – చేతన్, చేన్, తోడన్, తోన్
చతుర్థీ విభక్తి – కొరకున్, కై
పంచమీ విభక్తి – వలనన్, కంటెన్, పట్టి
షష్ఠీ విభక్తి – కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్
సప్తమీ విభక్తి – అందున్, నన్
సంబోధనా ప్రథమా విభక్తి – ఓ, ఓయి, ఓరి, ఓసి
విభక్తిని ఆధారంగా చేసుకొని శబ్దములకు చివర ఆగముగా గాని, ఆదేశముగా గాని వచ్చి
చేరేటటువంటి ఇ, టి, తి వర్గములు ఔప విభక్తికములు.
కాలు + చే = కాలిచే
అన్ని + ని = అన్నిటిని
చేయి + లో = చేతిలో.
సూచనలు : ప్రాచీన గ్రంథాలలో వాడింది కావ్యభాష. దాన్నే గ్రాంథిక భాష అంటారు. నేడు
వాడుకలో ఉండే భాషే వ్యావహారిక భాష, దాన్నే ఆధునిక భాష అంటారు. గ్రాంథిక భాషను ఆధునిక
భాషలోకి మార్చేటప్పుడు క్రింది మార్పులు గమనించాలి.
1. ఎ, ఏ లకు ముందున్న వకారం లోపిస్తుంది. పట్టు కు + వెళ్ళాడు – పట్టు కు + ఎళ్ళాడు –
పట్టు కెళ్లా డు. అలాగే పడేశాడు మొ॥

2. పెట్టు క్రియలోని వకారం లోపిస్తుంది. కూడు + పెట్టా డు – కూడు + ఎట్టా డు – కూడెట్టా డు

3. పదాదిలోని వకారం ఒకారంగా మారుతుంది.


వాడు వదలడు – వాడొదలడు
పట్టు కు వచ్చాడు – పట్టు కొచ్చాడు.

4. సాగుతున్న వర్తమాన కాలాన్ని సూచించే చోట ఊకారానికి మారుగా ఓకారం వస్తుంది.


ప్రవహిస్తూ + ఉంది – ప్రవహిస్తూంది – ప్రవహిస్తోంది
ఇట్లే చేస్తోంది. రాస్తోంది మొ॥

5. ము, మ్ము, ంబుల చోట ‘o’ వస్తుంది.


వర్షము – వర్షం; వృక్షమ్ము – వృక్షం; దేశంబు – దేశం

6. ని / ను, కి / కులకు ముందున్న మకారం లోపిస్తుంది. దానికి ముందున్న అచ్చు దీర్ఘం


అవుతుంది. ని అనేది న్నిగా మారుతుంది.
దేశమును – దేశాన్ని; దేశమునకు – దేశానికి ; దానిని – దాన్ని; పందెమునకు – పందానికి

7. ఇ, ఈ, ఎ, ఏ లకు ముందు ‘య’ చేరుతుంది.


ఎక్కడ – యెక్కడ; ఇటు = యిటు

8. ఉ, ఊ, ఒ, ఓ లకు ముందు వకారం చేరుతుంది.


ఉండ + ఒచ్చు – ఉండొచ్చు – వుండొచ్చు
9. రెండు పదాలు కలిసినపుడు రెండో పదం మొదట గల ‘అ’ లోపిస్తుంది లేదా ‘అ’ కు ముందు
టకారం చేరవచ్చు.
చచ్చే + అంత – చచ్చేంత – చచ్చేటంత

10. పొమ్ము, రమ్ము వంటి పదాలలోని ‘మ్ము’ లోపించి ముందు అచ్చు దీర్ఘం అవుతుంది. పొమ్ము
– పో; రమ్ము – రా
చూడుము, వెళ్ళుము వంటి వాటిలో ‘ము’ లోపిస్తుంది. చూడు, వెళ్ళు, వచ్చెను, పోయెను లలో
‘ను’ లోపించి వచ్చె, పోయె అవుతాయి.

ఆధునిక భాషలోని పరివర్తనం

క్రింది వాక్యాలను ఆధునిక భాషలోకి పరివర్తనం చేయండి.

1. వివేకహీనుడయిన ప్రభువును సేవించుట కంటే వనవాసముత్తమము.


ఆధునిక భాష : వివేకహీనుడైన ప్రభువును సేవించడం కంటే వనవాసం ఉత్తమం.

2. ఎలుక ప్రతిదినము చిలుకకొయ్య మీఁదికెగిరి పాత్రము నందున్న యన్నము భక్షించి


పోవుచున్నది.
ఆధునిక భాష : ఎలుక ప్రతిదినం చిలుకకొయ్య పైకి ఎగిరి పాత్రలో ఉన్న అన్నాన్ని భక్షించిపోతోంది.
“తని పోతుంది.

3. బుద్ధిహీనత వలన సమస్త కార్యములు నిదాఘనదీ పూరములట్లు వినాశము నొందును.


ఆధునిక భాష : బుద్ధిహీనత వల్ల సమస్తకార్యాలు నిదామన పూరములైనట్లు గా వినాశనాన్ని
పొందుతాయి.

4. అతని వ్యాపారము న్యాయమార్గమున సాగుచున్నది.


ఆధునిక భాష : అతని వ్యాపారం న్యాయమార్గంలో సాగుతోంది.

5. నేటి విద్యార్థు లు జ్ఞాన సంపాదనకు తగినంత శ్రద్ధ వహించుట లేదు.


ఆధునిక భాష : నేటి విద్యార్థు లు జ్ఞానం సంపాదించడం కోసం తగినంత శ్రద్ధ తీసుకోవడం లేదు.

6. పదేపదే చదివినచో పద్యము తప్పక అర్థమగును.


ఆధునిక భాష : పదే పదే చదివితే పద్యం తప్పకుండా అర్థమవుతుంది.

7. స్వాతంత్య్ర మనగా స్వరాజ్యమని మాత్రమే కాదు.


ఆధునిక భాష : స్వాతంత్ర్యం అంటే స్వరాజ్యం అని మాత్రమే కాదు.
8. పురుషుడు న్యాయము తప్పక విద్యా ధనములు గడింపవలెను.
ఆధునిక భాష : పురుషుడు న్యాయాన్ని తప్పక విద్యా సంపాదించాలి ధనాల్ని గడించాలి.

కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యంగా మార్చుట

‘కర్త’ ఆధారంగా రూపొందిన వాక్యాలు కర్తరి వాక్యాలని, ‘కర్మ’ ప్రధానంగా రూపొందించిన


వాక్యాలను కర్మణి వాక్యాలని అంటారు.
ఉదా:
రామకృష్ణారావు ఆమోదముద్ర వేశారు. (కర్తరి వాక్యం)
రామకృష్ణారావుచే ఆమోదముద్ర వేయబడింది. (కర్మణి వాక్యం)

వివరణ :
(ఆమోదముద్రవేయడం – కర్తకు సంబంధించిన క్రియ.
ఆమోదముద్ర వేయబడటం – కర్మకు సంబంధించిన క్రియ.)

1. ఆయన కన్నుమూసిన విషయం పత్రికలో వ్రాశారు. (కర్తరి వాక్యం)


ఆయనచే కన్నుమూయబడిన విషయం పత్రికలో వ్రాయబడింది. (కర్మణి వాక్యం)

2. సుగ్రీవుడు వాలిని యుద్ధా నికి ఆహ్వానించాడు. (కర్తరి వాక్యం)


సుగ్రీవునిచే వాలి యుద్ధా నికి ఆహ్వానించబడ్డా డు. (కర్మణి వాక్యం)

ప్రత్యక్ష కథనం – పరోక్ష కథనం

ప్రత్యక్ష కథనం :
ఇతరులు చెప్పిన దానిని లేక తాను చెప్పిన దానిని ఉన్నది ఉన్నట్టు గా అనుసరించి చెప్పడం. దీనిలో
ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి. ఉదా : ‘దీన్ని నరికివేయండి’ అని తేలికగ అంటున్నారు.

పరోక్ష కథనం :
అనుకరించిన దానిలోని విషయాన్ని లేక అభిప్రాయాన్ని మాత్రమే అనుకరించడం. దీనిలో ఇన్వర్టెడ్
కామాస్ ఉండవు.

ప్రత్యక్ష కథనం = పరోక్ష కథనం


నేను – నా – నాకు = తాను – తన – తనకు
మేము – మాకు = తాము – తమకు
నీవు – నీకు – నీది = అతడు / ఆమె – అతడికి / ఆమెకు – అతనిది / ఆమెది
మీ – మీకు = వారి – వారికి
ఇది – ఇవి – ఇక్కడ = అది – అవి – అక్కడ అని మార్పు చెందుతాయి.
1. ప్రత్యక్ష కథనం : “నా పుస్తకాలూ, కాగితాలూ ఏవీ ? ఎవరు తీశారు ?” అని రాజు కేకలు
వేసేవాడు.
పరోక్ష కథనం : తన పుస్తకాలూ, కాగితాలూ ఏమైనాయనీ, ఎవరు తీశారనీ రాజు కేకలు వేసేవాడు.

2. ప్రత్యక్ష కథనం : “నా రచనలలో నా జీవితం ఉంటుంది” అని రచయిత మిత్రు నితో
అంటున్నాడు.
పరోక్ష కథనం : తన రచనలలో తన జీవితం ఉంటుందని ఒక రచయిత తన మిత్రు నితో
అంటున్నాడు.

3. ప్రత్యక్ష కథనం : “నేను కఠినుడనని అందరూ అంటారు. నిజానికి నేను చాలా శాంత స్వభావం
కలవాడిని. పచ్చికవలె మృదువయినవాడిని. కోపం వచ్చినప్పుడే నన్ను సంభాళించడం
కష్టమౌతుంది” అని తనను గురించి చెప్పుకున్నాడు.
పరోక్ష కథనం : తాను కఠినుడని అందరూ అంటారనీ, నిజానికి తాను చాలా శాంత స్వభావం
కలవాడనీ, మృదువయిన వాడనీ, కోపం వచ్చినప్పుడు తనను సంభాళించడం కష్టమవుతుందనీ
ఆయన తన గురించి చెప్పుకున్నాడు.

4. ప్రత్యక్ష కథనం : “నేను మా ఊళ్ళో నాలుగో తరగతిదాకా చదివాను” అని లక్ష్మి చెప్పింది.
పరోక్ష కథనం : తాను వాళ్ళ ఊళ్ళో నాలుగో తరగతిదాకా చదివానని లక్ష్మి చెప్పింది.

5. ప్రత్యక్ష కథనం : “గంభీరమైన నా ముఖం చూసి ఎవరూ నాతో స్నేహం చేయడానికి ఇష్టపడరు”
అని అంబేద్కర్ అంటుండేవాడు.
పరోక్ష కథనం : గంభీరమైన తన ముఖం చూసి ఎవరూ తనతో స్నేహం చేయడానికి ఇష్టపడరని
అంబేద్కర్ అంటుండేవాడు.

6. ప్రత్యక్ష కథనం : “నాకు ఏ వ్యసనాలు లేవు. శీల సంవర్ధనంలో అభిమానపడతాను” అని ఆయన
అన్నాడు.
పరోక్ష కథనం : తనకు ఏ వ్యసనాలు లేవనీ శీల సంవర్ధనంలో అభిమానపడతానని ఆయన
అన్నాడు.

7. ప్రత్యక్ష కథనం : “నేను రాకున్నా నీవు తప్పక వెళ్ళి చూచి రా” అని రవి నాతో అన్నాడు.
పరోక్ష కథనం : తాను రాకున్నా నన్ను తప్పక వెళ్ళి చూచి రమ్మని రవి నాతో అన్నాడు.

8. ప్రత్యక్ష కథనం : “నాకు చాలా ముఖ్యమైన పని ఉందని రాము చెప్పాడు.


పరోక్ష కథనం : తనకు చాలా ముఖ్యమైన పని ఉందని రాము చెప్పాడు.

జాతీయాల వివరణ
1. మంత్రాలకు చింతకాయలు రాలడం :
మంత్రాలు మనస్సుకు సంబంధించినవి. అవి చదివినంత మాత్రాన తక్షణమే భౌతికమైన పనులు
జరుగవు. చింతచెట్టు కింద నిలబడి ఎన్ని మంత్రాలు చదివినా ఒక్క చింతకాయ కూడా రాలదు.
మానసిక ప్రయత్నంకంటే భౌతిక ప్రయత్నమే ముఖ్యమని తెలియజెప్పే సందర్భంలో దీన్ని
ప్రయోగిస్తా రు.

2. మిన్నందుకోవడం :
మిన్ను అనగా ఆకాశం. నిత్యావసర వస్తు వుల ధరలు కొనలేనంతగా బాగా పెరిగిన సందర్భంలోను
లేదా ఎత్తైన భవన నిర్మాణం జరిగినప్పుడు దాని ఎత్తు ను తెలియజేసే సందర్భం లోను దీన్ని
ప్రయోగిస్తా రు.

3. గజ్జెకట్టడం :
ఎవరైనా నాట్యం చేయడానికి ఆరంభంగా ముందుగా కాళ్ళకు గజ్జెలు కడతారు. ఏదైనా ఒకపని
ఆరంభమైందనే విషయాన్ని తెలియ జేసే సందర్భంలో దీన్ని వాడుతారు.

4. గుండెలు బరువెక్కడం:
సాధారణంగా గుండె సున్నితంగా ఉంటుంది. బరువులను మోయలేదు. మానసిక వత్తిడిని కూడా
తట్టు కోలేదు. ఎప్పుడైనా తీవ్రమైన బాధ కల్గిన సందర్భంలోను, ఆత్మీయులు, స్నేహితులు మొదలైన
వారిని కోల్పోయి బాధలో ఉన్నప్పుడు ఈ జాతీయాన్ని వాడుతాము.

5. నీరుకారిపోవడం :
ఘనపదార్థంగా ఉన్న మంచు ముక్క క్రమంగా నీరుగా మారిపోవడం అంటే ఉనికిని కోల్పోవడం.
అదే విధంగా మనిషికి చెమట పట్టి ఒక పనిని చేయలేని సందర్భములో ఈ జాతీయాన్ని
వాడుతాము.

6. కనువిప్పు :
‘విప్పు’ అంటే విచ్చుకోవడం, తెరుచు కోవడం. కన్ను తెరవడం ద్వారా కలిగే జ్ఞానం మిగిలిన
నాలుగు జ్ఞానేంద్రియాల ద్వారా కలిగే జ్ఞానం కంటే ఎక్కువైనా, ఇక్కడ కనువిప్పు అంటే మనోనేత్రం
విచ్చుకోవడం అని భావం. భ్రమలన్నీ తొలగిపోయి, సత్యం గోచరించడమే కనువిప్పు.

7. కాలధర్మం చెందడం :
కాలధర్మం అంటే ‘మరణించుట’ అని అర్థం. ఎవరైనా మరణించిన సందర్భంలో మరణించారు అనే
పదాన్ని ప్రయోగించ కుండా కాలధర్మం (కాలధర్మాన్ని అనుసరించి మరణం పొందు) అనే పదం
ప్రయోగిస్తా రు.
8. తునాతునకలు :
ఏదైనా ఒక వస్తు వు అజాగ్రత్త వల్ల గాని, నిర్లక్ష్యంగా గాని కిందపడినపుడు అది బ్రద్దలై
ముక్కలుముక్కలైపోతుంది. లేదా వేలుళ్ళు సంభవించినపుడు కూడా వస్తు వులు ముక్కలు
ముక్కలై పోతాయి. అందువల్ల ఒక వస్తు వు చిన్నా భిన్నమై పగిలిన సందర్భాన్ని
తెలియజేయునపుడు దీన్ని వాడతారు.

9. పురిటిలోనే సంధి కొట్టడం :


పని ప్రారంభించగానే ఆ పనికి విఘ్నం కలగడం అనే అర్థంలో వాడే జాతీయం.

10. ఉన్నదంతా ఊడ్చుకుపోవడం :


పూర్తిగా నాశనం కావడం అని భావం.

11. శ్రీరామరక్ష :
రక్షింపగలిగినది, సర్వరక్షకమైనది అనే అర్థం.

12. గీటురాయి :
కొలబద్ద ప్రమాణము అని ఈ జాతీయానికి భావము. నాణ్యత నిర్ణయించడానికి బంగారాన్ని
గీటురాయిపై గీత పెడతారు.

13. కారాలు మిరియాలు నూరడం :


మండిపడడం, మిక్కిలి కోపగించడం అని ఈ జాతీయానికి భావం.

14. స్వస్తి వాచకం :


ముగింపు, వదలివేయడం అని ఈ జాతీయానికి భావం.

15. అగ్రతాంబూలం : అందరికంటే ముందుగా గుర్తింపబడడం, గౌరవింపబడడం అని భావం.

16. దిక్కులు పిక్కటిల్లడం :


‘అంతటా వ్యాపించు’ అనే అర్థంలో వాడే జాతీయం.

17. విజయవంతం కావడం అంటే :


ఎవరైనా ఏదైనా ఒకపనిని కష్టపడి చేసినప్పుడు అది విజయవంతం అవుతుంది. ఆ విధంగా చేపట్టిన
పని విజయం పొందిన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. విజయవంతం కావడం అంటే
కార్యసాఫల్యతను పొందడం అని అర్థం.
18. ఉలుకు పలుకూ లేకపోవడం అంటే :
‘ఉలుకు’ అంటే భయం ‘పలుకు’ అంటే మాట ఎవరైనా ఎక్కడైనా భయంకరమైన జంతువును
చూచినప్పుడుగాని, భయంకరాకృతిని చూచిన సందర్భంలోను నిశ్చేష్ఠు లై పడి ఉండటాన్ని ఈ
పదం తెలియజేస్తుంది. నిష్క్రియత్వం లేకపోవడమే ఉలుకు పలుకూ లేకపోవడం.

వాక్య ప్రయోగాలు

1. శ్రీరామరక్ష : ధీమంతులకు ఆత్మస్థైర్యమే శ్రీరామరక్షగా ఉంటుంది.

2. గీటురాయి : ఎన్నికలు ప్రజాభిప్రాయానికి గీటు రాయి.

3. రూపుమాపడం : విద్యార్థు లు తమలోని దుర్గుణాలను రూపు మాపడం తప్పనిసరి.

4. కారాలుమిరియాలు నూరడం : పాలకపక్షం, విపక్షం ఎప్పుడూ ఒకదానిపై


మరొకటి కారాలు, మిరియాలు నూరుకొంటాయి.

5. స్వస్తి వాచకం : పురోహితులు భక్తు లకు స్వస్తి వాచకం పలుకుతారు.

6. శ్రద్ధా సక్తు లు : చదువుపట్ల శ్రద్ధా సక్తు లు ప్రదర్శించే వారు విజయాన్ని పొందుతారు.

7. ప్రేమ ఆప్యాయతలు : తల్లిదండ్రు లు తమ పిల్లలపట్ల ప్రేమ ఆప్యాయతలు ప్రదర్శించాలి.

8. వన్నెచిన్నెలు : అప్సరసలు తమ వన్నెచిన్నెలతో దేవేంద్రు ని అలరించారు.

9. సమయసందర్భాలు : కొందరు సమయసందర్భాలు పాటించకుండా మాట్లా డుతారు.

10. హాయిసౌఖ్యాలు : ప్రతిఫలాపేక్ష లేకుండా సేవచేయు వానికి


జీవితంలో హాయిసౌఖ్యాలు కలుగుతాయి.

11. సాన్నిధ్యం (సామీప్యం, ఎదురు) : భగవంతుని సాన్నిధ్యంలో అందరూ సమానులే.

12. మైత్రి : దుర్జనులతో మైత్రి చేయవద్దు .

13. ఏకాకి (ఒంటరి) : అభిమన్యుడు పద్మవ్యూహంలో ఏకాకి అయినాడు.

14. రోమాంచితం : భారతదేశం, క్రికెట్ ఆటలో ప్రపంచ కప్ సాధించినదని విని,


నాకు రోమాంచితం అయ్యింది.
15. కనువిప్పు : గురువుగారి హెచ్చరికతో నాకు కనువిప్పు కలిగింది.

16. పొద్దస్తమానం : సోమరులు పొద్దస్తమానం కాల క్షేపాలతో సమయాన్ని వ్యర్థం చేస్తుంటారు.

17. చమత్కారం : చాటుపద్యాల్లోని చమత్కారం పాఠకులను ఆనందపరుస్తుంది.

18. కష్టఫలం : రైతు సోదరులు కష్టఫలంగానే పంటలు పండుతాయి.

19. కడుపులు మాడ్చుకొను : దీనజనులు తిండితిప్పలు లేకుండా కడుపులు


మాడ్చుకొని జీవిస్తు న్నారు.

20. అడుగున పడిపోవు : పసిబాలుడు లోతైన బోరుబావి అడుగున పడిపోవడం విచారకరం.

సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చుట

వాక్యాల మార్పిడిలో గుర్తుంచుకోదగిన అంశాలు :

సామాన్య వాక్యం :
సమాపక క్రియ కల్గి కర్త, కర్మలు గల వాక్యం సామాన్య వాక్యం.
ఉదా :
రాముడు సీతను పెండ్లా డెను.

సంక్లిష్ట వాక్యం :
ఒక సమాపక క్రియ; ఒకటిగాని, అంత కంటే ఎక్కువగాని అసమాపక క్రియలు గల వాక్యం సంక్లిష్ట
వాక్యం. సమాపక క్రియగలది ప్రధాన వాక్యంగా, అసమాపక క్రియగలది ఉప వాక్యంగా ఉంటుంది.
అసమాపక క్రియ భూతకాలాన్ని సూచిస్తుంది.

ఉదాహరణలు :
I. క్రింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యంగా మార్చండి.

ప్రశ్న 1.
నా మల్లెలు ఎంతోమంది యువతులు ధరించారు. ఆనందించారు.
జవాబు:
నా మల్లెలు ఎంతోమంది యువతులు ధరించి ఆనందించారు.
ప్రశ్న 2.
పిల్లలు సముద్రతీరాన ఆడుకొంటున్నారు. ఇసుకలో ఇల్లు కట్టు కున్నారు.
జవాబు:
పిల్లలు సముద్రతీరాన ఆడుకొంటూ, ఇసుకలో ఇల్లు కట్టు కున్నారు.

ప్రశ్న 3.
బొండుమల్లెలు వేసింది తానే, పెంచింది తానే, డబ్బు చేసిందీ తానే.
జవాబు:
బొండుమల్లెలు వేసి, పెంచి, డబ్బు చేసింది తానే.

ప్రశ్న 4.
ఎందరో దేశభక్తు లు తమ ధన, మాన, ప్రాణాలను కోల్పోయారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చారు.
జవాబు:
ఎందరో దేశభక్తు లు తమ ధన, మాన, ప్రాణాలను కోల్పోయి, దేశానికి స్వాతంత్య్రం తెచ్చారు.

ప్రశ్న 5.
ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి. పంటలు బాగా పండాయి.
జవాబు:
ఈ సంవత్సరం వర్షాలు బాగా కురియడంతో పంటలు బాగా పండాయి.

ప్రశ్న 6.
విలేఖరులు వింకిల్ను పట్టణానికి తీసికెళ్ళారు. అతన్ని అనేక ప్రశ్నలడిగారు.
జవాబు:
విలేఖరులు వింకిల్ను పట్టణానికి తీసికెళ్ళి అనేక ప్రశ్నలడిగారు.

ప్రశ్న 7.
వినోద్ బొంబాయి వెళ్ళాడు. అతడు మిత్రు ణ్ణి కలిశాడు.
జవాబు:
వినోద్ బొంబాయి వెళ్ళి మిత్రు ణ్ణి కలిశాడు.

ప్రశ్న 8.
వదరుబోతు జన్మించినది అనంతపురమందు – వదరుబోతు పని చేసినది, సన్యసించినది
అనంతపురమందే.
జవాబు:
వదరుబోతు జన్మించినది, పని చేసినది, సన్యసించినది అనంతపురమందే.
ప్రశ్న 9.
నా భయం కళ్ళకు కప్పేసింది. రాలేక నిలబడి పోయాను.
జవాబు:
నా భయం కళ్ళకు కప్పేయ్యటంతో రాలేక నిలబడి పోయాను.

II. క్రింది సంక్లిష్ట వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చండి.

ప్రశ్న 1.
జనమంతా పగలబడి నవ్వుతూ గోల చేస్తు న్నారు
జవాబు:
జనమంతా పగలబడి నవ్వుతున్నారు. గోల చేస్తు న్నారు.

ప్రశ్న 2.
అతను మాట్లా డుతూ అన్నం తింటున్నాడు.
జవాబు:
అతను మాట్లా డుతున్నాడు. అన్నం తింటున్నాడు.

ప్రశ్న 3.
అంబేద్కర్ అమెరికా వెళ్ళి తనతో ఇరవైనాలుగు పెట్టెల పుస్తకాలు తెచ్చుకున్నాడు.
జవాబు:
అంబేద్కర్ అమెరికా వెళ్ళాడు. తనతో ఇరవైనాలుగు పెట్టెల పుస్తకాలు తెచ్చుకున్నాడు.

ప్రశ్న 4.
రాము కాఫీ తాగుతూ చదువుతున్నాడు.
జవాబు:
రాము కాఫీ తాగుతున్నాడు. రాము చదువుతున్నాడు.

ప్రశ్న 5.
కృష్ణ ఉద్యోగం చేసుకుంటూ చదువుకొంటున్నాడు.
జవాబు:
కృష్ణ ఉద్యోగం చేసుకుంటున్నాడు. కృష్ణ చదువు కొంటున్నాడు.

సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్పుట


సంయుక్త వాక్యం :
సమ ప్రాధాన్యం గల వాక్యాలను కలపడం వల్ల ఏర్పడే వాక్యాలను సంయుక్త వాక్యాలు అంటారు.

ప్రశ్న 1.
వీరు పొమ్మను వారు కారు. వీరు పొగబెట్టు వారు.
జవాబు:
వీరు పొమ్మను వారు కారు, పొగబెట్టు వారు.

ప్రశ్న 2.
రైలు వచ్చింది. చుట్టా లు రాలేదు.
జవాబు:
రైలు వచ్చింది కానీ చుట్టా లు రాలేదు.

ప్రశ్న 3.
నాలో చురుకుదనం ఉంది. జిజ్ఞాస ఉంది.
జవాబు:
నాలో చురుకుదనం, జిజ్ఞాస ఉన్నాయి.

ప్రశ్న 4.
పదేళ్ళకే మాకు ఎంతో మాటకారితనం వచ్చేది. ఎంతో పెద్దరికమూ వచ్చేది.
జవాబు:
పదేళ్ళకే మాకు ఎంతో మాటకారితనమూ, పెద్దరికమూ వచ్చేవి.

ప్రశ్న 5.
ఆయన సత్యకాలంవాడు. పరమ సాత్వికుడు.
జవాబు:
ఆయన సత్యకాలంవాడు మరియు పరమ సాత్త్వికుడు. (లేదా) ఆయన సత్యకాలం వాడు, పరమ
సాత్త్వికుడు కూడా.

ప్రశ్న 6.
అంబేద్కర్ కార్యవాది. క్రియాశీలి.
జవాబు:
అంబేద్కర్ కార్యవాది మరియు క్రియాశీలి. (లేదా) అంబేద్కర్ కార్యవాది, క్రియాశీలి కూడా.
ప్రశ్న 7.
కమల బాగా చదివింది. కమలకు ర్యాంకు రాలేదు.
జవాబు:
కమల బాగా చదివింది కాని ర్యాంకు రాలేదు.

ప్రశ్న 8.
రాముడు శివధనుస్సును విరచెను. రాముడు సీతను వివాహమాడెను.
జవాబు:
రాముడు శివధనుస్సును విరచెను మరియు సీతను వివాహమాడెను.

ప్రశ్న 9.
పోటీలో చాలామంది పాల్గొన్నారు. బహుమతి ముగ్గురికే ఇచ్చారు.
జవాబు:
పోటీలో చాలామంది పాల్గొన్నప్పటికీ బహుమతి ముగ్గురికే ఇచ్చారు.

ప్రశ్న 10.
రవి సాయంకాలం వరకు పనిచేసేవాడు. రవి చీకటి పడుతుంటే ఇంటికి వెళ్లేవాడు.
జవాబు:
రవి సాయంకాలం వరకు పనిచేసేవాడు కాని చీకటి పడుతుంటే ఇంటికి వెళ్ళేవాడు.

ప్రశ్న 11.
అనిల్ ఎంతో కష్టపడి చదివాడు. అతడు పరీక్షలో తప్పాడు.
జవాబు:
అనిల్ ఎంతో కష్టపడి చదివాడు కానీ పరీక్షలో తప్పాడు.

ప్రశ్న 12.
ప్రకాశం పంతులుగారు ధైర్యశాలి. అతడు త్యాగశీలి.
జవాబు:
ప్రకాశం పంతులుగారు ధైర్యశాలి మరియు త్యాగశీలి.

ప్రశ్న 13.
సీత పాఠం అర్థం చేసుకొంది. సీత పరీక్ష బాగా వ్రాసింది.
జవాబు:
సీత పాఠం అర్థం చేసుకొనడంతో పరీక్ష బాగా వ్రాసింది.

వాక్యాంగములు
సాధారణంగా వాక్యంలో కర్త, కర్మ, క్రియ అనే మూడు అంగాలు ఉంటాయి.
కర్త (Subject) – పనిని చేసేవాడు కర్త.
కర్మ (Object) – పని యొక్క ఫలితాన్ని అనుభవించేవాడు కర్మ.
క్రియ (Verb) – చేసిన పనిని తెలిపే పదం క్రియ.
ఉదా : వేటగాళ్ళు వలలు పన్నారు.
ఈ వాక్యంలో వేటగాళ్ళు – కర్త, వలలు – కర్మ, పన్నారు – క్రియ.

క్రియను ఎవడు, ఎవరు అను పదాలతో ప్రశ్నించగా వచ్చే జవాబు కర్త.

క్రియను దేనిని, వేనిని అను ప్రశ్నించగా వచ్చే జవాబు కర్మ.

కర్తను తెలిపే పదం కర్తృపదం అనీ, కర్మను తెలిపే పదం కర్మపదం అనీ అంటారు.

కొన్నిచోట్ల వాక్యాల్లో కర్త లోపించవచ్చును.


ఉదా : బడికి వెళ్ళాడు
(ఇక్కడ ‘వాడు’ అనే కర్త పదం లేదు)

కొన్నిచోట్ల వాక్యాల్లో కర్మ లోపించవచ్చును.


ఉదా : నేను చదువుతున్నాను.
(ఇక్కడ కర్మ పదం ‘పాఠం’ లేదు)

కొన్నిచోట్ల క్రియలేని వాక్యాలు ఉండవచ్చును.


ఉదా : దశరథునకు ముగ్గురు భార్యలు.

క్రియలు – భేదములు

పనిని తెలుపు పదములు క్రియలు. ధాతువునకు ప్రత్యయములు చేరి క్రియలు ఏర్పడును.


తెనుగున ధాతువులు ఉకారాంతములై ఉండును.

ధాతువునకు ఉదా : వండు, వ్రాయు, కొట్టు , తిను మొదలగునవి.


క్రియకు ఉదా : వండెను, వ్రాయుచున్నాడు, కొట్టగలడు, తినెను మొదలగునవి.

క్రియలు పనిని తెలిపే విధానమును బట్టి రెండు రకములు. అవి :

1. సమాపక క్రియలు,
2. అసమాపక క్రియలు.
సమాపక క్రియ – వాక్యార్థమును పూర్తి చేయునది. – తిన్నాడు, చూశాడు, చదివాడు.
ఉదా : సీత బడికి వెళ్ళెను.

అసమాపక క్రియ – వాక్య భావమును పూర్తి చేయని క్రియ. – తిని, చూసి, వండి, చేస్తూ
ఉదా : సీత బడికి వెళ్ళి

సమాపక క్రియలు కాలము, వచనము మొదలగు వాటిని అనుసరించి మారుచుండును.


అసమాపక క్రియలు మారవు. అందుకే వాటిని అవ్యయములు అని లెక్కించిరి.
పని జరుగు సమయమును బట్టి సమాపక క్రియలు నాలుగు కాలములందు వాడబడును.
భూతకాల క్రియ – జరిగిపోయిన పనిని తెలుపును.
ఉదా : వెళ్ళెను, వెళ్ళితిని, వ్రాసితిమి.

వర్తమానకాల క్రియ – జరుగుచున్న పనిని తెలుపు క్రియ.


ఉదా: వెళ్ళుచున్నావు, వ్రాయుచున్నాడు, తినుచున్నాము.

భవిష్యత్కాల క్రియ – జరుగబోవు పనిని తెలుపు క్రియ.


ఉదా : వెళ్ళగలను, వ్రాయగలడు, తినగలము.

తద్ధర్మార్థక క్రియ – భూత భవిష్యద్వర్తమానముల కంటే భిన్నమై, ఆ మూడు కాలములను తెలుపు


క్రియ.
ఉదా : వెళ్ళును, వెళ్ళెదము, చేసెదవు.
(ఇప్పటి వ్యవహారమున తద్ధర్మార్థక క్రియ భవిష్య దర్థములో వాడుచున్నారు)

అసమాపక క్రియలు :
1. క్త్వార్థకము – భూతకాలమును తెలిపే అసమాపక క్రియ. ధాతువు చివర ‘ఇ’ చేరును.
ఉదా : చేయు + ఇ = చేసి, తిను + ఇ = తిని.

2. వ్యతిరేక క్త్వార్థకము – క్త్వార్థకమునకు వ్యతిరేకము. ధాతువునకు “అక” చేరును.


ఉదా : చేయు + అక = చేయక,
తిను + అక = తినక.

3. శత్రర్థకము – వర్తమానార్ధమును తెలుపునట్టిది. ధాతువునకు “చున్” ప్రత్యయము చేరును.


ఉదా : చేయు + చున్ = చేయుచున్
తిను + చున్ = తినుచున్.
4. తుమున్నాద్యర్థకము – కారణమును తెలియజేసేది. ధాతువునకు “అన్” చేరును.
ఉదా : చేయన్, తినన్.

5. చేదర్థకము – కార్యకారణ సంబంధాన్ని తెలియ జేసేది. ధాతువునకు “ఇనన్” ప్రత్యయము


చేరును.
ఉదా : చదివినన్, చేసినన్, తినినన్.

6. అనంతర్యార్థకము – తరువాత అనే అర్థా న్ని తెలుపుతూ ధాతువునకు “డున్” చేరును.


ఉదా : చదువుడున్, చేయుడున్, తినుడున్.

7. భావార్థకము – ధాతువు యొక్క భావాన్ని తెలిపేది. “ట” చేరును.


ఉదా : విను – వినుట, చేయు – చేయుట, తిను – తినుట, వండు వండుట.

8. వ్యతిరేక భావార్ధకము – ధాతువు యొక్క అర్థా నికి వ్యతిరేకార్థమును తెలుపుచూ “అమి” చేరిన
అసమాపక క్రియ.
ఉదా : విను – వినమి, చేయు – చేయమి, తిను – తినమి.

వాక్యములలో రకములు

వాక్యాలు చెప్పే భావాన్ని, విధానాన్ని బట్టి కొన్ని రకాలుగా విభజించబడ్డా యి.

1. విద్యర్థక వాక్యం – కర్త పనిని చేయాలని ఆదేశించి నట్లు గా ఉంటుంది.


ఉదా :

1. సలీం ! నీవు తరగతిలో కూర్చో.


2. మీరు చదవండి.
3. మీరు చిత్రం వేయండి.
4. నీవు గూడూరు వెళ్ళు.
5. మీరు వెళ్ళాల్సిందే.
6. మీరు వ్రాయండి.
7. నువ్వు వాడు.
2. అనుమత్యర్థక వాక్యం – కర్త చేయవలసిన పనిని చేయవచ్చునని అనుమతి ఇచ్చినట్లుంటుంది.
ఉదా :

1. పిల్లలూ ! ఇక మీరు ఆటలాడుకోవచ్చు.


2. మీరు ఆటలు ఆడవచ్చు.
3. పిల్లలు ఊరికి వెళ్ళవచ్చు.
4. మీరు భోజనం చేయవచ్చు.
5. మీరు రావచ్చు.
6. నేను లోపలికి రావచ్చునా ?
7. మేము ఆటలు ఆడవచ్చునా ?

3. సందేహార్థక వాక్యం – కర్త చేయవలసిన పనిని చేస్తా డో, చేయడో అనే అనుమానం
తెలుపుతుంది.
ఉదా :

1. రాము ఈ రోజు బడికి రాడేమో.


2. రవి చూస్తా డో ? చూడడో ?
3. అమ్మ రమ్మంటుందో ? వద్దంటుందో ?
4. ఈ గొయ్యి లోతో ? కాదో ?
5. వారు వెళ్ళవచ్చా ?
6. వాన పడుతుందో, లేదో ?
4. ప్రశ్నార్థక వాక్యం – కర్త చేయవలసిన పని జరిగిందా అని ప్రశ్నిస్తు న్నట్లు ఉంటుంది.
ఉదా :

1. లలిత బడికి వచ్చిందా ?


2. పాఠాలు బాగా విన్నారా ?
3. పరీక్షలు బాగా వ్రాశారా ?
4. పదార్థా లు రుచిగా ఉన్నాయా ?
5. వారందరికి ఏమైంది ?
5. వ్యతిరేకార్థక వాక్యం – కర్త చేయవలసిన పనిని చేయడు అని చెప్పడం.
ఉదా :

1. రాజు ఈరోజు బడికి రాడు.


2. లత సినిమా చూడదు.
3. అమ్మ ఊరికి వెళ్ళదు.
4. వాడు పాఠం వ్రాయడు.
5. రాము చదవడు.

6. నిషేధార్థక వాక్యం – ఎవరూ ఈ పనిని చేయకూడదనే భావన ఉంటుంది.


ఉదా :
1. పరీక్ష మొదలైన తరువాత ఎవరూ లోనికి రాకూడదు.
2. మీరు అల్లరి చేయవద్దు .
3. మీరు బయట తిరగవద్దు .
4. దుష్టు లతో స్నేహం వద్దు .
5. మీరు రావద్దు .
6. మీరు వెళ్ళవద్దు .
7. నీవు తినవద్దు .
7. నిశ్చయార్థక వాక్యం – ఒక నిశ్చయాన్ని తెలిపేందుకు వాడే వాక్యం. కర్తకు లేక మరొక పదానికి
“ఏ, అ”లు చేర్చడం వలన ఏర్పడును. లేకుండా కూడా ఉండవచ్చును.
ఉదా :

1. రాముడే రక్షకుడు, రాముడు రక్షకుడు, వాడు శాస్త్రవేత్త.


2. నేను తప్పక వస్తా ను.
3. నేను రేపు రాస్తా ను.
4. రాము తప్పక వెళ్తా డు.
5. గోపాల్ చెట్టు ఎక్కాలి.
8. ఆశ్చర్యార్థక వాక్యం – ఆశ్చర్యాన్ని తెలిపేది.
ఉదా :

1. అయ్యో ! ఎంత కష్టం వచ్చింది, ఆహా ! ఎంత బాగున్నదో !


2. ఆహా ! కూర ఎంత బాగుందో !
3. ఆహా ! చిత్రం ఎంత అద్భుతంగా ఉందో !
4. ఆహా ! ఏమి ప్రకృతి రమణీయత !
5. ఆహా ! ఎంత బాగుందీ !

9. ప్రార్థనార్థక వాక్యం – ఇతరులను ప్రార్థించు, అర్థించు అనే విషయంలో ఈ వాక్యాలు వస్తా యి.
ఉదా :

1. దయచేసి అనుమతించండి.
2. నన్ను అనుగ్రహించండి.
3. నాకు సెలవు ఇవ్వండి.
4. లోపలికి అనుమతించండి.
5. అయ్యా ! నాకు చదువు చెప్పండి.
6. దయచేసి నన్ను కాపాడు.
7. దయచేసి ఆ పనిని పూర్తి చేయండి.
10. అప్యర్థకం – ‘అపి’ అనగా కూడా అని అర్థం. కూడా అనే పదాన్ని ప్రయోగించాల్సిన
సమయంలో ఈ వాక్యాలను వాడుతాము.
ఉదా :

1. వర్షాలు వచ్చినా చెరువు నిండలేదు.


2. అధికారులు వచ్చినా సమస్యలు తీరలేదు.
3. ముఖ్యమంత్రి వచ్చినా స్పందన లేదు.
4. వర్షాలు పడినా ధరలు తగ్గలేదు.
5. బాగా చదివినా మార్కులు రాలేదు.
6. రైలు వచ్చినా చుట్టా లు రాలేదు.
7. దేవుడు దిగివచ్చినా, ఆయన గెలవలేదు.
11. శత్రర్థకము వర్తమాన అసమాపక క్రియను శత్రర్థకము అని అంటారు.
ఉదా :

1. రాము తింటూ వింటున్నాడు.


2. అమ్మ వండుతూ చదువుతున్నది.
3. లత పాడుతూ నటిస్తు న్నది.
4. శ్రీను పాఠం వింటూ రాస్తు న్నాడు.

12. తద్ధర్మార్థక వాక్యం – మూడు కాలాల యందును జరుగు పనులను తెలియజేయును.


ఉదా :

1. సూర్యుడు తూర్పున ఉదయించును.


2. అగ్ని మండును.
3. సముద్రపు నీరు ఉప్పగా ఉండును.
4. ఆవుపాలు మధురంగా ఉండును.
13. ఆశీర్వచనార్థకం – ఆశీస్సును తెలియజేయు వాక్యములను ఆశీర్వచనార్థక వాక్యాలు
అంటారు.
ఉదా :

1. మీకు మేలు కలుగుగాక


2. మీకు క్షేమం కలుగుగాక
3. భగవంతుడు మిమ్ము అనుగ్రహించు గాక
4. మీ మార్గం ఫలప్రదం అగునుగాక
5. మీకు విజయం సిద్ధించుగాక.
6. మీరు ఉత్తీర్ణులగుదురుగాక.
14. హేత్వర్థక వాక్యం – హేతువు అనగా కారణం. ఒక పని జరగడానికి ఒక నిమిత్తం ఉండాలి.
అలాంటి వాక్యాలను హేత్వర్థక వాక్యాలు అని అంటారు.
ఉదా :

1. బాగా చదవడం వల్ల మార్కులు వచ్చాయి.


2. వరదలు రావడంతో ఇబ్బందులు వచ్చాయి.
3. మురుగునీరు రావడంతో దోమలు వచ్చాయి.
4. వర్షాలు కురవడంతో రైతులు ఆనందించారు.

15. సామర్థ్యార్థకం – పనిని చేయుటయందు సమర్థత కలిగి ఉండటం.


ఉదా :

1. రవి పాడగలడు.
2. లత చక్కగా చిత్రం వేయగలదు.
3. అర్జు నుడు యుద్ధం చేయగలడు.
4. ప్రధాని సామర్థ్యాన్ని నిరూపించుకొనగలడు.
వాక్యములు – భేదములు

ఒక భావమును తెలుపు పదముల సముదాయమే వాక్యము.


ఉదా : రాముడు పాఠమును చదివెను.

ఒక్కొక్కప్పుడు ప్రశ్నకు సమాధానంగా ఒక మాటనే చెప్పవచ్చును. అది పూర్తి భావాన్ని ఇస్తుంది.


కనుక అదియును వాక్యమే అగును.
ఉదా : నీదేవూరు ? – విజయవాడ.
నీ పేరేమి ? – రామరాజు.
వాక్యములు ముఖ్యముగా మూడు రకములు.
అవి :

1. సామాన్య వాక్యము,
2. సంక్లిష్ట వాక్యము,
3. సంయుక్త వాక్యము.
1. సామాన్య వాక్యము (Simple Sentence) :
దీనిని సంపూర్ణ వాక్యము అని కూడా అంటారు. పూర్తి అర్థమును తెలుపుతూ సమాపక క్రియతో
కూడినది సామాన్య వాక్యము.
ఉదా :
హనుమంతుడు సముద్రమును దాటెను. భావమును పూర్తిగా చెప్పకుండా అసమాపక క్రియతో
కూడిన వాక్యము అసంపూర్ణ వాక్యము. దీనినే ఉపవాక్యము అందురు. ఉదా : నేను బడికి వెళ్ళి.

2. సంక్లిష్ట వాక్యము (Complex Sentence) :


ఒక ప్రధాన వాక్యము, ఒకటిగాని అంతకంటే ఎక్కువగాని ఉపవాక్యములు కలిగియుండు వాక్యమే
సంక్లిష్ట వాక్యము. దీనిలో ప్రధాన వాక్యంలో సమాపక క్రియ, ఉపవాక్యాల్లో అసమాపక క్రియ
ఉంటాయి.

ఉదా :
మీరు వచ్చినచో, ఊరికి వెళ్ళుదము. సీత పాటను పాడి, బహుమతి గెల్చుకొనెను. వాడు చదివినా,
అర్థం కాలేదు.
రెండు సామాన్య వాక్యాలు కలిపి సంక్లిష్ట వాక్యముగా చేయవచ్చును. అప్పుడు మొదటి
వాక్యంలోని క్రియ అసమాపక క్రియ అవుతుంది.
ఉదా :

1. వాడు బడికి వెళ్ళాడు. వాడు పాఠమును చదివాడు.


వాడు బడికి వెళ్ళి పాఠమును చదివాడు.
2. సీత నవ్వుతున్నది. సీత మాట్లా డుతున్నది.
సీత నవ్వుతూ మాట్లా డుతున్నది.
3. సంయుక్త వాక్యము (Compound Sentence) :
పరస్పర సంబంధము గల రెండు వాక్యములు ఒకే వాక్యములో ఉన్నచో అది సంయుక్త వాక్యము.
ఉదా : అతడు విద్యావంతుడే గాక వినయశీలి కూడ.
వాడు చదివాడు కాని, అర్థం కాలేదు.

అర్థా లు

అంగన = స్త్రీ
అగ్రహారం = బ్రాహ్మణ పండితులకు రాజులు బహుమతిగా ఇచ్చే ఇళ్లు , భూములు
అభీప్సితం = కోరిక
అభ్యాగతుడు = భోజన సమయానికి వచ్చిన అతిథి
ఆర్ధ = తడిసిన
ఆసరా = తోడు
ఈవి = త్యాగం
ఉద్ది = జత
ఉన్నతి = ప్రగతి
ఉమ్రావులు = ఉన్నత వంశీయులైన కళాపోషకులు
ఏపు = వికాసం
ఏరుతార్లు = భేదాలు
కడగండ్ల = కష్టా లు
కయ్య = కాలువ
కర్దమం = బురద

పర్యాయ పదాలు

యశం = కీర్తి, గొప్ప


రవం = శబ్దం, ధ్వని
జెండా = పతాకం, కేతనం
రైతు = హాలికుడు, కర్షకుడు
అరణ్యం = వనం, అడవి
పల్లె = గ్రామం, జనపదం
తారలు = చుక్కలు, నక్షత్రాలు
మబ్బు = మేఘం, తెచ్చి
హాటకం = బంగారం, హోన్ను
సంబురం = సంతోషం, ఆనందం
వేదండము = ఏనుగు, కరి
వెన్నెల = జ్యోత్స్న, కౌముది
వటువు = బ్రహ్మచారి, వర్ణి, వడుగు
భండనం = యుద్ధం, రణం
కృపాణం = కత్తి, ఖడ్గం
పొలిమేర = సరిహద్దు , ఎల్ల
పొంకంగ = సొంపుగా, అందంగా
దేవాలయం = గుడి, కోవెల
పురాగ = మొత్తం, అంతా

వ్యుత్పత్త్యర్థా లు

నీరజభవుడు – విష్ణువు నాభి కమలము నందు పుట్టినవాడు (బ్రహ్మ)


పారాశర్యుడు – పరాశర మహర్షి కుమారుడు (వ్యాసుడు)
త్రివిక్రముడు – ముల్లోకాలను ఆక్రమించినవాడు (విష్ణువు)
గురువు – ఆజ్ఞానమనే అంధకారిని తొలగించే వాడు (ఉపాధ్యాయుడు)
అధ్యక్షుడు – చర్యలను కనిపెట్టి చూచేవాడు
విశ్వంభరుడు – విశ్వాన్ని భరించేవాడు (విష్ణువు)
భాగీరధీ – భగీరథమునిచే తీసుకురాబడదు
భాష – భాషింపబడేది (గంగ)
విష్ణువు – విశ్వమంతటా వ్యాపించి ఉండేవాడు (విష్ణుమూర్తి)

నానార్థా లు

అంబరము = వస్త్రం, ఆకాశం


ఆశ = కోరిక, దిక్కు
హరి = విష్ణువు, ఇంద్రు డు, గుర్రం
క్షేత్రం = చోటు, పుణ్యస్థా నం
స్కందం = కొమ్మ, ప్రకరణం
సిరి = సంపద, లక్ష్మీ
రాజు = ప్రభువు, ఇంద్రు డు
బుధుడు = పండితుడు, బుధగ్రహం
వర్షం = వాన, సంవత్సరం, దేశం
పణం = పందెం, కూలి, వెలి
ఘనం = మేఘం, ఏనుగు, కఠినం
గురువు = ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి
కులం = వంశం, జాతి
సాహిత్యం = కలయిత, వాజ్ఞ్మయం
వీడు = పట్టణం, వదలడం, ఇతడు
బాష్పం = కన్నీరు, ఆవిరి

ప్రకృతి – వికృతులు

ప్రకృతి – వికృతి

సముద్రం – సంద్రం
ఆధారం – అదెరువు
విద్య – విద్దె
శిఖ – సిగ
ప్రయాణం – పైనం
దిశ – దెస
భిక్ష – బిచ్చ
యాత్ర – జాతర
మత్స్యం – మచ్చెం
పంక్తి – బంతి
రత్నం – రతనం
ఆజ్ఞ – ఆన
ఆశ్చర్యం – అచ్చెరువు
కవిత – కైత
కార్యం – కర్జం
కావ్యం – కబ్బం
భాష – బాస

సొంత వాక్యాలు

1. సయ్యాటలాడు : ఆకాశంలో ఎగిరిన పతంగి గాలితో సయ్యాటలాడుతోంది.

2. చెవి వారిచ్చి : మా నానమ్మ చెప్పే కథలను చెవి వారిచ్చి వింటాను.

3. కుటిలవాజితనం : మనుషులకు ఉండకూడని లక్షణం కుటిలవాజితనం.

4. పొలిమేర : మా ఊరి పొలిమేరలో మంజీర నది ప్రవహిస్తుంది.

5. నగారా : అయిదు రాష్ట్రా ల్లో ఎన్నికల నగారా మోగింది.

6. మచ్చుతునక : తెలంగాణ చరిత్రలో పాపన్నపేట సంస్థా నం మచ్చుతునక.

7. భాసిల్లు : ఏడుపాయల వనదుర్గ ఆలయం పచ్చని రమణీయతల మధ్య భాసిల్లు తోంది.

8. ముసురుకొను : బెల్లం చుట్టూ ఈగలు ముసురు కున్నాయి.

9. ప్రాణం పోయడం : తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ ప్రాణం పోశారు.

10. గొంతు వినిపించు రాష్ట్ర సమస్యలపై ప్రధానితో అభిలాష్ తన గొంతు వినిపించాడు.

11. యజ్ఞం : గ్రామ క్షేమం కోసం మందిరంలో యజ్ఞం జరిగింది.

12. చెరగని త్యాగం : తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న విద్యార్థు లు చెరగని త్యాగంగా
మిగిలారు.
13. పుట్టినిల్లు : సంస్కృతి సంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లు .

14. ఏకాకి : పల్లెల్లో ఏకాకి జీవనం కనిపించదు.

15. చిత్తశుద్ధి : చిత్తశుద్ధితో చేసిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది.

16. గజ్జెకట్టు : ఆర్థిక అసమానతలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు వీరేశం గజ్జెకట్టా డు.

17. పఠనీయ గ్రంథం : మనిషి జీవితం పఠనీయ గ్రంథం లాంటిది.

…………..xxxxxxxxxxxxxx………..

1. సవర్ణదీర్ఘసంధి :
అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘము ఏకాదేశ మగును.
అ, ఆలకు అ, ఆలు
ఇ, ఈలు ఇ, ఈలు
ఉ, ఊలకు ఉ, ఊలు
ఋ, ఋలకు ఋ, ౠలు సవర్ణములు. సవర్ణములకు దీర్ఘము ఆదేశముగా వచ్చును. కనుక
సవర్ణదీర్ఘ సంధి.
ఉదా :
నర + అంతకుడు – నరాంతకుడు
దివ్య + ఆనందము – దివ్యానందము
యతి + ఇంద్రు డు – యతీంద్రు డు
ముని + ఈశ్వరుడు – మునీశ్వరుడు
గురు + ఉపదేశము – గురూపదేశము
పితౄ + ఋణము – పితౄణము
కుల + ఆచార్యుడు – కులాచార్యుడు
దిశ + అంచలము – దిశాంచలము
శ్రావణ + అభ్రము – శ్రావణాభ్రము
ఆంధ్ర + అంబిక – ఆంధ్రాంబిక
విభ + ఆవళులు – భావళులు
సచివ + ఆలయం – సచివాలయం
శీత + అమృతము – శీతామృతము
అశ్వ + ఆరూఢుడు – అశ్వారూఢుడు
పుణ్య + అంగన – పుణ్యాంగన
ముని + ఈశ్వర – మునీశ్వర

2. గుణసంధి:
అకారమునకు ఇ, ఉ, ఋలు పరమైనపుడు వరుసగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశ మగును.
ఏ, ఓ, అర్లకు గుణములని పేరు.

ఉదా :
నర + ఇంద్రు డు – నరేంద్రు డు
మహా + ఇంద్రు డు – మహేంద్రు డు
మహా + ఈశుడు – మహేశుడు
సూర్య + ఉదయము – సూర్యోదయము
మహా + ఋషి – మహర్షి
గర్వ + ఉన్నతి – గర్వోన్నతి
రమ్య + ఉద్యానములు – రమోద్యానములు
వదాన్య + ఉత్తముడు – వదాన్యోత్తముడు
సర్వ + ఈశ్వరా – సర్వేశ్వరా
భాగ్య + ఉదయం – భాగ్యోదయం
సత్య + ఉక్తి – సత్యోక్తి
దానవ + ఇంద్రు డు – దానవేంద్రు డు
నవ + ఉదయం – నవోదయం

3. వృద్ధిసంధి:
అకారమునకు ఏ, ఐలు పరమగునపుడు ‘ఐ’ కారమును, ఓ, ఔలు పరమగునపుడు ‘ఔ’
కారమును ఏకాదేశమగును.

ఉదా :
ఏక + ఏక – ఏకైక
లోక + ఐక్యము – లోకైక్యము
గంగ + ఓఘము – గంగౌఘము
గ్రామ + ఔన్నత్యము – గ్రామౌన్నత్యము
నాటక + ఔచిత్యం – నాటకౌచిత్యం
ఏక + ఏక – ఏకైక
వసుధ + ఏక – వసుధైక
దివ్య + ఐరావతం – దివ్యైరావతం
దేశ + ఐశ్వర్యం – దేశైశ్వర్యం
వన + ఓషధి – వనౌషధి
సమ + ఐక్యత – సమైక్యత

4. యణాదేశసంధి :
ఇ, ఉ, ఋలకు సవర్ణములు కాని అచ్చులు పరమగునపుడు క్రమముగా య, వ, ర, లు
ఆదేశమగును.

ఉదా :
ప్రతి + ఏకము – ప్రత్యేకము
వస్తు + ఐక్యము – వస్వైక్యము
పితృ + అంశము – పిత్రంశము
అతి + అంత – అత్యంత
అభి + ఆగతులు – అభ్యాగతులు
అణు + ఆయుధాలు – అణ్వాయుధాలు
అతి + అద్భుతం – అత్యద్భుతం
(ఇ + ఇ కాని అచ్చు – య
ఉ + ఉ కాని అచ్చు – వ
ఋ + ఋ కాని అచ్చు – ర)

5. జస్త్వసంధి :
క, చ, ట, త, పలకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరములు గాని, శ, ష, సలు గాక మిగిలిన హల్లు లుగాని,
అచ్చులుగాని పరమైనపుడు క్రమముగా గ, జ, డ, ద, బలు ఆదేశమగును.
ఉదా :
వాక్ + అధిపతి – వాగధిపతి
అచ్ + అంతము – అజంతము
షట్ + రసములు – షడ్రసములు
సత్ + రూపము – సద్రూపము

6. శ్చుత్వసంధి :
సకార తవర్గలకు శకార చవర్గలు పరమైనప్పుడు శకార చవర్గములే ఆదేశమగును.
ఉదా :
సత్ + జనులు – సజ్జనులు
మనస్ + చంద్రికలు – మనశ్చంద్రికలు
7. ష్టు త్వసంధి :
సకార తవర్గాలకు, షకార టవర్గలు పరమైనచో షకార టవర్గలే ఆదేశమగును.
ఉదా :
మనస్ + షట్పదము – మనష్షట్పదము
దనుస్ + టంకము – ధనుష్టంకము
తత్ + టీకా – తట్టీకా

8. అనునాసిక సంధి:
క, చ, ట, త, పలకు న, మలు పరమైనప్పుడు ఆయా వర్గ పంచమాక్షరములే వైకల్పికముగా
ఆదేశమగును.
ఉదా :
వాక్ + మహిమ – వాఙ్మహిమ, వాగ్మహిమ
రాట్ + నిలయము – రాణ్ణిలయము, రాడ్నిలయము
కకుప్ + నేత – కకుమ్నేత, కకుబ్నేత

9. విసర్గసంధి :
i) హస్వ అకారము మీది విసర్గకు వర్గ ప్రథమ, ద్వితీయాక్షరములు గాని, శ, ష, సలు తప్ప మిగిలిన
హల్లు లు గాని పరమైనచో విసర్గకు ముందున్న అకారమునకు “ఓ”కారమాదేశ మగును.
ఉదా :
మనః + గతి – మనోగతి
తపః + ధనము – తపోధనము
మనః + రథము – మనోరథము
శిరః + రత్నము – శిరోరత్నము

ii) విసర్గాంత శబ్దములకు అచ్చులు గాని, వర్గ తృతీయ, చతుర్ధ, పంచమాక్షరములు గాని, హ,
య, వ, రలు గాని పరమైనపుడు విసర్గకు రేఫము ఆదేశమగును.
ఉదా :
చతుః + ఆత్మ – చతురాత్మ
చతుః + భుజుడు – చతుర్భుజుడు
ధనుః + వేదము – ధనుర్వేదము
పునః + దర్శనము – పునర్దర్శనము

iii) విసర్గకు క, ఖ, ప, ఫలు పరమైనపుడు విసర్గకు మార్పురాదు.


ఉదా :
యశః + కాయము – యశఃకాయము
తపః + ఫలము – తపఃఫలము

10. సకారాంత సంధి:


i) ‘అస్’ అంతమున గల పదమునకు అకారము పరమైనచో రెండింటికిని కలిపి ‘ఓ’ కారమాదేశ
మగును.
ఉదా :
మనస్ + అభిలాష – మనోభిలాష
యశస్ + అబ్ధి – యశోబ్ధి

ii) సకారాంత శబ్దములకు శ, షలు పరమైనచో శ, షలు గాని, విసర్గము గాని వచ్చును.
ఉదా :
మనస్ + శక్తి – మనశ్శక్తి, మనఃశక్తి
చతుస్ + షష్టి – చతుష్షష్టి, చతుఃషష్టి

iii) సకారాంత శబ్దములకు ట, ఠలు పరమైనప్పుడు ‘ష’ వర్ణమాదేశమగును.


ఉదా :
అయస్ + టంకము – అయష్టంకము
ధనుస్ + టంకారము – ధనుష్టంకారము

II. తెనుగు సంధులు :

తెలుగు అజంత భాష. అనగా తెనుగు పదములు అచ్చుతో అంతమగును. సంధి అనగా పూర్వపర
స్వరములకు పరస్వరము ఏకాదేశ మగుట.
ఉదా :
రాముడు + అతడు – రాముడతడు
ఏమి + ఏమి – ఏమేమి
సీత + అయ్య – సీతయ్య

1. అకార సంధి :
అత్తు నకు సంధి బహుళము.
ఉదా :
రామ + అయ్య – రామయ్య
సీత + అక్క – సీతక్క
మేన + అత్త – మేనత్త
పుట్టిన + ఇల్లు – పుట్టినిల్లు , పుట్టినయిల్లు
దూత + ఇతడు – దూతయితడు
అమ్మ + ఇచ్చెను – అమ్మయిచ్చెను
ఒక + ఒక – ఒకానొక అన్యవిధము
ముచ్చట + ఆడు – ముచ్చటాడు
పుట్టిన + ఇల్లు – పుట్టినిల్లు
ముత్త + ఐదువ – ముత్తైదువ
పొత్తు ల + ఇల్లు – పొత్తు లి

2. ఇకార సంధి:
i) మధ్యమ పురుష క్రియలయందు ఇత్తు నకు సంధియగు.
ఉదా :
చేసితివి + అపుడు – చేసితినపుడు
ఏలితిరి + ఇపుడు – ఏలితిరిపుడు

ii) ఏమ్యాదుల ఇత్తు నకు సంధి వైకల్పికముగాను.


ఉదా :
ఏమి + అంటివి – ఏమంటివి, ఏమియంటివి
మఱి + ఏమి – మఱేమి, మఱియేమి
దారిని + ఇచ్చిరి – దారినిచ్చిరి
వేయి + ఏటికిన్ – యేటికిన్
అక్కడికి + అక్కడ – అక్కడికక్కడ
గెల్చితిమి + అమ్మ – గెల్చితిమమ్మ

iii) క్త్వార్థంబైన ఇత్తు నకు సంధిలేదు.


ఉదా :
వచ్చి + ఇచ్చెను – వచ్చియిచ్చెను

3. ఉకారసంధి:
ఉత్తు నకచ్చు పరంబగునపుడు సంధి యుగు.
ఉదా :
రాముడు + అతడు – రాముడతడు
అతడు + ఎక్కడ – అతడెక్కడ .
మనము + ఉన్నాము – మనమున్నాము
యుద్ధము + అడి – యుద్ధమాడి
పేరు + అవుతుంది – పేరవుతుంది
ధరాతలము + ఎల్ల – ధరాతలమెల్ల
సయ్యాటలు + ఆడెన్ – సయ్యాటలాడెన్
జగమ + ఎల్ల – జగమెల్ల
దారి + అవుతుంది – దారవుతుంది
ఎత్తు లకు + ఎదిగిన – ఎత్తు లకెదిగిన

4. అపదాదిస్వర సంధి :
అంద్వవగాగమంబులం దప్ప నపదాది స్వరంబు పరంబగునప్పుడచ్చునకు సంధియగు.
ఉదా :
మూర + ఎడు – మూరెడు
ఆర్థి + ఇంచు – అర్ధించు

III. ఆగమ సంధులు :

1. యడాగమ సంధి: సంధిలేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు యడాగమంబగు.


ఉదా :
మా + అమ్మ – మాయమ్మ
వచ్చి + ఇచ్చెను – వచ్చియిచ్చెను

2. రుగాగమ సంధి
i) పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరంబగునపుడు కర్మధారయమునందు రుగాగమంబగు.
ఉదా :
పేద + ఆలు – పేదరాలు
మనుమ + ఆలు – మనుమరాలు
జవ + ఆలు – జవరాలు
ముద్ద + ఆలు – ముద్దరాలు
జవ + ఆలు – జవరాలు
బాలింత + ఆలు – బాలింతరాలు
బీద + ఆలు – బీదరాలు

ii) కర్మధారయమునందు తత్సమంబులకు ఆలు శబ్దము పరంబగునపుడు అత్వంబునకు


ఉత్వంబును రుగాగమంబు నగు.
ఉదా :
ధీర + ఆలు – ధీరురాలు
గుణవత + ఆలు – గుణవంతురాలు
ధైర్యవంత + ఆలు – ధైర్యవంతురాలు
శ్రీమంత + ఆలు – శ్రీమంతురాలు

3. టుగాగమ సంధి
i) కర్మధారయములందుత్తు నకు అచ్చు పరంబగు నపుడు టుగాగమంబగు.
ఉదా :
నిగ్గు + అద్దము – నిగ్గుటద్దము
కఱకు + అమ్ము – కఱకుటమ్ము
సరసపు + అలుక – సరసపుటలుక

కర్మధారయములందు అనుటచే ఉకారములేని వాటికి కూడా కొన్ని చోట్ల టుగాగమంబు


వచ్చును.
దుక్కి + ఎద్దు – దుక్కిటెద్దు
పల్లె + ఊరు – పల్లెటూరు

ii) కర్మధారయమునందు పేర్వాది శబ్దములకు అచ్చు పరంబగునపుడు టుగాగమంబు


విభాషనగు.
ఉదా :
పేరు + ఉరము – పేరుటురము , పేరుమ
పొదరు + ఇల్లు – పొదరుటిల్లు , పొదరిల్లు

4. దుగాగమ సంధి :
నీ, నా తన శబ్దములకు ఉత్తర పదము పరంబగునపుడు దుగాగమంబు విభాషనగు.
ఉదా :
నీ + చెలిమి – నీదుచెలిమి
నా + నేరము – నాదునేరము
తన + కోపము – తనదుకోపము

5. నుగాగమ సంధి:
1) సమాసంబుల ఉదంతంబులగు స్త్రీ సమంబులకును, పంపులకును పరుష సరళములు
పరమగునపుడు నుగాగమంబగు.
ఉదా :
చిగురు + కయిదువు – చిగురుంగయిదువు చిగురుఁగయిదువు చిగురున్దయిదువు
2) షష్ఠీ సమాసమునందుకార, ఋకారములకు అచ్చు పరంబగునపుడు నుగాగమంబగు.
ఉదా :
రాజు + ఆనతి – రాజునానతి
విధాతృ + ఆజ్ఞ – విధాతృనాజ్ఞ

3) ఉదంత తద్ధర్మార్థక విశేషణమునకు అచ్చు పరంబగునపుడు నుగాగమంబగు.


ఉదా :
చేయు + అతడు – చేయునతడు
చదువు + అతడు – చదువునతడు

IV. ఆమ్రేడిత సంధులు :

1) అచ్చునకు ఆమ్రేడితంబు పరంబగునపుడు సంధి తరచుగానగు.


ఉదా :
ఔర + ఔర – ఔరౌర
ఆహా + ఆహా – ఆహాహా

2) ఆమ్రేడితంబు పరంబగునపుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణంబుల కెల్ల అదంతంబైన


ద్విరుక్త టకారంబగు.
ఉదా :
కడ + కడ – క + ట్ట + కడ – కట్టకడ
ఎదురు + ఎదురు – ఎట్టఎదురు
మొదలు + మొదలు – మొట్టమొదట

3) ఆమ్రేడితంబు పరంబగునపుడు మధ్యమ పురుష ‘ము’, ‘డు’ లకు లోపంబు విభాషనగు.


ఉదా :
నిలుము + నిలుము – నిలునిలుము, నిలుమునిలుము
కొట్టు డు + కొట్టు డు – కొట్టు కొట్టు డు, కొట్టు డుకొట్టు డు

4) ఆమ్రేడితంబు పరంబగునపుడు విభక్తి లోపంబు బహుళంబుగా నగు.


ఉదా :
నాడు + నాడు – నానాడు, నాడునాడు
ఇంచుక + ఇంచుక – ఇంచించుక, ఇంచుకించుక
5) అందదుకు ప్రభృతులు యథా ప్రయోగంబుగ గ్రాహ్యంబులు.
ఉదా :
అదుకు + అదుకు – అందదుకు
చెదరు + చెదరు – చెల్లా చెదరు
తునియలు + తునియలు – తుత్తు నియలు
మిట్లు + మిట్టు – మిఱుమిట్లు

V. ఆదేశ సంధులు :

1. ద్విరుక్తటకారాదేశ సంధి:
కుఱు, చిఱు, కడు, నడు, నిడు శబ్దముల ఱ, డలకు అచ్చు పరంబగునపుడు ద్విరుక్త
టకారంబగు.
ఉదా :
కుఱు + ఉసురు – ‘కుట్టు సురు
చిఱు + ఎలుక – చిట్టెలుక
కడు + ఎదుట – కట్టెదుట
నడు + ಇల్లు – నట్టిల్లు
నిడు + ఊరుపు – నిట్టూరు

2. సరళాదేశ సంధి :
ద్రు త ప్రకృతికముల మీది పరుషములకు సరళములగు,
ఉదా :
తోచెను + చుక్కలు – తోచెను + జుక్కలు
పూచెను + కలువలు – పూచెను + గలువలు
మూటన్ + కట్టు – మూట + గట్టు
ఆదేశ సరళములకు ముందున్న ద్రు తమునకు బిందు సంశ్లేషలు విభాషనగు.
తోచెను + జుక్కలు – తోచెంజుక్కలు , తోచెఁజుక్కలు (బిందువు) , తోచెన్జు క్కలు (సంశ్లేష)
పూచెను + గలువలు – పూచెంగలువలు , పూచెఁగలువలు(బిందువు) , పూచెన్గలువలు (సంశ్లేష)

3. గసడదవాదేశ సంధి:
i) ప్రథమ మీది పరుషములకు గ, స, డ, ద, వలు బహుళంబుగానగు.
ఉదా :
వాడు + కొట్టె – వాడుగొట్టె, వాడుకొట్టె
నీవు + టక్కరివి – నీవుడక్కరివి, నీవుటక్కరివి
నాల్కలు + చాచును – నాల్కలు సాచుచు
ప్రాణాలు + కోల్పోవు – ప్రాణాలుగోల్పోవు
ఆసు + పోయుట – ఆసువోయుట
కాలు + చేతులు – కాలుసేతులు

ii) ద్వంద్వంబునం బదంబుపై పరుషములకు గ, స, డ, ద, వలగు.


ఉదా :
కూర + గాయ – కూరగాయలు
కాలు + చేయి – కాలుసేతులు
తల్లి + తండ్రి – తల్లిదండ్రు లు

4. పుంప్వాదేశ సంధి :
కర్మ ధారయములందలి ‘ము’ వర్ణమునకు పుంపులగు.
ఉదా :
సరసము + వచనము – సరసపువచనము – సరసంపువచనమ
విరసము + మాట – విరసపుమాట , విరసంపుమాట

VI. లోప సంధులు :

1. పడ్వాది సంధి :
పడ్వాదులు పరంబగునపుడు ‘ము’ వర్ణంబునకు లోపపూర్ణబిందువులు విభాషనగు.
ఉదా :
భయము + పడు – భయపడు , భయంపడు, భయముపడు
సూత్రము + పట్టె – సూత్రపట్టె, సూత్రంపట్టె , సూత్రముపట్టె

2. డు వర్ణలోప సంధి (లేక) సమానాధికరణ సంధి :


సమానాధికరణంబగు ఉత్తరపదంబు పరంబ గునపుడు మూడు శబ్దము ‘డు’ వర్ణమునకు
లోపంబును, మీది హల్లు నకు ద్విత్వంబునగు.
ఉదా :
మూడు + లోకములు – ముల్లోకములు
మూడు + జగములు – ముజ్జగములు
(ద్విరుక్తంబగు హల్లు ………. అను సూత్రముచే దీర్ఘమునకు హ్రస్వము)

3. ప్రాతాది సంధి :
i) సమాసంబుల ప్రాతాదుల తొలియచ్చు మీది వర్ణంబుల కెల్ల లోపంబు బహుళంబుగానగు.
ఉదా :
ప్రాత + ఇల్లు – ప్రాయిలు, ప్రాతయిల్లు
పూవు + రెమ్మ – పూరెమ్మ, పూవురెమ్మ

ii) లుప్త శేషంబునకు పరుషములు పరంబగునపుడు నుగాగమంబగు.


ఉదా :
పూవు + తోట – పూన్ తోట
సరళాదేశ దృత సంధులు రాగా పూఁదోట అగును.
అట్లే, కెంపు + తామర – కెందామర

iii) క్రొత్త శబ్దమునకు ఆద్యక్షర శేషంబునకు కొన్ని యెడల నుగాగమంబును, కొన్ని యెడల మీది
హల్లు నకు ద్విత్వంబు నగు.
ఉదా :
క్రొత్త + పసిడి – క్రొంబసిడి
క్రొత్త + తావి – క్రొత్తవి

iv) అన్యంబులకు సహితము ఇక్కార్యంబులు కొండొకచో కానంబడియెడి


ఉదా :
పది + తొమ్మిది – పందొమ్మిది
నిండు + వెఱ – నివ్వెఱ
నెఱ + నడుము – నెన్నడుము

4. లు, ల, నల సంధి :
లు, ల, నలు పరంబగునపుడు ఒకానొకచో ముగాగమంబునకు లోపంబును, తత్పూర్వ
స్వరంబునకు దీర్ఘంబును విభాషనగు.
ఉదా :
మీసము + లు – మీసాలు, మీసములు
వజ్రము + లు – వజ్రాలు, వజ్రములు
చుట్టము + లు – చుట్టా లు, చుట్టములు
పగడము + లను – పగడాలను, పగడములను

5. త్రిక సంధి :
i) ఆ, ఈ, ఏలు త్రికములు.
ii) త్రికంబు మీది అసంయుక్త హల్లు నకు ద్విత్వంబు బహుళంబుగానగు.
ఉదా :
ఆ + కన్య – ఆ + క్కన్య
ఈ + కాలము – ఈ + క్కాలము
ఏ + వాడు – ఏ + వాడు
iii) ద్విరుక్తంబగు హల్లు పరంబగునపుడు ఆచ్చికంబగు దీర్ఘంబునకు హ్రస్వంబగు. అక్కన్య,
ఇక్కాలము, ఎవ్వాడు.

….xxxx………

సమర్థంబులగు పదంబులు ఏకపదంబగుట సమాసంబు. అనగా వేర్వేరు అర్థములు గల


పదములు ఒకే అర్థమునిచ్చు ఏకపదముగా ఏర్పడుట సమాసము అనబడును.

రాజు అనగా ప్రభువు. భటుడు అనగా సేవకుడు. రెండును వేర్వేరు పదములు. అవి రెండు కలిసి
“రాజ భటుడు” అని ఒకే అర్థం ఇచ్చే ఒక పదమైనపుడు అది సమాసము అనబడును.

సమాసంలో లోపించిన విభక్తి ప్రత్యయాలను చేర్చి చెప్పేది విగ్రహవాక్యము. రాజు యొక్క భటుడు.
సమాసము లోని మొదటి పదమును పూర్వపదము అంటారు.

సమాసంలోని రెండవ పదాన్ని ఉత్తరపదము అంటారు.


అర్థభేదముననుసరించి సమాసములు ప్రధానంగా నాలుగు విధాలు. నామభేదమును బట్టి ఆరు
రకాలు.
అవి :

1. తత్పురుషము,
2. కర్మధారయము,
3. ద్విగువు,
4. ద్వంద్వము,
5. బహువ్రీహి,
6. అవ్యయీ భావము.

1. తత్పురుష సమాసము :
ఉత్తర పదార్థ ప్రధానము తత్పురుషము. అనగా సమాసంలోని రెండవ పదము యొక్క అర్థము
ప్రధానంగా గలది.
రాజభటుడు వెళ్ళెను – వెళ్ళినది భటుడు.
పూర్వ పదమునకు విగ్రహవాక్యంలో చేరే విభక్తిని బట్టి సమాసం పేరుండును.

i) ప్రథమా తత్పురుష
– అర్ధరాత్రి – రాత్రి యొక్క అర్థభాగము
– మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్యభాగము
ii) ద్వితీయా తత్పురుష
– నెలతాల్పు – నెలను తాల్చినవాడు
– ఇందుధరుడు – చంద్రు ని ధరించినవాడు

iii) తృతీయా తత్పురుష


– ప్రభాభాసితము – ప్రభచేత భాసితము
– ధనాధికులు – ధనము చేత అధికులు

iv) చతుర్థీ తత్పురుష


– దూడ గడ్డి – దూడ కొఱకు గడ్డి
– దేవరమేలు – దేవర కొఱకు మేలు
– కళ్యాణ ఘంటలు – కళ్యాణం కొరకు ఘంటలు
– సంక్షేమ పథకాలు – సంక్షేమం కొరకు పథకాలు
– దేవాగ్రహారములు – దేవతల కొరకు అగ్రహారములు
– భిక్షా గృహములు – భిక్ష కొరకు గృహములు

v) పంచమీ తత్పురుష
– దొంగ భయము – దొంగ వలన భయము

vi) షష్ఠీ తత్పురుష


– రాజ భవనము – రాజు యొక్క భవనము
– పురుష శ్రేష్ఠు డు – పురుషులలో శ్రేష్ఠు డు
– దేవనది – దేవతల యొక్క నది
– కాకతీయుల కంచుగంట – కాకతీయుల యొక్క కంచుగంట
– పుష్ప గుచ్ఛము – పుష్పముల యొక్క
– గజ్జెల సప్పుడు – గజ్జెల యొక్క సప్పుడు
– బ్రతుకు త్రోవ – బ్రతుకు యొక్క త్రోవ
– యయాతి చరిత్ర – యయాతి యొక్క చరిత్ర
– భుజ తాండవం – భుజముల యొక్క తాండవడం

vii) సప్తమీ తత్పురుష


– యుద్ధ నిపుణుడు – యుద్ధము నందు నిపుణుడు
– మాటనేర్పరి – మాట యందు నేర్పరి
viii) నఞ తత్పురుష,
– అసత్యము – సత్యము కానిది
– అసాధ్యము – సాధ్యము కానిది
– అన్యాయం – న్యాయం కానిది
– అధర్మం – ధర్మం కానిది
– ఆజ్ఞానం – జ్ఞానం కానిది
– అపూర్వం – పూర్వం కానిది

2. కర్మధారయ సమాసము:
విశేషణమునకు విశేష్యముల (నామవాచకము) తో జరుగు సమాసము కర్మధారయము.
ఉదా : మంచి బాలుడు.
బాలుడు – విశేష్యము, మంచి విశేషణము.
ఇది ఎనిమిది విధములు.

i) విశేషణ పూర్వపద కర్మధారయము :


మొదటి పదము విశేషణముగా ఉండును.
ఉదా :
నల్ల గుఱ్ఱము – నల్లనైన గుఱ్ఱము
సరసపు వచనము – సరసమైన వచనము
కొత్తబాట – కొత్తదైన బాట
అంకితభావం – అంకితమైన భావం
సుందరాకారములు – సుందరములైన ఆకారములు
మహారవములు – గొప్పదైన రవములు
బృహత్కార్యం – బృహత్తు అయిన కార్యం

ii) విశేషణ ఉత్తరపద కర్మధారయము :


సమాసములోని రెండవ పదము విశేషణమై యుండును.
ఉదా :
కపోత వృద్ధము -వృద్ధమైన కపోతము
తమ్ముకుఱ్ఱలు – కుఱ్ఱవైన తమ్ములు

iii) విశేషణ ఉభయపద కర్మధారయము :


సమాసము లోని రెండు పదాలు విశేషణములుగా ఉండును.
ఉదా :
శీతోష్ణము – శీతమును, ఉష్ణమును
మృదుమధురము – మృదువును, మధురమును

iv) ఉపమాన పూర్వపద కర్మధారయము :


మొదటి పదము ఉపమానముగాను, రెండవ పదము ఉపమేయముగాను ఉండును.
ఉదా :
తేనెపలుకులు – తేనెవంటి పలుకులు
చిగురుకేలు – చిగురువంటి కేలు

v) ఉపమాన ఉత్తరపద కర్మధారయము :


ఉపమానము రెండవ పదముగాను, ఉపమేయము మొదటి పదముగాను ఉండును.
ఉదా :
ముఖపద్మము – పద్మము వంటి ముఖము
బాహువల్లి – వల్లివంటి బాహువులు

vi) రూపక సమాసము :


దీనినే అవధారణా పూర్వపద కర్మధారయము అందురు. ఒక వస్తు వు నందు వేరొక వస్తు వు
ధర్మమును ఆరోపించుట.
ఉదా :
సంసారసాగరము – సంసారము అనేది సాగరం
కోపాగ్ని – కోపమనే అగ్ని
ఇసుక గుండెలు – ఇసుక అనెడి గుండెలు
కాంతివార్ధు లు – కాంతులు అనెడి వార్ధు లు
మత పిశాచి – మతం అనెడి పిశాచి
దేశ జనని – దేశము అనెడి జనని
నగరారణ్యం – నగరం అనెడి అరణ్యం

vii) సంభావనా పూర్వపద కర్మధారయము :


సంజ్ఞ మొదటి పదముగా గలది.
ఉదా :
కృష్ణానది – కృష్ణ అనే పేరుగల నది
జనక మహారాజు – జనకుడు అనే పేరుగల మహారాజు
తెలంగాణ రాష్ట్రం – తెలంగాణ అనే పేరు గల రాష్ట్రం
గోలకొండ పట్టణం – గోలకొండ అనే పేరు గల పట్టణం
కాశికా పట్టణం – కాశికా అనే పేరు గల పట్టణం
హిందూ మతం – హిందూ అనే పేరు గల మతం

3. ద్విగు సమాసము :
సంఖ్యా వాచక శబ్దము పూర్వ పదము గాను, నామవాచకము ఉత్తరపదముగాను కలది.
ఉదా :
నాల్గులోకములు – నాల్గు సంఖ్యగల లోకములు
పంచపాండవులు – పంచసంఖ్యగల పాండవులు
సప్త సముద్రములు – సప్త సంఖ్యగల సముద్రములు
దశ దిక్కులు – దశ సంఖ్య గల దిక్కులు
మూడుతరాలు – మూడైన తరాలు
నాలుగు కాళ్ళు – నాలుగు సంఖ్య గల కాళ్ళు
రెండేళ్లు – రెండైన ఏళ్లు
పన్నెండు ద్వారములు – పన్నెండు సంఖ్య గల ద్వారములు

4. ద్వంద్వ సమాసము:
ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము. అనగా సమాసములోని రెండు పదాల అర్థము
ముఖ్యముగా గలది. పదములు నామ వాచకాలై యుండును.
ఉదా :
సీతారాములు – సీతయును, రాముడును
రామలక్ష్మణులు – రాముడును, లక్ష్మణుడును
అన్నదమ్ములు – అన్నయును, తమ్ముడును
కులమతాలు – కులమును, మతమును
పెంపుసొంపులు – పెంపును, సొంపును
జీవధనములు – జీవమును, ధనమును
యువతీయువకులు – యువతులును, యువకులును
క్రయవిక్రయాలు – క్రయమును, విక్రయమును
భూతప్రేతములు – భూతములు, ప్రేతములు
శక్తియుక్తు లు – శక్తియును, యుక్తియును
అందచందములు – అందమును, చందమును
కూరగాయలు – కూరలు, కాయలు

5. బహువ్రీహి సమాసము:
అన్యపదార్థ ప్రధానము. సమాసములోని పదముల అర్థము గాక ఇతర పదము యొక్క అర్థము
ప్రధానముగా గలది బహువ్రీహి.
ఉదా :
ముక్కంటి – మూడు కన్నులు గలవాడు – శివుడు
చక్రహస్తు డు – చక్రము హస్తము నందు కలవాడు – విష్ణువు
చిగురుబోడి – చిగురు వంటి మేను కలది – స్త్రీ
చక్రపాణి – చక్రము పాణియందు కలవాడు
ఆజానుబాహుడు – జానువుల వరకు బాహువులు కలవాడు
గరుడవాహనుడు – గరుడుడు వాహనముగా కలవాడు
ముక్కంటి – మూడు కన్నులు కలవాడు
దశకంఠుడు – దశ సంఖ్య గల కంఠములు కలవాడు
చంచలాక్షి – చంచలములైన అక్షులు కలది
మృగనేత్ర – మృగము వంటి నేత్రములు కలది

6. అవ్యయీభావ సమాసము:
పూర్వపదము యొక్క అర్థము ప్రధానముగా గలది. పూర్వపదము అవ్యయముగా నుండును.
ఉదా :
యథాశక్తి – శక్తిననుసరించి (లేక) శక్తిని అతిక్రమించక
ప్రతిదినం – దినముననుసరించి
నిర్జనం – జనంలేనిది
……………..xxxxxxxxxxxxxxxxx…

అలంకారాలు
1. శబ్దా లంకారాలు

1. వృత్త్యనుప్రాసాలంకారం :
లక్షణం :ఒకటిగాని, అంతకంటే ఎక్కువగాని హల్లు లు అనేకసార్లు వచ్చునట్లు చెబితే దాన్ని
వృత్త్యను ప్రాసాలంకారం’ అని అంటారు.
ఉదాహరణ : వీరు పొమ్మను వారు గారు పొగబెట్టు వారు.
సమన్వయం : పై ఉదాహరణ వాక్యంలో ‘ర’ కారం పలుమార్లు వచ్చింది. అందువల్ల ఇది
వృత్త్యనుప్రాసా లంకారం.

2. ఛేకానుప్రాసాలంకారం :
లక్షణం :
అర్థభేదంతో కూడిన హల్లు ల జంట అవ్యవధానంగా (వెంట వెంటనే) వస్తే ఛేకాను ప్రాసాలంకారం
అని అంటారు.
ఉదాహరణ :
అనాథ నాథ నంద నందన నీకు వందనం.

సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో ‘నాథ’ ‘నంద’ అనే హల్లు ల జంట అర్థభేదంతో వెంట వెంటనే వచ్చాయి.
అందువల్ల ఇది ఛేకాను ప్రాసాలంకారం.

3. లాటానుప్రాసాలంకారం :
లక్షణం :
అర్థభేదం లేకున్నా తాత్పర్య భేదముతో ఒకే పదం మరల మరల వచ్చునట్లు ప్రయోగించ బడితే
దాన్ని ‘లాటాను ప్రాసాలంకారం’ అని అంటారు.

ఉదాహరణ :
కమలాక్షు నర్చించు కరములు కరములు.

సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో ‘కరములు’ అనే పదం రెండు మార్లు ప్రయోగింపబడింది. రెండు మార్లు
అర్థంలో తేడా లేదు. ‘కరములు’ అనగా చేతులు. కానీ రెండవసారి ప్రయోగింపబడిన ‘కరములు’
అనే పదానికి ధన్యములైన చేతులని తాత్పర్య భేదం ఉంది.

అ) హరి భజియించు హస్తములు హస్తములు ……….. (చేతులే, నిజమైనచేతులు)


ఆ) చిత్తశుద్ధితో జేసెడి సేవ సేవ. (సేవయే నిజమైన సేవ)

పై రెండు సందర్భాల్లోను ఒకే పదం అర్థంలో తేడా లేకున్నా భావంలో తేడా ఉండేటట్లు
ప్రయోగించారు. ఈ విధంగా ఒకే పదాన్ని, అర్థం ఒకటే అయినా తాత్పర్య భేదంతో ప్రయోగించ
డాన్ని ‘లాటానుప్రాసాలంకారం’ అంటారు.

4. యమకాలంకారం :
లక్షణం :
అచ్చులలో హల్లు లో మార్పులేనట్టి అక్షరాల సమూహం అర్థభేదంతో మరల మరల
ప్రయోగింపబడితే దాన్ని ‘యమకాలంకారం’ అని అంటారు.

ఉదాహరణ 1 :
పురము నందు నందిపురమునందు.
సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో ‘పురము’ అనే అక్షర సమూహం అర్థభేదంతో మరల మరల
ప్రయోగింపబడింది. అందువల్ల దీనిని ‘యమకాలంకారం’ అని అంటారు.

ఉదాహరణ 2 :
లేమా ! దనుజుల గెలువఁగలేమా
(లేమ = స్త్రీ; గెలువగలేమా = గెలువడానికి మేమిక్కడ లేమా (ఉన్నాం కదా !)

ఉదాహరణ 3 :
ఆ తోరణం శత్రు వులతో రణానికి కారణమైంది.
(తోరణం = ద్వారానికి కట్టే అలంకారం; రణం = యుద్ధం)
పై రెండు సందర్భాలల్లోను ఒకే పదం అర్థభేదంతో ప్రయోగించడం జరిగింది. దీనినే
‘యమకాలంకారం’ అంటారు.

5. అనుప్రాసాలంకారం :
లక్షణం :
ఒకటిగాని, అంతకంటే ఎక్కువ వర్గాలు గాని, ఒకటి కంటే ఎక్కువసార్లు ఆవృత్తం అయినట్లైతే
దాన్ని ‘అనుప్రాసాలంకారం’ అని అంటారు.

ఉదాహరణ :
అక్క ముక్కుకు చక్కని ముక్కర.

సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో ‘క్క’ అనే అక్షరం పలుమార్లు ఆవృత్తం అయింది. అందువల్ల దీన్ని
‘అనుప్రాసాలంకారం’ అని అంటారు.

6. అంత్యానుప్రాసాలంకారం :
లక్షణం :
ప్రాస పాదం చివర ఒక అక్షరంగాని, అక్షర సముదాయంగాని ఉండేటట్లు రచన చేయడాన్ని
‘అంత్యాను ప్రాసం’ అని అంటారు.

ఉదా 1 :
నగారా మోగిందా
నయాగరా దుమికిందా
ఇది అంత్యానుప్రాసాలంకారానికి చెందినది. ఇందులో ‘దా’ అనే హల్లు రెండు పదాల్లోను
అంత్యంలో ప్రయోగించబడింది.
అందువల్ల ఇది అంత్యానుప్రాసాలంకారం.

ఉదా 2:
రంగదరాతిభంగ; ఖగరాజతురంగ; విపత్పరంపరో
త్తుంగ తమఃపతంగ; పరితోషితరంగ;
దయాంతరంగ; స
త్సంగ; ధరాత్మజా హృదయ సారస భృంగ;
నిశాచరాబ్జ మా
తంగ; శుభాంగ ! ……………
ఇందులో అంత్యానుప్రాసాలంకారం ఉంది. ఇక్కడ అంత్యప్రాసగా ‘గ’ అనే ఒకే హల్లు , రంగ అనే
హల్లు ల జంట వాడబడినాయి. అందువల్ల ఇక్కడ అంత్యానుప్రాసాలంకారం ఉంది.

ఉదా 3 :
కొందరికి రెండుకాళ్ళు
రిక్షావాళ్ళకి మూడుకాళ్ళు
ఉన్నవాళ్ళకి నాలుక్కాళ్ళు
ఇక్కడ అంత్యానుప్రాసాలంకారం ఉంది. ఈ ఉదాహరణ లోని పాదాల్లో చివరగా ‘కాళ్ళు’ అనే
హల్లు ల జంట అంత్యప్రాసగా వాడబడింది. అందువల్ల ఇక్కడ అంత్యాను ప్రాసాలంకారం ఉంది.

ఉదా 4 :
“అప్పుడు మా కులం వారిని ఆడవద్దన్నారు.
తర్వాత అన్ని కులాల వారిని ఆడవచ్చన్నారు”
పై ఉదాహరణ యందు మొదటి వాక్యంలో చివరనున్న ‘ఆడవద్దన్నారు’ అనే పదం రెండవ వాక్యం
చివర కూడా వస్తుంది. అందువల్ల అక్కడ అంత్యానుప్రాసాలంకారం ఉంది.

2. అర్థా లంకారాలు

1. ఉపమాలంకారం :
లక్షణం :
ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన పోలిక వర్గింపబడినట్టైతే దానిని ‘ఉపమాలంకాలరం’ అని
అంటారు.

ఉదాహరణ 1 :
ఓ కృష్ణా ! నీ కీర్తి హంసలాగా ఆకాశ గంగలో మునుగుతూ ఉంది.
సమన్వయం :
ఉపమేయం – కీర్తి, ఉపమానం – హంస, ఉపమానవాచకంలాగా, ఈ పై ఉదాహరణ వాక్యంలో కీర్తి
హంసతో మనోహరంగా పోల్చ బడింది. అందువల్ల దీన్ని ‘ఉపమాలంకారం’ అని అంటారు.

ఉదాహరణ 2:
కుముదినీరాగ రసబద్ధ గుళికయనగఁ
జంద్రుఁడుదయించెఁ గాంతి నిస్తంద్రుఁడగుచు.
పై ఉదాహరణయందు చంద్రోదయాన్ని రసమణి తోను, ఔషధపు ముద్దతోను పోల్చాడు.
అందువల్ల ఇక్కడ ఉపమాలంకారం ఉంది.

ఉదాహరణ 3:
శ్రీమంత్ చొక్కా మల్లెపూవులా తెల్లగా ఉంది.
ఇందులో ఉపమాలంకారం ఉంది. ఈ వాక్యంలో
చొక్కా – ఉపమేయం
మల్లెపూవు – ఉపమానం
సమానధర్మం – తెల్లగా ఉండటం
ఉపమా వాచకం -లాగా
ఇక్కడ ఉపమాన ఉపమేయాలకు చక్కనిపోలిక వర్ణించి చెప్పడం జరిగింది. అందువల్ల ఇందులో
ఉపమాలంకారం ఉంది.

2. రూపకాలంకారం :
లక్షణం :
1. ఉపమానానికి, ఉపమేయానికి భేదం లేనట్లు వర్ణించి చెప్పినట్లైతే దాన్ని ‘రూపకాలంకారం’ అని
అంటారు.
(లేదా)
2. ఉపమేయమందు ఉపమాన ధర్మాన్ని ఆరోపించి చెప్పినట్లైతే దాన్ని ‘రూపకాలంకారం’ అని
అంటారు.

ఉదాహరణ 1:
లతాలలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లిరి.

వివరణ :
పై ఉదాహరణ వాక్యంలో లతాలలనలు అంటే ‘తీగలు అనే స్త్రీలు’ అని అర్థం. ఇక్కడ తీగలకూ,
స్త్రీలకూ భేదం లేనట్లు చెప్పబడింది. అదే విధంగా “కుసుమాక్షతలు” అన్నప్పుడు కూడా పూలకూ,
అక్షతలకూ భేదం లేనట్లు చెప్పబడింది. అందువల్ల దీన్ని “రూపకాలంకారం” అని అంటారు.
ఉదాహరణ 2 :
సంసార సాగరాన్ని భరించటం మిక్కిలి కష్టం.

సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో ఉపమేయ మైన సంసారమందు ఉపమానమైన సాగర ధర్మం
ఆరోపించబడింది. అందువల్ల దీన్ని “రూపకా లంకారం” అని అంటారు.

ఉదాహరణ 3 :
ఓ రాజాఁ నీ యశశ్చంద్రికలు దిగంతాలకు వ్యాపించాయి.
ఇది రూపకాలంకారానికి చెందినది.

సమన్వయం :
ఇందులో యశస్సు – ఉపమేయం, చంద్రిక – ఉపమానం. ఈ పై ఉదాహరణ యందు
ఉపమేయమైన యశస్సునందు ఉపమానమైన చంద్రికల ధర్మాన్ని ఆరోపించడం జరిగింది. అందు
వల్ల ఇది రూపకాలంకారం.

ఉదాహరణ 4:
అజ్ఞానాంధకారంలో కూర్చోకుండా విజ్ఞాన వీధుల్లో విహరించాలి.
ఇది రూపకాలంకారమునకు చెందినది.

సమన్వయం :
పై ఉదాహరణయందు అజ్ఞానము – ఉపమేయము, అంధకారము – ఉపమానము. ఇక్కడ
ఉపమేయమైన అజ్ఞానమునందు ఉపమాన మైన అంధకార ధర్మం ఆరోపించబడింది. అందువల్ల
ఇది రూపకాలంకారం.

3. ఉత్ప్రేక్షాలంకారం :
లక్షణం :
ఉపమాన ధర్మసామ్యంచేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే దాన్ని ‘ఉత్ప్రేక్షాలం
కారం’ అని అంటారు.

ఉదాహరణ :
ఈ వెన్నెల పాలవెల్లియో అన్నట్లుంది.

సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో వెన్నెల, పాలవెల్లి (పాల సముద్రం)గా ఊహించబడింది. దీన్ని ‘ఉత్ప్రేక్షాలం
కారం’ అని అంటారు.
4. అర్థాంతరన్యాసాలంకారం :
లక్షణం:
విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంచేత గాని, సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంచేత గాని సమర్థించి
చెప్పినట్లయితే దాన్ని ‘అర్థాంతరన్యాసా లంకారం’ అని అంటారు.

ఉదాహరణ :
హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. మహాత్ములకు సాధ్యము కానిదేమున్నది?

సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో మొదటి వాక్యం విశేష వాక్యం. రెండవది సామాన్య వాక్యం. ఇక్కడ
విశేషం సామాన్యం చేత సమర్థించడం జరిగింది. అందువల్ల దీన్ని ‘అర్థాంతరన్యాసా లంకారం’ అని
అంటారు.

5. దృష్టాంతాలంకారం :
లక్షణం :
ఉపమాన, ఉపమేయ వాక్యాల యొక్క వేరు వేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో వర్ణించి
చెప్పినట్లయితే దాన్ని ‘దృష్టాంతాలంకారం’ అని అంటారు.

ఉదాహరణ :
ఓ రాజా ! నీవే కీర్తిమంతుడవు. చంద్రు డే కాంతిమంతుడు.

సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో రాజు ఉపమేయం. చంద్రు డు ఉపమానం. ఉపమేయమైన రాజు యొక్క
ధర్మం కీర్తి, ఉపమానమైన చంద్రు ని యొక్క ధర్మం కాంతి. కీర్తి, కాంతి అనే రెండు భిన్న ధర్మాలు
కలిగి ఉన్నాయి. దిక్కుల చివరి దాకా వ్యాపించి ఉండటం వీని సమానధర్మం. ఈ రెండు బింబ,
ప్రతిబింబ భావంతో వర్ణించబడ్డా యి. కాబట్టి దీన్ని “దృష్టాంతాలంకారం” అని అంటారు.

6. అతిశయోక్త్యలంకారం :
లక్షణం :
ఒక వస్తు వు గురించి గాని, ఒక సందర్భాన్ని గురించి గాని, ఉన్నదానికంటే ఎక్కువగా చేసి
చెప్పినట్లయితే దాన్ని ‘అతిశయోక్త్యలంకారం’ అని అంటారు.

ఉదాహరణ 1:
నగరంలోని భవనాలు నక్షత్రాలను తాకుతున్నాయి.
సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో నగరంలోని మేడలు మిక్కిలి ఎత్తయినవి అని చెప్పడానికి బదులుగా
నక్షత్రాలను తాకుచున్నాయని ఎక్కువగా చేసి చెప్పడం జరిగింది. అందువల్ల దీన్ని ‘అతిశ
యోక్త్యలంకారం’ అని అంటారు.

ఉదాహరణ 2:

1. మా చెల్లెలు తాటిచెట్టంత పొడవుంది.


2. దేవాలయ గోపురాలు ఆకాశానికంటుతున్నాయి.
పై వాక్యాల్లో చెల్లె ఎత్తు ను, గోపురాల ఎత్తు లను ఉన్న ఎత్తు కంటే ఎక్కువచేసి చెప్పడం జరిగింది
కదా! అంటే అతిశయంగా చెప్పడం అన్నమాట. ఇలా చెప్పటాన్ని అతిశయోక్తి అంటారు.

ఉదాహరణ 3 :
కం. చుక్కలు తల పూవులుగా
అక్కజముగ మేనుపెంచి యంబర వీధిన్ వెక్కసమై చూపట్టిన
అక్కోమలి ముదము నొందె ఆత్మస్థితిలోన్.

ఇక్కడ చుక్కలను తల పూలుగా చేసుకొని, ఆకాశమంత ఎత్తు పెరిగాడని, హనుమంతుడిని గూర్చి


ఎక్కువగాచేసి చెప్పడం జరిగింది. అందువల్ల ఇక్కడ అతిశయోక్తి అలంకారం ఉన్నది.

ఉదాహరణ 4:
మా పొలంలో బంగారం పండింది. సాధారణంగా పొలంలో పంట పండుతుంది. కాని బాగా పంట
పండిందనే విషయాన్ని తెలియ జేయడానికి బంగారం పండిందని ఎక్కువగా చేసి చెప్పడం
జరిగింది. అందువల్ల ఇక్కడ అతిశయోక్తి అలంకారం ఉన్నది.

7. శ్లేషాలంకారం :
లక్షణం : అనేకమైన అర్థా లు గల శబ్దా లను ఉపయోగించి చెబితే దాన్ని “శ్లేషాలంకారం” అని
అంటారు.
ఉదాహరణ 1:
రాజు కువలయానందకరుడు.
సమన్వయం : రాజు = ప్రభువు, చంద్రు డు;
కువలయం భూమి, కలువపూవు

1. ప్రభువు భూమికి ఆనందాన్ని కలిగిస్తా డు.


2. చంద్రు డు కలువపూలకు ఆనందాన్ని ఇస్తా డు.
ఇక్కడ రెండు అర్థములు వచ్చునట్లు గా చెప్పబడింది. అందువల్ల దీన్ని ‘శ్లేషాలంకారం’ అని
అంటారు.
ఉదాహరణ 2 :
మిమ్ము మాధవుడు రక్షించుగాక ! అర్థం :

1. మిమ్ము మాధవుడు (విష్ణువు) రక్షించుగాక !


2. మిమ్ము ఉమాధవుడు (శివుడు) రక్షించుగాక !

ఉదాహరణ 3 :
మానవ జీవనం సుకుమారం. అర్థం :

1. మానవ (ఆధునిక) జీవితం సుకుమారమైనది.


2. మానవ (మనిషి) జీవితం సుకుమారమైనది.
పై అర్థా లను గమనించారు కదా ! ఒకే శబ్దం రెండు వేర్వేరు అర్థా లనందిస్తు న్నది. అంటే విభిన్న
అర్థా లు ఆశ్రయించి ఉన్నాయి. ఇలా ఉంటే వాటిని ‘శ్లేషాలంకారం’ అని అంటారు.

ఉదాహరణ 4 :
నీవేల వచ్చెదవు
పై ఉదాహరణలో రెండు అర్థా లు స్ఫురిస్తు న్నాయి.

1. నీవు ఏల వచ్చెదవు ? (నీవు + ఏల)


2. నీవేల (ఏ సమయంలో ? వచ్చెదవు)
ఈ అర్థా లను వాక్యంలో వ్రాస్తే, క్రింది విధంగా ఉంటాయి.

1. నీవు ఏల వచ్చెదవు ?
2. నీవు ఏ సమయంలో వచ్చెదవు ?
ఇట్లా ఒకే వాక్యంలో రెండు కానీ అంతకుమించి అర్థా లను కానీ కూర్చడమే శ్లేషాలంకారం.

8. స్వభావోక్త్యలంకారం :
లక్షణం :
జాతి, గుణ, క్రియాదులలోని స్వభావమును ఉన్నది ఉన్నట్లు మనోహరంగా వర్ణింపబడినచో దాన్ని
‘స్వభావోక్త్య లంకారం’ అని అంటారు.
ఉదాహరణ :
అడవిలోని లేళ్ళు చెవులు నిక్కబొడుచు కొని చెంగుచెంగున గంతులేస్తూ బిత్తరచూపులతో
పరుగెత్తు చున్నాయి.

సమన్వయం :
పై ఉదాహరణ వాక్యంలో లేళ్ళ స్థితిని ఉన్నది ఉన్నట్లు గా మనోహరంగా వర్ణించబడింది. అందువల్ల
దీన్ని స్వభావోక్త్యలంకారం అని అంటారు.

9. ముక్తపదగ్రస్త అలంకారం :
కం. మన వేటికి నూతనమా !
తన మానినిఁ బ్రేమఁ దనకుఁ దక్కితిననుమా
నను మానక దయ దనరం
దనరంతులు మాని నరసధవు రమ్మనవే.

ఒక పద్యపాదంగాని, వాక్యంగానీ ఏ పదంతో పూర్తవు తుందో అదే పదంతో తర్వాత పాదం /


వాక్యం మొదలవు తున్నది. దీన్నే ముక్తపదగ్రస్త అలంకారం అంటారు.
………………….xxxxxxxxxx………

ఛందస్సు
1. ఉత్పలమాల :

1. ఉత్పలమాల వృత్తము నందు సాధారణముగా నాలుగు పాదములుండును.


2. ప్రతి పాదమునందును భ, ర, న, భ, భ, ర, వ అను గణములు వరుసగా ఉండును.
3. పదవ అక్షరము యతి స్థా నము.
4. ప్రాస నియమము కలదు.
2. చంపకమాల :

1. ప్రతి పద్యమునందును నాలుగు పాదము లుండును. ఇది వృత్తము.


2. ప్రతి పాదములోను న, జ, భ, జ, జ, జ, ర అను గణాలు వరుసగా ఉండును.
3. పదకొండవ అక్షరమున యతి చెల్లు ను.
4. ప్రాస నియమము కలదు.
3. శార్దూలము:

1. నాలుగు పాదములు గల వృత్తము.


2. ప్రతి పాదంలోను 19 అక్షరాలు ఉంటాయి.
3. ప్రతి పాదములోను మ, స, జ, స, త, త, గ అను గణములు వరుసగా ఉండును.
4. పదమూడవ అక్షరమున యతి చెల్లు ను.
5. ప్రాస నియమము కలదు.

4. మత్తేభము :

1. నాలుగు పాదములు గల వృత్తము.


2. ప్రతి పాదంలోను 20 అక్షరాలు ఉంటాయి.
3. ప్రతి పాదము నందు స, భ, ర, న, మ, య, వ అను గణములు వరుసగా ఉండును.
4. పదునాల్గవ అక్షరము యతి స్థా నము.
5. ప్రాస నియమము కలదు.
5. తేటగీతి :

1. తేటగీతి పద్యమునందు సాధారణముగా నాలుగు పాదములుండును.


2. ప్రతి పాదము నందును ఒక సూర్యగణము, రెండు ఇంద్ర గణములు, రెండు
సూర్యగణములు వరుసగా ఉండును.
3. నాలుగవ గణము మొదటి అక్షరము యతి స్థా నము.
4. ప్రాస నియమము లేదు.
5. ప్రాసయతి వేయవచ్చును.
6. ఆటవెలది :

1. ఆటవెలది పద్యమునందు నాలుగు పాదము లుండును.


2. 1, 3 పాదములలో మూడు సూర్యగణములు, మా రెండు ఇంద్రగణములు వరుసగా
వచ్చును.
3. 2, 4 పాదములలో అయిదు సూర్యగణములే ఉండును.
4. నాలుగవ గణము మొదటి అక్షరము యతి స్థా నము.
5. ప్రాస నియమము లేదు.
6. ప్రాసయతి వేయవచ్చును.

7. కందము :

1. 1, 3 పాదములలో మూడేసి గణములు, 2, 4 పాదములలో ఐదేసి గణములు ఉండును.


అనగా 1, 2 పాదాలలో 8 గణములు అట్లే 3, 4 పాదములలో కలిసి 8 గణములు
ఉండును.
2. గగ, భ, జ, స, నల యను గణములు ద్రగణలు మాత్రమే వాడవలెను.
3. ప్రాస నియమము కలదు.
4. 2, 4 పాదములలో చివరి అక్షరము గురువుగా ఉండవలెను.
5. 2, 4 పాదములలో మూడవ గణము (1, 2 భగణం పాదములు కలిపిన 6 వ గణము)
నలము గాని, జగణము గాని తప్పక ఉండవలెను.
6. 2, 4 పాదములలోని మొదటి గణం మొదటి అక్షరానికి, అదే పాదములోని నాల్గవ గణం
మొదటి అక్షరానికి యతి చెల్లు ను.
7. బేసి గణము (1, 3, 5, 7) జగణము కాకూడదు.
8. ద్విపద :
రెండు పాదములే ఉండును. ప్రతి పాదము నందును 3 ఇంద్ర గణములు, 1 సూర్యగణము
ఉండును. 3 వ గణము మొదటి అక్షరమున యతిమైత్రి చెల్లు ను. రెండేసి పాదములకు ఒక ప్రాస
ఉండును.

9. సీసము :

1. ప్రతి పాదమునందును ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉండును.


2. ఒకటి, మూడు, అయిదు, ఏడు గణముల ప్రథమాక్షర ములకు యతి చెల్లు ను.
3. ప్రాస నియమము లేదు.
4. ప్రాసయతి వేయవచ్చును.
5. నాలుగుపాదాల చివర ఆటవెలదిగాని, తేటగీతిగాని తప్పక చేర్చవలెను.
6. ప్రతి పాదాన్ని నాలుగేసి గణాలకు విరిచి, రెండు భాగాలుగా చేయవచ్చును.
7. మొదటి భాగంలో నాలుగు ఇంద్రగణాలు, రెండో భాగంలో రెండు సూర్యగణాలు వరుసగా
ఉండును.

గురు లఘువులను గుర్తించి, పద్య వృత్తమును గుర్తించటం

1.

ఇది చంపకమాల పద్యపాదము.

2.

ఇది “ఉత్పలమాల” పద్యపాదము.


3.

ఇందులో 3 ఇంద్రగణాలు,
2 సూర్యగణాలు ఉన్నాయి. ఇది ద్విపద పద్యపాదము.

4.

ఈ పద్యపాదంలో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు ఉన్నాయి. కాబట్టి ఇది “ఉత్పలమాల”


పద్యపాదము.

5.

ఈ పద్యపాదంలో న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలు ఉన్నాయి. కాబట్టి ఇది “చంపకమాల”


పద్యపాదము.

6.

ఈ పద్యపాదంలో మ, స, జ, స, త, త, గ అనే గణాలు ఉన్నాయి. కాబట్టి ఇది “శార్దూల”


పద్యపాదం.

7.

ఈ పద్యపాదంలో స, భ, ర, న, మ, య, వ అనే గణాలు ఉన్నాయి. కాబట్టి పద్యపాదము


మత్తేభము.
8.

ఇది తేటగీతి పద్యపాదము.

9.

ఇది ద్విపద పద్యపాదము.

You might also like