You are on page 1of 1

#3

చిన్నప్పుడెప్పుడో చదివిన కథ గుర్తు వచ్చింది ఈరోజు రోజు వదినతో మాట్లా డాక... రాధకి..
కళ్ళల్లో ప్రేమ తన్మయత్వం అమాయకత్వం కనిపించాయన్న మనిషి నువ్వెంతని అవమానిస్తే ఆ పిల్ల కళ్ళల్లో చిప్పిల్లిన కన్నీళ్ల ఖరీదు
ఎంత... ప్రేమించినప్పుడు పెద్దల అనుమతి అక్కర్లేని ఈ మనుషులకి ఆ ప్రేమని జీవితాంతం నిలుపుకోవాల్సి వచ్చినప్పుడు సంఘం
కట్టు బాట్లు అనుమతులు అని అంటుంటే ఆ పిల్ల గుండెకోత ఎవ్వరు తీర్చగలిగినది... ఆడదానికి ఆడదే శత్రు వా... ఎన్నాళ్లీ
వెతలు... ఎందుకీ దుర్గతి... సున్నిత మనస్కురాలైనా కొంత జీవితాన్ని చూసిన తనకే ఇలా ఉంటే.. innocent soul పాపం .. ఆ
పిల్లకెలా ఉందో... మనమేమి చెయ్యగలమంటూ... గుండె ఆక్రోశిస్తోంది..

ఈలోపు తీరిగ్గా ఈనాడు చదువుకుంటూ గ్రీన్ టీ తాగుతున్న మోహన్ నెమ్మదిగా తల తిప్పి.. ఏంటమ్మా అంతా ఓకే నా అన్నాడు.
అప్పటిదాకా ఓర్చుకున్న రాధ ఒక్కసారిగా బేలయ్యింది... జాహ్నవి కి జరిగిందంతా చెప్పింది.. పోరాడామని చెప్పడం సులభం... దైర్యం
చెప్పడం కూడా... కానీ ఆ పరిస్థితుల్లో అల్లకల్లోలం అయిన ఆ లేత మనసుని ఎలా ఊరడించడం... నా వల్ల కావట్లేదండి... అంటూ
కన్నీళ్లు పెట్టు కుంది..

జీవితం చాలా చిన్నది రాధా.. ప్రతి మనిషి తనకు ఏది ముఖ్యం అనేది తానే నిర్నయించుకోవాలి.. అతని పరిస్థితి పక్కన పెట్టి జాహ్నవి కి
భవిష్యత్తు ప్రణాళికల మీద దృష్టి పెట్టేలా ప్రయత్నించండి... కన్నీళ్లు విలువైనవి.. అవి చిప్పిల్లా యి అంటే తన జీవితంలో అంతర్భాగమైన
ఒక అంశాన్ని కోల్పోవాల్సి వచ్చినప్పుడు కలిగిన నిస్సహాయత కరిగి నులివెచ్చటి నీరై కళ్ళలోనుండి జాలువారి చెంపలను నిమిరి... తను
మనిషినే అని గుర్తు చేసి ధైర్యం తెచ్చుకో అని సర్దిచెప్పినట్టు ... పరిస్థితుల మధ్య నలిగిపోతూ ఏడవడానికి కూడా ధైర్యం లేని వాళ్ళ
గురించి ఖంగారు పడాలి... జాహ్నవి కి ఏమి కాదు.. ప్రేమించగలగడం కూడా అందరికి చేతకాదు లేమ్మా... అది భగవత్స్వరూపం...
అది తప్పకుండా కాపాడుతుంది... ఏడుస్తోందని బాధ పడక్కర్లేదు.. నీకు గుర్తు ఉందా మొన్న పెళ్ళాన్ని అనుమానిస్తూ బాధిస్తు న్న
వికారమైన మొగుడితో పిల్లల భవిష్యత్తు కోసం పంటి బిగువున బాధని దిగమింగుతూ..నవ్వుతూ నవ్విస్తూ తన వంతుగా అందరికి
తలలో నాలుకలా తిరిగే అమ్మాయి గురించి ఏమనుకున్నాం... చేసే పని మంచిది అయినప్పుడు... ఆత్మస్థైర్యం గుండె నిండా నింపుకొని
ముందుకి సాగితే.. భగవదనుగ్రహం పుష్కలంగా ఉంటుంది.. ఏది పంచినా పదింతలు గా తిరిగొస్తుందమ్మా... సహనం వహించమని
చెప్పు.. అన్నాడు మోహన్ లాలింపుగా..
ప్రేమించడం అంటే ప్రేమని ఇవ్వడం అన్న డైలాగ్ గుర్తు వచ్చింది... ఎప్పుడైనా ఏది చెప్పినా అప్పటికప్పుడు చక్కటి సాంత్వన లభించే
మాటలు చెప్తా డు అనుకుంటూ... ఈ కళ్ళల్లో ప్రేమతో పాటు ప్రతీ క్షణం నేనున్నాను అన్న భరోసా కనిపిస్తుంది కదా.. అని తృప్తిగా
లేచింది రాధ..

You might also like