You are on page 1of 52

 

ఎవడు చుట్టం...ఎవడు పక్కం.....


ఎవడికి వాడే స్వార్ధం...అప్యాయత.... ఆత్మీయత....అంతా ఒక బూటకం...... అవసరానికో మాట,అది నెరవేరడంతో టాటా....ధనం
ఉంటే లేదు గుణం....గుణం ఉంటే లేదు ధనం..ఆప్తు డెవ్వడు.. ఆత్మీయు డెవ్వడు...నింద వేయని బంధువెవ్వడు...
కష్టమొచ్చినా...నష్టమొచ్చిన నీ వెంట నిలిచేదొక్కడే.....వాడే నీ "నీడ"........
నీతి,నిజాయితీ వినడానికి చూడడానికి చాలా బాగుంటాయి.కానీ అది ఎక్కడ పని చేయవు ఈ రోజుల్లో..బ్రతకడానికి అవి అసలు
అవసరమే లేదు...మనము ఉన్నట్టు గానే లోకము ఉంటుంది..అనుకోవడం చాలా పొరపాటు ఎన్ని అనుభవాలు ఎదు రైనా ఎందుకో
పిచ్చి మనసు మారదు...
అది మళ్ళీ మళ్ళీ మోసపోతూనేఉంటుంది.
ఏదో ఒక రోజు మన నీతి నిజాయితీ పని చేయవా అనే గుడ్డి నమ్మకం తప్ప!...చేసేదే ముంది ఇంకా...మన మనసుకి సర్ది చెప్పు
కోవడం తప్ప..అందరూ నా వాళ్ళే అందరూ మనవాళ్ళే అందరూ మంచివాళ్లే అనుకోవ డమే మనసు తప్పు...మన తప్పు...
ఇతరులకు మాటలతో చేతలతో గాయపర చి తామే బలవంతులమని అనుకునే వారు.
  వారే మానసికంగా అందరికంటే బలహీ నులు.ఇతరుల నుండి ఏదీ ఆశించకుండా ఇవ్వగలిగినంత ఇవ్వాలి.
సూర్యకాంతి అంతటా ఉన్నా,అది అద్దం పైన ప్రతిఫలించినప్పుడు కాగితాలను దగ్ధం చేయగల శక్తి కలుగుతుంది.అదే విధంగా
దివ్యత్వపు ప్రకాశం అంతటా ఉంది.దానిని ప్రయోజనకరంగా మలుచుకోవడంలోనే సమర్థత దాగి ఉంది.
ఆధ్యాత్మిక భావాలు అనే అద్దంపై మనదృష్టి ని కేంద్రీకరించి దానిని ఆదర్శం పట్ల ప్రతి ఫలించేలా చేయగలిగితే మన జన్మ సార్థక
మైనట్లే.వీటిని పెంపొందించుకోవాలి.
కఠినంగా,పరుషంగా ప్రవర్తించేవారు,కలహ త్వపు స్వభావాన్ని కలిగి ఉన్నవారు చాలా విలువైన వాటినే కోల్పోవలసి వస్తుంది.
దాతృత్వం సర్వాన్నిసమకూరుస్తుంది. మనం ఉన్నతలక్షణాలుకలిగిఉంటేసరిపోదు వాటిని నిలబెట్టు కోవడానికి తగినసామర్ధ్యం కూడా
కలిగి ఉండాల బంధాల తోటలో వేపచెట్టు లాంటి బంధం కూడా ఉంటుంది.
  తియ్యగా పండే చెట్ల మధ్య చేదుగా కనిపించి నిరాదరణ చేసినా నిజానికి అవస రమైనప్పుడుదివ్యౌషధంగా పనిచేసేది అదే!.
💘🌷
        
మానవ జీవితంలో తొందరగా -పరమాత్మను చేరే మార్గం....
ప్రేమ్‌-ప్రేమ్‌సబ్‌కోయీ కహై , ప్రేమ్‌న జానై కోయ్‌_
_జా మారగ్‌హరి జీ మిలై, ప్రేమ్‌కహాయే సోయ్
ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ‘ప్రేమ - ప్రేమ’ అంటారేగానీ నిజంగా ప్రేమ అంటే ఏమిటో ఎవరికీ సరిగ్గా తెలవదు.
ఏ దారిలో పయనిస్తే మనం దైవాన్ని చేర గలుగుతామో అదే నిజమైన ప్రేమ...
‘‘మానవత్వం కలిగి ఉండడమే పరమాత్ము న్ని చేరే దగ్గరి దారి’’ సర్వోన్నతమైన ప్రేమ చాలా శక్తివంతమైనది,ఇది మానవత్వానికి
సాకారరూపం...నిస్వార్థంతో కూడిన ప్రేమ నేడు ప్రపంచానికి చాలా అవసరం.....
‘‘జీవారాధకుడే నిజమైన శివారాధకుడు...
జీవులను ద్వేషిస్తూ దేవుణ్ని ప్రేమిస్తా ననడం అజ్ఞానమే’’
ఇలా ఎవరు చెప్పినా ఒకటే మాట... తోటివారి పట్ల ఆదర భావంతో,మానవత్వం తో మెలగాలి....
ఒకరోజు ఓ భక్తు డి ఇంటికి ఆకలితో ఉన్న వృద్ధు డువచ్చి భిక్షంఅడుగుతాడు,అప్పుడు ఆ భక్తు డు ఆ యాచకుణ్ని తన ఇంట్లోకి
తీసికెళ్లి ఆదరంగా కూర్చోబెట్టి పళ్లెంలో ఆహారం వడ్డించి ‘‘తృప్తిగా భోంచేయండి.
సాక్షాత్తు భగవంతుడే మిమ్మల్ని నా ఇంటికి పంపించాడు’’ అన్నాడు.దానికి ఆ వృద్ధు డు ‘‘అయ్యా మీరు నాకు ఆహారం పెట్టి ఆకలి
తీరుస్తు న్నారు...మధ్యలో భగవంతుణ్ని ఎందుకు తలుస్తు న్నారు అన్నాడు,నిజంగా ఆయనే ఉంటే నేను ఇలా ఆకలి కడుపుతో
ఇల్లిల్లూ ఎందుకు తిరగవలసి వస్తుంది’’ అంటూ నిష్ఠూరంగా మాట్లా డాడు...అప్పుడా భక్తు డు కోపంతో.. ‘‘నీలాంటి నాస్తికుడికి నా
ఇంట్లో భోంచేసే అర్హత లేదు’’ అంటూ అన్నం తింటున్న వృద్ధు ణ్ని బలవంతంగా లేపి బయటకు నెట్టేశాడు.ఆ రాత్రి భక్తు ని కల లోకి
భగవంతుడు వచ్చి..‘‘ఆకలితో వచ్చి నువ్వు పెట్టిన అన్నం తింటున్న ఆ వృద్ధు ణ్ని బలవంతంగా లేపి బయటకు పంపించి
అవమానించావు...అన్నార్తు డి ఆకలి తీర్చ కుండా మహాపాపం చేశావు,ఎన్నో రోజు ల్నుండి ఆ యాచకుడు నన్ను దూషిస్తూ
అవమానపరుస్తు న్నా పోషిస్తు న్నాను"..
"నువ్వు మాత్రం ఆ వృద్ధు ణ్ని నా కోసం ఒక్క పూట భరించలేకపోయావు’’అన్నాడు,ఆ మాటతో ఆ భక్తు డికి కనువిప్పు కలిగింది.....
ప్రేమతత్వమే మానవత్వం....
‘‘మనిషిలో మానవత్వం మొలకెత్తా లంటే మొట్టమొదట అతడిలో ‘ప్రేమ’ మొగ్గ తొడ గాలి.ఆ ప్రేమే సత్యానికి,ధర్మానికి,అహింస కు
పట్టు గొమ్మగా నిలుస్తుంది,మానవుడే మాధవుడనే విశ్వాసంఏర్పడినప్పుడు అంద రిలోనుభగవంతుడిరూపమేకనబడుతుంది"
"ఆ పరమాత్మ అంతటా వ్యాపించి ఉంటాడ నేది సత్యం’’ ..
‘‘ప్రేమ’’ భావన.....
అది మనిషి మనుగడకు అమృతం వంటిది, మానసిక రుగ్మతలను మాన్పే శక్తి ప్రేమకు ఉంది.....ప్రేమ అంటే వయసులో కలిగే వికా
రమే కాదు, ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రు ల పట్ల,గురువు పట్ల,సాటి మానవుల పట్ల ఉండే గౌరవమే ప్రేమ....                  
ఎవరో విలువ ఇవ్వలేదని,మీ విలువ తగ్గించు కోకండి.మీ జీవితం మీకెప్పుడూ విలువైనదే.మీకు నచ్చినట్టు హుందాగా
బతికేయండి.ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రావు గడిచిన క్షణాలు..  
" ఆత్మవంచన,పరనింద చేసేవారు తమ పతనాన్ని తాము కొని తెచ్చుకున్నట్లే"        
నిజం చెప్పడానికే కాదు,నిజాన్ని ఒప్పుకోవ డానికీ ఎంతో ధైర్యం ఉండాలి.....
💕
      
ఎంత వానో తెలిసేదెలా....
ఏ ప్రాంతంలోనైనా వర్షం కురిస్తే ఆ ప్రాంతం లోని సమతలంపై నీరు ఎంత ఎత్తు కు చేరు కుంటుందో ఆ మట్టం ఆధారంగా అక్కడ
కురిసన వర్షపాతాన్ని కొలుస్తా రు.ఉదాహర ణకు విజయవాడలో 10 మిల్లీమీటర్ల వర్షం నమోదైందంటే అక్కడి సమతలంపై నిలిచి న
నీటి ఎత్తు 10 మి.మీ.అన్నమాట.కానీ ఒక స్థలంలో నీరు ఎంత ఎత్తు న నిలబడిం దనే విషయాన్ని నేల మీద నుంచి కొలవడం సాధ్యం
కాదు.అందువల్ల వర్షపాతాన్ని వర్ష మాపకం (Rain Gauge) అనే పరికరంతో కొలుస్తా రు.వర్షమాపకంలో ఫైబర్‌గ్లా స్‌తో
కానీ,లోహంతో కానీ చేసిన 10 సెంటీమీటర్ల వ్యాసంగల ఒక గరాటు (ఫన్నల్‌) ఉంటుంది. ఈ గరాటు ఒక లీటరు
ఘనపరిమాణంగల సీసా మూతకు బిగించి ఉంటుంది. గరాటు ద్వారా సీసాలో పడిన వర్షపు నీటి ఘనపరి మాణాన్ని కొలవడానికి
ఒక కొలజాడీ (measuring jar)ఉంటుంది.చెట్లు ,కొండలు లేని మైదానంలో సమతలంగా ఉన్న నేలపై 30 సెంటీమీటర్ల ఎత్తు లో
వర్షమాపకాన్ని అమరుస్తా రు.ఆ ప్రదేశంలో వర్షం పడినప్పు డు నీరు వర్షమాపకంలోని గరాటు ద్వారా సీసాలో పడి కొంత ఎత్తు లో
నిలబడుతుంది. అలా సేకరించిన నీటి ఘనపరిమాణాన్ని కొలజాడీలో కొలిచి ఆ ప్రదేశంలోని వర్షపాతా న్ని లెక్కగడతారు.వాతావరణ
పరిశోధన కేంద్రాలలోని వర్షమాపకం ఒక సన్నని గొట్టం లా ఉంటుంది.ఆ గొట్టంపై ముందుగానే పై పద్ధతిని ఉపయోగించి కొలతలు
గుర్తించి ఉంటాయి.అందులోకి చేరిన నీటి మట్టా న్ని బట్టి వర్షపాతాన్ని నేరుగా మిల్లీమీటర్లలో కొలుస్తా రు.
ఏదైనా భౌతిక రాశి (physical parameter)ని రాసేప్పుడు ఏ ప్రమాణాల్లో (units) రాస్తే సులువుగా ఉంటుందో దాన్నే పాటిస్తా రు.
సాధారణంగా మెట్రిక్‌విధానం, బ్రిటిష్‌విధానం గురించి చదువుకుని ఉంటా రు.అంతర్జా తీయంగా మెట్రిక్‌విధానం (Standard
International or SI) అమల్లో ఉంది.దీని ప్రకారం దూరానికి మీట రు, కాలానికి సెకను,ద్రవ్యరాశికి కిలోగ్రాము, విద్యుత్‌ప్రవాహానికి
ఆంపియర్‌ప్రమాణా లు. కొలతల్ని వీటిలోనే చిన్న,పెద్ద ప్రమాణా లుగా వాడతాము.దూరం విషయంలో మిల్లీ మీటరు, కిలోమీటరు
ఉన్నట్టన్నమాట.కానీ ఒక పరమాణువు సైజును మీటర్లలోనే రాయాలంటే దాన్ని 0.000000002 మీట ర్లు అని రాయాల్సి
ఉంటుంది.కానీ మీటరు లో బిలియన్‌(వంద కోట్ల భాగం) వంతును నానోమీటర్‌అనుకున్నాక, పరమాణువు సైజును 20
నానోమీటర్లు అనడం సులువు. అలాగే సూర్యుడికి, భూమికి మధ్య ఉండే దూరాన్ని మీటర్లలో రాయాలంటే 150000000000
అని రాయాల్సివస్తుంది.
దీనికన్నా 150000000 కిలోమీటర్లు అని రాయడం తేలిక.అయితే సూర్యుడికి,భూమి కి ఉన్న దూరాన్ని ఒక ఆస్ట్రనామికల్‌
యూనిట్‌అనుకుంటే అది ఖగోళ విషయా ల్లో సులువుగా ఉంటుంది.ఇక వర్షం ద్రవ పదార్థమే అయినా,వర్షపాతాన్ని కొలిచే పరి
కరాల్లో (రెయిన్‌గేజ్‌) కొలతలు మిల్లీమీటర్లు , సెంటీమీటర్లలో ఉంటాయి కాబట్టి అలా రాస్తా రు.ఒక సమతలమైన ప్రదేశంలో వర్షం
కురిస్తే,ఎంత ఎత్తు న నీరు నిలబడుతుందనే విషయాన్నే ఆ పరికరాలు చెబుతాయి. ఒక మిల్లీమీటరు వాన పడిందంటే అర్థం,ఆ
ప్రాంతంలో ప్రతి చదరపు మీటరు వైశాల్యా నికి ఒక లీటరు వంతున నీరు చేరిందని అర్థం.....
నేడు మానవుడు సుఖ సంతోషాల కోసం తన రూపమునకు మెరుగులు దిద్దు కుంటు న్నాడు.అయితే సుఖ సంతోషాలు మన
స్వభావంలో ఉన్నాయి తప్ప మన రూపము లో  లేవు అన్న విషయం తెలుసుకోవాలి. స్వభావం మంచిదైనపుడు మంచి భావాలు
కలిగి మంచి పనులు చేయగలుగుతాము. తద్వారా సుఖ సంతోషాలు వాటికవే సర్దు కుంటాయి. స్వభావం మంచిది కానపుడు చెడు
భావాలు మనసులో తిష్ఠవేసి ఉంటా యి. ఫలితంగా చెడు కర్మలు జరిగి ,చెడు ఫలితాలు పొంది దుఃఖములు పాలవుతాం. పేపరు
మీద వేసిన భయంకరమగుసర్పము బొమ్మను చూసి భయము చెందుతామా! లేదు కదా! ఎందుకంటే అది రూపం చేత సర్పము
తప్ప స్వభావం చేత కాదు కదా! అలానే స్వభావము మంచిదైతే ఏదియును మనలను బాధింపదు. నిశ్చింతగా ఉండవచ్చును.....
💜
       
తెలిసి తెలియక చేసే తప్పులు కూడా బంధాలు అవుతాయి...
ఇతరులతో పూర్వజన్మలో  మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా,భర్తగా,సంతానంగా,తల్లి
దండ్రు లుగా,మిత్రు లుగా,నౌకర్లు గా,ఆవులు, గేదెలు,కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు.
ఆ ఇచ్చి పుచ్చుకునే ఋణాలు తీరగానే దూర మవడమో,మరణించడమో జరుగు తుంది.ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం
చేసుకో గలిగితే మన జీవిత కాలంలో మనకి  ఏర్పడే సంబంధాల  మీద మోజు కలుగదు. ఇతర జీవులతో మన ఋణాలు ఎలా
ఉంటాయి అంటే...మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ,వస్తు వు లు కానీ తీసుకున్నా,లేదా ఉచితంగా సేవ
చేయించుకున్నా ఆ ఋణం తీర్చుకోవడాని కి ఈ జన్మలో మన సంపాదనతో పోషించ బడే భార్యగా,సంతానంగా,మనతో సేవ
చేయించుకునే వారి గాను తారసపడతారు.
ద్వేషం కూడా బంధమే.పూర్వజన్మలో మన మీదగల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ
జన్మలో మనకి వారు తారసపడవచ్చు.
మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చు కోవడానికి ఈ జన్మలో శత్రు వులుగానో, దాయాదులుగానో,ఏదో ఒక రకంగా మనకు 
అపకారంచేసేవారిగా ఎదురవుతారు.మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రు లు గానో,
సహాయకులు గానో ఎదురవుతారు....
“కోపం రావడం మానవ సహజం.అయితే, దాన్ని ఎక్కడ,ఎప్పుడు,ఎవరి మీద ఎలా ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత.”       
“మాటలు నమ్మేవారికి అబద్దా లు సులువు గా చెప్పి నమ్మించొచ్చు.కాని,మనిషిని నమ్మే వారికి మాత్రం అబద్దా లు చెప్పి నమ్మించడం
అతి కష్టం”.     
మంచికి దగ్గరగా ఉంటే మనం బాగుంటాం.
చెడుకి దూరంగా ఉంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా బాగుంటారు.                          
నీ బాధనుఅర్థం చేసుకోమనీ నీవు ఎవ్వరినీ అడగకు.ఎందుకంటే వాళ్లు అనుభవించే వరకు ఆ బాధ వాళ్లకు అర్థం కాదు.
కొంతమంది మనం బాగుపడితే చూడలేరు  మరియు బాధపడుతుంటే ఓదార్చలేరు,
తమ తప్పులు దాచుకుని,ఎదుటివారి తప్పులను  వెతుకుతారు.వారిని దుారంగా ఉంచడం మంచిది....
💛
     
నిప్పు మంటపై పెట్టిన పాత్ర వేడెక్కును. దానితో పాత్రలో ఉన్న జలము వేడెక్కును. ఆ జలముచే బియ్యము పక్వమగును‌. అప్పుడు
అన్నము అనబడు శ్రేష్ఠమైన పదా ర్థము పుట్టు చున్నది.అట్లే ప్రజ్ఞతో కూడిన దేహేంద్రియములను ఆశ్రయించుకొని ఉన్న జీవునకు
దేహమున ప్రాణేంద్రియాదుల సమ్మేళనమున ఈసృష్టి తయారగుచున్నది.
సంసారమను ఘటమునకు శిక్షణము రక్షణము కలిగించువాడు రాజు.అతడు దుష్టకర్మలు మాని అంతర్యామిని సేవించె నేని
సంసారబద్ధు డు కాడు.
(అగ్ని యందలి వేడిమి పాత్రకును,జలము నకును,బియ్యమునకును సంక్రమించి అన్నము అనబడు శ్రేష్ఠమైన పదార్థము
సిద్ధమగుచున్నట్లు అంతర్యామి ప్రజ్ఞ తెలివి ని పనిచేయించి ఇంద్రియముల ప్రవర్తనము గా ప్రసరించి దేహమును ప్రయోగించి శ్రేష్ఠ
మైన సత్కర్మలు ఆచరించుటకును,దాని ఫలితమును సిద్ధపరచుటకును కారణమగు చున్నది.అట్టి దేహధారులైన జీవులకు క్రమ
శిక్షణము ఇచ్చి రక్షించుట ప్రభువు ద్వార మున జరుగుచున్నది.ఆ ప్రభువు తన ఇష్టా అయిష్టములను ఆశ్రయింపక అంతర్యామి ని
ఆశ్రయించినచో ప్రజలందరును తరింతు రు కనుక ప్రభువునకు శిక్షదండనాది కర్మ ఫలములు అంటవు‌ఒకడు ప్రభువగుట
తక్కినవారు ప్రజలగుట ఉపాధులకు
సంబంధించినది కాక అంతర్యామి యందు వర్తించుచున్న ప్రవర్తనమని తెలియవలెను. అప్పుడు రాజునకు రాజగర్వము గాని,
పండితునకు పండిత గర్వముగానిఅంటదు‌. నీవు రాజును,నేను బ్రాహ్మణుడను అను వ్యవహార సత్యములను విడిచిపెట్టి మాట్లా
డినచో బ్రహ్మవిద్య అంటునని హెచ్చరిక)....
    మన ఆలోచనలు ఎలా సాగుతాయో మన జీవనం అలా రూపుదిద్దు కుంటుంది. అదే "యద్భావం తద్భవతి".కనుక పాజిటివ్
ఆలోచనలతో పాటు అందరితో ఆత్మీయత తో మెలుగుదాం తద్వారా అందరి నుండి ఆత్మీయతను పొందుదాం.ప్రేమను పంచు
దాం, ప్రేమను పొందుదాం,ఏది ఇస్తా మో దానిని పొందుతాం.ఏది తీసుకుంటామో దానిని పంచుదాం.ఇదే భగవంతుని చట్టం, ఈ
సత్యాన్ని ఎప్పుడూమరవకండి."చేసింది పోదు చెయ్యంది రాదు" మొత్తం జీవితం ఈ ప్రకృతి నియమాలలోనే నడుస్తుంది.
❣️
      [2/01, 9:42 AM] 💕
       
ఇతర సిద్ధాంతముల వారు స్వయం ఆత్మ యే నిజమైన సత్యమని చెప్పుచుండిరి. నిజానికి మనమే స్వయం ఆత్మలమైనప్పటి కి
ఆజ్ఞానము వలన మన ఆత్మను మనము తెలుసుకొనలేకున్నాము.అందువలన మన ము నిజమైన ఆత్మ తత్వమును గ్రహించు టకు
బంధనాల నుండి,అజ్ఞానము నుండి విముక్తి పొందుటకు ఆత్మ జ్ఞానము పొందిన గురువును ఆశ్రయించాలి.
మనం ఎంచుకొనే గురువు వేద జ్ఞానము కలిగి,తనకు తాను బ్రహ్మములో సదా చరిం చువాడై ,కోరికలను త్యజించినవాడై ,పరి
శుద్దు డై , భౌతిక ప్రపంచము యొక్క కర్మల నుండి విడివడినవాడై ఉండవలెను.మరి యు ప్రశాంత చిత్తు డై కోరికలను దగ్దము
చేసినవాడై ,దయా సముద్రు డై ఉండవలెను. అందరిని ప్రేమించువాడై ఉండవలెను.అట్టి గురువును భక్తితో పూజింపవలెను,సేవించ
వలెను.వినయ విధేయతలతో తన సందేహ ములకు సమాధానము పొందవలెను.నిన్ను నమ్మినవారిని బ్రోచే నీకివే నా వందనము
లు. నన్ను రక్షింపుము చావు పుట్టు కలతో కూడిన సంసార బంధనముల నుండి విముక్తి కలిగించుము.మీ దయా దృష్టిని నాపై
ప్రసరింపజేసి నీ యొక్క కరుణామృత మును నాపై కురిపించుము.
🧡
       
సిద్ధాంతము నుండి ఆచరణ వ్యక్తమగు చున్నది.ఎవరి సిద్ధాంతమును బట్టి వారు ఆచరించెదరు కదా! ప్రతి ఆచరణకు కేంద్ర
బిందువుగ ఒక సిద్ధాంత మున్నది.సిద్ధాంత ము నుండి,ఆచరణ నుండి సిద్ధాంతము పుట్టు చునే యుండును.
సిద్ధాంతము బీజమైన,ఆచరణ,వృక్షమగు ను. మరల ఆ వృక్షము నుండి అదియే బీజ ము జనించుచున్నది.తండ్రి నుండి కొడుకు
జనించి,కొడుకు నుండి మరుల కొడుకు జనించుటచే మొదటి కొడుకు తండ్రి అగు చున్నాడు.కొడుకు తండ్రి అగుట,తండ్రి
కొడుకగుట బీజము వృక్షముగ అనుశ్యుత ము సాగుచునేయుండును.
మనస్సు నుండి సంకల్పము పుట్టి సంకల్ప ము నుండి మరల మనస్సు పుట్టు చు నుండును.అటులనే చరిత్రనుండి పరిణామ ము
పుట్టి చరిత్రగ మారుచున్నది.కేంద్రము నుండి పరిధి పుట్టు చున్నది.పరిధి యందలి ప్రతి బిందువు నుండి మరల పరిధులు
పుట్టు చున్నవి.ఈ విధముగ కేంద్రము పరిధి గను,పరిధి కేంద్రముగను మారుచున్నవి.
పై విధముగ కర్మ నుండి జ్ఞానము పుట్టు చు, జ్ఞానము నుండి కర్మ పుట్టు చున్నది.కర్మ, జ్ఞానములు,చెట్టు ,విత్తనముల వంటివి.ఈ
రెండింటి యందు సమభావము కలిగి యుండుట యోగస్థితికి దారి తీయును.
కర్మలేని జ్ఞానము,జ్ఞానము లేని కర్మ ద్వంద్వ మునకు సంసరణము కలిగించును.కర్మము ను, జ్ఞానమును సమరీతిని గౌరవించి
అను సరించుట పరిణామమునకుదారితీయును.
💛
    
స్వేచ్ఛ.మీరనుకుంటున్నది కాదు’.....
అప్పుడు ఎలాంటి అడ్డు గోడలు ఉండవు. దానితో మీరు ఎలాంటి సరిహద్దు లు లేని అనంతాన్ని దర్శించగలరు.
లాంఛనప్రాయమైన మర్యాదలన్నీ పరస్పర అహాలకు సహకరించేవే.ఎందుకంటే,అవన్నీ అబద్ధా లే.ఉదాహరణకు,‘‘మీరు పెద్దవారు
కాబట్టి,ముందు మీరే చెప్పండి’’అనగానే ‘‘మీరు చాలా అనుభవజ్ఞులు,మీముందు మేమెంత’’అంటారు.ఇలా ఒకరినొకరు
లాంఛనప్రాయంగా పొగుడుకుంటారు.అంతే కానీ,వారు నిజంగా అలాంటివారుకారు. కాబట్టి,అలా లాంఛనప్రాయమైన మర్యాద ల
ముసుగులో నాగరికంగా కనిపించే నాట కాలను మనం ఆడుతూనే ఉంటాము.కానీ, వాస్తవమైన మీ అహం మీకు ఎప్పుడూ
అడ్డు గోడలా కనిపిస్తూనేఉంటుంది.అయినా మన నాటకాలు కొనసాగుతూనే ఉంటాయి. అందువల్ల కాలక్రమంలో ఆ గోడ
రోజురోజు కూ మరింత మందంగా తయారవుతూ, చివరకు మనకు ఏదీ కనిపించకుండా చేస్తుంది.ఆ గోడ మీ చుట్టూ ఉన్నట్లు
మీకు తెలిసిన వెంటనే ఒక దూకుతో దానిని వది లించుకుని బయటపడింది.అందుకు మీరు చెయ్యవలసినదల్లా ‘‘ఎలాగైనా
బయట పడాలి’’ అనే నిర్ణయం తీసుకోవడమే.కాబ ట్టి,వెంటనే మీరు మీ అహాన్ని పోషించడం మానండి.దానితో అది కొన్ని
రోజుల్లోనే మరణిస్తుంది.ఎందుకంటే,అది మనుగడ సాగించాలంటే దానికి ఎప్పుడూ మీ పోషణ, మీ ఆలంబన చాలా అవసరం.
అనేక భయాలుంటాయి.కానీ,అవన్నీ ఒకే భయానికి చెందిన శాఖలు మాత్రమే.ఎందు కంటే, భయం ఒక చెట్టు లాంటిది.ఆ చెట్టు
పేరే మృత్యువు.మీ భయాలన్నీ దానికి చెందినవే.కానీ,ఆ విషయం మీకు ఏమాత్రం తెలియదు.ప్రతి భయం మృత్యువుకు
సంబంధించినదే.భయం కేవలం ఒక నీడ మాత్రమే.
మీరు దివాలా తీసినప్పుడు అది పైకి కని పించకపోవచ్చు.కానీ,ఒక పక్క మీరు నిజం గా డబ్బులేదని భయపడుతూనే,చివరికి
చనిపోయేటంతగా మీరు మరీ బలహీనుల వుతూ ఉంటారు.చావు నుంచి ఏమాత్రం తప్పించుకోలేమని అందరికీ కచ్చితంగా
తెలిసినప్పటికీ,రక్షణకోసం వారు కేవలం డబ్బునే పట్టు కుని వేలాడతారు. అయినా ఇంకా ఏదో ఒకటి చెయ్యాలని తాపత్రయ
పడుతూ ఉంటారు.అది మీకు ఏమాత్రం తీరిక లేకుండా చేస్తుంది.అలా అదిమిమ్మల్ని ఒక రకమైన అచేతనంలోకి,ఒక రకమైన
మత్తు లోకి నెట్టేస్తుంది.కాబట్టి,తాగుబోతులు న్నట్లు గానే ‘‘పనిబోతులు’’ కూడా ఉంటారు.
వారు నిరంతరం ఏదో ఒక పనిలోనిమగ్నమై ఉంటారే కానీ,ఏ పని చెయ్యకుండా ఉండ లేరు. సెలవులంటేనే వారు భయపడతారు. ఏ
పని చెయ్యకుండా వారునిశ్శబ్ధంగా ఉండ లేరు. అందుకే ఉదయం చదివిన వార్తా పత్రి కనే వారు మళ్ళీ చదవడం ప్రారంభిస్తా రు. అలా
వారు ఏదో ఒక పనిచేస్తూ ఉంటారు. అది వారికి,మృత్యువుకు మధ్య ఒక తెరలా అడ్డు గా ఉంటుంది.కానీ,వారు చేస్తు న్న పని
ముగిసిపోగానే మళ్ళీ మృత్యుభయం వారి ని వెంటాడుతుంది.
ఇతర భయాలన్నీ కేవలం మృత్యుభయానికి చెందిన శాఖలు మాత్రమే. ఎందుకంటే, మీ భయానికి మూలకారణం తెలిస్తే,ఆ భయం
పోయేందుకు ఏదో ఒకటి చెయ్యవచ్చు.
మీ భయానికి మూలకారణం మరణమే అని తెలిసినప్పుడు ఆ భయాన్ని పోగొట్టేందుకు కేవలం మరణం లేని చైతన్యాన్ని మీ అనుభ
వంలోకి తీసుకురావడమొక్కటే అందుకు పరిష్కార మార్గం.అది తప్ప ఏది చేసినా ఎలాంటి ప్రయోజనము ఉండదు.డబ్బు,
హోదా,అధికారం- ఇలాంటివేవీ మృత్యువు కు ఎలాంటి బీమా కల్పించలేవు.కేవలం గాఢమైన ధ్యానమొక్కటే మీ శరీరము, మనసు
మరణిస్తా యని,మీరు వాటిని అధి గమించిన వారని మీకు తెలిపే ఏకైక సాధ నం. మీకన్నా ముందు ఇక్కడ ఉన్నది, మీ తరువాత
కూడా ఇక్కడ ఉండేది మీ జీవిత మూలాధారమైన మీ కేంద్రమొక్కటే.
💕
       
బ్రహ్మముతో యోగము చెంది ముక్తు డై నటు వంటి జీవాత్మ అక్షయమగు సుఖమును పొందుచున్నాడు.అతనికి బాహ్యస్పర్శ
యిత్యాది యింద్రియ స్పర్శలుండవు.వాని యందాసక్తియు యుండదు.బ్రహ్మము ప్రకృ తికి కూడ అతీతమైన తత్త్వము.దానియం
దు ముడిపడిన స్థిర చైతన్యము కలవాడు ప్రకృతి సంబంధిత సుఖములను దాటిన వాడగుచున్నాడు.....
బ్రహ్మముతో యోగము చెంది ముక్తు డై నటు వంటి జీవాత్మ అక్షయమగు సుఖమును పొందుచున్నాడు.అతనికి బాహ్యస్పర్శ
యిత్యాది యింద్రియ స్పర్శ లుండవు.వాని యందాసక్తియు యుండదు.బ్రహ్మము ప్రకృ తికి కూడ అతీతమైన తత్త్వము.దాని యం
దు ముడిపడిన స్థిర చైతన్యము కలవాడు ప్రకృతి సంబంధిత సుఖములను దాటిన వాడగుచున్నాడు.అతనికి దేహ సంబంధిత
మగు సుఖములుగాని,యింద్రియపరమగు సుఖములుగాని,మనోభావములుగాని, అహంకార భావములుగాని యుండవు.
అంతయు దైవముగనే యుండును.అందు వలన బాహ్యస్పర్శ యందు ఆసక్తిని దాటిన వాడని వేరుగ చెప్పవలెనా!
💙
         
‘అదానదోషాత్ భవేద్దరిద్రః‘, అంటే దానం చేయకపోవటం వలననే దరిద్రు డవుతాడు. మామూలుగా ఈ శ్లోకాన్ని అందరం చదువు
తాము. దానం చేయకపోవటంచేత మను ష్యుడు దరిద్రు డవుతున్నాడు. ‘పునరేవ దరిద్రః పునరేవ పాపీ‘. దానం చేయకపోతే
దరిద్రు డు అవుతాడు.దారిద్య్రంవలన మళ్ళీ పాపంచేస్తా డు.ఇలా ఉన్నారు మను ష్యులు. అందుకే,ఉన్నవాడు దానం చేసుకో వాలి.
దారిద్య్రంలో ఉన్నప్పుడు ఏం దానం చేయగలరు? అందువల్ల దానంచెయ్యాలని చెప్పి హితబోధలు,హితవాక్యాలు మనకు చాలా
ఉన్నాయి.
షడర్శనములలో జైమిని ‘పూర్వమీమాంస’ ఉంది.అందులో ప్రభాకర,భాట్టములనే
రెండు మతాలున్నాయి.వాటిలో ఒకరికి 5 ప్రమాణాలు,మరొకరికి ఆరు ప్రమాణాలు ఉన్నాయి.“మీరందరూ అనుకుంటున్నటు
వంటి సర్వజ్ఞుడనేవాడు,మహోత్తమ లక్షణా లు కలిగినవాడు,జగత్తు కు ప్రభువైనవాడు – విభుడు,నిత్యుడు,చిదాత్మకుడు మొద
లైన లక్షణాలు అన్నీ కలిగి ఉన్నాదంటున్న ఈశ్వరుడనే వాడు ఎవరూలేరు” అన్నాడు జైమిని.అలా అనగానే మనకు దుఃఖం కలు
గుతుంది.మన విశ్వాసానికి అది మూలఛ్ఛే దం అవుతుంది.ఈయన లేడని అంటే, ఉన్నాడని ప్రమాణాలు ఎంతో మంది చెప్పా
రు.అయితే ఈశ్వరుడు ఉన్నాడని సమర్థిం చేవాళ్ళు ప్రత్యక్షంగా ప్రమాణానికి దొరకరు. పోనీ ఉన్నాడని చూపించడానికి వీలుకలు
గదు.అనుమానప్రమాణంతో కూడా ఆయన నిర్ధా రణ చేయటానికి వీలులేదు.ఇకపోతే ఆగమము,ఉపమానము,ఉపమేయముల తో
ఇలా ఉంటాడని.చెప్పటానికి మాత్రమే బాగుంటుంది.అంటే,ఎప్పుడూకూడా మనం చూడని వస్తు వునుకూడా ఉందని నమ్మించ
వచ్చు.ఉదాహరణకు,ఒక ఊళ్ళో ఒక పెద్ద పక్షి ఉంది.ఇది ఇలా ఉంటుందని ఒకరు చెప్పవచ్చు.అంటే దాని పోలికలు ఇలా
ఉంటాయని చెపితే,ఉంటే ఉండవచ్చు.కాని అలాంటి పోలిక ఏమీ చెప్పడానికి వీలులేని వస్తు వు ఈశ్వరుడు.దేనితోనూ పోల్చడానికి
వీలులేని వస్తు వు అది.అట్లాంటి వస్తు వుకు ఉపమానం ఏం ఉంది?ఉపమేయంకాదది. ఈశ్వరుడు! కాబట్టి ‘ఉపమానము లేనిదా
నిని ఎందుకు విశ్వసించాలి?’ అని జైమిని ఒక ప్రశ్నవేశాడు.
❣️
       
దేహధారులై యున్నస్థితి ఉండును.సద్గురు వులయొక్క లేక,అవతార పురుషునియొక్క దివ్య కార్యాలయము కూడా ఉండును.
నిజమైన దివ్యుడు సృష్టిలో నివసించున ప్పుడు భగవంతుని సత్యముగను,ప్రపంచ మును మిథ్యగను తెలుసుకొనును.(బ్రహ్మ సత్యం
జగన్మిథ్య).'సలీక్'యొక్క చైతన్యము  ను సులూకియత్అందురు.సలూకియత్ అనగా అనంత దివ్య జ్ఞానము యొక్క విజ్ఞాన స్థితి.
విశ్వాసం,సౌశీల్యం గల(కొద్దిమంది) వ్యక్తు ల చరిత్రే ప్రపంచ చరిత్ర.మనకు కావలసినవి మూడు-స్పందించే హృదయం,ప్రేమించే
మనస్సు,పని చేసే చెయ్
కోరికలు క్షణికమైన సంతృప్తి లో అంతులేని దుఃఖాన్ని మోసుకొస్తా యి.
ప్రార్ధన చేస్తు న్నప్పుడు గాని,ధ్యానము చేస్తు న్నప్పుడు గాని అంతకు ముందు మనకు తెలియనివిషయములు స్ఫురణకు వచ్చుట
కు గాయత్రి మంత్రము ఉపయోగపడుతుం ది. గాయత్రిచేస్తే మన ప్రజ్ఞ బాగా వికసించి, ప్రచోదనము చెందుతుంది.ఎన్నెన్నో అద్భుత
మైన విషయములు తెలుస్తూ ఉంటాయి. మనకి స్పురణకి వచ్చిన విషయములను గ్రంధములలో వెదుక్కుంటే అంతకు పూర్వ మే
ఋషులు చెప్పినట్లు ఉంటాయి.
💘
           
" నీవు ఎట్లా ఉన్నావో అట్లా గే ఉండు,'నేను న్నాను' అనేది తెలుకో అంటున్నారు,అది సాధ్యం కావట్లేదే ...."
శాశ్వతమైనది సత్యమొక్కటే.అదే ఆత్మ. నేనున్నాను,నేను వెళుతున్నాను,నేను మాట్లా డుతున్నాను,నేను పనిచేస్తు న్నాను
ఇట్లేఎన్నెన్నో అంటావు.ఆ అన్నింటిలో 'నేను' సమమని గుర్తించు."నేను-ఉన్నాను" అనేది స్థిరమూ,ప్రధానమూ అయిన సత్యం.దైవం
మోసెస్ కి బోధించాడు."నేనున్నాను ఆదిగా నేనున్నాను" [I am that I am] నిశ్చలంగా ఉండు.నేను దైవమని
తెలుసుకో.ఇట్లు 'నేను -ఉన్నాను'.అదే దైవం !.
" 'నేనున్నానని' నేను అంటున్నా,ఆ 'నేను' ఏమిటో తెలియట్లేదు ?.
నీవున్నావని నీకు తెలుసు.లేవని ఎప్పుడూ అనలేవు.లేవనడానికి కూడా నీవుండవలె. కనుక ఈ కేవలస్థితి నీమనస్సు నిశ్చలమైతే నే
తెలియనౌతుంది.వ్యక్తి వెలికి నిర్గమించే శక్తియే మనస్సు.దానిని లోనికి మళ్ళిస్తే క్రమంగా అది స్తబ్దమౌతుంది.'ఆత్మస్థితి'- 'నేను' -
'ఉన్నాను' మిగులుతుంది. 'నేను-ఉన్నాను' అదే సత్యసర్వము !
💜
        
పరమశాంతిని గుర్తించిన తర్వాత దేహము కూడా అనంతాత్మేనని అర్ధం అవుతుంది !.
భూత,భవిష్యత్తు లు అనేవి నిజంగా నిలిచి ఉండే విషయాలుకావు.మనసును వర్తమా నంలో ఉంచి జీవించడం అలవర్చుకుంటే
మనం చిన్మయ స్వరూపులుగానే ఉంటాం. అప్పుడు దేహపరమైన చావు,పుట్టు కలు చాలా అల్పమైనవిషయాలుగాఅనిపిస్తా యి. ఆత్మ
అంటే అనుభవంలో ఉన్న శాంతి, ఆనందం.మనసులోని పరమశాంతిని గుర్తిం చిన తర్వాత దేహము కూడా అనంతాత్మే నని అర్ధం
అవుతుంది.వినపడే మాటలు ఇంద్రియపరమైన అనుభవాలు అన్నీ అస త్యాలే అని..! అంటే శాశ్వతమైనవి కావు అని అర్థం
అవుతుంది.అప్పుడు జీవనంలో అనవసరమైన అనుభవాలకు,అనుభూతు లకు విలువ తగ్గి మనసు సంకల్పరహితంగా ప్రకాశిస్తుంది
!.
🌷🌷🌷
        
*ఆదిత్యుని యందు గల తేజస్సు జగత్తు నంతను వెలిగించుచున్నది.అట్లే చంద్రు ని యందుగల వెన్నెల,అగ్నియందు గల వేడి మి,
వెలుగు జీవలోకమును చక్కబెట్టు చున్న వి. అవి నా వెలుగులని భావింపుము.
(సూర్యుని జూచి "నేను సూర్యుని చూచు చున్నాను" అని తలచువానికి 'నే'నను ప్రజ్ఞ శరీరమునను,సూర్యుడను పేరు ఆకాశము
నను వేరుగా నుండును.కాని 'సూర్యుడు నేను' అని ఎరిగినవాడు యోగి.మనకు మన శరీరమున్నట్లు సూర్యునికి సూర్య
బింబమున్నది. ఈ శరీరము నందు నేనను ప్రజ్ఞ యున్నట్లు సూర్యుని యందు నేనను ప్రజ్ఞ ఉన్నది. దానిని 'నేను' అని భావింపక,
'వాడు', 'అతడు', 'అది' మున్నగు పదముల కు లక్ష్యమైన భావన చేసినచో సర్వాంతర్యా మి అయిన ఈశ్వరభావము లభింపదు.
ప్రతి జీవియు తన శరీరమున 'నేనున్నా'నని తెలుసుకొనుము.అదియే నాయొక్కవెలుగు వెలువడుట.ఎదుటి వాని యందు
'అతడు న్నాడు'అను భావనచే ఈశ్వరుడు పూజింప బడక,అనాత్మ గోచరించును.అనాత్మ లేదు గనుక జ్ఞానము
మోహమగును.లేనిది ఉన్న ట్లు గోచరించు భ్రాంతిలో జీవితము గడచి పోవును.ఇట్లు వివేకము చేసికొని సర్వము నందు నేనున్నా
నని భావన చేయవలెను. సూర్యుని యందు సూర్యప్రకృతికి,చంద్రాదు లయందు వారి వారి ప్రకృతికి గల ప్రత్యేకత అను గూటిలో
నుండి ఆవతలి వెలుగగు 'నేను'అనిభావింప బడినప్పుడు ఆ వెలుగు 'నాది'అని దర్శన మిచ్చును.).
🧡
           
మాయను పరిహరించుటకు పూర్వము మాయత్వము,మాయ యొక్క లక్షణము లు, నిశ్చయింపవలెను గదా అనినచో విను
ము.లోకప్రసిద్ధమైన ఇంద్రజాల లక్షణమునే చూడుము.మధురపదార్థములను చేదు
పదార్థములుగాను,చేదైన వానిని మధుర ములుగాను,మిత్రు లను శత్రు వులు గాను, శత్రు వులను మిత్రు లనుగాను మార్చునది
మాయేనని యోగికి తెలియును కానీ, అజ్ఞా ని అదే సత్యమనే అట్టిమాయలో పడిపో వును.ఈ ప్రపంచము కేవల చైతన్యస్పందన
ము తప్ప వేరేదియుగాదు.అజ్ఞానిదృష్టిలో పిశాచమున్నట్లు కనిపించువిధముగానేె ఈ ప్రపంచమున్నట్లు అగుపించును.ఇది అంత
యు కేవలమాయయే.ఏల అనగా అనంత చైతన్యమునకు,ప్రపంచము యొక్క అభాస మగు అస్థిత్వమునకును మధ్య ఎట్టి వైరు
ద్ధ్యము లేదు.ఇది మేల్కొన్న వ్యక్తి యొక్క అద్భుత స్వప్నము వంటిది.అదే విధముగా దృక్కోణమును మార్చుకొనుట వలనను
పట్టు దలతో గూడిన అభ్యాసము వలనను మానవుడు పూర్వము ఆసక్తికరములుకాని శాస్త్రా ధ్యాయనముపట్ల,జపాదులపట్ల అభి
రుచిని పెంచుకొనగలడు.ఏల అనగా ఈ గుణములు ఆ విషయములలో లేవు,వ్యక్తి యొక్క భావన(మాయ)లో మాత్రమే ఉండు
ను.మద్యము త్రాగినవాడికి ప్రపంచము తిరుగుచున్నట్లు కనిపించు విధముగా,అజ్ఞా నికి ఈ గుణములు విషయములలో ఉండు
నన్న భావన కలుగును.
ఈ అజ్ఞానము(మాయ)ఎన్నో రూపాలలో అనునిత్యం మనకు ప్రత్యక్ష అనుభవము అవుతూనే వుంటుంది కదా!
ఇది వ్యక్తి యొక్క తీవ్రమగు స్వప్రయత్నము మీద ఆధారపడి యుండును.మానవుడు
అఖండబ్రహ్మానుభవము,
అజ్ఞానముతో ప్రపంచము సత్యమని అంగీ కరించుట--అను రెండు విభిన్నదిశలవైపు ఆకర్షింపబడును.అతడుఅనుభవగోచరము
గావించుకొనవలెనని అత్యంతతీవ్రముగా ప్రయత్నించినదే విజయవంతమగును.
ఒక్కసారి అజ్ఞానమును అతిక్రమించినచో భ్రాంతి(మాయ)యుతమయిన అసత్య దృష్టి శాశ్వతముగా నివర్తించును
❤️
        
మనుజులలో(గీతాతత్త్వప్రచారము చేయు) అట్టివానికంటె నాకు మిక్కిలి ప్రియము నొనర్చువా డెవడును లేడు.మఱియు
అతనికంటె నాకు మిక్కిలి ఇష్టు డై నవాడు ఈ భూలోకమున మఱియొకడుకలుగబోడు
అధ్యాత్మవిద్యావ్యాప్తియెడల,గీతాతత్త్వ ప్రచారముయెడల ఎంతటి ప్రీతిగలదో సువ్యక్తము చేయుచున్నవి.గీతను భగవ ద్భక్తు లకు
బోధించువానికంటె మిక్కిలి ప్రియ మునొనర్చువాడు తనకు మఱియొక డెవ డును లేడని శ్రీకృష్ణమూర్తి వచించిరి.
"ప్రియకృత్తమః” అని “తమ” ప్రత్యయము ను వాడుటచే అట్టివాడు భగవానునకు మహాప్రియమునొనర్చువాడని స్పష్టమగు
చున్నది.(ప్రియకృత్, ప్రియకృత్తరః , ప్రియ కృత్తమః) ప్రపంచములో దేవునకు ప్రియ మొనర్చుటకై అనేక పుణ్యకార్యములను జనులు
చేయుచున్నారు.కానివారి యందఱి కంటెను ఈ గీతాతత్త్వ ప్రబోధకుడే అధిక పుణ్యమును సంపాదించుకొనుచున్నాడు.
ఏలయనిన,అక్కార్యముద్వారా యతడు సర్వేశ్వరునకు మహత్తరప్రియము నొనర్చు చు తత్ఫలితముగ సాక్షాత్ బ్రహ్మసాయుజ్య
మునే పడయుచున్నాడు.అట్టివాడు భగవం తునకు పరమ ప్రీతిపాత్రు డు (ప్రియతము డు)అగుచున్నాడు.భూతభవిష్యద్వర్తమాన
ముల యందు అంతటి ఇష్టు డు వేఱొకడు తనకెన్నడును లేడని శ్రీకృష్ణపరమాత్మ అట్టి గీతా ప్రబోధకునిగూర్చి తన సదభిప్రాయ
మును వెల్లడించుటచూడ అట్టి గీతా ప్రచార కార్యము మహాపుణ్యప్రదమైనదని,భగవ త్ప్రీతికరమైనదని తెలియుచున్నది. నిజ
ముగా జీవితములో భగవంతునకు ప్రీతి పాత్రు డుగ నుండుటకంటె వేఱొక గొప్ప విషయమేమున్నది? అట్టివాని జన్మ సార్థకమైనట్లే.
జగన్నాథుడగు సర్వేశ్వరునకు ప్రియుడుగా నుండగలుగునట్టి జన్మము ధన్యము.అట్టి భగవత్ప్రియత్వమే జీవితపరమావధి కావున
ప్రతివారున్ను గీతాతత్త్వమును తాము చక్కగ అనుభూతమొనర్చుకొని, ఇతరులకున్ను దానిని బోధించవలెను. ఇవ్విధముగ తాను
తరించి ఇతరులను గూడ తరింపజేసి,తద్ద్వారా భగవంతునకు అతిప్రియముగా నుండగల్గు సౌభాగ్యమును నోచుకొనవలెను.
ఎవడు దేవునకు మిగుల ప్రియమగు కార్యమును జేయునో అతడు దేవునకు మిక్కిలి ఇష్టు డగును.గీతా ప్రబోధ ముయొక్క
మహిమనుగూర్చి భగవాను డి వ్విధముగ తెలియజేసినందు వలన ఇక ప్రతివారును తమతమ గ్రామములలోను తమతమ పరిసర
ప్రాంతములలోను,గీతా సంఘములను స్థా పించి,తద్ద్వారా గీతా జ్ఞానమును ప్రజలలో లెస్సగ వ్యాపింప జే యు ట ధర్మము.అట్లు
చేసినచో అది భగ వానునకు అతిప్రియకరకార్యమైయలరును. వారున్ను సర్వేశ్వరునకు మిక్కిలి ప్రీతిపాత్రు లగుదురు....
భూతభవిష్యద్వర్తమానములందు ఎవడును ఉండడు.....
నీ అంతరాత్మ భాషను తెలుసుకో అది నీకు సరైనది ఇస్తుంది...పిలుపు ఏదైనా ప్రేమతో ఉండాలి.బంధం ఏదైనా అనుబంధంగా
ఉండాలి.విభేదాలు ఎన్ని ఉన్నా విడిపో కుండా ఉండాలి.స్వార్థం కపటం అబద్దంకు
దూరంగా ఉండాలి.
           ♥️
పుట్టటంనుంచి గిట్టడందాకా,'మాయ'మర్మం
'జాతస్య హి ధ్రు వో మృత్యుః' .....
పుట్టినవాడు గిట్టక తప్పదు......
మరి మన తలరాత ఎలా ఉందో చూద్దాం. పుట్టటం నుంచి గిట్టడం దాకా ఈ 'మాయ' మర్మాన్ని కొద్దిగా తెలుసుకుందాం.
ఈ విశ్వాన్ని ఇంగ్లీషులో యూనివర్స్‌అంటు న్నాం.యూని అంటే ఒకటి,వర్స్‌అంటే అనేకం.ఏకం,అనేకం కలిసి యూనివర్స్‌
అయింది.అనేక రూపాలలో కనిపించేదంతా ఒక్కటే అని ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవాలి.
*కాబట్టి ఈ బ్రహ్మాండానికీ పిండాండానికీ తేడా ఏమీ లేదు.మనం పిండాండం నుంచి వచ్చాం కాబట్టి దీనిగురించితెలుసుకుందాం.
మనిషి శరీరంలో 72 శాతం నీరు ఉంది. వెన్నెముక నుంచి అన్ని వైపులకూ 72 వేల నాడులు ఉన్నాయి.వీటిలో 14 నాడులను
ప్రధానంగా చెప్పుకోవాలి.ఈ 14 నాడులకూ పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఉన్న 14 తిథులకూ సంబంధముంది. తిథి అంటే
నక్షత్రంలో సగం.శుక్ల పక్షంలోని 14 తిథులు, కృష్ణ పక్షంలోని 14 తిథులు కలిపితే 28 నక్షత్రాలు అవుతాయి.
మన నక్షత్రాలు 27 అయినా అభిజిత్‌తో కలిపి 28 కదా!మాయ అంటే మనమెవరో తెలియకపోవడం.ఒకటి అనేకం కావడమే
సృష్టి.ఆ ఒక్కటిలో అన్నీ చేరడమే ప్రళయం. అదే మరణం కూడా.
మనిషి పుట్టు కకు మూలకారణం స్త్రీలకు ప్రతి నెలా జరిగే రుతువు (బహిష్టు ).మను షులలో ఈ బహిష్టు 27 లేదా 28 రోజులకు
ఒకసారి జరుగుతుంది.ఈ బహిష్టు ప్రారంభ మైన క్షణం నుంచి 24 గంటలు ఒకరోజు.
అలాంటి 27 రోజులు లేదా 28 రోజులు ఒక నెల.నెల అంటే చంద్రు డు అని కూడా అర్థం ఉంది. నెలరాజు,నెలపొడుపు అనే పదాలు
ఇలా ఏర్పడినవే.బహిష్టు కు 14 రోజుల ముందు అండం విడుదల అవుతుంది.ఈ అండం ఫలదీకరణం చెందితే పిండం గర్భా
శయాన్ని చేరుతుంది.
శిశుజననంతో రుతుచక్రం ఆగిపోతుంది. దీన్నే మనం నెలతప్పడం అంటుంటాం.
భగవంతుడు తన శరీరంలో నాలుగోవంతు భాగంతో సృష్టిచేశాడని పురుషసూక్తం అంటోంది.కాలచక్రా నికి సూర్యుడే ఆధారం.
సావన సంవత్సరం అంటే 360 రోజులు. ఇదే రాశిచక్రంలోని 360 డిగ్రీలు.దీని ప్రకారం 360 రోజుల్లో నాలుగోవంతు 90 రోజులు
అవుతుంది.
ఈ 90 రోజులు పోగా 270 లేదా 280 (40 వారాలు) రోజుల్లో శిశువు జన్మిస్తుంది.
120 నెలలను పరమాయువు అంటారు. దీని ఆధారంగానే సూర్య సిద్ధాంతం రూపొం దింది.ఉత్తరాషాఢ,శ్రవణాల మధ్య అభిజిత్‌
నక్షత్రం ఉంటుంది.
ఈ 28 నక్షత్రాల ఆధారంగా హోరాశాస్రాన్ని పరాశరమహర్షి రూపొందించారు.సౌర అంటే 72,హోర అంటే 82.వీటిని తిరగేస్తే 27,28
వస్తా యి.
27 నక్షత్రాల ఆధారంగా సూర్యసిద్ధాంతం, 28 నక్షత్రాల ఆధారంగా హోరాశాస్త్రం రూపొందాయి.అందువల్ల దీన్ని పరాశర హోరాశాస్త్రం
అన్నారు.
నక్షత్ర మానం ప్రకారం 27.321 రోజులు ఒక నెల.అలాంటి 12 నెలలు ఒక సంవత్సరం. అలాంటి 120 సంవత్సరాలు మనిషి
ఆయువు.
జ్యోతిష శాస్త్రం ప్రకారం దశలన్నీ కలిపితే 120 సంవత్సరాలు వస్తుంది. దీన్ని బట్టి మనిషి పూర్ణాయువు 120 సంవత్సరాలని
అనుకోవలసి వస్తోంది.
120 సంవత్సరాలు బతకాల్సిన మనిషి అందులో సగంకూడా బతకడంలేడు.ఎందు కు అనే ప్రశ్న చాలా మందిలో ఉదయిస్తుం
టుంది.దీనికి కారణం మనిషి తీసే శ్వాసలే.
ముఖ్యంగా మనిషి పూర్ణ శ్వాసలు తీయడం లేదు.అర్ధశ్వాసలతో కాలం గడిపేస్తు న్నాడు.
మనిషి నిమిషానికి తీసే శ్వాసలు15. రోజుకు 1440 నిమిషాలు.1440ని 15తో హెచ్చిస్తే 21,600 శ్వాసలు వస్తా యి.12 రాశులు,12
నెలలు,పూర్ణాయువు120 సంవత్సరాలు,కలియుగం1200 దివ్య సంవ త్సరాలు,మహాయుగం 12000 దివ్య సంవ త్సరాలు...ఇలా
ఒకదానితో ఒకటి సంబం ధం కనిపిస్తూనే ఉంటుంది.
తక్కువ శ్వాసలు తీసే జీవి ఎక్కువ కాలం బతుకుతుంది.ఎక్కువ శ్వాసలు తీసే జీవి తక్కువ కాలం బతుకుతుంది.మనం యోగ
శాస్త్రా న్ని అభ్యసిస్తే పూర్ణాయువు సంపాదిం చుకోవడం పెద్ద కష్టం కాదు.మరణం అంటే శరీరం మార్పునకు లోనవడం.ఆత్మ ఈ శరీ
రాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటుంది. కాబట్టి మరణం గురించి భయపడాల్సిన అవసరం లేదు.
ఇక ఈజన్మలో అనుభవిస్తు న్న కర్మ ఫలితాల గురించి అంటారా...సత్కర్మ ఉన్న వారికి సరైన పరిహార క్రియలు తప్పనిసరిగా అందు
బాటులోకి వస్తా యి.
ఆ సత్కర్మబలంలేనివారు ఎక్కడెక్కడో తిరు గుతూ వేల రూపాయల్ని పరిహార క్రియల పేరిట వదిలించుకుంటారు.
అణువుకూ ఆత్మకూ తేడాఏమీలేదు.ఇదం
తా సూర్యకాంతి శక్తి.మన జీవితాలన్నీ సూర్యకాంతిశక్తితో ప్రేరణపొంది నడుస్తు న్నా యి.ఈ సూర్యకాంతే సృష్టి,స్థితి,లయలకు
మూలం.ఈ అనంత సూర్యశక్తిని సాధించి మనమే పూర్తిగా సూర్యకాంతిగా మారి అందులోనే లయం కావాలని గాయత్రీ మంత్రం
కూడా చెబుతోంది.ఇవన్నీభారతీయ సంస్కృతిలో అంతర్భాగాలు.వేదాలు,ఇతి  హాసములు,పురాణములు,స్మృతులు వీటి గురించి
విస్తా రంగా తెలుపుతున్నాయి. దేశ విదేశాల్లో పరిశోధకులు చేసి అనుసరిస్తు న్నారు.....
💜🌷🌷🌷
      
అక్షరములు అంటే క్షరము కానివి.కేంద్రము నుండి అక్షముగా కొనిరాబడినవి. (From centre to circumference ) సృష్టి కి
మూలము ఏదైతే ఉందో ఆ మూలమును, ఆ తత్వాన్ని మన దగ్గరకు చేరుస్తుంది. ఒక్కో అక్షరానికి ఒక్కొక్క కాంతి ఉంది. *రామ*
అని పిలిస్తే అద్భుతమైన,ఆహ్లా దం కలిగించేది,మన అంతర్ శుద్ధి చేసే  సింధూర వర్ణము వచ్చేస్తుంది.
**క్లీం*అంటుంటే అద్భుతమైన నీలి ఆకాశ మందలి వెన్నెల మనకు స్పర్శను ఇచ్చి, తన్మయత్వము కలిగిస్తుంది.ఉచ్ఛారణ
యాంత్రికముగా కాకుండా శ్రద్ధతో చేస్తే తద నుగుణమైన వెలుగులు మనలో ఉద్భవిస్తా యి.ఆ వెలుగుల మార్గము ద్వారా భగవం
తుడు మనలోకి దిగి వస్తా డు.మహాత్ములు భాషణ చేస్తూ ఉంటేనే ప్రకాశము అట్లా వ్యాప్తి చెందుతూ ఉంటుంది.
మనలను మనం వికసింపచేసుకునేందుకు జీవితం అంతులేని అవకాశాలను కల్పిస్తుంది.మార్పు లేకుండా అంతరంగ శుద్ధి ఎవరికీ
సాధ్యంకాదు.ఏ వ్యక్తిలోనైనా అతని వాక్కులో,ఆలోచనలో,కార్యాచరణం లో తప్పక ఇది కానవస్తుంది.
మార్పుతో అతని జీవితం పవిత్రీకరించబడి సంకల్పంలో స్థిరత్వం కలుగుతుంది.
అహంకారం,ఆవేశం అనేవి మన దృష్టిని మసకబార్చి ఉన్నత అవకాశాలకు ఆటంకా లుగా నిలుస్తా యి.
శోధన ద్వారానే అవకాశాలను సక్రమంగా వినియోగించుకోగలం,మనల్ని మనం మార్చుకోగలం.
మన మంచితనం గురించి ఇతరులకు చెప్పకూడదు.కారణం వారు నమ్మరు.మన చెడును మరొకరికి తెలుపకూడదు..
కారణం దానికిమరికొంతజోడించి ఊహించు కుంటారు.
జీవితంలో ఒంటరిగా నడవడంనేర్చుకోవాలి.
ఈరోజు మన వెంట ఉన్నవాళ్లు రేపు మన వెంట నడుస్తా రనే నమ్మకం లేదు.
ఆశతో ఉన్న వాడికి అవకాశం ఇస్తే దోచుకు తింటాడు.ఆశయం ఉన్నవాడికి అవకాశం ఇస్తే దాన్ని అందలం ఎక్కించి చూపిస్తా డు.
[2/2, 5:39 AM] 🌷🌷🌷
ఆనందం...అంటే..డబ్బులు....,ఆస్తు లు...
సంపాదించటం...కాదు..మనల్ని...
ప్రతీరోజు...గుర్తు ...పెట్టు కొని...ప్రేమగా...
పలకరించే...మనుషులను...సంపాదించు కోవడమే....జీవితానికి...నిజమైన....అర్ధం..
డబ్బుంటే బంధాలు వెలిగిపోతాయి..డబ్బు లేకపోతే బంధాలు వెలిసిపోతాయి..
డబ్బు.... మనిషికి...ఏంతఉన్న....దానికన్నా ఎక్కువ కావాలి.మనిషి దానికోసం ఏమి చేయడానికైనా సిద్దమై దిగజారిపోతున్నాడు
కొందరు మాత్రమే ఉన్నదానితో తృప్తిగా జీవిస్తు న్నారు.....ఎన్నో ప్రక్రియలో నలగందే నగదు బయటకు రాదు..అలాంటిది ఆ నగ దు
నీ దగ్గరకు రావాలి అంటే నువ్వు ఎంత నలగాలి,ఎంత నడవాలి,ఎంత నెగ్గాలి ఆలో చించుకో డబ్బు ఆలోచన విజయం.
నీరు ఉన్నంతవరకే బావికి విలువ..డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ...నీరు లేని బావిలో చెత్త వేస్తా రు. డబ్బులేని మనిషిని చెత్తలా
చూస్తా రు..చచ్చాక వినపడని డప్పు ఎంత గొప్పగాఉంటే ఏమి..బ్రతికుండగా విని యోగించని డబ్బు ఎంతకుప్పగాఉంటే ఏమి
       మనలోని సంతోషాన్ని ఎవరిలోను వెతుక్కోకూ మన బాదకు ఏభుజాన్నో ఆస రాగాతీసుకోకూడదు.మనకు మనమే బలం.
మనకు మనమే తోడని తెలుసుకోవాలి.
    ఈ జీవన ప్రయాణంలో ఎన్నో బంధాలు మనతో ఉంటాయి.కానీ మనం చేసేది
ప్రయాణమని మరువరాదు.తన పొరపాట్ల నుంచే కాదు.ఇతరుల వైఫల్యాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవడం వివేకవంతుల
లక్షణం."నీలో ఉన్న శక్తిని నీవు తెలుసుకున్న ప్పుడే గమ్యం చేరగలవు.కనుక ముందు నీగురించి నీవు పరిశోధించుకో "
" నువ్వు ఎప్పుడూ భయపడలేదంటే...
లేదా ఇబ్బంది పడలేదంటే..లేదా మనస్తా పా నికి గురి కాలేదంటే...నువ్వెన్నడూ అవకాశా ల జోలికి పోవన్నమాట. "
*జీవితం చాలా చిన్నది,ఈ కాస్త సమయం లో ఈర్ష్య,అసూయ,ద్వేషాల తో కాకుండా అందరికీ మన ప్రేమను పంచుతూ ఆనందం
గా బ్రతికేద్దాం"మనస్సును శూన్యం చేసు కుని వర్తమానక్షణంలో జీవిస్తూండడమే అసలైన జీవితం.......
        💞
ప్రతిదీ కాలంతో పాటు వచ్చి కాలంతో పాటు చెల్లిపోతాయి. వచ్చి వెళ్ళేది కనకనే జగత్తు ....జాయతే గఛ్ఛతే ఇతి జగం.
రావడమూ మన చేతిలో లేదు,పోవడం అంతకంటే మన చేతిలోలేదు.కాని మానవు లు ఉండే కొద్దికాలం లో నూ సర్వమూ ’నేను
చేశాను’ అని అహంకరిస్తూనే ఉన్నాడు,
ఎవరెన్ని చెప్పినా,అవన్నీ శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యాలే అయిపోతున్నాయి....
కాలం తో ఋణానుబంధం తీరిపోతూ ఉంటుంది.ఋణానుబంధ రూపేణా పశు పత్ని సుతాలయాః,ఋణ క్షయే క్షయం యాంతి
కాతత్రపరివేదనా...
పశువులు ,భార్య ,కొడుకులు ,ఇల్లు ,మన పూర్వజన్మ సుకృతాలను బట్టి కలుగుతా యి. రుణం తీరి పోగానే వారు లేక అవి దూరం
అవుతాయి.కనుక మంచి కానీ,చెడు కానీ అంతా రుణానుబంధమే.ఈ విషయా న్ని గ్రహిస్తే ఇక భాధ,దుఃఖం కలగవు.
మానవులంతా ఈషణ త్రయం చుట్టూ తిరుగుతూ ఉంటారు,కాని అదేం లేదని బుకాయిస్తుంటారు.
ఈ ఈషణాలేంటీ.....దారేషణ,ధనేషణ, పుత్రేషణ..దారేషణ భార్య/భర్త కోసం  పాకులాట..ధనేషణ సొమ్ముసంపాదనకోసం
పాకులాట...,పుత్రేషణ కొడుకుల గురించిన పాకులాట..జీవితంలో వీటిని వదలిపెట్టడం చాలాకష్టం.ధనమును సంపాదించుచున్నం
త వరకే నీ బంధు మిత్ర పరివార జనము నీ యందు అనురాగము,ఆసక్తి చూపుదురు. ముసలితనమున నీ దేహము శిథిలమై శక్తి
హీనమైనప్పుడు నీ ఇంట నిన్నుపలుకరించు వారు ఎవ్వరూ ఉండరు.కాళ్ళు చేతులు మొదలైన అవయవాలన్నీ శక్తి కోల్పోయా
యి,ముఖం మీద ముడుతలు పడ్డా యి, తల నెరిసింది ఇలా అన్నీ వార్ధక్యాన్నే సూచి స్తు న్నాయి కాని తృష్ణ అనగా ఆశ మాత్రం
ఇంకా యవ్వనంలోనే ఉంది.....
ఇల్లు ,భార్య,పిల్లలు,సంపద,ఆఖరుకి స్నేహి తులు,హితులు,సర్వం ఋణాను బంధమే, అది చెల్లిపోతే……అంతా మిధ్య.దర్పణ
దృశ్య మాన నగరీ,జీవితమంతా చిత్రమే.....
      ❣️
పూజారికి వృద్ధా ప్యంవల్ల గూని వచ్చింది. దానితో స్వామి మెడలో పూలమాలలు వేయాలన్నా, ముఖానికి తిలకం దిద్దా లన్నా
గూనితనం వల్ల చేయలేకపొతున్నాడు. అందుకే కమిటీ వారు  అతని కుమారునికి బాధ్యతలు అప్పగిస్తు న్నారు. ఆ రోజే అతని
సేవలకు చివరిరోజు!. అదీ అతని వ్యధ....
     ఓ కృష్ణా! ఇదే నా ఆఖరి పూజ.ఇన్నేళ్ళ కాలంలో నా వల్ల తెలిసిగాని,తెలియక గాని, అపరాధం జరిగి ఉంటే నన్ను క్షమించు.నీకు
పూలమాలలు వేయలేకున్నాను.నుదుట తిలకం దిద్దలేకున్నాను.నువ్వే సర్దు కుపో
యావు. ముసలితనం వల్ల నీ సేవకు దూరం అవుతున్నా.నేను నిస్సహాయున్ని!! నన్ను మన్నించు కృష్ణా! అంటూ కన్నీటితోవీడ్కోలు
పలికి ఆలయానికి తాళం వేసి భారమైన మనస్సుతో ఇంటి ముఖం పట్టా డు. తెల్లవార్లూ అతనికి నిద్రపట్టలేదు.చెప్పలేని బాధ అతన్ని
స్థిమితంగా ఉండనీయలేదు.              
కుమారుడు బిగ్గరగా అరుస్తూ,"నాన్నగారూ! అద్భుతం జరిగింది.అద్భుతం జరిగింది!" అని నోట మాటరాక ఆయాసపడుతున్నా
డు. వృద్ధ పూజారి ఆశ్చర్యపోతూ,ఆలయా నికి వచ్చి చూస్తే నిలబడి ఉన్న కృష్ణ విగ్రహం కూర్చోని ఉంది.అతని ప్రాణానికి ప్రాణమైన
మాధవుడు మందస్మిత వదనంతో కూర్చోని అతనితో సేవలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
తనతో సేవలు చేయించుకోవడానికి వీలుగా స్వామి తన భంగిమను మార్చుకున్నాడని అర్ధమవగానే ఆ వృద్ధు డు తన వయస్సు
మర్చిపోయి  విగ్రహాన్ని అల్లు కుపోయాడు. తన జన్మ సార్థకమైనదని ఆనందంతో కన్నీరు
పెట్టసాగాడు.                                                
ఆదర్శగురువు అంటే ధర్మం ఎటువైపుంటే ఆటే నిలబడతారు.మనవాళ్ళు కదా అని తప్పు వైపు నిలబడరు.మన పూర్వ జన్మ
పుణ్యఫలంగా ఈశ్వరుడు మనకు వివిధ విభూతులను ఇస్తా డు.వాటిని ఆ భగవంతు డు ఇచ్చిన ప్రసాదంగాభావించాలి కాని,అవి
ఉన్నందువల్ల నాఅంతవాణ్ణి అని అహంకరిం చకూడదు.అది మనిషి వినాశన హేతువు.
       💕
  ఓం గంగైచ యమునై చైవ - కృష్ణా గోదావరీ సరస్వతి  నర్మదా సింధు కావేరీ - జలేస్మిన్ సన్నిధిం కురు...అని ఎందుకుచదువుతారు.
గంగ నీటితోనో గోదావరి నీటితోనో స్నానం చెయ్యడం లేదు కదా......
మనం ఏ పని చేసినా ఒక ఆశావహ దృక్పధం అంటే పాజిటివ్ ఆలోచనతో చేస్తే ఆ పని ఫలితం కూడా పాజిటివ్ గా వుండే అవకాశం
మెరుగుపడుతుంది.....
బియ్యం అయిపోయాయి అని చెప్పదు..... నిండుకున్నాయిఅనిఅంటుంది.అలాగే దీపం ఆరిపోయింది అనదు,ఘనంఅయింది
లేదా దీపం కొండెక్కింది అంటుంది.నల్ల పూసల గొలుసు లేదా మంగళ సూత్రం తెగితే.. గొలుసు పెరిగింది అంటుంది.కానీ తెగింది
అని అనదు.ఇలా ప్రతీదీ పాజిటివ్ గానే చెపుతుంది తప్ప నెగటివ్ గా చెప్పదు.అమ్మ గంగ యమునా గోదావరి వంటి నదులను
పవిత్రంగా భావిస్తాం వాటిని దైవా లుగా కూడా కొలుస్తాం వాటి నీరు వాడుక కూడా ఆరోగ్యంగా భావిస్తాం.కానీ అన్ని ప్రదేశాల్లో ఆ
పవిత్ర నదులు ఉండవు. అందుకే అసలు నీటికే గంగమ్మ అని పేరు పెట్టేసుకున్నాం.అలాగే నీటితో జీవితాలు పెనవేసుకున్న బెస్తవారిని
గంగపుత్రు లు అంటాం.అంటే గంగ వంటి పవిత్ర నదులు మన జీవితాల్లో ఎంతగాపెనవేసుకున్నాయో
కుళాయి నీళ్ల తోనో,చేరువులోనో,యేటి నీళ్ల తోనో స్నానం చేస్తు న్నప్పుడు కూడా ఈ శ్లోకం పఠించి ఆ నీటిని పవిత్ర గంగజాలంగా
భావించి స్నానం చేద్దాం......
అలా భావించడం వల్ల మనం మానసికంగా ఒక పాజిటివ్ థాట్ ని శరీరానికి ఇస్తు న్నాం. అంటే ఈ నీరు పవిత్ర గంగాజలంతో సమా
నం.ఆరోగ్యానికి హాని కలుగకుండు గాక అని...₹20 పెట్టి ఒక లీటర్ నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం. మరి ఆ సీసాలో దొరికే నీళ్లు
నువ్వు ప్రతీ సారీ టెస్ట్ చేసి తాగవు..ఆ సీసా మూత సీల్ సరిగ్గా ఉంటే ఏ అనుమానం లేకుండా తాగేస్తు న్నావ్....
  అంటే దానికి కారణం ఆ సీసా మీద ఉన్న బ్రాండ్ పేరు.అంటే ఆ నీటికి కంపనీ వాడు ఒక బ్రాండింగ్ చేసాడు....
నేను తాగుతున్న నీరు ఫలానా కంపెనీ స్వచ్ఛమైన నీరు.ఈ నీరు తాగినా నాకు అనారోగ్యం రాదు అని.ఒక వేళ ప్రయాణం లో కానీ
ప్రయాణం అయ్యాక గాని సుస్తీ చేసినా ఈ నీటి వల్ల అని అనుమానించం.
అంటే అక్కడ నువ్వు ప్రతీసారీ టెస్ట్ చేయక పోయినా నమ్ముతున్నావ్.అంటే ఇక్కడ ఆ బ్రాండింగ్ నీకు ఒక పాజిటివ్ ఆలోచనని
ఇస్తోంది.....ఈ శ్లోకం చదవడం ద్వారా ఆ సాధారణ నీటికి మనం మానసికంగా బ్రాండింగ్ చేస్తు న్నాం......
💙
      
శ్రీనివాస నామజపం వల్లనే నాడీమండల శుద్ధి జరిగి పూర్వ జన్మకర్మల పాపమూలా లు ప్రక్షాళితమై వర్తమాన జీవితం ఆరోగ్య
మయంగా,శక్తివంతంగా తయారవుతుంది. అన్యధా శరణం నాస్తి !కనుక,రెండవసూత్రం ఏమిటంటే ఆరోగ్యానికీ,శక్తికీ తప్పనిసరిగా
అవసరం ధ్యానం.ఇంకా ముందుకుపోతే మనిషి జీవితం ఎప్పుడూ అర్ధవంతంగా వుండాలి.ప్రతి చూపూ,ప్రతి తలపూ,ప్రతి
పలుకూ,ప్రతి చేష్టా అర్ధవంతంగా వుండాలి. దీనికి తప్పదు.మూడవ *నం* ...అదే *జ్ఞానం* ... అంటే ఆత్మజ్ఞానం. అంటే,
ఆధ్యాత్మిక విజ్ఞానం... అంటే స్పిరిచ్యువల్ సైన్స్.అందరికీ తెలిసినదే... ఏమిటంటే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వారు అందరికీ
అందించేదే జ్ఞా *నం* అని.
   మూడవ సూత్రం ఏమిటంటే,మానవుడి జీవితం అర్ధవంతం కావాలి అంటే విధిగా వుండవలసిన వస్తు వే ఆత్మజ్ఞానం.ఆత్మ జ్ఞానం
లేనివాడి ప్రతి చూపూ,ప్రతి తలపూ, ప్రతి పలుకూ,ప్రతి చేష్టా నూటికి మూడొంతు లు అర్ధరహితమైనవే.ఆత్మజ్ఞానం వున్నవాడి ప్రతి
చూపూ,ప్రతి తలపూ,ప్రతి పలుకూ, ప్రతి చేష్టా నూటికి నూరుపాళ్ళు అద్భుత అర్ధ సహితమే అయి తీరుతుంది.
     ఇక పోతే,చివరిగా మానవుడి జీవితం ఆనందమయం కావాలి.దీనికి వుంది ఒక మార్గం.అదే గా *నం* ... మధుర గానం.
వాస్తవానికి చెవులు ఎందుకున్నాయ్ ? చక్కటి సంగీతం వినడానికే. కంఠం ఎందుకు వుంది ? చక్కటి *గానం* చేయడానికే.
      మానవుడి జీవితం ఆనందమయం కావాలి అంటే అనేకానేక కళలు నేర్చుకోక తప్పదు. ముఖ్యంగా సంగీత కళ నేర్చుకునే
ముందు విశేషంగా వినాలి.కనుక,జీవితంలో మాటలు తగ్గించి పాటలు,సంగీతం వినడం అన్నది హెచ్చించాలి.ఈ విధంగా మానవుడి
జీవితం సరళం గా,ఆరోగ్యంగా అర్ధవంతం గా, ఆనందమయంగా కావాలంటే తప్పదు నాలుగు *నం* లు. అవే...
మౌ నం.. ధ్యా నం.. జ్ఞానం.. గా నం..
నోర్మూసుకుంటే *మౌనం.* నోరూ, కళ్ళు మూసుకుని నాసికలోని శ్వాసను గమనిస్తే *ధ్యానం.* నాడీ మండలం ప్రక్షాళనమయిన
తరువాత మెదడును వుపయోగిస్తే *జ్ఞానం* కంఠాన్నీ,చెవుల్నీ సానబడితే *గానం..
   చాలా మంది సలహాలు తీసుకుంటారు. కాని తెలివైనవారే వాటినుండి లాభంపొందు తారు.నిందిస్తు న్న వారందరినీ దూరం చేసు
కోకండి! పొగుడుతున్న వారందరికీ పల్లకి మోయకండి.కావాలనే నిందించే వారుంటా రు.మీకు మంచి కావాలనే నిందించే వారు
కూడా ఉంటారు! ప్రతిఫలం కోసం పొగిడే వారుంటారు.పరుల హితం కోసం పొగిడే
వారుంటారు.ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే మనలోని లోపాలను విశేషతలను  
అంతర్మథనం చేసుకుని పరిశీలించుకున్న రోజు పొగడ్తలు...పరిచారికలుగా నిందలు.. విజయానికి నిచ్చెనలుగా అయిపోతాయి..
నీ పక్కన ఎవరున్నా లేకున్నా నీతో నువ్వు సంతోషంగా ఉండడం ధ్యానం..ఎంతమంది వున్నా ఎటువంటి పరిస్థితులలో వున్నా నిన్ను
నువ్వు కోల్పోకుండా ఉండడం జ్ఞానం.
💖
      
  అబద్ధం మాట్లా డకుండుట చాడీలు చెప్ప కుండుట,కఠినమైన లేదా పరుషమైన మాట లు
మాట్లా డకుండుట,వ్యర్థంగామాట్లా డకుం డుట,అబద్ధ మాటాడకుండా ఎల్లప్పుడూ సత్యాన్ని పలికే వానిని సత్యవాదిగా నిజా
యితీ గల వ్యక్తిగా గుర్తిస్తా రు.నిష్కపటిగా, నమ్మకస్తు నిగా నీతివంతునిగా గుర్తిస్తా రు. కీర్తి గురించికాని ఇతరుల ఆనందింప చేసేం
దుకు కాని తాను సత్యం నుండి దూరం కా జాలడు..అబద్ధా లాడే వారికి ప్రాధాన్యతను గుర్తింపును ఇవ్వాల్సిన అవసరం లేదు....
   కుండ అడుగున ఉన్న కొద్దిపాటి నీళ్ళను
పనికిరానివిగా భావించి ఎలా పారబోదుమో అలా అబద్దలాడేవానినికూడా తిరస్కరించా లి...వట్టి కుండను బోర్లించి పెడతాం
అలాగే అబద్ధా లాడే వానిని ఉపయోగం లేని వాని గా గుర్తించి ఒక ప్రక్కన బెట్టా లి......
ఖాళీ కుండలో శూన్యత వున్నట్లే అబద్ధా లా డే వాని మాటల్లో కూడాశూన్యతే వుంటుంది అతని మాటలలో కూడా విశ్వసింప దగిన
దేదీ వుండదు...కావున అతనిని వదలి వేయాలి... అబద్ధా లాడే వారికి విలువనీ యాల్సిన అవసరం లేనే లేదు.
❤️
      
సృష్టి రహస్యం,ఏడు జన్మలు ఏమిటి..... నేను అంటే ఎవరు..దుఃఖం ఎలా తొలగుతుంది.....
భగవంతుడు సర్వశక్తిమంతుడు సృష్టికర్త అయినప్పుడు ఆయనను తయారు చేసే దొకటి ఆయనకంటే ముందే ఎక్కడ ఏర్పడి
ఉండగలదు....
ఇలా సృష్టిలోని ప్రతిదానికీ మరొకటేదో కారణం అనుకుంటూ వెళితే ఆ ప్రతి కారణా నికీ కూడా మళ్ళీ ఇంకొక కారణం ఉండి
ఉండాల్సిందే.....ఎందుకంటే కారణం లేకుండా కార్యం ఉండదు.ప్రతి కార్యానికీ కారణం ఉండాల్సిందే.......
మరి దీనికి అంతెక్కడ....అలాగే ఇక్కడ ఇంకో సమస్య కూడా దాగి ఉంది.ప్రాణి జన్మ కు కేవలం తల్లిదండ్రు లు కారణం అనుకుంటే
ఆ జన్మించినవారికి అదే మొదటి జన్మ అవు తుంది.అంటే పుట్టిన వారికి క్రితం జన్మ అనే ది లేదనుకోవాలి.అలాంటప్పుడు మరణం
తర్వాత మరొక జన్మ కూడా ఉండ దనే భావించాల్సి ఉంటుంది.
ఎందుకంటే ప్రాణి యొక్క జన్మకు అతడి గత జన్మలలోని పాపపుణ్యాలు,సంస్కారా లు కారణం కాకుండా జన్మలనేవి కేవలం ఒకరు
ప్రసాదించేవి అయితే అవి ఆ ఒక్క జన్మతోనే మరణంతో అక్కడే ఆగిపోవల సిందే....తర్వాతి జన్మలకు కొనసాగడం అనేది ఇక ఎక్కడ
ఉంటుంది.వెనుకటి జన్మ అనేది లేనప్పుడు తర్వాతి జన్మ అనేది మాత్రం ఇక ఎక్కడ ఉంటుంది.....
మరి అలాంటప్పుడు ఈ లోకంలో పాపం, పుణ్యం,ధర్మం,అధర్మం,సత్యం పలకడం లాంటి నియమాలతో పనేముంది.....
ఒకరి వలన జన్మించి ఒకరోజు మరణంతో అన్నీ ఆగిపోయేపని అయితే ఈ లోకంలోని జీవులు అసలు దేనికీ భయపడాల్సిన పని
ఉండేది కాదు.
కానీ లోకంలోని ప్రాణుల హృదయాలలో కర్మలు చేసే సమయాలలో పాపపుణ్యాల భీతి ఏర్పడుతోంది....ధర్మ విరుద్ధమయిన పని
చెయ్యాలంటే ప్రాణుల హృదయంలో భయం కలుగుతోంది..దీన్నిబట్టి తేలేదేమం టే మనం గత జన్మలోనూ ఉన్నాం.గత జన్మ
మరణంతో ముగిసేటప్పటికి మనస్సులో ఏర్పడి ఉన్న అప్పటి సంస్కారాలనుంచే ఇప్పటి ఈ జన్మలోకి ప్రవేశించాం.ఈ జన్మలో
ముక్తిని పొందలేకపోతే తర్వాత రాబోవు జన్మలోనూ ఉంటాం అని.కాబట్టిమరణమనే అత్యంత చేదు మిళితమైవున్న ఎంతోదుఃఖ
కారణమయిన ఈ జన్మలనే బ్రమలనుంచి ముక్తిని పొందటానికి అత్యంత యోగ్యమైన మానవదేహాన్ని దానిలో ప్రాణాన్ని ప్రసాదిం చిన
తల్లిదండ్రు లకు అందరూ సదా కృతజ్ఞు లై ఉండాలి.తల్లిదండ్రు లు వృద్ధు లైనప్పుడు వారి వద్దనేఉండి శ్రద్ధతో వారికి కష్టం కలుగ
కుండా వారిని రక్షించడం అనేది వారినుంచి శరీరాన్ని పొందిన ప్రతి ప్రాణియొక్క అత్యం త ముఖ్యమయిన “కర్తవ్యం” అని
సర్వులూ గుర్తుంచుకోవాలి.
ఒక రైతుఉన్నాడు.అతడికికొద్దిభూమిఉంది. అందులో ఏ పంటా లేదు.పంట లేని ఆ భూమికి రైతు వెళ్లి రోజూ నీళ్ళు పెడతాడా?
పెట్టడు.ఎందుకంటే బీడు భూమికి మతి స్థిమితం లేనివాడు కూడా రోజూ వెళ్లి నీళ్ళు పెట్టే పని చెయ్యడు.ఆ భూమిలో గనక ఏదై
నా పంట ఉంటే అప్పుడు మాత్రమే ఎవరైనా ఆ భూమికి రోజూ వెళ్లి నీళ్ళు పెడతారు.
అలా ఎందుకంటే పంట ఉన్న ఆ భూమి నుంచి వారికి ఒకఫలితం లభిస్తుంది కాబట్టి.
దీనర్ధం మనం దేన్నయినా కాపాడుకుంటు న్నాము అంటే దానినుంచి మనకు ఏదో ఒక ప్రయోజనం ఉండటం వల్లేనని ఇక్కడ
అర్ధం అవుతోంది......
మరి మానవుడు లోకంలో పగలంతా తిరిగి ఎంతో శ్రమించి కొద్దిపాటి ధనం సంపాదించి తన శరీరానికి ఆహారం తెచ్చి పెడుతూ దాన్ని
జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడుగదా!
ఏ పలితం కొరకు?ఈ శరీరం నుంచి ఏప్రయో జనం పొందడం కొరకు శరీరాన్ని కాపాడు కుంటున్నాడు అనేదే ఇక్కడ ప్రశ్న.
తన శరీరానికి ఆహారం అయితే పెడుతు న్నాడు గాని ఎందుకు పెడుతున్నాను అనే ప్రశ్న వద్దకే మానవుడు రాలేకపోతున్నాడు.
కొద్ది కాలం మాత్రమే తనతో ఉండి ఆ తర్వా త మట్టిలో కలిసిపోయే ఈ శరీరం నుంచి నేను పొందాల్సింది ఏమిటి అనే ఆలోచనే
మానవుడు చెయ్యలేకపోతున్నాడు.శరీరం నుంచి ఏదో ప్రయోజనమే లేకపోతే దానికి ఆహారం పెట్టి రక్షించుకోవాల్సిన అవసరమే
మానవునికి ఉండేది కాదు.
[2/2, 4:59 AM]  🖤
రూపసాధన......
మీకు ఇష్టమైన దేవత యోక్క ప్రతిమను తీసుకుని , బాగా వెలుతురు ఉన్న ప్రదేశంలో ఆ ప్రతిమను గానీ ,లేక చిత్రాన్ని కానీ ఉంచి
ధ్యాన పూర్వకంగా నిర్నిమేషంగా ఒకటి లేదా ఐదు నిమిషాల పాటు అంగ ప్రత్యం గాలను ఏకాగ్రతతో పరిశీలించాలి ... కళ్ళు
మూసుకుని మనం చూసిన దానిని మన మనోనేత్రంతో ప్రత్యక్షం చేసుకుని ఆ ప్రతిమ యొక్క అంగ ప్రత్యంగాలను,రూపం,సౌంద
ర్యం,అభూషణములు,అలంకరణ విశేషాలు సమస్తమూ చూసింది చూసినట్లు ఆరోపణ చేసి ధ్యానం చేయాలి.తిరిగి కళ్లు తెరిచి మళ్లీ
ఆ చిత్రాన్ని ( ప్రతిమను) పరిశీలనగా చూసి మళ్ళీ కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి.ఈ ధ్యానంతో ఓంకారం కూడా జపం
చేయవచ్చు .ఈ విధంగా చేయడం వలన రూపం మనసులో స్థిరంగా ముద్రింప బడుతుంది.....
దివ్యనేత్రములతో దర్శనం చేయడం వలన గొప్ప ఆనందం కలుగుతుంది.నెమ్మది నెమ్మ దిగా చిత్రం యొక్క ముఖాకృతి మారుతూ
నవ్వుతూ,మందహాసం చేస్తూ కోపగిస్తూ , అలుగుతూ, భావబంగిమలను ప్రకటిస్తూ కనిపిస్తుంది.ఆ ప్రతిమ స్వప్నంలో గానీ,
జాగ్రదావస్థలో కానీ,కళ్ళ ముందు నిలిచి ఒకప్పుడు ప్రత్యక్ష సాక్షాత్కారం జరుగు తుంది.మొదట ఆ సాక్షాత్కారం మనసు నందు,
మసకగా కనిపిస్తుంది. ఆ తర్వాత ధ్యానం యొక్క లోతులకు పోగా ఆ దర్శనం స్పష్టంగా కనిపిస్తుంది.
ఎవరో ఒక వ్యక్తిని గురించి,అతని రూపము ను ధ్యానించాలి.దానితో పాటు అతనిపై ప్రభావం పడేటంతగా,బలంగాఆలోచనలను
అతనిపై ప్రసారం చేయాలి.ఈ విధంగా
మధుర సంబంధాన్ని ఉత్పన్నం చేయవచ్చు, చెడు అలవాట్లను పోగొట్టవచ్చు,ఆశీర్వాదం, శాపం యిచ్చి
లాభం,హానీకలుగచేయవచ్చు
  విశేష కర్మకాండల ద్వారా మంత్రములతో ఒక మనిషిని అతని రూపాన్ని ఆకర్షించి ఆ వ్యక్తిని రోగిగానూ,పిచ్చివానిగానూ,వశవర్తి
గాను చేయడం మనం చూస్తూనే ఉన్నాం.
ఛాయాపురుష సిద్ది కూడా , రూపసాధనలో ఒక భాగమే......
పరిశుద్ధమైన శరీరంతో,శుభ్రమైన వస్త్రము లను ధరించి భోజనం చేయకుండా అద్దం ముందు నిలబడి తన ఆకృతిని ధ్యాన
పూర్వకంగా గమనీంచి కొద్ది సేపటికి కళ్ళు మూసుకోవాలి.తాను చూసిన ఆకృతినీ ధ్యానం చేయాలి.కొంత సమయం తర్వాత తన
కాంతి తనకు దృష్టి గోచరం అవుతుంది అంటే అద్దంలో చూసుకుని తన రూపం తన మనోనేత్రంతో చూస్తాం అన్నమాట.....
అద్దా నికి బదులుగా స్వచ్చమైన సరోవర జలాన్నిగానీ,నువ్వుల నూనెను గానీ,కరిగిన నేతితో గానీ,ఈ విధమైన ధ్యానం చేయ
వచ్చు,ధర్పణ సాధన శాంతి! తైలం సంహా రకం! ఘృతం,ఉత్పాదకం,సూర్య చంద్రు లు ఆకాశం మధ్యలో ఉన్నప్పుడు తన ఛాయ
మీద గూడ ఈ సాధన చెయ్యవచ్చు,ఈ విధమైన సాధన కళ్యాణకారకం......
ధర్పణం... జలం,తైలం,ఘృతం,మొదలైన వాటిలో మన ముఖాకృతినీ చూడటం కళ్ళు మూసుకుని దానినె ధ్యానం చేయడం జరు
గుతుంది.సూర్యునికి లేక చంద్రు నికి వ్యతి రేక దిశలో నిలబడి తన ముందు పడే ఛాయను విప్పారి నేత్రాలతో తదేకంగా చూసి కళ్లు
మూసుకుని ఛాయను ధ్యానం చేయాలి. కొన్ని రోజుల క్రమం తప్పకుండా ఈ సాధన చేయడం వల్ల ఆ ఛాయ యందు తన
ఆకృతిని చూడవచ్చు !! కొంత కాలం పాటు నిరంతరాయంగా ఈ ఛాయా సాధన చేయడం వల్ల తన ఆకృతి తో ఒక ప్రత్యేక శక్తి
తయారు అవుతుంది.దాని యందు మన సంకల్పమును,ప్రాణమును సమ్మిశ్రి తం చేయడం వల్ల అది కొంత స్వతంత్ర చేతన గల
ప్రాణిగా తయారు అవుతుంది. దాని అస్థిత్వంను తన జీవితభూతంగా పిలుస్తా రు.ప్రారంభ దశలో అది ఆకాశంలో అటూ ఇటూ
తిరుగుతూ మన వద్దనే తిరు గుతూ ఉంటుంది.మనం చూస్తూనే ఉంటాం! ఆ తర్వాత దానిపై మనకి నియంత్రణ
సాధించగలిగినప్పుడు మన ఆజ్ఞాను సారం ప్రత్యక్షం అవడం,అదృశ్యం అవడం,మన పనులు చెసి పెట్టడం చేస్తుంది.మన ప్రాణ శక్తి
దుర్వినియోగం అయితే ఈఛాయా పుత్రు డు కూడా దుర్భరంగా ఉండి కేవలం దృష్టి గోచరం కావడం తప్ప విశేషంగా మనం చెప్పిన
పనులు ఏమీ చేయలేడు ! ప్రాణశక్తి బలంగా ఉన్నవారి ఛాయా పురుషుడు మన రెండవ అదృశ్య శరీరంలా ఉండి క్రియాశీల తను
వహిస్తా డు ! పనులు చేస్తా డు! ఒకటి స్థూల శరీరం,రెండోది సూక్ష్మ శరీరం,ఈ రెండు ప్రకటిత శరీరములు గల సాధకుడికి మహత్వ
పరిపూర్ణమైన లాభం కలుగుతుం ది. ఈ రూప సాధన ద్వారా మనసు వశమై ఏకాగ్రత పొందడం కూడా ప్రత్యక్ష లాభం....
💞
             
ఈ ప్రాపంచిక విషయ వాసనలనే మహా సముద్రమును దాటుటకు ఏ విధమైన మార్గాలను అనుసరించిన నా భవిష్యత్తు సాఫీగా
జరుగుతుందోనాకుతెలియుటలేదు. నన్ను రక్షించుటకు,నా దుఃఖాలనుఅంతము చేయుటకు ప్రభూ మీరు నాకు ఏ విధముగా
తోడ్పడగలరు.సాధకుడు ఈ విధముగా తన మార్గదర్శకుని ప్రార్ధించినప్పుడు,ఈ ప్రపంచమనే అడవిలోని దావాలనము అడవిని
దహించినట్లు ,ఆ సాధువు తన మృదువైన కృపాదృష్టిని దయతో సాధకుని పై ప్రసరింపజేసి అతని భయాన్ని దుఃఖాన్ని
తొలగించగల్గుతాడు.
ఏ సాధకునికి గురువు తన రక్షణ కవచాన్ని అందించాడో అతడుజనన,మరణ,దుఃఖాల నుండి విముక్తిని పొంది,గురువు యొక్క
శాస్త్ర విహితమైన సూచనలు ఆమోదిస్తూ, పవిత్రమైన మనస్సుతో ప్రశాంత స్థితిని పొందుటకు గురువు అతనికి దయతో సత్యబోధ
చేయగల్గుతాడు.
జ్ఞాని అయిన ఓ సాధకుడా! భయపడకు నీకు చావులేదు ఈ సంసారసాగరమును దాటుటకు యోగులు మార్గమును చూపిం
చినారు.అదే మార్గమును నేను నీకు చూపించెదను.
💚
        
శుద్ధచైతన్యము నుండి సంకల్ప ముద్భవిం చు క్షణమున చైతన్యమే బిందువుగ నేర్ప డును.అనగా సంకల్ప బీజముగ తాను
మొత్తము చైతన్యము నుండి వేరగును. బిందువేర్పడిన తక్షణమే దానికి పరిధి ఏర్ప డును.అనగా సంకల్ప బిందువునకు కాల
పరిమితి ఏర్పడును.సృష్టియందు మానవు ని యందుకూడ ఇట్లే సంకల్పము లేర్పడు చుండును.మరల శుద్ధచైతన్యమున లీన
మగుచుండును.కేంద్రమునుండి పరిధికి గల దూరము సంకల్పము యొక్క వైశాల్యము ను నిర్ణయించినది.ఒక సంకల్పము
నిర్వర్తిం పబడు లోపల అందులో అంతర్భాగముగ మరియొక సంకల్పము మొలకెత్తు ను.అన గా ఆదిసంకల్పములలోని వివరములే
అనుగత సంకల్పములుగ దిగి వచ్చుచుం
డును. ఈ అనుగత సంకల్పములన్నియు ఆది సంకల్పము వశమున నుండును.
స్థూలముగ ఆది సంకల్పము నుండి ఏర్పడు అనుగత సంకల్పములు ఏడుగ పెద్దలు వర్గీ కరింతురు.సూక్ష్మముగ మానవ మేధస్సున
కు అందని వర్గీకరణములున్నవి.ఆదిసంక ల్పమునే మహా సంకల్పమనికూడఅందురు.
         ♥️
ఒకసారి జీవితమంటే ఏమిటో స్వయంగా మీరు తెలుసుకుంటే,మరణం గురించి మీరు ఏమాత్రం పట్టించుకోరు.అంతేకాక,దానిని
అధిగమించి మీరు ముందుకు వెళ్ళగలరు. ఆ శక్తి మీలోనే ఉంది.అది మీ హక్కు కానీ, అందుకు మీరు మీ మనసునుంచి మనోర
హిత స్థితిలోకి చేరే చిన్నప్రయత్నం చెయ్య వలసి ఉంటుంది.
ఒక శిశువు జన్మించిన వెంటనే దాని జీవితం ప్రారంభమైనట్లు ,ఒక వృద్ధు డు మరణించిన వెంటనే అతని జీవితం ముగిసిపోయినట్లు
మీరు భావిస్తా రు.కానీ,అది నిజంకాదు. జనన,మరణాలు జీవితం యొక్క రెండు చివరలు కావు.ఎందుకంటే,వాటికన్నా జీవి తం
చాలా పెద్దది.జీవితంలో అనేక జనన, మరణాలు జరుగుతూ ఉంటాయి.ఆద్యంతా లు లేనిదే జీవితం జీవిత,శాశ్వతత్వాలు రెండూ
సమానమే.కానీ,జీవితం మరణంలో కి ఎలా మళ్ళుతుందో మీరు సులభంగా అర్థం చేసుకోలేరు.అలాగే,అది అసాధ్యమని కూడా
మీరు అంగీకరించలేరు.జీవితంలో అనూహ్యమైనవి కొన్ని ఉంటాయి.జీవితం మరణంలోకి మళ్ళడమనేది వాటిలో ఒకటి.
ఎప్పుడు,ఎక్కడ జీవితం ముగిసి మరణం గా మారుతుందో అలాగే ఎప్పుడు,ఎక్కడ జీవితం మళ్ళీ ప్రారంభమవుతుందో మీరు
గిరిగీసి చెప్పలేరు.
జీవితం ప్రారంభం శిశువు పుట్టినప్పుడా లేక గర్భధారణ జరిగినప్పుడా? గర్భధారణకు ముందే తల్లిగర్భంలోని బీజం,తండ్రి శరీరం
లోని వీర్యకణాలు సజీవంగా ఉన్నాయే కానీ,మరణించలేదు.ఎందుకంటే,రెండు నిర్జీవాల కలయిక ఒక జీవాన్ని ఎప్పటికీ
సృష్టించలేదు.మరి శిశువు ఎప్పుడుజన్మించి నట్లు ? ఈ విషయంలో విజ్ఞానశాస్త్రం కూడా ఒక కచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయిం
ది. అందుకు కారణం దాని దగ్గర ఎలాంటి ఆధారము లేదు.ఎందుకంటే,పుట్టు కనుంచే బీజాలను తల్లి తనలో మోస్తోంది. ఒక విష
యాన్ని మీరు ఇక్కడ అంగీకరించాలి.గర్భ ధారణకు ముందే మీ ఉనికిలోని సగం మీ తల్లిలో సజీవంగా ఉంది.మిగిలిన సగం మీ
తండ్రి ద్వారా సజీవంగానే లభిస్తుంది.ఎందు కంటే,తండ్రి శరీరంనుంచి విడుదలైన వీర్య కణాలన్నీ సజీవంగానే ఉంటాయి.కానీ, వాటి
జీవితకాలం కేవలం రెండు గంటలు మాత్రమే.ఆ సమయంలోనే అవి తల్లి శరీరం లో ఉన్న బీజాన్ని కలుసుకోవాలి.ప్రతి వీర్య కణం
కచ్చితంగా తన లక్షణాలతో కూడిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది.కొన్ని కణాలు బీజం వైపు పరిగెడుతుంటే,మరికొన్ని కణా లు
సోమరిపోతుల్లా చాలా నిదానంగా నడు స్తూ ఉంటాయి.అందుకే అవి ఎప్పటికీ బీజా న్ని చేరుకోలేవు.ఇలాంటి లక్షణాలన్నీ పుట్టు
కతోటే సంక్రమిస్తా యి.అలాంటి లక్షణాలు సంక్రమించిన వ్యక్తు లు మరణించేందుకైనా సిద్ధపడతారే కానీ,పరుగెత్తలేరు.కనీసం ఏం
జరుగుతోందో కూడా వారికి తెలియదు.
🌷🌷🌷🌷
         
Aura (తేజో వలయం) అనేది,మనిషి చుట్టూ ఉన్న రహస్య శక్తి మయ క్షేత్రము. ఈ తేజో వలయం అనేది జీవ ప్రపంచాని కంతటికీ
వర్తిస్తుంది.ఈ తేజో వలయం లేదా aura ఒక మనుజుని యొక్క సంస్కారాల పైన,ఆ మనుజుని శక్తి పైన ఆధార పడి ఉంటుంది.ఈ
తేజో వలయం భిన్న వర్ణాల తో వ్యక్తమౌతూ ఉంటుంది.చాలా మంది ఈ తేజో వలయాలను చూడలేరు.చాలా కాలం పాటు...
ధ్యాన,మంత్ర సాధనలు చేసిన సాధకులు ఒక ప్రత్యేక దృష్టితో చూడగలరు. ఒక ఆరా (aura) భిన్న భిన్న రంగుల మేళ వింపుతో...ఆ
ఆరాను చూసే యోగులకు హృద్యంగా ఉంటుంది.అయితే ఈ తేజో వలయ వర్ణ పటలంలో..శుక్ల వర్ణం/white colour..అనేది
చాలా అరుదుగా ఉండి,శక్తి వంతంగా ఉంటుంది.సాధారణంగా "ఆరా రంగులు" ,అనేక కారణాల రీత్యా మారుతూ ఉంటాయి.శుక్ల
వర్ణ తేజో వలయం లేదా aura in white colour...మిక్కిలీ స్పందనా త్మకమైనది,శక్తి వంతమైనది,పరిశుద్ధమైన కాంతికి సూచన.ఈ
శుక్ల వర్ణ (white colour) తేజో వలయం,అన్ని ఆరా రంగుల లోకీ స్వచ్ఛమైనది.సిద్ధపురుషులు,జ్ఞానులు, మనో స్వచ్ఛత
కలవారు...వీరి ఆరాలలో ప్రధానంగా శుక్ల వర్ణం ప్రధాన పాత్ర వహి స్తుంది. ఇంకా మహాత్ములు,సిద్ధ పురుషులు, ముక్త
కాములు,జ్ఞానులు,పూర్ణ పురుషులు. వీరి ఆరాలలో...బంగారు రంగుతో కూడిన తెలుపువర్ణం కనిపిస్తుంది కూడా.ఆరా రంగు లు
వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని తెలియ జేస్తా యి కూడా.
     ఈ తెల్లని రంగు ఆరా,సహస్రార చక్రంతో సంబంధం కలిగి ఉంటుంది.ఈ శుక్ల వర్ణపు ఆరా,వైశ్విక శక్తి తోనూ,స్థా వర జంగమాలలో
నూ ఉన్న ఏకత్వం తోనూ సంబంధం కలిగి ఉంటుంది.ఈ శుక్ల వర్ణపు కాంతి వలయం.. హెచ్చుగా కలవారు,ఉదార వాదులు గానూ,
మనో స్వచ్ఛత కలిగిన వారు గాను,పరోప కార పారాయణులు గానూ,జ్ఞానులు గానూ, చెడు వ్యవహారాలకి లొంగని వారు గానూ,
ఉన్నత స్థా యి ఆధ్యాత్మిక సంబంధాలు కలిగిన వ్యక్తు లు గానూ,శుద్ధ చైతన్యంతో సంబంధం కలిగిన వారు గానూ ఉంటారు.
   ఈ తెలుపు రంగు కాంతి వలయం గల వారు...తీవ్రమైన దశలో.... ఏదో ఒక నాటికి, "ఆత్మ సాక్షాత్కారాన్ని" పొందుతారు. వారు
క్రమంగా ఇహలోక వాసనలు వదలి వేస్తా రు. ప్రాపంచిక విషయాలకు,రాను రాను దూరం అవుతారు.
     ఒక యోగి/సాధకుడు పరిశుద్ధమైన బంగారు వర్ణపు కాంతివలయం సంపాదించ డానికి....నిరంతరం కృషి చేస్తా డు.ఆతడు తన
ఆలోచనలను,ఉద్దేశ్యాలను పవిత్రంగా ఉంచుకుంటాడు.క్రమంగా "జీవ-బ్రహ్మైక్య పథం" లో ముందుకు వెళతాడు.
🖤
       
ఇంద్రియ సుఖములు,యింద్రియ భోగము లు మొదలు సుఖము కలిగించినను,తరు వాత దుఃఖము కలిగించగలవు.అవి అంత
వంతములని తెలిసి బ్రహ్మజ్ఞాని వానియం దు రమించడు.త్రిగుణాత్మకమగు ప్రకృతి సహజ లక్షణము మార్పు.అష్ట ప్రకృతులు
ఎప్పుడును మార్పుచెందుచునేయుండును. మూల ప్రకృతి మార్పు చెందకయుండు వెలుగు.అది తొమ్మిదవది.
ఆ స్థిరమగు వెలుగున కాధారము దాని కావలయున్న బ్రహ్మతత్వము.ఈ తత్వము నాశ్రయించినపుడు మనయందలి చైతన్య మను
వెలుగు స్థిరముగ నుండును.స్థిరచైత న్యము ఆనంద దాయకము.అది పూర్ణము కూడ.అష్ట ప్రకృతులలోని చైతన్యము మార్పుకు
నిరంతరము గురియగు చుండు ను. పంచేంద్రియములు,రజస్తమస్తత్వము లు సన్నివేశములను బట్టి,కాలమును బట్టి, దేశమును
బట్టి వివిధముగ అనుభవము కలిగించును.అవి సుఖము కలిగించునట్లు గ అనిపించునుగాని,ఆ సుఖమును అందీ అందనట్లు
అనుభవింప చేయుచుండును.
తిథులకు గురియైన చంద్రు డు ఎట్లు హాని వృద్ధు లను అనుభవించునో, మానవుడు కూడ అట్లే ద్వంద్వము లందు ఊగిసలాడు
చుండును.ప్రకృతి విలాసమును దాటి,స్థిర ముగ నుండి ప్రకృతి క్రీడను చూచుట మహ దానంద దాయకము.నదీ ప్రవాహమున
కొట్టు కొని పోవుచున్నవాడు నదీ గమనము ను గాని,పరిసరములగల ప్రకృతి రమ్యత నుగాని అనుభూతి చెందలేడు.స్థిరము,
పటిష్ఠము అయిన నావయందు సుఖాసీను డై , నదిపై పయనించు ప్రయాణికుడు ప్రవా హము యొక్క వేగమును,తీరమునందలి
రమ్యమగు దృశ్యములను చూచి ఆనందిం చ గలడు.అట్లే సృష్టి రమ్యతను శాశ్వతము గ అనుభూతి చెందుటకు సృష్టి కధిష్ఠా నమై
న తత్వమున స్థిరపడుట తెలివి.ఇట్టి తెలివి బ్రహ్మజ్ఞానికి మాత్రమే యుండును.
💙
        
కర్మకర్మకు ఉన్న సంబంధంగురించి చెప్పా డు జైమిని.వైదిక కర్మమంతా కూడా తంత్ర మే! ఆ తంత్రం చాలా కఠినంగా ఉంటుంది.
పవిత్రగ్రంథి ఎంతఉండాలి వంటివి ఉంటా యి.దర్భపొడవు ప్రాదేశికమాత్రం అంటాడు. యజమానికి జానేడు అని అర్థం.అంతే
తీసుకోవాలి.
ప్రాదేశిసూత్రం జానెడు ముడివేసిన తరు వాత,చివరినుండి ముడితో కలిపి జానెడు తీసుకోవాలి.దాన్నేమో ఛేధించాలి.‘న నఖేన’,
అంటే గోళ్ళతో కాదు అని చెప్తా రు వెంటనే.అంటే గోరుతో తంపకూడదుదానిని.  దానిని ఒక పాత్ర అంచు మీద ఉంచి తెంపా లి.
ఇదంతా తంత్రం.ఇది జ్ఞానానికి గాని, భక్తికిగాని హేతువు కాజాలదు.కర్మయందు శ్రద్ధ ఉన్నప్పుడు,ఎక్కడో ఉండేటటువంటి
ఈశ్వరుణ్ణి ధ్యానం చేయటం అనే భావన పుట్టదు.అది అక్కడ అప్రస్తు తమవుతుంది. యజ్ఞం చూచేవారికి భక్తికి,ఈశ్వరధ్యానానికి
అవకాశం ఉంది.
ధ్యానం చేస్తే,వాళ్ళు నమస్కరిస్తూ ఉంటే, యజ్ఞపురుషుడికి – పరమేశ్వరుడో,విష్ణువో ఎవరైతే ఉన్నారో,యజ్ఞ స్వరూపుడయిన
వాడెవడో,యజ్ఞం ఎవరినుంచీ పుట్టిందో, ఎవరి ఆజ్ఞానుసారంగా ఆయజ్ఞం ఆ ఫలాన్ని ఇస్తుందో,అట్టి పరమేశ్వరునికి –ఈ ధ్యానం,
నమస్కారం చెందుతాయి.కాబట్టి యజ్ఞం చూచేవారికైనా ఫలం వస్తుంది.చేసేవాడికి ధ్యానం ఎక్కడ ఉన్నది? దర్భలు మొత్తం 108
ఉన్నాయాలేవా అని లెక్కపెట్టు కోవటం వంటి శాస్త్రవిహితమైన విషయాలపైనే ఏకా గ్రతఉంటుంది.యజ్ఞకర్తకు,యజమానికి భక్తి
భావాలతో సంబంధంలేనటువంటి ఏకాగ్రత నూరుశాతం ఉంటే,ఎక్కడా పొరపాటు రా కుండా చూచుకోవచ్చు.ఎక్కడయినా కొంచెం
పొరపాటు వచ్చిందా,ఆ కోరిన ఫలం రాదు. కాబట్టి కర్మకు,కర్మకు ఉండే సంబంధం, అలాగే ఎందుకు చెయ్యాలి? ఇటువంటివన్నీ ఆ
సూత్రములలో చెప్పారు.
  దానం విషయంలో మరొకసూత్రం..... తనకు ఆపద్ధర్మంగా అత్యవసరంగా కావల సింది ఉంచుకోవచ్చు.లేకపోతే పుత్రు లను,
భార్యను అందరినీ కూడా ఇవ్వవలసి వస్తుం ది.భార్యను కూడా ఎవరింట్లోనైనా దాసీపని చేయమని దానమిచ్చే అవకాశం ఉంది.
కాబట్టి ఉన్నదంతా దానం చెయ్యమనే ప్రస్తా వన వచ్చినప్పుడు,ఏదీ మిగలదు,తన శరీ రం తప్ప! కాబట్టి ఈ యుగంలో,ఈ కాలం
లో,ఉన్నదంతా దానంచేయటమనేది పొస గదు.యావఛ్ఛక్తితో ఎంత దానం చేయగలి గితే అంతా దానంచేస్తే, ఈ ఫలం వస్తుందని
జైమిని మహర్షియొక్క అభిప్రాయం.
💖
      
మానవునిలో నెలకొనిన భగవంతుని జీవి తములో, ఆ మానవుడు భగవంతునిగా సహజ సమాధి యొక్క అనుభవమును
పొందును.ఏ కొంచెము ప్రయాసము లేకుం డా ఏకకాలమందే నిరంతరాయంగా సహజ ముగా అటు భగవంతుని అనంత జ్ఞాన శక్తి,
ఆనందములను ఇటు మానవజాతి యొక్క బలహీనతలను,బాధలనుఅనుభవించును. ఇవి-తన అనంత సర్వము నుండి పుట్టిన
అభావజన్యములే యనియు,ఈ యనుభవ ము మిథ్యానుభవమేననియు ఎఱుంగును.
ఏక కాలమందే అటు భగవంతునిగను ఇటు మానవునిగను అనుభవించు స్థితియే పూర స్థితి.ఆత్మ ప్రతిష్టా పన స్థితిలో పూర్ణత్వము
మూడు విధములుగా నుండును.
పరిపూర్ణ మానవుడు
. పరిపూర్ణ మానవ శ్రేష్టు డు
. పరమ పరిపూర్ణుడు.
*The mind uncontrolled and unguided will drag us down, down, for ever - rend us, kill us; and the mind
controlled and guided will save us, free us.
గమ్యం తెలియక,నియంత్రణ లేని మనస్సు మనల్ని పతనమొందిస్తుంది.అధోగతిపాలు చేస్తుంది.నిగ్రహంతో,లక్ష్యంవైపు సాగిపోయే
మనస్సు విముక్తిని ప్రసాదించి,విజయ శిఖ రాలను అధిరోహింపజేస్తుంది.
Give up the small for the infinite, give up small enjoyments for infinite bliss.
శాశ్వతమైన దాని కోసం క్షణికమైన వాటిని  త్యజించండి.అనంతమైన ఆనందాన్ని పొందాలంటే అల్పసుఖాలను వదిలేయండి.
❣️🌷❤️
         
అజ్ఞానం అంటే ఏమిటి ? ౹ జ్ఞానం అంటే ఏమిటి ? ౹ విజ్ఞానము అంటే ఏమిటి ? ౹ సుజ్ఞానము అంటే ఏమిటి ? ౹ వాసనాత్రయం ౹
దేహవాసన ౹ లోక వాసన ౹ శాస్త్ర వాసన ఏమిటి ?:
అజ్ఞానం అంటే ఏమిటి ?తానెవరో తనకు తెలియకపోవడమే అజ్ఞానం.
జ్ఞానం అంటే ఏమిటి ? తానెవరో తనకు తెలియడమే జ్ఞానం.
ఆత్మజ్ఞానం వల్లనే మోక్షం కలుగుతుంది తప్ప అన్యధా అస్సాధ్యం !
"జ్ఞానం వినా మోక్షం న సిద్ధ్యతే శోకత్తరతి ఆత్మవిట్ నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే" అంతేకాని తనకు వేద శాస్త్రా లు
పురాణం ఇతిహాసాలు తెలిసినా,తెలియక పోయిన జ్ఞాన అజ్ఞానం కాదు.
తానెవరని విచారణ చేయగా దేహేంద్రియ ప్రణమనోబుద్ధు లు కాదని తెలుస్తుంది.తానే సర్వమును తెలుసుకుంటున్న తెలివి.
సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యాస్తమయం దాకా ఆ తెలివి వస్తూ ఉంటూ పోతుంది.
కొందరు వాయించలేక మద్దెల దరువేయ మనట్టు ,తెలివి యొక్క రాక పోకలు తెలియ కుండానే [ప్రజ్ఞానం బ్రహ్మమని] నమ్ముతు
న్నారు. ఈ తెలివి కర్మేంద్రియాలతో కలిసిన పుడు స్వల్ప గుణం ఉత్పత్తి అవుతుంది. ఇదే కేవలం ఈ తెలివి జ్ఞానేంద్రియాలతో
కలిసినపుడు ఎరుక.చిన్న చెంబులో నీళ్లు , బిందెలో నీళ్లు ,రెంటిలో నీళ్ళే ఉన్నాయి. ఉపాధుల్లో మాత్రమే తేడా ఉంది.
అన్నమయ,ప్రాణమయ,మనోమయాల్లో సంచరించే తెలివికి,వాటిని దాటిపోయినా విజ్ఞానమయ కోశంలోని తెలివి విశేషమైనది. ఆ
విశేషమైన తెలివిగలది తురీయమ్.
తురీయానికి,విశేష తెలివికి ఎరుకఅని చెప్ప వచ్చు.తక్కువ తెలివిని బుద్ధిఅంటారు. అయితే ఆ తెలివిని తెలుసుకున్నా,తెలుసు
కోకపోయిన తెలివిగదా?తెలిసిన,తెలియక పోయినా తెలివియొక్క విరహవ్యధా మోహ ము, భయము,జననమరణాలు, సుఖ
దుఃఖాలు పోవు.ఎలాగంటే వేపాకు చేదని తెలిసినా చేదే,తెలియకపోయినా చేదే.ఆ వేపాకు ఉన్నంత వరకు దాని చేదు గుణం
పోదు.ఆ వేపాకును కాల్చివేస్తే దానితోపాటు చేదు కూడా పోతుంది.అలాగే తానే తెలివని తెలిసినా,తెలియకపోయినా విరహవ్యధా
మోహము మొదలైనవి పోవు.
సద్గురువుని కృపచే ఆ తెలివిని దగ్ధం చేయా లి.ఆ తెలివి ఉండుట వలెనే కదా మరణ భయము కలుగుతున్నది. తెలివికి తెలివే
మృత్యువుగా ఉన్నది.ఏంటంటే స్వజాతి వైరము ?కుక్కకు కుక్క వైరోధము,యాచకు నికి యాచకుడు విరోధి యగును.అందుకే
"మృత్యోస్స మృత్యుమాప్నోతి".
*అజ్ఞానం :* నన్ను నేను తెలియక విషయా దులయందు వర్తించుట,శరీరమును సుఖ పెడితే వచ్చే ఆనందము సత్యమని,ఇంద్రి
యాలు,మనసు వీటివల్ల కలిగే సుఖదుఃఖ అనుభవాలే సత్యమని,ఇవి లేకపోతే నేను లేను అనుకొనుటే అజ్ఞానము.
*జ్ఞానము :* నేను దేహమును తెలుసుకొను వాడను కాని నేను దేహమును కాను. నేను ఆత్మ స్వరూపుడను,నేను మనసును
తెలుసుకొనువాడను కాని మనసు యొక్క అనుభవములు నావికావు.నేను మనసును కాను.నేను ఆత్మస్వరూపుడను.నేను ప్రకాశ
రూపుడను.ప్రజ్ఞా స్వరూపుడను.ఈ ప్రజ్ఞయే పిపిలికాది [చీమ] బ్రహ్మపర్యంతము 'నేను' గా ప్రకాశింప బడుతున్నదని తెలుసుకొనుట
యే జ్ఞానము !
*విజ్ఞానము :* ఇట్లు తెలిసిన జ్ఞానమును తనకు అన్వయించుకొని, తన స్వరూపమే జ్ఞానమని, తక్కినదంతయు అన్యముగా
నిరశించి, జ్ఞానమే తానైన స్థితి విజ్ఞానము.
సుజ్ఞానము :* పైన చెప్పిన అనుభవము లకు కారణము ఎఱుక అనియు[ఎఱుకన్నా, జ్ఞానమన్నా ఒక్కటే].ఈ ఎఱుకే జీవుడి
అజ్ఞానమును,ఈశ్వరుడిగా జ్ఞానస్థితినీ, పరబ్రహ్మగా మౌనస్థితిని పొందుతున్నదని యూ, కాలప్రభావమున మరలా ఎఱుక
సంకల్పించి,జీవేశ్వర జగత్తు గా మారవచ్చు ననియూ,త్రిగుణముల యొక్క సామ్యావస్థే పరబ్రహ్మమనియు,త్రిగుణముల యొక్క
వ్యవహారమే సృష్టి అనియూ,ఇది కాలచక్ర ముగా అనేక బ్రహ్మాండములను పరిపోషిం చుచున్నదనియూ ఎరిగి,త్రిగుణములను
నిరశించి,ఎరిగే ఎఱుకను వీడి,ఎఱుకను నిరశించి బయలగుటే సుజ్ఞానము !.
*వాసనా బలం* అంటే శరీర వాసన [దేహ వాసన],శాస్త్ర వాసన,లోక వాసన.ఏంచేసిన మన జీవితమంతా,ఈ మూడింటి కోసమే.
పెళ్ళి చేసుకున్నావండి,దేని కోసం ? దేహ వాసన,శాస్త్ర వాసన,లోక వాసన కోసం. మూడు కనపడుతున్నాయి కదా.
*శరీరానికి సుఖం కావాలంటావా ? దేహ వాసన.కాదండి లోకం కోసం,సృష్టి పునరు త్పత్తి కార్యంలో భాగంగా అంటావా - లోక
వాసన.కాదండి,శాస్త్రా ర్థం మేరకు ఐదురోజు ల పెళ్ళి చేశానండి అంటావా - శాస్త్రవాసన.
కాబట్టి ప్రతిపనిలో కూడా ఈ మూడు వాస నలు వున్నాయి. లేనిది ఏదో చూపెట్టండి ? ఇదే వాసనాత్రయం అంటే.
నిద్రపోయే పనిని తీసుకోండి.నిద్రపోయే పనిలో ఏమున్నాయి ? వుందా లేదా దేహ వాసన ? ఎందుకని నిద్రపోకపోతే దేహం
పనిచేయదుగా.విశ్రాంతి లేకపోతే దేహం పనిచేయదు నాయనా! అనే భావం చేత నిద్ర లోపలికి పోయామనుకోండి అది దేహవాసన
అయ్యింది.
నేను ఆత్మస్వరూపుడిని అని గమనిస్తూ, నిద్రను కూడా నేను గమనించేవాడను,నిద్ర ఇంద్రియాలకే కాని,నాకు కాదు.నేను ఆత్మ
స్వరూపుడను.అవస్థా త్రయానికి సాక్షిని అనే పద్ధతిలో నిద్రలోకి వెళితే,అప్పుడు నిద్ర కూడా జ్ఞానమే అయ్యింది !.
  💓
"నిత్యసాధనాలతో ఆశలను వదిలించు కోవటం వీలవుతుందా !?"
ఆశవల్ల సుఖాపేక్ష ఏర్పడుతుంది.సుఖాపేక్ష వల్ల కామ,మోహాలు ఏర్పడుతున్నాయి. అందుకే ఆశను వదలకుండా ఎన్ని సాధన లు
చేసినా అవితాత్కాలికంగా అణగిఉంటా యేగానీ పూర్తిగా అణగారిపోవు.మనలో ఉన్న సుఖసంతోషాలను గుర్తించగలగడమే
ఆత్మానుభవం.మరొకటి అడక్కుండా సహ జంగా ఉన్న సుఖసంతోషాలతో ఉండిపోవ డమే ఆత్మానందం.ఇష్టా యిష్టా లు పోతే
సుఖసంతోషాలను పెంచాలన్న ఆశ పోతుం ది. క్రొత్తగా సుఖసంతోషాలను అడగని మనసు సహజానందంలో ఉంటుంది !.
💞
          
నాకేదో లేదన్న భావంపోతే మనకంటే ఐశ్వ ర్యవంతులు ఉండరు!.
నిజానికి అనంతసృష్టిలో మనసృష్టి అణు మాత్రమే అయినా ఆశా,నిరాశలచేత అదే పెద్ద ప్రపంచంగా కనిపిస్తుంది.ఈ అనంత సృష్టిలో
మన ఉనికి అత్యల్పమని తెలిస్తే మనం సృష్టించుకునే సంతోషదుఃఖాల ప్రపంచానికి పెద్ద విలువే ఉండదు.మనం ఏమి చేసినా దానికో
ఫలం ఉంటుంది.మనం ఏ ఫలం కావాలనుకుంటే అలాంటి పనులే చేస్తుంటాం.అందుకే ఆపనులకు కర్తలం. వాటి ఫలాలను
అనుభవించే భోక్తలం మనమే అవుతాము.నాకేదో లేదన్న భావం పోతే మనకంటే ఐశ్వర్యవంతులు ఉండరు. అప్పుడు మనం నిత్య
సుసంపన్నులం అవు తాము.మనలోని లేదనే భావనే ఇప్పుడు మనంభావించే,అనుభవించే లేమికికారణం. మనసు శుద్ధమయ్యేకొద్దీ
లేమి భావం పోవ డమేకాదు,ఏమీ లేనివాడనని,అంటే ఏమీ అవసరం లేనివాడనని తెలుస్తుంది.అదే శాంతి సామ్రాజ్యం.అదే
బ్రహ్మీస్థితి !.
        💚
సకల చరాచర జీవలోకముల యందును నేను ఆవశ్యకత అను ప్యూహమును కల్పిం చి,దానికి తగిన ప్రకృతిని గుణసముదాయ
ముగా కల్పించి,ఉచితములైన సృష్టి కార్య ములను ఈశ్వరుడుగా నిర్వర్తించుచుండు ను. భూమిని ఆవేశించి ఓజస్సు రూపమున
ఈశ్వరుడగు నేను జీవులను ధరించుచు న్నాను.రసాత్మకుడగు సోముడై నేను ఓష ధులను అన్నిటిని పరిషోషించు చున్నాను.
(ఓజస్సు అనగా ఓంకారమును జనింప చేయు శక్తి.భౌతిక పదార్థమునందు అవేశిం చియున్న ప్రాణస్పందనము‌ఇది.గర్భస్థు డ గు
జీవుని తొలుతగా బ్రతికించు సారమిది. గర్భము ధరించు శక్తిని ఆయా ధాతువులకి ఇచ్చు సారము కూడ ఇదియే."యత్సార
మాదౌ గర్భస్వి యత్తదర్భరసా ద్రసః" అని ఆయుర్వేదమున ఓజస్సు నిర్వచింపబడి నది.ప్రాణులహృదయములలోన ఆవేశించి,
యిది హృదయ స్పందనము కలుగజేయు ను,దానితో ఊపిరితిత్తు లు స్పందించి,ఓంకా రము ఉద్భవించియుచ్చారణమొంది,“సోం
హం"అను శ్వాస మంత్రముగావెలువడును. ఇది పృథివీ తత్త్వము నావేశించి సూక్ష్మ తత్త్వములలో పనిచేయుచుండును.భూమి
యందలి లవణాదులలో భూసారముగా ఆవేశించి యుండి,జీవరాసులకు అంకురో ద్భవాది సామర్ధ్యములను ఇచ్చును.సోము డు
బ్రహ్మాండమునకు అతీతుడై న గంధ ర్వుల గణములోనివాడు.రుచి అనునది సోముని ప్రభావము.రుచి,అభిరుచి,లలిత
కళాసృష్టి,తన్మయీకరణము ఇతని శక్తు లు. అందు రుచికొరకై జలములయందు తన ప్రకృతిని నిహితము చేయును,ఇతని ప్రభా
వమున ఓషధులు పుష్టి చెందును.ఓషధు లనగా ఫలపాకాంతములు (పంటతో చెట్టు చనిపోవునవి),ధాన్యములు అన్నియు
ఓషధులను జాతివృక్షములు.సోముడు చంద్రు ని కిరణముల ద్వారమున భూమిపై పనిచేయుటవలన ఓషధులు పుష్టి చెందు
చున్నవి.ఇవి అన్నియు ఆయా దేవతల ప్రకృతులుగా 'నా' నుండి అంశలగుచున్నవి కనుక నేనే‌ఇన్ని ప్రకృతులలో నిర్వహించు
చున్నాను.)
         💘
నిర్ణయించుట అశక్యమైనది స్పష్టముగ కన్పించునది మాయ అని ఇంద్రజాలము మొదలగు వాని పట్ల జనులు స్వీకరించిరి.
ఈ జగత్తు స్పష్టముగ కన్పించుచున్నది.కాని దాని స్వరూపమేమో నిర్ణయింపనలవికాదు. కనుక నిష్పక్షపాతముగా ఈ
జగత్తు మాయా మయము భ్రమాత్మకము అని గ్రహింపుము.
"సద్విలక్షణత్వే సతి అసద్విలక్షణజ్ఞానమ్"
సత్తు కానిది అసత్తు గానిది అజ్ఞానము (మాయ).బ్రహ్మజ్ఞానముచే నశించుచున్నది కాన సత్తు కాదు. అజ్ఞానము అసత్తు అని
తలంతుమా వంధ్యా పుత్రు డు,ఆకాశ పుష్ప ము వీనివలె ప్రత్యక్షము కాకున్నది.
అజ్ఞానదశ యందు అనుభవ ప్రత్యక్షమై యున్నది.కనుక అసత్తు కాదు.ఈ కారణ ద్వయము చేతనే అజ్ఞానమనునది భావా
భావరూపమైనది అని వేదాన్తశాస్త్రకా రుల అభిప్రాయము.
ఇంద్రజాలము స్పష్టముగ కన్పించుచునే ఉండును,కాని దాని లక్షణం"ఇది"అని చెప్ప లేము.అట్లే మాయ కూడా కన్పించును కాని
ఇదమిత్థమని చెప్పజాలమని ఉద్దేశము.
కాని ఈ నిర్వచనము దోషరహితము కాదు. బ్రహ్మము కూడా ఇదమిత్థమని చెప్పలేము. అది కన్పించదు కూడా.కుందేటి కొమ్ము
అని స్పష్టముగ చెప్పగలము కాని అది కూడా ఏనాటికిని కన్పింపదు.
వేదాంతశాస్త్ర జ్ఞాన పండితుడై నను దేహాభి మానమును విడువక పోయిన బద్ధు డే. దేహాత్మబుద్ధి నెంతవరకు విడువక యున్నా డో
అంతవరకు మోక్షవార్తను వినుటకు కూడా నర్హుడు కాడు.ఈ జగత్తు స్పష్టముగ కన్పించుచున్నది. కానీ దాని స్వరూపమేమో
నిర్ణయింపనలవికాదు.అహంకారముతోను, అనేకమయిన అనుభూతివిషయముల తోను గూడిన ఈ ప్రపంచము సృజింపబడి
యుండలేదు.ఉన్నది బ్రహ్మమే.
ఎంతటి పండితమార్తాండులైనను ఏదో ఒక స్థా యి యందు మాయాఇంద్రజాలమునకు కారణము తెలియదని అంగీకరించక
తప్పదు.
ఈ మాయాబంధము అస్త్రముల చేతను, శస్త్రముల చేతను ఛేదింప శక్యము కాదు. అనేక విధములగు పుణ్యకర్మల నాచరిం చుట
చేతను ఈ బంధముతొలగునదికాదు. ఆ కర్మలును పునర్జన్మ హేతువులే,కాన సర్వనియన్తయగు పరమేశ్వరుని అనుగ్రహ
ముచేతను‌,వివేకముచే గల్గినబ్రహ్మానుభూత విజ్ఞానమను ఖడ్గము చేతను ఈ అనాది వాసనావాసితమగు అజ్ఞానమూలానాత్మ
బంధము చేదింప సాధ్యమగును.
💛
      
పూర్వమొకనాడు, దూర్వాసమహాముని (అత్రి అనసూయల పుత్రు డు),దేవవనితలు తనకిచ్చిన పూలహారమును,దేవతలకు
రాజయిన దేవేంద్రు నికి బహుకరించెను. ఆసమయమున దేవేంద్రు డు తనవాహనమ గు ఐరావతముపై వెళ్ళుచుండెను.అతడు
పూలహారమును ఐరావత కుంభ స్థలమున ఉంచగా,ఆ ఐరావతము ఆ హారమును క్రిందపడవైచి తన కాలితో త్రొక్కివేసెను.
అదిచూచిన దూర్వాసుడు మిక్కిలి కోపించి దేవేంద్రు ని (శక్తిహీనుడవమని) శపించెను. భగవాన్! నీ అంశతో జన్మించిన వారికి తప్ప
ఇతరు దేవతాంశులకు ఓరిమి ఎట్లు కలుగును?.
ఒకసారి దుర్వాసుడు విష్ణువు దర్శనానికి వెళ్లా రు.విష్ణువు ఆయనను గౌరవించి ఒక పారిజాత పుష్పాన్ని యిచ్చారు.కింది లోకా లకు
వస్తూవుంటే విద్యాధర కాంతిలో ఒక  పుష్పమాలను ఇచ్చారు.ఆయనకు కొంత దూరంలో దేవేంద్రు డు కనిపించారు.దుర్వా సుడు
ఇంద్రు ని ఆశీర్వదించి పారిజాతము, పుష్పమాల దేవేంద్రు నికి ఇస్తే ఆయన ఐరా వతముకు ఇచ్చారు.ఐరావతం ఆ రెండింటి ని పాడు
చేసింది.వెంటనే దేవేంద్రు ని నిర్లక్ష్య ముకు ఆగ్రహించినదుర్వాసుడు నీ ఐశ్వర్య ము గంగపాలు అవుతుంది -అని శపించా
రు.దేవేంద్రు డు క్షమించమని అడగగా-నీవు శ్రీహరినిధ్యానించిన నీకు నీఐశ్వర్యమునకు, ఐరావతమునకు రక్షణ కలుగుతుంది.
🧡
        
ఎవడు ధర్మయుక్తమైన(లేక ధర్మస్వరూపమే యగు) మన యిరువురి ఈ సంభాషణము ను అధ్యయనముచేయునో అట్టివాని జ్ఞాన
యజ్ఞముచేత నేనారాధింపబడినవాడనగు దునని నానిశ్చయము.
"ధర్మ్యమ్" - అని చెప్పుటవలన ఈ గీతా శాస్త్రము ధర్మమార్గమునుండి తొలగనిదని యు,సాక్షాత్ ధర్మస్వరూపమేయనియు
విదితమగుచున్నది. "ధర్మక్షేత్రే" - అని ధర్మ శబ్దముతోనే గీత ప్రారంభమగుట ఈ సందర్భమున గమనింపదగియున్నది.
    “జ్ఞానయజ్ఞేన" - ఈ గీతా గ్రంథము నధ్య యనము చేయువాడు జ్ఞానయజ్ఞముచే భగవంతుని పూజించినవాడగుచున్నాడని
యిచట తెలుపబడినది.
కావున ఈ గ్రంథము యొక్క కేవలము పారాయణము కూడ గొప్పఫలితమును గలుగజేయగలదని తెలియుచున్నది. అయితే
భక్తితో గూడి చేయవలెను. అర్థము తెలిసికొని అధ్యయనము చేసినచో ఇంకను గొప్ప మేలు చేకూరగలదు.
మఱియు గీతనంతను అధ్యయనము చేసినవాడు జ్ఞానయజ్ఞముచే తననారాధిం చుచున్నాడని చెప్పుటవలన గీతా గ్రంథము
యొక్క పరమతత్త్వము జ్ఞానమేయనియు, కర్మ,భక్తి,ధ్యానాదులన్నియు ఆ జ్ఞానమందే పర్యవసించుచున్నవనియు అవి జ్ఞానోత్పత్తి
కి సహాయభూతములుగ నుండుననియు తెలియుచున్నది.అట్లు   కానిచో గీతా గ్రంథా ధ్యయనమంతయు జ్ఞానయజ్ఞమనియే
యిచట యేల పేర్కొనవలెను? కావున తక్కిన కర్మ భక్త్యాదులను సహాయముగ గైకొని జ్ఞానమును లెస్సగ నభ్యసించి అట్టి
జ్ఞానరూపయజ్ఞముచే భగవత్సాక్షాత్కారము బడయవలెను. ఫల పుష్పాదులచే భగవంతుని పూజించుట సామాన్యపూజ.
జ్ఞానయజ్ఞముచే నాతనిని పూజించుట పరాపూజ. మొదటిదానికంటె రెండవది మహోత్కృష్టమైనది.
"మే మతిః" -  “ఇది నా నిశ్చయము". అని భగవానుడు చెప్పుటవలన ఈ వాక్యము పరమ ప్రమాణమైయున్నట్లు మనము
భావించవలెను.ఏలయనగా సాక్షాత్ భగ వానుడే " ఇది నా స్థిరనిశ్చయము అని ఘంటాపథముగ నొక్కి చెప్పిరి...
ఈ గీతాశాస్త్రము నధ్యయనము చేసిన వాడు ఏ యజ్ఞము నాచరించిన వాడగును. జ్ఞానయజ్ఞమును.
[2/2, 4:5 🌷
నువ్వు చేసేపనిఎంతమంది చూస్తా రన్నది ముఖ్యంకాదు అది ఎంతమందికి ఉపయోగ పడింది.అనేదే ముఖ్యం.మంచి పని చేసేట
ప్పుడు మనిషి కనబడాల్సిన అవసరం లేదు.మంచితనం కనబడితేచాలు
మనిషి కాదు మారాల్సింది మనసుమారాలి. ఆలోచించే విధానం మారాలి.మంచిగా ఆలో చిస్తే అన్నీ మంచిగా కనిపిస్తా యి.చెడుగా
ఆలోచిస్తే అన్నీచెడుగానే అర్థమవుతాయి
  కష్టపడుతూ పైకి ఎదిగినవాడికివిలువలతో కూడుకున్న సంస్కారం ఉంటుంది.ఒక్కసారి గా పైకెదిగిన వాడికి నువ్వెంత అనే అహం
కారం ఉంటుంది.
అదృష్టంతో వచ్చినది అహంకారాన్ని కలిగి స్తుంది,తెలివితో సంపాదించింది సంతోషాన్ని స్తుంది,కష్టపడి సంపాదించింది సంతృప్తి
నిస్తుంది......
[2/3, 5:14 AM] 🌷🌷🌷
అబద్ధా ల్లో..,అబద్ధా లతో అబద్ధపు బతుకు లుబతికే బతుకుల్లో....అబద్ధ మొక్కటే తిరుగులేని సత్యం.నీ జీవితం అమూల్యం, నీకు
విలువ ఇవ్వని వారికి,అందులో క్షణం కూడా ఇవ్వకు.నిరాడంబరమైన, యదార్ధ మైన వ్యక్తే.,నిజంగా గొప్ప వ్యక్తి..సామాజిక
అవగాహన,సామాజిక స్ఫూర్తి,సామాజిక చైతన్యం లేని వాళ్ళు,ఏది నిజమో...ఏది అబద్ధమో..తెలుసుకోలేనిమూర్ఖులు.మనం ఏది
చేసినా,ఏది చెప్పినా,ఒకడు అవును అంటాడు,ఒకడు కాదు అంటాడు,ఇదేలోకం క్యారెక్టర్ ఉన్నోడికి,కావాల్సినోళ్లంటూ ఎవరూ
ఉండరు.....వాడి బ్రతుక్కి వాడే రాజు,వాడే బంటు....నిందిస్తు న్న వారంద రినీ దూరం చేసుకోకండి!.పొగుడుతున్న వారందరికీ పల్లకి
మోయకండి.కావాలనే నిందించే వారుంటారు.మీకు మంచి కావాల నే నిందించేవారు కూడాఉంటారు!.ప్రతిఫలం కోసం
పొగిడేవారుంటారు,.పరుల హితం కోసం పొగిడేవారుంటారు.
ఎవరు ఏ విధంగా అనుకున్నాసరే మనలోని లోపాలను విశేషతలను అంతర్మథనం చేసు కుని పరిశీలించుకున్న రోజు పొగడ్తలు
పరిచారికలుగా, నిందలు విజయానికి నిచ్చెనలుగా అయిపోతాయి....
💘🌷
          
అలెగ్జాండర్.....
ప్రపంచవిజేత అయిన తరువాత ఏం చేస్తా వు.....మెసడోనియా తిరిగి వచ్చి హాయిగా విశ్రాంతితీసుకుంటాను.విశ్రాంతి తీసుకోవ
డానికి నీవు అన్ని రాజ్యాలు జయించి అంత రక్తపాతం సృష్టించాలా?నేడు కొత్తరకం అలెగ్జాండర్లు బయలుదేరారు.
సంపాదన,సంపాదన,సంపాదన ఒకటే సంపాదన ...సంపాదించటమే విజయం...
అనే దృక్పధం పెరిగిపోయింది నేడు.
అందులోని వత్తిడులు దానివల్ల వచ్చే రకరకాల రోగాలు......ఒక మనిషికి ఎంత కావాలి.ఈ ప్రశ్న దాదాపుగా మనమెవ్వర మూ
ఇంతవరకూ వేసుకోలేదు అని అను కుంటున్నా..... ఎవరైనా వేసుకున్నారా.....
లక్షాధికారి అయిన లవణమన్నమే కాని మెరుగు బంగారమ్ము మింగబోడు ప్రపంచం అంతా జయించాడు!.అన్ని దేశాల సుందరీ
మణులు,అతిలోక సౌందర్యవతులు తనను వరించి వచ్చారు,అయినా రావణునికి కాంక్షతీరలేదు!.ఇంకేదో కావాలి!.సీతమ్మను
చెరబట్టా డు! చివరకు రాముడి చేతిలో మొత్తం సబాంధవంగా హతుడయ్యాడు !...
అలానే నోటి దురుసుతనంప్రాణాంతకమవు తుంది!.తన మేనమామ కొడుకు,తన బంధువు అని చూడకుండా పదిమందిలో
కృష్ణుడిని అవమానించి ప్రాణం పోగొట్టు కున్నాడు శిశుపాలుడు!.తన పినతండ్రి పిల్లలు వాళ్ళు, తనదగ్గర లేనిది ఏదో వాళ్ళ దగ్గర
ఉన్నది అని అనుక్షణం ఈర్ష్యా అసూ యలతో మనసు పాడుచేసుకొని చివరకు వాటికే బలి అయిపోయాడు దుర్యోధనుడు.
కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు మనలను ఉన్నచోట ఉండనీయవు......
ధగధగా మెరిసే రాగిచెంబులాంటి మనస్సు కు పట్టే మకిలి ఈ ఆరుభావనలు నిత్యం తోమాల్సిందే.ఏ ఒక్కక్షణం కూడా బద్ధకించ
కూడదు...
అందుకే ఆమార్గం "క్షురస్యధారా నిశితా దురత్యయా దుర్గమ్ పధః".....
మనిషి తనలో చెలరేగే ప్రతి భావాన్ని నిశి తంగా గమనించి ఆ భావం ఎక్కడనుండి పుడుతుందో దాని మూలంలోకి వెళ్లి ఎప్పటి
కప్పుడు పెరికివేయాలి...లేకపోతే కలుపు మొక్కలు పుడుతూనే ఉంటాయి.....
మనలను మనమే ఉద్ధరించుకోవాలి......
మనకు మనమే శత్రు వు....
మనకు మనమే మిత్రు డు......
          ❣️🌹
భగవంతుని యందు భక్తి కలిగిన తరువాత ఆ భక్తి అప్పటి దాకా మన మనసులో ఉన్న రాజస, తామస భావాలు. కామలోభాదులు
వీటిని లేకుండా చేస్తుంది.ఎప్పుడై తే రాజస, తామస భావాలు తొలగిపోయాయో అవి లేని మనస్సు సత్త్వ గుణముతో ప్రసన్న మ
వుతుంది.ఇంతకాలం భగవంతునియందు, భక్తు ల యందు మనసు రాకపోవడానికి కారణం ఆ మనసు రాజస తామస భావాల తో
మునిగి ఉండటం.రాజసమంటే కోరికల పుట్ట.తామసమంటే కోపాలపుట్ట.రజోగుణం తో కామ గుణం,తమో గుణంతో లోభగుణం
మనసులో ఏర్పడుతాయి.సంసారం మీద సంసారిక భోగాల మీద అనగా స్రక్‌,చందన, వనిత,శయ్యాభోగాల యందు సౌధ,ఆభర
ణ,అలంకారాల యందు కోరికలు కలగడం కామగుణం,ఆ కోరిక పెరిగినపుడు ఇవన్నీ నాకే కావాలి అనిపించడం లోభం.దీనివలనే
భగవంతుడిని భక్తు లను,సజ్జనులనుదూరం చేసుకుంటాం.పైన చెప్పిన ప్రక్రియ ద్వారా ఆ కామం భగవంతుని యందు కలిగితే,ఆ
లోభం భగవంతుని కథల యందు కలిగితే సంసారిక కామలోభాలు,రాజస,తామస భావాలు తొలగిపోతాయి.భగవంతుని యందు
కలిగిన కోరిక,భగవంతుని కథల యందు కలిగిన లోభం సత్త్వగుణం అవు తుంది.సంసారంలో బాధించేది సంసారంతో బోధించేది
రాజస తామస భావాలు.సంసా రాన్ని తప్పించేది,కష్టా లు,బాధలను తొలగిం చేది సాత్త్విక భావం.అందుకే భగవంతుని యందు భక్తి
కలిగితే మనసులోని రాజస తామస భావాలను కామ లోభాదులను తొలగించి అదే మనసులో సత్త్వగుణాన్ని ఆవిర్భవింప చేసి
ప్రసన్నం చేస్తుంది.......
*త్రిదశేశ్వరీ.....
దేవతలకు ఈశ్వరి.మూడు అవస్థలకు ఈశ్వరి.పదముగ్గురువిశ్వేదేవతలకుఈశ్వరి. ముఫ్ఫైమూడుగుణాలకు ఈశ్వరి.
త్రిదశులు -బాల్య కౌమార యవ్వన వార్ధక్య ములనబడు దశలలో ఎల్లప్పుడూ మూడవ దశయందే ఉండేవారు -దేవతలు.ధర్ముడు
అనేవాడు ఒక మనువు.అతడికి పదిమంది భార్యలు.అందులో విశ్వ అను భార్యకు పుట్టినవారు విశ్వేదేవతలు.దేవతలకు,విశ్వే
దేవతలకుకూడా ఈశ్వరి ఆపరమేశ్వరి.
జాగ్రస్వప్నసుషుప్తు లందు మార్పులేని శరీరా భిమాని అయిన దేవత.సృష్టిస్థితిలయాలన బడే మూడుదశలకు ఈశ్వరి.33 మంది
దేవతలకు ఈశ్వరి.వీరు
ఏకాదశరుద్రు లు - 11
ద్వాదశాదిత్యులు - 12
అష్టవసువులు -8
ఇంద్రు డు, ప్రజాపతి -2,మొత్తం - 33 మంది
యజ్ఞాలలో హవిర్భాగం తీసుకునేది వీరే.
రూపం ఎంత బాగున్నా,అది కంటి వరకే విలువ.ఆ రూపం వెనుక మనసు,ఆమనసు నుండివచ్చే మాట కల్మషం లేనప్పుడు
మనిషికి రూపానికి మించిన విలువ...!!
నీ జీవితాన్ని మార్చేవాడు.నీ ముందు అద్దం లో తప్ప.లోకంలో ఎక్కడా కనిపించడు....
        💖
యజ్ఞములు మొదలగు కర్మలయందు గాని, వేదముల యందు గాని తరచుగా పరబ్రహ్మ తత్త్వము కనిపించదు.(యజ్ఞము లు
పవిత్ర కర్మలు అయినను,ఆచరణలో వానియందు శ్రద్ధనిలిచి అందలిఅంతర్యామి యందు నిలువదు.అట్లే వేదాధ్యయనము చేయు
వారు తమ ప్రయత్నమును పాండిత్యము ను గుర్తు పెట్టు కొందురే గాని అందలి పర బ్రహ్మమును వదలిపెట్టు దురు.అది దేనికోస ము
ఉద్దేశింపబడినదో దానిని మరచి‌మిగి లిన అస్థిపంజరములను కౌగిలించుకొను చున్నారు).
కలలో పొందిన సౌఖ్యమునకు ఆకారము లున్నవి.కలలో కనిపించిన ఆకారముల యందు అనుభవింపబడిన సౌఖ్యమున్నది. అందలి
ఆకారములు కలలో నిత్యములే గాని నిజముగా నిత్యములు కావు.అట్లే వేదాంత వాక్యములు తత్త్వమునుఅందించి
తొలగిపోవలసినవే గాని నిత్యములు కావు. (దూర దేశమున భార్యను విడిచి కొన్ని సంవత్సరములు ఉన్నవాడు కలలో భార్య తో
సంభాషించుచు తృప్తిని,సంతోషమును పొందును.ఈ తృప్తి,సంతోషము నిజముగా జీవునిచే అనుభవింపబడినవనుటలో
సందేహము లేదు.కాని దానికి ఆధారమైన స్వప్న భార్యకు దేహమున్నదా? స్వప్నమున తాత్కాలికముగా ఉన్నది‌కాని అటుపైన
లేదు.అట్లే అంతర్యామిని స్థా పించునట్టి యజ్ఞకర్మలు గాని,వేద మంత్రములు గాని, వేదాంత వాక్యములు గాని స్వప్నమందలి భార్య
దేహము వంటివి.అనుభవము కలు గుటకు నిమిత్తమైనంతవరకే వాని అస్తిత్వ ము గాని స్వతంత్రమైన అస్తిత్వము లేదు. ఈ
దృష్టితోనే దేహమును,మనస్సును,ఇంద్రి యములను,ఇంద్రియార్థములను,చుట్టరిక ములను,ఆస్తిపాస్తు లను వినియోగించు కొన
వలెను.వానికి అస్తిత్వమున్నదని నమ్మినచో అది మిథ్యాజ్ఞానము.అస్తిత్వము లేదనుట గూడా సత్యము కాదు.నీవు నరపతివి,నేను
జ్ఞానిని అను అంశముగూడాఇట్టివే.ఇప్పుడు పరబ్రహ్మానుభూతి కలుగుటయే వానిప్రయో జనము కాని తప్పు చేయుట క్షమించుట
మున్నగువానికి స్వతంత్ర ప్రయోజనము లేదు).జీవుని చిత్తము ఎంతకాలము త్రిగు ణములతో సంబంధించి ఉండునో అంత
కాలము జ్ఞానేంద్రియములకును,కర్మేంద్రియ ములకును సన్నిహితత్వము కలిగి అలవా టు పడును.ఈ అలవాటును బట్టి ధర్మము
లనో అధర్మములనో పుట్టించుచుండును. (ధర్మము పుట్టించు అభ్యాసమును కలిగిం చుకొను కర్మలను నిర్లిప్తు డై ఆచరించవలెను.
ఆ కర్మలే కలలోని భార్య దేహము వంటివి)..
శ్రీక్రిష్ణుడుసైతంయుద్ధంలోమూర్చబోయాడు
రాముడు సైతం అడవుల పాలయాడు.....
ప్రవక్త సైతం రాళ్ళ దెబ్బలు తిన్నాడు.
చెప్పేదేంటంటే కష్టా లు మంచి వాళ్ళకీ వస్తా యి,.చెడ్డవాళ్ళు కూడావస్తా యి.కానీ మంచి వాళ్ళు నలుగురు క్షేమం కోసం కష్టా లు పడ
తారు.చెడ్డవాళ్ళు నలుగురుని ఏడిపించి నవ్వుతుంటారు.......
ఓటమి అంతా అసమర్థత కాదు.గెలుపు అంతా గొప్పతనం కాదు.చీకటి,వెలుగులు సహజం.వెలుగుతో చీకటిని పారదోలవచ్చు.
కానీ చీకటి వెలుగుని ఏమీ చేయలేదు.
ఈ రోజులా రేపు ఎప్పటికీ ఉండదు.ఇదంతా మారిపోతుంది.మన మీద మనకు నమ్మకం, కృషి, పట్టు దల,దయార్థ
హృదయం,త్యాగం దైవం మీద నమ్మకమే అన్నింటినీ అధిగ మించే శక్తి ని ఇస్తుంది.....
[2/3, 04:1 ❤️
అజ్ఞానముతో కూడిన బంధనాల నుండి విముక్తిని పొందుట,కోరికల నుండి విడివడు ట ద్వారా అహంకారమును తొలగించుకొను
టనే ముముక్షుత్వమని చెప్పబడింది.బద్దక ము,పాలుమాలికను వదలిగురువుయొక్క దయతో స్వేచ్ఛను పొంది వైరాగ్యముతో
సమత్వస్థితిని,శాంతినిపొందుటచేయాలి.ఈ విషయములలో ముఖ్యముగా లౌకిక విషయాలకు అతీతముగా ఉంటూ స్వేచ్ఛ కొరకు
ప్రాకులాడుచూ,ఉన్నతమైన శాంతిని పొందుతూ ఇతర సాధనలు చేయుట నిజ మైన ఫలితాలను ఇస్తుంది.
ఎడారిలోని నీటిలాగ కేవలము ప్రాపంచిక విషయాలకు దూరముగా ఉంటూ స్వేచ్ఛ కొరకు ప్రశాంతత కొరకు చేయు సామాన్య
ఫలితములన్నియూ నిష్ఫలము.జన్మ రాహి త్యానికి,భక్తికి చేయు ప్రయత్నాలు అత్యు న్నత స్థా నమును ఆక్రమిస్తా యి.భక్తి అనేది ద్వైత
సిద్దాంతము ప్రకారము ఒక దివ్యాత్మ మీద ప్రేమను వ్యక్తము చేస్తు న్నప్పటికి, అద్వైత సిద్ధాంతము ప్రకారము పరమాత్మ
ఒక్కడే.పూజింపదగినవాడు.ఈ రెండు వేరుగా చెప్పబడినప్పటికి,పరమాత్మ అంశ యైన దివ్యాత్మకు,పరమాత్మకు ఎక్కువ భేదము
లేదని,అవి దాదాపు సమానమని చెప్పవచ్చు.
🌷🌷
         
'గోపా' శబ్దము,పరిరక్షింపబడి అమృత పానము చేయుచు సామరస్యమును,విజ యమును,పొందినజీవాత్మనుసూచించును.
గోప,గోపీజనులనగా వీరే.సూర్య చంద్రాత్మక ప్రజ్ఞలుగ సృష్టివలయమును ఏర్పరచువారు కూడా వీరే.వీరు పొందు తాదాత్మ్యస్థితిని
శబ్దపరముగ ఇంద్రబీజమైన 'ల' అను అక్షర ముగ ఋషులు తెలిపిరి.పానము,పరిరక్ష ణము,అమృతత్త్వము,సామరస్యము,విజ
యము అను గుణములన్నియు 'గోపాల' అను శబ్దమున ఇమిడి యున్నవి.గోపాల మంత్రముచే ఇట్లు తాదాత్మ్యము చెందిన
జీవులు ఎందరో కలరు.
శ్రీకృష్ణుని గానము,భజనము,ధ్యానము, స్మరణము చేసిన భక్తు లు పరిసరముల ప్రభావము నండి పరిరక్షింపబడుట కృష్ణ భావనా
పారవశ్యమున జీవించుట ఇందలి రహస్యము.
జగద్గురువగు శ్రీకృష్ణుడు తనను ధ్యానము చేసిన వారందరికీ పై విజయమును అను గ్రహించు చుండును.జీవుని ప్రయాణమున
ప్రతి నిత్యము మాధుర్యము నిండి యుండుట, జీవితము వైభవోపేతముగా ముందుకు సాగుట ఇందలి అద్భుతము.
🖤
           
అంతమాత్రాన మీరు తల్లి గర్భంలోనే శాశ్వ తంగా ఉండిపోవాలని కోరుకుంటారా? నిజమే.తల్లి గర్భంలో చాలా సౌకర్యంగానే
ఉంటుంది.అంతకన్నా గొప్ప సౌకర్యాన్ని ఇంతవరకు సృష్టించలేక పోయామని శాస్త్ర జ్ఞలు కూడా ఒప్పుకున్నారు.అంత మాత్రాన అదే
జీవితం కాదు.అసలైన జీవితం ఎప్పు డూ బహిరంగ ప్రపంచంలోనే-చాలా ఆటవి కంగా- ఉంటుంది.
‘‘ఎక్స్‌టసీ’’అనే ఆంగ్ల పదానికి చాలా ప్రాము ఖ్యత ఉంది. ‘‘ఎక్స్‌టసీ’’ అంటే ‘‘బయట పడడం’’అని అర్థం.అంటే,అన్నిరకాల సౌక
ర్యాలు, భద్రతలనుంచి,మృత్యు సమాన మైన అహం అడ్డగోడలనుంచి బయటపడి, ఒక ప్రక్రియగా మారి హాయిగా,స్వేచ్ఛగా అడుగు
ముందుకు వెయ్యడం,‘‘ఎక్స్‌టసీ (పరవశం)’’అంటే అదే.అప్పుడే మీ నుంచి పవనాలు పయనించగలవు.
‘‘అది చాలా అద్భుతమైన అనుభవం’’ అని మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం.
విత్తనం మొలకెత్తడం, తల్లిగర్భంలో లభించే సౌకర్యాలన్నింటినీ వదిలి తెలియనిప్రపంచం లోకి శిశువు అడుగుపెట్టడం,గుడ్డు నుంచి
బయటపడ్డ పక్షి ఆకాశంలోకి ఎగరడం, మొగ్గ వికసించడం-ఇలాంటివన్నీ పరవశాలే. ‘‘ఎక్స్‌టసీ’’అంటే అదే.
అహం ఒక గుడ్డు లాంటిది.అందులోంచి మీరు బయటపడాలి.అలాగే అన్నిరకాల భద్రతలు,రక్షణల వలయాల అడ్డు గోడల నుంచి
కూడా మీరు బయటపడాలి.అప్పుడే అంతులేని అనంతమైన విశాల ప్రపంచం మీ సొంతమవుతుంది.అందులో మీరు సమృద్ధి గా
జీవిస్తా రు.కానీ,భయం మిమ్మల్ని అవిటి వానిగా చేస్తుంది. ‘‘తల్లి గర్భంనుంచి బయ టపడే శిశువుకూడా ‘‘బయటకు రావాలా,
వద్దా ’’అని సంకోచిస్తూ,ఒక అడుగుముందు కు, ఒక అడుగు వెనక్కివేస్తూ ఉంటాడు. అలా గతం మిమ్మల్ని వెనక్కి లాగుతుంది.
భవిష్యత్తు మిమ్మల్ని ముందుకు తోస్తుంది. పురిటి నొప్పులంటే అవే.ఆ రకంగా శిశువు పుట్టు కతోటే విభజించబడతాడు.గతాన్ని,
అహాన్ని పట్టు కుని వేలాడడంవల్ల మీరు ఏదీ నిర్ణయించుకోలేని స్థితిలో ఇరుక్కుపోతారు. కానీ,మీరు చాలా అప్రమత్తంగా,జీవంతో
తొణికిసలాడే అరుదైన క్షణాలలో మాత్రం ఆ స్థితి మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలా లేని క్షణాలలో ఆ స్థితి ఒక పారదర్శక
మైన గోడలా ఎంత స్పష్టంగా కనిపిస్తు న్నప్ప టికీ,దానిని మీరు ఎప్పటికీ గమనించలేరు.
అన్ని తలుపులు,కిటికీలు పూర్తిగా మూసేసి తమ అంతరంగ మందిరంలో ఎవరు నివసి స్తు న్నారో తెలుసుకోకుండానే అందరూ- ఒక
జన్మ కాదు,అనేక జన్మలు-తమ జీవితాన్ని గడిపేస్తు న్నారు.నిజానికి,అక్కడ నివసిస్తు న్నది ఎవరో మీకు తెలుసా?మీలోని అహమే
అక్కడ నివసిస్తోంది.దానిని మీరు ఎలాగైనా వదిలించుకోవాలి.అందుకు మీరు చాలా ధైర్యాన్ని కూడగట్టు కుని దానిని చంపెయ్యా
లి. కానీ,అలా చెయ్యకుండా అందరూ దాని ని అనేక రకాలుగా పోషిస్తూ,తమకే తెలియ కుండా తమ నరకాన్ని తామే సృష్టించు
కుం టున్నారు.మరణించిన ‘మర్ఫీ’ శవపేటిక పక్కన అతని భార్య,కొడుకు ఉన్నారు. సంతాపాన్ని తెలిపేందుకు వచ్చిన వారిలో
ఒకామె మర్ఫీని చూస్తూ ‘ఎంత సుఖంగా పడుకున్నాడో! ఇంతకీ ఎలా పోయాడు?’ అంది. ‘‘అందరి దగ్గర అలా పడుకునే
సుఖరోగంతో పోయాడు’’అంది మర్ఫీభార్య. ‘‘అలా చెప్తా వేమిటి మమీ.విరేచనాలు వచ్చి కదా నాన్నపోయాడు’’ అన్నాడు
కొడుకు. అది నాకు తెలుసురా! నాన్న చాలా సుఖం గా పోయాడని చెప్పాలి కానీ,అలా ఛండా లంగా పోయాడని
చెప్పడమెందుకు?’’అంది మర్ఫీ భార్య.అలా అందరూ అంతా ముగి సిన తరువాత నాటకాలాడతారు.అహం ఎప్పుడూ
అవాస్తవమైనదే.అందుకే అది ఎప్పుడూ మిమ్మల్ని బలవంతంగా అవాస్త వంలోకి నెట్టేస్తుందే కానీ,వాస్తవంగా జీవించ నివ్వదు.అహం
ఎప్పుడూ అబద్ధమే కానీ, దానిని ఎవరికివారే నిర్ణయించుకోవాలి. దానికి చాలా ధైర్యం కావాలి.
      💙
బ్రహ్మమునందు స్థిరబుద్ధి కల బ్రహ్మజ్ఞాని మోహరహితుడై యుండును.ఇష్టమైన దాని ని పొందునపుడు సంతోషించుటగాని,యిష్ట
ము లేని దానిని పొందునపుడు దుఃఖించు ట గాని చేయడు.బ్రహ్మజ్ఞాని అన్నిటియందు బ్రహ్మమునే దర్శించును.అతని బుద్ధి
బ్రహ్మ మునందు స్థిరపడి యుండును.
అతడు బ్రహ్మ పరాయణుడై యుండునని, బ్రహ్మమునందే నిష్ఠ కలిగియుండునని, అన్నింటి యందును బ్రహ్మమునే దర్శించు నని,
సృష్టి సర్గమును దాటిన దృష్టి కలవా డని ముందు శ్లోకములలో తెలుప బడినది. బ్రహ్మమును దర్శించునపుడు ప్రకృతి విలా సమే
యుండును కాని,మాయ ఆవరింపదు. మోహము పొందుట యుండదు.అతడు అసమ్మూఢుడు.
మూఢత్వమనిన మోహ పడుట.ప్రకృతి మాయ లేని వానికి మూఢత్వము లేదు, మోహ నత్వము లేదు.మోహమే లేనపుడు
ప్రియము లేదు,అప్రియము లేదు.ఇది బ్రహ్మ జ్ఞాని లక్షణము.తానే బ్రహ్మము అయిండు ట వలన,తాను బ్రహ్మజ్ఞాని యను స్ఫురణ
కూడ తనకులేదు. బ్రహ్మజ్ఞానులందరును సభ నేర్పాటు చేసి అతనిని బ్రహ్మజ్ఞానిగ నిర్ణయించినారు.ఆ విషయము పరమహం సకు
తెలుపగ ఆ మహాత్ముడు“అంటే ఏమి టి” అని అడిగినాడట.అతడు మురుగు నీటిని కూడ ఆచమనము గావించెడివాడు.
శునకముతో సమానముగ కలిసి భుజించె డివాడు.శునకమను భావ మతనికుండక, అదియును బ్రహ్మముగనే గోచరించెడిది.
బ్రహ్మజ్ఞాన స్థితి ప్రకృతి స్పర్శ దాటిన స్థితి.
    💓
అందుకనే భిక్షాటనము చేసుకునేటటువంటి విప్రు డు వేదం చదువుకునేటప్పుడు, వేదం చదువుకుంటూ మూడు ఇళ్ళల్లోనో, 5
ఇళ్ళ ల్లోనో, లేకపోతే ఎనిమిది ఇళ్ళల్లోనో “భవతీ భిక్షాందేహి” అని అడుగుతాడు.అలా సంపా దించిన దాంట్లో మొత్తం నాలుగు
భాగాలు చేస్తా డు.ఆశ్రమవాసులు కూడా అంతే! వాళ్ళుకూడా అలా భిక్షచేసి తెచ్చుకునేదే! మొదటిభాగాన్ని గోవుకు
పెడతారు.రెండో భాగం, ప్రక్కన ఎవరయినా భిక్షాటనానికి వెళ్ళనివారు ఉంటే వాళ్ళకు పెడతారు.
మూడోభాగాన్ని బ్రాహ్మణుడినివెతుక్కుంటూ వెళ్ళి ఆయన కాళ్ళమీదపడి ఆయన తీసు కొనేటట్లు గా ప్రార్థించి ఆయనకు ఆ
భిక్షటనా న్నం ఇస్తా రు.మిగిలిన నాలుగోభాగాన్ని వాళ్ళుతింటారు.తెలివితక్కువవారా వాళ్ళు  “వాళ్ళే భిక్షాటనంచేసి తెచ్చిన భిక్షను
ఇత రులకు పెట్టి దానంచేసి మిగిలిన దానిని తాము తింటుంటే,రాజువై ఉండి నువ్వు దానం చెయ్యక పోవటం ఏమిటి? అని అడి
గాడు రాజును జైమిని మహర్షి.
“ఈ ఐశ్వర్యం నీదని ఎలా అనుకుంటున్నా వు? ఈ ఐశ్వర్యమంతా ప్రజలది,దేశానిది. ప్రతీవాడూ ఈ ఐశ్వర్యం నాది అనుకోవటం
వలన దానం అనే విషయం పుడుతున్నద క్కడ. ‘ఏదీ కూడా నాది కాదు’ అనుకోవడం చేత,దానంచేసే అహంభావంతోకాకుండా
దానం ఇచ్చేస్తా డు.అడిగినవాడిదే ఇది.
‘ఈ పూట నాఇంట్లో ఇంత బియ్యము ఉందంటే, వచ్చి అడిగి భోజనంచేసే అతిథి ఎవరయితే వస్తా రో,నాభాగ్యంచేత ఆ అతిథి తన
భోజనం తాను చేసాడు.లేకపోతే ఏమ య్యేది? అతడి ధనం నేను దాచుకుని ఉండే వాణ్ణి!’ అని అనుకోవాలి.అలా ఉండాలి
దృక్పథం.అంటే,పరధనం నా దగ్గర ఉన్నట్లు భావిస్తే,నాకు అహంకారం కలుగదు.సహజ మైన ఈ విభూతితో–ఈ జ్ఞానంలో ఉన్న
వారికి వాళ్ళల్లో దానాహంకారం ఉండదు.
ఆర్యధర్మంలో మామూలుగా గృహస్థు డు తన క్షేమంకోరే దానంచేస్తా డు.మోక్షంకోరే వాడు త్యాగంచేస్తా డు.త్యాగంవేరు,దానం
వేరు.ఉన్నదాంట్లో ఒకభాగం ఇవ్వటందానం. ఉన్నదంతా ఇచ్చివేస్తే అది త్యాగం.త్యాగం మోక్షహేతువవుతుంది.దానం పుణ్యహేతు
వవుతుంది.పుణ్యంవల్ల మోక్షం రాదు.ఈ జీవుడికి పుణ్యమే ఆవశ్యకత.ఎంతవాడై నా సరే ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత ఈ
ఆకలిదప్పులు–అంటే దుఃఖంతో మృత్యు వాతపడ్డ తరువాత,అతడు పొందేటటు వంటి బాధలు ఏవయితే ఉన్నా యో,అవి ఆ
దానదోషం వలనే కలుగుతాయి.
❣️🧡
         
సృష్టిలోని ప్రతిప్రాణి ఫనా-బకాలను కలిగి యున్నట్లే భూమికలలో నున్న వారు కూడా ఫనా-బకా లను కలిగియుండును.కాని వాటి
వాటి సంస్కారములను బట్టి అవి తేడాలు కలిగియుండును.
హంసతూలికా తల్పమున పరుండిన వాడును,ఱాతిబండపై పరుండిన వాడై నను లేక ఇద్దరును కలిసి ఓకే పరుపుపై పరుండి నను
ఇద్దరికీ సుషుప్తి - జాగృతులున్నప్పటికీ ఎవరి ఫనా-బకాలు వారివి.
బ్రహ్మీభూతుడై న తరువాత, సచ్చిదానంద స్థితి ననుభవించుచు భూమి మీద భగవం తుని దివ్య జీవనము గడుపుటకై సామాన్య
మానవుని చైతన్యమునకు క్రిందకి దిగివచ్చి, దానితోపాటు భగవంతుని దివ్య జీవితము లో స్థిరపడిన వానిని నిజమైన దివ్యుడు
విశ్వాసం,సౌశీల్యం గల(కొద్దిమంది) వ్యక్తు ల చరిత్రే ప్రపంచ చరిత్ర.మనకు కావలసినవి మూడు-స్పందించే హృదయం,ప్రేమించే
మనస్సు,పని చేసే చెయ్యి.
💖
     
*ప్రార్ధన మనము మర్చిపోగూడదు.ఎందు కంటే ప్రార్ధన వలన మనకు సద్గురువుకి  link ఉంటుంది.దాని వలన మనకు అనుగ్ర
హము ఉంటుంది.ప్రార్ధన చేయకపోతే link ఉండక జీవితము తెగిపోయిన గాలిపటము అవుతుంది.
*ఇంక ఆ  జీవితానికి అందేదేమీ ఉండదు. ప్రతి నిత్యము ఒకమిల్లీ మీటరైనా ఉన్నతి సాధించాలి గదా! ఈ ప్రేయర్ ప్రతి దానికి
అడ్డు వస్తు న్నట్టు గా అనిపిస్తుంది. మిగిలినవన్నీ important అనిపిస్తా యి. మనకి ఏదిఆధారమో అది మానేసి మిగిలిన వన్నీ
చేస్తు న్నాము. మనలని మనము చీల్చి చూసుకుంటే లోపలున్న అంతరాత్మ చాలా నిక్కచ్చిగా ఎంత భక్తు లమో చెపుతుంది.
*మీ గమ్యము దైవాన్ని చేరడమే అయితే ఆ గమ్యము అలాగే ఉండాలి.ఎందుకు వచ్చి నట్లు సద్గురువు దగ్గరకు? బ్రహ్మాన్ని చేస్తా న
న్నారు గదా! అందరికీ అమరత్వాన్నిస్తా ను, అందరికీ బ్రహ్మత్వాన్ని  ఇస్తా నన్నారు గదా! మనకు అది ప్రధాన గమ్యముగా ఉండాలి.
లేకపోతే ప్రక్కకు వెళ్లిపోతాము.Time waste అయి పోతున్నది.కాలాన్ని ఒక్కసారి వృధా చేసుకుంటే అది మళ్ళారాదు గదా! ఎన్ని
కోట్ల డబ్బు ఇచ్చినా!.
💕🌹
     
*సాలెపురుగు తన నుండి వచ్చినజిగురుతో గూడు అల్లి,ఆగూట్లో చిక్కుకున్న పురుగుల ను తిని అదే సుఖంగా భావిస్తుంది.కానీ ఆ
గూడు నుండి బయటపడే మార్గం తెలియక అదేగూడులో చిక్కుకొని మృత్యువాత పడు తుంది.అలాగే మనిషి కోరికల వలయాన్ని
తనచుట్టు అల్లు కొని కోరికలు తీరడమే లక్ష్యం అనుకోని అంతకు మించి సుఖం లేద ని అనుకుంటాడు.నిజం తెలిసేనాటికి తాను
అల్లు కున్న గూడు కంచుకోటలా మారడం వల్ల బయటపడే మార్గం తెలియక,మాయ వల్ల ఏర్పడ్డ గోడలు బ్రద్దలు కొట్టలేక అందు
లోనే పడి అసువులు వదులుతున్నాడు..
*బ్రహ్మమే ఆత్మ.బ్రహ్మమునకు ఉపాధి లేదు. ఆత్మకు ఉపాధి గలదు.
*ఆత్మయే బింబరూపంలో పరమాత్మగాను, ప్రతిబింబ రూపంలో జీవాత్మగాను పిలువ బడుచున్నది.
*మాయ లేక ప్రకృతి ఉపాధిగా గలవాడు ఈశ్వరుడు. అవిద్య ఉపాధిగా గలవాడు జీవుడు.
🌷🌷🌷🌷
    
*మనసుపెట్టి పట్టిపట్టి వెతకకపోతే సదా వర్తమానమే ఉంటుంది !.
అనంతమైన బ్రహ్మానుభూతిలో పరబ్రహ్మమే నేనని తెలుసుకుంటే బయటకువ్యక్తమయ్యే గుణాలూ బ్రహ్మమే,అంతరంలో ఉండి నడి
పే గురువూ బ్రహ్మమేనని అనుభవపూర్వ కంగా అర్థం అవుతుంది.దీనంతటికీ చేయా ల్సినదంతా మనసును నిర్మలంగా ఉంచు
కోవడమే సాధన....సామాన్య పరిభాషలో గతం అంటే నిన్న భవిష్యత్తు అంటే రేపు. వర్తమానంలో శాంతిగా ఉన్నవాడికి నిన్న, రేపులు
ఏవీ బాధించవు.గడిచిన క్షణం తాలూకూ జ్ఞాపకాల వికారాలు,భవిష్యత్తు కి సంబంధించిన ఆశల ఊహలు ఉండవు. మనసుపెట్టి
పట్టిపట్టి వెతకకపోతే సదా వర్తమానమే ఉంటుంది !
💕🌹
             
"ఇరవై ఏండ్లు గా వేదాంతమంటే నాకు మక్కువ.ఎందరో ఏవేవో అనుభూతులు పొందామంటారు.నాకే కొత్త అనుభవాలూ
కలుగలేదు.దూరశ్రవణం,దూరదర్శనంవంటి సిద్ధు లూఎరుగను.ఈ దేహంలో బంధితుడ్ని. అంతకుమించి మరేమీకాలేదు.....
*అదేసరి.సత్యం ఒక్కటే.అదేఆత్మ.సకలము దానిలోని సంకల్పాలే.అందుండి వచ్చినవే. అది చేసినవే.దృష్టి,ద్రష్ట,దృశ్యము అన్నీ
ఆత్మయే.ఆత్మను ఆవలపెట్టి ఎవడై నాచూడ గలడా? వినగలడా? ఆ వినడం,చూడటం దగ్గరగానైతేనేం,సుదూరంగానైతేనేం.రెండు
సందర్భాల్లోనూ,చూసే వినే అవయవాల అవసరం ఉండనే ఉంది ! వాని రెండింటినీ విడనాడలేవు.వాని వలెనే మనసును వదల
రాదు. విధం ఏదైతేనేం,ఆధారపడకతప్పదు. అటువంటప్పుడు దూరశ్రవణ,దూరదర్శ నాదుల వ్యామోహం ఎందుకు? అదీగాక
లభ్యమైనది నష్టమూ అవుతుంది.అది శాశ్వతంకాదు !.
💚
        
ఈ జగత్తు వాస్తవమని భావించువారికి అందలి అద్భుతములు సంగతములగును. కాని ఇదిఅంతా మాయఅని అనే వేదాంతు
లకు,మాయయే అద్భుతమనే వేదాంతుల కు మాయాకార్యమునందు విశేషమేమీ కన్పింపదు.మాయ అద్భుతమనుటను
ఆక్షేపించి ఏమి లాభము?అట్టి ఆక్షేపముల ను మేము కూడా ఆక్షేపింపగలము.కర్తవ్య మేమనగా శాస్త్రా నుగుణమైన విచారణ ద్వారా
మాయను పరిహరించుట.కనుక వ్యర్థముగ శుష్కవాదములు చేయవలదు.
కేవల‌ము తర్కమును ఆశ్రయించి కార్యకార ణముల సంబంధములతో కుస్తీపట్టు ట వ్యర్థ ప్రయాస.ఏలన కార్యకారణ సంబంధమే
మాయ యొక్క కార్యము.కనుక స్వంయ బుద్ధి కుశలతను ప్రకటించే ప్రయత్నములు మాని మాయరహస్యమును భేదించు ప్రయ
త్నము శాస్త్రోక్తముగచేయవలెను.శాస్త్రము లు సూచించిన విధముగా మోక్ష స్థితిలో నెలకొన్నవారు తమ చైతన్యము ఆత్మవైపు
ప్రసరించును గనుక ఈ ప్రపంచ దృశ్యమను సముద్రమును నిశ్చితముగా దాటుదురు. కానీ దుఃఖమును,గందరగోళమును మాత్ర
మే కలిగించు తార్కిక వాదమను వలలో చిక్కుకొన్నవారు తమ పరమ శ్రేయమును పోగొట్టు కొందురు.శాస్త్రములుచూపిన మార్గ
మున గూడ వ్యక్తియొక్క"ప్రత్యక్షానుభవ ము" మాత్రమే అతనిని సురక్షితమగు పరమగమ్యపు దారివెంట నడుపును.
శుద్ధచైతన్యమే రజోగుణవశమున "నేను" అను మలినభావనను పెట్టు కొని తన సహ జమగు ప్రకాశమును విడువకయే అహంకా
ర,ప్రాణ,దేహ,ఇంద్రియాది వికృతరూపము ను అనుభవ గోచరముగావించుకొనును.
ఈ వికృతరూపము నిజముగా అసత్య మయినను,"నేను"అను అహంకారము,అది యథార్థముగా ఉన్నట్లు నమ్మి భ్రాతిజెందు ను.
మహాదుఃఖసమయములందూ గూడ మానవుడు తప్పుదారిలో కాలు పెట్టరాదు. తన స్వయధర్మముతో తృప్తిచెందక తాను విన్న
ఉపదేశముపట్ల ఆసక్తు డయి సత్యమా ర్గమున నడుచుటకు గట్టిగా ప్రయత్నించు వానిని మాత్రమే మానవునిగా పరిగణింతు రు.
ఇతరులు మానవరూపమున ఉన్నవా రు మాత్రమే.రూపు దాల్చిన ఆశ్చర్యమే మాయ.సంశయమే దాని శరీరము.బుద్ధి మంతులు
ప్రయత్న పూర్వకముగ దానిని పరిహరించె మార్గము వెదకవలెను.
💜🌷
         
*యోగులు యత్నముచేసి ఈ దేహములోని జీవుని స్థితిని,ఆత్మ స్థితిని దర్శింపగలుగు తున్నారు.ఆత్మయందు యోగమభ్యాసము
చేయనివారు దీనిని చూచుటలేదు.
(యోగులనగా దేహేంద్రియమనోబుద్ధు లను, ప్రకృతిని 'నేను'అను తత్త్వమున చూచు వారు.నిత్యము నన్ను స్మరించుచుండుట
వలన ఇందొక్కక్కటియే 'నే'నను ఈశ్వరుని చే కాంతిమంతమై పని చేయుచుండును. అప్పుడు ఒకదానియందు‌ఒకటి చక్కగా
అమరియుండును.మానికలో సోల,అందు లో అర సోల మున్నగునవి వరుసగా ఇమి డ్చి అమర్చినట్లు యోగి యందు ఇంద్రియ
ములు మనస్సులో,మనస్సు బుద్ధిలో,బుద్ధి ఈశ్వరుడై న 'నా'లో ఇమిడియుండును. అట్టివాడు సర్వము నందు అంతర్యామిగా
జీవుని, వానియందు విశిష్టు నిగా ఆత్మను చూచును..
'నా'యందు పరిశ్రమలేనివాడు మనోబుద్ధ్యా దులచే ఎంత శ్రమించినను,యజ్ఞయాగాది క్రతువులు చేసినను,వేద పురాణాది శాస్త్ర
ములు నేర్చినను,అందెందును పరిష్కార ము పొందలేడు.ఈ విద్యలన్నియుతనకన్నా భిన్నముగా మనస్సుమడతలలో బరువెక్కు
చుండును.మంచి గ్రంథములు గల బరువైన పెట్టెను మోయుచున్న వానివలె దుర్భర మగును. 'నా'యందు చూడలేని విద్యలను
ఎంత ఆకలితో అభ్యసించినను,ఆకలి గొని నవాడు అరటి పండ్లగెలను మోయుచున్న ట్లుండును.తిన్నవానికి మాత్రమే ఆకలి తీరి
నట్లు ,ఆత్మయందు సాధన చేసినవానికి మాత్రమే వానివలన ఆత్మదర్శనమగును.)
💙
        
"నిన్ను,నన్ను తలుచుకొని ఈ వృత్తాంతంను ఉదయముననే ఎవరుగానముచేయుదురో, వారు అత్యంత శ్రేయస్సును
పొందుదురు" అని గజేంద్రు నితో పలికి -ప్రభూ!నారాయణ మూర్తీ! సారూప్యుడై న ఆ గజేంద్ర సహిత ముగా నీ స్థా నమైన
విష్ణులోకమును చేరితి వి. గురవాయూరుపురాధీశా! నన్ను రక్షింపు ము. ఇలా రెప్పపాటు కాలంలో మొసలి శిరస్సును సుదర్శన
చక్రం ఖండించిన సమ యంలో ద్వాదశరాశులలో ఉండే మకరం సూర్యుని చాటున నక్కింది.నవనిధులలో ఉండే మకరం కుబేరుని
చాటున దాక్కుంది. సముద్రంలో ఉన్న మకరాలు ఆదికూర్మం చాటుకి చేరాయి.
కారుచీకటి నుండి వెలువడిన చందమామ లాగ, సంసార బంధాల నుండి విడివడిన సన్యాసి లాగ,గజేంద్రు డు మొసలి పట్టు
విడిపించుకొని ఉత్సాహంగా కాళ్ళు కదలిం చాడు. ఆదరంతో ఆడదిగ్గజాలు లాంటి ఆడ ఏనుగులు తొండాలతో పోసిన అమృత
జలంలో స్నానం చేసి అలసట తీర్చుకొన్న వాడై గజేంద్రు డు గర్వించి చక్కదనాలతో చక్కగా ఉన్నాడు.
విష్ణుమూర్తి విజయ సూచకంగా పాంచజన్య శంఖాన్ని ఊదాడు. ఆ శంఖం దయారసానికి సాగరం వంటిది. తన మహా గొప్పధ్వనితో
పంచభూతాల మహా చైతన్యాన్ని పటాపంచ లు చేసేది.అపారమైన శక్తితో కూడిన తెల్లని కాంతితో ఇంద్రాది ప్రభువులకైన బెరకు
పుట్టించేది.దీనుల దుఃఖాన్ని పోగొట్టేది.శత్రు వుల సైన్యాలను పారదోలేది.
శ్రీహరి పాంచజన్యం ధ్వనించగానే దేవతల దుందుభులు మోగాయి.పద్మాల సువాసన లతో కూడిన గాలులు వీచాయి.పూలవాన లు
కురిసాయి.దేవతా స్త్రీలు నాట్యాలు చేసారు.సకల ప్రాణుల జయజయధ్వానా లు నల్దిక్కుల వ్యాపించాయి.తన తరంగాల తో
సముద్రు డు ఉప్పొంగి ఆకాశగంగ ముఖ పద్మాన్ని ముద్దా డి ఆనందించాడు. విష్ణు మూర్తి తన పొడవైన చేతితో గజేంద్రు ని
సరస్సులోంచి బయటకుతీసుకొనివచ్చాడు. అతని మదజలధారలు తుడిచాడు.మెల్లగా దువ్వుతు దుఃఖాన్ని పోగొట్టా డు.
విష్ణుమూర్తి చేతి స్పర్శవల్ల గజేంద్రు ని శరీర తాపం అంతా పోయింది.గజరాజు సంతోషం గా ఆడఏనుగుల సమూహంతో కలిసి చేస్తు
న్న ఘీంకర నాదాలతో సొంపుగా ఉన్నాడు.
శ్రీహరి దయవల్ల బతికినట్టి గజేంద్రు డు, ఇదివరకు లానే తన ఆడ ఏనుగులను తన తొండంతో మెల్లగా తాకాడు.మళ్ళీ మిక్కిలి
ప్రేమగా వాటి తొండాలను తన తొండంతో నొక్కాడు.
❣️🌷
        
ఎవడు అతిరహస్యమైన గీతాశాస్త్రమును నా భక్తు లకు చెప్పునో అట్టివాడు నాయందు ఉత్తమ భక్తిగలవాడై ,సంశయరహితుడై
(లేక,నిస్సందేహముగ) నన్నే పొందగలడు.
గీతాప్రచారముయొక్క మహత్తర ఫలితము ను భగవానుడిచట తెలుపుచున్నాడు. గీతాప్రచారము యెడల భగవానునకెంత ప్రీతియో
ఈ వాక్యముల వలన వెల్లడియగు చున్నది.గీతాప్రబోధ ఫలితము సాక్షాన్మోక్షమే యని యిట వక్కాణింపబడినది. (మామేవైష్యతి).
తన భక్తు లకు గీతాశాస్త్రమును బోధించు వారు పరాభక్తికలవారై బ్రహ్మసాయుజ్యము ను బడయుదురని యిట వచింపబడినది.
దీనినిబట్టి ఇతరులకు ఉపకారముచేయుట యే సర్వోత్తమ భక్తి (పరాభక్తి) యగుచున్న ది. ఇతరులకు ఉపకారముచేయుటయనగా
ఆ యా రూపముతోనున్న భగవంతునకు సేవ చేయుటయే యగును.కావుననే యిది సామాన్యభక్తిగా గాక పరాభక్తిగా నిటవర్ణింప
బడెను.
అన్ని దానముల కంటెను జ్ఞానదానము సర్వోత్తమమైనది కావున ఇతరులకు చేయు జ్ఞానదానము పరాభక్తిగ నిట వర్ణింపబడెను.
‘అసంశయః’ అని చెప్పినందువలన అట్టి గీతా ప్రబోధకుడు తప్పకముక్తినొందగలడని, సంశయరహితుడు కాగలడని విదితమగు
చున్నది.కావున సర్వులున్ను ఇట్టి మహత్తర ఫలితము నొసంగగల ఈ గీతాశాస్త్రమును తాము శ్రద్ధతో పఠించి దానిని ఇతరులకు
కూడ బోధించుట ధర్మము.
*ఈ గీతాశాస్త్ర మెట్టిది.....రహస్యమైనది.
దీనిని ఎవరికి బోధించవలెను.....
భగవద్భక్తు లకు (క్రిందటి శ్లోకమున దెలిపిన దుర్గుణములు లేనివానికి)అట్లు బోధించు వారికి కలుగు ఫలితమేమి....వారు పరాభక్తి
కలవారై సంశయరహితులై భగవంతునే పొందుదురు (ముక్తు లగుదురు).ఇవ్విషయ మున సందియములేదు.
[2/3, 04:15 AM] 🌷🌷
పదార్థం గురించి చెప్పేది-సైన్స్,.
పరమార్ధం గురించి చెప్పేది -ఆధ్యాత్మికం....
అన్వేషించేది మనిషి.ఆకర్షించేది మనసు,
అందనిది ఆకాశం,ఆగనది కాలం.అంతరిం చేది జీవితం.అనునిత్యం మనందరి తోడు ఉండేది మనం చేసిన మంచితనం."చేస్తు న్న
పని పట్ల శ్రద్ధ కనబరిస్తే అది పలువురి ప్రశం సలు పొందుతుంది.ఫలితం బాగుంటుంది.."
  "ఏడుపుముఖంతో ఇష్టం లేకుండా చేసే పనికి ఫలితం ఏడుస్తు న్నట్లే ఉంటుంది..."
  "లభించిన వృత్తినే పరమపవిత్రంగా భావిం చి నిజాయితీతో పనిచేయాలి......."
"ఆలోచనలెప్పుడూ నిర్మలంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ అదుపు తప్ప కూడదు....."
"స్వచ్ఛమైన ఆలోచనలతోనే మనిషి ఆదర్శ ప్రాయుడవుతాడు.అందరి అభిమానం చూరగొంటాడు....
🌷🌷🌷🌷
మనం భూమితోను,ప్రకృతి తోను సంబంధం కోల్పోయామా? విశ్వానికి సహజంగా ఉన్న ఆవృత్తు లతోనూ,మానవ వ్యవస్థతోను
మానవ జాతి ఎలా సమన్వయం సాధించ గలదు......ఒక జీవితకాలంలో మీరు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే అది చాలా
కష్టమైన పని.కాని ప్రజలు తమ శరీరంలో ఎంతలోతుగా చిక్కుకుపోయి ఉన్నారంటే వాళ్లు శరీరాన్ని సాధనంగా చూడలేనంతగా.
శరీరంతో వారి అనుబంధం,గుర్తింపు ఎంత లోతుగా ఉన్నాయంటే వాళలు దీన్ని ‘నేను’ గానే చూడడం కొనసాగిస్తు న్నారు.ఈ శరీరా
న్ని మీరు ‘నేను’గా చూసిన క్షణంలోనే దాని కి బోలెడంత భావోద్వేగం జోడింప బడుతుం ది.ఇక మనం దాన్ని సాధనంగా
ఉపయోగిం చలేం.యోగాలో భూత శుద్ధి ప్రక్రియ అంతా ఇదే - పంచభూతాలనుండి విముక్తం కావడ మే.మీరు ప్రభావవంతంగా
మీకూ,పంచ భూ తాలకూ మధ్య దూరాన్ని సృష్టించగలిగితే, అప్పుడు మీకూ,మీ శరీరానికీ మధ్య స్పష్ట మైన దూరం ఉంటుంది.
ఒకసారి మీకూ,మీ శరీరానికీ మధ్య మీరు దూరాన్ని సృష్టించుకుంటే మీకు ఎటువంటి యంత్రం లభించిందో తెలుసుకున్న ఆనందం
కలుగుతుంది.దానిలో బానిసత్వానికీ,స్వేచ్ఛ కూ కావలసిన లక్షణాలన్నీ ఉన్నాయి.దీన్ని మీరు దైవంగా మలచుకోగలరు -మీ శరీరం
దివ్యమయ్యే విధంగా మీ శక్తి వ్యవస్థను మలచుకోగలరు.
లేదా ఒక శవం లాగా ఉండిపోగలరు.అంటే, మీరు మీ శరీరాన్నీ ఒక శవంగానైనా మార్చు కోగలరు లేదా శివంగానైనా
మార్చుకోగలరు. శవం అంటే మృతకళేబరం,శివం అంటే పర మొన్నతమైనది.దాన్ని ఏం చేయగలరో మీ మీదే ఆధారపడి
ఉంటుంది.ఒక మనిషి ఈ విధంగా పనిచేయగలడని మీరు ఊహించ లేని విధంగా మీ శరీరం పనిచేస్తుంది.
ఈ రోజుల్లో,ముఖ్యంగా నగరాల్లో ఉన్నవా రికి, దాదాపు 95% మందికి ఆరోజుచంద్రు డి దశ ఏమిటో తెలియదు.మీరు వాళ్లను తిధి
ఏమిటని అడిగితే,వాళ్లు గూగుల్‌లో చూస్తా రు తప్ప ఆకాశం వైపు కాదు.మీశరీరంమీద, మానసిక నిర్మాణం మీద చంద్రు డి దశల
ప్రభావం విస్తృతమయినది.
చంద్రు డి దశలకు మొత్తం మహా సముద్రాన్నే పైకి లాగగల శక్తి ఉంది.కానీ మీ మీదమాత్రం ఏమి ప్రభావం లేదని మీరెందు కనుకుంటు
న్నారు? ఎందుకంటే మీరు జ్ఞానాన్ని పోగు చేసుకునే సమాజంలా తయ్యారయ్యారు, అంతే తప్ప అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని
సంపాదించడం లేదు.ప్రతిదానికోసం మనం ఏదో పుస్తకం చదవాలి.మెల్లమెల్లగా మనం నిజమైన జీవితాన్ని గడపడంవదిలి,కూపస్థ
మండుకాలుగా మారుతున్నాం.దీనివల్ల ఎన్నో అనర్థా లు జరుగుతున్నాయి.మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మరెన్నో
జరుగుతాయి కూడా.ప్రస్తు తానికి ఈవైఖరిని మార్చగల స్థితిలోనే మనం ఉన్నాం.పరిస్థితి మరింత అధోగతిపాలైతే,సరిదిద్దడం అంత
తేలిక కాదు.
యోగాలో సౌరమండల వ్యవస్థను కుమ్మరి చక్రంగా భావిస్తాం.ఆ చక్రం తిరుగడం నుండే మనం ఉద్భవించాం.సౌర వ్యవస్థకూ,శరీరా
నికి ఉన్న సంబంధాన్ని మనం గుర్తించాం. అందుకే దానితో సమన్వయించడానికి అనే క అభ్యాసాలను నిర్మించడం జరిగింది.మన
శరీరంలో 72,000 శక్తి వాహికలున్నాయి. అవి విశిష్టరీతిలో 114 చోట్ల కలుస్తా యి. రెండు భౌతిక శరీరానికి వెలుపల ఉంటాయి.
నాలుగింటిలో మీరు మార్పు చేయగలిగిందే మీ లేదు.అంటే మీరు వాస్తవంగా పరివర్తింప గలిగినవి 108 అన్నమాట.
108 అనే సంఖ్యకు భారతీయ సంస్కృతిలో చాలా ప్రాధాన్యతఉంది.సూర్యుని గురించిన శాస్త్రం ‘సూర్యసిద్ధాంతం’ అని ఒక ప్రాచీన
గ్రంథం ఉంది.భూమికీ,సూర్యుడికీ మధ్య దూరం సూర్యుడి వ్యాసానికి 108 రెట్లు అని ఈ గ్రంథంచెప్తుంది.భూమికీ,చంద్రు డికీమధ్య
దూరం చంద్రు డి వ్యాసానికి 108రెట్లు .మాన వ వ్యవస్థ కూడా దీనితో సమన్వయంతో ఉంటుంది.
15,000 సంవత్సరాల కిందట ఆదియోగి తన శిష్యులైన సప్తర్షులకు యోగాన్ని అంది స్తూ, సృష్టిలో మనిషి ఎట్లా పరివర్తన చెందు
తారో ఆయన వివరిస్తు న్నారు.మొదటి రూపం మత్స్యం (జల చరం),తరువాత కూర్మం -ఉభయచరం.క్షీరదాలలో మొదటిది
వరాహం.తరువాత ఆయన సగం జంతువు, సగం మనిషి గురించి చెప్పారు.తర్వాత వామనుడు -మరుగుజ్జు .ఆ తర్వాత పూర్తి
మానవుడు,కాని భావోద్వేగ విషయంలో చంచలుడు.తర్వాత ఆయన ఒక శాంతి పూర్ణ పురుషుడి గురించి,ప్రేమజీవి గురించి,
ధ్యానజీవి గురించి మాట్లా డారు.ఆ తర్వాత ఒక మార్మికుడై న వ్యక్తి -ఇతర విషయాలను అనుభవంలోకి తెచ్చుకోగలిగిన వ్యక్తి –
ఇలాంటి వ్యక్తి రావాల్సి ఉంది.అంటే,ఈ సందర్భంలో ఆయన ఈ భూగోళం మీద మానవవికాసంగురించి మాట్లా డుతున్నారు.
అప్పుడు సప్తర్షులు ఆదియోగిని ఇలా అడి గారు, ‘‘మనిషి అంతకుమించి ఇంకా వికసిం చలేడా?’’అని.దానికి ఆదియోగి ఇలా
చెప్పా రు,‘‘సౌరవ్యవస్థలో విపరీతమైన మార్పులు సంభవిస్తే తప్ప మీ శరీరం ఇంతకుమించి వికసించలేదు; భౌతిక సూత్రాలు దానికి
అనుమతించవు’’.
🧡
         
పరహితము నొనర్చుట,దివ్యత్వమునకు చేరువగుట అనునవి సత్సాధకునకు కల్గు రెండు నిరంతర భావములు.గమ్యము చేరు
వరకు అనగా సత్యమును తెలియు వరకు ఆ సత్యము తానే అని తెలియు వరకు సత్సాధకుడు పరితృప్తి చెందడు.తాను చేయు
పర'హిత' కార్యములు,ధ్యానాదిక ములు అత్యల్పముగా తోచుచుండును.
తాను చేయు సాధన కాని,కార్యములు గాని చెప్పుకొనుటకు సిగ్గుపడు చుండును.జీవన విధానమును అన్ని విధములుగా దివ్యత్వ
ము వైపునకు మరల్చు కొనుటకు కృషి సలుపుచుండును.
అనగా కుటుంబము నందు, వృత్తియందు సంఘపరమైన కార్యములయందు,దైవము ను,ధర్మమును జొప్పించు చుండును.చేయు
చున్నది చాలదని ఆరాటపడుచుండును. చేయవలసినది మిక్కుటముగ నున్నదని భావించు చుండును.సాధనయందు సోమరి
తనము చోటు చేసుకొన్నచో తానిప్పటికే చాలా చేసితినని,చేయుచుంటినని తన శక్తి సామర్థ్యముల మేరకు పనిచేయుచుంటినని
తృప్తి చెందుట,గర్వపడుటగా నుండును. రోజునగల ఇరువది నాలుగు గంటలలో ఒకటి,రెండుగంటలు మాస్టరుగారి కార్యము ల
నొనర్చి చాలా చేయుచుంటినని భ్రమ పడుచుండును.
తనకున్న కుటుంబపరమైన బాధ్యతలు అంతకన్న సాధనకుగాని,పరహిత కార్యము నకు గాని అనుమతించనని తనకు తానే సర్ది
చెప్పుకొను చుండును.కుటుంబ సభ్యు లతో తాను మెలగు విధానమున ప్రేమపూరి తమైన యుక్తితో నిర్వర్తించు కొనిన గృహ ము
నందే మిక్కుటముగా అంతర్ముఖము గను,బహిర్ముఖముగను కార్యములను నిర్వర్తించుకొనగలుగును.తనభ్రమతనకు సత్య
మనిపించుటవలన సాధనకు కొంత సమయమే కేటాయించుట చేయుచుండు ను. ఇది సోమరితనము.
🌷🌷🌷
         
*యోగయుక్తు డై నవాడు పరిశుద్ధమైన హృదయము గల వాడగును.సమస్త ప్రాణి కోటి యందును ఒకే ఆత్మ యున్నదని తెలి
సినవాడు.ఇట్టి జ్ఞానము గలవాడు పనులా చరించు చున్నప్పుడు గూడ బంధమున పడడు. యోగయుక్తు డనగ విచక్షణ (బుద్ధి తో
నిష్కామముగ కర్తవ్యముల నాచరించు చు, త్యాగనిరతితో జీవించుచుండును.అట్టి వానిని 'విజితాత్ము'డని దైవముసంబోధించు
చున్నాడు. నిత్యము భగవత్స్మరణము నందుండువాడే (మననము చేయువాడె) ముని యని తెలుపబడినది.“విశ్వం విష్ణుః " అని
పలుకుటసులభమే.తెలియుట శ్రద్ధా ళు వునకు మాత్రమే అనుభవైకము.
యోగయుక్తు డై నవాడు పరిశుద్ధమైన హృద యముగల వాడగును.మనోవికారములను జయించినవాడగును.ఇంద్రియములను
జయించినవాడగును.సమస్త ప్రాణికోటి యందును ఒకే ఆత్మ యున్నదని తెలిసిన వాడు.ఇట్టి జ్ఞానముగలవాడు పనులాచరిం చు
చున్నప్పుడుగూడ బంధమున పడడు. యోగయుక్తు డనగ విచక్షణ (బుద్ధితో నిష్కామముగ కర్తవ్యముల నాచరించుచు,
త్యాగనిరతితో జీవించుచు నుండువాడని ముందు అధ్యాయములందలి సారాంశము గ్రహించినచో తెలియును.అట్టివాడు యింద్రి
య వినియోగము విచక్షణతో గావించును. కావున జితేంద్రియుడగును.ఇంద్రియవ్యాపా రములు శమించినపుడు మనసునకు
పూర్ణ మగు జయమే లభించును.అట్టి మనసు కామబద్ధము కాదు గనుక,బుద్ధియను వెలు గును
ప్రతిబింబింపజేయుచు,పూర్ణచంద్రు ని వలె యుండును.కామము మితిమీరినపుడే మనసునకుహెచ్చుతగ్గులుండును.కామము
విచక్షణకు లోనుగ పనిచేయుచుండుట వల న మనసునకు స్థిరముకలుగును.వికారము లు చెందక యుండును.అట్టి
వానిని'విజితా త్ము'డని దైవము సంబోధించు చున్నాడు. నిర్మలమగు మనసు కలిగినవానికి హృద యము విశుద్ధమై
యుండును.పరిశుద్ధమై యుండును.పరిశుద్ధమగు హృదయము, ప్రశాంతమగు మనస్సు,విధేయులైన యింద్రి యములుగల
జీవుడు నిర్వర్తించు కార్యము లు క్రమబద్ధముగ నుండును.అందు ఫలాస క్తి లేదు.ఫలితముల యందు ఆకర్షణయు
లేదు.చేయుట యందు వక్రతయు లేదు. అట్టి వానిని కర్మలెట్లు బంధించగలవు? బంధించలేవు.వాని కనుదిన కర్మాచరణము
ఆనందమే.వానికాచరణమే ఆనందము. అట్టివాడు యోగయుక్తు డు.యోగయుక్తు డై న వాడు, భగవత్స్మరణమున కూడ
యుండునని ముందు శ్లోకమున దైవము తెలిపినాడు.పై తెలిపిన నియమములకు మననము కూడ తోడై నచో అన్ని జీవుల
యందు తన యందున్నవాడే యున్నాడని తెలియును.ఇది ఒకచక్కనిసోపానక్రమము.
1. విచక్షణ - ఇంద్రియములు నిబద్ధత -  జితేంద్రియుడు
2. నిష్కామ కర్మ - మనసు ప్రశాంతత చెందుట - విజితాత్మ
3. యజ్ఞార్థ కర్మ -   మనసు నిర్మల మగుట - విశుద్ధా త్మ
4. సన్న్యాసము - రాగద్వేషములు మనస్సు విడచుట - యోగము
5. మననము - అన్నిజీవులయందలి ఆత్మను దర్శించుట -  ముక్తస్థితి.
అధ్యాయముల యందలి సూత్రములను పూసకెక్కించి నట్లు గ అమర్చుకొనుచు, అవగాహన చేసుకొనుచు శ్రద్ధా ళువగు ఆత్మ
సాధకుడు ముందుకు సాగవలెను. నిత్యము భగవత్స్మరణము నందుండువాడే (మననము చేయువాడె) మునియని తెలు
పబడినది.అట్లు స్మరణం చేయుటవలన అన్నిటియందు మూలముగ నున్న బ్రహ్మం ను పొందగలడనికూడ తెలుపబడుచున్నది.
అనగా అన్నిటి యందలి దైవము దర్శించిన వాడు మననము ఫలించినవాడే యగు చున్నాడు.మననము జరుగుటకుహృదయ
నైర్మల్యము,మనోప్రశాంతత ఆధారమై యున్నవి.మనోప్రశాంతతకు కామములేని కర్తవ్య కర్మ,విచక్షణ ఆధారములై యున్నవి.
ఇటుకమీద యిటుక పేర్చి యిల్లు కట్టినట్లు , ఈ వరుస క్రమమును గ్రహించి అట్లా చరించి పురోగతి చెందవలెనేగాని,మరియొక
మార్గ ము లేదు.సరాసరిగ అందరి ఆత్మలయందు వసించియున్న దైవమును చూచుట వీలుప డదు.“విశ్వం విష్ణుః "అని పలుకుట
సులభ మే.తెలియుట శ్రద్ధా ళువునకు మాత్రమే అనుభవైకము.
🖤
     
ధర్మశాస్త్రం ఏది చెపుతోందో,దానిని నిర్మొహ మాటంగా అలా చూచినప్పుడు,మహర్షులు చెప్పిన వాక్యాలకు సంబంధించిన ధర్మము
లు వాళ్ళు ఎంత నిష్కర్షగా చెప్పారో తెలు స్తుంది. “బ్రహ్మక్షత్రం,బ్రహ్మక్షత్రం,బ్రహ్మక్షత్రం” అని, రెండు లక్షణములూ ఎవరియందైనా
ఉండవచ్చు.క్షాత్రం అనే లక్షణంచేత,అంటే ఆ లక్షణంవలనే క్షత్రియుడవుతాడు.అతడి కి వేదవిహితమయిన ధర్మములన్నీ చెప్ప
బడ్డా యి.ఉపనయనాది సంస్కారములన్నీ క్షత్రియుని యందున్నాయి. బ్రాహ్మణుడికి ఏ సంస్కృతి ఉందో,అదంతా క్షత్రియుడికీ
ఉంది.బ్రాహ్మణుడికి మాత్రమే గల యాజన ము తప్ప, మిగిలినవన్నీ ఇద్దరికీ సమానం గానే ఉన్నాయి.ఈ ప్రకారంగా అప్పుడు వర్ణ
వ్యవస్థ ఉంది.వ్యాసమహర్షి పరాశరుడి కుమారుడు.మరి అతని తల్లి సత్యవతి? కాని ఆయన బ్రాహ్మణుడిగానే చెల్లు బడి అయ్యాడు
మనకు.
అంటే లక్షణము చేతనే బ్రాహ్మణత్వం ఉంది అని అర్థం.తపస్సులందరికీ సామాన్యమే! అందరికీ ఉండేటటువంటి ఆధ్యాత్మిక సంప
ద తపోబలం.తపోధనం ఉన్నంతవరకు వాళ్ళకు వర్ణాది విభేదములు లేనేలేవు.
వాళ్ళు ఎవరిననుగ్రహిస్తే వాళ్ళు,వాళ్ళ వర్ణంలో చేరినవాళ్ళే.అట్లాంటి స్వతంత్రు లు మహర్షులు.ఆ మాట గుర్తు పెట్టు కోవాలి.
సామాన్యుడు అస్వతంత్రు డై తన వర్ణధర్మా న్ని అనుసరించి చక్కగా వెళితేనే వాడు క్షేమంగా ఉంటాడు.కాని తపోబలం చేత అన్నిటినీ
అతిక్రమించిన ఉత్తముడు అయి నవాడికి ఏ ధర్మములూ వర్తించవు.అతడే ధర్మాలన్నిటికీ శాసనకర్త అవుతాడు.మహ ర్షుల
చరిత్రలన్నీకూడా వారు అటువంటి శాసనకర్తలే తప్ప; ఒక సంప్రదాయంలో నిబంధించబడిన (అందులోని నిబంధనల కు లోబడిన)
సామాన్యవ్యక్తు లు కాదు అనే చెబుతున్నాయి. వారు చెప్పిన ధర్మ శాస్త్రా లే మనకు ఇప్పటికీ జీవనసూత్రాలు.వారు ఏది ధర్మమని
చెపుతున్నారో అది మనం అనుసరిస్తు న్నాం తప్ప,వాళ్ళ కోసం చెప్ప బడినటు వంటి ధర్మాలంటూ ఏమీ లేవు. మహర్షుల అంత
స్వతంత్రు లని వాళ్ళను గురించి మనం గుర్తు పెట్టు కోవాలి.
💞
      
మానవుడిప్పుడు "అహంబ్రహ్మాస్మి" స్థితితో పాటు అనంత జ్ఞాన శక్త్యానందముల అను భవమును పొందుచుండును.బ్రహ్మానంద
మయుడై యుండును.
భగవంతుని అద్వైత  స్థితి : భగవంతుని ఏకత్వ స్థితి నిర్వివాదాంశమైనది.లోక ప్రసి ధ్ధ మతములన్నింటికి ఇది పునాది.ఆధ్యా త్మిక
శిక్షణకు ఇది గమ్యస్థా నము సిద్ధాంత ములో భగవంతుని ఈ యేకత్వస్థితిని అంగీకరించుటకు ప్రజాసామాన్యమునకు
విశేషాధికామున్నది. కాని దానిని గురించి పరిశోధించు వారు మాత్రము బహు కొలది మంది యుందురు.అది సులువైనది,కష్టమై
నది,సార్వజనీనముగా తౌహీద్ ను గురించి, ధర్మోపదేపీఠము నుండి,ఉపన్యాస వేదిక నుండి మాట్లా డుట చాలాసులువుగా ఉండు
ను. కానీ దీనిని సాధించుట బహుకష్టము.
*Slavery is slavery. The chain of gold is quite as bad as the chain or iron.
*సుఖ, దుఃఖాలు రెండూ బంధాన్ని,బానిస త్వాన్నే కలిగిస్తా యి-బంధించిన గొలుసు బంగారమైనా,ఇనుమైనా అది బంధనాన్నే
కలిగిస్తుంది కదా!.
విజ్ఞాన కవాటాలను అందరికి తెరచివుంది. తాడిత పీడితులకు చేయూత ఒసగి,వారికి న్యాయంగా చేకూరవలసిన హక్కులను,
అధికారాలను అందించండి.
*పుష్యమాసములో సూర్యోదయ సమయ మున ప్రసరించు సూర్య కాంతి అద్భుతమ గు యోగచైతన్యమును ప్రసాదింపగలదు.
పుష్యమి చాలా అద్భుతమైన నక్షత్రము. చెప్పలేనంత కాంతిని దర్శనము చేయించే మాసము పుష్యమాసము.ఉత్తరాయణ
పుణ్యకాలములో సూర్యుడు దక్షిణము నుండి ఉత్తరదిశగా పయనము సాగిస్తా డు. అనగా ఊర్ద్వముఖముగా ప్రయాణము.
మనలోని ప్రాణశక్తి బలమును కూర్చుకొను సమయము.సూర్యకిరణముల యందు ఒక ప్రత్యేకమైన హిరణ్మయమైన కాంతి ఉండు
ను.ఇది మన బుద్ధిని ప్రచోదనము గావించు ను. మనస్సును అంటిపెట్టు కున్న స్వభావ ము నందలి అశుభములను ఆ కాంతి
హరింపగలదు.బుద్ధిబలము,ప్రాణబలము పుష్టిగా లభించు మాసము పుష్యమాసము.
💘
       
*హృదయమనే దేవాలయం వద్ద కాపలా కాసే వానివలె అప్రమత్తతతో ఉండాలి.ఆద ర్శానికి కట్టు బడి ఉండాలంటే మొక్కవోని,
ధైర్యం,ఎదురులేని శక్తి,అచంచల విశ్వాసం, నిస్వార్థపరత కలగలసి ఉండాలి.
*ఎటువంటి ప్రతిఘటనలు ఎదురైనా భయ పడకూడదు.పరాజయం పాలైనా క్రుంగకూ డదు.చీకటి ఎదురైనా విశ్వాసం సడల
కూడదు.
*మనం ఎంచుకున్న ఆదర్శం పట్ల గల ప్రేమ మనలను మనం మరిచిపోయే స్థితికి తీసు కువెళితే అప్పుడు ఇక జయాపజాయాలు,
లాభనష్టా లు ఏవీ మనలను బాధించలేవు.         
💙
"శరీరం తెలుస్తుంది,చైతన్యంతెలియబడటం లేదు.. ఇందుకు కారణం ఏమిటి !?"
*దేహాన్ని నడిపే చైతన్యం తెలియబడక పోవడం చేత చైతన్యంతో నడిచే దేహమే నేను అనిపిస్తుంది. ఇందుకు కారణం.. చైత న్య
స్వరూపమైన ఆత్మపదార్థం ఈ సృష్టిగా కదలాడాలంటే రూపనామాలతో కలయిక తప్పదు. అదే సృష్టిమాయ ! నిద్రలోనేకాదు
నిత్యజీవితంలో అనేక సందర్భాల్లో మన మనోదేహాల సంయోగం కొనసాగుతూనే ఉంది. ఏఏ సందర్భాల్లో మనోదేహాలు సంయోగం
చెందుతున్నాయో అప్పుడు దానికి రూపనామాలతోఅవసరమేఉండటం లేదు. నిజానికి మన బాధలన్నింటికీ కారణం
రూపనామాలు ఉండటం కాదు,అందులో మనం తాదాత్మ్యత చెందటం.ఇప్పుడు పోగొట్టు కోవలసింది కూడా ఆ తాదాత్మ్యత నే. ఈ
తాదాత్మ్యత వల్లనే నేను అనగానే రూపనామాలతో గుర్తు కు వస్తు న్నాం.ఇదం తా మెలకువగా ఉన్నప్పుడు మనసు శరీరం నుండి
విడివడటం వల్ల జరిగే మాయ !.
💜
     
*ఏ బాధలేని మనసే బ్రహ్మము !.మనమే దైవమనేది నిత్యసత్యం.అది మనసు పెడితే అందరికీ రుజువయ్యే నిదర్శనం.మనమే
భగవంతుడై నా ఎందుకు తెలియడంలేదంటే  బాధవల్ల.ఆ బాధ ఎందుకంటే మనసుకు మౌనం అలవడనందువల్ల.బాధఅనేది ఆలో
చనలుచేసే సృష్టి.మనమే భగ వంతుడని తెలిస్తే ఏం జరుగుతుందంటే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు,వెంకటేశ్వరుడు ఎలాగైతే పుట్టెడు
కష్టా ల్లో కూడా ప్రశాంతం గా బాధలేకుండా ఉన్నారో,మనం కూడా అలా ఉంటాము !
💚
        
బంధింపబడుటలో,అనగా జీవుడుగా అస్తిత్వమందుటలో సుఖము అలవడవలె ను. ఆ సుఖము తెలియుటకు జ్ఞానము నందు
ఇచ్ఛ కలుగవలెను.ఇట్లు జ్ఞాన సుఖ ములను జమిలిగా పేనుకొనిన నిర్మల ప్రకా శరూపమగు గుణమే సత్త్వము.గర్భ నిబం ధనము
నందు కర్మము లేక వ్యాపారము జరుగవలెను.దానికగు క్రియా శక్తియే తృష్ణా రూపమున పెనవేసుకుని రజోగుణము
ఉద్భవించును.ఇందురాగము,అనురాగము ఇమిడియుండును.
*దేహధారణకు భౌతికత్వమావశ్యకము. జ్ఞానమునకు నిద్రా స్థితియే ద్రవ్యత్వము లేక భౌతికత్వము.దీనితో పెనగొని తమో
గుణముద్భవించును.ఉన్న స్థితికి కట్టు బడి యుండుట,అపరిమితము పరిమితముగా భాసించుట దీనికి ఆవశ్యకము.కనుక అల
సత్వము (నిర్లక్ష్యము),పొరబడుట (అపరి మితము పరిమితముగా నమ్ముట),మోహ ము దీనియందు ఇమిడి ఉండును.
*సత్త్వము ప్రజ్ఞను,జ్ఞానమును సుఖ స్థితిలో నుంచును.రజస్సు కర్మ యందు నిలుపును. తమస్సు నిద్రాస్థితి,.పొరపాటు అను వాని
యందు నిలుపును.
*ఈ మూడింటి ప్రవర్తనము అతిచిత్రము. సత్త్వము రజస్తమస్సులను జయించి పైచేయిగా నిలుచును.రజస్సు తమస్సత్త్వ ములను
జయించి నిలుచును.తమస్సు సత్త్వరజస్సులను జయించి నిలుచును. ఇందు ఒక్కొక్కటి ఇంకొక దానిని జయింప లేవు.కాని
ఒక్కొక్కటి రెండింటి సమ్మిశ్రము ను జయింపగలదు.మొత్తము మీద సత్త్వ ము, రజస్సు,తమస్సు క్రమముగా నైసర్గిక బలమున
తక్కువగుచున్నవి.
💛
          
అవ్యక్తమగు ప్రకృతి వ్యక్తప్రకృతియగు మహత్తు కంటే భిన్నమనీ ఆత్మ అసంగమనీ చెప్ప శ్రు తిని వారు ప్రమాణీకరింతురు.సత్త్వ
రజస్తమోగుణాత్మకమైన ప్రకృతి పురుషుని బంధమోక్షములను కల్పించునని సాంఖ్య వాదము.
గుణములు సామ్యావస్థయందుండుట ప్రకృతి స్వభావము.అది చెదరినపుడు సృష్టి ప్రారంభమగును.జడమగు ప్రకృతి తానంత ట
తానే ఎట్లు చెదరగరదు?అసంగుడగు పురుషుడు ఎట్లు ప్రకృతినిచెదరగొట్టగలడు?
రెండవది,పురుషులు అసంఖ్యాకులై ప్రకృతి శాశ్వతమైనచో వాని మధ్య ఏదోక సంబం ధము కల్పింప వలసివచ్చును.సంబంధ
మేర్పడి నంతనే పురుషుని అసంగత్వము భంగపడును.ఇట్లు సాంఖ్యులవాదము కూడా సరికాదు.వేదాంతవాదమున ఆత్మ సత్ చిత్
ఆనందస్వరూపమని ప్రథమ ప్రకర ణముననే నిరూపింపబడినది.ప్రకృతి అంటే సత్త్వం,రజస్సు,తమస్సు అనే మూడు గుణాల
సామ్యావస్థ.ఈ గుణాల పరస్పర కలయిక చేత దృశ్యమాన జగత్తు ఏర్పడు తొంది. కాని అవి తేలుపు నలుపు వంటి గుణములు
కావు.పాలు,ఇనుము వంటి ద్రవ్యాలు కావు.సత్త్వమంటే జ్ఞానశీలత, రజస్సు క్రియాశీలత,తమస్సు స్థితిశీలత.
జీవుడు,జగత్తు ,ఈశ్వరుడు అనే వ్యవహారా నికి మూల కారణంగా ప్రకృతి ప్రతిపాదించ బడుతొంది.బ్రహ్మం కంటే భిన్నమైన సత్త
ప్రకృతికి లేదు.అది బ్రహ్మం నుండి పుట్టినది కూడా కాదు.కాని ప్రకృతిని తీసివేస్తే సృష్టికి కారణంఏమిటి అనే ప్రశ్నకు ఉత్తరం లేదు.
ఇట్టి ప్రకృతిలో బ్రహ్మం "ప్రతిబింబించుట"... అంటే ఇది ఊహకు అతీతమైన విషయాన్ని మాటలలో చెప్పే ప్రయత్నమనే గ్రహించాలి.
బ్రహ్మంలో"సృష్టింప వలెననే ఇచ్ఛ కలుగుట"
మొదలైనవన్నీ ఇట్టిప్రయత్నాలే.ఈ విషయం గుర్తించుకుంటే తత్త్వగ్రహణం సులభతర మవుతుంది.ఆత్మ సర్వదా ఆనందస్వరూ
పుడు.దుఃఖము కొంచమేనియు లేదు.విష యములవలన కలుగు ఆనందము క్షణికమై యున్నది.విషయజనితమైన ఆనందము
నిజమునకు ఆత్మదే.అయినను భ్రాంతి వశంబున విషయముల వలన ప్రతీతమై నట్లు తోచుచున్నది.ఆత్మయొక్క పరమానం ద
స్వరూపం తెలిసినచో తుచ్ఛ విషయాల లో,అవి కలిగించే క్షణికానందాలలో ఎవరికీ ప్రేమ ఉండదు.
"అహం బ్రహ్మస్మి"అనెడు జ్ఞానంబు గూడా అంతః కరణ వృత్తికి సంబంధించినదే అయి నను ఇది ఆత్మ జ్ఞానంబుగా చెప్పబడును.
ఎట్లనగా పాదములో గ్రు చ్చుకున్న ముల్లు తీసి వేయుటకు మరియొక ముల్లు వాడు దుము.ఇవి రెండూ ముండ్లే.అయినను
మొదటి ముల్లు బాధను గలిగించినది.రెండ వ ముల్లు బాధను పోగొట్టినది.అట్లే"దేహాదు లే నేను"అనియెడు వృత్తి రాగద్వేష సహిత
సంసారము గలిగిస్తు న్నది గాన ఇది ప్రవృత్తి అని చెప్పబడుచున్నది.
"బ్రహ్మమే నేను"అనియెడు వృత్తి రాగద్వేష రహితమైన "బ్రహ్మప్రాప్తి"అనెడు మోక్షంబు కల్గించుటచే నివృత్తి రూపమైన"ఆత్మజ్ఞానం
బుగా" చెప్పబడుచున్నది.స్వరూపము తెలి యని అజ్ఞాన సమయంలో(స్వరూపము తెలియని కాలములో)ఆత్మయందు మిథ్య యై
యుండియు సత్యముగా ఉన్నట్లు తోచెడు ఈ దేహాంద్రియాది ప్రపంచము, స్వరూపజ్ఞానము కలిగిన వెంటనే అసత్తై మిథ్యయై
కనబడును.
అధిష్టా నమందు తోచెడు అధ్వస్త మయినది ఏదియు ఆధిష్టా నము కంటే వేరుగా ఉండు టకు వీలులేదనెడు నియమము ననుసరిం
చి అధిష్టా నమైన ఆత్మయందు అధ్వస్తమై కాన్పించు ఈ దేహేంద్రియాదులు ఆత్మజ్ఞాని కి దగ్దపట న్యాయంగా ఉండి మరణ కాలం
లో వాటికి అధిష్టా నంగా తానే గావున తన యందే లయించి పోవును.అంతదనుక కేవల సాక్షి మాత్రు డై యుండును.
💖
       
ఉగ్రనరసింహమూర్తీ! నీవు హిరణ్యకశిపుని సంహరించిన పిదప ఆ రాక్షసుని మాంస ముతోను,రక్తముతోను తడిసిన నీ శరీరము
మిక్కిలి భీతావహముగానుండెను.హిరణ్య కశిపుని ప్రేగులను నీవు మెడలో వేసుకొని, అతని సభామధ్యమున కూర్చొని వారింప
శక్యముగాని భీకర ఘర్జనలతో మితి మీరిన రోషముతో కనిపించితివి.అప్పుడు నిన్ను దరిచేరు ధైర్యము ఎవరికినీ లేకుండె ను.
భయముతో ఎల్లరూ నీకు దూరముగా నుండిరి.ఇంద్రు డు,బ్రహ్మదేవుడు,శివుడు ఒక్కొక్కరు వచ్చి నిన్ను స్తు తించసాగిరి.ఉగ్ర
నరసింహుడి రూపాన్ని చూసి దేవతలు, చారణులు,విద్యాధరులు,గరుడులు,నాగు లు, యక్షులు,సిద్ధు లు మొదలైన వారిలో ఏ
ఒక్కరు కూడ ఆ సమయంలో ఆ ఉగ్ర నర కేసరి దరిదాపులకు వెళ్ళటానికి సాహసించ లేక భయకంపితులౌతున్నారు.నరసింహరూ
పుడి విజయోత్కర్షం చూసిన దేవకాంతలు ఆదర ఆనందాతిరేకాలతో పూలవానలు కురిపించారు.ఆనందంతో ఉత్సవాలు చేసు
కున్నారు.ఆ సమయంలో ఆకాశంలో అనేక మైన దేవతా విమానాలు తిరిగాయి;గంధర్వ గానాలు వీనుల విందు చేశాయి; అప్సరసల
నాట్యాలు కన్నుల పండువు చేశాయి; దివ్య మైన కాహళ,భేరీ,మురజ మున్నగు మంగళ వాద్యాలు
అనేకంవినబడ్డా యి;సునందుడు, కుముదుడు మొదలైన శ్రీహరి పార్శ్వచరు లు; పరమేశ్వరుడూ,బ్రహ్మదేవుడూ, మహేం ద్రు డూ,
మొదలైన దేవతలూ;కిన్నరులూ; కింపురుషులూ;నాగులూ;సిద్ధు లూ; సాధ్యు లూ; గరుడులూ;గంధర్వులూ;చారణులూ;
విద్యాధరులూ; ప్రజాపతులూ అందరూ ఆ ఉగ్ర నరకేసరిని దర్శించాలనే కుతూహలం తో విచ్చేశారు.
💕
        
అతినిర్మలమైన బుద్ధితో గూడినవాడును, ధైర్యముతో మనస్సును నిగ్రహించువాడు ను,శబ్దస్పర్శాది విషయములను విడిచి
పెట్టు వాడును,రాగద్వేషములను పరిత్య జించువాడును,ఏకాంతస్థలము లందు నివ సించువాడును,మితాహారమును సేవించు
వాడును,వాక్కును,శరీరమును,మనస్సును  స్వాధీనముచేసికొనినవాడును,ఎల్లప్పుడు ను ధ్యానయోగతత్పరుడై యుండువాడు
ను, వైరాగ్యమును లెస్సగ నవలంబించిన వాడును,అహంకారమును,బలమును (కామక్రోధాది సంయుక్తమగు బలమును లేక
మొండిపట్టు ను),డంబమును,కామము ను (విషయాసక్తిని),క్రోధమును,వస్తు సంగ్రహ ణమును,బాగుగ వదలివైచువాడును,మమ
కారము లేనివాడును,శాంతుడును అయి యుండువాడు బ్రహ్మస్వరూపము నొందుట కు
(బ్రహ్మైక్యమునకు,మోక్షమునకు)సమర్థు డగుచున్నాడు.
తరించుటకు కావలసిన సాధన సంపత్తి యంతయు వీనియందుగలదు.ఈ మూడు శ్లోకములందును తెలుపబడిన సాధనలను
చక్కగ అనుష్ఠించినచో మనుజుడు బ్రహ్మ సాక్షాత్కారము(మోక్షమును)తప్పక పొంద గలడు.(బ్రహ్మభూయాయ కల్పతే).సాధన
విధానము,దానిఫలితమును రెండును ఇచట పేర్కొనబడినవి.బ్రహ్మైక్యరూపమగు మహోన్నత ఫలితమును గలుగజేయునవి
యగుటవలన ముముక్షువు శ్రద్ధతో వానిని ఒక్కొక్కటిగ చక్కగ సాధించి,క్రమముగ అన్నిటిని సాధించవలెను.
"విశుద్ధయా" - "శుద్ధయా"అని చెప్పక "విశు ద్ధయా"అని చెప్పుటవలన బుద్ధి ఒకింత శుద్ధముగానున్నచో చాలదనియు,మిక్కిలి
శుద్ధముగా నుండవలెననియు స్పష్టమగు చున్నది.అత్యంతనిర్మలమైన అద్దమందే ముఖము స్పష్టముగ గోచరించునుగదా!
"ధృత్యా” -మనస్సు సామాన్యముగ లొంగు నదికాదు.దానిని జయించుటకు,నిగ్రహించు టకు ఎంతయో ధైర్యమవసరము.ఆత్మ
పిరికిపందలచే పొందబడునది కాదు.
   "కశ్చిద్ధీరః” -అనునట్లు ధైర్యవంతుడే మన స్సును లొంగదీసికొని ఆత్మను బొందును.
"ఆత్మానం నియమ్య చ”-మనస్సును,ఇంద్రి యములను నిగ్రహించనిచో అధ్యాత్మ క్షేత్ర మున ఎవరును విజయశ్రీని జేబట్టజాలరు.
సాధన క్రమములో మనస్సంయమము అత్యంత ప్రధానమైయున్నది."నియమ్య” అని చెప్పుటచే మనస్సును బాగుగ నిగ్రహిం
చవలెనని ఆదేశించడమైనది.
“శబ్దా దీన్విషయాం స్త్యక్యా” - శబ్దా ది దృశ్య విషయములవెంట పరుగిడువారు ఆత్మాను భవము నెన్నటికిని బొందజాలరు.మనస్సు
బహిర్ముఖత్వమునువీడి అంతర్ముఖమై ఆత్మధ్యానమందు నెలకొనియుండ వలెను. 'వివిక్త సేవీ’ -ఏకాంతస్థలమున నివసించ
వలెను.లేక గృహమందు ధ్యానమునకు ప్రతిబంధములేని ఒకానొక గదిని ఏర్పాటు చేసికొని అందు బ్రహ్మనిష్ఠా దులను జరుపు
కొనవచ్చును.సాధనదశలో బహుజనమధ్య మున నుండినచో చిత్తమునకు విక్షేపము కలుగును.కావున ఏకాంతముగ ధ్యానాదు
లను శీలించవలె.....
“లఘ్వాశీ” - మితాహారమును గైకొనవలెను. అధికముగ భుజించుటవలన ఆరోగ్యము చెడుటయేగాక ధ్యానమున్ను సరిగా జరుగ
దు. శరీరము ఎంత తేలికగా నుండిన అంతమంచిది.అయితే కేవల శుష్కోపవాసా దులు పనికిరావు.యుక్తా హారవిహారుడై
యుండవలెను.సాధకుడు ఆహారవిషయమై కడు జాగరూకుడై యుండవలెను. ఆహార ము వలననే శరీరము,మనస్సు ఏర్పడును
కావున ధ్యానానుకూలమగు సాత్త్విక,మితా హారమునే సేవించవలెను.ఆధ్యాత్మికసాధన రూప సౌధమునకు ఆహారనియమము
పునాదివంటిది.కాబట్టి దానివిషయమై బహుజాగ్రతవహింపవలెను.ఇదివరలో గీత యందు భగవానుడు దానిని గూర్చి పలు మారు
హెచ్చరించియుండిరి.ఇపుడు గీత పరిసమాప్తమగుచున్నందువలన తిరిగి జ్ఞాపకముచేయుచున్నారు.(ఆహారసంయ మాదులు)
ఎంత ప్రధానమైనవో యోచించు కొనవచ్చును.కావున ఆహారవిషయమై జాగ్ర త వహించుట చాల ముఖ్యమైనది."యత
వాక్కాయమానసః” -వాక్కును,శరీరమును, మనస్సును అదుపులో నుంచుకొనవలయు ను.మదపుటేనుగును మావటివాడు
అంకు శముచే స్వాధీనపఱచు కొనునట్లు సాధకు డు భక్తి జ్ఞానాదులచే,వివేకంచే పై మూడింటి ని తన యధీనమందుంచు
కొనవలెను. తానుచెప్పినట్లు అది నడువవలెనేకాని అది చెప్పినట్లు తాను ఆడగూడదు.
    “ధ్యానయోగపరో నిత్యం” - "నిత్యం” అని చెప్పుటవలన,ఒకపుడు ధ్యానశీలుడై , దైవచింతనాపరుడై మఱియొకపుడు దృశ్య
విషయాదులందు విచ్చలవిడిగ తిరుగరాద ని ఆదేశించడమైనది.ఇట్టిస్థితి ప్రారంభము లో సాధ్యముకాకున్నను అభ్యాసముచే
క్రమముగ సిద్ధించును.ధ్యానమునుండి బయటకు వచ్చినపుడుకూడ ఆ ధ్యానకా లస్థ ప్రశాంత సాత్త్వికవాతావరణమునే
కాపాడుకొనవలెను.
“వైరాగ్యం సముపాశ్రితః” -
శ్రితః = ఆశ్రయించినవాడు
ఆశ్రితః = బాగుగ ఆశ్రయించినవాడు
ఉపాశ్రితః - ఇంకను బాగుగ ఆశ్రయించిన వాడు,సముపాశ్రితః - లెస్సగ సంపూర్ణముగ ఆశ్రయించినవాడు.
“సముపాశ్రితః” అని చెప్పుటవలన వైరాగ్య మును పరిపూర్ణముగ లెస్సగ నాశ్రయించ వలెనని బోధింపబడినది.ఏలయనగామంద
వైరాగ్యయుతుని మాయ ఒక్క ఊపులో పడగొట్టివైచును.
‘బలమ్' - ఇచట ‘బలమ్' అని చెప్పబడిన దాని యర్థము దైవబలము,పరమార్థబలమ నికాదు.అసురబలము,పశుబలము,కామ
క్రోధాదులబలము అనియే.లేక తాను బల వంతుడనను అభిమానమనియు చెప్పవ చ్చును.వీనిని త్యజించివేయవలెను.సత్కా
ర్యముల కుపయోగించు బలము ఉత్తమ మైనది కాని,దుష్కార్యముల కుపయోగించు నది కాదు.మొండి పట్టు దలతో చూపబడు
బలము త్యాజ్యమేయగును.కావున వానిని వదలి దైవబలముచే సంపాదించవలెను.
“కామం క్రోధమ్" -ఈ రెండును గీతలో చాల చోట్ల అన్నదమ్ములవలె కలసి వచ్చుచున్నవి. ఒకదానినొకటి విడిచివచ్చినచోటు గీతలో
చాల అరుదుగా నుండును.ఏలయనగా, క్రోధమునకు పుట్టిల్లు కామము(కామాత్క్రో ధోఽభిజాయతే).ఆ కామక్రోధముల రెండిటి
ని సమూలముగ ఛేదించివేయవలెను.
"పరిగ్రహమ్” - పరిగ్రహమనగా ఇతరుల నుండి వస్తు వులను స్వీకరించుట.తన దేహ పోషణకు అవసరమైన భిక్షాదులు తప్ప
తదితరములను సాధకుడు ఒరులనుండి గ్రహింపరాదు.అట్లు గ్రహించుటచే ఆ యా వస్తు వులనుగూర్చిన ఆశాదులచే చిత్తము నకు
విక్షేపము గలుగుటయు ఇతరులకర్మ తనకు తగుల్కొనుటయు,భోగసామగ్రిచే సాధన చెడుటయు సంభవించును.కావున
పరిగ్రహమును వదలివేయవలెను.అహం కారాది దుర్గుణములలో "పరిగ్రహము”న్ను చేర్చబడుటబట్టి అదియు తక్కినవానివలె
ప్రమాదకరమనియు, అనుపాదేయమనియు స్పష్టమగుచున్నది.
‘విముచ్య’ - అని చెప్పుటవలన పైనదెల్పిన అహంకారాది దుర్గుణము లన్నిటిని సంపూ ర్ణముగ విడనాడవలెనని బోధించినట్లైనది.
‘బ్రహ్మభూయాయ కల్పతే’ - ఈ చెప్పబడిన సాధనయందారితేరువారు వారెవరైనను సరియే బ్రహ్మప్రాప్తికి, మోక్షమునకు అర్హులే
యగుదురు. వారు తప్పక బ్రహ్మానుభూతిని బడయగలరు. కాబట్టి ముముక్షువులు ఆ బోధలన్నిటిని చక్కగ కార్యాన్విత మొనర్చి
బ్రహ్మప్రాప్తి నొందవలయును.
ఈ మూడు శ్లోకములును గీతాసారమగుట వలనను,అతిముఖ్యములైనవి యగుట వలనను వీనిని ముముక్షువులు బాగుగ
కంఠస్థముచేసి అర్థమును సదా మననము చేయుచు వానిని చక్కగ కార్యాన్విత మొన ర్చి (మోక్షప్రాప్తి నొందుటద్వారా) కృతార్థు లు
కావలయును.వీనియందు కొన్ని గ్రహించ వలసిన గుణములు,కొన్ని త్యజించవలసిన గుణములుకూడ చెప్పబడినవి.అనగా ఔష
ధము,పథ్యము రెండును తెలుపబడినవి రెండును సమకూడినపుడే భవరోగము కుదురును.
బ్రహ్మసాక్షా త్కారమునకు (మోక్షప్రాప్తికి) ఏ యే సాధనలను జేయవలెను?ఎట్లు ప్రవ ర్తించవలెను....బుద్ధిని మిగుల నిర్మల ముగా
నొనర్చుకొనవలెను.ధైర్యముచే ఇంద్రియ
యమంబులను స్వాధీనముచేసికొనవలెను. శబ్దస్పర్శాది విషయములను త్యజించవలె ను.రాగద్వేషములనువిడిచిపెట్టవలయును.
ఏకాంతస్థలము నాశ్రయించవలెను.మితా హారమును సేవింపవలెను.వాక్కును,శరీర మును,మనస్సును స్వాధీనమునందుంచు
కొనవలెను.నిరంతరము ధ్యానయోగతత్ప రుడై యుండవలెను.వైరాగ్యమును లెస్సగ నాశ్రయించవలెను(తీవ్రవైరాగ్యము గలిగి
యుండవలెను).అహంకారమును,దుష్ట కార్యములకుపయోగించు బలమును (లేక బలాభిమానమును)దర్పమును,కామము
ను,క్రోధమును,పరి గ్రహమును బాగుగ వద లివేయవలెను.మమకారమును పోగొట్టు
కొనవలెను.శాంతచిత్తు డై యుండవలె..ఇంద్రియ మనంబులను ఏ ప్రకారము నిగ్రహించ వలెను.ధైర్యముతో.బ్రహ్మప్రాప్తికి(మోక్షమున
కు) ఎవడు అర్హుడు పైన దెల్పిన సుగుణ ములుకలవాడు (అతడెవడై నను సరియే). మందవైరాగ్యము గల ముముక్షువులను
సంసారసాగరమున ఆశయను మొసలి గట్టిగ కంఠము పట్టు కొని శీఘ్రముగ ముంచి వైచుచున్నది.
[1/21, 4:51 AM]
అంతా నావల్లే జరుగుతుంది,అంతా నేనే అని అతి చేయడం వల్ల ఎన్నో తప్పులు వచ్చే అవకాశం లేకపోలేదు.స్నేహితులు కూడా
శత్రు వుల్లా మారిపోయే ప్రమాదం ఉంది.అందరూ కలసి సాగితే హాయిగా, సుఖంగా ఉంటుంది......  
   మనది కాని రోజున మౌనంగా ఉండాలి, మనదైన రోజున వినయంగా ఉండాలి.
  ఏ రోజైనా ఆనందంగా ఉండాలి అందరూ.    
"నీ స్నేహితుడు కుబేరుడై తే సహాయం ఆశిం చకు.నీ మనసుతెలుసుకునేఅవకాశంఇవ్వు. నీ మిత్రు డు కుచేలుడై తే మనసు
తెలుసుకు ని సహాయం చెయ్యి.అడగలేదని ఆగిపోకు."   
"హద్దు లకు మించిన ఆశలు ఉన్నట్లయితే
శక్తికి మించిన కష్టా లు పడాల్సి ఉంటుంది."
నీకు ఎన్నికష్టా లున్న నలుగురిలో ఉన్నప్పు డు నవ్వుతూ ఉండాలి..పది మందిలో ఉన్న ప్పుడు పలకరించుకుంటు పోవాలి..
ఎందుకంటే నిన్ను చూసి కష్టం కనికరించదు. సమాజం సొల్యుషన్ ఇవ్వదు..ఎవరికీ అన్యాయం చేయకపోవటం,చేసిన మేలు
మరువకపోవటం,అడగకుండానే పక్క వాడి భాదను అర్ధం చేసుకొని సహాయం చెయ్య డం..ఇవన్నీ ప్రతి మనిషి దగ్గర సహజ గుణా
లుగా ఉండాలి..ఈ గుణాలే మనిషిని దైవ త్వానికి దగ్గరగా తీసుకువెళ్ళగలుగుతాయి.
🌷🌷🌷🌷
నటించేవాడు ఎన్ని వేషాలైనా వేస్తా డు....,
ఎన్ని మోసాలైనా చేస్తా డు,వినేవాడు ఉండాలే కానీ....మాటలు వరదలా వస్తా యి అబద్ధా ల రూపంలో...తప్పులు చేసేవాడే,
వాళ్ళ తప్పులు బయటపడకుండా ఉండ టానికి,ఏదో ఒక సమస్యని సృష్టించి, దాని చుట్టూ అలజడిని సృష్టిస్తా రు....
ఇతరుల నుండి.. సమాచారాన్ని... తీసుకో..
సలహాలను కాదు...
ఈ ప్రపంచాన్ని చూసి మోసపోకు, నువ్వు చూసేది వినేది,ఇతరులు నీతో మాట్లా డేది,
ఏదీ నిజంకాదు.కేవలం నీవుమాత్రమే నిజం.
నోరు ఉంటే రాజ్యం,నోటుఉంటే సామ్రాజ్యం, కానీ,తెలివి ఉంటేనే ప్రపంచం..
మంచివారితో మంచిగా ఉండండి.,చెడ్డ వారితో చెడుగా ఉండండి.ఎందుకంటే
వజ్రాన్ని వజ్రంతో కోయవచ్చు కానీ బురదని బురదతో కడగలేము......
ఇతరులకు మంచి చేసే ప్రతి మనిషి దేవుడే.
అందరి మంచి కోరుకునే మనసున్న ప్రతి మనిషి మనస్సు దేవాలయమే.
నీటిలో పడ్డ ఉప్పు నీటిగా మారుతుంది.
నిప్పులో పడ్డ ఉప్పు చిటపటలాడుతుంది.
నచ్చినవారితో స్నేహం నీటిలో ఉప్పయితే, నచ్చని వారితో స్నేహం నిప్పులో పడ్డఉప్పు.
💚
       
సముద్రపు గాలి మన శరీరానికి మంచిదేనా.....
సముద్రపు గాలి మన శరీరానికి మంచిదే... సముద్ర తీరపు వాతావరణం మన శరీరం లోని శ్వాసావయవాలకు,చర్మానికి మేలు
చేస్తుంది.రక్త ప్రసరణాన్ని అభివృద్ధి పరచడ మే కాకుండా,దేహానికి కావలసిన రోగ నిరో ధక శక్తిని పెంపొందిస్తుంది.ఆస్తమా,చర్మ
సంబంధిత అలర్జీలు,సమస్యలు ఉన్నవారికి సముద్రపుగాలి సోకాలి....వేసవిలో వీచే సముద్రపు గాలిలో నీటి ఆవిరి శాతం ఎక్కు వగా
ఉండడంతో శరీరంపై చెమట పోసి అసౌకర్యానికి గురి చేసినా,ఆ గాలుల్లో కాలు ష్యం లేనందున మిగతా కాలాల్లో శ్వాసకోశ
వ్యాధులున్న వారికి అనుకూలంగా ఉంటా యి.ఆ గాలుల్లో ఉప్పుతో కూడిన అతి చిన్న సముద్రపు నీటి కణాలు,అయోడిన్‌,మెగ్నీ
షియంలాంటి మూలకాలు ఉండడం వల్ల ఇవి మన శ్వాస సంబంధిత మార్గాల్లో శ్లేష్మం చేరకుండా ఉంచుతుంది.....
         ♥️
చెంపలపై జారుతూ.. ఓ కన్నీటి చుక్క.. మాటని అడిగిందిట..
నువ్వు రావాల్సిన సమయంలో నన్నెందుకు బయటకి పంపావని.....
అప్పుడు 'మాట' చెప్పిందట...కన్నీటితో నువ్వు బయటపడితే... మనసు తేలిక పడుతుంది...
అదే నేను పెదవి దాటితే ..ఎదుటివారి మనసు గాయపడుతుంది
❤️
        
క్షార సముద్రమునందు క్షారములు (Alkaloids) హెచ్చుగా లభించును.ఇక్షు సముద్రము చెరకు రసము వలె ఉండును. సురా
సముద్రము కల్లు వలె ఉండును.ఆజ్య సముద్రము నేతి వలె ఉండును.క్షీరసము ద్రము పాలవలె ఉండును.దధి సముద్రము
మంచుకరళ్ళతో తోడుబెట్టిన పెరుగువలె ఉండును.జలసముద్రము నీళ్ళతో నిండి యుండును.ఇది మనము ఎరిగిన భూమిపై 
ఉన్న సముద్రములు.మిగిలినవి భూమిపొర లలో రెండేసి పొరల నడుమ విడదీయ నట్లుండును.
దీనిని బట్టియే మన దేహముయందలి సప్త ధాతువులును,వాని నడుమ వర్తించు ఏడు విధములైన స్రావములును (Seven
humours)ఏర్పడివర్తించును.అందు లవణ సముద్రమువంటివి దక్షిణధ్రు వమైన మూలా ధార భాగమున ఏర్పడునట్టి మూత్రాది
ద్రు వములు.ఇక్షు సముద్రము వలన నాలు కకు రుచి తెలియునట్టి లాలాజలాదులు వర్తించును.సురాసముద్రము వలన మణి
పూరక చక్రమునందలి కల్లు సముద్రము లేక రాగద్వేషాదులైన అవేశములకు,చెమట మున్నగు వానికి స్థా నమేర్పడును.ఇచ్చట
వర్తించుచున్న శక్తినే 'శ్రీ విద్య'లో 'మదద్రవ' అను దేవతగా అర్చింతురు‌.ఆమె కల్లు సముద్రము నడుమ మణిద్వీపమునందు ఎర్రని
చుక్కలు గల చీర ధరించి భక్తు లను అనుగ్రహించునని వర్ణింపబడినది.ఆమె గృహము చింతామణులతో చేయబడినది. అనగా వివిధ
చింతనములు ఆశాపాశము లుగను,రాగద్వేషములుగను గూడుకట్టు కొని ఉండును.
నేతి సముద్రము అనగా మేధస్సు అనబడు మెదడులోని చమురు పదార్థము మరియు శుక్రధాతువు‌.దీనిని సంరక్షించుకొనుటకే
వేదాధ్యయనము,యజ్ఞ కర్మ.అందు నిత్యం  నేతితో హోమము చేయుచుండవలెను. అనగా స్వచ్ఛమైన నేతిని ఆహారమునందు
నిత్యపదార్థములలోఒకటిగా సేవించుచున్న పుడే బ్రహ్మ వర్చస్సు అనబడు వేదము- వెలుగు భాసించును.
క్షీరసముద్రము మనలోని ఆపేక్షలకు కారణ మైన ద్రవము.దీని వలన మొట్టమొదట తల్లి బిడ్డ నడుమ ఆపేక్ష ఏర్పడును‌.దీనికి
క్షీరగ్రంథులు కేంద్రములు కనుకనే తల్లి బిడ్డ కు పాలు ఇచ్చుట దేహధారులలో సహజం దధి సముద్రము అనగా పులిసిన సముద్ర
ము, కరడుగట్టినది.దీని‌వలన ఆహరమును పచనము చేయు ఆమ్లములు జీర్ణకోశమున వర్తించును‌జల సముద్రము అనగా దేహ
మందు రక్తా దులకు మాతృకయైన రస ధాతువు లేక జలము.........
🖤
      
మీలో ఉండే అజ్ఞానం,అహంభావాల వైపు చూడనంత కాలం భగవంతునివైపుచూసినా పెద్ద ప్రయెాజనం లేదు.అసలు అది ప్రార్థన
కానే కాదు.కేవలం ఒక ఏక పాత్రాభినయం మాత్రమే.మీ మనసులోని మాలిన్యాన్ని తొలగించుకోకుండా ఎన్ని పూజలు,వ్రతాలు,
తీర్థయాత్రలు చేసినా ఏమి ప్రయెాజనం!? అవన్నీ వృథాగాపోవాల్సిందే.మీ‌మీ మనసు లోని భావాలను శుధ్ధి చేసుకుంటే తప్ప‌మీరు
భగవంతుని అనుగ్రహం పొందుటకు వీలుపడదు.....
💜🌷💙
        
శరీరం కేవలం గూడు.అది ఆత్మకు ఆవాసం మాత్రమే..!
మానవజన్మ కర్మబద్ధం.కనుక ప్రపంచంలో కర్మనిష్ఠతో ఉండాలి.కానీ అంతరంగంలో బ్రహ్మనిష్ఠలో ఉండాలి.ఇదే మానవ జన్మ కున్న
విశిష్టత.సమ్యక్‌దృష్టితో ప్రాపంచిక కర్తవ్యాలు నిర్వర్తించాలి.మేను మాత్రమే నేనుకాదు.ఉన్నది ఒక్క నేనే.మూడు అవస్థ లలో వున్న
నేను అనేచైతన్యమే.హృదయం వెన్న వలె ఉండాలి. కాఠిన్యంతో కాకుండా.. కారుణ్య హృదయంతో ప్రపంచంలో సంచ
రించాలి.సిద్ధాంత రాద్ధాంతాలు,వాదోప వాదాలు లేకుండా మనీషతో వుండాలి. మనీష అంటే స్థిరప్రజ్ఞ,స్థిమిత బుద్ధి.ఇది కాదు,ఇది
కాదంటూ మనసును ఖాళీ చేసు కుంటూ పూర్ణ చైతన్యంతోప్రవర్తించాలి. శాస్త్రా ధ్యయనంతో మనసును పరిమళ భరితం
చేసి,స్వాదువుగా తీర్చిదిద్దు కోవాలి. జడాత్మక దేహం అనుభవించే ఏ వికారమూ నీది కాదు.ఎరుకతో ఉండాలి.
దేనికీ అంటక,దేనినీ అంటించు కొనక కాంతి కటకం వలె,తామరపత్రం మీద నీటి బిందు వువలె,తెరమీద బొమ్మవలె ఉండాలి.అంతా
బ్రహ్మమే అనుకో గలగటమే అసలైన ముక్తి!!
❣️
         
“ `నఖశిఖ పర్యంతరం ఉన్న శరీరంమాత్రమే నేను’ అనీ `నా తల్లిదండ్రు లు పేర్లు ఫలానా; అనీ, భావించేవారు కేవలం
మానవులుగానే పరిగణింపబడతారు....నేను ఆత్మను .. పూర్ణాత్మ నుంచి భూమిపైకి వచ్చిన అంశా త్మను’ అని గ్రహించగలిగిన వారే
నారాయణులు....”
“ఒకానొక రైలులో మనం హై దరాబాద్ నుంచి గుంటూరు వరకు ప్రయాణం చేసి, గుంటూరులో దిగినంత మాత్రాన రైలు మన తల్లి
కాజాలదు..మరి మనం రైలుకు జన్మిం చినట్లు కాదు...అది ఒక సాధనం మాత్రమే.
అలాగే ప్రాపంచిక తల్లి గర్భంలో కొంతకాలం ఉండి భూమిమీదకి ప్రవేశించినంత మాత్రాన `ఆమె కుమారులం’ అనడం కుదరదు......
పిల్లవాడు వచ్చి `నీ తల్లి... నిన్ను ఇంటికి రమ్మన్నది’ అన్నప్పుడు ఎవరు నా తల్లి? ఎవరు నాతండ్రి? నీకైనా,నాకయినా కని పెంచిన
వాళ్ళు తల్లిదండ్రు లు కారు.మనం శ్రీనివాసుని కుమారులం మరి నువ్వు కూడా శ్రీనివాసుని కుమారుడివే....’
“తల్లి ఎవరు? తండ్రి ఎవరు? తాత ఎవరు? ముత్తా త ఎవరు? నువ్వు ఎవరు?మనమందరం ఆత్మ స్వరూపులం......
మహాకారణ లోకాలలో ఉన్న పూర్ణాత్మ నుంచి జన్మించిన అంశాత్మలం మనం”
“ఇక్కడ బంధాలూ,అనుబంధాలూ తాత్కా లిక నాటకాలు,మనం వచ్చింది పై లోకాల నుంచి! మన శాశ్వత స్థిర నివాసం పైలోకమే
తప్ప ఈ లోకం కాదు.....వర్తమానంలో మనం ఉన్న లోకం మనకు ఒకానొక స్వల్ప కాలపు మజిలీ మాత్రమే”
“మన అసలు లోకం పై లోకమే.....”సత్యం మాత్రం ఒక్కటే...
స్వానుభవం అనేది అందరికీ ఒకే రకంగా ఉంటుందా......ఉండదు,ఉంటుంది.రెండు సమాధానాలు కరెక్టే. 'ఆత్మ' వరకు తీసు కుంటే
ఒకటే.,'ఆత్మ'ను దాటితే వేరు, వేరు.
బ్రహ్మ విద్య కు అర్హత ఏమి....
తనకు నామరూపములున్నాయి అనుకునే ప్రతి ఒక్కడూ అర్హుడే.....
💙
        
ఆగ్ర్యమ్య బుద్ధి అంటే అగ్రస్థితిలో వున్నటు వంటి బుద్ధి.మనం ఇప్పటి వరకూ మాట్లా డు కున్న అంశాలను స్పష్టంగా ఇక్కడ చెబుతు
న్నారు.మీ ఇంట్లో ఒక వజ్రం ఉందనుకోండి. ఆ వజ్రాన్ని ఎక్కడ పెడుతారు సాధారణం గా? మీ వంటింట్లో ఉన్నటువంటి కప్పులు,
సాసర్లు ,బిందెలు,గిన్నెలు...అక్కడ వెతికారు అనుకోండి,ఆ వజ్రం కనబడుతోందా? సాధా రణంగా ఈ వజ్రమంత విలువైన దానిని
ఎక్కడ పెడుతాము?ఎక్కడో ఒక చోట భద్ర మైనటువంటి స్థితిలో పెడుతాము. భద్రమైనటువంటి స్థా నంలో పెడుతాము. ఎందుకని?
చాలా విలువైనది కాబట్టి.మరి వాటిని సామాన్యంగా మనం వెతికితే,ఇంట్లో ఉన్న వస్తు వులన్నీ నేల మీద పడవేసి వెతి కితే అది
కనపడుతుందా అంటే,ఆ వస్తు వు లన్నిటిలో కలిసిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది.
అట్లా గే మనలో భద్రమైనటువంటి స్థా నంలో, భద్రమైనటువంటి స్థితిలో స్వస్వరూప జ్ఞాన మున్నది,స్వప్రకాశంకూడాఉన్నది.అదేఆత్మ.
బుద్ధి గుహ యందు ఉన్నటువంటి హృద యాకాశ స్థా నములో,నిరంతరాయంగా వెలుగుతూ ఉన్నటువంటి,స్వప్రకాశము ఏదైతే
ఉన్నదో అది ఆత్మ.ఇదిభద్రంగాఉంది. అతి సూక్ష్మంగా ఉంది,గుహ్యంగా ఉంది, రహస్యంగాఉంది,భద్రమైన స్థితిలో వుంది, భద్రమైన
స్థా నంలో ఉంది.
    ఒక్కొక్కదానిని విరమించుకుంటూ, ఒక్కొక్క దానియందున్న సంగత్వాన్ని పోగొ ట్టు కుంటూ,ఆసక్తు లను పోగొట్టు కొంటూ,
ప్రవృత్తి మార్గం నుండి నివృత్తి మార్గంలోకి మరలడం ద్వారా,మనస్సును మరలించ డం ద్వారా,నీ మనస్సు సదా గిన్నెలచుట్టూ, సదా
విషయముల చుట్టూ,సదా తినే పదా ర్థముల చుట్టూ,సదా భోగించేటటువంటి లక్షణాల చుట్టూ,మనస్సు పనిచేస్తూ ఉన్న ప్పుడు,ఏ
బట్టలు కట్టు కుందాం? ఏ భోజనం చేద్దాం? ఏ రకంగా సుఖాన్ని పొందుదాం? ఏ రకంగా విశ్రాంతి తీసుకుందాం? ఏ రకంగా
అలంకారం చేద్దాం? ఈ రకంగా బాహ్యమైన టువంటి విషయాల చుట్టూ,బాహ్యమైనటు వంటి వస్తు వుల చుట్టూ,మనస్సు
పనిచేస్తూ ఉంటే,బుద్ధి కూడా మనసును అనుసరించి, నిర్ణయాలుచేస్తూఉంటుంది బాహ్యముగానే.
ఏ నివృత్తి మార్గానికి,స్వస్వరూప ఆత్మజ్ఞానా నికి, ఉపయోగపడవలసినటువంటి బుద్ధి ఉన్నదో,దానిని బాహ్యమైనటువంటి విష
యాల కొరకు,బాహ్యమైనటుంవంటి వస్తు జ్ఞానముకొరకు,వ్యవహార నిర్ణయముకొరకు, వాడుకోవడం ఎటువంటిదంటే,కంట్లో ఆప
రేషన్‌చేయడానికి ఉపయోగించ వలసి నటువంటి కత్తిని,కూరగాయలు కోయడానికి ఉపయోగించ రాదా? అంటే,అది కూడా కత్తే,
కోయడానికి ఉపయోగ పడుతుందా? పడదా? పడుతుంది.కానీ,ఒకసారి కూరగా యలు కోస్తే మరల కంట్లో ఆపరేషన్స్‌చేయ డానికి
ఉపయోగపడదు.ఇప్పుడు మన బుద్ధి ఇలాగే తయారైంది.
   బుద్ధి నివృత్తి మార్గం ద్వారా స్వస్వరూప ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్నిపొందటానికి ఉప యోగపడవలసిన సూక్ష్మమైనటువంటి
ఇంద్రియం.అది ఎంత సూక్ష్మమైనది అంటే, సూర్యకిరణాలను కూడా నిలువుగా ఛేదించ గలిగేటటువంటి సమర్థత కలిగినంత సూక్ష్మ
మైనటువంటి ఇంద్రియం.దానిని ఇప్పుడు మనము బిందెల చుట్టు ,కడవల చుట్టు , భౌతికమైన,స్థూలమైనటువంటి విషయాల
చుట్టూ,వస్తు వుల చుట్టూ తిప్పుతున్నాము.
   ఈ రకమైనటువంటి అభ్యాసదోషం చేత మన బుద్ధి స్థూలతని సంతరించుకుంది.తన సూక్ష్మతను పోగొట్టు కుంది.ఇప్పుడు పునః
ఏం చేయాలట? దానిని వెనక్కుతిప్పుకుని, మనస్సును విరమింపచేసి,బుద్ధినివిరమింప చేసి,దానికి మూలమైనటువంటి,కారణమైన
టువంటి,మహతత్వము నందు,అవ్యక్తము నందు దానిని స్థిరపరచి బుద్ధి గుహయందు విచారణ చేసి,దృష్టి నిలిపి,హృదయాకాశ
ము నందు సదా ప్రకాశిస్తు న్నటువంటి,ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని మానవులు పొందాలి. అలా ఎవరైతే పొందుతారో వాళ్ళకి,ఆ సాక్షా
త్కార జ్ఞానం,ఆ జన్మపర్యంతం అంటే,జనన మరణాలను దాటటానికి అదే సోపానము గా పనికి వస్తుంది.అదే అవకాశంగా పనికి
వస్తుంది.ఈ జనన మరణ చక్రంలో నుంచి బయటపడగలుగుతాడు.కర్మబంధాలలో నుంచి బయటపడగలుగుతాడు.మోహంలో
నుంచి బయటపడగలుగుతాడు.
ఆ ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి ఎంతో విశేష మైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. మానవ జన్మని ధన్యత చెందించగల సర్వసమర్థమై
నటువంటి సాధన ఏదైనా ఒకటిఉందిఅంటే, అది ఆత్మవిచారణ,ఆత్మసాక్షాత్కార జ్ఞానం.
❣️
         
ఆశ లేనివాడును,చిత్త నిర్వహణము కల వాడును,ఏ వస్తు వును పరిగ్రహింపనివాడు ను చేయు కర్మనుండి ఎట్టి పాపము (మలి
నము) పుట్టదు అని యర్థము.... సంకల్పము,కోరిక లేకుండుటను గూర్చి దైవము తెలిపినాడు.నిత్యతృప్తి,నిరాశ్రయ
త,కర్మఫలసంగ త్యాగము తెలిపినాడు.ఈ శ్లోకమున ఆశ లేకుండుట,అపరిగ్రహము, చిత్త నిగ్రహము తెలిపినాడు.ఆశ లేనివానికి
చిత్తము పలువిధముల పరుగులెత్తదు.ఆశ, కోరిక లేక తృప్తిగ జీవించువానికి,చిత్తము స్థిరపడి సంకల్పములు లేని స్థితి కూడ
కలుగును.దీనికి అపరిగ్రహము తోడై నచో చిత్తము లోతుగ స్థిరపడును.ఈ శ్లోకము చేరుసరికి చిత్తమునకు ఏడు గుణములబ్బు
ను.అవి ఈ విధముగ నున్నవి.
కోరికలేమి,నిస్సంకల్పము,కర్మఫల సంగ త్యాగము,నిత్యతృప్తి,నిరాశ్రయత,నిరాశ, అపరిగ్రహము.ఈ ఏడు గుణము లబ్బినచో
నిగ్రహింపబడిన చిత్తముగలవాడై యుండు ను. అట్టివాడు నిర్వర్తించు కర్మల నుండి బంధనము పుట్టదు.
💞
       
శ్రీకృష్ణుని నగరమైన ద్వారాపట్టణంలోనే గోవుల పరిస్థితి పరమదారుణంగా ఉంది! ద్వారకా పట్టణం,కృష్ణపూజ,గోపూజ,కృష్ణా ష్టమి
అని ఏవేవో పండుగలు చేసుకుంటాం, మనం వండుకుని తినడానికి! పిండివంటలు వండుకోవటానికే మనం ఈ పండుగలు
చేసుంకుంటున్నామా అనిపిస్తుంది.
కనీసం కృష్ణాష్టమి నాడై నా మనం గోవుల ను స్మరిస్తు న్నామా? ధర్మాన్ని ఆచరిస్తు న్నా మా? ఎంత భ్రష్టత్వం వచ్చిందంటే,ఇంతక న్నా
దుఃఖం ఏమీలేదు.
ఎంతో అజ్ఞానం,ఎంతో నిస్పృహ,జడత్వం, మొండితనం ఉంటే తప్ప అవి చూడలేము. చూచి తట్టు కోలేము.జీవనోపాధికోసమేనా
ఇటువంటి భయంకరమైన పాపాలుచేయ టం! కోటానుకోట్ల జీవరాశులను కేవలం చంపటానికై పుట్టిస్తు న్నారు.చేపలనో,కోళ్ళ నో,
పశువులనో–చంపటంకోసమే నేడు పుట్టిస్తు న్నారు.
సహజంగా జీవకోటి ఎంతఉందో,ఆ ఉన్న వాటిలో,తమకు అవసరమైనంత వరకు, దొరికినంత మటుకు చంపటంకాదు.వాటిని
వ్యాపారం కోసం పుట్టించి చంపటమే ఘోర మయిన విషయం!అయితే ఎందుకు ఇదం తా చెయడం,దేనికోసం అంటే ధనం కోసమే!
అమితమైన భోజనం ఉన్నవాళ్ళే వీళ్ళంద రూ.వీళ్ళకు అన్నవస్త్రా దులకు లోటులేదు. దారిద్య్రం లేదు.జీవనం సుఖంగా ఉంది.
సిరిసంపదలు ఉన్నవి.కాని ధన దాహం!
లోపల భారతీయుడి మనస్సులో కాస్తయి నా ఆర్యధర్మం మిగిలి ఉంటే,ఈ ఘోరమ యిన పాపమ్యొక్క ఫలం ఎలా ఉంటుందో
గ్రహించగలడు. కానీ లోపల ఉండవల్సిన ఆ ధార్మికబుద్ధి,ఆ జ్ఞానమూ ఎందుకు పోయిం ది? ఈ ధనాశ –ధనపిశాచం ఎప్పుడయితే
వచ్చిందో, ధర్మం హరించుకు పోయింది.
పిశాచాలు ఉన్నచోట దేవతలు ఉంటారా? ఆ ధనపిశాచం లోపలికిరాగానే హృదయం లో ఉన్న దివ్యత్వం,ఆర్యసంస్కృతి,ఋషు లు
అంతా ఎక్కడికో పోతారు.కాబట్టే ఈ దౌర్భల్యం ఏర్పడింది.ఈనాడు మన దేశ పరి స్థితులు ఇలా ఉండటానికి కారణం అదే!
పాపం పెరిగిపోయిన తరువాత నిదర్శనం ఏముంటుంది?కొంచెం పుణ్యం,కొంచెంపాపం తో ఉండేవాడు;కొంచెం పాపంచేసినట్లయితే,
“ఈ పాపం చేస్తు న్నావు జాగ్రత్త!”అనిస్వప్నం లో ఎవరో కనబడి చెప్పటం జరుగుతుంది. పూర్తిగా పాపంలో ఉండే వాడికి ఎవరూ
కనబడరు.కాబట్టి పుణ్యపాపమిశ్రమ జీవ నంలో, పుణ్యంమీద శ్రద్ధ ఉండేవాడికి పాప క్షయం అయ్యే అవకాశం ఉంది.ఈ కారణం
చేత నేడు మన దేశంలో ఏ క్షణానఏమౌతుం దో ఎవరికీ తెలియని స్థితి వచ్చింది.
💘
           
అంతర్ముఖ చైతన్య ప్రగతిలో,ఒకటవ భూమికనుండి ఆరవభూమిక వరకు క్రమ క్రమముగా వివిధమైన భిన్నసంస్కారములు
నామాత్రా విశిష్టమై (ఇంకా అసలు సంస్కా రములే లేవు అన్నంతవరకు) పూర్తిగా క్షీణించి పోయినవి.కానీ ద్వంద్వ సంస్కార
అవశేషముల చూఛాయ "జాడ" మాత్రము మిగిలియున్నది.ఇచ్చట మానవునిలోనున్న భగవంతుడు మనస్సుతో తాదాత్మ్యమును
చెంది "నేను మనస్సు" ననెడి అనుభవము ను పొందు చుండును.
ఆరవ చైతన్య భూమికలో మానవుని స్థితి లో నున్న మానసిక చైతన్యుడై న భగవంతు డు, భగవంతుని ముఖాముఖీ సుస్పష్టము గా
చూడగలిగి నప్పటికీ భగవంతుని సమస్తములో సర్వత్రా చూచుచున్నప్పటికీ, తానింకను మానసిక చైతన్యమందు హత్తు కు
పోయి,మనస్సే తాను,తానే,-మనస్సు అన్నట్టి స్థితి యండుండుటచేత;తనను భగవంతునిలో చూడలేకున్నాడు.ఇతడు భౌతిక
సూక్ష్మ లోకములందలి వస్తు వులను కూడా చూడగల్గును.ఇంకను ద్వైతము నందే,ఎరుక కలవాడై యున్నాడు.తాను
"మనస్సు"గా,భగవంతుని నుండి వేరగు చున్నాడు.
Mystics in every religion speak the same tongue and teach the same truth.
ప్రతీ మతంలో ఉన్న ప్రవక్తలు ఒకే సత్యాన్ని భోధిస్తా రు.
If you have assimilated five ideas, and made them your life and character, you have more education than
any man who has got by heart a whole library.
జాగృతి
స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు
ఐదు అత్యుత్తమ భావాలను సరిగా అర్థం చేసుకుని,ఆచరిస్తూ వాటితో నిత్య జీవితా న్ని మలచుకుంటే,మొత్తం గ్రంథాలయాన్నే
కంఠస్థం చేసినవారి కన్నా,మీరు ఎక్కువ విద్యావంతులు.
        🖤
నీవు రోదనం చేస్తూ పుట్టా వు కాబట్టి నీపేరు రుద్రు డు. నీవు ఉండడానికి 11 స్థా నములు ఏర్పరిచితిని.
స్థా నములు:-సూర్యుడు.చంద్రు డు,అగ్ని,
వాయువు,జలము,ఆకాశము,పృథ్వి,ప్రాణ ము,తపస్సు,హృదయము,ఇంద్రియములు.
భూమిలో వేడి ఎక్కువైనా,జలములు అల్ల కల్లోలమైనా,రుద్రు డిని తలుచుకుంటే ఇలాంటిఆపదలుఉండవు.సూర్యునియందు
చక్కని ప్రకాశమునకు,చంద్రు ని యందు చక్కని వెన్నెలకు రుద్రు డే కారణము.చంద్రు ని ద్వారా germination,fertilization
nourishments,రుద్రు డు చేస్తా డు.
          💚
విశ్వాసము,శరణాగతి మార్గంలో నేను అనే భావన చాలా పెద్దఅవరోధంగా నిలుస్తుంది..
ఆత్మావలోకనం దేనిని సూచిస్తుంది? ప్రాథమికంగా చూస్తే మన బాహ్యపరిసరాలు బాహ్యదృశ్యాల గురించిన ఎరుక కలిగి ఉండటం
అని అర్థం. అయితే మనుష్యులు, విషయాలు,సంఘటనలు,వస్తు వులు ఇవన్నీ కొద్దిపాటి ప్రాముఖ్యతనే కలిగి ఉంటాయి. వాటికి
ప్రథమ స్థా నం ఇవ్వరాదు.
ఒక పనివాడు దృష్టిని లగ్నం చేసి ఉంచ వలసిన ముఖ్య విషయం ఏమిటి? అతడు నిర్వర్తించవలసిన పని.ఒక విద్యార్థి మన స్సును
లగ్నం చేయవలసిన ముఖ్యాంశం ఏమిటి?అతని విద్యాభ్యాసం.అవిగాక వారు వేరే విషయాలపై మనస్సు లగ్నం చేస్తే అది వారి
విజయానికి ఆటంకం అవుతుంది.అదే విధంగా అంతా మనచేతుల్లోనే ఉంది.అన్న భావన జీవితంలో ఎల్లవేళలా అవరోధమే.
❤️
           
"శుద్ధమనసు,ఆత్మ ఒకటే అంటారుగా మరి మనసు, ఆత్మకు ఎందుకు భిన్నమైంది !?"
నింజానికి మనసు ఆత్మస్వరూపమేఅయినా తాను చేసే యోచన చేతనే తనకు తాను భిన్నమైంది. శరీరానికి కలిగిన వ్యాధి వల్ల
మనసుకు బాధ తెలుస్తుంది.మందు వేసు కుంటే శరీరంలో వ్యాధి పోతుంది. కనుక బాధ పోతుంది.ధ్యాస మారిస్తే మన సుకు కలిగే
బాధ పోతుంది.ఎంతో వేదన పడుతూ ఆస్పత్రు లకు వెళ్ళినవాళ్ళు కూడా రిసెప్షన్ కౌంటర్ వద్ద ఏర్పాటు చేసిన టీవీల్లో లీనమై తమ
బాధను తాత్కాలికంగా మర్చి పోతు న్నారు. 'ఓం నమశ్శివాయ'అనే స్మరణ మనకు తెలుస్తుంది కదా !అదే ఆత్మ.కానీ ఆస్మరణ
యోచనతో ఉండటం వల్ల ఆ విషయం మనకు అనుభవంలోకి రావట్లేదు !
          💙
మనలోనే, మనతోనే ఉన్న ఆనందాన్ని గుర్తించాలి !
చైతన్యమంటే ఆత్మవ్యక్తీకరణ.సర్వత్రానిండి ఉన్న ఆత్మ అనుభవంగా మారేందుకు జరిగే వ్యక్తీకరణమేచైతన్యం.ఆనందస్వరూపమైన
ఆత్మ అర్థమైన రోజు దాని ప్రతివ్యక్తీకరణ చైతన్యంగానే గోచరమౌతుందిగానీ భిన్న కార్యాలుగా కాదు.భిన్నభావాలకు,విభిన్న
కార్యాలకు మూలం చైతన్య స్వరూపమైన ఆత్మ అని అర్థమైతే.. బ్రహ్మస్థితిలో ఉండ వచ్చు.అందుకు మనకు అందుబాటులో ఉన్న
సాధనామార్గం ఏమిటంటే..మనలోనే, మనతోనే ఉన్న ఆనందాన్ని గుర్తించడం, అర్థంచేసుకోవడం,సదా ఆస్థితిని కొనసాగించే
ప్రయత్నం చేయడం !
        💓
సాధన చేస్తే ఈ భూమ్మీద ఏదైనా సాధించ వచ్చును అంటారు.నిజమే.కాని ఏ సాధన చేస్తు న్నాం? ఎవరి ఆధ్వర్యంలో చేస్తు న్నాం,
ఎలా చేస్తు న్నాం,ఏయే నియమాలు పాటి స్తు న్నాం, అన్నీ సరిగ్గా ఉన్నాయా,శాస్త్రీయ పద్ధతిలో సాధన సాగుతోందా లేదా అని మనల్ని
మనం పరీక్షించుకోవాలి.
సాధన అంత సులభంకాదు.సాధనలో వచ్చే అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు.ఒక లౌకికమైన విషయం సాధించడానికి చాలా కష్టపడాలి.
అలాంటిది అలౌకిక సాధనలకు ఎంత ఏకా గ్రత,పట్టు దల,అంకితభావం,దీక్ష ఉండాలి ?
పుస్తకాల్లో చదివినప్పుడు అవి చేతికి అంది నట్లు గానేఉంటాయి.ఆ సూత్రాలనుపాటించి నప్పుడు,ఆ నియమాలను ఆచరించినప్పు
డు సాధకుల గొప్పతనం బోధపడుతుంది.
ఋషులు ఎంతో గొప్ప కృషిచేసి,సాధన చేసి లోకానికి అందించారు.వీటిని ఆచరణ లోకి తీసుకురావడమన్నది సాదాసీదావ్యక్తు లకు
అయ్యే పని కాదు.చంచల మనస్కులకు అసలు సాధ్యం కాదు.నేను-నాదిఅనే అహం కారులకు అసలే అంతుచిక్కదు.
సాధన చెయ్యాలనే కోరిక కలగడం కూడా పూర్వజన్మ సుకృతమేనంటారు.పట్టు విడ వకుండా దాన్ని కొనసాగించడం పురుష
ప్రయత్నం. దానికి దైవానుగ్రహం తోడవ్వాలి.
సాధనలో లోపాలు నాచుమీద నడకలా వెనక్కి లాగేస్తుంటాయి.చిల్లికుండతో నీళ్లు తెచ్చిన చందంలా ఎంతో చేస్తే,ఇంతేనా అని
అనిపిస్తుంటాయి.
సరైన గురు సన్నిధిలో వినయ విధేయత లతో, నిజాయతీగా,నిరాడంబరతతో నేర్చు కోవాలనే తపనకలిగిన సాధకుడికి మాత్రమే
అనుకూలమవుతుంది సాధన అని చెబుతారు పెద్దలు.
ధ్యానం చేసే వ్యక్తికి ఏకాగ్రత కావాలి.ప్రార్థన చేసే వ్యక్తికి ఆర్తి కావాలి.జపం చేసే వ్యక్తికి భావం కావాలి. పూజ చేసే వ్యక్తికి విశ్వాసం
ఉండాలి.
సాధనను మనం నమ్మితే,సాధన మనల్ని నమ్ముతుంది.చేసిందే మళ్ళీమళ్ళీ పట్టు దల తో చేస్తుంటే,ఆ విషయంమీద పట్టు వస్తుంది.
నైపుణ్యం కలుగుతుంది.ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.దాని ఆత్మ పట్టు బడుతుంది. చివరికి సాధన మనకు మోకరిల్లు తుంది.
అర్జు నుడి సాధన అతణ్ని గొప్ప విలుకాడిగా మార్చింది.హనుమంతుడి రామనామ సాధన అతణ్ని గొప్పభక్తు డిగా తీర్చిదిద్దింది.
సాధన అనేది పురుష ప్రయత్నం మీద ఆధారపడి ఉంది....
సత్యం తెలుసుకోవడానికి మొదట సాధన చెయ్యాలి. తరవాత తెలుసుకున్న సత్యాన్ని నిలబెట్టు కోవడానికి సాధన చెయ్యాలి.....
మెట్టు మెట్టు ఎక్కి శిఖరాగ్రాన్ని చేరుకోవాలి. బొట్టు బొట్టు కలిస్తేనే సముద్రమవుతుంది. మనం చిత్తశుద్ధితో చేసింది ఏనాడూ పోదు.
క్రమం తప్పకుండా సాధన చేస్తే, లోపాలు వాటంతట అవే సరి అవుతాయి.
శాస్త్రం మీద,గురువు మీద,సాధన మీద నమ్మకం ఉన్నవారు విజేతలవుతారు. భావితరాలకు మార్గదర్శి అవుతారు. సాధ్యం కానిది
లేదని నిరూపిద్దాం !.
💛
       
సుఖములు అన్నియు సుఖము నందు ఎచ్చట లీనమైనవి? సుఖములు అను జ్ఞప్తి లేని స్థితియే ఆ సుఖము.ఇది బుద్ధికే
తెలియును. ఇంద్రియములకు అందదు. ఇంద్రియముల ద్వారమున సుఖపడుట అనగా ఇంద్రియములలో నుండి సుఖము అగు
స్మరణతో దిక్కులు చూచుట. సుఖ స్మరణము సుఖమునకు శవము వంటిది.
అట్టి స్థితిలో సాధకుడు దేనిని తెలుసుకొను చున్నాడు? తెలుసుకొనుట అను భావము కరిగిపోయిన స్థితియే అప్పటి తెలుసుకొను
ట. కనుక చలనము ఉండని 'తాను' అను తత్వమే అప్పటి అనుభూతి.
మనస్సునకు తెలిసికొనవలెనను కుతూ హలం సహజము.కనుకనే ఒక అంశమును తెలిసికొంటినను అభిప్రాయమును పొందిన
వెనుక మరియొక ఒక అంశము తెలిసికొన వలెనను చాంచల్యం ఉన్నది.యోగ స్థితిలో మనస్సు బుద్ధిలోనికి కరిగిపోయినది కనుక,
మరి తెలియవలసిన జ్ఞానము మిగలదు. పొందవలసిన భావము మిగలదు. "ఇంతకన్న గొప్పది" అను అభిప్రాయము నశించును.
కనుక ఇట్టి అనుభూతి కన్న గొప్పదేదియూ లేదు. అందున్న వానిని బలీయములైన దుఃఖ కారణములు కూడా కదిలించలేవు.
అట్టియోగమే దుఃఖసంయోగం,వియోగము అను వానికి అతీతము.అనగా సన్నివేశము లు జరుగుచున్నను వాని ప్రభావము లేదు.
కనుక అవియు వానియందు లేవు.అది వరకు సన్నివేశముల యందు వర్తించుచున్న చిత్తము బుద్ధి యందు నిశ్చేష్టమగును.
💞🌷
        
వేదములను బాగుగనెఱింగినవారియొక్క శాస్త్రోక్తములగు యజ్ఞదాన తపః క్రియలన్ని యు ఎల్లప్పుడును "ఓమ్” అనిచెప్పిన
పిమ్మటనే అనుష్టింప బడుచున్నవి.
‘ఓమ్, తత్, సత్' అను మూడు పదము లలోను మొదటిది యగు ‘ఓమ్’అను పదం యొక్క మహిమను వెల్లడించు చున్నారు.
పరబ్రహ్మముయొక్క వాచకము (నామము) అయి అతిపవిత్రమై,మహాశక్తివంతమై యలరుచుండుటచే వేదవేత్తలందఱును తాము
ప్రారంభించు యజ్ఞదానతపస్సులను క్రియలన్నిటియొక్క ఆదియందు ఎల్లప్పు డును ‘ఓమ్'అను ఆ ఏకాక్షర ప్రణవమంత్రం ను
ఉచ్చరించుచున్నారు.అట్లు చ్చరించిన పిదపయే ఆ యా క్రియలను వారు ఉపక్ర మించుదురు.(అట్లే ఆ యా క్రియలు సమాప్త మైన
వెనుకను మఱల 'ఓమ్’ అని (ఆ ప్రణ వమును) ఉచ్చరించుచుందురు).అట్లొనర్చు టవలన ఆ యా క్రియలలో ఏవైనలోపము లు,
దోషములు ఉన్నచో అన్నియు తన్మంత్ర ప్రభావమువలన భస్మీభూతములైపోవ ఆ కర్మలు పరిపూర్ణఫలముల నొసంగగలవు.
“సతతమ్” - (ఎల్లప్పుడును) అని చెప్పుట వలన అట్టి వేదవేత్తలు తామాచరించు ఆ యా యజ్ఞదానాది సత్క్రియల ప్రారంభ మున
ఎల్లప్పడును ఆ ప్రకారమే ప్రణవోచ్చా రణము చేయుదురని స్పష్టమగుచున్నది. ఇంజనువలన రైలు పెట్టెలన్నియు కదలు నట్లు ను,
ఒకటి యనుల సంఖ్యచే ప్రక్కన గల పూర్ణానుస్వారములు (సున్నలు) అన్ని యు శక్తివంతములగునట్లు ను,మొదటగల
ఓంకారముచే తక్కిన మంత్రములు,క్రియలు అన్నియు చైతన్యవంతములు,ప్రతిభావంత ములు అగును.
"ఓంకారము"యొక్క మహిమనుతెలుపుడు
వేదవేత్తలు తామాచరించు యజ్ఞ దాన తపః క్రియలకు మొదట ఎల్లప్పడును ఓంకారము ను ఉచ్చరించియే పిమ్మట ఆ యా క్రియల
ను చేయుచుందురు....
కాలం ఎప్పుడు ఒకే చోట ఆగదు.
అలాగే జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు.
💞
       
'నువ్వు చూస్తు న్న విశాల భూభాగమంతా నేను సంపాదించినదే. ఇదికాక నావద్ద అపారమైన ధనరాసులు, బంగారం, వెండి, రత్నాలు,
వజ్రాలు ఉన్నాయి'....'వీటిలో నీ వెంట తీసుకుపోగలవి ఒక్కటీ లేదు కదా...'
'వెంట తీసుకుపోగలవి ఏముంటాయి....'
'పుణ్యరాసులు.....'
చాలామంది పాపపుణ్యాల గురించి ప్రస్తా విస్తా రే తప్ప ఆచరణలో వాటిపట్ల శ్రద్ధ చూపరు.
పాపపుణ్యాల జాబితా చేత పుచ్చుకొని ఎవరూ మంచి చెడు పనులు చెయ్యలేరు.
కానీ, ఇతరులకు మేలు కలిగించేది మంచి, కీడు వాటిల్లజే నేది చెడు అనే స్పృహతో వ్యవహరించడం కష్టమేమీ కాదు.
గొప్పగొప్ప ఆధ్యాత్మిక విషయాలు మధురం గా బోధిస్తా రు. 'అహం' ఆధ్యాత్మిక శత్రు వు అన్నవాళ్లే, తమంత వారు తామే అనే ధోరణి
కన బరుస్తా రు.
ఆధ్యాత్మిక సందేశాలన్నీ మౌనం ద్వారానే లభిస్తా యి.
మౌనం అంటే మాట్లా డకపోవడం కాదు. మనసులోని ఆలోచనలు,అలజడులన్నీ ఒక్కోటిగా బయటకు నెట్టివేస్తూ అంతరంగ
వేదికను పరిశుభ్రం చేసుకోవడం.
అప్పుడు అంతరంగం పూజా మందిరంగా మారిపోతుంది.అంతర్యామి దరహాసం చిందిస్తూ ప్రత్యక్ష మవుతాడు.కళ్లు మూసు కోగానే
మనం అంతర్యామి సన్నిధిలో ఉన్న అనుభూతి కలుగుతుంది.మనసు ధ్యానం లో స్థిరపడుతుంది.ధ్యానం ఆధ్యాత్మిక ధనం
ఆర్జించగల ఏకైక సాధనం.ఆధ్యాత్మిక ఆకాంక్షలు ఉత్తమంగా ఉంటే చాలదు.అవి ఆచరణగా రూపుదిద్దు కోవాలి.సాధనలన్నీ ఇష్టంగా
ఉండి చెయ్యాలి. కష్టంగాచేస్తే ఫలితాలు దక్కవు.
శరీరసుఖాలకు ప్రాధాన్యం ఇస్తే అన్నీ కష్టం గానే అనిపిస్తా యి.నాలుక రుచిని,శరీరం సౌఖ్యాన్ని,బుద్ధి గౌరవాన్ని అపేక్షిస్తా యి.
ఆధ్యాత్మికత వీటిని నిర్ద్వంద్వంగా తిరస్క రిస్తుంది.వీటికి అతీతంగా వ్యవహరిస్తుంది.
ఆధ్యాత్మిక ఫలాలంటే అష్టసిద్ధు లు కావు. సద్బుద్ధి,సద్భక్తి,అంతర్యామితో అవాంతరా లు లేని అనుబంధం మాత్రమే!
అసలు అంతర్యామితో అనుబంధమంటూ ఏర్పడాలేగాని,ప్రపంచాధిపత్యం సైతం గడ్డి పోచకన్నా హీనమనిపిస్తుంది.
మన ఆకాంక్షలన్నీ 'అంతర్యామి'తో అను బంధానికి అంకి తమై ఉండాలి.మన ఆచర ణలన్నీ అందుకు అనుబంధంగా ఉండాలి.
అప్పుడు మనం ఆత్మభావనతో జీవిస్తాం.
ఆ క్షణంనుంచి మనం ఎటుచూసినా ఆనంద  మే.ఏమి చేసినా భగవంతుడి సేవే.....
   మనం మంచివారితో సాంగత్యం చేస్తూ జీవనం సాగిస్తుంటే,చెడు గుణాలు సైతం మంచిగుణాలుగా పరిగణించబడుతుంటా
యి....!.నాలుక కన్నా చెవులే మంచివి.
తాము విన్నది అవి చెప్పలేవు కానీ..,తాను విననిది కూడా నాలుక చెప్పగలదు!!
❤️
     
మనం చేసే దానం ఎలా ఉండాలి.....
"దానం అనేది ఒక బాధ్యత!.మంచి సమ యంలో,మంచి ప్రదేశంలో,మంచి ఉద్దేశం తో,సరైన వాడికి తిరిగి ప్రతిఫలం ఆశించ కుండా
చేసిన దానాన్ని సాత్విక దానం అంటారు!.
ప్రతిఫలం ఆశించి,మళ్ళి తిరిగి రావాలనే భావంతో,బలవంతంతో,డంబము,పేరుకోసం మోహమాటంగా ఇష్టం లేకున్నా చేసే దానాన్ని
రాజసిక దానం అంటారు!.
సందర్భమే లేకున్నా,అనువుకాని చోట, యోగ్యత లేని వారికి,అగౌరవంగా,అవమాన కరంగా ఇచ్చే దానాన్ని తామసిక దానం
అంటారు!
పరబ్రహ్మను"ఓం","తత్","సత్"అనిఅంటారు! దీనివల్లనే పూర్వం జ్ఞానం(వేదము) ధర్మం (యజ్ఞం) సృష్టించబడ్డా యి!అందువల్ల వేద
వేత్తలు యజ్ఞ,దాన,తపస్సులను ఓం కారం తో ప్రారంభిస్తా రు! మోక్ష కాముకులు ఫలా పేక్ష లేకుండా పలు రకాల యజ్ఞాలను,దానా
లను,తపముల వంటి పుణ్యకార్యాలను "తత్" అనే శబ్దా న్ని ఉచ్చరించి ప్రారంభిస్తా రు...... "ఉన్నది"(భగవంతుని ఉనికి), "మంచిది"
(అన్నింటిలోకెల్లా ఉత్తమ మైనది) అనే అర్థంలో "సత్" అనే పరబ్రహ్మ నామా న్ని వాడతారు! అదే విధంగా ఉత్తమ కర్మ
ల్లో,భగవంతుని ప్రీతి కోసం చేసే కర్మలు  "సత్" అని పిలువబడుతున్నాయి!అందుకే యజ్ఞ,దాన,తపస్సులను అశ్రద్దతో ఆచరిస్తే
దానిని" అసత్" అంటారు!అలాంటి వారికి ఇహ పరాల్లో ఫలితం ఉండదు....
ఈ కాలంలో చాలా మంది చేసేవి రాజసిక దానాలే! ఒకరికి సహాయం చేస్తే ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని తిరిగి మనకేమైనా రావాలి
అనే భావంతో చేసేవే! ఫలాపేక్ష లేకుండా దానం చేసే వాల్లు ఈ కాలంలో అరుదు!ఇచ్చే దానం నేను ఇస్తు న్నా అనే తలపు నుండి ఏది
నాది? ఏది ఎవరిది? అనే ప్రశ్నల నుండి అంతా పరమాత్మునివే నేను,నాప్రాణం,నా ఆస్తి,నా కుటుంబం,నాది ఇలా అన్ని
ఆపరమాత్మునిలోవే,దేనికిమనం యజమానులం కాదు అనే భావన పూర్తిగా వచ్చాక చేసే దానం చాలా గొప్పది!అప్పుడు జీవితంలో
కూడికలు ఉండవు! తీసివేతలు ఉండవు! అప్పుడు చేసే ప్రతీ పనిలో ఆనందంగా ఉంటారు!
🌷🌷🌷🌷
ఓం అనేది ఏకాక్షర మంత్రం! దీనికి ఎన్నో అర్థా లుఉన్నాయి!త్రిమూర్తు ల స్వరూపము, మూడు కాలాలకు అతీతమైదిగా ఓం
చెప్పబడింది! "తత్" అంటే "అది" పరబ్రహ్మ అని అర్థం! సత్ అంటే మంచిది అని అర్థం! యజ్ఞ,దాన,తపములను గురించి తెలిసి
శ్రద్దతో చేయాలి! అప్పుడే అవి పరిపూర్ణంగా చేసినట్టు ! శ్రద్ద లేకుండా,అయిష్టంగా, బల వంతంగా తిరిగిఫలం ఆశించిచేసే యజ్ఞాన్ని,
దాన,తపములతో ఇహ,పరంలో కూడా సరైన ఫలం ఉండదు....
🌷🌷🌷🌷🌷
మంచివాడికంటే ముంచేవాడి మాటలే జనాలు నమ్ముతారు,కషాయం కంటే కాఫీ రుచిగా ఉంటుంది ...
  పది మందికి ఇబ్బంది కలిగించే గెలుపు ఓటమితో సమానం.పది మందికి ప్రేరణ కలిగించే ఓటమి వెయ్యి ఎనుగుల బలంతో
సమానం....
  ఉన్నది ఉన్నట్లు గా చేప్పేవాళ్ళని వదిలేస్తాం లేనిది ఉన్నట్లు గా చెప్పే వాళ్ళని నమ్మేస్తాం నిజా నిజాలు తెలుసుకొనే లోపలే నిజంగా
అభిమానించే వారిని కోల్పోతారు.
            ❤
అనంతమైన నీటితో నిండి ఉన్న సముద్రం నుండి ఓ నీటి చుక్కను ఏ విధముగానైతే వేరుచేసి చెప్పలేమో అదే విధమున సృష్టం తా
నిండిపోయి ఉన్న భగవంతుణ్ణి కూడా సృష్టి నుండి వేరుచేసి చెప్పలేము.భగవంతు డు కేవలం గుడిలోనో లేదా ఇంటి పూజా
మందిరంలోనో ఉన్నాడన్న భావన కంటే మూర్ఖత్వము మరొకటి లేదు.తన లోపలే ఉన్న ఆత్మ స్వరూపుని తెలుసుకోలేనివారు బయట
ఉన్న భగవంతుణ్ణి ఎలా తెలుసుకో గలరు!? విగ్రహారాధన,పూజలు,పుష్కరాలు ఇవన్నీ తమలో ఉన్న భగవంతుణ్ణి తెలుసు కోవడానికి
చేసే ప్రయత్నాలే తప్ప వీటితోనే జీవితమంతా గడపమని కాదు!. నిజానికి ఇవి అసలైన జ్ఞానంను ఇవ్వలేవు.గుడితో ప్రారంభమయిన
పూజ గుండె వరకూ చేర గలగాలి.భగవంతుణ్ణి సర్వవ్యాపకునిగా, సర్వాంతర్యామిగా తెలుసుకుని భాహ్య ఆరాధన క్రమేపీ
తగ్గించుకుని హృదయ అంతరాళంలో ఆరాధనచేయాలి..భగవంతు నికి భక్తు నికి మద్య బంధానికి ఇదీ కీలకం..
  దైర్యంతో కూడిన ప్రయతం అర్ధ విజయం తో సమానం.ధైర్యంతో అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చు...ఙ్ఞాపకాలు కత్తి కంటే
ప్రమాదకరం,కత్తి ఒక్కసారే చంపుతుంది
కానీ..ఙ్ఞాపకాలు ప్రతిక్షణం గుచ్చి గుచ్చి చంపుతాయి....  
  "అన్నింటికన్నా గొప్ప వరం సంతోషంగా ఉండగలగడమే. "                
"ధనాన్ని చూసి దరిచేరే బంధువులు,అందా న్ని చూసి కలిగే ప్రేమ,అవసరం కోసం కలు పుకునే స్నేహం..ఎన్నటికీ శాశ్వతం కావు."
" నువ్వు నిరుపేదవని అనుకోవద్దు ,ధనం నిజమైన శక్తి కాదు,మంచితనం,పవిత్రతలే నిజమైన శక్తి." 
" ప్రపంచంలో నువ్వొక సాధారణ మనిషివే కావచ్చు..కానీ కనీసం ఒక్కరికైనా నువ్వు ప్రపంచమంత గొప్పగా కనిపించేలా
జీవించాలి....
"లోకులు తొందరగా నిందిస్తా రు.అంతే త్వర గా అభినందిస్తా రు కూడా.అందువల్ల ఇతరు లు నిన్ను గురించి అనుకునే మాటలకు
అంత విలవ ఇవ్వొద్దు ....
"అన్నం లేకపోవడమే పేదరికం కాదు కుటుం బంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం. "
ప్రయత్నించేవాడికి ఏది కష్టం కాదు.,ప్రయ  త్నిస్తేగాని ఎవరి అదృష్టం వారికి తెలియదు.
    రోజు ప్రారంభంలో అనిపిస్తుంది ధనమే జీవితమనికానీ సాయంత్రం ఇంటికి చేరిన ప్పుడు "ప్రశాంతతే జీవితం"అనిపిస్తుంది...
ఉన్నోడుకి వూరంతా దోస్తు లే..,లేనోడీకి ఇంట్లో వాళ్ళు కూడా విరోధులే..
💙
         
బాహ్య దృష్టిని,చెడుకార్యాలకి ప్రేరేపించే సూక్ష్మాతి సూక్ష్మమైన వాసనాలని కారణ శరీరంలోనే అసురసంపదగా గుర్తించి తొలగించాలి
అనేకమైన చెడు నడతలుగా సూక్ష్మ శరీరం లో విజృంభించే కర్మలకి మూలం కారణ శరీరంలో ఉన్న కామ,క్రోధ,లోభ ప్రవృత్తు లు
మూడే,దానిని సాధించడానికి గాను మంచి, చేడు కార్యాలని నిర్ణయించుకోవడంలో శాస్త్రా న్ని పాటించాలి.
ప్రతి చిన్న పనికీ శాస్త్రం చదువుతూ కూర్చో వడం సాధ్యంకాదు.పైగా అందరికీ శాస్త్రా లు  అర్థం చేసుకునేపాటి పాండిత్యం ఉండాలి
కదా.శ్రద్ద ఉంటే చాలదా?శాస్త్రా లు దేనికి? శాస్త్రా న్ని వదిలి చేసే అభ్యాసం ఎలాంటిది అవుతుంది.....
శ్రవణ,మననాలు చేసినవాడు "నేను" అను కునే జీవుడు.తన మేలును కోరి చెప్పిన భగవంతుని మాటలని విశ్వసించి,అర్థం
చేసుకుని ఆచరిస్తూ వచ్చాడు.ఇక చివరికి మిగిలిన సాధన నేను' అనే జీవభావాన్నే చీల్చివేయడం.నేను' లేనప్పుడు ఏదీ ఉండ దనే
విషయం స్వానుభవం.నేననే జీవభావా న్ని తీసివేసినప్పుడు దానికి ఆధారమైన పర మాత్మ భావాన్ని పొందుతాడు,పరిమితుల
న్నింటిని అధిగమిస్తా డు అని శాస్త్రా లు, గురువులు చెబుతారు.వారి వాక్యాలలో శ్రద్ధ ఉన్న సాధకుడు ధైర్యం చేసి నేను'అన్న భా వాన్ని
తొలగించడానికి పూనుకుంటారు
నిజానికి అక్కడ పరమాత్మ భావం లేకపోతే? కేవలం శూన్యమే ఉంటే? నేను'అన్న భావా న్ని చీల్చివేసిన సాధకుడు శూన్యమై నశించి
పోతాడు.అందుచేత శ్రద్ధ అన్నది సత్యం మీ ద ఆధారపడివుండాలి.అసత్యం మీద ఆధా రపడిన శ్రద్ధ అనర్థా నికి కారణమౌతుంది.
'సప్త' అంటే సప్త సంఖ్య అంటే అనాయాసం గా జాలు వారే దశ. సరైన శ్రద్ధతో మోక్షం వైపుకి జాలువారే దశ ఇది.
ఏ ఏ కోరిక లేకుండా బ్రహ్మజ్ఞానులై,శాస్త్రా చరణచేసే వారు మహాత్ములు.మోక్షకాంక్షు లై శాస్త్రవిహితమైన కర్మలు చేసేవారు
సాత్యికులు.ఇహపరసుఖాల కోసం శాస్త్రం లో విశ్వాసం ఉండి ఆ విధానాల ప్రకారం ఆచరించేవారు రాజసికులు.
ఇదీ అదీ లేక శాస్త్రా లు వదిలి మూర్ఖంగా ప్రవర్తించేవారిది తమస్సు.....
💚
               
డై మన్షన్స్ మొత్తం 7...ఒక చతురస్రాకార వస్తు వును తీసుకున్నపుడు అది ఏడు భాగా లుగా ఉంటుంది,మనం 3rd డై మన్షాన్లో
ఉన్నాం,అందుకే మనకి ఏ వస్తు వైనామూడు భాగాలు మాత్రమే చూడగలుగుతాం.
ఒకటవ డై మన్షన్ లో ఉన్న వారు భూమి కింద చివరలో ఉంటారు
రెండవ డై మన్షన్లో నాగులు ఇతర సరీ సృపా లు నివసిస్తా యి.
మూడవ డై మన్షన్ లలో మనుషులు వీరు భూమిపై పొడవుగా ఎంతదూరమైనా ప్రయాణం చేయగలుగుతారు.
నాలుగవ డై మాన్షన్ వాళ్ళు మన పైన ఉంటారు.వీరు కిందకి రాగలరు,పైకి వెళ్ళ లేరు,భూత,ప్రేత సూక్ష్మ శరీరాలు.
ఐదవ డై మన్షన్ వాళ్ళు దేవతాస్వరూపాలు, దేవదూతలు మిగిలినవారు వీరు మనకు సహాయపడుతూంటారు.
ఆరవ డై మన్షన్ లో యోగులు,ఋషులు, వీరు ఎక్కడ నుండి ఎక్కడికైనా ప్రయాణం చేయగలరు,
ఇక చివరగా ఏడవది,దీన్నే మనం మోక్షం అంటాము,ఇక్కడ అందరూ ఒకే రూపురేఖ ల్ని కలిగి ఉంటారు,ఇదే చివరిది.వీటినేఏడు
జన్మలు,ఏడుఅడుగులు,ఏడుకొండలు....
🧡
         
మనలో వ్యక్తమయ్యే గుణాలనే వ్యక్తిత్వం అంటారు.పట్టు బట్టలతో ఇంట్లో కూర్చొని పూజ చేస్తు న్నప్పుడు మనకి ఏగుర్తింపు
ఉండదు.ఇంట్లోలేని వ్యక్తిత్వం బయట ఎవ రైనా తనను గమనిస్తు న్నారని తెలియటం తోనే బిడియపడటం,గుర్తింపును కోరుకోవ
టంతో మొదలైన వ్యక్తిత్వం తనను ఇంకా ఎవరెవరు గుర్తిస్తు న్నారనే గమనింపుతో మరింతగా విస్తరిస్తుంది.ఇతరుల మెప్పు కోరుకునే
వ్యక్తిత్వం వృద్ధి అవుతుంది.మనం ఎవరి ఇంటికో వెళ్తాం.వాళ్ళు మనల్ని ఆద రిస్తే సంతోషం,లేకుంటే కోపం వస్తుంది.అను కున్నది
జరగకపోతే అసహనం వస్తుంది. మన మనసు ఇలా ఎన్నో నాటకాలు ఆడు తుంది.అందరితో కలిసి ఉన్నప్పుడు తాను ఆడ,మగ
అనే భావంతో ఉంటుంది.అదే బాత్రూంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ భావం కలుగదు.మనలోని అన్ని గుణాల కలయిక వ్యక్తిత్వంగా
రూపుదిద్దు కుంటుంది.ఆ వ్యక్తి త్వం సమూలంగా పోవాలంటే మనలోని అన్ని రకాల గుణాలు పోవాలి !.
🌷🌷🌷🌷💙
  మనవి కాని వాటిపై 'అత్యాశ' ఎంత ప్రమాదమో..మనతో ఉన్నవాటిపై 'నిర్లక్ష్యం' కూడా అంతే ప్రమాదకరం..!!
   మనదరి చేరని వాటి కోసం ‘పట్టు పట్టడం'
ఎంత మూర్ఖత్వమో మనచెoత ఉన్నవాటిని
‘వదులుకోవడం' కూడా అంత మూర్ఖత్వం..
Let men have light, let them be pure and spiritually strong and educated, then alone will misery cease in
the world, not before.
అంధకారం నుండి మానవులు వెలుగులోకి రావాలి.పవిత్రు లై ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిస్తూ విద్యావంతులవ్వాలి.అప్పుడే లోకం
నుండి దుఃఖం నిష్ర్కమిస్తుంది.అందు కు మరో మార్గంలేదు.సమభావం ఉన్నచోట ద్వంద్వానికి తావు ఉండదు.నిత్య తృప్తు డు గా
ఉన్న జ్ఞానికి ప్రాప్తించిన విషయాలపైన, ప్రాప్తించని విషయాలపైనా మనసుకు కొల తలు ఉండవు.సంపూర్ణమైన సంతుష్టిలో ఉన్న
మనసుకు చేసిన కార్యాల విషయమై గానీ,చేయని కార్యాల విషయంలో గానీ... అదే సంతుష్టితో ఉంటుంది.జ్ఞాని కర్మలను
చేస్తా డుగానీ చేసిన కర్మలనుగాని,చేయని కర్మలనుగానిస్మరించడు.జ్ఞానికి నిందాస్తు తు లపై సంతోష పరితాపాలు ఉండవు.జీవన్మర
ణాలపై భావోద్వేగాలు ఉండవు.చిత్తము పూర్తిగా ఉపశమించి ఉంటుంది కనుక జన సమూహం నచ్చక అడవిలోకి,అడవిలోని
ఒంటరితనం నచ్చక జనసంచారంలోకి పరు గులు పెట్టడు.సమభావం ఉన్న చోట ద్వంద్వానికి తావు ఉండదు.జ్ఞాని జీవితం లో
జరుగు ప్రతీదీ మనకు బోధగానే ఉంటుంది !.
శరీరమే - రథము,ఆత్మయే - రథికుడు
బుద్ధియే - సారథి,ఇంద్రియములే -గుఱ్ఱము లు,మనస్సే - కళ్లెము.
సుడి గుండము:-కర్మచే ఫలము,ఫలముచే   భోగము,భోగముచే వాసన,వాసనచే  జన్మ
జన్మచే  కర్మ, కర్మచేఫలము.ఈ సుడిగుండం తప్పించుకొను ఏకైకమార్గము ఆత్మజ్ఞానమే..
💚
          
"వ్యక్తిత్వం ఏవిధంగా విశృంఖలం అవుతుంది.."మనలో వ్యక్తమయ్యే గుణాల నే వ్యక్తిత్వం అంటారు.పట్టు బట్టలతో ఇంట్లో కూర్చొని
పూజ చేస్తు న్నప్పుడు మనకి ఏ గుర్తింపు ఉండదు.ఇంట్లోలేని వ్యక్తిత్వం బయట ఎవరైనా తనను గమనిస్తు న్నారని తెలియటంతోనే
బిడియపడటం,గుర్తింపును కోరుకోవటంతో మొదలైన వ్యక్తిత్వం తనను ఇంకా ఎవరెవరు గుర్తిస్తు న్నారనే గమనింపు తో మరింతగా
విస్తరిస్తుంది.ఇతరుల మెప్పు కోరుకునే వ్యక్తిత్వం వృద్ధి అవుతుంది.మనం ఎవరి ఇంటికో వెళ్తాం.వాళ్ళు మనల్ని ఆదరి స్తే
సంతోషం,లేకుంటే కోపం వస్తుంది.అనుకు న్నది జరగకపోతే అసహనం వస్తుంది.మన మనసు ఇలా ఎన్నో నాటకాలు ఆడుతుంది.
అందరితో కలిసి ఉన్నప్పుడు తాను ఆడ, మగ అనే భావంతో ఉంటుంది.అదే బాత్రూం లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ భావం కలుగ
దు. మనలోని అన్ని గుణాల కలయిక వ్యక్తి త్వంగా రూపుదిద్దు కుంటుంది.ఆ వ్యక్తిత్వం సమూలంగా పోవాలంటే మనలోని అన్ని
రకాల గుణాలు పోవాలి !.
🖤
        
మనం ఏ కర్మలు చేస్తే చెడుకర్మలు సృష్టించి నట్లవుతుంది....
మన ఆరోగ్యాన్ని సరిగా చూసుకోక పోయి నా, డ్రగ్స్ తీసుకున్న,smoking,డ్రింకింగ్, అతిగా తిన్నా,పోషక ఆహారం తీసుకోక
పోయినా,వ్యాయామం చేయకపోయినా, వ్యతిరేక ఆలోచనలు వున్నా,ఇవి చెడు కర్మని సృష్టిస్తా యి.
ఇతరులకు శారీరకంగా హానిచేసినా,ఉద్వేగ పరంగా హాని చేసినా,చెడుకర్మను సృష్టించి నట్లే.
ఏదైనా పరిస్థితి ఎదురైతే దానినిఎదుర్కొని సమస్య పరిష్కారానికి,తగిన విధంగా కృషి చెయ్యక పోయినా,వాస్తవాన్ని అంగీకరించక
పోయినా చెడు కర్మ పొగవుతుంది.
మన చుట్టూ వున్న వ్యతిరేక ఆత్మల చెడు ప్రవర్తనను సహించినా,వారికి ఎక్కడ తప్పు చేస్తు న్నారో చెప్పకపోయినా,చెడు కర్మ పోగ
వుతుంది.
ఒకవేళవారు మీరుచెప్పిన విషయాలు వినక పోతే వారిష్టం.వారితో మంచిగా వుండొద్దు , ఒకవేళ వారితో మంచిగా ఉన్నారంటే వారిని
మనం ప్రోత్సహిస్తు న్నట్లే.అప్పుడు మనం కూడా వారి కోవలోకే చేరుతాము.
తల్లిదండ్రు లు,పిల్లలు,ప్రియతములు పట్ల బాధ్యతను విస్మరించినా చెడుకర్మ పొగవు తుంది.
ఆత్మహత్య చేసుకోవడం,దీనివల్ల ఒక ఆవ రణ మొత్తం కిందికి పడిపోతాము,చెడు కర్మ పోగైనట్లే,దేవుడు ఆత్మకు తన ఆధ్యాత్మిక
ధ్యేయం కోసం శరీరమనే వాహనాన్ని ఇచ్చా డు,దానిని ధ్వంసం చేసే అధికారం మనకు లేదు.ప్రతి ఒక్కరు ఏదోఒక కర్మను చేయాలి,
ఏ కర్మ చెయ్యకుండా ఉన్న చెడుకర్మ పోగ వుతుంది.
వినోదం కావాలనుకోవడం,యువత వయ సులో ఉన్నప్పుడు జీవితాన్ని స్త్రీ లతో అనుభవించాలనుకుంటారు.ఒక్క చిన్న తప్పు తమ
జీవితాల్ని నాశనం చేస్తుంది, మరలా సరిదిద్దు కోనీయకుండా చేస్తుంది.
ఈ విధంగా చేస్తే ఆత్మకు హాని చేసినట్లవు తుంది,ప్రలోభాలకు లోనుకాకూడదు....
🧡
         
మయ్యాసక...
నాయందు మాత్రమే మనస్సు నిలిపి,భక్తి యోగ అభ్యాసము ద్వారా నాకు శరణాగతి చేసి నీవు ఎట్లయితే నన్ను సంపూర్ణముగా,
సందేహానికి తావు లేకుండా తెలుసుకొన గలవో, అప్పుడు....మనస్సు తన యందు అనన్య భక్తితో లగ్నం చేసి భక్తితో తనను
సేవించువారు,యోగులలో శ్రేష్ఠు లు..... భగవంతుడిని గూర్చి తెలుసుకునే మార్గం ఏమిటి... ఆయనపై ధ్యానం చేయటం ఎలా...ఒక
భక్తు డు ఎలా దేవుడు ని పూజించాలి..'శృణు' అన్నపదంవాడాడు, అంటే "వినుము" అని అర్థం,అంతేకాక మద్-ఆశ్రయః....
లక్షణం ... "నీ మనస్సు నాయందే లగ్నంచేసి" అని అర్థం.
💜
        
సృష్టిలో శివతత్వము ఊర్ధ్వత వైపుకు, మాయ దిగువకు లాగుతూ వుంటాయి. సాధకులు జాగురూకులై సంచరించాలి.
  శివ తత్త్వము చాలా మహత్తరమైనది. సహస్రారమునుంచి మూలా ధారము వరకు సతీదేవి తో పాటు వచ్చి ఆయన వచ్చి
కూర్చుంటాడు.కానీ దేని యందు ఆయనకు సంభందంఉండదు.సంబంధమంతాఆమెదే. మనము శివుడితో ఉన్ముఖము అయితే
శివుడు మనకు ఉన్ముఖుడవుతాడు.మనం మర్చిపోతే అతను వదిలేస్తా డు.
అదిగో,ఆకాశపధము చూడుము.దక్షుని యజ్ఞ వైభవం చూచుటకై సాటి ఆడవారంద రూ భర్తలతో కలిసి దివ్య విమానము లెక్కి
పోవుచున్నారని శివుడితోఅంటుంది.శివుడు దక్షయజ్ఞము మొదలుపెట్టడానికి రెండు రోజుల ముందే నీకు జ్ఞాన బోధ చేస్తా ను.నా
అంతటి వానినిగా నిన్ను తయారు చేస్తా ను. కూర్చోమని చెపుతాడు.
శివుడు జ్ఞానబోధ చేస్తూఉంటే విమానాలలో వెడుతున్న వారిని చూస్తుంటుంది.నువ్వు అటుచూస్తే జ్ఞానముఎలావస్తుంది?అంటా
డు. నేను అటువైపు చూడకుండా ఉండలే ను. పిలవక పోయినను తండ్రి,గురువు, రాజు,స్నేహితుడు వద్దకు సజ్జనులు పోవు
చుందురు.
"ద్వేషాన్ని దూరంచేయగలిగేది ప్రేమఒక్కటే, ద్వేషం కాదు. "              
" ఈ ప్రపంచంలో నీలా ఉండేది..ఉండబోయే ది.. ఉండాల్సింది..కేవలం నీవు మాత్రమే.. అందుకే ఎవరిని అనుకరించవలసినవసరం
లేదు.. "
     జీవితంలో ఏదీ వ్యసనంగా పరిణమించ కూడదు.అదే జీవితానికి ప్రధానసూత్రం...               
తలనుండు విషము ఫణికిని...పాముకి కోరలు తీసేస్తే ఇంక దాని శరీరంలో ఎక్కడా విషం ఉండదు.అదేవిధంగా తేలుకి తోక తీసేస్తే
దాని శరీరంలోనూ ఇంకెక్కడా విషం ఉండదు. కాని మనిషికి మాత్రం అలా కాదు. అక్కడ ఇక్కడ అనే భేదం లేకుండా దుష్టు ని
శరీరమంతా విషం వ్యాపించి ఉంటుంది... దుర్గుణాలు ఉన్న మనుషుల గురించి...
నీళ్ళ ఫై నిలబడి,నీళ్ళును చూస్తూ సముద్ర మును దాటలేవు.
కొన్నది వంకాయ..కొసరింది గుమ్మడి కాయ న్నట్లు ,పరిమాణంలోను ఖరీదు లోను వంకా య,గుమ్మడికాయ కంటే చాలా చిన్నది.
వంకాయను కొని అందుకు కొసరుగా గుమ్మ డికాయను ఇవ్వమంటేఎలా? అలాగే కొంత మంది ఏదో కొద్దిపాటి పని చేసి అంతకు
వందరెట్లు అధికంగా,లేదా ఉచితంగా ఏదై నా ప్రతిఫలం వస్తే బాగుండునని భావిస్తుం టారు.అలా తక్కువ పని చేసి ఎక్కువ ప్రతి
ఫలాన్ని కోరడం ఏమంత సమజసంకాదు కదా! అటువంటి వారికి....
*చేపాయి బతుకు* నిరంతరం ఒకరికి జవాబుదారీగా ఉండి బతకటం,స్వేచ్ఛ లేకుండా జీవించటం,ఇంకొకరి సూచనల మేరకు
వ్యవహరిస్తూలెక్క చెప్పే....
  భగవంతుడు కేవలం సాక్షీభూతుడని, ఎవరి కర్మను వారు అనుభవింపక తప్పదనే మాట మనము తరచుగా వింటుంటాము.
అయితే భగవంతుడు సాక్షీభూతుడే కాదు, భక్తపరాధీనుడు కూడా అన్న సత్యాన్ని మనం మరువకూడదు.ఆనాడు మార్కండే
యుడు 'కర్మదాట వశమా!'అనుకొని నిరు త్సాహంతో నీరసించి కూర్చునిఉంటే ఈశ్వ రుని మెప్పించి మృత్యువును జయించ గలి
గేవాడా? సాక్షీభూతుణ్ని సహితం కరిగించి, కదిలించే శక్తి కలిగినది ప్రార్థన.వెన్నవంటి భగవంతుని హృదయాన్ని కరిగించాలంటే
మనం చూపవలసిన వేడి - ప్రార్థన.వేడి అధి కమౌతుంటే వెన్న తొందరగా కరిగిపోతుంది.  ప్రార్థిధ్ధాం.... గట్టి వేడే పుట్టా లి.భగవంతుని
హృదయం కరిగిపోవాలి.పట్టిన చెడు తొలగి పోవాలి. అంత వరకూ విశ్రమించకుండా, ప్రార్థన ఆపకుండా.
🌷🌷🌷🌷🌷

You might also like