You are on page 1of 2

గుప్త విద్య 9:-

అనేక విధాలుగా భూతాలు మనుషులను ఆవేసిస్తూ ఉంటాయి. కానీ సామాన్యంగా అవిష్టులైనవారికి వారిని
ఎవరు ఆవహించారో తెలియదు. ఆ అధికశక్తుల ప్రేరణతో ప్రవర్తిస్తూ ఉంటారు. తమ సొంత ఆలోచనతోనే
అలా నడుచుకుంటున్నాం అనుకుంటూ ఉంటారు. అటువంటి వారిని మీరు గ్రహ పీడీతులు అయ్యారు అంటే
నమ్మరు. వారు తమ మనసుతో ఆలోచిస్తూ పనిచేస్తూ ఉంటే తమ మనసులో, శరీరంలో గ్రహాలేవో ప్రవేశించి
ప్రభావితం చేస్తున్నాయి అనుకోవడం ఎక్కువ మందికి ఇష్టం ఉండదు. ( అతి త్వరలో ఈ నెగటవ్ ఎనర్జిస్
వదిలించుకొని పద్దతులను పోస్ట్ చేస్తున్నాను) ఒక దయ్యం పట్టి తాను ఆవహించిన మనిషి మనసును
పూర్తిగా స్తంబ్దనం చేసి పరిపూర్ణంగా వ్యక్తమై నేను ఫలానా వ్యక్తిని, ఈ శరీరాన్ని పట్టుకొన్నా అంటే
అప్పుడు ఎక్కువ నమ్ముతాం. అప్పుడు కూడా నమ్మక మనోభ్రాంతి అని త్రోసిపుచ్చేవారు కూడా ఉంటారు.
వారి సంగతి అటు ఉంచి. ఆస్తికులను మాత్రం శాస్త్ర పరాణాల ప్రమాణం చూపి, అప్పుడప్పుడు వ్యక్త
పిశాచ ప్రవర్తనను ప్రత్యక్షంగా చూపి, నమ్మవచ్చు. ప్రత్యక్షంతో పాటు అనుమానం, ఆప్తవాక్యము
కూడా గొప్ప ప్రమాణాలే. మనుషులను గ్రహించే భూతములను గ్రహములను పేరు ఉంది.

|| హింసా వికారయేకౌచిత్ దేవభావము పాశ్రితాః భూతానీతి కృతాసంజ్ఞా తేషాం సంజ్ఞా ప్రవక్త్రభిః


గ్రహసంజ్ఞాని భూతాని...సుశ్రుతం.||

దేవత్వం ఉండి, హింసా వికారం కలవారిని శాస్త్రజ్ఞులు భూతములు అన్నారు. మనుషులను పట్టుకొంటాయి
గనుక గ్రహలన్న పేరు వచ్చింది. ఇవి అసంఖ్యాకాలు. అయినా వీటిని ఎనిమిది రకాలుగా ప్రధానంగా
చెప్పవచ్చు.

దేవ, దైత్య, గంధర్వ,యక్ష, పిథృ, నాగ, రాక్షస, పిశాచ వర్గాలు అతీత శక్తులు కలిగిన ఈ దేవదానవ పిశాచాల
భేధాలు రకరకాల చోట్ల రకరకాల పేర్లతో ఉంది.

అమరులు, అసురులు, యక్షులు, నాగులు, రాక్షసులు ,కూష్మాండ వినాయకాదులు, బ్రహ్మ, క్షత్రియ,


వైశ్య, శూద్ర చండాల ప్రేతములు మొదలైనవి ఈ గ్రహాలలో భేధములు. ఇవి అమానుషమైన బలవిజ్ఞాన
విక్రమములతో ప్రకాశిస్తూ ఉంటాయి.

ఇవి ఎక్కడ ఉంటాయి.? అని సహజంగా సందేహం కలుగుతుంది. వాటి స్థానాలు .

సామాన్యంగా గ్రహలు కొండల మీద, పురాతన వృక్షాలమీద, చెరువు, సముద్రం,నదుల ఒడ్డున,నధీసాగర


సంగమంలో, గోకులములంలో, ఎవరు లేని ఇంట్లో, శ్మశానం లో, చితిపై, కొంత కాలం పూజలు చేసి మానేసిన చోట,
నిధుల వద్ద,ఊరి పొలిమేర, మాతృకల దగ్గర,తీర్థాలలో,తోటలలో, మేడపై ఉంటాయి. ఇది స్థూలంగా చెప్పేదే
కానీ ఎక్కడ పడితే అక్కడ సిద్దదేవత సన్నిధిలో తప్ప స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాయి.

అవి ఎవరెవరిని ఆవహించి భాధపెట్టడానికి పూనుకుంటాయో ఆ వివరాలు కూడా చూడండి.

|| సిద్దక్షేత్ర ప్రదేశేతు రజస్తామసభాపుకః అయోగ్య ఫలవాంచాయైయః కరోతిజపాదికం


తస్యబాధాంకరోత్యేవ దేవత ప్రేరణైస్సహ||

పరమ పుణ్య సిద్ద క్షేత్రంలో రాజస ,తామస గుణములు కలిగిన భావములతో అయోగ్యమైన కోరికలు
ఫలింపజేసుకోవడం కోసం ఎవరు జపం , తపస్సు చేస్తాడో వారిని ఆయా ధేవతల ప్రేరణచే గ్రహాలు పట్టుకొని
భాధలు పెడతాయి.

అంటే సత్వగుణ ప్రధానమైన శాంత స్థలాలలో , అక్కడి పవిత్ర వాతావరణాన్ని దుష్ట వాంచలతో కలుషితం
చేయడాన్ని ఆయా క్షేత్ర దేవతలు సహించవు. కోరికలు తీరవు సరికదా లేని ఇబ్బంది తెచ్చుకుంటాడు సాధకుడు.
కనుక తమ వాంఛను బట్టి సాధనా స్థలాన్ని ఎన్నుకోవాలి ఎవరైనా.

అవతలి వారు నాశనం అవ్వాలి నేనే అభివృద్ధి చెందాలి, నా శత్రువులు నాశనం అయి నేను హ్యాపీగా ఉండాలి,
వారు దరిద్రుడు కావాలి నేనే కుబేరుడిని కావాలి ఫలావా స్త్రీ వశం కావాలి,ఏం చేసినా పని విజయవంతం కావాలి
ఇలాంటి కోరికలతో దివ్య క్షేత్రాలకు వెళ్ళకూడదు. వెళితే అక్కడ ఉన్న క్షేత్ర దేవతలు తీర్చకపోవడమే
కాకుండా శిక్షిస్తాయి. ఆ దేవతల ఆజ్ఞ వలన వారిని పట్టుకొని పీడిస్తాయి. కనుక మహ సిద్ద క్షేత్రాలలో
దుష్ట బుద్దితో పోయి పూజలు,జపాలు ఇటువంటి చెడు కోరికలతో చేస్తే అవి ఫలితం ఇవ్వకపోగా వేరే గ్రహలు
నెత్తిన ఎక్కి వెంటాడతాయి.

|| దేవతాభక్తిసంయుక్తం విరక్తం భక్తి సంయుతం వృధా మత్సర సంయుక్తం తస్యోపాసనదేవతాః


రాక్షసాంశ్చ పిశాచాంశ్చ ప్రేరయంత్యనిశంతధా||

ఒకరు దేవతా భక్తుడైనా వృదామత్సర సంయుక్తుడైతే అతని ఉపాసన దేవతలే అతడిని పీడించడానికి
రాక్షసులను పిశాచాలను ప్రేరేపిస్తుంది.

ఆరాధించే దేవతలే భక్తుడిని శిక్షించడం చిత్రంగా కనబడవచ్చు. ఇందులో ఒక రహస్య విషయం ఉంది. ఒక
వ్యక్తి జపం, ధ్యానం చేశాడనుకోండి. దేవతను భక్తితో కొలిచాడనుకోండి. దాని ఫలితంగా ఆ సాధకుడికి కొన్ని
సిద్దులు వస్తాయి.

అతడు మత్సర గ్రహస్తుడు అయితే ఆ సిద్దులు దుర్వినియోగం కావచ్చు. ఇతరులకు అపకారం జరగవచ్చు.
అక్రమాలు,అన్యాయాలు జరగవచ్చు. దాని వలన లోకకళ్యాణానికి భగం కలగవచ్చు. దానిని అరికట్టడానికి
ముందే దేవతలు సాధకుడినీ పరీక్షిస్తారు. దివ్య శక్తులు ఎప్పుడూ ఉత్తమ గుణాలు కలిగి ఉన్న సాధకుడికే
లభిస్తాయి అని బాగా అర్థం చేసుకోవాలి. దుష్ట బుద్దితో ఏ దేవతా మంత్రం అయినా ఎన్ని సంవత్సరాలు
తపస్సు చేసినా ఫలితం శూన్యం... దానికి తగిన ఏర్పాట్లు , సంరక్షణ జరిగింది. కామ క్రోధాలకు వశం కాకుండా
ఉన్న సాధకులకు యోగ శక్తులు లభించే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం దేవతల బాధ్యత.

ఇంకో విషయం ఏమిటంటే..ఈ దుష్ట గ్రహలు మంత్ర తంత్ర శాస్త్రాలతో ఇతరులను హింసించే వారిని కూడా
పట్టుంటాయి అంట...భూత తంత్రం ఇలా చెబుతోంది.

|| మంత్రప్రయోగశస్త్రాద్వైః హింసాంచైవకరోతియ తస్స తద్వైరరూపేణ గ్రహగృహ్ణంతిపూరుషం. ||

|| మహపాతక సంయుక్తం పుణ్యక్షేత్రేవ సన్నపి ||

పుణ్య క్షేత్రాలలో ఉంటున్నా ఘోర పాపాలు చేసిన వాడిని ఆయా క్షేత్ర దేవత ఆజ్ఞ తీసుకుని గ్రహలు
పట్టుకొంటాయి.

ఈ సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పిన కథ గుర్తు చేసుకోదగినది. చమత్కారంగా
మాట్లాడుతూ ఒక సారి ఆయన గంగానది స్నానం చేసేటప్పుడు మహపాపి పాపాలన్నీ ఒడ్డున ఉన్న
చెట్టుమిదికి, ఎక్కి, వాడు ఈవతలకు రాగానే మళ్ళీ పట్టుకొంటాయి అన్నారు.

ఇంకా ఉంది...

... సశేషం
8688691567

You might also like