You are on page 1of 63

జైబాబా

గోవిందనామాల పై పద్యాలు

గోవిందా అని భక్తు లచే పిలిపించుకొనుట శ్రీకృష్ణ భగవానునకిష్ట


మట.అందుకే గోవిందనామాలపై పద్యాలు వ్రాయుటకు
సాహసించాను.గోవు అనగా కిరణాలనే అర్ధముండుటచే ఆధ్యాత్మిక
ఙ్ఞాన కిరణాలు మనపై ప్రసరించటానికి ఈ పద్యాలు సహకరిస్తా యని
నా ఆకాంక్ష.

శ్రీనివాసా గోవింద

తే.గీ. శ్రీని వాసు డొసగునిక సిరులు

పలుక గోవిందయనుచును పరవ శించి

వేడు కొందాము ఆర్తిగ వేం కటేశు

నిపిలచెదమిక గోవిందుని పలు మార్లు

మనము గోవిందా యని పరవసించి పాడినచో మనకు సంపదలను


శ్రీని వాసుడిచ్చును.కను క ఆ తిరుపతి వెంకన్నను పలుమార్లు
గోవిందా యని వేడు కొందాము

2.శ్రీవెంకటేశ గోవింద

తే.గీ. వెంక టే శదీనదయాళు వెన్న దొంగ

ఏడు కొండల వెంకన్న ఎపుడు మనల

వీడ డు తిరుమ లేశుని విశ్వ సించు

నామ సంకీర్త నంబును నరుల కుతగు.


తిరుమలేశుడు దీనదయాళు వు. కృష్ణావతారములో గోకులమున
వెన్న దొంగవన్నారు.ఏడు కొండలపైనున్న వేంకటేశుడు మన
చెంతనేయుండును అతను మనలను వదలడను విశ్వాసము
మనకుండాలి. నారాయణ స్మరణమే ఇప్పుడు మనకు తగినది.

3.భక్తవత్సల గోవింద

తే.గీ. వేద వాక్కుల క్షీరంబు వేగ త్రాగ

వేచి యుండెడి లే గలము వేంకట పతి

భాగవత ప్రియ గోవింద భక్త వత్స

ల మము బ్రోవుము గోప బా ల కరుణించు

వేద వాక్కులనే పాలను త్రాగుటకేదురు చూచెడి లేగ దూడలము


భక్తు లను వాత్సల్యముతో ఆవు తన లేగ దూడను వాత్సల్యముతో
చూచినట్లు నీవు భక్తు లమీద ప్రేమ కలవాడివి. వేంకటా చలపతి
భక్తు లమీద నీకు ప్రేమ కనుక మామీద కరుణతో మమ్ముల
రక్షించుము

4.భాగవత ప్రియా గోవిందా

కం. భాగవత ప్రియా గోవిం

దా గిరి ధారా మురారి ధరణీ నాధా

భాగవతంబున పోతన

భాగవతులకును నొసగినభగవంతు డితడే


భాగవత ప్రియుడు గోవిండుడు.భూదేవి భర్త.గోవర్ధన గిరి ధారి. ముర
అను రాక్షసునికి శత్రు వితడు. పోతనగారు భక్తు లకు కానుకగా
భాగవతమున అందజేసిన భగవంతుడితడే

5. నిత్య నిర్మల గోవిందా

తే.గీ. నిత్య నిర్మల గోవింద నీల వర్ణ

దేహ ఆనంద దాయక దేవ దేవ నెలకు మూడు వా నలు మాకు


నెపుడు కలుగు

రీతి వర్షింప చేయకోరితిమి దేవ

నీవు నిత్యము మలినములంటని శుధ్ధ చైతన్యము. గోవిందుడవు.నీలి


రంగు శరీర చ్చాయనీది.మాకు అనందమందించే వాడివి.నెలకు
మూడు వానలు భూమిపైవర్షించునట్లు నిన్ను కోరితిమి స్వామి.

6.నీల మేఘ శ్యామ గోవిందా

తే.గీ. నీలి మేఘపు వర్ణము నీ శరీర

కాంతి తాపము తీర్చెడి కాంతి చంద్ర

కాంతి శ్రీరామ మాలోని ఆత్మ రూపు

డవగు గోవింద మమ్ము వీ డ కుము నెపుడు

నీలి మేఘమువంటినీ శరీరకాంతి చంద్ర కాంతివలె మాతాపము


పోగొట్టు ను.శ్రీరామా మాలో ఆత్మ రూపమె నీవు. గోవిందా
మమ్ములను విడచి పోవద్దు .

7. పురాణ పురుషా గోవిందా


కం.గోవింద పురాణ పురుష

గోవుల కాపరి మురారి గోపీ లోలా

గోకుల బాలా జూతును

భావన లోనను మరియును బాహ్యము నందున్

.గోవిందా నీవు పురాణ పురుషుడవు.కృష్ణునిగా

నందుని గ్రామములో చిన్ని బాలునిగా గోవుల కాపరిగ


నడయాడితివి.ముర అను రాక్షసునికి శత్రు వివి. గోపికలకు లొంగిన
వాడవు .నిన్ను నేను భావనలోను బాహ్యమున చూచెదను.

8.పుండరీకాక్ష గోవిందా

తే.గీ పుండరీ కాక్ష గోవింద పుణ్య చరిత

జ్ఞాన దీపికలు తెలుపు జనులు చూడ

నీ కనులు మాకు గోవింద నీర జాక్ష

వేంకటేశ తిరుమలేశ వేద వేద్య

పుండరీకముల వలేనున్న నీ కనులు మాకు జ్ఞాన దివిటీలు(వెలుగు


దీపాలు)వేంకటేశ పుండరీక నయన. వేదములచే తెలుపబడిన వాడా.

9.నందనందనా గోవిందా

తే.గీ నంద నందనా గోవింద నారద నుత

నందునింటన నడయాడు నళిన నయన

పూతనాంతక తిరుమల పుష్కరిణి జ

ల అభి షేక ప్రియుడ కమలభవు జనక


నందునికి ఆనందంగూర్చు గోవిందా నారదునిచే కీర్తింపబడువాడా
నందుని ఇంటన నడయాడే కలువలంటి నేత్రములున్న గోవిందా
పూతన విషపూరిత పాలను త్రాగి ఆరక్కసిని చంపిన వాడా
తిరుమలలోని పుష్కరిణి జలముతొ అభిషేకము జరిపించుకొనుటకు
ఇష్టపడేవాడా నీ నాభికమలమునుండి జనించిన బ్రహ్మ దేవుని
తండ్రివిగోవిందా.

10. నవనీత చోరా గోవిందా

కం.నవనీత చోర గోవిం

ద వనిత దొంగ యనుచు నిను దరిచేరంగా

నవలీల కుచము గీరిన

భువనానందా ముకుంద భూతల నాధా

వెన్న దొంగా యని గోపిక నిను పట్టు కొనగా ఆమె చనుగీరిన నవనీత
చోరా లోకాలకు ఆనందమొసగు భూనాధా గోవిందా హరి హర
రూపము నీది(శివ కేశవుల ఏకైక రూపము) ముకుందా

11. పశు పాలక శ్రీ దోవిందా

కం. పశు పా లక గో విందా

దశముఖ మర్దన రఘుకుల దశరధ తనయా

పశువుల దాచిన బ్రహ్మ యు

పశుపాలక నీకు శిరము వంచెను లీలన్

గోసంతతిని పశువులను పోషించేవాడా రావణాసురిని సం హరించిన


దశరధ తనయాశ్రీరామా కృష్ణావతారములో బ్రహ్మ నిను
పరీక్షించుటకు గోవులను గోపబాలురను దాచగా పునఃసృష్టి చేసిన నీ
లీలకు బ్రహ్మ గర్వముడిగిశిరసు వంచెను.

12..పాప విమోచన గోవింద

కం. పలికెద గోవింద యనుచు

పలుమార్లు నిను గొలువంగ పావన మూర్తీ

కలుగును పాప విమోచన

తలవగ గోవిందుని నిరతము కరి వరదా

గోవింద యనుచు మాటి మాటికి పలికెదను.అలా గోవిందయని


పూజించుతే నా పాపములు పోవునుకదా!గజేంద్రు ని రక్షించిన వాడా
శ్రీహరీ.

13. దుష్ట సం హార గోవింద

తే.గీ ఖలుని గుణమును మార్చెడి ఘనుడ వనిరి

దుష్ట సం హార గోవింద దుష్ట మనసు

మార్చు దురిత నివారణ మంచి పెంచు

నీవె దిక్కు గోవింద నన్నికను బ్రోవు

దుర్మార్గుని మనసు మార్చి సన్మార్దు ని చేయగలవు. దుష్టు లను


హతమార్చెడి గోవిందుడవు.నాలోని చెడు ఆలోచనలు పోగొట్టి నా
మనసును మార్చి మంచిని పెంచి పాపాలను భస్మము చేసి నన్ను
రక్షించు గోవింద.

14.దురిత నివారణ గోవింద


తే.గీ. పాప పుంజన దళనము పద్మ నయన

నీ క రణ మగు గో వింద నిత్య సత్య

మూర్తి దురిత నివారణ ముందు చూడు

ని న్ను నేమని వర్ణింతు నీ రజాక్ష!

పద్మ నయనపాపసమూహమును తొలగించుటే నీ కర్తవ్యము నిత్య


సత్యమూర్తి..చెడు పనులు జరుగకుండా ముందు చూడు

ఓ నీరజాక్ష నిన్నేమని వర్ణించగలను

15. శిష్ట పరిపాలక గోవింద

తే.గీ. శిష్ట రక్షణ దుష్టు ల శిక్షణంబు

ధర్మ సంస్థా పనకు నీవు ధరణినందు

జన్మ నెత్తె ద ననెడి అజాయ మాన

జనన మరణ రాహిత్యపు ఙ్ఞా న మిమ్ము

మంచివారిని రక్షిం చుట దుష్టు లను శిక్షిం చుటకు ధర్మ


సంస్థా పనకు యుగయుగాలందు జన్మ నెత్తు తానని పలికే పుట్టు కే
లేనివాడా మాకు మరు జన్మ లేకుండునట్టి ఙ్ఞా నమును
ప్ర సాదించు.

16. కష్ట నివారణ గోవింద

తే కష్ట మెఱిగిన వాడవు కష్ట పడెడి

వారి కాచెడి కష్ట నివారణ హరి


వెంకటేశ సంకట హర వేద వేద్య

సంకటములను బాపుము సరసిజాక్ష

మాకష్టా లు తెలిసిన వాడివి గోవిందా.కష్టపదే వారి బాధలు తీర్చే


విష్ణువి.వేంకటేశా నీవు కష్టా లు తొలగించగలవు.వేదము తెలిసిన
వాడివి.మా వేదనలను తొలగించు పద్మాలవంటి కన్నులున్న గోవిందా.

17. వజ్ర మకుటధర గోవింద

తే.గీ వజ్రమకుట కిరీటంబు వాసి కెక్కె

వజ్రదేహము హనుమది వసుధలోన

వజ్ర మకుటధారాహరి వాసు దేవ

నీకు గోవింద నామము నిచ్చు ముదము

వజ్ర కీరీటము ధరించిన వాసుదేవా వజ్రము మహిమ ఎటువంటిదనగా


వసుధలో హనుమంతుని శరీరము వజ్రాయుధము
నగోవిందాయనగనె సంతోషించెదవు.

18 ఆది వరాహ మూర్తి గోవింద

కం. ఆది వరాహపు మూర్తిగ

ఆదను జునచట జలధిన అంతము గా వించి ధరణి నెత్తిన గోవిం

దా దురిత నివార మది ని దలతును క్రి ష్ణా వరాహ అవతారమెత్తి


హిరణ్యాక్షుడనే రాక్షసుని సం హరించి సముద్రములో మునిగిన
భూమిని పైకెత్తిన గోవిందా . రాక్క్షస సంహారమునకు దశరధుని
కుమారునిగా అవతరించావు..

19. గోపీ లోల గోవిందా

కం. నారీ నారీ నడుమన

నారాయణుడు అడుగులిడెనవ రస భరితం ఆరాట పడగ భక్తు లు

నారీ మణుల హరి విడచినచటన్ వెడలెన్ వనిత వనిత మధ్య


నారాయణుడు అడుగు లిడుచు నవరసాలు కురిపించగా
నారాయణుని చూడాలని భక్తు లు ఆరాట పడగా అడవారిని విడచి
నారాయణుడు భక్తు ల కోసము వెళ్ళెను

20.గోవర్ధనోధ్ధా ర గోవిందా

కం. గోవర్ధన గిరి ధారా

గోవింద హయములను ములుగోలన్ తోలన్

గోవింద కలిగె విజయము

గోవింద యనుచు కిరీటి గొలువగ నిన్నున్

గోవర్ధన పర్వతమును చిటికన వ్రేలిపై నుంచిన గోవిందా అర్జు నుని


రథాశ్వములను చెన్న కోలతో అదలించిన వాడా

గోవిందా అని పిలచినంతనే అర్జు నునకు కురుక్షేత్రమున విజయము


కలిగెనుకదా

కం. రారండోయనిగోవిం

దా రయమున కేల గిరిని దా ల్చెన వ వలీ


లన్ రాక్షస భంజన హరి

భారమవదు గిరి కరమున భాగవత నుతా

అవలీలగా కొండనెత్తి చిటికెన వ్రేలిననుంచి రారండొయని


గోకులవాసులను పిలచి భక్తు లచే కొనియాడబడు వాడివి తలచగ
వరాహ రూపమున భూమినే పైకెత్తిన వాడికి కొండ ఎత్తు ట భారమా

21.దశరధనందన గోవిందా

కం. దశరధ నందన రామా

దశ కంఠుని చెరన వనిజ దర్శన మయ్యెన్

దశ దిశలు వెదకు హనుమకు

దశముఖ మర్దన దనుజ విదారణ రామా

దశరధుని కుమారా పదితలల రావణుని సం హరించినవాడా

అన్ని దిక్కుల వెదకెడి హనుమకు జానకి దర్శనమయ్యెను.

జానకికి ప్రాణ నాధుడవు శ్రీ రాముడవు. నీవే గోవిందా.

22 దశముఖ మర్దన గోవింద

కం. దశముఖ మర్దన గోవిం

ద శశి వదనహరి గుణ నిధి దశరధ తనయా

దశ దిశలందున రాముడు

నిశాచరసమూహము గనినిర్జించె వారిన్


పదితలల రావణుని మర్దించిన రామా చంద్రు నికాంతిని ప్రసరించే
వదనముకల దశరధ తనయా సకల గుణ ములకు సముద్రంవంటి
వాడవు, పది దిక్కులలోనున్న రాక్షసులనుసం హ రించిన రాముడివి

23. పక్షివాహన గోవిందా |

తే గీ. .పక్షి వాహన గోవింద పాహి పాహి

మోసెదను హంస యగుచును మోదమంది

నామనసె వాహన మగును నర సఖా త

గదిక జాగు సేయంగను గరుడ గమన

పక్షి రాజగు గరుత్మంతుని వాహనముగా చేసుకున్న గోవిందా

రక్షించు రక్షించు నీకు నేను హంస వాహనమై మోసెదను.నామనసె


వాహన మగును ఓ గరుడ వాహనా ఆలస్యము చేయుట ఇక తగదు.

24.పాండవ ప్రియ గోవిందా

తే.గీ. విశ్వ రక్షణ చేసెడి విష్ణు మూర్తి.

పాండవ ప్రియ గోవింద పాహి పాహి

సవ్య సాచికి రణమున సారధిగను

జయము కూర్చినగోవింద జయము జయము

వైకుంఠమునుండి భూలోకమునకు దిగి విశ్వ రక్షణ చేసెడి విష్ణు


మూర్తి రెండుచేతులతోను బాణములు వేయగల అర్జు నునకు సారధిగ
జయము కూర్చిన పాండవ ప్రియ గొవింద .

25 మత్స్య కూర్మ గోవింద


తే.గీ. నిగమముల దాచిన దనుజుని దునుమగను

మత్స్య రూపిగ నీటసోమకుని జంపి

వేదములను కాపాడిన వేద మూర్తి

కొలుతు గోవింద యనుచును కోరి కోరి

బ్రహ్మ నుండి వేదములను దొంగిలించి సముద్రపు అట్టడుగున దాచిన


సోమకాసురుని సం హ రించి వేదములను బ్రహ్మ కందించిన
వేదమూర్తి గోవిందా నిన్ను కోరి కోరి భజింతును.

తే.గీ.పాల కడలిలో కూర్మమై పట్టి నావు

మందర గిరిని గోవింద మత్స్య కూర్మ

వివిధ రూపములనుదాల్చి వినుతి కెక్కి

నట్టి తిరుమలేశా హరి నార సిం హ

సముద్రములో తాబేలు గా దూరి మందరగిరి మునుగకుండ పట్టినావు


గోవిందా! మత్స్య కూర్మాదివివిధ రూపములతో అవతారమెత్తి విశ్వ
విఖ్యాతి పొందిన హరి నరసిం హ వందనం

26.మధుసూధన హరి గోవింద

కం. మధుసూదన హరి గోవిం

ద దనుజులు సురలు సుధకును ద లపడు చుండన్

సుధను దనుజులకు దక్కని

విధముగ మోహిని వగుటను వింతగ నుండెన్

మధు కైటభులను రక్కసులనువధించిన హరి ఓ గోవిందా క్షీరసాగర


మధనమున లభించిన అమృతము కొరకు దేవ దానవులు పోటీ
పడగా రాక్షసులకు అమృతము దక్కకుండా చేయుటకై మోహినీ
రూపము నీవు ధరించుట వింతగాఉన్నది.రెండువర్గాలలోను
బలవంతులు పోట్లా డుకొనుచున్నపుడు వారిని ఆపుటకు స్త్రీ
రూపమెత్తు ట వింతగానున్నది.యుధ్ధముకంటె మాయా మోహన
రూపమే గొప్పదని తలచుటచే మోహినీ అవతారమెత్తినావు.

27. వరాహ నరసిం హ గోవింద

తే.గీ.దనుజ డింభకు మాటకు దాల్చి నీవు

నార సిం హునిగ వెడలినావుకంబ

మందు న వరాహ నరసిం హమమ్ము బ్రోవు

భక్త రక్షక గోవింద భాను తేజ

రాక్షస రాజు హిరణ్యకశిపుణి కొడుకు ప్రహ్లా దుని మాటను నిజము


చేయుటకు స్తంభము నుండి నరసిం హునిగా ప్రత్యక్షమైనావు,హరి
అవతారమైననిన్ను వరాహ నర సిం హుడని కొలుచుచుండగా
సూర్యుని మించిన దివ్యకాంతులతో భక్తు లను రక్షించుచున్నావు.

28 వామనభృగురామ గోవిందా

తే.గీ.పుట్టు కెరుగని వాడవు పుట్టినావు

పొట్టి వానిగ వటువుగ పొగిడి బలిని

మూడడుగుల నేలనడిగి ముజ్జగములు

నిండె పాదము నుంచగ నీవు ఔర

పుట్టు క అనేది తెలియని వాడవు పొట్టివానిగ పుట్టి బ్రహ్మ చారిగా రాక్షస


రాజు బలి చక్రవర్తి వద్దకేగి అతనిని పొగిడి మూడడుగులనేలను
దానము పొంది ఒక్క కాలుతో ముజ్జగములు వ్యాపించుట

ఆశ్చర్యము సుమా!

తే.గీ. .చాల దయ్యె దరణియును చాప పదము

వామనావతారమునను వసుధ కొలువ

వామన భృగురామ హరిగో వర్ధ నగిరి

నెత్తిన యశోద తనయుడా వేడు కొనెద

వామన మూర్తి అవతారమున నీవు పాదము చాపగ ఒక్క పాదమునకే భూమి

పైన చోటు చాలలేదు.భృగు మహర్షి నీ -భార్య లక్ష్మీదేవి అన్నా చెల్లెళ్ళు..

ఋషులలో భృగు మహర్షిని నేనని గీతనందు తెలిపినావు. హరిగో వర్ధ నగిరి

నెత్తిన యశోద తనయుడా వేడు కొనెద

29.బల రామానుజ గోవిందా

కం. బల రామానుజ గోవిం

ద లక్ష్మణాగ్రజ దశరధ తనయా రామా


కలి యుగమునందు రాముని

కొలుతురు సకల శుభములను పొందగ సుమతీ

బలరాముడు నీకు అన్న లక్ష్మణునకు నీవు అన్నగా యుంటివి దశరధ

తనయుడగు రామా కలి యుగమునందు

నిన్నెప్పుడు సకల శుభములు పొందుటకై మంచి మనసున్న వారు కొలిచెదరు

30.బౌధ్ధ కల్కి ధర గోవిందా

తే.గీ. హింసను తొలగిం చగ ను మహిన వెలసిన

బుధ్ధ దేవ గోవింద మా బుధ్ధి మార్చు

సాత్త్వికముగను ధర్మము సత్యము నిలుప

అశ్వ మెక్కి కలికి గాను అవతరించు

లోకములో ప్రబలిన హింసా ప్రవృత్తి తొలగించుటకు బుధ్ద దేవునిగా

జన్మించినావు.హింసను ప్రకోపింపజేయు మనసును సాత్త్వికముగా నుండు

విధముగా మార్చుము.ధర్మము సత్యము వర్ధిల్లే విధముగా అశ్వారూఢుడవై

కలికిభగవానునిగా అవతరించు.
31. వేణు గాన ప్రియ గోవింద

తే.గీ. విమల బృందావనమునందు వీనులకును

విందగునటుల వేణువు విశ్వ మోహ

నంబుగా విని పించిన నంద బాల

వేం కట రమణ గోవింద వేద వినుత

పవిత్రమైన బృందావనములో చెవులకింపుగా ప్రపంచమునే మోహింపజేయు

విధముగా వేణునాదము వినిపించిన నందునికుమారా గోవింద నీవు వేదాలలో

తెలుపబడిన వాడా నీకు వందనం

తే.గీ.వెదురు బొంగు కరమునను వేణు వగుచు

వేద నాదము వినిపించు వేణు గాన

లోల వేణు గోపాలగోలోక వాస

గోపికాలోల గోవింద గోప బాల


వెదురు బొంగుని చేతిలో వేణువుగా మార్చి వేద స్వరములు వినిపించుటలోనే

నీవు ఇష్ట పడే వాడా గోపికలకు వశపడే వాడా,గోకులములో నడయాడే

గోపబాలుడాగోవిందా నమస్కారము.

32.వేంకట రమణ గోవింద

తే.గీ. వేం కట రమణ గొవింద వేంక టేశ

సంకట హరణ గొవింద సర్వ లోక

రక్షక మురారి శ్రీహరి రామ చంద్ర

వడ్డి కాసుల నడిగెడి వాసు దేవ

శుభములనందించే లక్ష్మీపతివి మా అడ్డంకులను మా బాధలను

హరింపజేయువాడవు జగత్తు ని రక్షించేవాడవు . ముర అను రాక్షసుని చంపిన

విష్ణువి,తిరుమలవచ్చే భక్తు లనుండి కాసులు వడ్డీ తో సహా వసూలు చేసేడి

గోవిందుడివి. ..

33 సీతా నాయక గోవింద

తే.గీ. ఫెళ్ళున శివ ధనుసు తృంచి పెండ్లి యాడి


న దశరధనందనాహరి నార సిం హ

రామ రాజ్యము కావలె రామ చంద్ర

దనుజసం హారి గోవింద ధర్మ నిరత

కం.. సీతా నాయక గోవిం

దాతిరుమల వాసుడనుచు దాపున చేరన్

గీతా పఠనము చేసిన

మా తాపము తీరుననుచు మరిమరి దలతున్

v శివ ధనువును విరచి మిధిలానగరమున సీతను పెండ్లియాడి రావణుని సం

హరించిప్రజలకు పదివేలసంవత్సరాలు పరిపాలన అందించిన సీతానాయకా

నీకు వందనములు.. మా తాపములు తీరుటకు నిత్యము గీతను చదువు.చు

తిరుమలలోని వేంకటేశ్వరుని దర్శనము చేసుకొనినచో మేలని నా నమ్మకము.

34.శ్రిత పరిపాలిక గోవింద

తే.గీ. శ్రిత జనపరి పాలకదేవ శ్రీకరహరి

దీన రక్షకగోవింద దివ్య తేజ


ఆర్తిగ పిలువ పలికెడి ఆది దేవ

శిష్ట రక్షక గోవింద శ్రీని వాస

గోవింద దీనులను రక్షించువాడివి ఆర్తిగా పిలచిన పలికేవాడివి

సజ్జనులను రక్షించు శ్రీనివాస.

35. దరిద్ర జన పోషక గోవింద

కం.గోవింద దరిద్ర జనుల

కావగ నిలచిన తిరుమల వాసా దేవా

భావ్య ము కాదు మము విడువ

ఓవసు దేవతనయనిను కోరితి క్రిష్ణా

దరిద్రజనులను కాపాడి పోషించుటకై తిరుమలనందు నివాసమున్న గోవిందా

మమ్ము విడచుట తగదు.వసుదేవుని కుమారుడవైన నిన్నే నమ్మితిని క్రిష్ణా

36. ధర్మ సంస్థా పక గోవింద

తే.గీ.అవత రింతువు గోవింద అవని నందు

ధర్మ సంస్థా పనను చేయు ధర్మ వర్తి


గోగణములను కాపాడు గోప బాల

కలికి గా అవతరించుము కమల నాభ

ధర్మ సంస్థా పన కొరకు భూమిపై అవతరించే ధర్మా చరణ కలవాడివి

గోకులమును కాపాడిన చిన్ని క్రిష్ణుడవు.కలికిగా అవతరించుము కమలమునే

బొడ్డు గా కల హరి

37. అనాథ రక్షక గోవింద

ఆ.వె. దిక్కు లేని వారు దిక్కునీవనెదరు

కరిని బ్రోచి నావు కనిక రించి

వలువ లిచ్చి పాండవ సతికి మానము

గాచి నావు నీకు గాని దేది

దిక్కులేని వారికి అనాధ రక్షకుడవు నీవె దిక్కనిరి. ని న్నె రుగని గజేంద్రు నికి

మకరి బాధ తొలగించావు,సభలో పాండవులు వగచుచుండగ ద్రౌపతికి వస్త్ర

దానము చేసావు.నీకు చేత గాని పనేదీ లేదు కదా.

38.ఆపద్బాంధవ గోవింద
కం.ఆపద్బాంధవ గోవిం

దా పరమాత్మా నిరతము ధర్మము నిలిపే

ఆ పరమ పురుష శ్రీ హరి

నీ పరి పాలన మనమున నిరతము దలతున్

ఆపదలొచ్చినప్పుడు ఆత్మ బంధువువలె కాపాడే గోవిందా ధర్మసంస్థా పన

చేయు నిన్ను నా మనసులో సర్వదా తలచుకొంటాను.

39 శరణాగత వత్సల గోవింద

కం. శరణా గత వత్సల హరి

శరణని చేరిన విభీష ణాదులు పొందెన్

హరి చెంత సకల సుఖములు

శరణాగతి మహిమ తలచ శక్యమె క్రిష్ణా

భగవంతుడు శరణని చేరిన వారిపై అపారమైన ప్రేమ


చూపును.విభీషణాదులు రాముని శరణు వేడి సకల
సంపదలతోకూడిన రాజ్యము పొందిరి.నవ విధ భక్తు లలో శరణాగతి
ఒకటి.దాని మహిమ చెప్ప నెవరి తరము.

40. కరుణా సాగర గోవిందా

కం. కరుణా సాగర గోవిం

ద రమా పతి హరి ముకుంద దశరథ తనయా


శరణని చేరితి నీదరి

కరుణా సింధో మురారికామిత ఫలదా

అపారమైన కరుణను వర్షింప జేయు గోవిం

ద కరుణా సముద్రు డవు,లక్ష్మీపతివి కేవలము విష్ణు మూర్తివి


శరణనుచు నీ వద్దకు వచ్చాను ముర అను రాక్షసుని చంపినవాడా మా
కోర్కెలు తీర్చేవాడివి.

41. కమల దళాక్ష గోవింద

కం. కమలాక్ష శరణు గోవిం

ద మహా మహిమాన్విత హరి ధరణీ నాధా

విమల గుణాన్విత అవ్యయ

సమితింజయ అతుల గహనసాత్త్విక మూర్తీ

క మలదళములవంటి కనులు కలవాడ గొవిందా మహా


మహిమాన్వితుడవు శ్రీహరివి భూమాతకు నాధుడవు
మంచి గూణాలతో సర్వదాశోభించే వాడివి సత్త్వ గుణ
శీలివి అందరినీ జయించినవాడవు.నీతో సమానులెవరు
లేరు నివెవరికి కనబడవు మంచి పనులు చేసే కృష్ణా
వందనము.

42. కామిత ఫలద గోవింద

కం. కామిత ఫలదా గోవిం


దా మధు సూదన ముకుంద దానవ సం హా

రామా ధవయనుజుడు బల

రాముని కూడి తిరుగుమధు రాపురవాసీ

అన్న బల రాముని తో తిరిగెడివాడివి.కోరికెలు తీర్చే గోవిందుడా


మధువు అను రాకహసుని చంపినవాడా ముకుందా లక్ష్మీ దేవి
నాధుడవు

43.పాప వినాశక గోవిందా

కం .పాపవి నాశక గోవిం

దా పరమ పురుష శుభాంగ దమనో ద్రష్టా

ఆపన్నివారకా హరి

గోప కిశోర కరివరద గోకుల నిలయా

పాపము ను నిర్మూలించేవాడివి పరమ పురుషుడవు


మంచి సుందరమైన మంగళ ప్రదమైన
అవయములతో కనువిందు చేయుచు ఇంద్రియ
నిగ్రహము పాటించి లోకాలను
పర్యవేక్షించేవాడివి,ఆపదలను
తొలగించేవాడివి.గోకులమున సిం హానివి. గోకులమే
నీ శాశ్వత నివాసము.
44. పాహి ము రారే గోవిందా

తే. గీ.. పాహి ముర వైరి గోవింద పలుక వేమి

పక్షి వాహన చరణము పట్ట నాకు

అంద కుంటివి నా దరి దాపు నకును

చేరు జాగును సేయకు ఎదురు చూతు

ముర అను రాక్షసునకు వైరి యగు గోవిందా


గరుత్మంతుని పై పయనించు నీదు పదములు నాకు
అందుటలేదు.నా వద్దకు ఆలస్యము చేయకుండా
వస్తా వని ఎదురు చూస్తు న్నాను.నన్ను రక్షించు.
45. శ్రీ ముద్రాంకిత గోవిందా

కం .శ్రీ ముద్రాంకిత మూర్తీ

శ్రీ మన్నారాయణాహరీగోవిందా

శ్రీమాన్ సప్త గిరినిలయ

నామము తలచెద నెపుడును నరహరి రూపా

నీది శంఖ చక్రా ది శ్రీ ముద్రలతో శోభిల్లు చున్న


మంగళరూపము.ఏడు కొండలపైన నివసించే
గోవిందా నీనామము నీ నరసిం హావతారము
ఎప్పుడూ తలచుకొనెదను.
46 శ్రీ వత్సాంకిత గోవిందా

కం.శ్రీ వత్సాంకిత గోవిం

దా వన మాలీ తిరుమల వాసా దేవా

గోవర్ధన గిరిధారా

శ్రీ వత్సముతో నిలచిన శ్రీకర క్రిష్ణా

వక్షస్థలమున లక్ష్మీదేవిని సూచించుశ్రీ వత్సమను


ఆభరణము ధరించిన వాడా గోవిందా మెడ లో
వనమల ధరించి తిరుమలకొండపైన వెలసిన
దేవా,గోవర్ధనగిరిని గొడుగువలె పట్టిన వాడివి.
శ్రీవత్సమనే పుట్టు మచ్చను కుడి వక్షస్థలమున కల
శుభములొసగు క్రిష్ణ భగవానుడివి

47. ధరణీనాయకా గోవిందా.

కం ధరణీ నాయక గోవిం

ద రమానాధా సురేశ ధన్వీ రుద్రో

విరజో అవ్యయ శ్రీమాన్

పరమేశ్వర హరి దమయిత పావన చరితా


భూమిని పాలించే వాడా గోవిందా లక్ష్మీపతీ
దేవతలకు ప్రభువువు కోదండ పాణివి,పద్మమును
వికసింపజే సినవిధముగాసృష్టిని
వికసింపజేయువాడవు,క్షీణించని వాడవు,అందరిచే
గౌరవంపబడే సర్వ శక్తు లు సకకల
సౌభాగ్యములున్నలక్ష్మీ పతివి పరమేశ్వరుడవు
కేవలము విష్ణు మూర్తివి.దుష్టు లను శిక్షిం చెదవు

48. దినకర తేజా గొవిందా

కం. గొవిందా దినకర తే

జా వజ్ర కిరీట ధారి జగదో ధ్ధా రీ

గోవర్ధన గిరి ధారా

గోవిందా గోప బాల గోపీలోలా

సూర్య తేజస్సు కల గోవిందుడా,వజ్రాలతో పొదిగిన


కిరీట ధారీ,ప్రపంచాన్ని రక్షించేవాదివి.గోవర్ధన
పర్వతమును పైకెత్తిన క్రిష్ణా గోపికల మనోహారివి
వారికి వశుడవు.
49. పద్మావతి ప్రియ గోవిందా
కం. గోవిం దా పద్మావతి

సేవించి పరిణయమాడె సేవింతు నికన్

గోవిందా యని పిలచెద

ఆవర్తన కుముద సులభ ఆశ్రమ నియమో

గోవిందా నిన్ను ప్రీమించి సేవించి పద్మావతీ అమ్మ


వారు నిన్ను పతిగా పొందింది..నేను కూడా గోవిందా
క్రిష్ణా యనుచు నీ సేవ చేసెదను.జీవుల జనన మరణ
క్లేశభరితమైన సంసార చక్రమును తిప్పేవాడివి,
భూదేవికి ఆనందము నిచ్చువాడు.కేవలము
స్మరించినంతమాత్రమునే సులభ ముగా
లభించువాడు. ముక్తు లగు మహాత్ములకు చివరికి
ఆశ్రయము ఆయన వైకుంఠమే. సర్వదేవతలను వారి
వారి పనులు చేయునట్లు నియమిం చేవాడివి
గోవిందా.
50.ప్రసన్న మూర్తీ గోవిందా

కం. చక్కని ప్రసన్న మూర్తీ

మ్రొక్కిన వరముల నొసగెడి మోహన రూపా

మొక్కులు తీర్చగ వచ్చిరి


ఎక్కుచు గోవింద యనుచును ఏడు శిఖరముల్

అందమైన ప్రసన్న రూపము.చేతులెత్తి మొక్కగనే


కోరిన వరములిచ్చెడి వాడవు,జనులు వారి
మొక్కులు తీర్చుకొనుటకు ఏడుకొండలెక్కి
గోవిందా యానుచు నీతిరుమల గిరికి వచ్చెదరు.

51 అభయ హస్త ప్రదర్శక గోవిందా

ఆ. అభయ హస్త మెత్తి ఆర్తు ల రక్షించు

గోప బాల నిన్ను గొల్తు మదిన

దేవ వేంక టేశ దేవకీ నందన

ఏడు కొండ లెక్కి వేడు కొనెద

ఆపదలోనున్న వారికి అభయ హస్త మిచ్చి వారిని


రక్షించు గోవిందా దేవ దేవ దేవకీనందనందనుగా
క్రిష్ణావతారమున నున్న వేంకటేశా ఏడుకొండలెక్కి
నిన్ను శరణు వేడెదను.
52 మత్స్యావతార గోవిందా

ఆ. మనువు గాంచె నిన్ను మత్స్య రూపునిగను

నీట నుండి తీసి నిగమ ములను


బ్రహ్మ కొసగి నావు బహురూప గోవింద

చిన్ని చేప రూపు చిత్రమగును

.ప్రళయకాలమందు నీటిలో చిన్న చేపగ నున్న నిన్ను మనువు చూచి


నీవు చెప్పినట్లు ఆచరించాడు.సోమకుని చంపి వేదాలాను
సురక్షితముగా బ్రహ్మ గారికి అందించావు. ధర్మరక్షణకై వివిధ
అవతారములు దాల్చెడు గోవిందుడవు .

విరాట్ రూపుడవైన నీవు చిన్న చేపగ మనువుకు కనబడుట చిత్రము


సుమా!

53.శంఖ చక్రధర గోవిందా

ఆ. శంఖ చక్ర ధారి శరణంటి గోవింద

నగధర వన మాలి నార సిం హ

పాహి పాహి పతిత పావన హరి

విష్ణువు నాలుగు చేతులలో రెండు చేతులందు


శంఖము చక్రము అమరియుండును.శంఖము నా
అహంకారమును అణచు గాక. సుదర్శన చక్రము నా
చిత్త వృత్తిని సరైన మార్గములో నడిపించుటకు నీ
శరణు జొచ్చినాను.కొండనేత్తిన వాడివి పాపాపలనే
కొండను తొలగించలేవా.దుర్మార్గమైన ఆలోచనలుకల
దుష్టు లను నాశనముచేయువాడివి పాపాత్ముల
మలినము తొలగించి రక్షించమని వేడెద.

54. శార్ఙ్గ గదా ధర గోవిందా

ఆ. శార్ఙ్గ మనెడి దనువు శరణాగతులకును

రక్షదురిత హారి రాజ దండ

మయ్యె గదయు హస్త మందున గోవింద

శ్రీని వాస దేవ సిరుల నొసగు

నీవు ధరించిన ధనువు పేరు శార్ఙ్గ మనెదరు అది మాకు


రక్షగా నుండును. గోవింద చేతిలోకౌమోదకి గద
దుర్మార్గులను దండించుటకు రాజ దండము.లక్ష్మీ దేవిని
నీ హృదయమున నుంచుకున్న శ్రీనివాస మాకు
ఐశ్వర్యము ప్రసాదించు

55. విరజాతీర్ధస్త గోవిందా

కం. విరజా తీర్ధము చెంతన

పురుషోత్తమ హరి నిలయము పుణ్యాత్ములకున్

పరమ దయాళో గోవిం

ద రమా నాధా కొలిచిన దర్శన మిమ్మా


విరజా జలములములు నీపాదాల అడుగున
కలవు.పురుషోత్తముడవు,హరి అవతారం నీది
గోవింద.పుణ్యాత్ములకు నీవే ఆశ్రయము.నిన్ను
కొలిచిన వారికి నీ దర్శన భాగ్యము కలిగించు దేవా.

56. విరోధిమర్దన గోవిందా

కం. క్రిష్ణా విరోధి మర్దన

క్రిష్ణం వందే యనగనె క్రిష్ణా మాకున్


కష్టము తొలగును శ్రీహరి

ఇష్టము గోవింద యనుట నీకును నెపుడున్

క్రిష్ణావతారములో విరోధులు బంధువులైనా వారిని


దండించితివి.క్రిష్ణం వందే యని స్తు తించినవారిని
కృపతో కష్టములు బాపితివి. నిను తలచిన తీరును
చింతల్.

57.సాల గ్రామ ధర గోవిందా

కం. సాల గ్రామము నమరెను

మాలగ గోకులమున గల మాయా రూపీ

బాలుడవు కావు బ్రహ్మవు


లీలలు జూపుచు కనులన నీరున్ తగునా సాలగ్రామ
ధారణ సరిపోయెను.గోకులమున బాలుని గా నీ వెవరో
తెలియకుండా మాయా రూపము ధరించావు.బాలుడివి
కాదు బ్రహ్మవి.ఏన్నో లీలలు చూపావు.యశొద నిన్ను
తాడుతో ఱోటికి కట్టివేయగా జాలిగా ముఖము పెట్టి
దొంగ ఏడుపు గావించుట నీకు తగునా!
58.సహస్ర నామా గోవిందా

కం.అహమును నణచెడి వాడవు

సహస్ర నామార్చనలను సలుపగ గోవిం

దా హరి తిరుమల వాసా

సహనము సాత్త్విక గతులకుసాధ్యము నెపుడున్

తిరుమల వాసా అహంకారము నణచెడి వాడవు. సత్త్వగుణము కలవారికి


సహనముతో నుండుట సాధ్యము.సహస్ర నామార్చనల తోనిను సేవించు వారికి
సహన శీలురకు సకల శాశ్వత సంపదలొసగెదవు.శివ కేశవ స్వరూపము నీది.

59.లక్ష్మీ వల్లభ గోవిందా

కం. లక్ష్మీ వల్లభ భక్తు ల

రక్షణ సేయగ సమయము రానే వచ్చెన్

పక్షీం ద్రు నిపై న గోవిం

ద క్షణమైన విడువకుమము దయతో గనుమా


లక్ష్మీ పతివి.భక్తు లను రక్షించే సమయము ఇప్పుడు కలిగింది.పక్షీ
రాజు వాహనము. క్షణమైన మమ్ములను వదలకుము,మాపై దయ జూపుము
60.లక్ష్మణాగ్రజ గోవిందా

తే. లక్ష్మణాగ్రజ గోవింద లంక కేగి

రణము నందున పరిమార్చి రాక్షసులను

సీత ను గొనిన వాడివి శ్రీని వాస

దిక్కు లేనివారికినీవె దిక్కనెదరు

ఆదిశేషుని అవతారమైన లక్ష్మణునకు నీవి అన్నవి,సీతాదేవిని చెరపట్టిన


రావణుమి రాక్షస సహితముగ నాశనముగావించి సీతను లంకనుండి
తీసుకొనివచ్చి పట్ట్టాభిషిక్తు డ వైతివి.శ్రీనివాసు డివి.దిక్కులేనివారికి
నీవె దిక్కు సుమా!

61. కస్తూరి తిలక గోవిందా

కం. కస్తూరి తిలక ధారీ

హస్తిని కావగ వడి వడి అడుగులు పడగా

వస్తివి గోవిం ద యనగ

వాస్తవముగనిను తలచిన కాచెద వెపుడున్

కస్తూరి తిలకము దరించేవాడా గజ రక్షణార్ధము ఆతురతతో నడచావు


క్రిష్ణా.మనసులో నిన్ను తలచిన చాలు గోవిం ద యనగ సర్వకాల
సర్వావస్తలందు రక్షించెదవు.

62.కాంచనాంబరధర గోవిందా
తే. కాం చనాంబర ధారివి కమల నేత్ర

కామిత ఫలదా గోవింద కాంచన వలు

వలను కట్టు ట ఎందుకు వస్త్ర ములుగ

దిక్కులుండెను నీకును దివ్య తేజ

కాం చనాంబర ధారిబంగారపు వస్త్ర ధారణ నీకేల


నీకు నలుదిక్కులే వస్త్రముగా నున్నవి కదా!మా
కోర్కెలు తీర్చేవాడా కమల నేత్రు డవగు గోవిందా

63.గరుడ వాహనా గోవిందా

.తే. గరుడ వాహన గోవింద గాన లోల

గరుడ గమనము నీకేల గోప బాల

వాహనముగను మనసును వాడ దగును

నామనసును వాహనముగ వాడు మికను

గరుత్మంతుని వాహనము గా
ఉపయోగించుకొనుచున్నావు గోవిందా.
వాహనముగను మనసును వాడ దగును

నామనసును వాహనముగ వాడు మికను

64. గజ రాజ రక్షక గోవిందా


కం.గజరాజుని రక్షించిన

భుజగశయన హరిమురారి భూతాది నిధీ

విజయా దేవా గోవిం

దజగద్రక్షక నిలుపుము ధర్మము క్రిష్ణా

గజేంద్రు నిమకరి బారినుండి రక్షించావు. ఆది శేషుని


పైన పడుకుంటావు. మాపాపములుహరించే
వాడివి.సర్వ భూతములకు స్థా నము
నీవే.అన్నిటిలోను విజయము నీదే.ముర అను
రాక్షసునుచంపిన
వాడివి.జగద్రక్షకుడవు.ధర్మమునునిలిపే
గోవిందుడవు.

65.వానర సేవిత గోవింద


కం. వానర సేవిత గోవిం

దా నారాయణ నరహరిదండో దమ యః

దీనదయాళూదేవా

దానవనాశక తగుదువు ధర్మము నిలుపన్


వానరులచే కొలువబడి రాక్షస సం హారము చేసిన రామ
చంద్రాగోవింద నారాయణా నారసిం హ.దండించేవాడివి
ఇంద్రియనిగ్రహముకలవాడా

ధర్మ సం స్థా పన చేయుటకునీవే తగిన వాడవు.

66 వారిధి బంధన గోవిందా

కం.వారిధి బంధన గోవిం

దారఘు రామా నుదధిని దాటగ కట్టెన్

వారధివానరులందరు

నారాయణుడవతరించె రాముని రూపున్

లంకకు చేరుటకు వానర సైన్యము


సముద్రముదాటుటకు వంతెన కట్టిరి.నారాయణుడె
రాముని రూపమున మానవుడిగ రఘు వంశమున
జన్మించాడు.

67. . ఏడు కొండల వాడా గోవిందా

ఆ. ఏడు కొండలెక్కి ఎదురుగ నిలచిన

కాన రావు మాయ కమ్మె నాకు

వడ్డి కాసు లడుగు వాడివి గోవింద


అసలు చాలు వడ్డి అడగ వద్దు

ఏడు కొండలెక్కి దర్శనానికివస్తే నీవు కనబడ కుండా


నాకుమాయ కమ్మింది.నీవు వడ్డి కాసులవాడివని
అనెదరు. అసలు చాలు వడ్డి అడగవద్దు గోవింద.

68.ఏక స్వరూప గోవిందా

కం. ఏక స్వరూప గోవిం

దాకరుణానిధి ఇహపర దాయక దేవా

లోకేశ్వర కరుణాకర

ఏకో నారాయణ యని వేదము తెలిపెన్

గోవిందా నీరూపమొక్కటే నీవు దయా


సముద్రు డవు.జీవించినప్పుడు సుఖ శాంతులు
దేహానంతరము స్వర్గభోగాలు నీవలనే లభించును.
కారుణ్య మూర్తివినారాయణా నీవు జగత్తు కే
ఈశ్వరుడవు.నారాయణుడొక్కడే ఇతరమేమి లేదని
వేద ము తెలిపెను.

69.శ్రీ రామ క్రిష్ణా గోవిందా


కం. శ్రీ రామ క్రిష్ణ గోవిం

దా రఘురామా నిలుపగ ధర్మము జగతిన్

నారాయణుడే వచ్చెను

నారాయణా యని తిరుగు నారద మునియున్

శ్రీ రామా శ్రీ క్రిష్ణా గోవిందా అని


పిలచెద.ధర్మస్థా పనకునారాయణుడేరామునిగా
అవతరించెను.నారదముని నారాయణా
యనితిరుగుచు స్మరించును.

70.రఘుకులానంద గోవిందా

కం.రఘు రామా గోవిందా

అఘముల బాపుము శుభకర అంతర్యామీ

రఘుకుల నందన రామా

రఘు వంశోత్తమ దశరథ రామా దేవా

రఘు రాముడివి గోవిందా మా పాపములను తుడిచి


మాకు శుభములనొసగుము.మా గుండెలలో
అంతర్యామిగనున్న రామ చంద్రు డివి.
7 ప్రత్యక్ష దేవ గోవిందా
కం.ప్రత్యక్ష దేవా గోవిం

దా తాప హరణ ముకుంద దనుజాం తకుడా

సత్యము తెలుపగ నీవే

నిత్యము కనబడు దినకరునివలెను తోచున్

గోవిందా పిలచినంతనే ఎదురుగనిలచే దేవా


.మాతాపత్రయాలను పోగొట్టు . ముకుందా
సత్యముతెలియజేయుటకు మాకు రోజూకనబడే
సూర్యుడవు.

72. పరమ దయా కర గోవిందా


కం.పరమ దయా కర గోవిం

దారక్షించుమని వేడ దయతో రావే

మి రమానాధా వీడుము

పరమ పదమునిక హరిహర పావన చరితా

పరమ పావాన చరితము కలవాడాదయా


సముద్రు డా రమాపతిహరిహర రూపుడవు గోవిందా
మము రక్షించుటకు రావేమి?మము రక్షించుటకు
పరమ పదమగు వైకుంఠము వీడి రావలయును.
73.వజ్ర కవచ ధర గోవిందా
ఆ. సర్వ కర్మ ఫలము సమ కూర్చు గోవింద

వజ్ర కవచ ధారి వాసు దేవ

ఆత్మ కేల రక్ష అనంద నందన

వెంకటేశ ఈశ వేద వేద్య

వజ్ర కవచము ధరించిన గోవిందా అన్ని కర్మల


ఫలితాలను అందించి అనందము కలిగించి
అందరిగుండెల్లోయుండే వాసు దేవుడవు .మా
బాధలు తొలగించే వెంకటేశుడవు,జగత్తు ను
పరిపాలించేఈశ్వరుడవు.వేదాలవలన మాకు నీవెవరో
తెలిసెను.

74.వైజయంతి మాల గొవింద


ఆ. వై జ యంతి మాల వైరుల నణచును

మాల ధారణంబు మహిమ లొసగు

వెం కటేశు మెడను వెలుగులు నింపెను

విష్ణు మూర్తి కొసగు విజయమెపుడు

విష్ణువు మెడలో వైజయంతిమాల అందముగా


మెరుస్తు న్నది.గోవిందనామ జపము
చేయువారువైజయంతిమాలను ధరించిన అతని
గ్రహ దోషాలు పోయి అష్ట సిధ్ధు లు కలుగుతాయి.
75.వడ్డికాసులవాడ గోవిందా

తే. వడ్డి కాసులగోవింద వందనంబు

మొక్కు తీర్చగ వచ్చితి మోము చూపు

అసలు ఋణమును తీర్చెద అడుగ వలదు

వడ్డి కాసులు కరుణించు వాసు దేవ

గోవిందా వడ్డి కాసులవాడా వందనం.నామొక్కును


తీర్చుటకు వచ్చాను.దర్శన భాగ్యము కలుగచేయి.నీ
బాకీలోఅసలు మాత్రముతీర్చెదను.నాపై కరుణించి
వడ్డి కాసులు అడుగవలదు.

76. వసుదేవ సుతా గోవిందా


కం. వసుదేవ సుతా క్రిష్ణా

కసితో చంపగ దలచెను కంసుడు నిన్నున్

కసరకు గోవింద జనుల

అసురుల మనకుము దయగను అమిత దయాళూ

వసుదేవుని తనయుడవగు క్రిష్ణా నిన్ను కంసుడు


చంపటానికి కసితో ఎంతో ప్రయత్నించాడు.నీ
కరుణకొరకు వేచియున్న జనుల కసరవద్దు .మేము
ఇతరులను బాధించే రాక్షసులము కాదు.మా పై
దయ చూపినంతమాత్రమున నీకు తరిగేదేమీ
లేదు.నీవు అవ్యయుడవుగోవిందా

.77.బిల్వ పత్రార్చిత గోవిందా

తే. బిల్వ పత్రార్చితుండవు విశ్వ నాధ

చేతు లారంగ పూజలు చేసి నంత

మేలు కలుగును గోవింద ఎంచి చూడ

శివు డొసగును శుభములు శీఘ్రము గను

విశ్వమునకు ప్రభువైన గోవిందా


నిన్నుబిల్వదళములతో జనులు పూజ చేసెదరు.
మంచి చెడులు ఆలోచించగా మనశరీరమునకు
చేతులున్నందునకు చేతులతో పూజలు చేస్తే సార్ధకత
కలిగి శివకేశవులకు ప్రీతి కలుగుతుంది.లక్ష పత్రి
పూజచేయలేక పోవచ్చు శివలింగముపై ఒక్క బిల్వ
దళము నుంచి నమస్కరించి చూడు శుభములు
త్వరగా చేకూరును.
78. బిక్షుక సంస్తు త గోవిందా
కం.బిక్షుక సంస్తు త గోవిం

దక్షమము దయను నొసగుముధరణీ నాధా

బిక్షుకులు తలచు దేవుని

బిక్షుకులనరు తదితర బిక్షక జనులన్

బిక్షుకులచే స్మరింపబడే గోవిందుడు దీనులపై దయ


కలిగియుండును.బాధలకు తట్టు కొను
శక్తినిచ్చును.నిజమైన బిక్షకులు తమకు తామే ఆకలి
బాధను తీర్చుకొనూటకు ఆహారము స్వయముగా
సంపాదించుకొని భగవన్నామ స్మరణ చేస్తూ
బ్రతుకుతారు.బిచ్చమేత్తు కొని జీవించాలనే వారు
భగవంతుని స్మరించని వారు బిక్షకులు కారు.
జలధిన మునిగిన భూమిని వరాహ రూపమున
పైకెత్తిన ధరణీ నాధుడవు గోవిందా.
79. స్తీపుం రూపా గోవిందా

కం.స్త్రీపుం రూపా గోవిం

దా పుణ్య పురుష ధరించె దవునర నారీ

రూపములు తగు సమయమున


ఆపద మొక్కుల తిరుమల అధినాయకుడా

స్త్రీ పురుషరూపములేవైనా నీవు ధరించి మా


ఆపదలుతీర్చే గోవిందుడవు,జగత్తు కే
అధినాయకుడివి.పురుషోత్తముడివి.పార్వతీ
పరమేశ్వరులవలె నర నారీ రూపము దరించెదవు.
80.శివకేశవ మూర్తి గోవిందా

కం.శివకేశవ గోవిందా

ఏవరును వేరుగ తలవరు ఏపుడున్ యముడున్

శివ కేశవనుతి చేసెన్

శివకేశవులన నొకటని శిష్టు లు పలుకున్

గోవిందా శివకేశవ స్థు తి కాశీ క్షేత్రములో శివలింగానికి


అభిషేకము చేస్తూ యముడు చదివిన స్తోత్రమిది.
శివ కేశవులు వేరు కాదని ఒకటే యని వేదాంతులైన
శిష్టు లనెదరు.

81.బ్రహ్మాండ రూప గోవిందా


కం..బ్రహ్మాండ రూప గోవిం

దహరీకడుపున జగములు దాచిన వాడా

బ్రహ్మాండంబులు కరమున
బహు రీతుల నట నిలిపెను బంతుల లీలన్

గోవిందా విశ్వమే నీ విరాట్ రూపము.లోకములు నీ పొట్టలో


దాచావు.బ్రహ్మాండములు నీకుబంతులుగా తోచినవి.

82.భక్త రక్షణ గోవిందా

తే. భక్త రక్షణ చేసెడి బాధ్యత కల

వాడు గోవిందు డనుచును వచ్చి నాము

నాలుగుతెగల భక్తు లనగవలదిక

భక్తి ముఖ్యము రక్షించు భవ్య చరిత

గోవింద భక్తు లను రక్షించే బాధ్యత నీది .ఆర్తు లని


కోరికలతో వచ్చారని తనమహత్తు ను
తెలుసుకొనుటకు వచ్చిన ఙ్ఞానులని మోక్షము
పొందుటకువచ్చారనిమమ్మలను
విడదీయకు.మాలోని భక్తిని మాత్రమే నీవు గుర్తించు

83. నిత్య కళ్యాణ గోవింద 5

తే. నిత్య కళ్యాణ గోవింద నిఖిల లోక

వాస శేషాచల నిలయ వాసు దేవ

నిత్య కళ్యాణము జరుగు నీకు గుడుల


లోన బాగుగ చూడుము లోక మంత

అన్నిలోకాల్లోయుండే వాడవు .మాకోసముశేషాద్రిపై


యున్నావు. నీకు నిత్యకళ్యాణముగుడులందు
జరుగుచుండును.లోకమంతా బాగుగా యుండే
విధముగా చూడవయ్యా!
84. నీరజ నాభ గోవిందా

కం.నీరజ నాభా గోవిం

దా రమణీప్రియ నిలుపగ ధర్మము నీవున్

భారము బాపగ ధరణిన్

కోరి యవతరించునెపుడు గోపీ లోలా

కమలనాభా గోవిందా లక్ష్మీ దేవి ప్రియుడవగు నీవు


ధర్మ సంస్థా పనకు భూభారము తగ్గించుటకు
కావాలని భూమిపై అవతరించెదవు.గోపికల ప్రేమకు
వశమైన వాడివి.

85 హాథీరామ ప్రియ గోవిందా

ఆ. హాతి రాము నింట ఆడుచు గోవింద

పాచికలను వదలి నావు నగను


చెరకు నంత తినిన చెరనుండివిడిచెద

మనగ చెరకు తినగ మారె కరిగ

గోవిందా హాథీ రాముడి ప్రియుడవు కనుక


అతనీంట్లో పాచికలాడి నగను వదలి
వెళ్ళావు.అతనినిచెరలో పెట్టి చెరకునంతా తిని
నిర్దోషిగా బయటపడమని శిక్షించగా ఏనుగు
రూపము ధరించి చెరకంతా తిని నీ సఖుని
విడిపించావు
ఆ. తింటి వంత చెరకు తిరుమల నందున

పేరు మార్చు కొనిన వేంకటేశ

భక్త వరద నిన్ను బాలాజి మరియును

హాథి రామ సఖుడ వనిరి జనులు

చెరకునంతయు ఏనుగు రూపమున వచ్చి తిని


సఖుడగు హాథీరాముని చెరనుండి
విడిపించితివి.వెంకటేశా నీ పేరే మార్చి బాలాజీగా
జనులచే పిలువబడుచున్నావు
86 హరి సర్వోత్తమ గోవిందా
కం.హరి సర్వోత్తమ గోవిం

ద రమానాధా ముకుంద దశరధ తనయా

పరమ దయాళో శ్రీహరి

వరాహ రూపా తిరుమల వాసా ఈశా

విష్ణుమూర్తివి అందరికన్నా ఉత్తముడవు లక్ష్మీపతి గోవిందా


మోక్షమునిచ్చు ముకుందుడవు.ధర్మాచరణ ప్రజలకు
తెలుపుటకు అవతారమెత్తినదశరధ తనయుడవైన
శ్రీరామచంద్రు నివి. పరమ
దయకలవాడివిశ్రీహరివి.వరాహరూపమెత్తి భూమిని
పైకెత్తినవాడివి.తిరుమలలో నున్న భగవంతుడివి.

87.జనార్దన మూర్తీ గొవిందా

కం. గోవింద జనార్దన హరి

గోవుల కాపరి సుజనుల కొసగుము మోక్షం

జీవులకాశ్రయ కర్తవు

నీవే భక్త జనులకును నిలయం తలపన్

గోవిందా నీవు శాశ్వతమైన


ఆశ్రయమిచ్చేవాడివి,సుజనులకు రక్షకుడవు.గోకులమున
గోవుల రక్షకుడివి.భక్తు లకు మోక్ష
దాతవు.పాపములు హరించేవాడివని తలచెదను.
88 .జగత్సాక్షి గొవిందా

. కం జగమున సాక్షిగ నుంటివి

జగదో ధ్ధా రా ముకుంద జగములు నేలే

జగదీశ్వరుడవు చేయుము.

అగజా ననుడును నిలువగ అండగ మాకున్

ప్రపంచములో జరిగే పనులన్నిటికి నీవు సాక్షిగా


చూస్తూయుండెదవు.జగమునకు ఆధారము నీవే.

గోవిందా.కుముదము వికసించినట్లు జగత్తు నీవలనే


ప్రకాశించుచున్నది.జగదీశ్వరుదవైన క్రిష్ణా పార్వతీదేవి
ముఖనునకూఅనందంకలిగించే విఘ్నేశ్వరుడు
మాకు అండగా నుండునటుల చూడు
89 .ఆభిషేక ప్రియ గోవిందా

తే.భక్తి తోడను జలమును భవుని లింగ

మందు ధారగ పోయుచు మనసు నిలిపి

చేతులారంగ పూజలు చేసి చూడు

కలుగు శుభములు పోవును కలుష మంత

దీని ని అభిషేక మనదగు


అభిషేకమనగాభక్తితో పవిత్రజలములు లింగముపై చి
లుకుట. మనలోని కలుష భావనలు తరిగి
పోవును.శివుని కరుణా కటాక్షము అధికముగా
లభిస్తుంది.అర్చనా విధానములో అభి షేకముతప్పని
సరి.

తే.సురభి క్షీరము నీకును సుర పతి అభి

షేక మొనరించె నిత్యాభి షేక పూజి

తా జనార్దనా భవభయ తాప హరణ

గోకులానంద గోవింద గోప బాల

దేవలోకమందలి సురభి గోవు పాలుతెచ్చి ఇంద్రు డు


నీకు అభిషేకము చేసెను. క్రిష్ణా భక్తు లచే నీవు
నిత్యము అభిషేకార్చనలతో
పూజింపబడుచున్నావు.ప్రపంచమును ఉధ్ధరించే
వాడివి.సంసార భయమను తాపమును దూరముచే
యు

గోవిందుడివి.గోకులమునకు ఆనందం కలిగించు


గోప బాల గోవిందా!
90.ఆపన్నివారణ గోవిందా

కం. ఆపన్నివారణా హరి

గోపీజనసేవితజగదోధ్ధా రణమే

నీపని గోవిందా నిక

ఆపన్నుల కాచుసమయ మయ్యెన్ దేవా

భక్తు ల ఆపదలను నివారించే గోవిందుడవు.గోపికా


సమూహముచే
పూజింపబడేవాడివి.ప్రళయమునుండి జగత్తు ని
ఉధ్ధరించేవాడివి.ఆపద్దలు రాకుండా చూచుటే నీ
కర్తవ్యం.భక్త జనుల ఆపదలను నివారణ చేయు
సమయమిదే దేవా.

91.రత్న కిరీటా గోవిందా

రత్న కిరీటా కౌస్తు భ

రత్న సుశోభిత మనోహరా గోవిందా

రత్నా కరమే నిలయము

రత్నమయంబుగను ధరణి రాజిలు నెపుడున్


శిరమున రత్న కిరీటము పరుండేది మామగారగు
రత్నాకరుడగు సముద్రజలమున.భూమిమీద
యుండకుండా మామగారి గృహమునే
వాడుకొనుచున్న లక్ష్మీనాధుడివి.రత్నమహిమ
వలనమనము చేసిన పనులకు ఫలితము
కలుగుతుంది క్రిష్ణా.

92 రామానుజనుత గోవిందా

కం.రామానుజనుత గోవిం

దా మధు సూదన సురేశ దశరధ తనయా

కామిత ఫలదా దేవా

రాజీవాక్షా ముకుంద రఘుకుల తిలకా.

భక్తు డగు రామానుజునిచే స్తు తింపబడినవాడు మధు


అను రాక్షసుని చంపిన వాడు దేవతలలకే దేవుడివి
రాక్షస సం హారమునకై దశరధతనయునిగా
జన్మించిన రామ చంద్రా కోరిన కోరికలు
ఫలించేవిధముగా చేయువాడా కమలములవంటి
కన్నులు. కలవాడివి
మోక్షమిచ్చువాడివి.రఘువవంశములో శ్రేష్టు డివి

93 స్వయం ప్రకాశ గోవిందా

భగ వాన్ స్వయం ప్రకాశమా

న గరుడ వాహన తిరుపతి నందున దేవా

జగదో ధ్ధా రకగోవిం

ద గభీరో హరిసురేశధరణీ నాధా

తనవెలుగులో తాను వర్తించే భగవాన్ నీవు స్వయం


ప్రకాశ మూర్తివిప్రపంచమునుధ్ధరించే
గోవిందాదేవదేవా

ఞ్ఞానము ఐశ్వర్యం సర్వ శక్తు లుకలిగిన


వాడుగంభీరమైన స్వభావము కలవాడుగభీరుడు.

గరుడ వాహనుడివి తిరుమలనయున్న దేవుడివి

దేవతల కి దేవుడివి..

గోవిందా విష్ణు దేవుని అవ తా రముగా వెలసిన


భూదేవి భర్తవి.
94.ఆశ్రిత పక్ష గోవిందా

.ఆ. ఆశ్రయించు వారి ఆపద తొలగించి

వారి పక్ష మందు వాసు దేవ

నుందు వెపుడు ధర్మ మునెలకొల్ప దలచుచున్

ఏడు కొండలందువేంకటేశ

ఆశ్రితుల పక్షమున నుండి వారి ఆపదలు తీర్చుచు


ఏడు

కొందలందుండి ధర్మ సంస్థా పన చేయాలని


చూచెదవు వేంకటేశ.

95.నిత్య శుభ ప్రద గోవిందా

తె. నిత్య శుభకర గోవింద నీర జాక్ష

సప్త గిరివాస శ్రీధర సత్య మూర్తి

కాల నేమిమహావీర కామ దేవ

విశ్వమూర్తిమహామూర్తివిష్ణు దేవ

రోజూ మంగళ ప్రదముగా యుండునట్లు చేయు


గోవిందుడవు కమల లోచనుడవు ఏడు కొండలపై
నుండిభక్తు ల కోరికలు తీర్చేవాడివి లక్ష్మీదేవిని
వక్షస్థలమున ధరించినవాడివి.సత్యమురూపుదాలిస్తే
నీవలె యుండును.కాలనేమియను రాక్షసుని
చంపినవాడివికాలమున కతీ తమైనమహా వీరుడివి
మన్మధుని తండ్రివి కోరికలు తీర్చే
దేవదేవుడివి.విశ్వము మొత్తమునీ
ఆకారమే.ప్రకాశవంతమైన వెలుగులను
లోకానికందించే దివ్య మూర్తివి.బ్రహ్మాండమంతా
వ్యాపించిన విష్ణు వి ఏడుకొండల వెంకట రమణ.

96. నిఖిల లోకేశ గోవింద

తే. నిఖిల లోకేశ గోవింద నిన్ను నమ్మి

నాను నన్నిక వీడకు నార దాది

మునులు సన్నుతి చేతురు ముక్తి దాత

పాప హారివి మమ్ముకాపాడు దేవ

అన్ని లోకములకు దేవ దేవుడవగు గోవింద నిన్నే


నమ్మితిని.నను నీవు వదలవద్దు .నారదాది మునులచే
నీవు సర్వదా స్తు తింపబడుచున్న ముక్తి దాతవు.మా
పాపాలను పోగొట్టి ఆపదలనుండి కాపాడవయ్యా
దేవ.

97 ఆనంద రూపా గోవిందా

ఆనంద రూపా గోవిందా

కం.ఆనందో బ్రహ్మ యనిరి

ఓ నం ద కిశోర నంద గోపుని యింటన్

ఆనంద రూప గోవిం

దానరసిం హా యశోద మాతవిధేయా

గోవిందా ఆనందమూర్తీ అనందమే బ్రహ్మ యని


వేదసూక్తి.నందగోపుని యింట్లో అనందముగా
పెరిగావు.యశోదామాతకు విధేయుడిగా
నటించావు.రాక్షస సం హారములో నరసిం హుడివే

98.ఆద్యంత రహితా గోవిందా

కం.ఆద్యంత రహిత గోవిం

దాదీ నదయా ళుడవని దలచితిక్రిష్ణా

నందుని యింటన్ పెరుగుట


నందుని భాగ్యమనదగును నరయగ దేవా

సృష్టికి ముందున్నావు ఇప్పుడున్నావు ఇక


అంతములేని చివరను నీ వే యుండి జగత్కార్యము
నెరవేర్చువాడివి. ఆది మధ్యాంతర రహితా గోవిందా
నందుని యింట పెరుగుట నందుని భాగ్యమని
తలచెదను దేవా నీవు దీనులపట్ల దయతో
యుండెడివాడవు.

99.ఇహ పరదాయక గోవిందా

కం .ఇహ పరదాయక గోవిం

దహరివి నుంటివి శిలగను దానవ వైరీ

బహుగుణ శోభిత క్రిష్ణా

సహకార మొసగు జనులకు సారస నయనా

గోవిందా భూలోక సంపదలు స్వర్గ సౌఖ్యము


జనులకునొసగుటకైశిలగా భూలోకమున వెలసిన
హరివి సద్గుణములతో శోభిల్లే క్రిష్ణా

100.ఇభ రాజ రక్షక గోవిందా


కం. ఇభ రాజ వరద గోవిం

ద భాను మండల నివాస దనుజాంతకుడా

అభయము నిచ్చెడి హస్తము

శుభముల నొసగుము నెపుడును సుందర


వదనాగజేంద్రు ని రక్షించిన గోవిందా
సూర్యమండలము నీ నివాసము.రాక్షస సం హారము
నీ కర్తవ్యము.ఆపదలోనివారికి అభయమునిచ్చెడి
హస్తము నీది.నీవు మాకు సర్వదా
శుభములొసగుము సౌందర్య రా శివి.

101.పరమ దయాళో గోవిందా

కం. పరమ ద యాళో గోవిం

దరమా నాధా విశోక దక్షో ధాతా

ధరణీ నాయక సవితా

పరమేశ్వర పాపహారి పావన చరితా

గోవిందా నీవు పరమ దయళుడవు.లక్ష్మీదేవి


నాధుడవు.భూదేవి భర్యవు.శోక నాశకుడవు,బ్రహ్మఏ
తండ్రివి.దేవకార్యము విజయవంతము చేయుగల
నేర్పరివి.సవిత అని పిలువబడేసూర్యమండలములో
నిదివ్య జ్యోతివి.మ పాపములను పోగొట్టే పుణ్య
చరితుడవు నీవే పరమేశ్వరా.

102.పద్మ నాభ హరి గోవిందా

తే.. పద్మ సంభవుడు తనయుడయ్యె నీకు

పద్మ నాభహరి యనుచు పలు విధాల

పరవశించినుతింతును పాండు రంగ

వేంకటేశగోవిందనా వెతలు బాపు

పద్మ సంభవుడు తనయుడయ్యె నీకు

పద్మ నాభహరి యనుచు పలు విధాల

పరవశించినుతింతును పాండు రంగ

వేంకటేశగోవిందనా వెతలు బాపు

103. తిరుమల వాసా గోవిందా

కం.తిరుమల వాసా దేవా

తిరుమల చేరిన జనులను తిలకిం చుమికన్

తరుగదు నీ సిరి కనులను


తెరచిగనగనే సమయమిదేగోవిందా

తిరుపతి వేంకటేశా దేవా నీ దర్శనము కొరకు


జనులు ఎదురు చూస్తు న్నారు.కనులను తెరచి
వారిని చూచినంత మాత్రమున నీ సొమ్మేమి
తరగదు.వారికి దర్శనమిచ్చే సమయమిదే గోవిందా.

104.తులసీవనమాల గోవిందా

తే.. నీరజాక్ష తులసి మాల నీకు మెడన

నుండె గోవింద తులసియు నుండె ధర్మ పత్ని

గాను తులసియుండినచోట కలసి మువ్వు

రమ్మలొసగును వరములు రమణులకును

కమలములవంటి కనులుగ గోవిందా తులసిమాలా


ధారివి.తులసి కూడా నీ ధర్మ పత్ని.తులసి యుండిన
చోట మువ్వురమ్మలు లక్ష్మీ వాణీ సరస్వతులు
పూజలు చెసిన స్త్రీలకు వరములిచ్చెదరు.

105. శేష సాయినే గోవిందా

తే.శేష సాయినే గోవింద వెంకటేశ


ఆది నారాయణాహరి ఆది దేవ

ఆది అంతము లేదని అందు రెపుడు

ఆత్మ రూపమై వెలుగెడి ఆది పురుష

గోవిందా లక్ష్మీదేవితో నున్న హరివి

శేషతల్పము మీద శయనించు ఆది నారాయణుడవు

. మొదలు మధ్య చివర లేని వాడవని


యందురు.అందరిలో ఆత్మగా వెలిగెడి ఆది
పురుషుడవు

106.శేషాద్రి నిలయ గోవిందా

. కం. శేషా చలపతి వందురు

శేషుడు శయ్యగ సతతము సేవయు చేసెన్

శేషాద్రి నిలయ దేవా

దోషము లెంచకు శరణము కోరగ నిపుడున్

గోవిందా నిన్ను శేషా చలపతివని పిలచెదరు.శేష


శైలము నీ నివాసము.ఆదిశేషుడు నీకు సతతము
శయ్యగా నుండి సేవ చేయు చుండును.నీ
శరణుకోరి వచ్చినవారి దోషములెంచకుమా!

107. శ్రీనివాస శ్రీ గోవిందా

తే. శ్రీమహా విష్ణు గోవింద శ్రీకరంబు

నిన్నుతలచిన వారికి సిరుల నొసగు

వాడివని దలతు దీన దయాళు వేంక

టేశ గోవుల కాపరి కేది గోవు

శ్రీ మహావిష్ణువే గోవిందునిగా మాకు


సిరులొసగుటకు తిరుమలన
వేలసితివి.ఐశ్వర్యమిచ్చెడివాడవని
తలచెదను.దీనులపట్ల జాలి చూపెడి వాడివి.. క్రిష్ణా
వతారములో గోవుల కాపరివైన నీకే కలియుగమున
తిరుమలలో నున్న నీవు అగస్త్యుని గోవు కావాలని
అడగవలసి వచ్చింది.గోవు ఇందా య ని
అగస్త్యుడనుచున్నా వెనుకకు తిరుగకుండా
కనబడకుండా వెల్ళితివి. గోవులకాపరికే గోవు
దొరకలేదు చిత్రము సుమా!

You might also like