You are on page 1of 16

నేటి క్రైస్తవ్యం పుస్త కము – 17

Christianity today Series Book- 17

దేవునిని ఎరుగుట Knowing God


V.D.Livingsto -
ne
1) తెలివా లేక జ్గా నమా ( Knowledge or Wisdom )

Text యోహాను 17 : 3 – అద్వితీయ సత్య దేవుడైన నిన్నును , నీవు పంపిన యేసు క్రీస్తు ను
ఎరుగుటయే నిత్య జీవము .
అనేకమంది క్రైస్తవులు ప్రపంచ వ్యాప్త ంగా దేవుని గురించి తెలుసుకోవడానికి
ప్రయత్నిస్తు న్నారు గాని దేవున్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు . దేవుని గురించి
తెలుసుకోవడం వలన తెలివి (Knowledge) లేక కొంత సమాచారం దొ రుకుతుంది . ఈ సమాచారం
లేక తెలివి మన మనస్సును (mind) పెద్దదిగా చేస్తు ంది . ( Knowledge makes mind bigger and
bigger ). తద్వారా అది మనలను గర్వం లోనికి నడిపస
ి ్తు ంది . ఈ విధంగా అనేకులు కేవలం
తెలివిని సంపాదించుకొని తమ్మును తాము నాశనం చేసుకొనుచున్నారు. ఈ తెలివి రక్షణ లోనికి
నడిపించదు . అయితే దేవుని తెలుసుకోవడం అనేది మనలను దీనత్వం లోనికి నడిపస
ి ్తు ంది .
దీనిని వివేకం (Wisdom) లేక జ్గా నం అని అంటారు . అనగా దేవుని గూర్చిన తెలివి లేక
సమాచారం మనలను జ్గా నం /వివేకంలోనికి నడిపించాలి లేక మనలను దీనత్వం లోనికి
నడిపించాలి . అప్పుడే అది వివేకం అవుతుంది . దేవుని గూర్చిన తెలివిని మాత్రమే తెలుసుకుంటే
అది మరణానికి దారి తీస్తు ంది . కాని దేవున్ని ఎరిగితే అది మనలను జీవములోనికి నడిపిస్తు ంది .
దేవుని గూర్చిన తెలివి మన మనస్సును తాకినప్పుడు మనలను గర్వంలోనికి నడిపిస్తు ంది . కాని
మన హృదయాన్ని తాకినప్పుడు మనలను దీనత్వం లోనికి నడిపిస్తు ంది . దీనులు మాత్రమే
ఆయనను ఎరుగగలరు. తెలివి (Knowledge) సంపాదించుకోవాలంటే ఎక్కువ నష్ట పో వలసిన
అవసరం లేదు . ఎందుకనగా ఇంటర్ నెట్ ( Internet ) ద్వారా , టి.వి (T.V) ల ద్వారా , అనేక

1
పుస్త కాల ద్వారా ఎంతైనా జ్గా నాన్ని, పాండిత్యాన్ని సంపాదించుకోవచ్చు. మనం దేనిని కోల్పోకుండా
జ్గా నం పొ ందవచ్చు . అయితే దేవున్ని ఎరుగుట లేక జ్గా నాన్ని సంపాదించాలనుకుంటే మనం వెల
చెల్లి స్తేనే గాని సంపాదించలేము .పౌలు ఫిలిప్ఫీ 3 : 7 - 11 వచనాలలో చేప్పినది ఏమనగా “
యేసుక్రీస్తు ను గూర్చిన అతి శ్రేష్టమన
ై జ్గా నము (Wisdom) నిమిత్త మై సమస్త మును నష్ట ముగా
ఎంచుకొనుచున్నాను ” . దేవున్ని ఎరగాలంటే సమస్త మును నష్ట పరచుకోవడానికి ఇష్ట పడాలి .
దేవుని గురించి తెలుసు కోవాలంటే కొంత వెల చెల్లి స్తే చాలు. ప్రస్తు తం క్రైస్తవ లోకం ఈ లోక
సంబంధమైన జ్గా నము సంపాదించుట కొరకే ప్రయాసపడుచున్నది గాని దేవున్ని సంపాదించు
కోవడానికి ప్రయాసపడుటలేదు . పౌలు క్రీస్తు ను ఎరుగుట కొరకు ఏమేమి నష్ట పరచుకున్నాడు ?
తన వంశాన్ని , తన గోత్రా న్ని , తన అతిశయాన్ని , పరిసయ్యుడననే గర్వాన్ని , ఆసక్తి విషయము
సంఘమును హింసించువాడనని , ధర్మశాస్త ం్ర విషయంలో అనింద్రు డననే విషయాలన్నింటిని క్రీస్తు
నిమిత్త ం నష్ట ంగా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు ( ఫిలిప్ఫీ 3 : 3 -6 ) .

క్రీస్తు నిమిత్త మై మనం ఏమి నష్ట పరచుకొనుచున్నాము ? మన ఉద్యోగాన్ని, మన


జీతమును , మన వస్తు వులను , మన కులాన్ని , మన పదవులను ఏమైనా క్రీస్తు నిమిత్త ం
నష్ట పరచుకొనుచున్నామా ? దేవుడు ఆదికాండములో ఆదాముతో చెప్పినదేమిటి ? “ మంచి చెడ్డల
తెలివినిచ్చు వృక్షఫలములను నీవు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు ” ( ఆది 2 : 17 ).
జీవ వృక్షఫలములను తిను దినమున నీవు బ్రతికెదవు . రెండు వృక్షాలను చూడగలం . ఒకటి
మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలము , రెండవది జీవ వృక్షఫలము . మంచి చెడ్డల తెలివినిచ్చు
వృక్షఫలము అనగా తెలివి లోనికి నడిపస
ి ్తు ంది. అది చివరకు మరణాన్ని కలుగజేస్తు ంది .
అంటేదేవున్నిసంప్రదించకుండా , ఆదాము తన స్వంత తెలివి మీద అధారపడడాన్ని సూచిస్తు ంది .
ఈ వృక్షం జీవ వృక్షఫలం . దేవుని మీద ఆధారపడేటట్లు చేస్తు ంది . దేవుడు ఎందుకు మంచి
చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలాన్ని తినవద్ద ని చెప్పాడు ? ఎందుకంటే ఆదాము తన స్వంతంగా ఏది
మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోలేడు కాని దేవుని మీద ఆధారపడితే అనగా జీవవృక్ష ఫలం దగ్గ రి
కొస్తే దేవుడు ఏది మంచిదో ఎది చెడ్డదో తెలియజేస్తా డు . అందువలన జీవవృక్ష ఫలం వివేకమును
(Wisdom) తెలియ జేస్తు ంది . మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం మరణాన్ని సూచిస్తు ంది .
(Tree of knowledge of good and evil represents the knowledge which leads to death but
tree of life represents wisdom which leads to life.
2
దేవుని గూర్చి తెలుసుకోవడం వలన కేవలం తెలివి మాత్రమే వస్తు ంది . దేవుని గూర్చిన
తెలివి హృదయం లోనికి దిగక పో యినట్ల యితే లేక ఆ వాక్యానికి లోబడకపో యినట్ల యితే అది
చివరికి మనలను మరణం లోనికినడిపిస్తు ంది . దేవున్ని ఎరుగుట అంటే దేవుని గూర్చిన తెలివిని
తెలుసుకొని దానికి లోబడుట . దీనిని జ్గా నం ( Wisdom ) అంటారు . ఈ వివేకము మనకు నిత్య
జీవాన్నిస్తు ంది . నిత్య జీవం అంటే దేవుని జీవాన్నికలిగి నిత్యం దేవునితో జీవించడం (Eternal life
is the life of God which has no beginning and no ending ) .
Are we seeking knowledge or wisdom ?

మనం కేవలం తెలివిని మాత్రమే వెదకుచున్నామా ? లేక జ్గా నాన్ని వెదకుచున్నామా ?


చాలా బైబిల్ కాలేజీలు , ప్రసంగీకులు , ప్రజలకు సమాచారాన్ని , డిగ్రీలను , మాత్రమే ఇస్తు న్నారు
గాని దేవునిని ఎరిగేటట్లు భోధించుట లేదు . అనేకులు బైబిలు కళాశాలలకు వెళ్ళి తెలివిని
సంపాదించు కొని ప్రజలకు తెలివిని ( knowledge ) భోధిస్తు న్నారు . ఎంత ఎక్కువ తెలివైన
వాడైతేఅంత ఎక్కువ జీతంఇస్తా రు . ఏ కళాశాలలో చదివాడు ? ఎంత తెలివిఉంది అనేదే ప్రజలు
లెక్క కడుతున్నారు గానిక్రీస్తు జీవితం ఉందా లేదా అనే విషయాన్ని సంఘం గ్రహించడం లేదు .
అనేకమైన సంఘాలు తెలివిని మాత్రమే సంపాదించుకొని నిర్జీవ స్థితిలో ఉన్నాయి . ప్రియులారా!
దేవుని గురించి ఎంతో నేర్చుకొని దేవున్ని ఎరుగకపో తే ఎంతో ప్రమాదం అని గమనించండి . ప్రస్తు త
సంఘం ప్రమాదపు అంచుల్లో ఉందని అనేకులు గ్రహించుట లేదు . యేసు క్రీస్తు మత్త యి 11 : 29
లో ఏమన్నాడు “ నేను సాత్వికుడను , దీనమనస్సు గల వాడను గనుక మీ మీద నా కాడి
ఎత్తు కొని నా యొద్ద నేర్చుకొనుడి ”. అనగా క్రీస్తు ని గురించి కాదు క్రీస్తు నే నేర్చుకోవాలి . అనగా
సాత్వికము , దీనత్వం గురించి కాదు క్రీస్తు సాత్వికం, దీనత్వంలోకి మనం మార్చబడాలి . అదియే
నిజమైన జ్గా నం( Wisdom ) మరియు నిత్యజీవం .

Two ways of Life


3
రెండు వృక్షముల మధ్య గల కొన్ని తేడాలు
క్రమ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం జీవ వృక్షం
సంఖ్య ( Tree of Knowledge ) ( Tree of Life – Wisdom )
1. మానవ గ్రహింపు దేవుని గూర్చిన గ్రహింపు
( Human understanding ) ( God’s understanding )
2. సమాచార సంబంధమైన జీవితం దేవుని సారూప్యతలోనికి మార్పు చెందే
( Information ) జీవితం ( Transformation )
3. నియమాల ప్రకారం జీవించుట ప్రేమతో జీవించుట ( Living by Love )
( Living by Rules )
4. ఇది మరణాన్ని తెస్తు ంది ఇది జీవాన్నిచ్చును
5. తాత్కాలికమైన జీవితం నిత్య జీవం
6. భావోద్రేకాలను కలిగించును ఆత్మీయతలోనికి నడిపించును
( Leads to soulish life ) ( Leads to spirituality )
7. ఇందులో మతాచారం ఉంది(Religiosity) నిజత్త ్వం ఉంది ( Reality )
8. లోకత్వం ఉంది ( Worldliness ) దైవత్త ్వం ఉంది ( Godliness )
9. గర్వం లోనికి నడిపించును దీనత్వం లోనికి నడిపించును
10. తన మీద తానే ఆధారపడేటట్లు చేయును దేవుని మీద ఆధారపడేటట్లు చేయును
( Independent of self ) ( Independence on God )
11. ఉప్పొంగజేయును (జ్గా నం ఉప్పొంగ ప్రేమ పుట్టించును ( ప్రేమ క్షేమాభివృద్ధి కలుగ
జేయును I కొరింధీ 8: 1) జేయును )
12. స్వార్ధపూరితమైనది నిస్వార్ధమైనది
13. ఆత్మీయులు అనుకునేటట్లు చేస్తు ంది నిజమైన ఆత్మీయతలోనికి నడిపించును
( Deception ) ( Dedication )
14. వెల చెల్లి ంచనక్కరలేదు వెల చెల్లి ంచాలి
15. ఈ వృక్షం చుట్టూ ఖడ్గ జ్వాల లేదు ఖడ్గ జ్వాల ఉంది ( Fire )
( No fire )
ఏ వృక్షాన్ని ఆశ్రయిస్తు న్నాము ? ఆలోచించండి ! ధ్యానించండి .

4
2. చింతపడకుడి
( Worry Not )
Text మత్త యి 6 : 25 – అందువలన నేను మీతో చెప్పునదేమనగా – ఏమి తిందుమో ఏమి
త్రా గుదుమో అని మీ ప్రా ణమును గూర్చియైనను , ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును
గూర్చియైనను చింతింపకుడి . ఆహారము కంటే ప్రా ణమును , వస్త మ
్ర ుకంటే దేహమును గొప్పవి
కావా ?

“ చింతపడకుడి ” అనే వాక్యం క్రొ త్త నిబంధనలో క్రైస్తవులకివ్వబడిన ఒక ఆజ్గ . ఆజ్గా తిక్రమమే
పాపం అని మనకు తెలుసు . క్రైస్తవులు చింతపడడం పాపమని భావించుటలేదు . ప్రస్తు తం చాలా
మంది క్రైస్తవులు అనేకమైన భౌతికమైన విషయాల గురించి చింతపడుచున్నారు . మనం ఏదైనా
విషయంలో ( అనగా ఉద్యోగం , ఇల్లు , పిల్లలు , చదువులు , భవిష్యత్తు మొదలగునవి ) చింతపడు
చున్నట్ల యితే మనము దేవుని మీద కాకుండా వేరే వాటిపైన ఆధారపడుచున్నామని గ్రహించాలి .
మన పో షణాధారం ప్రభువులో ఉన్నదనే విశ్వాసం లేదని అర్ధం . ప్రభువును మన పో షణకు
ఆధారం చేసుకున్నప్పుడు మనం చింతపడం . మత్త యి సువార్త ఆరవ అధ్యాయం 24 వ వచనం
నుండి 34 వచనాలలో ప్రభువు మూడుసార్లు చింతపడకుడి అని ఆజ్గా పించాడు ( Vs - 25, 31, 34).
మనం అనేక విషయాల గురించి చింతించుటకు గల కారణాలు :
ఒకటి - సిరికి దాసులుగా ఉండడం , సిరిని సేవించడం ( మత్త యి 6 : 24 ) . దేవునికి
దాసులుగా ఉన్నవారు చింతపడరు . సిరి అనగా డబ్బు , వస్తు వులు , స్థ లాలు మొదలగునవి .
అనేకులు ధనమును వెంటాడుచున్నారు గాని దేవునిని వెంటాడుటలేదు . ఈ లోకంలో
గొప్పవారగుటకు ప్రయాసపడుచున్నారు గాని దేవునిలో గొప్పగా జీవించుటకు ప్రయాసపడుట
లేదు . యేసుక్రీస్తు డబ్బును/సిరిని గూర్చి రెండు చోట్ల ప్రస్తా వించాడు . ఒకటి లూకా 16 : 11 లో
అన్యాయపు సిరి అన్నాడు అనగా దీని అర్ధం మనలను అన్యాయపు పనులు లేక మురికి పనులు
చేయుటకు ప్రేరేపించేది . రెండవది మత్త యి 13 : 22 లో ధన మోసము అన్నాడు . దీని అర్ధం
ఏమనగా – డబ్బుంటే నేను సంతోషంగా జీవించగలను అనే మోసంలో పడేస్తు ంది . నేను
ధనవంతుడను నాకేమి కొదవ లేదు అనుకోవడం మోసం . నీవు ధనవంతుడవు అనుకుంటు

5
న్నావు కాని నీవు దరిద్రు దవు అని లవొదికయ సంఘముతో ప్రభువు చెప్పిన మాట గమనించాలి
. ఇది మోసం. ధనము చెడ్డపనులు చేయుటకు ప్రో త్సహించును మరియు మోసం చేయును .
అంటే డబ్బు చెడ్డదని కాదు , డబ్బు చేత మనం అపవిత్రపరచబడకుండా , మోసపరచబడకుండా
జాగ్రత్త వహించాలని యేసు భోధించాడు. కాని చాలా మంది క్రైస్తవులు ఈ ధనము చేత
మోసపో తున్నారు. ధనము మంచి సేవకుడు గాని చెడ్డ యజమానుడు ( Money is a bad
master – but a good servant ) . అనేకులు క్రీస్తు ను వెంటాడుటకు బదులు ధనమును
వెంటాడుచున్నారు . డబ్బు చేత నడిపించ బడుచున్నారు. ఈ నవీన యుగంలో మంచి ఉద్యోగం ,
మంచి జీతం ( package ) , మంచి వసతులు ఉన్నాయంటే చాలు , ఇక అక్కడికి ప్రభువు
వెళ్ళమన్నాడా లేదా అని ప్రశ్నించు కోకుండా వాటి చేత ఆకర్షింపబడుచున్నారు . కొంతమంది
ప్రభువే ఈ గొప్ప ఉద్యోగాన్ని ఇచ్చాడు , ప్రభువు నడిపించారని సాక్ష్యమిస్తు ంటారు . అయితే
ప్రభువుతో గడపడానికి ఎంత సమయాన్ని కేటాయించ గలరు ? మంచి ఉద్యోగం చేయడం తప్పు
అని నేను చెప్పుటలేదు . ఉద్యోగాల చేత (packages) , జీతాల చేత కాదు మనం ప్రభువు చేత
నడిపించబడాలి . ధనమును వాడుకోవాలి గాని ప్రేమించకూడదు . అనేకులు డబ్బు కోసం
కుటుంబాలను , పిల్లలను దూరం చేసుకొని సంబంధాలను తెంచుకుంటున్నారు . కుటుంబం కంటే
డబ్బును ఎక్కువగా ప్రేమిస్తు న్నారు . అందుకే చింతపడుచున్నారు .

రెండవది – మనం చింతపడుటకు గల కారణం ప్రా ణం కంటే ఆహారమును , దేహం కంటే


వస్త మ
్ర ులను గొప్పగా ఎంచుకొనుట అనగా ఆత్మీయ విషయాలకంటే ఎక్కువగా భౌతికమైన
విషయాల గురించి ఆలోచించుట వలన చింతపడుచున్నాం. మత్త యి 6 : 25 లో ఆహారం కంటే
ప్రా ణమును , వస్త మ
్ర ు కంటే దేహమును గొప్పవి కావా ? ప్రా ధాన్యతలను తారుమారు చేస్తు న్నాం .
I కొరింధీ 3 : 16 లో “ మీరు దేవుని ఆలయమై యున్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించు
చున్నాడని మీరెరుగరా ” . 17 వ వచనం లో ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసిన
యెడల దేవుడు వారిని పాడు చేయును . దేవుని ఆలయం పరిశుద్ద మై యున్నది . మీరు ఆ
ఆలయమై యున్నారు. మన దేహమనే ఆలయాన్ని కాపాడుకోవడానికి ఎంత ప్రయాసపడు
చున్నాము ? దీని కొరకు దేవుని యొద్ద ఎంత కనిపెట్టు చున్నాము ? ఎంత శ్రద్ద కలిగి
యున్నాము? చాలామంది ఆలయం అంటే ప్రస్తు తం ఇటుక , సిమెంటుతో కట్ట బడిన నిర్మాణాలు

6
అని తలుస్తు ంటారు. మనం వెళ్ళేది ఆలయం కాదు . మనమే ఆలయం . ఈ ఆలయ శుద్ధి కొరకు
ఎంత శ్రద్ధ ఉన్నది ? చాలా మంది వైఖరి ఆత్మీయ విషయాల పట్ల ఎంతో భిన్నముగా కనబడు
చున్నది . దీనిని కొంత వివరముగా తెలుసుకుందాం ! ఉదాహరణకి ఒక స్కూలులో పిల్లలకు
చదువు సరిగా లేదని , సరియైన భోధన లేదని తెలుసుకున్నతల్లిదండ్రు లు చేసే పని ఏమిటి ?
వెంటనే వారు స్కూలు మాన్పించి వేరే స్కూలులో చేర్పిస్తా రు . అలాగే ఒక హాస్పిటల్ లో వైద్యం
సరిగా అందించుట లేదని తెలుసుకున్నవారు ఏం చేస్తా రు ? వెంటనే వేరొక హాస్పిటల్ కి వెళతారు .
దీనిని బట్టి మనం గ్రహించేదేమంటే పిల్లల చదువుల విషయంలో , ఆరోగ్య విషయంలో వెంటనే
స్పందించి మంచి చదువు , మంచి వైద్యం ఉన్న చోటుకు పంపుతారు . కాని అత్మీయ విషయాల్లో కి
వస్తే అక్కడ భోధ సరిగా లేక పో యినా , ఆత్మీయ స్థితి అద్వాన్నంగా ఉన్నప్పటికిని అక్కడ దేవుని
సన్నిధి లేదని తెలిసినప్పటికి అలాంటి సహవాసంలో కొనసాగుచున్న వారి వైఖరి ఎలాంటిదో
గమనించవచ్చు . మా తాత గారి కాలం నుండి ఇదే చర్చికి వెళ్ళుచున్నామండి . అందుకే మేము
కూడా అక్కడికే వెళ్ళుచున్నామని సమర్ధించుకుంటారు . అయితే మీ తాత గారు చదివిన
గవర్నమెంటు స్కూల్లో తెలుగు మీడియం లో మీ పిల్లలను ఎందుకు చేర్చుట లేదు ? అనగా
భౌతికమైన విషయాలలో ఉన్న శ్రద్ద వారి ఆత్మీయ విషయాలలో చూపించక పో వడంను బట్టి వారు
ఎంత దిగజారిన స్థితిలో ఉన్నారో మనం తెలుసుకోవచ్చు .

మూడవదిగా – మనం చింతపడుటకు గల కారణం : ”అన్యజనులు వీటి విషయమై


విచారింతురు ” ( మత్త యి 6 : 31 ) . మనం అన్యజనుల వలె ప్రవర్తించుటను బట్టి చింతపడు
చున్నాం . ఈ లోకంలోని ధనము కొరకు , పదవుల కొరకు , ఘనత కొరకు , పేరు ప్రఖ్యాతుల
కొరకు , అధికారం కొరకు అన్యజనులు ప్రయాసపడతారు . మనం కూడా వారు వెంటాడే వాటి
కొరకు ప్రయాసపడుచున్నాం . వాటి కొరకు ప్రా ర్థిస్తు న్నాం . అవి దొ రికినపుడు సాక్ష్యమిస్తు న్నాం .
అన్యజనులు వేటి వెంట పరుగెడతారో మనం వాటి వెంట పరుగెట్టకూడదు . నీతి , విశ్వాసం ,
సమాధానం , ప్రేమను పొ ందుకొనుటకు ఎంతమంది ప్రయాసపడుచున్నారు . లోకం క్రైస్తవ సంఘాల
లోనికి వచ్చేసింది . సంఘాలలో ఎక్కడ చూసినా మా అబ్బాయి / అమ్మాయి విదేశాల్లో
చదువుచున్నారు , పెద్ద ఉద్యోగం చేస్తు న్నారు , మల్టీ నేషనల్ కంపెనీలో పెద్ద ఉద్యోగం , పెద్ద కారు
అనే సాక్ష్యాలే వినిపిస్తు న్నాయి కాని క్రీస్తు ను వెంటాడుటలో మా అబ్బాయి / అమ్మాయి ఉద్యోగాన్ని

7
విడిచిపెట్టా రు , చదువు అపేశారు , ప్రమోషన్ పో గొట్టు కున్నారు అనే సాక్ష్యాలు గాని , క్రీస్తు ప్రేమను,
సాత్వికత్వాన్ని సంపాదించుకున్నామని , భార్యను ప్రేమించే మనస్సు , భర్త కు లోబడే మనస్సు
దేవుడిచ్చాడనే సాక్ష్యాలు కరువయ్యాయని విలపిస్తు న్నాను . మనం మారు మనస్సు పొ ంది
దేవుని వైపు తిరగవలసిన సమయం ఆసన్నమైనది . ఇప్పుడే గొడ్డ లి చెట్ల వేరున ఉంచబడి
ఉన్నది.
మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును ( మత్త యి 3 : 10 ) . మారు
మనస్సునకు తగిన ఫలము ఫలించండి ( మత్త యి 3 : 8 ) .

ప్రియులారా ! క్రైస్తవ సంఘాలు లోకత్వంలో కొట్టు కొని పో వుచున్నవి . ఈ విషయాన్ని


ఎవరూ గమనించడం లేదు. ఎవ్వరూ మనల్ని హెచ్చరించుట లేదు . ఎవరి సామ్రా జ్యాలను వారే
కట్టు కొనుటలో తలమునకలై ఒకరితో ఒకరు పో టీ పడుచున్నారు . పరిచర్యలో కూడా మా సంఘం
పెద్దది మా సంఘ సంఖ్య ఎక్కువ , మా పాస్ట రు గారు రెవరెండు , బిషప్ అని ఎంతో అతి
శయిస్తు న్నారు . ఎంత విచారం .

నాల్గ వదిగా – మనం చింతపడుటకు గల కారణం : మత్త యి 6 : 33 “ ఆయన రాజ్యమును


నీతిని మొదట వెదకుడి ” . మొదట మన స్వంత కార్యక్రమాలు , మన స్వంత క్షేమము విషయమై
ఆలోచిస్తు న్నాం గాని ఆయన రాజ్యాన్ని నీతిని వెదకుట లేదు . “ ఆయన రాజ్యమును వెదకుట ”
అంటే ఏమిటి ? చాలామంది భోధకులకు క్రైస్తవులకు ఈ పదజాలం అర్ధం కాలేదు . ఆయన
రాజ్యమును వెదకుట అంటే సేవ లేక పరిచర్య ( Ministry ) చేయడం కాదు , లేక ఆత్మలను
సంపాదించడం కాదు , బో ర్డు పెట్టి ఒక స్థ లములో ఒక సంఘాన్ని నడిపించడం కాదు , సువార్తీకరణ
చేయడం కాదు , మీటింగ్స్ పెట్టడం కాదు , చర్చి నిర్మాణాలను చేపట్ట డం కాదు , పెద్ద పెద్ద
నిర్మాణాలను చేపట్టి 5 కోట్ల తో , 10 కోట్ల తో , 15 కోట్ల తొ కట్టిన భారీ దేవాలయమని గొప్పలు
చెప్పుకోవడం కాదు . మరి దీని అర్ధం ఏమిటి ? దేవుని రాజ్యము అనగా దేవుని పరిపాలన .
దేవుని పరిపాలన మన జీవితంలో ఆరంభించబడాలని , మనం ఆయన పరిపాలన క్రిందికి రావాలని
, మనల్ని మనం ఆయనకు లోబరచుకోవాలని , ఆయన పరిపాలన సంపూర్ణంగా మన జీవితంలో
జరగాలని దీని అర్ధం . మనం ఎంత ఎక్కువగా ఆయనకు లోబడతామో అంత ఎక్కువగా ఆయన

8
పరిపాలన మన జీవితంలోనికి వస్తు ంది . మనం దేనిని వెదకాలి ? ఆయన పరిపాలన మన
జీవితంలో జరగాలని ఆయనే మనలను సంపూర్ణంగా పరిపాలించాలని , ఆయన నడిపింపులోనే
మన జీవితం కొనసాగాలనే విషయాలను వెదకాలి . కాని మనం దేనిని వెదకుచున్నాము ?
అన్యజనులు వేటిని వెదకుచున్నారో మనం కూడా వాటినే వెదకుచున్నాం . వారు వేటి గురించి
విచారిస్తు న్నారో మనం కూడా వాటి గురించే విచారిస్తు న్నాం . వారిని ఏవి నిరాశపరుస్తు న్నాయో
అవే మనలను కూడా నిరాశపరచుచున్నాయి . ఇది ఎంతో శోచనీయం . యేసు పిలాతుతో చెప్పిన
దేమి? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధ మైనదైతే నేను
యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పో రాడుదురు గాని నా రాజ్యము ఇహ
సంబంధమైనది కాదు అనెను ( యోహాను 18 : 36 ) . అనేకమంది క్రైస్తవులకు అర్ధం కాని విషయం
– మనము వేరే రాజ్యానికి చెందిన వారమని , మన పో రాటం వేరు , మన కోరికలు , ఆశయాలు
వేరు . మన జీవన శైలి భిన్నమైనది . మన రాజ్యం లోని నియమ నిబంధనలు వేరు . మన రాజు
క్రీస్తు , మన ఆశీర్వాదాలు , వాగ్ధా నాలు వేరు అనే విషయాలు అసలే అర్ధం కాలేదని గ్రహించాలి .
ఒకవైపు దేవుని రాజ్యానికి చెందిన వారమని చెప్పుచూ, మరొక వైపు భూసంబంధమైన రాజ్యంలోని
వాటినే వెదకుచూ వాటిని పొ ందుకోవడానికి ఎంతో ప్రయాసపడుచూ భూసంబంధమైన వారిగానే
జీవిస్తు న్నారు . ఇది ఎంతో దయనీయకరము . ప్రస్తు త సంఘాలలో ప్రా ర్ధనలు వేటికొరకు
చేస్తు న్నారు ? భూసంబంధమైన చదువులు , పదవులు , పెద్ద బంగ్లా లు , పెద్ద ఉద్యోగాలు,
విదేశాలలో సీట్లు వీటి కొరకే ప్రా ర్ధనలు , ఉపవాస ప్రా ర్ధనలు చేస్తు న్నారు . వీరి శరీర కోరికలను
తృప్తిపరచడానికి కొంతమంది అవివేకులైన అజ్గా నులైన పాస్ట ర్లు ప్రా ర్ధనలు చేస్తు న్నారు. ఇది ఎంత
దుర్భరం . నేటి ధనాపేక్షపరులైన భోధకులు ఇలాంటి లోక సంబంధమైన వాటిని వెంటాడి
తెచ్చుకోవడానికి ప్రజలను దీవిస్తు న్నారు , మరియు వారి కొరకు ప్రత్యేక ప్రా ర్ధనలు చేస్తు న్నారు .
ఇవి పొ ందుకున్న క్రైస్తవులు సంఘాలలో సాక్ష్యాలు చెప్పుచున్నారు. కాబట్టి మన క్రైస్తవ
సంఘాలలో జరిగే ప్రా ర్ధనలు చెప్పే సాక్ష్యాలు , చేసే భోధలు, చేసే ఉపవాసాలు అన్నీ ఈ లోక
సంబంధమైనవే . ఏదో అక్కడక్కడ ఒకటి లేక రెండు చిన్న చిన్నదేవుని రాజ్యానికి సంబంధించిన
సాక్ష్యాలు చెబితే చెప్పొచ్చు. అందుకే నేనుగమనించినది ఏమనగా – ప్రస్తు తం మన సంఘాలు

9
లోకత్వంలో మునిగి పో యాయి . లోకత్వంలో మునిగిపో యామనే గ్రహింపు కూడా లేకుండానే
జీవిస్తు న్నాం . ఇది ఎంతో భాధాకరం.
దేవుని రాజ్యం భోజనమును , పానమును కాదు గాని , నీతియు సమాధానమును ,
పరిశుద్ధా త్మయందలి ఆనందమునై యున్నది (రోమా 14 : 17 ) . దేవుని రాజ్యం భౌతికమైన
వాటికి సంబందించినది కాదు గాని నీతి సమాధానము పరిశుద్ధా త్మయందలి ఆనందములో
జీవించుటయే దేవుని రాజ్యం . భోజన పానాదుల కొరకు ప్రయాసపడుట కాదు . దేవుని రాజ్యం
మనలోనే ఆరంభమవ్వాలి . దేవుని రాజ్యంలో నివసించే వాని కుండవలసిన లక్షణాలు మత్త యి
సువార్త 5 , 6, 7 అధ్యాయాలలో యేసు భోధించాడు . ఆ లక్షణాలు కలిగి జీవించేవాడే దేవుని రాజ్య
సంబంధి . లేకపో యినట్ల యితే వాడు లోక సంబంధి .

ఐదవవదిగా – మనం చింతపడుటకు గల కారణం : భవిష్యత్తు ను గూర్చి ఆలోచించుట


మత్త యి ( 6 : 34 ) “ రేపటిని గూర్చి చింతపడకుడి ” . ఒక భక్తు డు ఇలా అన్నాడు “ నా భవిష్యత్తు
ఎలా ఉండబో తుందో నాకు తెలియదు గాని నా భవిష్యత్తు ఎవరి చేతిలో ఉన్నదో అది మాత్రం నాకు
తెలుసు ” ( I do not know where my future lies but I know who holds my future ) .
ఇలాంటి నిరీక్షణతో మనం బ్రతికినప్పుడు చింతపడము . చింతపడుట అనేది ఆందో ళన
చెందుటనని తెలుసుకోవాలి . ఆంగ్ల తర్జు మాలో Do not be anxious about anything అని ఉంది .
అంటే దేనిని గూర్చియు ఆందో ళన చెందవద్దు . మనలో ఆందో ళన ఎప్పుడు మొలకెత్తు తుందో
అప్పుడు అవిశ్వాసం ఆరంభమవుతుంది . ఈ అవిశ్వాసం పాపము చేయుటకు దారి తీస్తు ంది .
పాపము పరిపక్వమైన మరణాన్ని కలుగజేస్తు ంది . అందువలన దేవుడు నియమించిన విశ్రా ంతి
లోనికి ప్రవేశింపలేము . అవిశ్వాసం పాపమని హెబ్రీ 3 : 17 లో చూడగలం . ఎవరి మీద నలువది
ఏండ్లు ఆయన కోపగించెను ? పాపము చేసిన వారి మీదనే గదా ! వారి శవములు అరణ్యములో
రాలిపో యెను . అలాగే హెబ్రీ 3 : 18 , 19 వచనాలు చదవండి . “ తన విశ్రా ంతిలో ప్రవేశింపరని
యెవరిని గూర్చి ప్రమాణము చేసన
ె ు ? అవిధేయులైన వారిని గూర్చియే గదా ! కాగా అవిశ్వాసము
చేతనే వారు ప్రవేశింపలెక పో యారని గ్రహించుచున్నాము ” . ఈ వచనాలన్నింటి లోనుండి మనం
గ్రహించేదేమంటే :
- చింతపడుట లేక ఆందో ళన చెందుట మనలను అవిశ్వాసం లోనికి నడిపిస్తు ంది

10
- అవిశ్వాసం అవిధేయత లోనికి నడిపస
ి ్తు ంది
- అవిధేయత పాపం లోనికి నడిపిస్తు ంది
- పాపం చేసినందున మరణం మరియు విశ్రా ంతిలోనికి ప్రవేశింపకుండా చేస్తు ంది .
( ఆందో ళన అవిశ్వాసం అవిధేయత పాపం అవిశ్రా ంతి )

చింతపడుట అనే పాపం ఎంత భయంకరమైనదో గమనించారా ? నేడు అనేకులకు విశ్రా ంతి లేక
నెమ్మది లేకపో వడానికి గల కారణం ఆందో ళనయే . మరి మన భౌతికమైన అవసరాల కొరకు శ్రద్ధ
కలిగి యుండకూడదా అనే ప్రశ్న రావచ్చు . అయితే శ్రద్ధ కలిగి ఉండుట వేరు ఆందో ళన చెందడం
వేరు ( Having concern is different from Anxiety ) . పిల్లల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి గాని
ఆందో ళన చెందవద్దు . దేని విషయంలోనైనా మనం ఆందో ళన చెందితే అది పాపమవుతుంది .
అవిశ్రా ంతి లోనికి నడిపిస్తు ంది . మనం ఒకవేళ , ఒక నెల తర్వాత చేయాల్సిన పనిని గూర్చి
ఆందో ళన చెందుచున్నామంటే మనం నెల రోజుల పాటు ఆందో ళనతో బ్రతుకుచున్నాం మరియు
నెమ్మది లేకుండా జీవిస్తు న్నామన్నమాట . అలాగే ఒక సంవత్సరం లేక పది సంవత్సరాల తర్వాత
జరిగే వివాహము లేక ఏదైనా కార్యక్రమమును గూర్చి చింతపడుచున్నావంటే , ఒక సంవత్సరం
పాటు లేక పది సంవత్సరాల పాటు ఆందో ళనతోనే బ్రతుకుచున్నావన్నమాట . అందుకే యేసు
చెప్పాడు – రేపటి గూర్చి చింతింపకుడి . ఏనాటి కీడు ఆనాటికి చాలు . రేపటి దినము దాని
సంగతులను గూర్చి చింతించును చింతపడాల్సింది నీవు కాదు . ఆ దినం దానికదే
చింతపడుతుంది . మనకు ఈ ఆందో ళన ఎందుకు కలుగుతుంది ? మన మనస్సు
భూసంబంధమైన వాటిని గూర్చి ఎక్కువగా ఆలోచించినపుడు , భూసంబంధమైన విషయాల
మీదనే మన మనస్సును కేంద్రీకరించినపుడు ఆందో ళన వస్తు ంది . అందుకే కొలస్సీ 3 : 1 – 3 లో
చూడగలం “ మీరు క్రీస్తు తో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి . అక్కడ క్రీస్తు
దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి యున్నాడు . పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన
వాటి మీద మనస్సు పెట్టు కొనకుడి . మీ జీవము క్రీస్తు తో కూడా దేవుని యందు
దాచబడియున్నది" .

11
నేటి క్రైస్తవులు పైనున్నవాటిని వెదకుట లేదు . కేవలం భూసంబంధమైన వాటినే
వెదకుచున్నారు . అందుకే అనేకులు ఆందో ళన చెందుచున్నారు. ఫలితంగా భౌతికమైన అనేక
అసౌఖర్యాలకు గురవుతున్నారు మరియు ఆత్మీయ స్థితిలో విశ్రా ంతి లేదు .

చింతను జయించాలంటే కొన్ని సూత్రా లు :


1. దేవుని మీద విశ్వాసముంచాలి ( మత్త యి 6 : 30 )
2. ఆయన రాజ్యమును , నీతిని మొదట వెదకాలి ( మత్త యి 6 : 33 )
3. ప్రభునందు ఆనందించాలి ( ఫిలిప్ఫీ 4 : 4 )
4. సంతృప్తి కలిగి జీవించడం నేర్చుకోవాలి ( ఫిలిప్ఫీ 4 : 11-12 )
5. భూసంబంధమైన వాటి మీద మనస్సునుంచక పైనున్న వాటినే వెదకాలి కొలస్సీ (3 : 1 – 3)

బైబిలులో ప్రభువు మనకు చేసిన వాగ్దా నం – మన అవసరాలను తీర్చుతానని . అంతే కాని


కోరికలను కాదు . మన కోర్కెలు తీర్చబడనపుడు మనం చింతపడతాం . అందుకే మొదట ఆయన
రాజ్యాన్ని , నీతిని వెదకండి . అప్పుడవన్నియు మీకు అనుగ్రహింపబడతాయి . అవసరాల కొరకు
ప్రా ర్ధించండి – కోర్కెల కొరకు కాదు .

12
3 . పో గొట్టు కుంటే పొ ందుకుంటావు
Text యోహాను 12 : 25
అనేకమంది క్రైస్తవులు , అన్యజనులకున్నవి ( పెద్ద యిల్లు , పెద్ద కారు , ఆస్థి , పొ లాలు,
స్థ లాలు, పదవులు , పేరు ప్రఖ్యాతులు మొదలగునవి ) వారికి లేవనుకొని ఎంతో వాపో తుంటారు.
నిరాశతో బ్రతుకుతుంటారు . కాని క్రైస్తవుల కున్నవి ( రక్షణ , క్రీస్తు , ఆనందం , సమాధానం . . .)
అన్యజనులకు లేవని మాత్రం గ్రహించరు . అన్యజనులకు ఈ లోకంలో ఎంతైనా ఉండవచ్చు – పెద్ద
పెద్ద ఫ్యాక్టరీలకు అధినేతలవ్వవచ్చు , రాజకీయంగాను , సామాజికంగాను , ఆర్ధికంగాను ఎంతో
స్థిరపడి ఉండవచ్చు అయితే అవన్నియు తాత్కాలికమైనవేనని , వారు చనిపో యినప్పుడు అవి
వారి వెంట రావని , వాటినన్నిటిని ఈ లోకంలోనే విడిచిపెట్టవలసిందేనని మాత్రం తెలుసుకోలేరు .

క్రైస్తవులకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పరసంబంధమైనవి మరియు నిత్యమైనవి . అవి


వాడబారనివియు , అక్షయమైనవియు , మహిమకరమునై యున్నవి . క్రీస్తు , పరలోకం , రక్షణ,
ప్రేమ , ఆనందం , విశ్రా ంతి , పరిశుద్ధ త , మహిమ ఇవి శాశ్వతమైనవి . ఈ ఈవులు అన్యులకు
లేవు మనకున్నవి . మరి ఈ నిత్యమైన ఆశీర్వాదాలు పొ ందుకోవాలంటే అనిత్యమైన వాటిని
పో గొట్టు కోవాలి . క్రీస్తు నిమిత్త ం ఈ లోకంలో ఉన్నవాటిని పో గొట్టు కుంటే పరసంబంధమైన వాటిని
పొ ందుకుంటాం . మనం పో గొట్టు కోవలసినవి ఏవి ? యోహాను 12 : 25 లో “ తన ప్రా ణమును
ప్రేమించువాడు దానిని పో గొట్టు కొనును ; ఈ లోకంలో తన ప్రా ణమును ద్వేషించువాడు నిత్య
జీవము కొరకు దానిని కాపాడుకొనును ” . అని ఉంది . మనం పో గొట్టు కోవడం అంటే జీవనోపాధి
కొరకు చేసే ఉద్యోగాన్ని , మనకున్న ఇల్లు ను , మన ఆస్థిని పూర్తిగా విడిచిపెట్టా లని కాదు . వాటిని
క్రీస్తు నిమిత్త ం విడిచి పెట్టడానికి సిద్ధంగా ఉండాలి . అంటే ఇక్కడ భౌతికమైనవి కాదు మన అహం
అహమునకు సంబంధించిన జీవితాన్ని విడిచిపెట్టా లి అని అర్థం . అనగా మన self life విడిచి
పెట్టకపో తే మనం నిత్యజీవితాన్ని పొ ందుకోలేము .

13
బైబిలులో అనేక చోట్ల పో గొట్టు కుంటే ఏమి పొ ందుకుంటారో వ్రా యబడింది . మనం
పో గొట్టు కునేవి భౌతికమైనవి , క్షయమైనవియు , కాని మనం పొ ందుకోబో యేవి ఆత్మ
సంబంధమైనవి మరియు అక్షయమైనవి . ఈ సత్యాన్ని క్రైస్తవులు గ్రహించగలిగినప్పుడు వారు
క్రీస్తు నిమిత్త ం దేనినైనా సుళువుగా విడిచిపెట్ట గలరు . కొన్నిసార్లు ఈ సత్యాన్ని గ్రహించినా ఈ
లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టకపో వడానికి గల కారణం ఈ లోకంలో ఉన్నవాటిని దేవుని కంటే
ఎక్కువగా ప్రేమిస్తు న్నారు . “ ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి .
ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు” ( I యోహాను 2 : 15 ) .
లోకమును దాని ఆశయు గతించి పో వుచున్నవి గాని దేవుని చిత్త మును జరిగించువాడు
నిరంతరము నిలుచును ( యోహాను 2 : 17 ) .

దేవుడు భూమిని , ఆకాశమును ఇంకొకసారిచలింపజేయబో వుచున్నాడు . ( హెబ్రీ 12 : 26 ).


( God is going to shake up everything once again ) .

అనేకమంది క్రైస్తవులు ఈ లోకంలో ఉన్న/ లోకమిచ్చిన గుర్తింపులు , పదవులు ,


చదువులు , గృహాలు , పెద్ద ఉద్యోగాలు , డబ్బు , డిగ్రీలు పో గొట్టు కొనుటకు ఇష్ట పడుట లేదు .
యేసు శోధింపబడినపుడు సాతానుతో ఏం చెప్పాడు ? సాతాను ఇచ్చే ఈ లోక రాజ్యాలన్నిటిని ,
వాటి మహిమను తిరస్కరించి , దేవునిని మాత్రమే సేవింపవలెనని చెప్పలేదా ! ( మత్త యి 4 : 8 –
10). లోకంలో ఉన్న గొప్పతనాలను , సంపాదించుకున్న వారెవరైనా ఏదో సమయంలో సాతానుకు
తలవంచినవారే . పరిచర్య విషయంలోను ఇది వాస్త వం . ఎందుకంటే ఒక నిజమైన క్రైస్తవుడు లేక
సేవకుడు క్రొ త్త నిబంధన సూత్రా ల ప్రకారం ధనవంతుడవ్వలేడు . క్రీస్తు గాని అపొ స్త లులు గాని
ఎన్నడూ ధనవంతులవ్వలేదు . పరిచర్యలో ఎంతోమంది సేవకులనబడే వారు ఎంతో
ధనవంతులుగా మారుచున్నారంటే అది దేవునినుండి వచ్చిన దీవెన కాదు . సాతానుకు వారు
తలవంచి వాని ఆఫర్ ని అంగీకరించనందుననే నని గ్రహించాలి . మోషే ఐగుప్తు ధనమును
తిరస్కరించాడు . ఫరో కుమార్తె యొక్క కుమారుడననే గుర్తింపును ( Identity ) తిరస్కరించాడు .
అలాగే అల్పకాల సుఖ ; భోగములు ( Pleasures of World ) తిరస్కరించాడు . ఫలితంగా
అదృశ్యమైన బహుమానమును పొ ందుకున్నాడు . మన కంటికి కనబడేవన్నీ ఒక దినమున
నశించిపో తాయి . కనబడే సూర్యుడు నలుపెక్కును , కనపడే చంద్రు డు రక్త వర్ణమగును , కనబడే
14
నక్షత్రా లు రాలిపో వును , కనబడే పంచభూతములు మహా వేండ్రముతో లయమగును ( ప్రకటన 6 :
12, 13 ; 8 : 10 – 12 ; II పేతురు 3 : 10 – 12 ) . ప్రియులారా ! గమనించారా ! కనబడేవి అనగా
దృశ్యములైనవి అనిత్యములు , అదృశ్యములైనవి నిత్యములు . ( II కొరింధీ 4 : 18 ) . మనం వేటి
కొరకు ప్రయాసపడుచున్నాం ? నిత్యమైన వాటి కొరకా లేక అనిత్యమైన వాటి కొరకా ? నీ ప్రయాణం
ఎటు వైపు ? అనాది కాలం నుండి మానవడు సృష్ట మును ( Creation ) కోరుకొనుచున్నాడు గాని
సృష్టి కర్త ను ( Creator ) కోరుకోవడం లేదు . ఇది మన క్రైస్తవ్యానికి సో కిన అంటువ్యాధి . ఈ వ్యాధి
నుండి మనలను స్వస్థ పరచడానికే యేసు వచ్చాడు .

ధనవంతుడైన యవ్వ్వనస్థు డు యేసు నొద్దకు వచ్చి అడిగిన ప్రశ్న – నిత్య జీవమునకు


నేను వారసుడనవ్వాలంటే ఏమి చేయాలి ? అందుకు యేసు ఇచ్చిన జవాబు -: పో గొట్టు కుంటేనే
పొ ందుకుంటావు ” . నీ ఆస్థిని అమ్మి బీదలకిమ్ము( పో గొట్టు కో ) , నన్ను వెంబడించుము ( పొ ందు
కుంటావ్ ) . అప్పుడు నీకు నిత్యజీవం కలుగుతుంది . ఈ యవ్వ్వనస్థు డు తాత్కాలికమైన వాటిని
పో గొట్టు కొనుటకు ఇష్ట పడలేదు కాబట్టి శాశ్వతమైన జీవాన్ని (నిత్యజీవం ) పొ ందుకోలేకపో యాడు .
నేటి క్రైస్తవ్యం యొక్క దయనీయ స్థితి ఇలాగే యున్నది.

ఆంద్రెయ , పేతురు , యోహాను , యాకోబులు తమ వలలను , దో నల


ె ను విడిచిపెట్టి
యేసును వెంబడించారు . యోహాను , యాకోబులైతే తమ తండ్రిని కూడా విడిచిపెట్టా రు ( మత్త యి
4 : 18 – 22 ) , మరియు లూకా 5 : 11 లో “ వారు దో నెలను దరికి చేర్చి, సమస్త మును విడిచిపెట్టి
ఆయనను వెంబడించిరి ” అని చదవగలం . వీరు క్రీస్తు నిమిత్త ం సమస్త మును పో గొట్టు
కున్నప్పుడు , వారు ఏమి పొ ందుకున్నారు ? ఏదో పొ ందుకుంటాము అనే ఉద్దేశ్యంతో వీరు
సమస్తా న్ని విడిచిపెట్టలేదు . నేడు అనేకులు క్రీస్తు ను నమ్ముకుంటే – మనకు మేలు కలుగుతుంది,
ఆరోగ్యం కలుగుతుంది , పిల్లలు పుడతారు , పరలోకం కలుగుతుంది , అనే దురుద్దేశ్యంతో
నమ్ముకుంటున్నారు . దేవునికిస్తే దేవుడు మనకిస్తా డు అనే ఉద్దేశ్యం సరియైనది కాదు . వీరు
లాభాపేక్షతో పో గొట్టు కోలేదు. నేటి సేవకులలో చాలామంది లాభాపేక్షతోనే ప్రభువును సేవిస్తు న్నారు.
మరియు భోధిస్తు న్నారు. క్రీస్తు ను వెంబడించాలంటే మనకున్న సమస్తా న్ని పో గొట్టు కోవాలి . వీరు

15
దేవునికిస్తే , దేవుడు మీకు అత్యధికంగా ఇస్తా డు అని చేసే భోధ దుర్భోధ . ధనాపేక్షపరులైన
భోధకులు వీరు అని గుర్తించాలి .

పేతురు – ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అని


అన్నప్పుడు యేసు చెప్పిన జవాబు ఏమిటి ? “ దేవుని రాజ్య నిమిత్త మై యింటినన
ై ను,
భార్యనైనను , అన్నదమ్ములనైనను , తల్లిదండ్రు లనైనను , పిల్లలనైనను , విడిచిపెట్టిన వాడెవడును
ఇహమందు చాలా రెట్లు ను, పరమందు నిత్యజీవమును పొ ందకపో డని నిశ్చయముగా మీతో
చెప్పుచున్నాను ” ( లూకా 18 : 28 – 30 ) .

కావున ప్రియులారా ! మనం ప్రభువు నిమిత్త ం ఏమి పో గొట్టు కున్నా అది పరలోక రాజ్యంలో
నూరు రెట్లు పొ ందుతాము . మరియు మనం పో గొట్టు కుంటే పొ ందుకోబో యేది మరొకటి కూడా ఉంది
. అది మత్త యి 19 : 27 – 30 లో వ్రా యబడింది .

“ పేతురు ఇదిగో మేము సమస్త మును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి
దొ రకునని ఆయనను అడుగగా ! యేసు వారితో ఇట్ల నెను –( ప్రపంచ ) పునర్జననమందు మనుష్య
కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన
మీరును పండ్రెండు సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రా యేలు పండ్రెండు గోత్రముల వారికి తీర్పు
తీర్చుదురు . నా నామము నిమిత్త ము అన్నదమ్ములనైనను , అక్కచెల్లెండ్ర నైనను , తల్లినైనను ,
పిల్లలనైనను , భూములనైనను , ఇండ్ల నైనను విడిచిపెట్టిన ప్రతి వాడును నూరు రెట్లు పొ ందును ;
ఇది గాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును . మొదటివారు అనేకులు కడపటి వారగుదురు .
కడపటి వారు మొదటి వారగుదురు .

// వినుటకు చెవులు గలవాడు వినును గాక //

16

You might also like