You are on page 1of 2

సంతోష శుభవార్త

నేస్త మా!
నేను ఒక విద్యావంతుల కుటుంబములో నాగరికులైన తల్లి దండ్రు లకు జన్మించాను నా తల్లి దండ్రు లు ఇద్దరు ప్రభుత్వ
ఉపాద్యాయులుగా పని చేశారు వారికి మేము ముగ్గు రము సంతానం, మా తండ్రిగారు మమ్ములను ఎంతో కఠినమైన క్రమశిక్షణతో
పెంచారు. మా తల్లిగారు ఎంతోదైవభక్తి కలిగిన,క్రమశిక్షణ కలిగిన స్త్రీ,ఆమె మమ్ములను ఎంతో ప్రేమతోను,ఓర్పుతోను,సహనముతోను,
క్రమశిక్షణతో, దైవభయములో పెంచి పెద్దచేశారు.ఆ క్రమంలో మేము చక్కగా చదువుకొంటు మంచి జీవితాన్ని కలిగి ఉన్నాము. అయితే
మా తండ్రిగారు తనకున్న బంధుప్రీతి వల్ల నో మరి యితర కారణాలవల్ల నో మా నాలుగుర్ని (మా తల్లి మరియు పిల్ల లను) అనేక
కష్టా లపాలు చేసినారు.అయినప్పటికి మా తల్లిగారు ప్రభువైన యేసుక్రీస్తు కు మొర్రపెట్టు కుంటూ మమ్ములను దారితప్పకుండా పెంచినారు.
ఆలాగున జరుగుతున్న క్రమములో నేను 10 వ తరగతిలోకి ప్రవేశించాను. అది 1992 జనవరి 2 వ తేదీన ఉదయం లేచిన తరువాత
క్యాలెండర్ లో వాక్యం చదివాను అక్కడ ఇలా ఉంది “నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను
చూడవలెను. సామెతలు-4:25” అని అప్పుడు నేను ధ్యాన పూర్వకంగా ప్రా ర్దించాను,ప్రభువా దీని అర్ధం ఏమిటి అని అప్పుడు ప్రభువు నా
హృదయంలోనికి ఈ వాక్యపూ వివరణ ఇచ్చినాడు “నీవు యౌవ్వన ప్రా యములో ఉన్నావు,నీవు త్రో వతప్పి తొలగి పో యి పాపం చేసే
అవకాశం ఉంటుంది కనుక నీ కన్నులను సరిగా కాపాడుకొనుము” అని అప్పుడు నేను ఒక ప్రా ర్దన చేశాను. “ప్రభువా నాకు తెలిసి
ఇప్పటివరకు ఏ పాపం చేయలేదు. ఒక వేళ నేనెదైన పాపం చేసియుంటే దయచేసి నాకు తెలియచేయమని ప్రా ర్దించగా నేను
బాల్యమునుండి తెలిసితెలియక చేసిన ప్రతి(తప్పు) పాపమును నాకు గుర్తు చేశారు. అవి పాపములని నాకు తెలియదు. ఉదాహరణకు
ఇంట్లో చెప్పిన చిన్న చిన్న పనులు చేయకపో వటం, మా నాన్నగారి జేబులో చెప్పకుండా 10 పైసలు తీసుకోవటం(దీని విషయమై మా
నాన్న గారు స్కూలు పిల్ల లందరి ముందు నన్ను బెత్తంతో తీవ్రంగా కొట్టా రు) ఇలాంటివి పాపములని నాకు తెలియదు, అప్పుడు నేను
దేవునిదగ్గర అవన్నీ ఒప్పుకొని నన్ను రక్షించుము నీకిష్టమైతే నన్ను నీ బిడ్డ గా స్వీకరించి నా హృదయములోనికి రమ్ము నేను
నరకమునకు పాత్రు డను అని ప్రా ర్దించినాను.ఎందుకంటే దేవుని మాట చెప్తుంది పాపము వలన వచ్చు జీతము మరణము రోమా-6:23
ఇక్కడ మరణము అంటే దేవునినుండి దూరమై పో వుట. అప్పుడు నేను నా క్షమాపణ నిమిత్త మై దేవుడు ఏమి చెప్తా డా అని ప్రా ర్దించి
బైబిల్ చదువుతున్నపుడు “నేను నేనే నా చితానుసరముగా ని యతిక్రమములను తుడిచివేయుచున్నాను.నేను నీ పాపములను
జ్ఞా పకము చేసికొనను, యెషయా-43:25” అనే వాక్యం ద్వారా నీకు రక్షణ నిశ్చయత కలిగినది. నా హృదయములో ఎంతో గొప్ప
సంతోషము,నెమ్మది కలిగినది నా హృదయము మారిపో యినది.ఆరోజునే నేను నా హృదయమును యేసుక్రీస్తు ప్రభువు వారికి
అర్పించినాను.ఏదో తెలియని కొత్త దనం – నా మాటలో మార్పు, నా చూపులో మార్పు, హృదయంలో శాంతి,నా ప్రవర్తనలో మార్పు. నాకు
నేను కొత్త గా ఉన్నాను. ప్రపంచాన్నిచూచే నా దృష్టి కోణం మారింది. అలాగే బైబిల్ చదువుతున్నపుడు “కాగా ఎవడైనను క్రీస్తు
నందున్నయెడల వాడు నూతన సృష్టి ; పాతవి గతించేను ఇదిగో క్రొ త్త వాయెను 2 కోరింధి -5:17” అనే వాక్యం కనిపించింది. ఇంకా అలాగే
చదువుతున్నపుడు కాబట్టి యిప్పుడు క్రీస్తు యేసునందున్నవారికి ఏ శిక్షవిధీయు లేదు, రోమా- 8:1 అని చదివాను. నేను పెద్ద
చదువులు చదివి ఉద్యోగం చేస్తూ ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను.
నేస్తం! నీ జీవితం లో ఈ సంతోషం ఉందా? లేకపో తే నాలాగే నీవు కూడా యేసుక్రీస్తు కు నిన్ను నీవు అప్పగించుకో, ఆయనను నీ

హృదయంలోకి ఆహ్వానించు.నీకు మారుమనసు, రక్షణ, పరలోకరాజ్యంలో చోటు దొరుకుతాయి. దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్.
దేవుడు నరులను యదార్దవంతులుగా పుట్టించేను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని యున్నారు. ప్రసంగి - 7:29.

ఔను నిజమే పుట్టినప్పుడు మనిషి యదార్దవంతుడే గాని వయసు పెరుగుతున్న కొద్ది ఆ మనిషిలోని యదార్దత

(నిర్మలత్వం,నిష్కపటత్వం) అంతా నెమ్మదిగా మాయమై ఆ స్దా నంలో స్వార్దం,సంకుచిత మనస్త త్వం,జాలిలేని మనస్త త్వం వచ్చి చేరాయి.

అందుచేత మనిషి తోటివాని అనగా కనీసం తన కుటుంబ సభ్యులకు గాని, తల్లిదండ్రు లను గాని, తోబుట్టు వులను గాని

ప్రేమించలేకపో వుచున్నాడు. బైబిల్లో యేసుప్రభువు వారు చెప్పిన మాట నిన్ను వలె నీ పొ రుగు వానిని ప్రేమించుము మత్త యి- 19:19

అని ఇది ఎంతో కష్టం కదా. ఒక వ్యక్తిని ద్వేషించడం చాలా సులభం కానీ ప్రేమించడం చాలా కష్టం, ఎందుకంటే ప్రేమ దీర్ఘకాలం సహించును,

దయచూపించును అని I కోరింధి – 13 వ ఆద్యాయము 4 వ వచనం చెప్తుంది. దీర్ఘకాలం అంటే చాలా కాలము (మనము చనిపో యే వరకు

కూడా కావచ్చు). ఇది సాద్యమా, మనిషి త్వరగా కోపపడగలడు, ద్వేషించగలాడు కానీ ప్రేమించడం చాలా కష్టం,అందుకు ఒకరిని ఒకరు

చంపుకుంటున్నారు కూడా అది పాపమని, దాని నిమిత్త ము తనను శిక్షించే దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మనిషి తీవ్రముగా

తీసుకోడు కానీ ఇది నిశ్చయం. తప్పు చేసిన వారు చట్టపరంగా పో లీసుల చేత ఎలా అయితే శిక్షింపబడతారో అలాగే మనిషి కూడా

నైతికంగా పతనమైనప్పుడు శిక్షకు పాత్రు డు. ఒకవేళ నేరస్తు డు కోర్టు లో చేసిన నేరం ఒప్పుకొని ఇంకెప్పుడూ చేయనని క్షమాబిక్ష

ప్రసాదించమని వేడుకొంటే న్యాయమూర్తి ఆ నేరస్తు డ్ని క్షమించి విడుదలకు ఆదేశించవచ్చు. అలాగే మనిషి చేసిన పాపాలకు ఎన్నో

బలులు అర్పించటం ద్వారా క్షమాపణ పొందవచ్చని, మరణం తరువాత మోక్షం చేరుకోవచ్చని తలంచాడు.ఒకవేళ అలా చేయనిపక్షంలో

అతడు నరకపాత్రు దౌతాడు.కానీ ఆ విదంగా మోక్షం చేరుకోవటం ఆసాద్యం. ఎందుకంటే మనిషి బలియర్పించే ఆ జంతువులు గాని, పక్షులు

గాని పరిశుద్దమైనవి కాదు. అందుచేత నిర్దో ష మైన, పరిశుద్దడైన ఒక పుణ్యాత్ముడు రక్తం చిందించటం ద్వారా మనిషి పాపాలు ప్రక్షాళన

చేయబడతాయి. అంతే కాదు అతనికి/ఆమెకు మోక్షం ప్రా ప్తి స్తుంది. దీనికోసమే ప్రభువైన యేసుక్రీస్తు దేవుడై యుండి నరావతారిగా ఈ

లోకములోకి దిగివచ్చి సకల లోకంలో ఉన్న మానవాళి పాపం కొరకు సిలువలో తన ప్రా ణాన్ని అర్పించారు. ఆయన పరిశుద్ద రక్తంలో

పాపక్షమాపణ ఉంది. ఈ విషయాన్ని ఎవరైతే హృదయములో విశ్వసించి, తమ నోటితో ఒప్పుకొని బాప్టిస్మము తీసుకుంటారో వారు మోక్షం

చేరతారు. మార్కు సువార్త - 16:16.

You might also like