You are on page 1of 3

తేది. .12.

2022

గౌరవనీయులైన శ్రీయుత ప్రధాన కార్యదర్శి, స్కిల్స్ డెవలప్మెంట్ & ట్రైనింగ్


శాఖ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ వారి దివ్య సముఖమునకు ! సీడాప్ సంస్థలో పని
చేస్తు న్న సిబ్బంది వ్రాసుకున్న విన్నపం.

ఘనమైన అయ్యా !

విషయం:- సీడాప్ సంస్థలోని సిబ్బంది సమస్యలను


పరిష్కరించమని –కోరుట –గురించి.

మా సంస్థ గురించి, అందులో పని చేస్తు న్న సిబ్బంది అయిన మా గురించి తమరికి ఎంతో
అవగాహన కలదు.

మేము గత కొన్నేళ్లు గా మాకిస్తు న్న వేతనాలు సరిపోక, వేతనాలు పెంచమని సంస్థలోని


అధికారులను అభ్యర్దిస్తూనే వున్నాము. గత 16 సంవత్సరాలుగా ఇదే సంస్థను నమ్ముకుని వివిధ
హోదాలలో సుమారు 280 మంది సిబ్బంది పని చేస్తు న్నామని, మా మాతృ సంస్థ (SERP)
మాదిరిగా, ఇతర సొసైటీల మాదిరిగా, ఇతర రాష్ట్రా లలోని మా సంస్థ వలె నడపబడుచున్న సంస్థల
మాదిరిగా మాకు కూడా ఉద్యోగ భద్రత (HR Policy) వర్తింపు చేయమని దాదాపుగా కొన్ని
సంవత్సరాల నుండి మేము మొరపెట్టు కుంటూనే వున్నాము. మాలో కొంత మంది ఇప్పటికే
రిటై ర్మెంట్ వయసుకు దగ్గరపడిన వారు, రిటై ర్డ్ అయిన వారు కూడా వున్నారు. మమ్ములనే
నమ్ముకున్న మా కుటుంబాలకు ఇప్పటికీ మేము ఎటువంటి భరోసా ఇవ్వలేక పోతున్నాము.
సంస్థలోని సిబ్బందికి HR పాలసీ వర్తింపు చేయుటకు ఇప్పటి వరకూ పని చేసిన
ఉన్నతాధికారులంతా సానుకూలమైన నిర్ణయాలు తీసుకున్నా అవి కేవలం ఫైళ్ళకు మాత్రమే
పరిమితం చేసారు.

మాతో పాటు స్థా పించబడిన ఇతర సంస్థలలోని మరియు ఇతర రాష్ట్రా లలో మా సంస్థ
వలె నడపబడుచున్న సంస్థల సిబ్బంది అందరూ ఉద్యోగ భద్రత పొందడమే కాక, ప్రమోషన్లు పొంది
మరియు ఔట్ సోర్సింగ్ నుండి కాంట్రాక్టు పద్దతిలోకి మారి, మాకన్నా ఎన్నో రెట్లు అధికంగా వేతనం
తీసుకుంటూ, సంతోషకరమైన జీవనం సాగిస్తు న్నారు.

గతంలో ఎప్పుడు లేని విధంగా అన్ని రేట్లు అంతకంతకూ పెరిగిపోతూవున్నవి. ఇప్పుడున్న


పరిస్థితులలో మాకిస్తు న్న జీతాలతో గడపడం ఎంత కష్టంగా ఉంటుందో తమరు అర్ధం
మేము మా కుటుంబాల యొక్క కనీస అవసరాలను తీర్చుకోవడానికి కూడా మేము తీసుకుంటున్న వేతనాలు సరిపోవడం
లేదు. గతంలో (2017) మా యొక్క వేతనాలను పెంపుదల చేసినప్పటికీ అప్పటి ధరలు మా యొక్క కనీస అవసరాలకు మించి
ఉండేవి, అప్పటి నుండి ఇప్పటి వరకూ ధరలు ఇంకా పెరిగినవి, పైగా ఇటీవలి కాలంలో కరోనా విలయంతో అన్ని ధరలు అంతకంతకూ
ఆకాశాన్నంటాయి. మాకిస్తు న్న వేతనాలు సరిపోక, వేతనాలు పెంచమని అభ్యర్ధించగా, అందుకుగాను ఈసీ మీటింగు జరిపి అందులో
నిర్ణయం తీసుకుంటామని మా కార్యాలయ అధికారులు తెలిపారు. అప్పటి నుండి ఈసీ సమావేశం నిర్వహించి, వేతనాలు పెంచుటకు
నిర్ణయం తీసుకోవలసిందిగా దాదాపుగా గత 3 సంవత్సరాల నుండి ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది.

SEEDAP సంస్థ నిబంధనల మేరకు ప్రతి మూడు నెలలకు ఒక సారి ఈసీ సమావేశం నిర్వహించవలసి వున్నప్పటికీ,
జరుపబడలేదు. గత 3 సంవత్సరాల నుండి జరగకుండా వున్న ఈసీ సమావేశం మా అభ్యర్ధన మేరకు తమరి నిర్ణయం, తమరి
దయతోనే ఖరారు చేసియున్నారు.

కావున తమరు మా యందు దయవుంచి త్వరలో జరుగబోవు ఈసీ సమావేశంలో ఈ క్రింద కనపరిచిన మా యొక్క
అభ్యర్ధనలను పరిశీలించి మాకు తగు న్యాయం చేయగలరని తమ ఘనమును మిక్కిలిగా ప్రార్ధించుచున్నాము.

1. సంస్థలోని సిబ్బంది సంక్షేమం నిమిత్తం సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి అడ్మిన్ ఆఫీసర్ పోస్టు లో అనుభవం గల అధికారిని
త్వరితగతిన నియమించి సిబ్బంది యొక్క సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోగలరు.

2. గతంలో మాలో ఒకరైన SRTP ట్రైనర్ల కు అమలు పరిచిన వేతన వ్యత్యాసాలవలె మిగిలిన అన్ని హోదాల వారికి సర్వీసుకు తగ్గ
వేతన వ్యత్యాసాలను (రేషనలైజేషన్) అమలు చేయుటకు తగిన చర్యలు తీసుకోగలరు.

3. ప్రస్తు త ప్రభుత్వం వారు 11 వ PRC తో పాటుగా రాష్ట్రంలోని కాంట్రాక్టు సిబ్బందికి GO. No.5 ద్వారా, మినిమం టై మ్ స్కేల్
వర్తింపు చేయమని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సంస్థలోని కాంట్రాక్టు సిబ్బంది అందరికీ అమలు జరిగేలా చర్యలు
తీసుకోగలరు.

4. ఔట్సొర్సింగ్ లో పని చేస్తూ, APCOS ద్వారా వేతనాలు పొందుతున్న క్షేత్ర స్థా యి సిబ్బంది అయిన జాబ్స్ కో ఆర్డినేటర్లకు
కనీసం వేతనంగా రూ.18000/- లేదా GO. No.7 లోని రెండవ కేటగిరిని మరియు మిగిలిన సిబ్బంది అందరికీ GO.

No.7 లేదా 104 ద్వారా 23% జీతాల పెంపుదల చేసి, GO అమలు తేది నుండి అరియర్స్ మంజూరు చేయుటకు తగిన
చర్యలు తీసుకోగలరు.

5. GO. No.7 ను వర్తింపు చేయుటకు వీలుకాని పక్షంలో సంస్థలోని అవుట్ సోర్సింగ్ సిబ్బంది అందరినీ ఇతర సంస్థల
మాదిరిగా కాంట్రాక్టు పరిధిలోకి మార్చి, GO. No.5 ద్వారా, మినిమం టై మ్ స్కేల్ వర్తింపు చేయమని కోరుతున్నాము.

6. నూతనంగా ఏర్పాటు జరిగిన జిల్లా లకు సంస్థలో పనిచేస్తు న్న సిబ్బందిలో అర్హత, అనుభవం కలిగిన సిబ్బంది ద్వారా
(కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ అనే బేధం లేకుండా) అన్ని హోదాల వారికి ఇంచార్జ్ భాద్యతలు సిబ్బందికి పని ఒత్తిడి భారం
తగ్గించుటకు తగు చర్యలు తీసుకోగలరు.
7. సంస్థ ద్వారా సిబ్బందికి ఇస్తు న్న యాన్యువల్ ఇంక్రిమెంట్లను ప్రస్తు తం ఇస్తు న్న 3% నుండి గతంలో మాదిరిగా 6% అమలు
చేయుటకు తగిన చర్యలు తీసుకుని, ఇందకు సంబందించిన అరియర్స్ ను మంజూరు చేయుటకు తగు తీసుకోగలరని
కోరుతున్నాము.

8. ఫీల్డ్ వర్క్ సిబ్బంది అందరికీ (JRPs, DPs, SMOs, SRTPs, FC Executive, FC Manager, Finishing School
Manager, JDMs, QC Executives, PPSS Executive) గతంలోని మాదిరిగా ఫిక్సుడ్ ట్రావెల్ అలవెన్సును వర్తింప
చేయుటకు తగిన చర్యలు తీసుకోగలరు.

ఇట్లు
తమ విధేయులు

You might also like