You are on page 1of 4

పాఠ్యాంశాల తొలగింపుపై చరిత్రకారుల ప్రకటన

ఎన్ సి ఇ ఆర్ టి పాఠ్యపుస్త కాల నుంచి ఎన్నో అంశాలను తొలగించారని ఏప్రిల్ మొదటివారంలో బైటపడగానే 250
మంది చరితక
్ర ారులు, మేధావులు, రచయితలు చేసన
ి నిరసన ప్రకటన

పన్నెండో తరగతి, ఇతర తరగతుల చరిత్ర పాఠ్యపుస్త కాల నుంచి కొన్ని అధ్యాయాలను పూర్తిగా తొలగించాలని, మరి
కొన్ని పాఠ్యపుస్త కాల నుంచి కొన్ని భాగాలను ఎత్తి వేయాలని ఇటీవల నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసర్చ్
అండ్ ట్రేనింగ్ (ఎన్ సి ఇ ఆర్ టి) తీసుకున్న నిర్ణయం తీవ్రమైన ఆందో ళనను కలిగిస్తు న్నది. పాండెమిక్, లాక్ డౌన్
ల కాలాన్ని వాడుకుంటూ, విద్యార్థు ల మీద పాఠ్యాంశాల భారాన్ని తగ్గించాలనే పేరు మీద ఎన్ సి ఇ ఆర్ టి ఈ
వివాదాస్పద కార్యక్రమాన్ని ప్రా రంభించింది. మొఘల్ పాలనా చరిత,్ర గుజరాత్ లో 2002 మత కల్లో లాలు,
ఎమర్జెన్సీ, దళిత రచయితల ప్రస్తా వనలు, నక్సలైటు ఉద్యమ ప్రస్తా వనలు, సమానత్వం కోసం ఉద్యమాలు వంటి
అంశాలను ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి సామాజిక శాస్త ం్ర , చరిత,్ర రాజనీతిశాస్త ్ర పాఠ్యపుస్త కాల నుంచి
తొలగించారు. పాండెమిక్ తొలగిపో యినప్పటికీ, పాఠశాల విద్య క్రమంగా సాధారణ స్థితికి చేరినప్పటికీ, ఇప్పుడిక
ఆన్ లైన్ బో ధన ఎంతమాత్రమూ లేనప్పటికీ, ఎన్ సి ఇ ఆర్ టి పుస్త కాల తాజా ప్రచురణలు కూడ ఈ పాఠ్యాంశాలు
లేకుండానే, తొలగింపులు కొనసాగుతూనే వెలువడ్డా యి.

ఈ నేపథ్యంలో, పన్నెండో తరగతి చరిత్ర పాఠ్యపుస్త కం రెండో భాగం నుంచి మొఘల్ ల మీద అధ్యాయాన్ని, మూడో
భాగం నుంచి ఆధునిక భారత చరిత్ర రెండు అధ్యాయాలను తొలగించడం చాల ఆందో ళనకరం. ఈ పుస్త కాలను
తయారుచేసిన బృందాలలోని చరితక
్ర ారులను, పాఠశాల ఉపాధ్యాయులను, చివరికి ఎన్ సి ఇ ఆర్ టి సభ్యులను
కూడా సంప్రదించడానికి ఈ తొలగింపులు జరిపే ముందు ఎటువంటి ప్రయత్నమూ జరగలేదు. విస్తా రమైన
సంప్రదింపుల ప్రక్రియతో, అనేక అంశాల మీద చర్చలతో ఆ పుస్త కాలు తయారయ్యాయి. ఆ చర్చలన్నీ పాఠ్యాంశాల
విస్త ృతిలో మాత్రమే కాక, అసలు విద్యాబో ధన ప్రక్రియలో, మధ్యంతర పాఠశాల నుంచి ఉన్నత పాఠశాల వరకు
విద్యాబో ధనను క్రమానుగతంగా, సంలీన ఐక్యతతో అభివృద్ధి చేయాలనే ఆలోచనలతో కూడినవి. అలాగే ఆ
పాఠ్యపుస్త కాలు రూపొ ందించిన ప్రక్రియలో సమ్మిళిత దృక్పథం ప్రధానమైనది. భారత ఉపఖండం లోనూ, విశాల
ప్రపంచం లోనూ మానవ గతం ఎంత సంపన్నమైన వైవిధ్యంతో ఉందో విద్యార్థు లకు అవగాహన కలిగించడం ఆ
పాఠ్యాంశాల ఉద్దేశం. ఆ పాఠ్యపుస్త కాల నుంచి కొన్ని అధ్యాయాలను, లేదా భాగాలను తొలగించడం విద్యార్థు లకు
విలువైన పాఠ్యాంశాలను అందకుండా చేస్తు ంది. అలాగే, వర్త మాన, భవిష్యత్తు సవాళ్ల ను ఎదుర్కోవడానికి
అవసరమైన విద్యార్జనా అంశాల నుంచి కూడ వారిని దూరం చేస్తు ంది. అందువల్ల అది తీవ్రంగా
సమస్యాత్మకమైనది. పాఠశాల పాఠ్యపుస్త కాలకు ఎప్పటికప్పుడు క్రమబద్ధ ంగా సవరణలు జరపాలనే అంశం మాకు
తెలుసు. అయితే, ఆ పని అప్పటికి చారితక
్ర ంగా రూపొ ంది ఉన్న మేధో సమూహపు చర్చతో, సమ్మతితో మాత్రమే
జరగవలసి ఉంటుంది. కాని ఇప్పుడు పాఠ్యాంశాలలో కొన్ని భాగాలను ఎంచుకుని తొలగించడం విద్యాబో ధనా
అవసరాల కోసం కాక, విభజన రాజకీయాల ప్రభావపు ప్రతిఫలనంగా జరిగింది.

1
పాఠశాల పాఠ్యపుస్త కాల హేతుబద్ధీకరణలో భాగంగా, విద్యార్థు ల మీద భారం తగ్గించడానికే ఈ తొలగింపులు
జరిపామని ఎన్ సి ఇ ఆర్ టి డైరెక్టర్ అన్నారు. వారు చెపుతున్న ప్రకారం, పాండెమిక్ కాలంలో విద్యార్థు లకు
అందవలసిన బో ధన అందకపో వడం వల్ల , పాండెమిక్ అనంతర కాలంలో పాఠ్యాంశాల బరువు ఎక్కువ
అయిపో యింది. అలాగే, కొన్ని అధ్యాయాలు కొన్ని పాఠ్యవిషయాలలో, తరగతులలో మళ్లీ మళ్లీ వచ్చాయి గనుక
చదువు భారం పెరిగిన విద్యార్థు లకు ఉపశమనం ఇవ్వడానికి కొన్ని భాగాలను తొలగించడం హేతుబద్ధ ం అని ఎన్
సి ఇ ఆర్ టి అంది. ఈ హేతుబద్ధీకరణ నిర్ణయం వెనుక ఎటువంటి స్వార్థ రాజకీయ ఉద్దేశం లేదని ఎన్ సి ఇ ఆర్ టి
అధికారులు అంటున్నారు.

కాని, ఎన్ సి ఇ ఆర్ టి డైరెక్టర్ చేసిన ప్రకటనలకు భిన్నంగా, ఆ పుస్త కాల నుంచి తొలగించిన అధ్యాయాలు
కచ్చితంగా ప్రస్తు త పాలకుల భావజాల వైఖరులకు సరిపడనివి అనే విషయమే ఈ తొలగింపులకు కారణం
విద్యాసంబంధమైనది కాదని తెలియజేస్తు న్నది. పాఠశాల పాఠ్యపుస్త కాల సవరణల ద్వారా ప్రస్తు త పాలకులు తమ
పాక్షిక దృక్పథాన్ని ముందుకు తీసుకుపో యే కార్యక్రమాన్ని కొనసాగిస్తు న్నారని తేలుతున్నది. భారత ఉపఖండపు
ప్రజల చరితన
్ర ు కేవలం ఒకే ఒక ఆధిపత్య (హిందూ) సంప్రదాయపు ఉత్పత్తి గా తప్పుడు అర్థం ఇచ్చే భావజాల
కార్యక్రమమే ప్రస్తు త కేంద్ర ప్రభుత్వం కొనసాగించదలచుకున్నదని పాఠ్యపుస్త కాల నుంచి తొలగించిన అంశాలను
విమర్శనాత్మకంగా విశ్లేషిస్తే సంపూర్ణంగా తేటతెల్లమైపో తుంది.

అటువంటి కార్యక్రమం పెట్టు కున్నందువల్ల నే, చరిత్ర పాఠ్యపుస్త కం రెండో భాగం నుంచి ‘రాజులూ, చరిత్ర కథనాలూ:
మొఘల్ పాలన (పదహారు, పదిహేడో శతాబ్దా లు)’ అనే అధ్యాయాన్ని తొలగించారు. భారత ఉపఖండంలో ఎన్నో
ప్రా ంతాలను మొఘల్ లు గణనీయమైన కాలం పాలించారనే వాస్త వం ఆ కాలపు చరితన
్ర ు ఉపఖండపు చరితల
్ర ో
అవిభాజ్యమైన భాగం చేస్తు ంది. మధ్యయుగాల భారతదేశంలో మొఘల్ సామ్రా జ్యం, విజయనగర సామ్రా జ్యం
రెండూ చాల ప్రముఖమైన సామ్రా జ్యాలు. ఆ రెండు సామ్రా జ్యాల గురించీ అంతకు ముందరి చరిత్ర పాఠ్యపుస్త కాలలో
చర్చించడం జరిగింది. కాని ప్రస్తు తం సవరించిన పుస్త కంలో మొఘల్ ల మీద అధ్యాయాన్ని తొలగించారు.
విజయనగర సామ్రా జ్యాన్ని యథాతథంగా ఉంచారు. ఈ మినహాయింపు వెనుక ఉన్న మతోన్మాద వైఖరి స్పష్ట మే.
అది భారత గతం గురించిన తప్పుడు అవగాహన పునాదిగా జరిగింది. ఆ కాలంలో పాలకుడి మతమే ఆధిపత్య
మతంగా ఉండేదని ఆ తప్పుడు అవగాహన భావిస్తు ంది. ఆ అవగాహన నుంచే “హిందూ” యుగం, “ముస్లిం”
యుగం వగైరా తీవ్రంగా సమస్యాత్మకమైన నిర్వచనాలు వచ్చాయి. చారితక
్ర ంగా చాల వైవిధ్యభరితమైన సామాజిక
కలనేత దృశ్యం మీద ఈ ఏకత్వపు నిర్వచనాలను ఎంతమాత్రం విమర్శ లేకుండా రుద్దు తున్నారు.

అంతేకాదు, ఆధునిక చరిత్ర అనే మూడో భాగం నుంచి ‘వలసకాలపు నగరాలు: పట్ట ణీకరణ, ప్రణాళిక, భవన
నిర్మాణశైలి’, ‘దేశ విభజన అవగాహన: రాజకీయాలు, జ్ఞా పకాలు, అనుభవాలు’ అనే రెండు చాల ముఖ్యమైన
అధ్యాయాలను తొలగించారు. గాంధీ హత్యలో హిందూ తీవ్రవాదుల పాత్ర గురించి ప్రస్తా వనలన్నిటినీ తొలగించడం
కూడ ప్రా ధాన్యత గల అంశమే. ఉదాహరణకు, చరిత్ర పాఠ్యపుస్త కం మూడో భాగంలో ‘మహాత్మా గాంధీ –
జాతీయోద్యమం’ అనే అధ్యాయంలో నాథూరాం గాడ్సే గురించి “హిందూ తీవ్రవాద వార్తా పత్రిక సంపాదకుడు” అనే
ప్రస్తా వన తొలగించారు.

2
చరిత్ర పాఠ్యపుస్త కాల నుంచి మొత్త ం అధ్యాయాలనూ, కొన్ని అధ్యాయాలలో భాగాలనూ తొలగించాలని ఎన్ సి ఇ
ఆర్ టి తీసుకున్న ఈ తిరోగామి నిర్ణయం ఎటువంటి విద్యాసంబంధమైనదీ, బో ధనాసంబంధమైనదీ కాదని నొక్కి
చెప్పడం చాల ముఖ్యం. అందుకు భిన్నంగా, చరిత్ర పాఠ్యపుస్త కాల నుంచి తొలగించిన భాగాలు కచ్చితంగా ప్రస్తు త
పాలకుల కుహనా చరిత్ర పథకానికి సరిగ్గా సరిపో యేవి మాత్రమే. చరిత్ర నుంచి ఏదైనా ఒక భాగాన్ని తొలగించడం
చరిత్ర క్రమంలో గతం నుంచి వర్త మానానికి కొనసాగిన ధారను అర్థం చేసుకోవడంలో విద్యార్థు లకు ఇబ్బంది
కలగజేస్తు ంది. గతానికీ వర్త మానానికీ లంకె కుదిర్చే, పో ల్చిచూసే, విశ్లేషించే అవకాశాన్ని రద్దు చేస్తు ంది. చరిత్ర అనే
పాఠ్యాంశపు సజీవ అంతస్సంబంధాలను ధ్వంసం చేస్తు ంది. అంతమాత్రమే కాదు, చరిత్ర పాఠ్య పుస్త కాల నుంచి
చరితల
్ర ోని మొత్త ం కాల వ్యవధులలో కొన్నిటిని తొలగించడమంటే దురభిప్రా యాలనూ తప్పుడు అవగాహనలనూ
కొనసాగించడమే అవుతుంది, ప్రస్తు త పాలక పక్షాల విచ్ఛిన్నకర మతోన్మాద, కులతత్వ కార్యక్రమానికి
సహాయపడడమే అవుతుంది.

గతంలో ఎన్ సి ఇ ఆర్ టి రూపొ ందించిన పుస్త కాలు, చరిత్ర పాఠ్యాంశాలు భారత ఉపఖండమనేది విభిన్న
సమూహాలు, స్థా నిక మూలవాసులు, వగైరా కలగలిసిన భిన్న సంస్కృతుల మహా సంగమస్థ లి అనే అవగాహన
కల్పించడానికి ఉద్దేశించినవి. ఏ అధ్యాయం తర్వాత ఏ అధ్యాయం ఉండాలనే వరుస కూడ విద్యార్థు లకు చరిత్ర అనే
నైపుణ్యాన్ని బో ధించడానికి, గతం గురించి విమర్శనాత్మక ఆలోచనను అభివృద్ధి చేయడానికి తయారు
చేయబడింది. పాత ఎన్ సి ఇ ఆర్ టి పాఠ్య ప్రణాళిక ప్రధాన కేంద్రీకరణ భారత ఉపఖండపు సంకీర్ణ వారసత్వం
మీద, ప్రస్తు త కాలపు చారితక
్ర వంశవృక్షాల మీద ఉండింది. ఆ పాఠ్య ప్రణాళిక నుంచి కొన్ని అధ్యాయాలను
ప్రస్తు తం వ్యూహాత్మకంగా తొలగించారు.

పన్నెండో తరగతి చరిత్ర పాఠ్య పుస్త కం నుంచి తొలగింపులతో పాటు, పదకొండో తరగతి చరిత్ర పాఠ్యపుస్త కం నుంచి
కూడ ఎన్నో తొలగింపులు జరిగాయి. వాటిలో పారిశ్రా మిక విప్ల వం తదితరమైన చాల కీలకమైన
ఇతివృత్తా లున్నాయి. అలాగే పన్నెండో తరగతి రాజనీతి శాస్త ్ర పాఠ్య పుస్త కం నుంచి కూడా కొన్ని
తొలగింపులున్నాయి. అవి ప్రజా ఉద్యమాల వికాసం, 2002 గుజరాత్ మారణకాండ, జాతీయ మానవ హక్కుల
కమిషన్ నివేదిక వంటి భాగాలు. అదే విధంగా, పదకొండో తరగతి సమాజశాస్త ్ర పాఠ్య పుస్త కం ‘అండర్ స్టా ండింగ్
సొ సైటీ’ నుంచి 2002 గుజరాత్ మారణకాండ ప్రస్తా వనలను తొలగించారు.

ఒక విచ్ఛిన్నకర, పాక్షిక కార్యక్రమం నిర్దేశకత్వంలో, పాఠశాల పాఠ్యపుస్త కాల నుంచి ఎన్నో కీలకమైన భాగాలను
ఎంపిక చేసి తొలగించడం ద్వారా ఎన్ సి ఇ ఆర్ టి భారత ఉపఖండపు సంకీర్ణ వారసత్వానికి హాని చేయడం
మాత్రమే కాదు, భారత ప్రజానీకపు ఆకాంక్షలకు ద్రో హం చేస్తు న్నది. వలసవాద అవగాహనాలు, వాటి సమకాలీన
పునరుత్పత్తు లు భారత నాగరికతను ఒకే ఒక్క ఆధిపత్య సంప్రదాయపు ఉత్పత్తి గా చూస్తా యి. అందువల్ల నే
చారితక
్ర ంగా విభిన్నమైన వైవిధ్యభరితమైన సామాజిక కలనేత మీద “హిందూ సమాజం” వంటి నిర్వచనాలు
నిర్విమర్శగా రుద్ద బడుతున్నాయి. చిట్ట చివరికి, ఈ అన్ని తొలగింపులూ భారత ఉపఖండంలో ఒకే ఒక్క ఏకీకృత
“హిందూ” సమాజం ఉండిందనే పరిశుద్ధ చరితన
్ర ు విద్యార్థు లకు అందిస్తా యి. ఈ తరహా చరితల
్ర ో రాజుల గురించీ,
వారు చేసిన యుద్ధా ల గురించీ కథనాలు ఆందో ళనకరమైన అర్థా లతో సాగుతాయి. రాజ్య నిర్మాణాలు, సామ్రా జ్యాల

3
స్థా పన, మధ్యయుగాల పరివర్త నలు అన్నిటినీ ఈ తరహా చరిత్ర “హిందూ” అనబడే ఏకశిలాసదృశ సమాజం
ఒకవైపునా, “ఇస్లా మిక్” దురాక్రమణదారులూ పాలకులూ మరొకవైపునా ఉండి నిరంతర ఘర్షణ జరిగిందనే
నిరాధారమైన కథనంగా కుదిస్తు ంది. స్త్రీపురుష భేదం, కులం, వర్గ ం, వగైరా గండకత్తెరలతో పాటు విభిన్న రాజ్య
నిర్మాణాలలో ప్రజానీకం మీద సాగిన దో పడ
ి ీనీ పీడననూ దాచిపెట్టి భారత గతంలో ఎల్లెడలా సామాజిక సామరస్యం
వ్యాపించి ఉండేదనే భావనను ఈ తరహా చరిత ్ర కలగజేస్తు ంది. అలాగే ఈ తరహా చరిత్ర ప్రా ంతీయ వైవిధ్యాన్ని కూడ
విస్మరిస్తు ంది. చరితన
్ర ు అటువంటి ఏకశిలాసదృశ కథనాలకు కుదించడం ద్వారా కుహనా చరితల
్ర కు రంగం సిద్ధం
చేస్తు ంది. తద్వారా ప్రత్యేకంగా మతోన్మాద, కులతత్వపూరిత చరిత్ర రాజ్యం చేయడానికి అవకాశం ఇస్తు ంది.
అటువంటి “చరితల
్ర ు” వాట్సప్ ద్వారా, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఇప్పటికే పెద్ద ఎత్తు న చలామణీలో
ఉన్నాయి.

చరిత్ర పాఠ్యపుస్త కాల నుంచి అధ్యాయాలనూ, భాగాలనూ తొలగించాలని ఎన్ సి ఇ ఆర్ టి తీసుకున్న నిర్ణయంతో
మేం దిగ్భ్రాంతికి గురయ్యాం. ఈ తొలగింపుల నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. ఎన్ సి
ఇ ఆర్ టి నిర్ణయం వెనుక విచ్ఛిన్నకర ఉద్దేశాలున్నాయి. ఆ నిర్ణయం మన రాజ్యాంగ ఆదర్శాలకూ, భారత
ఉపఖండపు సంకీర్ణ సంస్కృతికీ వ్యతిరేకమైనది. అందువల్ల దాన్ని వీలైనంత త్వరగా వెనక్కు తీసుకోవాలి.

(ఏప్రిల్ 9 న విడుదల చేసిన ఈ ప్రకటన మీద సంతకాలు చేసిన 250 మంది చరితక
్ర ారులు, మేధావులలో రొమిల్లా
థాపర్, హర్బన్స్ ముఖియా, ఇర్ఫాన్ హబీబ్, జ్ఞా న్ ప్రకాష్, ఉమా చక్రవర్తి, ఆదిత్య ముఖర్జీ, ఆనంద్ చక్రవర్తి,
ఆనంద్ పట్వర్ధన్, అపూర్వానంద్, బద్రీ రైనా, బార్బరా మెట్కాఫ్, డేవిడ్ లుడ్డెన్, దిలీప్ సిమియన్, జయతీ ఘోష్,
కె సచ్చిదానందన్, నందితా నారాయణ్, కారెన్ గాబ్రియెల్, కె ఎం శ్రీమాలి, కవితా శ్రీవాస్త వ, మాయా జాన్,
మాయా కృష్ణా రావు, మృదులా ముఖర్జీ, ముకుల్ కేశవన్, నాసిర్ త్యాబ్జీ , ఆర్ మహాలక్ష్మి, షబ్నమ్ హాష్మి, శాంతా
సిన్హా , శతరూప భట్టా చార్య, శ్రీలా రాయ్, సుజాతా పటేల్, సుజాతా భద్రో , ఉపీందర్ సింగ్ తదితరులు ఉన్నారు)

You might also like