You are on page 1of 3

22/12/2023, 18:28 (30) Quora

ఎడ్వర్డ్ సయీద్ ఎవరు? ఆయన రచించిన ఓరియంటలిజం గ్రంథంలో మౌలికంగా ఏవిషయాలు


ప్ర తిపాదించారు?
ఓరియంటలిజం, రచయిత ఎడ్వర్డ్ సయీద్ డబల్యు, ప్ర చురణ సంవత్సరం. 1976.
సయీద్ పాలస్తీ నా దేశీయడు, విద్యావేత్త , రచయిత, అనేక విశ్వవిద్యాలయల్లో విజిటింగ్ ప్రొ ఫెసర్. ఇప్పుడు కొలంబియా
విశ్వవిద్యాలయంలో అంగ్ల సాహిత్యం బోధిస్తా రు.
బ్రి టిష్, ఫ్రెంచ్ చరిత్ర కారులు, రచయితలు ఈజిప్టు , ఇతర సమీప ప్రా చ్య దేశాలను(నియర్ ఈస్ట్ ) Oriental దేశాలని,
వాటిని గురించి .చేసిన రచలను- చరిత్ర , యాత్రా చరిత్ర లు, నవలలు, ఆ దేశపు భాషాసంస్కృతులను, ప్ర జలను గురించి
రాసిన సమస్త విషయాలను ఓరియంటలిజం పేరుతో వ్యవహరించారు. ఈ దృష్టి తోచూస్తే భారతదేశం కూడా ఈ
ఓరియంటలిజం కిందకు వస్తుంది.
ఓరియంటలిజం భావన , ఆ రచనలు వలస పాలకులకు ఉపయోగించాయని, పరోక్షంగా స్థా నిక ప్ర జలను అణచిపెట్టి వలస
పాలన కొనసాగించడానికే ఆయా రచయితలు, భాషావేత్త లు, కళావిమర్శకులు, రచయితలు సహకరించారని సయీద్ ఈ
రచనలో ఆరోపించాడు. కొంతవరకు అది నిజం కూడా. పాలితుల భాష నేర్చుకొని, క్రై స్త వ మత ప్ర చారానికి, మరింత పకడ్
బందీగా, కట్టు దిట్టంగా స్థా నిక తిరుగుబాట్ల ను అణచివేయడానికి ఉపయోగించుకొన్నారు. రచయిత సమీప ప్రా చ్యానికే
పరితమయినా అతని పరిశీలనలు భారత దేశం వంటి అనేక ప్రా చ్యదేశాలకు అన్వయిస్తా యి. ఓరియంట్ గురించి బ్రి టిష్ ,
ఫ్రెంచి, అమెరికా వారి అనుభవాలను మొత్తంగా ఒక యూనిట్ గా స్వీకరించి, వారి దృష్టి లో అరబ్, ఇస్లాం వేయేళ్ళ చరిత్ర ను
ఒక యూనిట్ గా భావించి పరిశీలించాడు.
ఫ్రెంచ్, ఇంగ్లీ షు పండితులు పర్షి యా, ఈజిప్టు , భారతదేశంలో ప్రా చీన భాషలను అధ్యయనం చేసి, ఆ ప్రాంతాల లిపులను,
శాసనాలను కూడా అధ్యాయం చేశారు. E.S. Sheffer రచన “Kubla KKhan and the fall of Jerusalam
“ఓరియంటలిజం మీద వచ్చిన తొలి గ్రంథాలలో ఒకటి. ఓరియంట్ నిగురించి రచనలు చేసే రచయితల కంఠస్వరం,
పాఠకులను సప్ర యత్నంగా సంబోధించిన విధానం, అందులో ఇచ్చిన చిత్రా లు , రచయిత ఓరియంట్ కు ప్రా తినిధ్యం
వహిస్తు న్నాడా? దాని తరుఫున మాట్లా డుతున్నాడా? అన్నీ పరిశీలన చేయదగినవే. సాధారణంగా ఓరియంటలిస్టు తనకు
పూర్వం వెలువడిన యాత్రా చరిత్ర లు, భాషా విషయ అధ్యయనాలు, ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ ల రికార్డు అన్ని
వాడుకుంటాడు. అయితే ఓరియంటలిస్టు ఓరియంట్ కు వెలుపలివాడు. అందుకే ఓరియంటలిజం ఓరియంట్ కు
దూరంగా, ప్ర ధానంగా ఇస్లాంకు, అరబ్బులకు వ్యతిరేకంగా, జూడాయిజం, యూదులపట్ల సానుకూల ధోరణి కలిగి
ఉంటుంది.
పెట్రో లియం చమురు ఆధిపత్యరాజకీయాలు కూడా రచయిత దృక్పథాన్ని నిర్ణ యిస్తా యి. అమెరికాలో పాలస్తీ నా పౌరుడుగా,
అరబ్ గా జీవించడం చాలా బాధాకరంగా ఉంటుందని రచయిత సయీద్ స్వానుభవంతో వివరిస్తా డు. అమెరికా ప్ర భుత్వం
Zionisam తో కలిసి అడుగులు వేస్తోంది అంటాడు.
ఈజిప్టు ను ఆక్ర మించింది దాన్ని ఉద్ధ రించడానికే, ఈజిప్టు పౌరుల శ్రే యస్సుకే అని Balflour రాశాడు. ఈజిప్టు దేశాన్ని
ఆక్ర మించి, వలసగా మార్చడం ఆ ప్ర జల శ్రే యస్సుకేనట! 1882లో ఆక్ర మణ, 1097తిరుగుబాటు అణచివేసినందుకు ఆ
గవర్నరుకు ఏభైవేల పౌండ్ల బహుమతి అన్ని ఈజిప్టు శ్రే యస్సుకే!
పాలితుల భాష, చరిత్ర , సంస్కృతుల పరిజ్ఞా నం వల్ల వారిని మరింత సులభంగా, అణచిపెట్టి పాలన చేయడం
సులభమవుతుంది అంటాడు సయీద్ ఈ రచనలో. పాలితుల లోటుపాట్లు , పరిమితులు, వారి జాతి, చరిత్ర , సంస్కృతి
సంప్ర దాయాలు, సమాజం గురించి తెలుసుకోవడం వల్ల పాలన ‘సంతృప్తి ’గా సాగడాన్ని ఓరియంటలిజం గా సయీద్
అభివర్ణించాడు.
యూరోపియన్ల ప్ర కారం ప్రా చ్యదేశాలవారు మూర్ఖంగా, శిశువులమాదిరివారని, పతితులని, తమకన్నా వేరుగా ఉంటారని
భావిస్తు న్నారు. తాము సకల సుగుణాభిరాములమని, పరిణత మనస్కులమని, సహజంగా ప్ర వర్తించే వారమని, original
అని భావించుకొంటారు. ప్రా చ్య దేశాలు, బలహీనంగా, పడమట దేశాలు బలంగా ఉన్న స్థి తిలో ఉన్న సమయంలో ఈ
భావనలు కల్పించుకొన్నారు. ఇస్లాం మతాన్ని అనుసరిస్తు న్న ప్రాంతాల్లో ఓరియంట్ ఫ్రెంచి, ఇంగ్లీ షు వారికి ఎదురైంది. ఈ
https://te.quora.com 1/3
22/12/2023, 18:28 (30) Quora

పరిస్థి తుల్లో యూరోపియన్లు ఓరియంట్ ను నిర్వచించారు. పాశ్చాత్యుల ఆధిక్యతకు ప్రా చ్యదేశాలవారి “ఆత్మన్యూనత”కు
తేడానే “ఓరియంటలిజం”గా అభివర్ణించారు. మరోరకంగా చెప్పాలంటే తమగతంనుంచి తాము వారసత్వంగా పొందిన
భావనలే యూరోపియన్లు ఓరియంటలిజంగా భావించారు. అయితే ఓరియంట్ కూడా ఆక్సిడెంట్.ను ప్ర భావితం చేసిన
సంగతి సయీద్ గుర్తు చేస్తా డు.
మత ప్ర చారకులు, బైబిలు పరిశోధకులు, ఇస్లాంను అధ్యయనం చేసే విద్వాంసులు, సెమిటిక్ భాషలు అధ్యయనం చేసే
పండితులు, చైనా భాషా సంస్కృతులను పరిశీలించే పండితులు, భారతదేశంలో సంస్కృతం చదివిన విలియం జోన్స్
వంటి వారు, విక్ట ర్ హ్యూగో, గెథె, Nerval, Floubrant, FFitzgerald తొలి ఓరియంటలిస్టు లు, వీరి రచనలు అందుకు
ఆధారాలు.
తమ దేశాలుకాని, తమవి కాని ప్ర దేశాల్లో నివసించే ప్ర జలను బార్బేరియన్ల ని, ఆదిమానవులని, క్రూ రులైన ప్ర జలు నివసించే
ప్రాంతాలని ఏకపక్షంగా యూరోపియన్లు తీర్మానించారు. ఈ విభజన ఏకపక్షంగా ఏర్పరిచింది.
క్రై స్త వ ప్ర పంచ దృక్పథం ముస్లింలపట్ల , ఓరియంటల్ లపట్ల స్థి రపడింది, దాన్ని ఎవరూ సరిచేయలేకపోయారు. ఈజిప్టు ను,
ఆపరిసర దేశాలను మాత్ర మే యూరోపియన్లు నియర్ ఓరియంట్ అన్నారు, ఇస్లాంను “Mohamaden” అని అగౌరవంగా
పిలిచారు. ఓరియంటలిజం ఒకరకమైన తప్పుడు అవగాహన, పొరపాటు చైతన్యం, భావన, paranoiea అంటాడు
సయీద్.
సూయజ్ కాలువ ఏర్పడడంతో యూరప్ కు నియర్ ఈస్టు తో రాకపోకలు, సంబంధాలు, సైన్యాల కదలికలు, ఆసియాలో వారి
వ్యాపారాలు సజావుగా సాగేందుకు పరిస్థి తులు అనుకూలం అయ్యాయి.వెస్టు ఇక శాశ్వతంగా ప్రా చ్య దేశాలలలో తిష్ట
వేసింది. ఇక యాత్రా చరిత్ర లు, పుస్త కాలు అన్నీ ఓరియంటల్ సంప్ర దాయంలో రాసాగాయి.19వ శతాబ్ది చివరకు
ఓరియంటలిజం పరిపూర్ణ త పొందింది.
యూరప్ విస్తీ ర్ణ ణవాదంలో మతప్ర చారకులు బహిరంగంగానే చేయికలిపారు. విద్యాసంస్థ లు నెలకొల్పడం ఈ ప్ర ణాళికలో
భాగమే. ఇక యూరప్ వాసులు అధిక సంఖ్యలో మిషన్ లు, ఫ్యాక్ట రీలు, కౌన్సిలర్ ఆఫీసులు పెట్టి ఆసియా దేశాలలో
స్థి రపడ్డా రు. ఇస్లాంను టెంట్ అండ్ ట్రై బ్ గా మార్చి పరిహాసప్రా యంచేశారు.
నిఘంటు నిర్మాణం, వ్యాకరణరచన, అనువాదం, cultural decoding, వగైరా కార్యక్ర మాలద్వారా ఓరియంటలిస్టు ”
ఓరియంట్” అనామకంగా మారకుండా దాన్ని కాపాడుతున్న హీరోగా తనను తాను భావించుకొన్నాడు. ఈ క్ర మంలో
ఓరియంటలిజం శాస్త్రం సమూలమైన పరివర్త నం చెందింది.
Massignon వంటి కొందరు నిజమైన ఓరియంటలిస్టు లు ఈ రంగంలో గొప్ప కృషి చేశారు. ఇతరేతర ప్రా చ్యదేశాల భాషా
సంస్కృతుల పరిజ్ఞా నం లేకపోతే Classical Originalism ప్రా చ్యదేశాలను అర్ధం చేసుకోడానికి సరిపోదని మాసిగ్నాన్
అంటారు. “The essence of the difference between East and West is between modernity and ancient
tradition” అని ఆయన ఒక్క మాటలో తేల్చారు.
ముస్లింలు నలుగురు స్త్రీ లను పెళ్ళాడడం, ఒక్కపొద్దు లు, విందులు వీటికే ఇస్లాంను ఓరియంటలిస్టు లు పరిమితం చేశారు.
ఏవో కొన్ని మతగ్రంథాలను బట్టి , మొత్తం ఇస్లాంను అంచనా వేయడాన్ని సయీద్ తప్పు పట్టా డు. Islam rarely studied,
rarely researched, rarely known అంటాడు. ఇస్లాం గురించి, అరబ్బులగురించి, ప్రా థమిక సమాచారం ఆధారంగా
మూసరచనలు వచ్చాయని సయీద్ అంటాడు. Cambridge History of Islam ను ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నాడు.
అవాస్త వాలు, వక్రీ కరణలు, పరస్పర విరుద్ధ అంశాలను అతను వివరంగా తన పుస్త కంలో ఇచ్చాడు. అరబ్బుల సమాజం
చలనరహితమైనదని, అరబ్బీ భాష తక్కువగా అభివృద్ధి చెందిన భాషని, వెనుక పడిన వారి ఆలోచనలను ఆ భాష
తెలియజేస్తూందని, ఆ భాష ఆలోచనలను నియంత్ర ణ చేస్తుందని ఇంకా రకరకాలుగా ఓరియంటలిస్టు లు రాశారు.
మనలో ముస్లింలపట్ల , అరబిక్ భాష, సమాజాలపట్ల ఉన్న అనేక అశాస్త్రీ య విషయాలను ఎడ్వర్డ్ సయీద్ తన పరిశోధన
గ్రంథంలో ఖండించి, ఓరియంటలిజం పేర పాశ్చాత్య సమాజం సృష్టించిన కాల్పనిక దృక్పథాన్ని పరాస్తంచేసి కొత్త చూపు
కలిగించాడు.

https://te.quora.com 2/3
22/12/2023, 18:28 (30) Quora

సి.పి.బ్రౌ న్, కాలిన్ మెకంజీ, ఇతర ఇంగ్లీ షు భాషా వేత్త లు, పరిశోధకులు, మిషనరీలు, ఇంగ్లీ షు చరిత్ర కారులు,
యాత్రా చరిత్ర కారుల గ్రంథాలను ఈ దృష్టి తో మరొకసారి పరిశోధించవలసిన అవసరం ఉంది. నామటుకు 1836-
39మధ్యకాలంలో రాజమండ్రి జిల్లా జడ్జి థామస్ భార్య జూలియా ఇంగ్లాండులో తనవారికి రాసిన ఉత్త రాలను మరొక
పర్యాయం పరిశీలించవలసిన అగత్యం ఉందనిపించింది. “ఆమె లేఖలు” పేరుతో రెండేళ్ల క్రి తం ఆ పుస్త కాన్ని ఎంఎస్.కొ
సంస్థ ప్ర చురించింది.

https://te.quora.com 3/3

You might also like