You are on page 1of 1

18/12/2023, 21:23 (30) Quora

చరిత్ర లో బాబర్, తైమూర్, ఘోరీ, ఘజనీలను కిరాతకులు, మతోన్మాదులుగా చూపకపోవటం వల్ల మనకు ఏం
లాభం జరిగింది?
దొంగలను దొంగలుగా, ఉన్మాదులను ఉన్మాదులుగా, ఉన్నది ఉన్నట్లు గా చూపించకపోతే ఏమవుతుందో తెలుసుకోవాలంటే
నేటి భారతాన్ని చూడండి. నిజాలనే నివేదిస్తే నిష్క్రియ పరత్వం. అబద్ధా ల వంక జోరైన ఆరాటం. నిజం మాట్లా డాలంటే
భయం. నిజాయితీగా నిలబడినవాడికి చేయూతమివ్వాలంటే భయం. ఎవరు ఏమంటారో ఏమి చేస్తా రోననే అనుమానం.
ఇదంతా తప్పుడు చరిత్ర ను చదువుకోవడం మూలంగా తయారైన దుస్థి తి. సత్యం వద, ధర్మం చర అనే దేశంలో సత్యం
వధ, ధర్మం చెర అనే పరిస్థి తి అర్ధంకావడం లేదు.
ఘోరీ - ఓటమికి మారుపేరు, లెక్క ప్ర కారం. పదిహేడుసార్లు ఓడినవాడు తిరిగి దండయాత్ర చేయగలిగాడంటే కారణం,
'శతృవైనా ప్రా ణభిక్ష కోరితే లేదా వెన్ను చూపితే చంపకుండా విడిచిపెట్టా లనే ధర్మం' మాత్ర మే. ఈరోజు మవం ఎన్నో
అనుకోవచ్చును. అలా ఎలా విడిచి పెడతారండీ, ఇందులో ఏదో తిరకాసు ఉంది అని ఇరవయయ్యవ శతాబ్దంలో
అనుకోవచ్చును. కానీ రాజపుత్రు ల సంఘటిత వ్యవస్థ , పృథ్వీరాజ్ శౌర్యం ముందు ఆగలేక పారిపోయిన ఘటనలు
పన్నెండు శతాబ్దంలో జరిగినవి. చంపకుండా విడిచిపెట్ట డానికి కారణాలు మనమనుకొనదగినవి 1. ఆయా ప్రాంతాల్లో
దొంగలమూకలను సంఘటితం చేసి వాడు వచ్చాడు. వాడిని ఓడించి వదిలేస్తే దొంగలమూకలను ఏకంచేసుకొని వస్తా డు.
చంపేస్తే చిన్న చిన్న మూకలు దేశం మీద పడతాయి. ఆయా కొండల్లో పట్టు కోవడం కష్టం అని.
2.ఒకవేళ చంపకుండా వదిలేస్తే
అదే సమయం లో మంగోల్ నుంచి పెరుగుతూ వస్తు న్న చెంఘిజ్ఖా న్, వారి సైన్యానికి వీరు
అడ్డంగా ఉంటారనే అవకాశం కోసం.
మన వారు చరిత్ర లో ఎన్నెన్నో కారణాలను చూపిస్తా రు. ఓడిపోవడానికి కారణాలు ఏవైనా ఉండవచ్చు. గెలిచిన తరువాత
దేశంమీద పడి ఎంతమందిని ఎందుకు చంపారో కారణాలు స్పష్టం గా ఉన్నాయి. ఆ కాలణాలను మాత్రం ఎఱ్ఱ కళ్ళద్దా ల
చరిత్ర కారులు కనీసం ప్ర స్తా వించలేదు. ఘోరీ మాత్ర మే కాదు. బాబర్, తైమూర్, అక్బర్, నుంచీ ఔరన్ఘ జబ్ వరకూ జరిగిన
మత హత్యలలో కనీసం ఒక కోటిమంది సాధారణపౌరులు మరణించిఉంటారని విదేశీ చరిత్ర కారుల ఊహ.
ఇప్పుడు మనకు జరిగిన నష్టా న్ని లెక్కవేయలేము. లాభాన్ని చూసుకునేట్ల యితే ప్ర భుత్వం భయం లేకుండా వారి పనిని
వారు చేసుకోవచ్చు. పరిశోధన, అందునా చరిత్ర పరిశోధన, నిజాలగురించి వాద ప్ర తివాదనలూ, వివిధ వర్గా ల గొడవలూ
ఉండవు. మహా అయితే నిజంతెలిసిన కొంతమంది గొడవ పెట్ట వచ్చు. అటువంటి వరిని 'ఇగ్నోర్ కర్' అనుకుంటే
సరిపోతుంది.
మనం మన అనుభవాన్నుపయోగించుకుని, తప్పులను సరిచూసుకుని, అటువంటివే మరలా జరగకుండా
చూసుకుంటాము. ఒక దేశానికి చరిత్ర అటువంటి అనుభవాలను సూచిస్తుంది. తప్పుడు చరిత్ర ఆయా దేశాల్లో జరిగిన
తప్పులను చూపకపోవడం వలన సరిచేసుకునే అనకాశం ఉండదు. మన దేశంలో కూడా అంతే. తప్పులు ఏమి
జరుగుతాయో వాటిని వివిధ వ్యవస్థ లో ఎలా ఆపవచ్చో మనకు తెలియదు. సత్యం తెలిస్తే మూలకారణాలను ప్ర జలే
ఆపగలరు. ప్ర జలకు తెలియని రోజున రక్ష ణ వ్యవస్థ మీద ఆ బాధ్యత పడుతుంది.
జర్మనీ వారు హిట్ల ర్ గురించి వారి చరిత్ర లో వ్రా సుకున్నారు. అతను సాగించిన హత్యాకాండలగురించి వారి పిల్ల లు
చదువుకుంటారు. అతని ప్ర వర్త న తెలుసుకుంటారు. ఉన్మాదానికీ ఉగ్ర వాదానికీ అతివాదానికీ ప్రో త్సహించేవారు ఎలా
మాట్లా డుతారో తెలుసుకుంటారు. ఫలితంగా వ్యక్తు లను వడబోస్తా రు. ఇక్కడ మనకా
అవకాశమేదీ?
వేరేదేశపు సీక్రె ట్ ఫైల్స్ బయటకు వస్తే నే గానీ ఇక్కడేది ఎందుకు జరుగుతోందో ఎవరికీ తెలియదు.
నేను చరిత్ర విద్యార్థి ని కాకపోయినా నాకు ఆ దృష్టి ని కలిగించిందీ, పైన వ్రా సిన వ్రా తకు ఆధారమూ శ్రీ యం. వి. ఆర్. శాస్త్ర్రి
గారి 'ఏది చరిత్ర ' అనే పుస్త కం. కొనసాగింపుగా శ్రీ శాస్త్రి గారు ' ఇదీచరిత్ర ' అనే పుస్త కాన్ని కూడా ఇచ్చారు. అందులో ఎన్నెన్నో
రిఫరెన్స్ గ్రంథాల పట్టి క ఉంది. ఆ పుస్త కం మొత్తం ఆంధ్ర భూమి లోని వ్యాసాలు సంకలనం. దుర్గా పబ్లి షర్స్ వారి ప్ర చురణ.
ఆన్ లైన్ లో కూడా కొనుక్కోవచ్చును.
https://te.quora.com 1/1

You might also like