You are on page 1of 1

07/06/2023, 10:41 (8) Quora

దేవర న్యాయం అంటే ఏంటి? కొన్ని సందర్భాలు చెప్పండి?


ఏ జీవికైనా కూడా పిల్ల లను కనాలనే ఉంటుంది. అందునా వంశం అభివృద్ధి చెందాలన్నది మానవజాతిలో అతిపెద్ద కోరిక.
అనేక కారణాలవల్ల దంపతులకు సంతానం కలగకపోవచ్చు. భర్త మరణించినప్పుడు కానీ, అతనికి సంతానాన్ని ఇచ్చే శక్తి
లేనప్పుడు కానీ భర్త అనుమతితో భార్య ఇతరత్రా సంతానాన్ని కనడాన్ని సనాతన భారతీయ ధర్మం అంగీకరించింది. ఈ
పద్ధ తిని నియోగం అనేవారు.
సాధారణంగా ఇటువంటి అసాధారణ ప్ర క్రి యలో తెలిసిన వారిని లేదా బంధువులనో ఇష్ట పడడం సామాన్యం. భర్త యొక్క
అన్నదమ్ములే ఎక్కువగా సంతానాన్ని కలిగించేవారు. భర్త అన్న తమ్ములను దేవర అని అంటారు. అందుకే ఈ ప్ర క్రి యకు
దేవర న్యాయం అన్న పేరు వచ్చింది. మనస్మృతి అంగీకరించిన ధర్మం ఇది.
ధృతరాష్ట్రుడు, పాండురాజు దేవరన్యాయం ద్వారా జన్మించారు.
పాండవులు నియోగ పద్ధ తిలో పుట్టా రు
అయితే ఈ దేవర న్యాయం వల్ల కలిగే ఇబ్బందులను కష్టా లను గుర్తించడం వల్ల నో, మరే ఇతర కారణాల వల్ల నో
కలియుగంలో ఈ పద్ధ తిలో సంతానం కనడం నిషిద్ధం.
దేవరాచ్చ సుతోత్పత్తి కలౌ పంచ నిషేధయేత్.
కానీ నియోగం అన్న పద్ధ తి గతశతాబ్ది లో కూడా అక్కడక్కడ జరుగుతూనే ఉండేది అని తమిళంలో రచింపబడిన
మాదోరుబాగన్ అనే నవల చెప్తుంది.
పద్దె నిమిదవ శతాబ్దం లో హైహయ వంశంలోని రాజరాజ్ సింగ్ అనే కలచరి రాజు (నేటి చత్తీ స్ గడ్ ప్రాంతం) నియోగం
ద్వారా సంతానం కన్నట్లు ఉన్నది
ఆధునిక వైద్యం కూడా ఇతరుల నుంచి సేకరించిన బీజంతో ఫలదీకరణ జరుపుతున్నది.

https://te.quora.com 1/1

You might also like