You are on page 1of 5

11/21/22, 7:18 PM (8) Quora

వీలునామా ఎలా వ్రా యాలి? బాండ్ పేపర్ మీద వ్రా స్తే సరిపోతుందా లేక తెల్ల కాగితం మీద వ్రా స్తే చాలా? ఇందులో
పాటించవలసిన నియమాలు ఏమిటి?
విల్లు రాసే వ్యక్తి హిందూ అని భావిస్తున్నాను. రాసిన వీలునామా చెల్లు బాటు అవడానికి
కావలసిన లీగల్ requirements చూద్దాం. విల్లు రాసే వ్యక్తి ని testator అంటారు
1. Testator లీగల్ గా major అయుండాలి మరియు రాసిన సమయంలో అతని
మానసిక పరిస్థి తి సవ్యంగా ఉండాలి.
2. వీలునామాకి నిర్దే శిత నమూనా లేదు కానీ content లో స్పష్ట త ముఖ్యం. ఇంగ్లీ ష్
లోనే రాయాలని లేదు మాతృ భాషలో రాయవచ్చు. టైపు లేక ప్రింట్ లేక చేతి
రాతతో తయారు చేయచ్చు. స్వయంగా రాయచ్చు లేక వేరేవారితో రాయించ వచ్చు.
స్వదస్తూరి తో రాసినప్పుడు, స్వయంగా రాసిన విషయాన్ని విల్లు లో రాయాలి.
వేరేవారు రాయడం/ ప్రింట్ తీయడం జరిగినప్పుడు, రాసిన వారి పేరు, వివరాలు
విల్లు చివరి భాగంలో పేర్కొని, వారి సంతకం తీసుకోవాలి. Testator, తానువిల్లు ని
పూర్తి గా చదివి లేక చదివించుకుని అర్థం చేసుకొని సంతృప్తి చెందిన తరువాతే
అన్ని పేజీలపై సంతకం చేస్తున్నానని, విల్లు చివరి పేరాలో రాయించాలి.
3. వీలునామా తెల్ల కాగితంపై రాయచ్చు. స్టాంప్ పేపర్ వాడడం ఐచ్చికమే కానీ
తప్పనిసరి కాదు. వీలునామాకి, ఇద్ద రి వ్యక్తుల సాక్షి సంతకాలు తప్పనిసరి.
Testator తమ ఎదురుగా విల్లు అన్ని పేజీలపైన సంతకం చేసాడని
ధ్రు వీకరిస్తూ,ఇద్ద రు సాక్షులు ఆఖరి పేజీలో, testator సంతకం కింద సాక్షి
సంతకాలు చేసి, తమ పూర్తి పేరు, చిరునామా ఇవ్వాలి. సాక్షులు మేజర్ల యుండాలి.
సాధారణంగా విల్లు లో లబ్ధి దారులు సాక్షులుగా ఉండకూడదు.
4. వీలునామాని రిజిస్ట్రేషన్ చేయించడం కూడా ఐచ్చికమే. తప్పనిసరి కాదు. రిజిస్ట ర్
చేయని వీలునామా అధికారతని, వ్యక్తి మరణం తరువాత ప్ర శ్నించే
అవకాశముంటుంది. Fake గా సృష్టించబడిందని వాదించవచ్చు. రిజిస్ట ర్డు విల్లు కి
ఆ బాధ ఉండదు. అందువల్ల లీగల్ గా అవసరం లేక పోయినా విల్లు ని రిజిస్ట ర్
చేయడం మంచిది.
5. విల్లు ని ఎప్పుడైనా మార్చవచ్చు / తిరగరాయించవచ్చు. జీవితకాలంలో ఎన్ని
విల్లు లైన రాయచ్చు. పాత విల్లు ని cancel చేసినట్లు తదుపరి విల్లు లో రాయడం
మంచిది. ఉన్న వాటిలో ఆఖరి (latest) date ఉన్న విల్లు ఒక్కటే చెల్లు తుంది.
ఇక్కడ ఉంకొక విషయం గమనించాలి. ఒక విల్లు రిజిస్ట ర్ చేస్తే దానికి, రిజిస్ట ర్
చేయని విల్లు కంటే ప్రా ధాన్యత ఉంటుంది (రాసిన తేదీ సంబంధం లేకుండా)
అంటే రిజిస్ట ర్డ్ విల్లు ని, తరువాత రాసిన unregistered విల్లు supercede
చేయదు. మళ్లీ రిజిస్ట ర్డ్ విల్లు రాయడం ద్వారానే పాత రిజిస్ట ర్డ్ విల్లు ని block చేయ
గలుగుతాం. అందువల్ల , చివరి విల్లు అనుకున్న దానినే రిజిస్ట ర్ చేయించండి.
6. విల్లు అన్ని పేజీలపై testator సంతకం చేయాలి. నిరక్ష రాస్యుడైతే వేలిముద్ర
వేయాలి. ఎవరతనికి చదివి, వివరించారో వారి వివరాలు విల్లు చివర
పొందుపరచి వారి సంతకం చేయించాలి. చదురాని వారి విల్లు రిజిస్ట ర్ చేయడం
ఉత్త మం. తరువాత లీగల్ సమస్య లేకుండా ఉంటుంది.

https://te.quora.com 1/5
11/21/22, 7:18 PM (8) Quora

7. విల్లు కి ఒక executor ని propose చేయడం మంచిది. ఎగ్జి క్యూటర్గా ఉండడం


సమ్మతమేనని ఆ వ్యక్తి సంతకం తీసుకోవాలి. విల్లు లోని లబ్ది దారుడు ఎగ్జి క్యూటర్
గా ఉండడానికి అర్హుడే. బయటి వ్యక్తి అవుతే ఇంకా మంచిది. Executor ని
appoint చేయడం మంచిదేగానీ compulsory కాదు. లేకపోయినా విల్లు
చెల్లు తుంది.
ఇంక విల్లు content విషయానికి వద్దాం.
Fixed format లేకపోయినా, కింది steps follow అవుతే స్పష్ట త ఉంటుంది.
(1) ముందు విల్లు execute చేస్తున్న తేదీ, తరువాత Tetator వివరాలు రాయాలి (లీగల్
name xxx son of yyy , age, వృత్తి , నివాసస్థ లం, permanent address, విల్లు రాస్తున్న
ప్ర దేశం వివరాలు etc).
(2) తన వివరాలు, కుటుంబ వివరాలు, వారసుల వివరాలు (భార్య/ భర్త , పిల్ల ల, తనతో
జీవించే / ఆధారపడిన తల్లి తండ్రుల వివరాలు). తన వారసుల పేర్లు, వయసులు, వారి
marital status లాంటివి. తన వృత్తి వ్యాపకాల ఆదాయ మార్గా లు, స్వార్జి త ఆస్తుల గురించి
క్లుప్తంగా రాయాలి.
(3) తన ఆస్థి వివరాలు: ఇక్కడ వివరాలను వర్గీ కరించడం / ఉపవర్గీ కరించడం చేయాలి.
ఉదాహరణ:
వర్గం A - Testator కి వారసత్వం గా వచ్చిన స్థి రాస్తుల వివరాలు:
వర్గం A1 - వారసత్వ వ్యవసాయ భూముల వివరాలు.
వర్గం A2- వారసత్వ స్థ లాల, ఇళ్ల వివరాలు
వర్గం B- testator స్వార్జి త ఆస్తుల వివరాలు:
వర్గం B1- స్వార్జి త వ్యవసాయ స్థి రాస్థులు
వర్గం B2 - స్వార్జి త స్థ లాలు, ఇళ్ళు వగైరా:
వర్గం B3- లిక్విడ్ assets వివరాలు. అంటే బ్యాంకు అకౌంట్ల , FD ల, అన్య డిపాజిట్ల ,
బ్యాంక్ లాకర్ నెంబర్లో ని undisclosed కంటెంట్స్, Shares & mutual ఫండ్స్, ఇన్సూరెన్సు
పాలసీల వివరాలు.
వర్గం B4 - ఇతర విలువైన వస్తువులు: బంగారం, antics, paintings, లైబ్ర రీ etc.
(4) విల్లు లో రాయాల్సిన తరువాత భాగం: పైనచెప్పిన ఆస్తులలోని భాగాలు, ఎవరెవరికి ఏ
విధంగా పంచబడుతున్నాయో వివరాలు. ఇక్కడ గమనించవలసిన విషయం: తన
వారసత్వ ఆస్తులని హిందూ succession act నియమాల ప్ర కారం మాత్ర మే పంచాలి. అలా
పంచకపోతే, పిత్రా ర్జి తాస్తుల పంపకం చెల్ల దు. వారసులు కోర్ట్ కి వెళ్లి , succession act
మేరకు తమ హక్కుల్ని పొందవచ్చు. వారసత్వ ఆస్తుల విషయంలో, విల్లు కు ముందే
వారసులతో partition deed రిజిస్ట ర్చేసుకొని, వారి ఆస్తులని వారికి ఇచ్చి వేయడం ఉత్త మం.
తన వాటా ఆస్థి ని విల్లు లో పంచవచ్చు. Partition date & reference వివరాలని విల్లు లో
https://te.quora.com 2/5
11/21/22, 7:18 PM (8) Quora

పొందుపర్చడం మంచిది. పార్టీ షన్లో తన వాటాకి వచ్చిన ఆస్తులు స్వార్జి తంకి సమానం.
వాటిని + స్వార్జి త ఆస్తుల్ని తన స్వేచ్చాభిమతం ప్ర కారం పంచ వచ్చు.
స్వార్జి త ఆస్తులని (స్థి రాస్థులు, చరాస్తులు ) తన ఇష్టం వచ్చిన వారికి, ఇష్టంవున్న మేరకు
పంచే హక్కు testator కి వుంది. వాటికి సంబంధించినంత వరకు, వరస క్ర మంలో
లబ్ది దారుని పేరు, తనతో relation, అతనికి / ఆమెకి చెందే ఆస్థి వివరాలు (పైనరాసిన
ఆస్తుల పట్టీ లోని రిఫరెన్స్ లు ఇస్తూ రాయాలి. example: నా పెద్ద కూతురు Mrs. లక్ష్మీ, w/o
Mr. xxx, వయస్సు 50 yrs, adress yyy కి నా తదనంతరం చెందే ఆస్తులు పైన A1
షెడ్యూల్లో ఇచ్చిన వ్యవసాయ భూమి (వివరాలు మళ్ళీ రాయండి).
నా భార్య శ్రీ మతి భాగ్యలక్ష్మి D/O cccc, age 70 yrs R/O address కి నా తదనంతరం
చెందే ఆస్తులు పైన B1 షెడ్యూల్లో ఇచ్చిన ఇల్లు (వివరాలు మళ్ళీ రాయండి).
పిల్ల లెవరికైనా ఆస్థి పంచకపోతే, కారణాలు రాయడం మంచిది (వాళ్లు విదేశాలలో
సుసంపాదనా పరులనో, వాళ్ళ చదువులకి ముందే చాలా ఖర్చు అయిందనో, ఇక్కడ వుండి
తనను చూసుకున్న వారికి మాత్ర మే పంచుతున్నాననో లేదా వారి అనుచిత ప్ర వర్త న, విరోధం
లాంటివి రాయాలి). వాళ్ళ పేర్లు, exclusion కారణాలు అసలు రాయక పోతే, తరువాత వాళ్లు
మా నాన్న "మతి మరపు వలన రాయలేదు అంటే రాసినప్పుడు ఆయన మానసిక స్థి తి
సరిగాలేదు" అన్న వాదనతో విల్లు ని ఛాలెంజ్ చేయచ్చు. వారి పేర్లు రాసి exclusion కారణాలు
రాస్తే ఈ సమస్య వుండదు.
ప్ర తి ఆస్థి విషయంలో దాని పూర్తి వివరాలు ఇవ్వాలి (విలేజ్, distric, సర్వే no , విస్తీ ర్ణం,
ఇంటి door నెంబర్, విస్తీ ర్ణం, address, bank a/c & బ్రాంచ్ వివరాలు, share/ఫండ్స్
certificate నెంబర్, policy details etc.)
బ్యాంకు account / బ్యాంకు locker లకి లబ్ది దారుల్ని ముందే జాయింట్ హోల్డ ర్స్ గా బ్యాంకు
record లో చేర్చడం మంచిది.
(5) విల్లు
లో ఉదహరించడం మరిచిన ఆస్తులు తరువాత బయటపడితే, ఎవరికే నిష్పత్తి లో
పంచబడాలో రాయాలి.
(6) testator కి, విల్లు రాసిన తరువాత గానీ అతని మరణం తరువాత గానీ అదనపు
ఆస్తులు సంక్ర మిస్తే (arrears, లాటరీ, గిఫ్ట్ compensation, రాయల్టీ etc), అవి ఎవరు ఏ
నిష్పత్తి లో పంచుకోవాలో రాయాలి.
(7) విల్లు తన స్వంతబుద్ధి తో, ఏ ప్ర భావానికీ లోనుకాకుండా, సంపూర్ణ మానసిక ఆరోగ్య
పరిస్థి తిలో రాస్తున్నానని ప్ర కటించాలి.
8) విల్లు స్వయంగా రాయించి, చదువుకుని / చదివించుకుని అర్థంచేసుకున్న తర్వాతే
సంతకం చేస్తున్న విషయం రాయాలి.
విల్లు అన్నిపేజీలపై ఇద్ద రు సాక్షుల సమక్షం లో సంతకం చేయాలి.
(9) తన ఆఖరి పేజీలో సంతకం కింద, ఇద్ద రు సాక్ష లూ, testator తమ ఎదుటనే సంతకం
చేశారని రాసి, సంతకాలుచేసి, తమ పేర్లు, చిరునామాలు రాయాలి.

https://te.quora.com 3/5
11/21/22, 7:18 PM (8) Quora

(10) చివరిగా విల్లు


తయారుచేసిన వ్యక్తి , testator అభిమతం మేరకు విల్లు తయారు
అయిందని సంతృప్తి చెందిన తరువాతే testator సంతకం చేశారని రాసి, తన పేరు,
సంతకం, చిరునామా వివరాలు రాయాలి.
వీటితో విల్లు డాక్యుమెంట్ పూర్త యింది.
———— - xxxxxxxxxxxxxxxx ——- - -
ముఖ్య విషయాలు:
విల్లు లో రాసినంత మాత్రా న, వారసులకి ఆస్థి మీద హక్కులు వెంటనే ఏర్పడవు. Testator
మరణానంతరం మాత్ర మే వారసులకి ఆస్థి సంక్ర మిస్తుంది (ఆఖరి విల్లు ప్ర కారం).
జీవిత కాలంలో ఎన్నిసార్లై నా విల్లు మార్చే హక్కు testator కి వుంది. ఆఖరు రాసిన విల్లు
మాత్ర మే చెల్లు తుంది. రిజిస్ట ర్డ్ విల్లు వుంటే దానిని ఉంకొక రిజిస్ట ర్డ్ విల్లు మాత్ర మే nullify
చేస్తుంది. రిజిస్ట ర్డ్ విల్లు వుంటే తరువాత రాసిన unregistered వీల్లు లకి బలం ఉండదు.
మార్చాలంటే మళ్లీ విల్లు రాసి రిజిస్ట ర్ చేయాలి.
విల్లు రాసే, రిజిస్ట ర్ చేసే ప్ర దేశం testator తాత్కాలిక నివాస ప్ర దేశమైనా అవచ్చు
(ఆస్తులున్న ప్ర దేశమే కావక్కరలేదు). ఉదాహరణ: తీర్థ యాత్ర లో ఆరోగ్యంచెడితే, అక్కడే రాసి
సాక్షి సంతకాలు చేయించవచ్చు. వారసులకి విల్లు ని అందచేయడం ముఖ్యం. Extrairdinary
సందర్భాలలో ఓడ లేక విమానం కెప్టె న్ కో, హాస్పిటల్ లో డాక్ట ర్ కో చెప్పిన oral విల్లు లు కూడా
చెల్లు తాయి. కానీ వారసుల మధ్య అంగీకారం లేకపోతే అనేక సమస్యలు. అందువల్ల ఆ
పరిస్థి తులు తెచ్చుకోక పోవడం ఉత్త మం.
ఈమధ్య భార్యాభర్త ల joint & mutual విల్లు పద్ద తి ప్రా చుర్యమవుతోంది. దీంట్లో భార్యా
భర్త లు ఇద్ద రూ తమ తమ ఆస్తులని విడిగా పేర్కొంటూ, తమలో survivor కి మొత్తం ఆస్థి
సర్వ హక్కులుతో దక్కుతుందని, survivor వేరే విల్లు రాయక పోతే, ఆస్థి ఎవరికీ వెళ్తుందో
రాసి విల్లు తయారుచేస్తున్నారు.
విల్లు లో రాసిన ఆస్తులు, తరువాత కాలంలో testator స్వాధీనంలో లేకపోతే (అమ్మడం, గిఫ్ట్
చేయడం, కోర్ట్ వ్యాజ్యాలలో కోల్పోవడం జరుగుతే) ఆయా ఆస్తుల గురించి రాసిన clause లు
మాత్ర మే చెల్ల వు. మిగతా విల్లు clause లు అన్నీ చెల్లు తాయి.
విల్లు రాసి కావలసిన సంతకాలు తీసుకున్న తరువాత, దానిని మీకు విశ్వాసం వున్న
బంధువు వద్దో , స్నేహితుడి వద్దో భద్ర పరచండి. ఆ వ్యక్తి మిమల్ని survive అయేలా ఉండాలి.
ఎవరి వద్ద విల్లు వుందో friends కి, ఫ్యామిలీ మెంబర్ల కి చెప్పడం మంచిది. విల్లు content
చెబుతారా లేదా అన్నది కుటుంబ బంధాలు, గోప్యతావసరాలు, పరిస్థి తులు, మీ విజ్ఞ త లను
బట్టి నిర్ణ యించుకోవాలి.
నా సలహా: ఎప్పటికప్పుడే మనం రాస్తూన్నదే ఆఖరి విల్లు అనుకుని, కక్ష , పగ వంటి వాటిని
విస్మరించి, న్యాయ భావనలతో రాయండి. దాన్ని మళ్ళీ మార్చే అవకాశం భగవంతుడు
మనకివ్వకపోవచ్చు.
మీ ఆస్తులని equal గా కాకుండా equitable గా పంచండి. సేవ చేసిన వారికి కృతఙ్ఞ త
చూపించండి. చిన్న భేధాల్ని విస్మరించండి. పట్టుదలకి పోకండి. పిల్ల లపై క్ష మ చూపండి.
https://te.quora.com 4/5
11/21/22, 7:18 PM (8) Quora

Assumptions వద్దు. ఉదా: మిమ్మల్ని survive అయ్యే తల్లి దండ్రుల, భార్య యొక్క
బాగుబోగులు మీ పిల్ల లు చూస్తా రనేది మీ assumtion. అలాంటివి వద్దు. వారికి సముచిత
ఏర్పాట్లు మీ విల్లు లోనే కల్పించండి.
జీవితభాగస్వామి, మీ అనంతరం సౌఖ్యంగా, గౌరవంగా జీవించే ఏర్పాటు చేయడం మీ
sacred duty. అది మీరు అనేక మంది పెద్ద ల సమక్షంలో అగ్నిసాక్షి గా భగవంతుడి ముందు
చేసిన ప్ర మాణం. మనమనే ఈ entity మన తల్లి తండ్రులిద్ద రి నుంచీ వచ్చిన శరీరం, మేధల
కలయిక. మనమీద మనకు respect ఉంటే, మనకు కారణభూతులైన కన్నవాళ్ల పట్ల ఇంకా
ఎక్కువుండాలి. వాళ్ళ ఋణం కూడా తీర్చుకోవాలన్నది మనం చూపాల్సిన కృతజ్ఞ త,
ఉత్కృష్ట ధర్మం.

https://te.quora.com 5/5

You might also like