You are on page 1of 2

23/06/2023, 18:38 (17) Quora

పదే పదే స్పామ్ కాల్స్ రాకుండా ఎలాంటి జాగ్ర త్త లు తీసుకోవాలి ?


కాల్స్ రాకుండా ఆపలేం.
కానీ , DND activate చేసుకుంటే అఫీషియల్ గా కాల్స్ రావు. ( START 0 అని 1909 కి sms పంపిస్తే చాలు)
ఏ కంపెనీ అయినా, ఎవరైనా TRAI నిబంధనల ప్ర కారం, DND వున్నపుడు మనకింక మార్కెటింగ్ కాల్ చేయకూడదు. కానీ
పర్సనల్ నంబర్ల నుండి వస్తా యి. రెండు మూడు చిట్కాలు చెప్తా ను.
1. వచ్చినది లోన్ కోసం కాల్ అయితే, "నాకు 60–70 యేళ్ళు, లోన్ ఇస్తా రా ? నేను కట్టు కోలేనమ్మా !" అని చెప్పండి.
వారు మనల్ని వట్టి పోయిన గేదెలుగా భావిస్తా రు. కుదిరితే , మంచివారైతే పెద్ద వారిని ఇబ్బంది పెట్ట టం
ఎందుకని నంబర్ డిలీట్ చేస్తా రు.
2. ల్యాండ్/ ప్లా ట్ కాల్ అయితే, నాకు ఇలా చాలా కాల్స్ వస్తు న్నాయి, దయచేసి ఇంక విసిగించకండి, అని చెప్పండి.
ఇవి మనం నిలువరించలేం ఎందుకంటే, చాలా మంది రియల్ట ర్ల కు మన నంబర్లు అనధికారికంగా
వెళ్ళిపోతాయి. ఎవరినని ఆపగలం?
3. ఏదైనా పెద్ద సంస్థ అనుకోండి, ఉదాహరణకు, బజాజ్ ఫిన్ సర్వ్, లేదా ఏ పెద్ద సంస్థ అయినా, కస్ట మర్ ఈ
మెయిల్ కు (గూగుల్ చేస్తే దొరుకుతాయి), "నాకు దయచేసి ఈ నంబరుకు, ఈ మెయిల్ కు, నాకు మెసేజ్ కానీ
కాల్ కానీ మెయిల్ కానీ చేయవద్దు " అని మెయిల్ చెయ్యండి. వారి ట్విట్ట ర్ లో రాయండి. వారు మనకి కాల్
చేయరు. పాలసీబజార్ లో కానీ మన నంబర్ పెట్టా మా, చచ్చామే! కానీ, వారు వద్దంటే మనకి కాల్ చేయరు.
4. అంటే, ఇలా ఏ కంపెనీకి ఆ విరుద్ధ మైన స్థి తి చెప్పాలి. అప్పుడు మనకి కాల్స్ రావు. ఉదా: హెల్త్ ఇన్షూ రన్స్
అయితే, మనకి 75 ఏళ్ళ వయసనీ, లోన్ అయితే ఇన్కమ్ లేదనీ, హాలిడే అయితే మేము దేశం వదిలేసామనీ,
అలా… నేనైతై నా క్రి యేటివిటీకి పని చెప్తా ను. చాలా ఫన్నీగా వుంటాయి.
ఒకోసారి విసుగ్గా వుంటాయి. నేను , నా కుటుంబమూ తీవ్ర కరోనాతో బాధపడుతోంటే నాకు బజాజ్ ఫిన్ సర్వ్ వారు చాలా
ఇబ్బంది పెట్టా రు. కానీ ఏం చేస్తాం?
ఇవి ఒకరకంగా అబద్ధం ఆడమని చెబుతుండటం లాంటిది, కాబట్టి అనైతికమైనది. మీ విజ్ఞ తతో ఈ సలహాలు
వాడుకోండి. సత్యాసత్యాలు, న్యాయాన్యాయాల పైన మనకు దైనిందన జీవితంలో ఈ కాల్స్ వల్ల ఇబ్బంది వున్నమాట
వాస్త వం.
ఏ టెలీకాలర్ తోనూ దయచేసి విసుగ్గా మాట్లా డకండి. తిట్ట కండి. వారూ మనుషులేగా! వారు కేవలం వారి భుక్తి కోసం ఈ
పని చేస్తు న్నారు. వారు ఓనర్లు కాదు. పనివారు. ప్లీ జ్, థాంక్యూ వంటి పదాలు వాడి వారినుండి మనకింకొకసారి కాల్
రాకుండా చేసుకోవచ్చు.
edit 1:
ఇక IVRS కాల్స్ విషయం లో ఒక మిత్రు డడిగారు, ఆ సమాధానం ఇలా…
IVRS కాల్ఏ అయినా వారికి దృష్టి కి తెచ్చి ఆపించుకోవచ్చు. ఏ సంస్థ (కార్పొరేట్) అయినా సరే, వాటికు వచ్చిన ప్ర తీ
మెయిలు, ట్విట్ట ర్ ఫీడ్ కు కంప్లైంట్ రూపేణా వచ్చినవి తప్పక రిప్లై ఇవ్వవలసినదే. వాటికి తప్పదు. కాబట్టి మనకి
పరిష్కారమవుతుంది.
ఇంక చిల్ల రమల్ల ర కంపెనీలంటారా, మనకి తప్పదు.
నా అనుభవంలో రెండు విషయాలు.
- పై చిట్కాలు పాటించి నేను దాదాపు 90% కాల్సి నివారించగలిగాను. బయటెక్కడా కొత్త గా నా నెంబర్లు ఇవ్వటం
మానేసాను. చాలా రిలీఫ్ గా వుంది.
https://te.quora.com 1/2
23/06/2023, 18:38 (17) Quora

ఇలా అబద్ధా లాడటం అనైతికం అవవచ్చు. మీ విజ్ఞ త తో సలహాలను పాటించండి.


- ఈ కాల్స్ సాధారణంగా వారాంతాల్లో ఎక్కువగా వస్తు న్నాయి. కాబట్టి ముందే మైండ్ ప్రి పేర్ చేస్తే విసుగు రాదు.
సడన్ గా "రేపటి నుండి నాకు కాల్స్ రావద్దు " అంటే కుదరదు.
(ఇది ఖచ్చితమైనదని చెప్పను, కానీ, సాధారణంగా #, * , 9 వంటి నంబర్లు IVRS లో నిరాకరణకు సంబంధించిన వి
వుంటాయి. అవి నొక్కి చెక్ చేసుకోవచ్చు, వారు చెప్పకపోయినా సరే!
కరోనా కొత్త ల్లో ను "దేవి ఔర్ సజ్జ నో , నమష్కార్ " అమితాబ్ బచ్చన్ మెసేజ్ ని # నొక్కి బైపాస్ చేయవచ్చని చాలా రోజులు
నాకు తెలియదు. )

https://te.quora.com 2/2

You might also like