You are on page 1of 13

I.

Origin of Language

ఉపోద్ఘాతము:

భావవ్యక్తీకరణకు అత్యుత్తమమైన సాధనము భాష. చేష్టా దికములచే మానవులు

భావమును వ్యక్తపరుచగలిగినను, అది సమగ్రము, స్పష్టము కాజాలదు. కావున

మానువుల పరస్పరభావవినిమయమునకు భాషయే ముఖ్యసాధనము.

భాషా అను సంస్కృతశబ్దము భాష వ్యక్తా యాం వాచి అను

ధాతువునుండి ఏర్పడినది.భాష్యతే అసౌ ఇతి భాషా. పశుపక్ష్యాదుల

భావవ్యక్తీకరణకు ధ్వనులు చేయుట ఉన్నను అవి వ్యక్తములు, సమగ్రములు

కావు. అంతేకాక అవి ఆ భావానుభవమువేళలో మాత్రమే ఆధ్వనులను

చేయగలవు. కాని మానవుల విషయమట్లు కాదు. ఎప్పుడైనను తనకు కావలసిన

శబ్దము లను ఉచ్చరించగలడు. కావున మానవుల ముఖయంత్రమునుండి

వెలువడిన అర్థవంతములైన ధ్వనులసముదాయమునే భాష అని

వ్యవహరింతురు.

భాష మానవుని మనుగడకు ముఖ్యసాధనము. భాష మానవుని

ప్రవృత్తికి, స్వభావమునకు దర్పణము. భాష మానవుని జీవితముతో

అవినాభావసంబంధము కలది. మానవసంబద్ధమగు వివిధ శాస్త్రములతో


భాషకు మిక్కిలి సంబంధమున్నది. మానవుని విజ్ఞానమంతయు భాషవలననే

అభివృద్ధిచెందుచున్నది. భాషవల్ల ఆభాషావ్యవహర్తల స్వభావము,నివసించిన

భౌగోళికపరిస్థితులు, విద్యావైజ్ఞానికవిషయములు,ఆచార వ్యవహారములు,

మతవిశ్వాసములు,ఆధ్యాత్మికావగాహనము మున్నగు సర్వవిషయ ములు

తెలియగలవు. అందువలననే దండి కావ్యాదర్శములో ఇట్లు చెప్పెను –

ఇదమన్ధం తమః కృత్స్నం జాయేత భువనత్రయమ్

యది శబ్దా హ్వయం జ్యోతిరాసంసారం న దీప్యతే. (1-4)

శబ్దమనే జ్యోతి ఈ ప్రపంచంలో వెలగకపోయుంటే ఈ లోకమంతా

గాఢాంధకారంలో ఉండేదికదా అని దీని అభిప్రాయము. అంటే భాష మానవుని

మనుగడకు దిక్సూచి అని భావింపవచ్చును.

భాష మానవవిజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది. విజ్ఞానవినిమయం భాషవలనే

సాధ్యమవుతుంది. ఈవిషయం భర్తృహరి వాక్యపదీయంలో చాలస్పష్టంగా

చెప్పాడు-

న సోస్తి ప్రత్యయో లోకే యః శబ్దా నుగమాదృతే

అనువిద్ధమివ జ్ఞానం సర్వం శబ్దేన భాసతే. (వాక్యప.1-124)

వాగ్రూపతా చేన్నిష్క్రా మేత్ అవబోధాయ శాశ్వతీ

న ప్రకాశః ప్రకాశేత సా హి ప్రత్యవమర్శినీ.(వాక్యప.1.125)


ఈలోకములో శబ్దసంబంధములేని జ్ఞానముండదు.సమస్తమగు జ్ఞానము

శబ్దముతో కలిసియే భాసించును. జ్ఞానమునకు సహజమైన వాగ్రూపము

వెలువడకపోయినచో ఆజ్ఞానమునకు ప్రకాశమే లేకుండెడిది.వక్త తన

అభిప్రాయమును శబ్దముద్వారా ఇతరులకు తెలియజేయును. శ్రోత

శబ్దముద్వారానే ఆ అభిప్రాయమును గ్రహించును. శబ్దా ర్థసంబంధము

నిత్యము. పతంజలి మహాభాష్యంలో శబ్దము,అర్థము,వానిసంబంధము

నిత్యమని(సిద్ధే శబ్దా ర్థసంబంధే)అని చెప్పాడు. అర్థభావనకలగగానే దానికి

యోగ్యమైన శబ్దం స్ఫురిస్తుంది. అలాగే శబ్దా న్ని ఉచ్చరించగానే దానికి

సంబంధించిన అర్థం స్ఫురిస్తుంది. అర్థరహితమైన శబ్దంగాని, శబ్దరహితమైన

అర్థంకాని ఉండదు. అందుకే శబ్దా ర్థసంబంధం నిత్యమని చెప్పబడింది.

భాష శబ్దంకంటే భిన్నమైనదికాదు. భేర్యాదిశబ్దా లు అర్థవిశిష్టా లు కావు.

అవి కేవలం ధ్వనులు మాత్రమే. ఏకః శబ్దః సుప్రయుక్తః శాస్త్రా న్వితః స్వర్గే లోకే

కామధుక్ భవతి అనే మహాభాష్యకారుని వచనం భాషగురించే.

భాషానిర్వచనము:

పాశ్చాత్య భాషాశాస్త్రవేత్తలు భాషను ఈవిధంగా నిర్వచించారు-


A language is a system of arbitrary vocal symbols by means of
which a social group cooperates. (Outline of Linguistic
Analysis, B.Bloch and G.L.Trager.)
దీనినే సంస్కృతంలో –

స్ఫుటవాక్కరణోపాత్తః భావాభివ్యక్తిసాధకః

సంకేతితో ధ్వనివ్రాతః సా భాషేత్యుచ్యతే బుధైః.(కపిల్దేవద్వివేది)

భావాభివ్యక్తిసాధకమైన, స్పష్టమైన వాక్సాధనముచే వెలువడినడిన

ధ్వనులసముదాయము ఒకసామాజికసమూహముచే అంగీకరింప బడినది

భాష – అని పాశ్చాత్యుల అభిప్రాయము.

భాష-వివిధదశలు:

భాష మౌలికముగా ఉచ్చారణరూపమైనది. అది కాలక్రమంలో

లిఖితరూపాన్ని పొందింది. భావాభివ్యక్తి దీని మౌలిక ప్రయోజనం. కాని అది

భాషకు ప్రాథమిక దశమాత్రమే. మానవసమాజంయొక్క అవసరాలకు

అనుగుణంగా వివిధదశలలో అది అభివృద్ధి చెందింది. దానిని నాలుగు

దశలుగా చెప్పుకోవచ్చు.1. భావాభివ్యక్తిదశ. 2. సాహిత్యదశ. 3.

వైజ్ఞానికదశ.4.ఆధ్యాత్మికదశ. ప్రాథమిక దశ అని భాషలకు ఉన్నప్పటికి

తక్కినదశలు అన్ని భాషలకు ఉండకపోవచ్చు. వ్యవహారదశలోని భాషకంటె

భిన్నంగా సాహిత్యలోని భాష గోచరిస్తుంది. దీన్ని కవిత్వభాష అంటూంటారు.

విజ్ఞానశాస్త్రం సాంకేతికతను కలిగి ఉండడంవల్ల వైజ్ఞానికభాష వెనుకటి


రెండిటుకంటె కొంతవిలక్షణంగా ఉంటుంది. ఇక ఆధ్యాత్మికదశలోని భాష

మరికొంత విలక్షణంగా ఉంటుంది. భాషాభివృద్ధిలో భాగంగా ఒకభాషనుండి

మరొకభాషకు పదాల ఆదానప్రదానాలు జరుగుతుంటాయి. అన్ని దశలలోను

అభివృద్ధిచెందినభాషగా సంస్కృతమును గుర్తించవచ్చు. తమ భాషను అన్ని

దశలలోను అభివృద్ధిచేసుకొనే బాధ్యత ఆయా భాషావ్యవహర్తపై ఉంటుంది.

భాషోత్పత్తి- వివిధసిద్ధాంతములు:

మానవుని మనుగడకి ఇంతముఖ్యమైన భాష ఎలా పుట్టింది అనే ప్రశ్నకు

పలువురు పలురకాలుగా భావన చేసారు. వీనిని వివిధసిద్ధాంతాలు గా భావిస్తు న్నాం.

భాషోత్పత్తిలో రెండు ముఖ్యమైన అంశాలున్నాయి. 1.మానవుని

ముఖయంత్రమునుండి ధ్వనులు వెలువడడం.2. వెలువడిన ధ్వనులసముదాయానికి

అర్థముతో నియతసంబంధం కలిగి ఉండడం. మొదటిది పశుపక్ష్యాదులలో కూడ

కొంతవరకు ఉంటుంది. రెందవది మానవసమాజంలోని భాషకే ఉంటుంది.

మానవులకు అర్థా న్ని చూసి శబ్దమును పలికే శక్తి సహజంగానే ఉంటుందని పాణిని

శిక్షలో చెప్పిన వర్ణోచ్చారణప్రకారాన్నిబట్టి తెలుస్తూంది. పాణినీయశిక్షలో –

ఆత్మా బుద్ధ్యా సమేత్యార్థా న్ మనో యుఙ్క్తే వివక్షయా

మనః కాయాగ్నిమాహన్తి స ప్రేరయతి మారుతమ్.


మారతస్తూరసి చరన్ మన్ద్రం జనయతి స్వరమ్

(ప్రాతస్సవనయోగం తమ్ ఛన్దోగాయత్రమాశ్రితమ్)

సోదీర్ణో మూర్ధ్న్యభిహతః వక్త్రమాపద్య మారుతః

వర్ణాన్ జనయతే., తేషాం విభాగః పఞ్చధా స్మృతః.(6,7,9)

జీవుడు బద్ధితో అర్థములను సమీపించి, చెప్పగోరికతో మనస్సును ప్రేరేపించును.

ఆమనస్సు శరీరమందలి అగ్నిని తట్టు ను. ఆ అగ్ని వాయువును ప్రేరేపించును.

ఆవాయువు వక్షమున సంచరించుచు నెమ్మదిగ స్వరమును కలిగించును.

ఆవాయువు పైకి ప్రయాణించినదై శిరసును తాకి, వక్త్రమును చేరి వర్ణములను

పుట్టించును. ఇక్కడ వాయుతరంగము క్రమముగా శబ్దతరంగముగా

పరిణమించునని గమనించవలెను. దీనిని బట్టి మానవునకు అర్థమునుచూచి

శబ్దమును ప్రయోగించు శక్తి సహజముగా ఉన్నదని తెలియుచున్నది. ఇదియే

భాషోత్పత్తికి మూలమని భావింపనగును.

ముఖ్యముగా పాశ్చాత్య భాషాశాస్త్రజ్ఞులు వివిధ సిద్ధాంతములను ప్రతిపాదించిరి.

ఇందే ఒక్కటియు సమగ్రముకాదు. కేవలము కొన్నిశబ్దల పుట్టు కను మాత్రమే

తెలుపుచున్నవి. వానిని పరిశీలింతము –

1. దివ్యోత్పత్తి సిద్ధాంతము(Devine Theory):


భాషదైవదత్తమని అభిప్రాయము. ఇది ప్రాచీనసమాజములలో ఉన్న భావన.

దేవీం వాచమజనయన్త దేవాస్తాం విశ్వరూపాః పశవో వదన్తి.

(ఋక్.8.100.11) వాగ్వై పరాచ్యవ్యాకృతా అవదత్, తే దేవా ఇన్ద్రమబ్రు వన్,

ఇమాం నో వాచం వ్యాకురు ఇతి.(తైత్తిరీయ.6)

యథైవేదమవ్యుచ్ఛిన్నం చన్ద్రతారకాది ఏవమస్యాక్షరసమామ్నాయస్య న

కశ్చిదాధునికః కర్తా స్తి.ఏవమేవ వేదపారమ్పర్యేణ స్మర్యమాణః.(భర్తృహరి).

ఇదమక్షరచ్ఛన్దో వర్ణశః సమనుక్రా న్తం యథాచార్యా ఊచుః – బ్రహ్మా

బృహస్పతయే ప్రోవాచ, బృహస్పతిరిన్ద్రా య,ఇన్ద్రో భరద్వాజాయ,భరద్వాజః

ఋషిభ్యః,ఋషయో బ్రాహ్మణేభ్యః, తం

ఖల్విమమక్షరసమామ్నాయమిత్యాచక్షతే , న భుక్త్వా న నక్తం ప్రబ్రూయాత్

బ్రహ్మరాశిరితి. ఋక్తన్త్రవ్యాకరణే శాకటాయనః.

సంస్కృతం నామ దైవీ వాగ్ అన్వాఖ్యాతా మహర్షిభిః – దండి.

అస్మాచ్ఛబ్దా దయమర్థో బోద్ధవ్య ఇతి ఈశ్వరేచ్ఛా శక్తిః – నైయైయికాః.


Language could not have been invented by man, but was a
direct gift from God.(Sussmilch) – Otto Jespersen. Language
p.27.
2. సంకేతసిద్ధాంతము(Agreement Theory): ఫ్రెంచ్ శాస్త్రవేత్త –

రూసో(Rousseau). Rousseau imagined the first men setting


themselves more or less deliberately to frame a language by
an agreement similar to the Contact Social, which according
to him was the basis of all social order-Otto Jespersen.

ఈవర్ణములు ఈక్రమంలో ఉన్నవి ఈ అర్థమును బోధించును అనెడి

సామాజిక నిర్ణయంతో భాష ఏర్పడింది. ఈ అభిప్రాయాన్ని భామహుడు

కావ్యాలంకారమనే గ్రంథంలో ఇలా చెప్పాడు-

ఇయన్త ఈదృశా వర్ణా ఈదృగర్థా భిధాయినః

వ్యవహారాయ లోకస్య ప్రాగిత్థం సమయః కృతః.(6.13)

3. అనురణనసిద్ధాంతము (Ding-Dong Theory): దీనికే

ధాతుసిద్ధాంతము(Root Theory) అనికూడ పేరు. ప్లేటో(Plato)

ప్రతిపాదించాడు. దీనిని హేస్(Heyes) దృఢపరిచాడు. మాక్స్ముల్లర్(Max

Muller) వ్యవస్థీకృతం చేశాడు. ధ్వనికి,అర్థా నికి రహస్యసంబంధం

ఉంటుంది. లోహము,కర్ర,రాయి వీటిని కొట్టినపుడు వేరువేరు ధ్వనులు

వస్తా యి. ఆ ధ్వనిభేదాన్నిబట్టి వస్తు భేదం గుర్తించి ఆదిమమానవుడు

వేరువేరుశబ్దా లను ప్రయోగించాడు. అలా ముందుగా

మూల(ధాతు)రూపాలు భాషలో ఏర్పడ్డా యి. ఘట, కాంస్య, అయస్, నదీ,

గో, అశ్వ, పర్వత, మనుష్య మున్నగుశబ్దా లు ఇలా ఏర్పడ్డా యి.

4. ధ్వన్యనుకరణ సిద్ధాంతము (Bow-wow Theory):


(Onomatopoic Theory, Echoic Theory) వస్తు వుల, పశుపక్ష్యాదుల

ధ్వనిని అనుకరించి ఏర్పడిన శబ్దా లు ఇందుకు ఉదాహరణములు.కాకా -

కాకః, కో కో -కోకిల, ఝర్ ఝర్ – నిర్ఝరః, దుమ్ దుమ్ – దున్దు భిః, కే కే -

కేకాః, భౌ భౌ-భషకః,బెక్ బెక్- భేకః మున్నగునవి ధ్వనులను అనుకరించగా

ఏర్పడిన శబ్దా లు.

5. ఆవేగసిద్ధాంతము (Pooh-pooh Theory):దీనికి మనోభావాభి

వ్యంజకతావాదమని పేరు. మానవుని మనస్సులో కలిగే భావాలను లేదా

అనుభవాలను వ్యక్తపరిచినపుడు ఏర్పడే శబ్దా లు ఇందుకు

ఉదాహరణములు. మనస్సులు ఆనందం కలిగినపుడు ఆహా ఇని, బాధ

కలిగినపుడు అహో(అయ్యో) అని , కోపంకలిగినపుడు రేరే అని ఇలా

వ్యక్తమయిన శబ్దా లే భాషోత్పత్తికి మూలమని ఈసిద్ధాంతసారం. ఆగ్లంలో

Pooh,Pish,Fie,Oh,Hi వంటివి.

6. శ్రమధ్వనిసిద్ధాంతము (Yo-he-ho Theory): మానవుడు శ్రమపడే

సమయంలో ఆశ్రమనుండి ఉపశమనంకోసం అప్రయత్నంగా కొన్ని

ధ్వనులను చేస్తా డు. అవే భాషోత్పత్తికి మూలమని ఈ సిద్ధాంతం యొక్క

అభిప్రాయం. చాకలి బట్టలు ఉతికేసమయంలో, పల్లెవారు పడవలాగే

సమయంలో, రోడ్డు వేసేటపుడు రోలరు లాగే వారు, బరువులు


మోసేవారు,బోయీలు పల్లకి మోసేటప్పుడు- చేసే ధ్వనులు ఇందుకు

ఉదాహరణాలు. ఓంఓం, హియో,హోహో,హూంహూం వంటివి.

7. ఇంగితసిద్ధాంతము (Gesture Theory): ఈసిద్ధాంతాన్ని

ప్రతిపాదించినవారు డా. రాయ్. ప్రొ. రిచర్డ్(Prof. Rechard)తన Human

Speech అనే పుస్తకంలో మౌఖిక ఇంగిత సిద్ధాంతము (Oral Gesture

Theory) అని దీనిని ప్రతిపాదించాడు. మానవుడు కొన్ని చేష్టలు

చేసేటప్పుడు అసంకల్పితంగా కొన్ని ధ్వనులను చేస్తా డు. నీరుత్రాగేటపుడు

నీటిని లోపలికి లాగుకొనే సమయంలో పా వంటి ధ్వనులను చేయడంవల్ల

పానం,పానీ వంటి శబ్దా లేర్పడ్డా యి. ఇటువంటి శబ్దా లు భాషలో చాల

తక్కువగా ఉంటాయి.

8. సంపర్కసిద్ధాంతము(Contact Theory): ఈసిద్ధాంతమును

ప్రతిపాదించినవాడు ప్రసిద్ధమనోవైజ్ఞానికుడైన జి.రేవేజ్ (G.Revesz).

మానవుడు సంఘజీవికనుక ఒకడు మరియొకరిని కలిసినపుడు ఆకలి

మున్నగు తన భావాలను వ్యక్తపరుడుటకై చేసే ధ్వనులే భాషోత్పత్తికి

మూలము. ఇందులో మొదట భావవ్యక్తీకరణ (Emotional) శబ్దా లు,

తరువాత ఆలోచనాత్మక (Intellectual) శబ్దా లు ఏర్పడ్డా యని అభిప్రాయం.


9. సంగీత సిద్ధాంతము (Sing-song Theory): దీనికే ప్రేమ

సిద్ధాంతము(Woo woo Theory)అని కూడ పేరు. డార్విన్, స్పెన్సర్,

జెస్పెర్సన్ మున్నగువారు ఈసిద్ధా తాన్ని పాక్షికంగా అంగీకరించారు.

మానవుడు తనమానసిక స్థితికి అనుగుణంగా గానం చేస్తూంటాడు.

ఆటపాటలు పనిసమయంలో సహజంగా వచ్చేవే. ఆయా

భావాలకనుగుణంగా పాడేటపుడు కొన్ని శబ్దా లు వెలుడుతాయి. అవే

భాషకు ప్రాథమికరూపమని అభిప్రాయం.

10. ప్రతీకసిద్ధాంతము (Symbolic Theory):ప్రొ. హెన్రీ స్వీట్(Henry

Sweet) అనునతడు దీనిని ప్రతిపాదించెను. భాషలో ముందు

సంబంధవాచకాలు ఏర్పడ్డా యి. ఆయాశబ్దములకు ఆయా అర్థములతో

సంబంధము సంకేతంవల్ల ఏర్పడింది. మాతా,పితా, భ్రాతా మున్నగు

శబ్దా లు ముందు ఏర్పడ్డా యి.

11. సమన్వయసిద్ధాంతము (Coherence Theory): ఈసిద్ధాంతమును

సమర్థించినవాడు, ప్రవర్తింపజేసినవాడు Henry Sweet. ఈతని

అభిప్రాయం ప్రకారం భాషలో మొదట అనుకరణాత్మక(4),

భావాభివ్యంజక(5), ప్రతీక(10) శబ్దములు ఏర్పడ్డా యి. కాక,కుక్కూ,,కేక.,

హా అహో, హా ., మాతా,పితా మొ.వి.


12. ప్రతిభాసిద్ధాంతము (Intellect Theory): ఈ సిద్ధాంత ప్రవక్త

భర్తృహరి. ఇతని అభిప్రాయంలో మానవునిలోని ప్రతిభయే భాషోత్పత్తికి

మూలము. దానినిట్లు చెప్పెను –

శబ్దేష్వేవాశ్రితా శక్తిః విశ్వస్యాస్య నిబన్ధనీ

యన్నేత్రః ప్రతిభాత్మాయం భేదరూపః ప్రతీయతే. (వాక్యప.1.115)

ఈ దృశ్యమాన ప్రపంచమునకు కారణమగు శక్తి శబ్దముల నాశ్రయించి

ఉన్నది. శబ్దా ర్థములకంటె భిన్నమైనది ప్రపంచమున ఏమియును లేదు.

లోకవ్యవహారమున భిన్నరూపముగ భాసించుటకు కారణము శబ్దమే.దానికి

మూలము మానవునిలోని ప్రతిభ. ఇది మానవునికి సహజసిద్ధము.

పశుపక్ష్యాదులు జాతమాత్రముచేతనే సహజప్రతిభాకారణం గానే

వ్యవహరింపగలుగుతున్నాయి. ఇక ఆలోచనాపరుడైన

మనుష్యునివిషయంలో ప్రతిభ ఎంతటిదో చెప్పవలెనా. కనుకనే భర్తృహరి

ఇలా చెప్పుచున్నాడు –

ఇతికర్తవ్యతా లోకే సర్వా శబ్దవ్యపాశ్రయా

యాం పూర్వాహితసంస్కారః బాలోపి ప్రతిపద్యతే. వాక్యప.1-121

లౌకికవ్యవహారమంతా శబ్దమును ఆశ్రయించుకొనే ఉన్నది. బాలుడు కూడ

జన్మాంతరసంస్కారంచే లోకవ్యవహారం చేయగలుగు చున్నాడు.


పైనచెప్పిన సిద్ధాంతాలలో ఏ ఒక్కసిద్ధాంతంవల్ల భాష ఏర్పడిందని

చెప్పలేకపోయినా, వాని ప్రకారం కొంతమేరకు శబ్దజాలం ఏర్పడి

ఉండవచ్చని భావించగలం. మానవునికి సహజంగానే అర్థా న్ని చూసి

శబ్దప్రయోగం చేసే శక్తి ఉన్నదని అందరూ అంగీకరించిందే. కాబట్టి మనవుని

ప్రతిభయే భాషోత్పత్తికి మూలమని భావింపనగును.

You might also like