You are on page 1of 7

శ్రీవిష్ణువిద్య – పూజ్యగురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు.

1.విశ్వమ్ - శ్రీ విశ్వస్మై నమః

1. విశ్వము - జగము (ప్రపంచము) - గోచరాగోచరాత్మకమైన అనంత విశ్వము నారాయణుడే.


మొదటి నామం విశ్వం. ప్రతివ్యక్తికీ మొదట గోచరించేది విశ్వమే. తొలుత కనబడే ఈ విశ్వమే విష్ణుని రూపమని
గ్రహించాలని ఈ ప్రథమనామం బోధిస్తోంది.

2. విశ్వమునకు కారణమైనవాడు, కార్యమైనవాడు - అని మరొక అర్థం. పరబ్రహ్మకు భిన్నమైనది ఏదీలేదు.


అందుకే విశ్వమే నారాయణుడు.
“బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్ఠం” (ముండకోపనిషత్తు )
“పురుష ఏవేదం విశ్వం”(ముండకోపనిషత్తు )
“అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః”
- లోపలా బయటా అంతటా వ్యాపించి నారాయణుడున్నాడు అని ‘నారాయణ సూక్తం’.

3. ‘విశతి’ - అంటే ‘ప్రవేశించెను’ అని అర్థం. నారాయణుడు దేనియందు ప్రవేశించి ఉన్నాడో అది ‘విశ్వం’. కనుక
‘విశ్వం’ అన్నమాటే ‘నారాయణుడు ఇందులో ఉన్నాడు’ అని ఎరుక పరుస్తోంది.

“తత్ సృష్ట్యా తదేవానుప్రావిశత్” - “దీనిని సృష్టించి, తానే దీనియందు ప్రవేశించాడు” అని తైత్తిరీయ
ఉపనిషద్వాక్యం.
“మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ” అని శ్రీకృష్ణ పరమాత్మ ‘నాకంటె భిన్నమైనది. ఏ ఒక్కటీలేదు’
అన్నాడు. కనుక విశ్వమంతా భగవంతుడే. ఈ ఒక్క నామాన్ని తెలిస్తే చాలు. భగవానుడు ఎక్కడోలేడు.
కనిపించేదంతా ఆయనే. కనిపించని అనంతమూ ఆయనే - అనే స్పృహ కలుగుతుంది.

“ఈశావాస్య మిదం సర్వం” - ఇదంతా ఆ ఈశ్వరునిచే నిండినది.

4. “విశ్వం అనంత వాచకం” అని మహాభారత వచనం. అంతుపట్టనివాడు.


విశ్వమశేషం కృత్స్నం సమస్తం నిఖిలాఖిలాని నిశ్శేషమ్
సమగ్రం సకలం పూర్ణ మఖండం స్యాదనూనకే
అని అమరం.
“వాసుదేవస్సర్వమితి స మహాత్మా సుదుర్లభః” - అంతా ‘వాసుదేవుడే’ అనే జ్ఞానం కలిగినవాడు (బ్రహ్మజ్ఞాని)
మహోన్నతుడు - సుదుర్లభుడు. ఆ గొప్ప జ్ఞానమే పరమావధి. ఆ జ్ఞానాన్ని స్ఫురింపజేసే నామం ‘విశ్వం’. ‘అంతా’,
‘పూర్ణత్వం’, ‘అఖండం అయిన పరబ్రహ్మమే విశ్వం.
“హరి! నీ మయమే అంతాను అరసి నిన్ను శరణనినాను” అని అన్నమాచార్య పలుకు.
“హరి మయము విశ్వమంతయు
హరి విశ్వమయుండు సంశయింపబనిలేదు
హరి మయముగాని వస్తు వు పరమాణువులేదు ...”
- అని పోతనగారి భాగవత వాక్యం.

5. జగములో తాను ప్రవేశించడమే కాదు - చివరకు జగము కూడా తనలోనే ప్రవేశిస్తు న్నది.
“యత్ప్ర యన్త్యభిసంవిశన్తి” అని వేదవచనం. ఎవరిలో ఈ జగము ప్రవేశిస్తు న్నదో అతడు ‘విశ్వం.
విశనాద్విశ్వమిత్యాహుః లోకానాం కాశి సత్తమ
లోకాంశ్చ విశ్వమేవేతి ప్రవదంతి నరాధిప
సమస్త ప్రాణులలోనూ ప్రవేశించి ఉండడం చేత భగవంతుని ‘విశ్వం’ అని వ్యవహరించుతున్నాం. ఈ శబ్దం
నపుంసక లింగ శబ్దం. అంటే ఇది నిర్గుణ పరబ్రహ్మవాచకం. ఓంకారంతో మంత్రం ప్రారంభమైనట్లే, ఈ ‘విశ్వం’
నామంతో విష్ణునామ మంత్రాలు ప్రారంభమయ్యాయి.
పంచాక్షరి, అష్టా క్షరి, ద్వాదశాక్షరి - ఇలా వైదికదేవతా మంత్రాలన్నీ ‘ఓం’తో ప్రారంభమౌతాయి. మంత్రాలు
మారుతున్నా ‘ఓం’కారం మారదు, మారనిది ‘ఓం’. మారినవి ‘మంత్రాలు’. పైగా మంత్రంలో ఒక స్పష్టమైన అర్థం
కనిపిస్తుంది. ఉదా నమశ్శివాయ - శివునకు నమస్కారం. నమో నారాయణాయ - నారాయణునకు నమస్కారం.
కానీ ‘ఓం’ కారానికి ఇలాంటి స్పష్టమైన అర్థం లేదు.
సర్వమూలమైన నిర్గుణతత్త్వం ‘ఓం’కారం. ఆ ప్రణవంలోని శక్తియే పంచాక్షరిగా, అష్టా క్షరిగా, వివిధ
మంత్రాలుగా వచ్చినదని గ్రహించడానికే - నిర్గుణతత్త్వమే వివిధ నామరూపాలతో సగుణమైందని తెలుసుకోడానికే
ఈ విధంగా మంత్రాలను జపిస్తాం. ప్రణవమే అన్ని మంత్రాలకు సమన్వయం. అలాగే ‘విశ్వం’ సర్వమయమైన
పరతత్త్వానికి సంకేతం. అదే తరువాతి నామాలలో విస్తరించింది. వృక్షానికి మూలం వలె వెయ్యి నామాలకు మూల
నామమిది.

మహాహ్రద మజ్జనము – బ్రహ్మశ్రీ కుప్పా నటరాజశర్మగారు

1. విశ్వమ్
శంకర భాష్యమ్.
1. విశ్వస్య జగతః - కారణత్వేన ‘విశ్వ’మిత్యుచ్యతే బ్రహ్మ
2. పరస్మాత్ పురుషాన్నభిన్నమిదం విశ్వం పరమార్థతః తేన విశ్వమిత్యభిధీయతే బ్రహ్మ
3. విశతీతి విశ్వం బ్రహ్మ
4. విశంతి విశ్వాని భూతాని అస్మిన్నితి విశ్వం బ్రహ్మ
5. విశ్వశబ్దేన ‘ఓం’కారోఽభిధీయతే। వాచ్యవాచకయోరత్యన్తభేదాభావాద్విశ్వమిత్యోంకార ఏవ బ్రహ్మేత్యర్థః
6. సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలావితి శాంత ఉపాసీత(ఛాం. ఉ. 3-14-9)

శా. శ్రీకైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్, లోక ర


క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేకస్తంభకుఁ గేళి లోల విలసదృగ్జా ల సంభూత నా
నాకంజాత భవాండ కుంభకు, మహానందాంగనా డింభకున్.
శ్రీ పోతన గారు మహాకవి, సహజకవి. ధ్యానమునందు శ్రీరాముని దర్శనమును పొందిన మహాభక్తు డు.
శ్రీరామాజ్ఞచే భాగవతమును తెనిగించుటకు పూనుకొనిన సత్పురుషుడు. తన మొదటి ప్రార్థనా పద్యములోనే
శ్రీకైవల్యపదంబునకై భగవత్ప్ర ర్ధన చేయుచున్నట్లు గా చెప్పుకొనెను.
విష్ణు సహస్రనామములో మొదటి నామము ‘విశ్వమ్’. భాగవత రచనలో శ్రీపోతనగారు
సందర్భానుసారముగా శ్రీవిష్ణునామముల భావములను వ్యక్తీకరించుచు పద్యములను నడిపిరి, ‘కేళి లోల విలన
దృగాల సంభూత నానాకంజాత భవాండకుంభకు’డని మొదటి నామమే యగు. ‘విశ్వ’ నామమును మొదటి
ప్రార్ధనా శ్లోకములోనే విశదీకరించిరి.
1. విశ్వమునకు-జగత్తు నకు కారణము అగుటచేత ‘బ్రహ్మము’ ‘విశ్వమ్’ అని చెప్పబడుచున్నది.

సీ. ఆద్యంత శూన్యంబు నవ్యయంబై తగు తత్త్వ మింతకు నుపాదాన మగుట


గుణవిషయములు గైకొని కాలమును మహదాది భూతములు దన్నాశ్రయింపు
గాలానురూపంబుఁ గైకొని యీశుండు దన లీలకై తనుఁ దా సృజించె
గరమొప్ప నఖిలలోకములందుఁ దానుండుఁ దనలోన నిఖిలంబుఁ దనరుచుండుఁ

తే. గాన విశ్వమ్మునకుఁ గార్య కారణములు దాన!


యమ్మహాపురుషుని తనువు వలన
బాసి విశ్వంబు వెలియై ప్రభావ మొందె,
మానితాచార ! యీ వర్తమాన సృష్టి. (భాగ. 3-342)
మైత్రేయుడు విదురునకిట్లు చెప్పెను. మొదలు తుదలేనిది, తరిగిపోనిది, యైన తత్త్వమే ఈ
సృష్టికంతటికీ ప్రధాన కారణం. అందువల్ల గుణాలూ, ఇంద్రియార్థా లు, మహత్తు , పంచభూతాలు తన్ను
ఆశ్రయించగా, ఈశ్వరుడు కాలానికి అనురూపమైన రూపం ధరించినవాడై వినోదానికై తనను తాను
సృష్టించుకొన్నాడు. ఈ విధంగా సృష్టించిన సమస్త లోకములందును ఈశ్వరుడుంటాడు. ఆ ఈశ్వరుని యందు
సమస్త లోకములును ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి విశ్వమునకు కార్యము, కారణము రెండూ తానే. ఆ పరమ
పురుషుని శరీరం నుండి విడివడి ఈ విశ్వం విరాజిల్లు తున్నది. కనుక బ్రహ్మమే విశ్వంబు, ఈ విధంగా వర్తమాన
సృష్టి ఏర్పడింది.

వచ. కార్యకారణ సంఘాత రూపంబైన విశ్వం బీశ్వరునందు నయస్కాంతం సన్నిధానంబు గలిగిన లోహంబు
చందంబున వర్తించు. నందు సర్వేశ్వరుండు నిమిత్త మాత్రంబుగా బరిభ్రమించు, నట్టి యీశ్వరుని
మాయాగుణ వ్యతికరంబున నారబ్ధంబులైన పంచభూతంబుల చేత యోషిత్పురుషవ్యవాయంబు వలన
యోషిత్పురుషాది రూపసంభూతియగు, నవ్విధంబునఁ దత్సర్గంబు దత్సంస్థా నంబు, దల్లయంబు
నగుచునుండు, నిట్లు దుర్విభావ్యంబైన కాలశక్తింజేసి గుణ క్షోభంబున విభజ్యమాన వీర్యుండు
ననంతుండు ననాదియునైన జనంబులచేత జనంబులం బుట్టించు చుండుటం జేసి యాదికరుండును,
మృత్యుహేతువున, జనంబుల లయంబు నొందించుటం జేసి యంతకరుండును, ననాది యగుటంజేసి
యవ్యయుండును నైన భగవంతుండు జగత్కారణుండు. (భాగ.4-355)
అయస్కాంత సన్నిధిలో లోహము భ్రమించినట్లు పరమాత్ముని సన్నిధిలో కార్యకారణ స్వరూపమైన
ప్రపంచం భ్రమిస్తుంటుంది. సర్వేశ్వరుడు నిమిత్త మాత్రంగా ఉంటాడు. అటువంటి భగవంతుని మాయాగుణ
సంబంధం వల్ల దేహాది ఆకారాలను పొందిన స్త్రీ పురుషుల కలయికచేత స్త్రీ పురుషుల ఉత్పత్తి జరుగుతుంది. ఈ
విధంగా సృష్టి, స్థితి, నాశము జరుగుతూ ఉంటాయి. ఊహింప శక్యం కాని కాలశక్తి వల్ల జనముల నుండి
జనముల పుట్టించటం వల్ల ఆద్యుడు, నశింపజేయటంవల్ల అంతకుడు, అనాది కావటంవల్ల అవ్యయుడు అయి
భగవంతుడు జగత్తు కు కారణమగును.

ఆ. ఆత్మవలనఁ గలిగి అమరు దేహాదుల, నాత్మకంటె వేఱు లని యటంచుఁ


దలఁచువాఁడు మూఢతముఁడు గావున నీశ! విశ్వమెల్ల నీవ, వేఱులేదు. (భాగ 10-పూ. 121)
ఆత్మనుండే శరీరం మనస్సూ మొదలైనవి పుడతాయి. వాటిని ఆత్మ కన్న వేఱుగా అనుకొనువాడు
మూర్ఖుడు. విశ్వమంతా నీవే, నీవు కానిది వేఱుగా ఏమియు లేదు.
2. పరమార్థ స్థితిలో ఈ విశ్వము పరమపురుషుని కంటే భిన్నము కాదు. అందుచే బ్రహ్మము ‘విశ్వమ్’
అని చెప్పబడును “బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్ఠమ్” (ముండక, 2-2-11) ఈ విశ్వమంతయు శ్రేష్ఠమగు బ్రహ్మమే.

వచ. చతుర్దశ లోకంబులందు మీది ఏడు లోకంబులు శ్రీమహావిష్ణువునకుం


గటి ప్రదేశంబున నుండి యూర్వదేహంబనియు, క్రింది ఏడు లోకంబులు
జఘనంబు నుండి యథోదేహమనియునుం బలుకుదురు. (భాగ 2 స్క, 89)
–(ttd potana bhagavatham-188 page).
(శ్రీమహావిష్ణువు యొక్క దేహమును గురించిన వర్ణనము ఇదే వచనములో విపులముగా
వివరించబడినది. ఆసక్తిగల వారు చూచుకొనగలరు)
“పురుష ఏవేదం విశ్వమ్” - (ముండక. 2-1-11)
ఈ విశ్వము పరమపురుషుడే. ఇట్టి శ్రు తివాక్యములచే బ్రహ్మమే విశ్వమని చెప్పబడుచున్నది.

3. విశతి-ప్రవేశించుచున్నాడు “తత్సృష్ట్వా తదేవాఽను ప్రావిశత్” (తైత్తి. 2-6) తత్ అనగా విశ్వమును


సృష్టించి దానినే అనుప్రవేశించెను అని శ్రు తి వచనము.

సీ. ....మనో వ్యాపారమున నిట్టి యఖిలలోక


ములఁజేసి యా లోకములకు నంతర్యామి యగుచుఁ బ్రవేశించి... (భాగ. 5 స్కం. 1 ఆ 100)

వచ. విశ్వంబు నీవ, గుణాత్మకంబైన విశ్వంబు సృజియించి యందుం బ్రవేశించి హేతుభూత గుణ యుక్తుండవై
రక్షక సంహారాది నానారూపంబుల నుండుదువు. (భాగ.7 స్కం.360)
అని ప్రహ్లా దుఁడు నరసింహమూర్తిని స్తు తించెను.

తే. నిఖిలమందెల్ల వర్తింతు నీవు దగిలి


నిఖిలమెల్లను నీయందు నెగడు కృష్ణ! (భాగ. 10-ఉ.భా. 442)
నీవు సమస్త జగత్తు లో సంచరిస్తుంటావు. సమస్త జగత్తు నీలో లీనమై యుంటుంది అని శివుడు శ్రీకృష్ణుని
స్తు తించెను.

వచ. నీవొక్కరుండవయ్యు మహదాద్యంబైన యీ యశేషవిశ్వంబు మాయాఖ్యంబైన


ఆత్మీయ శక్తిచేతం గల్పించి యందుం బ్రవేశించి యింద్రియంబులందు
వసించుచుఁ దత్తదేవతా రూపంబులచే నానాప్రకారంబుల దారువులం దున్న
వహ్ని చందంబునం బ్రకాశింతువు” (భాగ, 4 స్కం. 280)
అని ధ్రు వుడు తనకు ప్రత్యక్షమైన భగవానుని స్తు తించెను.

క. విశ్వాత్ముఁడు, విశ్వేశుఁడు, విశ్వమయుం డఖిలనేత, విష్ణుం, డజుండీ


విశ్వములోఁ దానుండును, విశ్వము దనలోనఁ జాల వెలుఁగుచు నుండన్. (భాగ.2 స్కం.100)

మ. తనలో నిన్ని జగంబులుం గలుగుటం దా నిన్నిటం గల్గుటన్ జననీ!


తంతువులందుఁ జీర గల యా చందంబునన్ విశ్వ భావనుడై యొప్పు శివుండు....(భాగ 9 స్కం. 227)
పోతన గారికి శివకేశవులయందభేద దృష్టి కనుక విశ్వభావనుఁడు శివుఁడని చెప్పినారు.

క. సర్వమునందున దానున్ సర్వముఁ దనయందు నుండు సంచారంబున్


సర్వమునకుఁ దన వలనన సర్వాత్మకు నట్టి వృష్టిసత్తముఁ దలతున్. (భార. శాంతి, 2 అ, 38)
సమస్తములో భగవంతుఁడును, భగవంతుఁడిలో సమస్తమును - సమస్తమునకు తనవలననే మెలగుట
జరుగునో అట్టి సర్వాత్మకుడైన, వృష్ఠి సత్తముడైన శ్రీమహావిష్ణువును ప్రార్ధించెదను.
భరతుఁడు పరమేశ్వరుని ఈ విధముగా స్తు తించెను.

సీ. కర్మఫలంబులఁ గడఁక నిచ్చుచు మనోవ్యాపారమున నిట్టి యఖిలలోకములఁజేసి


యా లోకములకు నంతర్యామి యగుచుఁ బ్రవేశించి...(భాగ.5 స్కం. 1 అ. 100)

4. సంహారకాలమందు సకల భూతములును ‘విశంతి అస్మిన్’ ఇతని యందు ప్రవేశించుచున్నవి అని


చెప్పబడుటచే బ్రహ్మము ‘విశ్వము’ అని చెప్పబడును.
“కేళిలోల విలసద్దృగ్జా ల సంభూత నానా కంజాత భవాండ కుంభకు”
కుంభకమనగా బయటి వాయువును లోనికి శ్వాసించి, బిగపెట్టు కొని యుండుట. పరమాత్మ ఈ
బ్రహ్మాండముల నన్నింటిని తనలో నిలుపుకొనును. కాన ‘నానా కంజాత భవాండ కుంభకు’ డనిరి.
సీ. సర్వేశ కల్పాంత సమయంబు నందు నీ। యఖిల ప్రపంచంబు నాహరించి...
(భాగ 4-287)
5. సర్వ వేదములును ఏ తెలియదగిన దానిని తెలుపుచున్నవో సకల తపస్సులును దేనిని ప్రాప్తవ్యముగా
చెప్పుచున్నవో, దేనిని పొందగోరుచు గురుకులవాసాది బ్రహ్మచర్య నియమముల ననుష్ఠించుచున్నారో, అట్టి పదమే
‘ఓం’కారము.
సర్వే వేదా యత్పదమామనన్తి తపాంసి సర్వాణి చ యద్వదన్తి
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరన్తి తత్తేపదం సఙ్రహేణ బ్రవీమ్యోమిత్యేతత్
ఏతద్వేవాక్షరం బ్రహ్మ ఏతద్యేవాక్షరం పరం
ఏతద్ద్వేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్ ॥ (కఠ. 1-2-15,16)
ఈ అక్షరమే బ్రహ్మ స్వరూపము. ఈ అక్షరమే శ్రేష్టమైనది. ఈ అక్షరమును తెలుసుకుని యెవడు దేనిని
కోరుచున్నాడో వానికది లభించుచున్నది. కనుక ‘ఓం’కారము బ్రహ్మమని నిరూపించబడును.

ప్రయతః ప్రణవోంకారం - ప్రణవం పురుషోత్తమమ్


ఓంకారం ప్రణవాత్మానం - తన్మే మనః శివసంకల్ప మస్తు (శివసంకల్ప మంత్రములలో 21 వ మంత్రము)
(అహం = నేను) ప్రణవ-ఓంకారం = ఎల్లరచేతను ప్ర-నుతము = మిక్కిలిగా స్తు తించబడు ఓంకారము
తనకు వాచకముగా (తన నామముగా) కలవాడును, ప్ర-నవం = ఎల్లప్పుడును మిక్కిలిగా క్రొత్తవాడును, పురుష-
ఉత్తమం = (ఎల్ల శరీరధారులలో) ఉత్తముడును, ఎల్లజీవుల కంటే ఉత్తముడును, ఓంకారం = ఓం అను
ప్రణవమునుచ్చరించుచు పరతత్త్వమును ఉపాసించు ఉపాసకుని రూపమున నున్నవాడును, అగు
పరతత్త్వమునుద్దేశించి ప్ర-యతః = ఉత్కృష్టమగు నియమములు కలవాడనగుచున్నాను. అట్టి పరమేశ్వర
తత్త్వము నా విషయమున శుభరూపమును, శుభకరమును అగు సంకల్పము గలది అగుగాక !
ఓం తద్బ్రహ్మ - ఓం తద్వాయుః - ఓం తదాత్మా - ఓం తత్సత్యం - ఓం తత్సర్వమ్ (నారా, ఉ. 68)
ఓం అనునదియే బ్రహ్మము. ఓంకారమే వాయువు. ఓంకారమే సత్యము. ఓంకారమే సర్వము అని
నారాయణోపనిషత్తు చెప్పుచున్నది.
“గిరా మస్యేక మక్షరం” (గీత 10-25) శబ్దములలో ఏకాక్షరము (ప్రణవము)ను నేనే యని గీత యందు
భగవానుడు చెప్పెను. గాన 'ఓం'కారము బ్రహ్మమగును.

6. విశ్వమునకు సృష్టి స్థితి సంహార కర్త విష్ణువే కనుక విశ్వమునే విష్ణువుగా భావించవలెను.
“సర్వం ఖల్విదం బ్రహ్మ- - తజ్జలావితి శాంత ఉపాసీత” (ఛాందో 3-14-1) అని శ్రు తి.
తజ్జం అనగా అతని నుండి పుట్టినది. తల్లం అనగా అతనియందు లయమగునది. కావున వికార
జాతమగు విశ్వము బ్రహ్మరూపమే యగుచున్నది.

క. పెనుపగు వర్షాకాలం । బున దిననాయకుని వలనఁ బొడమిన సలిలం


బనయము గ్రమ్మఱ గ్రీష్మం। బున సూర్యుని యందు డిందు పోలిక మఱియున్.
క. ధరణిఁ జరాచర భూతము । అరయగ జనియించి యందె యణఁగిన పగిదిన్
హరిచేఁ బుట్టిన విశ్వము । హరియందె లయంబు నొందు .....
(భాగ, 4 స్కం 956-957)
ఉ. ఇంతకు మూల మా హరి, రమేశ్వరుఁడర్థి నొనర్చు కార్యముల్
వింతలె, సర్వభూత భవ వృద్ధివినాశన హేతుభూతుఁడా
ద్యంత వికారశూన్యుడు దయానిధి మీ యెడ మేలు సేయు నీ
చింత దొరంగు వే చనుడు చేకురు మీకు మనోరథార్ధముల్.
(భాగ. 3 స్క, 599)
క. శ్రీవిభుని వలన నీ లో। కావళి యుదయించు బెరుఁగు నడగును విను రా
జీవ భవాదుల కతఁడే । భూవర! నిర్మాణ హేతు భూతుం డరయన్.
(భాగ. 3 స్కం. 791).

మ. అనఘా! యొక్కఁడవయ్యు నాత్మకృతమాయాజాత సత్త్వాది శ


క్తి నికాయస్థితి నీ జగ జ్జనన వృద్ధి క్షోభ హేతు ప్రభా
వ నిరూఢిం దగు దూర్జనాభిగతి....... (భాగ, 3 స్కం, 755)

శ్రీకృష్ణుని పొట్టకు కట్టిన త్రాటిని లాగగా ఆ త్రాటికి కట్టిన రోలు రెండు మద్దిచెట్ల మధ్య నుండి లాగబడగా ఆ
రెండు చెట్లూ నేలకూలినవి. ఆ చెట్లనుండి ఇద్దరు యక్షులు బయల్వెడలి ఇట్లు ప్రార్ధించిరి.

క. బాలుడవె నీవు, పరుడ వ । నాలంబుఁడ వధికయోగి వాద్యుఁడవు తను


స్థూలాకృతి యగు విశ్వము । నీ లీలారూపమండ్రు నిపుణులు కృష్ణా! (భాగ, 10 స్కం.పూ.భా. 404)

నీవు ఒక్కడవు అయినా నీ మాయవలన సత్త్వము మొదలైన శక్తు లు పుడుతున్నవి. సాలీడుగూడు


సృష్టించుకొని, మరల తనలో లీనం చేసుకొన్నట్లు నీవు ఆ శక్తు ల ద్వారా ఈ లోకములు పుట్టు టకు, వృద్ధి
పొందడానికీ, నాశం కావడానికి కారణమైన మాయా మహిమతో ప్రకాశించుచు నుండెదవు. పైన పేర్కొనిన
ప్రమాణోక్తు లచేత బ్రహ్మమే. సృష్టి స్థితి లయములకు కారణము గనుక ‘విశ్వ’ నామ వాచ్యుడగుచున్నాడు. కనుక
సాధకులు విశ్వమునే విష్ణు స్వరూపమగు తత్త్వముగా భావించి యుపాసింపవలెను.

You might also like