You are on page 1of 1

2.

విష్ణుః - శ్రీవిష్ణవే నమః

1. 'వేష్టి వ్యాప్నోతీతి విష్ణుః' - వ్యాపించి ఉన్నవాడు.

తాను సృష్టించిన జగములో తాను ప్రవేశించిన కారణంగా 'విశ్వం' అని పేరు వచ్చిందని మొదటి నామానికి అర్థం
చెప్పుకున్నాం. అయితే ప్రవేశించి ఓ మూల ఒదిగి కూర్చోలేదు ఆ బ్రహ్మము. మొత్తం వ్యాపించాడు. నిజానికి రెండు
నామాలు ఒకే అర్థా న్ని చెప్పినట్టు న్నా కించిత్ భేదం ఉంది. మొదటిది 'పూర్ణత్వాన్ని' తెలియజేస్తోంది. రెండవది
'వ్యాపకత్వాన్ని' చెబుతోంది.
'వ్యాప్య నారాయణ స్థితః' 'తముస్తోతారః పూర్వ్యం యథావిద
ఋతస్యగర్భం జనుషాపిపర్తన
అస్య జానన్తో నామ చిద్ వివర్తన మహస్తే
విష్ణో సుమతిం భజామహే - ఋగ్వేదం.
ఈ నామం సహస్రనామాలన్నిటి 'సారం'. అందుకే ఈ నామల పేరే ఈ నామమయ్యింది. ('విష్ణు' సహస్రనామం)

"ఓ స్తోతలారా! (స్తు తించువారు) సమ్యక్ జ్ఞానసిద్ధికోసం విష్ణునామ సంకీర్తనం విధింపబడింది. సత్యసారమైన ఆ
పురాణపురుషుని యథార్థజ్ఞానంతో స్తు తించి జన్మపరమార్థా న్ని (కైవల్యాన్ని) పొందండి. ఈ విష్ణునామాలను
తెలుసుకొని. కీర్తించండి... ఓ విష్ణుదేవా! ఇతరులు కీర్తించినా లేకున్నా మేము నీ శుభావహ తేజస్సును
కీర్తిస్తు న్నాము" అని ఈ వేదవచన భావం.

2. వ్యాప్తే మే రోదసీ పార్థ! క్రాంతిశ్చాభ్యధికామమ । క్రమణా చాప్యహం పార్థ! విష్ణురిత్యభిసంజ్ఞితః ॥


(మహాభారతం) ఈ సమస్తరోదసినీ దాటి, దానికంటె అధికుడై నిండినవాడు విష్ణువు. యస్మాద్విష్ణుమిదం సర్వం
తస్య శక్త్యా మహాత్మనః ।
తస్మాదేవోచ్యతే విష్ణుః విశేర్ధా తో ప్రవేశనాత్ ॥ (విష్ణుపురాణం)

ఈ సకలప్రపంచంలో ఆ పరమాత్మశక్తి ప్రవేశించి యున్నందున ప్రవేశార్థకమైన 'విశ' ధాతువును బట్టి "విష్ణువు" అని
చెప్పబడినాడు.

3. విషిశ్చ వ్యాప్తివచనో ణుశ్చ సర్వత్రవాచకః |


సర్వవ్యాపీ చ సర్వాత్మా తేన విష్ణుః ప్రకీర్తితః ॥
'విష్' వ్యాప్తినీ, 'ణు' సర్వత్ర (అన్ని చోట్ల) అనే అర్థా న్నీ చెబుతుంది. సర్వవ్యాపీ, సర్వాత్ముడు కనుక 'విష్ణువు'
(బ్రహ్మవైవర్త పురాణం) విశ్వంలో స్వామి వ్యాపకశీలుడై ప్రవేశించాడు - అని రెండు నామాలను కలిపి భావించాలి.
వ్యాపించినవాడు ఎలా వ్యాపించి ఉన్నాడు? యజ్ఞస్వరూపుడై ఉన్నాడని తరువాత నామంలో చెప్పారు.

You might also like