You are on page 1of 5

సరిహద్దు లు చెరిపేస్తు న్న కవి

కవి మిత్రు డు ఇబ్రహీం నిర్గు ణ్ వ్యక్తీకరణ ‘బహిరంగ ప్రకటన’ గనుక ఈ కవిత్వం గురించి ఇంకెవరి

మాటలూ విశ్లేషణలూ ప్రశంసలూ అవసరం లేదు. కాని ఒక బహిరంగ ప్రకటన చేసే ముందు కూడ డప్పు

కొట్టి, ప్రజల దృష్టిని ఇటు మళ్లించమని పిలిచి, ‘తెలియజేస్తు న్నారహో ’ అని ముందుమాట పలకడం

ఆనవాయితీ. ఈ నా ముందుమాట ఆ ఆనవాయితీ కన్న ఎక్కువ కాదు.

ఈ సంపుటం లోని కవిత్వం గురించి మాట్లా డబో యే ముందు, ఈ కవి పేరు గురించి, ఈ కవితా సంపుటపు

పేరు గురించి ఒకటి రెండు మాటలు చెప్పాలి.

తమ పేరు పక్కన తమ ఆదర్శాన్నో, తమను తాము గుర్తించుకునే తీరునో సూచించే మరొక మాట

పెట్టు కోవడం వలస వ్యతిరేక ప్రజా ఉద్యమ సందర్భంలో చాల సాధారణంగా జరిగింది . చంద్రశేఖర్ ‘ఆజాద్’,

రాంప్రసాద్ ‘బిస్మిల్’ వంటి పేర్లు అందరికీ తెలిసినవే. హిందీ, ఉర్దూ సాహిత్యకారుల్లో తమ పేరు పక్కనో,

కలం పేరు పక్కనో తమ ఊరి పేరు పెట్టు కునే అలవాటు కూడ సాధారణంగానే ఉండేది. ఫిరాఖ్ గోరఖ్ పురి,

జోష్ మలిహాబాదీ వంటి పేర్లు కూడ అందరికీ తెలిసినవే. కవి మిత్రు డు ఇబ్రహీం తన పేరు పక్కన ‘నిర్గు ణ్’

అని ఎందుకు పెట్టు కున్నాడో తెలియదు. కాని ఆ విశేషణానికి మనం తెలుసుకోవలసిన అవసరమైన

చరిత్ర చాల ఉంది.

నిర్గు ణ్ అంటే గుణం లేనివాడు, రూపం లేనివాడు అనే వాచ్యార్థ ం కాదు, గుణాతీతుడు, రూపాతీతుడు అనే

ధ్వన్యర్థ ంలో సర్వసాక్షి, సర్వాంతర్యామి, సర్వవ్యాపి అని భగవంతుడిని సంభావించే ఒక విశిష్ట పద్ధ తి అది .

ఈ దేశంలో ఒక చారితక
్ర దశలో కుల, స్త్రీపురుష విభేదాలకు అతీతంగా, కొన్నిసార్లు వాటిని తోసివేస్తూ ,

వాటికి వ్యతిరేకంగా తలెత్తి న భక్తి ఉద్యమం ‘నిర్గు ణ’ భావనకు మూలం. విగ్రహారాధన లేని ఇస్లా ం నుంచి

తలెత్తి న సూఫీ తత్వం కూడ ఒకరకంగా నిర్గు ణమే. భగవంతుడిని ఆలయం నుంచీ, విగ్రహం నుంచీ,

పో గుపడుతున్న సంపద నుంచీ, భ్రా హ్మణులు కల్పించిన సంకుచిత నిర్దిష్ట రూపం నుంచీ బైటికి లాగి,

సగుణ భక్తిని తోసివేసి ప్రతి మనిషికీ భగవంతుడిని చేరే అర్హతా, యోగ్యతా, చేరగల శక్తీ ఉన్నాయని

ప్రకటించినది నిర్గు ణ భక్తి భావన. హిందీ ప్రా ంతంలో అనేకానేక ప్రజా భాషలలో భక్తి కవులు నిర్గు ణ

కవిత్వాన్ని అపారంగా సృజించి వందల ఏళ్లు గా ప్రజల నాల్కల మీద ఆడే పదాలుగా, నుడిగా, నానుడిగా

1
మలిచారు. అది కుల ఆధిక్యతను, అంతరాలను, మధ్యవర్తిత్వ భావనను ధిక్కరించిన సామాజిక

అవగాహన. స్పష్టా స్పష్ట ంగా మానవ సమానత్వాన్ని బో ధించిన సాంస్కృతిక అవగాహన.

కబీర్, రవిదాస్ వంటి మహాకవులు సృజించిన ఆ మధ్యయుగాల తిరుగుబాటు, సమానత్వ కవిత్వం

కూడ ఎక్కడో ఒకచోట లోకాతీతశక్తికి కట్టు బడక తప్పని ఆ నాటి పరిమితులను మనం ఇవాళ అర్థం

చేసుకోవచ్చు. కాని ఆ నిర్గు ణత్వానికి కొత్త అర్థా లు అన్వేషించవలసిన దుర్భర వర్త మానంలో ఉన్న మనం

ఒక కొత్త నిర్గు ణ కవిత్వాన్ని ఆశించవలసి ఉన్నది, అన్వేషించవలసి ఉన్నది, ఆహ్వానించవలసి ఉన్నది.

సరిగ్గా అటువంటి నిర్గు ణ కవిత్వం ఇది.

అది కూడా ‘ఆకులందున అణగిమణగి కూసే కోయిల’లా కాక, బహిరంగ ప్రకటనగా రావలసిన

సందర్భంలో వెలువడుతున్న కవిత్వం ఇది. ఇవాళ అంతకంతకూ ఎక్కువగా బహిరంగ ప్రకటనలు

చేయవలసిన అవసరం పెరుగుతున్నది. చిమ్మచీకటి కమ్ముకొస్తు న్నప్పుడు గుసగుసలకూ, నర్మగర్భ

ప్రకటనలకూ స్థా నం లేదు. గొంతెత్తి నలుగురికీ వినిపించడమే, నలుగురినీ పిలవడమే, బహిరంగ

ప్రకటనలు చేయడమే అత్యవసరం, కాలం ఆదేశం.

అందువల్ల ఈ కవిత్వం ఇవాళ్టి కవిత్వం, ఇవాళ అవసరమైన కవిత్వం. పాత నిర్గు ణ కవిత్వం భాషల

సరిహద్దు లు చెరిపి, శిష్ట భాషల నుంచి ప్రజల భాషలకు చేరినట్టే, ఈ కొత్త నిర్గు ణ కవిత్వమూ

బడిపలుకుల తెలుగు, పలుకుబడుల తెలంగాణ, ఇంగ్లిష్, ఉర్దూ , హిందీలను యథేచ్ఛగా, ఏక కాలంలో,

ఒకే కవితలో కూడా వాడి భాషల సరిహద్దు లు చెరిపేస్తు న్నది. అంతరాలను చెరిపివేయడంలో పాత నిర్గు ణ

కవిత్వం సాధించని విజయాలను కూడా ఈ కొత్త నిర్గు ణ కవిత్వం సాధిస్తు న్నది. పాత నిర్గు ణ కవిత్వం

కుల, పితృస్వామిక అంతరాలను ప్రశ్నించడం దగ్గ ర ఆగిపో గా, ఈ కొత్త నిర్గు ణ కవిత్వం కుల, మత,

ప్రా ంత, దేశ, పితృస్వామిక, భాషా అంతరాలన్నిటినీ ప్రశ్నిస్తు న్నది, ధిక్కరిస్తు న్నది.

ఈ సంపుటంలోని దాదాపు తొంబై కవితలు విస్తా రమైన జీవితాన్ని ప్రతిఫలిస్తు న్నాయి,

కవిత్వీకరిస్తు న్నాయి, జీవిత అవగాహనలను ఉన్నతీకరిస్తు న్నాయి. ఇరవయ్యొకటో శతాబ్ది తొలి

దశకాలలో ఒక సున్నిత భావుకుడైన బుద్ధిజీవి ఏయే అంశాలకు స్పందించే అవకాశం ఉందో ఆ

అంశాలన్నీ ఇక్కడ కవిత్వంగా ఒదిగాయి, ఎదిగాయి. ఒక ఇతివృత్త ం మీద, ఒకానొక బిందువు దగ్గ ర

రాసినట్టు అనిపించే కవిత కూడా నిర్మాణ క్రమంలో అనేక అనుబంధ అంశాలను కలుపుకుని మహానది

అవుతుంది. అలా భిన్న కవితల మధ్య వస్తు వైవిధ్యం మాత్రమే కాదు, ఒక కవితలో భిన్న స్థా యిల్లో

2
భిన్నమైన వస్తు వులు రసాయన సంయోజనంలో ఒకటిగా ఒదిగిపో తాయి. అటువంటి ఒక్కొక్క కవితా

తీసుకుని వివరించి, విశ్లేషించి వాటి వస్తు శిల్ప వైవిధ్యాన్నీ, నిర్మాణ విశిష్ట తనూ చెప్పాలని ఉంది గాని,

అది మళ్లీ మరొక పుస్త కం కావలసి వస్తు ంది గనుక స్థూ లమైన అంశాలు మాత్రమే ప్రస్తా విస్తా ను.

ఈ కవితలలో వస్తు వైవిధ్యం మీరు ఎట్లా గూ చూస్తా రు. భిన్నమైన వస్తు వులను కవిత్వంగా మార్చగలిగే,

సాధారణ దృశ్యాలను అర్థ స్ఫోరక పదచిత్రా లుగా మార్చగలిగే శిల్ప సామర్థ ్యం, అభివ్యక్తి సాంద్రతల గురించే

ప్రత్యేకంగా చెప్పవలసింది చాల ఉంది. వాటికన్న ముందు మొట్ట మొదట గుర్తించవలసిన ఇబ్రహీం నిర్గు ణ్

కవిత్వ విశిష్ట త వర్త మానానికీ గత జ్ఞా పకానికీ, ఒక్కోసారి భవిష్యత్తు కూ మధ్య అతి సులభంగా వారధి

సృష్టించగలిగే, ఒకదాని నుంచి మరొక దానికి హద్దు లేమీ లేకుండా ప్రయాణించగల నేర్పు. కవులందరిలాగే

తాను కూడా ఒక తక్షణ ప్రేరణ దగ్గ రనే ప్రా రంభిస్తా డు గాని, దాని కవిత్వీకరణలో ఎంచుకున్న పద్ధ తి ఆ

వస్తు వు జ్ఞా పకాల్లో కీ, గతంలోకీ వెళ్లడం, కొన్ని కవితల్లో భవిష్యత్తు లోకి కూడా తొంగిచూడడం. అక్కడ

మరొక అంశం సామూహిక జ్ఞా పకాలనూ వ్యక్తిగత జ్ఞా పకాలనూ సునాయాసంగా మిళితం చేయగలగడం.

అందువల్ల ఒకే కవిత ఏకకాలంలో సామూహిక స్వరంగానూ వినబడుతుంది, ఒంటరి స్వరంగానూ

వినబడుతుంది. ఈ రెండు స్థా యిలను చాలా సులభంగా, అనాయాసంగా, నిరాటంకంగా సమ్మిళితం

చేయడం వల్ల కవిత్వ సాంద్రత పెరిగింది.

ఇబ్రహీం నిర్గు ణ్ కవిత్వాన్ని మామూలుగా తెలుగు కవిత్వ విమర్శకు అలవాటయిన ఏదో ఒక

నిర్వచనంలోకి, ఒక మూసలోకి కుదించడం సాధ్యం కాదు. తల్లి గురించీ, తమ్ముడి గురించీ, బాల్యం

గురించీ, ఊరి గురించీ రాశాడు. స్నేహితుల గురించీ, పురాస్మృతుల గురించీ రాశాడు. మామిడి పండు

కోసం హత్యకు గురైన ఉదంతం దగ్గ రి నుంచి ఎన్నో దళిత సమస్యలను తన కవిత్వంలో సంలీనం చేశాడు.

అడవి గురించీ, ఆదివాసుల గురించీ రాశాడు. రైతు సమస్యల దగ్గ రి నుంచి ఢిల్లీ సరిహద్దు ల రైతాంగ

ఉద్యమం దాకా రాశాడు. మైనారిటీ అస్తిత్వ వేదన రాస్తూ రోహింగ్యాల నుంచి నిజాం దాకా అన్ని

అంశాలనూ తడిమాడు. తెలంగాణ మీదా రాశాడు, అంతర్జా తీయ అంశాల మీదా రాశాడు. గూగీ వా

థియాంగో గురించీ, ఆజాద్ గురించీ, స్టా న్ స్వామి గురించీ, వరవరరావు గురింఛీ, సాయిబాబా గురించీ

రాశాడు. విప్ల వోద్యమం గురించీ, దండకారణ్య గురించీ, పో రాటస్ఫూర్తి గురించీ, ఆశావాదం గురించీ

రాశాడు. ఒక రకంగా ఆధునిక, సమకాలీన సామాజిక దృశ్యంలో తాను తన పరిధిలోకి తీసుకోని

అంశమేమన్నా మిగిలిపో యిందా అనిపిస్తు ంది.

3
“సామాజిక కవిత్వం” “అనుభూతి కవిత్వం” అనే అనవసరమైన, కృత్రిమ విభజన, లేదా అవి రాసే కవులు

వేరు వేరు అన్న అభిప్రా యం ఒకటి తెలుగు సాహిత్యలోకంలో చలామణీలో ఉంది గాని అనుభూతి లేని

మానవ మేధా లేదు. అనుభూతిలోకి వచ్చేది సమాజం కాకుండా మరేదీ లేదు. సమాజాన్ని అనుభూతి

చెందకుండా కవిత్వమే లేదు. ఇబ్రహీం నిర్గు ణ్ కవిత్వం సామాజిక, వయ్యక్తిక అనుభూతి కవిత్వపు

అద్భుతమైన సమ్మిళిత అభివ్యక్తి.

ఎన్నెన్నో ఉదాహరణలున్నాయి గాని మచ్చుకు ఇది చూడండి: అప్పటికప్పుడు తనకు కనబడిన ఒక

పరిగపిట్ట దగ్గ ర ప్రా రంభించి,

“ఆ పిట్ట పాట

పురాజ్ఞా పకాల సందూకని తిరిగివ్వడానికి వచ్చిన ప్రవక్త

అదొ క సూఫీ జారవిడుచుకున్న గేయం” అంటాడు.

పిట్ట పాట దగ్గ ర ప్రా రంభమయిన పదచిత్రం పురాజ్ఞా పకాలను నింపుకున్న సందుక దగ్గ రికి , అక్కడి నుంచి

అది తిరిగి ఇవ్వడానికి వచ్చిన ప్రవక్త దగ్గ రికీ, సూఫీ జారవిడుచుకున్న గేయం దగ్గ రికి అంటే ఒక

వర్త మానం నుంచి సుదూర గతం నుంచి సమీప గతం దాకా సాగుతుంది. పురాజ్ఞా పకాలు, సందుక, తిరిగి

ఇవ్వడం, ప్రవక్త , సూఫీ, జారవిడుచుకున్న గేయం అన్ని మాటలూ విశాలమైన అర్థా లను గర్భంలో

దాచుకున్న శక్తిమంతమైన అభివ్యక్తు లు.

అలాగే ఊరి గురించీ బాల్యం గురించీ ఒకదానిమీద ఒకటిగా ఎన్నో జ్ఞా పకాల పదచిత్రా లను పేని, చివరికి

అద్భుతంగా, హృద్యంగా “ఏది మరిచినమని” అంటాడు. ప్రతిదీ మరిచిపో వాలనీ, తక్షణ వర్త మానమే, ఆ

వర్త మానం లోని సరుకుల మాయే జీవితమనీ, జీవిత సార్థ కత అనీ పాలకులు ఊదరగొడుతున్న వేళ

“ఏది మరిచినమని” అనడం దానికదిగా ఒక ధిక్కారం. ఒక భవిష్యదాశ.

అలాగే ‘గూగీ’, ‘ఇప్పుడిక ఆజాద్’, ‘తుపాకీ మేల్కొనే ఉంది’, ‘నా గేయమెంతా’, ‘వాన రాదు’, ‘ఆకాశంలా

వెలిగే భూమి’, ‘Be Careful with Mango’ వంటి ఎన్నో కవితల్లో ఈ గత వర్త మాన భవిష్యత్తు ల కలయిక,

సామూహిక, వయ్యక్తిక స్వరాల కలయిక ఎంతో సాంద్రంగా అపురూప కవిత్వంగా వెలువడింది.

4
ఇక ఇబ్రహీం నిర్గు ణ్ కవిత్వంలో సహజమైన, అనివార్యమైన, అవిభాజ్యమైన అంశం తన అస్తిత్వ వేదన.

ఈ దేశంలో ముస్లింల పట్ల ఆధిపత్య హిందూ బ్రా హ్మణీయ సంస్కృతి ప్రదర్శిస్తు న్న వివక్ష, గురిచేస్తు న్న

పీడన, అనుమానాలు, అవమానాలు సంఘ్ పరివార్ నేతృత్వంలో చిలవలు పలవలుగా, చాపకింద

నీరులా కమ్ముకుంటూ వస్తు న్నది. మామూలుగా ప్రగతిశీల ఆలోచనలున్నవారిలో కూడా ఏమాత్రం

అజాగ్రత్తగా, అనాలోచితంగా ఉన్నా చొరబడుతున్న విష విద్వేష రాజకీయం ఇది. దాన్ని అర్థం

చేసుకోవడానికి, ఎదిరించడానికి, ఒదిలించుకోవడానికి మనిషి నిరంతర విమర్శతో, ఆత్మవిమర్శతో

ఉండాలి. తాను ఆధిపత్య మతంలో పుట్టి ఉంటే అది కల్పించే ఆభిజాత్యాన్ని, ఆధిక్యతా భావనను,

అహంకారాన్ని వదుల్చుకోవడానికి నిరంతర పో రాటం చేయాలి. తాను అణచివేతకు గురవుతున్న

మతంలో పుట్టి ఉంటే, చుట్టూ రా వాతావరణం తనలో కలిగిస్తు న్న ఆత్మన్యూనతను, భయసందేహాలతో

తనలోకి తాను ముడుచుకుపో తున్న స్థితిని వదుల్చుకోవడానికి నిరంతర పో రాటం చేయాలి. ఈ

తెలివిడిని మనిషికి ఇవ్వగలవి సాహిత్యం, కళలు. ముఖ్యంగా కవిత్వం.

ఇబ్రహీం నిర్గు ణ్ కవిత్వంలో పలికిన అస్తిత్వ వేదన ఈ రెండు పనులనూ, అటు ఆధిపత్య మతంలో

పుట్టినవారికి ఆత్మవిమర్శా అవగాహనను, ఆలోచనను, ప్రశ్నను ఇస్తు ంది. ఇటు మైనారిటీ మతంలో

పుట్టినవారికి ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, శక్తిని ఇస్తు ంది. ఈ ఇతివృత్త ంతో కవితలు పది, పదిహేను

ఉన్నాయి గాని, కనీసం ‘నాకెందుకు చెప్పలేదు నాన్నా’, ‘పెట్టు డుమచ్చ’ అనే రెండు కవితలయినా

చదవండి, చదివించండి.

ఒక్కమాటలో చెప్పాలంటే, ఒక కవిత్వాభిమానిగా ఎటువంటి కవిత్వం రావాలని నేను కోరుకుంటానో అటువంటి

కవిత్వం ఇది. దీనికి ముందుమాట పలికే అవకాశం రావడం గర్వకారణంగా భావిస్తూ , ఇబ్రహీం నిర్గు ణ్ ను

హృదయపూర్వకంగా అభినందిస్తూ , సకల సద్గు ణ సంపన్నమైన ఈ కవిత్వంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తు న్నాను.

 ఎన్ వేణుగోపాల్

హైదరాబాద్, అక్టో బర్ 30, 2022

You might also like