You are on page 1of 20

వాడుక భాషలో తెలుగు కవితావికాసము

జులై 2008
రచన: జెజ్జా ల కృష్ణ మోహన రావు

పరిచయము
అమెరికా సంయుక్త రాష్ట్రపు స్వే చ్ఛా నివేదనపత్రము ప్రపంచ చరిత్రలో ఒక మహత్తరమైన సంఘటన.
అందులో మొదటి వాక్య ము ప్రజల ఉనికికి ప్రాధాన్య త నిస్తూ “ప్రజలమైన మేము (We the people)”
అనే పదాలతో ఆరంభమవుతుంది. అధ్య క్షుడు లింకన్ మహాశయుడు “ప్రజల ప్రభుత్వం, ప్రజలచే
ప్రభుత్వం, ప్రజలకోసం ప్రభుత్వం ఈ భూమిపై అజరామరము (government of the people, by the
people, for the people shall not perish from the earth)” అన్నా రు. లింకన్‌యొక్క పై వాక్యంలో
ప్రభుత్వా నికి బదులు భాష, సాహిత్యం, కవిత్వం అనే పదాలు కూడా ఎంతో సమంజసంగానే
ఉంటాయి. కవిత్వ పు పరమావధి అది ప్రజల హృదయాలలో నాలుగు కాలాలపాటు హత్తుకొని
పోవడమే.

కదిలించేది, కరిగించేది, మారేది, మార్పించేది కవిత్వ మన్నా రు శ్రీశ్రీ. ప్రతి పదపు అర్థా నికి నిఘంటువు
పుటలు తిరగవేయాలంటే ఆ కవిత్వం ఎంత గొప్ప దైనా సామాన్య మానవుని రసానుభూతికి
దూరమవుతుంది. తెలుగు సాహిత్యా న్ని బహుళప్రజానీకానికి అర్థమయ్యే లా రాయాలనే ఉద్య మం
సుమారు వంద సంవత్స రాలకు ముందు పుట్టింది. వాడుకలో నున్న వ్యా వహారిక భాషను పాఠ్య
పుస్తకాలలో, పత్రికలలో, నాటకాలలో ఉపయోగించాలని తాపత్రయపడ్డవారిలో ప్రముఖులు గిడుగు
రామమూర్తి పంతులుగారు. జగమెరిగిన బ్రాహ్మ డికి జందెమేల యన్న ట్లు ఈ రంగంలో వీరి
వీరవిజయాలు అందరికీ తెలిసినవే. వీరు ఒకప్పు డు ఇలా అన్నా రు – “వ్యా వహారికమంటే ముందు
మనం విజ్ఞా నవ్యా ప్తికోసం కృషి చెయ్య వలసిన అవసరం ఉంది. కవిత్వం కాదు. ఎందులోనన్నా
రాసుకో. నాకభ్యంతరం లేదు. చదివినవాళ్లు చదువుతారు. లేకపోతే లేదు. ఇతర సాధనాలకు మాత్రం
వ్యా వహారికం తప్ప దు. సాహిత్యంలో కథలకి, నాటకాలకి వ్యా వహారికమే ఉండాలని నా ఆశయం.”
కవిత్వా న్ని కూడా వాడుక భాషలో రాసే ఉద్య మానికి నడుము కట్టిన వారు గురజాడ అప్పా రావుగారు. ఈ
మహానుభావుల నిద్దరిని నవయుగ వైతాళికులని చెప్ప వచ్చు .

ఈ వ్యా సపు ముఖ్యా శయం వాడుక భాషలో తెలుగు కవిత్వం ఎలా మెల్లమెల్లగా వికసించి నేటి స్థితికి
వచ్చిందన్న విషయాన్ని సోదాహరణంగా వివరించడమే. వ్యా సం కొద్దిగా పొడవైనా ఈ ఉదాహరణలు
పాఠకుల ఆసక్తిని ఎక్కు వ చేస్తా యని నా నమ్మ కం. ఈ వ్యా సంలో ఆధునిక కవిత్వ పు వైవిధ్యా న్ని ,
అందులోని తీరు తెన్ను లను వివరించ దలచుకోలేదు. కాల్ప నికవాదం, వాస్తవికత,
అభ్యు దయవాదం, హేతువాదం, అధివాస్తవికాన్వే షణ, అస్తిత్వ వాదం, అనుభూతివాదం, చైతన్య
స్రవంతి, విప్లవవాదం, సంప్రదాయవాదం, రూపవాదం, జనామోదవాదం మున్న గు
విషయాలనుగురించి ఇంకెక్క డైనా చదువుకోవాలి.

కవిత్వా న్ని సులభం చేసే ప్రయత్నా లు


సంస్కృత నాటకాలలో కథానాయకుడు, బ్రాహ్మ ణులు, దేవతలు తప్ప మిగిలినవారి సంభాషణలు
ప్రాకృతంలో ఉంటాయి. వీరు చెప్పే పద్యా లు కూడా లయబద్ధమైన ప్రాకృత ఛందస్సు లో ఉంటుంది.
జనాలు చూచి, విని ఆనందిస్తేనే సాహిత్యా నికి ప్రయోజనం ఉంటుందని ఆనాటి కవులకు కూడా
తెలుసు. సంస్కృతము బాగుగా తెలియనివారికోసమే నన్న య ఆంధ్రమహాభారతాన్ని తెలుగులో
రాయడానికి ఆరంభించారు. అందుకే అతనితో రాజరాజనరేంద్రుడు, ఓ మహాత్మా , వ్యా సుడు చెప్పి న
భారతాన్ని మీ బుద్ధిబలంతో తెలుగులో రాయండి అన్నా రు –

జననుత కృష్ణద్వై పాయన


మునివృషభాభిహిత మహాభారత బ-
ద్ధనిరూపితార్థ మేర్ప డఁ
దెనుగున రచియింపు మధిక ధీయుక్తిమెయిన్
– నన్న యభట్టు, ఆదిపర్వ ము (1.16)

అందుకే నన్నె చోడుడు “జానుతెనుగులో” కుమారసంభవాన్ని రాస్తున్నా నని చెప్పా రు. అందుకే
పాల్కు రికి సోమనాథుడు బసవపురాణము రాసేటప్పు డు తాను దేశి తెలుగు ఛందస్సై న ద్వి పదలో
రాస్తా నని చెప్పా రు.

ఉరుతర గద్య పద్యో క్తు లకంటె


సరసమై పరగిన జానుతెనుంగు
చర్చింపగా సర్వ సామాన్య మగుట
కూర్చె ద ద్వి పదలు కోర్కి దైవార
– సోమనాథుడు, బసవపురాణము

అందుకే మొల్ల కూడా “తేనెసోక నోరు తీయన యగు” విధంగా రామాయణాన్ని తెలుగులో
రాస్తున్నా నని చెప్పా రు.

కందువ మాటలు, సామెత


లందముగాఁ గూర్చి చెప్ప నది తెనుఁగునకున్
బొందై, రుచియై, వీనుల
విందై, మఱి కానుపించు విబుధుల మదికిన్
– మొల్ల, రామాయణము (1.18)

అందుకే పోతన భాగవతాన్ని అందరూ అర్థం చేసుకొనేలా రాశారు. ప్రజాకవి వేమన కూడా తన
సూక్తు లను జనులు వాడే భాషలో దేశి ఛందస్సై న ఆటవెలదిలో రాశారు. వాగ్గేయకారుడైన
అన్న మయ్య కూడా తన పాటలను వ్యా వహారిక భాషలో ప్రజల కర్థమయ్యే టట్లు రాశారు. రామదాసు,
త్యా గయ్య వంటి మిగిలిన సంగీతకారులు కూడ ఇతనిలాగే వాడుక భాషలో పాటలను రాశారు.

సంధి యుగం
పందొమ్మి దవ శతాబ్దాంతం, ఇరవైయవ శతాబ్దపు ఆరంభం తెలుగు దేశంలో మాత్రమే కాదు,
భారతావనిలో ఒక సంధి యుగం. ముద్రించబడిన గ్రంథాలు జనులను కొని చదవమని ఆహ్వా నించేవి.
అంటే రాయసగాళ్లు తాటాకులపై రాసుకోవలసిన అవసరం లేదు. పెద్ద ఊళ్లలో విద్యు చ్ఛ క్తి కూడా
ఉండేది. కాబట్టి కష్టం లేక చదువుకోవచ్చు . నాటకాలను సమాజాలు ప్రదర్శించేవారు. అప్పు డే
గ్రామఫోన్ రికార్డులు వచ్చా యి. ఇంకొక మూడు దశాబ్దా లకు మాట్లా డే సినిమా కూడా వస్తుంది.
వీటితోబాటు రాజకీయాలలో కూడా ఒక కొత్త గాలి వీచింది. స్వా తంత్ర్యే చ్ఛ , స్వ రాజ్య వాంఛ అనే
విత్తనాలు ప్రజల హృదయాలలో మొలకెత్తి పెరగడానికి అవకాశం కలిగింది. పనుల కోసం పాశ్చా త్య
విద్యా విధానం తప్ప నిసరి అయింది. ఇలా నాలుగు దిక్కు లనుండి వ్యా వహారిక భాష అనే
పెనుతుఫానుకు అనుకూల పరిస్థితులు ఏర్ప డ్డా యి.

ఆధునిక కవిత్వంలో వాడుక తెలుగును మొదట ఎక్కు వగా ఉపయోగించిన ఘనత గురజాడ
అప్పా రావుగారికి దక్కు తుంది. ఈ విషయంలో వీరు యుగపురుషులు. వీరు దీనికై ఒక కొత్త
ఛందస్సు ను ఉపయోగించారు. అదే ముత్యా లసరం. ముత్యా లసరము పదే పదే వచ్చే మూడు,
నాలుగు మాత్రల మిశ్రగతిలో నడుస్తుంది. ఇట్టి గతి ఉండే వృషభగతి రగడలాటి ఛందస్సు లు
తెలుగులో ఉన్నా కూడా, ఇందులో విరివిగా కవితలను రాయడమనేది తెలుగు భాషకు కొత్త. ఆ ఘనత
గురజాడవారికి చేరిందే. ముత్యా లసరానికి కన్న డములోని భామినీషట్ప దికి తేడా లేదు. కన్న డములో
షట్ప దులలో మహాకావ్యా లనే రాశారు. కానీ గురజాడవారు ఈ ఛందస్సు ను పారసీక భాషనుండి
గ్రహించినట్లు భావన. తెలుగులో కూడా ముత్యా లసరము ఛందస్సు లో గురజాడ కంటె నాలుగు
నెలలకు ముందుగా కింది పద్యం ప్రచురింపబడింది. కవి ఎవరో తెలియదు.

మేలుకొనుమీ భరతపుత్రుడ
మేలుకొనుమీ సుజనపుత్రుడ
మేలుకొనుమీ సచ్చ రిత్రుడ
మేలుకొనవయ్యా , వత్సా , మేలుకో

వేడుకను జాతీయతయను
వేగుచుక్క పొడిచె నదుగో
కూడి వందేమాతరమ్మ ని
కుక్కు టము లరచెన్, వత్సా , మేలుకో

ఇందులో వత్సా , మేలుకో అనే పదాలను తొలగిస్తే ఇది అచ్చంగా ముత్యా లసరమే. గురజాడవారి
మొదటి ముత్యా లసరము తోకచుక్క లోనిది. దీనిని వీరు కొత్తపాతల మేలు కలయిక అంటారు. కొత్త
భావాలను కొత్త భాషలో పాత సంస్కా రాన్ని అవలంబిస్తూ రాస్తున్నా రని మనం అనుకోవచ్చు .

గుత్తునా ముత్యా ల సరములు


కూర్చు కొని తేటైన మాటల
కొత్తపాతల మేలు కలయిక
క్రొమ్మె రుంగులు జిమ్మ గా
– తోకచుక్క

గురజాడవారి సార్వ త్రిక దృష్టి విశాలమైనది. గురజాడగారు కాలాతీతులు. ప్రజలందరికీ


అర్థమయ్యే టట్లు రాయడం మాత్రమే గాక తమ కవితలో దేశభక్తిని పెంపొందించారు, సాంఘిక
దురాచారాలను ఎత్తి చూపారు, స్త్రీకి పురుషునితో సరిసమానమైన స్థా నాన్ని ఇచ్చా రు. మచ్చు కు కొన్ని
ఉదాహరణలు ఇక్క డ ఇస్తున్నా ను.

దేశమనియెడి దొడ్డ వృక్షం


ప్రేమలను పూలెత్తవలెనోయ్
నరుల చెమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలెనోయ్

ఆకులందున అణగి అమణగీ


కవిత కోయిల పలుకవలెనోయ్
పలుకులను విని దేశమం దభి-
మానములు మొలకెత్తవలెనోయ్
– దేశభక్తి

మనిషి చేసిన రాయి రప్ప కి


మహిమ కలదని సాగి మొక్కు తు
మనుషులంటే రాయిరప్ప ల
కన్న కనిష్టం
గాను చూస్తా వేల బేలా
దేవు డెకడో దాగె నంటూ
కొండకోనల వెతుకులాడే
వేలా
కన్ను తెరచిన కానబడడో
మనిషిమాత్రుడు యందు లేడో
యెరిగి కోరిన కరిగి యీడో
ముక్తి
– మనిషి

మరులు ప్రేమని మది దలంచకు


మరులు మరలును వయసుతోడనె
మాయ మర్మ ము లేని నేస్తము
మగువలకు మగవారి కొక్క టె
బ్రదుకు సుకముకు రాజమార్గము
ప్రేమ నిచ్చి న ప్రేమ వచ్చు ను
ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును
ఇంతియె

మగడు వేల్ప న పాత మాటది


ప్రాణ మిత్రుడ నీకు
– కాసులు

మిశ్రగతి నడకతో ఉండే ముత్యా లసరాలను మాత్రమే కాదు, వీరు చతుర్మా త్రలను కూడా
ఉపయోగించారు తమ కవనాలలో. మచ్చు కు పుత్తడిబొమ్మ పూర్ణమ్మ లోని ఆఖరు పద్యం –

00:00 00:00
పూర్ణమ్మ
కన్యా శుల్కం సినిమా, ఘంటసాల

కన్ను ల కాంతులు కలువల చేరెను


మేలిమి జేరెను మేని పసల్
హంసల జేరెను నడకల బెడగులు
దుర్గను జేరెను పూర్ణమ్మ
– పూర్ణమ్మ (ఈ కవనాన్ని కన్యా శుల్కం చలనచిత్రంలో వినవచ్చు .)

కవిత్వ ము సులభంగా, అర్థవంతంగా ఉండాలి. ఆధునిక కవిత్వం ఆనందవర్ధనుని కింది


సిద్ధాంతంపైన ఆధార పడినది. అసీమమైన కావ్య జగత్తుకు కవియే సృష్టికర్త. అతడు తాను
చూచినదానిని ఉన్న దున్న ట్లుగా రాస్తా డు అన్న దే దీని సారాంశం.

అపారే కావ్య సంసారే


కవిరేవ ప్రజాపతిః
యథాస్మై రోచతే విశ్వం
తథేదం పరివర్తతే
– ఆనందవర్ధనుడు

చిత్ర కవిత్వ ము, గర్భ కవిత్వ ము, బంధ కవిత్వ ము, కష్టమైన పదాలు, నీరసమైన భావాలతో
శృంఖలాబద్ధను చేశారని సరస్వ తీదేవి నారదునితో చెప్పు కొంటుంది కందుకూరి వీరేశలింగం
పంతులుగారు రాసిన సరస్వ తీనారదసంవాదములో. అంటే ఆడంబరాలు కవిత్వా నికి అందాన్ని
ఇయ్య దని పంతులుగారి వాదన. ఆ విషయాన్ని ఎలా చెప్పా రో ఇక్క డ చూడండి –

దయమాలి తుదముట్ట తలకట్లు నిగిడించి


ధీరుడై నన్ను బాధించు నొకడు
పాదాంబులోపల పాదంబు లిమిడించి
వీరుడై నన్ను నొప్పించు నొకడు
ప్రాసంబుపై పెక్కు ప్రాసంబు లడరించి
పోటుబంటయి నన్ను పొడుచు నొకడు
బెండు పల్కు లు గూర్చి నిండైన నగలంచు
దిట్టయై చెవులు వేధించు నొకడు

ఖడ్గ చక్రాది రూపముల్ గానిపించి


వర్ణముల్ మార్చి నను చిక్కు పరచు నొకడు
కుమతు లొడ లెల్ల విరిచి ప్రాణములు తీయు
ఒడలి పస లేక శుష్కించియున్న దాన

ఆధునిక తెలుగు కవిత్వా నికి నాందీగీతం పాడినవారు ఇద్దరు మహనీయులు, వారు రాయప్రోలు
సుబ్బా రావు, గురజాడ అప్పా రావు. భావకవిత్వా నికి నాంది బహుశా రాయప్రోలువారి “లలిత”.
రాయప్రోలుగారు తెలుగులో సామాన్య ముగా వాడబడే ఛందస్సు లోనే లలితను తీర్చి దిద్దా రు.
ఫలించని ప్రేమ ఇందులోని కథావస్తువు. వేంకటపార్వ తీశ్వ ర కవులు దేశి ఛందస్సై న ద్వి పదలో తమ
ఏకాంతసేవను లోకప్రియముగా రాశారు. కృష్ణ శాస్త్రిగారు భావకవిత్వంలో శిఖరాలనే చేరుకొన్నా రు.
కాని ఇవన్ని యు ఛందోబద్ధమైనవే. ఐనా కూడా జనసామాన్యా నికి సులభంగా అర్థమయ్యే టట్లు కూడా
ఇట్టీ కవులు కొన్ని కవితలను రాశారు. వాటికి కింద కొన్ని ఉదాహరణలు –

పొదలలో పూవువై పోయినావేమొ


ఆలలో దూడవై యరిగినావేమొ
తమ్ము ల తీయగా ద్రవియించితేమొ
కలికి వేణువుతోడ కరిగినావేమొ
నిన్నెందు జూతురా చిన్నా రి కృష్ణ
ఏమూల వెదికేదిరా మోహనాంగ
– రాయప్రోలు, జడకుచ్చు లు, రాధ పిలుపు

లయ పెంచుతూ మధ్య
లయ దించుతూ పాట
రయ మెంచుతూ కిన్నె
రటు సోలి యిటు సోలి
తెలి నీటి మేనితో
తలిరాకు మేనితో
ఒయ్యా రములు పోయెనే
కిన్నె రా
అయ్యా రె యనిపించెనే
– విశ్వ నాథ సత్య నారాయణ, కిన్నె రసాని పాటలు, కిన్నె ర నృత్య ము

నువ్వ టే నువ్వ టే
పువ్వు విరిసిన వయసు
నవ్వు లలమిన సొగసు
రువ్వి నా ఎదపైన
చివ్వు నంతర్హివే
నువ్వ టే నువ్వ టే

నువ్వ టే నువ్వ టే
కవ్వించి నా కాంక్ష
త్రవ్వించి నా కలలు
ఉవ్వి ళ్ళు గొన మనసు
దవ్వై తివే దెసల
నువ్వ టే నువ్వ టే

నువ్వ టే నువ్వ టే
జవ్వ నీ ప్రణయినీ
మువ్వంపు వగలాడి
అవ్వా రు ముద్ది మా
నవ్వు తూ నను వదలి
రివ్వు రివ్వు న మిన్ను
పవ్వ ళింపయితివే
నువ్వ టే నువ్వ టే
– అడవి బాపిరాజు, శశికళ

అభ్యు దయ కవిత్వంలో అపారమైన కీర్తి గడించిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు. గురజాడ తరువాత
సాహిత్యా కాశంలో ఉన్న ట్లుండి మెరిసిపోయిన మరొక తోకచుక్క శ్రీశ్రీ. శ్రీశ్రీ కవిత్వం చదువని
తెలుగువాడు తెలుగువాడు కాదు. ఛందోబద్ధమైన కవిత్వంతో ప్రారంభించి కొత్త కొత్త దారులను
తొక్కా రు వీరు. కాని ఇక్క డ ఒక విషయం గుర్తుంచుకోవాలి. వీరి కొన్ని కవితలు వాడుక భాషలో లేదు.
అందులోని కొన్ని పదాలకు నిఘంటువును వెదకాల్సిందే! ఉదాహరణకు కింది గేయంలోని పదాలు
వ్యా వహారికభాషకు చెందినవి కావు.

ఎగిరించకు లోహవిహంగాలను
కదిలించకు సుప్తభుజంగాలను
ఉండనీ
మస్తిష్క కులాయంలో
మనోవల్మీ కంలో
– సాహసి

శ్రీశ్రీ కొత్త కొత్త ఛందస్సు లలో రాశారు. మాత్రాఛందస్సు ను తెలుగు కవితలలో అతి రమ్యంగా వాడిన
ఘనత వీరిదే. తెలుగు కవులు నిరసించిన ఎదురు నడక (లఘువు-గురువుతో ప్రారంభం) వీరి
గేయాలలో పదేపదే ప్రత్య క్షమవుతాయి.

మరో ప్రపంచం
మరో ప్రపంచం
మరో ప్రపంచం పిలిచింది
పదండి ముందుకు
పదండి త్రోసుకు
పోదాం పోదాం పైపైకి
– మహాప్రస్థా నం

తిరుగుబాటు కవులలో తనకై ఒక స్థా నాన్ని నిర్మించుకొన్న , కాదు లాగుకొన్న , “భావకవి కాని అహంభావ
కవి” పఠాభి. “నా ఈ వచన పద్యా లనే దుడ్డు కర్రల్తో పద్యా ల నడుముల్ విరుగదంతాను,
చిన్న యసూరి బాలవ్యా కరణాన్ని చాల దండిస్తా ను” అన్నా రు పఠాభి. వీరి ఫిడేల్ రాగాల డజన్‌లో
పాశ్చా త్య ప్రభావం ఉంది, వ్యంగ్యం కూడా ఉంది. పదాలతో ఆడుకోగలిగిన శక్తి, నిబ్బ రము వీరికుంది.
వీరి కవితకు కింద ఒక ఉదాహరణ –

హవాయి కడుతీ
యవాయి పడతీ (కడు తీయ వాయి)
భవచ్చ తురిమన్
విలాస గరిమన్
నుతింప నసహా
యుడీతడు సహా (అసహాయు డితడు సహా)
సఖి నీకలహా
సమాలీ కలహా (నీ కలహాస మాలిక లీక లహా)
వసంత కుసుమా
లసంత లుసుమా (కుసుమాల సంతలు సుమా)
ప్రియా విపులనే
త్రయుగ్మ ములనే
నుతింప గలనా
అలోహ లలనా
– యాత్రాఛందస్సు లు – హ్యో ల

గ్రామీణ భాషను సాహిత్యంగా తీర్చి దిద్ది అందరి మన్న లను పొందిన కవి నండూరివారు. వీరి యెంకి
పాటలు పల్లెపడుచుల అమాయకత్వా న్ని , ముగ్ధత్వా న్ని , స్నే హాన్ని మనముందు చిత్రించి సంతృప్తి
కలిగిస్తుంది. ఉదాహరణకు ఒక యెంకి పాట –

ఆరిపేయవే దీపమూ
యెలుగులో నీమీద నిలపలేనే మనసు
ఆరిపేయవే దీపమూ

జిమ్ము మంటా తోట సీకటై పోవాలి


సీకట్లో సూడాలి నీ కళ్ళ తళతళలు
ఆరిపేయవే దీపమూ

తళుకుతో నీ రూపు తలుసుకొని తలుసుకొని


సీకట్లో నా కళ్ళు సిల్లులడ సూడాలి
ఆరిపేయవే దీపమూ

సూపులే ఆపేసి మాపు వూసే మరిసి


వొక రెరుగ కింకోకరు వొరిగి నిదరోదాము
ఆరిపేయవే దీపమూ
– నండూరి సుబ్బా రావు , ఎంకి పాటలు

దేశభక్తికోసం వాడుక భాష


ఒక వంద సంవత్స రాలకు ముందు భారతదేశము బానిస దేశంగా ఉండింది. స్వా తంత్ర్యా నికై
ఎందరో తమ ప్రాణాలనే అర్పించారు. ప్రజల హృదయాలలో దేశంపై మమకారం, దేశమాతపై భక్తి
ఎక్కు వ చేయడానికి వ్యా వహారిక భాషలో రాసిన పాటలు ఎంతో దోహదం కల్గించాయి.
దేశాభిమానంతోబాటు సంఘసంస్క రణకు కూడా ఇవి తోడ్ప డ్డా యి. గురజాడవారి “దేశమంటే మట్టి
కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అన్న ముత్యా లసరం నిజంగా భారతమాతకు ముత్యా లసరమే.
చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులుగారు భారతదేశాన్ని గోమాతతో పోల్చి , ఆ ఆవు పాలను ఎలా
అమానుషంగా తెల్లవారు పితుకుతున్నా రో అని వాపోయారు.

భరతఖండంబు చక్క ని పాడి యావు


హిందువులు లేగదూడలై యేడ్చు చుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నా రు మూతులు బిగియబట్టి
– చిలకమర్తి లక్ష్మీ నరసింహం

సులభంగా అర్థమయ్యే మరి కొన్ని ప్రబోధ గేయాలు, జాతీయ గీతాలు –

మలిన వృత్తులు మాలవారని


కులము వేర్చి న బలియు రొక దే-
శమున కొందరి వెలికి దోసిరి
మలినమే మాల
– గురజాడ అప్పా రావు, లవణరాజు కల

మతము లన్ని టికి సమ్మ తము దీని క్రీడ


హితము కూడ శాంతియుతముగ పోరాడ
హిందువులం దెర్రనై ఇస్లా ము మతమందు
పొందుగ పచ్చ నై యానందమును గూర్చు
ధవళమై యితర మతమ్ము లకై వెలుగు
అవిరళ భాగ్య భోగ్య ముల నీయగలుగు
కోట్ల ధనము జనము కొట్టి పొట్టను బెట్టు
కాటకముల నెట్టు రాట్న ము గలట్టి
దిదియే జాతీయ జండా
జాతి కిదియె ప్రాణము మాన మిదియే
– గురజాడ అప్పా రావు (1922)
(జాతీయ జండాపైన తెలుగులో వీరి కవితయే మొట్టమొదటిదేమో? ఇప్పు డున్న చక్రానికి బదులు
అప్పు డు భారతదేశపు జండాలో రాట్న ము ఉండేది.)

ఏ దేశ మేగినా ఎందు గాలిడిన


ఏ పీఠ మెక్కి నా యెవ రెదురయిన
పొగడరా నీతల్లి భూమి భారతిని
నిలుపరా నీజాతి నిండు గర్వ మ్ము
లేదురా యిటువంటి భూదేవి యెందు
లేదురా మనవంటి ధీరు లింకెందు
– రాయప్రోలు సుబ్బా రావు, జన్మ భూమి

00:00 00:00
కొల్లా యి గట్టితే నేమి మా గాంధి
బసవరాజు, మాలపిల్ల చిత్రంలో

కొల్లా యి గట్టితే నేమి మా గాంధి


కోమటై పుట్టితే నేమి
వెన్న పూస మనసు, కన్న తల్లీ ప్రేమ
పండంటి మోముపై బ్రహ్మ తేజస్సు

నాల్గు పరకల పిలక


నాట్య మాడే పిలక
నాలుగు వేదాల నాణ్య మెరిగిన పిలక

బోసి నోర్వి ప్పి తే


ముత్యా ల తొలకరే
చిరునవ్వు నవ్వి తే వరహాల వర్షమే
– బసవరాజు, మా గాంధీ (మాలపిల్ల చిత్రంలో ఈ పాటను విని ఆనందించండి.)

శ్రీగాంధి నామం – మరువాం మరువాం


సిద్ధము జైలుకు – వెరువాం వెరువాం
కూడి భారతమాత – గొలుతాం గొలుతాం
నేడే స్వ రాజ్యా న్ని – తెస్తాం తెస్తాం

దేశభక్తు లు మాకు – సారాం సారాం


దేశద్రోహులు మాకు – దూరాం దూరాం
వర గాంధి మార్గా న్ని – వదలాం వదలాం
వేరే మార్గా లన్నీ – వదిలాం వదిలాం

లాటీ దెబ్బ లకేము – బెదరాం బెదరాం


మేటి తుపాకీకి – చెదరాం చెదరాం
శ్రీగాంధి నామం – మరువాం మరువాం
– దామరాజు

మాకొద్దీ తెల్ల దొరతనము దేవ


మాకొద్దీ తెల్ల దొరతనము

మా ప్రాణాలపై పొంచి మానాలు హరియించే


పన్నెండు దేశాలు పండుచున్నా గాని
పట్టెడన్న మె లోపమండి
ఉప్పు ముట్టుకొంటే దోషమండి
నోట మట్టికొట్టి పోతాడండి
అయ్యో కుక్క లతో పోరాడి
కూడు తింటామండి
– గరిమెళ్ల సత్య నారాయణ

ఉప్పు కొనండయ్యా స్వ రాజ్య పు


ఉప్పు కొనండయ్యా
ఉప్పు చట్టమును ధిక్క రించితే
తప్ప క మనకు స్వ రాజ్య ము వచ్చు

బానిసతనము బాపే మందిది


భారతీయుల భాగ్య ఫలంబిది
పేదలపాలిటి పెన్ని ధాన మిది
సాధులు చేసిన సంజీవిని యిది

శాంతి సైన్య ములు చేసిన ఉప్పి ది


శాంతి శుభమ్ము లు జగతి కిచ్చు నది
గాంధి మహాత్ము డు కనిపెట్టిన దిది
బంధనంబుల బారదోలు నిది

గవర్న మెంటుకు కను విప్పంగా


కాంగ్రెసు యోధులు కలసి చేసినది
– మంగిపూడి పురుషోత్తమ శర్మ

సిగ్గులేదా నీకు శరము లేదా


అన్న మైనలేక బీద లల్లా డుతుంటేను
సీతాకోక చిలుకలాగ సీమగుడ్డ కట్టి తిరుగ

పూట కూడు లేని ప్రజకు రాట్న మొకటే పెన్ని ధాన


మోటంచు పవిత్రమైన రాటం ఖద్దరు వెక్కి రింప

అంగడులన్ని యుంటే అల్లుడినోట శానున్న ట్లు


భాగ్య రాశి భారతభూమి పరదేశ సరుకులేల
– బసవరాజు ఆపారావు

స్వా తంత్ర్యం వచ్చి న తరువాత దేశంలో జరిగే అవినీతి పనులను, పాలకుల దౌర్జన్యా న్ని ప్రజల
దుస్థితిని గురించి కూడా వాడుక భాషలో వచన పద్యా లు రాస్తూ నే ఉన్నా రు కవులు, కవయిత్రులు.
కింద ఒక రెండు ఉదాహరణలు –

కడగొట్టు తమ్ము డని


గారాబు తమ్ము డని
కనికరమ్మే లేని
కటిక రక్క సులారా
ఏ తప్పు చేశాడురా
మీ సొమ్ము
ఏమి కాజేశాడురా
-జంధ్యా ల పాపయ్య శాస్త్రి, తప్పు లేని తమ్ము డు

అమ్మా భారతమాతా
ఎండిన పాలిండ్లనుంచి
స్తన్యం రాక
రుధిరపానం చేస్తున్నా డు
ఈ భావి భారత బాలుడు

స్వా ర్థ రాజకీయాలతో


పదవీ కాంక్షతో
ఈ వయసు ముదిరిన ఊసరవెల్లులు
నిన్నే శృంఖలాబద్ధను చేయదలిస్తే
నీకోసం
రక్తతర్ప ణం చేయడానికి
వాడి శరీరంలో కావలసినంత రక్తం
– జయప్రభ, రక్తతర్ప ణం

ఓ మగమద మృగాల్లా రా
మీరు మీ ఇళ్లల్లో చావండి
మీరు మీ భార్య ల ఒళ్లల్లో చావండి
మీ తల్లుల గుండెలపై చావండి
మీరు చావటానికి మా దగ్గరకు రాకండి
బతకటానికి నానా చావూ చస్తున్న వాళ్లం
– ఓల్గా

ఏ.సి. రూముల్లో న ఎఫ్.సి. కులపోలుంటే


తాటికమ్మ పాకల్లో బి.సి. కులపోలున్న రు
కులంలేని మతంలేని రాజ్యం మనదన్న రు
హైదరాబాదులో కులంలోని అగ్గి పెట్టుకొన్న రు
– వంగపండు ప్రసాదరావు, శూద్రుల సవాల్

స్త్రీల కవిత్వం
స్త్రీ ఒక తల్లికి కూతురు, ఒక శిశువుకు తల్లి, ఒక అన్న కు చెల్లి, ఒక తమ్ము నికి అక్క , ఒక పురుషునికి
భార్య , ప్రియురాలు, ఒక అత్తకు కోడలు. ఇలా స్త్రీకి ఎన్నో అవతారాలు. పురుషునితో సమానంగా
ఇప్పు డు స్త్రీలు కూడ ఆఫీసులలో, కంపెనీలలో, కళాశాలలో పని చేస్తున్నా రు, కానీ తక్కు వ వేతనంతో.
సంఘంలో స్త్రీని ఇంకా ఒక ఆటవస్తువుగానే కొందరు భావిస్తున్నా రు. స్త్రీ హృదయంలో కలిగే భావాలు,
క్షోభలు, సుఖ దుఃఖాలు, కన్నీ ళ్లు , ప్రేమలు, కామాలు – ఇవన్నీ కవితకు మంచి సారవంతమైన క్షేత్రం.
ఒక వంద సంవత్స రాలుగా స్త్రీల కవితలు ఎంతగానో ముందడుగు వేసింది. స్వా తంత్ర్యా నికి ముందు
ముగురమ్మ లు దీనికి మూలకారకులు. వారు – విశ్వ సుందరమ్మ , బంగారమ్మ , సౌదామిని. మచ్చు కు
వారి కవిత ఒకటి కింద ఇస్తున్నా ను. సౌదామినిగారి “దురదృష్టా న్ని ” చదివిన తరువాత కళ్ల నీళ్లు
బెట్టుకోని వాళ్లు అరుదుగా ఉంటారు.

అరమరలేని మన చిరతర స్నే హరుచుల్


కురిసిన వెన్నె లలా, అరవిరిసిన మల్లియలా

మనమున నెవ్వ గలే మాసెను ఘనమగు నెయ్య ములో


మెరపుల గుంపేమో అది కరగని వెలుగేమో

దినములు నిముసములై చనియెను తిన్న ని నడకలతో


కన్ను ల తళుకేమో అది పున్నె పు ప్రోవేమో

జీవితమున కంతా అది చెలువపు నిగ్గేమో


పరమ ప్రేమకు చిహ్న మైన తెలి వెన్నె ల కాంతుల సన్న పు తళుకేమో
– విశ్వ సుందరమ్మ , స్నే హరుచి

కను మూసి లేచాను వెనుదిరిగి చూశాను


కనలేదు ఆ జంట, వినలేదు ఆ జాడ
గుండె గుబగుబ లాడెను
నా గొంతు
ఎండి గుటకడదాయెను

పిలిచాను పిలిచాను అలసిపోయాను


అలసిపోయిన గుండె అట్టె ముడిపోవ
ఆకాశమున కెగిరితి
అక్క డా
అంధకారమె చూసితి

కేక వినబడదాయె చూపు కనబడదాయె


అంధకారములోన అట్టె రెక్క లు ముడిచి
అవనిపై బడితిని
అక్క డా
అంధకారమె గంటిని
– బంగారమ్మ , తమస్సు

చూచితి మెంతో దేశము


సుఖము, శాంతి దొరకునొ యని
మునిగితి మెన్నో నదులను
మోక్షము చేపట్టుద మని
ఎక్కి తి మెన్నో కొండల
నీశ్వ రు దర్శింతా మని
మ్రొక్కి తి మెన్నో వేల్పు ల
కొక్క పండు వర మిమ్మ ని
నోచితి మెన్నో నోములు
కాచి బ్రోచు నని పార్వ తి
కడకు దేవి దయచేతను
కంటిమి రత్న ములు రెండు
బతుకు కలంకారముగా
వాని దాచ చేతగాక
ఎచటనొ పోగొట్టుకొంటి
మెంతటి దురదృష్టముననొ
– సౌదామిని, దురదృష్టము

అరవైయవ దశకమునుండి స్త్రీల కవిత్వ ము, స్త్రీవాద కవిత్వ ము తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యే క
స్థా నాన్ని ఏర్ప రచుకొన్న ది. జయప్రభ, ఓల్గా , రేవతిదేవి, ఈశ్వ రి, సావిత్రి వంటి కవులు ఒక కొత్త చేవను,
బలాన్ని , దృక్ప థాన్ని సాహిత్యంలో సృష్టించారు. అమెరికాలాటి విదేశాల్లో ఉండే స్త్రీలు కూడా ఈ
ఉద్య మంలో ముఖ్య పాత్రలే. వీరి కవితలను చదువుతుంటే ఒక కథను చదివేలా అనుభూతి
కలుగుతుంది. కింద కొన్ని కవితాభాగాలను ఉదాహరణలుగా ఇస్తున్నా ను.

….
ఇద్దరి రక్తమూ ఎర్రగానే వుంది
ఇద్దరి రక్తమూ వేడిగానే వుంది
ఇద్దరి రక్తమూ ఉప్ప గానే వుంది
అంతే
ఆ తర్వా తెప్పు డూ అనుకరించలేదు నా పూజ్య పూర్వీ కుల్ని
ఆలోచించేవాణ్ణి శాస్త్రీయంగా నా మేధస్సు తో నేను
ఆచరించేవాణ్ణి ఏది సమంజసమనిపిస్తే దాన్ని
అనుసరించేవాణ్ణి ఏది యోగ్య మనిపిస్తే దాన్ని
– పెళ్ళ కూరు జయప్రద, నేస్తం ఆలోచించు

అది రాత్రి సరిగ్గా రెండు నిలువు గీతల సమయం


కొబ్బ రాకుల నిలువు పాపిట మీద
మంచు బొట్టొ కటి మిసమిసా నాకేసి చూస్తోంది
ఎదలోపల ఎక్క డో ఖరీదైన జ్ఞా పకం కాలుతోంది
గుండెలోపల పండిన మొగలిరేకు గుచ్చు కొన్న ట్లు
చివ్వు మన్న బాధ రివ్వు మన్న సువాసన

– కొండేపూడి నిర్మ ల, నిద్రపట్టని రాత్రి

పురుషుడికి అపారమైన శక్తి సామర్థ్యా లున్నా యి


అందచందాలున్నా యి
గుణగణాలున్నా యి
తెలివితేటలున్నా యి
అవన్నీ పురుషుడికి
తల్లిగా
ప్రేయసిగా
స్త్రీ ఇస్తుంది
అన్ని ఇచ్చి
చివరికి
మగాడి చేతిలో
ఆటబొమ్మ వుతుంది
– రేవతీదేవి, స్త్రీ

పాఠం ఒప్ప జెప్ప కపోతే


పెళ్లి చేస్తా నని
పంతులుగారన్న ప్పు డే భయం వేసింది
ఆఫీసులో నా మొగుడున్నా డు
అవసరమున్నా సెలవివ్వ డని
అన్న య్య అన్న ప్పు డే
అనుమానం వేసింది
వాడికేం మహారాజని
ఆడా మగా వాగినప్పు డే
అర్థమయిపోయింది
పెళ్లంటే పెద్ద శిక్షని
మొగుడంటే స్వే చ్ఛ భక్షకుడని
మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే
మమ్మ ల్ని విభజించి పాలిస్తోందని
– సావిత్రి, ఒక ఆడపిల్ల స్వ గతం

నీకూ మంచి రోజు లొస్తున్నా యిరా కన్నా


ఆడదిగా పుట్టనని అడవిలో మానైనా కాలేదని
విలపించే రోజులు
పోతున్నా యిలే తల్లీ
ఎందుకంటే
నీవు అమ్మ పొట్టలోంచి
బైటికే రావుగా
– ఈశ్వ రి

ఏమిటీ అలా వెతుకుతున్నా వు


ఆ రంగుటద్దా లు తీసేసి
నా కళ్లు పెట్టుకొని
నీలోకి చూసుకో
తెలుస్తుంది –
నీలో సగం నేనేనని
– ఇందిర కొల్లి, నీవు నేను

వచన కవితలు
అప్పా రావుగారైనా సరే, శ్రీశ్రీ ఐనా సరే – వీళ్లందరు కొత్త కొత్త ఛందస్సు లను సృష్టించి పాడుటకు
అనువుగా ఉండేటట్లు కవితలను అల్లినారు. పాశ్చా త్య రచనల ప్రభావంవల్ల కవులు కవితలను
వచనాలుగా అల్లడానికి ఆరంభించారు. పంక్తికీ పంక్తికీ మధ్య ఉండే అంతరము, చదివేటప్పు డు వచ్చే
విరామాలు ఇట్టి రచనలను ఇంకా పటిష్ఠము చేస్తా యి. మనసులో ఉదయించిన భావాలను ఏ
నిర్బంధం లేకుండా బహిర్గతం చేయడానికి వీలవుతుంది. ఇవి ఆంగ్లములోని blank verse లాంటిది,
మాడర్న్ ఆర్ట్ వంటిది. ఇందులో ప్రాసలు, శబ్ద సౌందర్యా లు కేవలం ఐచ్ఛి కము. ఏ పత్రిక చదివినా, ఏ
కవితాసంకలనం చదివినా వచన పద్యా లు అందులో తప్ప కుండా ఉంటాయి. ఇట్టి పద్యా లకు వస్తువు
ఏదైనా కావచ్చు . ఇక్క డ ఈ మాధ్య మంలోని కొన్ని కవితలను మీముందు ఉంచుతున్నా ను –

ఏ మహారాణి మెళ్లో దో
నీలాలపేరు ఇట
తెగి పడిపోయిందేమి
కాదు – విష్ణు క్రాంత
కడు చిన్ని పూలు
తీగెపై అడనద తీరుగా ఉన్నై
నీలాల కంటేను మేలుగా ఉన్నై
– టేకుమళ్ల కామేశ్వ ర రావు, మిణుగురు పురుగు

అక్షరంఅక్షరంలో నీ మధురస్వ ర ఆలాపన వింటాను


పంక్తి పంక్తిలో నీ జీవన దృక్కో ణం స్ప ర్శి స్తా ను
లేఖలో నీవు కనబడతావు
కరిగిస్తా వు
గరళం త్రాగే శక్తి నిస్తా వు
– గంగినేని, ఉదయిని

ఓటు నువ్వు ఎయ్య కుండ


సీటు రాదు నాయకులుకీ
పాటు నువ్వు పడకుండా
బువ్వ లేదు పెద్దలకీ
దళితన్న ల రాజ్యంకై
దండు నడుపుతున్న ట్టి
దండధరుల గిరిజనులా
దండులో కలవండిరో
– చుండూరు పాట, వంగపండు
ఒకడు చేసిన నేరానికి
ఒకడు వెళ్లా డు కారాగారానికి
ఒకడు చెప్పా డు దొంగ సాక్ష్యం
ఒకణ్ణి హింసించడమే అతని లక్ష్యం

న్యా యమూర్తి ఇచ్చి న తీర్పు


అతనికి కలిగించలేదు నిట్టూ ర్పు
దోషి వీధిలో తిరుగుతున్నా డు
నిర్దోషి ఖైదులో మురుగుతున్నా డు
– దాశరథి, జ్వా లాలేఖిని

నేను ఏ అడవుల్లో తిరిగానో


సింహశార్దూ లాల గర్భా ల్లో నిద్రిస్తూ
నన్ను ఏ అందమైన లేడి మేసిందో
శాద్వ లాల్లో తన రక్తమాంసాల్ని బుజ్జగిస్తూ
నేను ఏ అడవి అనుభూతికోసం కొమ్మ లు జాపానో
నా ఆకుల అంగుళులతో శూన్యం స్పృశిస్తూ

ఏ ప్రాచీన సముద్ర చేతనలో తేలానో


నిరింద్రియ నిరవయవ కాంతికణాన్న య్ స్పందిస్తూ
ఏ ఘడియలో ఊగానో
కాలంలో వ్రేలాడే బొమ్మ ల్లా ఉన్న
సూర్య చంద్రులకూ నాకూ అభేదం అనుభవిస్తూ

నా స్మృతులన్నీ రక్తప్రవాహాల్లో పడికొట్టుకొస్తున్నా యి


గుల్మొ హర్ ఒక నూతన రుతువును ప్రకటించిన ఈనాడు
ఏ రుతువు సృష్టి అనంతత్వా న్ని
గానం చేస్తూ ఉందో ఆ రుతువును

మా వూళ్లో ఇవాళ నన్నె రిగిన వాళ్లు నలుగురే


శిథిలమైన వంతెన
గ్రామ కాలువ
పాత గుడి
ముసలి చెరువుగట్టు
– గుంటూరు శేషేంద్ర శర్మ , నీరైపోయింది

సినిమా పాటలలో వ్యా వహారిక భాష


ముప్ఫై యవ దశకంనుండి చలనచిత్రాలు తెలుగులో విడుదలవుతున్నా యి. ఇవి అప్పు డూ, ఇప్పు డూ
ప్రజల జనరంజనానికి అత్య వసరమైన పరికరమే. తెలుగు చిత్రసీమ చేసిన అదృష్టం ఏమంటే,
సుప్రసిద్ధులైన కవులు సినిమా పాటలను రాశారు. సినిమా పాటలను పల్లెలలో, పట్టణాలలో ప్రజలు
పాడుకొంటూ ఉంటారు. దేవులపల్లి, రజనీకాంతరావు, సముద్రాల, ఆరుద్ర, శ్రీశ్రీ, సిరివెన్నె ల, వేటూరి
మున్న గువారి పేరులు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. కింద కొన్ని ఉదహరణలు –

00:00 00:00

అదిగదిగో గగనసీమ
కృష్ణ శాస్త్రి, నా యిల్లు

అదిగదిగో గగనసీమ
అందమైన చందమామ ఆడెనోయీ

ఇదిగిదిగో తేలి తేలి


చల్లనైన పిల్లగాలి పాడెనోయీ

హాయి హాయి ఈ లోకం


తీయనైన దీ లోకం
నీ యిల్లే పూలవనం
నీ సర్వం ప్రేమ ధనం
మరవకోయి ఈ సత్యం

నీకోసమె జగమంతా
నిండెనోయి వెన్నె లలు
తేలెనోయి గాలిపైన
తీయనైన కోరికలు

చెరుచుకోకు నీ సౌఖ్యం
చేతులార ఆనందం
ఏనాడును పొరబడకోయి
ఏమైనా త్వ రబడకోయి

మరల రాదు రమ్మ న్నా


మాయమైన ప్రేమధనం
చిగిరింపదు తిరిగి
వాడి చెడిన పూలవనం
మరవకోయి ఈ సత్యం
– కృష్ణ శాస్త్రి, నా యిల్లు

00:00 00:00

కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడి దాన


ఆత్రేయ, తోడికోడళ్లు
కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడి దాన
బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చె నో చెప్ప గలవా

[…]

గాలిలోన తేలిపోయే చీర కట్టిన చిన్న దానా


జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చె నో చెప్ప గలవా
చిరుగు పాతల బరువు బ్రదుకుల నేతగాళ్ళే నేసినారు
చాకిరొకరిది సౌఖ్య మొకరిది సాగదింక తెలుసుకో
– ఆత్రేయ, తోడికోడళ్లు

00:00 00:00

కలకానిది విలువైనది – బ్రతుకు


శ్రీశ్రీ, వెలుగునీడలు

కలకానిది విలువైనది – బ్రదుకు


కన్నీ టి ధారలతోనే బలిచేయకు
[…]
అగాధమౌ జలనిధిలోన ఆణిముత్య మున్న టులే
శోకాల మరుగున దాగి సుఖమున్న దిలే
ఏదీ తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి అదియే ధీరగుణం
– శ్రీశ్రీ, వెలుగునీడలు

00:00 00:00

వటపత్రశాయికి వరహాల లాలి


– నారాయణ రెడ్డి, స్వా తిముత్యం

లాలీ లాలీ లాలీ లాలీ


వటపత్ర్రశాయికి వరహాల లాలి

కళ్యా ణరామునికి కౌసల్య లాలి


యదువంశవిభునికి యశోద లాలి
కరిరాజముఖునికి గిరితనయ లాలి
పరమాబ్జభవునికి పరమాత్మ లాలి

జో జో జో జో
– నారాయణ రెడ్డి, స్వా తిముత్యం
ముగింపు
నాకు ఛందస్సు అంటే ఇష్టం. తాళవృత్తా లు, మాత్రాఛందస్సు నాకు ప్రియమైనవి. ఈ రంగంలో కొన్ని
ఏళ్లు గా నేను పరిశోధన కూడా స్వ తంత్రంగా చేస్తున్నా ను. ఐనా కూడా, నా మనసు లోతులలో ఉండే
కొన్ని భావాలకు ఆకృతి ఇవ్వా లనే అపేక్ష కలిగినప్పు డు, గేయ కవితనో లేక వచన కవితనో
ఎన్ను కొంటాను. ముఖ్యంగా, హృదయాన్ని స్పందింపజేసే శక్తి ఈ మాధ్య మానికి ఉంది. ఈ ఇంటర్నె ట్
యుగంలో మనం దైనందినం మాట్లా డే వాడుక భాషలో చాలా మంది కవితలను రాస్తున్నా రు,
అంతకంటే ఎక్కు వగా చదువుతున్నా రు. ఆన్‌లైన్ పత్రికలు, బ్లా గులు కూడా వీటికి ప్రోత్సా హం
ఇస్తున్నా యి. ఈ విధంగా ఇవి సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉన్నా యి. పాతంతా మంచీ
కాదు, చెడూ కాదు. కొత్తంతా చెడూ కాదూ, మంచీ కాదు. ఒక్కొ క్క దానికి ఒక్కొ క్క గుణం ఉంది, ప్రభావం
ఉంది. కవి యోచించి మాధ్య మాన్ని ఎన్ను కోవాలి. అందుకే నారాయణ రెడ్డిగారంటారు –

కొత్త నీటిని చేర్చు కొని తర-


గెత్తు నదివలె యెట్టి జాతియు
ముందు కేగిన యంత కాలము
మూడు పూవులు, ఆరు కాయలు

You might also like