You are on page 1of 41

పదవతరగతి - సంగ్రహణాత్మక మధింపు – 2

పాఠ్యాంశాలు : గద్యభాగం

లక్ష్యసిద్ధి

గోలకొండ పట్టణం

భూమిక

పద్యభాగం

శతక మధురిమ

జీవన భాష్యం

భిక్ష

ఉపవాచకం

కిష్కింధ, సుందర , యుద్ధ కాండము

వ్యాకరణము

ఛందస్సు : శార్దూ లము , మత్తే భము

అలంకారములు : అతిశయోక్తి , అర్థా o తరన్యాసాలంకారము, క్రమాలంకారము, ఉపమాలంకారము

సంధులు : ద్విరుక్తటకారసంధి, గ స డ ద వా దేశసంధి , రుగాగమ సంధి, త్రికసంధి

8. `లక్ష్యసిద్ధి –

సంపాదకీయ వ్యాసం
లక్ష్యసిద్ధి పాఠం సంపాదకీయ ప్రక్రియకు చెందినది. సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో

వ్యాఖ్యాన రూపంలో పుర్వాపరాలను పరామర్శిస్తూ సాగే రచన సంపాదకీయ వ్యాసం. తక్కువ మాటలలో

పాఠకులను ఆకట్టు కుంటూ, ఆలోచింప చేయగలగడం మంచి సంపాదకీయ లక్షణం . ఇవి తత్కాలానికి సంబంధించినవే

అయినా ఒక్కొక్క సందర్భంలో విభిన్న కాలాలకు అనువర్తింప చేసుకోవచ్చు . తెలంగాణా రాష్ట్ర అవతరణ సందర్భంగా జూన్

2 వ తారీకు 2014 సంవత్సరంలో ఒక తెలుగు దినపత్రికలో వెలువడిన సంపాదకీయ వ్యాసమే లక్ష్యసిద్ధి పాఠం.

ప్రశ్నలు – జవాబులు

1 . తెలంగాణ రాష్ట ఏర్పాటును జాతి చరిత్రలో ఒక అద్బుతమైన ఘట్టంగా ఎందుకు అనుకుంటున్నారు?

జ. తెలంగాణ పో రాటం గమ్యాన్ని అందుకున్న శుభక్షణం . తెలంగాణ జాతి చరిత్రలో అది అరుదైన, అద్భుతమైన క్షణం.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సమయంలో మూడు తరాల పిల్ల ల కన్నుల నుండి భావోద్వేగంతో ఆనంద -భాష్పాలు

ఉద్భవించాయి. ఆనందోత్సాహాలతో పాటు పో రాట జ్ఞా పకాలు కూడా ముసురుకొని , తెలంగాణ ప్రజల హృదయాలను ఆర్ద్రం

గా మార్చాయి. అందుకే తెలంగాణ రాష్ట ఏర్పాటును జాతి చరిత్రలో ఒక అద్బుతమైన ఘట్టంగా అనుకుంటున్నారు.

2. సంపాదకీయాల్లో ని భాషాశైలి ఎట్లా ఉంటుంది?

జ. సంపాదకీయం లోని భాష సరళంగా , సులభగ్రా హ్యంగా , నిష్కర్షగా, సూటిగా , సాధికారికంగా, సృజనాత్మకంగా ఉండాలి.

సంక్లిష్టమైన అంశాలను , జనభవితవ్యాన్ని, వర్తమానాన్ని ప్రభావితం చేసే అంశాలను విశ్లేషించి పాఠకుడికి అందివ్వాలి.

సంపాదకీయాల్లో ఆసక్తిని కలిగించే ఎత్తు గడ, వివరణ , ముగింపు అవసరం . పత్రికకు హృదయం లాంటిది సంపాదకీయం.

సృజనాత్మక శైలి ఎక్కువగా సంపాడకీయాల్లో నూ , వ్యాసాలలోనూ కనిపిస్తుంది.

3. సంపాదకియాలను పత్రికల్లో నే ఎందుకు రాస్తా రు?

జ. పత్రికల్లో అతి ముఖ్యమైన రచన సంపాదకీయం అని కొందరు , పత్రికా హృదయమే సంపాదకీయం అని మరికొందరు

చెప్పారు. ప్రజల అభిప్రా యాలను వారికే వ్యాఖ్యానించి చూపటం, మార్గనిర్దేశం చేయటం, సమస్యలపై స్పందించేలా

నిర్మాణాత్మకంగా ఆలోచింప చేయటం కోసం సంపాదకీయాలు రాస్తా రు. తక్షణ సమస్యలపై , తాజా వార్తలపై ,

సంఘటనలపై చేసే పరిశోధన , ఆలోచనల వ్యాఖ్యానమే సంపాదకీయం . సంపాదకీయాల్లో ఆసక్తిని కలిగించే ఎత్తు గడ,

వివరణ , ముగింపు ఉంటాయి. సంపాదకీయాలు సమాజ చైతన్యానికి తోడ్పడతాయి. తక్కువ మాటల్లో పాఠకులను

ఆలోచింప చేసేటట్లు గా , ఆకట్టు కునేటట్లు గా సంపాదకీయాలు రాస్తా రు.

4. పత్రికల్లో ని సంపాదకీయాలకు, సాధారణ వార్తాంశాలకు మధ్యనున్న భేదాలేవి?

జ. పత్రికలలోని సంపాదకీయాలలో సృజనాత్మక శైలిని ఉపయోగిస్తా రు. వార్తా రచనలు సూటిగా స్పష్టంగా ఉంటాయి.

వార్తలను ప్రజల పట్ల భాద్యతాయుతంగా రాస్తా రు. సంపాదకీయాలలో రచన సరళంగా, సూటిగా , స్పష్టంగా ఉంటుంది .

అటు వార్తలలోనూ , ఇటు సంపాదకీయాలలోనూ పాఠకునికి ఆసక్తి కలిగించే ఎత్తు గడ , వివరణ ముగింపు తప్పనిసరిగా

ఉంటుంది. సంపాదకీయాలను జాతీయాలు, సామెతలతో నర్మగర్భంగా రాస్తా రు. వార్తలు సూటిగా , స్పష్టంగా ఉండటమే

కాక చిన్న చిన్న పదాలతో వాక్యాలతో రాస్తా రు .


5. ఒక పత్రికలోని సంపాదకీయాలను చదివితే ఆ పత్రిక ఆలోచనా ధోరణులను , దృక్పథాన్ని అర్థంచేసుకోవచ్చు. దీనివల్ల

మీ అభిప్రా యాలను సో దాహరణంగా వ్రా యండి.

జ. సంపాదకీయాలను చదివితే ఆ పత్రిక ఆలోచనా ధో రణులను , దృక్పథాన్ని తెలుసుకోవచ్చు అనే ఆలోచనలో

నిజముంది. మన రాష్ట్రంలో వెలువడే “నమస్తే తెలంగాణ” పత్రిక ముఖ్యమంత్రి గారు చేసే ప్రతి పనినీ సమర్థిస్తుంది. ఈ

పత్రికలోని వార్తలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయి. అదే ఈనాడు పత్రికలోని వార్తలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా

ఉంటాయి. ఈ పత్రికలోని వార్తలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా , సంపాదకీయాలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా

ఉంటాయి. నమస్తే తెలంగాణ పత్రికను కె.సి.ఆర్ నెలకొల్పారు కాబట్టి సంపాదకీయంలో కె.సి.ఆర్ చేసిన తొలి ప్రసంగాన్ని

మెచ్చుకుంటూ రాసింది. ఉదాహరణకు సంక్షేమ రాజ్యానికి అనుగుణమైన హామీలు ఇచ్చారని, ఋణాలు మాఫీ

చేస్తా నన్నారని, పేదలకు రెండు పడకల గదులు కట్టిస్తా నన్నారని ఈ విధంగా కె.సి.ఆర్ ప్రసంగాన్ని ప్రశంసిస్తూ నమస్తే

తెలంగాణ పత్రికలో రాయబడింది. ఇలా ప్రతి ఒక్క పత్రిక తమకు ఎవరు, ఏ పార్టీ వారు అనుకూలంగా ఉంటారో వారి

గురించి వారు చేసే కార్యక్రమాల గురించి సదభిప్రా యాలను ప్రజలకు అందిస్తూ వార్తలను ప్రచురిస్తుంది. అప్పుడే ఆ పత్రిక

ప్రజాభిమానాన్ని పొందగల్గి తమ పత్రిక పేరును ,ప్రచారమును పెంపొందించుకోగల్గు తుంది.

6. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న ఏదైనా ఒక ప్రధాన సామాజికాంశం / సంఘటనల ఆధారంగా సంపాదకీయ

వ్యాసంను రాయండి.

జ. వార్తా పత్రికలోని సంపాదకీయాలను పరిశీలించి జవాబును రాయాలి.

7. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి అపురూపమైన క్షణాలలో మీరెలా స్పందించారు?

జ. తెలంగాణ రాష్ట్రం జూన్ 2 వ తేదీ 2014 న ఏర్పడుతుందని ముందుగానే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంటు

ఉభయసభలు ఆమోదముద్రను వేశాయి. ఈ వార్తను విన్న తెలంగాణ ప్రజల ఆనందానికి అవధులు లేవు. గ్రా మాల్లో

పట్టణాల్లో ఉన్న ప్రజలు ఎంతో సంబరాన్ని చేసుకున్నాము . మన ప్రాంతీయ భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, విద్య

వైద్య , వ్యవసాయం --ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో మనం ముందడుగు వేయవచ్చు అనే భావన ప్రతి ఒక్కరిలోనూ

నెలకొన్నది. రాష్ట్ర విభజన వలన మనలను మనమే పరిపాలించుకుంటాము , ఈ రాష్ట్రం మనది అనే మనోధైర్యంతో బడి

పిల్ల ల నుండి వృద్ధు ల వరకు హాయిగా ఊపిరి పీల్చుకున్నాము . రాష్ట్ర విభజన కోసం ప్రా ణత్యాగం చేసిన వారికి

నివాళులు అర్పించాము .బానిసత్వం నుండి విముక్తి పొందిన ఆనందం మాకు కలిగింది.

8. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోని ఏ ఘట్టా లు ఈ ప్రాంత ప్రజల హృదయాలను ఆర్ద్రంగా మార్చాయి.

జ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు కె.సి.ఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంవత్సరం. సకల జనుల సమ్మె పీరుతో

రోడ్ల పై ప్రజలు వంటా - వార్పూ చేపట్టిన సందర్భము. అన్ని తరగతుల ఉద్యోగులూ సమ్మె చేసి రాష్ట్రా న్ని స్థంభింప చేసిన

సందర్భము. విద్యార్థు లు అందరూ పాఠశాలలకు వెళ్ళటం మానేసి ఆ సమయంలో సమ్మె చేసిన సందర్భము. కొంతమంది

యువకులు ఆవేశంతో ఆత్మత్యాగమునకు సిద్ధపడిన సందర్భము – ఈ సంఘటనలు అన్నీ తెలంగాణా ప్రాంత ప్రజల

హృదయాలను ఆర్ద్రంగా మార్చాయి.


9. జై తెలంగాణా నినాదం బలపడటానికి దారి తీసిన సంఘటనలు, వాటి పర్యవసానాలను తెలియచేయుము.

జ. 1969 సంవత్సరములో మర్రి చెన్నారెడ్డి గారి నాయకత్వములో జరిగిన ప్రత్యేక తెలంగాణా పో రాటం చారిత్రా త్మకమైనది.

అప్పుడు తెలంగాణా ప్రజా సమితి నాయకత్వములో పదునాలుగుమంది నాయకులలో పదిమంది నాయకులు తెలంగాణ

ప్రజా సమితీ తరపున ఎం . పీ లుగా గెలుపొందారు. కె.సి.ఆర్ నాయకత్వములో తిరిగి ఉద్యమం మొదలైంది. కాంగ్రెస్ వారు

ఉద్యమాన్ని సమర్థించారు. దానితో ఉద్యమం మరింత బలపడింది. సకల జనుల సమ్మె, ఉద్యోగులు, విద్యార్థు లు, ఆర్.టి .

సి . ఉద్యోగుల సమ్మెలతో రాష్ట్రం అట్టు డికింది. కె.సి.ఆర్ నిరాహార దీక్ష ఉద్యమానికి ఊపును ఇచ్చింది. చివరకు సో నియా

గాంధీ ప్రజల కోరికను మన్నించి 2014 జూన్ లో కొత్త రాష్ట్రా న్ని ఏర్పాటు చేసింది. జై తెలంగాణా నినాదం ప్రజల

హృదయాలలోకి చొచ్చుకుపో యింది.

10. ఉద్యమ కాలంలో హైదరాబాదు వీథులు , మైదానాల ప్రత్యేకతలు ఏమిటి?

జ. ఉద్యమకాలంలో నాయకులు పిలుపు ఇవ్వగానే ఉద్యోగులు, విద్యార్థు లు, ప్రజలు వీథులలోకి , మైదానాలలోకి

పరుగులుపెడుతూ వచ్చేవారు. గులాబీ జెండాలతో వీథులు , మైదానాలు నిండిపో యేవి. ప్రతి ఇంటిపై తెలంగాణా

పతాకాలు ఎగురుతుండేవి . జై తెలంగాణా నినాదంతో వీథులు , మైదానాలు మార్మోగేవి. ప్రభుత్వం విధించిన ఆంక్షలను

ధిక్కరిస్తూ , యువకులు నినాదాలు చేస్తూ వాహనాలపై తిరుగుతుండేవారు. గులాబీ రంగు జెండాలను చూసి ప్రజలు

కేరింతలు కొట్టేవారు.

11. గన్ పార్క్ అమరవీరుల స్థూ పంతో ముడిపడిన సంఘటనలు ఎన్నో – ఆ సంఘటనలను గురించి చర్చించండి.

జ. తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంగా సుమారు రెండువేల మంది యువతీ యువకులు, పెద్దలు ఆత్మత్యాగం

చేశారు. వారి జ్ఞా పకంగా , ఉద్యమానికి ఉత్సాహాన్నిచ్చే చిహ్నంగా అమరవీరుల స్థూ పాన్ని తెలంగాణా పో రాట నాయకులు

నిర్మించారు. ఏ ఉద్యమం జరిగినా ముందుగా పో రాట యోధులు తెలంగాణ గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూ పము

దగ్గర చర్చలు జరిపి, జై తెలంగాణా నినాదంతో ఉద్యమాన్ని ముందుకు నడిపించేవారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి ,

అమరవీరుల స్థూ పానికి విడదీయరాని సంబంధం ఉంది.

12. నవతెలంగాణా నిర్మాణంలో ప్రభుత్వ వ్యూహాలు ఏమిటి?(లేదా) తెలంగాణా పునర్నిర్మాణములో ఎలాంటి చర్యలు

చేపట్టా లని సంపాదకియుల భావిస్తు న్నారు?దానిని మీరు సమర్థిస్తా రా?

జ. పరిపాలనారంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టా లి. తెలంగాణాకు నీటి పారుదల రంగంలో జరిగిన అన్యాయాన్ని

చక్కదిద్దా లి. ప్రజల ఋణాలను మాఫీ చేయాలి. ఇల్లు లేనివారికి రెండు పడకల ఇల్లు ఇవ్వాలి. తెలంగాణ పునర్నిర్మాణ

ము లో భాగంగా మూడు తరాల పాటు అణచివేయబడిన తెలంగాణ సమాజాన్ని సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవటం

ఇలాంటి కార్యక్రమాలు చేపట్టా లని సంపాదకులు భావిస్తు న్నారు. ఈ భావనలతో నేను ఏకీభవిస్తు న్నాను .

పర్యాయపదములు :

రాత్రి : రేయి, నిశి , నిశీధిని , రాతిరి మాట : పలుకు, ఉక్తి, వచనం


ధనుస్సు : విల్లు , చాపం, సింగాణి , ధనువు సంబురం: సంతోషం, ఆనందం

పతాకం : జెండా, ధ్వజము, కేతనం ప్రశంస : స్తో త్రం, పొ గడ్త , స్తు తి

గుడి : దేవాలయం, కోవెల, దేవళం, ఆలయం బాట : దారి , మార్గం

చంద్రు డు : రాజు, విభుడు, చందమామ, జాబిల్లి,

అభ్యాసము : 1

I . క్రింది పదాలను స్వంత వాక్యములలో ఉపయోగించి వ్రా యండి.

1. ముసురుకొను :

2. ప్రా ణంపో యు :

3. గొంతువినిపించు :

4. యజ్ఞం :

II . క్రింది వాక్యములలో పర్యాయపదాలను గుర్తించండి:

1. ఆకాశంలో తారలు మల్లె లు విరబూసినట్లు , చుక్కలు నేలమీద పరచినట్లు , నక్షత్రా లు కాంతులీనుతూ

అద్బుతంగా ఉన్నాయి.

2. బాల్యంలోని సంఘటనలు జ్ఞా పకాలుగా మారి వృద్ధు ల స్మృతి పథంలో దోబూచులాడుతూ ఉంటే వాటిని జ్ఞప్తి కి

తెచ్చుకునే ప్రయత్నంలో అర్థనిమీలిత నేత్రా లతో ఆనంద సాగరంలో ఓలలాడుతున్నారు.

3. ఉద్యమ పో రాటం ఆగదు . ప్రజలు సమర శంఖారావమును మ్రో గించారు. ప్రభుత్వం యుద్ధభేరిని విని దిక్కుతోచని

పరిస్థి తిలో ఉంది.

4. యువకుల ప్రా ణత్యాగాలతో ప్రజలు విషాదంతో, ఖేదాన్ని ఆపుకోలేక , దుఃఖ భారంతో ఆవేశపూరితులై అనుచిత

కార్యాలు చేస్తు న్నారు.

5. సంఘ సంస్కర్తలు సంస్కరణలు చేసే ఉద్దేశ్యంతో, సమాజ ఉద్దరణకు నడుంకట్టి , ప్రజా దృక్పథంలో మార్పులు

తెచ్చి సమాజాన్ని బాగుచేశారు.

III . అతిశయోక్తి అలంకార లక్షణమును వ్రా సి ఉదాహరణను వ్రా యుము.

IV . 1969 వ సంవత్సరంలోని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పరిస్థితులను తెలియచేయండి.

V . తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణములో మీరు ఎలాంటి పాత్ర పో షిస్తా రు?

నియోజనం : వివిధ దినపత్రికల ఆధారంగా 5 సంపాదకీయ వ్యాసాలను సేకరించండి. చదివి అర్థం చేసుకోండి .

కీలకాంశములను గుర్తించండి. పట్టికలో నమోదు చేయండి. (A 4 కాగితములో చేయండి )

క్రమ సంఖ్య తేదీ పత్రిక పేరు సంపాదకీయం శీర్షిక కీలకాంశములు


10 . గోలకొండ పట్టణం – ఆదిరాజు వీరభద్రరావు
ప్రశ్నలు – జవాబులు

1 . అజంఖాన్ ఎవరు? ఆయన గొప్పతనం ఏమిటి?

జ. అజంఖాన్ గోలకొండ పట్టణ నిర్మాణ పథకాన్ని తయారుచేసిన ఇంజనీర్. ఈయనే గోలకొండ పట్టణ రూపురేఖలను

దిద్దా రు. గోలకొండ పట్టణాన్ని అనేక భాగాలుగా విభజించారు. ఈ భాగాలను “మొహల్లా లు” అనేవారు. ఇప్పుడు ఈ

మొహల్లా ల పేర్లు తెలిపే రికార్డు లు లేవు. అందుకే వాటి వివరాలు సరిగ్గా తెలియవు. తెలుసుకునే ప్రయత్నంలో కొన్ని పేర్లు

మాత్రమే మనకు గోచరిస్తు న్నాయి. అవి – హక్షికమాన్ , దికాబ్ బాగ్, కటోరాహవుజు, మీర్ జుమ్లా మొహల్లా , మాదన్న

మొహల్లా మొదలైనవి .

2. గోలకొండ పట్టణ ప్రత్యేకత ఏమిటి?

జ. దక్షిణ భారతదేశంలోనే పట్టణం అంటే గోలకొండ పట్టణమే అనే పేరును పొందింది గోల్కొండ పట్టణం. గోల్కొండ దుర్గం

అంటే ఒక్క కోట కాదు. మొత్తం మూడు కోటలు . ఈ మూడు కోటలు కూడా ఒకదానిని చుట్టు కొని మరియొకటి కట్టబడింది.

మొదటి రెండు కోటల ప్రా కారముల మధ్యనే గోలకొండ పట్టణం నిర్మింపబడింది. దుర్గమునకు సుమారు ఏడు మైళ్ళ

కైవారము (చుట్టు కొలత) ఎనభై ఏడు బురుజులు , ఎనిమిది దర్వాజాలు ఉన్నాయి. సుమారు నాలుగు మైళ్ళ వైశాల్యము

ఉంటుంది.

3. పట్టణం అలంకార భూయిష్టంగా ఉండటం అంటే ఏమిటి?(లేదా) గోలకొండ పట్టణం అలంకార భూయిష్టంగా ఎలా

తయారైంది?

జ. పట్టణాన్ని అలంకార భూయిష్టంగా తయారుచేయుటకు ఇబ్రహీం కుతుబ్ షా చాలా కష్టపడ్డా రు. అలంకార

భూయిష్టంగా అంటే అందంగా పట్టణాన్ని నిర్మించటం . నిర్మాణంలో భాగంగా ఇబ్రహీం కుతుబ్ షా సరదార్లను,

భాగ్యవంతులను కోట లోపల మేడలు కట్టవలసినదిగా ఆజ్ఞా పించారు. కచ్చేరి భవనాలు, ఉద్యోగస్తు ల భవనాలు,

దేవాలయములు, మసీదులు, ధర్మశాలలు, బిక్షాగ్రు హములు, రమ్యోద్యానములు , పాఠశాలలు, స్నానమందిరములు

నిర్మించారు. ఈ విధంగా అనేక రకాల నిర్మాణాల వలన పట్టణం అలంకార భూయిష్టంగా తయారైంది.

4. గోలకొండ కోట ఎందుకు అచ్చెరువు గొల్పుతుంది?

జ. గోలకొండ కోటలో ఎన్నో అందమైన ఉద్యానవనాలను నిర్మించారు. వాటిలో ముఖ్యమైనది “నగీనాబాగ్ ”. ఉద్యానవన

నిర్మాణంలో విలక్షణమైనవి , ఆకర్షణీయమైనవి “మిద్దె ల మీది తోటలు” (రూఫ్ గార్డెన్స్). ఈ తోటలను భవనాల పై భాగంలో
ఎంతో నైపుణ్యంతో అందమైన ఉద్యానవనాలుగా రూపొందించారు. ఈ ఇద్యానవనాలకు నీటిని సరఫరా చేసే విధానం , నీటి

కాలువలు, జలాశయాలు, కేళాకూళులు (క్రీడా సరస్సులు) , జలపాతాలు మొదలైనవి ఆశ్చర్యమును కలిగిస్తా యి.

5. గోలకొండను వదిలి సామాన్య జనం హైదరాబాదుకు ఎందుకు వెళ్ళి ఉంటారు?( లేదా) గోలకొండ పట్టణంలోకి రాకపో కల

విషయంలో ఎందుకు జాగ్రత్త లు తీసుకునేవారు?

జ. గోల్కొండ పట్టణంలో జనాభా ఎక్కువ కావటం ఒక కారణం. ప్రజలకు నీటి సౌకర్యం లేదు. అందువలన పాదుషాలు ,

ధనవంతులు, వర్తకులు హైదరాబాద్ లో నివసించేవారు. హైదరాబాద్ నిర్మాణం క్రమంగా అభివృద్ధి చెందటంతో గోలకొండ

ప్రా ధాన్యం తగ్గింది. అంతేకాక గోలకొండ పట్టణానికి కొత్త వారు ఎవరైనా వస్తే వారి దగ్గర ఉప్పు కానీ , పొ గాకు కానీ ఉందేమో

అని వెతికేవారు. ఒకవేళ ఉంటే వారి దగ్గర నుండి రుసుము వసూలు చేసేవారు. దీనివలన రాజుగారికి పైకం (పన్ను) బాగా

వసూలు అయ్యేది. ఒక్కొక్క రోజు రెండు మూడు రోజుల వరకు ప్రవేశము లభించేది కాదు. అనుమతిని ఇచ్చువారు లేరని

చెప్పి ద్వార రక్షకులు వారి దగ్గర నుండి డబ్బు తీసుకునే ప్రయత్నం చేసేవారు. రాజోద్యోగులు లేదా దారోగా లలో ఎవరైనా

తెలిసిన వారు ఉన్నట్ల యితే కోట ప్రవేశం సులభంగా లభించేది. ఈ సమస్యల వల్ల ప్రజలు హైదరాబాద్ కు వెళ్ళి ఉంటారు.

పన్ను కట్టకుండా ఎవరూ తప్పించుకోవటానికి వీలు లేకుండా చేయటం కోసమే అధికారులు కోటలోకి రాకపో కల

విషయంలో జాగ్రత్త లు తీసుకునేవారు.

6. గోలకొండ పట్టణంలో వర్తక , వాణిజ్యాలు ఎలా సాగాయి?(లేదా) “తెలంగాణను ఈజిప్టు వలే ప్రపంచపు అంగడి “ అని

అనటానికి కారణాలను వ్రా యండి.

జ. గోలకొండ పట్టణ వీథుల్లో వజ్రా లు, నగలు, నాణెములు , విలాస వస్తు వులు , తినుబండారాలు లభిస్తా యి. భారతదేశం

నాలుగు మూలాల నుండి వర్తకం సాగేది. విదేశీ వస్తు వులు మచిలీపట్నం ఓడరేవు ద్వారా గోలకొండకు వచ్చేవి. విదేశీ

వ్యాపారులలో డచ్చివారు ముఖ్యమైనవారు. కులీ కుతుబ్ షా కాలంలో తెలంగాణ ఈజిప్టు లా ప్రపంచ అంగడిగా ఉండేది.

తుర్కిస్థా న్ , అరేబియా, పారశీకం వంటి దేశాల నుండి వర్తకులు గోలకొండ నగరానికి వచ్చేవారు.

7. గోలకొండ పాదుషాలు సాహితీ ప్రియులని ఎట్లు చెప్పగలవు?(లేదా) నాటి తెలంగాణలో కూడా తెలుగు భాష ఉచ్చస్థి తిలో

ఉందని ఎట్లా చెప్పగలవు?

జ. గోలకొండ పాదుషాలలో ఇబ్రహీం కుతుబ్షా విద్యాప్రియుడు. ఇతని ఆస్థా నంలో హిందూ, మహామ్మడియ కవులు,

పండితులు ఉన్నారు. అద్దంకి గంగాధర కవి “తపతీ సంవరనోపాఖ్యానము “ అనే కావ్యం రచించి పాదుషాకు అంకితం

చేశాడు. ఈ పాదుషా మరింగంటి నరసింహాచార్య కవికి అగ్రహారములనూ , గజాశ్వములనూ , పల్ల కీనీ , బంగారాన్నీ , పట్టు

వస్త్రా లను బహూకరించారు. ఇబ్రహీం పాదుషా సేనానిఅమీర్ ఖాన్ పొ న్నగంటి తెలగనార్యుడు రచించిన యయాతిచరిత్ర

అనే అచ్చ తెలుగు కావ్యాన్ని అంకితం పొందారు. అబ్దు ల్లా పాదుషా విజ్ఞా న శాస్త్రములను , లలితకళలను , వాజ్ఞ్మయాన్ని

వృద్ధి చేయటానికి ప్రయత్నించారు. అందువల్ల గోలకొండ పాదుషాలు సాహితీ ప్రియులని చెప్పవచ్చు. వీటిని పరిశీలిస్తే నాటి

తెలంగాణలో కూడా తెలుగు భాష ఉచ్చస్థితిలో ఉందని చెప్పవచ్చు. 8. గోలకొండ పాదుషా వారు

జివకారుణ్యం కలవారని , ప్రకృతి ప్రేమికులని ఎలా చెప్పగలవు?


జ. గోలకొండ కోటలో ఉఅత్త ర భాగంలో జింకల వనం ఉంది. ఆ జింకల గుంపును ఎవరూ కొట్టకూడదని , బాధించ కూడదని

రాజాజ్ఞ ఉన్నది. అందువలన పాదుషా వారు జివకారుణ్యం కలవారని , ప్రకృతి ప్రేమికులని చెప్పగలను.

9. ఈనాడు పట్టణాలలో జనాభా అధికమవటం వలన కలిగే ఇబ్బందులు ఏవి?

జ. ప్రజల నివాసానికి ఇళ్ళు , తగిన నీటి వసతి , తగిన ఆహారపదార్థా లు లేవు. మురికి వాడలు అధికమవుతున్నాయి.

చెరువులను, ఖాళీ ప్రదేశాలను మిగల్చకుండా వాటి స్థా నంలో ఇళ్ళు , పరిశ్రమలను నెలకొల్పటంవల్ల భూగర్భజలాలు

అడుగంటిపో తున్నాయి . వర్షం నీరు పో యే మార్గం లేకపో వటంతో ఇళ్ళు మునిగిపో వటమే కాక మురికినీరు ప్రవహించే

దారులు మూసుకుపో తున్నాయి. విద్య, వైద్య , రవాణా సదుపాయాలు కల్పించడం కష్టం అవుతుంది. స్థలాల ధరలు

పెరిగిపో యాయి. పిల్ల ల చదువుల ఖర్చులు ఎక్కువయ్యాయి . మంచి గాలి, నీరు కరువవ్వటమే కాక కాలుష్య భూతపు

కోరలలో చిక్కుకోవటం జరుగుతుంది.

అభ్యాసము : 2

I . క్రింది పదాలను స్వంత వాక్యములలో ఉపయోగించి వ్రా యండి.

1. పుట్టినిల్లు 6. జనసమ్మర్థము

2. పాటుపడటం 7. రాకపో కలు

3. పిడవదలడం 8. పెంపుసొంపులు

4. తలదాచుకోవటం 9. మిరుమిట్లు గొలుపు

5. రూపురేఖలు

II. క్రింది వాక్యములలో ప్రకృతి – వికృతులను గుర్తించండి.

1. గోల్కొండ కోట నిర్మాణ బాధ్యతలను అజంఖాన్ చేపట్టా రు. కోట్టములు మొత్తం మూడు ఉన్నాయి.

2. రాజు ఆజ్ఞా పించగా రాజోద్యోగులు ప్రజల దగ్గర కప్పములు సేకరించేవారు. ప్రజలు కూడా రాజుగారి ఆనను

మీరేవారు కాదు.

3. పట్టణాలలో వర్తక వాణిజ్యాలు ఎక్కువగా జరిగేవి. ప్రజలు పత్త నములలో నివాసమును ఏర్పరుచుకునేవారు.

4. ఉద్యానవనములలో పువ్వులు గుత్తు లుగా ఉండేవి. వాటితో పుష్ప గుచ్చములను తయారుచేసేవారు.

5. సీత రూపము మనోహరంగా ఉంది. ఆ రూపు రేఖలను చూసే యువరాజులు స్వయంవరానికి విచ్చేశారు.

6. ఆనాడు అంతఃపుర స్త్రీలు పల్యంకికలలో ప్రయాణం చేసేవారు. పల్ల కీలను మనుషులు మోసేవారు.

7. ఆనాడు నలుదిశలా వ్యాపారం విస్త రించింది. నలు దెసల నుండి ప్రజలు పట్టణాలకు వలస వచ్చేవారు.

8. జనాభా పెరగటం వలన గృహ నిర్మాణాలు ఎక్కువయ్యాయి. పేదలు తమ నివాసానికి గానూ గీముల నిర్మాణానికి

ప్రభుత్వానికి అర్జీ పెట్టు కున్నారు.


III గోలకొండ పట్టణ అందచందాలు , వైభవం, విశిష్టత గురించి విశ్లేషించండి. (లేదా) గోలకొండ పాఠ్య భాగ సారాంశాన్ని

స్వంత మాటలలో రాయండి.

iv. ఏదైనా ఒక పట్టణం లేదా ఒక ఊరి చారిత్రక / సాంస్కృతిక విశేషాలతో ప్రా జెక్టు చేయండి.

V . మీ రాష్ట్రంలోని వివిధ కోటల చిత్రా లు లేదా మీరు చూసిన కోట / ప్రా చీన గుడి /ఆధారంగా ఒక నివేదికను రాయండి.

భూమిక గూడూరిసీతారాం
ప్రశ్నలు – జవాబులు

1 . కథలకు , కవిత్వానికి గల బేధం ఏమిటి? మీకుఏవంటే ఇష్టం ? ఎందుకు ?

మనిషి జీవితంలోని సంఘటనలను , సన్నివేశములను కథలలో చిత్రిస్తా రు. వాటిలో కొన్ని యథార్థా లు , మరికొన్ని

కల్పితాలు ఉంటాయి. కథలు చదవటానికి ఆసక్తిని, స్పూర్తిని కలిగిస్తా యి. కొన్ని నియమ నిబంధనలు కలిగినది కవిత్వం.

కవిత్వం అందరికీ అర్థం కాదు. కవిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే విషయ పరిజ్ఞా నం చాలా అవసరం. మేమైతే కథలు

చదవటానికే ప్రా ముఖ్యతను ఇస్తా ము. ఎందుకంటే కథల వల్ల మానవ మనస్థత్వం , సంఘర్షణ భిన్న సంస్కృతులు మనకు

తెలుస్తా యి.

2. నాటి హైదరాబాదు రాజ్యంలో హక్కుల కోసం, స్వాతంత్ర్యం కోసం ప్రజలు ఎందుకు ఉద్యమించి ఉండవచ్చు?

జ. నాటి హైదరాబాద్ రాష్ట్రా న్ని నిజాం పరిపాలించేవారు. ఆయన రాజ్యంలో ప్రజలు స్వస్థా న , వేష భాషాభిమానాలకు

దూరమయ్యారు. నిజాం నిరంకుశ పరిపాలనలో పటేల్ , పట్వారీలు పెత్త నం సాగించేవారు. రైతులను పన్నుల పేరుతొ

వేధించేవారు. హిందువులను చిన్నచూపు చూసేవారు. ఇస్లాం పద్ధతులను , అలవాట్ల ను హిందువులపై రుద్దటానికి

ప్రయత్నించేవారు. నిజాం రాజు అధీనంలో ఉన్న ఖాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లు తెలంగాణ పల్లె ల్లో బీభత్సాన్ని

సృష్టించారు. గృహదహనాలు , లూటీలతో తెలంగాణ ప్రజలను భయ భ్రాంతులకు గురిచేశారు. ప్రజల స్వేచ్చ పూర్తిగా

హరించబడినది. సభలు, సమావేశాలకు అనుమతిని ఇచ్చేవారు కాదు. అటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న

ప్రజలు ఉద్యమం వైపు చూపు సారించారు.

3. జీవభాష అంటే ఏమిటి? జీవభాషను కథల్లో చిత్రించటం అంటే ఏమిటి?

జ. జీవభాష అంటే ప్రజలు నిత్య వ్యవహారంలో ఉపయోగించే భాష. దీనినే మనం వ్యవహారిక భాష అని అంటాము. ప్రజలు

ఇంట బయట ఒకరితో ఒకరు మాట్లా డే భాష జీవభాష. ఈ భాషను మాట్లా డితే హృదయానికి హత్తు కున్నట్లు గా ఉంటుంది.

కాబట్టి కథలలోని వివిధ పాత్రలు వ్యవహారిక భాషలలో మాట్లా డే విధంగా రాయటాన్నే జీవభాషను కథలలో చిత్రించటం

అని అంటారు.

4. చార్ మినార్ కథలను ఎందుకు చదవాలి?

జ. నెల్లూ రి కేశవస్వామి రాసిన చార్ మినార్ కథల్లో నవాబులు , దేవిడీలు , మహబూబ్ కి మెహింది, కోఠీలు , దివాన్ ఖాన్

లు , జనానాఖానాలు, బేగం సాహేబులు, దుల్హన్ పాషాలు , షాన్ దాన్ , పరాటా కీమా , దాల్చా నమాజులు , పరదాల
వెనుక జీవితంలోని సంస్కృతీ, లక్నో సంఘటనలు, ఆవద్ , డిల్లీ లలోని ముస్లిం రాజులు-ప్రజల జీవితాలు , అవిభక్త

ఇండియాలోని పాకిస్థా న్ , బంగ్లా దేశ్ ప్రాంతాల సంస్కృతిని గుర్తు కు తెస్తా యి. అంతర్జా తీయ సంస్కృతిని , మధ్య ఆసియా

ముస్లిం దేశాల సంస్కృతిని గుర్తు కు తెస్తా యి. అంతర్జా తీయ సంస్కృతీ జీవన విధానం హైదరాబాద్ రాజ్యంలో నిర్దిష్టంగా

ఎలా ఉండేదో తెలుసుకోవటానికి చార్ మినార్ కథలను చదవాలి.

5 . రెండు మతాల్ మధ్య ఆలోచనలు , సంస్కృతిలో ఆదాన ప్రదానాలు జరగటం అంటే ఏమిటి?

జ. 11 వ శతాబ్దం నుండి ఇండియాలో సాగిన ముస్లింల వలసలు , రాజ్యాలు – పరిపాలనా విధానాలు , జీవన విధానం ,

భారతీయ ప్రజలలో చెరగని ముద్ర వేసి ఇక్కడి సంస్కృతిలో అంతర్భాగం అయ్యాయి. హిందూ , ముస్లిం మతాల మధ్య

ఆలోచనలు, సంస్కృతీ , జీవితం, ఇచ్చిపుచ్చుకోవటం లాంటి విషయాలలో మార్పులు సంభావించటాన్నే ఆదాన ప్రదానాలు

జరగటం అని అంటారు.

6. నెల్లూ రి కేశవస్వామి హృదయం చార్ మినార్ కథల్లో ప్రతిబింబింస్తుంద ని మీరెలా చెప్పగలరు?

జ. కొన్ని అసాంఘిక శక్తు లు హైదరాబాద్ పాత నగరంలో హిందూ,ముస్లిం సంఘర్షణల పేరిట అపార్థా లు సృష్టించి

మారణకాండలు జరిపాయి. సో షలిస్టు భావాలు కలిగిన నెల్లూ రి కేశవస్వామిఈ సంఘటనలకు చలించి ఎన్నో నిద్ర లేని

రాత్రు లు గడిపారు. రాజకీయాల కోసం మానవ సంబంధాలు, మమతలు, మతాలు , కులాతీత స్నేహాలు , ఆత్మీయతలు

బలికావద్దని భావించారు. హిందూ , ముస్లింల సఖ్యత కోసం చార్ మినార్ కథలు రాశారు.

7. తెలంగాణ పలుకుబడులు అంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు రాయండి.

జ. పలుకుబడి అంటే నుడికారం . పలుకుబడులు, జాతీయాలు సామెతలు భాషకు హృదయం లాంటివి. తెలంగాణ

పలుకుబడులు అంటే తెలంగాణలో పల్లె ఒరజలు మాట్లా డుకునే అచ్చతెలుగు అని అర్థం. ఉదాహరణకు తాతా| ఇగాపటు

నీ పాను జర్దా డబ్బీ , ఈ వానలకూ , వోరదలకు ఏర్లు పొంగంగ ఎన్ని కయ్యలు గొట్టిందో , ఎన్ని గండ్లు వడ్డ దో , ఇదంత

నాకు తెల్సిన బాటనే | ఎన్నేండ్ల నుంచో తొక్కుడు వడ్డ బాట . గజ్జె ల సప్పుడు ఇని ఆ సుట్టు పక్కల పిల్ల లంత

ఉరుక్కుంటొచ్చి సుట్టు జుట్టు కున్నరు .

8. తెలంగాణ కథ పుట్టు క నుండి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది” అనే వాక్యం ద్వారా మీకేమి

అర్థమయిందో వివరించండి.

జ. తెలంగాణలో కథారచన 1902 లో మొదలైంది. బండారు అచ్చమాంబను తొలి కధకురాలుగా చరిత్ర స్పష్టం చేసింది.

అయితే తెలంగాణ కథలో పో రాటాలు , ఉద్యమాలు భాగమయ్యాయి. సమాజ పరిశీలన విశ్లేషణ, మానసిక చిత్రణ ,

సామాజిక పరిణామాలు , ఫ్యూడల్ సమాజం, ప్రజాస్వామిక స్వేచ్చా వాయువులు , తెలంగాణ పలుకుబడులు , గ్రా మీణ

కులవృత్తు లు , సంస్కృతి , గ్రా మీణ జీవితం , ఉర్దూ మీడియం పో యి తెలుగు మీడియం రావటం , ప్రజాస్వామిక

ఉద్యమాలు , రాజకీయ పరిణామాలు మొదలైనవి తెలంగాణ కథల్లో మొదటి నుండి అనేక కోణాల్లో చిత్రించబడ్డా యి.

అందువల్ల తెలంగాణ కథ పుట్టు క నుండి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది అని అర్థమైంది .
9. అన్నం మెతుకును చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పవచ్చు . అట్లే పుస్త క పరిచయ వ్యాసాన్ని లేదా సమీక్షను

చదివితే కూడా ఆ పుస్త కం గురించి ఆములాగ్రముగా అర్థం చేసుకోవచ్చు. ఎలాగో వివరించండి.

జ. ఒక పుస్త కం యొక్క ఆశయాన్ని, అంతస్సారాన్నీ , తత్త్వమునూ , రచయిత దృక్పథాన్నీ , ప్రచురణ కర్త

వ్యయప్రయాసలనూ – పుస్త క పరిచయ వ్యాసం పాఠకులకు తెలియపరుస్తుంది. ఈ గ్రంథము యొక్క నెపథ్యాన్నీ,

లక్ష్యాలనూ పుస్త క పరిచయ కర్త మనకు పరిచయం చేస్తా డు. ఆ పుస్త కంలో రచయిత వివరించిన విషయం , మంచి

చెడులు పుస్త క పరిచయ కర్త సమీక్షిస్తా రు. పుస్త క రచయిత రచనా విధానంలోని మెలకువలను , భాషా కౌశలమునూ

పరిచయ కర్త ద్వారా తెలుసుకుంటాము. ముఖ్య విషయాలను రేఖామాత్రంగా సమీక్షకుడు తెలియపరుస్తా డు. ఆ పుస్త కం

ద్వారా మనం ఏ విషయాలు తెలుసుకోగలమో , ఇంకా ఏ విషయాలు తెలిపితే బాగుంటుందో పుస్త క పరిచయాలలో

రాయబడుతుంది. కాబట్టి పుస్త క పరిచయ వ్యాసం ఆ గ్రంథాన్ని మనకు పరిచయం చేస్తుంది. పుస్త క పరిచయం చదివితే ఆ

పుస్త కం గురించి ఆమూలాగ్రంగా కాకపో యినా, రేఖా మాత్రంగా నైనా ఆ పుస్త కాన్ని గురించి తెలుసుకోవచ్చు.

10. కేశవస్వామి కవులను గురించి గూడూరి సీతారాం రాసిన వ్యాసం ఆధారంగా కేశవస్వామి రచనలను గురించి

రాయండి.

జ. కేశవస్వామి కథలను గురించి గూడూరి సీతారాం రాసిన వ్యాసం ఆధారంగా కేశవస్వామి రచనలను గురించి రాయండి.

జ. . కేశవస్వామి సుప్రసిద్ధ కథా రచయిత. ఆయన రాసిన కొన్ని కథలు నేడు లభించటం లేదు. ఈయన తన కథలను

కొన్ని సంపుటాలుగా వెలువరించారు. ఈయన తొలి కథల సంపుటి” పసిడిబొ మ్మ”. ఇది 1969 లో వెలువడింది. ఈ

సంపుటిని భాస్కరభట్ల కృష్ణా రావుగారికి అంకితం ఇచ్చారు. ఈయన రెండవ కథా సంపుటం “చార్ మినార్“కథలు . ఇవి

ఉహించి రాసిన కథలు కావు. సమాజంలో జరిగిన మార్పులను కథలుగా రాసిన సామాజిక రచన . ఈ కథలలో

హైదరాబాద్ సంస్కృతీ , మానవ సంబంధాలు, ముస్లింల జీవితాలను అపూర్వంగా చిత్రించారు. ఇందులో మొత్తం పదకొండు

కథలు. హైదరాబాద్ నగరం కాస్మోపాలిటిన్ నగరంగా ఎదిగింది. మరో కథ “యుగాంతం”. ఇందులో హైదరాబాద్ రాజ్యంలోని

పరిణామాలను ఒక చారిత్రిక డాక్యుమెంటుగా రాశారు. యుగాంతం కథ ద్వారా కేశవస్వామి భారతదేశం గర్వించదగ్గ

కథకులలో ఒకరుగా అయ్యారు. చార్ మినార్ కథల్లో కేశవస్వామి హృదయం ఉంది. “రుహి ఆపా “కథలో గొప్ప మానవీయ

బంధాలను , కులమతాలకు అతీతంగా స్పందించిన మనిషినీ చిత్రించారు. ముస్లిం నవాబులలో ఉన్న హృదయ

సంస్కారాన్ని చక్కగా ఆవిష్కరించారు.” వంశాంకురం “ అనే కథ ద్వారా ముస్లింల పెళ్ళి సంబంధాలు ఎలా ఉంటాయో

తేలియచేశారు. “భరోసా” అనే కథలో పేదల నమ్మకాలు ఎలా ఉంటాయో వివరించారు. కేశవస్వామి గారు హిందీ

రచయితలైన ప్రేమ్ చంద్ , కిషన్ చందర్ లతో పో ల్చదగిన గొప్ప కథా రచయిత.

అభ్యాసము – 3

I . శార్దూ లముపద్యపాదమును రాసి గణ విభజన చేసి, గణాలను గుర్తించండి. లక్షణములను రాయండి.


II . మత్తే భము పద్యపాదమును రాసి గణ విభజన చేసి, గణాలను గుర్తించండి. లక్షణములను రాయండి.

III . ఉపమ, అతిశయోక్తి అలంకారముల లక్షణములను రాసి ఉదాహరణలను రాయండి.

IV. ద్విరుక్త, గసడదవాదేశ సందుల సూత్రములను రాసి లక్షణములను వ్రా యుము.

V . ఒక కథను చదివి ఆ కథకు సమీక్షను రాయండి.

పద్యభాగం - 7. శతక మధురిమ - వివిధ కవులు

ఒకటవ పద్యం - ప్రతిపదార్థము

సర్వేశ్వరా - ఓ సర్వేశ్వరా | పూజలన్ - పూజలను

భవదీయ + అర్చన - నీ యొక్క పూజ మదిన్ - నీ మనస్సులో

చేయుచోన్ - చేయునప్పుడు కైకోవు - అంగీకరించవు

ఎన్నన్ - పరిగణింపగా
రెండవ పద్యం – ప్రతి పదార్ధం
సత్యంబు - సత్యం
శ్రీ కాళహస్తి + ఈశ్వరా -కాళహస్తి లో వెలసిన ఈశ్వరా
ప్రథమ - మొదటి
ఊరు + ఊరన్ - ప్రతి గ్రా మంలోనూ
పుష్పంబు - పూవు
జనులు + ఎల్ల న్ - ప్రజలందరూ
దయ + గుణంబు - దయ అనే గుణం
భిక్షము + ఇడరు + ఓ - అడిగితే భిక్షం పెట్టరా ?
రెండవ పుష్పంబు - రెండవ పూవు
ఉండన్ - నివసించడానికి
అతి - మిక్కిలి
గుహల్ - గుహలు
విశిష్టంబు - విశిష్టమైన
కల్గ వు + ఓ - లేవా ?
ఏక నిష్ఠా - ఏకాగ్ర నిష్ఠ తో కూడిన
చీర + ఆనీకము - వస్త్రా ల సముదాయం
సమ+ఉత్సవ+సంపత్తి - అధికమైన ఆనందం
వీథులన్ - వీథుల్లో
మూడవ పుష్పం - మూడవ పుష్పం
దొరకదు + ఓ - దొరకదా ?
అది - ఆ పూజ
శీత - చల్ల ని
భక్తి సంయుక్తి - భక్తితో కూడి
అమృత - అమృతం వంటి
భాస్వత్ - ప్రకాశించే
స్వచ్ఛ - నిర్మలమైన
యోగ విధానంబు - యోగ విధానం కలది
వాః పూరంబు - నీటి ప్రవాహం
అవి - ఈ మూడు పుష్పములు (సత్యము , దయ,
ఏరులన్ - సెలయేరులలో
ఏకాగ్రత )
పారదు + ఓ - ప్రవహించుట లేదా ?
లేని - లేనటువంటి
తపసులను - మునులను
ప్రో వంగాన్ - కాపాడటానికి లేక + ఐనన్ - లేకపో యినా

నీవు - నీవు విభూషితుండు + ఎ - అలంకరింపబడినవాడై

ఓపవు + ఓ - సమర్థు డవు కావా ? అయి - అయ్యి

జనుల్ - ప్రజలు భాసిల్లు న్ - ప్రకాశిస్తా డు.

రాజులన్ - రాజులను
నాల్గ వ పద్యము – ప్రతిపదార్థము
చేరన్ - ఆశ్రయించటానికి
దాశరథీ - దశరథుని
పో వుదురు + ఏల - ఎందుకు వెళతారో
కుమారుడైన శ్రీరాముడా |
మూడవ పద్యం ప్రతిపదార్థము
కరుణా పయోనిథి - దయా సముద్రు డవు
సురభిమల్లా | - ఓ సురభిమల్లా భూపాలుడా |
భండన - యుద్ధరంగంలో
నీతి వాచస్పతి - నీతి శాస్త్రంలో దేవతల గురువైన
భీముడు -శత్రు వులకు భయంకరుడవని
బృహస్పతి వంటి వాడా|
ఆర్తజన -దుఃఖం పొందే వారి పాలిట
ఔదలన్ - శిరస్సుతో
బాంధవుడవు - బందువువని
గురుపాద - గురువు పాదాలకు
ఉజ్వల - కాంతివంతమైన
ఆనతి - నమస్కరించటమూ
బాణ - బాణములను
కేలన్ + ఈగి -చేతియందు దానగుణమూ
తూణ - అమ్ములపొ దిని
చేవులందు - చెవులయందు
కోదండ కళా - కోదండమును ఉపయోగించే నేర్పులో
విన్కి - శాస్త్రములు వినటం
ప్రచండ - మిక్కిలి తీవ్రమైన
వక్త్రంబునన్ - ముఖమునందు
భుజ - బాహువుల యొక్క
స్థి ర - స్థి రమైన
తాండవ - పరాక్రమం
సత్య + ఉక్తి - సత్యమైన వాక్కును
కీర్తికిన్ - కీర్తి కలిగిన
భుజంబులన్ - భుజములందు
రామమూర్తికిన్ - నీకు
విజయమున్ - విజయమునూ
రెండవ సాటి దైవము -సాటివచ్చే మరో దేవుడు
చిత్తంబునన్ - మనస్సునందు
ఇకన్ - ఇక
సత్ - మంచిని
లేడు - లేడు
మనోహర - ఆకట్టు కునే
అనుచున్ - అని చెప్తూ
సౌజన్యము - మంచితనమూ
గడగట్టి - స్తంభాన్ని నాటి
కల్గినన్ - కలిగి ఉన్నట్ల యితే
భేరికా - భేరీ వాద్యము యొక్క
బుధుండు - -పండితుడు
దాండ , దదాండ , దాండ - డాం డాం డాం అనే
సిరి - సంపదలు
నినదంబులు - నినాదాలు ఘనుడు + అగున్ గొప్పవాడు అవుతాడు

అజాండంబు - భూమండలమంతా
ఏడవ పద్యం – ప్రతిపదార్థము
నిండన్ - వినపడేటట్లు
శ్రీ - కీర్తిగల
మత్త వేదండమున్ - మదించిన ఏనుగును
లొంక - లొంక అనే క్షేత్రంలో వెలసిన
ఎక్కి - అధిరోహించి
రామేశ్వరా - రామేశ్వరా|
చాటెదన్ - చాటుతాను
మితృడు - స్నేహితుడు

ఆరవ పద్యం – ప్రతిపదార్థము పొ త్తంబు + ఐ - పుస్త కమై

విశ్వనాధ + ఈశ్వరా - విశ్వనాథేశ్వరా కడున్ - మిక్కిలి

నేడు - ఈనాడు నేర్పుతో - నైపుణ్యంతో

త్యాగమయి -త్యాగంతో కూడిన హితమున్ - మంచిని

దీక్షన్ - దీక్షను ఉద్భోదించు - బో ధిస్తా డు

పూని - వహించి ఒక కార్యసాధనమునకున్ - ఒక పనిని

సర్వం సహా - లోకంలోని సాధించటానికి

జన దైన్య స్థి తిని -ప్రజల దీన స్థి తిని మితృడు - స్నేహితుడు

పో న్ + అదయించి - రూపుమాపి సంవిత్తంబు + ఐ -విలువైన ధనమై

సకల - సమస్త మైన వెల్గు + ఒందున్ - ప్రకాశించును

ఆశ పేశల + ఆనంద - కోరికలు తీరిన స్వాయత్తంబు + ఐనా - స్వాధీనమైన

ఆనందమైన సంతోషంతో కృపాణము + ఐ - కత్తి వంటి వాడై

జీవన - బతుకులోని అరులన్ - శతృవులను

సంరంభమున్ - ఉత్సాహాన్ని ఆహారించున్ - ఆరగిస్తా డు

పెంచి - పెంపు చేసి మితృడు - స్నేహితుడు

దేశ జననీ - మాతృ దేశపు తగన్ - తగినవిధంగా

ప్రా శస్త్యమున్ - గొప్పతనమును ప్ర + ఉత్ + చిత్తంబు + ఐ - నిండైనమనస్సు కలవాడై

పంచునో - విశదపరుస్తా డో సుఖము - సుఖాన్ని

ఆ + వాడు - అటువంటివాడే ఇచ్చున్ - ఇస్తా డు

ప్రశ్నలు – జవాబులు
1 . శతక ప్రక్రియ శతాబ్దా ల నుండి కొనసాగుతూనే ఉన్నది. పాఠంలోని శతక పద్యాల భయాలు నేటి కాలానికి కూడా

తోడ్పడవచ్చు అని భావిస్తు న్నారా? ఎందుకు? చర్చించండి?

లేదా

శతక పద్యాలలోని నీతులు నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడతాయో విశ్లేషించి రాయండి.

జ. శతకం అంటే వంద . వందకు పైగా పద్యాలు కలిగిన దానిని శతకం అంటారు. తెలుగులో వృషాధిపశతకం

మొట్టమొదటిది. దీనిని పాల్కురికి సో మన 13 వ శతాబ్ది లో రచించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో మంది కవులు

శతకాలు రాశారు. రాస్తు న్నారు. శతకాలలోని నీతి , రీతి సర్వకాల సర్వావస్థల యందు ఉపయోగపడతాయి. 1..

ఈశ్వరుని పూజకు సత్యం, దయ, ఏకాగ్రత , యోగం అనేవి ముఖ్యమని శతకకర్త చెప్పారు. ఈశ్వరుని పూజకే కాదు. ఏ

విషయంలోనైనా పై లక్షణాలు ఉంటే విజయం సాధించవచ్చు. కాబట్టి ఈ పద్య భావం ఏ కాలానికైనా వర్తిస్తుంది.

2 . గురువును గౌరవించేవారు , దాన గుణం కలిగినవారు, భుజబలంతో విజయాన్ని సాధించేవారు , మంచి మనస్సు గల

పండితులు సంపద లేకపో యినా ప్రకాశిస్తా డు. ఈ లక్షణాలున్న వారు ఏనాటి కాలంలోనైనా రాణిస్తా రు.

3. జనుల దీనస్థి తిని రూపు మాపి , అందరికీ ఆనందమైన జీవితాన్ని పంచి మాతృదేశ గొప్పతనాన్ని వ్యాపింప చేసినవారే

గొప్పవారు అవుతారని ఒక శతకకారుడు తేలియచేశారు. ఈ విషయాలు ఇప్పటికీ వర్తిస్తా యి..

4. మంచి మితృడు మంచి పుస్త కం మాదిరిగా సహకరిస్తా డనే నీతిని తెలుసుకోవటం ఇప్పటికీ అవసరమే .

5. మానవ రూపంలో రాక్షసులు ఎలా ఉంటారో శతకకర్త చెప్పారు. ఆ లక్షణాలు తెలుసుకుంటే వాటికి దూరంగా ఉండి,

మానవత్వం ఉన్న మంచివాళ్ళుగా మారటానికి దో హదపడుతుంది కాబట్టి ఈ విషయాలన్నీ నేటి కాలానికి కూడా

అన్వయించుకొని ప్రయోజనాలు పొందవచ్చు .

2. మీ దృష్టిలో అపూర్వ కీర్తివంతుడంటే ఎలా ఉండాలి?

జ. తనకున్న దాంట్లో కొంత దానం చేయటం సాధారణమైన విషయం. అది అందరూ చేస్తా రు. కానీ తన దగ్గర ఉన్నదంతా

ఇతరులకు దానం ఇవ్వడం చాలా గొప్ప. అటువంటి వారు అరుదుగా ఉంటారు. సక్తు ప్రస్థు డు కూడా అలాంటివాడే.

ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలాకాలం క్రితము సక్తు ప్రస్థు డు అనే గృహ యజమాని ఉండేవాడు. ఆయనిది ఉమ్మడి

కుటుంబం . వీరు ఎవరికీ హాని చేయకుండా ఏ పూటకు ఆ పూట దొరికిన దానిని తిని తృప్తి గా జీవితాన్ని గడిపేవారు. వారు

కేవలం జీవించటం కోసం మాత్రమే ఆహారాన్ని భుజించేవారు. ఒకరోజు వారు తమ పరిసర ప్రాంతాల చేలలో తిరిగి అక్కడ

రాలిన ధాన్యపు గింజలను ఏరి తెచ్చుకొని దంచి పిండి చేసి వండుకొని సమంగా నలుగురూ పంచుకొని భుజించటానికి

కూర్చున్నారు. అదే సమయంలో ఎముకల గూడులా ఉన్న శరీరంతో ఒక ముసలివాడు తనకు ఆకలిగా ఉన్నది అంటూ

వచ్చాడు. వెంటనే సక్తు ప్రస్థు డు తన వంతు ఆహారాన్ని ఆ ముసలివానికి పెట్టా డు. అయినా ఆయన ఆకలి తీరలేదు.

సక్తు ప్రస్థు ని భార్య , కొడుకు , కోడలు కూడా తమ ఆహారాన్ని అతనికి ఇచ్చారు. ఆయన ఎంతో తృప్తి గా ఆ ఆహారాన్ని

భుజించారు. తన ఆకలిని తీర్చినందుకు మనస్పూర్తిగా ఆ ముసలివాడు వారిని దీవించాడు. తత్ఫలితంగా వదాన్య


శీలుడైన సక్తు ప్రస్థు డు సకుటుంబ సమేతంగా స్వత్గా నికి వెళతాడు. తాము తినకున్నా ముసలివాని ఆకలిని తీర్చటం

సక్తు ప్రస్థు ని కుటుంబంలోని వారికున్న గొప్ప లక్షణం .అందుకే మా దృష్టిలో సక్తు ప్రస్తు డే అపూర్వమైన కీర్తిమంతుడు .

3. నిజమైన త్యాగి ఎవరు? అతని లక్షణాలు ఎలా ఉంటాయి?

జ. తమ సుఖ సంతోషాలు చూసుకోకుండా దేశం కోసం, తన చుట్టూ ఉన్న ప్రజల కోసం తన సర్వస్వాన్ని ధారపో సేవాడే

నిజమైన త్యాగి. ప్రపంచంలో ఏ దేశంలోనూ జన్మించనంత త్యాగధనులు మన దేశంలో జన్మించారు. దాదాపుగా

రెండువందల సంవత్సరాలు భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ వారిని మన దేశం నుండి వెళ్ళగొట్టటం కోసం ఎంతోమంది

స్వాతంత్ర్య సమరయోధులు తమ ధన, మాన , ప్రా ణాలను త్యజించారు. అటువంటి వారిలో గాంధీ, నెహ్రూ , సుభాష్

చంద్రబో స్ మొదలైన వారు ముఖ్యులు. వారంతా తమ చదువులను, ఉద్యోగాలను వదులుకొని స్వచ్చందంగా

స్వాతంత్రో ద్యమంలో పాల్గొ న్నారు. తాము సంపాదించిన సంపదనంతా స్వాతంత్రో ద్యమానికే ఖర్చు చేశారు. చివరకు తమ

ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా అహరహం దేశంకోసం శ్రమించారు. ఉద్యమం కోసం తమను తాము సమిథలుగా

ఆహుతి చేసుకున్నారు. ఈ విధంగా దేశం కోసం తమ సర్వస్వాన్ని ధారపో సే వారే నిజమైన త్యాగధనుల

4. మితృడు మంచి పుస్త కం వలె మంచి దారి చూపుతాడని ఎలా చెప్పగలవు?

జ. భారత, భాగవత, రామాయణాలు, శతకాలు, నీతికథలు మొదలైనవన్నీ మంచి పుస్త కాలే. వాటిలో నీతి , ధర్మం , మంచి,

చెడు, లోకం పో కడ మొదలైన అనేక విషయాలున్నాయి. వీటిలో మానవులు ఎలా ప్రవర్తించాలో , ఎలా ప్రవర్తించకూడదో

ఎంతో వివరంగా చెప్పబడింది. సమస్యలు కల్గినప్పుడు వాటిని ఎలా పరిష్కరించుకోవాలో , కష్టా లు కల్గినప్పుడు ఎలాంటి

పనులు చేయాలో , అన్నదమ్ములు ఎలా ఉండాలో, భార్యాభర్తల అనుబంధం ఎంత గొప్పదో , మితృడు అంటే ఎలా ఉండాలో

మొదలైన ఎన్నో విషయాలు తెలుస్తా యి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పుస్త కాలు మొత్తం ప్రపంచాన్ని చూపించే అద్దం

లాంటివి. కాబట్టి మితృడు కూడా మంచి పుస్త కం లాగే మంచి దారి చూపుతాడని చెప్పవచ్చు.

5. పూజకు పుష్పం, సత్యం, దయ, ఏకాగ్రత అవసరమని శతక పద్యం ద్వారా తెలుసుకున్నాము కదా| మరి చదువు

విషయంలో ఏవేవి అవసరమనుకుంటున్నారు ?

జ. పూజకు పుష్పం, సత్యం, దయ, ఏకాగ్రత వలె చదువుకు విజ్ఞా నం అవసరం. విజ్ఞా ని అయిన గురువు ముఖ్యం .

గురువు బో ధించే సూక్ష్మ విషయాలను గ్రహించి , అనేక పుస్త కాలు చదివి దానికి సంబంధించిన విషయాలను ఆమూలాగ్రం

తెలుసుకోవాలి. నేర్చుకున్న అంశాలను అభ్యాసం ద్వారా గుర్తుంచుకోవాలి . ఏకాగ్రత , నిరంతర పఠనం ద్వారా చదువు

రాణిస్తుంది. కృషి, పట్టు దలతో చదవాలి. చదువుకునే వారికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఉండాలి.

దీనివల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. చదివిన విషయాలు భాగా గుర్తుండిపో తాయి. ఈ విధంగా చదువుకు జిజ్ఞా స,

విజ్ఞా ని అయిన గురువు , ఏకాగ్రత, కృషి , పట్టు దల , నిరంతర గ్రంథపఠనం, అభ్యాసం మొదలైనవన్నీ అవసరమనుకుంటు

న్నాను.

అభ్యాసము – 4
ప్రా జెక్టు పని ( నియోజనం)

6 నుండి 10 వ తరగతి వరకు చదువుకున్న శతకాల పేర్లు , శతక కవుల వివరాలు క్రింది పట్టికలో రాయండి. కంఠంస్థం

చేసిన పద్యం ప్రథమ పాదమును రాయండి

క్రమ సంఖ్య శతకం పేరు కవి పేరు కాలం పద్య ప్రథమ పాదం

1 . రాముని గొప్పదనాన్ని ఏ విధంగా చాటిచేప్పవచ్చు ?

2 . మోసం ఎందుకు చేయకూడదు?

3. నరరూప రాక్షసులు అంటే ఎవరు?

4. ప్రజలు రాజును ఆశ్రయించవచ్చా? ఎందుకు?

5. అర్తాంతరన్యాసాలంకారము , క్రమాలంకారముల యొక్క లక్షణములను రాసి ఉదాహరణలను రాయండి.

6. ఒక పద్యం ఆధారంగా నీతి కథను రాయండి. కథకు తగిన చిత్రా లను సేకరించి అతికించండి.

9 . జీవన భాష్యం – సి. నారాయణరెడ్డి


ప్రశ్నలు – జవాబులు

1 . “మనసుకు మబ్బు ముసరడం “ అనటంలో అర్థమేమిటి?

జ. “మనసుకు మబ్బు ముసరడం “ అంటే మనసుకు ఆందోళనలు , బాధలు , చింతలు, దిగులు కలగటం అని అర్థం .

నీటితో నిండిన మబ్బులు తేమతో బరువేక్కితే వర్షంగా భూమిపై కురుస్తుంది. అలాగే మనసును ఆందోళనలు , బాధలు ,

చింతలు, దిగులు కమ్ముకుంటే దుఃఖ స్థితి కలిగి అది కన్నీరు గా మారుతుంది.

2. “జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది “ అని అనటాన్ని మీరెలా సమర్థిస్తా రు?

జ. ఒక లక్ష్యాన్ని సాధించటానికి బయలుదేరినప్పుడు అడుగడుగునా ఎన్నో కష్టా లు , అడ్డంకులు ఎదురవుతాయని లోకం

భయపెడుతుంది.నిరుత్సాహ పడకుండా ముందుకు నడిస్తే విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తే నలుగురూ అనుసరించే దారిగా

మారుతుంది.దీనిని మనస్ఫూర్తిగా సమర్థిస్తా ను.

3. మనిషి , మృగము ఒకటేనా? కాదా ? చర్చించండి.


జ. మనిషి , మృగము ఎప్పటికీ ఒకటి కాదు. మనిషికి ఆలోచనా శక్తి ఉంది. మృగానికి ఆలోచనా శక్తి లేదు. మనిషి

సంఘజీవి. నలుగురూ కలసి పరస్పర సహకారంతో జీవించటమే సాంఘిక జీవనం . అందుకే సాటి మనుషుల పట్ల

సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి. అప్పడే అందరూ కలసి మెలసి ఆనందంగా జీవించగల్గు తారు.

4. హిమగిరి శిరసు మాడటం అంటే మీకేమి అర్థమయ్యింది ?

జ. హిమగిరి శిరసు మాడటం అంటే హిమాలయ శిఖరం ఎండకు వేడెక్కటం అని అర్థం. ఉన్నతమైన హిమాలయ పర్వత

శిఖరం ఎండకు కరిగిపో యి నదిగా ప్రవహిస్తుంది. అలాగే ఎంత సామర్థ్యమున్నా , అధికారం ఉన్నా, సంపదలున్నా, ఎన్నో

విజయాలు సాధించినా ఏ కష్టా లూ , బాధలూ రావని ధీమాగా ఉండలేము. విధి ఎప్పుడు ఏ కష్టా లు కలిగిస్తుందో , ఏ

సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరు . దాని శక్తి ముందు తలవంచవలసిందే . ఎండకు హిమాలయ

శిఖరం వేడెక్కి నీరుగా మారినట్లు , ఎంతటి మనిషికైనా గర్వం నీరు కారిపో వలసిందేనని కవి భావన.

5. “చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. అని అనటాన్ని మీరు సమర్థిస్తా రా ? ఎలా?

జ స్వాతంత్ర్య సమరయోధులు , మహాత్ములు ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేశారు. చరిత్రలో నిలిచిపో యారు.అలాగే

ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రా మ సమయంలో కర్ణు డు తన సహజ కవచ కుండలములను దానం చేసి దాన కర్ణు డిగా

శాశ్వతమైన పేరును పొందారు. అందుకే చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది అని కవి రాసిన వాక్యాన్ని

సమర్థిస్తా ను.

6 . “జీవనభాష్యం” అనే శీర్షిక ఈ గజల్ కు ఏ మేరకు సరిపో యింది ? ఎందుకో చెప్పండి?

జ. భాష్యం అంటే వ్యాఖ్యానం అని అర్థం. “జీవనభాష్యం” అంటే జీవితాన్ని వ్యాఖ్యానించటం – అని అర్థం. సి.నా.ర్ జీవితాన్ని

గురించి బాగా విశ్లేషించారు . మనసుకు భాద కలిగితే దుఃఖము కలుగుతుందనీ , అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా

ఎదుర్కొని లక్ష్యాన్ని చేరుకోవాలనీ , సాటి మనుషుల పట్ల సానుభూతి ఉండాలనీ , ఎంతటి ఉన్నత స్థా నంలో ఉన్నా గర్వం

పనికిరాదనీ , త్యాగాలు చేస్తే మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుందనీ వివరించారు. ఎన్నో జీవిత సత్యాలను

తెలపటం వల్ల “జీవనభాష్యం” అనే శీర్షిక ఈ గజల్ కు సరిపో యింది.

7. గజల్ ప్రక్రియను గురించి తెలుసుకున్నారు. మీకు తెలిసిన నాలుగు సాహిత్య ప్రక్రియల పేర్లు తెలిపి వాటి గురించి

తెలియచేయండి.

జ. కథానిక : వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్ని , సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. ఇది

వచన ప్రక్రియ. క్లు ప్త త దీని లక్ష్యం. పాత్రలు, కథనమూ , వాస్త విక చిత్రణ మొదలైనవి కథానిక రచనలో భాగాలు.

శతకం: వంద పద్యాలకు పైగా కలిగిన రచనను శతకం అని అంటారు. శతకాలలోని పద్యాలను ముక్తకాలు అని అంటారు.

ముక్తక పద్యం దేనికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. శతకాల్లో మకుటం సాధారణంగా పద్యపాదం చివర ఉంటుంది. మకుట

రహితంగా కూడా కొన్ని శతకాలు ఉన్నాయి.

వ్యాసం: వచన రూపంలో ఉంటుంది. ఏదైనా ఒక అంశమును గురించి సంగ్రహంగా , పాఠకులను ఆకట్టు కునే విధంగా

వ్యాసం ఉంటుంది. సూటిగా, స్పష్టంగా, నిర్థిష్టంగా , సులభంగా అర్థమయ్యే విధంగా ఉంటుంది.


మినీ కవిత : ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో , వ్యంగ్యంగా , చురకలతో , తక్కువ పంక్తు ల్లో చెప్పటాన్ని మినీ కవిత

అని అంటారు.

9 . ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు - అనే వాక్యం ద్వారా విద్యార్థు లకు సి.నా.రె ఇచ్చే సందేశం ఏమై

ఉండవచ్చు?

జ. ఎడారి దిబ్బలు అంటే బీడు పడి , పనికి రాకుండా ఉన్న నేల అని అర్థం . అటువంటి బీడు భూమిలో ఏ ప్రయత్నాలు

లేకుండా ఏ పంటలూ పండవని నిరాశపడవద్దు . కష్టపడి ఆ నేలను దున్ని విశ్వాసంతో విత్త నాలు నాటితే మంచి పంటలు

పండుతాయి. విద్యార్థు లకు కూడా ఈ విషయాన్నే అన్వయించవచ్చు . కొంతమంది విద్యార్థు లు చురుకైన వారు

కాకపో వచ్చు. అంతమాత్రా న తామెందుకూ పనికిరామని నిరాశ పడకూడదు. వారు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను

శ్రద్ధగా వింటూ ఆకళింపు చేసుకొని నిరంతరం చదవటానికి ప్రయత్నిస్తే తప్పకుండా వారూ విద్యావంతులు అవుతారు.

ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు - అనే వాక్యం ద్వారా ఈ విధంగా విద్యార్థు లకు సందేశం ఇచ్చారని

చెప్పవచ్చు.

10 . మంచి పంటలు పండటానికి రైతు చేసే శ్రమ ఎలాంటిదో వివరించండి.

జ. ముందుగా మంచి విత్త నాలను ఎన్నుకోవాలి. భూమిని దున్నాలి. మళ్ళు కట్టి విత్త నాలను వేయాలి. వాటికి తగినంత

నీటిని అందించాలి. మొలకలోచ్చిన తరువాత వాటిని పొ లములో నాటాలి. మొలకలు ఎదిగిన తరువాత వాటి మధ్య

పెరిగిన కలుపు మొక్కలను తీసివేయాలి. కలుపు మొక్కలను తీయకపో తే పైరు ఎదగదు. మంచి దిగుబడి కోసం

సరియైన సమయంలో మంచి ఎరువులను వాడాలి. రాత్రి, పగలు పంటకు కాపలా కాయాలి. గింజలు పూర్తిగా గట్టిపడిన

తరువాత కోత కోయాలి. కుప్ప నూర్చాలి . ఇంత కష్టపడితేనే కానీ రైతుకు పంట చేతికి అందదు.

11. ఎలాంటి మంచి పనులు చేస్తే చరిత్రలో నిలిచిపో తారు?

జ. నిరుపేద విద్యార్థు లకు ఆర్ధిక సహాయాన్ని అందించటం . నీటి కుళాయిలు పెట్టించటం. రోడ్లు వేయించటం. ప్రజలకు

విద్య, వైద్య సౌకర్యాలు కల్పించటం. బాగా చదివే విద్యార్థు లకు ఉపకార వేతనాలు ఇవ్వటం. పేద, దళిత, గిరిజనుల

పెళ్ళిళ్ళకు ఆర్ధిక సహాయం చేయాలి. చెరువులు తవ్వించటం . దేవాలయాలు , ధర్మ సత్రా లు కట్టించటం

12. మనుషులు పదుగురు కూడితే ఒక ఊరు అవుతుంది – అని సి.న్నా.రె ఎందుకన్నారు?

జ. నలుగురూ మనుషులు కలిసి పరస్పరం సహకరించుకుంటే అది ఉత్త మమైన సాంఘిక ధర్మం అవుతుంది. సాటి

మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడే కులం, మతం అనే అడ్డు గోడలు తొలగిపో తాయి.

ఎక్కువ, తక్కువ అనే బేధ భావాలు సమసిపో తాయి. అందరూ కలసి ఐకమత్యంగా పనిచేస్తా రు. అప్పుడు అభివృద్ధి

సాధ్యమౌతుంది . ఈ విధంగా పదిమంది మనుషులు కూడితే అది ఊరు అవుతుంది. కలసికట్టు గా పని చేస్తే గ్రా మం

అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఆ గ్రా మానికి కావలసిన సదుపాయాలు ఏర్పరచుకోవచ్చు. అప్పుడు ఆ గ్రా మాన్ని చూసి

ఎన్నో గ్రా మాలు స్పూర్తిని పొందుతాయి. అప్పుడు దేశం సుభిక్షమౌతుంది. అందుకే సి.నా.రె మనుషులు పదుగురు కూడితే

ఒక ఊరు అవుతుంది అని అన్నారు.


అభ్యాసము – 5
1 . జీవన భాష్యం గజల్ లోని అంత్య ప్రా సల ఆధారంగా స్వంతగా ఒక వచన కవితను వ్రా యండి .

2 . ఆచార్య . సి. నారాయణ రెడ్డి గారు మీ పాఠశాలకు వస్తే వారి నుండి మీరు ఏమి రేలుసుకోవాలని అనుకుంటున్నారో

తెల్పుతూ ప్రశ్నాపత్రమను తయారుచేయండి .

3 . పదములకు పర్యాయపదములను వ్రా యండి .

మబ్బు గుండె శిరసు

4 . స్వంత వాక్యములను వ్రా యండి

ముసరడం జంకని అడుగులు ఎడారి దిబ్బలు చెరగని త్యాగం

5 . సి.నా.రె గారి గేయమును సేకరించి ఆ గేయం పై మీ అభిప్రా యమును వ్రా యండి .

11 . భిక్ష – శ్రీనాథుడు
ప్రశ్నలు – జవాబులు

1 . ప్రా చీన కాలంలో భిక్షాటనను పవిత్ర కార్యంగా ఎందుకు భావించేవారు?

జ. ఈనాడు భిక్ష అంటే అడుక్కొని తినటం అనే అల్పార్థములో వాడుతున్నారు. కాని ప్రా చిన కాలంలో భిక్ష అనే పదానికి

విశేషార్థము ఉంది. మహర్షు లు , సన్యాసులు, సర్వసంగ పరిత్యాగులు మొదలైన వారు కేవలం భిక్షాటన మీదనే

జీవించాలని శాస్త్రా లు చెబుతున్నాయి. ఎండుకంటే వారు జీవించటం కోసం సంపదను కలిగి ఉంటే వారిలో స్వార్థం

పెరుగుతుంది. సంసారమనే బంధంలో చిక్కుకుపో తారు. నేటి కాలంలో కూడా ఉపనయనం చేసినప్పుడు బ్రహ్మచారులు

తల్లిదండ్రు ల నుండి భిక్షను స్వికరించాలి . ఆది శంకరాచార్యులు , వివేకానందుడు భిక్షాటనం చేశారు. పూర్వ కాలంలో

భిక్షాటన చేసేవారిని ఎంతో గౌరవంగా చూసేవారు. అందుకే ప్రా చీన కాలంలో భిక్షాటనను పవిత్ర కార్యంగా భావించేవారు.

2. భిక్ష సమర్పించేటప్పుడు నాటికి, నేటికి ఉన్న తేడా ఏమిటి?

జ. పూర్వకాలంలో భిక్ష కోసం వచ్చిన అతిధులను ఎంతో గౌరవంగా చూసేవారు. గృహిణులు వాకిట్లో ఆవు పేడతో చక్కగా

అలికి , నాలుగు అంచులు కలిసేటట్లు ముగ్గు పెట్టేవారు. వచ్చిన అతిధిని ఆ ముగ్గు మధ్యలో నిలబెట్టేవారు. కాళ్ళు ,

చేతులు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చేవారు. తరువాత అతిధిని పూలతో , గంథంతో అర్చించేవారు. శుభ్రంగా కడిగిన

బంగారు పళ్ళెంలో అన్నం పెట్టి దానిపై నెయ్యి వేసేవారు. భోజనానికి పండ్లు , పరమాన్నం, పిండివంటలు చేర్చి ఎంతో భక్తి

విశ్వాసాలతో భిక్ష సమర్పించేవారు. కానీ నేటి కాలంలో భిక్ష సమర్పించటం తగ్గిపో యింది. ఒకవేళ భిక్ష వేసినా అది

మనస్ఫూర్తిగా వేయటం లేదు. పైగా దూషించుకుంటూ భిక్ష పెడుతున్నారు . ఇంకొంత మంది స్త్రీలు రాత్రి మిగిలిపో యిన

పదార్థా లు, పాడైపో యినవి , అపరిశుభ్రమైన పదార్థా లను భిక్షగా వేస్తు న్నారు.

3 . భిక్ష దొరకని వ్యాసుడు కోపించాడు కదా | దీనిపై మీ అభిప్రా యమేమిటి?


జ. వ్యాసుడు బ్రహ్మజ్ఞా ని . ఆయన వేదాలను విభజన చేశారు. పంచమ వేదంగా భావించే మహాభారతాన్ని, . అష్టా దశ

పురాణాలను రచించారు కాశీ పట్టణంలో తన పదివేల మంది శిష్యులతో భిక్షాటన చేసేవారు. ఒకసారి వరుసగా రెండు

రోజులు భిక్ష దొరకలేదు. అందుకు ఆయన కోపావేశంతో “కాశీ పట్టణంలోని ప్రజలకు మూడు తరాల దాకా ధనం, విద్య,

మోక్షం లేకుండా పో తారు” అని శపించబో యారు. ఇది సరియైన పని కాదు. ఎంతోమంది మునులు పిడికెడు వారి

గింజలతో కాలం వెళ్ళదీస్తుంటారు . ఇంకొంతమంది కేవలం శాకాహారంతోనే సరిపెట్టు కుంటారు. మరికొందరు దుంపలతో

సరిపెట్టు కుంటారు. కొందరు మునులు రోళ్ళ దగ్గర చెదిరి పడ్డ బియ్యాన్ని ఏరుకొని జీవనం సాగిస్తుంటారు. కాబట్టి

వేదవేదాంగవేత్త అయిన వ్యాసుని వంటి సంయవరేంద్రు డు కోపించటం తగదని నా అభిప్రా యం .

4. “కోపం మనిషిని విచక్షణ కోల్పోయేటట్లు చేస్తుంది” దీనిని గురించి వివరించండి. (లేదా) కోపం వల్ల కలిగే దుష్ట

పరిణామాలను గురించి రాయండి.

జ. కోపం కల్గినప్పుడు ఆత్మనిగ్రహాన్ని పాటించాలి. కోపాన్ని అదుపులో పెట్టు కోకపో తే ఎన్నో అనర్థా లు జరుగుతాయి.

అందుకే “తన కోపమే తన శతృవు – తన శాంతమే తనకు రక్ష” అని అన్నారు. కోపంగా ఉన్నప్పుడు మనిషి రాక్షసుడు

అవుతాడు. నేటి సమాజంలో చాలామంది నేరస్థు లు పుట్టు కతోనే దుర్మార్గు లు కారు . క్షణికమైన ఆవేశంతో అప్రయత్నంగా

చేసిన పనులే వారిని నేరస్థు లుగా మార్చాయి. అందుకే కోపం అనర్థదాయకం . కోపంగా ఉన్నప్పుడు విచక్షణ నశిస్తుంది.

అప్పుడు ఏం చేస్తు న్నారో వారికే తెలియదు. కాబట్టి కోపంగా ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు . పురాణ ,

ఇతిహాసాలలో కూడా కోపం వల్ల కలిగే అనర్థా లను తేలియచేశారు. ఉదాహరణకు మహాభారతంలో దుర్యోధనునికి

దాయాదులైన పాండవుల పై ఉన్న కోపమే కురుక్షేత్ర సంగ్రా మానికి దారితీసింది. విశ్వామిత్రు నికి వశిష్ఠు నిపై గల కోపమే

ఆయన భంగపాటుకు దారితీసింది.

5 . ఉన్న ఊరు కన్నతల్లితో సమానం అని ఎందుకు అంటారు/

జ. కన్నతల్లి బిడ్డ ల ఆలనా పాలనా చూస్తుంది. బిడ్డ కు ఏం కావాలన్నా క్షణాల్లో సమకూరుస్తుంది. ఎప్పుడూ

కోపగించుకోడు. బిడ్డ ను విడిచి ఒక్క క్షణం ఉండదు. మనం పుట్టిన ఊర్లో బంధువులు , స్నేహితులు, ఆత్మీయులు

ఉంటారు. కన్నతల్లి దగ్గర పొందే సంతోషం వారి దగ్గర కూడా పొందుతాము . “జననీ జన్మ భూమిశ్చ స్వర్గా దపీ గరీయసి “

అని అంటారు. అంటే జనని, జన్మభూమి స్వర్గం కంటే గొప్పవని అర్థం. ఉన్న ఉరుకు కన్నతల్లికి ఎంతో సారూప్యం ఉంది.

6. భోజనానికి ఆహ్వానించిన గృహిణితో వ్యాసుడు పలికిన మాటలను బట్టి మీకేమి అర్థమైంది?

జ. భోజనానికి ఆహ్వానించిన గృహిణితో వ్యాసుడు తల్లీ! సూర్యుడు అస్త మిస్తు న్నాడు. నేనే కాదు నాతొ ఎంతోమంది శిష్యులు

ఉన్నారు. శిష్యులతో కలసి భుజించాలనే నా వ్రతం విడిచిపెట్టి మీ ఇంట్లో నేను ఒక్కడినే భుజించలేను. ఈ రోజు కూడా

నిన్నటి లాగానే ఉపవాసముంటాను .” అని అన్నాడు. ఈ మాటలను బట్టి ఆయనకు శిష్యులపై అపారమైన వాత్సల్యం

ఉందని గ్రహించాను.

7. శ్రీనాథుని గురించి వ్రా యండి.


జ. శ్రీనాథుడు 15 వ శతాబ్దమునకు చెందిన కవి. మారాయ, భీమాంబ శ్రీనాథుని తల్లిదండ్రు లు. కొండవీటిని పరిపాలించిన

పెదకోమటి వేమారెడ్డి ఆస్థా నంలో విద్యాధికారిగా ఉన్నారు. విజయనగర ప్రౌ డ దేవరాయల ఆస్తా నంలోని గౌడ డిండిమ

భట్టు ను ఓడించి కనకాభిషేకాన్ని , కవిసార్వభౌమ బిరుదును . శ్రీనాథుడు పొందాడు . మరుత్త రాట్చరిత్ర , శాలివాహన

సప్త శతి , పండితారాధ్య చరిత్ర , భీమఖండం , కాశీఖండం, హరవిలాసం , శివరాత్రి మహాత్మ్యం , పల్నాటి వీరచరిత్ర

మొదలైన రచనలు చేశారు. సీస పద్య రచనలో శ్రీనాథుడు మేటి అని అనిపించుకున్నాడు. ఉద్దండలిల, ఉభయ వాక్ప్రౌడి ,

రసాభ్యుచిత బంధనం, సూక్తి వైచిత్రి, తన కవితా లక్షణములని శ్రీనాథుడు చెప్పుకున్నాడు.

8. వ్యాసుని పాత్ర స్వభావమును, గురించి రాయండి .

జ భిక్ష పాఠ్య భాగ సారాంశమును రాసి వ్యాసుని వ్యక్తిత్వమును రాయాలి.

ప్రతిపదార్థములు
తొమ్మిదవ పద్యం :

వేద = వేదములలో ఇటురమ్ము + అని - ఇటు రమ్మని

పురాణ - పురాణములలో పిల్చేన్ - పిలిచింది

శాస్త్ర = శాస్త్రములలో నిర్దేశింపబడిన


పదవ పద్యం
పదవీ - జ్ఞా నమునకు

న+దవ్ యసి + ఐన - మిక్కిలి దూరంలో లేని


ఇప్డు - ఇప్పుడు
పెద్ద ముత్తై దువ - గొప్ప ముత్తై దు
ఆ కంఠంబుగన్ - గొంతు వరకు
కాశికానగర - కాశికానగారము అనే
మాధుకర భిక్షాన్నంబు -మాధుకర భిక్షాన్నమును
హాటక పీఠ - స్వర్ణ పీఠము యొక్క
భక్షింపగాన్ - తినటానికి
శిఖా - శిఖరాన్ని
లేక+ఉన్నన్ - లేకపో వటంతో
అధిరూ - అధిరోహించిన
కడున్ - మిక్కిలి
ఆ + ఆదిమ శక్తి - ఆ ఆదిశక్తి
అంగలార్చెడవు - కోపంతో ఉన్నావు
హస్త సంజ్ఞా - చేతి సంజ్ఞతో
మేలు+ఏ - ఇది నీకు మంచిదా ?
ఆదర - ఆదరముతో
లెస్స - బాగున్నడా?
లీలన్ - విలాసముతో
శాంతుండవు + ఏ -నీవు శాంత స్వభావుడవేనా ?
రత్న - రత్నములతో
కటకటా - అయ్యో
ఖచిత - పొ దగబడిన
నీ వార ముష్టింపచుల్ - పిడికెడు వరి గింజలతో
ఆభరణంబులు - ఆభరణాలు (నగలు)
కాలం వెళ్ళబుచ్చేవారు
ఘల్లు ఘల్ల నన్ -ఘల్లు ఘల్లు మని శబ్దం చేస్తుండగా

సంయమివరా| - ఓ మునీశ్వారా |
శాకాహారులు (శాక+ఆహారులు) కూరగాయలు శిష్య గణమున్ - శిష్యులందరినీ

తినేవారు కొని - తీసుకొని

కండ భోజులు - దుంపలు తినేవారు చయ్యనన్ - వెంటనే

శిల+ఉంచ ప్రక్రముల్ - రొళ్ళ దగ్గర వడ్లు రమ్ము - భోజనానికి రా

దంచేటప్పుడు జారి పడిన గింజలను ఏరుకొని తిని విశ్వనాథుని - పరమేశ్వరుని

జీవించేవారు కృప పేర్మిన్ - దయతో , ప్రేమతో

తాపసుల్ - మునుల్ ఎందరు + అతిథుల్ - ఎంతమంది అతిథులు

నీ కంటెన్ - నీ కన్నా చనుదెంచినన్ - వచ్చినప్పటికిన్

మతిహీనులు + ఏ - తెలివితక్కువ వారా? కామదేనువున్ -కోరిన కోర్కెలు తీర్చే కామదేనువును

పని గొనునట్లు - స్వాధీనం చేసుకొన్నట్లు


పదునాల్గ వ పద్యం
అపారములైన - అంతులేని

అభీప్సిత + అన్నముల్ - కోరిన పదార్తముల్


అనవుడు -వేదవ్యాసుడు అలా పలుకగానే
పెట్టు డున్ - పెడతాను
కమల + ఆనన - పద్మము వంటి

ముఖము కలిగిన ఆ ముత్తై దువ

అల్ల - కొంచెం

నవ్వి - నవ్వి

ఇట్లు + అనున్ - ఈ విధంగా పలికింది

లెస్స గాక - మేలు కలుగుగఓ

మునివరా| - ఓ మునీశ్వరా |

నీవు - నీవు

అభ్యాసము - 6
1 . కోపం వల్ల అనర్థా లు కలుగుతాయి – కోపాన్ని తగ్గించుకోవటం మంచిది “ అనే విషయాన్ని తెల్పుతూ స్నేహితునికి

లేఖ రాయండి .
2 . భిక్ష , రక్ష , పరీక్ష, సమీక్ష , వివక్ష – వంటి పదాలతో ఒక చక్కని భావాన్ని ప్రకటించే కవితను రాయండి.

3 . వనిత పసిడి పారాశర్యుడు ఆగ్రహము ఆహిమకరుడు - పదాలకు పర్యాయ

పదములను వ్రా యుము .

4 . విద్య చిక్షము యాత్ర మత్స్యము రత్నము పంక్తి - పదములకు వికృతి

పదములను రాయండి .

5 . పదవ పద్యమునకు ప్రతిపదార్థమును వ్రా యుము ( ఆ కంఠంబుగన్ )

పదవతరగతి/ ఉపవాచకము /రామాయణము – కిష్కింధకాండ / ప్రశ్నలు – జవాబులు

1 . హనుమంతుడి మాట తీరు రాముడిని ఎలా ఆకట్టు కుంది?

జ. ఋష్యమూక పర్వతం నుంచి సుగ్రీవుడు రామలక్ష్మణులను చూశాడు. గుండెలో రాయిపడ్డ ట్టు అయినది. ఆ ఇద్దరు

తన అన్న అయిన వాలి పంపగా వచ్చారేమోనని భయంతో వణికిపో తున్నారు.ధనుర్భాణాలు ధరించిన వాళ్ళెవరో

మారువేషంలో వెళ్లి కనుక్కోమని ఆంజనేయుడిని సుగ్రీవుడు ఆదేశించాడు.

సుగ్రీవుని ఆనతి ప్రకారం రామలక్ష్మణుల దగ్గరకి సన్యాసి వేషంలో హనుమంతుడు వెళ్ళాడు. వారి రూపాన్ని

పొ గిడాడు. వారితో పరిచయం చేసుకున్నాడు. రామలక్ష్మణులు మౌనముద్ర వహించారు. హనుమంతుడు వారితో” వానర

రాజు సుగ్రీవుడు ధర్మాత్ముడు, మహావీరుడు . అతణ్ణి వాళ్ళ అన్న వాలి వంచించాడు . రక్షణ కోసం జాగ్రత్త గా

తిరుగుతున్నాడు. నేను సుగ్రీవుడి మంత్రిని. నన్ను హనుమంతుడు అని అంటారు. నేను వాయుపుత్రు డిని. ఎక్కడికైనా

వెళ్ళిరాగల శక్తిగలవాణ్ణి . సుగ్రీవుడు పంపగా ఈ రూపంలో మీ దగ్గరకు వచ్చాను. సుగ్రీవుడు మీతో స్నేహాన్ని

కోరుతున్నాడు. “ అని చాకచక్యంగా మాట్లా డాడు.విషయాన్ని చెప్పే పద్ధతిలో ఎంతో నేర్పును ప్రదర్శించాడు.

హనుమంతుడి మాట తీరు శ్రీరాముడిని ఆకట్టు కుంది. రాముడు లక్ష్మణుడితో “ఇతడు, వేదాలను, వ్యాకరణాన్ని క్షుణ్ణంగా

చదివాడన్నది నిశ్చయం . లేకపో తే మాటల్లో ఇంత స్పష్టత ఉండదు. తడబాటు, తొందరపాటు లేకుండా తప్పులు

పలకకుండా సరైన స్వరంతో చెప్పదలచుకున్న విషయాన్ని మనసుకు హత్తు కునేట్లు గా చెప్పాడు. ఈయన మాట్లా డే తీరు

చూస్తే చంపడానికి కత్తి ఎత్తి న శత్రు వుకు కూడా చేతులు రావు. “ అని మెచ్చుకున్నాడు. ఈ సన్నివేశం వల్ల మాటకున్న

శక్తి , ఎదుటి వారితో మాట్లా డాల్సిన తీరు తెలుస్తుంది.

2. వాలీ , సుగ్రీవుల విరోధానికి కారణమేమిటి?

జ. వాలీ , సుగ్రీవులు అన్నదమ్ములు. వాలి మహాబలశాలి. వాలి పెద్దవాడు కనుక తండ్రి తరువాత కిష్కింధకు రాజైనాడు.

మాయావి అనే రాక్షసుడికి వాలికి వైరం. ఒకనాటి అర్థరాత్రి మాయావి కిష్కింధకు వచ్చి వాలిని యుద్ధా నికి ఆహ్వానించాడు.

ఎవరెంతగా వారించినా వాలి వినకుండా మాయావితో పో రుకు సిద్ధమయ్యాడు. మాయావి భయంతో వెనుతిరిగి పిక్కబలం
చూపాడు.మాయావి చెప్పి నేను లోపలకి వెళ్లి మాయావిని చంపి వస్తా నని అప్పటిదాకా ఇక్కడే ఉండమని సుగ్రీవునితో

చెప్పి లోపలకు వెళ్ళాడు. సంవత్సరం గడిచినా వాలి జాడలేదు. ఇంతలో నురుగుతో కూడిన రక్తం గుహలో నుంచి

బయటకు వచ్చింది. మాయావి చేతిలో వాలి చనిపో యాడని , రాక్షసుడు బయటకు వస్తా డని , సుగ్రీవుడు కొండంత

బండతో భూగృహాన్ని మూసివేశాడు. తాను కిష్కింధకు వెళ్ళిపో యాడు. మంత్రు లు బలవంతంగా సుగ్రీవుని రాజుని చేశారు .

కొంతకాలానికి వాలి తిరిగి వచ్చాడు. సుగ్రీవుని రాజ్యభ్రష్టు డిని చేసి అతని భార్య రుమను అపహరించాడు. ప్రా ణభీతితో

సుగ్రీవుడు సమస్త భూమండలమును తిరిగాడు. చివరకు ఋష్యమూక పర్వతమును చేరుకున్నాడు. మతంగముని శాపం

కారణంగా వాలి అక్కడకు రాలేదు. శాపకారణం : వాలి దుందుభి అనే రాక్షసుణ్ణి చంపి విసిరివేసినప్పుడు ఆ రాక్షసుడి నోటి

నుండి రక్తబిందువులు మతంగాశ్రమము మీద పడ్డా యి. అందుకు కోపించిన ముని ఋష్యమూక పర్వతం మీద

కాలుపెడితే వాలి మరణిస్తా డని శపించాడు. ఇలా వాలి, సుగ్రీవుల మధ్య వైరం ఏర్పడింది.

3 . రామ , సుగ్రీవులకు మైత్రి జరిగిన విధానాన్ని , వాలి మరణాన్ని వివరించండి.

జ. సీత జాడ తెలుసుకోవటానికి సుగ్రీవునితో మైత్రి కోసం రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు.

సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి తన అన్న వాలి తనను చంపడానికి పంపిన వీరులని భయపడ్డా డు.

రామలక్ష్మణులను గురించి తెలుసుకోవడానికి హనుమంతుని పంపాడు. హనుమతో లక్ష్మణుడు తమకు సుగ్రీవుని సాయం

కావాలన్నాడు. హనుమ రామలక్ష్మణులను సుగ్రీవుని దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. శ్రీరామ, సుగ్రీవులు అగ్ని సాక్షిగా

మిత్రు లైనారు . సుఖదుఃఖాలలో ఒక్కటిగా ఉందామనుకున్నారు . ఆపదలో ఆదుకునేవాడే మిత్రు డని , తనకు మిత్రు డైన

సుగ్రీవుని కోసం వాలిని వధిస్తా నని రాముడు మాట ఇచ్చాడు. అందరూ కిష్కింధకు వెళ్ళారు. సుగ్రీవుడు భయంకరంగా

గర్జిస్తూ వాలిని యుధ్ధా నికి ఆహ్వానించాడు. మహాబలశాలియైన వాలి క్షణాలలో అక్కడికి వచ్చాడు. ఇద్దరి మధ్య భీకర పో రు

సాగుతుంది. వాలి, సుగ్రీవులు ఒకే పో లికతో ఉండటం వలన శ్రీరాముడు వాలిని స్పష్టంగా గుర్తించలేకపో యాడు. వాలి ధాటికి

తట్టు కోలేక సుగ్రీవుడు ఋష్యమూక పర్వతానికి పరుగులు తీశాడు. సుగ్రీవుడిని గుర్తించటానికి వీలుగా

“నాగాకేసరపులతను” మెడలో వేయమని శ్రీరాముడు లక్ష్మణునితో చెప్పాడు. పూలతో నిండిన ఆ లతను ధరించి

సుగ్రీవుడు తిరిగి యుధ్ధా నికి సన్నద్ధమయ్యాడు . అందరూ కిష్కింధకు ప్రయాణమయ్యారు. సుగ్రీవుడు వాలిని యుధ్ధా నికి

ఆహ్వానించాడు. వాలీ , సుగ్రీవుల పో రు తీవ్రంగా సాగుతున్నది. వాళ్ళిద్దరూ రక్తం కారుతున్నా పట్టించుకునే స్థితిలో లేరు.

మెల్ల మెల్ల గా సుగ్రీవుని శక్తి సన్నగిల్లు తుంది. మాటిమాటికి దిక్కులు చూస్తు న్నాడు. శ్రీరామునికి అతని ఆంతర్యం

అర్థమైంది. విషసర్పంతో సమానమైన బాణాన్ని అతడు వాలి మీదకు వదిలాడు. అది క్షణాలలో వాలి వక్షస్థలంలో

నాటుకున్నది . వాలి నేల మీదకు వాలిపో యాడు. స్పృహ కోల్పోయాడు. రక్తపు మడుగులో పడివున్న వాలి కొంతసేపటికి

తేరుకున్నాడు. తమ్ముడి భార్యను చెరపట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టినందువల్ల వాలికి మరణదండన విధించానన్నాడు

శ్రీరాముడు. వానరుడిని కనుక చాటుగా ఉండి చంపటంలో తప్పు లేదన్నాడు. వాలికి బాణం వల్ల కలుగుతున్న బాధ

అంతకంతకూ అధికమై ప్రా ణాలను వదిలాడు.


4. జాంబవంతుడు హనుమంతుడిని ప్రేరేపించడం వల్ల ఎలా సముద్రలంఘనానికి సిద్ధపడ్డా డో తెలియచేయండి.

జ. అంగదుని నాయకత్వంలో దక్షిణం వైపుకు బయలుదేరిన హనుమంతుడు మొదలైన వాళ్ళు సీత జాడ కోసం

అణువణువున గాలిస్తు న్నారు. సుగ్రీవుడు ఇచ్చిన గడువు పూర్తి అయింది. ఏం చేయాలో తోచడం లేదు. అంగదుడు

తమవాళ్ళు నిరాశ పడకుండా

జాగ్రత్త పడ్డా డు. ధైర్యోత్సాహాలతో ముందుకు సాగితే విజయం తప్పక వరిస్తుందని తన వారిని ప్రేరేపించాడు. అందరూ

రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదిలారు. సముద్రపు ఒడ్డు కు చేరుకున్నారు. ఆ సముద్రా న్ని” మహో దధి “ అని

అంటారు. ఉవ్వెత్తు న లేచే అలల అలజడి భయాన్ని కలిగిస్తుంది. ఆ తీరంలో వానరులంతా సమావేశమయ్యారు. ఏం

చేయాలో తీవ్రంగా చర్చించుకుంటూ , సీత జాడ కనిపెట్టకుండా సుగ్రీవుని చేరరాదని అనుకున్నారు. వానరవీరులు బల

పరాక్రమాలు ప్రదర్శించడం ద్వారానే సీతాన్వేషణ సఫలమౌతుందని నిశ్చయానికి వచ్చారు. కాని వంద యోజనాల దూరం

ఉన్న లంకకు ఎవరు వెళ్ళగలరని తర్కించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థి తులలో కార్యహాని కలగకుండా

కాపాడగలవారు హనుమంతుడేనని జాంబవంతుడు ఖచ్చితంగా తెలియచేశాడు. ఆ సమయంలో హనుమంతుడు

ఏకాంతంగా ఒకచోట కూర్చొని ఉన్నాడు.

జాంబవంతుడు హనుమంతుడి దగ్గరకు వెళ్ళి అతని శక్తియుక్తు ల గురించి తెలుపుతూ అతనిలో ఉత్సాహాన్ని నింపాడు.

దానికి తోడూ వానరుల ప్రశంసలు తోడైనాయి. హనుమంతుడు రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు.

అద్భుతమైన తేజస్సుతో వెలుగుతున్నాడు. వానరులతో “నేను మేరుపర్వతాన్ని అనాయాసంగా వేలమార్లు

చుట్టిరాగలిగాను . భూమండలాన్ని సముద్రంలో ముంచగలను . గ్రహ నక్షత్రా లను అధిగమించగలను. పర్వతాలను

నుగ్గు నుగ్గు చేయగలను. మహాసముద్రా లను అవలీలగా దాటగలను.” అని అధికమైన ఉత్సాహాన్ని ప్రదర్శించాడు.

హనుమంతుని మాటలకు జాంబవంతుడు సంతోషించి “నాయనా! నీ ధైర్యోత్సాహాలకు తగినట్లు గా మాట్లా డావు. నీ

మాటలు వానరుల మనసులో గుడుగట్టు కున్న దుఃఖమును దూరం చేశాయి. అందరం నీ శుభాన్ని కోరుతున్నాం.

ఋషులు, వృద్ధ వానరులు , గురువుల అనుగ్రహంతో ఈ సముద్రా న్ని లంఘించు. నీ రాక కోసం మేమిక్కడే ఎదురు

చూస్తూ ఉంటాము. మన వానరుల ప్రా ణాలన్నీ నీపైనే ఆధారపడి ఉన్నాయని “ తెలిపాడు. తాను లంఘించే సమయంలో

తన బలాన్ని భూమి భరించలేదని , మహేంద్ర పర్వత శిఖరాలు అందుకు తగినవని హనుమంతుడు పలికి మహేంద్రగిరి

చేరాడు. ఈ విధంగా జాంబవంతుడు హనుమంతుడిని ప్రేరేపించాడు.

సుందరకాండ

1. కార్యసాధకుడుపనిఅయ్యేవరకువిశ్రాంతికొరకుఆలోచించడు .

మైనాకవృత్తాంతంఆధారంగాహనుమలోనిలక్షణాలనువ్రా యండి.
జ. మహాబలుడైన మారుతి దేవతలకు నమస్కరించాడు. వాయు వేగంతో సాగిపో యే రామబాణంలా లంకకు

వెళతానన్నాడు. అక్కడ సీత కనబడకపో తే స్వర్గా నికి వెళతానన్నాడు . అక్కడ కూడా సీత కనబడకపో తే రావణుడిని

బంధించి తెస్తా నన్నాడు. పని పూర్తి చేసుకొని వస్తా నన్నాడు. ఒక్క ఉదుటున సముద్రం మీదకు ఎగిరాడు. హనుమంతుడికి

సముద్రు డు సహాయపడాలనుకున్నాడు . రామకార్యం కోసం వెళుతున్న హనుమంతునికి శ్రమ కలగకూడదనుకున్నాడు

. సముద్రంలో ఉన్న మైనాకుడిని బయటకు రమ్మన్నాడు. అతని శిఖరం మీద హనుమంతుడు కొద్ది సేపు విశ్రాంతి

తీసుకోగలడని అనుకున్నాడు. మైనాకుడు ఒక్కసారిగా సముద్రంలోంచి లేచాడు. అకస్మాత్తు గా లేచిన మైనాకుడిని తనకు

ఆటంకంగా మారుతి తలచాడు. తన ఎదతో నెట్టివేశాడు. మైనాకుడు హనుమంతుని బలానికి అబ్బురపడి మానవ

రూపంలో కనపడ్డా డు. సముద్రు ని కోరికను తెలిపి కొద్ది సేపు విశ్రాంతి తీసుకోమన్నాడు. సమయం లేదని, ఆగడానికి

వీలులేదని చెప్తూ మైనాకుని ఆదరపూరకమైన మాటలకు తృప్తి పడ్డా నన్నాడు. తన విధిని నిర్వర్తించే వరకు విశ్రమించనని

చెప్పి ముందుకు సాగిపో యాడు. కార్యసాధకుడు పని అయ్యేవరకు విశ్రమించడని హనుమ ఋజువు చేశాడు.

2. ఆత్మహత్య కన్నా బతికుండడమే ఎన్నో విధాల ఉత్త మమని , బాధల్లో నిరుత్సాహపడకూడదని నిరూపించి

హనుమంతుడు ఎలా ఆదర్శప్రా యుడయ్యాడు ?

జ. లంకలో రావణుని అంతఃపురంలోకి వెళ్ళి ఎంత వెదికినా హనుమంతునికి సీత జాడ తెలియలేదు. సీత

మరణించిందేమోనని సందేహపడ్డా డు. సీత జాడ కనిపెట్టక పొ తే తాను ఏ మొఖం పెట్టు కొని తిరిగివెళ్ళాలి అని బాధపడ్డా డు.

సీత కనబడలేదంటే రాముడు జీవించలేదు. అతడు లేకపో తే లక్ష్మణుడు ఉండడు . వీరి మరణ వార్త విని భరత ,

శత్రు ఘ్నులు ఉండరు. పుత్రు ల మరణాన్ని విని తట్టు కోలేక కౌసల్యా, సుమిత్ర, కైకేయి లు తనువు చాలిస్తా రు. ప్రియ

మిత్రు ణ్ణి వీడి సుగ్రీవుడు బ్రతకడు. దానితో రుమ, తార, అంగదులు కూడా మిగలరు. ఇది చూసి వానర జాతి ఈ లోకాన్ని

వీడుతుంది. ఇందరి మరణానికి కారణం కావడం కన్నా ప్రా యోపవేశంతో ప్రా ణాలను వదలడమే మంచిదని హనుమంతుడు

తలచాడు. కాని తర్కించి చూస్తే ఆత్మహత్య కన్నా బ్రతికుండడమే ఎన్నో విధాలా ఉత్త మమనిపించింది. చచ్చి

సాధించేదేమిటి? బతికితే సుఖాలను , శుభాలను పొందవచ్చు. బతికి ఉన్నవాళ్ళు ఎన్నడైనా కలుసుకోవచ్చు. అందుకే

ప్రా ణాలను నిలుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇలా సీత జాడ మొదట కనిపెట్టలేక నిరుత్సాహపడినా , ధైర్యం

తెచ్చుకున్నాడు. ఆత్మహత్య వల్ల ప్రయోజనం లేదని నిరూపించి , నేటికీ మనకు ఆదర్శప్రా యుడిగా హనుమంతుడు

నిలిచాడు.

3 . చూసి రమ్మంటే కాల్చి వచ్చిన హనుమ పరాక్రమాన్ని కార్యనిర్వహణనను లంకా దహన వృత్తాంతంతో వివరించండి.

జ. సీతాదేవి దర్శనంతో వచ్చిన పని ముగిసింది హనుమంతుడికి. రావణుడు అతని సైన్యపు శక్తి సామర్థ్యాలను కూడా

తెలుసుకోవాలనిపించింది. అందుకు అశోకవనాన్ని ధ్వంసం చేయడమే మార్గంగా భావించాడు . అనుకున్నంతా చేశాడు ఆ


కపివీరుడు. రాక్షస స్త్రీలు పరుగుపరుగున వెళ్ళి లంకేశునికి విషయం చెప్పారు. రావణుడు ఎనభైవేల మంది రాక్షసులను

పంపాడు. హనుమంతుడు వారిని మట్టు బెట్టా డు . తన పైకి వచ్చిన జంబుమాలిని, మంత్రిపుత్రు లు ఏడుగురిని , రావణుడి

సేనాపతులు ఐదుగురిని , అక్షకుమారుడుని అంతమొందించాడు. చివరకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రా న్ని ప్రయోగించి

హనుమంతుడిని బంధించాడు. బ్రహ్మ వరం చేత అది హనుమంతుని మీద క్షణకాలమే పని చేస్తుంది. అయినా తాను

దానికి కట్టు బడి ఉన్నట్లు నటించాడు. రావణుని ముందుకు హనుమంతుడిని తీసుకువెళ్ళారు. రావణునికి తాను

రామదూతనని చెప్పాడు. శ్రీరాముని పరాక్రమము ఎటువంటిదో సభాముఖంగా తెలియచేశాడు. సహించలేని రావణుడు

హనుమంతుడిని చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. దూతను చంపటం భావ్యం కాదని విభీషణుడు అన్నాడు. ఇతర పద్ధతులలో

దూతని దండించవచ్చని అన్నాడు. హనుమంతుని తోకకు నిప్పు అంటించి లంకంతా కలయదిప్పమన్నాడు రావణుడు.

బట్టలతో హనుమంతుని తోకను చుట్టా రు. నూనెతో తడిపారు. తోకకు నిప్పు పెట్టి ఊరంతా ఊరేగిస్తు న్నారు.హనుమంతుడు

ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. విభీషణుని భవనం తప్ప లంకకంతా నిప్పు పెట్టా డు. అందుకే “చూసి రమ్మంటే

కాల్చివచ్చాడని” సామెత పుట్టింది. లంకలో హాహాకారాలు మిన్నుముట్టా యి. ఈ విధంగా హనుమ తన పరాక్రమాన్ని ,

కార్యదక్షతను చూపాడు.

4 . హనుమంతుడు రామునికి సీత జాడను నివేదించిన వృత్తాంతాన్ని రాయండి.

జ. సీతాదేవిని దర్శించటంతో హనుమకు ఒక ముఖ్యకార్యం పూర్తి అయింది. హనుమ రావణుడి శక్తి సామర్థ్యాలు

తెలుసుకుందామని అనుకున్నాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. అశోకవన ధ్వంసం గురించి రాక్షస స్త్రీలు రావణునకు

చెప్పారు. రావణుని ముందుకు హనుమంతుడిని తీసుకువెళ్ళారు. రావణునికి తాను రామదూతనని చెప్పాడు. శ్రీరాముని

పరాక్రమము ఎటువంటిదో సభాముఖంగా తెలియచేశాడు. సహించలేని రావణుడు హనుమంతుడిని చంపమని ఆజ్ఞ

ఇచ్చాడు. దూతను చంపటం భావ్యం కాదని విభీషణుడు అన్నాడు. ఇతర పద్ధతులలో దూతని దండించవచ్చని అన్నాడు.

హనుమంతుని తోకకు నిప్పు అంటించి లంకంతా కలయదిప్పమన్నాడు రావణుడు. బట్టలతో హనుమంతుని తోకను

చుట్టా రు. నూనెతో తడిపారు. తోకకు నిప్పు పెట్టి ఊరంతా ఊరేగిస్తు న్నారు.హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి

ఎగిరాడు. విభీషణుని భవనం తప్ప లంకకంతా నిప్పు పెట్టా డు. అందుకే “చూసి రమ్మంటే కాల్చివచ్చాడని” సామెత

పుట్టింది. లంకలో హాహాకారాలు మిన్నుముట్టా యి. ఈ విధంగా హనుమ తన పరాక్రమాన్ని , కార్యదక్షతను చూపాడు. కాని

తాను తప్పు చేశానేమోనని , సీతా మాత ఆ మంటలలో కాలిపో యిందేమోనని సందేహించాడు. సీత క్షేమంగా ఉన్నదని

చారుల ద్వారా తెలుసుకొని సంతోషించాడు. హనుమ అరిష్టం అనే పర్వతం నుండి ఆకాశంలోకి ఎగిరాడు. మహేంద్రగిరి చేరి

మహానాదం చేశాడు . జాంబవంతుడు ఆ నాదం విని హనుమ విజయం సాధించి వస్తు న్నాడని వానరులకు చెప్పాడు.

హనుమ మహేంద్రగిరి చేరి పెద్దలకు నమస్కరించి “చూశాను సీతమ్మను “ అని చెప్పాడు. ప్రయాణ విషయాలు వారికి

తెలియచేశాడు. తరువాత అంగద , హనుమదాదులు శ్రీరాముడు, సుగ్రీవుడు ఉన్న చోటుకి వెళ్ళారు. హనుమ రాముడికి

నమస్కరించి సీతా ఇచ్చిన చూడామణిని ఇచ్చి సీతాన్వేషణ వృత్తాంతాన్ని వివరించాడు.


5 . త్రిజట కలను గురించి తెల్పండి.

జ. త్రిజట విభీషణుని కూతురు. సీతకు కావలిగా ఉన్నది. ఆమెకు కల వచ్చింది. ఆ కలలో వేయి హంసలతోకూడిన పల్ల కీ

మీదరాముడు, లక్ష్మణుడు కూర్చున్నారు. సముద్రం మధ్యలో తెల్ల ని పర్వతం మీద సీత కూర్చున్నది. నూనె పూసిన

శరీరంతో రావణుడు నేల మీద పడివున్నాడు. ఒక నల్ల ని స్త్రీ ఒళ్లంతా బురద పూసుకొని ఎర్రని వస్త్రములు ధరించి రావణుని

మెడకు తాడు కట్టి దక్షిణ దిశగా ఈడ్చుకు వెళుతున్నది. వరాహం మీద రావణుడు , మొసలి మీద ఇంద్రజిత్తు , మీద

కుంభకర్ణు డు దక్షిణదిశగా వెళుతున్నారు. లంక చిన్నాభిన్నమైపో యింది. ఈ కలను బట్టి చూస్తే సీత కోరిక తీరుతుందని ,

రామునికి జయం కలుగుతుందని , రావణుడికి వినాశం తప్పదని త్రిజట తన కలను గురించి తోటి రాక్షస స్త్రీలకు

వివరించింది.

యుద్ధకాండం

1 . “అసాధ్యమైన పనిని పట్టు దలతో సాధించవచ్చు “ సముద్రంపై సేతువును కట్టించిన రాముని ప్రయత్నాన్ని వివరించండి.

(లేదా)

శ్రీరాముడు వానర సైన్యంతో లంకానగారాన్ని చేరిన వృత్తాంతాన్ని రాయండి.

జ. హనుమకు ప్రశంస: ఉత్త ముడైన సేవకుడు ఇచ్చిన పనిని సాధించడమే కాక, దానికనుబంధమైన ఇతర కార్యాలను

సాధించుకుని వస్తా డు. అట్లా హనుమంతుడు లంకకు వెళ్ళి సీతను చూసి వచ్చి ఆమె కుశల వార్తను రామునికి చెప్పాడు.

లంకా నగర రక్షణ వ్యవస్థను చెప్పాడు. అంతటి మహో పకారం చేసిన హనుమను గుండెకు హత్తు కొని తన అభిమానాన్ని

చూపాడు రాముడు. కపి సైన్యంతో సముద్ర తీరానికి చేరుకున్నాడు.

విభీషణుని రాక : ధర్మం విడిచిన తన అన్న రావణుని వదిలి , శ్రీరాముని శరణువేడాడు విభీషణుడు . లంకను దాటడము

ఎలాగో చెప్పమని రాముడు సుగ్రీవుడిని అడిగాడు. సముద్రు డిని ప్రా ర్థించడం వలన అది సాధ్యపడుతుందని అన్నాడు

విభీషణుడు .

సముద్రు ని అనుమతి: శ్రీరాముడు సముద్రం ఒడ్డు న మూడు రాత్రు లు సముద్రు ని ప్రా ర్థిస్తూ గడిపాడు. సముద్రు డు రాలేదు.

సముద్రు డి అహంకారాన్ని అణచడానికి , సముద్రం లోని నీరు ఇంకి పో యేలా చేయాలని రాముడు కోపంతో బ్రహ్మాస్త్రా న్ని

స్మరించాడు.

ఆ దెబ్బకు సముద్రు డు దారికి వచ్చాడు. వానరుల్లో ని నలునితో సేతువుని నిర్మించమని , ఆ సేతువును తాను భరిస్తా నని

మాట ఇచ్చాడు.

సేతువు నిర్మాణం : నలుని సూచనల మేరకు పెద్ద పెద్ద చెట్ల ను , బండరాళ్ళను మోసుకు వచ్చి సముద్రంలో వేశారు .

ఐదురోజుల్లో వంద యోజనాల పొ డవు , పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం పూర్తి అయింది.

శ్రిరామలక్ష్మణులు సుగ్రీవునితో కలిసి వానర సైన్యంతో సముద్రం ఆవలి ఒడ్డు కు చేరారు. ఇలా ఆవలి ఒడ్డు కనపడని

సముద్రంపై దీక్షతో, పట్టు దలతో రాముడు సేతువును నిర్మించాడు.


2 . రామ రావణ యుధ్ధా నికి రామ రావణ యుద్ధమే సాటి – వివరించండి.

జ. రాముడి విలువిద్యా పాండిత్యం : రావణుడు లక్ష్మణుడి మీద ప్రయోగించిన శక్తి అనే ఆయుధం వల్ల లక్ష్మణుడు నేల

మీద పడిపో యాడు.శ్రీరాముడు ఇక ఉపేక్షించి లాభం లేదనుకున్నాడు. ఈ లోకంలో ఇక రాముడో , రావణుడో మాత్రమే

మిగిలి ఉంటారు అని అన్నాడు రాముడు. శ్రీరాముడి విలువిద్యా పాండిత్యానికి ఎదురు నిలువలేక రావణుడు భయంతో

పరుగులు తీశాడు.

దివ్యరథంపై రాముడు : అంతవరకు రావణుడు రథం మీద ఉండి యుద్ధం చేస్తూ ఉంటే , రాముడు నేలపై ఉండి యుద్ధం

చేస్తు న్నాడు. అప్పుడు ఇంద్రు డు పంపగా , మాతలి దివ్యరథంలో శ్రీరాముని వద్దకు వచ్చాడు. ఆ రథమెక్కి శ్రీరాముడు

యుద్ధభూమికి వెళ్ళాడు. రామరావణుల మధ్య ఎవరికీ ఎవరూ తీసిపో ని విధముగా యుద్ధం జరిగింది. రానురాను

రాముడిదే పై చేయి అయింది. ఇది గమనించి రావణుడి సారథి రథాన్ని పక్కకు మళ్ళించాడు. అది అవమానంగా

భావించిన రావణుడు సారదిపై నిప్పులు చెరిగాడు. రథం తిరిగి రాముడి ముందు నిలిచింది.

బ్రహ్మాస్త్ర ప్రయోగం : శ్రీరాముని బాణాల తాకిడికి రావణుడి తలలు నేలరాలుతున్నాయి. కానీ చిత్రంగా మరలా

మొలుస్తు న్నాయి. ఆకాశానికి ఆకాశం, సముద్రా నికి సముద్రం సమానమైనట్లు రామరావణ యుధ్ధా నికి రామరావణ

యుద్ధమే సమానమన్నట్లు యుద్ధం జరిగింది. బ్రహ్మాస్త్ర ప్రయోగంతో రావణుని చంపవలసిందిగా మాతలి సూచించాడు.

శ్రీరాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో రావణుడిని అంతమొందించాడు.

3 . శీలవంతులను అగ్ని కూడా ఏమీ చేయలేదు. సీతాదేవి తన శీలం గొప్పదనాన్ని లోకానికి చెప్పిన ఘట్టం రాయండి.

జ. సీతను స్వీకరించడానికి నిరాకరించిన రాముడు : రావణుడు మరణించాక విభీషణుడిని లంకారాజుగా పట్టా భిషిక్తు డిని

చేశాడు. విభీషణుడు పల్ల కీలో సీతాదేవిని రాముని దగ్గరకు చేర్చాడు . సీత సంతోషంతో భర్తను చేరింది . ఆమెను

స్వీకరించడానికి శ్రీరాముడు నిరాకరించాడు.

ములుకుల్లా గుచ్చుకున్న శ్రీరాముని మాటలు: తన వంశ గౌరవమును నిలుపుకోవడానికే దుష్ట రావణుని చెర నుండి

సీతను విడిపించటానికి యుద్ధం చేశానన్నాడు. పర పురుషుడైన రావణుని దగ్గర చాలా కాలం ఉన్నందువల్ల సీత ప్రవర్తన

పై అనుమానం ఉందన్నాడు. సీత తన ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళి ఉండచ్చు అని శ్రీరాముడు అన్నాడు. శ్రీరాముని

మాటలు సీతకు ములుకుల్లా గుచ్చుకున్నాయి. స్థా యికి తగినట్లు మాట్లా డలేదని రామునితో అంది.

సీత అగ్ని ప్రవేశం : అగ్ని లోకి ప్రవేశించి తన శీలం గురించి శ్రీరామునికి నమ్మకం కలిగించాలనుకుంది సీత . లక్ష్మణుడు

చితిని సిద్ధం చేశాడు. సీత అగ్ని లోకి ప్రవేశించింది. అక్కడున్న వాళ్ళంతా ఆందోళన చెందారు.

సీతాదేవి గొప్పతనాన్ని చెప్పిన అగ్నిదేవుడు: అగ్ని దేవుడే స్వయంగా వచ్చి సీతాదేవి గొప్పతనాన్ని తెలియ చెప్పాడు.

ఆమెను స్వీకరించవలసినదిగా శ్రీరాముడిని కోరాడు. సీత శీలం గురించి తనకు అనుమానం లేదని , ఆమె శీలం

గొప్పతనాన్ని ముల్లో కాలకు చాటడానికే అగ్ని ప్రవేశం చేస్తు న్నా ఊరుకున్నానన్నాడు శ్రీరాముడు. సీతను ఆప్యాయంగా

దగ్గరకు తీసుకున్నాడు.
ఇలా శీలవంతులను అగ్ని కూడా ఏమీ చేయలేదని , సీత వంటి పతివ్రతలను తాకడానికి అగ్ని కూడా భయపడుతుందని

, సీత వంటి వారు లోకానికి ఆదర్శమని తెలుస్తోంది.

అదనపు ప్రశ్నలకు జవాబులు :

1 . రామాయణాన్ని చదవడం వల్ల వ్యక్తికి గానీ , సమాజానికి కానీ కలిగే ప్రయోజనము ఏమిటి?

జ. రామాయణంలో మానవ జీవనాన్ని మెరుగుపరిచే అనేక విలువైన సూచనలు , విషయాలు ఉన్నాయి. ఈ కావ్య

నాయకుడైన శ్రీరాముని అడుగుజాడలలో నడిచినచో ఉన్నత వ్యక్తు లుగా గుర్తింపు కలుగుతుంది. సమాజంలోని

అన్యాయాలను , అధర్మాలను తొలగించాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తికీ ఉన్నది. రామాదుల వలె జీవించండి , రావణాదులవలె

కాదు అని సందేశం ఇస్తుంది. మానవజీవితాన్ని సంస్కరించ గల మహాకావ్యం ఈ రామాయణం. ఈ కావ్యాన్ని చదవటం

వల్ల అమ్మానాన్నల అనురాగం, బిడ్డ లతో అనుబంధం, అన్నదమ్ముల ప్రేమ, భార్యాభర్తల సంబంధం , గురుభక్తి, శిష్యానురక్తి

, స్నేహబలం, ధర్మబలం, వినయం, వివేకం, జీవకారుణ్యం , ప్రకృతి లాలన – ఇలా ఒకటేమిటి ఎన్నో సంబంధాలకు

ఆదర్శంగా రామాయణం నిలిచింది . ఒక్క మాటలో చెప్పాలంటే రామాయణం చదవడం వల్ల సర్వగుణ సంపన్నుడైన

పరిపూర్ణ వ్యక్తిగా సమాజంలో జీవించవచ్చు.

2 . “శ్రీరాముడు మర్యాదాపురుషుడు – శ్రీరాముడు ధర్మానికి ప్రతీక” – వివరించండి.

జ. మంచిగుణవంతుడు, ఆపదల్లో తొణకనివాడు, ధర్మమూర్తి, ఆశ్రితులను ఆదుకునేవాడు, ఆడినమాట తప్పనివాడు ,

వీరుడు, సౌందర్యమూర్తి, తండ్రి మాట జవదాటనివాడు, పెద్దల యెడ గౌరవం, దేవతలు – ఋషులు, మునుల యందు భక్తి

కలవాడు.

అధర్మాన్ని అనుసరించిన వాలిని, రావణుని , రాక్షస గణాలను మట్టు పెట్టి ధర్మాన్ని స్థా పించాడు. రావణుని అవినీతిని

వ్యతిరేకించి వచ్చిన విభీషణునికి ఆశ్రయ మిచ్చి లంకకు రాజును చేశాడు. తన పినతల్లి కైకేయికి తండ్రి యిచ్చిన వరాలను

నెరవేర్చడానికి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. సీతను రావణుడి చెరనుండి విడిపించిన తరువాత ఆమె

పవిత్రు రాలు అని తనకు తెలిసినా ప్రపంచానికి వెల్ల డించటానికి అగ్ని పరీక్ష పెట్టా రు. వనవాస సమయంలో ఋషులు

అందరిని దర్శించుకొని వారి ఆశీస్సులను , వారిచ్చిన దివ్య శక్తు లను పొందారు. ఈ ఘటనలు అతని భక్తి ప్రపత్తు లకు

నిదర్సనం. ఈ విధంగా శ్రీరాముడు మర్యాదా పురుషుడని, ధర్మానికి ప్రతీక అని చెప్పవచ్చు.

3 . “సీత ఆదర్శనారి” వివరించండి.

జ. సీత జనకమహారాజు కుమార్తె. సకల సద్గు ణవతి . శ్రీరాముని అర్థాంగి. భర్తను సేవిస్తూ నీడలా అనుసరించడమే

ధర్మంగా భావించింది. అత్త వారింట ఎంతో అనుకూలంగా మెలిగింది. శ్రీరాముడు తండ్రి ఆజ్ఞ మేరకు అడవులకు

బయలుదేరినప్పుడు “వనవాస కష్టా లు భారిమ్చాలేవు” అని ఎంతమంది వారించినా వినకుండా రాముని వెంట
అడవులకు వెళ్ళి 14 సంవత్సరాలు వనవాస కష్టా లన్నీ అనుభవించింది. పతియే ప్రత్యక్ష దైవం అని ప్రపంచానికి చాటిన

ఆదర్శనారి సీత . రావణుని చెరలో ఉన్న పది నెలలు అశోకవనంలో భర్తనే తలచుకుంటూ కాలం గడిపింది. రావణుడు

ఎన్ని ఆశలు చూపినా , ఎంత భయపెట్టినా, ఎన్ని మాయలు పన్నినా వేటికీ లొంగలేదు. ఎంతో ధైర్యంగా భర్త రాకకోసం

ఎదురు చూసింది. హనుమంతుడు సీతను రాముని చెంతకు చేరుస్తా నని అన్నా, దానివల్ల తన భర్త పరాక్రమానికి మచ్చ

వస్తుందనీ , శ్రీరాముడు రావణుని జయించి తనను తీసుకు వెళ్ళడమే ఉచితమని చెప్పి హనుమంతుని మాటను

తిరస్కరించింది. ఈ కారణాల వల్ల సీత ఆదర్శనారి అని చెప్పవచ్చు .

4 . లక్ష్మణుని రామసేవాతత్పరతను తెల్పండి .

జ. లక్ష్మణుడు రాముని వెంట నీడలా అనుసరిస్తా డు. విశ్వామిత్రు ని యాగ సంరక్షణకు వెళ్ళినప్పుడు రామునికి తన పూర్తి

సహకారాన్ని అందించాడు. ఎక్కడ బస చేస్తే అక్కడ కుటీరంను నిర్మించాడు. రేయింబవళ్ళు ధనుస్సు దించకుండా కావలి

కాశాడు. రాత్రిపూట కంటికి కునుకు లేకుండా 14 ఏళ్ళు రాముడిని సంరంక్షించాడు. రావణుడు మాయలేడిగా మారీచుని

పంపినప్పుడు సీత దానిని కోరగా తానే వెళ్ళి తెస్తా నన్నాడు. రాముడు వారించి సీత కోరికను తానే తీరుస్తా నని , ఆమెను

జాగ్రత్త గా సంరంక్షించమని చెప్పినప్పుడు, అన్న మాట జవదాటక అలాగే ఆచరించాడు. రావణుడు కపటవేషధారియై

సీతను అపహరించుకు పో యినప్పుడు అన్నను ఓదారుస్తూ సీతను వెతకటంలో మునిగిపో యాడు. లంకలో రామరావణ

యుద్ధసమయంలో కూడా అన్నకు ఏ మాత్రం తీసిపో కుండా గొప్ప పరాక్రమంతో యుద్దంచేసి ప్రముఖ దానవులను

ఎందరినో సంహరించాడు. సితామాతను అగ్ని పునీతను చేసి అన్నకు అప్పగించి తన బాధ్యతను నెరవేర్చాడు. ఇలా అన్ని

విషయాలలోనూ లక్ష్మణుడు తన అన్నను సేవిస్తూ జీవించాడు.

5 . రామాయణంలో మీకు నచ్చిన పాత్ర ఏది? ఎందుకో తెల్పండి .

జ . రామాయణంలో నాకు నచ్చిన పాత్ర హనుమంతుడు. ఇతనిని ఆంజనేయుడు, అంజనీపుత్రు డు, పవనకుమారుడు,

వాయుపుత్రు డు , మారుతీ – అని పలు రకాలుగా పిలుస్తా రు. మారుతి మహా బలశాలి, శూరుడు, పసితనంలోనే

సూర్యుడిని చూసి పండు అనుకొని సూర్యుణ్ణి మింగటానికి ఆకాశానికి ఎగిరినవాడు. పవనపుత్రు డు స్వామి భక్తి

పరాయణుడు. అంటే తన యజమానికి ఎంతో నమ్మకంగా పనిచేసే వ్యక్తి . ఇతడు సుగ్రీవునికి నమ్మినబంటు. తరువాత

శ్రీరామునికి పరమభక్తు డు అయ్యాడు. తన మాటల నేర్పుతో రామలక్ష్మణులకు సుగ్రీవునితో మైత్రి కుదిర్చాడు.

హనుమంతుడు మాట్లా డే తీరు చూసి “చంపడానికి కత్తి ఎత్తి న శత్రు వుకు కూడా చేతులు రావు” అని రాముడు

మెచ్చుకున్నాడు. అంతటి వాక్చతురుడు హనుమంతుడు. వేదవేదాంగాలలో గొప్ప పండితుడైనా ఎప్పుడూ వినయంగానే

ఉంటాడు. సీతను వెతకడానికి సమర్థు డుగా అందరిచేత ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అందుకే రాముడు అతనికి తన

ముద్రికను ఇచ్చాడు. వానరవీరుల ప్రేరణతో మహాసముద్రా న్ని దాటాడు. వెళ్ళిన పని సాధించుకొని వస్తా నని ఆత్మవిశ్వాసం

చాటాడు. సముద్రం మధ్యలో మైనాకుడు ఆతిధ్యానికి ఆహ్వానించినా విశ్రాంతి తీసుకోని కార్యదక్షుడు. సింహిక అనే

రాక్షసిని చంపిన వీరుడు. సీత జాడ దొరకక ఆత్మహత్యకు ప్రయత్నించి కూడా విచక్షణతో ప్రా ణాలు నిలుపుకున్నవాడు.
లంకలో ఆణువణువూ వెదకి సీతమ్మను గుర్తించిన కార్యశూరుడు. సీతను చూసి రమ్మంటే ఆ పనితో పాటు లంకను

దహనం చేసి వచ్చిన హనుమంతుడు సమయానుకూలంగా ఎలా ప్రవర్తించాలో తెలిసిన మహనీయుడు.

6 .రామాయణం మనకు అందించే జీవనముల్యాలను తెల్పండి .

జ . రామాయణం లోని శ్రీరాముని పాత్ర మానవ జీవితాలకు మార్గదర్శకమైనది. సత్యం, ధర్మం , ప్రతిజ్ఞా పాలన,

పితృవాక్యపరిపాలన, ఆశ్రిత జన పరిరక్షణ, పెద్దల పట్ల భక్తి , గౌరవం కలిగి ఉండటం ద్వారా ఆదర్శమైన జీవితం

గడపగలుగుతాము. దేవతలు, మునులు, ఋషుల పట్ల భక్తితో వినమ్రు లై ఉండాలి. వారి ఆశిస్సుల వలన కష్టా లు

కడతేరుతాయి . కష్టా లలో ధైర్యంగా ఉండాలి. మంచివారిని స్నేహితులుగా ఏర్పరుచుకోవడం వల్ల ఆపదల నుండి బయట

పడగలము అని రాముని పాత్ర వల్ల తెలుసుకుంటాము. సీత పాత్ర ద్వారా” పతికి అనుకూలంగా నడచుకోవాలి.

అంతఃపురమైనా, అరణ్యమైనా భర్తతో కలసి ఉంటేనే స్త్రీకి అలంకారం. ఆపదలు వచ్చినప్పుడు ధర్మం జయిస్తుందనే

నమ్మకం కలిగి ఉండాలి. ధైర్యంగా వాటిని ఎదిరించాలి.” అని తెలుస్తుంది. లక్ష్మణుని పాత్ర ద్వారా “అన్నదమ్ముల

అనురాగం, అన్నపట్ల గౌరవం కలిగి ఉండాలి” అని తెలుస్తుంది. రావణుని పాత్ర ద్వారా “ఎన్ని సద్గు ణాలున్నా పరస్త్రీ

వ్యామోహం వల్ల సర్వనాశానమౌతారని తెలుస్తుంది. ధర్మాన్ని , ధర్మ పక్షపాతులను దూషించి దూరం చేసుకోవడం తన

మరణాన్ని కోరి తెచ్చుకోవడమే అవుతుంది” అని తెలుస్తుంది. తల్లిదండ్రు లు దైవ సమానులని , పరస్త్రీ తల్లితో సమానమని

రామాయణం మనకు సందేశాన్ని ఇస్తుంది.


++

You might also like