You are on page 1of 5

అట్లతద్ది పూజా

విధానం
Atla Thaddi Pooja Vidhanam - Telugu

అట్లతద్ది పూజా విధానం


ఈ పండుగకు ముందురోజు నుంచే అన్ని వస్తువులను, సముదాయాలను ఏర్పా టు
చేసుకోవాలి. ఇక స్త్రీలు తమను తాము అలంకరించుకోవడం కోసం రాత్రినుంచే తమ
చేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు. ఇలా పూసుకోవడం వల్ల కూడా కొన్ని మంచి
ఫలితాలు అందుతాయి. తరువాత ఉదయాన్నే లేవగానే రోజువారి కార్య క్రమాలను
ముగించుకుని, స్నా నం ఆచరించాలి. ఉదయం భోజనం చేసిన తరువాత ఎటువంటి
తినుబండారాలను కూడా ముట్టుకోకూడదు. రోజంతా అభోజనంగానే వుండాలి. సాయంత్రం
అవగానే గౌరీదేవికి ప్రత్యే క పూజలు నిర్వ హించుకుని, చంద్రునిని దర్శించుకుంటారు. ఆ
తరువాత ఈ పండుగ ప్రత్యే కత అయిన అట్లను తిని, ఉపవాసాన్ని విరమించుకుంటారు.
చాలావరకు ఈ పండుగరోజు 11 రకాల కూరలతో కూడిన వంటకాలను చేసుకుంటారు.

అట్లతద్దినాడు స్త్రీలు, పిల్లలు తమకెంతో ఇష్టమైన ఉయ్యా లను ఊగుతారు. సరదాపాటలు


పాడుకుంటూ రోజంతా హాయిగా గడుపుతారు. గౌరీదేవికి పూజలో కుడుములు, పాలితాలికలు,
పులిహోర వంటివి నైవేద్యంగా సమర్పి స్తా రు. అట్లతద్ది నోమును నిర్వ హించుకున్న వారు 11

n
మంది ముత్తయిదువులను ఆహ్వా నించి, వారికి భోజనాలను తినిపిస్తా రు. నోమును నోచుకునే

f.i
స్త్రీలతోబాటు వాయనం అందుకునే స్త్రీలు కూడా ఉపవాసం వుండాలి. లేకపోతే ఎటువంటి
ఫలితాలు దక్క వు. పూజలో చేతులకు చామంతి, తులసిదళం, తమలపాకు వంటి మొదలైన
పుష్పా లను పత్రాలతో 11 ముడులు వేసి తోరలు కట్టుకుంటారు. పసుపు రంగులో వున్న
pd
గౌరీదేవిని, గణపతిని ఒక కలశంలో వుంచుతారు.

ఒక పళ్లెంలో బియ్యం పొసి, మధ్య మధ్య లో డిప్ప లు మాదిరిగా చేసిన కుడుములను


వుంచుతారు. వాటిమధ్య లో పసుపు, కుంకుమలను వేస్తా రు. అలాగే మధ్య లో పుష్పా లతో
a

అలంకరిస్తా రు. ఇలా చేసిన దానిని కైలాసంగా భావిస్తా రు మహిళలు. పూజా కార్య క్రమాలు
st

నిర్వ హించే సమయంలో లలితా సహస్రనామం, గౌరీ అష్టోత్తర శతనామావళిని ఖచ్చి తంగా
చదువుకోవాల్సి వుంటుంది. తరువాత అట్లతద్ది కథను చదువుకోవాలి. పూజా కార్య క్రమం
పూర్తియిన తరువాత పిలిచిన 11 మంది ముత్తయిదువులకు 11 అట్లు చొప్పు న పెట్టి.. గౌరీదేవి
In

వద్ద పెట్టిన కుడుములలోనుంచి ఒక్కొ క్క టి పెట్టి వాయనమివ్వా లి.

ఈ విధంగా అట్లతద్ది నోములో వాయనాన్ని అందుకున్న స్త్రీలు… అందులో వున్న అట్లను


వాళ్లు గానీ వారి కుటుంబీకులుగానీ మాత్రమే తినాలి. ఇతరులకు అస్స లు ఇవ్వ కూడదు.
అలా ఇవ్వ డం వల్ల అరిష్టా లు కలిగే పరిణామాలు వున్నా యి. వాయనం ఇచ్చే సమయంలో
స్త్రీలు తమ కొంగును ముందుకు తెచ్చి , అందులో వాయనాన్ని అందిస్తా రు. ఆ వాయనాన్ని
అందుకునే స్త్రీలు కూడా అదే పద్ధతిని పాటించాల్సి వుంటుంది. ఇలా ఈ విధంగా అట్లతద్ది
పండుగను మన తెలుగు మహిళలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు.

మన ఆంధ్రదేశంలో జరుపుకునే ఈ అట్లతద్ది పండుగ… ఉత్తర భారతదేశంలో స్త్రీలు


ప్రత్యే కంగా జరుపుకునే ‘కార్వా చౌత్’ పండుగతో సమానం. రోమ్ లో కూడా ఇటువంటి
ఆచారాలు, పద్ధతులతో కూడిన పండుగను అక్క డి స్త్రీలు అవలంభించుకుంటారు. ఈ
పండుగను వారు జనవరి 21వ తేదీన ‘‘సెయింట్ ఆగ్నె స్ ఈవ్’’గా పేర్కొంటారు.
పెళ్లయిన ఆడవాళ్లు తమ భర్తలు ఎటువంటి అనారోగ్య ఇబ్బందులతో బాధపడకుండా
పదికాలాలపాటు సుఖంగా, సంతోషంగా వుండాలనే ఈ అట్లతద్ది పండుకను ప్రత్యే కంగా
జరుపుకుంటారు. ప్రస్తుతకాలంలో ఈ పండుగ ప్రభావం తగ్గినప్ప టికీ.. ఇంకా చాలామంది
స్త్రీలు దీనిని జరుపుకుంటున్నా రు.
ఆశ్వ యుజ బహుళ తదియ నాడు వచ్చే పండుగ అట్ల
తద్దె నోము.

`అట్ల తద్దో య్‌ఆరట్లో య్‌ముద్దపప్పో య్‌మూడట్లో య్‌!’ అంటూ పాడుతూ, ఆటపాటలూ,


చప్ప ట్లూ , కోలాహలమూ, సందడితో జరిగే పండుగ ఇది. చంద్రోదయ సమయం తరువాత ఈ
పండుగ ఊపునందుకుంటుంది. గౌరీదేవిని విధ్యు క్తంగా పదహారు ఉపచారాలతోనూ
పూజించుకుని, పసుపు కుంకుమలు, వస్త్రా లు సమర్పించుకుని, అట్లు నివేదించి, తాము
ఆహ్వా నించిన ముత్తయిదువులకు తాంబూలాలతో సహా వాయనాలు ఇవ్వ డం… ఇట్లా బహు
సంబరంగా సాగుతుంది అట్ల తద్దె.

ఆశ్వ యుజ బహుళ తదియ నాడు అట్ల తద్దె నోము చేసుకోని తెలుగు వనిత వుండనే
వుండదు. కన్య లు తమకు చక్క ని వరుడు కావాలనీ, వివాహితలు సత్సంతానం కోసం ఈ
నోము నోస్తా రు. ఈ నోము చేసుకున్న తరువాతే పార్వ తీదేవి, పరమేశ్వ రుణ్ని పతిగా
పొందిందట. ఈ నోమును గురించి గిరిజాదేవికి చెప్పి నవాడు నారదమహర్షి. చంద్రోదయం
తరువాత చేస్తా రు కనుకనూ, సాక్షాత్తూ గౌరీదేవే స్వ యంగా నోచుకున్న ది కనుకనూ, ఈ
వ్రతానికి `చంద్రోదయ గౌరీవ్రతం’ అనే పేరు కూడా వుంది.

అట్లతద్ది పండుగలోని రహస్యం

n
పెళ్ళ యిన స్త్రీలు చేస్తే కుటుంబం ధనధాన్యా లతో సంతాన వృద్ధి జరుగుతుంది. పెళ్ళి కాని
f.i
యువతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే కోరిన వరుడు లభిస్తా డని చెబుతారు. నవగ్రహాలలోని
కుజుడు అనగా అంగారకునికి అట్లంటే ఇష్టం. అట్లను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టడం వల్ల
కుజదోషం పోయి సంసారంలో ఎలాంటి అడ్డంకులు రావు. స్త్రీలలో కుజుడు రజోదయమునకు
pd
కారకుడు కాబట్టి ఋతు సంబంధమైన సమస్య లు రాకుండా కాపాడుతాడు. అందువల్ల
గర్భ ధారణ సమస్య లవంటివి ఉత్ప న్నం కావు.
a

ఈ అట్ల తయారీలో మినుములు, బియ్యా న్ని ఉపయోగిస్తా రు. మినుములు రాహువుకు,


బియ్యం చంద్రునికి ఇష్టమైన ధాన్యా లు. ఈ ధాన్యా లలో తయారుచేయబడిన అట్లను
st

వాయనంగా ఇవ్వ డం వల్ల గర్భ దోషాలు తొలగిపోతాయి. గర్భ స్రావాల వంటివి నివారించబడి
సుఖప్రసవం జరుగుతుంది. అట్లతద్ది పండుగలోని రహస్యం ఇదే.
In

వ్రతమెలా చేయాలి:

ఆశ్వ యుజ బహుళ తదియనాడు తెల్లవారుజామునే లేచి, చద్ది అన్నం, గోంగూర పచ్చ డి,
నువ్వు ల పొడి, ఉల్లిపాయ పులుసు, గడ్డపెరుగులతో, కడుపు నిండా సుష్ఠు గా భోజనం చేయాలి.
తాంబూలం మరిచిపోకుండా వేసుకోవాలి. ముందు రోజే చేతులూ, కాళ్లకు గోరింటాకు
పెట్టుకుంటారు కనుక అవీ, నోరూ ఎరగ్రా పండి కళకళలాడుతూ వుంటారు. తరువాత
ఆటపాటలతో కాలక్షేపం చేయాలి. ఉయ్యా ల ఊగాలి. స్నా నపానాలు ముగించి, గౌరీదేవిని
పూజించుకోవాలి. పగలంతా ఉపవాసం వుండాలి. చీకటి పడ్డా క చంద్రదర్శ నం తరువాత
తిరిగి శుచి అయి మళ్లీ గౌరీపూజ చేసుకుని, అమ్మ వారికి పది అట్లు నైవేద్యం పెట్టా లి. ఆ
తరువాత ముత్తయిదువులను అలంకరించి, పదేసి అట్లు, పది పళ్లు వాయనం ఇవ్వా లి. ఆ
పైన వ్రతకథను చెప్పు కుని, అక్షింతలు తల మీద వేసుకోవాలి. ఆ పైన భోజనం చేయాలి.

పూర్వ వృత్తాంతం:
పూర్వం ఒక రాజుకు కుమారులున్నా రు కానీ, పుత్రిక కోసం పరితపించాడు. చిట్టచివరికి
కూతురు పుట్టింది. ఆమెను అల్లా రు ముద్దుగా పెంచుకున్నా డు. ఆమె అన్న లకు కూడా
చెల్లెలంటే పంచప్రాణాలు. ఎంతో గారాబంగా చూసుకునేవారు. రాకుమార్తెకు యుక్తవయస్సు
రావటంతో, వరాన్వే షణ చేయసాగారు. ఎందరిని చూసినా, దాదాపు కుదిరినట్లే అనుకున్న
తరువాత, అవి తప్పి పోతుండేవి. అలా జరగటానికి కారణమేమిటో తెలియక పాపం, ఆ
రాకుమారులు, కుమిలిపోతుండేవారు. ఇట్లా ఎన్నో సార్లు జరిగిన తరువాత, రాకుమారి విరక్తి
చెంది, గౌరీదేవి ఆలయానికి వెళ్లి, అక్క డ ఆత్మ హత్య చేసుకోవటానికి నిశ్చ యించుకున్న ది.
సరిగ్గా ఆ సమయానికి, అశరీరవాణిగా గౌరీదేవి, చంద్రోదయగౌరీవ్రతం ఆచరిస్తే, మంచి భర్త
లభిస్తా డని చెప్పింది. దేవి చెప్పి నట్లుగా, వ్రతాన్ని ఆచరించింది రాకుమార్తె. చంద్రోదయం
వరకూ వేచివుంటే, సుకుమారి అయిన తమ చెల్లెలు, శోష వచ్చి పడిపోతుందేమో అనుకుని
బెంబేలెత్తిన రాకుమారులు, చంద్రోదయం కాకుండానే, ఒక చోట మంట వేసి, ఆ మంటను
అద్దంలో సోదరికి చూపించారు. అది చంద్రోదయమే అనుకున్న రాకుమార్తె, భోజనం చేసింది.
ఆ విధంగా వ్రతభంగం కావటంతో, మళ్లీ ఎన్నో సంబంధాలు, కుదరకపోయేసరికి, వయసు
మీరినవారిని చూడసాగారు, తల్లిదండ్రులు. బెదిరిపోయిన రాకుమార్తె, ముసలి భర్తతో
జీవించటం కంటే, జీవితాన్నే ముగించుకోవటం మేలని, అడవిలోకి పారిపోయి, మళ్లీ
ఆత్మ హత్య కు తలపడింది.

ఆదిదంపతుల అనుగ్రహం:
భూలోకసంచారం చేస్తున్న పార్వ తీపరమేశ్వ రులు, వృద్ధదంపతుల రూపంలో ఆకాశం నుంచి
దిగి వచ్చి , ఆమె అన్న లు చేసిన పొరపాటును తెలియజెప్పి , మరోసారి, ఎలాంటి పొరపాట్లూ
చేయకుండా వ్రతాచరణ చేయమనీ, అలా చేస్తే తప్ప కుండా మంచి జీవితం లభిస్తుందనీ
చెప్పి , ఆశీర్వ దించి పంపించారు. ఆ విధంగా చేసిన ఆ రాకుమార్తెకు, అతిత్వ రలోనే
మహాశివభక్తు డైన కరివీరుడనే యువకునితో వివాహమై, జీవితాంతమూ సకలసంపదలతో
తులతూగుతూ గడిపింది.

ఉద్యా పన:

n
పదిమంది ముత్తయిదువులకు, ఒక్కొ క్క రికీ, ఒక నల్లపూసల గొలుసు, లక్క జోళ్లు , రవికెల బట్ట,
దక్షిణ, తాంబూలంతో పాటు పది అట్ల చొప్పు న వాయనం ఇవ్వా లి. వారికి విందు భోజనం
f.i
పెట్టి, సంతృప్తి పరచి, వారి దీవెనలు అందుకున్న తరువాతే, వ్రతం చేసినవారు భోజనం
చేయాలి.
pd
మన పెద్దలు ఏర్ప రచిన ప్రతి నియమమూ, ప్రతి నోమూ, వ్రతాల వెనుక ఎంతో చక్క ని
శాస్త్రీయత వున్న ది. అందుకనే ఆయా వ్రతాలకు విశిష్టత కలిగింది. కుజదోషం గల
స్త్రీపురుషులకు త్వ రగా వివాహాలు కావు. కుజదోషం గల యువతులు, అట్ల తద్దె నోము
a

నోచుకోవటం వల్ల, వారికున్న కుజదోషం పోవటమే కాకుండా, సాంసారి జీవితం కూడా సాఫీగా
గడిచిపోతుంది. పైగా ఈ వ్రతం రాహు చందలకు కూడా సంబంధించింది కావటంతో,
st

గర్భ దోషాలు సైతం పరిహారమై, సంతానసుఖమూ కలుగుతుంది. ఉపవాసమూ, ఉయ్యా లలు


ఊగటం వల్ల ఆడపిల్లలకు నడుము గట్టిపడుతుందని మన బామ్మ లు ఏ నాడో సెలవిచ్చా రు.
ఆటపాటలతో మానసికోల్లా సమూ, తద్వా రా శారీరకారోగ్య మూనూ. మరదే పెద్దల మాటంటే!
In

పతిదేవుని కోసం:
అనాదిగా మన దేశంలో స్త్రీలు, భర్తను దైవసమానుడుగా భావించి పూజించటం వుంది.
అందుకని అలాంటి పతిదేవుని కోసం రోజంతా నీరైనా తీసుకోకుండా ఉపవసిస్తా రు ఇల్లా ళ్లు .
ఈ వ్రతం కూడా అట్ల తద్దెలా తెల్లవారు జామునే ప్రారంభమవుతుంది. సాయంకాలం
చంద్రదర్శ నం అయిన తరువాతే ముగుస్తుంది. మహాశివుడు, ఈ వ్రతాన్ని గురించి తన
ప్రియభార్య అయిన పార్వ తీసతికి చెబుతాడు. అర్జునుడు పాశుపతాస్త్రం సాధించటం కోసం
తపస్సు కు వెళ్లిన తరువాత, పాండవులు పలు కష్టా లను ఎదుర్కు న్నా రు. అప్పు డు
శ్రీకృష్ణభగవానుడు, ద్రౌపదితో ఈ వ్రతం చేయమనీ, తద్వా రా సుఖసంతోషాలు
కలుగుతాయనీ ఉపదేశిస్తా డు. ద్రౌపది ఆ విధంగానే చేసి, సత్ఫ లితాలు పొందింది. కర్‌వా
చౌథ్‌రోజున మట్టి కుండలో నీరు నింపి చంద్రునికి అర్ఘ్యం ఇస్తా రు. తెల్లవారు జాము నుంచీ
సాయంకాలం చంద్రదర్శ నం అయ్యే వరకూ నిర్జలంగా ఉపవాసం వుండి పూజలు
చేసుకుంటారు కనుకనే. దీనికి `కర్‌వా చౌథ్‌’ అనే పేరు వచ్చింది.

భార్యా భర్తల అనురాగానికి:


ఈ వ్రతం రోజున మహిళలూ, చిన్నా , పెద్దా తేడా లేకుండా, వయసును కూడా
పట్టించుకోకుండా, నవవధువుల్లా గా అలంకరించుకుని, చేతులూ, కాళ్లకు రకరకాల డిజైన్‌లలో
గోరింటాకు పెట్టుకుంటారు. అందరి వదనాలూ ఉత్సా హం తొణికిసలాడుతూ, సాయంకాలం
చంద్రదర్శ నం కోసం ఎదురుచూస్తుంటాయి. ఈ పండుగ చేసుకోవటంలో ఉత్తరాదిలోనే,
వేర్వే రు ప్రాంతాల్లో వేర్వే రు పద్ధతులున్నా యి. ఉత్తరప్రదేశ్‌లో ప్రతి ఇంట్లో నూ `మాల్‌పువా’
అనే మైదాపిండి తీపి పూరీలు చేసుకుంటారు. రాజస్థా న్‌లో ఫేణీలూ, పంజాబులో తీపి, కారం
వంటకాలు చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో `కఢీ, చావల్‌’ (మజ్జిగ పులుసు, అన్నం) దేవునికి
నివేదించే ఆచారమూ వుంది. భార్యా భర్తల మధ్య అంతరంగానుబంధాన్నీ ,
ప్రేమానురాగాలనూ వృద్ధి చేసే పండుగ ఇది. తరం తరువాత తరానికి ఈ పండుగ
సాంస్కృతిక సంప్రదాయంగా అందుతూ వస్తున్న ది.

n
f.i
a pd
st
In

You might also like