You are on page 1of 1

ఎప్సంసాల్ట్ మొక్కను ఆకుపచ్చగా ఉంచుతుంది.

గుబురుగా, ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.

ఆకులను ఆకుపచ్చగా ఉంచుతుంది కాబట్టి కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైన క్లోరోఫిల్ తయారవడానికి
సహాయపడుతుంది.

ఎప్సంసాల్ట్ ను నీటిలో కలిపి మొక్కలకు ఇచ్చినప్పుడు మొక్కలు సులభంగా త్వరగా తీసుకుంటాయి‌‌.

ఆకుల మీద పిచికారి కూడా చేయవచ్చు.

ఎప్సం సాల్ట్ ను చెట్టు చుట్టూ ఒక చెంచా లేక రెండు చెంచాలు మొక్క సైజును బట్టి వేయాలి.

నీళ్ళలో కలిపి కూడా మొక్క చుట్టూ పోయచ్చు.

ఒక లీటరు నీటికి ఒక టీస్పూన్ ఎప్సం సాల్ట్ వేసి కలిపి మొక్క చుట్టూ పోయవచ్చు.

నారు మొక్కలు ప్రధాన మడిలో నాటేటప్పుడు, పెద్ద మొక్కలు కుండీల్లో నాటేటప్పుడు ట్రాన్స్ ప్లాంట్ షాక్ నుంచి
కోలుకోవడానికి మొక్క సైజుని బట్టి కొద్దిగా నీళ్ళలో కలిపి కానీ లేక నేరుగా అయినా మొక్కలకు ఇవ్వవచ్చు.

వేరు వ్యవస్థ బాగా పెరుగుతుంది‌.

ఇండోర్ మొక్కలకు, లాన్ లకు కూడా వాడవచ్చు.

చిక్కుడు, బీన్స్, ఆకుకూరలకు ఇవ్వనవసరం లేదు.

ఆకు ముడత ఉన్న మొక్కలకు చల్లితే ఆకు ముడత పోతుంది.

మట్టి లో వచ్చే స్లగ్స్, స్నెయిల్స్ మీద ఎప్సం సాల్ట్ ను నేరుగా చల్లితే అవి చనిపోతాయి.

You might also like