You are on page 1of 4

శ్రీగంధం సాగు పద్ధ తి : నేల స్వభావం: ఎర్రమట్టి నేలలు, పసుపు మట్టి నేలలు, ఇసుకతో కూడిన రేగడి నేలలు,

నలుపు మట్టి మరియు ఎర్రమట్టి కలయిక గల మిశ్రమ నేలలు శ్రీ గంధం సాగుకు అనుకూలమైన నేలలు

రేగడి నేలలు, నీరు నిలిచే బురద నేలలు, చౌడు నేలలు శ్రీగంధం సాగు అనుకూలమైన నేలలు కావు

భూమిని దున్నే పద్ధ తి: ట్రా క్టర్ తో నేలను చదును చేసి కొద్దిమర
ే ఏటవాలుగా తయారు చేయాలి తద్వారా ఎక్కువ

వర్షపాతం ఉన్నచో నీరు నిలిచి ఉండకుండా త్వరగా బయటకు వెళ్ళిపో తుంది. వీలు ఉన్నచోట మాత్రమే రైతులు

శ్రీగంధం వరుసలను ఉత్త ర దక్షిణ దిశలో ఏర్పాటు చేసుకోవాలి ప్రథమ ప్రా ధాన్యత నేల ఏటవాలు స్వభావానికి

ఇవ్వాలి.

శ్రీగంధం సాగు వివరాలు: శ్రీగంధం చెట్టు ని వివిధ ప్రా ంతాలలో తెల్ల గంధం చెట్టు అని , గంధం చెట్టు అని పిలుస్తా రు

ఇంగ్లీష్ లో శాండల్ వుడ్ అంటారు శాస్త్రీయ నామం santalum album . తెలుగు రాష్ట్రా ల వాతావరణం శ్రీగంధం సాగుకు

చక్కగా అనుకూలిస్తు ంది.

నేల స్వభావం: ఎర్రమట్టి నేలలు, పసుపు మట్టి నేలలు, ఇసుకతో కూడిన రేగడి నేలలు, నలుపు మట్టి మరియు

ఎర్రమట్టి కలయిక గల మిశ్రమ నేలలు శ్రీ గంధం సాగుకు అనుకూలమైన నేలలు రేగడి నేలలు, నీరు నిలిచే బురద

నేలలు, చౌడు నేలలు శ్రీగంధం సాగు అనుకూలమైన నేలలు కావు భూమిని దున్నే పద్ధ తి: ట్రా క్టర్ తో నేలను చదును

చేసి కొద్దిమేర ఏటవాలుగా తయారు చేయాలి తద్వారా ఎక్కువ వర్షపాతం ఉన్నచో నీరు నిలిచి ఉండకుండా త్వరగా

బయటకు వెళ్ళిపో తుంది. వీలు ఉన్నచోట మాత్రమే రైతులు శ్రీగంధం వరుసలను ఉత్త ర దక్షిణ దిశలో ఏర్పాటు

చేసుకోవాలి, ఉత్త ర దక్షిణ దిశలో వరుసలను ఏర్పాటు చేసుకున్నట్లైతే సూర్యరశ్మి మొక్కలకు ఎక్కువ సమయం

అందుబాటులో ఉంటుంది అందువలన మొక్కలు చక్కగా ఎదుగుతాయి , అయినప్పటికి ప్రథమ ప్రా ధాన్యత నేల

ఏటవాలు స్వభావానికి మాత్రమే ఇవ్వాలి.

శ్రీగంధం పాక్షిక పరాన్నజీవి మొక్క నేలలోని పో షకాలను స్వంతగా గ్రహించలేదు , తనతో పాటు నివసిస్తు న్న ఇతర

మొక్కలను తన వేరు వ్యవస్థ ద్వారా అనుసంధానం చేసుకుని పో షకాలను గ్రహిస్తు ంది. నేలలో నత్రజని ఇమిడ్చే శక్తి

ఉన్న host మొక్కలు శ్రీ గంధం ఎదుగుదలకు సహకరిస్తా యి శ్రీగంధం నాటినపుడు croton , కంది ,అవిసే

మొక్కలను కూడా నాటవలసిన ఉంటుంది మరియు శాశ్వత host మొక్కలు సరుగుడు లేదా సర్వి చెట్టు ,నల్ల

తుమ్మ చెట్టు , జిట్రేగి చెట్టు Rosewood plant ,గానుగ చెట్టు Biodiesel plant ఈ రెండు నుండి మూడు జాతుల

శాశ్వత host మొక్కలు నాటడం వలన శ్రీ గంధం మొక్క చక్కగా ఎదుగుతుంది, ఇందులో ఉత్త మమైన మొక్కలు

సరుగుడు మరియు నల్ల తుమ్మ చిన్న ఆకులతో తక్కువ నీడనిస్తు ంది ,ఎక్కువ సూర్య రశ్మి శ్రీ గంధం మొక్కల

అందే అవకాశం ఉంటుంది.


మలబార్ వేప మొక్క చాలా ఎత్తు కు ఎదుగుతుంది శ్రీగంధం మొక్కకు అధిక నీడనిస్తు ంది కావున శ్రీగంధం

ఎదుగుదల చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల మలబార్ వేపతో శ్రీగంధం సాగు చేపట్ట కూడదు.

పండ్ల జాతి మొక్కలు నిమ్మ ,బత్తా యి, దానిమ్మ, మామిడి ,సీతాఫలం మొక్కలు భూమిలో నత్రజని ఇమిడ్చే

మొక్కలు కావు, కావున శ్రీగంధం ఎదుగుదల తక్కువగా ఉంటుంది అందువలన పండ్ల జాతి మొక్కలతో శ్రీగంధం సాగు

చేపట్ట కూడదు

శ్రీ గంధం మొక్కకి వేరు వ్యవస్థ ఎదుగుదల చాలా అవసరం కాబట్టి శ్రీగంధం విత్త నాలను 20 సంవత్సరాల పైబడి

మొక్కల నుండి నేరుగా సేకరించి నేరుగా విత్త నాలను నాటటం ఉత్త మం. విత్త నాలను నేరుగా నాటడం

విలుకానట్ల యితే ఐదు నెలల లోపు చిన్న వయసు గల నర్సరీ మొక్కలు నాటండి ఎక్కువ వయస్సు గల

మొక్కల్లో నర్సరీ కవర్ సంచిలో వేరు వ్యవస్థ సరిగా ఎదగదు.

మొక్కలు నాటుతున్న సమయంలో అదే గుంతలో జతగా క్రో టన్ మొక్కలు నాటండి, తర్వాత రెండు నుండి మూడు

ఫీట్ల దూరంలో ఎడమవైపు ఒక కంది మొక్కను, కుడి వైపు మరో కంది మొక్కను నాటండి, తర్వాత 4 నుండి 5 ఫీట్ల

దూరంలో ఎడమవైపు ఒక అవిశ మొక్కను నాటండి అలాగే కుడివైపు మరో అవిశ మొక్కను నాటండి, తర్వాత పది

ఫీట్ల దూరంలో ఎడమ వైపు ఒక సరుగుడు మొక్కను నాటండి అలాగే కుడివైపు నల్ల తుమ్మ మొక్కను నాటండి

శ్రీగంధం మొక్కలను ఏర్పాటు చేసుకునే పద్ధ తి: శ్రీగంధం మొక్కకి శ్రీగంధం మొక్కకి 20 ఫీట్ల దూరం, వరసకి వరసకి

15 ఫీట్ల దూరం, శ్రీ గంధం మొక్కకి శ్రీ గంధం మొక్కకి మధ్యలో పది ఫీట్ల దూరంలో ఎడమవైపు సరుగుడు మొక్క

కుడివైపు పది ఫీట్ల దూరంలో నల్ల తుమ్మ మొక్కను నాటండి ఇలా నాటి నట్ల యితే ఒక ఎకరానికి 145 శ్రీ గంధం

మొక్కలు సుమారుగా 73 సరుగుడు మొక్కలు , సుమారుగా 72 నల్ల తుమ్మ మొక్కలు నాటవచ్చు అంతేకాకుండా

తక్కువ కాలం జీవించే క్రో టన్, కంది, అవిస మొక్కలను పైన చెప్పిన విధంగా నాటుకోవాలి, ఐదు సంవత్సరాల తర్వాత

క్రో టన్ కంది అవిస మొక్క లను పూర్తిగా తొలగించాలి , సరుగుడు మరియు నల్ల తుమ్మ మొక్కలను శాశ్వతంగా

శ్రీగంధం మొక్కలతో పాటు సంరక్షించాలి ఒకవేళ సరుగుడు ,నల్ల తుమ్మ మొక్కలు చనిపో తే శ్రీగంధం మొక్క కూడా

చనిపో తుంది , కావున శ్రీ గంధం మొక్కల అమ్మిన తర్వాతనే సరుగుడు మరియు నల్ల తుమ్మ మొక్కలను అమ్మండి

అగ్ని ప్రమాదాల నుండి రక్షణ చర్యలు :వేసవిలో తరచూ జరిగే అగ్ని ప్రమాదాల నివారణకు వ్యవసాయ క్షేత్రం చుట్టూ

సో లార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకొని, సో లార్ ఫెన్సింగ్ అనుకొని నాలుగు దిక్కులు మట్టి రోడ్ల ను ఏర్పాటు చేయాలి

ఈ రోడ్డు ను ఎప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు చేపట్టా లి , కలుపు మొక్కలు లేని రోడ్లు అగ్ని వ్యాప్తి

చెందకుండా శ్రీగంధం తోటను కాపాడతాయి


ఎరువుల యాజమాన్యం: శ్రీ గంధం తోటకి పశువుల ఎరువు ,మేకల ఎరువు , కోళ్ల ఎరువు అందించాలి వీటితోపాటు

నత్రజని ,భాస్వరం, పో టాస్ , క్యాల్షియం ,మెగ్నీషియం, ఐరన్ సల్ఫర్, బో రాన్, జింక్ మూలకాలను అందించాలి

కొమ్మల కత్తి రింపు పద్ధ తి : శ్రీగంధం మొక్క 365 రోజులు పచ్చటి ఆకులతో ఉంటుంది ఏ కాలంలో కూడా ఆకులు

రాలిపో వు, కావున 365 రోజులు సూర్యరశ్మి సమృద్ధిగా అందేలాగా మొక్కను శంఖు ఆకారంలో కత్తి రింపులు చేపట్టా లి

తద్వారా శ్రీగంధం చెట్టు కి పైన ఆకుల నుండి క్రింది ఆకుల వరకు పూర్తిగా సూర్యరశ్మి అందుతుంది host మొక్కలను

మరియు శ్రీ గంధం మొక్కలను ఒకే ఎత్తు ఉండే విధంగా కత్తి రింపులు చేపట్టా లి.

శ్రీ గంధం చెట్టు కొమ్మలను రెండు సంవత్సరాల వయస్సు వరకు ఎలాంటి కత్తి రింపులు చేపట్ట వద్దు 3 నుండి

7 సంవత్సరాల వయసులో ప్రతి సంవత్సరం క్రింది నుండి 2ft మేరకు కొమ్మలను తొలగించాలి, ఎనిమిది సంవత్సరాల

వయసులో 10ft చక్కటి ఏకైక కాండం గల శ్రీ గంధం చెట్టు ఉండేలాగా కొమ్మ కత్తి రింపుల చేపట్టా లి.

ఈ కొమ్మ కత్తి రింపులు 33% మాత్రమే చేపట్టా లి ఉదాహరణకి 30 ft లు ఎదిగన


ి శ్రీగంధం మొక్కకి కింది వైపు 10ft

మేరకే కొమ్మలు తొలగించాలి ,పైన 20 ft మొక్క కొమ్మలతో ఆకులతో నిండుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. చెట్టు

కొమ్మలను ప్రధాన కాండానికి అతిసమీపంలో కత్తి రింపులు చేపట్ట కూడదు కొమ్మ ఏ సైజు ఉంటే ఆ మేరకు స్థ లాన్ని

వదిలేసి కొమ్మ కత్తి రింపుల చేపట్టా లి. రంపంతో ముందుగా కొమ్మ కింది వైపు సగం మేరకు కత్తి రింపు చేపట్టి ఆ తర్వాత

కొమ్మ పైనుండి కత్తి రింపు కొనసాగించి కొమ్మలను తొలగించాలి, ప్రధాన కాండానికి ఎలాంటి గాయాలు కాకుండా అతి

జాగ్రత్తగా కొమ్మలను తొలగించాలి

కొమ్మలు కత్తి రించిన తర్వాత చెట్టు గాయాలకు bavistin, copper oxychloride, Macozeb M-45 శిలీంద్ర నాశక

మందులను అప్లై చేయాలి. నులిపురుగుల నివారణ కై Blitox / Bordeaux mixture నీ అప్లై చేయాలి

కీటకాల నివారణకై monocrotophos, quinolphos, chloropyriphos మందులను spray చేయాలి

శిలీంద్ర వ్యాధుల, నులిపురుగుల, కీటకాల బారి నుండి మొక్కలను కాపాడుకోవడం కోసం ఆరోగ్యకరమైన

మొక్కలకు పైన పేర్కొన్న టువంటి మందులను ప్రతి మూడు నెలలకు ఒకసారి అప్లై చేయాలి

రక్షణ చర్యలు : శ్రీ గంధం చాలా విలువైన మొక్క దొ ంగల బారి నుండి కాపాడుకోవడం కోసం సో లార్ ఫెన్సింగ్ ని

ఏర్పాటు చేసుకోవాలి కాపలాదారు వ్యక్తు లను నియమించుకోవాలి , బెంగళూరు IWST శాస్త వ


్ర ేత్తలు సూచించిన

మైక్రో చిప్స్ ని చెట్టు కాండం లో రహస్యంగా అమర్చడం వలన భవిష్యత్తు లో దొ ంగతనం జరిగితే మైక్రో చిప్

సహాయంతో శ్రీగంధం కలపను ట్రా క్ చేయవచ్చును


నీటి యాజమాన్య పద్ధ తి: చిన్న వయసులో మొక్కలకు నీరు సమృద్ధిగా ఇవ్వాలి మొక్క ఎదిగన
ి కొలది నీరు

తక్కువగా ఇవ్వాలి మొక్క ఆరు నుండి ఎనిమిది సంవత్సరాల వయసులో వేసవికాలంలో నీరు ఇస్తే సరిపో తుంది

తొమ్మిది సంవత్సరాల పైబడిన మొక్కలకి నీరు ఇవ్వకూడదు. తద్వారా మొక్క ఒత్తి డికి గురియై తెలుపు వర్ణం గల

కలప బ్రౌ న్ వర్ణంలోకి మారును. ఈ కలప నుండి శ్రీగంధం నూనె లభిస్తు ంది కావున రైతు సో దరులు ఎదిగన
ి

మొక్కలకు ఎట్టిపరిస్థితిలో నీరు ఇవ్వకూడదు

కలుపు నివారణ చర్యలు: శ్రీగంధం తోటలో వరుసల మధ్యలో రోటవేటర్ ద్వారా కలుపు తొలగించాలి , ఎట్టి పరిస్థితిలో

లోతుగా భూమిని దున్న వద్దు మొక్కల మధ్య ఉన్న కలుపును కూలీల ద్వారా తొలగించాలి

కలప అమ్మకం: శ్రీగంధం చెట్టు కాండం లో మరియు వేర్లలో గోధుమ వర్ణం గల కలప లభిస్తు ంది కావున రైతు

సో దరులు శ్రీగంధం చెట్టు వేర్లను మరియు కాండాన్ని అమ్మవలసి ఉంటుంది ,15 సంవత్సరాల పైబడిన శ్రీ గంధం

చెట్లను మాత్రమే అమ్మాలి , ముందుగా కొనుగోలుదారులు శ్రీగంధం చెట్టు ప్రధాన కాండానికి డ్రిల్ వేసి, లోపల ఏ

మేరకు గోధుమ వర్ణం గల కలప తయారైందో నిర్ధా రణ చేస్తా రు. ఒకవేళ కలప తక్కువగా తయారైతే రైతులు మరి కొన్ని

సంవత్సరాలు వేచి చూడవలసి వస్తు ంది.

శ్రీగంధం కలపను అమ్మే ముందు రెవెన్యూ శాఖ మరియు అటవీ శాఖ నుండి అనుమతి తీసుకోండి, శ్రీగంధం కలపను

కర్ణా టక ప్రభుత్వానికి చెందిన సబ్బుల పారిశమ


్ర యాజమాన్యానికి అమ్మండి వారు మైసూర్ శాండిల్ సో ప్ తయారు

చేస్తా రు వారు చెల్లి ంచే ధరలు ఈ విధంగా ఉన్నాయి తెలుపు రంగు గల కలప కి ఒక కిలోకి వంద రూపాయలు

మరియు గోధుమ రంగు కలపకు అందులో ఉన్న నూనె శాతాన్ని బట్టి ఒక కిలోకి ఎనిమిది వేల నుండి పదివేల

రూపాయల వరకు చెల్లి స్తా రు. ఒక ఎకరానికి 600 నుండి 800 కిలోల శ్రీగంధం కలప లభించే అవకాశం ఉంది. శ్రీ

గంధం మొక్కల సాగు వలన ఒక ఎకరానికి సుమారుగా 60 నుండి 80 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ

ఆదాయం కూడా సరైన సమయానికి ఎరువులు అందించటం, ఎల్ల ప్పుడూ కలుపు నివారణ చేపట్ట డం, ఏకైక 10ft

కొమ్మలు లేని ప్రధాన కాండం, చిన్నవయసులో మొక్కలకు నీరు ఇవ్వటం పెద్ద వయసులో మొక్కలకు నీరు

ఇవ్వకుండా ఉండటం, శ్రీగంధం బ్రతికినంత కాలం శ్రీ గంధం మొక్కలకు సమానమైన శాశ్వత host మొక్కలను కూడా

సంరక్షించడం మరియు ప్రతి మొక్క పైభాగం నుండి కింది భాగం వరకు సూర్యరశ్మి పూర్తిస్థా యిలో అందిన అప్పుడు

రైతుకు విజయం లభిస్తు ంది.

You might also like