You are on page 1of 3

జీవామృతం

జీవామృతం చల్లిన భూమిలో వానపాములు చైతన్యవంతమై అన్ని రకాల పోషకాలను పంటలకు


అందించేందుకు నిరంతరం శ్రమిస్తా యి. జీవనద్రవ్యంతో కూడిన భూసారాన్ని పరిరక్షించుకోవడం అవసరం. మెట్ట
పొలాల్లో ఆచ్ఛాదనకు గడ్డి లేకపోతే, భూమిని పైపైన దుక్కి చేసి మట్టి పెళ్లలతో ఆచ్ఛాదన కల్పింవచ్చు. ప్రకృతి
వ్యవసాయంలో ఎటువంటి ఎరువూ వేయనక్కర లేదు. దేశీ లేదా నాటు ఆవు పేడ, మూత్రంతో తయారైన
‘జీవామృతం’లో కోటానుకోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. ద్రవ జీవామృతం పంటకు బలాన్ని ఇస్తుంది. ఈ
జీవామృతమును ద్రవ, ఘన రూపాలలో తయారు చేసుకోవచ్చు .

వానపాము

కావలసిన పదార్ధ ములు

ఒక ఎకరం పంట పొలానికి సరిపడా జీవామృతం తయారీకి కావలసిన పదార్ధా లు


డ్రమ్ము - నీళ్ళు పట్టేది

నీళ్ళు - 200 లీటర్లు (సుమారుగా 15 బిందెలు),


ఆవు పేడ-10 కిలోలు,

ఆవుమూత్రం-10 లీటర్లు ,

పప్పు దినుసుల పిండి-2 కిలోలు,

బెల్లం-2 కిలోలు,

గట్టు మట్టి-గుప్పెడు.

తయారు చేయువిధానం

మొదట డ్రమ్ములో 200 లీటర్ల (సుమారుగా 15 బిందెలు) నీటిని తీసుకొని దానిలో 10లీటర్ల ఆవుమూత్రం
తీసుకోవాలి. 10 కేజీల ఆవు పేడను డ్రములో కలుపుకోవాలి. 2 కేజీలు పప్పు దినుసుల పిండిని కలుపుకోవాలి.
2 కేజీల బెల్లం వీటితో పాటు కలుపుకోవాలి. గట్టు మట్టిని గుప్పెడు కలుపుకోవాలి. ఈ అన్ని కలుపుకున్న
మిశ్రమాన్ని కర్రతో బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. దీనిని నాలుగు రోజులు మురగనివ్వాలి. దీనిని
నాలుగు రోజులు రోజుకు మూడుసార్లు ఉదయం, మధ్యానం, సాయంత్రం కర్రతో కలుపుకోవాలి. నాలుగు
రోజులు మురిగిన తర్వాత పంటకు వాడుకోవచ్చు. ఈ విధంగా చేయటం వలన లాభాలు పంటకు
బలాన్నిస్తుంది. దీనిని తయారు చేయుటప్పుడు ముందు జాగ్రత్తచర్యలుగా ఆరోగ్యకరమయిన దేశీయ ఆవు పేడ,
ఆవు మూత్రం తీసుకోవాలి. దీనిలో ఏమియు కలుపకూడదు. ఈ విధంగానే వాడుకోవాలి. మనం పంటకు నీరు
పెట్టె కాల్వ దగ్గర లేదా పంటలో దీనిని పోసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమం ఒక ఎకరాకు
పనిచేస్తుంది. బెల్లపు మడ్డి ఉపయోగించి జీవామృతం తయారుచేసే విధానం:

బెల్ల పు మడ్డి ఉపయోగించి జీవామృతం తయారుచేసే విధానం

బెల్లపు మడ్డి అనగా బెల్లం తయారు చేసేటప్పుడు వ్యర్ధంగా మిగిలే పదార్ధా న్నే బెల్లపు మడ్డి అని అంటారు
బెల్లపు మడ్డిని ఉపయోగించి జీవామృతం తయారు చేసేటప్పుడు బెల్లా నికి బదులుగా 4 లీటర్ల బెల్లపు మడ్డిని
ఉపయోగిస్తా ము. మంచి నీరు, ఆవు మూత్రము, ఆవు పేడ, పప్పు ధాన్యాల పిండి, పొలంమట్టి అన్నీ
జీవామృతం తయారీలో ఎంత నిష్పత్తిలో వాడుతామో, అంతే నిష్పత్తిలో ఉపయోగిస్తా ము.

జీవామృతం పిచికారి చేసే పద్ధ తి

3 నెలల్లో (60 నుంచి 90 రోజుల్లో ) పూర్తయ్యె పంటలకు


ఎకరానికి
మొదటిసారి : (విత్తనం నాటిన 1 నెలకి ) 5 లీటర్ల జీవామృతం,100 లీటర్ల నీటితో పిచికారి చేయాలి .

రెండో సారి : (మొదటి సారి పిచికారి చేసిన 21రోజుల తర్వాత ) 10 లీటర్ల జీవామృతం,150 లీటర్ల నీటితో
పిచికారి చేయాలి .

మూడో సారి : (రెండో సారి పిచికారి చేసిన 21రోజుల తర్వాత )20 లీటర్ల జీవామృతం,200 లీటర్ల నీటితో
పిచికారి చేయాలి .
నాలుగో సారి : (గింజ ఏర్పడే టప్పుడు -మిల్కింగ్ స్టేజి )5 లీటర్ల మజ్జిగ,200 లీటర్ల నీటితో పిచికారి
చేయాలి .చివరి సారి జీవామృతం అవసరం లేదు .

మూలాలు

ఇతర లింకులు

http://www.youtube.com/watch?v=BfZ26kSjcNY జీవామృతం తయారీ విధానం

"https://te.wikipedia.org/w/index.php?
title=జీవామృతం&oldid=3275962" నుండి వెలికితీశారు

మురళీకృష్ణ ముసునూరి చివరిసారి 9 నెలల క్రితం దిద్దు బాటు చేసారు

You might also like