You are on page 1of 7

బియ్యంలో రకాలెన్ని, అన్నం ముద్దగా కాకుండా ఏ బియ్యాన్ని ఎలా వండాలి?

bbc.com/telugu/articles/crg3x52n1yxo

ఫొటో సోర్స్, Getty Images

15 మార్చి 2024

ప్రపంచంలోని ప్రధాన ఆహారాల్లో అన్నం ఒకటి. ప్రతిరోజూ కోట్ల మంది ఇళ్లలో అన్నం వండుతారు. అయినప్పటికీ, తాము
అన్నం సరిగ్గా వండలేకపోతున్నామని కొందరు భావిస్తుంటారు. అయితే, మీరు వాడుతున్న బియ్యానికి అనుగుణంగా కొన్ని
పద్ధతులను పాటించడం ద్వారా చాలా సులభంగా అన్నం వండొచ్చు.

కింద చెప్పిన విధానాల ద్వారా మీరు ముద్దగా, జిగురులా కాకుండా చక్కగా అన్నం వండగలరని హామీ ఇస్తు న్నాం.

అందుకు కేవలం రెండు పద్ధతులు పాటించాల్సి ఉంటుంది.

ఎంత బియ్యాన్ని తీసుకుంటున్నాం, వాటికి ఎంత నీటిని తీసుకోవాలో తెలుసుకోవడం ద్వారా అన్నం వండడం
సులభతరమవుతుంది.

అలాగే, అన్నం ఉడుకుతున్న సమయంలో మధ్యలో కదిలించకూడదు, అలా చేస్తే అది జిగురుజిగురుగా లేదా ముద్దగా
అయ్యే అవకాశం ఉంటుంది.

కొన్ని వంటకాల్లో బియ్యం లేదా ఇతర ధాన్యాలను ఉడికించే ముందు అవి పాత్ర అడుగున అంటుకోకుండా ముందుగా వెన్న
లేదా ఒక చెంచా నూనె వాడతారు.

1/7
బాస్మతి వంటి పొడవైన బియ్యాన్ని ఉడికించే ముందు వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడంతో అనవసర పిండి
పదార్థా లు దూరమవుతాయి. ఆ తర్వాత గంజి ఇంకిపోయే పద్ధతి(అబ్జా ర్ప్షన్ ప్రాసెస్)లో ఉడికించాలి.

బ్రౌన్ రైస్‌కి అయితే వైట్ రైస్ కంటే ఎక్కువ నీరు అవసరమవుతుంది. బ్రౌన్ రైస్ ఉడికేందుకు కూడా ఎక్కువ సమయం
పడుతుంది. వండే ముందు కనీసం అరగంట సేపు నీటిలో నానబెట్టా లి.

చిన్న బియ్యం (తక్కువ పరిమాణంలో ఉండే రైస్‌) క్రీమీగా ఉండేందుకు ఎక్కువ గంజి అవసరం కాబట్టి, వాటిని మరీ
ఎక్కువగా కడగాల్సిన అవసరం లేదు.

ఫొటో సోర్స్, Getty Images

అన్నం వండడానికి ఎంత సమయం పడుతుంది?


అన్నం ఉడకడానికి ఎంత సమయం పడుతుందనేది మనం ఏ బియ్యం ఉపయోగిస్తు న్నాం, ఏ పద్ధతిలో వండుతున్నామనే
దానిపై ఆధారపడి ఉంటుంది.

బాస్మతి రైస్ లేదా పొడవాటి రైస్: స్టవ్ మీద అన్నం వండేట్లయితే, ప్రారంభం నుంచి పూర్తిగా ఉడికేందుకు దాదాపు 20
నిమిషాలు పడుతుంది. బాస్మతి రైస్ వండే ముందు 20 నిమిషాలు నానబెట్టడం ఉత్తమం.

బ్రౌన్ రైస్: వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఉడికేందుకు ఎక్కువ సమయం పడుతుంది. స్టవ్ మీద బ్రౌన్ రైస్ ఉడికేందుకు దాదాపు 30
నిమిషాల నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది.

షార్ట్ గ్రెయిన్ రైస్(చిన్న బియ్యం): వాడుతున్న బియ్యం రకం, దేనిమీద వండుతున్నాం అనే దానిని బట్టి ఉడికే సమయం
ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది.

ఓవెన్ మెథడ్: బాస్మతి బియ్యం వండేందుకు ఓవెన్ పద్ధతిలో దాదాపు 35 నిమిషాలు పడుతుంది. ఎక్కువ పరిమాణంలో
అన్నం వండేందుకు ఈ పద్ధతి అనువుగా ఉంటుంది.

2/7
మైక్రోవేవ్ మెథడ్: ఈ పద్ధతిలో బాస్మతి బియ్యం వండేందుకు 14 నిమిషాల సమయం పడుతుంది. 6 నిమిషాలు హై పవర్‌లో,
మరో 8 నిమిషాలు మీడియం పవర్‌లో ఉంచాలి. మైక్రేవేవ్‌సామర్థ్యాన్ని అనుసరించి చిన్నచిన్న మార్పులు అవసరం.

ఇవి సాధారణ మార్గదర్శకాలు మాత్రమే. మీరు ఉపయోగిస్తు న్న బియ్యం రకం, వండేందుకు వాడుతున్న పొయ్యి వంటి
అంశాల ఆధారంగా ఉడికే సమయం మారవచ్చు.

రోజూ ప్రాక్టీస్‌గా మీరు ఇష్టపడే బియ్యం, వండుతున్న విధానాన్ని బట్టి ఎంత సమయం పడుతుందనేది మీకు అర్థమైపోతుంది.

'డ్రై-ఐస్' తిన్న తరువాత నోట్లోంచి రక్తం పడింది... గురుగ్రామ్ రెస్టా రెంట్లో అసలేం జరిగింది?6 మార్చి 2024
షుగర్ ఉన్న పదార్ధా లు తినొద్దని ఒట్టు పెట్టు కున్నా పదే పదే ఎందుకు తినాలనిపిస్తుంది... ఎలా కంట్రోల్ చేసుకోవాలి?4
మార్చి 2024
గ్రీన్ సప్లిమెంట్లు : ఈ ‘సూపర్ పౌడర్లు ’ ఆరోగ్యానికి మ్యాజిక్‌లా పని చేస్తా యా?4 మార్చి 2024

ఫొటో సోర్స్, Getty Images

ఎంత బియ్యానికి ఎంత నీరు పోయాలి?


బాస్మతి బియ్యం, లేదా ఇతర అన్ని రకాల వైట్ రైస్‌ను స్టవ్ మీద వండేటప్పుడు 1: 2 నిష్పత్తిలో నీటిని వినియోగించాలి.

అంటే, ఒక కప్పు బియ్యానికి, రెండు కప్పుల నీరు కలపాలి. ఎక్కువ మొత్తంలో వండాలంటే ఇదే నిష్పత్తిలో, దానికి
అనుగుణంగా నీటిని తీసుకోవాలి.

బియ్యం ఉడికిన తర్వాత సరిపోయేంత పరిమాణంలో ఉన్న పెద్దపాత్రను ఎంచుకోవాల్సి ఉంటుంది.

3/7
ఫొటో సోర్స్, Getty Images

స్టవ్ మీద రైస్ ఎలా వండాలి?


ఒక కప్పు బాస్మతి రైస్ (సుమారు 75 గ్రాములు).

రెండు కప్పుల నీరు (150 ఎంఎల్).

1. ఒక కప్పు తీసుకుని దాని నిండా బియ్యాన్ని కొలిచి తీసుకోవాలి. లేదా ఒక పాత్రలో ఎంత బియ్యం తీసుకుంటున్నారో
తూకం వేసుకోవాలి. అలాగే, నీరు ఆ పాత్రలో ఎంతవరకూ వస్తుందో గమనించుకోవాల్సి ఉంటుంది.

2. ఒక పాత్రలో బియ్యం వేసి, అందులో నీళ్లు పోసి, బియ్యంపై ఉన్న అదనపు పిండి పదార్ధా లను తొలగిపోయేలా శుభ్రంగా
కడగాలి.

3. ఒక జల్లెడ తీసుకుని అందులో బియ్యాన్ని పోసి నీటిని ఒంపేయాలి. తర్వాత కొద్దిసేపు ఆరబెట్టా లి. ఆ తర్వాత నీరు
స్వచ్ఛంగా కనిపించేంత వరకూ బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. సమయం ఉంటే, బియ్యాన్ని కనీసం 30 నిమిషాలు నీటిలో
నానబెట్టా లి. అలా చేయడం ద్వారా బియ్యమంతా ఒకేలా ఉడికేందుకు ఉపయోగపడుతుంది.

4. ఆ బియ్యాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి.

5. బియ్యానికి సరిగ్గా రెండింతలు నీరు తీసుకోవాలి. (ఒక కప్పు బియ్యం ఉంటే 2 కప్పుల నీరు తీసుకోవాలి లేదా 75
గ్రాముల బియ్యానికి 150 ఎంఎల్ నీటిని తీసుకోవాలి). మీకు అవసరమైతే కొద్దిగా ఉప్పు కలుపుకోవచ్చు.

6. ఆ తర్వాత దానిని ఉడికించాలి. నీరు బియ్యం బాగా కలిసిపోయేలా ఒకసారి కలియ తిప్పుకోవాలి.

7. ఆ పాత్రపై మూత పెట్టా లి. వీలైనంత తక్కువ వేడి/మంటతో ఉడికించుకోవాలి. ఎక్కువ వేడి మీద అన్నం వండినట్లయితే
చాలా త్వరగా ఉడుకుతుంది, కానీ మధ్యలో ముద్దగా మారే అవకాశం ఉంటుంది.

4/7
8. పది నిమిషాలు అలాగే ఉడకనీయాలి. ఆ సమయంలో మూత తీయకూడదు. చివర్లో ఒక మెతుకు తీసుకుని అన్నం
సరిగ్గా ఉడికిందో లేదో పరిశీలించాలి. అప్పటికి సరిగ్గా ఉడకలేదని అనిపిస్తే మరో రెండు నిమిషాలు ఉడికించి, ఆ తర్వాత
మంట/హీట్ ఆపేయాలి.

9. ఆ తర్వాత బియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానిపై ఒక పది నిమిషాలు వస్త్రం కప్పి ఉంచితే, ఏదైనా అదనపు నీరు
ఉంటే ఆవిరిగా బయటకుపోతుంది. అప్పుడు పొడిపొడిగా, మంచిగా అన్నం సిద్ధమవుతుంది.

అన్నం స్టవ్ మీద వండేందుకే మేం ప్రాధాన్యం ఇస్తాం. ఒకవేళ స్టవ్ అందుబాటులో లేకపోతే ఓవెన్ లేదా మైక్రోవేవ్ ద్వారా
వండుకోవచ్చు.

ఎక్కువ మొత్తంలో వండాలంటే ఓవెన్ ఉత్తమం, అదే త్వరగా వండాలంటే మైక్రోవేవ్ విధానం ఉత్తమం.

బోర్సూక్: ఈ రొట్టె వాసన చనిపోయిన వారిని చేరుతుందంట.. పెళ్లి, పండుగ, సంవత్సరీకం ఏదైనా అక్కడ ఇదే
నైవేద్యం2 మార్చి 2024
చక్కెర బదులు తేనె వాడటం మంచిదేనా?23 ఫిబ్రవరి 2024
మాంసం బియ్యం: ఈ హై బ్రిడ్ బియ్యం తింటే, మాంసం తిన్నట్లే...16 ఫిబ్రవరి 2024

ఫొటో సోర్స్, Getty Images

ఓవెన్‌లో ఎలా వండాలి?


ఒక కప్పు బాస్మతి రైస్

5/7
రెండు కప్పుల వేడి నీళ్లు .

ఓవెన్‌ఫ్యాన్‌ను 160 నుంచి 180 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండేలా, గ్యాస్ 4 వద్ద ఉంచి ముందుగా వేడిచేయాలి.

పెద్ద గిన్నెలో నీటిని తీసుకుని అందులో బియ్యాన్ని కడగాలి. ఆ తర్వాత వాటిని వడకట్టా లి.

మీడియం సైజు పాత్రలో నీటిని ఎసరు పెట్టు కుని, అందులో బియ్యం వేయాలి.

దానిపై మూతపెట్టి సుమారు 35 నిమిషాలు ఉడకనివ్వాలి.

ఆ తర్వాత ఒక ఐదు నిమిషాలు వదిలేసి, మూత తీయాలి. అన్నం పొడిపొడిగా ఉందో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత
తినడానికి సర్వ్ చేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images

మైక్రోవేవ్‌లో ఎలా వండాలి?


ఒక కప్పు బాస్మతి రైస్ (75 గ్రాములు)

2.5 కప్పుల వేడి నీళ్లు (180 ఎంఎల్)

వేడిని తట్టు కునే (హీట్ ప్రూ ఫ్) గిన్నెలో బియ్యం వేసి, ఆ తర్వాత వేడినీళ్లు పోయాలి.

6/7
నీరు బయటికి రాకుండా కప్పి వుంచేలా మైక్రోవేవ్‌కి అనువైన మూతపెట్టి లోపల ఉంచాలి. ఆ తర్వాత 900 వాట్స్ వద్ద 6
నిమిషాలు, ఆపై మధ్యస్తంగా 500 వాట్స్ వద్ద 8 నిమిషాలు ఉడికించాలి.

ఆ తర్వాత కొద్దిసేపు ఆగి, ఆ మూతను తొలగిస్తే అప్పటికే అన్నం సిద్ధమవుతుంది.

ఇవి కూడా చదవండి:

7/7

You might also like