You are on page 1of 89

ఆరోగ్యానికి రాగి పిండితో జావ.

ఒక కప్పు రాగి పిండి ఒక గిన్నెలో వేసుకుని అందులో మూడు కప్పుల నీళ్ళు పో సి మరియు కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకుని స్టౌ
మీద పెట్టి ఒక పదిహేను నిముషాల పాటు మీడియం సెగన బాగా ఉడకనివ్వాలి .

ఉడికిందో లేదో చెయ్యి తడి చేసుకుని చూస్తే చేతికి అంటకూడదు .

చల్లా రగానే చేతితో చిన్న ఉండలుగా చేసుకుని అందులో మజ్జి గ పో సి మరి కాస్త ఉప్పు వేసి రాత్రంతా మజ్జి గలో నానబెట్టా లి .

మరుసటి రోజు స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి ఒక ఎండుమిర్చి , జీలకర్ర , ఆవాలు ,కరివేపాకు వేసి పో పు వేసుకుని
అందులో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు మరియు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి మగ్గ నిచ్చి ఆ తర్వాత ఈ రాగి
జావలో వేసి ఉండలుగా ఉన్నట్ల యితో చేతితో బాగా నలిపి అవసరమైతే మరి కాస్త మజ్జి గ పో సుకుని జావలా పల్చగా చేసుకుని ప్రతిరోజు
ఉదయాన్నే ఒక గ్లా సు మోతాదులో తీసుకోవాలి .

ఈ రాగి జావ సన్నపడాలనుకునే వారికి మంచిది.

శరీరానికి చలువ చేస్తు ంది


ఆలూరుకృష్ణ ప్రసాదు .

దొ ండకాయ మసాలాకూరపొ డి కూర.

కావలసినవి .

దొ ండకాయలు -- అర కిలో
నూనె -- నాలుగు స్పూన్లు

కూర పొ డికి.

ఎండుమిరపకాయలు -- 15
పచ్చిశనగపప్పు -- మూడు స్పూన్లు
చాయమినపప్పు -- స్పూనున్నర
వేరుశనగ గుళ్ళు -- రెండు స్పూన్లు
నువ్వుపప్పు -- స్పూనున్నర
ఎండుకొబ్బరి -- పావు చిప్ప. ( చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి .)
జీలకర్ర -- అర స్పూను
ఉప్పు -- తగినంత
నూనె -- మూడు స్పూన్లు

తయారీ విధానము .

ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి మూడు


స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు ,
పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , వేరుశనగ గుళ్ళు , నువ్వుపప్పు , ఎండు కొబ్బరి ముక్కలు మరియు జీలకర్ర వేసి కమ్మని
వాసన వచ్చే వరకు వేయించుకోవాలి.

చల్లా రగానే మిక్సీలో ఈ మిశ్రమమును మరియు సరిపడ ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా పొ డి వేసుకోవాలి .

తర్వాత దొ ండకాయలు చిన్న చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .

ఇప్పుడు స్టౌ మీద మందపాటి గిన్నె కాని , ఇత్త డి గిన్నె కాని పెట్టి మొత్త ము నాలుగు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే
దొ ండకాయ ముక్కలు మరియు కొచెం ఉప్పు వేసి అట్ల కాడతో బాగా కలిపి , స్టౌ మీడియం సెగన పెట్టి , ఒక గిన్నెలో కాని , పళ్ళెంలో
కాని పావు వంతు నీళ్ళు పో సి , ఆ నీళ్ళ పళ్ళెం గిన్నె మీద మూత పెట్టా లి .

ఇలా ముందుగా కొంచెం ఉప్పు వేయడం వలన మరియు నీళ్ళ గిన్నె మూత పెట్టడం వలన ముక్కలు బాగా మగ్గు తాయి .

మధ్య మధ్యలో అట్ల కాడతో ముక్కలను కదుపుతూ ఒక పది హేను నిముషాలు ముక్కలను బాగా మగ్గ నివ్వాలి .

తర్వాత నీళ్ళ మూత తీసివేసి ముందుగా సిద్ధం చేసుకున్న కూర పొ డి వేసుకుని ఓ అయిదు నిముషాల పాటు ఉంచి, పొ డి కమ్మగా
వేగిన వాసన రాగానే దింపుకుని , వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే దొ ండకాయ మసాలా కూరపొ డి కూర భోజనము లోకి సిద్ధం.

ఆలూరుకృష్ణ ప్రసాదు .

కొంచెం వెరైటీగా పచ్చిమిర్చి కొత్తి మీర పచ్చడి .

తయారీ విధానము.

చిన్నవి అయితే రెండు కట్ట లు , పెద్దది ఒక కట్ట కొత్తి మీర శుభ్రం చేసుకుని వలుచుకుని ఉంచుకోవాలి.

నిమ్మకాయంత చింతపండు పదిహేను నిముషాల ముందు కొద్దిగా వేడి నీళ్ళలో నానబెట్టకుని అర గ్లా సు రసం చిక్కగా తీసుకోవాలి
.

ఒక 15 పచ్చిమిరపకాయలు తొడిమలు తీసుకుని ఉంచుకోవాలి .

ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి స్పూను చాయమినపప్పు , పావు స్పూను మెంతులు , అర స్పూను
ఆవాలు , కొద్దిగా ఇంగువ వేసి పో పు వేగగానే పో పులో పచ్చిమిరపకాయలు , కొద్దిగా పసుపు , తగినంత ఉప్పు మరియు
చింతపండు రసం వేసి మూత పెట్టి అయిదు నిముషాలు చింతపండు రసంలో పచ్చిమిరపకాయలు మగ్గ నివ్వాలి .

తర్వాత కొత్తి మీర కూడా పో పులో వేసి మూడు నిముషాలు వేసి మగ్గ నిచ్చి దింపుకోవాలి .

చల్లా రగానే ఈ మిశ్రమము మొత్త ము మిక్సీలో వేసి పచ్చడి మెత్తగా మిక్సీ వేసుకోవాలి.

ఇష్ట మైన వారు చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు .

ఈ పచ్చడి ఇడ్లీ , దో శెలు, గారెలు మరియు భోజనము లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది .
ఆలూరుకృష్ణ పస
్ర ాదు .
సంబంధించిన రెసిపీ మేము తయారు చేయు విధానము మరియు ఫో టో తయారు చేయు సమయమున తీసినది.
ఇడ్లీ , దో శెలు , గారెలు , పూరీలు లోకి పల్లీల చట్నీ . ( వేరుశనగ పచ్చడి . )

కావలసినవి .

పల్లీలు ( వేరు శనగ గుళ్ళు ) - 75 గ్రా ములు .

బాండీలో నూనె వేయకుండా కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకుని , చల్లా రగానే చేతితో నలిపి పై పొ ట్టు తీసి వేసుకోవాలి.

పచ్చిశనగపప్పు -- అయిదు స్పూన్లు .

పచ్చి మిర్చి -- 8

చింతపండు -- ఉసిరి కాయంత . విడదీసి పది నిముషాలు ముందు కొద్దిగా నీటితో తడిపి ఉంచుకోవాలి .

కరివేపాకు -- మూడు రెమ్మలు.

ఉప్పు - తగినంత .

పో పునకు .

ఎండుమిరపకాయలు - 6
చాయమినపప్పు - స్పూను
ఆవాలు -- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా
నూనె -- రెండు స్పూన్లు
నెయ్యి -- రెండు స్పూన్లు

తయారీ విధానము .

ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి , ఎండుమిరపకాయలు నాలుగు , పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి .
తర్వాత అందులోనే వేయించి పొ ట్టు తీసిన వేరు శనగ గుళ్ళు , పచ్చిమిర్చి వేసి మగ్గ పెట్టా లి .

చల్లా రగానే వేయించిన మిశ్రమము , తడిపిన చింతపండు , తగినంత ఉప్పు వేసి మరియు తగినన్ని నీళ్ళు పో సుకుని మెత్తగా మిక్సీ
వేసుకోవాలి .

తర్వాత ఈ పచ్చడి వేరే గిన్నె లోనికి తీసుకోవాలి .

ఇప్పుడు స్టౌ మీద పో పు గరిటె పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని , నెయ్యి బాగా కాగగానే రెండు ఎండుమిర్చి ని ముక్కలుగా చేసి ,
చాయమినపప్పు , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకును వేసి పో పు వేగగానే పచ్చడిలో వేసి స్పూను తో బాగా కలుపుకోవాలి .

అంతే ఎంతో రుచిగా ఉండే ఈ పల్లీల చట్నీ ఇడ్లీలు , దో శెలు , గారెలు లోకే కాకుండా పూరీలు మరియు చపాతీలలోకి కూడా చాలా
రుచిగా ఉంటుంది .
ఆలూరుకృష్ణ ప్రసాదు ..
మోటో , బెండకాయలు మరియు మునగ కాడలు వేసి కందిపప్పుతో పప్పు చారు / పప్పు పులుసు.

తయారీ విధానము.

ఒక కప్పు కందిపప్పు ఒకసారి కడిగి కుక్కర్ లో సరిపడా నీళ్ళు పో సి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టౌ ఆపేయాలి

తర్వాత కుక్కర్ తీసి పప్పు బాగా యెనిపి , అందులో నాలుగు పచ్చిమిర్చి ముక్కలుగా తరిగి , రెండు ములక్కాడలు
ముక్కలుగా తరిగి , రెండు టమోటో లు ముక్కలు గా తరిగి , ఆరు బెండకాయలు ముక్కలుగా తరిగి , నిమ్మకాయంత
చింతపండు రసం రెండు గ్లా సుల నీళ్ళలో పది నిముషాలు నానబెట్టి రసం తీసుకుని , కాస్త పసుపు, రెండు రెమ్మలు
కరివేపాకు , సరిపడా ఉప్పు వేసి మరో అర గ్లా సు నీళ్ళు పో సి స్టౌ మీద పెట్టి ములక్కాడలు ఉడికే వరకు పుప్పు చారు
మరగనివ్వాలి .

ఆ తర్వాత పప్పు చారు దింపాలి .

తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి , నూనె బాగా కాగగానే వరుసగా మూడు ఎండుమిరపకాయలు
ముక్కలుగా చేసి , కొద్దిగా మెంతులు , పావు స్పూను జీలకర్ర , అర స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ మరియు కొద్దిగా
కరివేపాకు వేసి పో పు పెట్టు కోవాలి .

ఆ తర్వాత కొత్తి మీర తరిగి పైన వేసుకోవాలి .

అంతే ఘుమ ఘుమ లాడే ములక్కాడ , బెండకాయ , టమోటో కందిపప్పుతో పప్పు చారు సర్వింగ్ కు సిద్ధం.

ఇష్ట మైన వారు చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు .

వెల్లు ల్లి ఇష్ట పడే వారు ఇంగువ బదులుగా ఎనిమిది వెల్లు ల్లి రేకలు వేసుకుని పో పు వేసుకోవచ్చును.
కూర పొ డి .

సాధారణంగా వంకాయ , దొ ండకాయ మరియు బెండకాయ వంటి కూరల్లో వెరైటీగా ఆ కాయలలో పొ డిని పెట్టు కుని
కాయలపళంగా కూర చేసుకుంటాము .

ఈ కూర పొ డి కొద్దిగా మార్పులు చేసుకుని కొట్టు కోవచ్చు.

అదేవిధంగా ఒకసారే కొట్టు కుని సీసాలో భద్రపరచుకుంటే నాలుగైదు సార్ల కు వస్తు ంది.

ఈ విధముగా కొట్టు కున్న పొ డి సీసాలో భద్రపర్చుకుని ఫ్రిజ్ లో పెట్టు కుంటే మూడు నెలల వరకు తాజాగా ఉంటుంది .

మేం సాధారణంగా ఇలా చేసుకునే రెండు రకముల కూర పొ డుల గురించి మీకు తెలియ చేస్తా ను .

మొదటి విధానము .

ఈ పొ డి మసాలా టచ్ లేకుండా మామూలుగా ఉంటుంది .

ఎండుమిరపకాయలు -- 25
పచ్చిశనగపప్పు -- 50 గ్రా ములు
చాయమినపప్పు -- 50 గ్రా ములు
జీలకర్ర -- మూడు స్పూన్లు .
నూనె -- నాలుగు స్పూన్లు .
ఉప్పు -- తగినంత

తయారీ విధానము .

స్టౌ మీద బాండీ పెట్టి మొత్త ము నూనె వేసి , నూనె బాగా కాగగానే ఎండుమిరపకాయలు ( తొడిమలు తీసి ) ,
పచ్చిశనగపప్పు , చాయమినపప్పు మరియు జీలకర్ర వేసుకుని మీడియం సెగన కమ్మని వాసన వచ్చే వరకు
వేయించుకోవాలి .

కొద్దిగా చల్లా రగానే తగినంత ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పప్పులు తగిలే విధముగా మిక్సీ వేసుకోవాలి .

రోటి సౌకర్యము ఉన్నవారు రోటిలో పచ్చడి బండతో దంపుకుంటే రెట్టింపు రుచిగా ఉంటుంది.

తర్వాత సీసాలో భద్రపరుచుకుని ఫ్రిజ్ లో పెట్టు కోవాలి .


అవసరయయినప్పుడు ఫ్రిజ్ లో నుండి తీసుకుని అవసరమైతే కొద్దిగా ఉప్పు కలుపుకుని , కూరల్లో పెట్టు కుని ,
కాయలను నూనెలో వేయించుకోవాలి.

రెండవ విధానము .

కొద్దిగా మసాలా కూరలా చేసుకోవాలంటే ----

కావలసినవి .

ఎండుమిరపకాయలు -- 25
పచ్చిశనగపప్పు -- 50 గ్రా ములు
చాయమినపప్పు -- 50 గ్రా ములు
ధనియాలు -- 20 గ్రా ములు
జీలకర్ర -- రెండు స్పూన్లు
ఎండుకొబ్బరి -- పావు చిప్ప . చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి .
కరివేపాకు -- అయిదు రెమ్మలు .
నూనె -- నాలుగు స్పూన్లు
ఉప్పు -- తగినంత

తయారీ విధానము .

ముందు స్టౌ మీద బాండీ పెట్టి మొత్త ము నూనె వేసి , నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు ,
పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , ధనియాలు, జీలకర్ర , ఎండుకొబ్బరి ముక్కలు మరియు కరివేపాకు వేసి కమ్మని
వాసన వచ్చేవరకు వేయించుకుని చల్లా రగానే మిక్సీ లో వేసి , తగినంత ఉప్పువేసి మరీ మెత్తగా కాకుండా పప్పులు
తగిలే విధముగా మిక్సీ వేసుకోవాలి .

రోటి సౌకర్యం ఉన్నవారు రోటిలో పచ్చడి బండతో పప్పులు తగిలే విధముగా దంపుకుంటే ఈ మసాలా కూర పొ డి చాలా
రుచిగా ఉంటుంది .

తర్వాత సీసాలో భద్రపర్చుకుని , ఫ్రిజ్ లో పెట్టు కోవాలి .

అవసరమైనప్పుడు ఫ్రిజ్ లోనుండి తీసుకుని అవసరమైన యెడల కొద్ది ఉప్పు కలుపుకుని కూరల్లో పెట్టు కోవాలి .

ఈ కూరపొ డి కూడా రెండు నెలల పైన నిల్వ ఉంటుంది .

మనం కూరల్లో కూరే ముందు పొ డి నాలుక పై వేసుకుని రుచి చూస్తే ఉప్పగా తగిలితే వేగిన కూరలో సరిపో తుంది .
కాప్సికమ్ కాయలపళంగా కూర పొ డి కూరిన Stuffed Curry.

కావలసినవి.

కాప్సికమ్ చిన్న సైజు కాయలు - 350 గ్రా ములు.


ఎండుమిరపకాయలు -- 12
పచ్చిశనగపప్పు -- మూడు స్పూన్లు
చాయమినపప్పు -- రెండు స్పూన్లు
జీలకర్ర -- ముప్పావు స్పూను
ఆవాలు - కొద్దిగా
నూనె -- ఆరు స్పూన్లు
పెద్ద ఉల్లిపాయలు -- రెండు.
ఉప్పు -- తగినంత

తయారీ విధానము .

ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసుకుని నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు ,
పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , జీలకర్ర మరియు పావు స్పూను ఆవాలు వేసుకుని కమ్మని వాసన వచ్చేదాకా
వేయించుకోవాలి .

చల్లా రగానే వేయించిన పో పు మరియు తగినంత ఉప్పును వేసుకుని మిక్సీ లో వేసుకుని కొంచెం పప్పులు తగిలే
విధముగా మిక్సీ వేసుకోవాలి.

ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరుగుకోవాలి.

ఈ పొ డి వేరే పళ్ళెము లోకి తీసుకోవాలి .

చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలను ఈ పొ డిలో వేసుకుని చేతితో బాగా నలుపుకోవాలి.

పొ డి అంతా కొంచెం ముద్ద గా అవుతుంది .

కాప్సికమ్ కాయలకు చాకుతో నాలుగు మధ్యలో గాటు పెట్టు కోవాలి .

సిద్ధంగా ఉంచుకున్న కూరపొ డిని ఈ కాయలలో కూరుకోవాలి .


కొద్దిగా పొ డి మిగుల్చుకుంటే చివరలో దింపబో యే ముందు కూరలో కలుపకోవచ్చును.

స్టౌ మీద మళ్ళీ బాండీ పెట్టు కుని మిగిలిన నూనె మొత్త ము వేసి నూనె బాగా కాగగానే పొ డి కూరిన కాప్సికమ్
కాయలను నూనెలో వేసి , స్టౌ ను మీడియం సెగలో పెట్టి మూతపెట్టి మధ్య మధ్యలో అట్ల కాడతో కదుతూ పదిహేను
నిముషాల పాటు బాగా కాయలను బాగా మగ్గ నివ్వాలి .

దింపబో యే అయిదు నిముషాల ముందు మిగిలిన పొ డి కూరలో వేసి మూత తీసి కాయలు మరియు పొ డి వేగినట్లు గా
చేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది .

కూరను వేరే డిష్ లోకి తీసుకోవాలి .

అంతే ఎంతో రుచిగా ఉండే కాప్సికమ్ కూర పొ డి కూరిన కూర భోజనము లోకి సర్వింగ్ కు సిద్ధం.

వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ కూర నంచుకుని తింటే అద్భుతంగా ఉంటుంది .

సంబంధించిన రెసిపీ మరియు ఫో టో నా స్వంతం.


ఆలూరుకృష్ణ పస
్ర ాదు .

కొబ్బరి కారం / కొబ్బరి పొ డి .

కావలసినవి .

ఎండు కొబ్బరి చిప్పలు --- 2


ఎండుమిరపకాయలు -- 15
జీలకర్ర -- స్పూనున్నర
వెల్లు ల్లి పాయ రెబ్బలు -- 15
ఉప్పు -- తగినంత .

తయారీ విధానము .

ముందుగా స్టౌ వెలిగించి సెగ సిమ్ లో పెట్టు కోవాలి .

ఎండు కొబ్బరి చిప్పలు స్టౌ మీద పెట్టి వెనుక వైపు కొబ్బరి చిప్పలను మధ్య మధ్య తిప్పుతూ కమ్మని వాసన
వచ్చేదాకా కాల్చుకోవాలి .

ఎక్కువ సెగన కాల్చుకుంటే చిప్పలు మాడి పో వచ్చును లేదా చిప్పలు అంటుకునే ప్రమాదం ఉంది .

కొబ్బరి చిప్పలు చల్లా రగానే ఎండు కొబ్బరి తురుముతో తురుము కోవాలి .

లేదా చాకుతో చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి .

ఎండుమిరపకాయలు తొడిమలు తీసుకోవాలి .

ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి నూనె వేయకుండా ఎండుమిరపకాయలు , జీలకర్ర వేసి మిరపకాయలు వేగిన వాసన
వచ్చేదాకా వేయించుకోవాలి .

వెల్లు ల్లి పాయలు పై పొ ట్టు తీయకుండా రెబ్బలుగా వలుచుకోవాలి .

ఇప్పుడు మిక్సీలో వేగిన ఎండుమిరపకాయలు , జీలకర్ర , తగినంత ఉప్పు వేసి మెత్తగా వేసుకోవాలి .

తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు / లేక తురిమిన ఎండు కొబ్బరి మిక్సీ లో వేసుకుని మరీ మెత్తగా కాకుండా
వేసుకోవాలి .

చివరగా వెల్లు ల్లి రెబ్బలు కూడా వేసుకుని ఒకసారి మిక్సీ వేసుకోవాలి .


తర్వాత ఒక సీసాలో భద్రపర్చుకోవాలి .

వెల్లు ల్లి ఇష్ట ం లేని వారు మరో అర స్పూను జీలకర్ర వేసుకుని చేసుకోవచ్చు .

ఈ కొబ్బరి పొ డి షుమారు 20 రోజులు నిల్వ ఉంటుంది .

ఈ కొబ్బరి కారం లేదా కొబ్బరి పొ డి వేడి వేడి అన్నంలో మరి కాస్త నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే అద్భుతమైన
రుచిగా ఉంటుంది .

సంబంధిత రెసిపీ మరియు ఫో టో నా స్వంతం .


ఆలూరుకృష్ణ పస
్ర ాదు .

మరో కొత్త వెరైటీ మజ్జిగ పులుసు .

కావలసినవి .

పెరుగు -- అర లీటరు.

పెరుగు ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని సరిపడా నీళ్ళు పో సుకుని కవ్వంతో గిలక్కొట్టు కొని మరి కొన్ని నీళ్ళు
పో సుకుని ఉంచుకోవాలి .

పులుపు ఇష్ట మైన వారు పుల్ల ని పెరుగును , కమ్మగా ఇష్ట మైన వారు కమ్మని పెరుగును వాడుకోవచ్చును .

ఆనపకాయ -- ఒక ముక్క
క్యారెట్ -- రెండు
బంగాళా దుంపలు --
రెండు .

ఈ మూడు పై చెక్కు తీసుకుని ముక్కలుగా తరుగుకుని సరిపడా నీళ్ళు పో సి మెత్తగా ఉడికించుని , వడకట్టు కుని
విడిగా ఉంచుకోవాలి .

ముందుగా మజ్జిగ పులుసులో ముద్ద కు సిద్ధం చేసుకోవాలి,

బియ్యం -- స్పూనున్నర .
పచ్చిశనగపప్పు -- మూడు స్పూన్లు .

సరిపడా నీళ్ళు పో సి రెండు గంటలు నాన బెట్టు కోవాలి .

తరువాత

నూనె -- స్పూను .

ఎండుమిరపకాయలు - 2

మినపప్పు -- స్పూనున్నర .

స్టౌ మీద బాండీ పెట్టి స్పూను నూనె వేసి నూనె బాగా కాగగానే రెండు ఎండుమిరపకాయలు , స్పూనున్నర మినపప్పు
వేసి వేయించుకుని విడిగా ఉంచుకోవాలి .
ఈ రెండు చేసిన తర్వాత

పచ్చి కొబ్బరి -- పావు చిప్ప ( చిన్న ముక్కలుగా చేసుకోవాలి .)


అల్ల ం - చిన్న ముక్క.( పై చెక్కు తీసుకుని ముక్కలుగా చేసుకోవాలి . )
పచ్చి మిరపకాయలు -- ఎనిమిది
కొత్తి మీర -- చిన్న కట్ట ఒకటి
కరివేపాకు -- రెండు రెమ్మలు .
పసుపు -- పావు స్పూను .
ఉప్పు -- తగినంత .

ఇవ్వన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత

ఇప్పుడు నానబెట్టి సిద్ధంగా ఉంచుకున్న బియ్యం , పచ్చిశనగపప్పు , వేయించిన ఎండుమిరపకాయలు ,


చాయమినపప్పు , పచ్చి కొబ్బరి ముక్కలు , పచ్చిమిరపకాయలు , అల్ల ం ముక్కలు , శుభ్రం చేసిన కొత్తి మీర కట్ట
ఒకటి , రెండు రెమ్మలు కరివప
ే ాకు , పావు స్పూను పసుపు మరియు సరిపడా ఉప్పు మొత్త ం మిక్సీ లో వేసి కొద్దిగా
నీళ్ళు పో సి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .

ఇప్పుడు సిద్ధంగా ఉంచుకున్న మజ్జిగలో ఈ ముద్ద ను వేసుకుని గరిటెతో బాగా కలుపు కోవాలి .

ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి , నూనె బాగా కాగగానే రెండు ఎండుమిరపకాయలు
ముక్కలుగా చేసి , పావు స్పూను మెంతులు , పావు స్పూను ఆవాలు , కొంచెము ఇంగువ మరియు రెండు రెమ్మలు
కరివేపాకు వేసి పో పు వేయించుకుని పో పు చల్లా రగానే మజ్జిగ పులుసులో వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి .

పో పు వేసాకే మజ్జిగ పులుసు వెచ్చబెట్టా లి .

లేకపో తే మజ్జిగ పులుసు విరిగి పో తుంది .

ఇప్పుడు పో పు పెట్టిన ఈ మజ్జిగ పులుసును స్టౌ మీద పెట్టి పొ ంగ కుండా గరిటెతో బాగా కలుపుతూ తెర్ల నివ్వాలి .

ఆ తర్వాత ఉడికించి సిద్ధంగా ఉంచుకున్న ముక్కలు కూడా వేసి మజ్జిగ పులుసును బాగా తెర్లనివ్వాలి .

బాగా తెర్లా క పులుసును క్రిందకు దింపి, మరో చిన్న కట్ట కొత్తి మీర తరిగి వేసుకుని మూత పెట్టు కోవాలి .

అంతే ఎంతో రుచిగా ఉండే ఈ కొత్త వెరైటీ మజ్జిగ పులుసు భోజనము లోకి సిద్ధం.
ఆలూరుకృష్ణ పస
్ర ాదు .

ముంత కింద పప్పు / పిడత కింద పప్పు / మసాలా పప్పు / గరం గరం / ఇంట్లో నే తయారు చేసుకునే విధానము.

అర కప్పు నాటు అటుకులు కాని లేదా మిషను అటుకులు కాని తీసుకోండి .

స్టౌ మీద బాండి పెట్టి అందులో ఒక కప్పు నూనె పో సి నూనె సలసలా కాగాక ఒక్కసారి అర కప్పు అటుకులు వేసి తెల్ల
రంగులో వేగగానే తీసేసి ఒక ప్లేటులో పక్కన పెట్టు కోండి .

అర కప్పు అటుకులు వేగాక కప్పుడు అటుకులు అవుతాయి.

రెండు పెద్ద ఉల్లిపాయలు చాలా సన్నగా ముక్కలు తరిగి వేరే ప్లేటులో ఉంచుకోండి.

మూడు పచ్చి మిర్చి సన్నగా తరిగి ఉంచుకోండి.

రెండు రెమ్మలు కరివప


ే ాకు సన్నగా తరిగి ఉంచుకోండి .

ఒక పావు కప్పు పొ దినా ఆకు కూడా సన్నగా తరిగి ఉంచుకొండి.

వేయించి పొ ట్టు తీసిన వేరుశనగ గుళ్ళు పావు కప్పు , వేయించిన శనగపప్పు ( పుట్నాల పప్పు ) పావు కప్పు , కారం
వేయని బూంది అర కప్పు సిద్ధంగా ఉంచుకోండి .
నిమ్మకాయ ఒకటి , గరం మసాల పొ డి ఒక స్పూను , కారం ఒక స్పూను , ఉప్పు తగినంత సిద్ధం చేసుకోండి.

ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వరుస క్రమంలో వేయించిన అటుకులు, వేరు శనగ పప్పు , వేయించిన
శనగపప్పు , కారం వేయని బూందీ , సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు , సన్నగా తరిగిన కరివప
ే ాకు , సన్నగా
తరిగిన పొ దీనా , సన్నగా తరిగిన పచ్చి మిర్చి , ఒక స్పూను గరం మసాలా పొ డి , ఒక స్పూన్ కారం , ఒక కాయ
పిండిన నిమ్మరసం , తగినంత ఉప్పు వేసి గరిటతో బాగా కలిపి ప్లేట్లలో పెట్టి సాయంత్రం పూట సర్వ్ చేసారా !!

ఇక దాని రుచి చెప్పడం చేసి రుచి చూసి మీరే అంటారు " అద్భుతం " అని.

సంబంధించిన రెసిపీ మరియు ఫో టో నా స్వంతం.


చలికాలం వచ్చేసింది ఎన్నో గుణాలను దాచుకున్న ఆవకూర వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం. ఎన్ని రకాలు చేయగలిగితే అన్ని

రకాల రెసిపీస్ చేసుకుందాం

ఈ రోజు నేను అవకూర, మెంతికూర ఉపయోగించి చేసాను.

ముందుగా ఆవకుర, మెంతికూర,పండుమిర్చి, చిన్నగా తరిగి,గోళీకాయంత చింతపండు కూడా వేసి కొద్ది నూనెలో కాని లేదా

ఆవిరికి మగ్గ నిచ్చి మిక్సీ చేసిపెట్టు కోవాలి.(పులుపు కొరకుచింతపండు బదులు టమాటా వాడుకోవచ్చు )

కుక్కర్లో పో పుచేసి, అందులో ఈ ఆకుకూర ముద్ద ను వేసి వేగాక నీళ్లు పో సి, సరిపడా ఉప్పుకూడా వేసి, నీళ్లు

మరుగుతున్నప్పుడు బియ్యం వేసి మూత పెట్టి రెండు విసిల్స్ వచ్చేవరకు ఉంచి తీసివేయాలి.

మొత్త ం అన్నాన్ని ఒకసారి కలిపి సర్వ్ చేసుకోవడమే.

చాలా టేస్ట్ గా ఉన్న మంచి ఆరోగ్యకరమైన రెసిపీ సిద్ధం.


ఆలూరుకృష్ణ పస
్ర ాదు .

మార్చి నెల వస్తేనే కాని ఎండలు బాగా రావు.

అప్పుడే బూడిద గుమ్మడికాయ తో వడియాలు పెట్టు కుంటే ఏటి కేడాది నిల్వ ఉంటాయి.

వేసవి కాలం మార్చి నెల చివరకు వచ్చిందంటే ప్రతి తెలుగు వారి ఇంట్లో నూ హడావుడిగా ఉంటుంది .

పెద్దవారికి చేతి నిండా పనే .

పండు మిరపకాయల పచ్చడి ( కొరివి కారం / పళ్ళ కారం ),


చింతకాయ పచ్చడి , గోంగూర పచ్చడి , ఉసిరి కాయ పచ్చడి ,
వివిధ రకము లైన మామిడి కాయతో పచ్చళ్ళు , ఆవకాయ , మాగాయ.

ఇలా రెండు నెలల పాటు అందరి ఇళ్ళల్లో నూ ఒకటే హడావుడిగా ఉంటుంది .

ఇవి కాక ఈ రెండు నెలలూ సగ్గు బియ్యం వడియాలు , బియ్యపు పిండి తో వడియాలు , బియ్యపు రవ్వతో వడియాలు ,
మినపప్పు తో చిన్న వడియాలు , మినపప్పు తోనే బూడిద గుమ్మడి కాయతో వడియాలు ఇలా ఈ వేసవి కాలం
రెండూ నెలలు ఎండలను కూడా లక్ష్యపెట్టక మన స్త్రీ మూర్తు లందరూ ఎర్రని ఎండలో ఎంతో కష్ట పడతారు

ఇప్పుడు నేను ప్రస్తా వించబో యే అంశం బూడిద గుమ్మడి కాయతో పచ్చి వడియాలు .

బూడిద గుమ్మడి కాయతో ఏడాదికి సరిపడా వడియాలు పెట్టు కునే సమయంలోనే ఆ రోజు భోజనము లోకి ఆదరువుగా
గుమ్మడికాయ ముక్కలను కలిపిన కొంత పిండిని విడిగా తీసుకుని నూనెలో గారెల మాదిరిగా వేసుకుంటారు .

మేమయితే ఇప్పుడు బూడిద గుమ్మడి కాయలు బాగా వస్తు న్నాయి.

మేము మార్కెట్ కు వెళ్ళి లేత చిన్న బూడిద గుమ్మడికాయను ఎప్పటికప్పుడు తెచ్చుకుని ఈ నవంబరు నెల నుండి
దాదాపుగా ఏప్రియల్ నెల వరకు నెలకు రెండు సార్లు బూడిద గుమ్మడికాయతో పచ్చి వడియాలు వేసుకుని అన్నంలో
ఆదరువుగా తింటాము.

మరి రెసిపీ ఎలాగో తెలుసుకోండి .

**************************

ఆలూరుకృష్ణ పస
్ర ాదు .
గుమ్మడికాయ పచ్చి వడియాలు .

ఏడాదికి ఒకసారి గుమ్మడికాయ వడియాలు అందరూ పెట్టు కుంటారు కదా !

అలా వడియాలు పెట్టు కునేముందు చాలా మంది ఆ రోజుకు అన్నంలోకి కొంత ముక్కలు కలిపిన పిండి విడిగా
తీసుకుని నూనెలో వడియాలు వేయించు కుంటారు .

ఆ వడియాలనే గుమ్మడికాయ పచ్చి వడియాలు అని అంటారు.

గోదావరి జిల్లా లలో చాలా కుటుంబాల వారు ఈ పచ్చి వడియాలను వేసుకుంటారు .

మా ఇంట్లో అయితే చిన్న చిన్న లేత గుమ్మడికాయలు ప్రత్యేకంగా తెచ్చుకొని నెలకు రెండు సార్లు అయినా అన్నంలోకి
ఈ పచ్చి వడియాలు వేసుకుంటాము.

మా ఇంట్లో అందరికీ ఈ వడియాలు చాలా చాలా ఇష్ట ం.

ఈ వడియాలు వేసుకున్న రోజున భోజనము లోకి వేరే ఐటమ్స్ ఉండవు కాంబినేషన్ గా చారు తప్ప .

గారెల రూపంలో వేసుకుంటాము .

ఎంతో రుచిగా ఉండే ఈ గుమ్మడి కాయ పచ్చి వడియాలు

తయారీ విధానము మీ కోసం .

మినపగుళ్ళు -- 250 గ్రా ములు

గుమ్మడికాయ
లేత దైనా , లేదా
ముదురు దైనా
షుమారు --- 1 K.G కాయ

పచ్చి మిరపకాయలు ---


200 గ్రా ములు

ఇంగువ ---- మరి కాస్త ఎక్కువగా .

పసుపు --- తగినంత

ఉప్పు -- తగినంత
నూనె --- 350 గ్రా ములు

తయారీ విధానము ---

రేపు ఉదయము భోజనాల లోకి పచ్చి వడియాలు వేసుకుందామనుకుంటే ముందు రోజు గుమ్మడి కాయను పగుల
కొట్టి పై చెక్కు తీయకుండా సొ రకాయ ముక్కలు తరిగి నట్లు గా తరుగుకొని ముక్కలకు ఉప్పు , పసుపు వేసి ఒక
గుడ్డ లో మూట కట్టి అందులో నీళ్ళు కారి పో యే విధంగా పైన చిన్న రోలు కాని , లేదా బరువు కానీ పెట్టు కోవాలి .

మురుసటి రోజు ఉదయానికల్లా నీరు కారిపో తుంది.

మరుసటి రోజు పిండిలో ముక్కలనువేయబో యే ముందు


ఒకసారి ముక్కలను చేతితో పిండుకోవాలి.

లేదా పిండి పలుచన అయి గారెలు వేయడానికి రావు .

మినపగుళ్ళు కూడా ముందు రోజు నాన బో సుకోవాలి .

మరుసటి రోజు నానిన పప్పు శుభ్రంగా కడిగి మిక్సీ లేదా గ్రైండర్లో పప్పు , తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు పో స్తూ
గారెల పిండిలా గట్టిగా రుబ్బు కోవాలి .

ఇప్పుడు చాలా కొంచెం నీళ్ళల్లో ఇంగువ వేసి బాగా కలిపి ఆ నీళ్ళు గట్టి పిండిలో వేయాలి .

ఇప్పుడు గట్టిగా పిండిన గుమ్మడికాయ ముక్కలు అందులో వేసి రెండు సార్లు తిప్పితే చాలు .

పిండి ముక్కలకు పడుతుంది . ఇంగువ వాసనతో.

ముక్కలు కలిపిన తర్వాత కూడా పిండి గారెల పిండిలా గట్టిగానే ఉండాలి .

పచ్చి మిరపకాయలు తొడిమలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి .

పిండిలో ఉప్పు తగ్గినట్లు అన్పిస్తే


ఈ పచ్చి మిర్చి లో వేసుకుని కలుపుకోండి .

ఇప్పుడు ముక్కలు కలిపిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని


అందులో మిక్సీలో వేసిన పచ్చి మిరపకాయల మిశ్రమం కలుపు కోవాలి .

భోజనానికి ముందు

స్టౌ మీద బాండి పెట్టి మొత్త ము నూనె పో సి నూనె బాగా కాగిన తర్వాత గారెల మాదిరిగా వేసుకోవాలి.
ఘమ ఘమ లాడే ఇంగువ వాసన తో పచ్చి గుమ్మడికాయ వడియాలు ( గారెలు ) భోజనము లోకి సిద్ధం .

హామీ పత్రం.

సంబంధిత రెసిపీ మరియు ఫో టో నా స్వంతం .


ఆలూరుకృష్ణ పస
్ర ాదు .

సాంబారు పొ డి .

సాంబారు రుచికరంగా తయారవ్వాలంటే సాంబారు పొ డి కాని లేక సాంబారు ముద్ద కాని వేసుకోవాలి .

దక్షిణాదిన తమిళనాడు వారే రక రకాల సాంబారులు ప్రతి రోజు పెట్టు కుంటారు .

ప్రతిరోజు భోజనములో వారు సాంబారుతో పాటుగా రసము కూడా పెట్టు కుంటారు .

దక్షిణాది వారు సాంబారులో అన్ని రకములైన కాయగూరలు మరియు ఎక్కువ మోతాదులో పప్పు వేసి బాగా చిక్కగా
సాంబారు పెట్టు కుంటారు.

ఉదయం ఇడ్లీ , వడలు మొదలైన టిఫిన్ల లో సాంబారు ఒక రకంగా , మధ్యాహ్నము భోజనము లోకి సాంబారు మరో
రకంగా పెట్టు కుంటారు .

మన ఆంధ్రా లో దొ రికే సాంబారు పొ డులు అంత రుచిగా ఉండవు .

తమిళనాడులో అంబిక , శక్తి ఇంకా ఇతర కంపెనీ వారి సాంబారు పొ డులు ప్రతి షాపులోను విరివిగా దొ రుకుతాయి .

వాటిలో With మసాలా , Without మసాలా అని కూడా ఉంటాయి .

మసాలా అంటే దాల్చిన చెక్క మరియు లవంగాలు వాసన వేస్తూ పొ డి చాలా ఘూటుగా ఉంటుంది .

మసాలా వేయనిది అంటే పై వస్తు వులు వేయకుండా చేసినది కూడా దొ రుకుతుంది .

మామూలుగా సాంబారు లోకి మసాలా వేయనిదే రుచిగా ఉంటుంది .

ఈ సాంబారు పొ డి నెలకు సరిపడా ఇంట్లో నే తయారు చేసుకోవచ్చు .

సాంబారు పొ డి .

తయారీ విధానము .

కావలసినవి.

ఎండుమిరపకాయలు -- 15
చాయమినపప్పు -- 75 గ్రా ములు
పచ్చి శనగపప్పు -- 50 గ్రా ములు.
కందిపప్పు -- 25 గ్రా ములు
బియ్యము -- రెండు స్పూన్లు
మెంతులు -- స్పూను
జీలకర్ర -- స్పూను
ఆవాలు -- అర స్పూను.
ధనియాలు -- 100 గ్రా ములు.
మిరియాలు -- షుమారు 25
ఇంగువ -- పొ డి కాకుండా పలుకులు 5 ముక్కలు
కరివేపాకు -- తడి లేకుండా పొ డిది ఒకటిన్నర కప్పు.
పసుపు -- ఒక స్పూను.

తయారీ విధానము .

ముందుగా చాయ మినపప్పు , పచ్చి శనగపప్పు , కందిపప్పు , బియ్యము , ధనియాలు నూనె అసలు వేయకుండా
ఒక బాండిలో కమ్మని వాసన వచ్చేదాకా వేయించుకుని విడిగా వేరే పళ్ళెంలోకి తీసుకోండి .

దానిపైన స్పూను పసుపు వేసుకోండి .

ఆ తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి కరివప


ే ాకు నూనె వేయకుండా ఎర్రగా వేయించుకుని వేరేగా ఉంచుకోండి .

ఆ తర్వాత తిరిగి బాండిలో నూనె లేకుండా ఎండుమిరపకాయలు , మెంతులు , జీలకర్ర , ఆవాలు , మిరియాలు ,
ఇంగువ పలుకులు కూడా వేసి వేయించుకోండి .

ముందుగా మిక్సీ లో మొదట వేయించుకున్న ధనియాలు , శనగపప్పు , కందిపప్పు , మినపప్పు తదితర


మిశ్రమాన్ని వేసి మెత్తగా పొ డి వేసుకుని ఒక బేసిన్ లో తీసుకోండి .

తర్వాత రెండవసారి వేసుకున్న ఎండుమిరపకాయలు , జీలకర్ర , మెంతులు , ఇంగువ మిశ్రమాన్ని , వేయించిన


కరివేపాకు కూడా వేసి మిక్సీ లో మెత్తగా వేసుకుని ముందు తీసుకున్న బేసిన్ లో వేసుకుని రెండూ చేతితో బాగా
కలుపుకుని ఒక సీసాలో పో సుకుని ఫ్రిజ్ లో పెట్టు కుని అవసరమైనప్పుడు మూడు స్పూన్లు చొప్పున సాంబారు లో
వేసుకుని , తిరిగి సీసాను ఫ్రిజ్ లో పెట్టు కుంటే నాలుగు నెలలు పైన ఈ సాంబారు పొ డి ఘుమ ఘుమ లాడుతూ
సాంబారుకు మంచి రుచి వస్తు ంది.

సంబంధించిన రెసిపీ మరియు ఫో టో నా స్వంతం .

RAGI PATTIES
Quick and healthy breakfast fix

Here's another detailed recipe of these delicious and super healthy grain Ragi. Ready in a jiffy. You can even
make the mixture a night before, shape it, cover it with cling and refrigerate for quick pan frying in the morning.

Recipe: makes 3 patties

• Mash one large boiled potato in a bowl. Add 1/4th cup of grated Paneer/Cottage cheese, some finely chopped
onion and handful of chopped mint leaves.
• Add 1/4th tsp of Coriander Powder, a pinch of Garam masala, 1/4th tsp of Amchoor, Salt and black pepper to
taste and some roasted Jeera powder/Cumin powder.
• Put 3 tbsps of Ragi flour or as required to get a dough like consistency.
• Shape as required. Heat a non stick ceramic pan. Add one tbsp of desi ghee or any oil. Put the patties and cook
both sides till golden brown.
• Enjoy with ketchup or chutney of your choice.

MOONG DAL CHILLA/PANCAKES

Yellow Moong dal or Spilt Moong dal is highly recommended for children for many reasons:
* It's light & easy to digest
* It's an excellent source of protein
* It also contains good amount of Iron, Potassium, Vitamin B complex & Calcium
* Stimulates immune system
* Is good for liver

Now, since with roti kids barely finish half a bowl of dal so Moong dal chilla is a great way of getting
more goodness of this dal. This is perfect start to your child's day.
It is suitable for #10+month babies.

Recipe: makes 3 or 4 medium size chillas

Ingredients:
* Yellow moong dal: 1 cup or 250 gms
* Salt to taste
* Water as required to soak and make the batter
* Oil: 1 tbsp + for cooking
* Cumin seeds/Jeera: 1 tsp
* Hing/Asafoetida: a pinch
* Coriander leaves: handful
* Red chilli powder: 1/4th tsp or as required (optional)

Method:
- Soak moong dal in enough water for minimum 4 hours or overnight.
- Drain the water. Add the dal in blender. Pour in just enough water (1/4th cup) and blend the dal to a
smooth paste.
- The batter consistency is neither too thick nor too thin.
- Add coriander and the seasoning.
- Heat a tbsp of oil in small pan. Add cumin seeds & hing. Let it splutter. Switch off the flame and add
this to the batter. I prefer mustard oil for tadka.
- Heat a nonstick pan. Brush it with a little oil.
- Pour a little batter and spread it well. Cook both sides on medium low flame till golden.

** Adding oil in the batter ensures the pancakes/chilla is thoroughly cooked and it also adds to the taste.
** You can also add grated veggies like carrots, bottle gourd, beetroot for more nutrition.
**You can also tip in some curry leaves in the tadka.
** I also added 1/4th cup of Masoor dal to moong dal. It enhances the taste

SUJI/SEMOLINA TOAST

The recipe is very simple and super quick to make. It's an all time favourite at my house.

Recipe:

* Take 1/2 cup suji, 3 tbsps of curd and water as required to make a thick paste. Let it rest for ten to 15
minutes. Suji will swell a bit. Add a little water to get the right consistency. It's more like an idli batter.
* Then add veggies of your choice. I like some finely chopped onions, tomatoes, capsicum, grated
carrot, curry leaves and coriander leaves in it.
* Season it with salt, red chilli powder and black pepper.
* Apply a thin layer on one side of bread slice.
* Put butter on a preheated griddle and cook both sides till golden brown and crisp

INSTANT BREAD UTTAPAM

Here's another totally hassle free and a healthy recipe for our little ones. It came out absolutely
delicious. And it's so easy and quick to make. I used wholewheat bread so the colour is yellowish. If
you use white bread it'll look exactly like uttapam. (But wholewheat is always better and healthier 😊)

Instand Bread uttapam

Recipe:

Ingredients: good for 4 medium size uttapam

Bread slices: 5
Suji: 5 tbsps
Rice flour: 5 tbsps
Salt to taste
Curd: 3 tbsps
Red chilli powder
Hing: a pinch
Curry leaves: 9 to 10
Coriander leaves: handful
Veggies of your choice: I used onion, grated carrot, tomato and capsicum
Water for the batter
Grated ginger: a tbsp (optional)

Method:

- Cut the sides of the bread and break them into small pieces.
- In a blender, add bread pieces, suji, rice flour, curd, salt, red chilli powder and little bit water.
- Blend it to make a smooth batter. Take it out in a bowl.
- Batter consistency should not be too runny. It should be thick but flowy.
- Add the veggies, curry leaves, hing and coriander leaves to the batter. Mix well.
- Heat oil on a non stick skillet. Pour about 3 tbsps of batter and cook both sides till golden brown and
crisp.
Serve with coconut chutney, coriander chutney or ketchup.
CUCUMBERS IDLIS
Cucumbers are not only refreshing but also provides great source of nourishment. They are rich in essential
Vitamins including vitamin B & K. It also contains good amount of minerals like potassium, phosphorus, copper
and magnesium.
Cucumbers helps in flushing out toxins keeping digestive system healthy. Keeps your child hydrated. Also fights
heat both inside out.

So how do you include such super food in your child's diet. Most common way is to add cucumber in
sandwiches. Another delicious and healthy way is to make CUCUMBER IDLIS.

It's a must try 😊👌

Recipe: makes 20 idlis


Ingredients:

* Rava/Suji/Semolina: 2 cups (you can roast it or use it raw. But mild roasting gives a better flavour) or 1 1/2 cup
Rava and 1/2 Rice flour
* Sour curd: 2 cups
* Salt
* Red chilli powder: 1/2 tsp (optional)
* Curry leaves: 20 to 25
* Coriander leaves: handful
* Channa dal: handful
* Ghee: 2 tbsps + for greasing
* Hing/Asafoetida: a pinch
* Mustard seeds: 1 tsp
* Cucumber: 3 grated
* Green chilli: 1 (optional)
* Water for steaming
* Baking Soda/Eno fruit salt: 1 tsp
Method:
* In a large bowl, mix rava, rice flour if using, salt, red chilli powder and curd together. Do not add water. Water
from cucumber will be plenty.
* Add grated cucumber and green chilli in a blender and give few blitz
* Add the cucumber in Rava batter and mix till becomes smooth. The batter consistency is thick but should flow
freely. If it feels thick, add a little water, if thin add some more Rava.
* Keep aside for 15 to 20 minutes.
* For tempering, heat ghee, add channa dal and fry till golden brown. Switch off the flame. Now add mustard
seeds, curry leaves and hing. The oil will be hot enough to let all crackle.
* Mix this tempering in the batter.
* When ready to prepare, add baking soda or Eno fruit salt and gently fold.
* Boil water in Idli maker, no more than 3 inch high. Grease the moulds.
* Now add batter and steam on medium heat for 9 to 10 minutes.
* If using pressure cooker then remove the whistle.
* Wait for 2 minutes then take out the idli mould. Allow it to cool a bit then de-mould it.
* Enjoy it Coconut chutney, ketchup or anything you prefer
>> you skip channa dal and add cashews instead. Feel free to temper as per choice.
>> you can do this without Baking soda or Eno but it won't really fluff up. There won't be any change in taste
though. It'll just be dense.
VEGETABLE POHA PATTIES for toddlers and whole family 😉😄

Quick, healthy and delicious. Poha is super rich in Iron and it's a great way of including poha and more
vegetables in your kid's diet.
Every kid loves patties. My 4 year old gobbled two of these really quick. 😅

A must try!

RECIPE: makes around 17 to 18 patties

Ingredients:
-Boiled potatoes: 6
-Carrots: 2 small size, grated
-Capsicum: 1 medium size, chopped finely
-French beans: 10 to 11, chopped finely
-Onions: 2 small size, chopped finely
-Ginger/Garlic: 1 tsp each, grated
-Coriander leaves: finely chopped with stems
-Kasturi methi: 2 tbsps
-Oil: few tbsps or as required for shallow frying
-Salt to taste
-Masalas used: red chilli powder, coriander powder, garam masala, amchoor and chat masala. (Can't
mention the quantity. I tasted an added)
-Poha: 1 1/4th cup (wash and soak it for 5 minutes or till it's soft)
-Rice flour: 2 tbsps (I added for extra crispness and texture. You may skip)

Method:
Mash the potatoes really well. Add all the ingredients mentioned above and mash mash mash really well
with your hands till it resembles a dough.
Give a desired shaped.
Pan fry both sides with few tbsps of Oil till it's golden brown and crisp.
Serve it with green chutney & ketchup.

> if making it for yourself, add some green chillies 😉

EGG PARANTHA

If your child loves eggs like mine, I am sure he/she is going to love this parantha. This is my quick fix
even for dinner when he doesn't want to eat dal subji.
Loaded with good protein and energy, makes it a great breakfast choice.

Recipe:

- Beat one egg till yolk incorporates well. Add coriander leaves, a tbsp of finely chopped onion, salt,
pepper, coriander powder and a pinch of garam masala. Keep aside.
- Take a normal parantha dough. Roll it like a roti and spread some ghee. Bring the sides from the centre
together, make a bow shape and then bring the two halves together.
- Roll again like a roti, not thick and not too thin.
- Partial cook both sides. Lower the flame and make an opening with a sharp knife. Now if you are
doing it for the first time, then keep the partial cooked roti on a plate and make an opening.
- Spread ghee on the surface of parantha then from the opening, pour the egg inside. Keep the flame on
low.
- Cover the tawa with a lid and let it cook for 30 seconds to a minute on one side or till the egg is set.
- Add a little ghee on top and flip. Cover again and cook for few more seconds. Cook till parantha fluffs
up and becomes crisp.

Serve with dollop of butter and loads of love :)

CHEESE EGG MUFFINS

Easiest way to make a quick and healthy breakfast or snack for your child. It's loaded with nutrition.
You can play along with vegetables. It tastes great, it's super healthy and kids love it.

Eggs offer tremendous nutrition. They are high in proteins, contains Vitamin B, E, K and A, is rich in
antioxidants and many more. One egg gives the most complete nutrition hence making it ideal breakfast
for kids. Adding veggies to eggs makes it more nourishing.

Here's the recipe: makes 10 muffins. I used 5 eggs here in the recipe. 1 egg will give you 2 muffins. Feel
free to tweak it as per your child's preference

Ingredients:
- Eggs: 5
- Veggies: of your choice (I used broccoli, carrots and capsicum) chopped finely
- Salt and black pepper to taste
- Mozzarella cheese: 1/2 cup grated (if you want, you can skip it but it adds to the taste)
- Mint leaves: handful, chopped finely
- Red chilli powder as per taste (optional)
- Oregano: 1/2 tsp
- Milk: 1/4th cup
- Butter for greasing + 1 tbsp

Method:
- Crack eggs in a bowl, add milk and beat well for 5 to 7 minutes
- Then add all of the above ingredients to eggs and mix well.
- Grease muffin tray cavities with butter and pour eggs in it. Fill 3/4th of the cavity.
- Put the tray in a preheated oven and bake for 12 to 15 minutes at 200 C or till toothpick inserted at the
centre comes out clean.
- I also sprinkled some cheese on top of eggs before baking. That's totally your choice.

*** the eggs might stick to the cavity after baking so best would be use silicon moulds for baking.

RICE AND CUCUMBER PANCAKES

These are healthy and delicious. The flavours of cucumber combined with curry leaves and mint leaves
makes it very refreshing.
Cucumbers are a great source of nutrition. It contains multi B vitamins, potassium, fibre and many
more. It also keeps the body hydrated.

It makes a great tiffin recipe too ☺️

A must try! 😊

Recipe: makes 6 pancakes

Ingredients:
- Rice flour: 1 cup
- Curd: 1/4th cup
- Cucumber: 1, peeled and grated
- Salt and pepper to taste
- Curry leaves: 10 to 12, chopped
- Mint leaves: handful, chopped
- Coriander leaves: a tbsp, chopped
- Water: 1/4th cup roughly for the batter
- Oil for cooking

Method:

In a bowl, mix in all the above ingredients except oil to make thick but a flowy batter.
Let it rest for 15 mins. Heat a non stick pan. Add some oil and pour around 2 tbsps of batter. Spread a
little to make a thin pancake. Cook both sides till browned. Enjoy it with green chutney or coconut
chutney. 😊
ఆలూరుకృష్ణ పస
్ర ాదు .

ప్రియమిత్రు లందరికీ

ఈ రోజు స్పెషల్ అరటి కాయ పచ్చడి .

అరటి కాయ పచ్చడి .

తయారు చేయు విధానము .

కావలసిన వస్తు వులు .

అరటి కాయలు ---- 2


పెద్ద ఉల్లిపాయలు ---- 2
పచ్చిమిరపకాయలు ----- 4
కరివేపాకు ----- 3 రెమ్మలు
కొత్తి మీర ----- మరి కాస్త ఎక్కువ .

పో పు వేయుటకు --- నూనె 3 టీ స్పూన్లు .


ఎండు మిరపకాయలు --- 5
చాయ మినపప్పు --- 2 స్పూన్లు
ఆవాలు ---- 1 స్పూన్
ఇంగువ --- తగినంత
పసుపు --- కొద్దిగా
ఉప్పు ---- తగినంత .

అరటి కాయ పచ్చడి తయారు చేయు విధానము .

ముందు ఉల్లిపాయలు పై పొ ట్టు తీసి చాలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరగండి. ( ఎలాగంటే దో శెలలోకి మరియు
మిర్చి బజ్జీలలోకి సన్నగా తరుగుతాము కదా . ఆ విధంగా )

ఇప్పుడు అరటికాయలు శుభ్రంగా కడిగి పొ డిగా గుడ్డ పెట్టి తుడవండి.

అరటి కాయల చెక్కు తీయవద్దు .

ఇప్పుడు స్టౌ వెలిగించి సెగ సిమ్ లో పెట్టండి.


అరటికాయలు మీద నూనె రాయనక్కరలేదు .

ఆ రెండు అరటి కాయలు వంకాయలు బజ్జీ పచ్చడికి కాల్చినట్లు కాల్చండి .

పై చెక్కు నల్ల గా అయి చేతితో పట్టు కొని చూస్తే లోపల మెత్తగా అవుతుంది .

గిన్నెలో నీళ్ళు పెట్టు కుని చేతులు తడి చేసుకుంటూ ఆ కాయల పై చెక్కు తీసేయండి .

ప్లేటులో ఆ కాయలు ఉంచుకోండి.

ఇప్పుడు స్టౌ మళ్ళీ వెలిగించి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగాక అందులో చాయ మినపప్పు , ఆవాలు ,
ఎండు మిరపకాయలు , ఇంగువ వేసి పో పు బాగా వేగాక అందులో కరివప
ే ాకు , పచ్చిమిరపకాయలు వేసి రెండు
నిముషాలు ఉంచి స్టౌ ఆపేయండి .

సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయించవద్దు .

పో పు చల్లా రాక ముందుగా మిక్సీ లో ఎండుమిరపకాయలు , తగినంత ఉప్పు , పసుపు కొద్దిగా వేసి మెత్తగా మిక్సీ
వేసుకోండి.

మిగిలిన పో పు ఇప్పుడే వేయవద్దు .

తర్వాత మిక్సీ లో కాలిన అరటి కాయలు ,పచ్చి మిరపకాయలు ,


వేగిన కరివేపాకు వేసి మరోసారి మిక్సీ వేసుకోండి.

అరటికాయలు బాగా కాలి ఉంటాయి కాబట్టి కొద్దిగామిక్సీ వెస్తే చాలు పచ్చడి మెత్త పడుతుంది .

ఇప్పుడు ఒక పళ్ళెంలోకి తీసుకొని సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు , మిగిలిన పో పు , కొత్తి మీర
సన్నగా తరిగి చేత్తో నే బాగా కలుపుకుని ఒక Bowl లోకి తీసుకోండి.

అంతే పసందైన అరటి కాయ పచ్చడి భోజనం లోకి సిద్ధం.

ఇందులో ఉల్లిపాయలు పచ్చివి వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది .

వేగిన మినపప్పు పంటి కింద తగులుతూ చక్కని రుచితో ఉండే ఈ అరటి కాయ పచ్చడి తప్పక try చెయ్యండి.

మీ అందరికీ నచ్చుతుంది .

ఈ పచ్చడికి పండిన , ఓ మాదిరిగా పండిన అరటి కాయలు వాడవద్దు .


పచ్చడి తీపి వచ్చి రుచి పాడవుతుంది .

పచ్చి కాయలే వాడండి .

ఫో టో --- ఈ రోజు మేము చేసిన అరటికాయ పచ్చడి .

సంబంధించిన రెసిపీ మరియు ఫో టో నా స్వంతం .


ఆనపకాయ / సొ రకాయ పెరుగు పచ్చడి .

కావలసినవి .

లేత ఆనపకాయ చిన్నది అయితే సగం ముక్క మధ్యకు తరిగి , పై చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరుగు కోవాలి
ముక్కలు షుమారు రెండు కప్పులు ఉండాలి .
పెరుగు -- అర లీటరు . కరివేపాకు -- రెండు రెమ్మలు కొత్తి మీర -- చిన్న కట్ట
పచ్చిమిర్చి -- 4 పచ్చి కొబ్బరి తురుము -- పావు కప్పు. నెయ్యి -- మూడు స్పూన్లు
ఉప్పు -- తగినంత .

పో పుకు కావలసినవి .

ఎండుమిర్చి --- మూడు చిన్న ముక్కలుగా చేసుకోవాలి .


మినపప్పు -- స్పూను ఆవాలు -- అర స్పూను
జీలకర్ర -- పావు స్పూను ఇంగువ -- కొద్దిగా .

పచ్చిమిర్చి చాలా చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .

కొత్తి మీర సన్నగా తరుగు కోవాలి .

సొ రకాయ ముక్కలు ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్ళు పో సి , కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా ఉడకనివ్వాలి .

తర్వాత నీళ్ళు వార్చి ముక్కలు చల్లా ర నివ్వాలి .

ఒక గిన్నెలో పెరుగు వేసుకోవాలి . పెరుగు కమ్మగా ఉంటే పచ్చడి రుచిగా ఉంటుంది . పెరుగుపై కొద్ది మీగడ ఉన్నా
వేసేయండి . పచ్చడికి కమ్మని రుచి వస్తు ంది .

పెరుగులో ఉడికించి చల్లా రిన ఆనపకాయ ముక్కలు , పచ్చి కొబ్బరి తురుము , సన్నగా తరిగిన కొత్తి మీర , సన్నగా
తరిగిన పచ్చిమిర్చి ముక్కలు , తగినంత ఉప్పు వేసి గరిటతో బాగా కలుపుకోవాలి .

ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నెయ్యి వేసి నెయ్యి బాగా కాగగానే వరుసగా ఎండుమిర్చి ముక్కలు ,
మినపప్పు , జీలకర్ర , ఆవాలు , కొద్దిగా ఇంగువ మరియు కరివేపాకు వేసి పో పు చల్లా రగానే పెరుగులో వేసి బాగా
కలుపుకోవాలి .

అంతే ఎంతో రుచిగా ఉండే సొ రకాయ పెరుగు పచ్చడి సర్వింగ్ కు సిద్దం.


ఐదు నిముషాల్లొ అయిపొ యె పచ్చడి ఇది. అదిరిపొ యే రుచి కూడా!

కావలసినవి:
టమాటాలు ఆరు
పచ్చిమిరపకాయలు నాలుగు
నూనె ఒక స్పూను
ఉప్పు తగినంత
కొత్తి మీర చిన్న కట్ట
కరివేపాకు మూడు రెబ్బలు

పద్ధ తి:

బానలిలొ నూనె వెసి టమాటాలను, మిరపకాయలను 3 నిముషాలు మూత పెట్టకుందా వెయించాలి.

టమాట తొక్క వచ్చేస్తు ంది. దాన్ని పట్ట కారతో తీసేసేయాలి.


రోటిలొ ముందు సగం కొత్తి మీర, రెండు రెమ్మలు కరివేపాకు నూరుకోవాలి. తరువాత టమాటా ముక్కలు,
మిరపకాయలు వెసి మెల్లగా నూరుకోవాలి. ఆఖరున ఉప్పు కలిపి నూరి, గిన్నెలోకి తీసుకుని పో పు వెయ్యండి. మిగతా
కొత్త ిమీర తరిగి పైన అలంకరించండి. కారంగా పుల్ల గా నోరూరించే టమాట పచ్చడి 5 నిముషాల్లొ సిద్ధం!
మార్కెట్లో తాజా ముల్ల ంగి కొంటుంటే అమ్మే అమ్మాయ్ ఆకులు ఉంచి ఇవ్వనా తీసేసి ఇవ్వనా అంది..నేను ఆకులు యెంచేసుకోను

తీసెయ్ అన్నా..అయ్యో ఆకు పెసర పప్పుతో పొ డి పప్పు వేసుకుంటే చాలా బాగుంటుందమ్మా ఆరోగ్యానికి మంచిది కూడా

అంది..ఎట్లా చేయాలో కూడా చెప్పింది.వెంటనే ఆకులు తీసుకుని వచ్చేసా..ఉదయాన్నే అవి ఉప్పు కలిపిన నీటిలో వేసి, పొ ట్టు

పెసలు నానబెట్టి, ఒక గంటాగి ఆకులు సన్నగా తరిగి పెట్టు కుని, బాండ్లీలో నూనె పో పు చేస్కుని, అందులో తరిగిన ముల్ల ంగి ఆకు

పెసలు వేసి కలిపి కాసేపు మూతపెట్టి కాస్త ఉడికాక..రెండు టమాటాలగుజ్జు వేసి కలిపి ,సరిపడా ఉప్పుకారం,ధనియాల పొ డి చల్లి,

కాస్త మగ్గా క దించేసి కొత్తి మీరతో అలంకరించా. ఎందుకైనా మంచిదని టమాట పచ్చడి,మిరియాల చారు చేసాను.. (పప్పు

బాగాలేదంటే వీటితోనన్నా తింటారని).భయపడుతూ మావారేం చెప్తా రో అని ఎదురుచూస్తూ కూర్చున్నా🙄🙄పప్పు కలిపారు నెయ్యి

వేసి మరీ.. నాకు దడ తింటారో లెదో అని... ముద్ద నొట్లో పెట్టు కుని నా వంకచూసారు... ఐపో యింది☹️☹️.... ఏం కూర వేసావు చాలా

బాగుంది అన్నారు. నేను మనసులో💃💃💃. అప్పటికి దాటవేసి పప్పు బాగుందని లాగించాక చెప్పా🤗🤗..... ఎప్పుడు ముల్ల ంగి

తెచ్చినా ఇలాగే చేయ్ అని చెప్పి వెళ్ళారు😊😊ఇంకేముంది..... ఖేల్ ఖతం దుక్నం బంధ్😄😄

పెసరపప్పు పప్పు చారు .


కావలసినవి .
చాయపెసరపప్పు -- ఒక కప్పు లేదా షుమారుగా 75 గ్రా ములు. చింతపండు - పెద్ద నిమ్మకాయంత
కరివేపాకు -- మూడు రెమ్మలు పచ్చిమిర్చి -- అయిదు . కొత్తి మీర -- ఒక కట్ట పసుపు -- కొద్దిగా
ఉప్పు -- తగినంత
పో పుకు .
ఎండుమిరపకాయలు -- మూడు మెంతులు -- పావు స్పూను జీలకర్ర -- అర స్పూను
ఆవాలు -- అర స్పూను ఇంగువ -- కొద్దిగా.
తయారీ విధానము .
ముందుగా చింతపండు విడదీసి ఒక అర గ్లా సు నీళ్ళలో పది నిముషాలు నానబెట్టి రెండు గ్లా సుల రసం తీసుకోవాలి .
చాయపెసరపప్పు ఒక గిన్నెలో వేసి ఒకసారి కడిగి , తగినన్ని నీళ్ళు పో సి స్టౌ మీద పెట్టి మెత్తగా ఉడకనివ్వాలి .
ఉడికిన తర్వాత గరిటతో పప్పుని మెత్తగా యెనపాలి .
తర్వాత అందులో చింతపండు రసం , పసుపు , ఉప్పు , నిలువుగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు , మరియు కరివేపాకు వేసి తిరిగి
స్టౌ మీద పెట్టి బాగా తెర్లనివ్వాలి .
ఆ తర్వాత పులుసు దింపి పో పు గరిట స్టౌ మీద పెట్టి వరుసగా ఎండుమిర్చి ముక్కలు , మెంతులు , జీలకర్ర , ఆవాలు మరియు
ఇంగువ వేసి పో పు పెట్టు కొని పులుసులో కలపాలి .
తర్వాత పులుసు పై తరిగిన కొత్తి మీర చల్లు కోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే పెసరపప్పుతో పప్పు చారు భోజనము లోకి సిద్ధం.
కొంతమంది చింతపండు బదులుగా రెండుకాయలు నిమ్మరసం పిండుకుని ఈ పెసరపప్పు పప్పుచారు పెట్టు కుంటారు .
వెరైటగ
ీ ా అప్పుడప్పుడు ఈ విధముగా కూడా చేసుకొనవచ్చును ఇందులో మేము కారం మరియు బెల్లం వేయము .
ఇంగువ బదులుగా ఇష్ట మన
ై వారు పో పులో ఓ ఎనిమిది పొ ట్టు తీసిన వెల్లు ల్లి రెబ్బలు వేసుకుని పో పు పెట్టు కుంటే రుచి
అమోఘంగా ఉంటుంది .
ఆలూరుకృష్ణ పస
్ర ాదు .

ఈ రోజు స్పెషల్ ఐటం ' ముక్కల పులుసు '.

రసం , సాంబారు , పప్పు పులుసు , పప్పు చారు ఇలా లిక్విడ్ ఐటమ్స్ లో వివిధ రకాలున్నా ముక్కల పులుసు ది
ప్రత్యేక స్ధా నం. ప్రధమ స్ధా నం.

ముక్కల పులుసు.
*************

కావలసినవి.

ఆనపకాయ / సొ రకాయ --
కాయలో పావు ముక్క షుమారు పావు కిలో.
ములక్కాడలు --- 2
వంకాయలు --- 2
బెండకాయలు - 8
చిలకడదుంపలు - 4
పచ్చి మిర్చి - 5
కరివేపాకు -- మూడు రెమ్మలు
కొత్తి మీర -- ఒక కట్ట

చింతపండు -- 50 గ్రా
బెల్లం -- 40 గ్రా
పసుపు -- పావు టీ స్పూను
కారం --- అర టీ స్పూను
ఉప్పు --- తగినంత

పో పుకు

ఎండుమిర్చి -- మూడు
మెంతులు -- కొద్దిగా
ఆవాలు -- అర స్పూను
జీలకర్ర --- పావు స్పూను
ఇంగువ -- కొద్దిగా
తయారీ విధానము.

ముందుగా పదిహేను నిముషములు చింతపండు వేడినీళ్ళలో నాన బెట్టు కుని ఒక రెండు గ్లా సుల రసం తీసుకొని ఒక
గిన్నెలో పో సుకోవాలి.

ఆనపకాయ చెక్కు తీసుకుని


ఫో టోలో చూపిన సైజులో ముక్కలు తరుగు కోవాలి .

చిలకడ దుంపలు చెక్కు తీయనవసరంలేదు.

ఫో టోలో చూపిన విధంగా గుండ్రంగా ముక్కలు తరుగు కోవాలి.

ములక్కాడలు , బెండ కాయలు , వంకాయలు అన్నీ ముక్కలు తరుగు కోవాలి .

పచ్చి మిర్చి నిలువుగా చీల్చు కోవాలి .

ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో ఈ తరిగిన అన్ని ముక్కలు వేసుకోవాలి .

ఇందులో చింతపండు రసం నీళ్ళు పో యాలి .

ఇందులో పసుపు , తగినంత ఉప్పు , బెల్లం , కారం , తరిగిన పచ్చిమిర్చి ముక్కలు , కరివప
ే ాకు వేయాలి .

ఇప్పుడు స్టౌ వెలిగించి మీడియం సెగన ఈ పులుసును ఓ ఇరవై నిముషాల పాటు ముక్కలన్నీ మెత్తగా ఉడికేలా మరగ
నివ్వాలి .

ఆ తర్వాత మూడు విధములుగా మన అభిరుచిని బట్టి చేసుకోవచ్చు.

మొదటిది ముక్కలు ఉడికాక రెండు గరిటెలు మెత్తగా ఉడికిన పప్పు బాగా యెనిపి పులుసులో వేసి మరో అయిదు
నిముషాలు మరగ నిచ్చి దింపు కోవచ్చు.

రెండవది ఒక రెండు స్పూన్లు బియ్యపు పిండి తీసుకొని అరగ్లా సు నీళ్ళలో వేసి ఉండలు లేకుండా కలిపి , మరుగుతున్న
పులుసులో వేసి మరో అయిదు నిముషములు కాగనిచ్చి దింపుకోవచ్చు.

ఇక మేము చేసే మూడవ విధానము.

పావు స్పూను మెంతులు , మూడు ఎండుమిరపకాయలు , స్పూను పచ్చిశనగపప్పు , అర స్పూను మినపప్పు ,


స్పూను ధనియాలు,
కొంచెం ఇంగువ నూనెలో వేయించి అందులో పావు చిప్ప పచ్చి కొబ్బరి ముక్కలుగా తరిగి వేసి కొద్దిగా వేయించాలి.
చల్లా రగానే మెత్తగా మిక్సీ వేసుకోవాలి .

ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పులుసులో ముక్కలన్నీ ఉడికాక వేసి , మరో అయిదు నిముషముల పాటు తెర్ల
నివ్వాలి

చివరగా పో పు గరిట స్టౌ మీద పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి ఎండు మిర్చి ముక్కలు, జీలకర్ర , ఆవాలు , మెంతులు ,
ఇంగువ వేసి పో పు పెట్టు కోవాలి .

పైన కొత్తి మీర తరిగి వేసుకోవాలి .

అంతే అదిరిపో యే రుచితో ఘమ ఘమ లాడే " ముక్కల పులుసు " సర్వింగ్ కు సిద్ధం.

చక్కగా రెండు రోజుల పాటు అన్నం లోకి , ఇడ్లీల లోకి , పూరి , చపాతీ ల లోకి వేసుకుని తినవచ్చు.

టమాటో రైస్: ముందుగా 4 టొమాటోస్ కట్ చేసి గ్రైండ్ చేసి పెట్టా లి స్ట వ్ పైన కుక్కర్ పాన్ పెట్టి 2 స్పూన్స్ నేయి వేసి 2 స్పూన్స్
ఆయిల్ వేసి బిర్యానీ ఆకు పచ్చిమిర్చి ఉల్లి తరుగు కొత్తి మీర పుదీనా తరుగు వేసి అల్ల ం వెల్లు ల్లి పేస్ట్ వేసి అన్ని మసాలాలు కలిపి పొ డి
చేసి వేయాలి పో పు బాగా వేగిన తరువాత టమాటో జ్యూస్ 1 గ్లా స్ నీళ్లు 1/2 గ్లా స్ వేసి కొద్దిగా ఎవరెస్ట్ బిర్యానీ పొ డి 1 స్పూన్ వేసి
ఎసరు మరిగంి చి ఒకసారి కడిగి నన పెట్టిన బాస్మతి రైస్ 1 గ్లా స్ ఎసరు లో వేసి కుక్కర్ మూత పెట్టి 3whistles వోచేవరకు ఉంచి స్ట వ్
ఆఫ్ చేసి దించడమే ఘుమ ఘుమలాడే టమాటో రైస్ రెడీ
DHABA STYLE EGG CURRY / SPICY EGG
CURRY / PUNJABI STYLE EGG CURRY
RECIPE

           

Dhaba Style Egg Curry

After the relaxing holidays and lovely weekend, I am happy to be here with a spicy egg curry recipe.
This dhaba style egg curry is very flavorful, hot and absolutely fingerlicking yummy. In this recipe,
the boiled eggs are cooked...in a thick onion tomato based gravy infused with aromatic spices. It
tastes excellent with tandoori rotis, parathas or fried rice. Also you can use baby potatoes instead
of egg in this same recipe for veg version.

Ingredients:

      Eggs                       - 3

      Oil                           - 2 tbsp

      Onions                    - 2

      Tomato                   - 2

      Bay leaf                  - 1

      Cloves                    - 3 to 4
      Cinnamon              - 1

      Black pepper          - 1 tsp

      Ginger garlic paste- 1 tbsp

      Turmeric pwd        - ¼ tsp

      Red chilly pwd       - 1 to 2 tsp

      Coriander pwd       -2 tsp

      Garam masala pwd- 1 tsp

      Lemon juice           - few drops

      Salt to taste

      Fresh coriander leaves

Method:

1.              Add sliced tomatoes to blender and make it to puree.

2.             Keep it aside.

3.             Cook the eggs, deshell it and make fine slits on it.

4.             Heat oil in a fry pan.


5.             Add the cooked eggs and saute until it turns light golden yellow in color.

6.             Take it and keep aside.

7.             To the pan add 2 tsp of oil and heat it. Add bay leaf, cloves, cinnamon, black pepper and saute for a
minute.

8.             Make a paste of sliced onions and add it to the pan.

9.             Keep the flame in medium and keep on stirring until the onions are cooked and the raw smell
disappears.

10.          Add ginger garlic paste and saute for one minute.

11.           Add turmeric pwd, red chilly pwd, coriander pwd, salt and combine. ( adjust the red chilly pwd to
suit your spicy taste)

12.          Add 1 cup of water and allow to boil.


13.          Once the oil oozes out of the masala, add the tomato puree.

14.          Mix well.

15.          Continue cooking for another 4 to 5 minutes in low medium flame.

16.          Once the gravy reaches thick consistency, add the boiled eggs.

17.          Add garam masala pwd and stir.

18.          Taste and adjust salt and seasonings. . ( add 2 tsp of yoghurt in this step, if you like to have more
creamy gravy)

19.          Turn off flame.

20.         Squeeze few drops of lemon juice.


21.          Serve hot with fresh coriander leaves garnishing.

22.         It tasted lipsmacking good with a combo of soft chapatis.


మసాలా ఫిష్‌కర్రీ

కావలసినవి

చేపలు - ఆరు లేదా ఎనిమిది ముక్కలు, ఉల్లిపాయ - సగం, అల్ల ం - చిన్నముక్క, వెల్లు ల్లిపాయలు- రెండు లేదా మూడు,
దాల్చినచెక్క - చిన్నది, లవంగాలు - రెండు, ధనియాలు - ఒక టీస్పూను, జీలకర్ర - అర టీస్పూను, మిరియాలు - అర టీస్పూను,
సో ంపు - పావు టీస్పూను, ఉప్పు-తగినంత.

 మారినేషన్‌కు

పసుపు - పావు టీస్పూను, కారం- అర టీస్పూను, నిమ్మకాయ రసం- ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, వేగించడానికి నూనె -
సరిపడినంత.

తయారీ

ఉల్లిపాయ, వెల్లు ల్లి, అల్ల ం, దాల్చినచెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, సో ంపు అన్నింటినీ కలిపి నీళ్లు
కలపకుండా పేస్టు లా గ్రైండ్‌ చేయాలి. చేప ముక్కలను శుభ్రంగా కడిగి నీళ్లు పిండేయాలి. పసుపు, కారం, ఉప్పు, నిమ్మరసం
మిశ్రమాన్ని కలిపి చేప ముక్కలకు పట్టించి అరగంట ఉంచాలి. ఆ తర్వాత అన్ని ముక్కలకు మసాలా పట్టించి పది నిమిషాలు
ఉంచాలి. నాన్‌స్టిక్‌ పెనం వేడి చేసి మసాలా పట్టించిన ఒక్కొక్క ఫిష్‌ పీసును పెనంపై పెట్టి దాని చుట్టూ నూనె చల్లి చేప ముక్కను
ఎర్రగా కాల్చాలి. అలా అన్ని చేప ముక్కలను కాల్చాలి. చేప ముక్కలను కాల్చేటప్పుడు మంట చిన్నదిగా ఉండాలి.
చేపముక్కలను రెండు వైపులా తిప్పుతూ నూనెలో కరకరలాడేలా ఫ్రై చేయాలి.
ఫిష్‌వేపుడు

కావలసిన పదార్థా లు: చేపలు - కిలో, ఉల్లిపాయ - ఒకటి, అల్ల ం వెల్లు ల్లి ముద్ద - రెండు టేబుల్‌ స్పూన్లు , కారం - మూడు టీ
స్పూన్లు , ఉప్పు - తగినంత, మసాల పొ డి - రెండు టీ స్పూన్లు , పసుపు - కొద్దిగా, నూనె - సరిపడా. 
తయారుచేయు విధానం: ముందుగా చేపల్ని శుభ్రం చేసుకుని మనకి కావల్సిన సైజులో కట్‌ చేసుకోవాలి. తరువాత ఉల్లిపాయని
కోసి మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని ఒక గిన్నెలో వేసుకుని అందులో అల్ల ంవెల్లు ల్లి ముద్ద , కారం, ఉప్పు, పసుపు, మసాల పొ డి,
పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసి మిశ్రమం అంతా చేపముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి.
ఒక గంట తర్వాత స్టౌ వెలిగించి మందంగా ఉన్న పెనం పెట్టి కొద్దిగా నూనె పొ య్యాలి. కాగిన తర్వాత చేప ముక్కల్ని రెండు చొప్పున
వేసి వేయించుకోవాలి. సన్నని మంటపై వేయిస్తే చేప బాగా ఫ్రై అవుతుంది. తర్వాత దింపుకుని దీన్ని వేయించిన కరివేపాకుతో,
కొత్తి మీర తురుముతో అలంకరించుకోవాలి.
బియ్యపు రవ్వతో ఉప్పు పిండి లేదా ఉప్మా.

కావలసినవి .

బియ్యపు రవ్వ -- ఒక గ్లా సు.


చాయ పెసర పప్పు -- పావు గ్లా సు 
పచ్చి కొబ్బరి -- అర చిప్ప
నూనె -- నాలుగు స్పూన్లు  
పచ్చి మిరపకాయలు -- 5 నిలువుగా చీలికలు చేసుకోవాలి .
కరివేపాకు -- మూడు రెమ్మలు

పో పుకు .

ఎండుమిరపకాయలు -- 3 ముక్కలుగా చేసుకోవాలి .


పచ్చిశనగపప్పు -- రెండు స్పూన్లు  
చాయమినపప్పు -- స్పూనున్నర 
జీలకర్ర -- స్పూను 
ఆవాలు -- స్పూను 
నెయ్యి -- మూడు స్పూన్లు  
నీళ్ళు -- మూడు గ్లా సులు. 
ఉప్పు -- తగినంత

తయారీ విధానము .

చాయపెసరపప్పు తగినన్ని నీళ్ళు పో సి గంటన్నర సేపు నానబెట్టు కోవాలి .

తర్వాత నీరు వడగట్టు కొని వేరే ప్లేటులో తీసుకోవాలి .

పచ్చి కొబ్బరి తురుము కోవాలి.

ఇప్పుడు స్టౌ మీద మందపాటి గిన్నె కాని లేదా బాండీ కాని పెట్టు కుని నాలుగు స్పూన్లు నూనె వేసుకుని నూనె బాగా కాగగానే వరుసగా
ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు , పచ్చిమిర్చి మరియు కరివేపాకు వేసి పో పు
పెట్టు కోవాలి.

పో పు వేగగానే మొత్త ం మూడు గ్లా సుల నీళ్ళు , నానబెట్టిన చాయపెసరపప్పు వేసి , తగినంత ఉప్పును వేసి మూత పెట్టి నీళ్ళు బాగా
తెర్లనివ్వాలి .

ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము అందులో వేసి గరిటెతో బాగా కలిపి రెండు నిముషాలు తెర్ల నివ్వాలి .

ఆ తర్వాత సన్నగా బియ్యపు రవ్వ పో సుకుంటూ ఉండకట్ట కుండా అట్ల కాడతో బాగా కలపాలి .

తర్వాత మూడు స్పూన్లు నెయ్యి వేసి అట్ల కాడతో బాగా కలపాలి .

తర్వాత స్టౌ సిమ్ లో పెట్టి మరో పది నిముషాలు సన్నని సెగన మగ్గ నివ్వాలి .

అంతే ఎంతో రుచిగా ఉండే బియ్యపు రవ్వతో పిండి సర్వింగ్ కు సిద్ధం.

ఇందులో నంచుకోవటానికి చట్నీ.


చిన్న నిమ్మకాయంత చింతపండు ( అయిదు నిముషాలు తడిపి ), ఒక చిన్న కట్ట కొత్తి మీర , ఆరు పచ్చి మిరపకాయలు , కొద్దిగా బెల్లం
మరియు సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ లో వేసుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి .

తర్వాత స్టౌ మీద పో పు గరిటె స్పెట్టి , రెండు స్పూన్లు నెయ్యి వేసి రెండు ఎండుమిరపకాయలు , స్పూను మినపప్పు , అర స్పూను
ఆవాలు , కొద్దిగా ఇంగువ మరియు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని పో పు పెట్టు కుని పచ్చడిలో కలుపు కోవాలి .

ఈ పచ్చడి పిండి లోకి కాంబినేషన్ గా బాగుంటుంది .


చుక్కకూర -- రెండు కట్ట లు.
పచ్చిమిర్చి -- 8
నూనె -- అయిదు స్పూన్లు  
పసుపు -- కొద్దిగా 
ఉప్పు -- తగినంత

పో పునకు.

ఎండుమిరపకాయలు -- 6
చాయమినపప్పు -- స్పూనున్నర 
మెంతులు -- పావు స్పూను 
ఆవాలు -- అర స్పూను .
ఇంగువ -- కొద్దిగా .

తయారీ విధానము .

ముందుగా చుక్కకూరలో ముదురు కాడలు తీసి వేసి శుభ్రం చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి .

తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే చుక్కకూర , పచ్చిమిర్చి , పసుపు వేసి మూత పెట్టి
ఆకును మగ్గ నివ్వాలి .

తర్వాత మగ్గిన ఆకును విడిగా ప్లేటులో తీసుకోవాలి .

తిరిగి స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు, మినపప్పు , మెంతులు ,
ఆవాలు , ఇంగువ వేసి పో పు వేసుకోవాలి .

ఈ వేయించిన పో పును మిక్సీ లో వేసి , తగినంత ఉప్పును వేసి మెత్తగా మిక్సీ వేసు కోవాలి .

తర్వాత మగ్గిన చుక్క కూర , పచ్చిమిర్చి వేసి ఒకసారి మిక్సీ వేసుకోవాలి.

తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి.

ఇష్ట మైన వారు మినపప్పు , ఆవాలు మరియు ఎండుమిర్చి వేసి తిరిగి పైన పో పు వేసుకోవచ్చు .

ఈ చుక్కకూర పచ్చడిలో ఆకులో పులుపు ఉంటుంది కనుక చింతపండు వేయనవసరము లేదు.

ఈ పచ్చడి దో శెలు, చపాతీలు మరియు భోజనము లోకి ఎంతో రుచిగా ఉంటుంది .


ఆలూరుకృష్ణ ప్రసాదు .

ఈ రోజు స్పెషల్ .

బెండకాయ నువ్వుల పొ డి కూర.

కావలసినవి .

లేత బెండకాయలు --- పావు కిలో.


నువ్వు పప్పు -- 100 గ్రా ములు .
నూనె -- 100 గ్రా ములు.
ఎండుమిరపకాయలు -- 6
జీలకర్ర -- అర స్పూను .
ఉప్పు -- తగినంత .

తయారీ విధానము .

ముందుగా నువ్వుల పొ డి సిద్ధం చేసుకోవాలి .

స్టౌ మీద బాండీ పెట్టి నూనె వేయకుండా నువ్వు పప్పు , ఎండుమిర్చి , జీలకర్ర కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకుని చల్లా రగానే
సరిపడా ఉప్పు వేసుకుని మిక్సీ లో మెత్తగా పొ డి చేసుకుని వేరుగా ఉంచుకోవాలి .

లేత బెండకాయలు రెండువైపులా ముచికలు తీసుకొని చాకుతో నిలువుగా మధ్యలో గాటు పెట్టు కోవాలి .

కాయలు మరీ పెద్దవి అయితే మధ్యకు తరుగుకోవాలి .

ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి నూనె మొత్త ం పో సి , నూనె బాగా కాగగానే , కాయలు పళంగా తరిగిన బెండకాయలు వేసి గరిటతో
కలుపుతూ బాగా వేగనివ్వాలి .

తరువాత వేగిన కాయలు వేరే పళ్ళెంలో తీసుకొని , ముందుగా సిద్ధం చేసుకున్న నువ్వులపొ డి కాయల్లో కూరుకుని , బాగా కాగుతున్న
వేడి వేడి నూనె ప్రతి కూరిన కాయపై పో సుకోవాలి .

అంతే ఎంతో రుచిగా ఉండే బెండకాయ నువ్వులపొ డి కూర భోజనము లోకి సర్వింగ్ కు సిద్ధం.
టమోటో ఉల్లిపాయ చట్నీ .

రెండు ఉల్లిపాయలు మరియు రెండు టమోటోలు ముక్కలుగా తరగండి.

బాండీలో రెండు స్పూన్లు నూనె పో సి ఉల్లిపాయలు మగ్గ పెట్టండి .

విడిగా ప్లేటులో తీసుకోండి

విడిగా టమోటో ముక్కలు కాస్త పసుపు వేసి మగ్గ పెట్టండి.

వేరే ప్లేటులో తీసుకోండి .

మిక్సీ లో ముందు మగ్గిన ఉల్లిపాయ ముక్కలు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ వేసుకోండి .

తర్వాత అందులో టమోటో ముక్కలు , రెండు రెబ్బలు తడిపిన చింతపండు , స్పూనున్నర ఎండు కారం మరియు తగినంత ఉప్పు 
 వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ వేసుకోండి .

తర్వాత వేరే గిన్నెలోకి నూరిన పచ్చడి తీసుకుని పో పు గరిటలో రెండు స్పూన్లు నెయ్యి వేసి రెండు ఎండుమిర్చి ముక్కలుగా చేసి ,
స్పూను మినపప్పు , అర స్పూను ఆవాలు, కొద్దిగా ఇంగువ మరియు రెండు రెమ్మలు కరివేపాకు వేసి నూరిన పచ్చడి పైన పో పు
పెట్టు కోండి.

ఇడ్లీ , దో శెలు, చపాతీలు , గారెలు మరియు భోజనము లోకి ఎంతో రుచికరమైన టమోటో ఉల్లిపాయ చట్నీ సిద్ధం.
వెజిటబుల్ రైస్.

కావలసినవి .

బియ్యము -- ఒక గ్లా సు .
క్యారెట్లు -- 2
క్యాప్సికమ్ -- 2
ఉల్లిపాయలు -- 2
బీన్స్ -- 100 గ్రా ములు. చిన్న ముక్కలుగా చేసుకోవాలి .
నెయ్యి -- మూడు స్పూన్లు .
జీడిపప్పు -- 10

పొ డికి .

నెయ్యి -- రెండు స్పూన్లు .


ఎండుమిర్చి - 5 
 మినపప్పు -- స్పూను 
శనగపప్పు -- స్పూను 
వేరు శనగ గుళ్ళు - రెండు స్పూన్లు  
 నువ్వుపప్పు -- రెండు స్పూన్లు  
ఎండు కొబ్బరి -- పావు చిప్ప చిన్న ముక్కలుగా చేసుకోవాలి .
ఉప్పు -- తగినంత

స్టౌ మీద బాండీ పెట్టి నెయ్యి వేసి ముందుగా జీడిపప్పు వేయించుకుని విడిగా తీసి ఉంచుకోవాలి .
తర్వాత పై దినుసులన్నీ వేసి వేయించుకుని , సరిపడా ఉప్పు వేసి మిక్సీ లో మరీ మెత్తగా కాకుండా పొ డి కొట్టు కుని ఉంచుకోవాలి .

తయారీ విధానము .

ముందుగా గ్లా సు బియ్యము సరిపడా 


నీళ్ళు పో సి కుక్కర్ లో పొ డిగా వండుకోవాలి .

వెజిటబుల్స్ అన్నీ చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి .

ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నెయ్యి వేసి నెయ్యి బాగా కాగగానే , ముందుగా ఉల్లిపాయలు , క్యారెట్ ముక్కలు ,
క్యాప్సికమ్ ముక్కలు , బీన్స్ ముక్కలు వేసి కొద్దిగా ఉప్పువేసి మూతపెట్టి ముక్కలను పది నిముషాలు మెత్తగా మగ్గ నివ్వాలి.

తర్వాత అందులో ఉడికించి సిద్ధంగా ఉంచుకున్న అన్నం వేసుకుని గరిటతో బాగా కలుపుకోవాలి .

ఇప్పుడు సిద్ధంగా ఉంచుకున్న పొ డి నాలుగు స్పూన్లు వేసుకుని మరో మూడు స్పూన్లు నెయ్యి వేసి బాగా కలుపుకుని పైన నేతిలో
వేయించిన జీడిపప్పు వేసుకుని వేరే డిష్ లోకి తీసుకోవాలి . అంతే ఎంతో రుచిగా ఉండే వెజిటబుల్ రైస్ సర్వింగ్ కు సిద్ధం.
Rohi fish fry.... 
Its a simle fry...
Recipe-
Take 500 gms rohu fish pieces.. 
Wash it and drain the water nicely... 
Now mix it with turmeric red chilli and salt..keep it for 10 mins... 
Now just shallow fry them using mustard oil.. 
It goes wll with hot rice n dal..
ఈరోజు సింపుల్ గా కొత్తి మీర రైస్ చేసా, నాకు కూరలుకన్న రైతా తో తింటే కొత్తి మీర రైస్ ఇష్ట ం ఇంకా కీరా రైతా చెయ్యాలి మీరంతా
పడుకుంటారని పో స్ట్ పెట్టెస్తు న్న

నేను చేసిన కొత్తి మీర రైస్ 


ముందుగా అల్ల ం,వెల్లు ల్లి, కొంచం ఎక్కువ కొత్తి మీర,పచ్చిమిర్చి, ఒక టమేట ో పెష్ట్ చేసిపెట్టు కోవాలి. పాన్ పేట్టి ఒక స్పూన్ నెయ్య
+ఆయిల్ వేసి వెడయ్యక జీర వేసి కట్ చేసిపెట్టు కున్న గోబీ వేసి వేయించి మట్ట ర్ ( గ్రీంపీస్) వేసి ఒక 2min తరువాత రడీగా
చేసిపెట్టు కున్న పేస్ట్ వేసి పచ్చి వాసనపో యేవరకూ వేయించి నానబేట్టి ఉంచిన బాస్మతీ రైస్ వేసి సరిపడా ఉప్పు వేసి 1:2 నీళ్ళు పో సి
ఉడికించుకోని దించుకొవటమే....... ఇది కీరా రైతా తో బావుంటుంది

కారంపెట్టికూర అని అందరూ చేస్తూ వుంటారు ఈకారాన్ని మేము మినపప్పు కారం అంటాము కూరకారం అంటారు అది రకరకాలుగా
చెస్తా రు మా వాళ్ళు చాలమంది నీవు చెసినట్లు రాదు మాకు అంటారు మనకే ఒక్కొక్కసారి కుదరదు 
ఈ కారంతో వంకాయ దొ ండకాయ బీరకాయ బెండకాయ లను చేసుకోవచ్చు కావలసినవి....
పచ్చి శనగపప్పు -1 కప్
మినపప్పు - 1/2 కప్పు
జీలకర్ర - 1 స్పూన్
మెంతులు - 1 స్పూన్
ఆవాలు- 1 స్పూన్
ఎండుమిరపకాయ 3 కప్స్
ధనియాలు నేను వేయను
అన్నీ కొద్దిగా నూనే వేసుకుని సన్నపు సెగమీద వేయించుకోవాలి చల్లా రేక వుప్పువేసి మిక్సీలో పౌడర్ చేసుకుని కూరల్లో
వాడేసుకోవడమే 😊 😊

ఈరోజు వంకాయ చేసేను చూడండి


ఆలూరుకృష్ణ ప్రసాదు .

సాంబారు కారం తయారీ విధానము .

ముందుగా సాంబారు కారం అంటే సాంబారు లోకి వాడే కారం కాదు . దయచేసి గమనించ గలరు .

అసలు పూర్తిగా అంటే నూటికి నూరుపాళ్ళు వెల్లు ల్లి ఇష్ట పడని వారు దయచేసి ఈ సాంబారు కారం తయారీకి ప్రయత్నించ వద్దు .

మన ఇళ్ళల్లో ప్రతి రోజు వంటల్లో కారం అంటే కొట్టి ఉంచుకున్న జీలకర్ర కారం వాడతాము .

ఈ జీలకర్ర కారం అన్ని వంటలలో కూడా అంటే ముద్ద కూరలు , వేపుడు కూరలు , కారం కూరి చేసే బెండకాయ , కాకరకాయ వంటి
కూరల్లో ను వాడతాము .

అలాగే చాలా మంది అంటే జీలకర్ర కారం వాడని వారు సాంబారు కారం ప్రతి వంటల్లో ను నూటికి నూరు పాళ్ళు వాడతారు

వాళ్ళు ఏడాదికి సరిపడా చాలా ఎక్కువ మోతాదులో అంటే షుమారు అయిదారు కిలోల మోతాదులో రోకళ్ళ మరల్లో దంపించుకుని
శుభ్రంగా వాసన పో కుండా ఉండటానికి ఒక జాడీలో పో సుకుని , కావలసినప్పుడు కొద్ది కొద్దిగా వేరే కంటైనర్ ల లోకి తీసుకుని పూర్తిగా
సంవత్సరం పొ డుగునా వాడుకుంటారు .

ముఖ్యంగా వారి కోసమే ఈ సాంబారు కారం తయారీ విధానము .

ఇక్కడ నేను ఒక K.G . ఎండు మిరపకాయలకు సరిపడా మిగిలిన దినుసుల కొలతలు ఇచ్చాను .

మీరు రెండు లేదా మూడు K.G. ల ఎండుమిరపకాయలతో సాంబారు కారం కొట్టించు కోదల్చుకుంటే దాని ప్రకారం మిగిలిన దినుసుల
కొలతలు పెంచుకోవాలి.

ఇక ఈ సాంబారు కారం తయారీ విధానము గురించి తెలుసుకుందాం.

కావలసినవి .

ఎండు మిరపకాయలు -- 1 K.G. .


ధనియాలు --- పావు K.G .
జీలకర్ర --- 100 గ్రా ములు .
మెంతులు --- 50 గ్రా ములు .
పొ ట్టు మినపప్పు లేదా చాయ మినపప్పు --- 50 గ్రా ములు .
పచ్చి శనగపప్పు --- 50 గ్రా ములు .
రాళ్ళ ఉప్పు --- అర కిలో 500 గ్రా ములు .
కరివేపాకు ఆకులు పొ డిగా ఒక కప్పు నిండా తీసుకోవాలి.
వెల్లు ల్లి --- పావు కిలో పై పొ ట్టు తీయకుండా విడివిడిగా పాయలుగా తీసుకోవాలి .
కల్తీ లేని మంచి పసుపు --- నాలుగు స్పూన్లు .
స్వచ్ఛమైన ఆముదం -- 50 గ్రా ములు .

ఆముదం ఇష్ట ం లేని వారు బదులుగా స్వచ్ఛమైన నువ్వుల నూనె వాడుకోండి.

తయారీ విధానము .

ముందుగా ఎండు మిరపకాయలు తొడిమలు తీసి రెండు రోజులు బాగా గల గల లాడే విధముగా ఎర్రని ఎండలో పెట్టు కోవాలి .
నూనె వెయ్యకుండా ఒట్టి బాండిలో విడివిడిగా ధనియాలు , జీలకర్ర , మెంతులు , మినపప్పు , శనగపప్పు , రాళ్ళ ఉప్పు మరియు
కరివేపాకు వేయించుకోవాలి .

అన్నీ విడివిడిగా వేరే ప్లేట్ల లోకి తీసుకోవాలి.

చల్లా రాక

పైన చెప్పిన వన్నీ విడివిడిగా మిక్సీ వేసుకుని పసుపు కలిపి అన్నీ ఒక బేసిన్ లోకి తీసుకోవాలి .

వేగిన కరివేపాకు కూడా మిక్సీ వేసుకుని పొ డిగా చేసుకుని అన్నింటితో పాటు కలుపుకోవాలి .

బాగా ఎండిన ఎండు మిరపకాయలు మిక్సీలో మెత్తగా వేసుకోవాలి . లేదా మర పట్టించుకోవాలి .

ఇప్పుడు బేసిన్ లో ఉన్న దినుసులు పొ డి మరియు ఎండు మిరప కాయల కారం అన్నీ బాగా చేత్తో బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు చివరగా మళ్ళీ మిక్సీలో ఒక కప్పుడు ఈ కలిపిన పొ డి , ఆముదం మరియు వెల్లు ల్లి పాయలు వేసి ఒక్కసారి మిక్సీ తిప్పి ఆ
మిశ్రమాన్ని ఈ బేసిన్ లోని కారం తో కలిపి మొత్త ము సాంబారు కారాన్ని చేతులతో బాగా గుచ్చెత్తు కుని బాగా కలుపు కోవాలి .

వెల్లు ల్లి మరీ పేస్టు లా నలగకూడదు .

నోట్లో వేసుకుని చూసుకుంటే ఉప్పు నోటికి తగలాలి.

అప్పుడు కూరల్లో కి సరిపో తుంది .

అంతే ఏటికి ఏడాది నిల్వ ఉండి ఘుమ ఘమ లాడే వెల్లు ల్లి వాసనలతో " సాంబారు కారం " సిద్ధం .

ఈ సాంబారు కారాన్ని ఒక జాడీలో కాని , ఒక కంటైనర్ లో కాని పో సుకుంటే ఏడాది పొ డవునా ఆ వాసన అలాగే ఉంటుంది .

మేము కూరల్లో వాడము . ఇడ్లీ , దో శెలు మరియు కాకర కాయ కాయల పళంగా చేసుకునే వాటిలో వాడతాము.

వెల్లు ల్లి పూర్తిగా అంటే నూటికి నూరు పాళ్ళు మాకు నిషేధము కాదు .

చాలా చాలా తక్కువగా వాడతాము .


ఈ రోజుల్లో తోటకూర అంటే..అందరికి నిస్సాకారం....కానీ రుచిగల కూరలు పప్పులు తోటకూర తో చేయోచ్చు.....
సరే తోటకూర కూటు ఎలా చేయచ్చో..చెప్పుకుందాం...ఈ కూటు లనేవి పాతకాలం వంటలు....అప్పట్లో పెళ్ళిళ్ళకి..ఇంకా దేవాలయాల
లో సంతర్పణ కి విరివిగా చేసేవారు.
కావలసినవి:
సుమారు పది రూపాయల తోటకూర కట్ట లు.
అరచిప్ప కొబ్బరి 
సుమారు మూడు పిడికిళ్ల పెసరపప్పు.(వంద గ్రా ములు అనుకోండి )
10 పచ్చిమిరపకాయలు.
1 చెంచా పసుపు.
1 చెంచా జీలకర్ర 
కొద్దిగా కరివేపాకులు.
సరే పో పు సామాను...అదే తాలింపు గింజలు.
రెండు చెంచాల నూనె...తాళింపు కోసం.
సరిపడా ఉప్పు.
తయారు విధానం:
పెసరపప్పు ముందు గా రాయి రప్పా లేకుండా శుభ్రం చేసుకోవాలి.
తర్వాత సరిపడా నీళ్ళు పో సి ఆ పెసరపప్పు ఉడకెయ్యాలి 
పెసరపప్పు ఉడుకుతూండగా లేత తోటకూర కాడలు..ఆకులు సన్నగా తరిగి అందులో వెయ్యాలి....అప్పుడే చెంచా పసుపు కూడా
అందులో వెయ్యాలి.
ఈ లోగా అర కొబ్బరి చిప్ప కోరు,మిరపకాయలు..జీలకర్ర ఈ మూడూ కలిపి రోట్లో నో..గ్రైండర్ లోనో మెత్తగా రుబ్బుకోవాలి.
తర్వాత్త మొత్తా నికి సరిపడా ఉప్పు, ఇంకా ఈ రుబ్బిన రుబ్బు ఉడుకుతున్న పప్పు లో వెయ్యాలి.
మొత్త ం బాగా ఉడికిందీ లేనిదీ చూసుకొని.
తర్వాత పో పుగింజలు కర్వేపాకులూ వేయించి ఆ పప్పులో కలుపుకొని.మొత్త ం మరో నిముషం ఉంచి దించెయ్యాలి...

ఇది చేసుకొని తిని చెప్పండి....ఎలా ఉందొ ..


ఆలూరుకృష్ణ ప్రసాదు .

వాము ఆకుతో పచ్చడి .

వాము ఆకు అప్పుడప్పుడు వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది .

కనీసం మూడు నెలలకు ఒక్కసారి అయినా వాము పొ డి కాని వాము ఆకు కాని వాడితే ఉదరం శుభ్ర పడుతుంది .

ఈ వాము ఆకుతో చాలా మంది బజ్జీ లు వేసుకుంటారు .

వాము ఆకుతో పచ్చడి కూడా చేసుకోవచ్చు .

కావలసినవి .

తెల్లనువ్వుపప్పు - 50 గ్రా ములు .

రెండు ఎండుమిరపకాయలు , నువ్వు పప్పు నూనె వేయకుండా బాండిలో వేయించుకుని , చల్లా రగానే మిక్సీలో పొ డిగా చేసుకుని వేరేగా
తీసి ఉంచుకోవాలి .

వాము ఆకులు -- షుమారు 30 


నూనె -- మూడు స్పూన్లు  
ఎండుమిరపకాయలు - 8
చింతపండు -- ఉసిరి కాయంత
మెంతులు -- అర స్పూను 
ఆవాలు -- అర స్పూను 
పసుపు -- కొద్దిగా 
ఇంగువ -- కొద్దిగా 
ఉప్పు -- తగినంత

తయారీ విధానము .

ముందుగా వాము ఆకులను కడిగి శుభ్రం చేసుకోవాలి .

స్టౌ మీద బాండీ పెట్టి స్పూనున్నర నూనె వేసి నూనె బాగా కాగగానే ముందుగా మెంతులు తర్వాత ఎండుమిరపకాయలు , ఆవాలు
మరియు ఇంగువ వేసి పో పు వేయించుకొని వేరే ప్లేటులోకి విడిగా తీసుకోవాలి .

తర్వాత తిరిగి స్టౌ మీద బాండీ పెట్టి మిగిలిన నూనె వేసి నూనె బాగా కాగగానే వాము ఆకులు మరియు కొద్దిగా పసుపు వేసి ఒక అయిదు
నిముషాలు ఆకును బాగా మగ్గ నివ్వాలి.

తర్వాత మిక్సీలో వేయించిన పో పును, చింతపండు మరియు తగినంత ఉప్పువేసి మెత్తగా వేసుకోవాలి .

తర్వాత మగ్గిన వాము ఆకును కూడా వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి.

చివరలో నువ్వుల పొ డి కూడా వేసుకుని మరోసారి మిక్సీ వేసుకుని వేరేగా గిన్నెలోకి తీసుకోవాలి .

అంతే ఎంతో రుచికరమైన వాము ఆకు పచ్చడి సర్వింగ్ కు సిద్ధం.

ఈ పచ్చడి మొదటగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.
ఉలవచారు.

తయారీ విధానము లోగడ శ్రీమతి Geetha Dusi గారు లోగడ నా పో స్టు లో చెప్పగా నోట్ చేసుకున్నాను.

వారికి కృతజ్ఞ తాపూర్వకధన్యవాదములు .

ఇష్ట మైన వారు ప్రయత్నించండి .

తయారీ విధానము .

ఉలవలు ఎర్రగా వేయించుకొని కుక్కర్ లో మెత్తగా ఉడికించి పెట్టు కోవాలి.

నిమ్మకాయంత చింతపండు నానపెట్టి రసం తీసి ఉంచుకోవాలి.

ధనియాలు,ఎండుమిర్చి, జీలకర్ర ఉడికించుకున్న ఉలవలు,ఇంగువ మెత్తగా రుబ్బుకొని గిన్నెలో ఉల్లిపాయ


ముక్కలు(ఇష్ట మైతే)వేయించుకున్నాక
చింతపండు రసం వేసి అందులో రుబ్బుకున్న ఉలవల మిశ్రమం , ఉప్పు పసుపు కలిపి మరగనివ్వాలి.పచ్చిమిర్చి, కరివేపాకు కూడా
వేసుకోవాలి.

మరిగిన తర్వాత ఆవాలు ,జీరా ఎండుమిర్చి, మెంతులు ఇంగువ తో పో పు పెట్టు కోవాలి.


కొబ్బరి అన్నం .

తయారీ విధానము .

కొబ్బరిపాలు -- రెండు కప్పులు .

కొబ్బరి పాలు తీసుకునే విధానము .

ఒక కొబ్బరి కాయను కొట్టి రెండు చిప్పలను పచ్చి కొబ్బరి కోరాముతో తురుముకుని మిక్సీ లో తురుమిన కొబ్బరి వేసి
పావు గ్లా సు నీళ్ళు పో సి మిక్సీ వేసుకుని వేరే గిన్నెలో కొబ్బరి పాలు వడకట్టు కోవాలి .

ఇదే పద్ద తిలో మరో సారి వేసుకోవాలి .

అలా రెండు కప్పుల కొబ్బరి పాలు తీసుకొని విడిగా ఉంచుకోవాలి .

మరో చిప్ప కొబ్బరి తురుముకుని విడిగా ఉంచుకోవాలి .

తర్వాత ఒక గిన్నెలో గ్లా సు బియ్యం పో సి నీళ్ళతో కడిగిన , తర్వాత గ్లా సు నీళ్ళు పో సి స్టౌ మీద పెట్టి ఉడుకుతుండగా
సిద్ధంగా ఉంచుకున్న రెండు కప్పుల కొబ్బరి పాలు కూడా పో సి అన్నం పూర్తిగా ఉడకనివ్వాలి .

వార్చ వద్దు .

తర్వాత ఒక బేసిన్ లో అన్నం వార్చుకోవాలి .

తర్వాత స్టౌ మీద బాండి పెట్టి నాలుగు స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కాగగానే నాలుగు ఎండుమిర్చి తుంపిన ముక్కలు ,
రెండు స్పూన్లు పచ్చి శనగపప్పు , స్పూనున్నర మినపప్పు , ముప్పావు స్పూను జీలకర్ర , స్పూను ఆవాలు , కొద్దిగా
ఇంగువ , అయిదు నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి , మూడు రెమ్మలు కరివేపాకు , స్పూను తరిగిన అల్ల ం , మూడు
స్పూన్లు పల్లీలు , పది జీడిపప్పు పలుకులు వేసి వేయించుకుని , తర్వాత సిద్ధంగా ఉంచుకున్న కప్పు పచ్చి కొబ్బరి
తురుము , మరియు తగినంత ఉప్పు కూడా వేసి కొబ్బరి తురుము పచ్చి వాసన పో యే వరకు కొద్దిగా వేయించుకుని
బేసిన్ లో సిద్ధంగా ఉంచుకున్న అన్నంలో వేసుకుని కొద్దిగా తరిగిన కొత్తి మీర వేసుకుని గరిటతో బాగా కలుపుకోవాలి

.
అంతే ఎంతో రుచికరమైన కొబ్బరి అన్నం సర్వింగ్ కు
సిద్ధం .

ఈ కొబ్బరి అన్నం టమోటా చట్నీతో కాని అల్ల ం చట్నీతో


కాని తింటే చాలా రుచిగా ఉంటుంది .
పావ్ భాజీ
తయారుచేయు విధానం

పావ్ భాజీ మనందరికీ


ఇష్ట మే తినాలంటే
ఖచ్చితంగా ఏ చాట్ బండి
దగ్గ రకో వెళ్ళవలసిందే, ఐతే
ఇది మన ఇంట్లో నే ఎలా
తాయారు చేసుకోవాలో ఈ
రోజు నేర్చుకుందాం !

తయారీకి కావలసిన సాల్ట్ : తగినంత


పదార్దా లు : కొత్తి మీర : కొద్దిగా

ఆలు : మూడు బట్ట ర్ : 5 స్పూన్స్

కాలిఫ్ల వర్  : చిన్న ముక్క నిమ్మకాయ రసం : రెండు స్పూన్లు

బీట్ రూట్ : ఒకటి


కారట్  : ఒకటి
బీన్స్ : ఆరు Pav Bhaji తయారు చేయు విధానం :
పచ్చి బఠాణి: అర కప్పు
ముందుగా ఆలు, కారట్, గోబీ, బీన్స్, బీట్
ఉల్లిపాయముక్కలు : అర కప్పు
రూట్, అన్ని కడిగి కట్ చేసుకుని కుక్కర్ లో
కాప్సికం ముక్కలు : అర కప్పు
వేసుకుని తగినంత వాటర్ వేసి కుక్కర్ మూత
టమోటో ముక్కలు : ఒక కప్పు
పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి .
పచ్చిమిర్చి ముక్కలు : మూడు స్పూన్లు
అవి చల్ల రాక మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
అల్ల ం వెల్లు ల్లిపేస్ట్ : ఒక స్పూన్
కారం : రెండు స్పూన్లు
ఇప్పుడు స్ట వ్ వెలిగించి పాన్ పెట్టి బట్ట ర్ వేసి
పసుపు : చిటికెడు
కరిగాక అందులో జీలకర్ర వేసి వేపాలి, వేగాక
గరం మసాలా : ఒక స్పూన్
అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి
పావ్ భాజీ మసాలా : రెండు స్పూన్లు
ముక్కలు, కాప్సికం ముక్కలు వేసి వేపాలి ..
జీలకర్ర : ఒక స్పూన్
ఇవి వేగాక అందులో అల్ల ం వెల్లు ల్లి పేస్ట్ వేసి
పంచదార : రెండు స్పూన్లు
వేపాలి, అందులో పసుపు, కారం, గరం మసాలా, అన్ని వేసి బాగా వేపుకోవాలి.

అందులో ఇప్పుడు  టమోటో ముక్కలు కూడా  వేసి బాగా మగ్గ నివ్వాలి, మగ్గా క అందులో సాల్ట్ , పంచదార
వేసి కలిపి అందులో తగినంత వాటర్ వేసి కలిపి అందులో పచ్చి బఠాణి వేసి 5 నిముషాలు ఉడకనివ్వాలి .

ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి మెత్తగా చేసిపెట్టు కున్న ఆలు మిశ్రమం వేసి బాగా కలిపి పది
నిముషాలు పాటు కుక్ చేసుకోవాలి ..
ఇందులో ఇప్పుడు పావ్ భాజీ మసాలా కూడా వేసి బాగాకలుపుకుని స్ట వ్ ఆఫ్ చేసుకుని కొత్తి మీర, నిమ్మరసం
వేసి దించుకోవాలి.

చివరిగా ఇప్ప్పుడు స్ట వ్ వెలిగించి దో స పాన్ పెట్టు కుని కొంచెం బట్ట ర్ వేసుకుని పావ్ బన్స్ ని కట్ చేసుకుని
బట్ట ర్ లో రెండు వైపులా వేయించుకోవాలి ….

ఇప్పుడు ప్లేట్ లోకి బట్ట ర్ లో వేయించుకున్న పావ్ ను తీసుకు ని పక్కన భాజీ మసాలా వేసుకుని పైన
కొత్తి మీర , ఉల్లిపాయముక్కలు , నిమ్మరసం పిండుకుని … సర్వ్ చేసుకోవాలి ….
అంతే ఎంతో యమ్మీ, యమ్మీ పావ్ భాజీ మసాలా రెడీ .

పావ్ భాజీ ఉత్త రాది వంటకం ఇది మహారాష్ట ్ర లో ప్రసిద్ధి చెందిన ఫుడ్. మనవాళ్ళు పావ్ భాజీ ని సాయంత్రం
పూట స్నాక్ ఐటెం గా తింటారు..
గుత్తి వంకాయ గ్రేవీ కూర

                                                               గుత్తి వంకాయ గ్రేవీ  కూర

కావలిసిన పదార్థా లు

1. గుత్తి వంకాయలు పావు కేజి; 2. ఉల్లిపాయలు 2; 3. నూపప్పు  3 స్పూన్స్ ; 4. కొబ్బరికోరు చిన్న కప్పు 
5. పల్లీలు 3 స్పూన్స్; 6.  ఎండు మిరపకాయలు 5 ; 7. ఉప్పు ; 8. పసుపు

తయారీవిధానము
ముందుగా స్ట వ్ వెలిగించుకుని బాణలి పెట్టు కుని పైన చెప్పిన నూపప్పు , పల్లీలు , ఎండు మిరపకాయలను , వేసి దో రగా
వేపుకోవాలి అవి చల్లా రాక  కొబ్బరి కోరు కుడా కలుపుకుని మెత్తగా ముద్దలాగ రుబ్బుకోవాలి ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి.
వంకాయ లు గుత్తు లు గా తరుగు కోవాల. స్ట వ్ మీద బాణలి పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసి దో రగా వేగాక
పసుపు సరిపడినంత ఉప్పు వేసుకుని మగ్గ నివ్వాలి రుబ్బి పెట్టు కున్న ముద్దను వేసి కొంచెము నీళ్ళు పో సుకుని
 బాగా దగ్గ ర పడేమ్తవరకు వుడకనివ్వాలి కొత్తి మీర తో గార్నిష్ చేసుకుంటే ఘుమ ఘుమలాడే గుత్తి వంకాయ గ్రేవీ  కూర రెడీ.
ఉల్లి పాయ పులుసు "
            

                                      
                                                               "   ఉల్లి పాయ పులుసు "

కావలిసిన పదార్థా లు 

1. ఉల్లి పాయలు  4; 2. టమాటో 1; 3. బెండకాయ లు 2 ; 4. వంకాయ 1 ; 5. పచ్చి మిరపకాయలు 2

6. కరివే పాకు ; 8.  వెల్లు ల్లి 2 రెబ్బలు  ; 9. ఆవాలు పావు స్పూన్ ; 10. మెంతులు పావు  స్పూన్
11.  జీలకర్ర పావు స్పూన్ ; 12.  ఎండు మిరపకాయలు 2  ; 13. ఇంగువ కొద్దిగా ; 14.   చింత పండు నిమ్మ  కాయంత
15.  బెల్లము కొద్దిగా

తయారీ విధానము
చింత పండు ను ఒక గిన్నేలో  నీళ్ళూ పో సి నానబెట్టు కోవాలి, స్ట వ్ వెలిగించుకుని  బాణలి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ,
పైన  చెప్పిన పో పు దినుసులను వేసి వేగాక, ఉల్లి , టమాటో , వంకాయ  , బెండకాయ ముక్కలను , వెల్లు ల్లి రెబ్బలను వేసి
దో రగా  వేగనివ్వాలి . ఇప్పుడు నానబెట్టిన  చింతపండు ను , నానబెట్టిన  నీళ్ళలో  నుండి పిప్పిని తీసి వేసి ,  వేగిన ఉల్లిపాయ
మిశ్రమాని వేసి , పసుపు  , ఉప్పు,   బెల్లము సరిపడునంతగా  వేసి స్ట వ్  మీద పెట్టా లి , ఒక 5 నిమిషాలు  మరిగాక, ఒక
2 స్పూన్స  వరి పిండిని  చిన్న కప్పులోకి తీసుకుని నీళ్ళు పో సి ఉండలు లేకుండా  కలుపుకుని  ,
దానిని స్ట వ్ మీద  మరుగుతున్న  పులుసులో కలిపుకుని  కొంత సేపు  మరగనివ్వాలి , 15 నిమిషాలు  మరిగాక స్ట వ్  ఆఫ్  చేస్తే
ఉల్లిపాయ పులుసు రెడీ  . దీనిని  , కందపొ డి , కంది పచ్చడి  లేక పాటోలి తో తింటే బాగుంటుంది
పూరీ సెనగ పిండికూర

పూరీ  సెనగ పిండికూర


కావలిసిన పదార్థా లు
1.  ఉల్లిపాయలు 5
2. బంగాళాదుంపలు 2
3. కేరట్లు 2
4. పసుపు కొద్దిగా
5. సెనగపిండి 3 స్పూన్స్
6. పచ్చిమిర్చి 3
7. అల్ల ం చిన్న ముక్క
8. కరివేపాకు9. పంచదార 1 స్పూన్
10. నీళ్లు కూరకి సరిపడా
11. ఉప్పు రుచికి సరిపడా
12. కొత్తి మీర

పో పుదినుసులు
సెనగ పప్పు 1 స్పూన్ , మినపప్పు 1 స్పూన్ , ఆవాలు అరస్పూన్ ,
జీలకర్ర అరస్పూన్ , ఎండుమిరపకాయ 1, ఆయిల్  2 స్పూన్స్

తయారీ విధానం
ఉల్లిపాయలను  చీలికలుగాను   ,అల్ల మును  చిన్న  ముక్కలుగా  ,
పచ్చిమిర్చిని  చీలికలుగాను , బంగాళాదుంప,  కేరట్  లను  ,
చిన్న  ముక్కలుగా  తరుగుకోవాలి .

సెనగ పిండిని ఒక  బౌల్ లోకి  తీసుకుని , అందులో  ఒక  స్పూన్  పంచదారను ,


ఒక  గ్లా సు  నీళ్లను  పో సి  ,ఉండలు  లేకుండా  కలుపుకోవాలి  .

స్ట వ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ,


ఆయిల్  వేస,ి   పైన  చెప్పిన  పో పు  దినుసులను  వేసి  ,
దో రగా  వేగాక  ,
తరిగి పెట్టు కున్న  కూర  ముక్కలను,  కరివేపాకును,  పసుపు ,
 ఉప్పు ను  వేసి  బాగా కలిపి , తగినన్ని  నీళ్లు  పో సి   ,ఉడకనిచ్చి  ,
దీంట్లో  ముందుగా  నీళ్లలో  కలిపి  పెట్టు కున్న ,
 సెనగ పిండిని  వేసి  బాగా  కలిపి ఉడకనివ్వాలి  .

మధ్య  మధ్య లో  కలుపుతూ  ఉండాలి  లేకపో తే 


అడుగంటుతుంది .
కూర  బాగా  దగ్గ ర  పడ్డా క  ,ఒక  బౌల్  లోకి  తీసుకుని  ,
కొత్తి మీర  తో  గార్నిష్  చేసుకుంటే  పూరీ   సెనగ  పిండి  కూర
రెడీ   అవుతుంది.

Subha's Kitchen
పేజీ పో స్టు లు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
వంకాయ టమాటా ఉల్లిపాయ కూర

వంకాయ టమాటా  ఉల్లిపాయ  కూర

కావలిసిన  పదార్థా లు 


1. వంకాయలు  పావుకేజీ 
2. టమాటాలు  2.
3. ఉల్లిపాయలు  3.
4. ఆయిల్   6 స్పూన్స్ 
5. పసుపు  కొద్దిగా 
6. ఉప్పు  రుచికి  సరిపడా 
7. కారం  రుచికి  సరిపడా 
8. కొత్తి మీర
9. నీళ్లు  కొద్దిగా 
10. కరివేపాకు

పో పు  దినుసులు 
సెనగపప్పు  1 స్పూన్  , మినపప్పు  1 స్పూన్  ,ఆవాలు  అర  స్పూన్ , జీలకర్ర  అర స్పూన్

తయారీ  విధానం 
ముందుగా  టొమాటాలు  ,ఉల్లిపాయలు , వంకాయలను  శుభ్రం గా  కడుగుకోవాలి  .
టొమాటోలను ,ఉల్లిపాయలను , సన్నగా  చిన్నముక్కలుగా ను   ,
వంకాయలను  గుత్తి గా ఉంచి చీలికలు చేయాలి .
స్ట వ్   వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  2 స్పూన్స్  ఆయిల్  వేసి
పైన  చెప్పిన  పో పు  దినుసులను  వేసిఅవి  దో రగా  వేగాక  ,
కరివేపాకు ,టమాటో  ,ఉల్లిపాయముక్కలు , పసుపు  ,ఉప్పు  ,కారము  ,
వేసి  బాగా  కలిపి  కొద్దిగా  నీళ్లు  పో సి  ఉడకనివ్వాలి.
మధ్య  మధ్యలో  కలుపుతూ  ఉండాలి  .
కూర  అంతా  బాగా  దగ్గ ర పడేంత  వరకు  మగ్గ నివ్వాలి .
స్ట వ్   పైన వేరే  బాణలి  పెట్టి  వేడెక్కాక  ఆయిల్  వేసి 
తరిగిపెట్టు కున్న  వంకాయ  గుట్ట లను ,వేసి దో రగా  వేపుకోవాలి .
ఇలా  దో రగా  వేపుకున్న  వంకాయ గుత్తు లను,
టమాటో  ఉల్లిపాయ  మిశ్రమంలో  వేసి  బాగా  కలిపి 
పైన కొత్తి మీర చల్లి  స్ట వ్  ఆఫ్  చేసుకుంటే
 వంకాయ  టమాటో  ఉల్లిపాయ  కూర  రెడీ  అవుతుంది
ఈ కూరను  వేడి అన్నం లోను  చపాతీలలోను  బాగుంటుంది

Subha's Kitchen
పేజీ పో స్టు లు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi
బెండకాయ సెనగపిండి కారం కూర

బెండకాయ  సెనగపిండి  కారం  కూర 

కావలిసిన  పదార్థా లు
 1. బెండకాయలు  పావుకేజీ
2.  సెనగ పిండి  3 స్పూన్స్
3.  కారం  2 స్పూన్స్ 
4. ఉప్పు  రుచికి సరిపడా 
5. పసుపు  కొద్దిగా
6.  జీలకర్ర  1 స్పూన్ 
7. ఆయిల్  8. స్పూన్స్ 
8. కరివేపాకు

తయారీ  విధానం 
ముందుగా  బెండకాయలను  శుభ్రం గా కడిగి  తుడిచి ఆరబెట్టు కోవాలి .
ఆరిన  బెండకాయలను  పైన  కింద   వున్న తొడిమలు  తీసి ,
బజ్జీపచ్చిమిరపకాయ లకు  ఎలా  గాట్లు  పెట్టు కుంటామో ఆలా గాట్లు  పెట్టు కోవాలి .
ఒక  ప్లేట్ లోకి  సెనగపిండి  ,కారం , తగినంత ఉప్పు  ,పసుపు  ,జీలకర్ర వేసి ,
బాగా కలిపి  3 స్పూన్స్  ఆయిల్  వేసి ,ముద్దలాగా  కలుపుకుని ,
గాట్లు  పెట్టు కున్న  బెండకాయలలో  కూరు కోవాలి .
స్ట వ్  వెలిగించి  వెడల్పయిన  బాణలి  పెట్టి  వేడెక్కాక
4  స్పూన్స్  ఆయిల్ వేసి  ,కారం  కూరుకున్న  బెండకాయలను   ,
కరివేపాకును వేసి  ,అట్ల కాడతో  కలిపి 
మగ్గ నివ్వాలి .మధ్య మధ్యలో  అట్ల కాడతో  కలుపుతూ  ఉండాలి .
బాగా  మగ్గిన  తరువాత  స్ట వ్  ఆఫ్  చేసుకుని,
ఒక  బౌల్లో కి  తీసుకుంటే 
బెండకాయ  సెనగపిండి కారం  కూర  రెడీ అవుతుంది.

Subha's Kitchen
పేజీ పో స్టు లు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi
Friday, 9 June 2017
టమాటో దో శ

టమాటో  దో శ

కావలిసిన  పదార్థా లు 

1. బియ్యం  1 కప్పు 

2. టమాటో  1

3. జీలకర్ర  పొ డి  పావు  స్పూన్

4. కారం  పావు  స్పూన్ 

5. ఆయిల్   తగినంత

6. ఉప్పు  తగినంత 

7. ఆవాలు  కొద్దిగా

8.  జీలకర్ర   కొద్దిగా 

9. మినపప్పు   అర  స్పూన్ 

10. కరివేపాకు 

11 కొత్తి మీర

తయారీ  విధానం 
ముందుగా  బియ్యమును శుభ్రం గా  కడిగి  ,

తగినన్ని  నీళ్లు  పో సి  ,4 గంటల  సేపు  నానబెట్టు కోవాలి.

ఇలా  నానిన  బియ్యమును  , ఉప్పు  ,టమాటో  వేసి ,

మెత్తగా  దో శ  పిండి  మాదిరిగా గ్రైండ్    చేసుకోవాలి  .

 ఈ  పిండికి  జీలకర్ర పొ డి , కారం , వేసి   బాగా  కలుపుకోవాలి .

స్ట వ్  వెలిగించి  బానలిపెట్టి  వేడెక్కాక   ,

పైన  చెప్పిన  పో పు  దినుసులను  ,కరివేపాకును  ,

వేసి  దో రగా  వేపుకుని, పిండి  లో  వేసి  ,బాగా  కలుపుకోవాలి .

స్ట వ్  మీద  పెనం  పెట్టి  వేడెక్కాక,  ఆయిల్  వేసి ,

రుబ్బిన  పిండిని  వేసి  దో శ  మాదిరిగా  తిప్పుకోవాలి .

 ఒక పక్క  వేగాక  ,అట్ల కాడతో  తిరగేసి ,కొద్దిగా  ఆయిల్  వేసి,

దో రగా  వేగనిచ్చి  ప్లేటులోకి  తీసుకుని

 సర్వ్  చేసుకుంటే  టమాటో  దో శ  రెడీ  అవుతుంది.

Subha's Kitchen
పేజీ పో స్టు లు మీకు నచ్చినట్లైతే

మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..


https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi
విజ్ఞ ప్తి : మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న

  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పో స్టింగ్స్ వివరాలు లభిస్తా యి.
గ్రీన్ పీస్ మసాలా కర్రి

గ్రీన్ పీస్  మసాలా  కర్రి

కావలిసిన  పదార్థా లు
1.   గ్రీన్  పీస్  1 పేకెట్
2.  ఉల్లిపాయలు  4
4. టమాటోలు  3
5. పచ్చిమిర్చి  2
6. అల్ల ం  చిన్న  ముక్క
7.  వెల్లు ల్లిరెబ్బలు  5 
8. పసుపు  కొద్దిగా 
9. ఉప్పు రుచికి సరిపడా 
10. కారం కొద్దిగా 
11. ధనియాలపొ డి  1 స్పూన్ 
12. గరం  మసాలా పొ డి 1 స్పూన్ 
12. పెరుగు  3 స్పూన్స్ 
14. పల్లీలు  1 స్పూన్
15.  జీడిపప్పు పలుకులు 6 
16. కొత్తి మీర
17.   ఆయిల్ 6 స్పూన్స్ 
18. నీళ్లు  తగినన్ని
తయారీ  విధానం 
ముందుగా  గ్రీన్ పీస్  ను శుభ్రం  గా  కడిగి  ,తగినన్ని  నీళ్లు  పో సి ,
ఉడికించుకుని  చల్లా ర్చు కోవాలి.
2 ఉల్లిపాయలను  సన్నగా తరుగుకుని పక్కన పెట్టు  కోవాలి.

అల్ల ం,   వెల్లు ల్లి,  పచ్చిమిర్చి  ని  కలిపి  మెత్తని  ముద్దలాగ ,


మరియు  టొమాటో  , ఉల్లిపాయలను  కూడా  మెత్తని  పేస్టు లాగ  గ్రైండ్  చేసుకోవాలి  .

పల్లీ లు  ,జీడిపప్పు  పలుకులను , దో రగా  వేపుకుని ,


చల్లా రాక  మెత్తని  ముద్ద  లాగ  గ్రైండ్  చేసుకోవాలి.

స్ట వ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ఆయిల్  వేసి ,


అల్ల ం వెల్లు ల్లి  పేస్టు  వేసి  పచ్చి  వాసన పో యేంత వరకు  వేపుకుని,
తరిగిపెట్టిన  ఉల్లిపాయ ముక్కలను  వేసి
అవి  దో రగా  వేగాక, 
టొమాటో ఉల్లిపాయ  ముద్దను  కూడా  వేసి  ,
పచ్చివాసన  పో యేంత  వరకు  వేపుకుని  ,
దీంట్లో  
ముందుగా ఉడికించి  పెట్టు కున్న  గ్రీన్ పీస్  ను  , పసుపు  ,
ఉప్పు ,  కారం ,  ధనియాల  పొ డి , గరం  మసాలా  పొ డులను  వేసి బాగా  కలిపి 
తగినన్ని  నీళ్లు  పో సి ఉడకనివ్వాలి  .

కొద్దిసేపు  ఉడికిన తరువాత  పెరుగును  కూడా  వేసి  ఉడకనివ్వాలి .

తరువాత  పల్లీ , జీడీ పప్పు  ముద్దను  కూడా  వేసి  బాగా  కలిపి  ,


కూర  అంతా  దగ్గ ర  పడేంత  వరకు  ఉంచి  ,

స్ట వ్  ఆఫ్  చేసుకుని   ఒక  బౌల్  లోకి  తీసుకుని


 పైన  కొత్తి మీరతో  గార్నిష్  చేసుకుంటే 
గ్రీన్ పీస్  మసాలా కర్రీ  రెడీ  అవుతుంది

ఈ కూర  చపాతీలలోకి కొబ్బరి అన్నం  లోకి  బాగుంటుంది.

Subha's Kitchen
పేజీ పో స్టు లు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi

పుల్ల అట్లు

పుల్ల  అట్లు

కావలిసిన  పదార్థా లు 


1. చిక్కని  మజ్జిగ  2 కప్పులు
2.  బియ్యం  2 కప్పులు 
3. మెంతులు  కొద్దిగా
4. ఉప్పు  తగినంత
5. ఆయిల్  తగినంత
6. ఉల్లిపాయ  1
7. పచ్చి  మిర్చి  3

తయారీ  విధానం 
ముందుగా  బియ్యమును , మెంతులను  ,
శుభ్రం  గా  కడిగి  ఒక  గిన్నె లోకి  తీసుకుని   ,
అందులో  మజ్జిగ  పో సి  6. గంటలు  నాన బెట్టా లి  .
ఇలా  నానిన  బియ్యమును  ,
తగినంత  ఉప్పు  వేసి  ,
మెత్తగా  గ్రైండ్  చేసుకోవాలి .
 ఇలా  గ్రైండ్  చేసుకున్న, పిండి ,
ఒక  రాత్రి  అంతా  బాగా  ఊర నివ్వాలి .
మరునాడు ఇలా  ఊరిన  పిండిని,
దో సెల మాదిరి గా వేసుకోవాలి  ,
ఉల్లి పాయను , పచ్చిమిర్చిని , సన్నగా తరుగుకోవాలి.
 స్ట వ్  వెలిగించి  పెనం  పెట్టి  వేడెక్కాక  ఆయిల్  వేసి ,
అట్ల కాడతో పామి ,
పిండిని  వేసి , దో స మాదిరిగా గరిటతో  తిప్పి
పైన ఉల్లి , పచ్చిమిర్చి  ముక్కలు  వేసి ,
ఒక  స్పూన్  ఆయిల్  వేసి ఒక  పక్క వేగిన  తరువాత  తిరగేసి
మరల  ఒక స్పూన్  ఆయిల్  వేసి రెండో పక్క  కూడా  వేగనిచ్చి
ప్లేట్ లోకి  తీసుకుని
అల్ల ం  పచ్చడితో  గాని టమాటో  పచ్చడి తో  గాని తింటే  రుచిగా ఉంటాయి.

సేమ్యా పులావ్

సేమ్యా  పులావ్

కావలిసిన  పదార్థా లు
1 సేమ్యా  2 కప్పులు
2 ఉల్లిపాయ  1
3 పొ టాటో 1
4 క్యారట్  1
5 ఫ్రెంచ్  బీన్స్  5
6 గ్రీన్ పీస్   గుప్పెడు
7 కొత్తి మీర  కొద్దిగా
మసాలా  దినుసులు
1  లవంగాలు  2
2 దాల్చిన  చెక్క  1
3 ఏలకులు  2
4 జీలకర్ర  1 స్పూన్
5 పులావ్  ఆకులు  2
కొబ్బరి తురుము  2 స్పూన్స్
సో ంపు  1 స్పూన్
అల్ల ం  చిన్న  ముక్క
పచ్చిమిర్చి  3
నెయ్యి  1 స్పూన్
ఆయిల్  1 స్పూన్
వేడి  నీళ్లు  3 న్నర కప్పులు
ఉప్పు  తగినంత

తయారీ  విధానం.
ముందుగా  పైన  చెప్పిన  కూరలను  శుభ్రం గా  కడిగి ,
చిన్న  ముక్కలుగా  తరుగుకోవాలి
కొబ్బరి  తురుము  ,సో ంపు , అల్ల ం  ,పచ్చిమిర్చి  ,కొత్తి మీర  కలిపి   ,
మెత్తని  ముద్దలాగా  గ్రైండ్  చేసుకోవాలి
సేమ్యా  ను  కొద్దిపాటి  నేతిలో  దో రగా  వేపుకోవాలి   .
స్ట వ్  వెలిగించి  వెడల్పయిన  లోతు గా  వుండే  బాణలి   తీసుకుని  వేడెక్కాక  ,
ఆయిల్   మరియు  నెయ్యి  వేసి  పైన  చెప్పిన  మసాలాదినుసులను   వేసి ,
అవి  దో రగా   వేగాక ,
ఉల్లిపాయ  ముక్కలు  , పుదీనా  ఆకులు  ,కొబ్బరి  పేస్ట్  వేసి  ,
కొద్దిసేపు  వేగనిచ్చి  , తరిగిపెట్టు కున్న  కూరముక్కలు  కూడా  వేసి  ,
8- 10. నిమిషాలు  మగ్గ ని చ్చి ,
సేమ్యా,  గ్రీన్ పీస్  లను  వేసి ,బాగా  కలిపి  ,
మూడున్నర  కప్పులు  వేడనీ
ి ళ్లు  పో సి , తగినంత  ఉప్పును  వేసి ,
బాగా కలిపి  మూత  పెట్టి  ,సన్నని  మంట  మీద  ఉడకనివ్వాలి ,
మధ్య  మధ్యలో  కలుపుతూ  బాగా
ఉడకనివ్వాలి  .నీరు  అంతా  పో యి  విడివిడి  లాడుతూ  వచ్చాక ,
స్ట వ్  ఆఫ్  చేసుకుని  ,ఒక  బౌల్లో కి  తీసుకుని  ,
పైన  కొత్తి మీరతో  గార్నిష్ చేసుకుంటే 
సేమ్యా  పులావ్  రెడీ.
దీనిని  టొమాటో సాస్  తో గాని  చిల్లి  సాస్  తో  గాని  తింటే రుచిగా  ఉంటుంది

అల్ల ం పచ్చడి

  అల్ల ం  పచ్చడి

కావలిసిన పదార్థా లు

1. అల్ల ం  100 గ్రా ములు


2. పచ్చి మిర్ల్చి 6
3. సెనగ పప్పు 3 స్పూన్స్
4. మినపప్పు 3 స్పూన్స్
5.  ఆవాలు 1 స్పూన్
6. మెంతులు అర స్పూన్
7. ధనియాలు  1 స్పూన్
8. జీలకర్ర 1 స్పూన్ 
9. ఎండు మిరపకాయలు 10
10. చింతపండు 50 గ్రా ములు
11.  బెల్లం 100 గ్రా ములు 
12. ఉప్పు 
13. పసుపు

తయారీ విధానము

చింత పండు  నీళ్ళలో  నానబెట్టు కోవాలి .


స్ట వ్  వెలిగించి బాణలి పెట్టు కుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని

సెనగపప్పు ,  మినపప్పు   , ఆవాలు.,   జీలకర్ర  , 


మెంతులు , దనియాలు , ఎండు మిరపకాయలు  ,
వేసి  వేపుకోవాలి .

 ఇవి వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి

 అదే బాణలిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి


 తరిగి పెట్టు కున్న అల్ల ం ముక్కలు , పచ్చిమిర్చి చీలికలు వేసి దో రగా వేపుకోవాలి  .

ఇవి  రెండు చల్లా రాక


ముందుగా

వేపుకున్న పో పు దినుసులను మెత్తగా పొ డి లాగ  గ్రైండ్  చఎసుకొవాలి


ఈ పొ డిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి

తరువాత వేపుకున్న అల్ల ం పచ్చిమిర్చి  లను కూడా మెత్తగా గ్రైండ్  చేసుకుని ,

దాంట్లో
నానబెట్టు కున్న చింతపండు ని , ఉప్పుని , బెల్లం మిశ్రమాని వేసి ,
మెత్తగా గ్రైండ్ చేసుకుని తరువాత
ముందుగా గ్రైండ్ చేసిపెట్టు కున్న కారము పొ డి ని కూడా వేసి
మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి 

దీనిని  ఒక బౌల్ లోకి తీసుకుని


ఆవాలు , జీలకర్ర , ఎండు మిరపకాయ , కరివేపాకు వేసి , ఇంగువ ,
పో పు పెట్టు కుంటే
అల్ల ం పచ్చడి రెడీ అవుతుంది.

ఇడ్లీ  ,దో శ   , పెసరట్టు ఉప్మా , లలోకి  చాలా  బావుంటుంది .


.

టమాటో రైస్ "

                                                          
                                                                 " టమాటో రైస్  "

కావలసిన పదార్థా లు  
1. టమాటోలు  6  
2. రైస్ 250 గ్రా ములు 
3. అల్ల ం వెల్లు ల్లి పేస్టు  2 స్పూన్స్
4.  జీడిపప్పు 
5.  లవంగాలు 
6. పచ్చి మిర్చి చీలికలు 4 
7.  ఆయిల్ 

తయారీ   విధానము 
ముందుగా రైస్  ఉడీకించుకుని  ప్లేట్ లో తడి లేకుండా  ఆరబెట్టు కోవాలి . 
స్టౌ మీద బాణలి పెట్టు కుని  ఆయిల్ వేసుకుని ,
లవంగాలు  ,
జీడి పప్పు వేసుకుని  ,వేఇంచుకొవాలి ,
వేగాక 
అల్ల ం వెల్లు ల్లి పేస్టు , 
 పచ్చి మిర్చి చీలికలు వేసి 
వేగాక
తరిగిన టమాటో ముక్కలు వేసి బాగా మగ్గ నివ్వాలి . 
ఈ మిశ్రమాని ఆరబెట్టు కున్న రైస్  మీద వేసి , 
ఉప్పు  వేసి బాగా కలుపుకోవాలి  
కొత్తి మీర తో గార్నిష్ చేసుకుంటే  ఘుమ ఘుమ లాడే టమాటో రైస్ రెడీ

ఇడ్లీ కారప్పొడి

                                                                    ఇడ్లీ కారప్పొడి

కావలిసిన పదార్థా లు

1.సెనగ పప్పు 5 స్పూన్స్


2. మినపప్పు 5 స్పూన్స్
3. చింతపండు నిమ్మకాయ అంత
4. ఆవాలు 2 స్పూన్స్
5. జీలకర్ర 2 స్పూన్స్
6.  ధనియాలు 2 స్పూన్స్
7. ఎండుమిరపకాయలు 8
8. వెల్లు ల్లిరెబ్బలు 5
9. ఆయిల్ 2 స్పూన్స్
10. ఇంగువ కొద్దిగా
11. ఉప్పు రుచికి సరిపడా

తయారీ విధానం
చింతపండులో ఈనెలు  ,గింజలు తీసి వెయ్యాలి .
స్ట వ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక,

పైన చెప్పిన సెనగపప్పు, మినపప్పు ,ఆవాలు ,


జీలకర్ర ,ధనియాలు ,ఎండుమిరపకాయలు ,
వెల్లు ల్లి రెబ్బలు , ఇంగువ వేసి దో రగా వేపుకోవాలి .
వీటిని బాగా చల్లా రిన తరువాత
చింత పండు ఉప్పు వేసి ,
మెత్తగా పొ డి లాగ గ్రైండ్ చేసుకోవాలి.
అంతె ఇడ్లీ కారపు పొ డి రెడీ అవుతుంది .

ఈ పొ డి 2 నెలల పాటు నిలువ ఉంటుంది


ఈ పొ డిని అన్నం లోకి ఇడ్లీ  దో సెలా లోకి చాలా బాగుంటుంది.
మిక్స్డ్ రాగి దో శ

మిక్స్డ్ రాగి దో శ
కావలిసిన పదార్థా లు
1. రాగి పిండి 1 కప్పు
2. గోధుమ పిండి అర కప్పు
3. వరి పిండి అర కప్పు
4. గోధుమ నూక అర కప్పు
5. ఉప్పు రుచికి సరిపడా
6. కారము 1 స్పూన్
7. నీళ్లు జీలకర్ర 1 స్పూన్
8. పచ్చిమిర్చి 2
9. ఉల్లిపాయలు 2
10. ఆయిల్ అర కప్పు

కావలిసిన పదార్థా లు
ముందుగా పైన చెప్పిన రాగిపిండి,  గోధుమపిండి , గోధుమనూక , వరిపిండి ,జీలకర్ర , కారం , ఉప్పు , లను ఒక గిన్నెలో వేసి
బాగా కలిపి నీళ్లు పో సుకుంటూ గరిట జారుగా ఉండేలా , రవ్వ దో శ  పిండి మాదిరిగా కలుపుకోవాలి.
ఈ పిండిని ఒక అరగంట సేపు నాననివ్వాలి , ఉల్లిపాయలను పచ్చిమిర్చిని సన్నగా తరుగుకోవాలి .
స్ట వ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కాక ,ఒక స్పూన్ ఆయిల్ వేసి, గరిట తో  పిండిని రవ్వ దో శ పిండిమాదిరిగా చుట్టూ పో సుకుంటూ
మధ్యలోకి రావాలి. పైన తరిగి పెట్టు కున్న ,  ఉల్లిపాయ , పచ్చిమిర్చి ముక్కలను వేసి అట్ల కాడతో అద్ది ఒక స్పూన్ ఆయిల్ వేసి
వేగనిచ్చి , అట్ల కాడతో తిరగేసి మరల ఆయిల్ వేసి దో శను దో రగా ( క్రిస్పీ గా ) వేగనిచ్చి  ప్లేట్ లోకి తీసుకుంటే
మిక్స్డ్ రాగి దో శ రెడీ అవుతుంది
ఈదో శను కొబ్బరి పచ్చడితో తింటే బాగుంటుంది. 

Subha's Kitchen
కొబ్బరి అన్నము ( coconut rice )

                                                       కొబ్బరి అన్నము ( coconut rice )

కావలిసిన పదార్థా లు
1. బియ్యం 4 గ్లా సులు
2. పచ్చిబఠాణీలు ఒక పాకెట్
3. కొబ్బరి కోరు 3 కప్పులు 
4. అల్ల ము వెల్లు ల్లి పేస్టు 2 స్పూన్స్
5. పచ్చిమిర్చి 6
6.జీడిపప్పు 12 పలుకులు
7. లవంగాలు 4
8. మిరియాలు 4
9. కొత్తి మీర
10. ఉప్పు రుచుకి సరిపడా
11. ఆయిల్ 6 స్పూన్స్
తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి
 గ్లా సు బియ్యానికి రెండు గ్లా సులు నీళ్లు పో సుకుని
కుక్కరులోపెట్టి ఉడికించుకోవాలి.
 ఉడికించుకున్న అన్నాన్ని ఒక ప్లేటులోకి తీసుకుని చల్లా ర్చుకోవాలి .
పచ్చి బఠానీలను కూడా ఉడికించుకోవాలి .
పచ్చిమిర్చిని చీలికలుగా తరుగుకోవాలి ,
స్ట వ్ మీద బాణలి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి
పైన చెప్పిన లవంగాలు , మిరియాలు ,
జీడిపప్పులు వేసి అవి దో రగా వేగాక ,
ముందుగా తయారు చేసి పెట్టు కున్న
అల్ల ం వెల్లు ల్లి  అల్ల ము వెల్లు ల్లి పేస్టు   మిశ్రమాన్ని వేసి
అది పచ్చి వాసన పో యేదాకా వేపుకుని,
 పచ్చిమిర్చి చీలికలు , బఠానీలు ,
కొబ్బరి కోరు లను వేసి దో రగా వేగనివ్వాలి
దో రగా వేసిన ఈ మిశ్రమాన్ని ,
ముందుగా ఉడికించి చల్లా రబెట్టు కున్న అన్నం లో వేసి
సరిపడినంత ఉప్పును కూడా వేసి
బాగా కలుపుకోవాలి ,
కొత్తి మీర తో గార్నిష్ చేసుకుంటే
వేడి వేడి ఘుమ ఘుమ లాడే కొబ్బరి అన్నం రెడ.ీ

దధ్యోజనం

                                                                    దధ్యోజనం

కావలసిన పదార్థా లు

1.  బియ్యం  2 గ్లా సులు


2. కమ్మని పెరుగు 3 కప్పులు
3. ఉప్పు రుచికి సరిపడ
4. పచ్చిమిర్చి  5
5. అల్ల ం చిన్న ముక్క
6. కరివేపాకు
7.కొత్తి మీర

పో పు దినుసులు
పల్లీలు 2 స్పూన్స్
సెనగపప్పు 1 స్పూన్
మినపప్పు 1 స్పూన్
ఆవాలు అర స్పూన్
జీలకర్ర అర స్పూన్
ఎండుమిరపకాయలు  2
ఇంగువ కొద్దిగా

తయారు విధానం
అల్ల ం చిన్న ముక్కలు గాను ,
పచ్చిమిర్చిని చీలికలుగాను తరుగుకోవాలి

బియ్యాన్ని శుభ్రం గా కడిగి


గ్లా సుబియ్యానికి  రెండు గ్లా సులు నీళ్లు పో సుకుని
కుక్కరులో పెట్టి ఉడికించాలి

ఉడికిన అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని


చల్లా రనివ్వాలి

స్ట వ్ మీద బాణలి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి


ముందుగా పల్లీలను వేసి ,
అవి వేగాక పైన చెప్పిన పో పు దినుసులను వేసి
అవి దో రగా వేగాక పచ్చిమిర్చి చీలికలు ,
అల్ల ం ముక్కలు ,
కరివేపాకు లను వేసి దో రగా వేగనివ్వాలి

పెరుగును తీసుకుని ఉడికించి చల్లా రబెట్టు కున్నఅన్నం లో వేసి


కలుపుకోవాలి

ముందుగా వేపుకుని పెట్టు కున్న పో పు ను


సరిపడఉప్పును వేసి బాగా కలుపుకుని ,

కొత్తి మీర తో గార్నిష్ చేసుకుంటె

ఘుమ ఘుమ లాడే దధ్యోజనం రెడీ అవుతుంది

అన్నం చల్లా రాక పెరుగు కలుపుకోవాలి లేకపో తే పెరుగు విరిగినట్లు అవుతుంది


దబ్బకాయ నంచుకు తింటాయి గొప్ప రుచిగా ఉంటుంది
పెరుగు పులుపు లేకుండా కమ్మటిది అయితే దధ్యోజనం చాలా రుచిగా ఉంటుంది .

శనగ పప్పు " పాటోళీ "

                                                              శనగ పప్పు  " పాటోళీ  "

కావలసిన పదార్థా లు  : 


1. సెనగపప్పు  100 గ్రా ములు 
2. ఉల్లిపాయలు 2 
3. పచ్చిమిరపకాయలు 2 
4. మినపప్పు 1 స్పూన్ 
5. ఆవాలు అర స్పూన్ 
6. జీలకర్ర అర స్పూన్  
7. ఎండు మిరపకాయలు  2 
8. కరివేపాకు   రెండు రెమ్మలు 
9. కొత్తి మీర కొద్దిగా  
10. వెల్లు ల్లి 4 రెబ్బలు 

తయారీ  విధానము  
ముందుగా సెనగ పప్పుని  నీళ్ళలో నాన బెట్టు కోవాలి 
పప్పు 4 గంటలు నానితే  సరిపో తుంది 
నానిన పప్పుని  మెత్తగా రుబ్బు కోవాలి. 
స్ట వ్ వెలిగించి బాణలి పెట్టి 6 స్పూన్స్  నూనె  వేసి , 
వేడెక్కాక  
పైన  చెప్పిన పో పు దినుసులు , వెల్లు ల్లిరెబ్బలు వేసి , 
 వేగాక 
కరివేపాకు , తరిగిపెట్టు కున్న ఉల్లిపాయలు , పచ్చిమిరపకాయలు  ,
వేసి దో రగా వేయించుకోవాలి . 
తరువాత రుబ్బి పెట్టు కున్న పప్పు ముద్ద ను వేసి , 2 స్పూన్స్ నూనె  వేసి  ,
సరిపడినంతగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి . 
బాణలి పైన  మూత  పెట్టి కాసేపు మగ్గ నివ్వాలి . 
10 నిమిషాలకొక సారి కలుపుతూ ఉండాలి.
కలుపు తున్నప్పుడు  ఆయిల్  వేసి కలుపుతుంటే ,
పాటోళీ పొ డి పొ డి లాడుతూ వస్తు ంది . 
చివరకు పొ డిపొ డి లాడుతూ ఉండే  " పాటోళీ " తయారవుతుంది  
కొత్తి మీరతో గార్నిష్ చేసుకోవాలి . 
దీనిలో కి  " ఉల్లి పాయ పులుసు "  తో నంచుకు తింటే బావుంటుంది

You might also like