You are on page 1of 18

రాగి పంట యాజమాన్య పద్ధతులు

మరియు పంట ఆధారిత ఆహార ఉత్పత్తులు

భారత గ్రామ నవ నిర్మాణ సంస్థ (MARI)


నీరు, భూమి యాజమాన్య శిక్షణ మరియు పరిశోధన
సంస్థ (WALAMTARI)

1
ముందు మాట
భారత గ్రామ నవ నిర్మాణ సంస్థ (MARI) గత మూడు దశాబ్దాలుగా సుస్థిర వ్యవసాయ అభివృద్ధి
లక్ష్యంతో అనేక కార్యక్రమాలను అమలు చేసి మంచి ఫలితాలను సాధించింది. ఆయా
కార్యక్రమాలన్ని తెలంగాణ జిల్లాలలోని చిన్న సన్నకారు రైతులకు బహుళ ప్రయోజనాలను
అందించాయి. ఇదే కృషిని కొనసాగిస్తూ మా సంస్థ, నీరు, భూమి యాజమాన్య శిక్షణ
మరియు పరిశోధన సంస్థ (WLAMTARI) భాగస్వామ్యంతో, జర్మనీ సంస్థ GIZవారి ఆర్థిక
సహాయముతో యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లోని వర్షాధారిత వ్యవసాయంపై
ఆధారపడి ఉన్న చిన్న సన్నకారు రైతులను మారుతున్న వాతావరణ (climate change)
పరిస్థితులను తట్టుకొని నిలబడగలిగే పంట విధానం పాటించేటట్లు ప్రోత్సాహించడానికి
ఒక కార్యక్రమాన్ని చేపట్టినది. ఇందులో భాగంగా 2018 రబీ పంటకాలంలో 633 రైతులకు
సిరిధాన్య పంటల సాగుపై శిక్షణను ఇవ్వగా అందులో 321 రైతులు 595.5 ఎకరాలలో
విజయవంతంగా జొన్న (434 ఎకరాలు), కొర్ర (127 ఎకరాలు), రాగి (16.5 ఎకరాలు),
సామలు (4.5 ఎకరాలు), అండుకొర్రలు (4 ఎకరాలు), అరికలు (4 ఎకరాలు), వరిగలు
(4 ఎకరాలు) మరియు ఊదల (1.5 ఎకరాలు) పంటలను పండించినారు. అదే విధంగా
2019 ఖరీఫ్ పంటకాలంలో 1540 మంది రైతులకు శిక్షణ ఇవ్వగా, 1219 మంది రైతులు
1779 ఎకరాలలో పచ్చజొన్నలు (1340 ఎకరాలు), కొర్రలు (230 ఎకరాలు), అండు కొర్రలు
(173 ఎకరాలు), రాగులు (28 ఎకరాలు), వరిగలు (3 ఎకరాలు), అరికలు (3 ఎకరాలు),
సజ్జల (2 ఎకరాలు) పంటలు వేసినారు.
గత కొద్ది సంవత్సరాలుగా సిరిధాన్యాన్ని ఆహారంగా వినియోగించడానికి అన్ని వర్గాల
ప్రజల్లో ఎంతో ఆసక్తి పెరగడం సంతోషకరమైన మార్పు. ముఖ్యంగా హైదరాబాదు,
వరంగల్, కరీంనగర్, ఖమ్మం మొత్తం అన్ని పట్టణాలలో సిరిధాన్యానికి గిరాకీ ఎన్నోరెట్లు
పెరగడం, తెలంగాణలో వర్షాధారిత భూముల్లో సిరిధాన్యాన్ని పండించడానికి ఎంతో
అవకాశాన్ని కల్పిస్తుంది. ఇప్పటికే చాలా మంది రైతులు తమసొంత ఆహారానికి, మార్కెట్‍లో
అమ్మడానికి సిరిధాన్యాలను పండిస్తున్నారు. అటువంటి రైతులకు సిరిధాన్యపంటల
సాగుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సంక్షిప్తంగా, రైతులకు 9 చిన్న పుస్తకాలను,
ఒక కాలెండర్ని మేము ముద్రించి అందుబాటులోకి తీసుకువస్తున్నాము. రైతులందరికీ ఈ
పుస్తకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తున్నాము. ఈ పుస్తకాల రూపకల్పనలో
సహకారం అందించిన Shri V. Prakash Rao, Chairman, TWRDC & WALAMTARI,
Dr.T.S.S.K.Patro, Principal Scientist, ARS Vizianagaram, Dr. C.V. Sameer Kumar,
Principal Scientist - Millets, PJTSAU, Rajendranagar, Hyderabad గార్లకు
హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాము.
ఆర్. మురళి
Executive Director
MARI సంస్థ
ప్రతులకు సంప్రదించవలసిన చిరునామా శ్రీ కొసరాజు సురేష్, C/o. మంచిపుస్తకం,
Street No.1, Tarnaka, Secunderabad-500017
2
రాగులు / తైదలు
రాగిలో ఉన్న అధిక పోషక విలువలు, ఔషధగుణాల రీత్యా ఇటీవవల కాలంలో అవగాహన పెరిగి,
రాగి పంట సాగు ప్రాధాన్యత సంతరించుకుంటున్నది.
రాగి పంటను దక్షిణ ఆసియా, పశ్చిమ ఆప్రికాలో ఎక్కువగా ధాన్యంగా మరియు పశుగ్రాసం
కొరకు పండిస్తున్నారు. రాగులు ఉష్ణమండల ప్రాంతాలైన 25 ఆఫ్రికా దేశాలతో సహా మరియు
భారతదేశంలో ముఖ్యమైన చిరుధాన్య పంట. రాగిలో క్యాల్షియం అత్యధికంగాను కొవ్వు తక్కువగా
ఉంటాయి మరియు పీచు పదార్ధాలు మిగిలిన ధాన్యాలలో కంటే ఎక్కువగా ఉన్నాయి. రాగులలో
తక్కువ కొలెస్ట్రాల్,‌ గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ మరియు ఎక్కువ యాంటి ఆక్సిడెంట్‌ కలిగిన పోషకాలు
వుండి మధుమేహ వ్యాధి కలిగిన వారికి మంచి ఆహారంగా ఉపయోగ పడుతుంది.
ఖరీఫ్‍లో వర్షాధారంగా, యాసంగిలో ఆరుతడి పంటగా రాగిని సాగుచేసుకోవచ్చు. మాగాణుల్లో
నీటి లభ్యత తగ్గినపుడు మరియు కొద్దిపాటి చౌడు సమస్య ఉన్న పరిస్థితుల్లో రాగి పంట సాగు
చేసుకుని మంచి దిగుబడులు పొందవచ్చును.
విత్తే సమయము: ఈ పంటను ఖరీఫ్‍లో జూలై మొదటి వారం నుండి ఆగష్టు చివరి వారం వరకు,
రబీలో అక్టోబరు చివరి వారం వరకు మరియు వేసవిలో ఫిబ్రవరి మొదటి పక్షంలోపు నీటి ఆధారిత
పంటగా నాటుకోవాలి.
నేలలు: రాగిని తేలిక రకం ఇసుక నేలలు, బరువైన నేలలు మరియు కొద్ది పాటి చౌడు సమస్య ఉన్న
భూముల్లో సాగు చేసుకోవచ్చును. కానీ నీరు నిలువ ఉండే భూముల్లో సాగు చెయ్యరాదు.
అధిక దిగుబడి నిచ్చే రాగి రకాలు

‌ఋతువు పంట కాలము దిగుబడి


రకము గుణగణాలు
(రోజుల్లో) (క్వింటాళ్ళు/ఎకరానికి)
వెన్నులు పెద్దవిగా, ముద్దగా
అన్ని
భారతి 105-110 10-12 ఉంటాయి. అగ్గి తెగులును
కాలాలకు
కొంత వరకు తట్టుకుంటుంది.
పైరు ఎత్తుగా పెరిగి పిలకలు
శ్రీచైతన్య ఖరీఫ్ 110-120 10-12
ఎక్కువగా వేస్తుంది.
తెల్ల గింజ రాగి రకము. అగ్గి
హిమ రబీ 105-110 10-12
తెగులును తట్టుకుంటుంది.
అగ్గి తెగులును కొంత వరకు
వఖుల ఖరీఫ్ 105-110 10-12 తట్టుకుంటుంది.
ఖరీఫ్, బెట్టను మరియు అగ్గి తెగులును
మారుతి 85-90 9-10 తట్టుకుంటుంది.
వేసవి
3
భారతి VR-762 శ్రీచైతన్య VR-842

విత్తన మోతాదు: 2.0 కిలోల విత్తనముతో 2 గుంటలలో పెంచిన నారు ఒక ఎకరా పొలంలో
నాటడానికి సరిపోతుంది. నేరుగా వెదజల్లే పద్ధతిలో ఎకరాకు 3-4 కిలోల విత్తనము
అవసరమవుతుంది.
విత్తనశుద్ది: కిలో విత్తనానికి 2 గ్రా॥ కార్బండిజమ్‌గాని (లేదా) 10 గ్రా॥ సూడోమోనాస్‌ఫ్లోర్‌సెన్స్‌3
గ్రా॥ మాంకోజెబ్‌పొడి మందును గాని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.
విత్తేపద్దతి: నారుమడిని మెత్తగా దున్ని తేలికపాటి దుక్కి చేసి విత్తనం చల్లి, గుంటక తోలాలి. బాగా
దుక్కి చేసిన నేలల్లో రాగిని 1:3 నిష్పత్తిలో విత్తనము మరియు సన్నని ఇసుక కలిపి నేరుగా కూడ
విత్తుకోవచ్చును. వరుస మధ్య 30 సెం.మీ. దూరం ఉండవలెను మరియు ఒక వరుసలో మొక్కకి
మధ్య 8-10 సెం.మీ. దూరంలో ఉంచవలెను.
నారు నాటేపద్ధతి: 85-90 రోజుల స్వల్పకాలిక రకాలకు 21 రోజుల వయసు కలిగిన మొక్కలను,
105-120 రోజుల దీర్ఘకాలిక రకాలకు 30 రోజుల మొక్కలను నాటాలి. వరుసల మధ్య 30 సెం. మీ.,
మొక్కల మధ్య 15 సెం.మీ. దూరం పాటించాలి.
నారుమడి ఎరువు యాజమాన్యం: 2 గుంటల నారుమడిలో 1.5 కిలో యూరియా, 4 కిలోల సింగిల్‌
సూపర్‌పాస్ఫేట్, 800 గ్రాముల మ్యూరేట్‌ఆఫ్‌పొటాష్‌వేసుకోవాలి.
ఎరువులు: ప్రధాన పొలంలో, ఎకరానికి ఆఖరి దుక్కిలో 100 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌
మరియు 20 కిలోల మ్యూరేట్‌ఆఫ్‌పొటాష్‌, 40 క్వింటాళ్ళ పశువుల ఎరువు వేసి కలియదున్నాలి.
రైతులు డి.ఎ.పి. రూపంలో ఆఖరి దుక్కిలో వేయదలుచుకుంటే, 35 కిలోల డి.ఎ.పి సరిపోతుంది.
అప్పుడు, సింగల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ను ఆఖరి దుక్కిలో వెయ్యవసిన అవసరం లేదు. యూరియాను
ఎకరానికి 50 కిలోలు వెయ్యాల్సి ఉంటుంది. అందులో సగభాగాన్ని నాటేటప్పుడు, మిగతా
సగభాగాన్ని నాటిన 25-30 రోజులకు వేసుకోవాలి. ఎకరాకు 25-30 కిలోల డి.ఎ.పి., 15 కిలోల
మ్యూరేట్ ఆఫ్ పొటాష్ నాటేటప్పుడు వేయాలి. నాటిన 30 రోజులకు 25 కిలోల యూరియా
పైపాటుగా చేసుకోవాలి.

4
కలుపు నివారణ, అంతరకృషి:
విత్తిన తరువాత 30 రోజుల లోపు అంతర సేద్యం దంతెలతో చేసుకొని కలుపు నివారణ చేపట్టాలి.
రాగిని నేరుగా విత్తే పద్ధతిలో సాగుచేసినపుడు సహజంగా పెరిగే గడ్డిజాతి మరియు వెడల్పాకు
కలుపు నివారణకు లోండాక్స్‌పవర్‌లీటరు నీటికి 6 గ్రా. చొప్పున విత్తిన 72 గంటలలో పిచికారి చేస్తే
మంచి ఫలితం ఉంటుంది. రాగి నాట్లు వేసే పద్ధతిలో కలుపు నివారణ కోసం పెండిమిథాలిన్‌ను
ఎకరానికి 1 లీటరు చొప్పున నాట్లు వేసిన 48-72 గంటలలో వెంటనే పిచికారీ చేయాలి.
నీటి యాజమాన్యము:
పూత దశ, గింజ పాలు పోసుకునే దశల్లో పైరు నీటి ఎద్దడికి గురి కాకుండా చూడాలి. నాట్లువేసిన
పొలంలో నాటిన పైరు బాగా వేళ్ళు తొడిగిన తరువాత, 10 రోజుల వరకు నీరు పెట్టరాదు. పూత,
గింజ, పాలుపోసుకునే దశల్లో పైరు నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి.
అంతర పంటలు :
ప్రతి 8 వరుసల రాగి పంటకు, 2 వరుసల కంది పంటను వేసుకున్నట్లయితే, ఎకరాకు అదనంగా
రూ।। 2,340/- వచ్చినట్లు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఈ విధంగా రాగితో కంది వంటి పప్పు
ధాన్యపు పంటను అంతర పంటగా వేయడం వలన రాగిని పండించే చిన్న, సన్నకారు రైతు ఆర్ధిక
పరిస్థితి మెరుగుపడటమే కాకుండా, మాంసకృత్తులు అధికంగా ఉండే కంది వలన ఆహార పోషక
విలువలు కూడా మెరుగుపడతాయి.
వరిమాగాణుల్లో నేరుగా విత్తే రాగి సాగు :
సాధారణంగా రాగి పంటను రబీ కాలంలో కూడా ఖరీఫ్‌లో వేసినట్లే నారు పోసుకొని, నాట్లు
వెయ్యటం జరుగుతుంది. అలాకాకుండా వరి మాగాణుల్లో, వరి కోతకు వారం రోజుల ముందు
రాగి విత్తనాలను నానబెట్టి చల్లుకుంటే ఖర్చు తగ్గుతుంది.
అందుకోసం రాగి విత్తనాలను 24 గంటల పాటు నానబెట్టి, ఆ తరువాత నీరు పోసి, ఒక పొడిగుడ్డ
మీద విత్తనాలను పలుచగా నీడలో ఆరబెట్టాలి. ఇలా పొడిగా అయిన విత్తనాలను పొలంలో
సమానంగా వెదజల్లుకోవాలి. దీనివల్ల నారు పోసుకొని నాట్లువేసుకుట్లయితే ఖర్చు గణనీయంగా
తగ్గి, అధిక నికరాదాయం వస్తుంది. విత్తిన 20 రోజులకు ఎకరానికి 20 కిలో యూరియా మరియు
10 కిలోల మ్యూరేట్‌ఆఫ్‌పొటాష్‌వేసుకుంటే సరిపోతుంది. రైతు కమతాల్లో చేపట్టిన ప్రయోగాల్లో,
నాట్లు వేసిన పద్ధతిలో ఎకరానికి ఖర్చు రూ।। 13,850/- ఉండగా, వరిమాగాణుల్లో నేరుగా వెదజల్లే
పద్ధతిలో ఖర్చు రూ।। 7,375/- మాత్రమే ఉండటం గమనించటమైనది. దిగుబడులు నాట్లు
వేసిన పొలంలోనే అధికంగా వచ్చినప్పటికీ, ఆదాయ, వ్యయనిష్పత్తి నాట్లు వేసిన పొలంలో
1.70:1 మాత్రమే ఉండగా, వరి మాగాణుల్లో నేరుగా వెదజల్లే పద్ధతిలో 2.17:1 రావటం జరిగింది.
కాబట్టి, కూలీ కొరత ఎక్కువగా ఉన్నప్పుడు, వరి మాగాణుల్లో రాగి పంటను సాగు చేసుకోవటం
లాభదాయకం.

5
సస్యరక్షణ: వివిధ పరిశోధన కేంద్రాలలో నిర్వహించబడిన పరిశోధన ఫలితాల ఆధారంగా ఈ
క్రింది సస్యరక్షణ చర్యలు మరియు మందులు సూచించబడినవి.
గులాబి రంగు పురుగు: బాగా ఎదిగిన లార్వాలు గులాబి రంగులో ఉండి కాండాన్ని తొలచి
లోపలి భాగాలను తినడం వలన మొవ్వు చనిపోతుంది. పంటను కంకి దశలో ఆశిస్తే తెల్లకంకులు
ఏర్పడతాయి. ఈ పురుగు నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి
చేయాలి.
కాండం తొలుచు పురుగు: ఇది ఆశించడం వల్ల తెల్లకంకులు వస్తాయి. మొవ్వు పీకితే ఊడి
వస్తుంది. నివారణకు క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ (లేదా) కార్టాఫ్హై
‌ డ్రోక్లోరైడ్‌ 2.0 గ్రాములు / లీటరు
నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
అగ్గితెగులు: ఈ తెగులు ఆశించినపుడు ఎదిగిన మొక్కల ఆకులు, కణుపులు, వెన్నులపైన దారపు
కండె ఆకారం మచ్చలు ఏర్పడతాయి. మచ్చ యొక్క అంచు ముదురు గోధుమ వర్ణంలోను, మధ్య
భాగం బూడిద రంగు కల్గి ఉంటుంది. తెగులు పెరిగేకొద్ది మచ్చ సంఖ్య మరియు పరిమాణం పెరిగి
ఒకదానితో ఒకటి కలిసి, ఆకులు ఎండిపోయి చూడడానికి పైరును నిప్పుతో తగలబెడితే ఏ విధంగా
ఉంటుందో అనగా కాలినట్లు కనిపించును. అందువలననే దీనిని ‘‘అగ్గితెగులు’’ అని అంటారు.

ఆకుమీద అగ్గితెగులు మెడమీద అగ్గితెగులు రెక్కమీద అగ్గితెగులు


నివారణ : మొక్కపై అక్కడక్కడ మచ్చలు కనిపించినప్పుడు లీటరు నీటికి 1 గ్రా॥ కార్బెండిజమ్‌లేదా
1 మి.లీ॥ ఎడిఫెన్‌ఫాస్‌మందును కలిపి పిచికారి చేయాలి.
నారు నాటే ముందు బ్లైటాక్స్ లేదా మాంకోజబ్‌ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపిన
ద్రావణంలో నారును ముంచి శుద్ధి చేసి నాటుకుంటే పంటను మొదటి దశలో ఆశించే తెగుళ్ళ
నుంచి కాపాడుకోవచ్చును.
కణుపులపై తెగులు ఆశిస్తే కణుపులు విరగడం, వెన్నుపై ఆశిస్తే గింజలు తాలుగా మారుతాయి.
మొక్కలపై ఈ తెగులు ఆశించినపుడు 1 గ్రా. కార్బండాజిమ్ లేదా మాంకోజెబ్ 2.5 గ్రా. / లీటరు
నీటికి కలిపి పిచికారి చేయాలి లేదా హెక్సాకొనజోల్ 2 మి.లీ. లేదా ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. / లీటరు
నీటికి కలిపి పిచికారి చేయాలి.
చెదలు: చెదలు ఎక్కువగా తేలిక నేలల్లో, వర్షాధార పరిస్థితుల్లో ఆశిస్తాయి. క్లోరిపైరిఫాస్‌ ఇ.సి 5
మి.లీ / లీటరు నీటికి చొప్పున కలిపిన ద్రావణాన్ని చెదల పుట్టపై పోయాలి.
6
పాము పొడ తెగులు :
లక్షణాలు:
• సాధారణంగా ఈ తెగులు దుబ్బులు వేసే దశ నుండి ఏ దశలోనైన ఆశించవచ్చు. ఈ
శిలీంధ్రము వలన కాండంపై ఉన్న ఆకుమీద చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడి అవి
క్రమేపి పెద్దవై పాముపొడ వంటి మచ్చలుగా మారతాయి. ఈ మచ్చలు ఒక క్రమ పద్ధతిలో
ఉండవు. మచ్చలచుట్టు గోధుమ వర్ణం కలిగి మధ్యభాగం బూడిద రంగులో ఉంటుంది.
• రాగి మొక్కల వెన్ను దశలో పై ఆకులకు కూడా ఈ శిలీంధ్రం వ్యాపించి ఆకులపై మచ్చలు ఒక
దానితో ఒకటి కలిసిపోయి ఆకులు మరియు మొక్కలు కూడ ఎండిపోతాయి.
• వాతావరణంలో తేమ అధికంగా వుండి, ఉష్ణోగ్రత 23-250C మధ్య ఉన్నపుడు, రాగి నాట్లు
దగ్గర దగ్గరగా నాటినపుడు మరియు అధిక నత్రజని ఎరువు వేసినపుడు ఈ తెగులు అధికంగా
వృద్ధి చెందుతుంది.
• దుబ్బుచేసే దశలో తెగులు లక్షణాలు కనిపించినపుడు 1 మి.లీ. ప్రోపికోనజోల్‌ లేదా 2 మి.
లీ. హెక్సాకోనజోల్‌ లేదా 2 మి. లీ. వాలిడామైసిన్‌ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి
చేయాలి.
పంట కోత: గింజలు ముదురు గోధుమ రంగులో ఉన్నప్పుడు, వెన్నుల దగ్గరి ఆకులు పండినట్లుగా
ఉంటే పంటను కోయవచ్చు. పిలక కంకుల కంటే ప్రధాన కాండపు కంకి మొదట కోతకు వస్తుంది.
కాబట్టి 2 దశల్లో కంకులను కోయాలి. పొలంలోనే చొప్పకోసి, 2-3 రోజులు ఆరిన తర్వాత
వెన్నులను విడదీయాలి. బాగా ఆరిన వెన్నులను కర్రలతో కొట్టిగాని, ట్రాక్టరు నడపడం ద్వారా గాని
గింజలను సేకరించాలి. అలా సేకరించిన గింజలను గాలికి తూర్పారబట్టి నాణ్యమైన గింజలను
పొందవచ్చును.

పాముపొడవంటి మచ్చలు రాగిసాగులో అంతర పంటలు

7
పంట సంక్షిప్త సమాచార సూచనల సమగ్ర పట్టిక
# వివరాలు సమయపట్టిక
1 అనుకూలమైన నేలలు నీరు నిలిచే నేలలు మినహా అన్ని
తేలిక నేలలు
2 వర్షాకాలంలో అనువైన సమయం జూన్-జూలై
(ఖరీఫ్)
3 వేసంగిలో అనువైన సమయం (రబి) అక్టోబర్-డిసెంబర్
4 దుక్కి విధానం మొదట దుక్కి దున్ని, తరువాత
రొటవేట్ చేసి, బాగా చదునైన
పొలంలో బోదెలు చేయాలి
5 బాగా తయారైన సేంద్రియ ఎరువు 40 క్వింటాళ్ళు
6 ఎకరానికి దుక్కిలో వేయాల్సిన నత్రజని (N)-12
ఎరువు బాస్వరం (P)-16
పొటాషియం (K)-12
7 ఎకరానికి కావాలసిన విత్తనాలు 2.5-4 కిలోలు
విత్తన పరిమాణాన్ని బట్టి ఇసుక
కలిపి విత్తుకోవాలి
8 విత్తన శుద్ది ఒక కిలో విత్తనానికి 2 గ్రాముల
(అజోస్పైరిలియం వంటి బయో Carbendazim మందుతో శుద్ది
ఎరువులు) మరియు (వ్యాధి చేయాలి
నిరోధకత కోసం) శిలీంద్ర సంహారిణి
9 బోదెల మధ్యన ఉండాల్సిన దూరం 30 x 10 సెం.మీ.
10 విత్తే విధానం నేరుగా విత్తడం / నారుపోసి నాటు
పెట్టడం
11 30 నుండి 40 రోజుల మధ్యన 12 కిలోలు
వేయవలసిన నత్రజని
12 కలుపు తీయుట, అంతరసాగు 25 – 30
వరుసలలో (గుంటక) (రోజులలో)

8
# వివరాలు సమయపట్టిక
13 సస్యరక్షణ చర్యలు ప్రధాన తెగుళ్ళు తుప్పుతెగులు:
Mancozeb @ 3g/l or
Tridimarph 1ml/l పిచికారీ
చేయండి
14 అనుకూలమైన అంతర పంటలు కంది
15 పంట వ్యవధి 70-115 రోజులలో
16 దిగుబడి 10-12 క్వింటాళ్ళు
17 చొప్ప దిగుబడి (పశుగ్రాసం) 20-25 క్వింటాళ్ళు
18 మద్దతు ధర (2019-20) 3150
19 పంట ఆధారిత ఆహార ఉత్పత్తులు లడ్డు, అంబలి, జావ, అట్లు, పూరి,
ఇడ్లీ, చపాతి, వడ, మెంతిరొట్టె,
రొట్టె

9
రైతులు పంటకాలంలో ఖర్చు, దిగుబడి, ఆదాయ వివరాలు మొత్తం
నమోదు చేసుకోవడానికి పట్టిక
రైతు పేరు : ------------------- గ్రామము : --------------------
ఋతువు : -------------------- పంట రకము : -----------------
విత్తన వివరం, వెరైటీ : ----------- విత్తే పొలము విస్థీర్ణం : -----------
తేది పని వివరాలు యూనిట్ ధర మొత్తం
దున్నడం
చదను చేయడం (డిస్క్)
కల్టివేటర్
రోటవేటర్
బాగా మురిగిన పశువుల ఎరువు
దుక్కిలో వేసిన వివరాలు
బోదలు చేసిన వివరాలు
విత్తడం
విత్తనం కప్పడం / గుంటక నడపడం
మొలకముందు వేయాల్సిన కలుపు మందు
సస్యరక్షణ
నీరు పెట్టడం
కలుపు తీయడం
పంటలో అంతర కృషి
రెండవ దఫా ఎరువు
పక్షుల నుంచి రక్షణ
అడవి పందుల ఇతర జంతువులపై నిఘా
పంటకోత
కంకుల నుండి గింజలు వేరు చేయుట
ఇతర ఖర్చులు
మొత్తం ఖర్చులు
దిగుబడి
క్ర.సం. వివరాలు యూనిట్ ధర మొత్తం విలువ
1 పండిన ధాన్యము క్వింటాళ్ళు
2 పశు గ్రాసము
నికర ఆదాయము
1 మొత్తం విలువ
2 మొత్తం ఖర్చులు
3 నికర ఆదాయము
10
పంట పరిశీలన వివరాలు
1వ వారం

2వ వారం

3వ వారం

4వ వారం

5వ వారం

6వ వారం

7వ వారం

8వ వారం

9వ వారం

10వ వారం

11వ వారం

12వ వారం

13వ వారం

14వ వారం

15వ వారం

11
పంట ఆధారిత ఉత్పత్తులు
రాగి అంబలి
కావసిన పదార్థాలు :
రాగిపిండి : 1/2 కప్పు
ఉల్లి తరుగు : 1/2 కప్పు
మిరపకాయ : 1 చెంచా
కరివేపాకు : 1 రెమ్మ
ఉప్పు : తగినంత
తరిగిన కొత్తిమీర : 2 చెంచాలు
మజ్జిగ : 2 కప్పు
తయారుచేసే పద్ధతి :
ఒక కప్పు నీళ్లలో అరకప్పు రాగి పిండి జారుగా కలుపుకొని మరుగుతున్న అర లీటరు నీళ్లలో
పోసుకుని బాగా కలుపుకుని 6-7 నిమిషాలు బాగా ఉడక పెట్టుకోవాలి. ఉడుకుతున్నంతసేపు
ఉండ కట్టకుండా కలియపెడుతూనే ఉండాలి. చల్లారిన తరువాత మజ్జిగ, ఉల్లిపాయ తరుగు,
పచ్చిమిరపకాయ తరుగు, ఉప్పు, జీలకర్ర పొడి, కొత్తిమీర, కరివేపాకు కలుపుకుని కుండలో
పెట్టుకుని, త్రాగితే ముఖ్యంగా వేసవి తాపానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. దీనికి కొంచెం
నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఈ అంబలి సజ్జ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు.

రాగి అట్లు

రాగిపిండి : 500 గ్రాములు


బెల్లం : 25 గ్రాములు
తయారుచేసే పద్ధతి :
నీటిలో బెల్లం కరిగించాలి. ఈ నీటిలో రాగిపిండి
కలిపి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమం పలుచగా
ఉండేటట్లు సరిచూసుకోవాలి. పొయ్యిమీద పెట్టిన
పెనంపై గరిటతో కలిపి ఉంచిన రాగి పిండిని
వెయ్యాలి. అట్టును రెండువైపులా కాల్చాలి.

ముఖ్యమైన పోషక విలువలు / వంద గ్రాములకు :


మాంసకృత్తులు 5.6 గ్రా॥, రైబోఫ్లావిన్‌ 0.06 మి.గ్రా॥, కాల్షియం 238 గ్రా॥., నియాసిన్‌ 0.78,
ఇనుము 4 మి.గ్రా॥, శక్తి 269 క్యాలరీస్‌.

12
రాగి జావ (మాల్ట్‌)
కావసిన పదార్థాలు :
రాగి పిండి : 1 కప్పు
బెల్లం పొడి : 1 కప్పు
తయారుచేసే పద్ధతి :
రాగులు మొలకెత్తించి ఎండపెట్టి పొడిచేసి పెట్టుకుంటే పోషక విలువలు
పెరుగుతాయి. ఒక కప్పు రాగిపిండిని 5 లేక 6 కప్పుల నీటిలో ఉండలు లేకుండా
జారుగా కలుపుకుని పొయ్యి మీద సన్నని మంట మీద సుమారు 5 నిమిషాలు
ఉడక పెట్టాలి. రాగి పిండ ఉడుకుతున్నంత సేపు గరిటతో కలుపుతూనే ఉండాలి
లేకపోతే ఉండలు కట్టే అవకాశముంది. ఇప్పుడు దీనికి బెల్లం లేదా పటికబెల్లం
పొడి, యాలకుల పొడి, పిస్తా, బాదం పొడిని వేసి మరొక 3-4 నిముషాలు సన్నని
మంటమీద కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు కలుపుకుంటే రుచికరమైన రాగి జావ
తయారవుతుంది. చిన్నపిల్లకు గోరు వెచ్చగా ఉన్నప్పుడు పెడితే త్వరగా జీర్ణం
అవుతుంది. సజ్జ పిండితో కూడా ఈ జావ తయారు చేసుకోవచ్చు.

13
రాగి పూరి
కావసిన పదార్థాలు :
రాగి పిండి : 100 గ్రాములు
మైదా : 25 గ్రాములు
నూనె : 120 గ్రాములు
ఉప్పు : తగినంత
నీళ్లు : తగినంత

తయారుచేసే పద్ధతి :

ఒక పాత్రలో జల్లించిన మైదా, రాగి పిండిలో ఉప్పు, తగినన్ని నీళ్ళుపోసి కలుపుకుని,


20 నిమిషాలు ప్రక్కన ఉంచాలి. ఉండల్లా చుట్టుకొని పూరీల్లా చేసుకోవాలి. ఈ
పూరీలను బాగా మరిగిన నూనెలో వేయించుకోవాలి.

రాగి చపాతి

కావసిన పదార్థాలు :
గోధుమ పిండి : 500 గ్రాములు
రాగి పిండి : 125 గ్రాములు
నూనె : తగినంత
ఉప్పు : తగినంత
నీళ్ళు : తగినంత

తయారుచేసే పద్ధతి :

ఒక పాత్రలో జల్లించిన రాగి, గోధుమపిండి, తగినంత ఉప్పు తీసుకొని నీళ్ళతో చపాతీ


ముద్దలా కలుపుకోవాలి. దీన్ని చిన్న, చిన్న ఉండులుగా చేసి చపాతిలా వత్తుకోవాలి.
వేడి అయిన పెనంపై రెండువైపులా దోరగా కాల్చాలి. ఈ విధంగా రుచికరమైన
చపాతీలు తయారుచేసుకోవచ్చు.

14
రాగి మెంతి రొట్టె
కావసిన పదార్థాలు :
రాగిపిండి : 1 కప్పు
గోధుమ పిండి : 1/4 కప్పు
మెంతి ఆకు : 1 కప్పు
ఉల్లిపాయ తరుగు : 1/2 కప్పు
పచ్చిమిరపకాయ తరుగు : 2 చెంచాలు
తయారుచేసే పద్ధతి :
వెడల్పాటి గిన్నెలో రాగిపిండి, గోధుమపిండి తీసుకుని, దానిలో ఉల్లిపాయ తరుగు,
పచ్చిమిరపకాయ తరుగు, మెంతికూర, జీలకర్ర, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద,
తగినంత ఉప్పు చేర్చుకుని రొట్టె పిండిలాగ కలుపుకుని 15 నిమిషాలు తడి ఆరకుండా
పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి చిన్న ఉండలుగా చేసుకుని అరిటాకు మీద కాని
రొట్టె కర్రతో రొట్టొగా ఒత్తుకుని పెనం మీద నూనెతో లేదా నెయ్యితో రెండువైపుల
దోరగా కాల్చాలి, ఏదైన చట్నీతో ఈ రొట్టొతింటే చాలా రుచిగా ఉంటాయి. మెంతి
ఆకు బదులు మునగాకు కూడా కలుపుకోవచ్చు లేదా ఏ ఆకుకూరలైన సన్నగా తరిగి
కలుపుకోవచ్చు. అల్లం, వెల్లుల్లి ముద్ద పచ్చివాసన వస్తుంది అనుకుంటే కళాయిలో,
రెండు స్పూన్‌నూనె తీసుకుని జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ తరుగు, అల్లం
వెల్లుల్లి ముద్ద, మెంతికూర, పసుపు అన్నీ మగ్గబెట్టుకుని పిండిలో కలుపుకోవచ్చు.
కరివేపాకుపొడి, కొత్తిమీర రొట్టె పిండికి కలుపుకుంటే రొట్టెలు మరింత రుచిగా
తయారవుతాయి. అన్నిరకాల చిరుధాన్యాల పిండితో ఈ రొట్టె చేసుకోవచ్చు.

15
రాగి ఇడ్లీ

కావసిన పదార్థాలు :
రాగి పిండి : 60 గ్రాములు
మినపపిండి : 20 గ్రాములు
ఉప్పు : తగినంత
నీళ్లు : తగినంత

తయారుచేసే పద్ధతి :

మినప పప్పుని నానబెట్టుకొని రుబ్బుకోవాలి. దీనికి రాగి పిండిని కలిపి సమపాళ్ళలో


నీటిని కలిపి ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. దీనిని ఒక రాత్రి వరకు నాననివ్వాలి.
తరువాత రోజు ఇడ్లీ పాత్రలో ఇడ్లీవలె పోసి 15 నిమిషాల పాటు ఉడక నివ్వాలి.
వేరుశనగ, అల్లం చెట్నితో తింటే బాగుటుంది.

రాగి వడ
కావసిన పదార్థాలు:
రాగి పిండి : 80 గ్రాములు
నానపెట్టిన శెనగు : 35 గ్రాములు
కారం పొడి : 5 గ్రాములు
ఉల్లిపాయు : 10 గ్రాములు
అల్లం : 10 గ్రాములు
పచ్చిమిరపకాయలు : 5
తయారుచేసే పద్ధతి :
నానబెట్టిన శనగపప్పును గరకగా రుబ్బుకోవాలి. కొత్తిమీర, పుదీనా తురుమును,
ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తరిగి ఉంచుకోవాలి. ఒకపాత్ర తీసుకొని
రాగి పిండిలో శనగరుబ్బు మరియు తరిగిన ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు
వేసి కలిపి ఉంచుకోవాలి. బాండిలో నూనెవేసి కాగిన తరువాత పిండిని కొంచెం
తీసుకొని వడల్లాగా వత్తి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.

16
రాగి రొట్టె

కావసిన పదార్థాలు :
రాగిపిండి : 1 కప్పు
ఉల్లిపాయలు : 1
జీలకర్ర : 1/2 చెంచా
పచ్చికొబ్బరి తురుము : 1 చెంచా
పచ్చిమిరపకాయలు : 2
కొత్తిమీర తురుము : తగినంత
ఉప్పు : తగినంత
నూనె లేదా నెయ్యి : తగినంత
తయారుచేసే పద్ధతి :
రాగిపిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కతో పాటు మిగిలిన
పదార్ధాన్ని వేసి నీటితో గట్టిగా చపాతి ముద్దలా కలిపి పెట్టుకోవాలి. పెనంను పొయ్యి
మీద పెట్టి, చేతికి నూనె రాసుకొని రాగి మిశ్రమాన్ని వుండలా చేసుకొని చేతితో
గుండ్రంగా ఒత్తాలి. చపాతిలా ఒత్తిన రొట్టెను నూనె లేదా నెయ్యి రాసిన పెనం మీద
కాల్చాలి. ఈ రొట్టెను పెరుగుతో తింటే చాలా రుచిగా వుంటాయి.

17
18

You might also like