You are on page 1of 2

ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం ప్రా ముఖ్యత, తయారీ మరియు వాడే విధానం:

డా|| ఎం. సురేష్, డా॥ కె. భానురేఖ, డా॥ శ్రీధర్ చౌహాన్, డా॥ బి. రాజేశ్వరి మరియు డా|| జి. అనిత వ్యవసాయ
కళాశాల, ఆదిలాబాద్
జీవామృతం:
రసాయనిక వ్యవసాయం వల్ల భూమిలో
సూక్ష్మజీవరాశి మరియు సేంద్రియ పదార్థం నశించి పొ లాలు నిస్సారమైపో తున్నాయి. ఈ దశలో భూమిని తిరిగి
సారవంతం చేయడం అత్యవసరం. అందుకు జీవామృతం చక్కగా ఉపయోగపడుతుంది. జీవామృతం ఒక సేంద్రీయ
ఎరువు. అధిక బయోమాస్ సహజ కార్బన్, నైట్రో జన్, ఫాస్ఫరస్ మరియు కాల్షియం వంటి అవసరమైన పో షకాలు కలిగి
మొక్క పెరుగుదలకు మరియు అభివృద్ధికి దో హదపడుతుంది.
మట్టిలో ఉన్న సూక్ష్మజీవులు నేల సారాన్ని మరియు పంటల ఉత్పాదకతను పెంచుతాయి. నేలలో ఉన్న
సూక్ష్మజీవులను పెంచేందుకు జీవామృతం ఉపయోగపడుతుంది. జీవామృతం చల్లిన భూమిలో సూక్ష్మజీవులు,
వానపాములు చైతన్యవంతమై పో షకాలను పంటలకు అందించేందుకు నిరంతరం శ్రమిస్తా యి. స్థా నికంగా గ్రా మాల్లో
అందుబాటులో ఉండే ప్రకృతి వనరులతోనే జీవామృతం తయారు చేయవచ్చు.
జీవామృతం రెండు రకాలు ఒకటి ఘన జీవామృతం మరొకటి ద్రవ జీవామృతం. ఆవు పేడ, మూత్రం, పప్పుల పిండి,
బెల్లంతో ద్రవజీవామృతాన్ని ప్రతి 15 రోజులకోసారి తయారుచేసుకొని వాడుకోవాలి. మనజీవామృతాన్ని అనుకూలమైన
ఎండాకాలంలో తయారు చేసుకోవాలి. భూసారం పెంపుదలలో పశువుల ఎరువు, వర్మీకంపో స్టు లకు ఇది చక్కని
ప్రత్యామ్నాయం. ఘనజీవామృతాన్ని ఏటా ఎకరానికి 400 కిలోలు వేస్తే చాలు.
ద్రవజీవామృతం:
ఒక ఎకరం పంట పొ లానికి సరిపడా ద్రవజీవామృతం తయారీకి కావలసిన పదార్థా లు:
హింగువ ప్రశాంత్ గుప్తా 9030966647
1. దేశీ ఆవుపేడ 5-10 కేజీలు
2. దేశీ ఆవుమూత్రం 5-10 లీటర్లు
3. బెల్లం-4 కేజీలు లేదా చెరుకురసం - 2 లీటర్లు
4. పప్పుల (ద్విదళాల) పిండి-2 కేజీలు (శనగ, ఉలవ, పెసర, మినుము ఏదైనా వాడవచ్చు)
5. నీరు - 200 లీటర్లు
6. పుట్ట మన్ను లేదా పొ లంగట్టు మన్ను-దో సెడు
జీవామృతాన్ని తయారు చేసే విధానం మొదట డ్రమ్ములో 200 లీ. (సుమారు 15 బిందెలు) నీటిని తీసుకొని దానిలో
5-10 లీ. ఆవుమూత్రం తీసుకోవాలి, తరువాత 10 కేజీల ఆవుపేడను, 2 కేజీలు పప్పుదినుసుల పిండిని మరియు 4
కేజీల బెల్లంని కూడా డ్రమ్ములో వేసి కలుపుకోవాలి. పుట్ట మన్నుని గుప్పెడు కలుపుకోవాలి. ఈ పదార్థా లన్నింటినీ కలిపి
నీడలో 48 గంటల పాటు ఉంచాలి. ప్రతి రోజు రెండు, మూడు సార్లు కర్రతో కుడి వైపునకు తిప్పాలి.

ఇలా కలిపిన జీవామృతం 48 గంటల తర్వాత వాడకానికి సిద్ధమవుతుంది, అప్పట్నుంచి వారం రోజుల వరకు
సూక్ష్మజీవుల వృద్ధి అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో వాడుకుంటే మంచి ఫలితం వస్తు ంది.
జీవామృతం పంటలకు వాడే పద్ధ తులు :
హింగువ ప్రశాంత్ గుప్తా 90309 666 47
1. నీటి తడులతో పారించటం : నీటి తడులను అందించేటప్పుడు నీటితో పాటుగా జీవామృతాన్ని ఎకరాకు ఒక దఫా 200
లీటర్ల గ్రా చొప్పున అందించాలి. పంటల వివిధ దశల్లో 5 నుండి 6 సార్లు నీటితో పాటు పారించాలి.
2. జీవామృతం పిచికారీ పద్ధ తి : జీవామృతాన్ని బాగా వడగట్టి, నీటితో పాటుగా ఎకరాకు ఒక దఫాకు 200 లీటర్ల పంటల
వివిధ దశల్లో 3 నుంచి 4 సార్లు రైతులు పొ లాల్లో పిచికారీ చేయాలి.
3. డ్రిప్, స్ప్రింకర్ల ద్వారా జీవామృతం పారించటం: పండ్ల తోటలు, కూరగాయతోటలకు కొన్ని చోట్ల ఆరుతడి వరికి సైతం
జీవామృతాన్ని జాగ్రత్తగా వడకట్టి డ్రిప్ ద్వారా లేదా స్ప్రింకర్ల ద్వారా రైతులు అందించవచ్చు.
4. పైపాటుగా పంటలపై పో యటం: చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు లేదా పెరట్లో కూరగాయలు పండించుకునే
వారు పంటలపై మొదట్లో వేరు తడిచేలా జీవామృతాన్ని చెంబులు, మగ్గు లతో అందించవచ్చు.
3 నుండి 5 నెలల్లో (90 నుంచి 150 రోజుల్లో ) పూర్త య్యే పంటలకు ఎకరానికి
మొదటిసారి : (విత్త నం నాటిన 1 నెలకి) 10 లీటర్ల జీవామృతం, 200 లీటర్ల నీటితో పిచికారి చేయాలి.
రెండో సారి : (మొదటిసారి పిచికారి చేసిన 21 నుండి 30 రోజుల తర్వాత) 15 లీటర్ల జీవామృతం, 200 లీటర్ల నీటితో
పిచికారి చేయాలి.
మూడో సారి : (రెండో సారి పిచికారి చేసిన 21 నుండి 30 రోజుల తర్వాత) 20 లీటర్ల జీవామృతం, 200 లీటర్ల నీటితో
పిచికారి చేయాలి.
నాలుగోసారి: (మూడో సారి పిచికారి చేసిన 21 నుండి 30 రోజుల తర్వాత) 8 లీటర్ల మజ్జిగ +200గ్రా ములు హింగువ
-200 లీటర్ల నీటితోపిచికారి చేయాలి. చివరిసారి జీవామృతం అవసరం లేదు.
నాలుగు నుండి ఐదు నెలల పంటలకైతే
ఐదో సారి: (గింజ ఏర్పడుతున్నప్పుడు) 5 లీటర్ల మజ్జిగ+ 200గ్రా ములు హింగువ, 200 లీటర్ల నీటితో పిచికారి చేయాలి.
చివరిసారి జీవామృతం అవసరంలేదు.
—------------------------------------------------------
ఘనజీవామృతం:
తయారీకి కావాల్సిన పదార్థా లు :
1. దేశీ ఆవుపేడ(వారం రోజుల్లో సేకరించినది) -100 కేజీలు
2. దేశీ ఆవుమూత్రం - 5 లీటర్లు
3. బెల్లం-2 కేజీలు లేదా చెరకు రసం-4 లీటర్లు లేదా తాటిపండ్ల గుజ్జు తగినంత
4. పప్పుల (ద్విదళాల) పిండి-2 కేజీలు శనగ, ఉలవ, పెసర, మినుము ఏదైనా వాడవచ్చు.
5. పిడికెడు పుట్ట మట్టి లేదా రసాయనాలు తగలని పొ లం గట్టు మన్ను
90309 666 47 హింగువ ప్రశాంత్
తయారు చేసే విధానం:
చెట్టు నీడలో లేదా షెడ్డు లో ఈ పదార్థా లన్నిటినీ 100 కేజీలు బాగా చీకిన పశువుల పేడలో వేసి చేతితో బాగా కలిపి,
దానిపై 5 లీటర్లు ఆవుమూత్రా న్ని చల్లి, బాగా కలియబెట్టి కుప్పగా చేస,ి గోనెపట్టా కప్పాలి. 48 గంటలు గడచిన తర్వాత
దీన్ని పలుచగా చేసి ఆరబెట్టు కోవాలి. 10 రోజులు ఆరబెడితే ఘనజీవామృతం సిద్ధమవుతుంది. తయారు చేసిన వారం
రోజుల్లో పొ లంలో వెదజల్లి, దుక్కి దున్నవచ్చు. 'నిల్వ చేసుకొని తదనంతరం వాడుకోవాలనుకుంటే, పూర్తిగా ఆరిపో యిన
తరువాత గోనెసంచులలో నిల్వ చేసుకోవాలి. పంటలకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఇలా తయారుచేసిన
ఘనజీవామృతం 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఎకరానికి దుక్కిలో కనీసం 400 కిలోల ఘనజీవామృతం వేసుకోవాలి.
దానితోపాటు పైపాటుగా ఎకరానికి కనీసం మరో 200 కిలోలు వేసుకోగలిగితే మంచిది. ఇలా వేయటం వలన పంటలకు
పో షకాల లోపం లేకుండా మంచి దిగుబడులు పొ ందవచ్చు .
ప్రకృతి వ్యవసాయంలో ముందస్తు గా కషాయాలు మిశ్రమాలు వాడుకోవడం వల్ల సత్ ఫలితాలు రైతులు పొ ందుతారు.
చీడపీడ పురుగులు దాడి చేసిన తర్వాత ప్రకృతి వ్యవసాయం లో ఫలితాలు మద్యస్థ ంగా ఉంటాయి. హింగువ ప్రశాంత్
9030966647
తక్కువ ఖర్చుతో ప్రకృతి వ్యవసాయంలో తయారు చేసుకునే మిశ్రమంలు, కషాయాలు వలన రైతు దిగుబడి పెంచుకొని
పెట్టు బడి తగ్గించుకోవచ్చు .

You might also like