You are on page 1of 2

శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,

మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|

నోచిన వారికి – నోచిన వరము,

చూసిన వారికి – చూసిన ఫలము.||

శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,

మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|

స్వామిని పూజించే – చెచేతులే చేతులట,

ఆ మూర్తిని దర్శించే – కనులే కన్నులట;

తన కథ వింటే ఎవ్వరికయినా …

జన్మ తరించునటా…||1||

శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,

మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|

ఏ వేళ అయినా – ఏ శుభమైనా,

కొలిచే దైవం – ఈ దైవం;

అన్నవరం లో వెలసిన దైవం,

ప్రతి ఇంటికి దైవం.||2||

శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,

మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|

అర్చణ చేదామా – మనసు అర్పణ చేదామా,


స్వామిని మదిలోనే – కోవెల కడదామా;

పది కాలాలు పసుపు కుంకుమలు…

ఇమ్మని కొరేనా …||3||

శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,

మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|

మంగళమనరమ్మా – జయ మంగళమనరమ్మా,

కరములు జోడించి – శ్రీ నందనమలరించి;

మంగళమగు – శ్రీ సుందర మూర్తికి…

వందన మనరమ్మా… ||4||

శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,

మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|

నోచిన వారికి – నోచిన వరము,

చూసిన వారికి – చూసిన ఫలము.||

శ్రీ సత్యనారాయణ మీ సేవకు రారమ్మ,

మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ.|

You might also like