Professional Documents
Culture Documents
క్రీస్తు యొక్క శ్రమలు! - The suferings of Christ! - Real Conversion
క్రీస్తు యొక్క శ్రమలు! - The suferings of Christ! - Real Conversion
సిలువ వేయబడే ముందు రాత్రి ఆయన శ్రమలు మొదలయ్యాయి. ప్రభు రాత్రి భోజనము అయ్యే సరికి అర్ధరాత్రి
అయింది. యేసు శిష్యులను ఇంటి నుండి బయటికి తీసుకెళ్ళాడు. అంధకారంలో బయటికి వెళ్ళారు. వారు కెద్రో ను వాగు దాటి
ఒలీల కొండను సమీపించి, గెత్సమనే వనంలో అందకారంలోనికి ప్రవేశించాడు. ఎనిమిది మంది శిష్యులతో యేసు చెప్పాడు,
"నేను అక్కడికి వెళ్లి ప్రా ర్ధన చేసి వచ్చు వరకు, మీరిక్కడ కూర్చోండి" (మత్తయి 26:36). ఆయన పేతురు, యాకోబు మరియు
యోహానులను వనము లోపలి తీసుకెళ్ళాడు. క్రీస్తు వారిని అక్కడ విడిచి పెట్టి ఇంకా ముందుకు వెళ్లి, ఒలీవల చెట్టు క్రింద,
దేవునికి ఒంటరిగా ప్రా ర్ధించాడు.
ఇప్పుడు "క్రీస్తు యొక్క శ్రమలు" ఆరంభమయ్యాయి (I పేతురు 1:11). గమనించండి, మనవ హస్తము ఆయనను
ముట్టలేదు. గమనించండి, ఆయన అంధకారంలో గెత్సమనే వనంలో ఒలీవల చెట్టు క్రింద, ఆయనకు శ్రమలు
ప్రా రంభమయ్యాయి. అక్కడ, వనంలో, మానవాళి పాప భారము ఆయనపై మోపబడింది, దానిని ఆయన "ఆయన శరీరములో"
భరించాడు, ఉదయాన్న సిలువకు (I పేతురు 2:24). అప్పుడు యేసు చెప్పాడు,
ఈ ప్రా ర్ధనకు ఆధునిక తర్జు మా చెప్తుంది యేసు సిలువ నుండి విడిపింపబడడానికి అడుగుతున్నాడు అని. కాని ఆ
అభిప్రా యానికి విలువ ఇచ్చే లేఖనము నేను కనుగొనలేదు. నేను నమ్ముతాను డాక్టర్ జాన్ ఆర్. రైస్ మరియు డాక్టర్ జే. ఆలివర్
బస్ వెర్ సరియైన తర్జు మా ఇచ్చాడని. ఇద్దరు సువర్తికులు డాక్టర్ రైస్ వేదాంతి డాక్టర్ బస్ వెల్ అన్నాడు క్రీస్తు ప్రా ర్దన, "ఈ గిన్నె
నానుండి తొలగింపుము," అంటే మరణపు "గిన్నె" – పాప భారము క్రింద శ్రమ – గెత్సమనే వనంలో! యేసు దిగ్బ్రాంతిలో
ఉన్నాడు. ఆయన వనంలో చనిపోబోతున్నాడు. డాక్టర్ బస్ వెల్ అన్నాడు యేసు ప్రా ర్ధించాడు "వనంలో మరణము నుండి
విడుదల కొరకు, సిలువపై తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి" (J. Oliver Buswell, Ph.D., A Systematic Theology of
the Christian Religion, Zondervan, 1971, part III, p. 62). డాక్టర్ రైస్ అన్నాడు అదే విషయాన్ని ప్రస్తా విస్తూ , "ఆ
రాత్రి మరణపు గిన్నె తప్పిపోవాలని ప్రా ర్ధించాడు తద్వారా యేసు మరునాడు సిలువపై చనిపోవడానికి" (John R. Rice, D.D.,
Litt.D., The Gospel According to Matthew, Sword of the Lord Publications, 1980, p. 441).
"అసాధారణంగా ఆయన శరీరము బల పరచ బడకపోతే, క్రీస్తు తప్పని సరిగా ఆరాత్రి వనంలో చనిపోయి ఉండేవాడు" (రైస్,
ఐబిఐడి., పేజీ 442). మీ పాప భారము ఆయనను గెత్సమనేలో చంపేసి ఉండేది.
"ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రా ర్ధన చేయగా: ఆయన చెమట
నేలపడుతున్న గొప్ప రక్త బిందువుల వలే ఆయెను" (లూకా 22:44).
యేసు ఆ రాత్రి మన పాపాలు ఆయనపై మోపబడినప్పుడు భయంకర భయాన్ని అనుభవించాడు. ఆయన వేదన
ఎంత అధికంగా ఉందంటే చెమట "గొప్ప బిందువుల వలే" ఆయన చర్మము నుండి కారింది. ప్రవక్త అన్నాడు,
గెత్సమనేలో నొప్పి, శ్రమ, భయము ద్వారా వెళ్ళడానికి! ఆరాత్రి యేసు భరించిన ఆ భయంకర శ్రమను గూర్చి మనం ఎంత
తక్కువగా ఆలోచిస్తా ము! జోషఫ్ హార్ట్ అన్నాడు,
నేను తరుచు అనుకుంటాను గెత్సమనేలో, మొదటి శ్రమ చాల గొప్పది. మనవ హస్తము ఆయనను ఇంకా తాకలేదు.
కాని దేవునిచే నీ పాపము ఆయనపై మోపబడినప్పుడు ఆయన మనసు పగిలింది – ఆయన చర్మము నుండి రక్తము చెమట
బిందువుల వలే కారింది! విలియమ్ విలియమ్స్ అన్నాడు,
"క్రీస్తు యొక్క శ్రమలు" ప్రా రంభమయ్యాయి. ఇంకా చాలా జరుగ నున్నాయి. సైనికులు దివిటీలతో గెత్సమనే
వనమునకు వచ్చారు. అబద్ధపు అభియోగముతో వారు యేసును బంధించారు. వారు ప్రధాన యాజకునికి ఆయనను
అప్పగించారు.
గెత్సమనే వనంలో ఆయన చెమట రక్తము బిందువుల వలే కారుచుండగా, యేసు ముఖముపై కొట్టబడ్డా డు. తరువాత
ఆయన నలుగ గొట్టబడ్డా డు ఆయన శరీరము ఎముకలు కనబడే వరకు కొట్టబడినప్పుడు. తరువాత ముండ్ల కిరీటము క్రూ రంగా
ఆయన తలపై ఉంచబడింది, ఆయన కళ్ళ మీదుగా రక్తము కారునట్లు గా.
ఆయన అప్పటికే సగం చనిపోయాడు వారు ఆయనను సిలువ వేయడానికి తీసుకొని వెళ్ళేటప్పుడు,
వారు పెద్ద మేకులను ఆయన చేతులకు కాళ్ళకు కొట్టి, సిలువ మ్రా నుపై ఉంచారు. వారు సిలువను ఎత్తా రు యేసు
నొప్పితో శ్రమతో వేలాడుచున్నాడు. జోసెఫ్ హార్ట్ అన్నాడు,
దీనిని మన తలలు అర్ధము చేసుకోలేవు. లూథర్ అన్నాడు అది మానవ పదాలచే వివరింపబడనిదని. అంటే మనం దానిని
పూర్తిగా అర్ధము చేసుకోలేము, తండ్రీ కుమారుని నుండి తిరిగి పోవడం – మరియు యేసు మన పాపములకు వెల చెల్లించడానికి
ఒంటరిగా మాత్రమే చనిపోయాడు!
"క్రీస్తు ... అనీతిమంతుల కొరకు, నీతిమంతుడైన క్రీస్తు , మనలను దేవుని వద్దకు
తెచ్చుటకు ఒక్కసారే శ్రమపడెను..." (I పేతురు 3:18).
నీవు నీ పాప ఆరోపణ నుండి శిక్ష నుండి రక్షింప బడ గోరుచున్నావా? అప్పుడు నీవు సామాన్య విశ్వాసముతో యేసు
దగ్గరకు రావాలి. పరలోకములో దేవుని కుడి పార్శ్వమున ఉన్న ఆయన దగ్గరకు రా. నేను నిన్ను బతిమాలుచున్నాను, నా
హృదయము మనసు అంతటితో, ఇప్పుడే యేసు నొద్దకు రమ్ము! ఆయనలో విశ్రమించు. ఆయనను నమ్ము. ప్రతీ పాపాన్ని
ఆయన కడిగివేస్తా డు. ఆయన నీకు స్వచ్చమైన నివేదికలు ఇస్తా డు. కాలమంతటికి, నిత్యత్వానికి నీ ఆత్మను ఆయన రక్షిస్తా డు –
అంతము లేని లోకములో. నీవు! అవును, నీవే! నీవు నీ పాప ఆరోపణ నుండి శిక్ష నుండి "క్రీస్తు యొక్క శ్రమలచే" నీవు
రక్షింపబడగలవు (I పేతురు 1:11) యేసు నొద్దకు రమ్ము. ఆయన నీ పాపాన్ని కడిగి నీ ఆత్మను రక్షిస్తా డు. ఆమెన్.
సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net (mailto:rlhymersjr@sbcglobal.net) లేదా ఆయనకు
ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.
ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టు లకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.