You are on page 1of 3

వై.యస్.

ఆర్ ఆసరా పథకం:


గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ :
స్వయం సహాయక సంఘ అక్క చెల్లమ్మలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను
“ప్రజా సంకల్పయాత్ర ” లో చూసిచలించి పోయిన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి
ఉజ్యల భవిష్యత్ కోసం “వై.యస్.ఆర్ ఆసరా” పథకాన్ని ఈ ప్రభుత్వం యొక్క
ప్రధాన కార్యక్రమమైన “నవరత్నాల” లో చేర్చడం జరిగినది.

పథకం ముఖ్యమైన ఉద్దేశం:

ఈ పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగుయి, గ్రామీణ మరియు


పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళల యొక్క
ఆర్ధిక పురోగతికి దోహదపడుతుంది. ఈ ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం ద్వారా
అక్క చెల్లమ్మలు ఆర్థికంగా అభివృధి చెంది వారి కుటుంబాలు ఆనందంగా
ఉంటాలానే ఉద్దేశం తో ఈ పథకంను తీసుకొనిరావడం జరిగినది.
ఈ పథకం క్రింద ఎవరు అర్హులు :

వాణిజ్య మరియు సహకార బ్యాంకులలో ఋణం తీసుకొని తేది


11.04.2019 నాటికిఅప్పు నిల్వ ఉన్న అన్ని మహిళా స్వయం
సహాయక సంఘాలు ఈ పథకం లో అర్హులు.

తేది 11.04.2019 నాటికి అక్క చెల్లమ్మలకు ఉన్న పొదుపు


సంఘాల బ్యాంకు రుణాల అప్పు నిల్వ మొత్తం సొమ్మును 4
దఫాలుగా నేరుగా వారి సంఘం పొదపు ఖాతా లకు జమ
చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.

వై.యస్.ఆర్ ఆసరాక్రింద 4 విడతలుగా ఇవ్వబోవు మొతాన్ని


వివిధ కార్పొరేషన్ల్ ద్వారా (యస్.సి,యస్.టి,బిసి,ఈబిసి,కాప
ు,మైనారిటీ,క్రిస్టియన్) ఇవ్వడం జరుగుతుంది.
ఈ పథకం క్రింద అందించు మొత్తం :
 
ఈ పథకం కింద రాష్ట్రంలోని 7,91,257 పొదుపు సంఘాల్లో
ఉన్న 78,27,693 మంది అక్కచెల్లెమ్మలకు తేది 11.04.2019
నాటికి వారి సంఘాలలో ఉన్న అప్పు నిల్వ మొత్తం ర
ూ.25,383.49 కోట్ల నేరుగా నాలుగేళ్లలో అక్కచెల్లమ్మల
సంఘం పొదుపు ఖాతాల్లో జమచేయడం జరుగుతుంది.

మొదటి విడతగా రూ.6,345.87 కోట్ల రూపాయలను నేరుగా


సెప్టెంబర్ 11 వ తేది న మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. జగన్
మోహన్ రెడ్డి గారు అక్కచెల్లమ్మల సంఘాల పొదుపు ఖాతాలకు
జమ చేసే రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు ఈ రోజు.....

You might also like