You are on page 1of 2

 

ఒకనాడు నారదుడు, పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేదతీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు.

ఆ సమయంలో ఆ గ్రామంలో 4 వర్ణాల వారూ ఇళ్ళను గోమయం(ఆవుపేడ)తో అలికి, ముగ్గులు వేశారు. స్త్రీలందరూ

తలంటుస్నానం చేసి, కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి. 4 వర్ణాలవారు కలిసి ఒక చోట చేరి, లక్ష్మీదేవి

ప్రీతి కొరకు గానం చేస్తుండగా, వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో "మహర్షి!ప్రజలంతా కలిసి

ఇంత ఆనందంగా చేస్తు న్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతుహలంగా ఉంది. ఈ

పూజ గురించి వివరంగా తెలియపరచండి" అన్నారు. గురువారం చేసే ఈ పూజను లక్ష్మీపూజ అంటారు.

సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది. లక్ష్మీ దేవికి చాలా ప్రీతికరమైనది

అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. నారదుడు"మహనీయ, ఈ పూజను ఇంతక ముందు ఎవరినా చేశారా?

చేస్తే ఎవరు చేశారో, వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి "అనగా, పరాశరుడు కధ చెప్పడం మొదలుపెట్టా డు

ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణూపాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో "స్వామి ఈ రోజు మార్గశిర లక్ష్మీవారం.

ప్రజలు నా వ్రతం చేసే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసే వారిని అనుగ్రహిస్తా ను "అని

పలికింది. విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృతభూషితయై భూలోకానికి పయనమైంది లక్ష్మీ దేవి. ఒక ముసలి

బ్రహ్మణ స్ర్తీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ గ్రామంలో సంచరిస్తు న్న మహాలక్ష్మీదేవి ఆ

ఇంటిముందుకు వచ్చి "అవ్వా! ఈ రోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ. ఇల్లు గోమయంతో అలికి

ముగ్గుపెట్టలేదేంటి?" అన్నది. అప్పుడు ఆ ముసలి స్త్రీ "అమ్మా! ఆ వ్రతం ఏమిటి? ఏలా చేయాలి? నువ్వు చెబితే

నేను కూడా చేస్తా ను" అని అడుగగా మహలక్ష్మీ మందహాసంతో ఈ విధంగా పలికింది "మార్గశిర గురువారం

ఉదయమే నిద్రలేచి, ఇల్లు గోమయంతో అలికి, ముగ్గులు  పెట్టి, లక్ష్మీ దేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి. కొత్త

కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టా లి. దాన్ని వివిధరకాలైన ముగ్గులతో, బొమ్మలతో అందంగా తయారుచేయాలి.

శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకుని, దానిమీద కొత్త ధాన్యం పోయాలి. దాని మీద కొలతపాత్రను ఉంచి,

పసుపునీటితో కడిగిన పోకచెక్క(వక్క)ను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి. దానిని కడిగి మనసులో

కోరికను చెప్పుకుని, కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలతపాత్ర మీద పోయాలి. ఎరుపురంగు వస్త్రా న్ని దాని మీద ఉంచి ,
ఎర్రని పూలతో పూజించి శ్రీమహాలక్ష్మిని తలచుకుని దీపారాధన చేయాలి. మొదటపాలు నైవేధ్యంగా పెట్టా లి.

తరువాత నూనె వాడకుండా, నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవెధ్యంగా పెట్టా లి. ఇది ఒక విధానం".

లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పడం మొదలుపెట్టింది."రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల

దశమి తిధి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్నే చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రత నైవెధ్యం

పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మికటాక్షం లభించదు. మనసును నిర్మలంగా ఉంచుకుని, పదిమందిని పిలిచి ఈ వ్రతం

చేయాలి, పసుపుకుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది.

You might also like