You are on page 1of 26

AJARUDDIN GK GROUPS

భారత విభజన

📚 APPSC, TSPSC RRB,SI, కానిస్టేబుల్ ఉద్యోగాల

📚
కోసం వాట్సాప్, టెలిగ్రా మ్, ఫేస్బుక్ గ్రూ ప్స్ లో జాయిన్
అవ్వండి .

🗞️ 📚
📖 📝
డైలీ న్యూస్ పేపర్స్ ,మెటీరియల్స్ ,కరెంట్

👇👇👇👇👇👇👇👇
అఫైర్స్ ,జాబ్ నోటిఫికేషన్.
1.వాట్సప్ లింకు(మెటీరియల్స్+కరెంట్ అఫైర్స్+న్యూస్

👇
పేపర్స్)(ఏదో ఒక వాట్సప్ గ్రూ పులో మాత్రమే జాయిన్
అవ్వండి)
గ్రూ పులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ Click
చేయండి
గ్రూ పులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ Click
చేయండి
గ్రూ పులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ Click
చేయండి

👇
2.టెలిగ్రా మ్ లింక్(3,000 మెటీరియల్ అప్లో డ్
చేశాము)
గ్రూ పులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ Click
చేయండి

👇
3.ఫేస్బుక్ లింకు(దేశంలో విడుదలవుతున్న మొత్త ం
నోటిఫికేషన్ల కోసం)
గ్రూ పులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ Click
చేయండి

👇
4.GET LIVE JOBS (కేవలం ఉద్యోగ నోటిఫికేషన్ల
కోసం)
గ్రూ పులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ Click
చేయండి
5. ఉద్యోగ నోటిఫికేషన్లు , ఆన్లైన్ ఫ్రీ ఎగ్జా మ్స్, కరెంట్

👇
అఫైర్స్, ఆరోగ్యానికి సంబంధించిన సూత్రా లు, A to Z
మెటీరియల్స్ కోసం వెబ్సైటు
https://www.prudhviinfo.com/

◎ ══════ ❈ ══════ ◎
1947 లో యునైటెడ్ కింగ్‌డమ్ పార్ల మెంటు చేసిన చట్ట ం ద్వారా బ్రిటిషు భారతదేశాన్నిభారతదేశం,
పాకిస్థా న్‌అనే రెండు రెండు స్వతంత్ర అధినివేశ రాజ్యాలుగా విభజించడాన్ని భారత విభజన
అంటారు.ఆనాటి భారతదేశం నేడు భారత రిపబ్లి క్ గాను, ఆనాటి పాకిస్తా న్ నేడు ఇస్లా మిక్ రిపబ్లి క్ ఆఫ్
పాకిస్తా న్, పీపుల్స్ రిపబ్లి క్ ఆఫ్ బంగ్లా దేశ్ లు గానూ ఉనికిలో ఉన్నాయి. ఈ విభజనలో బెంగాల్, పంజాబ్
అనే రెండు రాష్ట్రా లను ఆ రాష్ట్రా ల్లో జిల్లా వారీగా ఉన్న ముస్లిం, ముస్లిమేతర ప్రజల మెజారిటీల ఆధారంగా
విభజించారు. దేశ విభజనతో పాటు బ్రిటిషు ఇండియన్ ఆర్మీ, రాయల్ ఇండియన్ నేవీ, ఇండియన్ సివిల్
సర్వీస్, రైల్వే, సెంట్రల్ ట్రెజరీల విభజన కూడా జరిగింది. ఈ విభజనను భారత స్వాతంత్ర్య చట్ట ం 1947లో
వివరించారు. దీని ఫలితంగా బ్రిటిషు రాజ్ లేదా భారతదేశంలో బ్రిటిషు పాలన రద్దైపో యింది. భారతదేశం,
పాకిస్తా న్ అనే రెండు స్వయంపరిపాలక దేశాలు 1947 ఆగస్టు 15 న అర్ధ రాత్రి చట్ట బద్ధ ంగా ఉనికిలోకి
వచ్చాయి.

భారత విభజన

1909 లో బ్రిటిష్ ఇండియా సామ్రా జ్యం. బ్రిటిష్ ఇండియా గులాబి రంగు లోను, సంస్థా నాలు పసుపు రంగు
లోనూ ఉన్నాయి
తేదీ
1947 ఆగస్టు

ప్రదేశం
బ్రిటిషు ఇండియా, భారత దేశం, పాకిస్తా న్

ఫలితం
బ్రిటిషు ఇండియా సామ్రా జ్యాన్ని భారతదేశం, పాకిస్తా న్ అనే రెండు స్వతంత్ర డొ మినియన్లు గా విభజన,
కాందిశీకుల సమస్య

మరణాలు
2,00,000 నుండి 20 లక్షల దాకా,

1901 భారత జనగణన ప్రకారం బ్రిటిషు ఇండియా సామ్రా జ్యంలో మతాలు


ఈ విభజనలో 1 - 1.2 కోట్ల మంది ప్రజలు మత ప్రా తిపదికన కాందిశీకులయ్యారు. కొత్త గా ఏర్పడిన
దేశాల్లో పెద్దయెత్తు న శరణార్థు ల సంక్షోభం ఏర్పడింది. పెద్ద ఎత్తు న హింస జరిగింది. విభజన సమయం
లోను, అంతకుముందూ జరిగిన ప్రా ణనష్ట ం అంచనాలు వివాదాస్పదంగా ఉన్నాయి. రెండు లక్షల నుండి
ఇరవై లక్షల దాకా ఈ అంచనాలు ఉన్నాయి.
విభజన లోని హింసాత్మక స్వభావం భారత పాకిస్తా న్ల మధ్య శత్రు త్వానికి, అనుమానాల వాతావరణానికీ
కారణమైంది. ఇప్పటికీ ఇది వాటి సంబంధాలను దెబ్బతీస్తూ నే ఉంది.

1971 లో పాకిస్తా న్ నుండి బంగ్లా దేశ్ విడిపో వడాన్ని లేదా బ్రిటిషు ఇండియా పరిపాలన నుండి బర్మా
(ఇప్పుడు మయన్మార్ ), సిలోన్ (ఇప్పుడు శ్రీలంక ) లు విడిపో వడం భారతదేశ విభజనలో భాగం కాదు.
రాచరిక సంస్థా నాలు భారత పాకిస్తా న్ల లో విలీనమవడం, లేదా విలీనానికి సంబంధించి హైదరాబాద్,
జునాగఢ్, జమ్మూ కాశ్మీర్ రాజ్యాల్లో తలెత్తి న వివాదాలు కూడా విభజనలో భాగం కాదు. 1947–1954
కాలంలో ఫ్రెంచ్ భారతదేశం లోని ప్రా ంతాలను భారతదేశంలో కలపడం లేదా 1961 లో గోవానూ, పో ర్చుగీస్
భారతదేశంలోని ఇతర జిల్లా లనూ భారతదేశం చేజిక్కించుకోవడం కూడా ఈ విభజనలో భాగం కావు.
1947 లో ఈ ప్రా ంతంలోని ఇతర సమకాలీన రాజకీయ ప్రా ంతాలైన సిక్కిం, భూటాన్, నేపాల్, మాల్దీవులు
కూడా ఈ విభజన ద్వారా ప్రభావితం కాలేదు.

రాచరిక సంస్థా నాల్లో , పాలకుల ప్రమేయంతో గానీ, పాలకులు అసలు పట్టించుకోక పో వడం ద్వారా గానీ
వ్యవస్థీకృతమైన హింస జరిగింది. సిక్కు రాష్ట్రా ల్లో (జింద్, కపూర్త లా మినహా) ముస్లింల ఏరివేత
జరుగుతూంటే అక్కడీ సంస్థా నాధీశులు పట్టించుకోకుండా ఉండిపో యారు. పాటియాలా, ఫరీద్క ‌ ోట్,
భరత్‌పూర్ వంటి ఇతర సంస్థా నాధీశులు ఈ అల్ల ర్లు చేయించడంలో భారీ ఎత్తు న పాల్గొ న్నారని
భావిస్తు న్నారు. భరత్‌పూర్ పాలకుడు, జాతి పేరిట తన ప్రజల ఏరివేత జరుగుతోంటే సాక్షిగా ఉన్నాడు -
ముఖ్యంగా డీగ్ వంటి చోట్ల.

నేపథ్యం

ముస్లింలీగ్, దాని నాయకుడు మహమ్మద్ అలీ జిన్నాల ప్రధాన నినాదమైన ద్విజాతి సిద్ధా ంతం, బ్రిటిషు
ప్రభుత్వపు విభజించి పాలించు అన్న పాలనా సిద్ధా ంతం వంటివి భారత విభజనకు ముఖ్య నేపథ్యం.
రామచంద్ర గుహ వంటి చరితక ్ర ారులు ఈ రెంటికి తోడు - కాంగ్రెసు ముఖ్యనేతలైన మహాత్మా గాంధీ,
జవహర్ లాల్ నెహ్రూ తదితరులు 1920ల్లో నూ, 30ల్లో నూ రాజకీయంగా మహమ్మద్ అలీ జిన్నాను,
ముస్లిం లీగ్ ను తక్కువ అంచనా వేసి రాజకీయ చర్చల్లో పట్టు విడుపుల ధో రణి కనబరచక పో వడం కూడా
భారత విభజనను ఇష్ట పడనివారు చూపించే కారణమని చెప్తా డు.

బెంగాల్ విభజన (1905), ముస్లింలీగ్ ఏర్పాటు


1905లో లార్డ్ కర్జ న్ ప్రభుత్వం బెంగాల్‌ను విభజించింది. దీనిలో భాగంగా ఉమ్మడి బెంగాల్ ప్రా విన్సులో
ముస్లిములు ఎక్కువ సంఖ్యలో ఉన్న తూర్పుభాగాన్నీ (చాలాభాగం ప్రస్తు త బంగ్లా దేశ్, ప్రస్తు త అస్సాంల్లో
ఉన్నాయి), హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్న పశ్చిమ భాగాన్నీ (ప్రస్తు తం ప్రధానంగా పశ్చిమ
బెంగాల్, ఒడిషా, ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రా ల్లో విస్త రించి ఉంది) విభజించి తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్
ఏర్పాటుచేశారు. పశ్చిమ ప్రా ంతాల్లో అధికంగా నివసించే హిందూ జమీందారులు తూర్పు ప్రా ంతాల్లో ని తమ
భూములను అక్కడి ముస్లిం రైతులకు కౌలుకు ఇచ్చేవారు, అలానే పశ్చిమ ప్రా ంతంలో మెజారిటీ బెంగాలీ
హిందువులను బీహారీల సంఖ్య డామినేట్ చేసేలా విభజన జరిగిందని, ఇది తమ రాజకీయ చైతన్యానికి
బ్రిటిషు వారు విధించిన శిక్షగా వారు భావించారు. దీనికి వ్యతిరేకంగా బెంగాలీలు - ప్రధానంగా పశ్చిమ
బెంగాల్లో ని హిందువులు - వందేమాతరం ఉద్యమాన్ని చేపట్టా రు. విభజన జరిగిన ఐదేళ్ళ అనంతరం
ఉద్యమం కారణంగానూ, పరిపాలనా సరళీకరణలో భాగంగానూ బెంగాల్ పునరేకీకరణ జరిగింది. ఐతే
ముస్లిం సంపన్నులు, విద్యావంతులూ ముస్లిములకు ప్రత్యేక నియోజకవర్గా లు (ప్రతి నియోజకవర్గా నికి
జనరల్, ముస్లిం అన్న రెండు స్థా నాలను ఏర్పరిచి ముస్లింలు ముస్లిం స్థా నాలకే ప్రత్యేకంగా ఓటు చేసే
విధానం) కావాలన్న డిమాండ్ ను 1906లో అప్పటి కొత్త వైస్రా య్ లార్డ్ మింటో ముందుంచారు.
మరోవైపు, పూర్వం తమకు రాజరికం ఉండడం, బ్రిటిషు రాజ్యానికి సహకరించడం వంటి కారణాలతో
తమకు మరింత ఎక్కువ ప్రా తినిధ్యాన్ని చట్ట సభల్లో కల్పించాలని కోరారు. ముస్లిముల ఈ ఆకాంక్షల్ని
రాజకీయంగా వారి మద్ద తు ఆశిస్తు న్న బ్రిటిషు ప్రభుత్వం ప్రో త్సహిస్తూ ండడంతో 1906లో ఢాకాలో అఖిల
భారత ముస్లింలీగ్ పక్షాన్ని ఏర్పాటుచేశారు.

విభజించి పాలించు సిద్ధా ంతం

ముస్లిం సంపన్నులు, విద్యావంతులను ప్రతిబింబించే ముస్లింలీగ్ బెంగాల్ విభజనకు అనుకూల


దృక్పథాన్ని స్వీకరించింది. నిజానికి 1871 జనాభా లెక్కల్లో మొదటిసారిగా మత ప్రా తిపదికన జనాభాను
లెక్కించినప్పటి నుంచి ఉద్రిక్తతలు ఏర్పడుతూనే ఉన్నాయి. 1857లో భారత ముస్లింలు బ్రిటిషు
సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా పో రాడిన నాటి నుంచి ఎలాగైనా వారిని బ్రిటిషు సామ్రా జ్యానికి
అనుకూలురుగా చేయాలని చేసిన ప్రయత్నాలు బెంగాల్ విభజనతో వాస్త వరూపం దాల్చినట్ట యింది. 19వ
శతాబ్ది చివరి భాగంలో హిందువులకు అధికారంలో మరింత భాగస్వామ్యం లభిస్తూ ండడం, ఆపైన
హిందీ-ఉర్దూ వివాదం చెలరేగడం, గోవధ వ్యతిరేకోద్యమాలు జరగడం వంటి వాటితో ఉత్త రప్రదేశ్
ముస్లిముల్లో భయాలు, రాజకీయ ఆకాంక్షలూ ప్రబలమయ్యాయి. 1905లో బెంగాల్ విభజనకు
వ్యతిరేకంగా ఉద్యమకారులు (ప్రధానంగా హిందువులు) వందేమాతరం నినాదాన్ని చేపట్ట డంతో ఆ నినాదం
ఉన్న పద్యం హిందూ ముస్లిం వివాదాలకు సంబంధించిన ఆనంద్ మఠ్ నవలలోదన్న విషయాన్ని
రాజకీయ నాయకులు బయటకు తీశారు. ఢాకా నవాబ్ ఖ్వాజా సలీముల్లా వంటివారి రాజకీయ ఆకాంక్షలు
కూడా వీటికి తోడయ్యాయి. కాంగ్రెసు బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ ండగా సలీముల్లా తూర్పు బెంగాల్,
అస్సాం ప్రా ంతాల్లో విభజనకు అనూకూలంగా సభలు, సమావేశాలు నిర్వహించారు.

లక్నో ఒప్పందం
1911లో వందేమాతరం ఉద్యమం ఫలితంగా బ్రిటిషు ఇండియా ప్రభుత్వం బెంగాల్ ను తిరిగి ఏకీకరించడం
ముస్లిం లీగ్ లోనూ, ఆ పార్టీ నాయకత్వంలోనూ బ్రిటిషు ప్రభుత్వంపై అపనమ్మకాన్ని ఏర్పరిచింది. టర్కీ,
జర్మనీలకు వ్యతిరేకంగా పో రాడిన దేశాల్లో బ్రిటన్ కూడా ఉంది. తరచుగా మక్కా, మదీనా, జెరూసలేం
వంటి ముస్లిం పవిత్ర స్థ లాల రక్షణ బాధ్యతను ప్రకటించుకుంటూండే టర్కీ సుల్తా న్ లేదా ఖలీఫా మొదటి
ప్రపంచయుద్ధ ంలో బ్రిటిషు వారికి వ్యతిరేకంగా పో రాడడం కూడా కారణమయింది. బ్రిటన్, దాని
మిత్రరాజ్యాలు టర్కీతో యుద్ధ ం సాగిస్తు ండడంతో అప్పటికే బెంగాల్ పునరేకీకరణ సమయంలో ఏర్పడ్డ
అపనమ్మకాలు ధ్రు వపడి, బ్రిటిషు ప్రభుత్వం మతపరమైన తటస్థ వైఖరి అవలంబించట్లేదని ముస్లిం లీగ్
భావించింది.

మరోవైపు మొదటి ప్రపంచ యుద్ధ ంలో భారీ సంఖ్యలో భారతీయ సైనికులు బ్రిటన్ పక్షాన పాల్గొ నడం,
బ్రిటన్ విజయానంతరం ప్రపంచవ్యాప్త ంగా నానాజాతి సమితిలోనూ, వింటర్ ఒలింపిక్స్ లోనూ బ్రిటిషు
ఇండియాను ఒక రాజ్యంగా గుర్తించడం వంటి పరిణామాలు జరిగాయి. ఈ నేపథ్యంలో భారత జాతీయ
కాంగ్రెసు జాతీయోద్యమాన్ని మరింత విస్త ృతపరిచి స్వయం పరిపాలన కోసం డిమాండ్ ను తీవ్రతరం
చేయడం ప్రా రంభించింది. 1916లో లక్నోలో జరిగిన కాంగ్రెసు సమావేశాలు ముస్లింలీగ్, కాంగ్రెసు పరస్పర
సహకారం అనే అనూహ్య పరిణామానికి తెరతీసింది. కొందరు ముస్లింలీగ్ నాయకులు వ్యతిరేకించిన
ప్రధానంగా లీగ్ లోని యువతరం ఈ లక్నో ఒప్పందానికి మద్ద తు తెలిపింది. ప్రధానంగా యునైటెడ్
ప్రా విన్సుకు చెందిన అలీ సో దరులుగా ప్రఖ్యాతులైన మౌలానా మహమ్మద్ అలీ, మౌలానా షౌకత్ అలీలు,
వారి యువ అనుచరులు దీన్ని సాధ్యపరచేందుకు లీగ్ పరంగా కృషిచేశారు. ఈ ఒప్పందాన్ని అప్పటికి
యువ న్యాయవాది, తర్వాతికాలంలో భారత జాతీయోద్యమంలోనూ, లీగ్ లోనూ, పాకిస్తా న్ ఏర్పాటు
ఉద్యమంలోనూ కీలక స్థా నం పొ ందిన జిన్నా సమర్థించాడు.

ఈ ఒప్పందం ప్రకారం భారత జాతీయోద్యమానికి ముస్లింలీగ్ సహకరించడం, ఇంపీరియల్ లెజిస్లేటివ్


కౌన్సిల్లో నే కాక, ప్రొ విన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా మతపరమైన ప్రత్యేక నియోజకవర్గా లను
ముస్లింలకు ఇచ్చేలా అంగీకరించారు. ఏర్పడిన కొన్నేళ్ళకు ఒప్పందం పూర్తి స్వభావం బయటపడింది -
ఇది అప్పటికే మెజారిటీతో ఉండి ఎలాగూ గెలిచే పంజాబ్, తూర్పు బెంగాల్ ముస్లిములకు ప్రయోజనం
లేకపో గా యునైటెడ్ ప్రా విన్స్, బొ ంబాయి, మద్రా స్ వంటి ప్రా విన్సుల్లో మైనారిటీలుగా ఉన్న ముస్లిములకు
మాత్రం రాజకీయంగా ప్రయోజనకరం.

మాంటేగు-చెమ్స్‌ఫో ర్డ్ సంస్కరణలు: 1919


మునుపటి శీతాకాలంలో భారతదేశంలో చేసిన సుదీర్ఘమైన నిజనిర్ధా రణ పర్యటన తరువాత భారత
వ్యవహారాల కార్యదర్శి మోంటేగు, వైస్రా య్ లార్డ్ చెమ్స్ఫ ‌ ో ర్డ్ లు 1918 జూలైలో తమ నివేదికను
సమర్పించారు.[9] బ్రిటన్లో ప్రభుత్వం, పార్ల మెంటు దీనిపై చర్చించింది. భవిష్యత్ ఎన్నికలలో భారత
జనాభాలో ఎవరెవరు ఓటు వేయవచ్చో గుర్తించడానికి ఫ్రా ంచైజ్ అండ్ ఫంక్షన్స్ కమిటీ మరో పర్యటన
చేసింది. ఆ తరువాత, 1919 డిసెంబరులో భారత ప్రభుత్వ చట్ట ం 1919 (దీనిని మోంటేగు-చెమ్స్ఫ ‌ ో ర్డ్
సంస్కరణలు అని కూడా పిలుస్తా రు) ని బ్రిటను పార్ల మెంటు ఆమోదించింది.[9] కొత్త చట్ట ం ప్రా ంతీయ,
ఇంపీరియల్ శాసనమండళ్ళు రెండింటినీ విస్త రించింది. సభలో ఓటింగులో వ్యతిరేకంగా ఫలితం వచ్చిన
సందర్భంలో బ్రిటిషు భారత ప్రభుత్వం దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఉన్న "అధికారిక
మెజారిట"ీ పద్ధ తిని రద్దు చేసింది.[9] రక్షణ, విదేశీ వ్యవహారాలు, క్రిమినల్ లా, కమ్యూనికేషన్స్,
ఆదాయపు పన్ను వంటి విభాగాలను వైస్రా య్, కేంద్ర ప్రభుత్వాలు నిలుపుకున్నప్పటిక,ీ ప్రజారోగ్యం, విద్య,
భూమి-రాబడి, స్థా నిక స్వపరిపాలన వంటి ఇతర విభాగాలను రాష్ట్రా లకు బదిలీ చేసారు.[9] ప్రా దేశిక
ప్రభుత్వాలు ఇప్పుడు ద్వంద్వ ప్రభుత్వ పద్ధ తిలో ఉంటాయి. నీటి పారుదల, విద్య, వ్యవసాయం, మౌలిక
సదుపాయాల అభివృద్ధి, స్థా నిక స్వయం పరిపాలన వంటి కొన్ని అంశాలు భారతీయ మంత్రు లు,
అంతిమంగా భారతీయ ఓటర్ల చేతిలో ఉండగా, భూమి-శిస్తు , పో లీసులు, జైళ్లు , మీడియా నియంత్రణలు
బ్రిటిషు గవర్నరు, అతని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పరిధిలో ఉంటాయి.[9] కొత్త చట్ట ం వలన భారతీయులు,
సివిల్ సర్వీసులోను ఆర్మీ ఆఫీసర్ కార్ప్స్ లోనూ చేరడం సులభతరమైంది.

ఇప్పుడు మరింత మంది భారతీయులకు వోటు హక్కు వచ్చింది. అయితే, జాతీయ స్థా యిలో ఓటు
వేయడానికి, మొత్త ం వయోజన పురుష జనాభాలో 10% మాత్రమే హక్కు ఉంది. వీరిలో చాలామంది
నిరక్షరాస్యులు.[9] ప్రా ంతీయ శాసనసభలలో, బ్రిటిషు వారు తమకు సహకరించే, లేదా తామకు
ఉపయోగపడే అంశాల కోసం సీట్లను కేటాయించడం ద్వారా కొంత నియంత్రణను అట్టిపెట్టు కున్నారు.
ముఖ్యంగా, బ్రిటిషు పాలన పట్ల సానుభూతిగా ఉంటూ, పెద్దగా ఘర్షణ పడని గ్రా మీణ అభ్యర్థు లకు, పట్ట ణ
అభ్యర్థు ల కంటే ఎక్కువ సీట్లు కేటాయించారు.[9] బ్రా హ్మణేతరులు, భూ యజమానులు, వ్యాపారవేత్తలు,
కళాశాల గ్రా డ్యుయేట్లకు కూడా సీట్లు కేటాయించారు. మింటో-మోర్లే సంస్కరణల అంతర్భాగంగాను,
ఇటీవలి కాంగ్రెస్-ముస్లిం లీగ్ లక్నో ఒప్పందంలోనూ ఉన్న "మత ప్రా తినిధ్యా"న్ని పునరుద్ఘా టించారు.
ముస్లింలు, సిక్కులు, భారతీయ క్రైస్తవులు, ఆంగ్లో -ఇండియన్లు , ఇక్కడ స్థిరపడ్డ యూరోపియన్ల కూ
ప్రా విన్షియల్ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్‌లో సీట్లు కేటాయించారు.[9] మోంటేగు-చెమ్స్ఫ
‌ ో ర్డ్
సంస్కరణలు భారతీయులకు శాసన అధికారాన్ని వినియోగించుకోవడానికి అత్యంత ముఖ్యమైన
అవకాశాన్ని కలిగించాయి -ముఖ్యంగా ప్రా ంతీయ స్థా యిలో; అయితే, అర్హతగల ఓటర్ల సంఖ్య ఇంకా
తక్కువగానే ఉండడం, ప్రా ంతీయ శాసనసభలకు ఉన్న చిన్న చిన్న బడ్జెట్లు , బ్రిటిషు నియంత్రణ సాధనంగా
భావించే గ్రా మీణ సీట్ల వలన ఆ అవకాశం పరిమితమై పో యింది.

రెండు దేశాల సిద్ధా ంతం

భారత ఉపఖండంలోని ముస్లింల ప్రా థమిక గుర్తింపు, వారిని ఐక్యపరచే అంశం వారి భాష కాదు, జాతీ
కాదు - వారి మతం. అదే రెండు దేశాల సిద్ధా ంతానికి ప్రా తిపదిక. అందువల్ల హిందువులు, ముస్లింలు
సామాన్యతలతో సంబంధం లేకుండా రెండు విభిన్న దేశాల్లా ంటి వారు. పాకిస్తా న్ ఉద్యమానికీ (అంటే
దక్షిణాసియాలో ఒక ముస్లిం దేశంగా ఉండడం అనే భావజాలం) 1947 లో భారతదేశ విభజనకూ రెండు
దేశాల సిద్ధా ంతమే మూల సూత్రం.

భారతీయ ముస్లింల జాతీయతను నిర్వచించేది మతమే అనే భావజాలాన్ని ముహమ్మద్ అలీ జిన్నా
చేపట్టా డు. దీనిని, పాకిస్తా న్ ఏర్పాటు కోసం ముస్లింలకు మేల్కొలుపు అని పేర్కొన్నాడు. ఈ భావజాలమే -
భారత ముస్లిములు విదేశీయులని, రెండవ తరగతి పౌరులని, భారతదేశం నుండి ముస్లింలను
బహిష్కరించడం, హిందూ దేశ స్థా పన, ఇస్లా ం మతంలోకి మారడాన్ని నిషేధించడం, భారతీయ
ముస్లింలను హిందూ మతంలోకి మార్చడం లేదా తిరిగి మార్చడాన్ని ప్రో త్సహించడం వంటి ఆలోచనలు
పలు హిందూ జాతీయవాద సంస్థ ల్లో రేకెత్తడానికి కారణమైంది.

ముస్లిం, ముస్లిమేతర జనాభా ప్రా తిపదికన భారతదేశాన్ని విభజించాలని డిమాండ్ చేసిన మొదటి
వ్యక్తు లలో హిందూ మహాసభ నాయకుడు లాలా లజపత్ రాయ్ ఒకడు. అతను 1924 డిసెంబరు 14 లో
ది ట్రిబ్యూన్ పత్రికలో రాశాడు:

నా పథకం ప్రకారం ముస్లింలకు నాలుగు ముస్లిం రాష్ట్రా లు ఉంటాయి: (1) పఠాన్ ప్రా విన్స్ లేదా వాయువ్య
సరిహద్దు ; (2) పశ్చిమ పంజాబ్ (3) సింధ్ (4) తూర్పు బెంగాల్. భారతదేశం లోని మరే ఇతర
ప్రా ంతంలోనైనా చిన్న ముస్లిం సమాజం ఉంటే, అది ఒక ప్రా విన్స్ ఏర్పడటానికి సరిపడేంత పెద్దదైత,ే వారిని
కూడా అదేవిధంగా ఏర్పరచాలి. అయితే ఇది ఐక్య భారతదేశం కాదని స్పష్ట ంగా అర్థ ం చేసుకోవాలి. అంటే
ముస్లిం భారతదేశం, ముస్లిమేతర భారతదేశంగా భారతదేశాన్ని స్పష్ట ంగా విభజించడం.[12]

రెండు జాతీయతా సిద్ధా ంతాలు ఒక భూభాగంలో సహజీవనం చేయగలవా లేదా అనే దానిపై ఆధారపడి,
రెండు దేశాల సిద్ధా ంతానికి భిన్నమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. వీటికి భిన్నమైన పర్యవసానాలున్నాయి.
భారత ఉపఖండంలోని ముస్లిం-మెజారిటీ ప్రా ంతాలకు విడిపో యే హక్కుతో సహా సార్వభౌమ
స్వయంప్రతిపత్తి ఉండాలని ఒక వ్యాఖ్యానం చెప్పింది. ఇందులో జనాభా బదిలీ ఉండదు (అంటే
హిందువులు ముస్లింలు కలిసి జీవించడం కొనసాగుతుంది). హిందూ ముస్లింలవి "రెండు విభిన్నమైన,
విరుద్ధ మైన జీవన విధానాలు. అందువల్ల వారు ఒకే దేశంలో సహజీవనం చేయలేరు" అని మరో
వ్యాఖ్యానం చెప్పింది. ఈ ఆలోచనలో, జనాభా బదిలీ (అనగా, ముస్లిం-మెజారిటీ ప్రా ంతాల నుండి
హిందువులను మొత్త ం తొలగించడం, హిందూ-మెజారిటీ ప్రా ంతాల నుండి ముస్లింలను మొత్త ం
తొలగించడం) అనేద,ి "సామరస్యంగా సహజీవనం చేయలేని" రెండు అననుకూల దేశాలను పూర్తిగా
వేరుచేయడానికి ఆవశ్యకమైన చర్య"

ఈ సిద్ధా ంతానికి వ్యతిరేకత రెండు మూలాల నుండి వచ్చింది. మొదటిది అఖండ భారత దేశం అనే భావన.
అందులో హిందువులు ముస్లింలు రెండు ఒకరితో ఒకరు ముడిపడి ఉంటారు. ఇది ఆధునిక, అధికారికంగా
లౌకిక, భారత గణతంత్రా నికి మూల సూత్రం. పాకిస్తా న్ ఏర్పడిన తరువాత కూడా, ముస్లింలు హిందువులు
విభిన్న జాతీయులా కాదా అనే చర్చ ఆ దేశంలో కూడా జరుగుతోంది. వ్యతిరేకతకు రెండవ మూలం
ఏమిటంటే, భారతీయులు ఒక దేశం కానట్లే, ఉపఖండంలోని ముస్లింలూ హిందువులూ కూడా ఒక దేశం
కాదు. ఉపఖండంలోని సజాతీయ ప్రా ంతీయ భూభాగాలే నిజమైన దేశాలవుతాయి. ఇవే
సార్వభౌమత్వానికి అర్హమైనవి; పాకిస్తా న్ లోని బలూచ్, సింధి, పష్తూ న్‌లు భారత్ లోని అస్సామీ [13]
పంజాబీ [14] ఉప జాతీయులు దీనికి ఉదాహరణలు.

ముస్లిం మాతృభూమి, ప్రా ంతీయ ఎన్నికలు, రెండవ ప్రపంచ యుద్ధ ం, లాహో ర్ తీర్మానం:
1930-1945

1940 లో కాంగస
్రె ు రామ్‌గఢ్ సమావేశంలో జవహర్‌లాల్ నెహ్రూ , సరోజిని నాయుడు, ఖాన్ అబ్దు ల్ గఫర్
ఖాన్, మౌలానా ఆజాద్ పాల్గొ న్నారు, ఇందులో ఆజాద్ రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు

అఖిల భారత ముస్లిం లీగ్ యొక్క 1940 లాహో ర్ తీర్మానాన్ని జిన్నా (కుడి) అధ్యక్షత వహించి,
లియాఖత్ అలీ ఖాన్ మధ్యలో చౌదరి ఖాలిక్జ్జామన్ (ఎడమ)
1933 లో చౌదరి రహమత్ అలీ నౌ ఆర్ నెవర్ పేరుతో ఒక కరపత్రా న్ని తయారుచేసాడు. అయితే, అది
రాజకీయ దృష్టిని ఆకర్షించలేదు. [15] ఇందులోనే పంజాబ్, నార్త్ వెస్ట్ ఫ్రా ంటియర్ ప్రా విన్స్ (ఆఫ్ఘ నియా),
కాశ్మీర్, సింధ్, బలూచిస్తా న్ లతో కలిపిన " పాకిస్తా న్ ", "స్వచ్ఛమైన భూమి", భావనను మొదటిసారిగా
ప్రకటించారు. కొన్నాళ్ళ తరువాత, భారత రాజ్యాంగ సంస్కరణలపై పార్ల మెంటరీ కమిటీని కలిసిన ఒక
ముస్లిం ప్రతినిధి బృందం, పాకిస్తా న్ ఆలోచన "భ్రమ" అని, "అసాధ్యమైనద"నీ చెప్పింది. [15] 1932 లో,
"అణగారిన తరగతులకు" కేంద్ర, ప్రా ంతీయ శాసనసభలలో ప్రత్యేక ప్రా తినిధ్యం వహించాలన్న డాక్టర్
అంబేద్కర్ డిమాండ్‌ను బ్రిటిషు ప్రధాన మంత్రి రామ్‌సే మెక్డ ‌ ొ నాల్డ్ అంగీకరించారు. హిందూ కుల
నాయకత్వాన్ని బలహీనపరిచే అవకాశం ఉన్నందున ముస్లిం లీగ్ ఈ అవార్డు కు మొగ్గు చూపింది.
అయితే, దళిత హక్కులకు ప్రముఖమైన మద్ద తుదారుగా కనిపించిన మహాత్మా గాంధీ ఈ అవార్డు ను రద్దు
చేయమని బ్రిటిషు వారిని ఒప్పించడానికి ఉపవాస దీక్ష చేసాడు. గాంధీ ప్రా ణాలకు ముప్పు ఉందనిపించి,
అంబేద్కర్ వెనక్కి తగ్గా ల్సి వచ్చింది.[16]

రెండు సంవత్సరాల తరువాత, భారత ప్రభుత్వ చట్ట ం 1935 ప్రా ంతీయ స్వయంప్రతిపత్తి ని ప్రవేశపెట్టింది.
భారతదేశంలో ఓటర్ల సంఖ్య 3.5 కోట్ల కు పెరిగింది. [17] మరింత ముఖ్యంగా, శాంతిభద్రతల సమస్య
మొదటిసారిగా బ్రిటిషు అధికారం నుండి భారతీయుల నేతృత్వంలోని ప్రా ంతీయ ప్రభుత్వాలకు బదిలీ
అయింది. [17] దీంతో హిందూ ఆధిపత్యం పట్ల ముస్లిముల్లో ఉన్న ఆందో ళనలు పెరిగాయి. [17] 1937
భారత ప్రా ంతీయ ఎన్నికలలో, ముస్లిం లీగ్ యునైటెడ్ ప్రా విన్సెస్ వంటి ముస్లిం-మైనారిటీ ప్రా విన్సులలో
ఉత్త మ ప్రదర్శన కనబరిచింది. ఇక్కడ 64 రిజర్వు చేసిన ముస్లిం సీట్లలో 29 స్థా నాలను గెలుచుకుంది.
[17] అయితే, పంజాబ్ బెంగాల్‌ల ముస్లిం-మెజారిటీ ప్రా ంతాలలో ప్రా ంతీయ పార్టీలు లీగ్‌పై పైచేయి
సాధించాయి. [17] పంజాబ్ లో సికందర్ హయత్ ఖాన్ నాయకత్వం లోని యూనియనిస్ట్ పార్టీ ఎన్నికల్లో
గెలిచి భారత జాతీయ కాంగస్ ్రె , శిరోమణి అకాలీ దళ్ ల మద్ద తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఐదు
సంవత్సరాలు పాలించింది. [17] బెంగాల్‌లో, క్రిషక్ ప్రజా పార్టీ నాయకుడు ఎకే ఫజ్లు ల్ హుక్ నేతృత్వంలోని
సంకీర్ణంలో లీగ్ అధికారాన్ని పంచుకోవలసి వచ్చింది . [17]

మరోవైపు, మొత్త ం 1585 ప్రా విన్షియల్ అసెంబ్లీ స్థా నాల్లో 716 చోట్ల విజయం సాధించి కాంగ్రెస్, బ్రిటిషు
ఇండియాలోని 11 ప్రా విన్సులలోను, ఏడింటిలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. [17] ఆర్థిక
సామాజిక సమస్యల కంటే మతపరమైన సమస్యలకు ప్రజలు తక్కువ ప్రా ముఖ్యతనిస్తా రని కాంగ్రెసు తన
మ్యానిఫెస్టో లో పేర్కొంది. అయితే, మొత్త ం 482 ముస్లిం స్థా నాల్లో కేవలం 58 స్థా నాల్లో కాంగ్రెసు పో టీ
చేయగా, వీటిలో 26 సీట్లలో మాత్రమే గెలిచింది. [17] కాంగ్రెసు గెలిచిన యుపిలో, లీగ్‌తో అధికారాన్ని
పంచుకునేందుకు ముందుకొచ్చింది - కానీ లీగ్ ముస్లింలకు మాత్రమే ప్రతినిధిగా పనిచేయడం
ఆపివేయాలి అనే షరతుతో. లీగ్ అందుకు నిరాకరించింది [17] ఇది ముస్లిం ప్రజల నుండి కాంగ్రెస్న ‌ు
మరింత దూరం చేసింది. ఈ షరతు పెట్టడం పొ రపాటని తేలింది. అంతేకాకుండా, కొత్త యుపి రాష్ట ్ర
ప్రభుత్వం గోరక్షణను, హిందీ వాడకాన్నీ ప్రకటించింది. [17] కొత్త కాంగ్రెసు పాలనలో కొన్నిసార్లు ప్రభుత్వ
భవనాల్లో కి పెద్ద సంఖ్యలో గ్రా మీణ ప్రజలు చేరడంతో, సామాన్యులెవరో, అధికారులెవరో చట్టా న్ని అమలు
చేసే వ్యక్తు లెవరో తెలీకుండా పో యేది. అస్త వ్యస్త మైన ఈ దృశ్యాలను చూసినపుడు యుపిలో ఉన్నత వర్గ
ముస్లింలు కాంగ్రెసుకు మరింత దూరమయ్యారు. [18]

కాంగస ్రె ు పాలనలో ఉన్న ముస్లింల పరిస్థితులపై ముస్లిం లీగ్ తన దర్యాప్తు నిర్వహించింది. [19]
ఇటువంటి పరిశోధనల ఫలితాలు భవిష్యత్ హిందూ ఆధిపత్యం పట్ల ముస్లిం ప్రజలలో భయాన్ని పెంచాయి.
[19] కాంగ్రెసు ఆధిపత్యం కలిగిన స్వతంత్ర భారతదేశంలో ముస్లింల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తా రనే
అభిప్రా యం ఇప్పుడు ముస్లింల బహిరంగ చర్చల్లో ఒక భాగం. [19] 1939 లో రెండవ ప్రపంచ యుద్ధ ం
ప్రా రంభమవగానే, వైస్రా య్ లార్డ్ లిన్‌లిత్‌గో, భారతీయ నేతలతో చర్చలేమీ లేకుండానే, భారతదేశం
తరపున యుద్ధ ప్రకటన చెయ్యడంతో, దానికి నిరసనగా కాంగ్రెసు ప్రా దేశిక మంత్రు లు రాజీనామా చేసారు.
[19] దీనికి విరుద్ధ ంగా, ముస్లిం లీగ్, [20] "విమోచన దినం", వేడుకలు (కాంగ్రెసు ఆధిపత్యం నుండి)
నిర్వహించింది. యుద్ధ ప్రయత్నంలో బ్రిటన్‌కు మద్ద తు ఇచ్చింది. [19] లిన్‌లిత్‌గో జాతీయవాద
నాయకులతో కలిసినప్పుడు, అతను గాంధీకి ఇచ్చిన స్థా యినే, జిన్నాకూ ఇచ్చాడు. ఒక నెల తరువాత
కాంగ్రెసును "హిందూ సంస్థ "గా అభివర్ణించాడు. [20]

1940 మార్చి లో, లాహో ర్లో జరిగిన లీగ్ యొక్క వార్షిక మూడు రోజుల సమావేశంలో, జిన్నా ఇంగ్లీషులో
రెండు గంటల ప్రసంగం చేసాడు. చరితక ్ర ారులు టాల్బోట్, సింగ్ మాటలలో చెప్పాలంటే, ఆ ప్రసంగంలో
ద్విజాతి సిద్ధా ంత వాదనలు ఉన్నాయి. "ముస్లింలు, హిందువులు ... ఒకదానికొకటి ఏమాత్రమూ
సరిపడని ఏకమత సమాజాలు. ముస్లిముల ఆకాంక్షలను సంతృప్తిపరచని ఏ పరిష్కారాన్నీ వారిపై
రుద్ద లేరు." [19] సమావేశాల చివరి రోజున, లాహో ర్ రిజల్యూషన్ను లీగ్ ఆమోదించింది. దీన్నే కొన్నిసార్లు
"పాకిస్తా న్ రిజల్యూషన్" అని కూడా పిలుస్తా రు. [19] "భారతదేశం యొక్క వాయువ్య, తూర్పు
మండలాల్లో లాగా ముస్లింలు సంఖ్యాపరంగా మెజారిటీ ఉన్న ప్రా ంతాలన్నిటినీ స్వతంత్ర దేశాలుగా
ఉండటానికి సమూహం చేయాలి. ఇందులో రాజ్యాంగ యూనిట్లు స్వయంప్రతిపత్తి , సార్వభౌమత్వం కలిగి
ఉంటాయి. " లీగ్‌ను స్థా పించి మూడు దశాబ్దా లు గడిచినా, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మాత్రమే
దక్షిణాసియా ముస్లింల మద్ద తు పొ ందింది.[21]

యుద్ధ ం తరువాత భారతదేశానికి డొ మినియన్ హో దా ఇవ్వాలని వైస్రా య్ 1940 ఆగస్టు లో లిన్‌లిత్‌గో


ప్రతిపాదించాడు. అతడు పాకిస్తా న్ ఆలోచనను సీరియస్‌గా తీసుకోలేదు. జిన్నా కోరుకున్నది హిందూ
ఆధిపత్యం లేని సమాఖ్యేతర ఏర్పాటు అని లిన్‌లిత్‌గో భావించాడు. హిందూ ఆధిపత్యం గురించి
ముస్లింలలో భయాలను తొలగించడానికి, భవిష్యత్ రాజ్యాంగం మైనారిటీల అభిప్రా యాలను
పరిశీలిస్తు ందనే వాగ్దా నంతో 'ఆగస్టు ఆఫర్' వచ్చింది.[22] కాంగ్రెస్, ముస్లిం లీగ్ లు రెండూ ఈ ప్రతిపాదనపై
సంతృప్తి చెందలేదు. ఇద్ద రూ దీనిని సెప్టెంబరులో తిరస్కరించారు. కాంగ్రెసు మరోసారి శాసనోల్లంఘన
కార్యక్రమాన్ని ప్రా రంభించింది.[23]

1942 మార్చి లో, సింగపూర్ పతనం తరువాత జపనీయులు మలయా ద్వీపకల్పంలోకి వేగంగా
వెళ్లడంతో, [20] అమెరికన్లు భారతదేశ స్వాతంత్ర్యాన్ని సమర్ధిస్తూ ండడంతో, [24] బ్రిటన్ యొక్క
యుద్ధ కాల ప్రధాన మంత్రి విన్స్టన్ చర్చిల్, సర్ స్టా ఫో ర్డ్ క్రిప్స్న
‌ ు కాంగ్రెసుతో రాయబారానికి భారతదేశం
పంపాడు. యుద్ధ ప్రయత్నాలకు కాంగ్రెసు మద్ద తు ఇస్తే, అందుకు ప్రతిఫలంగా యుద్ధ ం ముగిసాక,
భారతదేశానికి డొ మినియన్ హో దా ఇస్తా మనేది ఆ రాయబారం. [25] తాము ఇప్పటికే మద్ద తు
దక్కించుకున్న మితుల - ముస్లిం లీగ్, పంజాబ్ యూనియన్లు , సంస్థా నాధీశులు - మద్ద తును
కోల్పోకుండా ఉండేందుకు క్రిప్స్, బ్రిటిషు ఇండియన్ సామ్రా జ్యంలో ఏ భాగాన్ని కూడా, ఆ డొ మినియన్‌లో
చేరాలని బలవంతం చేయమని పేర్కొన్నాడు. పాకిస్తా న్ సూత్రా న్ని తీర్చడంలో ఈ నిబంధన సరిపో దని
భావించి లీగ్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది.[26] ఆ నిబంధన కారణంగా, కాంగ్రెసు కూడా ఈ
ప్రతిపాదనలను తిరస్కరించింది. 1885 లో మర్యాదపూర్వక న్యాయవాదుల సమూహంగా మొదలైనప్పటి
నుండీ, [27] తాను అన్ని విశ్వాసాలకు చెందిన భారతీయులందరికీ ప్రతినిధిగా కాంగ్రెసు భావిస్తూ వస్తో ంది.
[25] 1920 లో భారతీయ జాతీయవాదం యొక్క ప్రఖ్యాత వ్యూహకర్త గాంధీ వచ్చి, [28] కాంగ్రెసును కోట్ల
మంది ప్రజల జాతీయవాద ఉద్యమంగా మార్చేసాడు. [27] 1942 ఆగస్టు లో, కాంగ్రెసు క్విట్ ఇండియా
తీర్మానాన్ని ప్రా రంభించింది, ఇది తీవ్రమైన రాజ్యాంగ మార్పులను కోరింది. 1857 లో భారత తిరుగుబాటు
తరువాత బ్రిటిషు వారు తమ పాలనకు ఇదే అత్యంత తీవ్రమైన ముప్పుగా భావించారు. [25] ప్రపంచ
యుద్ధ ం ద్వారా వారి వనరులు, శ్రద్ధ ఇప్పటికే చిక్కిపో వడంతో, బ్రిటిషు వారు వెంటనే కాంగ్రెసు
నాయకులను జైలులో పెట్టా రు. 1945 ఆగస్టు వరకు జైలులోనే ఉంచారు. [29] అయితే రాబో యే మూడు
సంవత్సరాల పాటు దాని సందేశాన్ని ప్రచారం చేసుకునేందుకు ముస్లిం లీగ్ మాత్రం స్వేచ్ఛగానే ఉంది.
[20] పర్యవసానంగా, ముస్లిం లీగ్ యొక్క సభ్యత్వం యుద్ధ సమయంలో పెరిగిందని, జిన్నా స్వయంగా
అంగీకరించాడు, "ఎవరూ స్వాగతించని ఈ యుద్ధ ం, మాకు వరమైంది." [30] అబుల్ కలాం ఆజాద్, ఎకే
ఫజులుల్ హక్, వామపక్ష కృషక్ ప్రజా పార్టీ బెంగాల్లో , సికందర్ హయత్‌ఖాన్ భూస్వామ్య ఆధిపత్య
యొక్క పంజాబ్ యూనియనిస్ట్ పార్టీ, నార్త్ వెస్ట్ ఫ్రా ంటియర్ ప్రా విన్స్లో కాంగ్రెసు అనుకూల ఖుదాయి
ఖిద్మత్‌గార్ (ప్రముఖంగా, "రెడ్ షర్ట్స్") కు చెందిన అబ్దు ల్-గఫార్ ఖాన్ వంటి ఇతర ముఖ్యమైన జాతీయ
ముస్లిం రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ బ్రిటిషు వారు మాత్రం ముస్లిం భారతదేశానికి ప్రధాన
ప్రతినిధిగా లీగ్‌నే ఎంచుకున్నారు.[31]

1946 ఎన్నికలు, క్యాబినెట్ మిషన్, డైరెక్ట్ యాక్షన్ డే, విభజన కోసం ప్రణాళిక,
స్వాతంత్ర్యం: 1946-1947

1946 జనవరిలో సాయుధ సేనల్లో తిరుగుబాట్లు జరిగాయి. బ్రిటనుకు చెందిన RAF సైనికులు తమను
స్వదేశానికి తిరిగి పంపడం నెమ్మదిగా జరగడంతో నిరాశ చెందారు. వారితో తిరుగుబాట్లు
మొదలయ్యాయి.[32] 1946 ఫిబవ ్ర రిలో బొ ంబాయిలో రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటుతో
పుంజుకున్నాయి. కలకత్తా , మద్రా స్, కరాచీలలో కూడా అందుకున్నాయి. తిరుగుబాట్ల ను వేగంగా
అణచివేసినప్పటిక,ీ అవి అట్లీ ప్రభుత్వాన్ని చర్యకు ప్రేరేపించాయి. లేబర్ పార్టీ ప్రధాన మంత్రి క్లెమెంట్ అట్లీకి
1920 ల నుండి భారత స్వాతంత్ర్యం పట్ల ఆసక్తి ఉంది. అనేక సంవత్సరాలుగా దీనికి మద్ద తు ఇస్తూ
వచ్చాడు. అతను ఇప్పుడు ప్రభుత్వ పదవిని చేపట్టా డు, ఈ సమస్యకు అత్యధిక ప్రా ధాన్యత ఇచ్చాడు.
భారత విదేశాంగ కార్యదర్శి లార్డ్ పెథిక్ లారెన్స్ నేతృత్వంలో ఒక క్యాబినెట్ మిషన్ భారతదేశానికి
పంపాడు. ఇందులో సర్ స్టా ఫో ర్డ్ క్రిప్స్ కూడా ఉన్నాడు. క్రిప్స్ అంతకు నాలుగేళ్ళ ముందు కూడా
భారతదేశాన్ని సందర్శించాడు. స్వాతంత్ర్యానికి క్రమబద్ధ మైన బదిలీకి ఏర్పాట్లు చేయడమే మిషన్ యొక్క
లక్ష్యం.[32]

1946 ప్రా రంభంలో, భారతదేశంలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు ప్రకటించడంతో ముస్లిం ఓటర్లు ఐక్య
భారత దేశం, లేదా విభజన - ఈ రెంటిలో ఒకదాన్ని ఎన్నుకోవలసి వచ్చింది.[33] 1945 లో యుద్ధ ం
ముగింపులో, దేశద్రో హ ఆరోపణలు ఎదుర్కొన్న సుభాస్ చంద్రబో స్కు చెందిన భారత జాతీయ సైన్యం లోని
ముగ్గు రు సీనియర్ అధికారులపై బహిరంగ విచారణను వలస ప్రభుత్వం ప్రకటించింది. విచారణలు
ప్రా రంభమైనప్పుడు, అంతకు ముందు ఎప్పుడూ ఐఎన్‌ఎకు మద్ద తు ఇవ్వని కాంగ్రెసు నాయకత్వం,
నిందితులైన అధికారులను రక్షించాలని తలపెట్టింది.[34] అధికారులపై నేరారోపణలు, దానికి వ్యతిరేకంగా
ప్రజల ఆగ్రహం, చివరికి శిక్షల నుండి ఉపశమనం వలన కాంగ్రెస్క ‌ ు సానుకూల ప్రచారం లభించింది.
తదుపరి జరిగిన ఎన్నికల్లో పదకొండు ప్రా విన్సులలో ఎనిమిదింటిలో పార్టీ విజయాలను గెలుచుకోవడానికి
ఇది దో హదపడింది.[35] కాంగస ్రె ు, ముస్లిం లీగ్ మధ్య చర్చలు విభజన సమస్యపై తడబడ్డా యి.

చాలా మంది హిందువులకు సంబంధించి, బ్రిటిషు పాలన చట్ట బద్ధ తను కోల్పోయింది. దీనికి
నిశ్చయాత్మకమైన రుజువు 1946 ఎన్నికల రూపంలో వచ్చింది. ముస్లిమేతర నియోజకవర్గా లలో
కాంగ్రెసు 91 శాతం ఓట్ల ను గెలుచుకుంది. తద్వారా కేంద్ర శాసనసభలో మెజారిటీ సాధించింది. ఎనిమిది
ప్రా విన్సుల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. చాలా మంది హిందువులకు బ్రిటిషు ప్రభుత్వానికి
చట్ట బద్ధ మైన వారసుడు కాంగస ్రె ్సే. ఒకవేళ, బ్రిటిషు వారు భారతదేశాన్నీ వదలకుండా పాలిస్తూ నే
ఉండాలని అనుకుని ఉంటే, రాజకీయంగా చురుకైన భారతీయులను బ్రిటిషు పాలనకు
అంగీకరింపజేయడం ఈ ఎన్నికల ఫలితాల తరువాత వారికి కష్ట మయ్యేది. అయితే, చాలా మంది గ్రా మీణ
భారతీయుల అభిప్రా యాలు ఆ సమయంలో కూడా అనిశ్చితంగానే ఉన్నాయి.[36] ముస్లిం లీగ్ ముస్లిం
ఓట్ల తో పాటు ప్రా ంతీయ అసెంబ్లీ లలో రిజర్వు చేసిన ముస్లిం సీట్లలోఎక్కువ భాగాన్ని గెలుచుకుంది. ఇది
కేంద్ర అసెంబ్లీ లో ముస్లిం సీట్లన్నిటినీ దక్కించుకుంది. చివరకు ముస్లిం లీగ్, జిన్నాలు మాత్రమే భారతదేశ
ముస్లింలకు ప్రా తినిధ్యం వహిస్తా రనే వాదనను లీగ్ పటిష్ఠం చెయ్యగలిగింది [37] జిన్నా ఈ ఓటును ప్రత్యేక
మాతృభూమి కోసం ప్రజాదరణ పొ ందిన డిమాండ్‌గా చిత్రించాడు.[38] అయితే, సింధ్, బెంగాల్ రెండు
ప్రా విన్సుల వెలుపల ముస్లిం లీగ్ మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేయలేకపో గా, కాంగ్రెసు NWFP లో ఒక
మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. సిక్కులు యూనియనిస్టు లతో కలిసి కాంగ్రెస్, పాంజాబులో సంకీర్ణ
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.[39]

బ్రిటిషు వారు ప్రత్యేక ముస్లిం మాతృభూమిని ఆమోదించ లేదు గానీ, భారత ముస్లింల తరపున
మాట్లా డటానికి ఒకే స్వరం ఉండడంలోని వీలు వారికి నచ్చింది.[40] భారతదేశాన్ని తన 'సామ్రా జ్య రక్షణ'
వ్యవస్థ లో ఉంచాలంటే భారతదేశం, దాని సైన్యం ఐక్యంగా ఉండాలని బ్రిటన్ కోరుకుంది.[41][42]
భారతదేశంలోని రెండు రాజకీయ పార్టీలు దీన్ని అంగీకరించక పో వడంతో, బ్రిటన్ క్యాబినెట్ మిషన్
ప్రణాళికను రూపొ ందించింది. ఈ మిషన్ ద్వారా, బ్రిటన్, కాంగ్రెసులు రెండూ కోరుకున్న ఐక్య భారతదేశాన్ని
కాపాడాలని భావించారు. అదే సమయంలో పాకిస్తా న్ కోసం జిన్నా చేస్తు న్న డిమాండ్ లోని సారాన్ని
'సమూహాల' ద్వారా సాధించదలచారు.[43] క్యాబినెట్ మిషన్ పథకంలో, ప్రా విన్సులన్నీ మూడు
సమూహాలుగా ఉండే సమాఖ్య ఏర్పాటు ఉంది. ఈ సమూహాలలో రెండిట్లో ప్రధానంగా ముస్లిం ప్రా విన్సులు
ఉంటాయి. మూడవ సమూహం ప్రధానంగా హిందూ ప్రా ంతాలతో ఉంటుంది. ప్రా విన్సులు స్వయంప్రతిపత్తి
కలిగివుంటాయి. అయితే రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార మార్పిడిపై కేంద్రం నియంత్రణను కలిగి
ఉంటుంది. ఇవి స్వతంత్ర పాకిస్తా న్‌ను అందించనప్పటిక,ీ ముస్లిం లీగ్ ఈ ప్రతిపాదనలను అంగీకరించింది.
భారతదేశపు ఐక్యత పదిలంగానే ఉన్నా, ఇది కేంద్రా న్ని బలహీనపరుస్తు ందని కాంగ్రెసు నాయకులు,
ముఖ్యంగా నెహ్రూ , భావించారు. 1946 జూలై 10 న నెహ్రూ "రెచ్చగొట్టే ప్రసంగం" చేస్తూ , ప్రా విన్సులను
సమూహపరచాలనే ఆలోచనను తిరస్కరించాడు. క్యాబినెట్ మిషన్ ప్లా న్‌ను, ఐక్య భారతదేశం అవకాశాలు
రెండింటినీ "సమర్థ వంతంగా తుత్తు నియలు చేసేసాడు".[44]

కేబినెట్ మిషన్ విఫలమైన తరువాత, బ్రిటిషు ఇండియాలో ముస్లిం మాతృభూమికి ఉన్న డిమాండ్‌ను
శాంతియుతంగా ఎత్తి చూపే లక్ష్యంతో జిన్నా 1946 ఆగస్టు 16 ప్రత్యక్ష కార్యాచరణ దినోత్సవాన్ని
ప్రకటించారు. అయితే, 16 వ తేదీ ఉదయం, కలకత్తా లోని ఓక్టర్లో నీ మాన్యుమెంట్ వద్ద ముస్లిం లీగ్‌కు
చెందిన బెంగాల్ ముఖ్యమంత్రి హుస్సేన్ షాహీద్ సుహ్రా వార్ది ప్రసంగం వినడానికి సాయుధ ముస్లిం
ముఠాలు సమావేశమయ్యాయి. చరితక ్ర ారుడు యాస్మిన్ ఖాన్ మాటల్లో చెప్పాలంటే, "అతను హింసను
స్పష్ట ంగా ప్రేరేపించకపో యి ఉండవచ్చు, కానీ అతడి మాటల్లో మాత్రం - వారు ఏంచేసినా శిక్ష పడకుండా
తప్పించుకోగలరని, పో లీసులను గానీ, మిలిటరీని గానీ పిలవరనీ, నగరంలో వారు చేసే ఏపనులనైనా
ప్రభుత్వం పట్టించుకోదనీ అభిప్రా యాన్ని ఖచ్చితంగా ప్రేక్షకులకు కలిగించింది". [45] అదే రోజు
సాయంత్రం, కలకత్తా లో, ఈ సమావేశం నుండి తిరిగి వస్తు న్న ముస్లింలు హిందువులపై దాడి చేసారు. వారి
చేతుల్లో అంతకుముందు పంచిన కరపత్రా లున్నాయి. ఈ హింసకు, పాకిస్తా న్ డిమాండుకూ మధ్య ఉన్న
స్పష్ట మైన సంబంధాన్ని ఈ కరపత్రా లు చూపించాయి. హింసకు మూలం ప్రత్యక్ష చర్యా దినోత్సవమేనని
సూచించింది. ఈ హింసనే "1946 ఆగష్టు కలకత్తా నరమేధం" అని పిలిచారు. [46] మరుసటి రోజు,
హిందువులు తిరగబడ్డా రు. హింస మూడు రోజులు కొనసాగింది, ఇందులో హిందువులు ముస్లింలు
సుమారు 4,000 మంది మరణించారు (అధికారిక లెక్కల ప్రకారం). భారతదేశంలో ఇంతకుముందు
హిందూ ముస్లింల మధ్య మత హింసలు జరిగినప్పటిక,ీ కలకత్తా హత్యలు " జాతి ప్రక్షాళన " లక్షణాలను
ప్రదర్శించిన మొదటి కలహాలివి.[47] హింస ప్రజా రంగానికి మాత్రమే పరిమితం కాలేదు, ఇళ్ళల్లో కి
ప్రవేశించి నాశనం చేసారు, మహిళలు పిల్లలపై దాడి చేశారు. [48] భారత ప్రభుత్వం, కాంగ్రేస్ పార్టీ రెండూ
ఈ ఘటనలతో క్రక్కదలి పో యినప్పటిక,ీ సెప్టెంబరులో జవహర్ లాల్ నెహ్రూ ఐక్య భారత ప్రధానిగా,
కాంగ్రెసు నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు.

మత హింస బీహార్ (హిందువులు ముస్లింలపై దాడి చేసారు), బెంగాల్‌లోని నోఖాలి (ముస్లింలు


హిందువులను లక్ష్యంగా చేసుకున్నారు), యునైటెడ్ ప్రా విన్స్‌లోని గర్హ్ముక్తేశ్వర్ (హిందువులు ముస్లింలపై
దాడి చేసారు) లకూ వ్యాపించింది. 1947 మార్చిలో రావల్పిండిలో హిందువులపై దాడి చేస,ి
తరిమేసారు..[49]

బ్రిటిషు ప్రధాన మంత్రి అట్లీ, లార్డ్ లూయిస్ మౌంట్ బాటెన్ను భారతదేశపు చివరి వైస్రా య్ గా
నియమించాడు. విభజనను నివారించడానికీ, యునైటెడ్ ఇండియాను కాపాడటానికీ సూచనలతో 1948
జూన్ నాటికి బ్రిటిషు ఇండియా స్వాతంత్ర్యాన్ని పర్యవేక్షించే పని అతనికి ఇచ్చారు. కనీసమాత్రపు
ఎదురుదెబ్బలతో అతడు ఈ పని నిర్వహించాలి. భారతదేశంలో సమాఖ్య ఏర్పాట్ల కోసం క్యాబినెట్ మిషన్
పథకాన్ని పునరుద్ధ రించాలని మౌంట్ బాటన్ భావించాడు. కేంద్రా న్ని పరిరక్షించాలన్న ఆసక్తి అతనికి
మొదట్లో ఉన్నప్పటిక,ీ ఉద్రిక్తమైన మతతత్వ పరిస్థితి వలన అధికారాన్ని త్వరగా బదిలీ చేయడం కోసం
విభజన అతడికి తప్పనిసరైంది [50][51][52][53]

ముహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలో పెరుగుతున్న ముస్లిం వేర్పాటువాద ఉద్యమానికి పరిష్కారం


భారతదేశ విభజనేనని అంగీకరించిన మొదటి కాంగస ్రె ు నాయకులలో వల్ల భాయ్ పటేల్ ఒకరు. భారతదేశం
అంతటా మత హింసను రేకెత్తి ంచిన జిన్నా యొక్క ప్రత్యక్ష కార్యాచరణ ప్రచారం, రాజ్యాంగ ప్రా తిపదికన
హింసను ఆపడానికి తన హో ం శాఖ ప్రతిపాదనలను వైస్రా య్ వీటో చెయ్యడం అతడికి ఆగ్రహం
తెప్పించింది. వైస్రా య్, లీగ్ మంత్రు లను ప్రభుత్వంలోకి ప్రవేశపెట్టడాన్ని, కాంగ్రెసు అనుమతి లేకుండా
బ్రిటిషు వారు సమూహ పథకాన్ని తిరిగి ధ్రు వీకరించడాన్నీ పటేల్ తీవ్రంగా విమర్శించాడు. ముస్లిం లీగ్
పార్టీ కేంద్ర ప్రభుత్వంలో భాగమైనప్పటికీ అసెంబ్లీ ని బహిష్కరించడం, మే 16 నాటి ప్రణాళికను
అంగీకరించకపో వడం లపై పటేల్క ‌ ు మరింత ఆగ్రహం కలిగింది. కానీ, జిన్నాకు ముస్లింలలో మద్ద తు
ఉందని, అతడికీ జాతీయవాదులకూ మధ్య బహిరంగ వివాదం తలెత్తి తే పరిస్థితి క్షీణించి, హిందూ-ముస్లిం
అంతర్యుద్ధా నికి దారితీసే అవకాశం ఉందనీ పటేల్ భావించాడు. కేంద్ర ప్రభుత్వం బలహీనంగా,
భిన్నాభిప్రా యాలతో కొనసాగిత,ే 600 కి పైగా రాచరిక సంస్థా నాలు స్వాతంత్ర్యం ప్రకటించుకుని, దేశం
ముక్కలైపో యే ప్రమాదముందని పటేల్ మనస్సులో ఉంది.[54] 1946 1947 డిసెంబరు జనవరి
కాలంలో పటేల్, ప్రభుత్వ అధికారి విపి మీనన్‌తో కలిసి పనిచేశాడు. ముస్లిం-మెజారిటీ ప్రా విన్సుల నుండి
పాకిస్తా న్ ను సృష్టించాలనే మీనన్ ప్రతిపాదనపై వాళ్ళిద్ద రూ పనిచేసారు. 1947 జనవరి, మార్చి ల్లో
బెంగాల్, పంజాబ్‌లలో జరిగిన మతహింస వలన, విభజన ప్రతిపాదన లోని ప్రయోజకత్వం పటేల్క ‌ు
మరింతగా అర్థ మైంది. పంజాబ్, బెంగాల్ లోని హిందూ-మెజారిటీ ప్రా ంతాలను ముస్లిం రాజ్యంలో చేర్చాలని
జిన్నా చేసిన డిమాండును తీవ్రంగా విమర్శించిన పటేల్, ఆ ప్రా విన్సుల విభజనను సాధించి, తద్వారా
వాటిని పాకిస్తా న్లో చేర్చే అవకాశం లేకుండా చేసాడు. పంజాబ్, బెంగాల్ ల విభజనపై పటేల్ చూపించిన
నిర్ణ యాత్మకత, లీగ్ వ్యూహాలతో విసిగిపో యిన భారత ప్రజలకు చాలా నచ్చింది. అతనికి మద్ద తు
దారులను, ఆరాధకులనూ సంపాదించి పెట్టింది. అయితే, విభజన కోసం ఆత్రు తగా ఉన్నాడంటూ అతన్ని
గాంధీ, నెహ్రూ , లౌకిక ముస్లింలు, సో షలిస్టు లు విమర్శించారు. 1947 జూన్ 3 న లార్డ్ మౌంట్ బాటన్
అధికారికంగా ఈ ప్రణాళికను ప్రతిపాదించినప్పుడు, పటేల్ తన అనుమతి ఇచ్చి, నెహ్రూ ను ఇతర కాంగ్రెసు
నాయకులనూ ఈ ప్రతిపాదనను అంగీకరించమని నచ్చచెప్పాడు. విభజన ప్రతిపాదనలకు సంబంధించి
గాంధీ యొక్క తీవ్ర వేదనను తెలుసుకున్న పటేల్, కాంగ్రెస్-లీగ్ సంకీర్ణ ప్రభుత్వం ఏ విధంగా
ఆచరణాత్మకం కాదో , హింస ఎలా పెరుగుతోందో , అంతర్యుద్ధ పు ముప్పు ఎలా పొ ంచి ఉందో .. ప్రైవేట్
సమావేశాల్లో గాంధీతో చర్చించాడు. ఈ ప్రతిపాదనపై ఓటు వేయాలని పిలిచిన అఖిల భారత కాంగ్రెసు
కమిటీ సమావేశంలో పటేల్ ఇలా అన్నాడు:

[ముస్లిం-మెజారిటీ ప్రా ంతాల] లోని మా సో దరుల భయాలను నేను పూర్తిగా అర్థ ం చేసుకున్నాను.
భారతదేశ విభజన ఎవరికీ ఇష్ట ం లేదు. నాకూ గుండె భారంగా ఉంది. కానీ, ఒక్క విభజనా, అనేక
విభజనలా అనేది మనమిప్పుడు ఎంచుకోవాల్సి ఉంది. మనం వాస్త వాలను ఎదుర్కోవాలి. భావోద్వేగాలకూ
మనోభావాలకూ లొంగిపో కూడదు. వర్కింగ్ కమిటీ భయంతో వ్యవహరించలేదు. కానీ నేను ఒక
విషయానికి భయపడుతున్నాను, ఇన్ని సంవత్సరాలుగా మనం పడ్డ శ్రమ, కృషి అంతా వృథాగా పో వచ్చు
లేదా నిష్ఫలమై పో వచ్చు. నా తొమ్మిది నెలల పదవీకాలంలో క్యాబినెట్ మిషన్ ప్లా న్ యోగ్యతల పట్ల
నాకున్న భ్రమలు తొలగిపో యాయి. ఏవో కొన్ని గౌరవనీయమైన మినహాయింపులు తప్పించి, పైనుండి
క్రిందికి - చప్రా సీల దాకా ముస్లిం అధికారులంతా లీగ్ కోసమే పనిచేస్తు న్నారు. మిషన్ ప్లా న్‌లో లీగ్‌కు
ఇచ్చిన మతపరమైన వీటో ప్రతి దశలో భారతదేశ పురోగతిని అడ్డు కునేద.ి మనకు నచ్చినా
నచ్చకపో యినా, పంజాబ్, బెంగాల్‌లలో ఇప్పటికే డీ ఫ్యాక్టో పాకిస్తా న్ ఉంది. ఈ పరిస్థితులలో, నేను డి
జ్యూర్ పాకిస్తా న్‌ను ఇష్ట పడతాను. ఇది లీగ్‌ను మరింత బాధ్యతాయుతంగా చేస్తు ంది. స్వేచ్ఛ వచ్చేస్తో ంది.
75 నుండి 80 శాతం భారతదేశం మనకే ఉంది. మన తెలివితేటల్తో దీన్ని బలోపేతం చేసుకోవచ్చు.
మిగిలిన దేశాన్ని లీగ్ అభివృద్ధి చేసుకుంటుంది.[55]

ప్రణాళికను గాంధీ తిరస్కరించడం [56] కాంగ్రెసు ఆమోదించడం జరిగాక, పటేల్ విభజన మండలిలో
భారతదేశానికి ప్రా తినిధ్యం వహించాడు. అక్కడ అతను ప్రజా ఆస్తు ల విభజనను పర్యవేక్షించాడు. నెహ్రూ తో
కలిసి భారత మంత్రు ల మండలిని ఎంచుకున్నాడు. ఏదేమైనా, విభజనతో జరిగే తీవ్రమైన హింస, జనాభా
బదిలీని అతను గాని, మరే ఇతర భారతీయ నాయకుడు గానీ ఊహించలేదు. 1946 చివరిలో, బ్రిటన్‌లోని
లేబర్ ప్రభుత్వం, ఇటీవల ముగిసిన రెండవ ప్రపంచ యుద్ధ ంతో దాని ఖజానా ఖాళీ అయిపో వడంతో,
భారతదేశంలో బ్రిటిషు పాలనను ముగించాలని నిర్ణ యించుకుంది. 1948 జూన్ లోపు అధికారాన్ని బదిలీ
చేయాలనే ఉద్దేశ్యాన్ని 1947 ప్రా రంభంలో ప్రకటించింది. అయితే, హింస పెరిగిత,ే బ్రిటిషు సైన్యం
సన్నద్ధ ంగా లేనందువల్ల , కొత్త వైస్రా య్, లూయిస్ మౌంట్ బాటెన్, అధికార బదిలీ తేదీని ముందుకు
తెచ్చాడు. స్వాతంత్ర్యం కోసం పరస్పరం అంగీకరించిన ప్రణాళికకు ఆరు నెలల కన్నా తక్కువ సమయం
ఇచ్చాడు. 1947 జూన్ లో, కాంగ్రెసు తరపున నెహ్రూ , అబుల్ కలాం ఆజాద్, ముస్లిం లీగ్‌కు ప్రా తినిధ్యం
వహిస్తు న్న జిన్నా, దళిత సమాజానికి ప్రా తినిధ్యం వహిస్తు న్న బిఆర్ అంబేద్కర్, సిక్కులకు ప్రా తినిధ్యం
వహిస్తు న్న మాస్ట ర్ తారా సింగ్ సహా జాతీయవాద నాయకులందరూ గాంధీ అభిప్రా యాలకు పూర్తిగా
వ్యతిరేకంగా మతపరమైన దేశ విభజనకు అంగీకరించారు. ప్రధానంగా హిందువులు సిక్కులూ ఉన్న
ప్రా ంతాలను కొత్త భారతదేశానికీ, ప్రధానంగా ముస్లిం ప్రా ంతాలను కొత్త దేశం పాకిస్తా న్‌కూ కేటాయించారు.
ఈ ప్రణాళికలో పంజాబ్, బెంగాల్ ముస్లిం-మెజారిటీ ప్రా విన్సుల విభజన ఉంది. విభజన రేఖ అయిన
రాడ్‌క్లిఫ్ లైన్ ప్రకటనతో జరిగిన మత హింస మరింత భయంకరమైనది. భారత విభజనతో పాటు జరిగిన
హింసను వివరిస్తూ , చరితక ్ర ారులు ఇయాన్ టాల్బోట్ గురుహర్‌పాల్ సింగ్ ఇలా వ్రా స్తు న్నారు:

బాధితులను నరకడం, అవయవాలు తెగ్గొ య్యడం గురించి అనేక ప్రత్యక్ష సాక్షుల కథనాలు ఉన్నాయి.
భయానక చర్యల్లో గర్భిణీ స్త్రీల గర్భవిచ్ఛిత్తి , ఇటుక గోడలపై శిశువుల తలలు పగల కొట్ట డం, బాధితుల
అవయవాలు, జననేంద్రియాలను కోసెయ్యడం, తలలూ మొండేలను ప్రదర్శించడం వంటివి ఉన్నాయి.
మునుపటి మత అల్ల ర్లు ఘోరమైనవే అయినప్పటిక,ీ విభజన నాటి ఊచకోతలోని క్రూ రత్వం, ఆ స్థా యీ
మున్నెన్నడూ ఎరగనిది. విభజన ఊచకోతలకు సంబంధించి ' మారణహో మం ' అనే పదాన్ని
ఉపయోగించడాన్ని కొందరు పండితులు ప్రశ్నించినప్పటిక,ీ చాలా చోట్ల జాతిహింస ధో రణులు
కనిపించాయి. ఇప్పటికే ఉన్న తరాన్ని తుడిచెయ్యడానికీ, భవిష్యత్ పునరుత్పత్తి ని నిరోధించడానికీ ఈ
హింసను రూపొ ందించారు. "

1947 ఆగస్టు 14 న, పాకిస్తా న్ అనే కొత్త డొ మినియన్ ఉనికిలోకి వచ్చింది. ముహమ్మద్ అలీ జిన్నా
కరాచీలో మొదటి గవర్నర్ జనరల్ గా ప్రమాణ స్వీకారం చేశాడు. మరుసటి రోజు, 1947 ఆగస్టు 15 న,
భారతదేశం - ఇప్పుడు చిక్కిపో యిన యూనియన్ ఆఫ్ ఇండియా - న్యూ ఢిల్లీ లో అధికారిక వేడుకల
మధ్య, జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా, వైస్రా య్ మౌంట్ బాటెన్ మొదటి గవర్నర్‌జనరల్‌గా
స్వాతంత్ర్యం పొ ందింది. విభాజిత ఉపఖండంలోని కొత్త శరణార్థు లతో కలిసి పనిచేయడానికి గాంధీ
బెంగాల్‌లోనే ఉండిపో యాడు.

భౌగోళిక విభజన, 1947

మౌంట్ బాటన్ ప్లా న్

రెండు కొత్త దేశాలుగా బ్రిటిషు ఇండియా విభజన "3 జూన్ ప్లా న్" లేదా "మౌంట్ బాటెన్ ప్లా న్"గా పిలిచే
దాని ప్రకారం జరిగింది. 1947 జూన్ 3 న మౌంట్ బాటన్ విలేకరుల సమావేశంలో దీనిని ప్రకటించాడు.
స్వాతంత్ర్య తేదీ - 1947 ఆగస్టు 15 అని కూడా ప్రకటించాడు. ప్రణాళిక లోని ప్రధాన అంశాలు:

పంజాబ్, బెంగాల్ శాసనసభలలో సిక్కులు, హిందువులు, ముస్లింలు సమావేశమై విభజనకు ఓటు


వేస్తా రు. ఏ ఒక్క సమూహమైనా సాధారణ మెజారిటీతో విభజన కోరుకుంటే, ఈ ప్రా విన్సులను విభజిస్తా రు.
సింధ్, బలూచిస్తా న్‌లు వారి స్వంత నిర్ణ యం తీసుకోవలసి ఉంది.[58]
నార్త్ వెస్ట్ ఫ్రా ంటియర్ ప్రా విన్స్, అస్సాంలోని సిల్హె ట్ జిల్లా గతిని ప్రజాభిప్రా య సేకరణ ద్వారా నిర్ణ యించాల్సి
ఉంది.
1947 ఆగస్టు 15 నాటికి భారతదేశం స్వతంత్రంగా ఉంటుంది.
బెంగాల్‌కు ప్రత్యేకంగా స్వాతంత్ర్యం ఇవ్వడాన్ని తోసిపుచ్చారు.
విభజన విషయంలో సరిహద్దు కమిషన్ ఏర్పాటు చేయాలి.
భారత రాజకీయ నాయకులు జూన్ 2 న ఈ ప్రణాళికను అంగీకరించారు. బ్రిటిషు స్వాధీనంలో లేని రాచరిక
సంస్థా నాలను ఏం చెయ్యాలో ఇది తేల్చలేకపో యింది, కాని స్వతంత్రంగా ఉండవద్ద నీ, ఏదో ఒక దేశంలో
చేరాలనీ జూన్ 3 న మౌంట్ బాటెన్ వారికి సలహా ఇచ్చాడు.[59]

ఆ విధంగా ప్రత్యేక దేశం కోరిన ముస్లిం లీగ్ డిమాండ్ల ను అంగీకరించారు. ఐక్యతపై కాంగ్రెసు అభిప్రా యాన్ని
కూడా అడగ్గా , అది పాకిస్తా న్‌ను వీలైనంత చిన్నదిగా చేసింది. మౌంట్ బాటెన్ సూత్రం భారతదేశాన్ని
విభజించడం, అదే సమయంలో, గరిష్ఠ ఐక్యతను నిలుపుకోవడం.

హింసాత్మక అల్ల ర్ల సంభావ్యతపై అబుల్ కలాం ఆజాద్ ఆందో ళన వ్యక్త ం చేశారు, దీనికి మౌంట్ బాటన్ ఇలా
సమాధానం ఇచ్చారు:

కనీసం ఈ ప్రశ్నపై నేను మీకు పూర్తి హామీ ఇస్తా ను. రక్త పాతం, అల్ల ర్లు లేకుండా నేను చూస్తా ను. నేను
సైనికుడిని, సాధారణ పౌరుడిని కాదు. విభజన సూత్రప్రా యంగా అంగీకరించిన తర్వాత, దేశంలో ఎక్కడా
మతపరమైన అల్ల ర్లు ఉండకూడదని నేను ఆదేశాలు జారీ చేస్తా ను. స్వల్పంగానైనా ఆందో ళన ఉంటే,
మొగ్గ లోని తుంచెయ్యడానికి నేను కఠినమైన చర్యలు తీసుకుంటాను.[60]

ఇదీ, ఆ తరువాత జరిగినదీ "ప్రభుత్వ యంత్రా ంగపు స్పష్ట మైన వైఫల్యాన్ని" చూపించింది అని జగ్మోహన్
అన్నాడు [60]

1947 జూన్ 3 న, విభజన ప్రణాళికను కాంగ్రెసు వర్కింగ్ కమిటీ అంగీకరించింది.[61] పంజాబ్ లో అల్ల ర్లు
లేవు. కానీ ఉద్రిక్తత ఉంది. నెహ్రూ , పటేల్ల
‌ ు గాంధీని పక్కన పెట్టా రు. అతడు మౌనదీక్ష చేపట్టా డు. మౌంట్
బాటన్ గాంధీని సందర్శించి, విభజనను మీరు వ్యతిరేకించరని ఆశిస్తు న్నానని అనగా, దీనికి గాంధీ "నేను
నిన్ను ఎప్పుడైనా వ్యతిరేకించానా?"అని సమాధానం రాసి చూపించాడు [62]

బ్రిటిషు భారతదేశంలో, భారతదేశం, పాకిస్తా న్ మధ్య సరిహద్దు ( రాడ్‌క్లిఫ్ లైన్) ను లండన్ న్యాయవాది
సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్ అధ్యక్షతన బ్రిటిషు ప్రభుత్వం నియమించిన నివేదిక ద్వారా నిర్ణ యించారు. పాకిస్తా న్
విడివిడిగా ఉన్న రెండు భూభాగాలతో ఉనికిలోకి వచ్చింది, తూర్పు పాకిస్తా న్ (నేడు బంగ్లా దేశ్), పశ్చిమ
పాకిస్తా న్. ఈ రెంటినీ భారతదేశం భౌగోళికంగా వేరు చేసింది. బ్రిటిషు ఇండియాలోని మెజారిటీ హిందూ
ప్రా ంతాలతో భారతదేశం, మెజారిటీ ముస్లిం ప్రా ంతాలతో పాకిస్తా న్ ఏర్పడ్డా యి.

1947 జూలై 18 న, బ్రిటిషు పార్ల మెంటు భారత స్వాతంత్ర్య చట్టా న్ని ఆమోదించింది. విభజన కొరకు
ఏర్పాట్లు చెయ్యడం, అనేక వందల సంఖ్యలో ఉన్న రాచరిక సంస్థా నాలపై బ్రిటిషు పాలనను తొలగించడం,
ఏ దేశంలో కలవాలో, లేదా స్వతంత్రంగా ఉండాలో నిర్ణ యించుకునే అధికారాన్ని వాటికే వదిలెయ్యడం ఈ
చట్ట ంలో ఉన్నాయి.[63] కొత్త దేశాలకు అవసరమైన చట్ట పరమైన చట్రా న్ని అందించడానికి భారత ప్రభుత్వ
చట్ట ం 1935 ను అనుసరించారు.

1947 ఆగస్టు లో కొత్త దేశంగా ఏర్పడిన తరువాత, పాకిస్తా న్ ఐక్యరాజ్యసమితి సభ్యత్వం కోసం దరఖాస్తు
చేసుకుంది, 1947 సెప్టెంబరు 30 న సర్వసభ్య సమావేశం దీన్ని అంగీకరించింది. 1945 నుండి
భారతదేశం ఐక్యరాజ్యసమితి వ్యవస్థా పక సభ్యుడిగా ఉన్నందున డొ మినియన్ ఆఫ్ ఇండియా ఆ సీటులోనే
కొనసాగింది.[64]

రాడ్‌క్లిఫ్ లైన్

పంజాబ్ ప్రా ంతం యొక్క పటం సుమారు 1947 .


ప్రధాన వ్యాసం: రాడ్‌క్లిఫ్ అవార్డ్
సింధుకు తూర్పున ఉన్న ఐదు నదుల ప్రా ంతం పంజాబ్. ఆ నదులు: జీలం, చెనాబ్, రావి, బియాస్,
సట్లెజ్. రెండేసి నదుల మధ్య గల భూమిని దో యబ్ అంటారు. పంజాబు 5 దో యబ్‌ల రాష్ట ం్ర . అవి:
సింధ్-సాగర్ దో యబ్ (సింధు జీలం మధ్య), జెచ్ దో యబ్ (జీలం / చెనాబ్), రెచ్నా దో యబ్ (చెనాబ్ / రవి),
బారి దో యబ్ (రవి / బియాస్), బిస్ట్ దో యబ్ (బియాస్ / సట్లెజ్) (కుడి వైపున ఉన్న మ్యాప్ చూడండి).
1947 ప్రా రంభంలో, పంజాబ్ సరిహద్దు కమిషన్ చర్చలకు దారితీసిన నెలల్లో , ప్రధాన వివాదాస్పద
ప్రా ంతాలు బారి, బిస్ట్ దో బ్ల
‌ లో కనిపించాయి. అయితే, రెచ్నా దో యబ్‌లోని కొన్ని ప్రా ంతాలు తమవేనని
కాంగ్రెస్, సిక్కులు పేర్కొన్నారు. బారి దో యబ్‌లో గురుదాస్‌పూర్, అమృత్‌సర్, లాహో ర్, మోంట్‌గోమరీ
జిల్లా లన్నీ వివాదాస్పదమయ్యాయి.[65] అన్ని జిల్లా ల్లో (అమృత్‌సర్ మినహా, ఇక్కడా 46.5%
ముస్లింలు) ముస్లిం మెజారిటీ ఉంది; గురుదాస్‌పూర్‌లో, ముస్లిం మెజారిటీ 51.1% వద్ద ఉంది. ఉప ప్రా ంత
స్థా యిలో, బారి దో యబ్‌లో కేవలం మూడు తహసీళ్ళు మాత్రమే ముస్లిమేతర మెజారిటీలను కలిగి
ఉన్నాయి. అవి: పఠాన్‌కోట్ (వివాదాస్పదంగా లేని గురుదాస్‌పూర్‌కు ఉత్త రాన), అమృత్‌సర్ జిల్లా లోని
అమృత్‌సర్, తర్న్ తరన్. అంతేకాకుండా, బియాస్-సట్లెజ్కు తూర్పున నాలుగు ముస్లిం-మెజారిటీ
తహసీళ్ళు ఉన్నాయి (రెండు చోట్ల ముస్లింల సంఖ్య, హిందువులు సిక్కుల మొత్త ం సంఖ్య కంటే
ఎక్కువ).[65]

సరిహద్దు కమిషన్ అధికారిక విచారణలను ప్రా రంభించడానికి ముందు, తూర్పు, పశ్చిమ పంజాబ్
ప్రా ంతాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసారు. వారి భూభాగాలను జిల్లా ల్లో ఉన్న మెజారిటీల ఆధారంగా
"నోషనల్ డివిజన్" ద్వారా తాత్కాలికంగా విభజించారు. పంజాబ్, బెంగాల్ లకు చెరొక సరిహద్దు కమిషన్‌
ఉంటుంది. ఒక్కో కమిషన్లో ఇద్ద రు ముస్లిం, ఇద్ద రు ముస్లిమేతర న్యాయమూర్తు లుంటారు. రెండు
కమిషన్ల కూ సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్‌చైర్మన్‌గా ఉంటాడు.[65] పంజాబ్ కమిషన్‌కు అప్పగించిన బాధ్యతలు
ఇలా ఉన్నాయి: "ముస్లింలు, ముస్లిమేతరుల మెజారిటీ ప్రా ంతాలను నిర్ధా రిస్తూ , దాని ఆధారంగా పంజాబ్
రెండు భాగాల సరిహద్దు లను గుర్తించడం. అలా చేసే క్రమంలో, ఇది ఇతర అంశాలను పరిగణనలోకి
తీసుకుంటుంది". ప్రతీ పక్షమూ (ముస్లింలు, కాంగ్రెసు / సిక్కులు) బేరానికి వీలు లేని పద్ధ తిలో తమ
వాదనను సమర్పించారు. న్యాయమూర్తు లకు కూడా రాజీ పడే అధికారం లేదు. అన్ని ప్రధాన సమస్యలపై
వారు "రెండు - రెండు"గా విడిపో యారు. ఇక వాస్త వ నిర్ణ యాలు తీసుకునే దుర్మార్గ పు పని మాత్రం సర్
సిరిల్ రాడ్‌క్లిఫ్ద
‌ ే అయింది.[65]

స్వాతంత్ర్యం, జనాభా బదిలీ, హింస

విభజన తరువాతి నెలల్లో కొత్త గా ఏర్పడిన రెండు రాష్ట్రా ల మధ్య భారీ యెత్తు న జనాభా మార్పిడి జరిగింది.
విభజన కారణంగా జనాభా బదిలీలు జరుగుతాయనే ఆలోచనే ప్రభుత్వాల్లో లేదు. మతపరమైన
మైనారిటీలు తాము నివసిస్తు న్న రాష్ట్రా ల్లో నే ఉంటారని భావించారు. అయితే, పంజాబుకు మినహాయింపు
ఉంది, ఇక్కడ ప్రా విన్సును ప్రభావితం చేసే మత హింస కారణంగా జనాభా బదిలీని వ్యవస్థీకృతంగా
జరిపారు. ఇది ఇతర ప్రా విన్సులకు వర్తించదు.

"1947 లో అవిభక్త భారతదేశ జనాభా సుమారు 39 కోట్లు . విభజన తరువాత, భారతదేశంలో 33 కోట్ల
మంది, పశ్చిమ పాకిస్తా న్‌లో 3 కోట్ల మంది, తూర్పు పాకిస్తా న్‌లో (ఇప్పుడు బంగ్లా దేశ్) 3 కోట్ల మంది
ఉన్నారు." సరిహద్దు లు ఏర్పడిన తర్వాత, సుమారు 145 లక్షల మంది ప్రజలు, మతపరమైన మెజారిటీ
ఉన్నచోట భద్రత ఉంటుందని భావించి సరిహద్దు లను దాటారు. 1951 పాకిస్తా న్ జనాభా లెక్కల ప్రకారం
పాకిస్తా న్లో కాందిశీకుల సంఖ్య 72,26,600. బహుశా వీళ్ళంతా భారతదేశం నుండి పాకిస్తా న్లోకి ప్రవేశించిన
ముస్లింలే అయి ఉంటారు; 1951 భారత జనాభా లెక్కల ప్రకారం 72,95,870 మంది కాందిశీకులున్నారు.
వీళ్ళంతా, విభజన జరిగిన వెంటనే పాకిస్తా న్ నుండి భారతదేశానికి వెళ్లి న హిందువులు సిక్కులూ అయి
ఉంటారు .[2] మొత్త ం 1.45 కోట్లు . అయితే రెండు దేశాల జనాభా గణనలు విభజన జరిగిన 4
సంవత్సరాల తరువాత జరిగాయి. సామూహిక వలసల తరువాత నికర జనాభా పెరుగుదల కూడా ఈ
సంఖ్యల్లో ఉంది.

సుమారు 112 లక్షల మంది (కాందిశీకుల్లో 77.4% మంది) పశ్చిమంలో ఉన్నారు. అందులో ఎక్కువ
మంది పంజాబ్ నుండే: 65 లక్షల మంది ముస్లింలు భారతదేశం నుండి పశ్చిమ పాకిస్తా న్‌కు వెళ్లా రు, 47
లక్షల మంది హిందువులు, సిక్కులు పశ్చిమ పాకిస్తా న్ నుండి భారతదేశానికి వెళ్లా రు; అందువల్ల
భారతదేశం నుండి పశ్చిమ పాకిస్తా న్ (ఇప్పుడు పాకిస్తా న్) కు నికర వలస 18 లక్షలు. మరో 33 లక్షల
మంది (కాందిశీకుల్లో 22.6%) తూర్పున ఉన్నారు: 26 లక్షలు తూర్పు పాకిస్తా న్ నుండి భారతదేశానికి,
7 లక్షలు భారతదేశం నుండి తూర్పు పాకిస్తా న్ (ఇప్పుడు బంగ్లా దేశ్) కు తరలారు; ఈ విధంగా, తూర్పున
నికర వలసలు భారతదేశంలోకి 19 లక్షలు
పంజాబ్

భారతదేశ విభజన సమయంలో అంబాలా స్టేషన్ వద్ద శరణార్థు ల ప్రత్యేక రైలు


బ్రిటిషు ఇండియా విభజనతో, పూర్వపు బ్రిటిషు ప్రా విన్స్ అయిన పంజాబ్‌కూడా రెండుగా విడిపో యింది.
ప్రా విన్స్ లో ఎక్కువగా ముస్లింలు ఉండే పశ్చిమ భాగం పాకిస్తా న్ లోని పంజాబ్ ప్రా విన్స్ అయింది;
హిందూ సిక్కులు మెజారిటీగా ఉండే తూర్పు భాగం భారతదేశం లోని తూర్పు పంజాబ్ రాష్ట ం్ర గా మారింది
(తరువాత దీన్ని పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ అనే మూడు రాష్ట్రా లుగా విభజించారు). చాలా
మంది హిందువులు, సిక్కులు పశ్చిమాన నివసించేవారు, చాలా మంది ముస్లింలు తూర్పున
నివసించేవారు. అలాంటి మైనారిటీలందరికీ చాలా భయాలుండేవి. విభజన వలన చాలా మంది ప్రజలు
స్థా నభ్రంశం చెందారు. మతకలహాలు చెలరేగాయి. కొందరు పంజాబ్‌లో హింసను ప్రతీకార మారణహో మం
అని అభివర్ణించారు.[68]

రెండు దిశల్లో నూ అత్యంత భారీ యెత్తు న జరిగిన వలసలను గానీ, కొత్త గా ఏర్పడిన సరిహద్దు కు రెండు
వైపులా జరిగిన భారీ హింసను గానీ కొత్త గా ఏర్పడిన ప్రభుత్వాలు ఊహించనేలేదు. ఏమాత్రం సిద్ధంగా లేవు
కూడా. మరణాల సంఖ్యపై అంచనాలు మారుతూ ఉన్నాయి - తక్కువలో తక్కువ 2,00,000 అని
అంచనా వెయ్యగా, అత్యధికంగా 20,00,000 అని అంచనా వేసారు. అన్ని ప్రా ంతాలలోకీ అత్యంత
ఘోరమైన హింస పంజాబ్‌లో జరిగిందని తేల్చారు. తూర్పు పంజాబ్‌లో (మలేర్క ‌ ోట్ల మినహా) ఒక్క ముస్లిం
కూడా ప్రా ణాలతో బయటపడలేదు. పశ్చిమ పంజాబ్‌లో ఒక్క హిందూ లేదా సిక్కు కూడా
బయటపడలేదు.[73]

లారెన్స్ జేమ్స్ ఇలా అన్నాడు: తన ప్రా విన్స్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ 5,00,000 మంది
ముస్లింలు మరణించారని పశ్చిమ పంజాబ్ గవర్నర్ సర్ ఫ్రా న్సిస్ ముడీ అంచనా వేయగా, కరాచీలోని
బ్రిటిషు హైకమిషన్ మాత్రం ఈ సంఖ్య 8,00,000 అని చెప్పింది. మౌంట్ బాటెన్ అతని మనుషులూ
2,00,000 మంది మాత్రమే చంపబడ్డా రని చెప్పిన మాట అర్ధ ంలేనిదని తేలింది : [జేమ్స్ 1998: 636] ".
[74]

ఈ కాలంలో, ముస్లింల హత్యకు తారా సింగ్ ఆమోదం ఉందని పలువురు ఆరోపించారు. 1947 మార్చి 3
న, లాహో ర్లో సింగ్, సుమారు 500 మంది సిక్కులతో కలిసి, "పాకిస్తా న్ ముర్దా బాద్" అని నినదించాడు.
రాజకీయ శాస్త వ ్ర ేత్త ఇష్తియాక్ అహ్మద్ ప్రకారం, "మార్చి 3 న, అతివాద సిక్కు నాయకుడు మాస్ట ర్ తారా
సింగ్ పంజాబ్ అసెంబ్లీ వెలుపల తన కిర్పాన్ (కత్తి ) ను ప్రదర్శించాడు. పాకిస్తా న్ అనే ఆలోచననే నాశనం
చేయాలని పిలుపునిచ్చాడు. దీంతో ఉత్త ర పంజాబ్‌లోని ముస్లింలు అధికంగా ఉన్న జిల్లా ల్లో ని ముస్లింలు,
సిక్కులకు హిందువులకు వ్యతిరేకంగా హింసాత్మకంగా ప్రతిస్పందించారు. అయినప్పటిక,ీ ఆ సంవత్సరం
చివరకు, పశ్చిమ పంజాబ్‌లో ముస్లిములు చంపిన హిందువులు సిక్కుల కంటే తూర్పు పంజాబ్‌లో
ఎక్కువ మంది ముస్లింలు చంపబడ్డా రు. " [75] పశ్చిమ పంజాబ్‌లోని హిందువులు, సిక్కుల కంటే
తూర్పు పంజాబ్‌లో అప్పటి వరకు రెట్టింపు ముస్లింలు చంపబడ్డా రని నెహ్రూ ఆగస్టు 22 న గాంధీకి లేఖ
రాశాడు.[76]

బెంగాల్

బెంగాల్ ప్రా విన్స్ పశ్చిమ బెంగాల్ (ఇండియన్ డొ మినియన్ లో కలిపారు), తూర్పు బెంగాల్ (పాకిస్తా న్
డొ మినియన్ లో కలిపారు) అనే రెండు ప్రా ంతాలుగా విభజించారు. 1955 లో తూర్పు బెంగాల్ పేరును
తూర్పు పాకిస్తా న్ గా మార్చారు. ఆ తరువాత 1971 బంగ్లా దేశ్ విముక్తి యుద్ధ ం తరువాత బంగ్లా దేశ్ అనే
స్వతంత్ర దేశంగా మారింది.

ముస్లిం మెజారిటీ జిల్లా లైన ముర్షిదాబాద్, మాల్డా లను భారతదేశానికి ఇచ్చారు. హిందూ మెజారిటీ జిల్లా
ఖుల్నా, బౌద్ధ మెజారిటీ (జనాభా బాగా తక్కువ) ఉన్న చిట్ట గాంగ్ హిల్ ట్రా క్ట్స్‌లను పాకిస్తా న్కు రాడ్క్లిఫ్
అవార్డు ద్వారా ఇచ్చారు.[77]

పాకిస్తా న్‌కు ప్రదానం చేసిన తూర్పు బెంగాల్ జిల్లా ల్లో ఉన్న వేలాది మంది హిందువులపై దాడులు
జరిగాయి. ఈ మతపరమైన హింస కారణంగా తూర్పు బెంగాల్ నుండి లక్షలాది మంది హిందువులు
భారతదేశంలో ఆశ్రయం పొ ందవలసి వచ్చింది. కలకత్తా లోకి హిందూ శరణార్థు లు భారీగా రావడం నగర
జనాభాను ప్రభావితం చేసింది. చాలా మంది ముస్లింలు నగరాన్ని విడిచిపెట్టి, తూర్పు పాకిస్తా న్ వెళ్ళారు.
హిందూ శరణార్థ కుటుంబాలు వారి ఇళ్ళూ ఆస్తు లను ఆక్రమించాయి.

సింధ్

విభజన సమయంలో, సింధ్ లోని సంపన్న మధ్యతరగతి ప్రజలు హిందువులే. హైదరాబాద్, కరాచీ,
షికార్పూర్, సుక్కూర్ వంటి నగరాల్లో ఎక్కువ మంది కేంద్రీకృతమై ఉన్నప్పటికీ అప్పటికి 14,00,000
మంది హిందూ సింధీలు ఉన్నారు. సింధ్‌లో నివసిస్తు న్న వందలాది మంది హిందువులు వలస వెళ్ళవలసి
వచ్చింది. భారతదేశం నుండి ముస్లిం శరణార్థు ల రాకతో సింధ్‌లో కొన్ని హిందూ వ్యతిరేక హింసకు
దారితీసింది. దీనికి స్థా నిక ముస్లింల నుండి మద్ద తు పెద్దగా లేదు. పశ్చిమ పంజాబ్ నుండి వలస
వెళ్ళవలసి వచ్చిన పంజాబీ హిందువులూ సిక్కుల మాదిరిగా కాకుండా సింధీ హిందువులపై హింస
తక్కువగా ఉంది.

1947 డిసెంబరు 6 న, భారతదేశంలోని అజ్మీర్‌లో మత హింస జరిగింది, దర్గా బజార్‌లో సింధీ హిందూ
శరణార్థు లకు, స్థా నిక ముస్లింలకూ మధ్య వాదన జరిగింది. మళ్లీ డిసెంబరు మధ్యలో అజ్మీర్‌లో హింస
తలెత్తి ంది. కత్తి పో ట్లు , దో పిడీలు, కాల్పులు జరిగాయి. ముస్లింలు ఎక్కువగా మరణించారు.[78] చాలా
మంది ముస్లింలు థార్ ఎడారి మీదుగా పాకిస్తా న్లోని సింధ్‌కు పారిపో యారు.[78] ఇది సింధ్ లోని
హైదరాబాద్ లో మరిన్ని హిందూ వ్యతిరేక అల్ల ర్ల కు దారితీసింది. జనవరి 6 న కరాచీలో హిందూ వ్యతిరేక
అల్ల ర్లు చెలరేగ,ి 1100 మంది మరణించినట్లు అంచనా.[78] 7,76,000 సింధీ హిందువులు భారతదేశానికి
పారిపో యారు.[79] ఉత్త ర గుజరాత్ పట్ట ణమైన గోద్రా కు సింధీ హిందూ శరణార్థు ల రాకతో 1948 మార్చిలో
అల్ల ర్లు జరిగాయి. ఇది గోద్రా నుండి పాకిస్తా న్కు ముస్లింల వలసలకు దారితీసింది.[78]

వలసలు జరిగినప్పటిక,ీ గణనీయమైన సింధీ హిందూ జనాభా ఇప్పటికీ పాకిస్తా న్ లోని సింధ్ ప్రా విన్స్లో
నివసిస్తు న్నారు, ఇక్కడ వారి సంఖ్య 1998 పాకిస్తా న్ జనాభా లెక్కల ప్రకారం 23 లక్షలు; భారతదేశంలో
సింధీ హిందువులు 2001 భారత జనాభా లెక్కల ప్రకారం 26 లక్షలు. సింధ్‌లోని కొన్ని సరిహద్దు
జిల్లా లైన థార్‌పార్కర్ జిల్లా , ఉమెర్క
‌ ోట్, మీర్‌పూర్ఖా స్, సంఘర్, బాడిన్ వంటి జిల్లా ల్లో హిందూ మెజారిటీ
ఉంది, కాని వారి జనాభా తగ్గు తోంది. వారు తమను తాము మైనారిటీగా భావిస్తు న్నారు. జిల్లా లో ఇప్పటికీ
ఉమెర్క ‌ ోట్‌లో మాత్రమే హిందువులు మెజారిటీగా ఉన్నారు. సింధీ సమాజం పెద్ద ఎత్తు న హింసను
ఎదుర్కోలేదు, కానీ మాతృభూమినీ, సంస్కృతినీ కోల్పోతున్నామని భావించింది.[78]

గుజరాత్
విభజన సమయంలో పంజాబ్, బెంగాల్‌లో జరిగినట్లు గుజరాత్‌లో సామూహిక హింస జరగలేదు.[80]
పాకిస్తా న్‌కు వలస వచ్చిన వారిలో కేవలం 2.2% మంది మాత్రమే గుజరాత్, బొ ంబాయి నగరాలకు
చెందినవారు, వారిలో 75% మంది తమ వ్యాపార ప్రయోజనాల రీత్యా కరాచీకి వెళ్లా రు.[80]

ఢిల్లీ

బాబర్ కాలం నుండి ఢిల్లీ మొఘల్ సామ్రా జ్యానికి రాజధానిగా ఉంది, అంతకు ముందరి టర్కీ ముస్లిం
పాలకులకు కూడా ఢిల్లీ రాజధానిగా ఉండేద.ి ఢిల్లీ లో విస్తా రమైన ఇస్లా మిక్ నిర్మాణ శైలి కనిపిస్తు ంది.
బలమైన ఇస్లా మిక్ సంస్కృతి నగరంలో విస్త రించింది. 1911 లో, బ్రిటిషు రాజ్ తమ రాజధానిని కలకత్తా
నుండి ఢిల్లీ కి మార్చినప్పుడు, నగరం యొక్క స్వభావం కొద్దిగా మారడం ప్రా రంభించింది. నగర ప్రధాన
భాగాన్ని బ్రిటిషు వాస్తు శిల్పి ఎడ్విన్ లుట్యెన్స్ పేరు మీద 'లుట్యెన్స్ ఢిల్లీ ' అని పిలుస్తా రు ఏదేమైనా, 1941
లో జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ జనాభాలో 33.2% ముస్లింలు.

1947 లో శరణార్థు లు ఢిల్లీ లోకి రావడం మొదలయ్యే సమయానికి, నిర్వాసితుల సమస్యను


ఎదుర్కోవటానికి నగరం సిద్ధంగా లేదు. శరణార్థు లు “ఎక్కడెక్కడ వెళ్ళేందుకు వీలుందో అక్కడక్కడికి
చొరబడిపో యారు… కళాశాలలు, దేవాలయాలు, గురుద్వారాలు, ధర్మశాలలు, సైనిక బ్యారక్లు , తోటలూ
మొదలైన చోట్ల నెలకొల్పిన శిబిరాల్లో కి వెళ్ళారు ” [81] 1950 నాటిక,ి నగరం యొక్క కొన్ని భాగాలలో
ఇళ్ళు నిర్మించుకోడానికి ప్రభుత్వం కాబ్జా దార్ల ను అనుమతించడం ప్రా రంభించింది. తత్ఫలితంగా, లజ్‌పత్
నగర్, పటేల్ నగర్ వంటి ప్రా ంతాలు ఉనికిలోకి వచ్చాయి. ఈనాటికీ వీటికి ప్రత్యేకమైన పంజాబీ లక్షణం
ఉంటుంది. అయితే, పంజాబ్ నుండి వేలాది హిందూ సిక్కు శరణార్థు లు నగరానికి పారిపో యి రావడంతో,
మత హింసలు రేగడంతో ఇది తిరుగుబాట్ల వాతావరణాన్ని సృష్టించింది. ఢిల్లీ లోని పాకిస్తా న్ దౌత్యవేత్త
హుస్సేన్, ఢిల్లీ ముస్లిం జనాభాను నిర్మూలించడానికే భారత ప్రభుత్వం ఉద్దేశించిందని లేదా వారి కర్మకు
వాళ్ల ను వదిలేసిందనీ ఆరోపించాడు. అమాయక ముస్లింలను ఆర్మీ దళాలు బహిరంగంగా కాల్చి
చంపాయని అతడు నివేదించాడు.[82] నగరంలో 1000 వరకు మరణాలు/క్షతులూ ఉన్నట్లు భారత
ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అంచనా వేసాడు. అయితే, ఇది 20 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఇతర
వర్గా లు పేర్కొన్నాయి..ఢిల్లీ హింస గురించి జ్ఞా నేంద్ర పాండే యొక్క ఇటీవలి కథనంలో ఢిల్లీ లో ముస్లిం
మరణాల సంఖ్య 20,000-25,000 మధ్య ఉన్నట్లు పేర్కొన్నాడు

రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా పదివేల మంది ముస్లింలను శరణార్థి శిబిరాలకు


తరలించారు. ఢిల్లీ లోని పురానా ఖిల్లా , ఈద్గా , నిజాముద్దీన్ వంటి అనేక చారితక ్ర ప్రదేశాలు శరణార్థి
శిబిరాలుగా మారిపో యాయి. వాస్త వానికి, చాలా మంది హిందూ సిక్కు శరణార్థు లు ఢిల్లీ ముస్లిం
నివాసులు వదిలిపెట్టిన ఇళ్ల ను ఆక్రమించారు.[84] ఢిల్లీ లో ఉద్రిక్తతలు తగ్గేనాటికి 3,30,000 మంది
ముస్లింలు నగరం వదలి పాకిస్తా న్‌కు పారిపో యారు. జనాభా లెక్కల ప్రకారం నగరంలో ముస్లిం జనాభా
1941 లో 33.2% నుండి 1951 లో 5.3%కి పడిపో యింది.

భారతదేశంలో శరణార్థు ల పునరావాసం: 1947-1951

1951 భారత జనాభా లెక్కల ప్రకారం, జనాభాలో 2% మంది శరణార్థు లే (పశ్చిమ పాకిస్తా న్ నుండి
1.3%, తూర్పు పాకిస్తా న్ నుండి 0.7%). ఒకే నగరానికి అత్యధిక సంఖ్యలో శరణార్థు లు వచ్చింది, ఢిల్లీ కి.
1947–1951 కాలంలో ఢిల్లీ జనాభా 10 లక్షల (9,17,939) నుండి 17 లక్షల కన్నా ఎక్కువకు
(1,744,072) పెరిగింది.[86] శరణార్థు లను పురానా ఖిల్లా , ఎర్రకోట, కింగ్స్‌వే క్యాంప్‌లోని సైనిక
బ్యారక్‌లలో (ప్రస్తు త ఢిల్లీ విశ్వవిద్యాలయం చుట్టూ ) ఉంచారు. కింగ్స్‌వే క్యాంప్‌, ఉత్త ర భారతదేశంలో
అతిపెద్ద శరణార్థి శిబిరాలలో ఒకటిగా మారింది. ఏ సమయంలోనైనా 35,000 మందికి పైగా శరణార్థు లు
అక్కడ ఉండేవారు. 1948 నుండి భారత ప్రభుత్వం చేపట్టిన విస్త ృతమైన భవన నిర్మాణ ప్రా జెక్టు ల ద్వారా
శిబిరాలను శాశ్వత గృహాలుగా మార్చారు. ఈ కాలంలో లజ్‌పత్ నగర్, రజిందర్ నగర్, నిజాముద్దీన్ ఈస్ట్,
పంజాబీ బాగ్, రెహగర్ పురా, జంగ్‌పురా, కింగ్స్‌వే క్యాంప్ వంటి అనేక హౌసింగ్ కాలనీలు ఢిల్లీ లో
వచ్చాయి. అఖిల భారత స్థా యిలో శరణార్థు ల కోసం విద్య, ఉపాధి అవకాశాలు, వ్యాపారాలు
ప్రా రంభించడానికి సులభమైన రుణాలు వంటి అనేక పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.[87]

చాలా మంది సిక్కులు, హిందూ పంజాబీలు పశ్చిమ పంజాబ్ నుండి వచ్చి తూర్పు పంజాబ్‌(అందులో
హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లు కూడా ఉన్నాయి) ఢిల్లీ ల్లో స్థిరపడ్డా రు. తూర్పు పాకిస్తా న్ (ఇప్పుడు
బంగ్లా దేశ్) నుండి పారిపో తున్న హిందువులు తూర్పు భారతదేశం, ఈశాన్య భారతదేశం అంతటా
స్థిరపడ్డా రు. చాలామంది పొ రుగున ఉన్న భారత రాష్ట్రా లైన పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపురలలో
స్థిరపడ్డా రు. కొంతమంది వలసదారులను అండమాన్ దీవులకు పంపారు. అక్కడ బెంగాలీలు అతిపెద్ద
భాషా సమూహంగా ఉన్నారు.

సింధీ హిందువులు ప్రధానంగా గుజరాత్, మహారాష్ట ,్ర రాజస్థా న్ల లో స్థిరపడ్డా రు. అయితే దూరాన,
మధ్యప్రదేశ్ల
‌ ో కూడా కొందరు స్థిరపడ్డా రు. మహారాష్ట ల
్ర ో సింధి హిందూ శరణార్థు ల కోసం కొత్త టౌన్‌షిప్
ఏర్పాటు చేసారు. భారత గవర్నర్ జనరల్ సర్ రాజగోపాలాచారి ఈ పట్ట ణానికి పునాది వేసి దానికి ఉల్హా స్
నగర్ (అవి 'ఆనందం నగరం') అని పేరు పెట్టా రు.

సెంట్రల్ ముంబైలోని సియోన్ కోలివాడ ప్రా ంతంలో ఎక్కువగా సిక్కులు, పంజాబీ హిందువులతో కూడిన
ఒక స్థా వరాన్ని నెలకొల్పారు. దీనికి గురు తేజ్ బహదూర్ నగర్ అని పేరు పెట్టా రు.[88]

పాకిస్తా న్లో శరణార్థు ల పునరావాసం: 1947-1951

1951 పాకిస్తా న్ జనాభా లెక్కల ప్రకారం ముస్లిం శరణార్థు లు అత్యధిక సంఖ్యలో తూర్పు పంజాబ్, సమీప
రాజ్‌పుతానా రాష్ట్రా ల (అల్వార్, భరత్‌పూర్) నుండి వచ్చారు. వారు 57,83,100 దాకా ఉన్నారు. పాకిస్తా న్
లోని మొత్త ం శరణార్థ జనాభాలో వీరు 80.1% దాకా ఉన్నారు.[89] పంజాబ్‌లో సరిహద్దు కు రెండు
వైపులా జరిగిన ప్రతీకార జాతి ప్రక్షాళన ప్రభావం ఇది. తూర్పు పంజాబ్‌లోని ముస్లిం జనాభాను పశ్చిమ
పంజాబ్‌లోని హిందూ / సిక్కు జనాభా లాగా బలవంతంగా తరిమేసారు.

భారతదేశంలోని ఇతర ప్రా ంతాల నుండి వలసలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: బీహార్, పశ్చిమ బెంగాల్,
ఒరిస్సాల నుండి 7,00,300 లేదా 9.8%; యుపి, ఢిల్లీ ల నుండి 4,64,200 లేదా 6.4%; గుజరాత్,
బొ ంబాయిల నుండి 1,60,400 లేదా 2.2%; భోపాల్, హైదరాబాదుల నుండి 95,200 లేదా
1.2%;మద్రా సు, మైసూరుల నుండి 18,000 లేదా 0.2%.[89]

పాకిస్తా న్లో వారి స్థిరనివాసానికి సంబంధించినంతవరకు, తూర్పు పంజాబ్, దాని సమీప ప్రా ంతాల నుండి
97.4% మంది శరణార్థు లు పశ్చిమ పంజాబుకు వెళ్లా రు; బీహార్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా నుండి
95.9% మంది పూర్వ తూర్పు పాకిస్తా న్ కు వెళ్ళారు; యుపి, ఢిల్లీ ల నుండి 95.5% ప్రధానంగా పశ్చిమ
పాకిస్తా న్ లోని, సింధ్ లోని కరాచీ విభాగంలోకి; భోపాల్, హైదరాబాద్ నుండి 97.2% పశ్చిమ
పాకిస్తా నుకు, ప్రధానంగా కరాచీకి; బొ ంబాయి, గుజరాత్‌ల నుండి పశ్చిమ 98.9% పాకిస్తా ను లోని
కరాచీకి; మద్రా సు మైసూరుల నుండి 98.9% మంది పశ్చిమ పాకిస్తా న్‌లోని కరాచీకి వెళ్లా రు.[89]

పశ్చిమ పంజాబ్‌లో అత్యధిక సంఖ్యలో శరణార్థు లు (73.1%) ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రధానంగా
తూర్పు పంజాబ్, దాని సమీప ప్రా ంతాల నుండి వెళ్ళారు. మొత్త ం వలసదారులలో 16.1%తో రెండవ
అతిపెద్ద శరణార్థు ల జనాభా సింధ్ చేరుకుంది. సింధ్ లోని కరాచీ విభాగం ఒక్కచోటికే మొత్త ం వలస
జనాభాలో 8.5% వెళ్ళింది. 6,99,100 మందితో తూర్పు బెంగాల్ శరణార్థు లు, మొత్త ం పాకిస్తా న్ ముస్లిం
శరణార్థ జనాభాలో 9.7%తో మూడవ స్థా నంలో ఉన్నారు. తూర్పు బెంగాల్‌లో 66.7% మంది శరణార్థు లు
పశ్చిమ బెంగాల్ నుండి, 14.5% బీహార్ నుండి, 11.8% అస్సాం నుండి వెళ్ళారు.[90]

NWFP, బలూచిస్తా న్ల లోకి అతి తక్కువ సంఖ్యలో వలసదారులు వెళ్ళారు. ఎన్‌డబ్ల్యుఎఫ్‌పికి 51,100
మంది వలసదారులు (వలస జనాభాలో 0.7%) ఉండగా, బలూచిస్తా న్ 28,000 (వలస జనాభాలో
0.4%) వెళ్ళారు.

1948 లో పశ్చిమ పంజాబ్‌లో శరణార్థు ల జనాభా గణనను ప్రభుత్వం చేపట్టింది. ఇది భారతదేశంలో వారి
మూలం ఎక్కడో తేల్చింది.

తూర్పు పంజాబ్, పొ రుగు ప్రా ంతాల జిల్లా ల నుండి పశ్చిమ పంజాబ్‌లోకి వెళ్ళిన ముస్లిం శరణార్థు ల డేటా
[91]

స్థ లాలు సంఖ్య


అమృత్సర్ (తూర్పు పంజాబ్) 7,41,444
జలంధర్ (తూర్పు పంజాబ్) 5,20,189
గురుదాస్‌పూర్ (తూర్పు పంజాబ్) 4,99,793
హో షియార్పూర్ (తూర్పు పంజాబ్) 3,84,448
కర్నాల్ (తూర్పు పంజాబ్) 3,06,509
హిస్సార్ (తూర్పు పంజాబ్) 2,87,479
లుధియానా (తూర్పు పంజాబ్) 2,55,864
అంబాలా (తూర్పు పంజాబ్) 2,22,939
గుర్గా వ్ (తూర్పు పంజాబ్) 80,537
రోహ్తక్ (తూర్పు పంజాబ్) 172,640
ఢిల్లీ 91,185
కాంగ్రా (తూర్పు పంజాబ్)33,826
యునైటెడ్ ప్రా విన్సెస్ 28,363
సిమ్లా (తూర్పు పంజాబ్) 11,300
తూర్పు పంజాబ్, రాజ్‌పుతానాలోని సంస్థా నాల నుండి పశ్చిమ పంజాబ్‌లోని ముస్లిం శరణార్థు ల డేటా
[91]
సవరించు
పేరు సంఖ్య
పాటియాలా (తూర్పు పంజాబ్) 3,08,948
అల్వార్ (రాజ్‌పుతానా) 1,91,567
కపుర్తా లా (తూర్పు పంజాబ్) 1,72,079
ఫరీద్కోట్ (తూర్పు పంజాబ్) 66,596
భరత్‌పూర్ (రాజ్‌పుతానా) 43,614
నభా (తూర్పు పంజాబ్) 43,538
జింద్ (తూర్పు పంజాబ్) 41,696
ఇతర చిన్న రాష్ట్రా లు కలిసి 39,322

తప్పిపో యిన వ్యక్తు లు


1931, 1951 జనాభా లెక్కల ప్రకారం అందించిన డేటాను ఉపయోగించి పంజాబ్ లోని జిల్లా ల్లో కి వచ్చే
జన ప్రవాహం, వెళ్ళే జన ప్రవాహాలపై చేసిన అధ్యయనం ప్రకారం, పశ్చిమ భారతదేశాన్ని విడిచిపెట్టి,
పాకిస్తా న్ చేరుకోని ముస్లిములు 13 లక్షల మంది అని అంచనా వేసారు.[92] పశ్చిమ సరిహద్దు లో
తప్పిపో యిన హిందువులు / సిక్కుల సంఖ్య సుమారు 8 లక్షలు.[93] పంజాబ్ సరిహద్దు లో విభజనకు
సంబంధించిన వలసల కారణంగా తప్పిపో యిన వారి మొత్త ం సంఖ్య సుమారు 22 లక్షలకు
చేరుతుంది.[93] 1931, 1941, 1951 జనాభా లెక్కలను ఉపయోగించి పంజాబ్ ప్రా ంతంలో విభజన
యొక్క జనాభా పరిణామాలపై మరొక అధ్యయనం ప్రకారం పంజాబ్లో 23 - 32 లక్షల మధ్య
తప్పిపో యారని తేల్చింది.

మహిళల పునరావాసం

అల్ల ర్ల సమయంలో అపహరణకు, అత్యాచారానికీ గురైన మహిళలను పునరుద్ధ రించడానికి


ప్రయత్నిస్తా మని ఇరువర్గా లు ఒకరికొకరు వాగ్దా నం చేశాయి. 33,000 మంది హిందూ, సిక్కు మహిళలను
అపహరించారని భారత ప్రభుత్వం చెప్పగా, అల్ల ర్ల సమయంలో 50,000 మంది ముస్లిం మహిళలను
అపహరించారని పాకిస్తా న్ ప్రభుత్వం పేర్కొంది. 1949 నాటిక,ి భారతదేశంలో 12,000, పాకిస్తా న్లో 6,000
మంది మహిళలను కాపాడారని చట్ట పరమైన వాదనలు ఉన్నాయి.[95] 1954 నాటికి భారతదేశంలో
20,728 మంది ముస్లిం మహిళలను కాపాడారు, 9,032 మంది హిందూ, సిక్కు మహిళలను పాకిస్తా న్
లో కాపాడారు.[96] తమ కుటుంబం తమను స్వీకరించదని భయపడి చాలా మంది హిందూ, సిక్కు
మహిళలు భారతదేశానికి తిరిగి వెళ్లడానికి నిరాకరించారు. అలాగే ముస్లిము మహిళలు పాకిస్తా న్
వెళ్ళేందుకు నిరాకరించారు

విభజన తరువాత వలసలు

పాకిస్థా న్

1951 జనాభా లెక్కల తరువాత కూడా, భారతదేశం నుండి అనేక ముస్లిం కుటుంబాలు 1950 ల్లో ను
1960 ల ప్రా రంభంలోనూ పాకిస్తా నుకు వలస వెళ్లడం కొనసాగించాయి. చరితక ్ర ారుడు ఒమర్ ఖలీది
ప్రకారం, 1947 1971 డిసెంబరు డిసెంబరు మధ్య యుపి, ఢిల్లీ , గుజరాత్, రాజస్థా న్, మహారాష్ట ,్ర
మధ్యప్రదేశ్, కర్ణా టక, ఆంధ్రపద
్ర ేశ్, తమిళనాడు, కేరళల నుండి ముస్లింలు పశ్చిమ పాకిస్తా న్‌కు వలస
వెళ్ళారు. వలసల తదుపరి దశ 1973 - 1990 ల మధ్య జరిగింది. ఈ వలసదారుల ప్రా థమిక గమ్యం
కరాచీతో పాటు సింధ్ లోని ఇతర పట్ట ణ కేంద్రా లు.

1959 లో, అంతర్జా తీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) ఒక నివేదికను ప్రచురించింది, 1951 నుండి 1956
వరకు, భారతదేశం నుండి మొత్త ం 6,50,000 మంది ముస్లింలు పశ్చిమ పాకిస్తా న్‌కు మకాం
మార్చారు.[99] అయితే, పాకిస్తా న్కు భారత ముస్లిం వలసల గురించి వాదనల ప్రా మాణికతపై విజారియా
(1969) సందేహాలను లేవనెత్తి ంది. ఎందుకంటే 1961 పాకిస్తా న్ జనాభా లెక్కలు ఈ గణాంకాలను
ధ్రు వీకరించలేదు. అయితే, 1961 పాకిస్తా న్ జనాభా లెక్కల్లో అంతకు ముందరి దశాబ్ద కాలంలో
భారతదేశం నుండి పాకిస్తా న్కు 8,00,000 మంది ప్రజలు వలస వచ్చారని ప్రకటించారు.[100] పాకిస్తా న్
బయలుదేరిన వారిలో, చాలామంది తిరిగి రాలేదు.

పాకిస్తా న్కు భారత ముస్లింల వలసలు 1970 లలో బాగా తగ్గా యి. ఈ ధో రణిని పాకిస్తా న్ అధికారులు
గుర్తించారు. 1973-1994 మధ్య కాలంలో, సరైన ప్రయాణ పత్రా లపై 8,00,000 మంది సందర్శకులు
భారతదేశం నుండి వచ్చారని, 1995 జూన్ లో, పాకిస్తా న్ అంతర్గ త మంత్రి నసీరుల్లా బాబర్ జాతీయ
అసెంబ్లీ కి తెలియజేశారు. వీరిలో 3,393 మంది మాత్రమే ఉండిపో యారు.[101] ఇలాంటి ధో రణినే
చూపిస్తూ , భారతీయ పాకిస్తా న్ ముస్లింల మధ్య వివాహాలు కూడా బాగా తగ్గా యి. న్యూ ఢిల్లీ లోని పాకిస్తా న్
హైకమిషనర్ రియాజ్ ఖోఖర్ 1995 నవంబరులో చేసిన ప్రకటన ప్రకారం, 1950 - 1960 లలో
సరిహద్దు మీదుగా జరిగిన వివాహాల సంఖ్య సంవత్సరానికి 40,000 నుండి సంవత్సరానికి 300 కి
పడిపో యింది.[101]

1965 ఇండో -పాకిస్తా న్ యుద్ధ ం తరువాత, 3,500 మంది ముస్లిం కుటుంబాలు థార్ ఎడారి లోని భారత
భాగం నుండి థార్ ఎడారి లోని పాకిస్తా న్ విభాగానికి వలస వెళ్ళారు.[102] 1965 యుద్ధ ం తరువాత 400
కుటుంబాలు నాగర్‌లో స్థిరపడ్డా యి. మరో 3000 కుటుంబాలు పశ్చిమ పాకిస్తా న్‌లోని సింధ్ ప్రా విన్స్‌లోని
చాక్రో తాలూకాలో స్థిరపడ్డా రు.[103] పాకిస్తా న్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 12 ఎకరాల భూమిని
ఇచ్చింది. ప్రభుత్వ రికార్డు ల ప్రకారం ఈ భూమి మొత్త ం 42,000 ఎకరాలు.[103]

పాకిస్తా న్‌లో 1951 జనాభా లెక్కల ప్రకారం తూర్పు పాకిస్తా న్‌లో 6,71,000 మంది శరణార్థు లు
నమోదయ్యారు, వీరిలో ఎక్కువ మంది పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చారు. మిగిలిన వారు బీహార్ కు
చెందినవారు.[104] 1951–1956 కాలంలో ఐఎల్‌ఓ ప్రకారం, ఐదు లక్షల మంది భారతీయ ముస్లింలు
తూర్పు పాకిస్తా న్‌కు వలస వచ్చారు.[105] 1961 నాటికి ఈ సంఖ్య 8,50,000 కి చేరుకుంది. రాంచీ
జంషెడ్పూర్ల లో జరిగిన అల్ల ర్ల తరువాత, బీహారీలు అరవైల చివరలో తూర్పు పాకిస్తా న్కు వలస వెళ్ళడం
కొనసాగించారు. వీరి సంఖ్య సుమారు పది లక్షల వరకు ఉంటుంది.[106] విభజన తరువాతి రెండు
దశాబ్దా లలో సుమారు 15 లక్షల మంది ముస్లింలు పశ్చిమ బెంగాల్, బీహార్ ల నుండి తూర్పు బెంగాల్కు
వలస వచ్చారని అంచనాలు సూచిస్తు న్నాయి.[107]

భారతదేశం

పాకిస్తా న్‌లో మతపరమైన హింస కారణంగా హిందువులు భారత్‌కు పారిపో తూనే ఉన్నారు. వీరిలో ఎక్కువ
మంది భారతదేశంలోని రాజస్థా న్ రాష్ట ం్ర లో స్థిరపడుతూంటారు.[108] హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్
పాకిస్తా న్ డేటా ప్రకారం, 2013 లో కేవలం 1,000 హిందూ కుటుంబాలు భారతదేశానికి
పారిపో యాయి.[108] 2014 మే లో, పాలక పాకిస్తా న్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) సభ్యుడు డాక్టర్
రమేష్ కుమార్ వాంక్వానీ పాకిస్తా న్ జాతీయ అసెంబ్లీ లో ప్రతి సంవత్సరం 5,000 మంది హిందువులు
పాకిస్తా న్ నుండి భారతదేశానికి వలస పో తున్నారని వెల్లడించాడు.[109] భారతదేశం 1951
ఐక్యరాజ్యసమితి శరణార్థు ల తీర్మానంపై సంతకం చేయలేదు కాబట్టి పాకిస్తా న్ నుండి వచ్చే హిందూ
వలసదారులను శరణార్థు లుగా గుర్తించడానికి భారత్ నిరాకరించింది.[108]

పశ్చిమ పాకిస్తా న్‌లోని సింధ్ ప్రా విన్స్‌లోని థార్‌పార్కర్ జిల్లా లో జనాభా 1947 లో స్వాతంత్ర్యం
సమయంలో 80% హిందూ, 20% ముస్లింలు. 1965, 1971 నాటి ఇండో -పాకిస్తా న్ యుద్ధా ల
సమయంలో, హిందూ ఉన్నత కులాలు, వారి అండలో ఉన్నవారూ భారతదేశానికి పారిపో యారు. ఇది
జిల్లా లో భారీ జనాభా మార్పుకు దారితీసింది.[102] 1978 లో భారతదేశం 55,000 మంది
పాకిస్తా నీయులకు పౌరసత్వం ఇచ్చింది.[108] పాకిస్తా న్ 1998 జనాభా లెక్కల నాటిక,ి థార్‌పార్కర్‌
జనాభాలో ముస్లింలు 64.4%, హిందువులు 35.6% ఉన్నారు.

తూర్పు పాకిస్తా న్ నుండి భారతదేశానికి హిందువుల వలసలు విభజన తరువాత నిరంతరాయంగా


కొనసాగాయి. భారతదేశంలో 1951 జనాభా లెక్కల ప్రకారం 25 లక్షల మంది శరణార్థు లు తూర్పు
పాకిస్తా న్ నుండి వచ్చారు. వారిలో 21 లక్షల మంది పశ్చిమ బెంగాల్‌కు, మిగిలిన వారు అస్సాం, త్రిపుర,
ఇతర రాష్ట్రా లకు వలస వచ్చారు.[104] ఈ శరణార్థు లు తరంగాలుగా వచ్చారు. వాళ్ళు వచ్చింది విభజన
సమయంలో మాత్రమే కాదు. 1973 నాటికి వారి సంఖ్య 60 లక్షలకు చేరుకుంది. కింది డేటా తూర్పు
పాకిస్తా న్ నుండి వచ్చిన శరణార్థు ల ప్రధాన తరంగాలను, వలసలు సంభవించిన సంఘటనలనూ
చూపిస్తు ంది:[110][111]

సంవత్సరం కారణం సంఖ్య


1947 విభజన 3,44.000
1948 హైదరాబాదు స్వాధీనం 7,86.000
1950 1950 బారిసల్ అల్ల ర్లు 15,75.000
1956 పాకిస్తా న్ ఇస్లా మిక్ రిపబ్లి క్‌గా మారినప్పుడు 3,20,000
1964 హజ్రత్బ ‌ ాల్ సంఘటనపై అల్ల ర్లు 6,93.000
1965 1965 ఇండో -పాకిస్తా న్ యుద్ధ ం 1,07,000
1971 బంగ్లా దేశ్ విముక్తి యుద్ధ ం 15,00,000
1947-1973 మొత్త ం 60,00,000

📚 APPSC, TSPSC RRB,SI, కానిస్టేబుల్ ఉద్యోగాల

📚
కోసం వాట్సాప్, టెలిగ్రా మ్, ఫేస్బుక్ గ్రూ ప్స్ లో జాయిన్
అవ్వండి .

🗞️ 📚
📖 📝
డైలీ న్యూస్ పేపర్స్ ,మెటీరియల్స్ ,కరెంట్

👇👇👇👇👇👇👇👇
అఫైర్స్ ,జాబ్ నోటిఫికేషన్.

1.వాట్సప్ లింకు(మెటీరియల్స్+కరెంట్ అఫైర్స్+న్యూస్

👇
పేపర్స్)(ఏదో ఒక వాట్సప్ గ్రూ పులో మాత్రమే జాయిన్
అవ్వండి)
గ్రూ పులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ Click
చేయండి
గ్రూ పులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ Click
చేయండి
గ్రూ పులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ Click
చేయండి

👇
2.టెలిగ్రా మ్ లింక్(3,000 మెటీరియల్ అప్లో డ్
చేశాము)
గ్రూ పులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ Click
చేయండి

👇
3.ఫేస్బుక్ లింకు(దేశంలో విడుదలవుతున్న మొత్త ం
నోటిఫికేషన్ల కోసం)
గ్రూ పులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ Click
చేయండి

👇
4.GET LIVE JOBS (కేవలం ఉద్యోగ నోటిఫికేషన్ల
కోసం)
గ్రూ పులో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ Click
చేయండి
5. ఉద్యోగ నోటిఫికేషన్లు , ఆన్లైన్ ఫ్రీ ఎగ్జా మ్స్, కరెంట్

👇
అఫైర్స్, ఆరోగ్యానికి సంబంధించిన సూత్రా లు, A to Z
మెటీరియల్స్ కోసం వెబ్సైటు
https://www.prudhviinfo.com/

◎ ══════ ❈ ══════ ◎

You might also like