You are on page 1of 20

ఎ.సి.

భక్తివేదాంత స్వామి
ప్రభుపాద
అభయ్ చరణారవింద భక్తివేదాంత స్వామి ప్రభుపాద (1896 సెప్టెంబరు 1 - 1977 నవంబరు 14[1] ) ఇంటర్నేషనల్
సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ISKCON) [2][2] సంస్థా పకాచార్యులు.[1][3][4] ఇస్కాన్ అనుచరులు భక్తివేదాంత
స్వామి ప్రభుపాదను చైతన్య మహాప్రభు ప్రతినిధిగా, దూతగా చూస్తా రు.[5] ఈ సంఘం "హరేకృష్ణ ఉద్యమం "గా
ప్రసిద్ధి పొందింది.[6]
ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద

1974లో జర్మనీలో ప్రభుపాదులు

శీర్షిక అంతర్జా తీయ కృష్ణ


చైతన్య సంఘం
సంస్థా పకాచార్యులు.
వ్యక్తిగతం
జననం అభయ్ చరణ్ దే
1896 సెప్టెంబరు 1
కలకత్తా , బెంగాల్ ప్రెసిడెన్సీ,
బ్రిటిష్ ఇండియా.
మరణం 1977 నవంబరు 14
(వయసు 81)
బృందావన్, భారతదేశము
చివరి మజిలీ భక్తి వేదాంతస్వామి
సమాధి, బృందావనం
మతం గౌడీయ వైష్ణవం,
హిందూమతము
జాతీయత భారతీయుడు
ఇతర పేర్లు అభయ
చరణారవింద,అభయ
చరణ్ దే
Senior posting

Based in బృందావన్, భారతదేశము


Period in office 1966 - 1977
Predecessor భక్తిసిద్ధాంత సరస్వతీ
ఠాగూరు
Initiation దీక్ష–1932, సన్యాసం–
1959

Post గురువు, సన్యాసి,


ఆచార్యుడు
Website Official Website of
ISKCON (http://iskco
n.org/)

కలకత్తా లోని ఓ వ్యాపారస్తు ల కుటుంబంలో జన్మించిన ఈయన స్కాటిష్ చర్చ్ కళాశాలలో చదివాడు. ఒక చిన్న
మందుల సంస్థ లో పనిచేస్తూ భక్తిసిద్ధాంత సరస్వతి స్వామిని కలిసి ఆయన శిష్యుడైనాడు. 1959 లో పదవీ
విరమణ చేశాక సంసారాన్ని విడిచిపెట్టి సన్యాసి అయ్యాడు. వైష్ణవ గ్రంథాలపైన వ్యాఖ్యానాలు రాయడం
మొదలుపెట్టా డు. వైష్ణవ సన్యాసిగా దేశ విదేశాలు తిరుగుతూ 1966 లో ఇస్కాన్ ను స్థా పించి, దాని ద్వారా గౌడీయ
వైష్ణవ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేశాడు. ఈయనను చాలామంది అమెరికన్ మత పండితులు అంగీకరించినా, కల్ట్ ను
వ్యతిరేకించే వారు మాత్రం విమర్శించారు. నల్లవారిపై ఆయన అభిప్రా యాలు, నిమ్నకులాల వారు, యూదుల పట్ల
వివక్ష, హిట్ల ర్ నేరాలపై ఆయన ధృక్పథం విమర్శలకు గురయ్యాయి.[7][8][9]
జీవిత విశేషాలు
ఈయన భారతదేశములోని కలకత్తా నగరములో 1896 వ సంవత్సరములో జన్మించాడు. కలకత్తా లోని స్కాటిష్
చర్చి కళాశాలలో విద్యాభ్యాసం చేశాడు.[10] ఆయన ఆధ్యాత్మిక గురువైన భక్తిసిద్ధాంత సరస్వతీ
గోస్వామిని[11]1922లో కలకత్తా లో మొదటిసారి కలుసుకున్నాడు.[12] భక్తిసిద్ధాంత సరస్వతీ గోస్వామి ప్రముఖ
వైదిక విద్వాంసుడు. 64 గౌడీయ మఠాలను స్థా పించాడు. ఆయన యువకుడైన ప్రభుపాదను చూసి సంతోషంతో
వైదిక విజ్ఞా నాన్ని బోధించడానికి తమ జీవితాన్ని అంకితం చేయమని ఉపదేశించాడు. ఆనాటి నుండి ప్రభుపాద
భక్తిసిద్ధాంత సరస్వతీ గోస్వామికి శిష్యుడై పదకొండు సంవత్సరాల తరువాత 1950లో దీక్షను తీసుకున్నాడు.[13]

సన్యాసం
మొదటి సమావేశములోనే భక్తిసిద్ధాంత సరస్వతీ ఠాకూరు ఆంగ్ల భాష ద్వారా వైదిక విజ్ఞా నాన్ని ప్రచారము
చేయమని ప్రభుపాదులను కోరాడు. తరువాతి సంవత్సరాలలో ఆయన భగవద్గీతకు భాష్యం వ్రా సి, గౌడీయమఠ
కార్యక్రమాలకు తోడ్పడ్డా రు. 1944లో బ్యాక్ టు గాడ్ హెడ్ (భగవద్ద ర్శనం ) అనే ఆంగ్ల పక్ష పత్రికను స్థా పించాడు.
అది ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో వారి శిష్యుల చేత ముప్పయి కంటే ఎక్కువ భాషలలో కొనసాగిస్తు న్నారు.
ప్రభుపాదుల భక్తి, విజ్ఞా నాలను గుర్తించి 1947 లో గౌడీయ వైష్ణవ సంఘం వారికి భక్తివేదాంత బిరుదును ఇచ్చి
గౌరవించింది. 1950 లో 54 సంవత్సరాల వయస్సులో ఆయన వైవాహిక జీవితాన్ని విడిచిపెట్టి ఎక్కువ కాలం
గ్రంథాలను చదవడానికి, వ్రా యడానికి, వినియోగించ సాగాడు. తరువాత వారు బృందావనానికి వెళ్ళి అక్కడ మధ్య
యుగంలో చరిత్ర ప్రసిద్ధి కెక్కిన శ్రీ శ్రీ రాధా దామోదర మందిరములో అతి నిరాడంబర జీవితమును గడిపాడు.

రచనలు
బృందావనంలో ఆయన చాలా సంవత్సరాల పాటు విద్యా వ్యాసంగం చేసి అనేక గ్రంథాలను రచించాడు. 1959లో
సన్యాసాన్ని స్వీకరించాడు. వైష్ణవ తత్వంపై రచనలు చేయడం మొదలు పెట్టా డు.[14] తమ జీవిత ముఖ్యరచన
అయిన శ్రీమద్భాగవతములోని 18,000 శ్లో కాలను అనువాదము వ్యాఖ్యానాలతో కూడిన అనేక సంపుటాలుగా
రచనను ప్రా రంభించాడు. గ్రహాంతర సులభమానం అనే మరో గ్రంథాన్ని కూడా రచించాడు.
శ్రీ మద్భాగవతము మూడు సంపుటాలుగా ప్రచురించాక ఆయన తమ ఆధ్యాత్మికాచార్యుల కోరికను
నెరవేర్చడానికి 1965 లో అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్ళాడు. అప్పటి నుండి భారతీయ వేదాంత గ్రంథాలపై
ప్రా మాణికాలైన వ్యాఖ్యానాలు, భాషాంతరీకరణలు, సంగ్రహ వ్యాఖ్యలు 70 సంపుటాలకు పైగా రచించాడు.

అంతర్జా తీయ కృష్ణ చైతన్య సంఘం


స్థా పన
1965లో ఆయన మొట్ట మొదటిసారిగా ఒక వాణిజ్య నౌకలో న్యూయార్క్ నగరానికి వెళ్ళినపుడు అతని చేతిలో
ఒక్క పైసా కూడా లేదు. తరువాత ఒక సంవత్సరానికి అంటే 1966 జూలైలో అతికష్ట ము మీద అంతర్జా తీయ కృష్ణ
చైతన్య సంఘాన్ని (ఇస్కాన్) ను స్థా పించగలిగాడు.[11][15] పదిసంవత్సరాల లోపలే ఆ సమాజం బాగా అభివృద్ధి
చెంది ప్రపంచమంతటా వ్యాపించసాగింది. పాఠశాలలు, మందిరాలను, ఆశ్రమాలను మొదలైనవాటిని
నెలకొల్పగలిగింది.

1968 లో ప్రభుపాద న్యూవర్జీనియాలో కొండల పైన ఆధ్యాత్మిక సమాజాన్ని స్థా పించి దానికి నూతన బృందావనం
అని పేరును పెట్టా డు.[16] అక్కడే ఒక వైదిక పాఠశాలను నెలకొల్పి పాశ్చాత్య దేశాలకు సైతం వైదిక గురుకుల
విద్యావిధానాన్ని అందుబాటులోకి తెచ్చాడు. ఆ నూతన బృందావనం ఇప్పుడు వేయి ఎకరాల పైగా వైశాల్యము
గల ప్రదేశములో విరాజిల్లు తోంది. అమెరికాలోని వారి శిష్యులు అలాంటి సంఘాలను చాలా వరకు స్థా పించారు.

1972 లో ఆయన పాశ్చాత్య దేశాలలోని డల్లా స్, టెక్సస్ లో వైదిక పద్ధ తిలో గురుకులాలను ఏర్పాటు చేశాడు.
1972లో ముగ్గు రు విద్యార్థు లతో ప్రా రంభమైన గురుకులము 1975 నాటికి 150 మంది విద్యార్థు లతో
విరాజిల్లింది.[17]
భారతదేశంలో ఆధ్యాత్మిక కేంద్రా లు

భక్తిసిద్ధాంత సరస్వతీ ఠాకూరు

ప్రభుపాద భారతదేశంలో అంతర్జా తీయ కేంద్రా లను ఏర్పాటు చేయడానికి ప్రో త్సహించాడు. పశ్చిమ బెంగాల్లో ని
మాయాపూరులో శ్రీథామం అనే అంతర్జా తీయ ఆధ్యాత్మిక కేంద్రా న్ని నిర్మించాడు. అది వైదిక పఠనానికి
అనుకూలంగా నిర్మించబడింది. భారతదేశంలోని బృందావనంలో మహోన్నతమైన కృష్ణబలరామ మందిరం ఆ
పద్ధ తుల ప్రకారమే నిర్మించారు. అక్కడ ఒక అంతర్జా తీయ అతిథి గృహం కూడా నిర్మించారు. పాశ్చాత్యులక్కడ
నుండి వైదిక సంస్కృతిని స్వయంగా నేర్చుకునే అవకాశం ఉంది. భారతదేశంలో సుమారు పద్దెనిమిది ముఖ్య
స్థా నాలలో ఇతర కేంద్రా ల నిర్మాణం జరుగుతున్నది.

గ్రంథ రచనలు

వృందావనంలో అతను సమాధి


ప్రభుపాద చేసిన ముఖ్యమైన సేవ గ్రంథరచన . దానిద్వారా ఆయన ప్రసిద్ధి పొందాడు. వారి గ్రంథాలు
ప్రా మాణికత్వానికీ, జ్ఞా న గాంభీర్యానికీ, వైదుష్యానికిపెట్టింది పేరు. అవి విద్వాంసుల చేత ఎంతగానో
గౌరవింపబడ్డా యి. అనేక కళాశాలల్లో ప్రా మాణిక పాఠ్య గ్రంథాలుగా నిర్ణయించబడ్డా యి. వారి రచనలు ఎనభైకి పైగా
భాషలలోకి అనువదించబడ్డా యి. ఆయన గ్రంథాలను ముద్రించి, ప్రకటించడం కోసం 1972 మేలో భక్తివేదాంత బుక్
ట్రస్టు అనే సంస్థ ను స్థా పించారు.[18] అది ఇప్పుడు భారతీయ వైదిక తత్వ విషయాలపై గ్రంథాలను ప్రచురించే
ప్రపంచ ప్రముఖ సంస్థ గా రూపొందింది.

పర్యటనలు
వార్థక్యం సమీపించినా అతను సుమారు పన్నెండు సంవత్సరాలలో ప్రపంచమంతటా పద్నాలుగు సార్లు ఉపన్యాస
యాత్ర సాగిస్తూ ఆరు ఖండాలలో పర్యటించాడు. అంతటి నిర్విరామ కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నప్పటికీ వారు
తమ గ్రంథ రచనలు కొనసాగిస్తూ నే ఉండేవాడు. వారి గ్రంథాలన్నింటినీ కలిపితే ఒక ప్రఖ్యాత వైదిక వేదాంత
సాహిత్య సంస్కృతీ గ్రంథాలయము అవుతుంది.

అస్తమయం
ఆయన నవంబరు 14 1977 న ఉత్తరప్రదేశ్ లోని బృందావనంలో మరణించాడు.[19] ప్రపంచమంతటా 100కిపైగా
ఆశ్రమాలు, మందిరాలను, సంస్థ లను స్థా పించి కృష్ణ చైతన్య సంఘాన్ని అంతర్జా తీయ సంస్థ గా (ఇస్కాన్) తీర్చి
దిద్దా డు.
చిత్రమాలిక

1974లో శిష్యులతో కలసి వ్యాహ్యాళి

ఇస్కాన్ దేవాలయం, న్యూఢిల్లీ


ఇస్కాన్ దేవాలయం, తిరుపతి

ఇస్కాన్ ప్రభుపాద పాలెస్, న్యూవర్జీనియాలో


1982లో ప్రభుపాద పాలెస్ ఆఫ్ గోల్డ్

వృందావనంలో సమాధి
మాయాపూర్ లో పుష్పసమాధి

1977లో స్థా
పించిన 108 ప్రపంచవ్యాప్త
దేవాలయాలలో ఒకటి.వృందావనంలో కృష్ణ -
బలరాముల చిత్రం

మూలాలు
1. Jones, Constance (2007). Encyclopedia of
Hinduism. New York: Infobase Publishing.
pp. 77–78. ISBN 978-0-8160-5458-9.

2. Goswami et al. 1983, p. 986


3. Who's Who in Religion (https://archive.org/d
etails/whoswhoinreligio0000unse)
(2nd ed.). Chicago, Illinois: Marquis Who's
Who. 1977. p. 531 (https://archive.org/deta
ils/whoswhoinreligio0000unse/page/531/
mode/1up) . ISBN 0-8379-1602-X.
"Prabhupada, A. C. Bhaktivedanta Swami,
leader, Hare Krishna Movement. Founder,
Internat. Soc. for Krishna Consciousness,
1965."

4. బ్రిటానికా విజ్ఞా న సర్వస్వము లో Hare Krishna (h


ttp://www.britannica.com/EBchecked/topi
c/255215) సమగ్ర వివరాలు
5. Satsvarupa dasa Goswami (1968).
Prabhupada: Messenger of The Supreme
Lord (https://archive.org/details/isbn_9788
189574307) . India: Bhaktivedanta Book
Trust Publications. pp. vi. ISBN 978-
8189574307.

6. Melton, John Gordon. Hare Krishna (http://


www.britannica.com/eb/article-9039249/H
are-Krishna#218723.hook) .
www.britannica.com. Archived (https://web.
archive.org/web/20080616152959/http://
www.britannica.com/eb/article-9039249/H
are-Krishna#218723.hook) from the
original on 16 జూన్ 2008. Retrieved 9 April
2015. {{cite encyclopedia}}:
|work= ignored (help)
7. Bryant, E.; Ekstrand, M. (2004). The Hare
Krishna Movement: The Postcharismatic
Fate of a Religious Transplant (https://book
s.google.com/books?id=mBMxPdgrBho
C) . Columbia University Press. pp. 350–
377. ISBN 978-0-231-50843-8. Archived (ht
tps://web.archive.org/web/202304221659
40/https://books.google.com/books?id=m
BMxPdgrBhoC) from the original on 22
April 2023. Retrieved 24 February 2023.
8. Rochford, E.B. (2007). Hare Krishna
Transformed (https://books.google.com/b
ooks?id=XPqgBwAAQBAJ&pg=PA126) .
New and Alternative Religions. New York
University Press. p. 126. ISBN 978-0-8147-
7688-9. Archived (https://web.archive.org/
web/20230301053839/https://books.goog
le.com/books?id=XPqgBwAAQBAJ&pg=PA
126) from the original on 1 March 2023.
Retrieved 1 March 2023.
9. Scheck, Frank (21 June 2017). " 'Hare
Krishna! The Mantra, the Movement and the
Swami Who Started It All': Film Review" (htt
ps://www.hollywoodreporter.com/movies/
movie-reviews/hare-krishna-mantra-movem
ent-swami-who-started-all-1015535/) . The
Hollywood Reporter. Archived (https://web.
archive.org/web/20230301064414/https://
www.hollywoodreporter.com/movies/movi
e-reviews/hare-krishna-mantra-movement-s
wami-who-started-all-1015535/) from the
original on 1 March 2023. Retrieved 1
March 2023.

10. Jones, Constance (2007). Encyclopedia of


Hinduism. New York: Infobase Publishing.
pp. 77–78. ISBN 0-8160-5458-4.

11. Klostermaier 2007, p. 217


12. Goswami 1984, page xv
13. Goswami 2002, Vol.1 Chapter 6
14. Goswami 2002, Vol.1 Chapter 9
15. Ekstrand & Bryant 2004, p. 23
16. Charles S. J. White (2004). A Catalogue of
Vaishnava Literature on Microfilms in the
Adyar Library (https://archive.org/details/c
atalogueofvaisn0000unse) . Delhi: Motilal
Banarsidass. ISBN 81-208-2067-3.

17. Klostermaier 2007, p. 309


18. Cole & Dwayer 2007, p. 25
19. Vasan & Lewis 2005, p. 128

ఇవి కూడా చూడండి


నరసరావుపేట ఇస్కాన్ టెంపుల్
బయటి లింకులు
Wikimedia Commons has media related
to Prabhupada.
A. C. Bhaktivedanta Swami Prabhupada
- Source material (https://web.archive.or
g/web/20140424034716/http://vaniquot
es.org/wiki/Category:Prabhupada)
Prabhupada's English rendition of the
Bhagavad Gita (http://andhra-telugu.co
m/prabhupada/)

"https://te.wikipedia.org/w/index.php?
title=ఎ.సి._ భక్తివేదాంత_ స్వామి_ ప్రభుపాద&oldid=41337
09" నుండి వెలికితీశారు
ఈ పేజీలో చివరి మార్పు 13 ఫిబ్రవరి 2024న 07:31కు
జరిగింది. •
అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద
లభ్యం

You might also like