You are on page 1of 8

స్త్రీ దేవతా పూజా నిరూపణము

రామః - స్త్రీణాం పూజ్యతమా లోకే దేవతాస్త ం ప్రకీర్తయ ! | తాసాం కాలం విధానం చ ఫలం పూజనత స్థ థా || 1

పుష్కరః - శ్రియస్సంపూజనం కార్యం స్త్రీభిస్తు సతతం గృహే | పుష్పా೭ర్ఘ్యమాల్య నై వేద్య ధూపదీపా೭ను లేపనైః ||

గృహసమ్మార్జనం రామ ! తథా తస్యోపలేపనమ్‌- పుష్పోపహారకరణం సుధా శుక్ల త్వ మేపచ || 3

సర్వమేత ద్విజానీయా చ్ఛ్రియ స్సంపూజనం ద్విజః | స్నానా೭ను లేపనం యచ్చ గంధవర్ణా ೭వధారణమ్‌|| 4

సువర్ణతా చ నారీణాం శ్రియ స్సంపూజనా ద్భవేత్‌| అష్ట మీషు చ సర్వాసు పూజనీయా ೭ప్యశోకికా || 5

గంధమాల్య నమస్కార ధూపధీపా೭దిభి స్త థా | తస్మిన్నహని యా భుం క్తే నక్త ం తైల వివర్జితమ్‌|| 6

భవత్యథ విశోకా సా యత్ర యత్రా ೭భిజాయతే | అష్ట మీషు చ సర్వాసు న చేచ్ఛక్నోతి భార్గ వ! || 7

ప్రో ష్ఠ పద్యాం వ్యతీతాయాం యా స్యా త్కృష్టా ೭ష్ట మీ ద్విజ ! తస్యా మవశ్యం కర్త వ్యా దేవ్యాః పూజా యథావిధి || 8

అపామివ త్రిలోకేషు ప్రకృతిః స్త్రీషు చోచ్యతే | యా ప్రేరయతి కర్మాణి లోకేషు ద్విజసత్త మ ! 9

తస్యాం సంపూజనం కార్యం శుక్లా ం పంచదశీం తథా | మాల్యాను లేపనై ః శుక్లై ర్ధూ పేన చ సుగంధినా || 10

రక్త వస్త ్ర ప్రదానేన దీపదానేన చా೭ప్యథ | వైదళైశ్చ తథా భ##క్ష్యైః భోజ్యైశ్చోషై#్య స్త థైవ చ || 11

పూజయిత్వా చ తాం దేవీం భోక్త వ్యం నిశి భార్గ వ! | యది పంచదశీ సర్వాం నశక్నోతి కదాచన || 12

దేవ్యా స్సంపూజనం కార్య మవశ్య మపి కార్తికే | ఉషార్తిం పూజయే ద్యాతు సా తు నారీ పతివ్రతా || 13

సదా ధర్మరతా సాధ్వీ లోకే భవతి భార్గ వ! | నా೭శుభే చ మతిస్త స్యాః కదాచిదపి జాయతే || 14

ఏకాదశీం తథా కృష్ణా ం ఫాల్గు నే మాసి భార్గ వ ! | ఛందో దేవస్య కర్త వ్యా పూజా ధర్మభృతాం వరః || 15

పూజనా చ్ఛందో దేవస్య తనయం గుణవర్జితమ్‌| న ప్రా ప్నోతి తథా ೭ప్నోతి తథా గుణవంత మసంశయమ్‌|| 16

గంధమాల్యాదిభి ర్భక్త్యా తథా వై వస్తు దేవతామ్‌| ఏకాదశీం తథా ప్రా ప్య చైతశు
్ర క్ల స్య పూజయేత్‌|| 17

సంపూజ్యతాం మహాభాగ ! గృహభంగో న జాయతే | శుక్లా ష్ట మీం తు సంప్రా స్య మాసి భాద్రపదే తథా || 18
దూర్వాప్రతానం లుంపే త్త దుత్త రా೭శాభి గామినమ్‌పూజయేద్గృహ మానీయ గంథమాల్యా೭ను లేపనైః | 19

ఫలమూలై స్త థా రామ ! ధూపదీపౌ వివర్జయేత్‌| అగ్నిపక్వం తథా సర్వం న నివేద్యం కథంచన || 20

భోక్త వ్యం చ తథా రామ ! వహ్ని పాక వివర్జితమ్‌| దూర్వాంకురస్థా ం సంపూజ్య విధినా ¸°వనశ్రియమ్‌| 21

¸°వనం స్థిర మాప్నోతి యత్రయత్రా ೭భిజాయతే సో పవాసా తు యా నారీ కృష్ణ పక్షస్య కార్తికే || 22

ద్వాదశ్యాం పూజయే ద్విష్టు ం గాం సవత్సా మనన్త రమ్‌| గంధమాల్య నమస్కార ధూపధీపా೭న్న సంపదా || 23

నై వేద్యం గోరసం సర్వం వర్జనీయం ప్రయత్నతః | భోక్త వ్యం చ న ధర్మజ్ఞ | దో గ్జవ్యానైన చా೭ర్జు నీ || 24

స్త్రీలకు మిక్కిలి పూజనీయులైన దేవతలం గీర్తిపుమని యాపూజాసమయము విధానము ఫలమును గూడ

యానతిమ్మని పరశురాముడడుగ బుష్కరుండిట్లనియె. స్త్రీలు గృహమందేవేళ లక్ష్మి పూజ సేయవలెను. పుష్పార్ఘ్య

ధూపదీపనై వైద్యాదులతో నర్చింపవలెను. దేవతా గృహసమ్మార్జనము అనులేపనము పుష్పోపహారకరణము

తెల్లసున్నము పూయుట యిదంతయు లక్ష్మి పూజయని యే యెరుంగనగును. స్నానానులేపనము.

గంధావదారణము స్త్రీలకు సువర్ణము (మంచి చాయ) లక్ష్మి పూజ వలన గల్గు ను అన్ని యష్ట ములందు అశోకికయను

దేవతను పూజింపవలెను. గంధమాల్య నమస్కార ధూప దీపాదులచే నా నాడు నక్త ముండి తై లవర్జితముగ భోజనము

చేయునేని యా యింతి మరు జన్మ మందు విశోక యగును. అన్ని యష్ట ములందు అశోక పూజ సేయలేని దేని

ప్రో ష్ట పది గడిచిన కృష్ణా ష్ట మి నాడా పూజ తప్పక చేయవలెను. ముల్లో కములందు. నీరు ప్రకృతి (మూలద్రవ్యమ

ు)అన్నట్లు స్త్రీగూడ ప్రకృతి యనియు చెప్పబడినది. లోకమందు కర్మ ప్రేరణను స్త్రీయే చేయును. అ ప్రకృతిని శుక్ల పక్ష

పూర్ణిమనాడు తెల్లని పూల మాలలతో గంథముతో సుగంధభరితమైన ధూపముతో పూజసేయవలను. రక్త వస్త మ
్ర ు

సమకూర్చవలెను. దీపము వెట్టవలెను. విదళములైన వాని (సెనగలు, పెసలు మినుములు మొదలగునవి

ద్విదళములు విసరిన రెండు ముక్కలగు నవి. అట్లు రెండు ముక్కలు గానివి గోధుమలు బియ్యము, మొదలయినవి

విదళములు) జేసిన భక్ష్యములు భోజ్యములు చోష్యములతో నా దేవింబూజించి రాత్రి భోజనము సేయవలెను. దానినే

నక్త మందురు. ప్రతిపూర్ణిమనాడు పూజ చేయలేని యెడల నాదేవిని కార్తీక పూర్ణమి నాడు తప్పక చేయవలెను. ఏ

పతివ్రత ఉషార్తిని పూజించు నా విడ లోకమందు ధర్మాసక్తికలదగును. ఆమెపతి యెన్నడు నశుభ స్థా నమందు

బుట్ట డు. ఫాల్గు ణ బహుళైకాదశి నాడు ఛందో దేవతకు పూజ సేయవలెను. ఛందో దేవ పూజ వలన స్త్రీ గుణహీనుని

కుమారుని గనక గుణవంతునే కనును. భక్తితో గంధమాల్యాదులచే చైతశు


్ర క్లెకాదశినాడు వాస్తు దేవతా పూజ

సేయవలెను. అందువలన గృహభంగమెన్నడును గలుగదు. భాద్రపదశుక్లా ష్ట మినాడు గరిక దుబ్బల నుత్త ర
దిశభిముఖముగా జనువానిని బెరికి ఇంటికి దెచ్చి గంధ మాల్యాదులచే పండ్ల తో పూజింపవలెను. ధూపదీపములు

మాత్రము పనికిరావు. అగ్నిపక్వమైన పదార్థము నివేదింపరాదు. అపక్వములచే నైవేద్యము పెట్టవలెను. తాను యపక్వ

పదార్థములనే తినవలెను. గరికపో చలందున్న వన లక్ష్మిని బుజించిన జన్మించిన చోటనెల్ల స్థిర ¸°వనము నొందును.

కార్తిక బహుళద్వాదశినాడు యువతి యుపవసించి విష్ణు వును తరువాత సవత్సమైన గోవును గంధ మాల్య ధూపదీప

నమస్కారములతో బూజింపవలెను. గోరసము సర్వము ఆవుపాలు పెరుగు నెయ్యి మొదలయినవి యేవియు

నివేదింపరాదు. తాను దినరాదు. ఆ పాలు పిదుకరాదు.

గానః ప్రా ప్నోతి కృత్వైవం నా೭త్రకార్యా విచారణా | ధేను తాం యధి విప్రా య ప్రదదాతి యథావిధి || 25

స్వర్గ లోక మథ೭೭సాద్య న తతో వినివర్త తే | కార్తికే చ తథా మాసి కృతికాయాం చ పూజనమ్‌|| 26

కర్త వ్యం గంధకల శైర్గంధ మాల్యా೭ను లేప నైః | భ##క్ష్యైశ్చ పరమా೭న్నైశ్చ కుల్మాషైః పర్పటై స్త థా || 27

శక్త్యా వసై#్త్రశ్చ ధర్మజ్ఞ ః మహారంజన రంజనై ః | గుడేన మధునాచైవ సితయా లవణన చ || 28

అర్థ్రకేణక్షుణా చైవ తథా కాలోద్భవైః ఫలై ః | సర్వైశ్చ వివిధైరన్నైర్గ ంధై ర్నానావిధై స్త థా || 29

పానకైశ్చ తథా హృద్యైః పూజనీయాశ్చ కృత్తి కా ః | సహచంద్రమసా రామ ! తేన సౌభాగ్య మశ్నుతే || 30

నారీ చ రూపలావణ్య ధర్మేచా೭గ్ర్యాం తథా మతిమ్‌| అవైధవ్యంచ ధర్మజ్ఞ ! యత్ర యత్రా ೭భిజాయతే || 31

లవణస్య తులాం కృత్యా మహారంజన రంజితే || వస్త్రే వస్త్రేణ తే೭నాథ సాలంకారం సిత చ్ఛవిమ్‌|| 32

కృత్వా పిండం హరిద్రా ೭క్త ం కృత్తి కానాం నివేదయేత్‌| గ్రా హయే ద్ర్భాహ్మణం తాం చ ప్రా ప్తే చంద్రో దయే తథా || 33

అనేక కర్మాణా నారీ సౌభాగ్యం మహదశ్నుతే | పురుషో ೭ ప్యధ వై శుద్ధో సౌభాగ్యం మహదశ్నుతే || 34

యా భుం జ్తే గోరసప్రా యం కృత్వా బ్రా హ్మణ పూజనమ్‌| సప్త జన్మా೭తరాణ్యవ సౌభాగ్యం రూప మేవ చ || 35

స్వర్గే తు భోగా నాప్నోతి సహభర్త్రా తు సా శుభా | 36

ప్రా ప్య పంచదశీం రామ ! తథా శుక్లా ం చ కార్తికీం| కార్తికం కార్తికం రామ ! గృహభిత్తౌ సమాలిఖేత్‌|| 37

ఉపద్వారం గృహద్బాహ్యం నానావర్ణైస్తు వర్ణకైః| గృహో పకరణం శక్త్యా తయోశ్చైవా೭ భితో లిఖేత్‌|| 38
పీఠ ఖడ్గా ೭సనా೭ద్యత్ర శకటోలూఖలాదికమ్‌| తతస్తౌ పూజయే న్నారీ నానభక్తి పరా శుచి ః || 39

గంధమాల్య నమస్కార ధూపధీపా೭న్న సంపదా | ఇక్షుణక్షు వికారైర్వా విశేషేణ ఛ పూజయేత్‌|| 40

తయోస్తు పూజనం కృత్వా మత్స్యంచ సికతాయుతమ్‌| శక్తి నేతం్ర న్యసేత్‌క్షీరే తచ్చ దద్యాద్ద్విజాతయే || 41

తతశ్చ నక్త ం భుంజీత తిలతైల వివర్జితమ్‌| అనయోః పూజనాద్రా మ ! గృహభంగం న చా ೭ప్నుయాత్‌|| 42

పతివ్రతా మహాభాగ ! దీర్ఘ మాప్నోతి జీవితమ్‌| కార్తికే చ తథా మాసి సార్థం చంద్రమసా సదా || 43

రోహిణ్యాం రోహిణీ పూజా కర్త వ్యా విధినా ద్విజ ః | సర్వై రవిధవా

చిహ్నైర్ల వణన చ భూరిణా || 44

ఇట్లు చేసిన గోసమృద్దినందును. ఆ దేనువును విప్రు నికిచ్చినవాడు స్వర్గ మంది తిరిగర


ి ాడు. కార్తికమాసమందు కృత్తి కా

నక్షత్రమందు (కార్తిక పూర్ణిమ) గంధకలశములతో గంధమూల్యాను లేపనములతో భక్ష్యములతో పరమాన్నములతో

కుల్మాషములు పర్పటములతో పూజ చేయవలెను. యథాశక్తిగా మహారంజనము అయిన (పట్టు బంగారు వెండిజరీల

గల) వస్త మ
్ర ులతో బెల్లము తేనె పంచదార ఉప్పుతో అల్ల ముతో చెరకుతో నాకాలమందు పండు పండ్ల తో

వివిధమృష్టా న్నములతో నానావిధగంధములతో మనోహర పానకములతో కృత్తి కా నక్షత్ర దేవతలను చంద్రు నితో గూడ

పూజింపవలెను. దాన సౌభాగ్యవంతుడగును. స్త్రీ రూపలావణ్యవతి యగును. ధర్మ మందును బుద్ధిగలదగును.

ఎచ్చటపుట్టినను ధీర్ఘ సుమంగళియగును. లవణతులాదానము చేయవలెను. అనగా తెల్లని ఉప్పును వస్త మ


్ర ుతో

మూటగట్టి జరీ వస్త మ


్ర ుతో చేసిన తక్కడె యందుంచి, అలంకరించి పసుపుతో ముద్ద చేసి కృత్తి కులకు నివేదింపవలెను.

చంద్రో దయమయినతర్వాత దానిని బ్రా హ్మణునికిదాన మీయవలెను. దీని వలన స్త్రీ మహా సౌభాగ్యవంతురాలగును.

కృత్తి క ప్రతిపాదమందు నా కృత్తి కలం బూజించి బ్రా హ్మణులం బూజించి గోరస ప్రా యముగ భోజనము చేసన
ి వనిత

సప్త జన్మములు సౌభాగ్యవతి రూపవతియు నగును. భర్త తో నామె స్వర్గ భోగముల ననుభవించును. కార్తిక పూర్తిమ

నాడు కార్తికమును కార్తికి చిత్రమును యింటి గోడమీద వ్రా యవలెను. ఇంటి వెలుపలి ఉపద్వారమున నానావిధముల

రంగులతో వారిని చిత్రించి యా మూర్తు ల కెదురుగ గృహో పకరణ సామగ్రిని (అనగా పీఠము ఖడ్గ ము కుర్చీ శకటము

రోలును మొదలు వానిని) జిత్రించి భక్తి భరితమై యా కార్తికీ కార్తిక దేవతలను గంధ మాల్యనమస్కార ధూపదీపాన్న

సమృద్ధితో బూజింపవలెను. చేఱకు వికారములు = చెఱకు పానకము పంచదార బెల్లముతో జేసిన భక్ష్యములతో విశేష

పూజ చేయవలెను. ఆదేవత లిద్ద రినట్లు పూజించి పంచదారతో ముత్యపు చిప్పను కన్నులుగా నమర్చి

మత్స్యవిగ్రహముచేసి పాలలో నుంచి ద్విజునకది దానమీయవలెను. ఆటుపై నక్త మునందు (రాత్రి) తిలలు తైలము
లేకుండ భోజనము సేయవలెను. వీరి పూజ వలన గృహభంగ మెన్నడును బొ ందరు. పతివ్రతయై దీర్ఘా యువందును

కార్తిక మాసమందు రోహిణీనక్షత్రమందు (పూర్ణిమమరునాడు) చంద్రు నితో రోహిణీ నక్షత్ర దేవతా పూజ యథావిధి

నొనర్చవలెను. ఆ పూజలో ముత్తైదువ యొక్క పుణ్యస్త్రీ చిహ్నములయిన పసుపు, కుంకుమ, మంగళసూత్రము,

నల్ల పూసలు, కాటుకయునను నైదువస్తు వులను ప్రధానముగా బూజచేయవలెను. సమృద్ధ మైన ఉప్పుతో గూడ యీ

పూజ నెరపవలెను.

గంధమాల్య నమస్కార ధూప దీపా7 న్నసపందా | తథా కుంకుమరక్తేన శక్త్యా భార్గ వ ! వాససా || 45

సో భాగ్యం పరమాప్నోతి కృత్వైత త్పరమా7ంగనా | శుక్ల పక్ష త్రయోదశ్యాం యా చ నారీ పతివ్రతా || 46

పూజయే త్సోపవాసా చ కామదేవ మతంద్రితా | పట్ట వర్ణక విన్యాసం తస్య భార్యా తథా పతిమ్‌|| 47

గంధమాల్య నమస్కార ధూపదీపా7 న్న సంపదా | గుడేన మధునా చైవ సితయా చాంద్రికేణ చ || 48

లవణన రసై శ్చాన్యైర్గ ంధై స్ససై#్యః పృథక్‌పృథక్‌| భ##క్ష్యై ర్నానావిధై శ్చైవ కుంకుమా7 ర్ద్రేణ వాససా || 49

గంధతోయా7ంబు వూర్ణేన ద్రు మ పల్ల వ శాలినా | పూర్ణకుంభేన భ##వ్యేన మాల్యకంఠేన భార్గ వః || 50

కామదేవాయ నో దద్యా ద్యదవ్లు ం కించి దేవ తు | తతశ్చ పశ్చా ద్భోక్త వ్యం సర్వ మవ్లు వివర్జితమ్‌|| 51

సర్వాన్‌కామా నవాప్నోతి కామ పూజావిధాయినీ | అథ చేన్నైవ శక్నోతి సర్వాం రామ ! త్రయోదశీమ్‌|| 52

చైత్ర శుక్లేన సర్వాసాం ఫల మాప్నోత్యసంశయమ్‌| తస్మా త్సర్వ ప్రయత్నేన చైత్ర శుక్ల త్రయోదశీమ్‌|| 53

కామస్య పూజా కర్త వ్యా సర్వకామ ప్రదాయినీ | కామదేవం సమభ్యర్చ్య కార్య మాత్మాభిపూజనమ్‌|| 54

కుంకుమాంకై స్త థా వసై#్త్ర ర్గ ంధ మాల్య విభూషణౖః | భర్తా రం వూజయే త్పశ్చా న్నరీ తు కృతమండనా || 55

కుంకుమాంకేన వస్త్రేణ గంధమాల్యై ర్మనోహరైః | పురుషో 7 పి సమభ్యర్చ్య కామదేవ మసంశయమ్‌|| 56

సర్వాన్‌కామా నవాప్నోతి నా7 త్రకార్యా విచారణా | తథా శుక్ల చతుర్థీషు గౌరీపూజా సదా భ##వేత్‌|| 57

స్నాతాభి స్సోపవాసాభి స్సూర్యస్యోదయనం ప్రతి | గంధ మాల్య నమస్కార ధూపదీపా7 న్న సంపదా || 58

గుడేన సితయా చా7 పి మధునా చా7 ర్ద్రకేణ చ | సర్వైశ్చా7 విధవా చిహ్నై ర్ల వణన చ భూరిణా || 59
చతుర్థీద్వితీయే పూజ్యా సర్వక్త్యా విశేశషతః | ఆషాఢే7 ప్యథవా మాసి మాఘే చా7 ప్యథవా ద్విజః || 60

చతుర్ణా మపి కుండానాం మధ్యే సూర్యాంశు సేవినీ | ఆషాఢే సో పవాసా తు తృతీయాయాం తథా వసేత్‌|| 61

న తస్యా దుర్ల భం లోకే కించి ద్భవతి భార్గ వ! | మాఘే7 ప్యుపో షితా మాసి రాత్ర్యన్తే తుహినోత్కరైః || 62

శుక్లీకృత్వా7 ఖిలాన్యంగా న్యధ్యాస్తే శయనం యయా | తతశ్చ శీతతోయేన పశ్చాత్స్నానం సమాచరేత్‌|| 63

సా7 పి కామా నవాప్నోతి యాన్‌రామ ! మనసేచ్ఛతి | పతివ్రతా సదా లోలా సుభగా రూపసంయుతా || 64

గంధమాల్య ధూపదీపాన్న సంపదతో నమస్కారములతో శక్తి యున్నచో కుంకుమమురంగుగల వస్త మ


్ర ులతో పూజ

సేయవలెను. పుణ్యాంగన యీ పూజచేసి పరమ సౌభాగ్యమందును. శుక్ల పక్ష త్రయోదశినాడు సాధ్వి యుపవాసముండి

తొందర పాటు లేక కామదేవుని యాయన సతిని రతీదేవిని పట్ట వర్ణక విన్యాసమున (వస్త మ
్ర ుమీద రంగులతో చిత్రించి)

గంధమాల్య నమస్కార ధూపదీపనైవేద్య సమృద్ధిగా బెల్లము, పంచదార, తేనె, అల్ల ము, ఉప్పు మరి నైదు రసములచే

గంధములచే సస్యములచే వేరు వేరు పెక్కు రకముల భక్ష్యములచే, కుంకుమతో దడిపిన వస్త మ
్ర ుతో, చందనోదక

పూర్ణము మంగళ పల్ల వ భరితము మాలాంలంకృత కంఠ భాగముగల పూర్ణకుంభముతో రతీ మన్మథులం

బూజింపవలెను. కామదేవునకు పులుపు యే మాత్రము సేయరాదు. మన్మథపూజ చేసన


ి యావిడ యవ్వల

భోజనము సేయవలెను. అందు పులుపు పనికిరాదు. కామపూజ చేసిన కామిని సర్వకామములను బడయును. అన్ని

త్రయోదశులు చేయలేనిచో నొక్క చేత్ర త్రయోదశి నాడైన యీరతీ మన్మథ పూజిచేసిన సుదతి సర్వత్రయోదశీ

పూజాఫలమందును. సర్వప్రయత్నముగా నీ పూజను పుణ్యాంగనలు సేసి తీరవవలెను. కామదేవ పూజ చేసి తరువాత

తన్నుదా పూజించుకొన వలెను. కుంకుమాలంకృతములైన వస్త మ


్ర ులతో గంధమాల్యా భూషణములతో,

దానలంకరించుకొని భర్త ను బూజింపవలెను. కుంకుమమాంకమయిన వస్త మ


్ర ుతో గంనమాల్యాదుబతో బురుషుడును నీ

కామ పూజ గావించి సర్వకామములం బొ ందును. అదేవిధముగా శుక్ల చతుర్థినాడు గౌరీపూజ చేయనగును.

స్నానముసేసి యుపవాసముసేసి సూర్యోదయవేళ గంధమాల్యాది షో డశోపచారములతో బెల్లము

సర్వసుమంగళచిహ్నములు అనగా పసుపు, కుంకుమ, కాటుక మొదలయినవానితో సమృద్ధియైన ఉప్పుతో

శుక్ల కృష్ణ పక్ష చతుర్థు లు రెంటియందు సర్వశక్తితో గౌరీపూజ గావింపవలెను. ఆషాఢమున మాఘమందిది సేయవలెను.

ఆషాఢములో తదియనాడుపవాసండి యీ పూజ సేసిన యామెకు లోకమందు దుర్ల భ##మైనదే కొంచెము నుండదు.

మాఘమందు గూడ యుపవాసముసేసి వేకువయందు మంచు బిందువులచే తన సర్వావయములను


దెలుపొ నరించుకొని పానుపుపైనధివసించి యవ్వల చన్నీళ్ల తో స్నానము సేయవలెను. అట్లు సేసిన పతివ్రత

మనసుపడిన కోరికలన్నింటిని బొ ందును. ఏయాందో ళనములేక సౌభాగ్యవతియై సౌందర్యవతియై రాణించును.

ధర్మప్రియా చ భవతి గౌరీవూజన తత్పరా | ఆషాఢే దాడిమం పుష్పం మధౌ కార్పాస సంభవమ్‌|| 65

నివేద్య సర్వ మార్వాయై సౌభాగ్యం మహ దశ్నుతే | శక్రా ణీ చ తథా పూజ్యా మాసి భాద్రపదే భ##వేత్‌|| 66

స్త్రీణాం గౌరీవిధానేన సర్వకామ ప్రదా హి సా | ప్రో ష్ఠ పదస్య మాసస్య చతుర్థ్యాం ద్విజసత్త మః || 67

శక్రా ణీ పూజనం కృత్వా నాక పృష్టే మహీయతే | పూజాతిధిమ సర్వాసు రామ! బ్రా హ్మణ పూజనమ్‌|| 68

కర్త వ్యం యచ్చ నైవేద్యం దేయం తత్సుభగాసు చ | అనభ్యర్చ్య తధా గౌరీం గౌరీదీపం ప్రపశ్యతి || 69

దౌర్భాగ్యం మహాదాప్నోతి వర్జితం తస్య దర్శనమ్‌| గౌరీపూజన కామా స్త్రీ తస్మిన్నహని యా ద్విజ! || 70

స్నాన ముష్టా ంబునా కుర్యా త్సాపి సౌభాగ్య మశ్నుతే | సంపూజ్య విధినా గౌరీం యత్ర యత్రా 7 భిజాయతే || 71

రూప లావణ్య సౌభాగ్య యుక్తా భవతి చాప్యథ | నిత్యం చా7 విధవా రామ! తథైవ చ పతివ్రతా || 72

ఏతాః పూజ్యతమాః స్త్రీషు దైవతస్థా ః ప్రకీర్తితాః ' అతః పరం తు యా కుర్యా త్సతీ మార్గ వివర్జనమ్‌|| 73

హింసాత్మక మనిర్దిష్టం అశుద్ధ ం వా ద్విజోత్త మ! | దేవతా7 రాధనం సాతు చిరం నరక మృచ్ఛతి || 74

తతస్తు చా7 ప్యనాయుష్యం గ్రహభూత వివర్ధనమ్‌| హింసాత్మకా తు యా నారీ దేవతా 7 రాధనే రతా || 75

మూలకర్మరతా భర్త్రా సా7 వివాహ్యా భృగూత్త మ ! | పౌంశ్చల్యాదపి నారీణాం రామ ! హింసా7 వివర్జితా || 76

స్త్రీ స్వభావం శుభం రామః సౌమ్యత్వం మార్దవం దయా | నిర్దయా రాక్షసీ రామ! పిశాచీ వా ద్విజోత్త మః || 77

అథవా సర్వ ముత్సృజ్య పతి పూజన తత్పరా | కేశవా7 రాధనం కుర్యా చ్ఛ్రియశ్చ పురుషర్షభ ! || 78

తేనైవ సర్వ మాప్నోతి యత్కించి త్పర మృచ్ఛతి | అఫలం సర్వమేవ స్యా ద్భర్త ్రనుజ్ఞా ం వినా కృతమ్‌|| 79

కేశవా7 రాధనం రామ! తథా7 పి సఫలం స్త్రియః | సర్వభూతాని గోవిందో భర్తా నా7 న్యస్తు యోషితః || 80

భర్త ్రనుజ్ఞా ం వినా తస్మా త్త తః పూజా విధీయతే || 80


నారాయణః వూజ్యతమోహి లోకే | నారాయణ స్సర్వగతః ప్రధానః |

నారాయణా7 రాధన తత్పరా స్త్రీ | కామా నవాప్నోతి న సంశయో7 త్ర || 81

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్త రే ద్వితీయఖండే స్త్రీ దేవతా పూజన నిరూపణం నామ పంచ త్రింశత్త మో7 ధ్యాయః.

గౌరీ పూజాతత్పరయైన నారి ధర్మప్రియురాలగును. ఆషాఢమందు దానిమ్మపువ్వు తేనె ఆర్యాంబికకు

నివేదించిననీరజాక్షి మహా సౌభాగ్యవతి యగును. భాద్రపదమందు శక్రా ణియు (శకపత్ని శచీదేవి) గౌరీపూజా

విధానమున పూజనీయ. సర్వకామప్రదమును. (భాద్రపద) మాస చతుర్థియందు శక్రా ణీ దేవతా పూజచేసిన వారు స్వర్గ

పూజ్యులగుదురు. ఈ పూజా తిథులన్నీటను బ్రా హ్మణ పూజయుం గర్త వ్యము. దేవతలకు నివేదించిన దెల్ల

సువాసినులకు వాయన మీయవలెను. గౌరీదేవిం బూజింపకుండ గౌరీ దీపమును జూచిన దౌర్భాగ్యము నందును.

పూజ సేయకుండ గౌరీ దీపము దర్శించుట నింద్యము. గౌరీ పూజాభి లాషిణి యా నాడుష్టో దకస్నానము సేయవలెను.

అందుచే సౌభాగ్యమండును. గౌరీపూజ చేసన


ి సుందరి యొక్కడెక్కడ తాను జన్మించు నక్కడక్కడ రూపలావణ్య

సౌభాగ్య శాలినియగును. నిత్యసుమంగళియునగును. మహాపతివ్రతయునగును. స్త్రీలకు బరమ పూజ్యులైన దేవతలుగా

వీరు కీర్తింపబడినారు. దీనినిమించి సతీమణుల మార్గ ము దప్పి హింసాత్మకము శాస్త ్ర నిర్దిష్టముగాని దేవతా రాధన

మదియెల్ల శుద్ధ ముగాదు. అట్టిది చేసిన స్త్రీ చిరకాలము నరకమునంబడును. అది యనాయుష్యము. గ్రహబబాధలను

భూతావేశములను పెంచును. హింసాత్మకయై ఇతరులను హింసించునదై మూలకర్మరతయైన (వశ్య విద్యలు చేతబడు

ప్రయోగములు మొదలయిన వానికి మూలకర్మయని పేరు) భామినిని జారిణక


ి ంటెగూడ వివాహము సేసక
ి ొనరానిది.

సొ మ్యత్వము మార్దవము దయ యనునది స్త్రీ యొక్క శుభ స్వభావము. నిర్దయయైన స్త్రీ రాక్షసి పిశాచియగును.

ఇందంతయుంగాదు సర్వము వదలి స్త్రీ పతి పూజా తత్పరయై కేశవారాధనము సేయవలెను. లక్ష్మీపూజ సేయవలెను.

దాననే మానిని సర్వ భాగ్యముల నందగలదు. ఏకొంచెము పరమఫలమైన దాననే పొ ందును. భర్త యనుజ్ఞ లేకుండ

జేసినదెల్ల నిష్ఫలమే. కేశవా రాధనము మాత్రమట్లు గాదు. అది ఫలమే యగును. సర్వ భూతములు గోవిందుడే. స్త్రీకి

భర్త గోవిందుడేగాని యితరుడుగాడు. కావున భర్త యనుజ్ఞ లేకయో గోవిందుని బూజించుట భర్త ను పూజించుటయే.

కావున నదిమాత్రము స్త్రీకి విధింపబడినది. లోకమందు నారాయణుడు పూజ్యతముడు. నారాయణుడు సర్వగతుడు

ప్రధానుడు. వారాయణారాధన తత్పరయయిన నారీ యభీష్ట ములంబొ ందును. ఇందు సందియములేదు.

ఇది శ్రీ విష్ణు ధర్మోత్త ర మహాపురాణమందు ద్వితీయఖండమున స్త్రీ దేవతాపూజానిరూపణమను

ముప్పదియైదవయధ్యాయము.

You might also like