You are on page 1of 1

వెబ్ ప్రత్యేకం పాంచ్‌పటాకా (https://twitter.

com/intent/tw
(https://api.whatsapp.c
(https://telegram
(https://w
(https://www.eenadu.net/web-
సండే మ్యాగజైన్ (https://www.eenadu.net/paanchpataka)
అన్నదాత హరిద్వారం url=https://www.eenadu.net/
text= url=https%3A%
exclusive/news)
(https://www.eenadu.net/sundaymagazine)
(https://www.eenadu.net/magazine/annadata) -
క్యాలెండర్ రిజల్ట్స్
(https://www.eenadu.net/calender/home)
(http://results.eenadu.net) https%3A%2F%2Fw

గంగానది పర్వత శ్రేణిని దాటి మైదానంలో ప్రవేశించే మొదటి ప్రదేశం హరిద్వార పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధమైంది. భరత ఖండంలోని సప్త మోక్షపురాల్లో ఇది ఒకటి. దీన్ని మాయాపురి అని, గంగాద్వార
అని పిలుస్తారు. మాయాపురి, హరిద్వారం, కనఖల, జ్వాలాపూర్‌, భీమ్‌గోడా అనే అయిదు గ్రామాలను కలిపి హరిద్వార్‌గా వ్యవహరిస్తున్నారు. చార్‌ధామ్‌గా ప్రసిద్ధమైన బదరీనాథ్‌, కేదార్‌నాథ్‌,
గంగోత్రి, యమునోత్రిలకు ప్రవేశద్వారం ఇది. నారద పురాణం హరిద్వార మాహాత్మ్యాన్ని వివరిస్తుండగా- వ్యాసభారతం, మరికొన్ని పురాణాల్లోనూ ఈ క్షేత్ర ప్రశస్తి కనిపిస్తుంది. హరి అంటే విష్ణువు.
హరి వద్దకే చేర్చేది అనే అర్థంలో ప్రసిద్ధం. శైవులు ‘హరద్వార్‌’ అని వ్యవహరిస్తారు. హరుడంటే శివుడు.
దక్ష ప్రజాపతి ఇక్కడే గొప్ప యజ్ఞం నిర్వహించి, తన అల్లుడు శివుణ్ని ఆహ్వానించలేదు. పిలవకపోయినా యాగానికి వెళ్ళిన దక్షుడి కుమార్తె, శివుడి పత్ని సతీదేవి యజ్ఞవాటికలో దగ్ధమైంది. ఆ
పౌరాణిక సన్నివేశానికి సాక్ష్యం ఈ క్షేత్రం.
కురువంశ రాజుల్లో ఒకడైన ప్రతీపుడు ఇక్కడే తపస్సు చేశాడు. భీష్ముడు తన తండ్రి శంతనుడికి ఈ గంగాద్వారం వద్దనే శ్రాద్ధ కర్మలు నిర్వహించాడు. గంగాద్వార సమీపంలోని అరణ్యంలో పుట్టిన
కార్చిచ్చుకు ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి దహనమయ్యారు. యుధిష్ఠిరుడు వారికి గంగాద్వారం వద్దనే అంత్యక్రియలు నిర్వహించాడు. కపిలముని, భరద్వాజుడు, అగస్త్యుడు, లోపాముద్ర
మొదలైనవారు ఈ పవిత్ర క్షేత్రంలోనే తపస్సు చేశారు.
హరిద్వారానికి దక్షిణ దిక్కున గల కనఖలం వద్ద మూడు రాత్రులు ఉపవాసం చేసి తీర్థంలో స్నానం చేసినవారు సకల పాపాల నుంచి విముక్తులవుతారని విశ్వాసం. ఇక్కడే జహ్ను తీర్థం ఉంది.
జహ్ను మహర్షి గంగానదిని పానంచేసి దేవతల ప్రార్థనపై విడిచిపెట్టాడని ఐతిహ్యం. ఈ తీర్థంలోను, హరిద్వార్‌కు పశ్చిమాన గల కోటితీర్థంలోను స్నానం సకలపాప హరంగా భావిస్తారు.
గంగానది పాయలుగా చీలిన ప్రాంతాన్ని ‘సప్తగంగ’గా వ్యవహరిస్తారు. ఇక్కడ ఏడు తీర్థాలున్నాయి. విష్ణుమూర్తి తన పాదముద్రల్ని ఇక్కడ ‘హరిపురి’లో వదిలివెళ్ళాడని, ఆ ముద్రల్ని గంగానది
తడిపిందని భక్తులు విశ్వసిస్తారు.
హరిద్వార్‌అనగానే కుంభమేళా గుర్తుకొస్తుంది. ప్రయాగ, హరిద్వార, ఉజ్జయిని, నాసిక్‌లలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. సూర్యుడు మేషరాశిలోను, బృహస్పతి
కుంభరాశిలోను ఒకేసారి ప్రవేశించినప్పుడు హరిద్వార్‌లో కుంభమేళా జరుగుతుంది. 2010లో ఇక్కడ కుంభమేళా జరిగింది. దీనికి లక్షలమంది భక్తులు వస్తారు.
ఏడో శతాబ్దంలో హర్షవర్ధనుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన యువాన్‌చాంగ్‌హరిద్వార్‌గురించి, కుంభమేళా గురించి రాశాడు. అతడు దాన్ని ‘మొ-యు’ అంటే ‘మాయాపురి’ అని
పేర్కొన్నాడు. క్రీ.పూ.1700-1300 మధ్య జీవించిన ప్రజలు టెర్రకోట సంస్కృతికి చెందినవారు. బంకమన్నుతో తయారైన వస్తువుల్ని బట్టీల్లో కాల్చి, ఉపయోగించే వస్తువులను ‘టెర్రకోట’ అంటారు.
1399లో హరిద్వార్‌తైమార్‌లాంగ్‌దండయాత్రకు వశమైంది. సిక్కుగురువు గురునానక్‌హరిద్వార్‌లోని ‘కుష్వనాఘాట్‌’లో స్నానంచేసిన ఉదంతం వారి మత గ్రంథంలో చోటుచేసుకుంది.
విక్రమాదిత్యుడు తన సోదరుడు భర్తృహరి స్మారకార్థం ఇక్కడ గంగాతీరంలో స్నానఘట్టం నిర్మించాడని చెబుతారు.
ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా విఖ్యాతమెనi హరిద్వార్‌లో చండీదేవి ఆలయం,  మానసదేవి కోవెల, మాయాదేవి ఆలయం, దక్షమహాదేవ కోవెల, సతీకుండ్‌, పరాడ్‌శివలింగం, సురేశ్వరి దేవి
ఆలయం, భారత్‌మాత మందిరం, ఆనందమయి మాత ఆశ్రమం, పిరన్‌కాలియార్‌దర్గా, జైరామ్‌ఆశ్రమం, నీల్‌ధార పక్షుల సంరక్షణ కేంద్రం మొదలైనవి ప్రసిద్ధ దర్శనీయ స్థలాలు.
- డాక్టర్‌దామెర వేంకట సూర్యారావు

You might also like