You are on page 1of 1

(https://twitter.

com/intent/tw
(https://api.whatsapp.c
(https://telegram
(https://w
అద్భుత సృజన url=https://www.eenadu.net/
text= url=https%3A%
ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల తోరణం కడితే పండుగ కళ ప్రభవిస్తుంది. దేవుడి పటానికి మరుమల్లె పూదండ వేస్తే పరిమళం ఇల్లంతా గుబాళిస్తుంది. చెట్టుకు కొత్త చిగురు, -అప్పుడే
మొలకెత్తిన మొక్క, గాలి వీస్తే వయ్యారంగా ఊగే చెట్టు కొమ్మలు రెమ్మలు... ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. దూరపు కొండలు, గలగలమంటూ ప్రవహించే వాగులు వంకలు, https%3A%2F%2Fw
చిలుక
పలుకులు... కోయిల కుహు కుహులు, అప్పుడే వర్షం కురిసి వెలిసిన తరవాత నీలి ఆకాశంలో కనిపించే ఇంద్రధనుస్సు- మానసిక
ఉల్లాసానికి హేతువులు. ప్రకృతి ఇంత అందంగా ఉందేమిటి? ఆ అందాలు ఎలాంటి నిర్వచనానికి అందక, మన హృదయాన్ని
నిశ్శబ్దంగా శాసిస్తూ ఏలుతున్నాయి. గాలిలో ఎగురుతూ కనిపించే సీతాకోక చిలుకలు, ఎవరో ఆహ్వానిస్తే వెళ్తున్నట్లు ఆనందంగా
సాగుతూ కనిపించే ఆకాశంలోని మబ్బులు... ఆహ్లాదపరుస్తాయి. మనిషి ప్రకృతిని ప్రేమించే సున్నిత మనస్కుడు. ఎందుకు
ఇంతటి అందాలను సృజనకారుడు మానవాళికోసం రచించాడో అర్థం కాని అద్భుతం.
సూర్యాస్తమయం, కొండలపై తెల్లని ముసుగులా కప్పుకొన్న మంచు... మనసును ప్రఫుల్లం చేస్తాయి. ఈ ఆనందానికి ప్రయో
జనమేమీ కనిపించనట్లు తోస్తుంది. ప్రకృతిలోని సౌందర్యాలను సృజన కారుడు ఉత్తినే తీర్చిదిద్దలేదు. ఈ అందాలన్నీ అతీత
స్పృహకు కారణాలు కావడం గమనిస్తాం. తైత్తిరీయ ఉపనిషత్తులో ప్రకృతి చక్కదనంలోని గొప్పదనం గురించిన వర్ణనలు
సాధకులను ఆశ్చర్య పరుస్తాయి. ‘ప్రకృతి నన్ను పరవశింపజేస్తోంది. ఆ పరబ్రహ్మ మహాద్భుత చిత్రకారుడు. నా హృదయాన్ని
చైతన్యపరచి ఎక్కడా లేని ఉత్సాహాన్ని కలిగించిన ఆ సృజనకారుడి గొప్పదనాన్ని శ్లాఘించాలనిపిస్తోంది...’ అంటోంది తైత్తిరీయ
ఉపనిషత్తు. ఆనందంగా జీవిస్తూ పరమానందమే లక్ష్యంగా బతుకు కొనసాగించాలని తైత్తిరీయ ఉపనిషత్తులోని ఆనందవల్లి
చెబుతోంది. బ్రహ్మవిద్యా ప్రతిపాదకం ఆనందమే. దైవం సృజించిన ఈ అందమైన ప్రకృతి చెబుతున్న నీతి సైతం అదే. మనిషి
ఏం చేయాలనుకొని ఈ భూమిపైకి వచ్చాడో ఎలా ఉండాలనుకొని వచ్చాడో అలా చేయగలిగితే జీవితం సార్థకం అయినట్లే. ఈ
ధార్మికత గురించి మానవుడు తెలుసుకోవడానికే ఇంత అందమైన ప్రకృతిని దైవం రచించాడు.  
మనల్ని సతమతం చేస్తున్న సమస్యలు విశ్వ సంబంధితమైన సచేతనత్వం వల్ల తొలగిపోతాయి. హాయిగా చెట్టు నీడన కూర్చొని
ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉపాధ్యాయుడు చెప్పే పాఠాలు విన్న పిల్లల జ్ఞానం అపరిమితంగా పెరుగుతుందని ఒక శాస్త్రీయ
పరిశోధనలో తేలింది. పూర్వం మునులు తపస్సుకు అరణ్యాలకు వెళ్ళేవారు. తోటలో ఒక అందమైన పువ్వును చూసి మనిషిలో
కలిగే ఆనందమే సచ్చిదానందమని వృక్షశాస్త్రజ్ఞుడు బీర్బల్‌సహానీ వెల్లడించారు. నిజానికి దేవుడు సృజించిన ఈ అందమైన
ప్రకృతి మానవుడి విజ్ఞానం కోసమే. అందుకే ఈ ప్రకృతి స్వరూపం ఒక దివ్యమైన ఆకర్షణ. ఇక్కడే కదా ఎరుకకు అవసరమైన మానసిక చైతన్యం లభించేది. జ్ఞానసముపార్జనకు ప్రశాంతమైన
మనసే ప్రధానం. ఆ మనసు ప్రకృతిలోని అందాలను ఆస్వాదించే ఆనందంలో లౌకికత ఎంత లోపిస్తే మనం అంత ఆధ్యాత్మపరులం కావడం తథ్యం.
- అప్పరుసు రమాకాంతరావు


(https://vuukle.com) Advertisement

మరిన్ని కథనాలు
ప్రకృతితో మమేకం
దైవభీతి

ఈ ఆధునిక యాంత్రిక జీవితంలో మానవుడు ఆనందం అనే మాటే భగవంతుడికి ఎందుకు భయపడాలి? వాస్తవానికి, దేవుణ్ని చూసి భయపడాల్సిన
మరిచిపోయాడు. ప్రకృతికి బహుదూరంగా పరుగులు పెడుతున్నాడు. అసలు పనిలేదు. భగవంతుడు పరిపూర్ణ ప్రేమ స్వరూపుడు. దేవుడి కంటే ఆత్మ
తాను ఈ అనంతమైన ప్రకృతిలో భాగం అనే విషయం బంధువు మరొకరు ఉండరు. ఆయనకు తరతమ భేదాలు ఉండవు.
పరాధీనత్వం
యోగక్షేమం

స్వశక్తిని విడిచి పరాధీనులమై దీనంగా జీవించడం అవమానకరం. మనిషి జీవితం అనేది ఒక ఉత్సవం. మనిషి జీవించినంతకాలం అది అలాగే
ఎప్పుడూ ధైర్యంగా నిశ్చయ భావంతో అడుగులు ముందుకు వేసి బతకాలని సాగిపోవాలి. కాలంతోపాటు ఎంతో సంతృప్తినివ్వాలి. ఆనందమయం చేసేది
కోరుకుంటాడు.
  మనిషి మానసిక స్థితే. మనిషిది చంచలమైన స్వభావం. మనసు కోరుకున్న
భయం - నిర్భయం
ధనానుబంధాలు

మనిషి జీవితంలో సంతోషాన్ని, సుఖాన్ని దూరం చేసే అంతర్గత శత్రువుల్లో భయం ఒకటి. భయం సమాజంలో రూపాన్ని చూసి మోసపోవడం, రూపాయిని చూసుకుని గర్వపడిపోవడం
మనిషికి దుఃఖాన్ని, బాధను, అశాంతిని కలగజేస్తుంది. ఆందోళన పెంచుతుంది. అందుకే చూస్తుంటాం. మనిషిని డబ్బు మార్చకపోయినా, అతడి నిజస్వరూపాన్ని బయటపెడుతుంటుంది.
భయానికన్నా భయంకరమైనది మరొకటి లేదంటారు.

You might also like